Pushpa Srivani
-
చంద్రబాబు బూటకపు హామీలు.. ఏకిపారేసిన పుష్ప శ్రీ వాణి..
-
హైకోర్టు తీర్పు: పుష్పశ్రీవాణి ఎస్టీ కులానికి చెందినవారే..
జియ్యమ్మవలస: మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి ఎస్టీ కులానికి చెందిన వారంటూ హైకోర్టు తీర్పు ఇచ్చినట్టు ఆమె శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. 2019లో జరిగిన ఎన్నిల బరిలో నిలిచిన నిమ్మక జయరాజు, నిమ్మక సింహాచలం అనే ఇద్దరు వ్యక్తులు పుష్పశ్రీవాణి ఎస్టీ కాదంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు.ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు పిటిషనర్ చేసిన ఆరోపణలపై ఆధారాలు లేకపోవడంతో కేసు కొట్టేసింది. డీఎల్ఎస్సీ కమిటీ రిపోర్టు, స్టేట్ స్క్రూటినీ కమిటీ ఇచ్చిన జీవో నంబర్ 6ను పరిగణనలోకి తీసుకుని పుష్పశ్రీవాణి ఎస్టీ కులానికి చెందిన వ్యక్తిగా కోర్టు అభిప్రాయపడింది. పదేళ్లుగా ఓ వర్గం తను ఎస్టీ కాదని తప్పుడు ప్రచారం చేసిందని, చివరకు న్యాయమే గెలిచిందని పుష్పశ్రీవాణి సంతోషం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: మా మకుటం... సత్యమేవ జయతే! -
లోకేష్ కు పుష్ప శ్రీవాణి ఛాలెంజ్
-
ఆడుదాం ఆంధ్రా..వాలీబాల్ ఆడిన ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి
-
వెల్లివిరిసిన గిరిజన చైతన్యం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: సుదీర్ఘకాలంగా వెనుకబడి ఉన్న గిరిజన ప్రాంత దశను మార్చేలా పార్వతీపురం మన్యం జిల్లాను ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి గిరిజనం జై కొట్టారు. విద్య, వైద్య రంగాలను సమూలంగా మార్చడమే గాక ప్రభుత్వ సేవలను తమ ఆవాసాలకే చేర్చినందుకు హర్షధ్వానాలతో కృతజ్ఞతలు తెలిపారు. భారీఎత్తున భూ పంపిణీతో బతుకులు మార్చిన జగనన్నకు జేజేలంటూ పాటలు పాడారు. గిరిజన పక్షపాతికి సుదూర గిరిశిఖర గ్రామాల నుంచీ తరలివచ్చి ధన్యవాదాలు చెప్పారు. బుధవారం పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో జరిగిన సామాజిక సాధికార యాత్ర దృశ్యమిది. గిరిజన చైతన్యానికి ఈ యాత్ర అద్దంపట్టింది. తొలుత కురుపాం నియోజకవర్గం గరుగుబిల్లి మండలం నందివానివలస గ్రామం నుంచి వందలాది యువకులు ద్విచక్రవాహనాలపై ర్యాలీగా బయల్దేరారు. 11 గ్రామాల మీదుగా 12 కిలోమీటర్లకు పైగా సాగిన ఈ ర్యాలీకి ప్రజలు ప్రతి గ్రామంలో ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కురుపాం పోలీస్ స్టేషన్ జంక్షన్ వద్ద ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి అధ్యక్షతన భారీ బహిరంగ సభ జరిగింది. సభ ఆద్యంతం జై జగన్, జై జై జగన్ నినాదాలతో హోరెత్తింది. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ నాలుగున్నరేళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చేసిన మేలును ప్రజాప్రతినిధులు వివరిస్తుంటే ప్రజలు చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. సభలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి ప్రత్యేక జిల్లాతో గిరిజనులకు గుర్తింపు: ఎంపీ గొడ్డేటి మాధవి సుదీర్ఘకాలంగా వెనుకబడి ఉన్న గిరిజన ప్రాంతాల అభివృద్ధికి సీఎం జగన్ కట్టుబడి ఉన్నారని, ప్రత్యేకంగా పార్వతీపురం మన్యం జిల్లాను ఏర్పాటుచేసి 45 లక్షల మంది గిరిజనులకు గుర్తింపు ఇచ్చారని అరకు ఎంపీ గొడ్డేటి మాధవి చెప్పారు. ప్రజలంతా వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. సీఎం జగన్ దేశానికే స్ఫూర్తి: ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి, చెప్పని పథకాలను ఎన్నింటినో అమలు చేస్తున్న సీఎం వైఎస్ జగన్ దేశానికే స్ఫూర్తిగా నిలిచారని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అన్ని రంగాల్లో పెద్దపీట వేసి, సాధికారత కల్పించిన సీఎం ఒక్క జగన్ మాత్రమేనని అన్నారు. ముఖ్యమంత్రి పీఠం కోసం చంద్రబాబు సొంత మామకు వెన్నుపోటు పొడిచినట్లే 2014 ఎన్నికల్లో గెలిపించిన ప్రజలనూ మోసం చేశారని చెప్పారు. 2024 ఎన్నికల్లోనూ మాయమాటలు చెప్పడానికి చంద్రబాబు సహా టీడీపీ మోసగాళ్లు మళ్లీ ప్రజల ముందుకొస్తున్నారని, వారి మాటలు నమ్మవద్దని అన్నారు. గిరిజన బిడ్డలకు పెద్దపీట: ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర రాష్ట్రంలోని గిరిజనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు అనేక నామినేటెడ్ పదవులు ఇచ్చి అన్ని రంగాల్లో ముందడుగు వేసేలా తీర్చిదిద్దుతున్నారని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర చెప్పారు. చంద్రబాబు ఏనాడూ గిరిజనులకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదన్నారు. బాబుకు భిన్నంగా సీఎం వైఎస్ జగన్ గిరిబిడ్డలను అనేక పథకాలతో ఆదరిస్తున్నారని, మంచి విద్య, అధునాతన వైద్యం అందిస్తున్నారని తెలిపారు. గిరిజనులకు రాజ్యాధికారం ఇచ్చిన ఘనత వైఎస్ జగన్‌దేనని అన్నారు. గిరిజనులకు అందుబాటులో విద్య: ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ, సాలూరులో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంతో పాటు పార్వతీపురంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు ద్వారా గిరిజనులకు ఉన్నత విద్యను సీఎం వైఎస్ జగన్ అందుబాటులోకి తెస్తున్నారని విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ చెప్పారు. అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడే సీఎం జగన్ వెంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు నిలవాలని, లేదంటే నష్టపోతామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు విశ్వాసరాయి కళావతి, అలజంగి జోగారావు, శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్ బాబు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీకి కౌంటర్ ఇచ్చిన పుష్ప శ్రీవాణి
-
కొన్ని స్కూల్స్ లో బాత్రూములు కూడా సరిగ్గా లేవు.. కానీ ఇప్పుడు..!
-
వైఎస్ఆర్ సీపీ ప్రతినిధుల సభలో పుష్ప శ్రీవాణి ప్రసంగం
-
పేదల తలరాతలు మార్చే పథకం జగనన్న అమ్మ ఒడి: పుష్పశ్రీవాణి
-
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పుష్ప శ్రీవాణి
-
దూసుకొచ్చిన మృత్యువు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: నిశ్చితార్థానికి వెళ్లి ఆటోలో తిరిగి వస్తోన్న గిరిజన కుటుంబాలపై మృత్యువు లారీ రూపంలో దూసుకువచ్చింది. పార్వతీపురం మన్యం జిల్లాలో బుధవారం జరిగిన ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. తీవ్ర గాయాలతో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని మెరుగైన వైద్యం కోసం విశాఖలోని కేజీహెచ్‌కు తరలించారు. గాయపడిన మరో ఐదుగురు పార్వతీపురం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం అంటివలసకి చెందిన 2 కుటుంబాల్లోని 12 మంది గిరిజనులు నిశ్చితార్థం కోసం అదే మండలంలోని తుమ్మలవలసకి వెళ్లారు. మధ్యాహ్న భోజనం తర్వాత తిరిగి సొంత గ్రామానికి ఆటోలో బయల్దేరారు. 20 నిమిషాల్లో ఇళ్లకు చేరతారనగా..చోళ్లపదం శివాలయం మలుపు వద్ద ఆటోను పార్వతీపురం నుంచి కూనేరు వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో ఆటో నుజ్జునుజ్జ్జయింది. ప్రయాణిస్తోన్న వారంతా ఎగిరి పడిపోయారు. ప్రమాదంలో ఊయక నరసమ్మ (54), ఊయక లక్ష్మి (48), మెల్లిక శారద(35), మెల్లిక అమ్మడమ్మ(80), ఊయక వెంకట్(55) అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయాలైన మిగతా 8 మందిని పోలీసులు పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి అంబులెన్స్‌ల్లో తీసుకువెళ్లారు. వారిలో ఊయక రామస్వామి, ఊయక వెంకటేష్‌ల పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యానికి విశాఖ కేజీహెచ్‌కు రిఫర్ చేశారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, అదనపు ఎస్పీ దిలీప్కిరణ్లు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి పార్వతీపురం ఆస్పత్రికి వచ్చి క్షతగాత్రులను పరామర్శించి బాధిత కుటుంబాలను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని చెప్పారు. -
వారం రోజుల పాటు ‘అమృత భూమి’ చిత్రం ఉచిత ప్రదర్శన
ప్రకృతి వ్యవసాయంపై రైతులను చైతన్యవంతం చేస్తూ తెరకెక్కిన చిత్రం ‘అమృత భూమి’. కె.బి. ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కీ.శే. వంగపండు ప్రసాదరావు కథ, పాటలు అందించారు. ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి కీలక పాత్రలో నటించారు. రసాయన వ్యవసాయం వల్ల భూములు నిస్సరమ అయిపోవటమే కాకుండా.. ప్రకృతి వనరులు, మనం తినే ఆహారం కూడా రసాయనాలు మయం అవుతోంది. అందుకే మనందరం - రైతులైనా, వినియోగదారులు అయినా - ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. ఆరోగ్యంగా జీవించాలంటే అమృతాహారం ఆవశ్యకతను గుర్తెరగాలి.. సమాజంలో ప్రతి ఒక్కరికీ ఈ సందేశాన్ని తెలిసేలా ప్రచారం చేయాలి. ఈ ఉదాత్తమైన అద్భుత సందేశాన్ని అత్యంత సృజనాత్మకంగా వెండి తెర పైకి ఎక్కించిన ఘనత ప్రముఖ స్వచ్ఛంద సేవకులు, ‘అమృతభూమి’ చిత్ర నిర్మాత పారినాయుడుకే దక్కింది. ఆంధ్ర ప్రదేశ్ ప్రకృతి వ్యవసాయ శాఖకు అనుబంధ సంస్థ రైతు సాధికార సంస్థ తోడ్పాటుతో ఈ చలన చిత్రాన్ని హృద్యంగా నిర్మించారు. పిల్లలు, పెద్దలు, రైతులు.. అందరూ చూడదగిన ఈ చిత్రాన్ని నూజివీడుకు చెందిన వ్యాపారవేత్త, మూల్పూరి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు లక్ష్మణ స్వామి నూజివీడు(కృష్ణా జిల్లా) ప్రాంత ప్రజలకు వారం రోజుల పాటు ఉచితంగా చూపించాలని సంకల్పించారు. ఇప్పుడు 7 రోజులూ .. రోజూ 4షోలకు మార్చారు. ఆగష్టు 5 నుంచి 11తేదీ వరకు రోజూ 4 ఆటలు.. మార్నింగ్ షో ఉదయం 11 గంటలకు, మాట్నీ 2 గంటలకు, ఫస్ట్ షో సాయంత్రం 6 గంటలకు, సెకండ్ షో రాత్రి 9 గంటలకు ఉచితంగా సత్యనారాయణ మినీ థియేటర్లో ప్రదర్శించనున్నారు. ఈ ఖర్చంతా లక్ష్మణ స్వామి భరిస్తున్నారు. ఈ సదవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకొని ప్రకృతి సేద్యం, ప్రకృతి ఆహారం తక్షణ ఆవశ్యకతను గుర్తించాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. -
గడపగడపలో జగన్నినాదం
(వైఎస్సార్ ప్రాంగణం నుంచి సాక్షి ప్రతినిధి) : రాష్ట్రంలో ప్రతి గడపలోనూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరే వినిపిస్తోందని, వచ్చే ఎన్నికల్లోనూ పార్టీ తిరిగి విజయం సాధించడం.. జగన్ మళ్లీ సీఎంగా ప్రమాణం చేయడం తథ్యమని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, స్పీకర్ తమ్మినేని సీతారామ్ అన్నారు. రాష్ట్రంలో పేదల సంక్షేమం కోరే జగన్ ప్రభుత్వం ఉందని, అది గాంధీ కోరిన స్థానిక స్వపరిపాలన అందిస్తోందన్నారు. గ్రామ సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలు అందులో భాగమేనన్నారు. సీఎం జగన్ సంస్కరణలు ఓ తరానికి ఆదర్శమని ఆయన తెలిపారు. వైఎస్సార్సీపీ ప్లీనరీ రెండో రోజు శనివారం అశేష జనవాహిని హోరుతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ‘పరిపాలన వికేంద్రీకరణ–పారదర్శకత’ తీర్మానం మీద చర్చించి ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా స్పీకర్‌తోపాటు ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు, మాజీమంత్రి పుష్పశ్రీవాణి మాట్లాడారు. తమ్మినేని ఇంకా ఏమన్నారంటే.. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి విజయమ్మ విషాదాన్ని దిగమింగి అనేక అవమానాలను ఎదుర్కొని తన కుమారుడిని గొప్ప ముఖ్యమంత్రిగా తీర్చిదిద్దడం దేశ చరిత్రలో మరువలేనిది. రాష్ట్రంలో సీఎం జగన్ ప్రజల కోసం అమలుచేస్తున్న అనేక సంక్షేమ పథకాల గురించి ఎల్లో మీడియా ఎందుకు రాయడంలేదు. అన్ని రంగాల్లో ప్రభుత్వం ముందుకు దూసుకెళ్తోంది. విద్యా, వైద్యానికి, సేద్యానికి పేదరికం అడ్డంకి కాకూడదని, పల్లెలకు కూడా అభివృద్ధి చేరాలని అనేక ప్రయత్నాలు చేస్తుంటే అవి ఎల్లో మీడియాకు కనిపించడంలేదా? అవి పచ్చ పత్రికలు కాదు.. పక్షపాత పత్రికలు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో వీటికి తెలియదు. గడప గడపకూ తిరుగుతున్న మాకు ప్రజల మనస్సు తెలుసు, వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించడం.. జగన్ మళ్లీ సీఎంగా ప్రమాణం చేయడం, టీడీపీ భూస్థాపితం కావడం ఖాయం. ధర్మాన్ని కాపాడుతున్న సీఎం జగన్‌ను ఆ ధర్మమే కాపాడుతుంది. ఆయన లేకపోతే ఈ రాష్ట్రంలో సంస్కరణలు, వికేంద్రీకరణ ఆగిపోతాయి. అసమానత్వం తొలగాలి.. పేదరికం పోవాలి.. ఇది జరగాలంటే జగన్ ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పాలించాలి. అంబేడ్కర్ ఆలోచనలను అమలుచేస్తున్న జగన్ అధికారం అంటే తాను మాత్రమే ఎదగడం, తన వర్గం వారు మాత్రమే బాగుపడడం అనుకునే స్వార్థపరుడు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. ఆయన 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా మోసాలు, అబద్ధాలతోనే కాలం గడిపారు. టీడీపీ పాలనలో రాష్ట్ర ప్రజలకు మేలు జరిగిందేలేదు. కానీ, ఇప్పుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. రాజ్యాంగాన్ని, అంబేడ్కర్ ఆలోచనలను అమలుచేస్తున్న నాయకుడు జగన్. – కొరుముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యే, రైల్వేకోడూరు ఈ విజయం సీఎం జగన్, కార్యకర్తలదే – పుష్పశ్రీవాణి, మాజీ మంత్రి దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలున్నా.. సమైక్య పోరాటంతో అధికారంలోకి వచ్చిన గొప్ప చరిత్ర వైఎస్సార్సీపీది. మనం 13 ఏళ్లలో సాధించిన ఘనత మరే పార్టీకి లేదు. ఈ విజయానికి కారణం ఒకరు సీఎం వైఎస్ జగన్ అయితే.. మరొకరు పార్టీ కార్యకర్తలు. ఈ ప్లీనరీ జగన్ సైనికులకు పెద్ద పండగలాంటిది. దేశంలో సంక్షేమ ప్రభుత్వం ఎలా ఉండాలో 2004, 2009లో వైఎస్సార్ పరిచయం చేశారు. పారదర్శకత కోసం కృషిచేసిన గొప్ప నాయకుడు ఆయన. వైఎస్సార్ సంకల్పాన్ని, ఆశయాలను సీఎం జగన్ నిజంచేసి చూపిస్తున్నారు. రాష్ట్రంలో పారదర్శక పాలన సాగుతోంది. గ్రామ, వార్డు సచివాలయాలే నిదర్శనం. అర్హత గల ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. పరిపాలనా వికేంద్రీకరణతోనే అభివృద్ధి – నందిగం సురేష్, ఎంపీ, బాపట్ల రాష్ట్ర ప్రజలు ఏమైపోయినా చంద్రబాబుకు అనవసరం. ఆయన, ఆయన వర్గం బాగుపడితే చాలనుకునే స్వార్థపరుడు. రాజధాని పేరుతో రైతుల పంటలను తగులబెట్టించి దుర్మార్గానికి పాల్పడ్డాడు. అధికారంలోకి రాగానే నూజివీడులో రాజధాని అని చెప్పి గుట్టుచప్పుడు కాకుండా కారుచౌకగా తుళ్లూరులో తన వర్గీయులతో భూములు కొనిపించి తర్వాత పేదల భూములను బలవంతంగా లాక్కొన్నాడు. ఏడాదికి మూడు పంటలు పండే భూములు ఇవ్వలేమని రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తే చంద్రబాబు కుట్రలతో పంటలు తగలబెట్టించాడు. అభివృద్ధి అనేది ఒకేచోట కేంద్రీకృతం కారాదు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే పరిపాలనా వికేంద్రీకరణ జరగాలి. రాష్ట్ర విభజన సమయంలో జరిగిన నష్టం మరోసారి జరగకూడదంటే మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి జరగాలి. -
31 పథకాలు గిరిజనుల కోసమే
-
శివయ్యకు డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ప్రత్యేక పూజలు
-
డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఎస్టీనే: అప్పిలేట్ అథారటీ
సాక్షి, విజయవాడ: డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఎస్టీనే అని అప్పిలేట్ అథారటీ నిర్ధారించింది. హైకోర్టు ఆదేశాలకు మేరకు విచారణ చేపట్టిన అప్పిలేట్ అథారిటీ.. పుష్ప శ్రీవాణి గిరిజనురాలేని స్పష్టం చేసింది. ఆమె ఎస్టీ కొండదొర సామాజిక వర్గంగా తెలిపింది. కాగా అప్పిలేట్ అథారిటీ నిర్ణయం మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
బుల్లెట్ బండెక్కి సందడి చేసిన డిప్యూటీ సీఎం
-
గిరిజన రైతుకు ‘హక్కు’తో పాటు ‘భరోసా’
సాక్షి, అమరావతి: అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలుస్తూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని గిరిజన రైతులకు కూడా వర్తింపచేయడంతో వారిలో ఆనందం వెల్లువెత్తుతోంది. రాష్ట్రంలోని గిరిజన రైతులకు గత రెండున్నరేళ్ల కాలంలో మూడు పర్యాయాల్లో రూ.750 కోట్ల మేర నేరుగా వారి ఖాతాలకే ప్రభుత్వం జమ చేసింది. ఒక్కో రైతుకు ఏడాదికి రూ.13,500 చొప్పున రైతు భరోసా ఇస్తున్న సంగతి తెల్సిందే. సొంత భూమి కలిగిన ఆసామికే కాకుండా అటవీ హక్కుల పట్టా (ఆర్వోఎఫ్ఆర్)లను పొందిన వారికి కూడా ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2008 నుంచి 2021 నవంబర్ వరకు రాష్ట్రంలో 2,34,827 మంది గిరిజనులకు 4,79,105 ఎకరాలను పట్టాలుగా అందించడం జరిగింది. వాటిలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం రెండున్నరేళ్ల కాలంలో 1,32,084 మంది గిరిజనులకు 2,44,827 ఎకరాలకు సాగు హక్కు పత్రాలు (పట్టాలు) అందించడం దేశంలోనే రికార్డుగా నిలిచింది. దీంతోపాటు సాగుకు సాయమందిస్తూ వారికి ‘వైఎస్సార్ రైతు భరోసా’ను ప్రభుత్వం వర్తింపజేసింది. సీఎం జగన్‌కు రుణపడి ఉంటాను ప్రభుత్వం నాకు రెండెకరాల భూమికి హక్కు పత్రం (ఆర్వోఎఫ్ఆర్ పట్టా) ఇచ్చింది. దాన్ని సాగు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. భూమి పట్టా ఇవ్వడంతోపాటు ‘రైతు భరోసా’ అందిస్తున్న ప్రభుత్వం నా కుటుంబానికి అండగా నిలిచింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఎప్పుడూ రుణపడి ఉంటాను. – పలాసి మోహనరావు, కోడా పుట్టు గ్రామం, విశాఖ జిల్లా. భూమి పట్టా ఇచ్చి సాగుకు ఊతం మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ‘నవరత్నాలు’ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట తప్పకుండా అమలు చేసి ఆదర్శంగా నిలుస్తున్నారు. నవరత్నాల్లో భాగంగా వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని గిరిజన రైతులకు కూడా వర్తింపజేశారు. గిరిజనులకు హక్కు పత్రాలు ఇవ్వడమే కాదు, ఆ పట్టాలు ఇచ్చిన భూముల్లో సాగుకు ‘రైతు భరోసా’తో ఊతమివ్వడం జరుగుతోంది. దీని వల్ల గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగవుతున్నాయి. – పుష్పశ్రీవాణి, ఉప ముఖ్యమంత్రి -
గిరిజన ప్రాంతాల్లోని సమస్యల్ని వెంటనే పరిష్కరించాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: గిరిజన ఎమ్మెల్యేల నియోజక వర్గాల్లో అభివృద్ధిపనులు, స్థానిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. డిప్యూటి సీఎం పుష్పశ్రీవాణి, గిరిజన ఎమ్మెల్యేలు పీడిక రాజన్న దొర, తెల్లం బాలరాజు, విశ్వసరాయి కళావతి, తదితరులు శాసన సభలోని కార్యాలయంలో.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. దీనిపై స్పందించిన సీఎం జగన్.. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి అవసరమైన అన్నిచర్యలు తీసుకోవాలని సీఎంవో అధికారును ఆదేశించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణానికి సంబంధించిన అంశాలు, కరోనా సమయంలో ఆగిపోయిన రోడ్ల నిర్మాణం,ఎత్తైన కొండ ప్రాంతాల్లో నిర్మిస్తున్న రహదారులను మెషిన్స్ ద్వారా చేయడానికి అవసరమైన అనుమతులు, కొండ ప్రాంతాల్లోకి వెళ్లేందుకు అవసరమైన రైస్ వ్యాన్స్, మెరుగైన ఇంటర్నెట్ సౌకర్యం వంటి పలు అంశాలను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా... జీవో నంబర్ 3 పై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను సూచించారు. షెడ్యూల్డ్ ఏరియాలో చేర్చని గ్రామాలను కూడా చేర్చడం కొరకు.. రానున్న అసెంబ్లీలో సమావేశాలలో తీర్మానం చేయనున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. కాగా, గిరిజన ప్రాంతాల్లోని సమస్యలన్నింటిని వెంటనే పరిష్కరించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. -
డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి దీపావళి సంబరాలు
-
నేరేడుబందకు మొబైల్ ఆధార్ టీం
పాడేరు: ఆ మారుమూల గిరిజన తండా ప్రజల చిరకాల కోరిక నెరవేరుతోంది. అసాధ్యమనుకున్నది సుసాధ్యమవుతోంది. విశాఖ జిల్లా జి.మాడుగుల, రావికమతం మండలాల సరిహద్దులోని నేరేడుబంద గ్రామంలో పిల్లలకు ఆధార్ కార్డులు అందనున్నాయి. ఈ గ్రామంలో జన్మించిన 18 మంది పిల్లలకు జనన ధ్రువీకరణ పత్రాలు లేకపోవడం, దీంతో వారు ఆధార్ కార్డులకు నోచుకోక చదువుకు దూరం కావడంపై ‘సార్.. మా ఊరే లేదంటున్నారు’ శీర్షికన సోమవారం ‘సాక్షి’ ప్రధాన సంచికలో వచ్చిన కథనానికి ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి స్పందించారు. ఐటీడీఏ పీవో ఆర్.గోపాలకృష్ణతో ఫోన్లో మాట్లాడి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో అధికార యంత్రాంగం ఆగమేఘాలపై కదిలింది. జి.మాడుగుల ఎంపీడీవో వెంకన్నబాబు, ఇతర అధికారులు సోమవారం నేరేడుబంద గ్రామాన్ని సందర్శించారు. వారిచ్చిన నివేదికతో పీవో వెంటనే మొబైల్ ఆధార్ టీంను పంపించారు. వారు సోమవారం రాత్రికే నేరేడుబంద చేరుకున్నారు. మంగళవారం ఆ గ్రామంలోని 18 మంది చిన్నారులకు ఆధార్ నమోదు చేయనున్నారు. ఆ గ్రామానికి సిగ్నల్స్ అందే అవకాశం లేకపోవడంతో ఆఫ్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకుని సమీపంలోని జోగుంపేట ఆధార్ కేంద్రంలో ఆన్లైన్ చేయనున్నారు. ‘సాక్షి’ కథనంతో ఎంతోకాలంగా ఉన్న తమ సమస్య పరిష్కారం అవుతోందని నేరేడుబంద గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
యువతిపై పెట్రోలు దాడి: దిశా యాప్‌తో బాధితురాలిని రక్షించాం
-
గిరిజన సంక్షేమంలో ఏపీ భేష్
సాక్షి, అమరావతి: కరోనా కష్టకాలంలో కూడా గిరిజనులను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం అభినందనీయమని కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ నావల్జిత్ కపూర్ పేర్కొన్నారు. గిరిజనుల అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు బాగున్నాయని ప్రశంసించారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలో సోమవారం కేంద్ర, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖలు, ఏపీ గిరిజన సాంస్కృతిక పరిశోధన–శిక్షణ మిషన్, సెంటర్ రీజనల్ స్టడీస్‌ఆధ్వర్యంలో జాతీయ సదస్సు జరిగింది. వర్చువల్ విధానంలో ఈ సదస్సులో పాల్గొన్న నావల్జిత్ కపూర్ మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతాల్లో విద్య, వైద్యం, మంచినీరు, రోడ్లు తదితర మౌలిక వసతులను కల్పించేందుకు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఏపీలో గిరిజన ఉప ప్రణాళిక అమలుకు సహకారం అందిస్తామన్నారు. ఉప ప్రణాళిక అమలులో ముందున్నాం.. ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి మాట్లాడుతూ.. గిరిజన ఉప ప్రణాళిక అమలులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ముందుందని చెప్పారు. నవరత్నాలతో పాటు పలు సంక్షేమ పథకాల ద్వారా గిరిజనుల జీవితాల్లో సీఎం జగన్ కొత్త వెలుగులు నింపారని పేర్కొన్నారు. గిరిజన సంక్షేమం, హక్కుల రక్షణలో ఏపీ ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఏపీ గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి కాంతీలాల్ దండే మాట్లాడుతూ.. రాష్ట్రంలోని గిరిజనులకు 2వ దఫా పట్టాల పంపిణీకి చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ సంచాలకుడు పి.రంజిత్‌బాషా, గిరిజన సంక్షేమ శాఖ మిషన్ సంచాలకుడు రవీంద్రబాబు, డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. థింసా నృత్యం చేసిన మంత్రి పుష్పశ్రీవాణి సీతానగరం(పార్వతీపురం)/కురుపాం/ పాడేరు: విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయంలో ఎమ్మెల్యే జోగారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పుష్పశ్రీవాణి పాల్గొన్నారు. స్థానిక గిరిజన మహిళలతో కలిసి థింసా నృత్యం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పీడిక రాజన్నదొర, జోగారావు, ఎమ్మెల్సీ రఘువర్మ, ఐటీడీఏ పీవో కూర్మనాథ్ తదితరులు పాల్గొన్నారు. పాడేరులో ఘనంగా: విశాఖ ఏజెన్సీలోని పాడేరులో నిర్వహించిన అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవంలో ఎంపీ గొడ్డేటి మాధవి, ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు, ఎమ్మెల్యేలు కె.భాగ్యలక్ష్మి, చెట్టి ఫాల్గుణ, కలెక్టర్ మల్లికార్జున, ఏపీ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ నర్సింగరావు, రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ బుల్లిబాబు, ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ హాజరయ్యారు. -
గిరిజనులతో కలిసి డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి థింసా డ్యాన్స్
-
గిరిజనులతో కలిసి డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి థింసా డ్యాన్స్
సాక్షి, పార్వతీపురం: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖామంత్రి పాముల పుష్ప శ్రీవాణి గిరిజనులతో కలిసి థింసా నృత్యం చేసి ఆకట్టుకున్నారు. ఉత్సవాల్లో ఎమ్మెల్యే అలజంగి జోగారావు డప్పు కొట్టి ఉత్సాహపరిచారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే జోగారావు, కలెక్టర్ సూర్యకుమారి, ఎమ్మెల్సీ రఘువర్మ, సబ్ కలెక్టర్ భావన, ఐటీడీఏ పీఓ కూర్మనాధ్, మున్సిపల్ చైర్పర్సన్ గౌరీశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ అవార్డులు రావడం సంతోషంగా ఉంది :పుష్ప శ్రీవాణి
-
ఏపీ గిరిజన సంక్షేమ శాఖకు 5 జాతీయ అవార్డులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమశాఖకు 5 జాతీయ అవార్డులు దక్కాయి. దాంతో పాటు గిరిజన కో ఆపరేటివ్ కార్పొరేషన్(జీసీసీ) దేశంలోనే మూడు నంబర్‌వన్ అవార్డులు సాధించింది. వన్ ధన్ యోజన, చిన్నతరహా అటవీ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలను కల్పించడంలోనూ, సేంద్రీయ, సహజ ఆహార ఉత్పత్తుల మార్కెటింగ్‌లోనూ జీసీసీ.. జాతీయ స్థాయిలో దేశంలోనే మొదటి ర్యాంకులను సాధించిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి తెలిపారు. జాతీయ స్థాయిలో ఐదు అవార్డులు రావడం గర్వకారణమని ఆమె పేర్కొన్నారు. జీసీసీ వివిధ విభాగాల్లో సాధించిన ప్రగతి మేరకు ట్రైఫెడ్ ఈ అవార్డులను ఇవ్వనుందని పుష్ప శ్రీవాణి తెలిపారు. వన్ ధన్ యోజన పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయడంలోనూ, చిన్నతరహా అటవీ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరలను ఇప్పించడంలోనూ ఉత్తమ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌కు మొదటి ర్యాంకును కేటాయించిందని పుష్ప శ్రీవాణి తెలిపారు. సేంద్రీయ, సహజ ఆహార ఉత్పత్తులను సరఫరా చేయడంలోనూ ఉత్తమ ప్రతిభ కనబరచినందుకు మొదటి ర్యాంకును ఇచ్చారని పుష్ప శ్రీవాణి వివరించారు. దీనితో పాటుగా కేంద్ర ప్రభుత్వ నిధులతో అత్యధికంగా రూ.4.50 కోట్ల విలువైన చిన్నతరహా అటవీ ఉత్పత్తులను సేకరించినందుకు జాతీయ స్థాయిలో 2వ ర్యాంకు జీసీసీకి దక్కిందని తెలిపారు. తీవ్రమైన కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలోనూ ఉత్పత్తుల సేకరణలో గిరిజనులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడటానికి తీసుకున్న చర్యలు, పటిష్టమైన పర్యవేక్షణ కారణంగానే ఇది సాధ్యమైయిందని పుష్ప శ్రీవాణి అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగానే జీసీసీ అధికార సిబ్బందికి పుష్ప శ్రీవాణి అభినందనలు తెలిపారు. సీఎం జగన్ మార్గదర్శనంతోనే జీసీసీ ఉత్తమంగా పనిచేస్తోందనడానికి జాతీయ స్థాయిలో వచ్చిన 5 అవార్డులే నిదర్శమన్నారు. -
‘మహిళల తలరాతలు మార్చేలా సీఎం జగన్ పాలన అందిస్తున్నారు’
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశానికే ఆదర్శంగా నిలిచారని ఏపీ డిప్యూటి సీఎం, గిరిజన సంక్షేమశాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి అన్నారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తాజాగా ప్రకటించిన నామినేటెడ్ పదవుల్లో సీఎం జగన్ మహిళలకు పెద్ద పీట వేశారని కొనియాడారు. ఇప్పటి వరకు దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా మహిళలకు 50 శాతం పదవులను కేటాయించలేదని గుర్తుచేశారు. అదేవిధంగా, రాష్ట్రంలో మహిళల తలరాతలు మార్చేలా సీఎం జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన అందిస్తున్నారని.. మహిళలంతా ఆయనకు అండగా నిలవాలని పుష్పశ్రీవాణి ఆకాంక్షించారు. -
డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఎస్టీనే..
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి ఎస్టీ అని విచారణ కమిటీ తేల్చింది. ఆమె ఎస్టీ కొండదొర కులానికి చెందినవారని నిర్థారించింది. పొందుపరిచిన కులం నిజమేనని డీఎల్ఎస్సీ ప్రకటించింది. కాగా, ఉప ముఖ్యమంత్రి శ్రీవాణి కులంపై లాయర్ రేగు మహేష్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన కోర్టు విచారణ జరపాలని ప.గో.జిల్లా డీఎల్‌ఎస్‌సీకి సూచించింది. విచారణ నివేదికను జిల్లా కలెక్టర్‌కు ఇవ్వాలని ఆదేశించింది. కోర్టు సూచనతో డీఎల్ఎస్సీ ఛైర్మన్ పుష్ప శ్రీవాణి కులంపై జిల్లా స్థాయి నిర్థారణ కమిటీ ఆధ్వర్యంలో విచారణ జరిపారు. శ్రీవాణి నిజమైన ఎస్టీ కొండదొర కులస్తురాలని విచారణలో తేలింది. నివేదిక ఆధారంగా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. -
ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణికి కరోనా
సాక్షి, విజయనగరం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణికి కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం ఆమె విశాఖపట్నంలోని ఓ ఆస్పత్రిలో వైద్యం చేయించుకుంటున్నారు. ఆమె భర్త, వైఎస్సార్ సీపీ అరకు పార్లమెంట్ అధ్యక్షుడు పరిక్షిత్ రాజుకు కూడా కరోనా సోకింది. -
ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు: పుష్ప శ్రీవాణి
-
ఆక్సిజన్ అందక ఎవరూ చనిపోలేదు: విజయనగరం కలెక్టర్
-
ఆక్సిజన్ అందక ఎవరూ చనిపోలేదు: విజయనగరం కలెక్టర్
సాక్షి, విజయనగరం: జిల్లాలోని ఓ ఆస్పత్రిలో సోమవారం ఆక్సిజన్ సరఫరాలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఆక్సిజన్ ప్రవాహం తక్కువ కావడంతో రోగులు ఇబ్బంది పడ్డారు. సకాలంలో అధికారులు స్పందించి, 15 మంది రోగులను వేరే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై విజయనగరం జిల్లా కలెక్టర్ హరిజవహర్ లాల్ స్పందిస్తూ.. ఆక్సిజన్ సరఫరాలో సాంకేతిక సమస్య వచ్చిందన్నారు. సకాలంలో స్పందించి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టామని తెలిపారు. కొంత మంది రోగులను వేరే ఆస్పత్రులకు తరలించామని చెప్పారు. ఆక్సిజన్ అందక ఎవరూ చనిపోలేదని వైద్యులు చెప్పినట్టు కలెక్టర్ వెల్లడించారు. ఇతర అనారోగ్య కారణాల వల్లే ఇద్దరు చనిపోయారని స్పష్టం చేశారు. ఖాళీ అయిన సిలిండర్లు ఎప్పటికప్పుడు నింపుతున్నామని తెలిపారు. కొంత మంది రోగులను వేరే ఆస్పత్రులకు తరలించామని చెప్పారు. బాధితులు, వారి కుటుంబసభ్యులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ హరిజవహర్ లాల్ పేర్కొన్నారు అదే విధంగా ఈ ఘటనపై డీప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి మాట్లాడుతూ.. ఆక్సిజన్ సరఫరాలో సాంకేతిక సమస్యను పరిష్కరిస్తున్నామని తెలిపారు. వైద్య, ఆరోగ్య మంత్రి ఆళ్ల నాని పరిస్థితిని సమీక్షిస్తున్నారని చెప్పారు. ఆక్సిజన్ సరఫరాలో సాంకేతిక సమస్య తలెత్తిందని అన్నారు. 15 మంది రోగులను వెంటనే వేరే ఆస్పత్రికి తరలించామని తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి పుష్ప శ్రీవాణి పేర్కొన్నారు. ఈ ఘటనపై ఆస్పత్రి సూపరింటెండెంట్ మాట్లాడుతూ.. ఆక్సిజన్ సరఫరాలో సాంకేతిక సమస్యను పరిష్కరిస్తున్నామని తెలిపారు. ఆస్పత్రిలో 296 మంది బాధితులకు చికిత్స అందిస్తున్నామని చెప్పారు. నాన్ కోవిడ్ పేషెంట్లకు కూడా చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం 150మందికి ఆక్సిజన్ అందిస్తున్నామని పేర్కొన్నారు. చదవండి: 1.43 లక్షల టన్నుల ఆక్సిజన్ సరఫరా -
నా కులంపై దుష్ప్రచారం చేస్తున్నారు: పుష్ప శ్రీవాణి
సాక్షి, విజయనగరం: తన కులంపై కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి ఆవేదన వ్యక్తం చేశారు. నూటికి నూరు శాతం తాను ఎస్టీ కొండ దొర కులానికి చెందిన వ్యక్తిని అన్నారు. తన సోదరి స్పెషల్ డీఎస్సీ పోస్టును వెనక్కి తీసుకోవడంపై ఆమె స్పందించారు. ‘‘నాన్ లోకల్ కారణంగానే మా సోదరికి స్పెషల్ డీఎస్సీలో పోస్టు వెనుకకి తీసుకున్నారు. కులం కారణం కాదు. ఏ విషయం మీద తొలగించారన్నది ఎందుకు మీరు చెప్పడం లేదు. 2014 ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసినప్పుడు ఎమ్మార్వో ఇచ్చిన కుల ధృవీకరణ పత్రాన్ని సమర్పించినందుకు రిటర్నింగ్ అధికారికి అనర్హత వేటు వేయాలని కొందరు ఫిర్యాదు చేశారు’’ అని పుష్ప శ్రీ వాణి తెలిపారు. ‘‘అయితే, ఎస్టీ కుల ధృవీకరణ పత్రం ఆర్డీవో కాకుండా ఎమ్మార్వో ఇవ్వచ్చొన్న నిబంధన ఉందని… ఇదే విషయం సంబంధిత రిటర్నింగ్ అధికారి వద్ద నుంచి లిఖిత పూర్వకంగా తీసుకున్నాం. దీనిపై విచారణ జరుగుతుంది. నిజాలు త్వరలోనే తేలుతాయి. రాజకీయంగా కొందరు నాపై ఆరోపణలు చేస్తున్నారే తప్ప.. వాళ్లకీ తెలుసు నేను ఏ తప్పు చేయలేదని. కానీ అబద్దాన్ని పది సార్లు చెప్పి నిజం అనిపించాలని ప్రయత్నం చేస్తున్నారు. న్యాయం నావైపే ఉంటుందని ఆశిస్తున్నాను’’ అన్నారు పుష్ప శ్రీవాణి. చదవండి: గిరిజనులకు రక్షణగా ఎస్టీ కమిషన్: పుష్పశ్రీవాణి -
జగనాన్న విద్యా దీవెన ద్వారా ప్రతి విద్యార్థికి లబ్ది చేకూరుతుంది
-
గిరిజనులకు రక్షణగా ఎస్టీ కమిషన్: పుష్పశ్రీవాణి
సాక్షి, విజయవాడ: చంద్రబాబు గిరిజనులను ఏనాడూ పట్టించుకోలేదని డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పుష్పశ్రీవాణి మండిపడ్డారు. ఎస్టీ కమిషన్ తొలి ఛైర్మన్ కుంభా రవిబాబు పదవీ బాధ్యతల స్వీకార మహోత్సవ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, గిరిజనుల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని.. ఆయనను ప్రతి గిరిజనుడు చిరస్థాయిగా గుర్తుపెట్టుకుంటారన్నారు. గిరిజనులకు రక్షణగా ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఉంటుందన్నారు. గిరిజనులకు 3 లక్షల ఎకరాలకు పట్టాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌దన్నారు. గిరిజనుల సాధికారత సాధించడానికే ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేశారని పుష్ప శ్రీవాణి అన్నారు. చదవండి: రాజకీయ బతుకుదెరువు కోసమే టీడీపీ కుట్రలు’ ఎస్టీ కమిషన్ తొలి ఛైర్మన్‌గా కుంభా రవిబాబు బాధ్యతలు -
గిరిజనులకు రక్షణగా ఎస్టీ కమిషన్: పుష్పశ్రీవాణి
-
పుష్పశ్రీవాణి కుమార్తె నామకరణ కార్యక్రమం
-
డిప్యూటీ సీఎం కుమార్తెకు ‘వైఎస్’ పేరు
సాక్షి, విజయనగరం: వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంపై తమకున్న అభిమానాన్ని ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, వైఎస్సార్సీపీ అరకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు దంపతులు మరోసారి చాటుకున్నారు. ఆ దంపతులకు తొలి సంతానంగా జన్మించిన పాపకు వైఎస్ అక్షరాలతో పాటు సీఎం జగన్, ఆయన సతీమణి భారతి పేరు కలిసొచ్చేలా ‘యశ్విత శ్రీజగతి’ అని నామకరణం చేశారు. విజయనగరం జిల్లా చినమేరంగిలోని స్వగృహంలో శనివారం నిర్వహించిన నామకరణ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ధర్మాన, మంత్రి బొత్స తదితరులు హాజరయ్యారు. తమ కుమార్తెకు యశ్వితలో మొదటి అక్షరం వై, శ్రీలో మొదటి అక్షరం ఎస్ కలిపితే వైఎస్ అని, తమ నాయకుడు జగన్, ఆయన సతీమణి భారతి పేరు కలిపి జగతి అని నామకరణం చేశామని పుష్పశ్రీవాణి దంపతులు వివరించారు. -
పుష్ప శ్రీవాణికి ఎమ్మెల్యే రోజా శుభాకాంక్షలు
-
ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు..
సాక్షి, విజయవాడ: ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్రం ఆమోదంతో ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం.. ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు నోటిఫికేషన్ విడుదల చేసింది. (చదవండి: ఇళ్ల నిర్మాణానికి మూడు ఆప్షన్లు: సీఎం జగన్) ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి మాట్లాడుతూ, ప్రత్యేక ఎస్టీ కమిషన్ కోసం ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. గిరిజనులకు ఇచ్చిన హామీ నెరవేర్చారని, గిరిజన హక్కులు కాపాడేందుకు ఎస్టీ కమిషన్ తీసుకొచ్చారని ఆమె తెలిపారు. సీఎం జగన్‌కు గిరిజనులంతా రుణపడి ఉంటారని పుష్పశ్రీవాణి పేర్కొన్నారు.(చదవండి: నా ఇంటి నెంబరు 305..) -
సీఎం జగన్‌కి ప్రధాని పుట్టిన రోజు శుభాకాంక్షలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు నేడు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ.. సీఎం జగన్‌కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు. చిరకాలం మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను’ అంటూ మోదీ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖులు, వైఎస్సార్ సీపీ నేతలు ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. Birthday greetings to Andhra Pradesh CM Shri ysjagan Garu. I pray that Almighty blesses him with a healthy and long life. — Narendra Modi (narendramodi) December 21, 2020 ఇక సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా తమిళనాడు సీఎం పళనిస్వామి, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డితో సహా పలువులు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. On the6 joyous occasion of Hon'ble Chief Minister of AndhraPradesh ysjagan's birthday, I would like to convey my warm felicitations to him and wish him many more happy returns of the day. — Edappadi K Palaniswami (CMOTamilNadu) December 21, 2020 Birthday greetings to the Chief Minister of Andhra Pradesh Shri ysjagan ji. May you be blessed with good health and long life. — Nitin Gadkari (nitin_gadkari) December 21, 2020 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వై యస్ జగన్ మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ మరియు దేశ ప్రజల సేవలో మీకు మంచి ఆరోగ్యం మరియు దీర్ఘాయువు కలగాలని ఆకాంక్షిస్తున్నాను. ysjagan — Lok Sabha Speaker (loksabhaspeaker) December 21, 2020 ప్రియతమ అధినేత, ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. చిరకాలం మీరు ఆయురారోగ్యాలతో ఉంటూ ప్రజారంజకంగా పాలించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా.ysjagan HBDYSJagan — Vijayasai Reddy V (VSReddy_MP) December 21, 2020 జన్మదిన శుభాకాంక్షలు Warm birthday wishes to the young & dynamic Chief Minister of AndhraPradesh - Y. S. Jaganmohan Reddy. On this special day, I pray to Lord Venkateswara for your good health & long life.HBDYSJagan YSJaganBirthday ysjagan YSRCParty AndhraPradeshCM — Parimal Nathwani (mpparimal) December 21, 2020 "నేను విన్నాను.. నేను ఉన్నాను.." అని చెప్పి ప్రజల్లో భరోసా కల్పించడమే కాకుండా ఆ మాటను నిజం చేస్తున్న మన ప్రియతమ నాయకుడు వైయస్ జగన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు.ysjagan HBDYSJagan HBDBestCMYSJagan — Buggana Rajendranath Reddy (IamBuggana) December 21, 2020 Wishing a happy birthday to Andhra Pradesh Chief Minister ysjagan from all the team UKinHyderabad — Dr Andrew Fleming (Andrew007Uk) December 21, 2020 Warm birthday greetings to Chief Minister of Andhra Pradesh Shri Y.S.Jaganmohan Reddy. My best wishes for a long and healthy life in the service of the people. ದೇವರ ಅನುಗ್ರಹ ಸದಾ ಇರಲಿ ಎಂದು ಹಾರೈಸುತ್ತೇನೆ. ysjagan — B.S. Yediyurappa (BSYBJP) December 21, 2020 Wishing a very happy birthday to Chief Minister of Andhra Pradesh Shri ysjagan Ji. Hope this year is filled with good luck, good health, and much happiness. — Dr. Ramesh Pokhriyal Nishank (DrRPNishank) December 21, 2020 పాదయాత్రలో ప్రజల కష్టాలు చూశాడు. ప్రతి మనిషికీ ‘నేను ఉన్నాను’ అనే ధైర్యాన్ని ఇచ్చాడు. నవరత్నాలతో నమ్మకాన్ని నింపాడు. తన పాలనతో రాష్ట్రాలనే కాదు దేశం మొత్తం ఆయన వైపు తొంగి చూసేలా చేశాడు. ‘దట్ ఈజ్ వైయస్ జగన్మోహన్ రెడ్డి’ HAPPY BIRTHDAY జగన్ అన్న.HBDYSJagan ysjagan VSReddy_MP — MARGANI BHARAT RAM (BharatYSRCP) December 21, 2020 జనం కోసం పుట్టిన జననేత కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్‌డే జగన్ అన్న HBDYSJagan — Biyyapu MadhuSudhan Reddy - MLA (BiyyapuMadhu) December 21, 2020 Hon’ble AP Governor Sri Biswa Bhusan Harichandan conveyed his warm wishes on birthday of AndhraPradeshCM Sri ysjagan Y S Jagan Mohan Reddy. The Governor wished that Lord Jagannath, Venkateswara & Maa Kanakadurga bless him with joy, prosperity & long life in service to people. — Governor of Andhra Pradesh (governorap) December 21, 2020 Wishing the honourable chief minister of Andhra Pradesh ysjagan many many happy returns of the day!!💐… May God bless you with the strength to lead AP to it’s glory!!! Thank you jagan Garu For the relief measures given to the Telugu film industry!! HBDYSJagan — Nagarjuna Akkineni (iamnagarjuna) December 21, 2020 -
ఆ ఘనత సీఎం వైఎస్ జగన్‌దే..
సాక్షి, విజయవాడ: గిరిజనుల కోసం మాట్లాడే అర్హత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడికి లేదని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనులను చంద్రబాబు.. ఐదేళ్లు మోసం చేశారని ఆమె దుయ్యబట్టారు. ‘గిరిజనులకు దేశంలో ఎవరూ చేయని మేలు వైఎస్ జగన్ చేశారు. వారికి ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌ది. ప్రత్యేక ఎస్టీ కమిషన్, గిరిజన సలహా మండలి ఏర్పాటు చేశాం. గిరిజన ప్రాంతాల్లో మెడికల్ కాలేజీ, 5 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను ఏర్పాటు చేస్తున్నాం.గిరిజనులకు ఏనాడైనా చంద్రబాబు ఇన్ని పథకాలు తెచ్చారా?. జీవో నెంబర్ 3పై సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేశామని’’ పుష్పశ్రీవాణి పేర్కొన్నారు. (చదవండి: ‘రాజ్యాంగ వ్యతిరేక శక్తులెవరో తేల్చుకుంటాం’) -
కార్పొరేటు స్కూళ్లకు ధీటుగా గిరిజన పాఠశాలలు
-
ట్రైబల్ సబ్‌ప్లాన్ పటిష్టంగా అమలు
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లు ట్రైబల్ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టకుండా, ప్రతి పైసా గిరిజనులకే చేరేలా చూడాలని ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర స్థాయి నోడల్ ఏజెన్సీ ఆమోదం పొందకుండా నిబంధనలకు విరుద్ధంగా నిధులు ఖర్చు చేయడాన్ని నియంత్రించాలని కోరారు. తాత్కాలిక సచివాలయంలో బుధవారం ఆమె గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో గిరిజన గురుకుల విద్యా సంస్థలలో ఏర్పాటు చేసిన డిజిటల్, వర్చువల్ క్లాసు రూములపై సమగ్ర నివేదికను ఇవ్వాలని ఆదేశించారు. హాస్టళ్ల నుంచి స్కూళ్లుగా స్థాయి పెంచిన అన్ని పాఠశాలల భవనాల నిర్మాణానికి కావాల్సిన స్థలాలను గుర్తించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. గిరిజన గురుకుల విద్యాలయాలపై ఆమె సమీక్షించారు. -
గిరిజన పక్షపాతి సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: అటవీ భూములపై హక్కు పత్రాలు పొందిన గిరిజనులకు 2 విడతల రైతు భరోసాను ఒకేసారి చెల్లించడం ద్వారా సీఎం జగన్ గిరిజన పక్షపాతి అనే విషయాన్ని మరోసారి నిరూపించారని ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి కొనియాడారు. ఒక్కో గిరిజన రైతుకు రూ.11,500 చొప్పున ఒకేసారి ఖాతాల్లో జమ చేయడం గొప్ప విషయమని ఆనందం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఆమె మంగళవారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈనెల 2న సీఎం జగన్ రాష్ట్రంలోని 1.53 లక్షల మంది గిరిజనులకు 3.12 లక్షల ఎకరాల భూమిని పట్టాలుగా పంపిణీ చేసిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. వారందరికీ కూడా రైతు భరోసా అందిస్తామని సీఎం అప్పట్లో హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఆ మాట ప్రకారం.. నేడు రెండు విడతల రైతు భరోసా మొత్తాలను ఒకేసారి గిరిజనుల ఖాతాల్లో జమ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. అంతేకాకుండా గిరిజనులు ఆ భూముల ద్వారా ఉపాధి పొందడానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారని పుష్ప శ్రీవాణి తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీల కోసం నూతన పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చారని కొనియాడారు. సీఎం జగన్ అధికారం చేపట్టిన ఏడాదిలోనే అమలు చేసిన రైతు భరోసా, పెన్షన్ కానుక, వాహన మిత్ర, సున్నా వడ్డీ, లా నేస్తం, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, అమ్మ ఒడి, ఆరోగ్య శ్రీ, ఆరోగ్య ఆసరా, కంటి వెలుగు, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన తదితర పథకాల ద్వారా గిరిజనులకు ఎంతో మేలు జరిగిందని కొనియాడారు. -
ఎమ్మెల్సీలుగా సురేష్, జకియా ప్రమాణస్వీకారం
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలుగా పెనుమత్స సురేష్, జకీయా ఖానుమ్ మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలి చైర్మన్ షరీఫ్ వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమానికి డిప్యూటీ సీఎంలు పుష్ప శ్రీవాణి, అంజాద్ భాషా, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు బడ్డుకొండ అప్పల నాయుడు, జోగి రమేష్, మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ వేణుగోపాల్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. ‘సీఎం జగన్ ఎమ్మెల్సీల ఎంపికలో ప్రత్యేక శైలి పాటించారు. చరిత్రలో తొలిసారి మైనారిటీ మహిళ జకీయా ఖానుమ్‌ను శాసన మండలికి పంపారు. జగన్‌తో తొలి రోజు నుంచి వెన్నంటే ఉన్న సాంబశివరాజు కుమారుడు సురేష్‌కి అవకాశం ఇచ్చారు. ఇద్దరి ఎంపిక పార్టీని నమ్ముకున్న వారికి జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యం ఇచ్చారని రుజువు చేసింద’ని అన్నారు. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మాట్లాడుతూ.. 'మైనారిటీ మహిళను ఎమ్మెల్సీ చేయడం మైనారిటీలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఉన్న ప్రేమకు నిదర్శనం. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ముస్లిం మహిళకు గౌరవం ఇచ్చిన ఘనత సీఎం జగన్‌ది. ముస్లిం సమాజం మొత్తం సీఎం జగన్‌ను అభినందిస్తున్నారు. వైఎస్ కుటుంబం అంటేనే ముస్లిం పక్షపాత కుటుంబం. సామాన్య మైనారిటీ మహిళను మండలికి పంపడం విశేషమ'ని పేర్కొన్నారు. (ప్రధాని మోదీతో ముగిసిన సీఎం జగన్ భేటీ) ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ.. 'విజయనగరం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపింది పెనుమత్స సాంబశివరాజు. పార్టీని నమ్ముకున్న వారికి సీఎం జగన్మోహన్రెడ్డి గుర్తింపు ఇస్తారని మరోసారి నిరూపించారు. రాష్ట్రంలోని కార్యకర్తలు అందరిలోనూ గౌరవాన్ని పెంచారు. మైనారిటీ మహిళకూ ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి జగన్మోహన్రెడ్డి మహిళా పక్షపాతి అని నిరూపించార'ని ప్రశంసించారు. -
మహాత్ముడికి వైఎస్ఆర్సీపీ నేతల నివాళి
-
‘గాంధీ ఆశయాలను నిజం చేసిన సీఎం జగన్’
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో గ్రామ స్వరాజ్యం తీసుకువచ్చారని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి అన్నారు. వైస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో ఇవాళ(అక్టోబర్ 2) మహత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రీల జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎంతో పాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి కన్నబాబు, ఎంపీ నందిగాం సురేష్, పార్టీ నేత లేళ్ల అప్పిరెడ్డి పాల్గొని నివాళులు అర్పించారు. అనంతరం పుష్పశ్రీవాణి మాట్లాడుతూ.. గాంధీ ఆశయ సాధన కోసం అందరం పునరంకితం కావాలన్నారు. మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. గాంధీజీని స్మరించుకోవడం మన బాధ్యత అన్నారు. గ్రామ స్వరాజ్యం ఆచరణలో చూపిన వ్యక్తి సీఎం వైఎస్ జగన్ అని పేర్కొన్నారు. (చదవండి: గాంధీ అడుగు నీడలో పాలన : సీఎం జగన్) ఇక సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. విశ్వం ఉన్నంత వరకు తలుచుకోవాల్సిన మహ మనిషి గాంధీజీ అని చెప్పారు. ఆయనను స్మరించుకోవడమే కాకుండా గాంధీ ఆశయాలను నిజం చేసిన వ్యక్తి సీఎం జగన్ అన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం సంక్షేమాన్ని ప్రజల ముంగిటకే తీసుకేళ్లిందని, సచివాలయ వ్యవస్థ ప్రతి కుటుంబంలో ఒక భాగంగా అయిందని తెలిపారు. ప్రతి ఇంటికి వాలంటిర్లు వెళ్లి పెన్షన్‌లుఇవ్వడమే ఇందుకు నిదర్శనమని, ప్రభుత్వం వదిలిపోయిన భయంకరమైన ఆర్థిక పరిస్థితిలో కూడా సీఎం వైఎస్ జగన్ వల్లే ఇది సాధ్యమైందన్నారు. గాంధీజీ కలలు కన్న నాయకుడు సీఎం వైఎస్ జగన్ అని పేర్కొన్నారు. పేదల ఇళ్ల పట్టాల పంపిణీకి కోర్టుల ద్వారా ప్రతిపక్షం అడ్డుపడుతోందని వచ్చే మూడేళ్లలో సమస్యలు లేని గ్రామాలు ఉండేలా చేస్తామన్నారు. పట్టణాలకు ధీటుగా గ్రమాలను తయారు చేస్తామని సజ్జల వ్యాఖ్యానించారు. -
దశాబ్ధాల పోరాటానికి సీఎం జగన్ పరిష్కారం..
సాక్షి, విజయవాడ: దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా గిరిజనులకు సీఎం జగన్ భూమి హక్కు కల్పిస్తున్నారని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి అన్నారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. 'అనేక దశాబ్దాల గిరిజనుల పోరాటానికి సీఎం జగన్ పరిష్కారం చూపారు. ఏ గిరిజనుడు, గిరిజన సంఘాలు పోరాటాలు చేయకుండానే సీఎం జగన్ ఈ హక్కులు కల్పిస్తున్నారు. లక్షా 10 వేల మందికి ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు ఇస్తున్నాం. సుమారు 2 లక్షల ఎకరాలు పంపిణీ చేస్తున్నాం. కమ్యూనిటీ పట్టాల ద్వారా 60 వేల మందికి పంపిణీ చేస్తున్నాం. (ఏపీ: పెన్షన్ల పంపిణీకి సర్వం సిద్ధం) లక్షా 60 వేల ఎకరాలు కమ్యూనిటీ పట్టాలిస్తున్నాం. భూములు లేని గిరిజనులకు కూడా ఒక్కొక్కరికి 2 ఎకరాలు పంపిణీ చేస్తున్నాం. అనేక దశాబ్దాలుగా గిరిజనులు సాగు చేస్తున్న భూమికి రెవిన్యూ పట్టాలు కూడా పంపిణీ చేస్తున్నాం. మొత్తం 3 లక్షల 50 వేల ఎకరాలకు గిరిజనులకు సాగు హక్కు కల్పిస్తున్నాం. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంత పెద్దఎత్తున గిరిజనులకు భూ పంపిణీ చెయ్యలేదు. సీఎం జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకుని గిరిజన పక్ష పాతిగా నిలిచారు' అని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి పేర్కొన్నారు. (నిజాలు దాచి.. నిందలు) -
‘దళితులపై చంద్రబాబు మొసలి కన్నీరు’
సాక్షి, విజయవాడ: ఎస్సీ, ఎస్టీల గురించి మాట్లాడే అర్హత ప్రతిపక్ష నేత చంద్రబాబుకు లేదని డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి నిప్పులు చెరిగారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎస్సీలుగా పుట్టాలనుకుంటారా అంటూ అవమానించిన చంద్రబాబు వ్యాఖ్యలను గుర్తు చేశారు. ఎస్టీలకు తెలివి ఉండదని చంద్రబాబు హేళన చేశారని.. ఆయనను చూసి ఎస్సీ, ఎస్టీలు అసహ్యించుకుంటున్నారని తెలిపారు. ‘‘రాష్ట్ర చరిత్రలో ఎస్సీ, ఎస్టీలకు ఎవరూ ఇవ్వనన్నీ పథకాలు అమలు చేస్తున్నాం. కోటి 13 లక్షల మందికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం జగన్‌దే ఎస్సీ, ఎస్టీలకు ఏడాదిలోనే 13వేల కోట్లు సంక్షేమ పథకాల రూపంలో అందించాం. దళితులు, గిరిజనులపై దాడులు జరిగితే వెంటనే చర్యలు తీసుకుంటున్నామని’’ మంత్రి వెల్లడించారు. (చదవండి: చంద్రబాబు దళిత ద్రోహి: దళిత నేతలు) పశ్చిమగోదావరి: చంద్రబాబు దళిత ద్రోహి అని మంత్రి తానేటి వనిత మండిపడ్డారు. ఏనాడూ దళితులను ఆయన పట్టించుకోలేదన్నారు. దళితులపై చంద్రబాబు మొసలికన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. సీఎం జగన్ కేబినెట్లో ఐదుగురు దళితులకు అవకాశం కల్పించారని పేర్కొన్నారు. చంద్రబాబుకు దళితులు గుణపాఠం చెబుతారని తానేటి వనిత అన్నారు.(చదవండి: ‘చంద్రబాబుకు ప్రేమలేదు.. అంతా డ్రామా’) -
ఎంపీ మోపిదేవికి తృటిలో తప్పిన ప్రమాదం
సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. అయితే ఎంపీ మోపిదేవితో పాటు ఆయన కుటుంబసభ్యులకు తృటిలో ప్రమాదం తప్పింది. విశాఖ జిల్లా కసింకోట మండలం తాళ్లపాలెం వద్ద మోపిదేవి వెళ్తున్న కాన్వాయ్‌లో ముందు వెళ్తున్న వాహనం సడన్ బ్రేక్ వేయడంతో కార్లు ఢీకొన్నాయి. అదే సమయంలో వెనకనే వచ్చిన డిప్యూటీ సీఎం పుష్పశ్రీ వాణి వాహనంలో ఎంపీ మోపిదేవి, ఆయన కుటుంబసభ్యులు విశాఖ బయల్దేరి వెళ్లారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఘనంగా ఆదివాసీ దినోత్సవం
సాక్షి, అమరావతి/పార్వతీపురం టౌన్/పాడేరు: ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని ఐటీడీఏల్లో నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గిరిజన ఎమ్మెల్యేలు, నేతలు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, అల్లూరి సీతారామరాజు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గిరిజనుల అభ్యున్నతికి ప్రభుత్వం చేస్తున్న సేవలను కొనియాడారు. 90 శాతం హామీలు నెరవేర్చాం.. విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి జ్యోతి ప్రజ్వలన చేసి ఆదివాసీ దినోత్సవాన్ని ప్రారంభించారు. ఎన్నికల మేనిఫెస్టోలో గిరిజనులకు ఇచ్చిన హామీల్లో 90 శాతానికి పైగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెరవేర్చారని, మరెన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని పుష్పశ్రీవాణి కొనియాడారు. కార్యక్రమంలో అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, ఎమ్మెల్యేలు అలజంగి జోగారావు, పీడిక రాజన్నదొర తదితరులు పాల్గొన్నారు. పాడేరులో ఘనంగా.. విశాఖ జిల్లా పాడేరులో ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అధ్యక్షతన గిరిజన దినోత్సవాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ వి.వినయ్‌చంద్, అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన గిరిజన సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఐటీడీఏ పీవో వెంకటేశ్వర్, మాజీ మంత్రి మణికుమారి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో.. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో పార్టీ ఎస్టీ సెల్ నేతలు పాల్గొన్నారు. నాడు వైఎస్సార్ 32 లక్షల ఎకరాలకు పైగా భూముల్లో గిరిజనులకు హక్కులు కల్పించారని పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ కుంభా రవిబాబు గుర్తుచేసుకున్నారు. నేడు సీఎం వైఎస్ జగన్ దాదాపు 50 వేల ఎకరాల భూమిని 24,500 మంది గిరిజన కుటుంబాలకు పంపిణీ చేసేందుకు నిర్ణయించారని కొనియాడారు. -
వంగపండు మృతికి సీఎం వైఎస్ జగన్ సంతాపం
సాక్షి, అమరావతి: ఉత్తరాంధ్ర జానపద కాణాచి వంగపండు ప్రసాదరావు మృతికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. వంగపండు ఇక లేరన్న వార్త ఎంతో బాధించింది. ఆయన వ్యక్తిగతంగా నాకు ఆప్తులు. జానపదాన్ని తన బాణీగా మార్చుకుని ‘పామును పొడిచిన చీమలున్నా’యంటూ ఉత్తరాంధ్ర ఉద్యమానికి అక్షర సేనాధిపతిగా మారారు. తెలుగువారి సాహిత్య, కళారంగాల చరిత్రలో ఓ మహాశిఖరంగా ఆయన నిలిచిపోతారు. వంగపండు మృతిపట్ల ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను’ అంటూ ఆయన ట్విటర్లో పేర్కొన్నారు. (ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు కన్నుమూత) ప్రజల్లో స్ఫూర్తిని రగిల్చారు: విజయసాయిరెడ్డి వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వంగపండు ప్రసాదరావు మృతికి సంతాపం ప్రకంటించారు. ‘ఉత్తరాంధ్ర జానపద శిఖరం, ప్రజాకవి, కళాకారుడు వంగపండు ప్రసాదరావు గారు మృతి తీరని లోటు. ఈ తెల్లవారుజామున మనల్ని విడిచి వెళ్లిపోయారన్న వార్త నన్ను దిగ్బ్రాంతికి గురిచేసింది. వందలాది జానపద గేయాలతో ఆయన ప్రజల్లో స్ఫూర్తిని రగిల్చారు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి' అంటూ ట్వీట్ చేశారు. గొప్ప కళాకారుడు వంగపండు: డిప్యూటీ సీఎం ప్రముఖ జానపద కళాకారుడు వంగపండు ప్రసాదరావు మృతికి డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి సంతాపం ప్రకటించారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ‘ఉత్తరాంధ్ర జానపదాన్ని ప్రపంచ స్థాయికి తీసుకుని వెళ్లిన కళాకారుడు వంగపండు. ఆయన విజయనగరం జిల్లాలో మా ప్రాంత వాసి కావడం మా అందరికి గర్వకారణం. తన పాటలు, రచనలు, ప్రదర్శనలతో ప్రజల్లో చైతన్యం నింపారు. 5 దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర ప్రజల కష్టాలను తన పాటలతో వినిపించిన గొప్ప కళాకారుడు వంగపండు. ఆయన ఉత్తరాంధ్ర గళం. ఆయన మరణం యావత్ ఉత్తరాంధ్ర ప్రజలకు తీరని లోటు. ఆయన కుటుంబాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ గౌరవిస్తుంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను' అని తెలిపారు. బహుముఖ ప్రజ్ఞాశాలి: తానేటి వనిత వంగపండు ప్రసాదరావు మృతికి మంత్రి తానేటి వనిత సంతాపం వ్యక్తం చేశారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన వంగపండు తన పాటలు, రచనలు, ప్రదర్శనలతో ప్రజల్లో ఎంతో చైతన్యం కల్పించారని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఆర్వోఎఫ్ఆర్ పట్టాలపై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, అమరావతి: ఆర్వోఎఫ్ఆర్ పట్టాలపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. శుక్రవారం రోజున సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి, రెవిన్యూ, అటవీ, గిరిజన సంక్షేమ శాఖలకు చెందిన అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఆగస్టు 9న ఆదివాసీ దినోత్సవం రోజున పట్టాల పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అందుకు సంబంధించిన క్లెయిమ్‌లను పరిశీలించి గిరిజనులకు మేలు చేయాలని అధికారులకు సూచించారు. అటవీ భూములపై సాగు హక్కుల కోసం చాలా కాలంగా వేచి చూస్తున్న గిరిజనులకు ప్రయోజనం కల్పించాలన్నారు. అర్హత ఉన్న వారందరికీ సాగు హక్కులు కల్పించాలని ఆదేశించారు. పట్టాలు ఇచ్చాక ఆయా భూముల అభివృద్ధిపై కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలన్నారు. ఆ భూముల్లో ఏం సాగు చేయాలన్న దానిపై కూడా ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు పోవాలని సూచించారు. దీనిపై వ్యవసాయ, సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. దీని కోసం 'గిరిభూమి' పేరుతో పోర్టల్‌ను ప్రారంభిస్తున్నట్లు అధికారులు సీఎం వైఎస్ జగన్‌కు తెలిపారు. (అందరికీ పథకాల ఫలాలు దక్కాలి: వైఎస్ జగన్) -
గిరిజన హక్కులను హరించింది చంద్రబాబే
సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో గిరిజనులు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యారని, వారి హక్కులను హరించేలా అప్పటి ప్రభుత్వం వ్యవహరించిందని ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి ధ్వజమెత్తారు. గిరిజనుల హక్కులు, రిజర్వేషన్లపై సీఎం వైఎస్ జగన్‌కి చంద్రబాబు లేఖ రాయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆమె శనివారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ► సీఎం వైఎస్ జగన్ బాక్సైట్ అనుమతులు రద్దు చేశారు. ► గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేశారు. ► గిరిజన విశ్వవిద్యాలయం, ఇంజినీరింగ్, మెడికల్ కళాశాలల ఏర్పాటుకు ఆదేశాలిచ్చారు. ► ఏడు ఐటీడీఏలలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. ► ఏజెన్సీ పంచాయతీల్లో 100 శాతం వార్డులను, జెడ్పీటీసీ స్థానాలను గిరిజనులకు రిజర్వ్ చేశాం. ► మైదాన ప్రాంతాల్లోనూ 100 శాతం గిరిజన జనాభా ఉన్న తండాల్లో సర్పంచ్‌లు, వార్డు మెంబర్ల స్థానాలన్నింటినీ గిరిజనులకే కేటాయించాం. ► 4.76 లక్షల గిరిజన కుటుంబాలలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. జీవో నంబర్–3ను సుప్రీంకోర్టు కొట్టేయడానికి టీడీపీ ప్రభుత్వం చేసిన తప్పిదమే కారణం. గతంలో గిరిజనులకు 100 శాతం రిజర్వేషన్ కల్పించే జీవో 275 అమల్లో ఉండగా.. దాన్ని నిర్లక్ష్యం చేసి జీవో నంబర్–3ను తెచ్చారు. రాజ్యాంగంలో విస్తృతాధికారాలున్న 5(2) అధికరణం ప్రకారం కాకుండా, పరిమితాధికారాలున్న 5(1) ప్రకారం జీవోను తేవడం వల్ల సుప్రీం కోర్టులో వీగిపోయింది. -
గిరిజన హక్కులను కాలరాసిన టీడీపీ
సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో గిరిజనాభివృద్ధిని గాలికొదిలేశారని డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి మండిపడ్డారు. రాష్ట్రంలో గిరిజనుల హక్కులు, రిజర్వేషన్లు గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు లేఖ రాసిన నేపథ్యంలో ఆమె శనివారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో టీడీపీ తీరును దుయ్యబట్టారు. గత ప్రభుత్వంలో గిరిజనుల హక్కులను కాలరాసేలా నిర్ణయాలు తీసుకున్నారని ధ్వజమెత్తారు. జీవో నంబర్ 3 వీగిపోవడానికి టీడీపీ తప్పిదమే కారణమన్నారు. ఐదేళ్ల పాలనలో గిరిజనుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిన చంద్రబాబు.. గిరిజనాభివృద్ధిపై లేఖ రాయడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. టీడీపీ పాలనలో రాష్ట్రంలో గిరిజనులు తీవ్ర నిర్లక్ష్యానికి, అవమానాలకు గురయ్యారని, వారి హక్కులను కూడా హరించేలా అప్పటి ప్రభుత్వం వ్యవహరించిందని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం కొనసాగిన ఐదేళ్ల కాలంలో చివరి ఆరు నెలల దాకా కూడా గిరిజనులకు మంత్రి పదవిని ఇవ్వకుండా అవమానించారని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన మంత్రివర్గంలో గిరిజన మహిళకు ఏకంగా ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చి గౌరవించారని గుర్తు చేశారు. (అశోక్‌బాబుపై ఏపీఎన్జీవో ఫైర్..) గిరిజనులకు వ్యతిరేకంగా బాక్సైట్ తవ్వకాలకు అనుమతులిచ్చారు.. కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గిరిజనాభివృద్ధికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకొనే గిరిజన సలహా మండలి(టీఏసీ)ని ఏర్పాటు చేయాల్సి ఉండగా టీడీపీ ప్రభుత్వం వచ్చిన మూడున్నరేళ్ల తర్వాతగానీ టీఏసీని ఏర్పాటు చేయలేదని తెలిపారు. వైఎస్సార్సీపీ నేతల హెచ్చరికలతో టీఏసీని ఏర్పాటు చేసిన టీడీపీ ప్రభుత్వం.. గిరిజన శాసనసభ్యులందరూ వైఎస్సార్సీపీకి చెందిన వారు ఉండటంతో వారి హక్కులను కాలరాసేలా, టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన వారిని కూడా టీఏసీలో సభ్యులుగా చేసిందని విమర్శించారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన మూడు నెలల కాలంలోనే టీఏసీని ఏర్పాటు చేసారని, ప్రభుత్వం ఏర్పాటయిన ఐదు నెలలకే టీఏసీ సమావేశం కూడా జరిగిందని వివరించారు. మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతులు రద్దు చేస్తామని ఎన్నికలలో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం గిరిజనులకు వ్యతిరేకంగా బాక్సైట్ తవ్వకాలకు అనుమతులను కూడా ఇచ్చిందని చెప్పారు. అయితే వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజనుల మనోభిప్రాయాలను గౌరవిస్తూ బాక్సైట్ అనుమతులను రద్దు చేసారని వెల్లడించారు. (మరో విప్లవానికి ఏపీ సర్కార్ నాంది) గిరిజనాభివృద్ధిని టీడీపీ పట్టించుకోలేదు.. గిరిజనుల విద్యాభివృద్ధిని, వారి ఆరోగ్య సమస్యలను గురించి టీడీపీ ప్రభుత్వం ఏ రోజు కూడా పట్టించుకోలేదని పుష్ప శ్రీవాణి విమర్శించారు. వైఎస్ జగన్ అధికారం చేపట్టిన తర్వాత గిరిజనుల విద్యాభివృధ్దిలో భాగంగా గిరిజన విశ్వవిద్యాలయాన్ని, గిరిజన ఇంజనీరింగ్ కళాశాలను, గిరిజన మెడికల్ కళాశాలను కూడా ఏర్పాటు చేయడానికి ఆదేశాలను ఇచ్చారని ప్రస్తావించారు. అలాగే రాష్ట్రంలో ఏడు ఐటీడీఏలలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మించడానికి కూడా చర్యలను తీసుకుంటున్నారని వివరించారు. ఆ వర్గాలతో పాటు గిరిజనులకు కూడా అవకాశం.. మునుపెన్నడూ లేని విధంగా తమ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఏజెన్సీ ప్రాంత పంచాయతీల్లో 100 శాతం వార్డులను, జడ్పీటీసీ స్థానాలను గిరిజనులకు రిజర్వ్ చేశారని ప్రస్తావించారు. మైదాన ప్రాంతాల్లోనూ 100శాతం గిరిజన జనాభా కలిగిన తాండాలలో సర్పంచ్‌లు, వార్డు మెంబర్ల స్థానాలన్నింటినీ కూడా గిరిజనులకే కేటాయించారని గుర్తు చేశారు. 500కు పైబడి జనాభా కలిగిన 146 గ్రామాలను ప్రత్యేక గిరిజన పంచాయితీలుగా మార్చారని, రాష్ట్రంలో 4.76 లక్షల గిరిజన కుటుంబాల గృహావసరాలకు కూడా ఉచిత విద్యుత్తును ఇస్తున్నారని తెలిపారు. నామినేషన్ పనులు, పదవుల్లోనూ ఇస్తున్న 50 శాతం రిజర్వేషన్లలో భాగంగా ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలతో పాటుగా గిరిజనులకు కూడా సీఎం జగన్ అవకాశం కల్పించారని చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో గిరిజనులకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చారని స్పష్టం చేసారు. టీడీపీ తప్పిందంతోనే జీవో నంబర్ 3 రద్దు.. జీవో నంబర్ 3 సుప్రీం కోర్టు కొట్టి వేయడానికి కూడా గతంలో టీడీపీ ప్రభుత్వం చేసిన తప్పిదమే కారణమని పుష్ప శ్రీవాణి ఆరోపించారు. గతంలో గిరిజనులకు 100 శాతం రిజర్వేషన్ కల్పించే జీవో నంబర్ 275 అమల్లో ఉండగా దాన్ని నిర్లక్ష్యం చేసి టీడీపీ ప్రభుత్వ హయాంలో జీవో నంబర్-3 ను తీసుకువచ్చారని, అయితే రాజ్యాగంలో విస్త్తృతమైన అధికారాలు కలిగిన 5(2) అధికరణం ప్రకారం కాకుండా పరిమితమైన అధికారాలు కలిగిన 5(1) అధికరణం ప్రకారంగా ఆ జీవోను తీసుకురావడంతో సుప్రీం కోర్టులో ఈ జీవో వీగిపోవడానికి ప్రధాన కారణమని వివరించారు. జీవో నంబర్ 3 అమల్లో ఉన్న సమయంలో కూడా చంద్రబాబు ప్రభుత్వం దాన్ని అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించిందని దుయ్యబట్టారు. టీడీపీ గోబెల్స్ ప్రచారాలను గిరిజనులు నమ్మరు.. సుప్రీం కోర్టులో కేవలం రివ్యూ పిటిషన్ వేసి చేతులు దులుపుకోవడం తమ ప్రభుత్వ విధానం కాదని స్పష్టం చేశారు. జీవో నంబర్ 3 పై న్యాయపరమైన అన్ని చర్యలు తీసుకోవడంతో పాటుగా ఏజెన్సీ ప్రాంత గిరిజనులకు టీచర్ ఉద్యోగాలలో 100 శాతం రిజర్వేషన్ వర్తించే విధంగా ఒక కొత్త చట్టాన్ని కూడా తీసుకురావాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని తెలిపారు. ఇటీవల జరిగిన రాష్ట్ర గిరిజన సలహా మండలిలో కూడా ఈమేరకు తీర్మానాన్ని ఆమోదించడం జరిగిందని కూడా గుర్తు చేశారు. తాము అధికారంలో ఉండగా గిరిజనులకు చేసిన ద్రోహాలను మరిచిపోయి సీఎం జగన్‌కు నీతులు చెబుతూ టీడీపీ అధినేత లేఖను రాయడం ఏమాత్రం సబబు కాదన్నారు. గిరిజనాభివృద్ధికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ విషయంలో టీడీపీ చేసే గోబెల్స్ ప్రచారాలను గిరిజనులు ఎవరూ నమ్మరని పుష్ప శ్రీవాణి అభిప్రాయపడ్డారు -
అడవి బిడ్డలను ఆదుకోవడానికి కొత్త చట్టం
సాక్షి, అమరావతి/బుట్టాయగూడెం: గిరిజనులకు ఉద్యోగాల్లో వంద శాతం రిజర్వేషన్లు కల్పించే జీవో నంబర్ 3ని సుప్రీంకోర్టు కొట్టేసిన నేపథ్యంలో గిరిజనుల హక్కులను కాపాడేందుకు న్యాయపరమైన చర్యలు తీసుకొని అవసరమైతే కొత్త చట్టాన్ని తీసుకురావాలని రాష్ట్ర గిరిజన సలహా మండలి (టీఏసీ) ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ విషయంలో సీఎం వైఎస్ జగన్ తీసుకుంటున్న చర్యలను అభినందిస్తూ మరో తీర్మానాన్ని కూడా ఆమోదించింది. ఐటీడీఏలలో గిరిజనుల కోసం ప్రత్యేకంగా మెడికల్ కళాశాల, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం, కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కళాశాలకు 153 కోట్లను కేటాయించినందుకు సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపింది. జీవో నంబర్ 3 విషయంపై రాష్ట్ర గిరిజన సలహా మండలి (టీఏసీ) ప్రత్యేక సమావేశం గురువారం సచివాలయంలో జరిగింది. దీనికి డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణితో పాటుగా గిరిజన ఎమ్మెల్యేలు తెల్లం బాలరాజు, పీడిక రాజన్న దొర, కళావతి, చెట్టి ఫల్గుణ, భాగ్యలక్ష్మి, ధనలక్ష్మి, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే, డైరెక్టర్ రంజిత్ బాషా హాజరయ్యారు. డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. ► జీవో నంబర్ 3పై సుప్రీం తీర్పు నేపథ్యంలో ఇప్పటి వరకూ తీసుకున్న చర్యలపై సుదీర్ఘంగా చర్చించాం. ► ఏజెన్సీ ప్రాంతాల్లోని పరిస్థితులు, భాషలు, సంప్రదాయాల నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో స్థానికులైన గిరిజనులు ఉపాధ్యాయులుగా ఉంటే ప్రయోజనం. ► గిరిజన పిల్లలు చదువుకోవడానికి, డ్రాప్ అవుట్స్ తగ్గడానికి అవకాశం ఉంటుందని జీవో నంబర్ 3ని తీసుకొచ్చాం. ► సుప్రీం తీర్పు తర్వాత సీఎం జగన్ ఆదేశాలతో అధికారులు ఇప్పటికే 3 సార్లు సమావేశాలను నిర్వహించారు. ► తెలంగాణకి చెందిన న్యాయశాఖ అధికారులు, అడ్వొకేట్ జనరల్‌తోనూ సమన్వయ సమావేశాలను నిర్వహించాం. ► సుప్రీం తీర్పుపై రివ్యూ పిటీషన్ దాఖలు చేయడానికి ఎలాంటి గడువు లేదు. కొంతమంది రాజకీయ దురుద్దేశాలతో జీవోపై రాద్ధాంతం చేయాలని చూస్తున్నారు. ► కాగా, సుప్రీం కోర్టులో రివ్యూ పిటీషన్ వేయడంతో పాటుగా ఏజెన్సీ గిరిజనులకు ఉద్యోగాల్లో 100 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ఒక కొత్త చట్టాన్ని తీసుకురావాలని పలువురు గిరిజన ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో కోరారు. -
గిరిజన హక్కుల రక్షణకు కొత్త చట్టం..
సాక్షి, తాడేపల్లి: డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి అధ్యక్షతన గిరిజన సలహా మండలి సమావేశం గురువారం జరిగింది. గిరిజన ప్రాంత ఎమ్మెల్యేలు, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో పుష్పశ్రీవాణి మాట్లాడుతూ జీవో 3 పై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని తీర్మానం చేశామని పేర్కొన్నారు. గిరిజనుల హక్కులు కాపాడేందుకు కొత్త చట్టాన్ని తేవాలని తీర్మానం చేశామన్నారు. గిరిజనుల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయాలను అభినందిస్తూ తీర్మానం చేశామని వెల్లడించారు. జీవో 3పై తెలంగాణ అధికారులతో కూడా చర్చించామని పుష్పశ్రీవాణి పేర్కొన్నారు. -
గిరిజనులకు అన్యాయం జరగనివ్వం
సాక్షి, అమరావతి: గిరిజన ప్రయోజనాలను కాపాడే విషయంలో రాజీపడే సమస్యే లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గిరిజనులకు అన్యాయం జరగనివ్వకుండా చూస్తామని హామీ ఇచ్చారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పుష్ప శ్రీవాణి నేతృత్వంలో గిరిజన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలిశారు. ఏజెన్సీ ప్రాంతంలోని టీచర్ పోస్టులను 100 శాతం గిరిజనులకే కేటాయించాలంటూ ఉమ్మడి ఏపీలో జారీ అయిన జీవో నంబర్ 3ను ఇటీవల సుప్రీం కోర్టు కొట్టేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని వారు సీఎంను కోరారు. జీవో నంబర్ 3ను కొట్టివేస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై ఏ విధంగా ముందుకెళ్లాలన్న దానిపై నిర్ణయం తీసుకుని, ఆ మేరకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఇదివరకే ఆదేశాలిచ్చినట్టు సీఎం వారితో చెప్పారు. ఈ నేపథ్యంలో దీనిపై గిరిజన ఎమ్మెల్యేలతో చర్చించి వారి సలహాలు తీసుకునేందుకు గురువారం గిరిజన సలహా మండలి (ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్) సమావేశాన్ని సచివాలయంలో ఏర్పాటు చేశారు. సీఎంను కలిసిన వారిలో తెల్లం బాలరాజు, పీడిక రాజన్న దొర, కె.కళావతి, భాగ్యలక్ష్మి, చెట్టి ఫల్గుణ, ధనలక్ష్మి తదితరులున్నారు. -
జీవో నెం.3 పై చర్చించిన సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: గిరిజనుల సంక్షేమానికి సంబంధించిన జీవో నెం 3 పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి, గిరిజన ఎమ్మెల్యేలతో మంగళవారం సీఎం కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ భేటీలో రాజన్నదొర, కళావతి, భాగ్యలక్ష్మి, శెట్టి ఫాల్గుణ,ధన లక్ష్మీలు, బాలరాజు పాల్గొన్నారు. జీవో నెం 3 కి సంబంధించి గిరిజనులకు న్యాయం చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యేలు వినతి పత్రం అందజేశారు. (ఏపీ బడ్జెట్ 2020-21) -
అగ్రి ల్యాబ్ రైతులకు ఉపయోగంగా ఉంటుంది
-
‘గిరిజనులను కేంద్రం ఆదుకోవాలి’
సాక్షి, విజయవాడ: లాక్డౌన్ కారణంగా గిరిజనులు నష్టపోయారని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి కేంద్రానికి తెలిపారు. కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె పాల్గొన్నారు. పలు గిరిజన సమస్యలను కేంద్రమంత్రికి వివరించారు. అటవీ ఉత్పత్తులకు కేంద్రం మద్దతు ధరలు ప్రకటించాలని కోరారు. (ఇది శుభపరిణామం : జవహర్ రెడ్డి) గిరిజనులు పండించే పసుపు,రాజ్మా, ఫైనాపిల్ పంటలకు మద్దతు ధర ప్రకటించాలన్నారు. వన్‌ధన్ కేంద్రాలను రాష్ట్రానికి మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరారు. గిరిజనుల ఆరోగ్యం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చర్యలు చేపట్టారని వివరించారు. గిరిజనులను ఆదుకోవడానికి కేంద్రం నిధులను కేటాయించాలని కేంద్రమంత్రికి పుష్పశ్రీవాణి విజ్ఞప్తి చేశారు. (ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు) -
వారి ప్రయోజనాలు కాపాడండి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఏజెన్సీ రిజర్వేషన్ల వ్యవహారంపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టి సారించారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతంలో టీచర్స్ నియామకాల్లో 100 శాతం రిజర్వేషన్ల అమలు జీవో నెంబర్ 3ను సుప్రీం కోర్టు ఇటీవల కొట్టివేసిన నేపథ్యంలో ఈ అంశంపై పూర్తి స్థాయిలో చర్చించి తదుపరి కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ విషయంపై అడ్వకేట్ జనరల్ సుబ్రహ్మణ్య శ్రీరామ్‌తో సమీక్ష జరిపిన వైఎస్ జగన్ గిరిజనుల ప్రయోజనాలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో గిరిజన వర్గాల్లో ఆందోళన నెలకొని ఉంది. అయితే ఈ అంశాన్ని డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి, గిరిజన ఎమ్మెల్యేలు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తీర్పును క్షుణ్నంగా అధ్యయనం చేసి న్యాయపరంగా తీసుకోవాల్సిన చర్యలపై ఆలోచనలు చేయాలని సీఎం అధికారులకు సూచించారు. ఉమ్మడి రాష్ట్రంలో విడుదల చేసిన జీవో కనుక, తీర్పు ప్రభావం ఇరు రాష్ట్రాలపై ఉంటుందని, ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా సమన్వయం చేసుకుంటూ ముందడుగు వేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. చదవండి: విదేశాల నుంచి వచ్చేవారి వివరాలు నమోదు 'ఆయనను ఇక గొలుసులతో కట్టేయాల్సిందే' -
‘అందుకే మద్యం షాపులు తగ్గింపు’
సాక్షి, విజయవాడ: దశల వారి మద్యపాన నిషేధాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి అన్నారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అందులో భాగంగానే మద్యం షాపులు తగ్గిస్తూ నేడు ఉత్తర్వులిచ్చారని పేర్కొన్నారు. ప్రజా సంకల్పయాత్రలో మహిళల కష్టాలు తీరుస్తానని మాట ఇచ్చారని.. ఆ మాట ప్రకారమే 33 శాతం మద్యం షాపులు ఏడాదిలోనే తొలగిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో 44వేల బెల్టు షాపులు, 40 శాతం బార్లు తొలగించామని చెప్పారు. కచ్చితంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలు చేసి చూపిస్తారని పేర్కొన్నారు. మహిళల సంక్షేమం కోసం సీఎం ఆలోచిస్తున్నారని పుష్పశ్రీవాణి పేర్కొన్నారు. (ఏపీలో మద్యం షాపులను తగ్గిస్తూ ఉత్తర్వులు) -
‘గిరిజనులకు అన్యాయం జరగనివ్వం’
సాక్షి, అమరావతి: గిరిజన ప్రాంతాలకు సంబంధించిన జీవో నంబర్ 3ను సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో గిరిజనులకు న్యాయం చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై ఏపీ ప్రభుత్వం న్యాయ నిపుణుల సలహాలను కోరిందని డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ తీర్పుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా వాకబు చేశారని పేర్కొన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో జరిగే ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో స్థానిక గిరిజనులకే అన్ని ఉద్యోగాలు వచ్చేలా 100 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కొనసాగుతున్న 2000 సంవత్సరంలో అప్పటి గవర్నర్ జీవో నెంబర్.3 ను జారీ చేశారన్నారు. (‘ఆయన చెప్పిందే నిజమైంది’) అయితే ఈ జీవో ఆధారంగా ఏజెన్సీ ఏరియాలోని టీచర్ల నియామకాల్లో గిరిజనులకు 100 శాతం రిజర్వేషన్లు ఇవ్వడాన్ని ఆక్షేపిస్తూ కొంత మంది సుప్రీం కోర్టును ఆశ్రయించగా, 100 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని వాఖ్యానిస్తూ సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం జీవో నెంబర్.3ను కొట్టి వేసిందని వివరించారు. ఈ తీర్పు నేపథ్యంలో గిరిజనులకు న్యాయం జరిగేలా ఏ చర్యలు తీసుకోవాలనే విషయంగా న్యాయ కోవిదులను సంప్రదిస్తున్నామని చెప్పారు. సుప్రీం తీర్పునకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉందని, ఆ వివరాలు వచ్చాక న్యాయ నిపుణులతో చర్చించి, వారు సూచించిన విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని వివరించారు. ప్రభుత్వం ఏజెన్సీ గిరిజనులకు న్యాయం జరిగేలా చూస్తుందని పుష్ప శ్రీవాణి హామీ ఇచ్చారు. (‘సున్నా వడ్డీ’తో మా కుటుంబాల్లో వెలుగు) -
వాలంటీర్ల వ్యవస్థ అధ్బుతంగా పనిచేస్తోంది
-
కరోనా నివారణకు ప్రజలంతా సహకరించాలి
-
వైరస్ వ్యాప్తి నివారణలో మన రాష్ట్రం ముందుంది
-
జగనన్న రాజ్యంలో మహిళా సారధులు
-
డిప్యూటీ సీఎంపై అసభ్యకర పోస్టు..వ్యక్తి అరెస్టు
సాక్షి, విజయనగరం: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణిపై అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. గత ఏడాది జూన్‌లో వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఫేస్బుక్లో అసభ్యకర పోస్టులు పెట్టాడు. దీనిపై గత అక్టోబర్‌లో ఎల్విన్‌మెంట్ పీఎస్‌లో మంత్రి ఫిర్యాదు చేశారు. పుష్ప శ్రీవాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బెంగుళూరులలో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు వెంకటేశ్వర్లు నెల్లూరు జిల్లా కావలికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. -
డిప్యూటీ సీఎంపై అభ్యంతరకర పోస్టులు వ్యక్తి అరెస్ట్
-
అమ్మఒడి ఓ చరిత్రాత్మక పథకం
సాక్షి, అమరావతి: జగనన్న అమ్మఒడి పథకం విద్యావ్యవస్థలో ఓ పెద్ద సంస్కరణగా పలువురు మంత్రులు, శాసనసభ్యులు అభివర్ణించారు. రాష్ట్రాన్ని అక్షర క్రమంలోనే కాకుండా అక్షరాస్యతలోనూ అగ్రస్థానంలో నిలిపేందుకు ఈ పథకం దోహదం చేస్తుందన్నారు. లక్షలాది మంది తల్లులు తమ పిల్లల భవిష్యత్‌ను తీర్చిదిద్దేందుకు ఉపయోగపడుతుందని వివరించారు. అమ్మఒడి పథకానికి రూపకల్పన చేసిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనీయుడని కొనియాడారు. అమ్మఒడి పథకం– లక్ష్యాలపై రాష్ట్ర మంత్రి కె.కన్నబాబు మంగళవారం అసెంబ్లీలో స్పల్పకాలిక చర్చను ప్రారంభించారు. అమ్మ ఒడితో సంక్రాంతి కంటే ముందుగానే పండుగ వచ్చిందని తల్లులు సంతోష పడ్డారన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం బోధన దేశంలో ఎక్కడా లేదని మంత్రి కన్నబాబు అన్నారు. మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందిస్తున్నామని, సీఎం స్వయంగా రూపొందించిన మధ్యాహ్న భోజన మెనూ ఈరోజు నుంచే అన్ని పాఠశాలల్లో అమలవుతోందని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ చెప్పిన దానికంటే ఎక్కువగా ఇస్తున్నారన్నారు. మధ్యాహ్న భోజన కార్మికుల నెలవారీ వేతనాన్ని రూ. వేయి నుంచి రూ.3 వేలకు పెంచిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌దే అని చెప్పారు. పాఠశాలలు నాడు–నేడు కార్యక్రమంతో వచ్చే మూడేళ్లలో ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మారనున్నాయని కన్నబాబు చెప్పారు. రాజకీయాలకు అతీతంగా సీఎంను అభినందించాలి జగనన్న అమ్మఒడి పథకం కేవలం సంక్షేమ పథకం కాదు.. ఓ సంస్కరణ పథకం అని గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కొనియాడారు. సమాజ దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమ్మఒడి పథకాన్ని రూపొందించారని చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు కేవలం ఎన్నికల ముందు ప్రజలను మభ్య పెట్టేందుకు పసుపు కుంకుమ, పండుగలకు పప్పు బెల్లాలు పంచారని, కానీ సీఎం వైఎస్ జగన్ పేదలు, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులను ఉన్నత స్థానాలను చేర్చేందుకు అమ్మఒడి పథకంతో చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. రాజకీయాలకు అతీతంగా అందరూ ముఖ్యమంత్రిని అభినందించాలని పేర్కొన్నారు. ఈ పథకంతో పేదల జీవితాల్లో విప్లవాత్మక మార్పు తీసుకువచ్చిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలుతున్నానని చెప్పారు. ఇటువంటి మంచి పథకంపై జరుగుతున్న చర్చలో టీడీపీ అధినేత చంద్రబాబు సభలో లేకపోవడం దురదృష్టకరం అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదవుకున్న వ్యక్తిగా తాను ‘అమ్మ ఒడి’ పథకానికి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. జగన్ అంటే ఒక బ్రాండ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంటే పేరు కాదని, అదో బ్రాండ్ అని, చెప్పాడంటే చేస్తాడంతే– అనేది ట్యాగ్‌లైన్ అని ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి అభివర్ణించారు. చిన్నప్పుడు ఏ ఫర్ యాపిల్ అని చెప్పేవారని, ఇప్పుడు ఏ ఫర్ అమ్మఒడి అని చెప్పే విధంగా ఈ పథకం ఉందన్నారు. అ అంటే అమ్మఒడి, ఆ అంటే ఆంధ్రప్రదేశ్ అని అక్షరాలు దిద్దేలా నిలిచిపోయే చారిత్రకమైన పథకం అని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి పేద బిడ్డకు సంక్రాంతి పండుగకు మేనమామ మాదిరిగా జగన్ అమ్మఒడి కానుకను తెచ్చారన్నారు. చరిత్రను తిరగరాసిన రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకువచ్చిన జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన పథకాలు బడుగు, బలహీన వర్గాల పాలిట పెద్ద వరమని ఎమ్మెల్యే సీహెచ్ అప్పలరాజు కొనియాడారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంటు పథకంతో ఒక అడుగు ముందుకు వేస్తే ఆయన కుమారుడు వైఎస్ జగన్ మరో రెండడుగులు ముందుకు వేసి విద్యను ఉద్యమ రూపంలో సంస్కరించేందుకు నడుంకట్టారన్నారు. అమ్మఒడి సంక్షేమ పథకం కాదని, అదో విప్లవాత్మక సంస్కరణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన స్వానుభవాలు, చంద్రబాబుపై సెటైర్లు సభికులను ఆకట్టుకున్నాయి. అమ్మఒడిని ప్రారంభించిన జనవరి 9 ఏపీ చరిత్ర తిరగరాసిన రోజు అన్నారు. మంచి చెప్పినా టీడీపీలో వినే పరిస్థితి లేదు మంచి చెప్పినా తెలుగుదేశం పార్టీలో వినే పరిస్థితి లేదని ఆ పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మద్దాళి గిరిధరరావు అన్నారు. అమ్మఒడి లాంటి అద్భుతమైన పథకంపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేతతో సహా ఆ పార్టీ సభ్యులు సభలో లేకపోవడం పేద పిల్లల చదువుపట్ల వారి నిర్లక్ష్యాన్ని తెలియజేస్తోందన్నారు. జగనన్న అమ్మఒడి, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం, నాడు–నేడు వంటి పథకాలతో ప్రభుత్వ విద్యా వ్యవస్థల్లో సీఎం వైఎస్ జగన్ సంస్కరణలు తీసుకొస్తున్నారని చెప్పారు. అమ్మఒడి పథకం పట్ల బడుగు, బలహీన వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయని చెప్పారు. కూల్చడానికి సినిమా సెట్టింగులు కాదు ఢిల్లీ వెళ్లి వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని కూల్చేస్తానని ఓ నాయకుడు ప్రగల్భాలు పలుకుతున్నాడంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. కూల్చేయడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏమీ సినిమా సెట్టింగులు కాదన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అంటే కొన్ని కోట్ల కుటుంబాల సమూహం అన్నారు. ముఖ్యమంత్రి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఆ సినీ హీరో పార్టీకి చెందిన ఎమ్మెల్యే ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు మద్దతు ఇస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. వైఎస్ జగన్‌ను జైల్లో నిర్బంధిస్తా అన్న కాంగ్రెస్, టీడీపీలు కాలగర్భంలో కలిసిపోయాయని చెప్పారు. 40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకుంటున్న మరో నాయకుడు మూడు రాజధానులను అడ్డుకునేందుకు రాజకీయ భిక్షగాడి పాత్ర పోషిస్తున్నారని ఆయన విమర్శించారు. మనసుతో చూసినప్పుడే ఇది సాధ్యం ప్రజల కష్టాలను మనసుతో చూడడం వల్లే అమ్మఒడి లాంటి అద్భుత పథకాలకు వైఎస్ జగన్ శ్రీకారం చుట్టగలిగారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వేణుగోపాల్ అన్నారు. జగన్ అంటే నిజం, నిజమంటే జగన్ అనేది రుజువైందని, తన కలను జగన్ సాకారం చేశారని చెప్పారు. పేదల గుండెల్లో జగన్‌కు గుడి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ యతిప్రాసలతో, కవితలతో చేసిన ప్రసంగం సభను ఆకట్టుకుంది. ’జనవరి నైన్త్– జనానికి స్ట్రెంగ్త్’ అన్నారు. ’పేదవాళ్లకు ఉండదు తడి (డబ్బు అనే అర్థంలో), వారి గుండెల్లో కట్టుకున్నారు జగనన్నకు గుడి.. అదే జగనన్న అమ్మఒడి, ఇదే చదువుల బడి’ అంటూ ఆయన ఆసు కవితను చదివినప్పుడు సభికుల నుంచి అభినందనలు వచ్చాయి. -
‘కొట్టేసిన భూముల కోసమే ఆయన ఆరాటం’
సాక్షి, అమరావతి: ఉత్తరాంధ్ర ప్రజలంతా అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణను స్వాగతిస్తున్నారని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి అన్నారు. సోమవారం ఉదయం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు ఈ రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ప్రాంతాలని.. తరతరాలుగా ఉత్తరాంధ్ర ప్రజలు ఉపాధి కోసం వలసలు వెళ్లే పరిస్థితి ఉందన్నారు. విశాఖకు పరిపాలన రాజధానిగా అన్ని అర్హతలు, సౌకర్యాలున్నాయని పేర్కొన్నారు. వలసల ఉత్తరాంధ్ర.. ఇప్పుడు అభివృద్ధి ఉత్తరాంధ్ర గా మారుతుందన్నారు. శివరామకృష్ణన్ కమిటీ, జిఎన్ రావు కమిటీ, బీసీజీ నివేదికలు అన్ని ఇదే విషయం చెప్పాయన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణను ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యతిరేకించడం దారుణమన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలంతా చంద్రబాబు తీరును తీవ్రంగా ఖండిస్తున్నారని తెలిపారు. చంద్రబాబు సామాజికవర్గం కోసమే అభివృద్ధి వికేంద్రీకరణ ను వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. ఇన్సైడర్ ట్రేడింగ్ లో కొట్టేసిన భూముల కోసమే ఆయన ఆరాటం అని మండిపడ్డారు. రాజధానిని తరలించడం లేదు..పెంచుతున్నాం.. రాజధానిని తరలించడం లేదని.. పెంచుతున్నామని పుష్ప శ్రీవాణి తెలిపారు. చంద్రబాబు తమ భూముల కోసమే రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖలో ఎగ్జిక్యూటీవ్ క్యాపిటల్ రావడం వల్ల వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ వల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుందని పేర్కొన్నారు. -
ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణితో స్ట్రెయిట్ టాక్
-
ఉత్తరాంధ్ర దశ మారబోతుంది: పుష్ప శ్రీవాణి
సాక్షి, అమరావతి : విశాఖలో పరిపాలన రాజధానితో ఉత్తరాంధ్ర దశ మారబోతుందని డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి తెలిపారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శాశ్వత పరిష్కారం చూపించారని అన్నారు. సచివాలయంలో గురువారం మంత్రి మాట్లాడుతూ.. అభివృద్ధి వికేంద్రీకరణను అన్ని ప్రాంతాల ప్రజలు స్వాగతిస్తున్నారని, చంద్రబాబు వైఖరి ఉత్తరాంధ్రకు తీరని ద్రోహం చేసేలా ఉందని విమర్శించారు. విశాఖ నుంచి పరిపాలన చేస్తే ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులు వస్తాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో భవిష్యత్తులో వేర్పాటు ఉద్యమాలు రాకుండా సీఎం జగన్ విజన్‌తో ఆలోచించారని, జీఎన్ రావు కమిటీ నివేదికను అందరూ ఆహ్వనించాలని సూచించారు. -
గిరిజన అభివృద్ధికి రూ.60.76 కోట్లు
సాక్షి, అమరావతి: శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఐటిడిఏ పరిధిలో కొత్తూరులో గిరిజన యువతకు ఉపాధి కల్పన కోసం ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి తెలిపారు. మంగళవారం శాసన సభలో గిరిజన ఉత్పత్తులు, గిరిజన సమస్యలు, జీసీసీలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చారు. అటవీశాఖ అధికారులతో ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు అటవీ అధికారులకు, గిరిజనులకు మధ్య త్వరలో సమన్వయ సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. 2019-20 సంవత్సరానికి సబ్‌ప్లాన్ కింద రూ.60.76 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని పేర్కొన్నారు. సీతంపేటలో ఆంధ్రా బ్యాంకు, స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా భవనాలు జీసీసీకు సంబంధించిన పార్కు స్ధలంలో ఉన్నాయా అని సభ్యుల అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆ భూమి జీసీసీకి సంబంధించినది కాదని మంత్రి పుష్ప శ్రీవాణి స్పష్టం చేశారు. ఆక్రమణలకు గురి కాలేదు.. సీతంపేట ఐటిడిఏ పరిధిలో కొత్తూరు గ్రామ పరిధిలో 1210 చదరపు గజాలు ఖాళీ స్థలం ఒకటి మాత్రమే ఉందని, దానిలో స్ధానిక గిరిజన యువతకు ఉపాధి కల్పన కోసం కావాల్సిన శిక్షణా తరగతులకు సంబంధించి ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదించామన్నారు. జీసీసీకు సంబంధించిన శాశ్వత స్ధలాలు ఎక్కడా ఆక్రమణకు గురికాలేదని స్పష్టం చేశారు. కొన్ని చోట్ల రోడ్డు పక్కన చిన్న, చిన్న స్ధలాల్లో షాపులు పెట్టుకున్నారన్నారు. 5 అటవీ ఫల ఉత్పత్తులకు కేంద్ర ప్రభుత్వం మద్ధతు ధర ప్రకటించిందన్నారు. ఇంకా కొన్ని అటవీ ఉత్పత్తులకు మద్ధతు ధర కోసం రాష్ట్ర ప్రభుత్వం తరపున మరికొన్ని ప్రతిపాదనలు కూడా పంపించామని పేర్కొన్నారు. యానాదుల సమస్యల పరిష్కారానికి చర్యలు.. గిరిజన ప్రాంతాల్లో శాశ్వత నిర్మాణాల కోసం 2019-20 ట్రైబల్ సబ్ ప్లాన్ కింద కొన్ని నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపించామన్నారు. దీనికి సంబంధించి నిధుల కేటాయింపు మంజూరు కావాల్సి ఉందని సభకు తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో శిథిలావస్థలో ఉన్న భవనాలు మరమ్మత్తులు కోసం ప్రతిపాదనలు చేస్తామన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో సమస్యల పరిష్కరించడంతో పాటు, యానాదుల సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
‘వారికి అటవీ హక్కులు కల్పించాలి’
సాక్షి, అమరావతి: చెంచు జాతిని కాపాడాలని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి కోరారు. మంగళవారం శాసన సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన చెంచుల స్థితిగతులపై పలు ప్రశ్నలు లేవనెత్తారు. శ్రీశైలం అడవుల్లో చెంచులు ఎక్కువగా నివసిస్తున్నారని తెలిపారు. వారికి అటవీ హక్కులు కల్పించి జీవనోపాధిని పెంచాలని కోరారు. జనాభా ప్రతిపాదికన చూస్తే.. చెంచు జాతి రోజు రోజుకు అంతరించిపోతోందన్నారు. వారి జీవన స్థితిగతులు మారాలంటే విద్య ఎంతో అవసరమన్నారు. అటవీప్రాంతంలో రోడ్లు, బోరు వేయాలన్నా అనుమతులు అవసరమవుతున్నాయన్నారు. ఏ పని చేయాలన్నా అటవీ అధికారులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. చెంచుల సమస్యలు పరిష్కరిస్తాం.. చెంచుల సమస్యలను పరిష్కరిస్తామని డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పుష్ప శ్రీవాణి తెలిపారు. శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చారు. అటవీ అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఐదు అటవీ ఫలాలకు కేంద్రం మద్దతు ధర ప్రకటించిందని, మరిన్ని అటవీ ఫలాలకు మద్దతు ధర కల్పించాలని కోరామన్నారు. గిరిజనాభివృద్ధికి చెందిన భూములు ఆక్రమణకు గురికాలేదని పేర్కొన్నారు. గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ ఆస్తుల వివరాలను పుష్పశ్రీవాణి వెల్లడించారు. -
మరో అల్లూరి.. సీఎం జగన్
సాక్షి, అమరావతి: చరిత్రలో గిరిజనుల హక్కుల కోసం పోరాడింది మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజైతే.. ప్రస్తుతం గిరిజనుల హక్కుల కోసం ఎస్టీ కమిషన్ తీసుకొచ్చి ఆదివాసీల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మరో అల్లూరి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి అభివర్ణించారు. దీపం లేని గిరిజన గుడిసెలు ఉంటాయేమో కానీ జగన్ లేని గిరిజన గుండె ఉండదన్నారు. ఏపీ రాష్ట్ర షెడ్యూల్ ట్రైబ్స్ కమిషన్ బిల్లును ఆమె సోమవారం శాసనసభలో చర్చకు ప్రతిపాదించారు. ఈ సందర్భంగా పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ గిరిజనుల హక్కులకు భంగం కలిగినా, సామాజిక వివక్ష చూపినా, గిరిజన మహిళలపై అత్యాచారాలకు పాల్పడినా, గిరిజన ప్రాంతాల అభివృద్ధిని నిర్లక్ష్యం చేసినా ఈ కమిషన్ ప్రశ్నిస్తుందన్నారు. గిరిజన సబ్ ప్లాన్ నిధుల వినియోగాన్ని పరిశీలించడంతోపాటు గిరిజనుల సామాజిక, ఆర్థిక, రాజకీయ అభ్యున్నతికి అవసరమైన సలహాలను ప్రభుత్వానికి ఇచ్చేందుకు ఈ కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అనంతరం జరిగిన చర్చలో పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడారు. దళితులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి: నారాయణ స్వామి బిల్లు సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యల్ని ఖండిస్తూ పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రసంగించారు. ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, ఎమ్మెల్యే సుధాకర్ బాబులు చంద్రబాబుకు పలు ప్రశ్నలు సంధించారు. ’నారావారిపల్లెలోని గుడిలోకి ఇప్పటికీ మాల, మాదిగల్ని రానివ్వనిమాట నిజం కాదా? గతంలో మీకు వ్యతిరేకంగా ఓటేసిన 300 మంది దళితుల ఇళ్లను తగులబెట్టిన మాట నిజంకాదా? కారంచేడు మాదిగ పల్లె దుస్థితికి మీరు కారణం కాదా? అని మంత్రి నారాయణ స్వామి ప్రశ్నించారు. దళితులు శుభ్రంగా ఉండరని ఆదినారాయణరెడ్డి హేళన చేసినా.. మంత్రివర్గం నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదని, మాదిగలు, మాలల మధ్య చిచ్చుపెట్టింది మీరు కాదా? అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు నిలదీశారు. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని సీఆర్డీఏ పరిధిలోని ఓ గ్రామంలో గణేష్ ఉత్సవాల సందర్భంగా అవమానించినప్పుడు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, బాలరాజు, జోగి రమేష్ తదితరులు ప్రసంగించారు. గిరిజనులంతా వైఎస్ జగన్ వెంటే: రాజన్నదొర గిరిజనులంతా వైఎస్ జగన్ వెంటే ఉన్నారని, ఏడు ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులను మంచి మెజార్టీతో గెలిపించడమే దీనికి నిదర్శనమని ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర అన్నారు. కొత్త చరిత్రకు శ్రీకారం: కళావతి ఎస్టీలకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటుతో సీఎం వైఎస్ జగన్ గిరిజనుల జీవితాల్లో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి పేర్కొన్నారు. తద్వారా గిరిజనులకు రక్షణ కల్పించారన్నారు. గిరిజన చట్టాలను ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు బాక్సైట్ దాహానికి గిరిజన ఎమ్మెల్యే బలయ్యారు: టి.బాలరాజు బాక్సైట్ తవ్వకాలతో చంద్రబాబు గిరిజనుల బతుకులను ఛిద్రం చేయాలని చూశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే టి.బాలరాజు విమర్శించారు. చంద్రబాబు బాక్సైట్æ దాçహానికి ఓ గిరిజన ఎమ్మెల్యే మావోయిస్టుల చేతిలో ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గిరిజన గూడేల్లో పర్యటించి.. అక్కడే నిద్రించి.. వారి కష్టాలను కళ్లారా చూశారని చెప్పారు. అందుకే బాక్సైట్ తవ్వకాల జీవోను రద్దు చేసి గిరిజనుల జీవితాలకు భరోసా ఇచ్చారన్నారు. దళితులు, గిరిజనుల జీవితాల్లో వెలుగులు: గొల్ల బాబూరావు ఎస్సీ, ఎస్టీ కమిషన్ విభజన బిల్లు సాహసోపేతమైందని పలువురు కొనియాడారు. వైఎస్సార్సీపీ సభ్యుడు గొల్లబాబూరావు మాట్లాడుతూ.. అణగారిన వర్గాల కోసం తీసుకున్న ఈ నిర్ణయం వారి జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు. దళితులు, గిరిజనులకు ఉపయోగపడే మంచి బిల్లులని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సమర్ధించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే నేతగా జగన్ ప్రజల్లో గుర్తుండిపోతారని కీర్తించారు. టీడీపీ ఎమ్మెల్యే వీరాంజనేయులు బిల్లును సమర్ధించారు. ఎమ్మెల్యే తిప్పేస్వామి మాట్లాడుతూ దళితులు, గిరిజనుల ప్రయోజనాన్ని ఆకాంక్షించే ఈ బిల్లుతో వారు జగన్ వైపే శాశ్వతంగా ఉంటారని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు గిరిజనులను దగా చేశారు: భాగ్యలక్ష్మి చంద్రబాబు గిరిజనుల హక్కులను భక్షిస్తే.. సీఎం వైఎస్ జగన్ గిరిజనుల హక్కులకు రక్షణగా నిలిచారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి పేర్కొన్నారు. బాక్సైట్ తవ్వకాలకు అనుకూలంగా జీవో జారీ చేసి చంద్రబాబు గిరిజనులను దగా చేశారని దుయ్యబట్టారు. 1/70 చట్టాన్ని యథేచ్ఛగా ఉల్లంఘించి టీడీపీ పెద్దలు అడవులను దోచుకున్నారని ధ్వజమెత్తారు. జగన్ వెంటే దళిత, గిరిజనం: మేరుగ దళితులు, గిరిజనుల కోసం పాటుపడిన ఘనత వైఎస్ కుటుంబానికే దక్కుతుందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున చెప్పారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయడంతో దళితులు ధైర్యంగా ఉన్నారన్నారు. ఆయన తర్వాత అణగారిన, బహుజనుల హక్కుల కోసం ప్రత్యేక చట్టాలు తెస్తున్న ఔదార్యం సీఎం వైఎస్ జగన్‌దని చెప్పారు. దళితులు, గిరిజనులు ఎప్పటికీ జగన్ వెంటే ఉంటారన్నారు. -
మహిళా లోకానికి సీఎం వైఎస్ జగన్ అన్నలా అండగా నిలిచారు
-
ఏపీ సువర్ణాధ్యాయం సృష్టించబోతుంది..
సాక్షి, అమరావతి: చదువుకు పేదరికం అడ్డుకాకూడదన్నది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్దేశమని మంత్రి పుష్పశ్రీవాణి తెలిపారు. దీనికోసమే సీఎం జగన్ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేశారు. గురువారం పుష్పశ్రీవాణి శాసనసభలో మాట్లాడుతూ.. నూటికి నూరు శాతం ఇంగ్లిష్ విద్య అందించే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ సువర్ణాధ్యాయం సృష్టించబోతుందన్నారు. పిల్లల బంగారు భవిష్యత్ కోసమే ప్రభుత్వం ఇంగ్లిష్ విద్యను తీసుకొచ్చిందని వివరించారు. సీఎం జగన్ ప్రైవేటు స్కూళ్లలో తెలుగు సబ్జెక్ట్‌ను తప్పనిసరి చేశారని గుర్తు చేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఏనాడైనా తెలుగు సబ్జెక్ట్‌ను తప్పనిసరి చేయాలనే ఆలోచన వచ్చిందా అని పుష్పశ్రీవాణి సూటిగా ప్రశ్నించారు. దళితులను అవమానించారు.. ఎస్సార్సీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు సభలో మాట్లాడుతూ సీఎం జగన్ సిద్ధాంతాలపై నిలబడి పాలన చేస్తున్నారన్నారు. పిల్లలకు ప్రాథమిక దశ నుంచే ఇంగ్లిష్ విద్య అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షం ఇంగ్లిష్ విద్య వద్దని గగ్గోలు పెట్టి ఇప్పుడు యూటర్న్ తీసుకుందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ఇంకా వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు, టీడీపీ నేతలు దళితులను ఎన్నో రకాలుగా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితుడిగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అని హేళన చేశారని ఆయన మండిపడ్డారు. -
చదువుకు పేదరికం అడ్డుకాకూడదని సీఎం వైఎస్ జగన్ ఉద్దేశం
-
టీడీపీకి మహిళా సభ్యులన్న గౌరవం కూడా లేదు
-
‘పథకం ప్రకారమే టీడీపీ సభ్యుల ఆందోళన’
సాక్షి, అమరావతి: అసెంబ్లీ మార్షల్స్ తమ పట్ల దురుసుగా ప్రవర్తిచారని శాసనసభలో టీడీపీ నేతలు రాద్ధాంతం చేశారు. దీనిపై అధికార వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కౌంటర్ ఇచ్చారు. నిన్నటి నుంచి సభలో టీడీపీ సభ్యులు సభా నియామాలకు విరుద్దంగా ప్రవరిస్తున్నారని ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. సభలో టీడీపీ సభ్యుల ధోరణి భిన్నంగా ఉందని.. ఇది సరైన విధానం కాదన్నారు. సభలో టీడీపీ సభ్యులు కేవలం ఆందోళన చేయడానికే వస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. సభా సజావుగా జరుగుతుంటే టీడీపీ ఓర్చుకోలేకపోతోందని ఆయన మండిపడ్డారు. పథకం ప్రకారమే టీడీపీ సభ్యులు ఆందోళన చేస్తున్నారని బుగ్గన విమర్శించారు. ముఖ్యమైన బిల్లులు సభలో ఈ రోజు ఆమోదం పొందుతాయని.. టీడీపీ సభ్యులు కావాలని గందరగోళం సృష్టిస్తున్నారని బుగ్గన మండిపడ్డారు. అసెంబ్లీ ఆవరణలో పబ్లిక్ మీటింగ్‌లపై నిషేధం ఉందని ఆయన గుర్తు చేశారు. అసెంబ్లీ మార్షల్స్ తమ పరిధిలో ఉన్న నియమాల ప్రకారమే వ్యవహరిస్తున్నారని బుగ్గన స్పష్టం చేశారు. అచ్చెన్నాయుడు సభా సాంప్రదాయ గురించి చెప్పటం దెయ్యాలు వేదాలు వల్లించటంగా ఉందని మంత్రి పుష్పశ్రీవాణి సూటిగా విమర్శించారు. గత శాసనసభలో టీడీపీ దారుణంగా ప్రవర్తించిదని ఆమె మండిపడ్డారు. మీడియాను కూడా అసెంబ్లీలోకి అనుమతించకుండా దౌర్జన్యం చేసిన చరిత్ర టీడీపీదని మంత్రి దుయ్యబట్టారు. నేడు సభా సాంప్రదాయల గురించి చెప్పడం విడ్డురమని పుష్పశ్రీవాణి ఎద్దేవా చేశారు. -
దేశంలోనే ఓ గొప్ప ముఖ్యమంత్రి వైఎస్సార్: సుమన్
సాక్షి, విజయవాడ: ఆయుధాన్ని నమ్ముకోవడం కంటే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం ద్వారా శరీరాన్నే ఆయుధంగా మలుచుకోవాలని మార్షల్ ఆర్ట్స్‌కు స్ఫూర్తి, ప్రముఖ సినీనటుడు సుమన్ అన్నారు. ఒక్కోసారి ఆయుధం మొరాయిస్తుందని, అదే ఆయుధం ప్రత్యర్థి చేతికి చిక్కే సమస్య ఉంటుందన్నారు. ఇందుకే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం ద్వారా స్వీయరక్షణకు ఎటువంటి ఢోకా ఉండదన్నారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగవచ్చన్నారు. స్థానిక దండమూడి రాజగోపాలరావు ఇండోర్ స్టేడియంలో సుమన్ షోటోకాన్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన డాక్టర్ వైఎస్సార్ స్మారక 10 జాతీయ స్థాయి ఓపెన్ కరాటే పోటీల్లో ప్రారంభోత్సవంలో సుమన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి స్మారక కరాటే పోటీల్లో పాల్గొన డం సంతోషంగా ఉందన్నారు. భారతదేశంలోనే ఓ గొప్ప ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఉచిత విద్యుత్, డ్వాక్రా అక్కా చెల్లిమ్మలకు రుణాలు ఇలా ఎన్నో ఎవరూ ఊహించని సంక్షేమ కార్యక్రమాలు చేసిన గొప్ప మహానేత తనకు చాలా ఇష్టమన్నారు. ఆ మహానేత బాటలో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ముందుకు సాగుతున్నారన్నారు. దిశలాంటి సంఘటనలను ఎదుర్కొవడానికి మార్షల్ ఆర్ట్స్ చాలా అవసరమని, ఇందుకు ప్రతి పాఠశాలలో కరాటే విద్యను నేర్పించాలని తాను సీఎం జగన్‌ను కోరతానని అన్నారు. తొలుత ఈ పోటీలను రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో ఆయా రాష్ట్రాల నుంచి వచ్చిన చిన్నారులు చేసిన మార్చ్ఫాస్ట్ వందన స్వీకారాన్ని ఉప ముఖ్యమంత్రి అందుకున్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు, ఏపీ కరాటే అసోసియేషన్ అధ్యక్షుడు ప్రతాప్, అకాడమీ వ్యవస్థాపకుడు సైదులు, పోటీల నిర్వాహకులు చిన్నపురెడ్డి, కాత్యాయని, సత్యలక్ష్మి, వైఎస్సార్సీపీ నేతలు వేమారెడ్డి, అవుతు శ్రీనివాసరెడ్డి, జార్జి వివిధ రాష్ట్రాలకు చెందిన కరాటే కోచ్‌లు, క్రీడాకారులు పాల్గొన్నారు. కలర్ బెల్ట్ కేటగిరీలో ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను తెలంగాణ కైవసం చేసుకుంది. బ్లూబెల్ట్ కేటగిరీలో తమిళనాడు, గ్రీన్ బెల్ట్ కేటగిరీలో కర్ణాటక, పర్పుల్ బెల్ట్ కేటగిరీలో ఏపీ క్రీడాకారులు తమ సత్తాను చాటారు. దాదాపు 800 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. చిన్నారులు కరాటే విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. -
గిరిజన ఆవాసాలన్నింటికీ రహదారులు
సాక్షి, అమరావతి/విజయవాడ స్పోర్ట్స్: గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని, గిరిజన ఆవాసాలన్నింటికీ రహదారి సౌకర్యాలను కల్పించడానికి చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి గిరిజన శాఖ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గిరిజన రోగులను డోలీలలో తీసుకెళ్లాల్సి వస్తున్న పరిస్థితిని మార్చాలన్నారు. అన్ని గిరిజన ప్రాంతాల్లో నియోజకవర్గానికి 100 పడకలతో గర్భిణులకు హాస్టళ్లను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కోరారు. సచివాలయంలో గిరిజన సంక్షేమశాఖ ఇంజనీరింగ్ అధికారులతో శనివారం ఆమె సమీక్ష నిర్వహించారు. గిరిజన శాఖలో మంజూరు చేసిన పనులను కాంట్రాక్టర్లు సకాలంలో పూర్తి చేయనపుడు వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆడపిల్లలు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి మహిళల రక్షణకు అవసరమైన చర్యలను సీఎం వైఎస్ జగన్ చేపట్టారని, ప్రతీ గ్రామంలో ఒక మహిళా పోలీసును నియమించడం, మద్యాన్ని పూర్తిగా నిషేధించే దిశగా అడుగులు వేయడం వీటిలో భాగమేనని పుష్ప శ్రీవాణి చెప్పారు. సుమన్ షోటోకాన్ కరాటే అకాడమీ ఆఫ్ ఇండియా, ఏపీ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం విజయవాడలో డాక్టర్ వైఎస్సార్ స్మారక 10వ జాతీయ కరాటే చాంపియన్‌షిప్ పోటీలను ఆమె ప్రారంభించారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. 6వ తరగతి నుంచి బాలికలకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించడానికి ప్రయత్నిస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ప్రముఖ సినీ నటుడు సుమన్, క్రీడాకారులు పాల్గొన్నారు. -
‘వారికి దేవుడే శిక్ష విధించాడు’
సాక్షి, విజయవాడ: ‘దిశ’ కేసు నిందితులను ఎన్కౌంటర్ చేయడం పట్ల డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి హర్షం వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ..మహిళలపై దారుణాలకు పాల్పడే వారికి దేవుడే శిక్ష విధిస్తాడని..ఈ ఎన్కౌంటర్ ద్వారా న్యాయం జరిగిందన్నారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల నియంత్రణకు ప్రత్యేక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళల రక్షణకు చర్యలు చేపట్టారని వెల్లడించారు. గత అసెంబ్లీ సమావేశాల సమయంలోనే ‘ఉమెన్ సేఫ్టీ ఇన్ సైబర్ క్రైమ్’ అనే కార్యక్రమం చేపట్టామని, దేశంలో ఎక్కడా లేని ప్రయోగం ఏపీలోనే జరిగిందన్నారు. ప్రతి గ్రామంలో ఒక మహిళా కానిస్టేబుల్‌ను ఏర్పాటు చేశారని చెప్పారు. మద్యానికి బానిసై కర్కశంగా నలుగురు నిందితులు.. ‘దిశ’పై ఘాతుకానికి పాల్పడ్డారన్నారు. ఇలాంటి దారుణాలను నియంత్రించడానికి విడతల వారీగా మద్యపాన నిషేధానికి వైఎస్ జగన్ కృషి చేస్తున్నారని తెలిపారు. పాఠశాలల్లో విద్యార్థినిలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేవిధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. ఆడపిల్లలకు సెల్ఫ్ డిఫెన్స్ చాలా అవసరమని పుష్ఫ శ్రీవాణి సూచించారు. చట్టాలను కఠినతరం చేయాలి.. మహిళల రక్షణకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. మహిళల రక్షణ, భద్రతకు నూతన చట్టం తెచ్చేలా సీఎం జగన్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. చట్టాలను కఠినతరం చేయాలని కోరారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే కొత్త చట్టం తీసుకువచ్చే విధంగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. (చదవండి: మహిళలపై దాడులు.. కేంద్రం కీలక ఆదేశాలు) -
పవన్ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: పుష్ప శ్రీవాణి
సాక్షి, అమరావతి : రేపిస్టుల విషయమై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి డిమాండ్ చేశారు. షాద్‌నగర్ ఘటన కేసులో నిందితులను బహిరంగంగా ఉరి తీయాలంటూ జనం చేస్తున్న డిమాండ్ సరికాదని, రేపిస్టులను బెత్తంతో రెండు దెబ్బలు చెమ్డాలు ఊడేలా కొడితే సరిపోతుందంటూ పవన్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం సచివాలయంలో పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ.. మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా పవన్ వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని, మహిళలకు ఆయన బహిరంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దిశ కేసులో నిందితులను కఠినంగా శిక్షించకుండా కేవలం బెత్తంలో రెండు దెబ్బలు కొడితే సరిపోతుందనడం దారుణమన్నారు. ఆడపిల్లల మాన, ప్రాణలంటే నీకు అంత చులకనా అంటూ పవన్‌పై ధ్వజమెత్తారు. పవన్ కల్యాణ్ మాటలు మహిళల మనోభావాలను దెబ్బతీశాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు చేసే వారిని కఠినంగా శిక్షించేందుకు కొత్త చట్టాన్ని తీసుకువస్తామని తెలిపారు. -
‘చిన్నారులపై నేరాలు తగ్గించేదుకు ప్రత్యేక చర్యలు’
సాక్షి, అమరావతి : చిన్నారులపై లైంగిక నేరాలను తగ్గించేందుకు ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి తెలిపారు. బుధవారం సచివాలయంలో చిన్నారులపై లైంగిక దాడుల నివారణపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎంతో పాటు హోం మంత్రి మేకతోటి సుచరిత, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సుచరిత మాట్లాడుతూ.. అభం శుభం తెలియని చిన్నారులపై లైంగిక హింస జరగడం దారుణమన్నారు. చట్టాలను వేగంగా అమలు చేసి నిందితులకు శిక్ష పడేలా చేయాల్సిన అవసరం ఉందన్నారు. కఠినమైన చర్యలు తీసుకుంటేనే ఇలాంటి ఘటనలను నియంత్రించగలమని, ఇందుకోసం అన్ని శాఖలు, స్వచ్చంద సంస్థలు కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు. మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. చిన్న పిల్లలు, యువతులపైనే లైంగిక దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమన్నారు. ఇలాంటి దాడులకు పాల్పడేవారి ఆలోచన విధానంలో మార్పు తీసుకురావడానికి.. కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. చిన్నారులపై నేరాలను తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని అన్నారు. లైంగిక నేరాల నియంత్రణకు చట్టాలను పటిష్టంగా అమలు చేస్తునే.. మరో వైపు ఇలాంటి ఘటనలపై యువతి, యువకులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. -
‘ప్రత్యేక కమిటీ వేసి విచారణ చేపడతాం’
సాక్షి, పశ్చిమ గోదావరి: స్వాత్రంత్యం వచ్చి 70ఏళ్లు దాటినా నేటికీ గిరిజన ప్రాంతాలు అభివృద్ది చెందలేదని ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి పేర్కొన్నారు. జిల్లాలోని కేఆర్‌పురంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో జరిగిన అవకతవకలపై ప్రత్యేక కమిటీ వేసి విచారణ చేస్తామని అమె తెలిపారు. గత ప్రభుత్వం కంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ట్రైబల్ సబ్‌ప్లాన్‌కు రూ. 811 కోట్లు నిధులను అదనంగా కేటాయించారని మంత్రి వెల్లడించారు. అయితే గత టీడీపీ ప్రభుత్వంలో గిరిజన ప్రాంతాల అభివృద్ది జరగలేదని పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గిరిజన యూనివర్శిటీ, ఇంజనీరింగ్ కళాశాల, మెడికల్ కాలేజీలను గిరిజన ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. అలాగే 7 గిరిజన నియోజకవర్గాల పరిధిలో 7 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారని, వచ్చిన 3 నెలలకే ట్రైబల్ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసిన ఏకైక ప్రభుత్వం వైఎస్సార్ సీపీది అని హర్షం వ్యక్తం చేశారు. అలాగే వచ్చే ఏడాది ఫిబ్రవరి కల్లా ఆర్వైఎఫ్ పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపడతామని మంత్రి వెల్లడించారు. -
షెడ్యూల్డ్ ఏరియాలుగా గిరిజన పునరావాస గ్రామాలు
సాక్షి, అమరావతి: పునరావాసం కింద గిరిజనులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించినప్పుడు ఆ ప్రాంతాన్ని షెడ్యూల్డ్ ఏరియాగా ప్రభుత్వం ప్రకటించాలని గిరిజన సలహా మండలి సమావేశం తీర్మానించింది. కొన్ని ప్రాజెక్టుల కారణంగా గిరిజనులను తరలించి పునరావాసం ఏర్పాటు చేసినప్పుడు గిరిజన హక్కులు కోల్పోతున్నారని సలహా మండలి అభిప్రాయ పడింది. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి అధ్యక్షతన మంగళవారం గిరిజన సలహా మండలి సమావేశం జరిగింది. సమావేశంలో సభ్యులైన గిరిజన ఎమ్మెల్యేలు విశ్వసరాయి కళావతి, పీడిక రాజన్నదొర, బాలరాజు, చెట్టి ఫల్గుణ, భాగ్యలక్ష్మి, కె ధనలక్ష్మి, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్పి సిసోడియా, డైరెక్టర్ పి రంజిత్‌బాషా, అడిషనల్ డైరెక్టర్ రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. సమావేశం ఆమోదించిన తీర్మానాలను అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి పుష్పశ్రీవాణి వివరించారు. - గిరిజనుల కోసం ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసేందుకు తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపుతాం. - రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల్లో ప్రస్తుతం నాన్ షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్న 554 గిరిజన గ్రామాలను షెడ్యూల్డ్ ఏరియాలో కల´బాలి. - ఆర్వోఎఫ్ఆర్ పథకం కింద వచ్చే ఫిబ్రవరిలో గిరిజనులకు పట్టాలు ఇవ్వాలి. ప్రభుత్వం పేదలకు ఉగాది నాటికి పట్టాలు ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో అంతకు ముందుగానే గిరిజనులకు ఇవ్వాలని నిర్ణయం. - బాక్సైట్ తవ్వకాల జీవో రద్దు చేసినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు. అలాగే సాలూరులో వైఎస్సార్ గిరిజన యూనివర్సిటీ, పాడేరులో మెడికల్ కాలేజీ, కురుపాంలో ఇంజనీరింగ్ కాలేజీ, ఏడు గిరిజన ప్రాంతాల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు గిరిజనులు అడగకుండానే ఇచ్చిన సీఎంకు ధన్యవాదాలు. -
గిరిజన ప్రాంతాల్లో యూనివర్సిటీలు ఏర్పాటు
-
అడవి బిడ్డలతో హరిచందన్
గవర్నర్ రాకతో మన్యం మురిసింది. గిరిజనం సంతసించింది. అడవిబిడ్డల కోసం ప్రత్యేకంగా వచ్చిన అతిథిని చూసి ఉప్పొంగిపోయింది. తమ సమస్యల గురించి ఆరా తీసినపుడు... బాగోగుల గురించి ప్రస్తావించినపుడు... తాము పండించిన పంటలను చూసి ప్రశంసించినపుడు... తమకు అందుతున్న సౌకర్యాల గురించి ప్రశ్నించినపుడు తమపై వారెంత బాధ్యతగా ఉన్నారో స్పష్టమైంది. సుమారు నాలుగైదు గంటలపాటు తమతో గడిపిన ఆ అతిథిని గర్వంగా సాగనంపింది. సాక్షిప్రతినిధి, విజయనగరం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్ జిల్లా పర్యటన విజయవంతమైంది. గిరిజనులకు అందుతున్న ప్రభుత్వ పథకాల గురించి, వారి జీవన విధానం గురించి తెలుసుకునేందుకు గవర్నర్ తన పర్యటనలో ప్రాధాన్యమిచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాల అమలు తీరుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. మరింత మెరుగ్గా సౌకర్యాలు అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తన పర్యటనలో గర్భిణులు, రైతులు, విద్యార్థులతో మాట్లాడగా అందరూ గిరిజనులు కావడం పర్యటన ప్రాధాన్యత తెలియజేసింది. ఈ సందర్భంగా హరిత విజయనగరం సంకల్పంలో గవర్నర్ సైతం పాలుపంచుకున్నారు. మొక్కలు నాటి తన పర్యటనకు మొదలుపెట్టారు. అందరూ విరివిగా నాటాలని పిలుపునిచ్చారు. గిరిజన బాలికలతో సహపంక్తి భోజనం చేసి పర్యటన ముగించారు. నాలుగు గంటలు బిజీబిజీగా... రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరి చందన్ ఒక్కరోజు పర్యటనలో భాగంగా గురువారం సాలూరు డీగ్రీ కాలేజీ మైదానానికి ఉదయం 11.32 నిమిషాలకు హెలికాఫ్టర్‌లో చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో సాలూరు పట్టణంలో ఉన్న గుమడాం వద్ద గల యూత్ ట్రైనింగ్ సెంటర్‌కు చేరుకుని మొక్కలు నాటారు. అనంతరం గవర్నర్‌కు గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఆర్.పి.సిసోడియా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పార్వతీపురం ఐటీడీఏ ఏర్పాటు గురించి వివరించారు. జిల్లా కలెక్టర్ ఎం.హరిజవహర్‌లాల్ గవర్నర్‌కు జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి, జిల్లాలో అమలు చేస్తున్న కంటివెలుగు, రైతుభరోసా, వాహనమిత్ర, తదితర పథకాలు గురించి సమగ్రంగా వివరించారు. అమ్మవలస సభకు హాజరైన గిరిజనులు గర్భిణుల ఆరోగ్యంపై ఆరా... వైటీసీలోని గిరిశిఖర గ్రామాల గర్భిణుల వసతి గృహాన్ని గవర్నర్ సందర్శించారు. అక్కడ ఆశ్రయం పొందుతున్న గర్భిణులతో మాట్లాడుతూ యోగ క్షేమాలు తెలుసుకున్నారు. ఆరోగ్యం ఎలావుంది? మీరు ఏ గ్రామం నుంచి వచ్చారు? మీ ఊరు నుంచి ఎలా వచ్చారు? మీ గ్రామానికి రోడ్డు, బస్సు సౌకర్యం ఉన్నాయా? వసతిగృహంలో ఎటువంటి వైద్య సేవలు ఆందుతున్నాయని ప్రశ్నించారు. వసతిగృహంలో మౌలిక సదుపాయాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇక్కడ అన్ని రకాల మౌలిక సదుపాయాలు వున్నాయని, ప్రసవ సమయంలో గిరిశిఖర ప్రాంతాలనుంచి వైద్యం నిమిత్తం రావడం చాలా కష్టంగా వుండేదని పలువురు గర్భిణులు తెలిపారు. ఈ వసతిగృహం వల్ల గిరిజనులకు మంచి జరుగుతుందని వారు సంతోషాన్ని వ్యక్తం చేయడంతో గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రకృతి సేద్యానికి ప్రశంస అనంతరం గవర్నర్ బిశ్వభూషణ్ పాచిపెంట మండలం అమ్మవలస చేరుకున్నారు. అక్కడ గిరిజన రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్న వరి, మొక్కజొన్న, అరటి, పత్తి, కంద, మామిడి, జీడిమామిడి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం ఏవిధంగా చేస్తున్నారన్న విషయం తెలుసుకున్నారు. వ్యవసాయ యాంత్రీకరణ, ఇతర వ్యవసాయ పద్ధతుల గురించి ఆరా తీశారు. ఈసందర్భంగా రైతులు వాటి గురించి గవర్నర్‌కు వివరించారు. అనంతరం ఆయన గ్రామసభలో పాల్గొన్నారు. సభలో రైతులతో మాట్లాడారు. రైతులకందుతున్న ప్రభుత్వ పథకాల గురించి రైతులను అడుగ్గా కె.విజయ్ అనే రైతు మాట్లాడుతూ రైతుభరోసా పథకం ద్వారా రాష్ట్ర ముఖ్యమంంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి రూ.7500లు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ పీఎం కిసాన్ యోజన పథకం ద్వారా రూ.2000 ఇచ్చారని, పంట సాగుకు పెట్టుబడికి సాయం అందించినట్టయిందని తెలిపారు. ఆరోగ్య కార్యకర్తలు తనిఖీలు, పౌష్టికాహారం పంపిణీ, మందులు సరఫరా గురించి గవర్నర్ అడుగ్గా క్రమ పద్ధతిలో తనిఖీ చేసి, పౌష్టికాహారం, మందులు సరఫరా చేస్తున్నారని గిరిజన మహిళ లక్ష్మి తెలిపారు. అనంతరం ఆయన పి.కోనవలస గిరిజన సంక్షేమ బాలికల జూనియర్ కాలేజీకి వెళ్లి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. విద్య, కాలేజీ, వసతిగృహంలో సౌకర్యాలు గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకల్లో పాల్గొని, గిరిజన బాలికలతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. వైద్యసదుపాయాలు మెరుగు: డిప్యూటీ సీఎం అమ్మవలస సభలో మాట్లాడిన డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ మంత్రి పాముల పుష్పశ్రీవాణి ఏజెన్సీలో వైద్యసదుపాయా ల మెరుగుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోం దని తెలిపారు. గిరిజనులు తక్కువగా ఉన్న కొత్తవలస ప్రాంతంలో పెట్టిన గిరిజన యూనివర్శిటీని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సాలూరు ప్రాంతంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారన్నారు. పాడేరులో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నారనీ, ఏడు ఐటీడీఏల పరిధిలో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రులు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. బాక్సైట్ తవ్వకాలు ముఖ్యమంత్రి రద్దు చేసిన విషయాన్ని తెలియజేశారు. సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి: ఎమ్మెల్యే రాజన్నదొర అమ్మవలసలో నిర్వహించిన సభలో సాలూరు ఎమ్మెల్యే పీడక రాజన్నదొర మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల సందర్శనకు గవర్నర్ రావడం సంతోషంగా ఉందనీ, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి కృషి చేస్తున్నారనీ తెలిపారు. నవరత్నాల ద్వారా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. సాలూరు ప్రాంతంలో ధీర్ఘకాలికంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా మధ్య 21 కొఠియా గ్రామాల సమస్య నలుగుతోందనీ, వీరి సమస్య పరిష్కరించాలని కోరారు. గిరిజనులకు వైద్య సదుపాయాలు మెరుగుపరచాల్సి ఉందన్నారు. స్పందించిన గవర్నర్ వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. మధ్యాహ్నం 3.25 నిమిషాలకు హెలిప్యాడ్ వద్దకు చురుకున్న గవర్నర్ పర్యటన విజయవంతంపై జిల్లా అధికారులను అభినందించి, వారితో గ్రూఫ్ఫొటో దిగారు. అనంతరం గవర్నర్ విశాఖ బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో గిరిజన సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్.పి.సిసోడియా, గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్ రంజిత్ బాషా, బొబ్బిలి, పాడేరు ఎమ్మెల్యేలు శంబంగి చిన్న అప్పలనాయుడు, కె.భాగ్యలక్ష్మి, శాసనమండలి సభ్యులు గుమ్మడి సంధ్యారాణి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరిజవహర్‌లాల్, విశాఖ రేంజ్ డీఐజీ కాళిదాసు రంగారావు, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, పార్వతీపురం సబ్ కలెక్టర్ టి.ఎస్.చేతన్, జిల్లా ఎస్.పి.రాజకుమారి ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
‘గిరిజనులతో మైత్రిని కొనసాగిస్తాను’
సాక్షి, విజయనగరం: గిరిజనుల జీవన విధానాన్ని తను వ్యక్తిగతంగా చూశానని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తెలిపారు. వారితో మైత్రిని భవిష్యత్తులో కూడా కొనసాగిస్తానని ఆయన పేర్కొన్నారు. జిల్లాలోని పాచిపెంట మండలం అమ్మవలస ఆదివాసి గ్రామాన్ని గవర్నర్ బిశ్వభూషణ్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన వైఎస్సార్ రైతు భరోసా కింద లబ్ధి పొందిన గిరిజన రైతులతో మాట్లాడారు. వాళ్ల బ్యాంకు ఖాతాలకు ఎంత సొమ్ము జమ అవుతుందో ఆరా తీశారు. ఈ క్రమంలో అమ్మవలస ఆదివాసి గిరిజన రైతులు సాగుచేస్తున్న ఉద్యానవన పంటలను సందర్శించి గిరిజన రైతులతో ముచ్చటించారు. అనంతరం ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగు చేస్తున్న వరి , మొక్కజొన్న, అరటి, పత్తి, మామిడి, జీడిమామిడి తదితర పంటల సాగు వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అమ్మవలస ఆదివాసి గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామసభను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీ వాణి, ఎమ్మెల్యే రాజన్న దొర కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ ప్రసంగిస్తూ.. గిరిజనుల జీవన విధానాన్ని వ్యక్తిగతంగా చూసి, వారి సమస్యలు తెలుసుకున్నానని తెలిపారు. సమస్యల పరిష్కార చర్యలపై ప్రభుత్వానికి సూచిస్తానని పేర్కొన్నారు. సంస్కృతి, సంప్రదాయాలు వేల సంవత్సరాలు నుంచి వచ్చాయని.. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాటిని కాపాడటం సవాలుతో కూడుకున్న పని అని అన్నారు. ప్రస్తుతం విద్య, ఆరోగ్యం రెండు ప్రధాన అంశాలుగా ఉన్నాయని పేర్కొన్నారు. వాటిని నిర్వహించే క్రమంలో గిరిజన ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు, ఏకలవ్య పాఠశాలలు ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. గిరిజనులు విద్యకు ప్రాధ్యాన్యత ఇచ్చి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఆరోగ్యానికి సంబంధించి ఏఎన్ఎం వ్యవస్థ, పీహెచ్‌సీలు ఏర్పాటు చేసినా భౌగోళికపరంగా సమస్యలు ఉన్నాయన్నారు. గిరిజన ప్రాంతాలకు వైద్యం అందుబాటులోకి తీసుకురావడం.. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. గిరిజన యువత ఉపాధి కోసం కొత్త రంగాలను ఎంచుకొని నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. పోటీ పరిక్షలకు సిద్ధం అవుతూ.. తమను తాము మార్చుకుని ప్రభుత్వం సహకారం పొందాలని వివరించారు. షెడ్యూల్ ప్రాంతాల్లో గిరిజన సమస్యలు తెలుసుకోవడంతో పాటు.. పరిష్కారం కోసం ఆ వివరాలను ప్రభుత్వానికి సూచించడం తన బాధ్యత అన్నారు. గిరిజనులతో మాట్లాడటం చాలా ఆనందంగా ఉందని.. ఈ మైత్రి బంధాన్ని భవిష్యత్‌లో కూడా కొనసాగిస్తాని అన్నారు. స్థానికంగా ఉన్న సమస్యలు తన దృష్టికి వచ్చాయని.. వాటి పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ.. గిరిజనులకు ప్రభుత్వాభివృద్ధి ఫలాలు అందుతున్న తీరును పరిశీలించేందుకు గవర్నర్ రావడం శుభసూచకం అన్నారు. ప్రభుత్వం గిరిజనాభివృద్ధికి ఎంతో కృషి చేస్తోందని తెలిపారు. ఇంకా చాలా ప్రాంతాల్లో విద్య, వైద్యం అందాల్సి ఉందని గుర్తుచేశారు. పాడేరులో మెడికల్ కళాశాల, సాలూరులో గిరిజన విశ్వ విద్యాలయం రాబోతున్నాయని వెల్లడించారు. గిరిజన అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం అని శ్రీవాణి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కోటియా గ్రామాల సమస్యను ఎమ్మెల్యే రాజన్నదొర గవర్నర్ దృష్టికి తీసుకు వచ్చారు. అనంతరం రాజన్న దొర మాట్లాడుతూ.. కోటియా గ్రామాల గిరిజనులు సరిహద్దు సమస్యను ఎదుర్కొంటున్నారని తెలిపారు. అభివృద్ధిలో ఒడిషా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య పోటీతత్వం ఏర్పడుతోందని పేర్కొన్నారు. ప్రజలు రెండు రాష్ట్రాల మధ్య నలిగిపోతున్నారని చెప్పారు. ఈ సమస్యను పరిష్కరించాలని గవర్నర్‌కి విన్నవించినట్టు తెలిపారు. -
గిరిజన విద్యార్థులకు ఏపీ సర్కారు తీపికబురు
సాక్షి, అమరావతి: ఏపీ ప్రభుత్వం తొలిసారిగా గిరిజన విద్యార్థులకు ఆయూష్‌లో పీజీ సీట్లలో చోటు కల్పించింది. గత ఐదేళ్లలో ఆయూష్ పీజీ సీట్లలో గిరిజన (ఎస్టీ) రిజర్వేషన్లు అమలు కాలేదు. ఇదే విషయాన్ని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడలో ఒక సీటు, తిరుపతి కళాశాలలో రెండు సీట్లను గిరిజనులకు కేటాయించింది. ప్రభుత్వ నిర్ణయంపై గిరిజన మెడికల్ విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
గురుకుల పాఠశాలలో దీపావలి జరుపుకున్న పుష్పశ్రీవాణి
-
గిరిజనుల అభివృద్ధికి రూ.4,988 కోట్లు
సాక్షి, అమరావతి: గత ఐదేళ్ల టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన సబ్‌ప్లాన్ నిధుల అవినీతిపై నోడల్ ఏజెన్సీతో విచారణ జరిపిస్తామని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో గిరిజన సబ్‌ప్లాన్ నిధులను దారిమళ్లించి.. దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో పారదర్శక పాలన జరుగుతుందన్నారు. సబ్‌ప్లాన్ నిధులు దుర్వినియోగం కాకుండా ప్రతి పైసా గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. గిరిజనుల అభివృద్ధికి రూ.4,988 కోట్లతో ఉప ప్రణాళికను అమలు చేస్తున్నామని పుష్ప శ్రీవాణి పేర్కొన్నారు. -
ఉప ముఖ్యమత్రి పుష్పశ్రీవాణితో పూజా సమయం
-
టీడీపీ రాజకీయ కుట్రలు చేస్తోంది: పుష్ప శ్రీవాణి
రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించిన నాలుగు నెలల్లోనే లక్షా 26వేల ఉద్యోగాలు భర్తీ చేసి చరిత్ర సృష్టించారని ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి అన్నారు. కురుపాం నియోజకవర్గ పరిధి కొమరాడ మండలం గంగరేగువలస, గరుగుబిల్లి మండలం రావివలసలో గ్రామసచివాలయాలను గురువారం ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ గాంధీజీ కలలు గన్న గ్రామస్వరాజ్య స్థాపనకే సచివాలయ వ్యవస్థ ఆవిర్భవించిందని చెప్పారు. సాక్షి, గరుగుబిల్లి(విజయనగరం): రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ ఏర్పాటు ఓ సువర్ణాధ్యాయమని ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి అన్నారు. జాతిపిత గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సచివాలయాలతోనే సాధ్యమని దీన్ని గుర్తించే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సచివాలయ వ్యవస్థకు రూపకల్పన చేశారన్నారు. మండలంలోని రావివలస గ్రామంలో సచివాలయాన్ని గురువారం ఆమె ప్రారంభించారు. అనంతరం ఎంపీడీఓ ఎంవీ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకు సచివాలయాలు తోడ్పడతాయన్నారు. వైఎస్సార్సీపీ అరకు పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో నాలుగు లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తే తెలుగుదేశం రాజకీయం చేసేందుకు కుట్రలు పన్నిందన్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం చంద్రబాబుకు ఇష్టం లేదన్నారు. కార్యక్రమంలో వీటీ సూర్యనారాయణ థాట్రాజ్, పార్టీ మండల కన్వీనర్ ఉరిటి రామారావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె.ధర్మారావు, మాజీ సర్పంచ్ ఎం.బలరాంనాయుడు, బాపూజీనాయుడు, గ్రామ ప్రత్యేకాధికారి బి.తిరుపతిరావు, జియ్యమ్మవలస మండల కన్వీనర్ మూడడ్ల గౌరీశంకరరావు, నాయకులు కలిశెట్టి ఇందుమతి, బొబ్బిలి అప్పలనాయుడు, ముదిలి గౌరునాయుడు తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు రావివలసలో నెలకొన్న సమస్యలను మాజీ సర్పంచ్ బలరాంనాయుడు మంత్రికి వివరించారు. మొక్కలు పర్యావరణ నేస్తాలు గరుగుబిల్లి: మొక్కలు పర్యావరణ నేస్తాలని ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి అన్నారు. మండలంలోని రావివలస సచివాలయ ప్రాంగణంలో పలు రకాల మొక్కలను గురువారం నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు ప్రాణవాయువు అందించాలంటే ఇప్పటి నుంచే ప్రతీ ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. మొక్కల పెంపకం ఆవశ్యకతను మరింతగా ప్రజలకు వివరించాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ అరకు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, మండల కన్వీనర్ ఉరిటి రామారావు తదితరులు ఉన్నారు. -
వృద్ధుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం..
సాక్షి, విజయనగరం: వయో వృద్ధుల సంక్షేమానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి అన్నారు. అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా మంగళవారం విజయనగరం జిల్లా ఏరియా ఆసుపత్రిలో వృద్ధుల వార్డును డిప్యూటీ సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వృద్ధులకు అన్ని విధాలుగా చేయూతనందించే దిశగా చర్యలను చేపట్టామని తెలిపారు. గత ప్రభుత్వం ఇస్తున్న పింఛను మొత్తాలను పెంచడంతో పాటుగా.. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రత్యేక వైద్యసేవలను అందించనున్నామని వెల్లడించారు. పార్వతీపురం ఏరియా ఆస్పత్రిలో 60 ఏళ్లు దాటిన వృద్ధుల కోసం 10 పడకలతో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ వార్డులో వయో వృద్ధులకు ప్రత్యేకంగా పడకలను కేటాయించి అవసరమైన చికిత్సలను అందిస్తామని తెలిపారు. సేవలను సీనియర్ సిటిజన్లు వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, అధికారులు పాల్గొన్నారు -
నవశకానికి నాంది
సాక్షి, విజయనగరం: వైఎస్సార్ సీపీ ప్రభుత్వం గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యానికి నాంది పలికింది. ప్రజాప్రతినిధులు, అధికారుల సాక్షిగా సచివాలయ వ్యవస్థ అమలుకు శ్రీకారం చుట్టింది. సీఎం జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు విజయనగరం జిల్లాలోని రాజీవ్ క్రీడాప్రాంగణంలో సోమవారం గ్రామ/వార్డు సచివాలయాల్లో పలు రకాల ఉద్యోగాలకు ఎంపికైన 4,283 మంది అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలను ప్రజాప్రతినిధులు, అధికారులు అందజేశారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు, వారి తల్లిదండ్రులతో మైదానంలో పండగ సందడి కనిపించింది. నియామక పత్రాలు అందుకున్న నిరుద్యోగులు చిరునవ్వులు చిందించారు. జగన్మోహన్రెడ్డి సీఎం కావడం, ఉద్యోగాల విప్లవం సృష్టించడంతో చిరకాల వాంఛతీరిందంటూ మురిసిపోయారు. ఏపీ డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, పలువురు ఎమ్మెల్యేలు జ్యోతిప్రజ్వలన చేసి నియామకపత్రాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ జాతిపిత మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి నాంది పలికిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. వినూత్న రీతిలో ఆలోచిస్తూ సుమారు ఒక లక్షా 26 వేల పోస్టులను శాశ్విత ప్రాతిపదికన భర్తీ చేసి నిరుద్యోగులకు కొత్త జీవితాలు ప్రసాదించారన్నారు. మరోవైపు ప్రజల ముంగిటకే ప్రభుత్వ సేవలను తీసుకువెళ్లే శాశ్వత యం త్రాంగం అమలుకు శ్రీకారం చుట్టారన్నారు. కేవలం 72 గంటల్లోనే సమస్యలు పరిష్కరించే ఒక చక్కని సుపరిపాలనా వ్యవస్థను తెరపైకి తెచ్చారన్నారు. ప్రభుత్వ ఆశలు, ఆశయాలకు అనుగుణంగా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు అంకిత భావంతో విధులను నిర్వహిస్తూ ప్రభుత్వానికి మంచి పేరుతేవాలని ఆమె విజ్ఞప్తిచేశారు. జిల్లాలో ప్రసుత్తం భర్తీ చేసిన 4,283 పోస్టుల్లో సగానికి పైగా మహిళలనే ఎంపిక చేయడం మహిళా శక్తిపై ప్రభుత్వానికి ఉన్న విశ్వాసానికి నిదర్శనంగా పేర్కొన్నారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ఎటువంటి విమర్శలకు తావులేకుండా నిర్వహించిన జిల్లా యంత్రాగానికి అమె శాల్యూట్ చేశారు. అందరి ముఖాలలో చిరునవ్వులు చూడాలన్నదే సీఎం ధ్యేయంగా పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్ ఒక్కడుకు ముందుకు వేసి పాలన సాగిస్తే యువ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రెండడుగులు ముందుకు వేసి ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్నారన్నారు. కష్టపడి చదివి ఎంపికైన నిరుద్యోగులపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అవాకులు, చవాకులు పేలుస్తూ.. పేపర్‌లీక్ అయ్యిందంటూ నిరుద్యోగల్లో అలజడి రేపే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. ఉద్యోగాల భర్తీ ఎలా సాగిందో నిరుద్యోగ అభ్యర్థులకు తెలుసన్నారు. విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ దేశ చరిత్రలోనే ఇదొక మైలురాయిగా అభివర్ణించారు. లక్షా 26 వేల ఉద్యోగాలను శాశ్విత ప్రాతిపదికన భర్తీ చేసి దేశానికే ఆదర్శంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నిలచారన్నారు. నిరుద్యోగుల ప్రతిభకు పట్టం కట్టారన్నారు. జేసీ కె.వెంకటరమణా రెడ్డి మాట్లాడుతూ గ్రామ, వార్డు సచివా లయ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలను 92 శాతం మేర అందజేసి రాష్ట్రంలో విజయనగరం జిల్లా ప్రథమస్థానంలో నిలవడం ఆనందంగా ఉందన్నారు. ప్రతిభ ఆధారంగానే ఉద్యోగుల నియామకం జరిగిందన్నారు. ఉద్యోగులుగా నియామకం అయిన వారంతా అంకిత భావంతో విధులను నిర్వర్తిస్తూ జిల్లాను ప్రగతి పథంలో నడిపించాలని విజ్ఞప్తిచేశారు. కార్యక్రమంలో ఎస్పీ రాజకుమారి, జేసీ–2 ఆర్.కూర్మనాథ్, డీఆర్వో జె.వెంకటరావు, డీఆర్డీఏ పీడీ సుబ్బారావు, డ్వామా పీడీ నాగేశ్వరరావు, ఆర్డీవో సాల్మన్‌రాజు, జెడ్పీ సీఈఓ వెంకటేశ్వరరావు, జిల్లా పంచాయతీ అధికారి సత్యనారాయణ, పశుసంవర్దక శాఖ జేడీ నరసింహులు, సెట్విజ్ సీఈఓ నాగేశ్వరరావు, విజయనగరం కార్పొరేషన్ కమిషనర్ ఎస్.ఎస్.వర్మ, పలు శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. చరిత్ర సృష్టించారు.. సీఎం జగన్మోహన్రెడ్డి ప్రజా సంక్షేమ పాలన అందిస్తూ చరిత్ర సృష్టిస్తున్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హమీలన్నీ అమలు చేసే దిశగా సీఎం ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. సచివాలయ వ్యవస్థపై నమ్మకాన్ని పెంపొందించాలి. రాష్ట్ర భవిష్యత్ మీ పైనే ఆధారపడి ఉంది. గత పాలకుల్లా డబ్బు సంపాదన కోసం రాజకీయంచేసేవాళ్లం మేము కాదు. మంత్రులు బొత్స, శ్రీవాణి, బెల్లాన నాయకత్వంలో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం. – కోలగట్ల వీరభధ్రస్వామి, ఎమ్మెల్యే, విజయనగరం నియోజకవర్గం నూతన శకం ఆరంభం రాష్ట్రంలో జిల్లాలో నూతన శకం ఆరంభమైంది. 4 నెలల వ్యవధిలోనే సీఎం జగన్మోహన్రెడ్డి తనదైన మార్కు చూపించారు. విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి పారదర్శకమైన పాలనకు శ్రీకారం చుట్టారు. గత 5 ఏళ్లలో కుళ్లిపోయిన వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. దీనికి మహాత్మా గాంధీ 150వ జయంతి రోజున నాంది పలకడం శుభపరిణామం. నిరుద్యోగుల ప్రతిభకు పట్టంకట్టే రోజులు వచ్చాయి. – శంబంగి వెంకటచినఅప్పలనాయుడు, ఎమ్మెల్యే, బొబ్బిలి నియోజకవర్గం నమ్మకాన్ని నిలబెట్టండి గ్రామ సచివాలయాల్లో ఉద్యోగులుగా ఎంపికైన అభ్యర్ధులకు అభినందనలు. జగన్మోహన్రెడ్డి మీపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టేలా చిత్తశుద్ధితో పని చేయాలి. చక్కని చిరునవ్వుతో అందరికీ సేవలందించాలి. లక్షలాది ఉద్యోగాలు ఒకే సారి భర్తీ చేయటం చాలా గర్వంగా ఉంది. కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని కాపాడుకుందాం. ఆయన ఆశయాలను అందరూ కలసిగట్టుగా నెరవేర్చుదాం. – బడ్డుకొండ అప్పలనాయుడు, ఎమ్మెల్యే, నెల్లిమర్ల నియోజకవర్గం సచివాలయ ఉద్యోగులకు నియామక పత్రాలను అందజేస్తున్న డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి, తదితరులు సచివాలయ ఉద్యోగులకు నియామక పత్రాలను అందజేస్తున్న డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి, తదితరులు భాగస్వాములు కావాలి. సీఎం జగన్మోహన్రెడ్డి ఓ చారిత్రాత్మక ఘట్టా నికి తెరలేపారు. అందులో మనందరినీ భాగస్వాములు చేయడం గొప్ప అనుభూతిగా మిగులుతుంది. తప్పు చేస్తే సొంత పార్టీ ఎమ్మెల్యేనైనా, ఎంపీనైనా క్షమించేది లేదని గెలిచిన కొద్ది రోజుల్లోనే చెప్పిన వ్యక్తి జగన్మోహన్రెడ్డి. అటువంటి నిబద్ధత కలిగిన వ్యక్తి నమ్మకాన్ని మనందరం నిలబెట్టాలి. – కడుబండి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే, ఎస్.కోట -
అప్పుడు చెప్పారు.. ఇప్పుడు చేసి చూపిస్తున్నారు
సాక్షి, విజయనగరం: అవినీతి, అక్రమాలకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా గ్రామ సచివాలయ నియామకాలు చేపట్టామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి అన్నారు. జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పుష్ప శ్రీవాణి నియామక పత్రాలను అందజేశారు. సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయాలకు ఎంపికైనవారికి అభినందనలు తెలిపారు. నూతనంగా ఎంపికైన ఉద్యోగులు ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా పారదర్శక పాలన అందించాలని కోరారు. దేశంలో మరెక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సుపరిపాలన అందిస్తున్నారని కొనియాడారు. పాదయాత్ర సమయంలో చెప్పిన విషయాలను ఇప్పుడు చేసి చూపిస్తున్నారని తెలిపారు. మహిళలకు యాభై శాతం రిజర్వేషన్ కల్పిస్తూ అన్నింటా అవకాశాలు కల్పిస్తున్నారని పేర్కొన్నారు. కష్టపడి చదివి ఉద్యోగం సాధించుకున్నవారిపైన ప్రతిపక్ష నేత చంద్రబాబు అవాక్కులు చవాక్కులు విసిరారని విమర్శించారు. పేపర్ లీక్ అంటూ అసత్య ప్రచారాలు చేపట్టారని మండిపడ్డారు. -
ప్రజాభాగస్వామ్యంతోనే ఉత్సవాలు: డిప్యూటీ సీఎం
సాక్షి, విజయనగరం : ప్రజలందరి భాగస్వామ్యంతో విజయనగరం ఉత్సవాలను విజయవంతం చేయాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ జిల్లా అధికారులు, వివిధ కమిటీల సభ్యులకు పిలుపునిచ్చారు. స్థానిక కలెక్టరేట్ ఆడిటోరియంలో ఆదివారం సాయంత్రం సిరిమానోత్సవం, విజయనగర ఉత్సవాలపై ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి, మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ ఉత్సవాల్లో ప్రజలందరినీ భాగస్వాములను చేస్తూ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవ నిర్వహణలో సంప్రదాయాలకు భంగం కలిగించకుండా వ్యవహరించాలని స్పష్టం చేశారు. సిరిమానోత్సవానికి బందోబస్తు ఏర్పాట్లను పటిష్టంగా చేస్తూనే అధికంగా భక్తులు ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు వీలుగా భక్తుల విషయంలో కాస్త ఉదారంగా వ్యవహరించాలని సూచించారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అమ్మవారి దర్శనం జరిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఉత్సవాల సందర్భంగా ఏ చిన్న సంఘటనకు తావులేకుండా జాగ్రత్త వహించాలని చెప్పారు. ఉత్సవాల నిర్వహణకు అవసరమైన నిధులు కేటాయించేందుకు కృషి చేస్తానని కూడా చెప్పారు. అక్టోబర్ 12 నుంచి 14 వరకూ మూడురోజుల పాటు నిర్వహించే ఉత్సవాలు, విజయనగరం సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఉండాలని తెలిపా రు. ఐదు వేదికల్లో ఉత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని, జిల్లాకు చెందిన విశిష్ట వ్యక్తులకు సత్కరించనున్నామని వెల్లడించారు. జిల్లా ప్రతిష్ట పెంపొందించాలి ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి మాట్లాడుతూ జిల్లా ప్రతిష్ట ఇనుమడింపజేసేలా ఉత్సవాలను నిర్వహించాలని సూచించారు. జిల్లాకు సాంస్కృతికంగా ఎంతో విశిష్టత ఉందని, దాన్ని చాటిచెప్పేలా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ గతంలో నిర్వహించిన ఉత్సవాల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని గతం కంటే మిన్నగా ఈ ఏడాది ఉత్సవాలు నిర్వహించాలన్నారు. సుదూర ప్రాంతాల నుంచి అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. అత్యధికంగా భక్తులు సిరిమానోత్సవం తిలకించేలా అవకాశం కల్పించాలన్నారు. సిరిమానోత్సవం రోజున నగరంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. ప్రముఖుల దర్శనానికి నిర్దిష్ట సమయాలు కేటాయించాలని చెప్పారు. సామాన్య భక్తుల దర్శనానికే అధిక ప్రాధాన్యమివ్వాలన్నారు. జేసీ వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ ఉత్సవాల నియంత్రణకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. ఒక్కో వేదిక వద్ద కార్యక్రమాల నిర్వహణకు కమిటీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గతంలో నిర్వహించిన తరహాలోనే ఈ ఏడాది పుష్ప ప్రదర్శనను సంగీత కళాశాలలో ఏర్పాటు చేయనున్నామన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమం ఆనందగజపతి ఆడిటోరియంలోనూ, 13, 14 తేదీల్లో సాయంత్రం వేళల్లో అయోధ్యా మైదానంలో కార్యక్రమాలను ఏర్పాటుచేశామన్నారు. 15న పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం పూర్తయిన తర్వాత బాణాసంచా కాల్చే ఏర్పాట్లు చేయాలని మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. ఇందుకు అనువైన ప్రదేశాన్ని పోలీసు అధికారులే గుర్తించాలని పేర్కొన్నారు. సమావేశంలో పలు స్వచ్చందసంస్థల ప్రతినిధులు, జర్నలిస్టులు, తమ అభిప్రాయాలను, సూచనలను వ్యక్తపరిచారు. కార్యక్రమంలో పార్లమెంటు సభ్యుడు బెల్లాన చంద్రశేఖర్, నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, ఎస్పీ రాజకుమారి, జేసీ–2 ఆర్.కూర్మనాథ్, డీఆర్ఓ వెంకటరావు, ఓఎస్డీ జె.రామ్మోహనరావు, ఏఎస్పీ ఎన్.శ్రీదేవీరావు తదితరులు పాల్గొన్నారు. ఫ్లెక్సీలు, బ్యానర్లకు అనుమతులివ్వద్దు విజయనగర ఉత్సవాలు, పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం సందర్భంగా ఫ్లెక్సీలు, బ్యానర్ల ఏర్పాటుకు ఎటువంటి అనుమతులివ్వవద్దని మంత్రి బొత్స సత్యనారాయణ పురపాలక అధికారులను ఆదేశించారు. ఏ పార్టీ తరఫునైనగానీ, వ్యక్తుల తరఫునగానీ బ్యానర్లు, ప్లెక్సీలు ఏర్పాటు చేయకుండా నియంత్రించాలన్నారు. మున్సిపాలిటి అడ్వర్టైజింగ్ ఏజెన్సీలకు అనుమతించిన హోర్డింగులు మినహా ఏ ఒక్కటీ అదనంగా కనిపించడానికి వీల్లేదన్నారు. -
చంద్రబాబుపై డిప్యూటీ సీఎం ఫైర్
సాక్షి, అమరావతి: విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాల విషయంలో గత చంద్రబాబు ప్రభుత్వం అవలంభించిన విధానాలపై ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బాక్సైట్ తవ్వకాలకు అనుకూలంగా గిరిజనుల జీవితాలను నాశనం చేసే జీవో నెం. 97 ఇచ్చింది చంద్రబాబు కాదా..? 2015 లో జీవో జారీ చేసినపుడు సీఎంగా ఉన్నది మీరే కదా...? గత ప్రభుత్వంలో మీరు గిరిజనులకు ఏం చేశారో చెప్పలేక, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే బాక్సైట్ తవ్వకాలను రద్దు చేసి చూపించిన సీఎం జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం హాస్యాస్పదం. గత ఐదేళ్ల మీ పాలనలో ప్రజలకు ప్రత్యక్ష నరకం చూపించారు. జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసి పల్లెల్లో మాఫియాను ప్రోత్సహించారు. కాగా నేడు ప్రభుత్వ ఫథకాలను ప్రజలకు గడప ముంగిటకే చేర్చాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన గ్రామ వాలంటీర్ల వ్యవస్థను కించపరిచేలా మాట్లాడటం సిగ్గుచేటు. ఇలా మాట్లాడటం వల్లే 123 సీట్ల నుంచి 23 సీట్లకు పడిపోయేలా ప్రజలు బుద్ధి చెప్పినా ప్రవర్తనలో మార్పు లేదన్నారు. ఈ సందర్భంగా గత ఐదేళ్లలో జిసిసిలో జరిగిన వందల కోట్ల అవినీతిపై విచారణ జరపండి. గిరిజనుల ఉత్పత్తులకు ధర కల్పించకకుండా అవినీతికి పాల్పడిన అధికారులపై విచారణ జరిపి, కోట్ల అవినీతిలో భాగస్వాములైన అధికారులపై చర్యలు తీసుకోమని ఆదేశించారు. (చదవండి : ‘గిరిజనులు సీఎం జగన్‌ను ఎప్పటికి మర్చిపోలేరు’) -
‘గిరిజనులు సీఎం జగన్‌ను ఎప్పటికి మర్చిపోలేరు’
సాక్షి, అమరావతి : గిరిజనుల అభిప్రాయాన్ని గౌరవించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బక్సైట్ తవ్వకాలను రద్దు చేశారని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి పేర్కొన్నారు. గిరిజనులు పెట్టుకున్న నమ్మకాన్ని సీఎం జగన్ నిలబెట్టుకున్నారని ప్రశంసించారు. గిరిజనులు ఈ రోజు పండుగ చేసుకునే రోజని అన్నారు. గతంలో చంద్రబాబు గిరిజనుల సంపదను దోచుకోవాలని చూశాడని, బాక్సైట్ కోసం బాబు గిరిజన ఎమ్మెల్యేలను సైతం కొనుగోలు చేశాడని మండిపడ్డారు. బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా గిరిజనులు పోరాడారని గుర్తు చేశారు. 2015 లో చంద్రబాబు ఇచ్చిన 97 జీవో కు వ్యతిరేకంగా సీఎం జగన్మోహన్రెడ్డి పోరాడారని, ఆ సమయంలోనే వైఎస్ జగన్ బాక్సైట్ అనుమతులు రద్దు చేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. సీఎం అయిన నాలుగు నెలల్లోనే గిరిజనులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని స్పష్టం చేశారు. వైఎస్ జగన్‌పై ఉన్న నమ్మకంతోనే గిరిజన ప్రాంతాల్లోని అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీని గెలిపించారని తెలిపారు. ఇక గిరిజనులు సీఎం జగన్‌ను ఎప్పటికి మర్చిపోరని అన్నారు. -
సినిమాలో నటిస్తోన్న డిప్యూటీ సీఎం
సాక్షి, గుమ్మలక్ష్మీపురం (విజయనగరం): ప్రకృతి వ్యవసాయం ప్రాధాన్యం తెలిపేలా తెరకెక్కిస్తున్న ‘అమృత భూమి’ సినిమాలో టీచర్ పాత్రలో డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖామంత్రి పాముల పుష్పశ్రీవాణి, అధికారి పాత్రలో కలెక్టర్ హరిజవహర్‌లాల్ నటించారు. మండలంలోని లోవముఠా ప్రాంతం గొరడ గ్రామంలో నిర్వహించిన సినిమా చిత్రీకరణలో ఆమె పాల్గొన్నారు. గొరడ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయురాలిగా డిప్యూటీ సీఎంపై సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఈ సందర్భంగా పుష్పశ్రీవాణి మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేలా సినిమా నిర్మించడం ఆనందదాయకమన్నారు. నటుడు రాజాప్రసాద్ బాబు మాట్లాడుతూ రోజు రోజుకీ అటవీప్రాంతం అంతరించి పోతోందని, తినే తిండి గింజల నుంచి కట్టుకునే బట్ట వరకు అంతా రసాయనాలతో నిండిపోతుందని చెప్పారు. రైతులకు ప్రకృతి వ్యవసాయం పట్ల చైతన్యపర్చేందుకు ఈ చిత్రాన్ని రూపొం దిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో జానపద కళాకారుడు వండపండు, జట్టు వ్యవస్థాపకులు డి.పారినాయుడు పాల్గొన్నారు. తోటపల్లిలో సినిమా సందడి గరుగుబిల్లి: ప్రకృతి వ్యవసాయంపై రైతులను చైతన్యవంతం చేస్తూ తెరకెక్కిస్తున్న అమృతభూమి సినిమాలో అధికారి పాత్రలో కలెక్టర్ డా.హరిజవహర్‌లాల్ నటించారు. మండలంలోని తోటపల్లిలోని ప్రకృతి ఆదిదేవోభవ ప్రాంగణంలో పలు సన్నివేశాలను ఆదివారం చిత్రీకరించారు. ఏపీ రైతు సాధికార సంస్థ, అజీం ప్రేమ్‌జీ ఫౌండేషన్ సహకారంతో జట్టుటస్టీ డి.పారినాయుడు పర్యవేక్షణలో సినిమా నిర్మాణం జరుగుతోంది. సినీ రచయిత వంగపండు ప్రసాదరావు ప్రకృతి వ్యవసాయం ఇతివృత్తంగా ఈ కథను రచించారు. షూటింగ్లో కలెక్టర్ పాల్గొనడంతో చూసేందుకు పరిసర గ్రామాల ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం సేంద్రియ ఎరువులను వినియోగించి ఆరోగ్యకరమైన పంటల ఉత్పత్తికి ప్రణాళిక రూపొందించిందన్నారు. ఈ సినిమా ద్వారా ప్రజల్లో విప్లవాత్మక మార్పులు వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో సీనియర్ నటుడు ప్రసాద్‌బాబు, టీవీ ఆర్టిస్ట్ దయబాబు, కెమెరామెన్ మురళి, ఆర్ట్ డైరెక్టర్ శివ, సహదర్శకుడు రౌతు వాసుదేవరావుతో పాటు నటీనటులు ప్రసాద్‌బాబు, లక్ష్మి, స్వప్న, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
‘చంద్రబాబు, రాధాకృష్ణ కలిసే కుట్రలు చేస్తున్నారు’
సాక్షి, అమరావతి : సచివాలయ ఉద్యోగాలపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా ఉద్యోగాలు కల్పించాలని ప్రశంసించారు. 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన సీఎం జగన్ రికార్డ్‌ను బాబు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. అందుకే చంద్రబాబు, ఏబీఎన్ రాధాకృష్ణ కలిసే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఉద్యోగాలు ఇస్తే బాబు సహించలేకపోతున్నారని, ఇంటికి ఒక ఉద్యోగమని చెప్పి చంద్రబాబు నిరుద్యోగులను మోసం చేశారని దుయ్యబట్టారు. కులాలు, మతాలు, మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నించడం దారుణమని, చంద్రబాబు, ఏబీఎన్ రాధాకృష్ణపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
ఇది చంద్రబాబు కడుపు మంట
పింఛన్ల పెంపు, ఉద్యోగులకు ఐఆర్, విద్యార్థులకు 100 శాతం ఫీజు రీయింబర్స్ మెంట్, గ్రామ వలంటీర్లు, రైతులకు మేలు చేసే నిర్ణయాలు, యువతకు ఉద్యోగాలు, పలు కంపెనీల ఏర్పాటును తప్పుపడుతున్నారంటే ఇవన్నీ మీకు ఇష్టం లేదనే కదా? – టీడీపీకి ఉప ముఖ్యమంత్రుల ప్రశ్న సాక్షి, అమరావతి : చెరువులో చేప ఒడ్డున పడితే ఎలా గిలగిల లాడుతుందో అధికారం కోల్పోయిన టీడీపీ అధినేత చంద్రబాబు పరిస్థితి కూడా అలాగే ఉందని ఉప ముఖ్యమంత్రులు పిల్లి సుభాష్‌చంద్ర బోస్, పాముల పుష్పశ్రీవాణి, ఆళ్ల నాని, కళత్తూరు నారాయణస్వామి, షేక్ బేపారి అంజాద్ బాషలు మండిపడ్డారు. ప్రజా రంజకంగా సాగుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిపాలనపై కరపత్రం విడుదల చేసి లేని పోని విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి అర్ధంతరంగా పారిపోయి వచ్చిన తుగ్లక్ చంద్రబాబు అని, ఆయన ప్రకటించిన చార్జిషీటులో నిజాలేమైనా ఉన్నాయా? అని నిలదీశారు. అధికారం పోయిందన్న కడుపు మంట చంద్రబాబుకు ఎంత ఉందో వారి కరపత్రం చూస్తే తెలుస్తోందన్నారు. ‘నా ఇల్లు ముంచేశారు.. నేను కట్టిన ప్రజా వేదికను కూల్చేశారు..’ అనే రెండు మాటలే మూడు నెలలుగా చంద్రబాబు నోట వెలువడుతున్నాయన్నారు. టీడీపీ కరపత్రం మొదట్లోనే అక్రమ కట్టడాన్ని కూల్చిన ఫొటో వేశారని వారు తప్పు పట్టారు. అందులోని అంశాల వారీగా స్పందిస్తూ శనివారం వారు ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. బాబు ఐదేళ్ల పాలనలో ఏ ఒక్క ఏడాది కూడా శ్రీశైలం, నాగా ర్జున సాగర్, పులిచింతల జలాశయాలు నిండలేదన్న నిజాన్ని కరపత్రంలో ఇవ్వకుండా దాచారని తప్పుపట్టారు. ఆర్టీసీ కార్మికులకు జగన్ ప్రభుత్వం మేలు చేస్తుంటే ఓర్వలేకపోతున్నారని పేర్కొ న్నారు. తక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నప్పటికీ లంచాల కోసం చంద్రబాబు విద్యుత్ సంస్థలకు దాదాపు రూ.20 వేల కోట్లు నష్టం తీసుకు వచ్చాడన్న విషయాన్ని మీడియా ఎందుకు రాయడం లేదని వారు ప్రశ్నించారు. అన్న క్యాంటీన్లకు చంద్రబాబు ప్రభుత్వం పైసా విడుదల చేయలేదని స్పష్టీకరించారు. ఈ ప్రశ్నలకు బదులేదీ? అమ్మ ఒడి స్కీం ద్వారా పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికి రూ.15 వేలు ఇవ్వడం మీకు ఇష్టం లేదా? ఐదేళ్లలో బాబు ఏ తల్లికి అయినా రూపాయి ఇచ్చారా? అమరావతిలో రూ.50 వేల కోట్ల పనులు నిలిపివేశారన్నారే.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది రూ.1500 కోట్లని చెప్పిన చంద్రబాబు మిగతా సొమ్ము ఎక్కడి నుంచి తెచ్చిపెట్టారు? పోలవరం ప్రాజెక్టు ద్వారా 2018కే గ్రావిటీపై నీళ్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్తామన్న మాట ఏమైంది? టీడీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును ఏటీఎంగా మార్చుకుందని సాక్షాత్తు దేశ ప్రధాని చెప్పడం నిజం కాదా? చంద్రబాబు తన అవినీతి బయటపడుతుందని రివర్స్ టెండరింగ్ విధానాన్ని వ్యతిరేకించారు. పోలవరం డ్యాం భద్రత ప్రశ్నార్థకం అయ్యిందని చార్జిషీటులో రాశారు. సిమెంటు, ఇనుముతో చంద్రబాబు పునాదుల నుంచి సవ్యంగా కడితే దాని భద్రతకు ఎలాంటి ముప్పూ ఉండదు. మరి ఆ డబ్బు తినేసి బూడిదతో కట్టారా? 2014 జూన్ 8నే రుణమాఫీ చేసేశామని చంద్రబాబు చెప్పారు కదా? రుణ మాఫీ చేసి ఉంటే బకాయిల ప్రస్తావన ఎందుకొస్తుంది? రూ.87,612 కోట్ల అప్పులను రూ.24,500 కోట్లకు కుదించి చివరకు అందులోనూ రూ.10 వేల కోట్లు ఎగ్గొట్టడం వాస్తవం కాదా? మీరు నిరుద్యోగ భృతి పేరుతో యువతను వంచించడం నిజం కాదా? వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ఏకంగా 4.5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తుండటం నిజం కాదా? అసెంబ్లీ సమావేశాలు పూర్తికాకుండానే అమెరికా పారిపోయిన చంద్రబాబు తనకు మైకు ఇవ్వలేదని ఎందుకు మాట్లాడుతున్నారు? పింఛన్ల పెంపు, ఉద్యోగులకు ఐఆర్, విద్యార్థులకు వంద శాతం ఫీజు రియింబర్స్‌మెంట్, గ్రామ వలంటీర్లు, రైతులకు మేలు చేసే నిర్ణయాలు, పలు కంపెనీల ఏర్పాటును తప్పుపడుతున్నారంటే ఇవన్నీ మీకు ఇష్టం లేదనే కదా? ఒక ఉద్యోగి ట్రాన్స్‌ఫర్‌కు సంబంధించిన జీవోను పట్టుకుని బందరు పోర్టు తెలంగాణకు ఇచ్చేసే వ్యూహం అంటూ ప్రచారం చేయడం దిగజారుడుతనం కాదా? ఉప ముఖ్యమంత్రుల ప్రతికా ప్రకటన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
‘మతి భ్రమించే చంద్రబాబు అలా చేస్తున్నారు’
సాక్షి, అమరావతి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని విమర్శించే అర్హత బాబుకు లేదని అన్నారు. వందేళ్లైనా జరగవు అనుకున్న పనులను సీఎం జగన్ వంద రోజుల్లోనే చేసి చూపించారని కొనియాడారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేపట్టని సంస్కరణలు సీఎం జగన్ వంద రోజుల్లోనే చేశారని పేర్కొన్నారు. ‘అధికారంలోకొచ్చిన వంద రోజుల్లోనే లక్షా 33 వేల ఉద్యోగాలిచ్చారు. దేశంలో ఏ సీఎం కూడా ఇన్ని ఉద్యోగాలు ఇవ్వలేదు. అది సీఎం జగన్ చిత్తశుద్ధి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం రిజర్వేషన్లు, పనుల్లో 50 శాతం వాటా ఇచ్చిన ఘనత జగన్మోహన్రెడ్డిది. కల్లోనైనా చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల కోసం ఆలోచించారా’ అని అన్నారు. పునరావాస కేంద్రాల పేరుతో చంద్రబాబు డ్రామాలాడుతున్నారని పుష్ప శ్రీవాణి విమర్శించారు.నారాయణ కాలేజీల్లో 25 మంది ఆడపిల్లలు చనిపోయినప్పుడు, ఎమ్మార్వో వనజాక్షిని చింతమనేని ప్రభాకర్ కొట్టినప్పుడు ఎందుకు పునరావాస కేంద్రాలు పెట్టలేదని ప్రశ్నించారు. తన పార్టీ ఎమ్మెల్యేలు, నేతల్ని కాపాడుకోవడానికే బాబు పునరావాస కేంద్రాలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి 100 రోజుల పాలనకే చంద్రబాబుకు మతి భ్రమించిందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వాన్ని ఏం విమర్శించాలో తెలియక డ్రామా ఆర్టిస్టులతో దుష్ప్రచారానికి తెగబడ్డారని, ఇప్పటికయినా అబద్దాలు మాని చంద్రబాబు బుద్ది తెచ్చుకోవాలని ఆమె హితవు పలికారు. -
‘విద్యార్థుల ప్రగతే టీచర్లకు అవార్డులు’
సాక్షి, విజయవాడ: ఉపాధ్యాయ దినోత్సవం సందర్బంగా ఉత్తమ ఉపాధ్యాయులను గురువారం ఏపీ ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమశాఖ మంత్రి పాముల పుష్ప శ్రీవాణి సన్మానించారు. ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ లెక్చరర్ల సుదీర్ఘ సమస్యను పరిష్కరించి ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు కల్పించిన సందర్బంగా మంత్రి శ్రీవాణిని జూనియర్ కళాశాలల అధ్యాపకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి గిరిజన విద్యా సంస్థల్లో వర్చువల్ క్లాస్ రూములను, కేంద్రీకృత సీసీ కెమెరాల వ్యవస్థను ప్రారంభించారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా 105 గిరిజన విద్యాసంస్థల్లో వర్చువల్ క్లాస్ రూములు ప్రారంభమైయ్యాయి. విద్యకు, ఉపాధ్యాయులకు జగన్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందని ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి అన్నారు. తొమ్మిది ప్రమాణాలకు అనుగుణంగా గిరిజన విద్యాసంస్థల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. పిల్లలు సాధించిన ప్రగతినే టీచర్లు తమ అవార్డులుగా భావించాలని, మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు. -
‘విద్యార్థులను మోసం చేసిన చంద్రబాబు’
సాక్షి, అమరావతి : చంద్రబాబు నాయుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ విద్యార్థులను మోసం చేశారని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఆరోపించారు. స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్లు చెల్లించకుండ విద్యార్థులను ఇబ్బంది పెట్టిన ఘనత చంద్రబాబుదేనన్నారు. ఎస్సీ, ఎస్టీ హాస్టల్ బిల్లులను కూడా చంద్రబాబు మళ్లీంచారని మండిపడ్డారు. సీఎం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు హయాంలోని బకాయిలన్నింటిని తీర్చి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఇచ్చిన హామీల అమలుకు పెద్ద పీట వేస్తూ.. విద్యార్థులకు 20 వేల చొప్పున హాస్టల్, మెస్ చార్జీలను ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే గిరిజన హాస్టళ్లు, పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి వారికి నాణ్యమైన విద్యను అందించేందుకు తొమ్మిది రకాల ప్రమాణాలను రూపొందిస్తున్నామని అన్నారు. గురుకుల హాస్టల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తి చేస్తామని, మానిఫెస్టోలో చెప్పిన ప్రకారం గిరిజన యూనివర్సిటీ, మేడికల్ కాలేజిలు ఏర్పాటు చేస్తామని పుష్ప శ్రీ వాణి పేర్కొన్నారు. కురుపాంలో గిరిజన ఇంజనీరింగ్ కాలేజి ఏర్పాటు చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని, త్వరలోనే దానికి ఆయన శంఖుస్థాపన చేయనున్నట్లు పుష్ప శ్రీవాణి వెల్లడించారు. ఎస్టీ, ఎస్సీ, మైనారిటీలకు నామినేటెడ్ పదవులను, అలాగే నామినేషన్ వర్కులలోను యాభై శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ఆర్థిక సాయం అందించే ఉద్దేశ్యంతో వైఎస్సార్ చేయూత పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. దీని కింద ఏడాదికి 18,750 రూపాయలు అందించనున్నట్లు తెలిపారు. ఇందుకోసం వెంటనే తగిన ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారని తెలిపారు. -
వివిధ శాఖలపై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం వివిధ శాఖలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సాంఘిక సంక్షేమం, గిరిజన, మైనారిటీ శాఖలపై జరుగుతున్న సమావేశంలో ఉప ముఖ్యమంత్రులు పుష్ప శ్రీవాణి, అంజాద్ బాషా, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు ఎలక్ట్రిక్ బస్సులపై, సాయంత్రం 4.30 గంటలకు రాజధాని సీఆర్డీఏ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించనున్నారు. కాగా సీఎం జగన్ నిన్న వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్, స్టాంపులు, రవాణా శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. -
కురుపానికి నిధుల వరద పారింది
గత తెలుగుదేశం పాలనలో అన్నింటా నిర్లక్ష్యానికి గురైన కురుపాం నియోజకవర్గానికి నిధుల వరద పారింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి చొరవతో నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులకు కలెక్టర్ హరిజవహర్‌లాల్ ఏసీఏ నిధులు రూ.1.95కోట్లు మంజూరు చేశారు. వీటితో తాగు, సాగు, రహదారుల పనులు చేపట్టనున్నారు. సాక్షి, జియ్యమ్మవలస(విజయనగరం) : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి చొరవతో ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న కురుపాం నియోజకవర్గానికి కలెక్టర్ భారీగా అదనపు కేంద్ర సహాయక నిధులు (ఏసీఏ) మంజూరయ్యాయి. ఈ మేరకు కోటి 94 లక్షల 96వేల రూపాయిలు ఏసీఏ నిధులు మంజూరు చేసినట్టు కలెక్టర్ నుంచి కాపీ అందినట్టు మంత్రి పుష్పశ్రీవాణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తాగునీటికి సంబంధించి ఆర్డబ్ల్యూఎస్ ఈఈ పార్వతీపురం వారి నుంచి 39 పనులకు మంజూరు అనుమతులు వచ్చినట్టు పేర్కొన్నారు. మంజూరైన నిధుల వివరాలను పరిశీలిస్తే... కొమరాడ మండలంలో శివిని గ్రామంలో ఎస్సీ కాలనీకి రూ.4లక్షలు, కోటిపాం పంచాయతీ గదబవలసకు రూ.2.50 లక్షలు, దేవకోన గ్రామానికి రూ.3లక్షలు, పాలెం పంచాయతీ పూజారిగూడకు రూ.3లక్షలు, సీహెచ్ గంగరేగువలసకు రూ.5లక్షలు, కొరిసిల గ్రామానికి రూ.3లక్షలు, మసిమండకు రూ.3లక్షలు, అర్తాం పంచాయతీ సీతమాంబపురానికి రూ.75వేలు మంజూరు చేసినట్టు తెలిపారు. సీసీ రోడ్లు, కాలువ పనులకు కళ్లికోట గ్రామానికి రూ.4.99లక్షలు, మసిమండ పంచాయతీ బల్లపాడు గ్రామానికి రూ.4.99లక్షలు, పెదశాఖ పంచాయతీ చినశాఖకు రూ.4.99లక్షలు మంజూరయ్యాయి. జియ్యమ్మవలస మండలం గవరమ్మపేట పంచాయతీ గవరమ్మపేట కాలనీకి రూ.1.50 లక్షలు, గడసింగుపురం పంచాయతీ ఏనుగులగూడకు రూ.2.50 లక్షలు, బల్లేరుగూడకు రూ.2.50లక్షలు, కుందరతిరువాడ పంచాయతీ నీచుకవలసకు రూ.రూ.5లక్షలు, పిప్పలబద్ర పంచాయతీకి రూ.4.50లక్షలు, పిప్పలబద్ర బీసీ కాలనీకి రూ.4లక్షలు, చినమేరంగి పీడబ్ల్యూఎస్ స్కీం మరమ్మతు పనులకు రూ.3లక్షలు, తుంబలి పంచాయతీ పందులవానివలస గ్రామానికి రూ.1.50లక్షలు, చినమేరంగి ఎస్సీ కాలనీ(పీడబ్ల్యూఎస్) తాగునీటి పథకం మరమ్మతులకు రూ.2లక్షలు మంజూరు అయ్యాయి. సీసీ రోడ్లు, కాలువ పనులకు పెదతోలుమండకు రూ.4.99లక్షలు, పెదదోడిజ గ్రామానికి రూ.4.99 లక్షలు మంజూరయ్యాయి. కురుపాం మండలానికి తాగునీరు పనులు బియ్యాలవలస పంచాయతీ దిమిటిగూడ గ్రామానికి రూ.1.50లక్షలు, గుజ్జువాయి పంచాయతీ వూటచవకగూడ, మరుపల్లి పంచాయతీ వంతరగూడ, మొండెంఖల్ పంచాయతీ మంగళగిరి గ్రామాలకు రూ.2లక్షలు చొప్పున, నీలకంఠాపురం పంచాయతీ కేదారిగూడ గ్రామానికి రూ.1.50లక్షలు, చుక్కుగడిగూడ గ్రామానికి రూ.2లక్షలు, కుంబుమానుగూడ గ్రామానికి రూ.2లక్షలు, నీలకంఠాపురం ఇందిరమ్మ కాలనీకి రూ.3లక్షలు, పెదగొత్తిలి పంచాయతీ జగ్గన్నదొరవలస, కొలిస గ్రామాలకు రూ.2లక్షలు చొప్పున మంజూరు చేశారు. పొడి పంచాయతీ రాజీపేట(తచ్చిడి)కురూ.2లక్షలు, తిత్తిరి పంచాయతీ సీడిగూడ గ్రామానికి రూ.2.50లక్షలు, వలసబల్లేరు పంచాయతీ బండిమానుగూడ గ్రామానికి రూ.1.50లక్షలు మంజూరయ్యాయి. సీసీ రోడ్లు, కాలువలకు మొండెంఖల్లు బస్టాప్ వరకు రూ.4.99 లక్షలు, టీజీ రోడ్డు నుంచి గాంధీనగర్ కాలనీ కురుపాం చివర వరకు రూ.4.99 లక్షలు, దండుసూరకు రూ.4.99 లక్షలు మంజూరు చేశారు. సాగునీటి పనుల కోసం గుజ్జువాయి రిజర్వాయరు పనులకు రూ.20 లక్షలు,గుమ్మలక్ష్మీపురం మండలం కేదారిపురం పంచాయతీ జోబుగూడకు రూ.3లక్షలు, పీ.ఆమిటి కాలనీకి రూ.3లక్షలు, ఎన్‌ఎన్‌పేట కాలనీకి రూ.2.50లక్షలు, చెముడుగూడ పంచాయతీ మసిడిగూడకు రూ.3లక్షలు, దుడ్డుఖల్లు పంచాయతీ కిల్లిగూడకు రూ.2.50లక్షలు, ఎల్విన్‌పేట పంచాయతీ పీబీ కాలనీకి రూ.3లక్షలు, గుమ్మలక్ష్మీపురం పంచాయతీ గడ్డికాలనీకి రూ.4లక్షలు, డుమ్మంగి పంచాయతీ కోరాటగూడకు రూ.3లక్షలు, ఎల్విన్‌పేట పంచాయతీ ఎస్టీ కాలనీకి రూ.3లక్షలు తాగునీటికి మంజూరయ్యాయని తెలిపారు. సీసీ రోడ్ల కోసం కొండవీధి వయా మెట్టవీది టూ గడ్డి కాలనీకి రూ.4.99 లక్షలు, ఏపీఆర్ఎస్ పాఠశాల నుంచి ఆర్‌ఆండ్‌బీ రోడ్డుకు రూ.4.99 లక్షలు మంజూరు చేశారు. గుమ్మలక్ష్మీపురం మండలం బొద్దిడి చెక్‌డ్యాం పనులకు రూ.10లక్షలు, మురడగెడ్డ పనులకు రూ.6లక్షలు, సీమలగూడ ఆనకట్ట పనులకు రూ.6లక్షలు మంజూరు చేసినట్టు పుష్పశ్రీవాణి తెలిపారు. -
గిరిజనుల పక్షపాతి.. సీఎం వైఎస్ జగన్
సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గిరిజనుల పక్షపాతి అని, గిరిజనుల అభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టారని ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి కొనియాడారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విశాఖ జిల్లా అరకు లోయలో శుక్రవారం రాష్ట్ర స్థాయి ఉత్సవాన్ని ఆమె ప్రారంభించారు. అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పుష్పశ్రీవాణి మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వచ్చాక నాలుగున్నరేళ్ల వరకూ గిరిజనులకు మంత్రి పదవి కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఇచ్చిన దుర్మార్గ ప్రభుత్వం కూడా చంద్రబాబుదేనని దుయ్యబట్టారు. తనకు వెన్నుదన్నుగా ఉన్న గిరిజనులకు సీఎం వైఎస్ జగన్ అండగా నిలిచారని తెలిపారు. రూ.66 కోట్లను కేటాయించి పాడేరుకు వైద్య కళాశాలను బహుమతిగా ఇచ్చారన్నారు. 2019–20 బడ్జెట్లో రూ.4,988 కోట్లు కేటాయించారని చెప్పారు. ప్రతి గిరిజన పోస్టుమెట్రిక్ విద్యార్థికి భోజనం, వసతి కోసం ఏటా రూ.20 వేల చొప్పున అందించేందుకు రూ.132.11 కోట్లు కేటాయించారన్నారు. 45 ఏళ్ల వయసు దాటిన గిరిజన మహిళలకు నాలుగు దశల్లో రూ.75 వేల మొత్తాన్ని అందించేందుకు రూ.971 కోట్ల నిధులు ఇచ్చారని వెల్లడించారు. షెడ్యూల్డ్ తెగల ప్రాంతాల్లో గిరిజన యువతకు నూరు శాతం రిజర్వేషన్లను వర్తింపజేసి గ్రామ సచివాలయాల్లో దాదాపు 4,706 పోస్టులను వారికే కేటాయించారన్నారు. వివాహం చేసుకునే గిరిజన వధువులకు రూ.లక్ష చొప్పున సహాయం చేస్తామన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజనులకు రూ.100 కోట్ల మేర ఆర్థిక సహాయాన్ని పుష్పశ్రీవాణి అందజేశారు. రూ.43 కోట్ల అంచనా వ్యయంతో తలపెట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆమె ప్రారంభించారు. రాష్ట్ర పర్యాటక, యువజన సరీ్వసుల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ అరకు, పాడేరు ప్రాంతాలను పర్యాటక ప్రదేశాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజన ఆశ్రమ పాఠశాలలు, గురుకుల విద్యాలయాల విద్యార్థినులు ప్రదర్శించిన జానపద, గిరిజన నృత్య రూపకాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, పాడేరు ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ, మాజీ మంత్రి మత్స్యరాస మణికుమారి, మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు, జిల్లా కలెక్టర్ వి.వినయ్‌చంద్, ఐటీడీఏ పీవో డీకే బాలాజీ, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు. పాడేరులో గిరిజన వైద్య కళాశాల ఆదివాసీలకు సీఎం జగన్ శుభాకాంక్షలు సాక్షి, అమరావతి: ఆదివాసుల కోసం పాడేరులో గిరిజన వైద్య కళాశాల ఏర్పాటు చేస్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెల్లడించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసీ గిరిజనులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ.. ఈ విషయాన్ని వెల్లడించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ట్విట్టర్లో పేర్కొంది. ‘ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివాసీ గిరిజనులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఆదివాసుల కోసం పాడేరులో గిరిజన మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నామని, ఎన్నికల ముందు చెప్పిన ప్రతి హామీ అమలు దిశగా అడుగులేస్తున్నామన్నారు’ అని సీఎంవో ట్వీట్ చేసింది. -
గిరిజన ఆశ్రమ పాఠశాలను సందర్శించిన డిప్యూటీ సీఎం
సాక్షి, విజయనగరం: శృంగవరపుకోట మండలం మూల బొడ్డవర గిరిజన గ్రామంలో అనారోగ్యంతో డిప్పల సింహాచలం అనే గిరిజన బాలుడు మృతి చెందాడు. దీంతో ఏపీ ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమశాఖ మంత్రి పుష్ప శ్రీవాణి మృతుని కుటుంబాన్ని పరామర్శించారు. బాలుడి తల్లి తండ్రులులను ఓదార్చి వారికి తన వంతుగా పాతిక వేల రూపాయలు ఆర్ధిక సాయం అందించారు. అంతేకాక ప్రభుత్వం తరపున రావలసిన సాయాన్ని త్వరలోనే అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం విజయనగరం జిల్లాలోని శృంగవరపుకోటలో బాలుడు చదువుకున్న గిరిజన ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో ఉన్న మౌళిక వసతులను డిప్యూటీ సీఎం పరిశీలించారు. శృంగవరపుకోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, రఘురాజు, నెక్కల నాయుడు బాబు తదితరులు ఆమె వెంట ఉన్నారు. -
డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణిని కలిసిన ఉపాధి హామీ ఉద్యోగులు
-
దేశానికే ఆదర్శ సీఎం వైఎస్ జగన్
సాక్షి, విశాఖపట్నం : గిరిజన మహిళనైన తనను ఉప ముఖ్యమంత్రిని చేసి యావత్ దేశానికే ఆదర్శ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలిచారని ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి అన్నారు. శనివారం మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో పుష్పశ్రీవాణి పుట్టినరోజు వేడుకలు పార్టీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడాతూ.. చిన్నవయసులోనే తనకు పెద్దపదవి అప్పగించి గిరిజన మహిళలు, ప్రజల పట్ల అత్యున్నత గౌరవాన్ని చూపించిన తమ నాయకుడు జగన్మోహన్రెడ్డికి తానెప్పుడూ రుణపడి ఉంటానన్నారు. మేనిఫెస్టో అంటే ప్రజలకు పూర్తి నమ్మకం కలిగే విధంగా ప్రభుత్వపాలన ఉంటుందని పేర్కొన్నారు. అర్హులందరికీ ఇళ్లు రాష్ట్రంలో 25 లక్షల ఇళ్ల నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారన్నారు. కులాలకు, మతాలకు అతీతంగా రాష్ట్రలో సంక్షేమ పథకాలు ప్రజలందరికీ చేరాలన్నారు. రైతుబాంధవుడిగా చెరగని ముద్రవేసుకున్న మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిని ఆదర్శంగా తీసుకుని ‘రైతు భరోసో’ పేరుతో అత్యున్నత సంక్షేమ పథకం సీఎం జగన్మోహన్రెడ్డి అమలు చేశారని తెలిపారు. అక్టోబర్ 15 నుంచి వైఎస్సార్ రైతు భరోసా కింద అర్హులైన రైతులకు రూ.12,500 జమ చేస్తామన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మూడు వారాలు కాకుండానే పదికి పైగా సంక్షేమ పథకాలు అమలుచేశారని కొనియాడారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు 600 పైగా హామీలిచ్చి ఒక్క హామీకూడా పూర్తిగా అమలు చేసిన పాపానపోలేదన్నారు. అందుకే ప్రజలు టీడీపీనీ భూస్థాపితం చేశారని, మరో 25 ఏళ్ల పాటు టీడీపీ మనుగడే ఉండదని జోస్యం చెప్పారు. వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణశ్రీని వాస్ మాట్లాడుతూ మహిళలకు అత్యున్నత స్థానాన్ని కల్పించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కిందన్నారు. కార్యక్రమంలో పాడేరు, అరకు ఎమ్మెల్యేలు కె.భాగ్యలక్ష్మి, చెట్టి పాల్గుణ, అరకు పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు పరీక్షిత్‌రాజు, రాష్ట్ర అధికార ప్రతినిధి జాన్‌వెస్లీ, రాష్ట్ర కార్యదర్శులు సత్తిరామకృష్ణారెడ్డి, సనపల చంద్రమౌళి, రాష్ట్ర అదనపు కార్యదర్శులు రవిరెడ్డి, నడిపల్లి కృష్ణంరాజు, పేర్లవిజయచందర్, మొల్లి అప్పారావు, రాష్ట్ర యువజన విభాగం అధికారప్రతినిధి తుల్లి చంద్రశేఖర్, నగర అనుబంధసంఘాల అధ్యక్షులు కొండారాజీవ్ పాల్గొన్నారు. -
300 కిలోల కేక్ కట్ చేసిన పుష్ప శ్రీవాణి
సాక్షి, విశాఖ: అక్టోబర్ నుంచి రైతు భరోసా పథకం అమలు అవుతుందని ఉపముఖ్యమంత్రి, గిరిజనశాఖ మంత్రి పుష్పశ్రీవాణి తెలిపారు. ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. పార్టీలకు అతీతంగా కుల మత బేధాలు లేకుండా అందరకి సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పారు. పుట్టిన రోజు సందర్భంగా తొలిసారి ఆమె విశాఖలోని వైయస్ఆర్ సీపీ కార్యాలయానికి వచ్చారు. వైఎస్సార్ సీపీ విశాఖ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పుష్ప శ్రీవాణి మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీలను కచ్చితంగా నెరవేరుస్తామన్నారు. ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలను అరికడతామన్నారు. గతంలో గిరిజనులకు ఇచ్చిన మాట తప్పమని, వారి మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యవహరించమని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ, పాడేరు ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మీ, పార్టీ సమన్వయకర్త అక్కరమాని విజయ నిర్మల, యతిరాజుల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు విశాఖలోని ప్రేమ సమాజంలో మంత్రి పుష్ప శ్రీవాణి తన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. అనాథ పిల్లలకు దుస్తులు పంపిణీ చేశారు. తన తొలి వేతనంలో 50 వేల రూపాయలు విరాళంగా ఇస్తున్నట్టు ఆమె ఈ సందర్భంగా ప్రకటించారు. మరోవైపు సొంత నియోజకవర్గం కురుపాంలో మంత్రికి ఘన స్వాగతం లభించింది. జియ్యమ్మవలస మండలం చినమేరంగి గ్రామంలో పుష్ప శ్రీవాణి నివాసంలో ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరిగాయి. 300 కిలోల కేక్‌ను ఆమె కట్ చేశారు. -
పార్టీలకతీతంగా అందరికీ సంక్షేమ పథకాలు
-
అక్టోబర్ నుంచి రైతు భరోసా : పుష్ప శ్రీవాణి
సాక్షి, విశాఖపట్నం : అక్టోబర్ నుంచి రైతు భరోసా పథకం అమలు అవుతుందని ఉపముఖ్యమంత్రి, గిరిజనశాఖ మంత్రి పుష్పశ్రీవాణి తెలిపారు. పార్టీలకు అతీతంగా కుల మత బేధాలు లేకుండా అందరకి సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పారు. పుట్టిన రోజు సందర్భంగా తొలిసారి ఆమె విశాఖలోని వైఎస్సార్సీపీ కార్యాలయానికి వచ్చారు. వైఎస్సార్సీపీ విశాఖ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రేమ సమాజాన్ని సందర్శించి పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పుష్ప శ్రీవాణి మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీలను కచ్చితంగా నెరవేరుస్తామన్నారు. ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానన్నారు. ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలను అరికడతామన్నారు. గతంలో గిరిజనులకు ఇచ్చిన మాట తప్పమని, వారి మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యవహరించమని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ, పాడేరు ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మీ, పార్టీ సమన్వయకర్త అక్కరమాని విజయ నిర్మల, యతిరాజుల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ జగన్ చరిత్రలో నిలిచిపోతారు: పుష్పశ్రీవాణి
సాక్షి, అమరావతి : గిరిజన శాఖ మంత్రిగా డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె ....గిరిజన గ్రామాల్లో ఆరోగ్య కార్యకర్తల వేతనాలను రూ.400 నుంచి రూ.4వేలకు పెంచుతూ తొలి సంతకం చేశారు. గిరిజన ప్రాంతాల్లో మార్కెట్ యార్డుల అభివృద్ధికి రూ.19 కోట్లు విడుదల చేస్తూ ఆమె రెండో సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'గిరిజన సంక్షేమ శాఖ లో పారదర్శక పాలన అందించి, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నమ్మకాన్ని నిలబెట్టుకుంటా' అన్నారు. గిరిజనులకి ఇచ్చిన ప్రతి ప్రభుత్వ పథకాన్ని, హామీని నెరవేర్చి గిరిజనుల ఆత్మ గౌరవాన్ని, ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిస్తామన్నారు. గిరిజన ప్రాంతంలో విద్యావకాశాలు మెరుగుపరిచి, గిరిజన ఆడపిల్లలకి వైఎస్సార్ పెళ్లికానుక కింద లక్ష రూపాయలు అందిస్తామన్నారు. గతంలో చంద్రబాబు గిరిజనులని అంటరాని వారిగా చూసి మంత్రి పదవి ఇవ్వలేదని, గిరిజనులని ఉప ముఖ్యమంత్రి చేసిన జగన్మోహన్రెడ్డి చరిత్రలో నిలిచిపోతారన్నారు. -
గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పుష్పశ్రీవాణి బాధ్యతల స్వీకరణ
-
హెల్త్ వర్కర్ల వేతనాలు 400 నుంచి 4 వేలకు పెంపు
సాక్షి, అమరావతి: గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి గిరిజన గ్రామాల హెల్త్ వర్కర్ల వేతనాలు 400 నుండి 4 వేలకు పెంచుతూ తొలి సంతకం చేసింది. ఈ కార్యక్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్యేలు కోలగట్ల, భాగ్యలక్ష్మి, జోగరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'గిరిజన సంక్షేమ శాఖ లో పారదర్శకమయున పాలన అందించి, జగన్మోహన్ రెడ్డి నమ్మకాన్ని నిలబెట్టుకుంటా' అన్నారు. గిరిజనులకి ఇచ్చిన ప్రతి ప్రభుత్వ పథకాన్ని, హామీని నెరవేర్చి గిరిజనుల ఆత్మ గౌరవాన్ని, ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిస్తామన్నారు. గిరిజన ప్రాంతంలో విద్యావకాశాలు మెరుగుపర్చి, గిరిజన ఆడ పిల్లలకి వైఎస్సార్ పెళ్లికానుక కింద లక్ష రూపాయలు అందిస్తామన్నారు. గతంలో చంద్రబాబు గిరిజనులని అంటరాని వారిగా చూసి మంత్రి పదవి ఇవ్వలేదని, గిరిజనులని ఉప ముఖ్యమంత్రి చేసిన జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారన్నారు. -
నవరత్నాలు అమలు దిశగా ప్రభుత్వ నిర్ణయాలు
విజయనగరం గంటస్తంభం : నవరత్నాల హామీలను వందశాతం అమలుచేసే దిశగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని, గవర్నర్ తన ప్రసం గంలో ఈ విషయం స్పష్టం చేశారని ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి అన్నారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక శనివారం తొలిసారిగా సొంత జిల్లాకు వచ్చిన ఆమె ఇక్కడి జెడ్పీ అతిథి గృహంలో మీడియాతో మాట్లాడారు. అవినీతి రహిత పాలన అందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని, అవినీతి ఎక్కడ జరిగినా ఉపేక్షించేది లేదని స్పష్టంచేశారు. వలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాలను లబ్ధిదారుల ఇళ్లకే నేరుగా అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందన్నారు. కుల, మత, రాజకీయాలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తామని వివరించారు. రాష్ట్రంలో గిరిజన సంక్షేమం, అభివృద్ధికోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకునేందుకైనా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సిద్ధంగా ఉన్నారని ఆమె చెప్పారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ హరిజవహర్‌లాల్, పార్వతీపురం, నెల్లిమర్ల ఎమ్మెల్యేలు అలజంగి జోగారావు, బడ్డుకొండ అప్పలనాయుడు పాల్గొన్నారు. -
ఇచ్చిన ప్రతిహామీని సీఎం వైఎస్ జగన్ నేరవేరుస్తారు
-
సభలో భావోద్వేగానికి గురైన పుష్పశ్రీవాణి
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసనసభలో డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి భావోద్వేగానికి గురయ్యారు. స్పీకర్‌కు ధన్యవాద తీర్మానం సందర్భంగా ఆమె గురువారం సభలో కంటతడి పెట్టారు. ఒక గిరిజన మహిళ అయిన తనను డిప్యూటీ సీఎంగా నియమించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశానికే ఆదర్శంగా నిలిచారని పుష్పశ్రీవాణి పేర్కొన్నారు. అట్టుడుగు వర్గాల గొంతు కూడా చట్టసభల్లో వినిపించేలా అవకాశం కల్పించారన్నారు. అదేవిధంగా గత సభలో విలువలు, విశ్వసనీయతకు పాతర వేశారని, ఈ సభ గొప్పగా నడుస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. అ సందర్భంగా పుష్పశ్రీవాణి మాట్లాడుతూ...‘ముందుగా స్పీకర్‌గా ఎన్నికైనందుకు అభినందనలు. మీరు మా పక్క జిల్లాకు చెందిన వ్యక్తి. అలాంటి మీరు స్పీకర్‌గా ఎన్నికైనందుకు సంతోషంగా ఉంది. మిమ్మల్ని స్పీకర్‌గా ఎంపిక చేసినందుకు ముఖ్యమంత్రికి కూడా ధన్యవాదాలు. స్పీకర్ అంటే ఇక్కడున్నటువంటి 174 మంది సభ్యులకు కూడా మీరు కుటుంబ పెద్దలాంటి వారు. ఆరుసార్లు శాసన సభకు ఎన్నికై..మంత్రిగా అనేక సంవత్సరాలుగా పని చేసిన మీకు స్పీకర్ పదవి అప్పగించడం సహేతుకంగా భావిస్తున్నాను. చట్టసభలపై, రాజ్యంగంపై మీకు సంపూర్ణమైన అవగాహన ఉంది. మీరు ఈ సభను గొప్పగా నడిపిస్తారని నమ్మకం ఉంది. పరిపాలన, ప్రజా సమస్యలపై మీకు పూర్తిగా పట్టు ఉంది కనుక మీరు విజయవంతంగా పని చేస్తారని ఆకాంక్షిస్తున్నాను. నేను రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. మొదటిసారి ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో అడుగుపెట్టాను. అయితే ఈ సభలో విలువలు, విశ్వసనీయతను గత సభలో చూడలేకపోయాం. రాజ్యాంగ విలువలు దెబ్బతీసిన తీరు చూసి బాధపడ్డాను. ఇదే సభలో అప్పుడు చిన్న వయసులో ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి చూపిన తీరు చూసి గర్వపడ్డాను. ఏ సభలో అయితే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారో అదే సభను గొప్పగా నడిపిస్తారని ఆశిస్తున్నాను. మా నాయకుడు వైఎస్ జగన్ నాయకత్వంలో ఈ సభ దేశంలోనే గర్వంగా ముందుకు వెళ్తుందని ఆశిస్తున్నాను. ప్రజా గొంతుకను గర్జనలా వినిపించిన మీరు ఐదుకోట్ల ప్రజల గొంతుకను వినిపిస్తారని సంపూర్ణ నమ్మకం ఉంది. ఎంతో గొప్ప ఆదర్శాలకు మన ముఖ్యమంత్రి స్వీకారం చుట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించారు. ఒక గిరిజన మహిళ అయిన నన్ను ఒక ఉప ముఖ్యమంత్రిగా చేసి దేశానికే గొప్ప సంకేతాన్ని పంపించారు. అదే స్పూర్తితో మీరు గిరిజనులకు ప్రాతినిధ్యం వహిస్తున్న మాకు గొప్ప అవకాశం ఇచ్చి గిరిజన అభివృ ద్ధికి సహకరించాలని కోరుతున్నాను. ఆనాటి సభలో మహిళా ఎమ్మెల్యే అయిన ఆర్కే రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేసిన తీరును చూశాం. మహిళల సమస్యలను మీ వద్ద విన్నవించుకునే అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం. ప్రతిపక్ష నాయకుడికి కూడా మైక్ ఇవ్వని సాంప్రదాయం చెరిపి..ఈ సభలో అందరికి మైక్ ఇచ్చి మాట్లాడే అవకాశం కల్పించాలని కోరుతున్నాను. మిమ్మల్ని స్పీకర్‌గా ఎన్నిక చేసినందుకు బడుగు, బలహీన వర్గాల నాయకుడు వైయస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.’ అని అన్నారు. -
ఎమ్మెల్యేలుగా ఎన్నికైన మేము
సాక్షి, విజయనగరం: రాష్ట్ర శాసనసభలో విజయనగరం జిల్లా కళకళ లాడింది. జిల్లాకు చెందిన తొమ్మిదిమంది ఎమ్మెల్యేలూ వైఎస్సార్సీపీవారే కావడం ఒక ఎత్తయితే... అందులో ఒకరు డిప్యూటీ సీఎం కావడం మరో ప్రత్యేకత. అంతేకాదు... రాష్ట్రంలోని సీఎం, ప్రతిపక్షనేతతో సహా అందరు ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించే ప్రొటెం స్పీకర్ శంబంగి మన జిల్లావారు కావడం మరో విశేషం. మొత్తమ్మీద రాష్ట్ర శాసనసభ చరిత్ర పుటల్లో మరోసారి విజయనగరం జిల్లాకు సముచిత స్థానం లభించడం ఈ జిల్లావాసులకు గర్వకారణం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదిహేనవ శాసన సభ బుధవారం కొలువుతీరింది. విజయనగరం జిల్లాకు ఆదినుంచీ రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఈ జిల్లా నుంచే ఉద్దండులైన ఎందరో రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పారు. ఇన్నాళ్లూ జిల్లాకు ఉన్న గుర్తింపు ఒకెత్తయితే ఇప్పుడు వచ్చిన గుర్తింపు మరొకెత్తు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ జిల్లాలోని విజయనగరం పార్లమెంట్‌తో పాటు, తొమ్మిది అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుని దేశం దృష్టిని ఆకర్షించింది. క్లీన్‌స్వీప్ చేసిన జిల్లాకు రెండు మంత్రి పదవులను ఇచ్చి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సముచిత స్థానం కల్పించారు. అక్కడితో ఆగిపోకుండా ఉపముఖ్యమంత్రి పదవిని కూడా జిల్లాకే కేటాయించి మరింత గౌరవాన్ని పెంచారు. అప్పటికీ సరిపెట్టకుండా సీఎంతో పాటు, అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలతో ప్రమాణస్వీకారం చేయించే ప్రొటెం స్పీకర్ బాధ్యతను జిల్లాకు చెందిన ఎమ్మెల్యేకు అప్పగించి రాష్ట్రంలోనే జిల్లాకు ప్రత్యేక స్థానం కల్పించారు. దీంతో శాసనసభలో విజయనగరం జిల్లా ప్రత్యేకంగా కనిపించింది. జిల్లా మంత్రులు బొత్స సత్యనారాయణ, పాముల పుష్పశ్రీవాణి, ఎమ్మెల్యేలు పీడిక రాజన్నదొర, కోలగట్ల వీరభద్రస్వామి, బొత్స అప్పలనరసయ్య, బడ్డుకొండ అప్పలనాయుడు, కడుబండి శ్రీనివాసరావు, అలజంగి జోగారావు చేత ప్రొటెం స్పీకర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పలనాయుడు ప్రమాణ స్వీకారం చేయించారు. నిలిచిన శంబంగి ఆత్మగౌరవం రాష్ట్ర శాసనసభలో ప్రమాణస్వీకారోత్సవాన్ని మాత్రమే అందరూ చేశారు. అయితే ప్రొటెం స్పీకర్ స్థానంలో ఉన్న శంబంగి వెంకట చినఅప్పలనాయుడు మాత్రం తన ఆత్మగౌరవాన్ని తలెత్తుకునేలా చేశారు. విషయం ఎమిటంటే శంబంగి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఆయన ఆత్మగౌరవాన్ని చంద్రబాబు దెబ్బతీశారు. అప్పట్లో హైదరాబాద్‌లో ఒక ఎమ్మెల్యే, తెర్లాంలో ఒక ఎమ్మెల్యే చనిపోయారు. బై ఎలక్షన్ వచ్చింది. నామినేషన్‌కు ఆఖరి రోజు వరకు టీడీపీ అధ్యక్షుడి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు అభ్యర్థి పేరు ప్రకటించలేదు. నామినేషన్ ముందురోజు ఫోన్ చేసి ఫలానా వ్యక్తిని అభ్యర్థిగా వేస్తున్నట్లు శంబంగికి చెప్పారు. ఆయనకు ఏ ప్రాతిపదికన టిక్కెట్ ఇచ్చారని, మీరు తీసుకున్న నిర్ణయం కూడా తప్పని చంద్రబాబుకి చెప్పినా వినలేదు. ఒకసారి వచ్చి సమస్య పరిష్కరించాల్సిందిగా అర్థించారు. రావడానికి తనకు ఖాళీ లేదన్నారు చంద్రబాబు. ఇది రాజకీయ సమస్య కాబట్టి మీరు ఒకసారి ఖాళీ చేసుకుని రావాల్సిందేనని శంబంగి నచ్చజెప్పినా తనకు ఖాళీ అయ్యాక చెబుతానంటూ నిర్లక్ష్యంగా చంద్రబాబు బదులిచ్చారు. ఆ మాటకు నొచ్చుకున్న శంబంగి తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన పార్టీలో కొనసాగలేనంటూ టీడీపీని వదిలి బయటకు వచ్చేశారు. ఇప్పుడు ప్రొటెం స్పీకర్ హోదాలో ఉన్న శంబంగి ప్రతిపక్ష పార్టీ నేతగా ఉన్న చంద్రబాబు చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం చంద్రబాబు ప్రొటెం స్పీకరైన శంబంగి వద్దకు వెళ్లి చేతులు పట్టుకుని మరీ అభివాదం చేశారు. -
ఏపీ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన పుష్పశ్రీవాణి
-
కలకంటి కన్నీరు...
ఓ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యురాలామె. వేలాదిమంది గిరిజనులకు ప్రతినిధి ఆమె. పల్లె పల్లెలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తనవిగా భావించి వాటిపై పోరాడారు. పదవి చేపట్టినప్పటినుంచి ప్రజల మధ్యే ఉంటూ... వారి బాగోగులకోసం పరితపించారు. వారికి సౌకర్యాలు కల్పించేందుకు అహర్నిశలూ పాటుపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నా... తనవారికోసం రోడ్డెక్కారు. అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారు. వారి సమస్యలు పరిష్కరించారు. అందుకే ఆమె ఇప్పుడు ఆ గిరిజనులందరికీ ఆడబిడ్డ అయ్యారు. ఆమెను తమ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు. ఇదే అక్కడి టీడీపీ పెద్దలకు కంటగింపుగా మారింది. ఆమె ఉన్నంతవరకూ ఇక వేరెవ్వరూ గెలవలేరని నిర్ధారించుకున్నారు. ఎలాగైనా ఆమెను మట్టుపెట్టాలని యత్నించారు. అందులో భాగమే చినకుదమలో సాగిన దౌర్జన్యకాండ. సాక్షి ప్రతినిధి విజయనగరం: ఓ మహిళా ప్రజాప్రతినిధి కన్నీరు పెట్టుకున్నారు. ఆమె సామాన్య వ్యక్తి కాదు. ఓ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే పుష్పశ్రీ‘వాణి. తాజాగా జరిగిన ఎన్నికల్లోనూ వైఎస్సార్సీపీ తరఫున పోటీచేసి విజయానికి చేరువలో ఉన్నారు. అయినా ఆమెకు జరిగిన అన్యాయాన్ని పట్టించుకునే అధికారులు కరువయ్యారు. ఆమెపై హత్యాయత్నం జరిగితే దానిపై చురుకైన దర్యాప్తు సాగడం లేదు. కనీసం ఏమాత్రం చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కానరావడం లేదు. అదే ఆమె ఆవేదనకు కారణమైంది. రాజకీయంగా ఎదుర్కొనలేక ఇంతలా తనపై హత్యాయత్నానికి పాల్పడతారా... ఆ సంఘటనను పోలీసులు తీవ్రంగా పరిగణించకుండా మీనమేషాలులెక్కిస్తారా అన్నది ఆమె వాదన. అదే విషయాన్ని ఆమె మంగళవారం విజయనగరంలోని మీడియాముందుకొచ్చి తనకు జరిగిన పరాభవాన్ని కన్నీటిపర్యంతమవుతూ చెప్పారు. అసలేం జరిగింది.... కురుపాం నియోజకవర్గం జియ్యమ్మవలస మండలం కుదమ పంచాయతీ చినకుదమ గ్రామంలో పోలింగ్ బూత్ నంబర్ 152లో ఈ నెల 11వ తేదీన ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ రిగ్గింగ్‌కు పాల్పడింది. జెడ్పీటీసీ భర్త డొంకాడ రామకృష్ణ ఆధ్వర్యంలో సాగుతున్న ఈ దందా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి తన భర్త అరకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు పరీక్షిత్‌రాజును తీసుకుని అక్కడకు చేరుకున్నారు. దీనిపై ప్రిసైడింగ్ అధికారితో మాట్లాడేందుకు యత్నించారు. ఇదే అదనుగా భావించిన ప్రత్యర్థి వర్గానికి చెందిన కొందరు వారిపై దాడికి పాల్పడ్డారు. భయంతో వారు లోపలికి వెళ్లగానే ఆ పోలింగ్ కేంద్రాన్ని చుట్టుముట్టారు. కర్రలు, మారణాయుధాలతో పోలింగ్ కేంద్రంలో ఉన్నవారిని హతమార్చేందు కు యత్నించారు. హఠాత్పరిణామంతో దిక్కుతో చని వారు దాదాపు మూడుగంటలపాటు అందులోనే ఉండిపోవాల్సి వచ్చింది. బయటకు రావడానికి ప్రయత్నించినా ప్రాణాలు తీసేందుకు సిద్ధం గా ఉన్నారని భావించి పోలీసులు సైతం వారిని అక్కడినుంచి రానివ్వలేదు. చివరకు ఆమె జిల్లా పోలీసు యంత్రాంగంతో మాట్లాడిన అనంతరం అడిషనల్ ఎస్పీ ప్రత్యేకబలగాలతో అక్కడకు చేరుకుని వారిని సురక్షితంగా ఇంటికి చేర్చగలిగారు. జిల్లాలో అన్నిచోట్లా...టీడీపీ అకృత్యాలు జిల్లాలో మునుపెన్నడూ లేని విపరీత పరిణామాలకు తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల సందర్బంగా తెర తీసింది. వైఎస్సార్సీపీని ఎలాగైనా దెబ్బ తీ సేందుకు శాయశక్తులా ప్రయత్నం చేసింది. పథకం ప్రకారం ప్రతిపక్షపార్టీ సానుభూతిపరుల ఓట్లను తొలగించింది. పార్టీ కార్యకర్తలను భయాందోళనలకు గురి చేసింది. నాయకులను ప్రలోభ పెట్టింది. ప్రతిపక్షానికి ఓట్లు పడతాయనుకున్న పోలింగ్ బూత్‌లలో ఉద్రిక్తత పరిస్థితులు కల్పించారు. సాలూరు నియోజకవర్గం నేరెళ్లవలస పోలింగ్ కేంద్రాల పరిధిలోని కొఠియా గ్రామాల గిరిజనులు ఆనాదిగా వైఎస్సార్సీపీకే ఓట్లు వేస్తున్నారు. ఈసారి వారిఓట్లు వైఎస్సార్సీపీకి పడకుండా చేయాలన్న ఉద్దేశంతో పోలింగ్ అధికారులతో కలిసి టీడీపీ వర్గీయులు అడ్డుకున్నారు. ఈ ప్రాంతంతో పాటు మిగిలిన గిరిజన ప్రాంతాల్లో అమాయక గిరిజనులకు పదిరోజుల ముందు నుంచి మద్యం సరఫరాను భారీగా చేస్తూ పోలింగ్ రోజు వారు ఓటు వేసేందుకు కూడా రాలేని విధంగా మద్యం మత్తులో ముంచేశారు. బొబ్బిలిలో ఏకంగా వైఎస్సార్సీపీ పోలింగ్ ఏజెంట్లపైనే దాడులకు తెగబడ్డారు. కురుపాంలో పలు పోలింగ్ కేంద్రాల్లో వైఎస్సార్సీపీకి ఓటేస్తున్న వారిపై దౌర్జన్యానికి దిగి విచక్షణా రహితంగా కొట్టడంతో పాటు వారివద్ద ఉన్న సెల్ఫోన్లు సైతం లాక్కున్నారు. జిల్లాలో మరికొన్ని చోట్ల గొడవలు సృష్టించి వైఎస్సార్ సీపీ నాయకులను భయపెట్టేందుకు ప్రయత్నించారు. అధికార పార్టీకి పోలీసులు సైతం వత్తాసు పలికారు. వాహన తనిఖీల్లోనూ పక్షపాత వైఖరిని చూపారు. ఈ విధంగా జిల్లాలో మునుపెన్నడు లేనట్లుగా టీడీపీ అరాచకాలకు పాల్పడింది. ఇంత చేసినా ఎన్నికల రోజు ఓటింగ్ సరళిని చూసి కంగుతింది. వైఎస్సార్సీపీకే ఓటర్లు పట్టం కడుతున్నారన్న విషయం స్పష్టమైంది. ఓటమికి చేరువవుతున్నామనే ఉక్రోషం వారిలో విచక్షణను దెబ్బతీసింది. అందుకే వారి పరపతిని వినియోగించి వైఎస్సార్సీపీ చేసిన ఫిర్యాదులను నీరుగార్చేలా చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇన్నాళ్లయినా... చర్యలేవీ... ఈ సంఘటనపై ఆ మరునాడే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ ఇప్పటివరకూ బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో వారు మీనమేషాలు లెక్కిస్తున్నారు. సంఘటన జరిగి అయిదు రోజులైనా నిందితులెవరినీ అదుపులోకి తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు ఎమ్మెల్సీ శత్రుచర్ల విజయరామరాజు పోలీస్ ఉన్నతాధికారులను కలవడం మరింత చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో తనకు న్యాయం చేయాలంటూ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి దంపతులు జిల్లా వైఎస్సార్సీపీ నాయకులతో కలసి కలిసి డీఐజీ జి.పాలరాజు, ఎస్పీ ఎ.ఆర్.దామోదర్‌ను మంగళవారం కలసి వినతిపత్రాలు అందజేశారు. న్యాయం చేయాలని కోరారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ తనపై జరిగిన దాడిపై కన్నీటిపర్యంతమవుతూ వివరించారు. -
కేసును పక్కదారి పట్టిస్తున్నారు..
విజయనగరం టౌన్: తనను హత్య చేసేందుకే మాజీమంత్రి శత్రుచర్ల విజయరామరాజు కుట్ర పన్ని దాడులు చేయించారని కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 11న కురుపాం నియోజకవర్గం చినకుదమ గ్రామంలో తనపై జరిగిన దాడికి సంబంధించి కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని, కేసును పక్కదారి పట్టించకుండా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి, దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతూ విశాఖ రేంజ్ డీఐజీ జి.పాలరాజును, ఎస్పీ ఎఆర్.దామోదర్‌ను మంగళవారం వారి చాంబర్లో కలిసి ఆమె వినతిపత్రం అందజేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు పెనుమత్స సాంబశివరాజు, ఎమ్మెల్సీ, పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి, విజయనగరం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్, అరకు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, గజపతినగరం నియోజకవర్గ సమన్వయకర్త బొత్స అప్పలనరసయ్య, నెల్లిమర్ల నియోజకవర్గ సమన్వయకర్త బడ్డుకొండ అప్పలనాయుడు, పార్వతీపురం నియోజకవర్గ సమన్వయకర్త అలజంగి జోగారావు ఉన్నారు. ఈ మేరకు డీఐజీ, ఎస్పీలు మాట్లాడుతూ పూర్తి స్థాయిలో విచారణ చేయించి, నిందితులను అదుపులోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి మీడియాతో మాట్లాడుతూ ఏప్రిల్ 11న తనపై జరిగిన దాడికి సంబంధించిన విషయంలో ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీ పాపారావు అనుసరిస్తున్న వైఖరిపై తమకు అనుమానం ఉందనీ, ఆయన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయనీ, అందువల్ల తనకు ఆ ఇన్విస్టిగేషన్ వల్ల, అధికారి వల్ల న్యాయం జరగదని భావించి డీఐజీ, ఎస్పీలను కలిశామన్నారు. ఏప్రిల్ 11న తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, చిన్నకుదమ బూత్ నంబరు152లో రిగ్గింగ్ జరుగుతుందనే సమాచారంతో అక్కడున్నటువంటి పీఓతో, ఇక్కడ రిగ్గింగ్ జరుగుతుందని ఫిర్యాదు చేసేందుకు తాను వెళ్లిన సందర్భంలో అక్కడున్నటు జెడ్పీటీసీ భర్త డొంకాడ రామకృష్ణ , ఆయన మనుషులు విజయరామరాజు ప్రోత్బలంతో తనపై తీవ్రమైన దాడి చేశారన్నారు. ఒక గిరిజన మహిళా ఎమ్మెల్యే అని కూడా చూడకుండా తీవ్రంగా గాయపరిచి తనను, తన భర్తను చంపించే ప్రయత్నం జరిగిందన్నారు. ఆ విజువల్స్ పోలీసు శాఖకు అందజేశామన్నారు. మూడు గంటల పాటు నిర్బంధించి, కరెంటు తీసి, చిత్రహింసలు పెట్టి, రాళ్లతో, సుత్తులతో కొట్టి, భయాందోళనకు గురి చేశారన్నారు. ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి భర్త, అరకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు మాట్లాడుతూ రిగ్గింగ్ జరుగుతుందని వెళితే జెడ్పీటీసీ భర్త డొంకాడ రామకృష్ణ రిగ్గింగ్‌కి పాల్పడుతున్నారన్నారు. దారుణంగా రిగ్గింగ్ చేస్తున్నారని నిలదీస్తే అటాక్ చేశారని, ఊర్లోని అందరినీ రెచ్చగొట్టి, తమపై దాడులు చేశారన్నారు. ఎమ్మెల్యే మహిళా అని చూడకుండా గాయపరిచారని, శత్రుచర్ల ఆయన వాహనంతో వచ్చి బూత్‌ని ఆక్రమించేశారన్నారు. తమ కుటుంబానికి తగు రక్షణ కల్పిండంతో పాటు కేసును త్వరితగతిన విచారణ చేయించి నిందితులపై కఠిన చర్యలు చేపట్టాలని కోరారు. వారి వెంట పార్టీ రాష్ట్ర కార్యదర్శి జమ్మాన ప్రసన్నకుమార్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్ కుమార్, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి అంబళ్ల శ్రీరాముల నాయుడు, జి.సూరపురాజు, ఎమ్ఎల్ఎన్.రాజు (హర్షరాజు) తదితరులున్నారు. ఫిర్యాదు చేస్తే... తాము ఫిర్యాదు ఇస్తే ఈ రోజు వరకూ ఎటువంటి చర్య లేదని, నిన్న విజయరామరాజు డీఎస్పీని కలిసిన తర్వాత, నేను ఈ రోజు కలిసిన తర్వాత ఆయన మాటల్లో వ్యత్యాసం కనిపించిందన్నారు. తనపై జరిగిన దాడిపై తమకు న్యాయం జరగదని భావించి, మహిళా ఎమ్మెల్యేకే భద్రత లేదంటే సామాన్యులకు ఇంకెక్కడ ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం జరిగే వరకూ ఎంతవరకైనా వెళతామన్నారు. జెడ్పీటీసీ భర్త డొంకాడ రామకృష్ణ ఆ గ్రామంలో ప్రజలకు అబద్దాలు చెప్పి, తాను దాడి చేశానని చెప్పి రెచ్చగొట్టారని తెలిపారు. -
నన్ను హత్య చేసేందుకు కుట్ర పన్నారు
-
‘నా హత్యకు కుట్ర పన్నింది ఆయనే’
సాక్షి, విజయనగరం : పోలింగ్ సందర్భంగా ఈనెల 11న జియ్యమ్మవలస మండలం చినకుదమ గ్రామంలో తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ కురుపాం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పుష్పశ్రీవాణి డీఐజీ పాలరాజు, ఎస్పీ దామోదర్‌లకు వినతిపత్రం సమర్పించారు. తనపై దాడికి పాల్పడిన డొంకాడ రామకృష్ణ, ఇతర టీడీపీ నేతలపై ఆమె ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఒక ఎమ్మెల్యేకే రక్షణ లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని కన్నీటి పర్యంతమయ్యారు. తనని హత్య చేసేందుకు మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కుట్ర పన్నారని ఆరోపించారు. ఒక మహిళా ఎమ్మెల్యేపై దాడి జరిగినా ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం విచారకరమన్నారు. తనకి న్యాయం జరుగుతుందనే నమ్మకం లేదని.. అయితే న్యాయం కోసం ఎంతవరకైనా వెళ్లే ధైర్యం ఉందని పుష్ప శ్రీవాణి పేర్కొన్నారు. కాగా డొంకాడ రామకృష్ణపై ఫిర్యాదు చేసే క్రమంలో ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణితో పాటు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, మాజీ ఎమ్మెల్యేలు బొత్స అప్పలనర్సయ్య, బడుకొండ అప్పలనాయుడు, పెన్మత్స సాంబశివరాజు, పార్వతీపురం అభ్యర్థి అలజంగి జోగారావు., జిల్లా ఎస్సీ సెల్ ఇంచార్జ్ పి. జైహింద్ కుమార్ కూడా డీఐజీ పాలరాజును కలిశారు. ఇక టీడీపీ నేతలు పుష్పశ్రీవాణి, ఆమె భర్త పరీక్షిత్ రాజుపై హత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. రిగ్గింగ్‌ను అడ్డుకునేందుకు వెళ్లిన మహిళా ఎమ్మెల్యేపైనే ఏకంగా దాడికి తెగబడ్డారు. ఆమె భర్తపైనా దాడికి పాల్పడి వారి అనుచరులతో సహా ఓ గదిలో నిర్బంధించారు. దీంతో ఎమ్మెల్యే దంపతులు మూడు గంటల పాటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని చీకటి గదిలో గడిపారు. గాలి, వెలుతురు లేని ఆ గదిలో పుష్పశ్రీవాణి స్పృహ తప్పి పడిపోయారు. అప్పుడు కూడా ఆమెను ఆస్పత్రికి తరలించేందుకు అవకాశం ఏర్పడలేదు. చాలా సమయం తరువాత ఏఎస్పీ రాకతో స్థానిక మీడియా, వైద్యులు చేరుకున్నారు. ఎమ్మెల్యేకు ప్రాధమిక చికిత్స అందించిన అనంతరం పోలీసు బలగాల భద్రత నడుమ వారిని, వారితో ఉన్న అనుచరులను రక్షించి క్షేమంగా ఇంటికి తరలించారు. -
పక్కా స్కెచ్‌తోనే నాపై దాడి: పుష్ప శ్రీవాణి
సాక్షి, విజయనగరం : ఎన్నికల పోలింగ్ రోజు తనపై జరిగిన దాడి యాదృచ్ఛికం కాదని కురుపాం వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి పుష్పశ్రీవాణి ఆందోళన వ్యక్తం చేశారు. భౌతికంగా తనను అడ్డు తొలగించుకోవడానికి తెలుగు దేశం పార్టీ నేతలు పక్కా ప్రణాళికతో చేసిన కుట్ర దాగుందన్న అనుమానం వ్యక్తం చేశారు. కేవలం ఓటమి భయంతోనే పచ్చ పార్టీ నేతలు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని.. ఈ వ్యవహారంలో దోషులకు శిక్ష పడేంతవరకూ వదిలిపెట్టేది లేదని పుష్ప శ్రీవాణి స్పష్టం చేశారు. చదవండి...(ఎన్నికల... దౌర్జన్యకాండ) పుష్ప శ్రీవాణి దంపతులకు పరామర్శ కాగా టీడీపీ నేతలు కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి, ఆమె భర్త పరీక్షిత్ రాజుపై హత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. రిగ్గింగ్‌ను అడ్డుకునేందుకు వెళ్లిన మహిళా ఎమ్మెల్యేపైనే ఏకంగా దాడికి తెగబడ్డారు. ఆమె భర్తపైనా దాడికి పాల్పడి వారి అనుచరులతో సహా ఓ గదిలో నిర్బంధించారు. దీంతో ఎమ్మెల్యే దంపతులు మూడు గంటల పాటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని చీకటి గదిలో గడిపారు. గాలి, వెలుతురు లేని ఆ గదిలో పుష్పశ్రీవాణి స్పృహ తప్పి పడిపోయారు. అప్పుడు కూడా ఆమెను ఆస్పత్రికి తరలించేందుకు అవకాశం ఏర్పడలేదు. చాలా సమయం తరువాత ఏఎస్పీ రాకతో స్థానిక మీడియా, వైద్యులు చేరుకున్నారు. ఎమ్మెల్యేకు ప్రాధమిక చికిత్స అందించిన అనంతరం పోలీసు బలగాల భద్రత నడుమ వారిని, వారితో ఉన్న అనుచరులను రక్షించి క్షేమంగా ఇంటికి తరలించారు. -
కురుపాంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పుష్ప శ్రీవాణి ప్రచారం
-
తుంబలిలో ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి ఎన్నికల ప్రచారం
-
జగనన్నను గెలిపించుకుందాం...
విజయనగరం, గుమ్మలక్ష్మీపురం: రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగన్మోహన్రెడ్డిని గెలిపించుకుందామని కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి అన్నారు. వైఎస్సార్ సీపీ అరకు పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజుతో కలిసి మండలంలోని మారుమూల గ్రామాలైన ఎస్టీ గొయిపాక, ఎస్సీ గొయిపాక, పుసాబడి, బబ్బిడి, దిగువ చోరుపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో నిన్ను నమ్మం బాబు కార్యక్రమం పేరుతో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే గిరిజన ప్రజలతో మాట్లాడారు. నాలుగున్నరేళ్లుగా పేదలను అష్టకష్టాలు పెట్టిన చంద్రబాబు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మళ్లీ పేదల పల్లవీ ఎత్తుకున్నారన్నారు. నవరత్నాల పథకాలను కాపీ కొడుతూ..ప్రజలను మరో మారు మభ్యపెట్టేందుకు చూస్తున్నారన్నారు. బడుగు, బలహీన, మైనార్టీ వర్గాల జీవితాల్లో వెలుగులు నింపేందుకు జగన్ కృతనిశ్చయంతో ఉన్నారని గుర్తుచేశారు. చంద్రబాబు మాయలో పడి మరోసారి మోసపొద్దని కోరారు. అప్రమత్తంగా ఉండాలి... పోలింగ్ బూత్ కమిటీ సభ్యులంతా అప్రమత్తంగా ఉండాలని కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి అన్నారు. శనివారం ఆమె గొయిపాక, పుసాబడి, బబ్బిడి, దిగువ చోరుపల్లి గ్రామాలను సందర్శించిన సందర్భంగా ఆయా గ్రామాల్లో ఉన్న పోలింగ్ బూత్ కమిటీ సభ్యులతో కూడా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె వారితో మాట్లాడుతూ ఏ సర్వేలో చూసిన రాబోవు ఎన్నికల్లో జగన్మోహన్రెడ్డి రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి అంటూ చెబుతుండడంతో, చంద్రబాబు ప్రభుత్వం వైఎస్సార్ సీపీకి చెందిన ఓటర్లను రద్దు చేయడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఆమె వెంట వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు కుంబురుక దీనమయ్య, జిల్లా కార్యదర్శి గోరిశెట్టి గిరిబాబు, మండల కార్యదర్శి సామల మాధవరావు, బీసీ సెల్ కన్వీనర్ జి.వెంకటరావు, వైస్ ఎంపీపీ బిడ్డిక చంద్రమ్మ, బీరుపాడు ఎంపీటీసీ కె.కళావతితో పాటు కురుపాం మండ ల కన్వీనర్ ఐ.గౌరీశంకరరావు, జిల్లా అధికార ప్రతినిధి నిమ్మక వెంకటరావు పాల్గొన్నారు. -
ప్రాణ నష్టం జరిగితేగాని స్పందించరా...!
విజయనగరం, కురుపాం: ఏనుగుల బారి నుంచి పంటలను రక్షించాలని కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి ప్రభుత్వాన్ని కోరారు. మూడు నెలలుగా కురుపాం నియోజకవర్గంలోని జియ్యమ్మవలస, కొమరాడ, గరుగుబిల్లి మండలాల్లోనే ఏనుగులు సంచరిస్తూ అరటి, వరి, కూరగాయల పంటలకు తీవ్ర నష్టం కల్గిస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఆమె మాట్లాడుతూ మూడు నెలలుగా ఏనుగులు కురుపాం నియోజకవర్గంలోని మూడు మండలాల్లోనే ఉంటున్నాయని చెప్పారు. దీంతో రైతులు తమ వ్యవసాయ పనులను చేయలేక తమ పంటలను రక్షించుకోలేక అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని లేకుంటే భవిష్యత్‌లో ప్రజలకు మరిన్ని ఇబ్బందులు తప్పేలా లేవని పేర్కొన్నారు. గజరాజుల సంచారంతో ఈ ప్రాంత ప్రజలకు కొద్ది నెలలుగా కంటి మీద కునుకు కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని పేర్కొన్నారు. ఏనుగులు మూడు మండలాల్లోనే సంచరిస్తూ పంటలనే తింటున్నాయని, మున్ముందు ప్రజలపై అవి విరుచుకుపడి ప్రాణ నష్టం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. నెలల తరబడి వీటి సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతుంటే పాలకులు దీన్ని తీవ్రంగా పరిగణించకపోవడం దారుణం అని పేర్కొన్నారు. మరింత నష్టాలు సంభవించ కుండా అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిపుణులను రప్పించి ఏనుగులను తరలించే చర్యలు చేపట్టాలని పుష్పశ్రీవాణి కోరారు. -
గిరిజనుల పాలిట శాపంగా బయోమెట్రిక్
విజయనగరం, కురుపాం: ప్రభుత్వ వైఫల్యం వల్ల కురుపాం నియోజకవర్గంలో ఉన్న గిరిజన మండలాలకు చెందిన గిరి శిఖరాల్లో వృద్ధులకు, ప్రజలకు ప్రతి నెలా నిత్యావసర సరుకులు, పింఛన్లు అందడం లేదని ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి పేర్కొన్నారు. బయోమెట్రిక్ విధానం గిరిజనుల పాలిట శాపంగా తయారైందని ఆరోపించారు. మండలంలోని నీలకంఠాపురం పంచాయతీ దండుసూర గ్రామానికి చెందిన కొండగొర్రి లైంబో బయోమెట్రిక్‌లో తన వేలిముద్ర పడక ఈ నెల పింఛన్ అందదేమోనని మనస్తాపంతో ఇంటి వద్దే మృత్యువాత పడిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి ఆ గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. మృతి విషయమై ఆరా తీశారు. అదే గ్రామానికి చెందిన మూటక చంద్రి అనే వృద్ధ అంధ దివ్యాంగురాలు తనకు 21 నెలలుగా పింఛన్ అందడం లేదని ఎమ్మెల్యే వద్ద కన్నీటి పర్యాంతమయ్యారు. వేలిముద్రలు పడక ఈ నెల పింఛన్ ఇవ్వలేదని మండంగి సుబ్బమ్మ, బిడ్డిక కేమి, కె.లచ్చిమి, బి.జమ్మయ్య అనే వృద్ధులు ఎమ్మెల్యే వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బయోమెట్రిక్ గిరిజనుల పాలిట శాపంగా మారిందని పేర్కొన్నారు. గిరిజనులు వేలి ముద్రలు పడక, నెట్వర్కు సమస్యల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రతి నెల పింఛన్లపై, రేషన్ బియ్యంపై ఆధారపడి అవి సమయానికి అందక పస్తులు కూడా ఉంటున్న వృద్ధులు ఉన్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి దీనికి పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని, బయోమెట్రిక్ లేకుండా చర్యలు తీసుకొనేందుకు ఐటీడీఏ పీవోకు సమస్యలను విన్నవిస్తానని హామీ ఇచ్చారు. -
ఒక్క మహిళపై వంద గొంతులు!
జిల్లా పరిషత్ సమావేశం సాక్షిగా అధికార పార్టీ ఆగడాలు మరోసారి బహిర్గతమయ్యాయి. అధికారులపై అడ్డగోలుగా విరుచుకుపడటాన్ని తప్పుపట్టిన ప్రతిపక్ష ఎమ్మెల్యే... అందునా గిరిజన మహిళపై మూకుమ్మడిగా మాటలదాడికి దిగారు. ఒక్క మహిళపై వందగొంతుకలు ఒక్కటై... వేలు చూపించి భయపెట్టేందుకు యత్నించి... క్షమాపణ చెప్పాలంటూ పట్టుబట్టాయి. తాను చేయని తప్పునకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని దీటుగానే ఎదుర్కొన్నారు. ఆమెకు అండగా నిలిచిన మరో ప్రతి పక్ష ఎమ్మెల్యేపైనా... నిందలకు దిగారు. ప్రతిపక్షం గొంతునొక్కడానికి శతవిధాలా యత్నించి... చివరకు ప్రజాసమస్యల గురించి చర్చనే విస్మరిం చారు. సమస్యలపై ప్రస్తావించాలని వచ్చిన విపక్షఎమ్మెల్యేలకు అవకాశం లేకుండా చేసి తూతూ మంత్రంగా చిన్నపాటి చర్చలతో ముగించారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: జిల్లా పరిషత్ సర్వసభ్యసమావేశం ఆద్యంతం వాడి వేడిగా సాగింది. జెడ్పీ చైర్పర్సన్ స్వాతిరాణి అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన సమావేశం చర్చలకంటే వ్యక్తిగతంగా ప్రతిపక్షంపై దాడికి దిగడానికే పాలకపక్ష సభ్యులు ఎక్కువ ప్రాధాన్యమిచ్చినట్టు స్పష్టమైంది. తొలుత సమావేశంలో కొంతమంది జెడ్పీటీసీలు అధికారులను నిలదీశారు. ఆర్అండ్బీ స్థలం లో అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నారని, వాటిని అడ్డుకోవాలని తాము ఎన్నిసార్లు చెబుతున్నాజిల్లా పంచాయతీ అధికారి సత్యనారాయణ పట్టించుకోవడం లేదనేది వారి ప్రధాన ఆరోపణ. దానికి పంచా యతీ అధికారి సమాధానమిస్తూ.. ఆ స్థలం రోడ్లు, భవనాల శాఖది కనుక నిర్మాణాలు ఆపే అధికారం తమకు లేదన్నారు. ఆయన సమాధానానికి టీడీపీ ప్రజాప్రతినిధులు సంతృప్తి చెందలేదు. అడుగడుగునా నిలదీస్తూ, ఆయన పనితీరు సరిగ్గాలేనందున చర్యలకు సిఫారసుకోసం తీర్మానం చేయాలంటూ పట్టుబట్టారు. ఒకానొక సందర్భంలో డీపీఓ సత్యనారాయణ ఆవేదన చెంది తాను ధర్మబద్ధంగా మాత్రమే పనిచేస్తానన్నారు. ఆ మా టకు జెడ్పీ చైర్పర్సన్ స్వాతిరాణి కల్పిం చుకుని మిమ్మల్నెవరు అధర్మంగా పనిచేయమన్నారు. మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారంటూ డీపీఓను హెచ్చరించారు. ఇలా కాసేపు కొనసాగగా ఆయనపై తీర్మానం చేయాలని చివరిగా టీడీపీ నేతలంతా తేల్చారు. అధికారుల పక్షాన నిలిచినందుకు... సభలో తన వంతు వచ్చినపుడు ప్రసంగం మొదలు పెట్టిన కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి టీడీపీ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. అధికారపార్టీ ప్రజాప్రతినిధులు జిల్లా అధికారులను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని, గతంలోనూ ఇదే విధంగా ప్రవర్తించడంతో అధికారులంతా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారని గుర్తుచేశారు. ఈ చర్యలను తాను ఖండిస్తున్నానని, అధికారులకు పెద్దదిక్కైన జిల్లా కలెక్టర్ స్పందించి టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కురుపాం నియోజకవర్గానికి రూ.110 కోట్లతో తాగునీటి పధకాన్ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ మంజూరు చేస్తున్నట్టు జీఓ జారీ చేశారని, అయితే 24 గంటల్లో ఆ జీఓ మార్చేశారనీ తెలిపారు. కురుపాం నియోజకవర్గంపై ఎందుకంత వివక్ష చూపుతున్నారని జెడ్పీ చైర్పర్సన్ స్వాతిరాణిని నిలదీశారు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పనివ్వకుండా అధికార పార్టీ జెడ్పీటీసీలు, జెడ్పీ వైస్ చైర్మన్ బలగం కృష్ణమూర్తి నాయుడు కలుగజేసుకుని 6 నెలలుగా ఒక సమస్యను పరిష్కరించకుండా నీరు గారుస్తున్నారని, ఆ అధికారిపై చర్య తీసుకోమని చెప్పామే తప్ప, ఏ అధికారిని కించపరిచేవిధంగా మాట్లాడలేదని, తమపై నిందలు వేసినందుకు ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి క్షమాపణ చెప్పాలని పట్టుబట్టారు. ప్రేక్షకపాత్ర.. అవహేళన చాలా కాలం తర్వాత జెడ్పీ సమావేశానికి వచ్చిన ఎంపీ అశోక్ గజపతిరాజు కూడా సభ ప్రారంభంలోనే అధికా రులపై ఆగ్రహంతో ఊగిపోయారు. ఆయన తర్వాత మిగతా వారు అదే బాటను అనుసరించారు. ఈ క్రమంలో వారి తీరు సరైంది కాదన్న ప్రతిపక్ష గిరిజన, మహిళా ఎమ్మెల్యేపై టీడీపీ జెడ్పీటీసీలు విరుచుకుపడుతుంటే.. ఒకానొక దశలో ఆమెపై భౌతిక దాడికి పాల్పడతారేమోనన్న భయాందోళనలు కలిగిస్తుంటే అశోక్ నోరుమెదపకుండా చూస్తూ కూర్చుకున్నారు. కనీసం ఇలాంటి ప్రవర్తన తప్పని వారించే ప్రయత్నం కూడా చేయలేదు. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యేలు, ముఖ్యంగా గజపతినగరం ఎమ్మెల్యే కె.ఎ.నాయుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేను హేళన చేస్తూ మాట్లాడారు. జెడ్పీ సమావేశంలో ప్రజా సమస్యలపై మాట్లాడుతుంటే అడ్డుతగిలి, మీరేదైనా మాట్లాడాలనుకుంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడండంటూ హేళనగా నవ్వుతూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను చులకన చేసేలా విధంగా కేఏ నాయుడు ప్రవర్తించిన తీరు విమర్శలపాలైంది. భయానక వాతావరణం టీడీపీ నేతలు అంతటితో ఆగకుండా ఎమ్మెల్యే దగ్గరకు మూకుమ్మడిగా వచ్చి తీవ్రంగా వాదనలకు దిగా రు. చేతులు, వేలు చూపిస్తూ తీవ్ర భయభ్రాంతులకు గురి చేశారు. ఆవేశంతో ఊగిపోతూ పెద్ద పెద్ద కేకలు వేస్తూ మహిళా ఎమ్మెల్యేపై మాటల దాడి చేశారు. దీంతో సభలో భయానక వాతావరణం ఏర్పడింది. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి మాత్రం ఏ మాత్రం బెదరకుండా... కొంతమంది మాత్రమే అధికారులను టార్గెట్ చేస్తున్నారన్నానే తప్ప అందరినీ అనలేదని క్షమాపణ చెప్పే ప్రపక్తే లేదని తేల్చి చెప్పారు. పుష్పశ్రీవాణికి సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, కురుపాం జెడ్పీటీసీ శెట్టి పద్మావతి, ఎంపీపీ అనిమి ఇందిర బాసటగా నిలిచారు. కొంత సేపటికి జెడ్పీ చైర్పర్సన్ స్వాతిరాణి కలుగజేసుకుని అధికార పార్టీ జెడ్పీటీసీలకు మాట్లాడడానికి అవకాశం ఇస్తానని చెప్పి ఎవరి సీట్లతో వారిని కూర్చోమన్నారు. ఐదు అంశాలపైనే చర్చ తొలుత సమావేశంలో 58కి పైగా అంశాలపై చర్చించాలని అజెండా రూపొందించారు. కానీ మధ్యలో పాలకపక్ష సభ్యులు సమావేశాన్ని పక్కదారిపట్టించడంతో కేవలం ఐదు అంశాలపైనే చర్చ జరిగింది. ఆరోగ్యం, వ్యవసాయం, డీపీఏ, ఉపాధిహామి , ఆర్డబ్ల్యూఎస్ శాఖలవరకే పరిమితమైంది. ముందుగా ఆరోగ్యశాఖపై చర్చించారు. ఆతర్వాత డ్వామా( ఉపాధిహామీ), వ్యవసాయశాఖ, జిల్లా పంచాయతీ శాఖపై చర్చించారు. చివరిగా ఆర్డబ్ల్యూఎస్శాఖపై చర్చించి ముగించారు. ఇదే చివరి సమావేశం కావడంతో ఎక్కువ అంశాలపై చర్చిస్తారని పలువురు భావించినప్పటికీ ఐదింటితోనే ముగించడం విశేషం. -
బాబుకు ఏ కష్టమొచ్చినా పవన్ కళ్యాణ్ తెరమీదకి వస్తారు
-
కురుపాం గడ్డ.. వైఎస్అర్ కుటుంబానికి అడ్డ..
-
జననేతకు ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు పూర్తి
-
బాబు ప్రభుత్వం అరాచకాలని సృష్టిస్తోంది
-
సమస్యల పరిష్కారమే ముందున్న లక్ష్యం
కురుపాం విజయనగరం : తనను ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజల సమస్యల పరిష్కారమే తన ముందున్న లక్ష్యమని ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి అన్నారు. ఆమె జన్మదినం సందర్భంగా శుక్రవారం రావాడ కూడలిలో ఉన్న మహానేత దివంగత వైఎస్సార్ విగ్రహం వద్ద అభిమానులు, కార్యకర్తల నడుమ కేక్‌ను కట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె భర్త, వైఎస్సార్ సీపీ అరకు పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు కేకును ఆమెకు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి మాట్లాడుతూ తన భర్త శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, నియోజకవర్గ నాయకులు, ప్రజల సహకారంతో ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కృషి చేస్తానన్నారు. భవిష్యత్‌లో గిరిజనులకు వైద్యం, తాగునీరు, రహదారులు, విద్య సక్రమంగా అందేలా పని చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో కురుపాం ఎంపీపీ ఇందిరాకుమారి, జెడ్పీటీసీ పద్మావతి, వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి నాగేశ్వరరావు, ఎంపీటీసీలు గొర్లి సుజాత, రాజేశ్వరి, నీలకంఠాపరం సర్పంచ్ మన్మధరావు, పొడి మాజీ ఎంపీటీసీ కామేశ్వరరావు, మండల కో–ఆప్షన్ సభ్యుడు షేక్ నిషార్‌తో పాటు కార్యకర్తలు, అభిమానులు, నాయకులు పాల్గొన్నారు. -
గిడ్డి ఈశ్వరి ఎన్ని కోట్లు తీసుకున్నారు?
సాక్షి, విజయనగరం : గిరిజనుల అభివృద్ధి చూసే పార్టీ మారానని గిడ్డి ఈశ్వరి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని కురుపాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి వ్యాఖ్యానించారు. గతంలో బాక్సైట్ తవ్వకాల కోసమే అరకు ఎంపీ, ఎమ్మెల్యే పార్టీ మారారన్న గిడ్డి ఈశ్వరి... ఇప్పుడు ఆమె కూడా బాక్సైట్ తవ్వుకోవడానికే టీడీపీలోకి వెళ్లారా? అని సూటిగా ప్రశ్నించారు. ఎన్నికోట్లు తీసుకుని పార్టీ మారారో ఆమె సమాధానం చెప్పాలని పుష్ప శ్రీవాణి డిమాండ్ చేశారు. గిడ్డి ఈశ్వరికి ఆత్మాభిమానం ఉంటే తక్షణమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని అన్నారు. పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ...‘ 2019 ఎన్నికల్లో అరకు, పాడేరులో మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుందని చెప్పడం మీ మాట్లోనే విన్నాం. వైఎస్ జగన్ ఎవరైతే కోట్లు ఇస్తారో వారికే సీట్లు కేటాయిస్తున్నారని ఇప్పుడు చెప్పడం దురదృష్టకరం. అలా అయితే మీరు ఎన్నికోట్లు ఇస్తే...2014లో మీకు వైఎస్ జగన్ సీటు ఇచ్చారో చెప్పాలి. నిన్న, మొన్నటివరకూ కూడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని, చంద్రబాబు నాయుడును విమర్శించేవారు. గిరిజనులకు టీడీపీ సర్కార్ చేస్తున్న వ్యతిరేక విధానాలపై ప్రశ్నించిన మీరు ... మళ్లీ గిరిజనులకు చేస్తున్న అభివృద్ధి చూసి టీడీపీలో చేరుతున్నట్లు చెప్పడం హాస్యాస్పదం. ఆనాడు టీడీపీ నేతలు మా పార్టీకి వస్తే రూ.30కోట్లు ఇస్తామని చెప్పారన్న గిడ్డి ఈశ్వరి...ఇప్పుడు ఎన్నికోట్లు ఇస్తే మీరు పార్టీ మారారో చెప్పాలి. వైఎస్ఆర్ సీపీలో ఆత్మాభిమానం లేదన్న మీరు... నిజంగా మీకు ఆత్మాభిమానం ఉంటే తక్షణమే శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి టీడీపీ తరపున నిలబడి గెలవాలి.’ అని డిమాండ్ చేశారు. కాగా వైఎస్ఆర్ సీపీ జెండాపై గెలిచిన గిడ్డి ఈశ్వరి... సోమవారం సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. అందుకోసం రూ.25కోట్లకు పైగా డీల్ కుదిరిందని విశ్వసనీయ సమాచారం. రూ.10 కోట్లు అడ్వాన్సుగా అందించారని, మిగిలిన రూ.15 కోట్లు కమీషన్లు దక్కే పనుల రూపంలో అందించబోతున్నారని తెలుస్తోంది. త్వరలో జరగబోతున్న రాజ్యసభ ఎన్నికలలో వైఎస్ఆర్ సీపీకి సీటు దక్కకుండా చేయడం కోసం సాక్షాత్తూ ముఖ్యమంత్రే స్వయంగా రంగంలోకి దిగి రూ. 25 కోట్ల డీల్‌కు ఒప్పించినట్లు తెలిసింది. -
'ప్రజలను నమ్మించి మోసం చేసిన ఏకైక సీఎం బాబు'
విజయనగరం : టీడీపీ మునిగిపోయే నావా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజన్న దొర ఎద్దేవా చేశారు. ఎవరు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే టీడీపీకి డిపాజిట్లు కూడా దక్కవని సర్వేలు చెబుతున్నాయని రాజన్న దొర వెల్లడించారు. బుధవారం విజయనగరం జిల్లా సాలూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, పెన్మత్స సాంబశివరావు, ఎమ్మెల్యేలు రాజన్నదొర, పుష్పశ్రీవాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుష్పశ్రీవాణి మాట్లాడుతూ... 2004లో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల కష్టాలు తెలుసుకోవడం కోసం పాదయాత్ర చేశారని చెప్పారు. కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ప్రజలను మోసం చేయడానికే పాదయాత్ర చేశారని మండిపడ్డారు. ప్రజలను నమ్మించి మోసం చేసిన ఏకైక సీఎం చంద్రబాబు అని పుష్పశ్రీవాణి ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
'హామీలు గుర్తు చేస్తే గొంతు నొక్కుతున్నారు'
-
'హామీలు గుర్తు చేస్తే గొంతు నొక్కుతున్నారు'
హైదరాబాద్: ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తే ప్రభుత్వం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి ఆరోపించారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద పుష్పశ్రీవాణి మాట్లాడుతూ...అంగన్వాడీలపై చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ఆమె నిప్పులు చెరిగారు. అంగన్వాడీ కార్యకర్తల అరెస్ట్‌లు చాలా బాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీ సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం చేస్తామని చంద్రబాబు సర్కార్‌ను మరో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఈశ్వరి హెచ్చరించారు. -
విఐపి రిపోర్టర్ - కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి
-
అరకు ప్రాంతంపై ప్రభుత్వానికి రహస్య అజెండా ?
హైదరాబాద్: విశాఖపట్నం జిల్లాలోని అరకు ప్రాంతంపై టీడీపీ ప్రభుత్వానికి రహస్య అజెండా ఉన్నట్లుందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. బాక్సైట్ తవ్వకాల కోసం ఆ ప్రాంతాన్ని డీ నోటిఫై చేస్తారేమోనని వారు అనుమానం వ్యక్తం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వైఎస్ఆర్ సీపీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు రాజన్నదొర, సర్వేశ్వర్రావు, గిద్ది ఈశ్వరి, కళావతి, పుష్ప శ్రీవాణి, రాజేశ్వరి మాట్లాడుతూ... ఇప్పటికీ గిరిజన సలహామండలి పునరుద్ధరణకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదని వారు గుర్తు చేశారు. గిరిజన సంబంధిత అంశాల్లో ప్రభుత్వం... ఎస్టీ ఎమ్మెల్యేలకు భాగస్వామ్యం కల్పించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతం అరకును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే అంశంపై అసెంబ్లీలో తమను మాట్లాడనివ్వకపోవడం సరికాదని వారు అభిప్రాయపడ్డారు. గిరిజన అంశాలు సభలో చర్చకు వచ్చినప్పుడు స్పీకర్ తమకు మాట్లాడే అవకాశం కల్పించాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు.