Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Massive Response From Mangalagiri People For CM Jagan Speech
మంగళగిరి మారుమోగింది.. ‘జై జగన్.. సీఎం జగన్‌’

గుంటూరు, సాక్షి: అది మంగళగిరి పాత బస్టాండ్‌ సెంటర్‌.. కాస్త ఎండపూట ఇసుకేస్తే రాలనంత జనం చేరారు. సంక్షేమ సారథికి మద్దతు పలికేందుకు అశేషంగా తరలివచ్చిన జన సునామే అది. ఆ అభిమానం ఇంతటితో ఆగలేదు.. సీఎం జగన్‌ ప్రసంగించే సమయంలో సీఎం సీఎం.. జై జగన్‌.. జయహో జగన్‌ అంటూ నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగేలా చేశారు. మంగళగిరిలో పచ్చ బ్యాచ్‌ మొదటి నుంచి ఒకరమైన ప్రచారంతో ముందుకు పోతోంది. బీసీ జనాభా అత్యధికంగా ఉండే చోట.. అగ్ర కులానికి, అందునా గత ఎన్నికల్లో ఓడిన తమ చిన్నబాస్‌ నారా లోకేష్‌ను బరిలోకి దింపింది. బీసీ కులాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను సైతం చంద్రబాబు పట్టించుకోలేదు. కానీ, సీఎం జగన్‌ సామాజిక న్యాయం పాటించారు. గత ఎన్నికల్లో గెలిచిన ఆర్కే(ఆళ్ల రామకృష్ణారెడ్డి)ని తప్పించి మరీ.. బీసీ సామాజిక వర్గానికి, అందునా ఒక మహిళను వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా నిలబెట్టారు. మురుగుడు లావణ్య ప్రచారానికి వెళ్లిన చోటల్లా.. ప్రజలు ఆదరించడం మొదలుపెట్టారు. అదే సమయంలో నారా లోకేష్‌కి ఆదరణ కరువు కావడంతో.. టీడీపీకి ఏమాత్రం మింగుడు పడలేదు.దీంతో మంగళగిరిలో నారా కుటుంబం ప్రచారాన్ని.. ఐటీడీపీ అండ్‌కో పేజీలు సోషల్‌మీడియాలో జాకీలు పెట్టడం ప్రారంభించారు. అక్కడా ప్రతికూల కామెంట్లే వినిపించాయి. అప్పటికీ కూడా మంగళగిరిలో టీడీపీ జెండానే  ఎగురుతుందంటూ లోకేష్‌ అండ్‌ కో ప్రచారం చేస్తూ వచ్చాయి. ఈలోపే..సీఎం జగన్‌ మంగళగిరి ప్రచార సభకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు#MemanthaSiddham, #YSJaganAgain. ఆయన ప్రసంగిస్తున్నంత సేపు.. జయజయధ్వానాలు పలికారు. ఎటుచూసినా జన సమూహంతో పండగ వాతావరణం కనిపించింది. ‘‘చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ప్రేమానురాగాలు, ఆప్యాయతలు, ఆత్మీయతలు పంచుతున్న నా ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ, ప్రతి అవ్వకూ, ప్రతి తాతకూ, ప్రతి సోదరుడికీ, ప్రతి స్నేహితుడికీ.. మీ అందరి ఆప్యాయతలకు మీ బిడ్డ, మీ జగన్‌ రెండు చేతులు జోడించి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు..’ అంటూ ప్రసంగం ప్రారంభంలో సీఎం జగన్‌ చెప్పిన మాటలు.. ఆపై కొనసాగిన స్పీచ్‌ మంగళగిరి ప్రజల్లో ఉత్సాహం నింపింది. ఫ్యాన్‌ గుర్తుకు తమ ఓటేసి.. కూటమి నేతలను తిప్పికొడతామంటూ తమ నినాదాలతో స్పష్టం చేశారు మంగళగిరి వాసులు. ..‘‘14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశానని ఈ పెద్దమనిషి అంటుంటాడు, ఆ యన పాలనలో ఏనాడైనా ఇన్ని స్కీములు ఇచ్చా డా? ఇప్పటి మాదిరిగా ఏనాడైనా అవ్వాతాతలకు ఇంటింటికీ పింఛన్‌ ఇచ్చాడా? రైతు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా? ఈ పెద్దమనిషి చంద్రబాబు పేరు చెబితే పేదలకు చేసిన కనీసం ఒక్కటంటే ఒక్క స్కీమ్‌ అయినా గుర్తుకు వస్తుందా?’’.. అంటూ సీఎం జగన్‌ అడిగిన ప్రశ్నలకు లేదూ.. లేదూ.. అంటూ రెండు చేతులు ఊపుతూ ప్రజలు మద్దతు తెలిపారు. ఈ ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ పాలనలో తెచ్చిన పథకాలు గురించి వివరిస్తున్నప్పుడు అవునూ.. అవునూ.. అంటూ ప్రజలు పెద్దఎత్తున మద్దతు పలికారు. స్థానికంగా ఉండే లావణ్యమ్మ(మురుగుడు లావణ్య)కు ఓటేయాలన్నప్పుడు కూడా ప్రజల నుంచి.. సిద్ధం అనే సమాధానమే వినిపించింది. మొత్తంగా.. గ్రాఫిక్స్‌ అనే వాళ్ల గూబ గుయ్యి మనేలా.. కూటమి వెన్నులో వణుకు పుట్టేలా.. మంగళగిరి ‘జై జగన్‌’ నినాదాలతో మారుమోగింది.

AP High Court Dismiss Sunitha Petition Over YS Viveka Case
వివేకా కేసు: సునీత దంపతులకు ఎదురుదెబ్బ

సాక్షి, అమరావతి: వైఎస్‌ వివేకా హత్య కేసులో నర్రెడ్డి రాజశేఖర్‌ రెడ్డి, సునీత, సీబీఐ అధికారి రాంసింగ్‌కు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగలింది. వీరు వేసిన క్వాష్‌ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు డిస్మిస్‌ చేసింది.కేసు పూర్వపరాలేంటీ? మాజీ మంత్రి వివేకానంద రెడ్డికి పీఏగా పనిచేసిన కృష్ణారెడ్డి 2021 డిసెంబర్‌లో పులివెందుల కోర్టులో ఒక ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు. వివేకా హత్య కేసుకు సంబంధించి కొందరు తనను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఈ కేసులో అవినాష్‌ రెడ్డి, శంకర్‌ రెడ్డి, భాస్కర్‌రెడ్డి పేర్లు చెప్పాలంటూ సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్ ఒత్తిడి చేస్తున్నారని కోర్టుకు తెలిపారు. వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆరోపణలకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలంటూ ఒత్తిడి చేశారని ఆరోపించారు. కృష్ణా రెడ్డి ఫిర్యాదుపై పులివెందుల కోర్టు 2023 డిసెంబర్ 8న విచారణ జరిపింది. కేసు నమోదు చేసి తుది నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో పోలీసులు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, సునీత, రాంసింగ్‌పై కేసులు నమోదు చేసింది. ఈ కేసును కొట్టేయాలంటూ సునీత, ఆమె భర్త రాజశేఖర్‌, ఎస్పీ రామ్‌సింగ్ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ వేశారు.హైకోర్టు ఏం చెప్పింది?వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డి పెట్టిన కేసును కొట్టేయాలన్న సునీత, రాజశేఖర్‌ రెడ్డి, రాంసింగ్‌ వాదనలను ఏపీ హైకోర్టు అంగీకరించలేదు. వీరు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్‌ చేసింది. చదవండి : నర్రెడ్డి సునీత, రాజశేఖర్‌రెడ్డి చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలుకృష్ణారెడ్డి ఏం చెబుతున్నారు? "వివేకానందరెడ్డి హత్య కేసులో సునీత దంపతుల పాత్ర అనుమానస్పదంగా ఉంది. ఈ హత్య సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డి కుట్ర అని భావిస్తున్నాను. వారిద్దరితోపాటు శివప్రకాశ్‌రెడ్డిల తీరు సందేహాస్పదంగా ఉంది. వివేకా రెండో పెళ్లితోనే ఆ కుటుంబంలో తీవ్ర విభేదాలు తలెత్తాయి. రెండో భార్య షమీమ్‌కు ఆస్తిలో వాటా ఇవ్వాలని వివేకానందరెడ్డి భావించడంతో హత్య జరిగినట్టు భావిస్తున్నాను. వివేకా లెటర్‌ను దాచిపెట్టమని ఆయన అల్లుడు రాజశేఖర్‌రెడ్డి స్వయంగా చెప్పారు. ఆ తర్వాత కూడా అబద్ధం చెప్పాలని సునీత, రాజశేఖర్‌రెడ్డి నన్ను వేధించారు. ఈ హత్యకు కారణం ఎంపీ అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి పేర్లు చెప్పాలని నాపై ఒత్తిడి తెచ్చారు. పోలీసులు, సీబీఐ అధికారులు చిత్రహింసలకు గురిచేశారు. నేను అబద్ధం చెప్పకపోతే నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి జైలుకు వెళ్లాల్సి వస్తుందని సునీత అన్నారు. దస్తగిరి అప్రూవర్‌గా మారడం వెనుక పక్కా కుట్ర ఉంది. అవినాశ్‌రెడ్డిని ఎంపీగా గెలిపించడం కోసం చివరి వరకూ వివేకా కృషి చేశారు" అని వివేకా పీఏ కృష్ణారెడ్డి వెల్లడించారు.చదవండి : వైఎస్‌ వివేకా పీఏ ఎంవీ కృష్ణారెడ్డి ఇంటర్వ్యూ పూర్తి పాఠం 

May 10th: ఏపీ ఎన్నికల సమాచారం

ఏపీ ఎన్నికలకు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం.. 

Delhi High Court Hearing On MLC Kavitha Bail Petition Updates
ఢిల్లీ హైకోర్టు: క​విత బెయిల్‌ పిటిషన్‌ విచారణ వాయిదా

సాక్షి, ఢిల్లీ:  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణను మే 24వ తేదీకి ఢిల్లీ హైకోర్టు వాయిదా వేసింది. కవిత బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి కోర్టు నోటీసులు జారీ చేసింది. జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం విచారణ జరిపింది.తనకు బెయిల్ నిరాకరిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుని హైకోర్టులో కవిత సవాల్ చేసింది. లిక్కర్ పాలసీ మనీలాండరింగ్ కేసులో తనకు వ్యతిరేకంగా ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారని,కేసు వాస్తవాలు పరిశీలించి తనకు అనుకూలంగా ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్‌లో కవిత పేర్కొంది. తనకు పలు అనారోగ్య సమస్యలు ఉన్నాయని పిటిషన్‌లో ఆమె ప్రస్తావించింది.హైపర్ టెన్షన్, గైనిక్ సమస్యలకు చికిత్స అవసరమని పిటిషన్ లో కవిత కోరారు. తాను జైల్లో ఉండడం వల్ల మైనర్ కుమారుడు షాక్ లో ఉన్నాడని పిటిషన్‌లో వెల్లడించారు.1149 పేజీలతో కవిత న్యాయవాదులు హైకోర్టులో బెయిల్ అప్లికేషన్ వేశారు. త్వరితగతిన తన పిటిషన్ పై విచారణ జరపాలని కవిత తన పిటిషన్‌లో పేర్కొన్నారు. 

Pawan Kalyan sensational comments in an English TV channel interview
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్‌

సాక్షి, అమరావతి/వన్‌టౌన్‌ (విజయవాడ పశ్చిమ): రాష్ట్రంలో చాలాకాలంగా డిమాండ్‌ చేస్తున్న కాపు రిజర్వేషన్లతో పాటు ముస్లిం రిజర్వేషన్లు అసలు అవసరమేలేదంటూ జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఆ రిజర్వేషన్లనే ఆయన వ్యతిరేకిస్తూ పరోక్షంగా పలు వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంగ్లిష్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ముస్లిం రిజర్వేషన్ల అంశంలో ఇటీవల బీజేపీ జాతీయ నేతలు చేస్తున్న ప్రకట­నలకు జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్‌ పూర్తి మద్దతు ప్రకటించడంతో పాటు కోరుకునే వారందరికీ రిజర్వేషన్లు కల్పించడం సాధ్యమేకాదని తన మనస్సులోని మాటను కుండబద్దలు కొట్టారు. ఈ రిజర్వేషన్లకు ప్రత్యామ్నాయ మార్గాలు గురించి ఆలోచన చేయాలన్నారు. ఆ ఇంటర్వ్యూలో సంబంధిత మీడియా ఛానల్‌ ప్రతినిధి.. ముస్లింలకు సంబంధించి బీజేపీ వైఖరి గురించి పవన్‌ను ప్రశ్నించినప్పుడు, బీజేపీ ముస్లింలకు వ్యతిరేకం కాదని వ్యాఖ్యానించారు. కానీ, వాళ్లు (బీజేపీ) ముస్లిం రిజర్వేషన్లు అమలుచేయబోమని ఆ పార్టీ నేతలు నేరుగా చెబుతున్నారు కదా.. దానిపై మీరేమీ నిరాశ చెందడంలేదా అన్న ప్రశ్నకు పవన్‌ బదులిస్తూ.. ముస్లిం రిజర్వేషన్లపై బీజేపీ నేతల ప్రకటనలపట్ల తానేమీ నిరాశ, ఆందోళన చెందడంలేదని చెప్పారు. అయినా, రిజర్వేషన్ల అమలుకన్నా యువతకు ఉపాధి అవకాశాలు, నైపుణ్యాలు పెంచేలా వివిధ అంశాల్లో శిక్షణ ఇవ్వాలని సూచించారు.అందరికీ రిజర్వేషన్లు కూడా కుదరదు..రిజర్వేషన్లు కావాలని కోరుకుంటున్న అన్ని వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలన్నా సాధ్యమయ్యే పరిస్థితి కాదని పవన్‌ తేల్చిచెప్పారు. ప్రత్యేకంగా తమ సొంత (కాపు) కులం కూడా రిజర్వేషన్ల కోసం కొన్ని దశాబ్దాలుగా పోరాటం చేస్తోందన్నారు. అందరికీ రిజర్వేషన్లు ఇవ్వాలన్నా కుదరదని.. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని సుప్రీంకోర్టు స్పష్టంచేసిందని పవన్‌ గుర్తుచేశారు. రిజర్వేషన్లు ఇవ్వడానికి సాధ్యంకానప్పుడు, ప్రత్యామ్నాయ మార్గాల గురించి ఆలోచించాలని ఆయన చెప్పారు.జగన్‌ ఇచ్చిన వాగ్దానాలను  నెరవేర్చలేదు మరోవైపు.. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం విజయవాడలో పవన్‌ పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ.. రాష్ట్రంలోని యువకుల గళాన్ని అసెంబ్లీలో బలంగా వినిపిస్తానన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదన్నారు. మైనార్టీల ప్రాథమిక హక్కులకు తాను అండగా ఉంటానని.. కాపులకు రిజర్వేషన్లను అడుగుతున్నారని, న్యాయస్థానాల్లో ఉన్న అంశాలపై తాము మాట్లాడకూడదంటూ ఇంగ్లీష్‌ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూకు భిన్నంగా మాట్లాడారు. ఇక ఇక్కడ తాను పెంచి పెద్దచేసిన నాయకుడు తనపై విమర్శలు చేస్తూ తిటడం బాధ కలిగిస్తోందని పోతిన మహేష్‌ పేరు ప్రస్తావించకుండా వ్యాఖ్యానించారు. అలాగే, వంగవీటి రాధా చట్టసభలకు వెళ్తానంటే తాను అండగా ఉంటానని పవన్‌ చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని, పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనాచౌదరి, నాయకులు వంగవీటి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.Video Credits: NDTV 

విరాట్‌ కోహ్లి (PC: BCCI)
ఆర్సీబీ ఘన విజయం: కోహ్లి కీలక వ్యాఖ్యలు

ఐపీఎల్‌-2024 ఆరంభంలో కాస్త తడబడ్డా తిరిగి పుంజుకుని పరుగుల వరద పారిస్తున్నాడు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి. అత్యధిక పరుగుల వీరుడిగా కొనసాగుతూ ఆరెంజ్‌ క్యాప్‌ తన దగ్గరే పెట్టుకున్నాడు.తాజాగా పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో దుమ్ములేపిన ఈ ఆర్సీబీ ఓపెనర్‌ జట్టును గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు. 47 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో వింటేజ్‌ కోహ్లిని గుర్తుచేస్తూ 92 పరుగులు సాధించాడు. సెంచరీ చేజారినా అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగలిగాడు.Going..Going..GONE!Virat Kohli clobbers that delivery into the stands in grand fashion! 💥Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #PBKSvRCB pic.twitter.com/Y5eVp7Q6fN— IndianPremierLeague (@IPL) May 9, 2024కోహ్లి స్ట్రైక్‌రేటుపై విమర్శలుఈ మ్యాచ్‌తో కలిపి ఈ సీజన్‌లో 12 ఇన్నింగ్స్‌ ఆడిన విరాట్‌ కోహ్లి ఓ శతకం సాయంతో 634 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో ఈ రన్‌మెషీన్‌ స్ట్రైక్‌రేటు 153.51గా నమోదైంది.కాగా గత కొన్ని రోజులుగా విరాట్‌ కోహ్లి స్ట్రైక్‌రేటుపై విమర్శలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. స్వార్థపూరిత ఇన్నింగ్స్‌ ఆడుతూ జట్టుకు మేలు కంటే చేటే ఎక్కువ చేస్తున్నాడంటూ కొంతమంది మాజీ క్రికెటర్లు విమర్శించారు.ఇందుకు కోహ్లి గట్టిగానే బదులివ్వగా.. సునిల్‌ గావస్కర్‌ వంటి వాళ్లు చూసిందే మాట్లాడుతున్నాం అంటూ మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ నేపథ్యంలో పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌ అనంతరం కోహ్లి కీలక వ్యాఖ్యలు చేశాడు.‘‘నాకు క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం. లోపాలు సరిచేసుకుని ముందుకు ఎలా వెళ్లాలో నాకు తెలుసు. రోజురోజుకు ఆటను మెరుగుపరచుకోవడమే నా పని.స్పిన్నర్ల బౌలింగ్‌లో స్లాగ్‌స్వీప్‌ షాట్లు ఆడాను. నిజానికి నేను అలాంటివి గతంలో ప్రాక్టీస్‌ కూడా చేయలేదు. కానీ కొన్నిసార్లు రిస్క్‌ తీసుకోకతప్పదని నాకు తెలుసు.స్ట్రైక్‌రేటు పెంచుకునే క్రమంలోనాకోసం, జట్టు ప్రయోజనాల కోసం స్ట్రైక్‌రేటు పెంచుకునే క్రమంలో ఇలాంటివి చేయాల్సిందే’’ అని కోహ్లి పేర్కొన్నాడు. ఇక వరుస ఓటముల తర్వాత ఆర్సీబీ వరుస విజయాల పట్ల స్పందిస్తూ.. ‘‘నిజం చెప్పాలంటే.. మేము మొదటి అర్థ భాగంలో స్థాయికి తగ్గట్లు రాణించలేదు.అందుకే పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్నపుడు ఆత్మ గౌరవం కోసం ఆడాలని నిర్ణయించుకున్నాం. మా అభిమానులను గర్వపడేలా చేయాలనుకున్నాం. ఇప్పుడు ఏడో స్థానానికి చేరుకోగలిగాం. మేము ఇదే పని కాస్త ముందు చేసి ఉంటే ఎంతో బాగుండేది’’ అని కోహ్లి చెప్పుకొచ్చాడు. కాగా ఐపీఎల్‌-2024 ప్లే ఆఫ్స్‌ నుంచి ఇప్పటికే ముంబై ఇండియన్స్‌ నిష్క్రమించగా.. ఆర్సీబీ చేతిలో గురువారం 60 పరుగుల తేడాతో ఓడిన పంజాబ్‌ కూడా ఆశలు కూడా గల్లంతయ్యాయి.చదవండి: ద్రవిడ్‌ గుడ్‌ బై!.. టీమిండియా కొత్త కోచ్‌గా ఫారినర్‌?.. జై షా కామెంట్స్‌ వైరల్‌ The Punjab Kings bounce back with crucial breakthroughs, especially the big one of Virat Kohli 👏👏#RCB 238/5 with 5 deliveries leftWatch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #PBKSvRCB pic.twitter.com/9mu2bMjrWV— IndianPremierLeague (@IPL) May 9, 2024

Samyuktha Menon Comparison Tollywood With Mollywood
టాలీవుడ్‌లో అది చాలా కష్టం.. అసౌకర్యంగా అనిపిస్తుంది: సంయుక్త

తెలుగు సినిమాలపై స్టార్ హీరో సంయుక్త మేనన్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇక్కడ నటించాలంటే చాలా కష్టమని చెప్పింది. అలానే టాలీవుడ్‌లో తనకెదురైన కష్టాల్ని, అనుభవాల్ని బయటపెట్టింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తెలుగు చిత్రసీమపై తన అభిప్రాయాల్ని వ్యక్తం చేసింది. అలానే మలయాళ ఇండస్ట్రీతో పోల్చి చూస్తే ఇక్కడ ఎలా ఉంటుందనేది కూడా చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ హీరో.. అమ్మాయి ఎవరంటే?)'మలయాళంతో పోలిస్తే తెలుగు సినిమాల్లో నటించడం చాలా కష్టం. భాష రాకపోవడమనేది ఓ కారణమైతే.. మేకప్ మరో రీజన్. వినడానికి సిల్లీగా ఉన్నాసరే నా వరకు ఇది చాలా పెద్ద విషయం. మలయాళ చిత్రాల్లో మేకప్ త్వరగా అయిపోతుంది. చాలా నేచురల్‌గా వేస్తారు. యాక్టింగ్ కూడా మనకు నచ్చినట్లు చేసేయొచ్చు. కానీ టాలీవుడ్‌లో చాలా జాగ్రత్తగా ఉండాలి. స్క్రీన్‌పై ఎలా కనిపిస్తున్నామనేది ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. దానికి తోడు ఎక్కువ మేకప్ వేస్తారు. చాలా చిరాగ్గా.. ముఖంపై ఏదో ఉన్నట్లు అనిపిస్తుంది' అని సంయుక్త తన కష్టాల్ని చెప్పుకొచ్చింది.2016లోనే నటిగా మారిన సంయుక్త మేనన్... తొలుత మలయాళ, తమిళ చిత్రాలు చేసింది. ఆ తర్వాత టాలీవుడ్‌లో అడుగు పెట్టింది. 'భీమ్లా నాయక్', 'బింబిసార', 'విరూపాక్ష', 'సర్' చిత్రాలతో వరస హిట్స్ కొట్టి గోల్డెన్ లెగ్ అనిపించుకుంది. కానీ కల్యాణ్ రామ్ 'డెవిల్'తో ఫ్లాప్ అందుకుంది. ప్రస్తుతం నిఖిల్ 'స్వయంభు' మూవీతో పాటు శర్వానంద్, బెల్లంకొండ శ్రీనివాస్ చేయబోయే కొత్త చిత్రాల్లో నటిస్తోంది. అలానే హిందీలోకి కూడా అడుగుపెట్టాలని ప్లాన్స్ చేసుకుంటోంది.(ఇదీ చదవండి: తెలుగు సీరియల్ నటి పర్సనల్‌ వీడియో లీక్‌)    View this post on Instagram           A post shared by Samyuktha (@iamsamyuktha_)

oil cos cut 14 Percent of their workforce in six years even as their revenues nearly doubled
ఆదాయాలు రెట్టింపైనా ఉద్యోగాల్లో కోత!

ప్రభుత్వ ఆయిల్‌, గ్యాస్ కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గడిచిన ఆరేళ్లలో ప్రభుత్వ చమురు సంస్థలు సుమారు 15,700 ఉద్యోగాలను తగ్గించాయి. వాటి శ్రామికశక్తిలో ఇది 14 శాతంగా ఉంది. ఈ ఆరేళ్ల కాలంలో ఆయా కంపెనీల ఆదాయాలు మాత్రం రెట్టింపు అయినట్లు తెలుస్తుంది. అయినప్పటికీ వేలసంఖ్యలో ఉద్యోగులను తగ్గించడంపట్ల ఆందోళనలు నెలకొంటున్నాయి.చమురు మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం..ఉద్యోగాల కోత అన్ని విభాగాల్లో ఉంది. ప్రధానంగా నాన్-మేనేజిరియల్ ఉద్యోగాలను భారీగా తగ్గించారు. ప్రభుత్వ చమురు, గ్యాస్ కంపెనీల్లో 2022-23 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 1,10,000గా ఉన్న శ్రామికశక్తి 94,300కి పడిపోయింది. ఎక్స్‌ప్లోరేషన్‌, ఉత్పత్తి, మార్కెటింగ్, రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ విభాగాల్లో గడిచిన ఆరేళ్లలో 20-24% ఉద్యోగాలను తొలగించారు. రిఫైనరీల్లో మాత్రం కేవలం 3% ఉద్యోగాల కోత విధించారు. ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాలు 6శాతం, నాన్‌ మేనేజిరియల్‌ ఉద్యోగాలు 25 శాతం మేర తగ్గించినట్లు తెలిసింది.కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన కొత్త ఉద్యోగాలు నియమించడం, బౌట్‌సోర్సింగ్‌ కొలువులపై దృష్టిసారించడంతో రెగ్యులర్‌ స్థానాలపై వేటు పడుతున్నట్లు తెలిసింది. దాంతోపాటు శ్రామికశక్తి స్థానంలో అవకాశం ఉన్న విభాగాల్లో టెక్నాలజీ వాడకాన్ని పెంచుతున్నారు. పదవివిరమణ చేసిన ఉద్యోగులు స్థానంలో పరిమిత స్థాయిలోనే కొత్త వారికి అవకాశం ఇస్తున్నారు. ఫలితంగా కంపెనీల ఆదాయాలు పెరుగుతున్నా ఉద్యోగుల సంఖ్యలో కోతలు కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. ఇదిలాఉండగా, 2022-23 నాటికంటే ముందు ఆరు ఆర్థిక సంవత్సరాల్లో ప్రభుత్వ చమురు కంపెనీలు మూలధన వ్యయంలో భాగంగా సుమారు రూ.6.8 లక్షల కోట్లు వెచ్చించాయి.

After Rottweiler Attack,Tamil Nadu Bans 23 Dangerous Dog Breeds
డాగ్‌ లవర్స్‌ బీ అలర్ట్‌ : ప్రమాదకరమైన కుక్కలపై తమిళనాడు నిషేధం

దేశంలో వీధికుక్కల దాడులు, దుర్మరణాలు సంఖ్య పెరుగుతూ ఉండటం ఆందోళన రేపుతోంది.  ప్రతి ఏడాదీ మిలియన్ల కొద్దీ దాడుల కేసులు నమోదవుతున్నాయి.  ముఖ్యంగా పిల్లలు , సీనియర్ సిటిజన్ల మరణాలు కూడా సంభవిస్తున్నాయి.  దేశంలో 3.5 కోట్లకు పైగా వీధికుక్కలు ఉన్న నేపథ్యంలో ఇదొక సవాలుగా మారుతోంది. అంతేకాదు ఇటీవలి కాలంలోక ఒన్ని పెంపుడుకుక్కలు కూడా  మనుషులకు తీరనిహాని చేస్తున్న ఘటనలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  23 జాతుల కుక్కలపై తమిళనాడు ప్రభుత్వం నిషేధందేశంలో పెరుగుతున్న కుక్క కాటు కేసుల నేపథ్యంలో పిట్‌బుల్ టెర్రియర్, అమెరికన్ బుల్‌డాగ్, రోట్‌వీలర్ లాంటి పలు కుక్క జాతుల పెంపకాన్ని నిషేధించాలని కేంద్రం ఈ ఏడాది మార్చిలో రాష్ట్రాలను ఆదేశించిన  సంగతి తెలిసిందే. తమిళనాడులో పిట్‌బుల్ టెర్రియర్, తోసా ఇను సహా 23 రకాల క్రూరమైన కుక్క జాతులను నిషేధించినట్లు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ  నిన్న (గురువారం, ఏప్రిల్‌ 9)ప్రకటించింది. ఇటీవల చెన్నైలో రోట్‌వీలర్  డాగ్‌ బాలుడిని  గాయపరిచిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.క్రూరమైనవిగా భావించే 23 జాతుల దిగుమతి, పెంపకం, అమ్మకాలపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది.  అలాగే వీటి పెంపకం, విక్రయాలను నిలిపివేయాలని రాష్ట్రాలను కోరింది. అదే సమయంలో వాటికి గర్భనిరోధకానికి చర్యలు  అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, పశుసంవర్ధక శాఖ, పాడిపరిశ్రమ శాఖలకు లేఖ రాసింది. కొన్ని జాతుల కుక్కలను పెంపుడు జంతువులుగా, ఇతర ప్రయోజనాల కోసం ఉపగించకుండా నిషేధించాలని పౌరులు, సిటిజన్ ఫోరమ్‌లు, యానిమల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ (AWO) ఫిర్యాదుల నేపథ్యంలో  కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.దూకుడు , మానవులకు హాని కలిగించే  లక్షనాలున్న ఈ జాతులు ప్రమాదకరమైనవిగా పరిగణించబడతాయి  కేంద్రంస్పష్టం చేసింది . 2024 నాటికి భారతదేశంలో నిషేధించిన జాబితాను ప్రకటించింది. కేంద్రం నిషేధించిన కుక్కల జాతుల జాబితా పిట్‌బుల్ టెర్రియర్, టోసా ఇను, అమెరికన్ స్టాఫోర్డ్‌షైర్ టెర్రియర్, ఫిలా బ్రసిలీరో, డోగో అర్జెంటీనో, అమెరికన్ బుల్‌డాగ్, బోర్‌బోయెల్ కంగల్, సెంట్రల్ ఏషియన్ షెపర్డ్ డాగ్, కాకేసియన్ షెపర్డ్ డాగ్.  ఇంకా సౌత్ రష్యన్ షెపర్డ్ డాగ్, టోర్న్‌జాక్, సర్ప్లానినాక్, జపనీస్ టోసా, అకిటా, మాస్టిఫ్స్, టెర్రియర్స్, రోడేసియన్ రిడ్జ్‌బ్యాక్, వోల్ఫ్ డాగ్స్, కానరియో, అక్బాష్ డాగ్, మాస్కో గార్డ్ డాగ్, కేన్ కోర్సో,  బ్యాండాగ్‌ ఉన్నాయి.దాడులు ఎందుకు పెరుగుతున్నాయిభారతదేశంలో దాదాపు 1 కోటి పెంపుడు కుక్కలు ఉన్నాయి. అయితే వీధికుక్కల జనాభా చాలా ఎక్కువ.2019లో దేశంలో 4,146 కుక్కకాటు కేసులు నమోదై మానవ మరణాలకు దారితీశాయి. 2019 నుంచి దేశవ్యాప్తంగా  భారతదేశం 1.5 కోట్లకు పైగా కుక్క కాటు కేసులు వెలుగు చూశాయి. ఉత్తరప్రదేశ్, తమిళనాడు ,మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో అత్యధికంగా ఉన్నాయి.వీధికుక్కలు రెచ్చగొట్టినా, బెదిరించినా, లేదా తన బిడ్డలకు (కుక్క పిల్లలకు)  హాని జరుగుతుందని  భావించిన సూడి కుక్క దాడికి  తెగబడుతుంది.  వీధి కుక్కల దాడులకు దోహదపడే కారకాలు ప్రభుత్వం, జంతు సంక్షేమ సంస్థల నిర్లక్ష్యం మరియు వ్యక్తిగత ఉదాసీనత.వీధి కుక్కల జనాభాను నియంత్రించడానికి సమర్థవంతమైన చర్యలు లేకపోవడం కూడా  ప్రధానకారణంగా నిలుస్తోంది.వీధి కుక్కలకు ఆహారం ఇవ్వడం చట్టవిరుద్ధం కానప్పటికీ, వాటికి ఆహారం ఇచ్చినందుకు వ్యక్తులపై దాడి చేస్తున్న ఘటను చూస్తున్నాం.జంతు ఆరోగ్య సంరక్షణ , నియంత్రణ లేకపోవడంఆకలి లేదా ఇన్ఫెక్షన్ కారణంగా  వీధికుక్కలు దూకుడుగా  మారతాయి.19604 నాటి జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం ప్రకారం వీధి కుక్కలపైక విషప్రయోగం చేయడం చట్టరీత్యా నేరం.వీధి కుక్కల దాడుల సమస్యను పరిష్కరించడానికి మెరుగైన జంతు నియంత్రణ, అవగాహనతోపాటు  బాధ్యతాయుతమైన పెంపుడు జంతువుల యాజమాన్యంతో కూడిన సమగ్ర విధానం అవసరం. ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూనే  జంతువుల పట్ల దయ, కరుణ కలిగి ఉండటం  చాలా అవసరం. ఇప్పటికే ఈ నిషేధిత జాతులలో ఏదైనా జాతికి చెందిన కుక్క మీ దగ్గర ఉంటే, వాటి సంతానోత్పత్పిని అరికట్టేలా స్టెరిలైజేషన్‌ చేయించాల్సి ఉంటుంది. 

తనిష్క్ జ్యువెలరీ నెక్లెస్‌
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్‌డేస్’ ను విడుదల చేసిన తనిష్క్

ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన,  భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్‌ల నుండి ప్రేరణ పొంది  అద్భుతమైన మరియు వైవిధ్యమైన  శ్రేణి సమకాలీన,  రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్‌డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్‌డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్‌రోబ్‌కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్‌లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్‌లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్‌లు,  కస్టమర్‌లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా,  ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్‌లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్‌ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్‌ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్‌డేస్,  ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం  వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్‌లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్‌గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్‌లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్‌లెట్‌లు అయినా, గ్లామ్‌డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్‌లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్‌లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్‌డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు*. ఆఫర్‌లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్  18కేరట్  మరియు 22కేరట్  బంగారంలో విస్తృతమైన శ్రేణి  డిజైన్‌లతో,  నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని  సంపూర్ణం  చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్‌లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్‌డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన  సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను  అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా  కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్‌డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్‌తో, గ్లామ్‌డేస్ విభిన్నమైన నెక్లెస్‌లు, చెవిరింగులు, బ్రాస్‌లెట్‌లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్‌కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్‌డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్‌లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement

ఫోటో స్టోరీస్

View all