Dilsukhnagar blast case
-
సరైన న్యాయం!
పుష్కరకాలం క్రితం ఒక మునిమాపు వేళ హైదరాబాద్ నగరంలో 18 మంది అమాయకుల ప్రాణాలు తీసిన బాంబు పేలుళ్ల ఉదంతాల్లో దోషులుగా తేలిన ఆరుగురు నిందితులకూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక న్యాయస్థానం విధించిన మరణశిక్షను ధ్రువీకరిస్తూ తెలంగాణ హైకోర్టు మంగళవారం వెలువరించిన తీర్పు బాధిత కుటుంబాలకు మాత్రమే కాదు, ఉగ్రవాద ఘటనలను వ్యతిరేకించే వారందరికీ ఊరటనిస్తుంది. నగరంలోని దిల్‌సుఖ్‌నగర్‌లో రెండుచోట్ల జరిగిన ఈ పేలుళ్లలో మరో 131 మంది గాయాల పాలయ్యారు. వారిలో చాలామంది ఈనాటికీ ఆ గాయాలు కలిగించిన శారీరక, మానసిక క్లేశాల నుంచి కోలుకోలేకపోతున్నారు. మరణశిక్ష పడిన వారిలో రియాజ్ భత్కల్ అనే ఉగ్రవాది ఇప్పటికీ పాకిస్తాన్లో తలదాచుకున్నాడు. ఈ పేలుళ్లకు పథకం పన్నడంతోపాటు అందుకు కావల్సిన నిధుల సమీకరణ, పేలుడు పదార్థాలు, మనుషుల్ని సమకూర్చుకోవటం వగైరాలకు సూత్రధారి రియాజే. ఏవో కొన్ని ఉగ్రవాద ఘటనల ద్వారా దేశంలో అల్లకల్లోలం సృష్టించవచ్చని, దేశాన్ని బలహీనపరచవచ్చని ఈ బాపతు ఉగ్రవాదులు కలలుగంటారు. ఉగ్రవాదం మామూలు ఉన్మాదం కాదు. అది ఎప్పుడు ఎక్కడ తన విషపుకోరలు చాస్తుందో... ఎవరిని కాటేస్తుందో అంచనా వేయటం కూడా అసాధ్యం. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద సంస్థలు అక్కడి సైన్యం, దాని గూఢచార విభాగం ఐఎస్ఐ సహకారంతో శిక్షణ శిబిరాలు నిర్వహించటం, యువకులను తప్పుడు మార్గానికి మళ్లించటం, సాధారణ ప్రజానీకానికి హాని కలిగించగల చర్యలకు ప్రేరేపించటం దశాబ్దాలుగా సాగుతోంది. ఆ సంస్థల ప్రేరణతో సొంతంగా ఉగ్రవాద సంస్థలను నెలకొల్పి భయోత్పాతాన్ని సృష్టించటం భత్కల్ లాంటివారికి లాభసాటి వ్యాపారంగా కూడా మారిందని దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల ఉదంతంపై చేసిన దర్యాప్తులో వెల్లడైంది. మంగళూరు సమీప ప్రాంతాల్లో రియాజ్ భత్కల్ భారీయెత్తున రియల్ ఎస్టేట్ వెంచర్లు నిర్వహించాడని, జిహాద్ పేరుతో దేశంలోనూ, వెలుపలా లక్షలాది రూపాయలు వసూలు చేసి సొంత ఖాతాలకు మళ్లించుకున్నాడని కూడా బయటపడింది.తమను తాము మత సంరక్షకులుగా చిత్రించుకోవటం, జిహాద్ చేస్తున్నామని మభ్యపెట్టడం భత్కల్ లాంటివారికి రివాజు. వీరి వలలోపడి అనేకమంది యువకుల జీవితాలు నాశనమయ్యాయి. జనసమ్మర్దంగల ప్రాంతాల్లో బాంబులుంచి సాధారణ పౌరుల ప్రాణాలకు హాని కలిగించే ఇలాంటి వారికి కఠినమైన శిక్ష విధించటం సమాజ శ్రేయస్సు కోసం తప్పనిసరి. ఈ పన్నెండేళ్ల కాలంలోనూ వీరు తమ చర్యలకు పశ్చాత్తాపం ప్రకటించటంగానీ, ఇకపై సత్ప్రవర్తనతో మెలుగుతామని గానీ ఎక్కడా చెప్పలేదు. వీరిలో పరివర్తనకూ లేదా సంస్కరణకూ అవకాశమే లేదని నిర్ధారణ కొచ్చినట్టు ఉన్నత న్యాయస్థానం చెప్పిందంటే ఈ నేరగాళ్లు ఎంత కరుడు గట్టిపోయారో అర్థమవుతుంది. ఉగ్రవాదులు మతం పేరు చెప్పుకోవచ్చుగానీ ఏ మతమూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించదు. ఉగ్రవాదానికి అసలు మతం ఉండదు. ఇలాంటి నేరగాళ్ల చర్యల వల్ల మాత్రమే మతం సురక్షితంగా మనుగడ సాగించగలదని అందులోని వారెవరూ విశ్వసించరు కూడా! కానీ అమాయకులను నమ్మించటానికి వీరు మతాన్ని సాధనంగా వాడుకుంటారు. వారిని మభ్యపెట్టడం కోసం ఆధ్యాత్మి కతను ప్రబోధిస్తారు. క్రమేపీ తమ దురాలోచనను వారి మెదళ్లలోకి ఎక్కిస్తారు. అప్పటికల్లా ఆ యువకులు వీరి చేతుల్లో కీలుబొమ్మలుగా మారుతారు. ఇలాంటివారికి చివరకు మిగిలేదేమిటో, వారి మానసిక, శారీరక స్థితిగతులు ఎలా దిగజారతాయో తెలియటానికి జాతీయ న్యాయ విశ్వ విద్యాలయ విద్యార్థులు కొందరు వారితో మాట్లాడి రూపొందించిన నివేదికే సాక్ష్యం. భిన్న వర్గాల ప్రజల మధ్య చిచ్చురేపి దేశాన్ని విచ్ఛిన్నం చేయటానికీ, సమాజాన్ని భయభ్రాంతపరచటానికీ వీరు పాల్పడిన చర్యల వల్ల ఎక్కడెక్కడి నుంచో పొట్టకూటి కోసం ఈ మహానగరాని కొచ్చిన సాధారణ ప్రజానీకం బలయ్యారు. అందులో అన్ని మతాలవారూ ఉన్నారు. ఇంకా అమ్మ కడుపులోనే ఉన్న శిశువు మొదలుకొని స్త్రీలు, పిల్లలు కూడా వీరి మతిమాలిన చేష్టలకు బలైపోయారు. అనేకమంది జీవితాలు అనిశ్చితిలో పడ్డాయి. మనుషులైవుండి తోటి మనుషుల పట్ల ఇంత క్రూరంగా, ఇంత దారుణంగా వ్యవహరించటం ఊహకందనిది. ఇలాంటి ఉదంతాల్లో ఆచూకీ దొరక్కుండా సులభంగా తప్పించుకోవచ్చని, నేర నిరూపణ అసాధ్యమని నేరగాళ్లు భావిస్తుంటారు. కానీ సాంకేతికత బాగా పెరిగిన ఈ కాలంలో అదేమంత కష్టం కాదని పకడ్బందీ దర్యాప్తు ద్వారా ఎన్ఐఏ నిరూపించింది. అయితే ఇలాంటి కేసుల్లో ఇమిడివుండే సంక్లిష్టతల వల్ల కావొచ్చు... మన న్యాయస్థానాలకు ఉండే పెండింగ్ కేసుల భారం వల్ల కావొచ్చు విచారణకు సుదీర్ఘ సమయం పడుతోంది. ఈ ఉదంతం చోటుచేసుకున్ననాటినుంచీ చూస్తే ఇప్పటికి పన్నేండేళ్ల సమయం పట్టింది. త్వరితగతిన విచారించి శిక్షించే వ్యవస్థ ఉంటే అలాంటి బాటలో పోయేవారికి అదొక హెచ్చరికగా పనికొస్తుంది. ఈ తరహా భయోత్పాత చర్యలకు ఒక నిరోధంగా ఉపయోగపడుతుంది. అయితే ఈ ఉదంతంలో అయిన వారిని కోల్పోయినవారికీ, ప్రాణాలతో బయటపడి భారంగా బతుకీడుస్తున్నవారికీ ఇప్పటికీ ప్రభుత్వ సాయం అందలేదంటే మనసు చివుక్కుమంటుంది. కాళ్లూ చేతులూ కోల్పోయి, చూపు, వినికిడి దెబ్బతిని, కనీసం మందులు కొనే శక్తిలేక అనేకులు కష్టాలు పడుతుండటం కలచివేస్తుంది. ఈ విషయంలో ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. -
ఇలాంటి శిక్ష ఇదే తొలిసారి!
సాక్షి, హైదరాబాద్: దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో దోషులుగా తేలిన ఐదుగురు ఉగ్రవాదులకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టు వేసిన ఉరి శిక్షను హైకోర్టు సమర్థించడం తెలిసిందే. అయితే ఓ కేసులో నిందితులందరికీ ఉరి శిక్ష పడటం, కింది కోర్టు తీర్పును హైకోర్టు యథాతథంగా సమర్థించడం తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇదే తొలిసారి. ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులుగా ఉండగా.. ప్రధాన సూత్రధారి రియాజ్ భత్కల్ ఇంకా పరారీలోనే ఉన్నాడు. మిగతా ఐదుగురికి ఉరి శిక్షను ఉన్నత న్యాయస్థానం ఖరారు చేసింది. దేశంలో ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాద సంస్థ పాల్పడిన ఘాతుకాలకు సంబంధించి విచారణ పూర్తై, కింది కోర్టులో శిక్షపడి, దాన్ని హైకోర్టు ఖరారు చేసిన తొలి కేసు ఇదే కావడం గమనార్హం.ఎవరీ ఐదుగురు? ఇప్పుడెక్కడ ఉన్నారు?పాకిస్తాన్లో తలదాచుకున్న రియాజ్ భత్కల్ ఆదేశాల మేరకు జరి ్డగిన ఈ ఆపరేషన్‌లో అతడి సోదరుడు మహ్మద్ అహ్మద్ సిద్ధిబప్ప అలియాస్ యాసీస్ భత్కల్‌తో పాటు అసదుల్లా అక్తర్ అలియాస్ హడ్డీ, జియా ఉర్ రెహ్మాన్ అలియాస్ వకాస్ (పాకి స్తానీ), మహ్మద్ తెహసీన్ అక్తర్ అలియాస్ మోను, ఎజాజ్ షేక్ పాల్గొన్నారు. పేలుళ్లపై దర్యాప్తు చేపట్టిన ఎన్ఐఏ దేశంలోని వేర్వే రు ప్రాంతాల్లో వీరిని అదుపులోకి తీసుకుంది. వివిధ కేసులకు సంబంధించి కొంతకాలం ముంబై, పుణే జైళ్లలో ఉన్న ఈ ఐదుగురూ ప్రస్తుతం తిహార్ జైల్లో విచారణ ఖైదీలుగా ఉన్నారు.ఎప్పుడు.. ఎక్కడ చిక్కారంటే..ఎజాజ్ షేక్‌ను 2013 సెప్టెంబర్ 6న ఉత్తరప్రదేశ్ పశ్చిమ ప్రాంతమైన సహరంగ్‌పూర్ రైల్వే స్టేషన్లో పట్టుకున్నట్లు ఎన్ఐఏ రికార్డుల్లో పేర్కొంది. యాసీన్, హడ్డీలు 2013 ఆగస్టు 29న బిహార్‌లోని రక్సుల్ ప్రాంతంలో దొరికారని తెలిపింది. జియా ఉర్ రెహ్మాన్‌ను రాజస్తాన్‌లోని అజ్మీర్ రైల్వేస్టేషన్లో 2014 మార్చ్ 22న, తెహసీన్ అక్తర్‌ను పశ్చిమ బెంగాల్‌లోని కాఖర్‌ర్బిత ప్రాంతంలో 2014 మార్చి 25న పట్టుకున్నట్లు పేర్కొంది. యాసీన్ అరెస్టు తర్వాత ఎజాజ్ షేక్‌కు దిల్సుఖ్నగర్ పేలుళ్ళలో పాత్ర ఉన్నట్లు తేలింది. కాగా వీరందరినీ వేర్వేరు సమయాల్లో ఎన్ఐఏ హైదరాబాద్‌కు తీసుకువచ్చి అరెస్టు చేసింది. రెండు కేసులు .. ఒకే ఉదంతం2013 ఫిబ్రవరి 21న తొలుత దిల్‌సుఖ్‌నగర్‌లోని 107 బస్టాప్ వద్ద , తర్వాత ఏ–1 మిర్చి సెంటర్ వద్ద కొన్ని సెకన్ల తేడాతో జరిగిన పేలుళ్లలో ఓ గర్భస్థ శిశువు సహా 18 మంది మరణించగా.. 131 మంది క్షతగాత్రులయ్యారు. మొదటిది సాయంత్రం 6 గంటల 58 నిమిషాల 38 సెకండ్లకు పేలగా, రెండోది 6 గంటల 58 నిమిషాల 44 సెకండ్లకు పేలింది. హైదరాబాద్‌లోని మలక్‌పేట, అప్పటి సైబరాబాద్, ఇప్పటి రాచకొండ కమిషనరేట్‌లోని సరూర్‌నగర్ ఠాణాల్లో నమోదైన ఈ కేసులు దర్యాప్తు నిమిత్తం ఎన్ఐఏకు బదిలీ అయ్యాయి.దిల్సుఖ్నగర్ జంట పేలుళ్లకు సంబంధించి సాంకేతికంగా రెండు కేసులు నమోదైనప్పటికీ ఒకే ఘటన కింద పరిగణనలోకి తీసుకున్నారు. నగరంలో 1990ల నుంచీ ఉగ్రవాద ఛాయలు ఉండటంతో అనేక కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఏ కేసులోనూ ఎవరికీ ఉరి శిక్ష పడిన దాఖలాలు లేవు. అలాగే ఒకే ఉదంతానికి సంబంధించి మొత్తం దోషులందరికీ ఉరి శిక్షలు వేసిన కేసులు కూడా లేవు.ఏ ప్రాంతానికి చెందినవాళ్లు?⇒ రియాజ్ భత్కల్: కర్ణాటకలోని భత్కల్‌లో ఉన్న తెంగినగుడి ⇒ అసదుల్లా అక్తర్: ఉత్తరప్రదేశ్‌లోని ఆజమ్‌గఢ్‌లో ఉన్న గులమ్కాపూర్⇒ జకీ ఉర్ రెహ్మాన్: పాకిస్తాన్ పంజాబ్‌లో ఉన్న గోజారా⇒ తెహసీన్ అక్తర్: బిహార్‌లోని సమిస్తిపూర్ జిల్లా ముట్కాపూర్ ⇒ యాసీన్ భత్కల్: కర్ణాటకలోని భత్కల్‌లో ఉన్న ముగ్దుం కాలనీ.⇒ ఎజాజ్ షేక్: మహారాష్ట్రలోని పుణే ఘోర్పేట్ఎవరి పాత్రలు ఏంటి?రియాజ్ భత్కల్: కీలక సూత్రధారియాసీన్ భత్కల్: నేపాల్‌లో ఉండి కుట్రను అమలు చేశాడువకాస్: 107 బస్‌స్టాప్ వద్ద బాంబుతో ఉన్న సైకిల్ పెట్టాడుమోను: ఏ–1 మిర్చి సెంటర్ వద్ద బాంబుతో ఉన్న సైకిల్ వదిలాడుహడ్డీ: అబ్దుల్లాపూర్ మెట్లో షెల్టర్ తీసుకున్నాడు. సైకిళ్ళు తదితరాలు కొనుగోలు చేశాడు.ఎజాజ్: అవసరమైన పేలుడు పదార్థాలు, నగదు సమకూర్చాడువిచారణ పూర్తి, శిక్షలు..2016 నవంబర్ 21న కేసుల విచారణ పూర్తి కాగా.. డిసెంబర్ 13న పరారీలో ఉన్న రియాజ్ మినహా మిగిలిన ఐదుగురినీ ఎన్ఐఏ కోర్టు దోషులుగా తేల్చింది. అదే నెల 19న వారికి ఉరి శిక్ష విధించింది. -
17 ఏళ్లుగా పరారీలోనే!
సాక్షి, హైదరాబాద్: రియాజ్ భత్కల్.. 2007 నాటి గోకుల్ చాట్, లుంబినీ పార్క్, 2013 నాటి దిల్సుఖ్నగర్ పేలుళ్ళకు సూత్రధారిగా, ఈ కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది. తెలంగాణ సహా తొమ్మిది రాష్ట్రాల్లో నమోదైన విధ్వంసాల కేసుల్లో ఇతని పేరు ప్రముఖంగా ఉంది. 2008లో అజ్ఞాతంలోకి వెళ్లిపోయి, 17 ఏళ్లుగా పరారీలో ఉన్న రియాజ్ భత్కల్ ఇప్పటికీ చిక్కలేదు. భత్కల్‌లో పుట్టి.. నేరబాట పట్టిరియాజ్ భత్కల్ అసలు పేరు రియాజ్ అహ్మద్ షహబంద్రి. కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా భత్కల్ గ్రామంలో 1976 మే 19న పుట్టాడు. ఈ ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలు, స్మగ్లింగ్ వ్యవహారాలు ఎక్కువ. వాటి ప్రభావంతో నేరబాట పట్టాడు. వీరి కుటుంబం కొన్నాళ్ల పాటు మహారాష్ట్రలోని ముంబైలో నివసించింది. ఇతనికి ఆది నుంచీ డబ్బుపైన ఆశ ఎక్కువ. ఆ యావలోనే ముంబై గ్యాంగ్‌స్టర్ ఫజల్ ఉర్ రెహ్మాన్ ముఠాలో చేరాడు. బెదిరింపులు, కిడ్నాప్‌లు తదితర వ్యవహారాల ద్వారా డబ్బు సంపాదించడం ప్రారంభించాడు.ఈ మేరకు ఇతనిపై కోల్‌కతా, ముంబయి, కర్ణాటకల్లో అనేక కేసులు నమోదైనా..ఒక్కసారీ అరెస్టు కాలేదు. ఈ గ్యాంగు నుంచి బయటకు వచ్చిన తర్వాత కుర్లా ప్రాంతంలో ‘ఆర్ఎన్’ పేరుతో కొత్తముఠా కట్టి కొంతకాలం వ్యవహారాలు సాగించాడు. అక్కడ స్థానికంగా ఓ ప్రార్థన స్థలానికి, ప్రత్యేక కార్యక్రమాలకు తరచూ వెళ్లేవాడు. ఆ క్రమంలో నిషిద్ధ స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమి)లో కొంతకాలం పని చేశాడు. అప్పడికే ఇతని అన్న ఇక్బాల్ భత్కల్ పాక్ ప్రేరేపిత లష్కరే తొయిబాతో సంబంధాలు పెట్టుకోవడంతో అతని ద్వారా ఉగ్రవాదం వైపు మళ్లాడు.ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఏర్పాటులో కీలక పాత్ర పోషించి, రెండో కమాండ్ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నాడు. ఆసిఫ్ రజా కమెండో ఫోర్స్ పేరుతో ఉగ్రవాద సంస్థను ప్రారంభించిన కోల్‌కతా వాసి అమీర్ రజా ఖాన్ నుంచి అందే ఆదేశాల ప్రకారం చేపట్టాల్సిన విధ్వంసాలకు పేలుడు పదార్థాలు, మనుషులు, డబ్బు ఏర్పాటు చేస్తుంటాడు. ధనార్జన కోసం రియల్టర్ అవతారం... జిహాద్ పేరుతో యువకులను ఉగ్రవాదం వైపు నడిపించి వారి భవితను భత్కల్ బుగ్గిపాలు చేశాడు. తాను మాత్రం ఉగ్రవాదం పేరు చెప్పి వసూలు చేసిన నిధులను భారీగా దారి మళ్లించి రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహించాడు. మరిన్ని నిధుల కోసం పుణేకు చెందిన వ్యాపారులను కిడ్నాప్ చేయాలని కుట్రపన్నాడు. విధ్వంసాలకు శిక్షణ, పేలుడు పదార్థాల కొనుగోలు, ఆయుధాల సేకరణ పేరుతో కొన్ని విదేశీ సంస్థల నుంచి హవాలా ద్వారా భారీగా నిధులు సమీకరించాడు. అయితే వాటిని తన సొంత ఖాతాల్లోకి మార్చుకుంటూ మంగళూరు సమీపంలోని థోయ్యత్తు, ఉల్లాల్ పరిసరాల్లో భారీగా రియల్ ఎస్టేట్ వెంచర్లు నిర్వహించాడు. హైదరాబాద్, జైపూర్, బెంగళూరు, అహ్మదాబాద్ పేలుళ్ల నిమిత్తం అంటూ విదేశీ సంస్థల నుంచి రూ.లక్షల్లో నిధులు సమీకరించాడు. గుట్టు బయటపడింది ఇతని వల్లే..ఐఎంలో కీలక వ్యక్తిగా ఉన్న రియాజ్ భత్కల్ అనేక పేలుళ్ల సందర్భంలో కొన్ని ఈ–మెయిల్స్ రూపొందించి మీడియా సంస్థలకు పంపాడు. ఇలా చేయడాన్ని మరో ఉగ్రవాదైన సాదిక్ షేక్ పూర్తిగా వ్యతిరేకించాడు. దీనివల్ల తమ ఉనికి బయటపడుతుందని, దర్యాప్తు సంస్థలకు పట్టుబడే అవకా శం ఉందని వాదిస్తూ వచ్చాడు. ఈ మాటలను రియాజ్ పెడచెవిన పెట్టాడు. ప్రతి విధ్వంసానికీ అత్యంత పకడ్బందీగా వ్యూహరచన చేసి కథనడిపేది తామైతే... చివరకు పేరు మాత్రం సీమాంతర ఉగ్రవాద సంస్థలకు రావడం రియాజ్‌కు రుచించలేదు.తమ సంస్థ పేరు బయటకు వచ్చి ప్రచారం జరిగితే నిధులు సైతం భారీగా వస్తాయంటూ సాదిక్‌తో వాదించాడు. చివరకు తన పంతం నెగ్గించుకుని ప్రతి విధ్వంసానికీ ముందు ఈ–మెయిల్ పంపడం ప్రారంభించాడు. ఈ మెయిల్స్ వచ్చిన ఐపీ అడ్రస్ ఆధారంగా దర్యాప్తు చేసిన అధికారులు ఐఎంకు సంబంధించిన కొన్ని వివరాలు సేకరించారు. అలా ప్రారంభమైన దర్యాప్తుతోనే 2008లో ఐఎం గుట్టురట్టు అయింది. దీంతో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన రియాజ్... ప్రస్తుతం పాకిస్తాన్‌లోని డిఫెన్స్ ఏరియాలో తలదాచుకుంటున్నట్టు సమాచారం. -
ఆ ఐదుగురు ఉగ్రవాదులకు 'ఉరే సరి'
‘‘అమాయక పౌరులపై ఉగ్రదాడులు జరిపి వారి మరణానికి కారణమైనప్పుడు ఉరిశిక్ష విధించాలనే వాదన సరైందే. నగరంలో పేలుళ్లకు పాల్పడటాన్ని సాధారణ నేరంగా పరిగణించరాదు. చిన్నాపెద్దా, ఆడామగా తేడా లేకుండా అంతమొందించి భయబ్రాంతులకు గురిచేయడం క్రూరత్వమే. దీన్ని వ్యవస్థీకృత నేరంగా పరిగణించాల్సి ఉంది. అరుదైన నేరాల్లో ఒకటిగా భావించాలి. విచక్షణా రహితంగా ప్రాణాలను హరించడమే లక్ష్యంగా బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ప్రాసిక్యూషన్‌లోని చిన్న చిన్న లోపాలతో దోషులు లబ్ధి పొందలేరు. సాక్షులు తప్పుడు సాక్ష్యం చెప్పారని దోషుల తరఫు న్యాయవా దులు పేర్కొనడంలో అర్థంలేదు. మృతుల్లో పసికందు కూడా ఉంది. వారి కుటుంబీకులకు తప్పుడు సాక్ష్యం చెప్పాల్సిన అవసరం లేదు. మరణ వాంగ్మూలాలను నమోదు చేయనంత మాత్రాన ఇలాంటి కేసుల్లో నష్టం జరగదు. దోషుల్లో కొందరు తుపాకీ సహా ఇతర ఆయుధాలను వినియోగించడంలో సిద్ధహస్తులు. ఇలాంటి కిరాతక హత్యల విషయంలో ఉపశమనం ఇవ్వడం అర్థరహితం. కనికరం అన్న దానికి తావే లేదు. అంతిమ శిక్ష మరణశిక్షే..’’ – హైకోర్టు ధర్మాసనం సాక్షి, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో హైకోర్టు సంచలనాత్మక తీర్పు వెలువరించింది. దోషులుగా తేలిన ఉగ్రవాదులకు ఉరి శిక్షే సరైందని స్పష్టం చేసింది. ఈ మేరకు 2016 డిసెంబర్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పును యథాతథంగా సమర్థించింది. ట్రయల్ కోర్టు ఉత్తర్వుల్లో ఎందుకు జోక్యం చేసుకోవాలో నిరూపించడంలో అప్పీల్‌దారులు విఫలమయ్యారని పేర్కొంది. అసదుల్లా అక్తర్, జియా ఉర్ రెహ్మాన్, తెహసీన్ అక్తర్, మహ్మద్ అహ్మద్ సిద్ధిబప్ప అలియాస్ యాసీన్ భత్కల్, ఎజాజ్ షేక్ దాఖలు చేసిన అప్పీళ్లను కొట్టివేసింది. దోషులకు మరణ శిక్ష ఖరారు చేస్తూ జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ శ్రీసుధ ధర్మాసనం మంగళవారం 357 పేజీల సుదీర్ఘ తీర్పు వెలువరించింది. పన్నెండేళ్ల క్రితం.. 2013 ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన జంట పేలుళ్లలో 18 మంది మృతి చెందగా, 131 మంది గాయపడ్డారు. ఈ కేసులో దోషులుగా తేలిన ఐదుగురికి ఎన్ఐఏ ఫాస్ట్ ట్రాక్ కోర్టు 2016లో ఉరి శిక్ష విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ముద్దాయిలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ అప్పీళ్లపై హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. నిందితుల తరఫున న్యాయవాదులు ఆర్.మహదేవన్, అప్పం చంద్రశేఖర్ వాదనలు వినిపించగా, ఎన్ఐఏ తరఫున సీనియర్ న్యాయవాది, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి.విష్ణువర్ధన్ రెడ్డి వాదనలు వినిపించారు. సుమారు 45 రోజుల పాటు సాగిన సుదీర్ఘ వాదనలు, సాక్ష్యాధారాల పరిశీలన అనంతరం తీర్పును రిజర్వు చేసిన ధర్మాసనం మంగళవారం కింది కోర్టు తీర్పును సమర్ధిస్తూ తీర్పునిచ్చింది. దిల్‌సుఖ్‌న గర్ వద్ద పేలుడు దృశ్యం(ఫైల్) మొత్తం సమాజంపై దుష్ప్రభావం.. ‘ఎన్ఐఏ కోర్టు వాస్తవ పరిస్థితులన్నింటినీ పరిగణనలోకి తీసుకుని అప్పీలుదారులకు వివిధ సెక్షన్ల కింద మరణశిక్ష, జీవిత ఖైదు, ఇతర శిక్షలను విధించింది. అప్పీలుదారులు చేసిన వ్యక్తిగత వాదనలు, సాక్షుల వాంగ్మూలాలను కూలంకషంగా పరిశీలించింది. అప్పీలుదారులకు వ్యతిరేకంగా శిక్షలను విధించడానికి బలమైన, సహేతుకమైన కారణాలను నమోదు చేసింది. శిక్షలను విధించడంలో ట్రయల్ కోర్టు ఎక్కడా ఏకపక్షంగా, అసమంజసంగా వ్యవహరించలేదు. ప్రభుత్వ నివేదికలను పరిశీలించిన తర్వాత.. సీఆర్పీసీ సెక్షన్ 366 ప్రకారం 2016, డిసెంబర్ 19న ట్రయల్ కోర్టు విధించిన మరణశిక్ష సరైనదేనని ఈ ధర్మాసనం భావిస్తోంది. ఇలాంటి కేసుల విచారణలో కునాల్ మజుందార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్తాన్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. ఇది అత్యంత క్రూరమైన నేరం. ఇది బాధితులపైనే కాదు, మొత్తం సమాజంపై దుష్ప్రభావాలు చూపించింది. ఇలాంటి కేసుల్లో నేరస్తుల మనస్తత్వం, నేరం జరిగిన వెంటనే, ఆ తర్వాత దోషుల ప్రవర్తన, నేరస్తుల గత చరిత్ర, నేర పరిమాణం, బాధితులపై ఆధారపడిన వారిపై దాని పరిణామాలు.. ఇలా అన్ని అంశాలను పరిశీలించాల్సి ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. అలాగే ఇలాంటి కేసుల్లో ఇచ్చే తీర్పు శాంతిని ప్రేమించే పౌరుల మనసుల్లో విశ్వాసాన్ని నింపాలి. ఇతరులు అలాంటి నేరాలకు పాల్పడకుండా నిరోధించే లక్ష్యాన్ని సాధించేలా ఉండాలి. కాబట్టి దోషుల సంస్కరణకు, పునరావాసానికి అవకాశం ఇచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ జీవిత ఖైదు పూర్తిగా వ్యర్థం. ఎందుకంటే ఇలాంటి నేరుస్తుల విషయంలో సంస్కరణ శిక్షతో లక్ష్యం పూర్తిగా నెరవేరదు. కాబట్టి దోషుల అప్పీళ్లను కొట్టివేస్తున్నాం. వీరికి ఎన్ఐఏ కోర్టు విధించిన మరణశిక్షనుధ్రువీకరిస్తున్నాం. సీఆర్పీసీ సెక్షన్ 363లోని సబ్ సెక్షన్(2) నిబంధన మేరకు దోషులకు తీర్పు కాపీని ఉచితంగా అందజేయాలి. నేటి నుంచి 30 రోజుల్లోగా సుప్రీంకోర్టు ముందు అప్పీల్ చేసుకునే హక్కు దోషులకు ఉంటుంది..’ అని ధర్మాసనం పేర్కొంది. ఏ–1 రియాజ్ భత్కల్ఈ కేసులో ఎన్ఐఏ రియాజ్ భత్కల్ను ఏ–1గా చేర్చింది. అసదుల్లా అక్తర్ (ఏ–2), జియా ఉర్ రెహ్మాన్ (పాకిస్తాన్ వాసి, ఏ–3), తెహసీన్ అక్తర్ (ఏ–4), మొహమ్మద్ అహ్మద్ సిద్ధిబప్ప అలియాస్ యాసీన్ భత్కల్(ఏ–5), ఎజాజ్ షేక్ (ఏ–6)గా ఉన్నారు. 157 మంది సాక్షులుగా ఉన్నారు. ఎన్ఐఏ కోర్టు 502 డాక్యుమెంట్లు, 201 ఎవిడెన్స్‌లను (సాక్ష్యాధారాలు) పరిశీలించి నిందితులను దోషులుగా నిర్ధారించింది. ఐదుగురికి ఉరి శిక్ష వేసింది. 2016 డిసెంబర్ 24న దోషులు హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. -
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు నిందితులకు ఉరిశిక్ష
సాక్షి, హైదరాబాద్: దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. ఈ కేసు నిందితులకు హైకోర్టు ఉరిశిక్ష విధించింది. ఎన్ఐఏ కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది. పేలుళ్లకు పాల్పడ్డ ఐదుగురికి హైకోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. నిందితుల అప్పీల్ పిటిషన్‌ను కొట్టేసిన న్యాయస్థానం.. అక్తర్, జియా ఉర్ రహమాన్, తహసీన్ అక్తర్, యాసిన్ భత్కల్, అజాజ్ షేక్‌కు ఉరి శిక్ష విధించింది.2013లో జరిగిన ఈ పేలుళ్లలో 18 మంది మృతి చెందగా, 130 మంది వరకు గాయపడ్డారు. ఈ కేసులో కీలక నిందితుడు యాసిన్ భత్కల్ సహా ఐదుగురికి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) ఫాస్ట్ ట్రాక్ కోర్టు 2016లో ఉరి శిక్ష విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ముద్దాయిలు హైకోర్టును ఆశ్రయించారు.ఇరుపక్షాల వాదనలు పూర్తి కావడంతో జస్టిస్ కె.లక్ష్మణ్ ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. 2013, ఫిబ్రవరి 21న హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లో పేలుళ్లు సంభవించాయి. ఎన్ఐఏ రంగంలోకి దిగి దర్యాప్తు చేసింది. 157 మంది సాక్ష్యాలను నమోదుచేసింది. ఈ ఘటనలో ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రసంస్థ సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ ప్రధాన నిందితుడిగా తేలింది.అసదుల్లా అక్తర్, వకాస్, తెహసీన్ అక్తర్, ఎజాజ్ షేక్, సయ్యద్ మక్బూల్‌ని నిందితులుగా గుర్తించారు. మూడేళ్లు ఈ కేసులు విచారించిన ఎన్ఐఏ స్పెషల్ కోర్టు.. నిందితులకు మరణశిక్షను విధించింది. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన యాసిన్ భత్కల్ను 2013లో నేపాల్ సరిహద్దుల్లో పట్టుకున్నారు. ఢిల్లీ, దిల్సుఖ్నగర్ పేలుళ్ల కేసు సహా పలు కేసుల్లో దోషిగా తేలగా తిహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. -
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో రేపే తీర్పు
హైదరాబాద్, సాక్షి: దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో రేపు(మంగళవారం) తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించనుంది. 2013లో జరిగిన పేలుళ్లలో 18 మంది చనిపోగా.. 130 మందికి గాయాలు అయ్యాయి. ఈ కేసు విచారణ జరిపిన ఎన్ఐఏ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు మోస్ట్‌వాంటెడ్ ఉగ్రవాది యాసిన్ భత్కల్ సహా ఐదుగురికి మరణశిక్ష విధించింది. అయితే.. ఈ శిక్షను సవాల్ చేస్తూ ముద్దాయిలు హైకోర్టును ఆశ్రయించారు. 2013 ఫిబ్రవరి 21న నగరంలో అత్యంత రద్దీ ప్రాంతమైన దిల్సుఖ్ నగర్లో పేలుళ్లు సంభవించాయి. ఎన్ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) దర్యాప్తు జరిపింది. విచారణలో 157 మంది సాక్ష్యాలను రికార్డ్ చేసింది. ఈ దర్యాప్తులో ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ ప్రధాన నిందితుడిగా తేలింది. నిందితులలో అసదుల్లా అఖ్తర్, వకాస్, తెహసీన్ అఖ్తర్, ఎజాజ్ షేక్, సయ్యద్ మక్బూల్ నిందితులుగా ఉన్నారు. మూడేళ్లపాటు ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానంలో జరిగిన విచారణ అనంతరం.. నిందితులపై మరణశిక్ష పడింది. ఈ కేసుతో పాటు పలు ఉగ్రదాడుల్లో కీలకంగా వ్యవహరించిన యాసిన్ భత్కల్ను 2013లో బీహార్-నేపాల్ సరిహద్దులో పట్టుకోగలిగారు. ఢిల్లీ(2008), దిల్సుఖ్ నగర్ పేలుళ్ల కేసు సహా పలు కేసుల్లో దోషిగా తేలడంతో తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. -
సీడీ దొరక్క శిక్ష పడలేదు!
సాక్షి, హైదరాబాద్: అతడో కరుడుగట్టిన ఉగ్రవాది.. దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసులో మరణ శిక్ష పడిన వారిలో ఒకడు.. ఢిల్లీలోని జామా మసీదు వద్ద జరిగిన విధ్వంసం కేసులోనూ నిందితుడిగా ఉన్నాడు.. ఆ కేసులో కీలక సాక్ష్యంగా ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్‌తో కూడిన సీడీ అక్కడి కోర్టుకు చేరలేదు.. పోలీసుల వద్దే మిస్ కావడంతో నిర్దోషిగా ప్రకటిస్తూ న్యాయస్థానం గత వారం తీర్పు ఇచ్చింది. ఐటీ ప్రొఫెషనల్ నుంచి ఉగ్రవాదిగా మారిన పుణేవాసి ఎజాజ్ సయీద్ షేక్ నేపథ్యమిది. మహారాష్ట్రలోని పుణేలో ఉన్న ఘోర్పేట్ పీఠ్‌కు చెందిన ఎజాజ్ షేక్ ప్రముఖ బీపీఓ సంస్థలో ఐటీ నిపుణుడిగా పని చేశాడు. ఇండియన్ ముజాహిదీన్(ఐఎం) ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకులు రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్ ప్రధాన అనుచరుడు మోహిసిన్ చౌదరికి సమీప బంధువు. అతడి ద్వారానే ఉగ్రవాద బాటపట్టాడు. 2008లో ఢిల్లీలోని బాట్లాహౌస్ ఎన్కౌంటర్ తర్వాత పాకిస్థాన్‌కు పారిపోయిన మోహిసిన్ చౌదరితో సంప్రదింపులు జరుపుతూనే ఉండేవాడు. ఇతడి ద్వారానే ఐంఎ మాస్టర్‌మైండ్ రియాజ్ భత్కల్‌కు దగ్గరయ్యాడు. బాంబు పేలుళ్లకు కొన్ని నిమిషాల ముందు మీడియా సంస్థకు ఈ–మెయిల్స్ పంపడానికి ఐఎం ఓ మీడియా సెల్‌నే ఏర్పాటు చేసుకుంది. దీనికి ఇన్చార్జ్గా ఉన్న పుణేవాసి మన్సూర్ అస్ఘర్ పీర్భాయ్ వ్యవహరించాడు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి, ఢిల్లీలోని జామా మసీదు, పుణేలోని జర్మన్ బేకరీ ఉదంతాలకు ముందూ ఇలాంటి ఈ–మెయిల్స్ మీడియాకు వచ్చాయి. వీటిపై సాంకేతికంగా దర్యాప్తు చేసిన ఢిల్లీ స్పెషల్ సెల్ అధికారులు ఎజాజ్ పాత్రను గుర్తించారు. 2013 సెపె్టంబర్ 6న ఉత్తరప్రదేశ్‌లోని పశి్చమ ప్రాంతమైన సహరంగ్‌పూర్ రైల్వే స్టేషన్లో ఇతడిని పట్టుకున్నారు. దిల్సుఖ్నగర్ పేలుళ్లకు అవసరమైన నిధుల్ని పంపే బాధ్యతల్ని రియాజ్ భత్కల్ మహారాష్ట్రలోని పుణేలో ఉంటున్న ఎజాజ్‌కు అప్పగించాడు. దీంతో ఎజాజ్ మంగుళూరులోని హంపన్‌కట్టలో ఉన్న వెస్ట్రన్ యూనియన్ మనీ ట్రాన్స్ఫర్ సంస్థ ఔట్లెట్ సుపమ ఫోరెన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో పాటు మంగుళూరులోని మార్కెట్ రోడ్డులో హవాలా వ్యాపారం నిర్వహించే డింగ్‌డాంగ్ దుకాణం యజమాని ద్వారా 2013 ఫిబ్రవరిలో రూ.6.8 లక్షలు పంపాడు. ఆ నగదుని వినియోగించే ఉగ్రవాదులు 2013 ఫిబ్రవరిలో దిల్సుఖ్నగర్ పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ కేసులో మిగిలిన నిందితులతో పాటు ఎజాజ్‌కు 2016లో ప్రత్యేక కోర్టు ఉరి శిక్ష విధించింది. అప్పటి నుంచి ఎజాజ్ కొన్నాళ్లు చర్లపల్లి కేంద్ర కారాగారంలోనే ఉన్నాడు. ఢిల్లీ కోర్టులో ట్రయల్ నడుస్తున్న జామా మసీదు వద్ద విధ్వంసం కేసులో అక్కడి పోలీసులు తీసుకువెళ్లారు. ఈ ఉదంతానికి ముందు ఈ–మెయిల్ పంపడానికి వినియోగించిన ఫోన్‌ను ఎజాజ్ ముంబైలోని మనీష్ మార్కెట్లో ఖరీదు చేశాడు. అప్పట్లో దర్యాప్తు అధికారులు దీనికి సంబంధించిన సీసీ కెమెరాల ఫుటేజ్‌ను సేకరించి సీడీలో భద్రపరిచారు. ఆ కేసులో ఎజాజ్ నేరం చేశాడని నిరూపించడానికి ఇదే కీలక ఆధారం. అయితే నాలుగున్నరేళ్ల క్రితం ఈ సీడీ పోలీసుల వద్ద నుంచి హఠాత్తుగా మిస్ అయింది. మరో కాపీ కూడా లేకపోవడంతో కోర్టులో దాఖలు చేయలేకపోయారు. దీంతో పాటు ఇతర అంశాలను పరిగణలోకి తీసుకున్న ఢిల్లీ కోర్టు ఎజాజ్‌ను నిర్దోíÙగా ప్రకటించింది. దీంతో 2011లో ముంబైలో జరిగిన ట్రిపుల్ బ్లాస్ట్ కేసు విచారణ కోసం ఎజాజ్‌ను అక్కడకు తరలించనున్నారు. -
దిల్సుఖ్ నగర్ పేలుళ్ల నిందితుడు మక్బూల్ మృతి
హైదరాబాద్, సాక్షి: దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో సయ్యద్ మక్బూల్ (52) మృతి చెందాడు. అనారోగ్యంతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసినట్లు చర్లపల్లి జైలు అధికారులు ప్రకటించారు. ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రసంస్థకు పని చేసిన సయ్యద్ మక్బూల్.. దేశవ్యాప్తంగా పలు బాంబు దాడుల్లో పాల్గొన్నాడని ఎన్ఐఏ నిర్ధారించింది. ఈ క్రమంలో ఢిల్లీ కోర్టు అతనికి జీవిత ఖైదు కూడా విధించింది. అయితే.. దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసు విచారణ నిమిత్తం ట్రాన్సిట్ వారెంట్ మీద అతన్ని హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. అప్పటి నుంచి మక్బూల్ చర్లపల్లి జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు.2013 ఫిబ్రవరి 21న సాయంత్రం 6.45 గంటలకు ఆనంద్ టిఫిన్స్‌తో పాటు బస్టాండ్‌లో పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ పేలుళ్లలో 17 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా.. వందలాది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ జంట బాంబుల కేసును మూడేళ్లపాటు విచారణ చేసిన ఎన్ఐఏ.. 157 మంది సాక్ష్యాలను రికార్డ్ చేసింది. ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ పేలుళ్లకు పాల్పడినట్లు నిర్ధారించింది. అసదుల్లా అఖ్తర్, వకాస్, తెహసీన్ అఖ్తర్, యాసిన్ భత్కల్, ఎజాజ్ షేక్, మక్బూల్ దోషులుగా తేల్చారు. ప్రధాన నిందితుడైన యాసిన్ భత్కల్ పాకిస్థాన్‌లో తలదాచుకోగా.. మిగిలిన నిందితులు చర్లపల్లి జైల్లో ఉన్నారు. వీరిలో మక్బూల్ ఇప్పుడు అనారోగ్యంతో చనిపోయాడు. అయితే.. ఇక.. మహారాష్ట్రకు చెందిన ముక్బూల్ బాంబులు తయారు చేసేవాడు. ఎన్ఐఏ అతన్ని అరెస్ట్ చేసిన టైంలో.. ఢిల్లీ పాటియాలా కోర్టు ఆవరణలో తెలుగు మీడియాను చూస్తూ.. తాను మూడు నెలల్లో జైలు నుంచి బయటకు వస్తానని వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. -
దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసు: నలుగురికి పదేళ్ల జైలు
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: హైదరాబాద్‌లో దిల్సుఖ్నగర్ సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పేలుళ్లకు కుట్ర చేసిన కేసులో ఇండియన్ ముజాహిదీన్‌కు చెందిన నలుగురికి ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు బుధవారం పదేళ్ల జైలు శిక్ష విధించింది. వీరిలో డానిశ్ అన్సారీ, అఫ్తాబ్ ఆలం (బిహార్), ఇమ్రాన్ ఖాన్ (మహారాష్ట్ర), ఒబైదుర్ రెహా్మన్ (హైదరాబాద్) ఉన్నారు. వీరికి 2006 వారణాసి పేలుళ్లకు, 2007 ఫైజాబాద్, లక్నో పేలుళ్లు, 2008 జైపూర్, ఢిల్లీ, అహ్మదాబాద్ వరుస పేలుళ్లు, 2010 బెంగళూరు స్టేడియం పేలుడు, 2013 హైదరాబాద్ జంట పేలుళ్లతో సంబంధాలున్నట్టు ఎన్ఐఏ పేర్కొంది. పాకిస్తాన్‌కు చెందిన కుట్రదారులతో కలిసి పథక రచన చేసినట్టు వివరించింది. ఈ కేసుల్లో ప్రత్యేక కోర్టు ఇప్పటికే యాసిన్ భక్తల్ తదితరులపై అభియోగాలు మోపడం తెలిసిందే. దర్యాప్తులో భాగంగా ఎన్ఐఏ ఢిల్లీ వీరిని 2013 జనవరి–మార్చి మధ్య అరెస్టు చేసింది. చదవండి: Chandrayaan-3: ఆవలి దిక్కున... జాబిలి చిక్కేనా! -
వారిని రప్పించండి లేదా కేసు కొట్టేయండి
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో 2013లో జరిగిన దిల్‌సుఖ్‌నగర్‌లో జంట పేలుళ్ల కేసులో ఉరిశిక్ష ఎదుర్కొంటున్న ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాది ఎజాజ్ షేక్ గత వారం ముంబై కోర్టుకెక్కాడు. తనపై ముంబై సైబర్‌సెల్ పోలీసులు నమోదు చేసిన మరో కేసులో దర్యాప్తు అధికారులను కోర్టుకు రప్పించాలని లేదా కేసు కొట్టేయాలని తన న్యాయవాదుల ద్వారా కోరాడు. ‘దిల్సుఖ్నగర్’కేసులో ఎజాజ్‌కు 2016లో ఎన్ఐఏ కోర్టు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు ఇవ్వగా వివిధ నగరాల్లోనూ అతనిపై విధ్వంసం కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రస్తుతం ఎజాజ్ మహారాష్ట్రలోని ఎరవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. టెర్రర్ మెయిల్స్‌పై మరో కేసు: 2013–14ల్లో ఐఎంకు చెందిన అనేక మందిని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్టు చేశారు. అదే ఏడాది సెప్టెంబర్ 5న ఎజాజ్ షేక్‌ను మహారాష్ట్రలో పట్టుకున్నారు. ఇతర ఉగ్రవాదులతోపాటు అతన్నీ ఎన్ఐఏ అధికారులు హైదరాబాద్ తీసుకొచ్చి దిల్సుఖ్నగర్ పేలుళ్ల కేసులో విచారించారు. అదే సందర్భంలో ‘టెర్రర్ మెయిల్స్’పంపింది ఎజాజ్ షేక్ అని తేలడంతో ముంబై సైబర్‌సెల్ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. చార్జ్‌షీట్ సైతం దాఖలు చేయడంతో 2017లో ఈ కేసు కోర్టు విచారణకు వచ్చింది. 58 సార్లు విచారణ వాయిదా... అప్పటి నుంచి దర్యాప్తు అధికారు లు న్యాయస్థానంలో హాజరుకావట్లేదు. ఫలితంగా వరుస వాయిదాలు పడుతూ పోయింది. ఆ ఏడా ది ఆగస్టు 14 నుంచి 2019 వరకు మొత్తం 58 సార్లు వాయిదా పడినా పోలీసులు కోర్టుకు హాజరుకాలేదు. దీంతో ఎజాజ్ షేక్ తన న్యాయవాదుల సాయంతో గత వారం ముం బై కోర్టులో ‘నాన్ అప్పీరెన్స్ ఆఫ్ ప్రాసిక్యూషన్’పై పిటిషన్ దాఖలు చేయించాడు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం పోలీసులకు నోటీసులు జారీ చేసింది. -
జీన్స్ ప్యాంట్, స్పోర్ట్స్ షూస్ కావాలి!
సాక్షి, హైదరాబాద్ : ‘సాధారణ కాటన్ దుస్తులు ధరించలేకపోతున్నా.. అవి వేసుకుంటే నా కాళ్లు, చేతులకు చర్మ వ్యాధులు వస్తున్నాయి. కాళ్లకు ఏమీ లేకుండా తిరగడం కూడా కష్టంగా ఉంది. జైల్లో వేసుకోవడానికి నాకు జీన్స్ ప్యాంట్, స్పోర్ట్స్ షూస్ కావాలి’అంటూ ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిద్దీన్ (ఐఎం) టెర్రరిస్ట్ అసదుల్లా అక్తర్ అలియాస్ హడ్డీ ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీన్ని అన్ని కోణాల్లో విచారించిన న్యాయస్థానం అలాంటివి కుదరదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్న హడ్డీ 2013 నాటి దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసులోనూ ఉన్నాడు. దీనికి సంబంధించి 2016లో ఉరి శిక్ష పడిన ఐదుగురిలో ఇతడూ ఒకడు. ఇక్కడ పూర్తికావడంతో అక్కడకు.. దిల్‌సుఖ్‌నగర్‌లోని ఏ–1 మిర్చ్ సెంటర్, 107 బస్టాప్‌ల్లో 2013 ఫిబ్రవరి 21న బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ పేలుళ్లకు పాల్పడిన ఐఎం ఉగ్రవాదుల్లో హడ్డీ ఒకడు. ఈ సంస్థకు చెందిన కీలక ఉగ్రవాది యాసీన్ భత్కల్‌కు హడ్డీ కుడి భుజంగా వ్యవహరించాడు. ఈ పేలుళ్ల తర్వాత నేపాల్‌లో ఉన్న యాసీన్ భత్కల్ వద్దకు పారిపోయాడు. సుదీర్ఘకాలం అక్కడే తలదాచుకున్న ఈ ఇద్దరు ఉగ్రవాదుల్నీ ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు 2013 ఆగస్టు 28న బిహార్‌లోని మోతిహరీ ప్రాంతంలో అరెస్టు చేశారు. ఆపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) అధికారులు పీటీ వారెంట్‌పై హైదరాబాద్ తీసుకొచ్చి విచారించడంతోపాటు కోర్టులో అభియోగపత్రాలూ దాఖలు చేశారు. ఈ కేసులను విచారించిన చర్లపల్లి జైలులోని ప్రత్యేక న్యాయస్థానం 2016 డిసెంబర్ 19న మొత్తం ఐదుగురికి ఉరి శిక్ష విధించింది. వీరిలో యాసీన్తోపాటు హడ్డీ కూడా ఉన్నాడు. ఈ ముష్కరులు దేశవ్యాప్తంగా పేలుళ్లకు పాల్పడ్డారు. ఇక్కడి కేసుల విచారణ పూర్తి కావడంతో ఢిల్లీ విధ్వంసాలకు సంబంధించి విచారణకు పోలీసులు అక్కడకు తరలించారు. తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా.. ప్రస్తుతం హడ్డీ తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. అయితే సిటీలో నమోదైన కేసుల్లో ఉరిశిక్ష పడటంతో ఇతడిని శిక్షపడిన ఖైదీగా పరిగణించిన అక్కడి అధికారులు జైలు దుస్తుల్ని ఇచ్చారు. అయితే వీటిని వేసుకో వడం వల్ల తన కాళ్లు, చేతులకు చర్మ వ్యాధి (అటోపిక్ డెర్మటైటిస్) సోకిందంటూ ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ నేపథ్యంలోనే తాను జైల్లోనూ జీన్స్ ప్యాంట్, స్పోర్ట్స్ షూస్ ధరించేలా అనుమతి ఇవ్వాలని కోరాడు. పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం అలా కుదరదంటూ తీర్పు చెప్పింది. అలా వేసుకోవడం జైలు నిబంధనలకు పూర్తి విరుద్ధమని స్పష్టం చేసింది. కేవలం ఈ ఒక్క కారణమే కాదని.. సాధారణంగా అటోపిక్ డెర్మటైటిస్ వంటి చర్మ వ్యాధులు సోకినప్పుడు వైద్యులు తేలికైన దుస్తులు ధరించమని చెప్తారని, అలాంటిది జైలు దుస్తులు కాదని జీన్స్, స్పోర్ట్స్ షూస్ కోరడం ఏమిటంటూ ప్రశ్నించింది. జైల్లో ఉన్నన్ని రోజులూ అందరు ఖైదీల మాదిరి కాటన్ దుస్తులు ధరించాలని స్పష్టం చేసింది. -
యాసీన్ భత్కల్‌కు ఎదురుదెబ్బ!
సాక్షి, సిటీబ్యూరో: నిషేధిత దేశవాళీ ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) కో–ఫౌండర్ యాసీన్ భత్కల్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే హైదరాబాద్‌లోని దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసులో ఉరిశిక్ష పడిన ఇతడికి బెంగళూరు చిన్నస్వామి స్టేడియం పేలుళ్ల కేసులోనూ శిక్షకు ‘మార్గం సుగమమైంది’. యాసీన్ అనుచరులు, ఆ కేసులో సహ నిందితులైన ముగ్గురిని దోషులుగా తేలుస్తూ అక్కడి ప్రత్యేక కోర్టు గత వా రం తీర్పు ఇచ్చింది. దీంతో యాసీన్కూ శిక్ష తప్ప దని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరులతో పాటు అహ్మదాబా ద్, ఢిల్లీ, పుణే, వారణాసి విధ్వంసాలకు సూత్ర« దారిగా ఉన్న ఇతను ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నాడు. 2010లో స్టేడియం బ్లాస్ట్... బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో 2010 ఏప్రిల్ 17న జరిగిన పేలుళ్లలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఐపీఎల్ మ్యాచ్‌ల నేపథ్యంలో ఈ స్టేడియాన్ని టార్గెట్ చేసిన ఐఎం విధ్వంసానికి దిగింది. ఈ కేసుకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించిన అధికారులు కర్ణాటకలోని భత్కల్ ప్రాంతానికి చెందిన గజ ఉగ్రవాదులైన రియాజ్, ఇక్బాల్ భత్కల్‌ల ఆదేశాల మేరకు వారి సమీప బంధువు యాసీన్ నేతృత్వంలో పేలుళ్లు జరిగినట్లు గుర్తించారు. ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు 2011 నవంబర్‌లో ఖతీల్, ఖఫీల్ అక్తర్, ఎజాజ్, హసన్ తదితరులను అరెస్టు చేసి పుణేలోని ఎరవాడ జైల్లో ఉంచింది. వీరి విచారణ నేపథ్యంలో బెంగళూరుకు 60 కిమీ దూరంలో ఉన్న టుమ్కూరులో మొత్తం ఐదు బాంబులను తయారు చేశామని, ఆ ఏడాది ఏప్రిల్ 16 అర్థరాత్రి యాసీన్‌తో పాటు ఖతీల్ వీటిని స్టేడియం చుట్టూ పెట్టారని వెల్లడించారు. మిగిలిన వారిపై అభియోగాలు... యాసీన్ భత్కల్ 2008లో జరిగిన అహ్మదాబాద్ పేలుళ్ల తర్వాత పూర్తి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. దీంతో అతడి ఆచూకీ లేని కారణంగా బెంగళూరు పోలీసులు యాసీన్ మినహా మిగిలిన నిందితులపై కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేశారు. 2011 వరకు భారత్‌లోనే ఉండి ‘ఆపరేషన్స్’ చేపట్టిన యాసీన్ ఆపై దేశం దాటేశాడు. యునానీ వైద్యుడి ముసుగులో నేపాల్‌లో తలదాచుకుని తన అనుచరుల ద్వారా దేశ వ్యాప్తంగా పేలుళ్ళకు పాల్పడ్డాడు. 2013 ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌లోని ఏ–1 మిర్చ్ సెంటర్, 107 బస్టాప్ వద్ద చేసిన జంట పేలుళ్లే ఇతడి ఆఖరి ఆప రేషన్. మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న ‘యాసీన్ అండ్ కో’ చిరవకు 2013 ఆగస్టులో పట్టుబడ్డారు. దీంతో యాసీన్‌పై బెంగళూరు పోలీసులు చిన్నస్వామి స్టేడియం పేలుళ్లకు సంబం«ధించి వేరుగా అభియో గపత్రం దాఖలు చేశారు. ఇతడిపై హైదరాబాద్ కేసులో నేరం నిరూపణై ఉరి శిక్ష కూడా పడింది. వేరుగా అభియోగపత్రం దాఖలు... ఢిల్లీ పేలుళ్ల కేసు విచారణ కోసం అక్కడి పోలీసులు యాసీన్ తదితరులను తీసుకువెళ్లారు. ప్రస్తుతం యాసీన్ భత్కల్ను తీహార్ జైల్లో ఉన్న ఏకాంత కారాగారంలో (సోలిటరీ కన్ఫైన్మెంట్) ఉంచారు. ఓ పక్క ఢిల్లీ సెషన్స్ కోర్టులో అక్కడి పేలుళ్ల కేసు విచారణ సాగుతుండగానే బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం పేలుళ్ల కేసు విచారణ సైతం బెంగళూరులోని కోర్టులో సాగింది. దీంతో యాసీన్‌పై మరో అభియోగపత్రం దాఖలు చేశారు. ఇది విచారణలో ఉండగానే గత వారం న్యాయస్థానం మిగిలిని నిందితుల్ని దోషులుగా తేల్చింది. ఖతీల్ 2012లో జైల్లోనే హత్యకు గురికాగా.. మిగిలిన ఖఫీల్, ఎజాజ్, హసన్‌లకు ఏడేళ్ళ చొప్పున జైలు శిక్ష విధించింది. దీంతో ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉండి, విచారణ ఎదుర్కొంటున్న యాసీన్‌ను శిక్ష తప్పదని నిపుణులు చెప్తున్నారు. ఇతడిపై ఉన్న మిగతా కేసుల విచారణ సైతం పూర్తయి, ఇతర ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాత మాత్రమే హైదరాబాద్ ఎన్ఐఏ కోర్టు విధించిన ఉరి శిక్ష అమలుకు ఆస్కారం ఉంటుందని తెలిపారు. -
తీహార్ జైల్లో ఉండాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసులో ఉరిశిక్ష పడి, ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్న ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాది యాసీన్ భత్కల్ వేసిన పిటిషన్‌ను ఢిల్లీ సిటీ సెషన్స్ కోర్టు గత వారం కొట్టేసింది. కేసు విచారణ కోసం బెంగళూరు తరలించడం సాధ్యం కాదని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే ట్రయల్ జరుగుతుందని స్పష్టం చేసింది. కర్ణాటకలోని భత్కల్ ప్రాంతానికి చెందిన యాసీన్ గజ ఉగ్రవాదులైన రియాజ్, ఇక్బాల్‌లకు సమీప బంధువు. 2013 ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌లోని ఏ–1 మిర్చి సెంటర్, 107 బస్టాప్ వద్ద చేసిన జంట పేలుళ్లే ఇతడి ఆఖరి ఆపరేషన్. అదే ఏడాది ఆగస్టులో పట్టుబడిన ‘యాసీన్ అండ్ కో’కు చర్లపల్లి కేంద్ర కారాగారంలో ఏర్పాటు చేసిన ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం గత ఏడాది ఉరి శిక్ష విధించింది. దీంతో ఇక్కడి కేసు విచారణ పూర్తి కాగా.. ఢిల్లీ పేలుళ్ల కేసు విచారణ కోసం అక్కడి పోలీసులు యాసీన్ తదితరుల్ని తీసుకువెళ్లారు. ప్రస్తుతం యాసీన్ భత్కల్ను తీహార్ జైల్లో ఉన్న ఏకాంత కారాగారం (సోలిటరీ కన్ఫైన్మెంట్)లో ఉంచారు. ఓపక్క ఢిల్లీ సెషన్స్ కోర్టులో అక్కడి పేలుళ్ల కేసు విచారణ సాగుతుండగానే బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం పేలుళ్ల కేసు విచారణ సైతం బెంగళూరులోని కోర్టులో సాగుతోంది. ఈ నేపథ్యంలో భత్కల్ను బెంగళూరు న్యాయస్థానం తీహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారిస్తోంది. అయితే యాసీన్ గత నెలలో ఢిల్లీ కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశాడు. కెమెరా అంటే సిగ్గు ఉన్న తనకు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనడానికి ఇబ్బందిగా ఉందంటూ అందులో పేర్కొన్నాడు. స్వేచ్ఛాయుతంగా కేసు విచారణ జరగాలంటే తనను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాకుండా బెంగళూరు తీసుకువెళ్లి కోర్టులో హాజరుపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరాడు. భద్రతా కారణాల నేపథ్యంలో యాసీన్ భత్కల్ లాంటి ఉగ్రవాదిని విచారణ కోసం ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించడం భారీ ఖర్చుతో కూడుకున్న అంశమంటూ పోలీసులు న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. -
భారీ వర్షం.. వరదనీటిలో చిక్కుకున్న బస్సు!
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఆదివారం పలుచోట్ల ఆకస్మికంగా వర్షం ముంచెత్తింది. నిండు వేసవిలోనూ ఆకాశం మేఘావృతమై ఉండటంతో ఉదయం నుంచి నగరంలో వాతావరణం భిన్నంగా కనిపించింది. దీనికితోడు పలుచోట్ల భారీగా వర్షం కురియడంతో వాతావరణం చల్లగా మారిపోయింది. సికింద్రాబాద్ ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. దీంతో మెట్టుగూడ రైల్వే బ్రిడ్జి కింద భారీగా వరద నీరు చేరింది. ఈ వరదనీటిలో ఆర్టీసీ బస్సు చిక్కకుపోయింది. బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు. హయత్‌నగర్, దిల్సుఖ్నగర్ వర్షం పడగా.. సికింద్రాబాద్, మౌలాలీలో వడగండ్ల వాన ముంచెత్తింది. మల్కాజ్గిరి, సైనిక్‌పురిలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఉప్పల్, నాగోల్, రామంతాపూర్, అంబర్‌పేట్‌లో వర్షం పడింది. ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, చిక్కడపల్లి, హిమయత్‌నగర్, రాంనగర్, విద్యానగర్ ప్రాంతాల్లోనూ వర్షం పడింది. -
నాకు అసలే సిగ్గు బాబు!
సాక్షి, హైదరాబాద్ : ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) సహ వ్యవస్థాపకుడు... దిల్సుఖ్నగర్ జంట పేలుళ్లతో పాటు అహ్మదాబాద్, ఢిల్లీ, పుణే, వారణాసి, బెంగళూరు విధ్వంసాలకు సూత్రధారి... దేశ వ్యాప్తంగా 149 మందిని పొట్టనపెట్టుకున్న ఉగ్రవాది... గతేడాది ఉరి శిక్ష కూడా పడిన యాసీన్ భత్కల్‌కు కెమెరాను ఫేస్ చేయాలంటే సిగ్గట. ఈ విషయాన్ని అతడే ఢిల్లీ న్యాయస్థానానికి విన్నవించుకున్నాడు. తనకు కెమెరా షై ఉన్న నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించే ప్రక్రియను ఆపాలని కోరాడు. ఈ మేరకు గత వారం ఢిల్లీ సిటీ సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అయితే నిఘా వర్గాలు మాత్రం కేసు విచారణ జాప్యం జరిగేలా చేయడానికి ఇలాంటి ఎత్తులు వేస్తున్నాడని అంటున్నారు. తీహార్ జైలు ‘ఏకాంత కారాగారం’లో కర్ణాటకలోని భత్కల్ ప్రాంతానికి చెందిన యాసీన్ ఉగ్రవాదులైన రియాజ్, ఇక్బాల్‌లకు సమీప బంధువు. 2013, ఫిబ్రవరి 21న దిల్సుఖ్నగర్ జంట పేలుళ్లే ఇతడి ఆఖరి ఆపరేషన్. అదే ఏడాది ఆగస్టులో పట్టుబడిన ‘యాసీన్ అండ్ కో’కు ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం గత ఏడాది ఉరి శిక్ష విధించింది. దీంతో దిల్సుఖ్నగర్ కేసు విచారణ పూర్తి కాగా.. ఢిల్లీ పేలుళ్ల కేసు విచారణ కోసం అక్కడి పోలీసులు యాసీన్ తదితరుల్ని తీసుకువెళ్లారు. ప్రస్తుతం యాసీన్‌ను తీహార్ జైల్లో ఉన్న ఏకాంత కారాగారంలో (సోలిటరీ కన్ఫైన్మెంట్) ఉంచారు. ఓ పక్క ఢిల్లీ సెషన్స్ కోర్టులో అక్కడి పేలుళ్ల కేసు విచారణ సాగుతుండగానే బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం పేలుళ్ల కేసు విచారణ సైతం బెంగళూరులోని కోర్టులో సాగుతోంది. ఈ నేపథ్యంలో భత్కల్ను బెంగళూరు న్యాయస్థానం తీహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారిస్తోంది. ఇక్కడే ఈ ఉగ్రవాదికి ‘సిగ్గు పుట్టుకు’వచ్చింది. జాప్యం చేయడానికే... కేసు విచారణకు అడ్డంకులు సృష్టించి జాప్యం జరిగేలా చేయడానికే యాసీన్ పిటిషన్ దాఖలు చేశాడని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లోని కేసుల విచారణ పూర్తయితే ఇప్పటికే పడిన ఉరి శిక్ష అమలు చేసే ఆస్కారం ఉంది. ఈ ప్రక్రియ ఆలస్యం కావడం కోసమే యాసీన్ పిటిషన్ దాఖలు చేసినట్లు అంచనా వేస్తున్నాయి. కాగా భద్రతా కారణాల నేపథ్యంలో యాసీన్ లాంటి ఉగ్రవాదిని విచారణ కోసం ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించడం భారీ ఖర్చుతో కూడుకున్న అంశమని అధికారులు చెప్తున్నారు. గతంలో ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ తీసుకువెళ్లడానికి సరిహద్దు భద్రతా దళానికి చెందిన హెలీకాఫ్టర్ వాడాల్సి వచ్చిందని పేర్కొంటున్నారు. యాసీన్ పిటిషన్ ఢిల్లీ సిటీ సెషన్స్ కోర్టులో విచారణకు వచ్చినప్పుడు ఈ కారణాలను పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. కెమెరా షై అంటూ పిటిషన్... కొన్నాళ్లుగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బెంగళూరు కోర్టు విచారణ ఎదుర్కొంటున్న యాసీన్ భత్కల్ గత సోమవారం ఢిల్లీ కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశాడు. కెమెరా షై ఉన్న తనకు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనడానికి ఇబ్బందిగా ఉందంటూ పేర్కొన్నాడు. కేసుకు సంబం«ధించిన చర్చలు చేయాల్సి వచ్చిన ప్రతి సందర్భంలోనూ తన లాయర్లను బెంగళూరు నుంచి తీహార్ జైలు వరకు రప్పించడానికి భారీగా ఖర్చు అవుతోందని పిటిషన్లో పేర్కొన్నాడు. స్వేచ్ఛాయుతంగా కేసు విచారణ జరగాలంటే తనను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాకుండా బెంగళూరు తీసుకువెళ్లి కోర్టులో హాజరుపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరాడు. ముంబై దాడులకు (26/11 ఎటాక్స్) కీలక పాత్రధారిగా ఉండి, సజీవంగా పట్టుబడిన పాకిస్తానీ ఉగ్రవాది అజ్మల్ కసబ్‌కు విచారణ నేపథ్యంలో ఇచ్చిన వెసులుబాట్లలో కొన్ని తనకూ వర్తింపజేయాలని యాసీన్ విన్నవించుకున్నాడు. -
ఉగ్రదాడిలో కాలు కోల్పోయా..
ఉగ్రదాడిలో కాలు కోల్పోయా.. ఇక జీవితం లేదనుకున్నా.. వందసార్లు నాకు నేనే ప్రశ్నించుకున్న బతికి సాధించాలన్న నిర్ణయానికి వచ్చా దిల్సుఖ్నగర్ బాంబుపేలుళ్ల బాధితురాలు రజిత అప్పుడు ఎంబీఏ రెండో సంవత్సరం చదువుతున్న. ప్రాజెక్టు వర్క్ కోసం దిల్‌సుఖ్‌నగర్‌లోని ఇనిస్టిట్యూట్‌కు వెళ్లి తిరిగి హాస్టల్‌కు వచ్చేందుకు బస్టాప్ దగ్గర నిల్చున్న. నాతో పాటు మా హాస్టల్ వార్డెన్ కూడా ఉంది. ఒక్క సెకన్లో భారీ విస్పోటం. ఎక్కడ చూసినా భయానక దృశ్యం. నాకు ఒళ్లన్నీ దెబ్బలే. కాలు తెగిపోయింది. కింద పడిపోయి అటూ ఇటూ చూస్తున్న. నొప్పితో అరుస్తున్నా. మా మేడం చనిపోయింది. చాలామంది గాయాలపాలయ్యారు. అక్కడి దృశ్యమంతా ఒక్కసారిగా మారిపోయింది. నేనూ సాయం కోసం అరుస్తుంటే కొంతసేపటికి కొందరు వచ్చి నన్ను ఆటోలో ఎక్కించుకుని హాస్పిటల్ కు తీసుకుపోయిండ్రు.. అంటూ నాటి సంఘటనను గుర్తు చేసుకుంది రజిత. సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలోని శివ్వాయిపల్లికి చెందిన అంజయ్య, నాగమణిల కూతురు రజిత హైదరాబాద్‌లో ఎంబీఏ చదువుతుండేది. 2013 ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌లో హాస్టల్‌కు వెళ్లేందుకు బస్టాప్‌లో నిలబడగా, ఒక్కసారిగా బాంబుపేలుడు జరిగింది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఆ ప్రాంతం ఒక్కసారిగా బీభత్సంగా మారింది. కొందరు చనిపోయారు. మరికొందరు తీవ్ర గాయాలపాలయ్యారు. కాపాడమంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. ఈ ఘటనలో రజిత కాలు తెగిపోయింది. లేవలేని స్థితిలో ‘కాపాడండి’ అంటూ అరుస్తోంది. కొంతసేపటికి కొందరు యువకులు వచ్చి రజితను మలక్‌పేటలోని యశోదా ఆస్పత్రిలో చేర్పించారు. కుడికా లు మోకాలి కింది వరకు తొలగించారు. ఆస్పత్రిలోనే రెండునెలలు ఉండాల్సి వచ్చింది. అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిలు వచ్చి పరామర్శించి అండగా ఉంటామన్నారు. ఎంతో బాధపడ్డా.. రెండునెలల తరువాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయి అక్కడే రూంలో ఉన్నానని, ఆ సమయంలో ఎంతో మానసిక ఒత్తిడికి గురయ్యానని రజిత తెలిపింది. ‘‘ఈ జీవితం ఇంతే అనుకున్న. ఏంతో బాధపడ్డా. ఏడ్చిఏడ్చి కన్నీళ్లు ఇంకిపోయినయి. కానీ నామీద నాకున్న నమ్మకంతో ఒకటికి వంద సార్లు ప్రశ్నించుకున్న. నేను సాధించాల్సింది ఎంతో ఉందనిపించింది. గుండె నిబ్బరం చేసుకున్నా. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన పదిరోజులకే పరీక్షలు వచ్చాయి. ఆ పదిరోజులు చదివి పరీక్షలు రాసి పాసయ్యా. దీంతో ఇంకా నమ్మకం పెరిగిందని రజిత వివరించింది. కృత్రిమకాలు సహాయంతో.. ఏడాది కాలంపాటు ఎటూ వెళ్లలేని పరిస్థితి.. ఇంటిదగ్గరే ఉండేదాన్ని.. తరువాత కృత్రిమ కాలును సమకూర్చారు. అది కొంత ఉపయోగపడింది. ఏడాది క్రితం హీరోయిన్ సమంత జర్మనీ నుంచి కృత్రిమ కాలును తెప్పించి ఇచ్చారు. దానితో సులువుగా నడువగలుగుతున్నా. ప్రభుత్వం నాకు రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం కల్పించింది. ఇప్పుడు కామారెడ్డి కలెక్టరేట్లో పనిచేస్తున్నా’ అని పేర్కొంది రజిత. ‘మా అమ్మా, నాన్న, అన్నయ్య, తమ్ముడు, బాబాయ్ లు నాకు అండగా నిలిచారు. నాకు ఎంతో ధైర్యాన్నిచ్చారు. ఎంతో సేవ చేశారు. వారి సహకారం ఎంతో ఉంది’ అని తెలిపింది. కృత్రిమ కాలు సాయం తో నడుస్తున్న రజిత స్కూటీపై విధులకు వెళ్లి వస్తోంది. లక్ష్యం గ్రూప్–2.. ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేస్తున్నా. డిపార్టుమెంటర్ టెస్టులన్నీ రాశాను. కానీ నా లక్ష్యం గ్రూప్–2. సాధించాలన్న పట్టుదలతో ఉన్నా. నోటిఫికేషన్ రాగానే గ్రూప్ 2 ద్వారా మంచి ఉద్యోగం సాధిస్తా. నాలాగా కాలుతో ఇబ్బంది పడేవారికి కృత్రిమ కాళ్లు ఇప్పించే ప్రయత్నం చేస్తా. కష్టాలు ఎన్నో వస్తుంటాయి. తట్టుకునే శక్తి ఉండాలి. అవి మనల్ని చూసి భయపడాలి. నమ్మకం, ఆత్మవిశ్వాసం ఉంటే ఏ రంగంలోనైనా రాణించొచ్చు. ముఖ్యంగా ఆడపిల్లలు ధైర్యంగా ఎదుర్కొనాలి. – రజిత, శివ్వాయిపల్లి -
పట్టుకోవడానికి పదహారేళ్లు!
సాక్షి, హైదరాబాద్: దిల్సుఖ్నగర్ సాయిబాబా ఆలయం వద్ద 2002లో జరిగిన బాంబు పేలుడు కేసులో కీలక నిందితుడు మహ్మద్ షఫీఖ్ ముజావర్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఏళ్లుగా ఒమన్‌లో మకాం వేసిన ఇతను ఇటీవల ఖతర్ వెళ్లే ప్రయత్నాల్లో ఇంటర్‌పోల్‌కు దొరికాడు. దీంతో షఫీఖ్‌ను బలవంతంగా భారత్‌కు పంపారు. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఈ ఉగ్రవాదిని సీఐడీ అధికారులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. లష్కరే తొయిబాలో (ఎల్ఈటీ) షఫీఖ్ కీలక పాత్ర పోషించాడు. ఆలయం వద్ద పేలుళ్లలో ఉగ్రవాదులైన అబ్దుల్ బారి అలియాస్ అబు హంజా, ఫర్హాతుల్లా ఘోరీ, అబ్దుల్ రజాఖ్, సలావుద్దీన్ తదితరులు కీలక పాత్ర పోషించారు. ఈ కుట్రను అమలు చేయ డం కోసం దుబాయ్ కేంద్రంగా అనేక సమావేశా లు జరగడంతో పాటు భారీ స్థాయిలో నిధుల సమీకరణ చేశారు. ఈ రెండు వ్యవహా రాల్లోనూ ముంబైకి చెందిన, దుబాయ్‌లో ఉంటూ ఎల్ఈటీ కోసం పని చేస్తున్న షఫీఖ్ కీలకంగా వ్యవహరించాడు. 2002, నవంబర్ 21న దిల్‌సుఖ్‌నగర్‌లోని సాయిబాబా ఆలయం వద్ద బాంబు పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు చనిపోగా, 15 మంది గాయపడ్డారు. ఈ కేసులో మొత్తం 10 మంది నిందితులున్నారు. ఈ కేసులో వాంటెడ్‌గా ఉన్న షఫీఖ్పై నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దీని ఆధారంగా సీఐడీ అధికారులు ఇంటర్‌పోల్ సాయంతో రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయించారు. కొన్నేళ్లుగా ఒమన్ కేంద్రంగానే వ్యవహారాలు నడుపుతున్న షఫీఖ్ ఇటీవల ఖతర్ పయనమయ్యాడు. ఖతర్ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన ఇతడిని పట్టుకున్న ఇంటర్‌పోల్ భారత్‌కు బలవంతంగా (డిపోర్టేషన్) పంపింది. ఖతర్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఇతడిని అదుపులోకి తీసుకున్న సీఐడీ సోమవారం నాంపల్లి కోర్టులో హాజరుపరిచింది. కోర్టు షఫీఖ్‌కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌కు ఆదేశించడంతో చంచల్‌గూడ సెంట్రల్ జైలుకు తరలించారు. ఇతడిని పోలీసు కస్టడీకి తీసుకుని విచారించడం కోసం సీఐడీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనుంది. ఈ కేసులో ప్రధాన నిందితులైన మహ్మద్ ఆజం, సయ్యద్ అబ్దుల్ అజీజ్‌లు గతంలో ఉప్పల్, కరీంనగర్ల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో మరణించారు. మిగిలిన వారిలో 8 మందిపై సీఐడీ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ కేసుకు సంబంధించి అబ్దుల్ రజాక్‌ను 2005లో అరెస్టు చేశారు. సలావుద్దీన్‌ను కేరళలోని కొచ్చి విమానాశ్రయంలో 2012లో పట్టుకోగా, ట్రాన్సిట్ వారెంట్‌పై ఇక్కడికి తీసుకువచ్చారు. రజాఖ్ 2011లో ఆత్మహత్య చేసుకోగా... సలావుద్దీన్ 2014లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. -
లేడీస్ హాస్టల్ ఎదుట రెచ్చిపోయిన ఆకతాయిలు
-
హైదరాబాద్ నుంచి తీవ్రవాదుల తరలింపు
హైదరాబాద్: దిల్షుక్నగర్ పేలుళ్ల నిందితులను ఢిల్లీ, ముంబై జైళ్లకు తరలించారు. ప్రధాన నిందితుడిగా ఉన్న ఉగ్రవాది యాసిన్ భత్కల్‌తో పాటు మరో ఇద్దరిని తీహార్ జైలుకు, మిగతా ఇద్దరు ఉగ్రవాదులను ముంబైకి గురువారం విమానంలో తరలించినట్టు జైళ్ల శాఖ అధికారులు తెలిపారు. యాసిన్ భత్కల్‌తో పాటు ఇద్దరిని ఢిల్లీ స్పెషల్ పోలీసులు, ముంబై తరలించిన ఇద్దరినీ యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ బృందాలు ప్రశ్నించనున్నట్టు తెలిసింది. -
తీహార్ జైలుకు ‘దిల్సుఖ్నగర్’ దోషులు
ఉరిశిక్ష పడిన ఉగ్రవాదుల తరలింపునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి సాక్షి, హైదరాబాద్: దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల దోషులను ఢిల్లీలోని తీహార్ జైలుకు తరలించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. 2014లో పేలుళ్ల అనంతరం ఈ ఐదుగురు ఉగ్రవాదు లను విచారించేందుకు నేషనల్ ఇన్వె స్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) హైదరాబాద్ రేంజ్ అధికారులు పీటీ వారెం ట్‌పై రాష్ట్రానికి తీసుకువచ్చారు. పే లుళ్ల కేసు విచారణ పూర్తయ్యే వరకు ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు న్యాయశాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇటీవల ఈ కేసులో ఐదుగురు ఉగ్రవాదులను దోషులుగా నిర్ధారించిన ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం.. వారికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. హైదరాబాద్‌లో విచారణ పూర్తయినందున ఈ ఐదుగురి ని తాము విచారించాల్సి ఉందని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అక్కడి న్యాయస్థానంలో పీటీ వారెంట్ పొందారు. అంతేకాకుండా నిందితులను దర్యాప్తు అధికారులు పీటీ వారెంట్‌పై తీసుకొస్తే తిరిగి అప్పగించాల్సి ఉంటుంది. ఈ మేరకు వీరిని తీహార్ జైలుకు తరలిం చాలని విజ్ఞప్తి చేయగా.. రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. దీనిపై ఇప్పటికే రాష్ట్ర హోంశాఖ, డీజీపీ కి జైళ్ల శాఖ డీజీ లేఖలు రాశారు. 4 రోజుల్లోగా ఈ ఐదుగురిని తీహార్ జైలు కు తరలించేందుకు చర్యలు చేపడుతు న్నామని.. ఇందుకు భద్రతా చర్యలు తీసుకోవాలని అందులో కోరారు. ఈ ఐదుగురు ఉగ్రవాదులను వచ్చే వారం విమానంలో ఢిల్లీకి తరలించనున్నట్లు సమాచా రం. వారిని ఢిల్లీ స్పెషల్ పోలీసులు, అనంతరం మహా రాష్ట్రలోని థానే పోలీసులు విచారించనున్నారు. బెంగ ళూర్, పుణె, కోల్‌కతా, అహ్మదాబాద్, బిహార్, జైపూర్ పేలుళ్ల కేసులోనూ ఈ ఉగ్రవాదులే నిందితులుగా ఉండటంతో అక్కడి పోలీసులు సైతం విచారించేందుకు ప్రయత్నిస్తు న్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. -
‘దిల్సుఖ్నగర్’ నిందితులకు భద్రత పెంపు
హైదరాబాద్: దిల్సుఖ్నగర్ పేలుళ్ల కేసు నిందితులు జైలు నుంచి పరారయ్యే అవకాశాలు ఉన్నాయని ఐబీ హెచ్చరికలతో ఎన్ఐఏ అధికారులు అప్రమత్తమయ్యారు. చర్లపల్లి జైల్లో ఉన్న నిందితులు పారిపోయే అవకాశం ఉందని ఐబీ సూచించడంతో.. జైల్లో భద్రత పెంచారు. నిందితులు ఉంటున్న మంజీర బ్యారెక్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు.. 2 బెటాలియన్ల భద్రతా బలగాలను అదనంగా నియమించారు. -
ఉరిశిక్ష ఖరారుపై నిర్ణయం తీసుకోండి
దిల్సుఖ్నగర్ పేలుళ్ల కేసులో హైకోర్టును కోరిన ప్రత్యేక కోర్టు సాక్షి, హైదరాబాద్: దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల నిందితుల్లో ఐదుగురికి ఉరి శిక్ష విధిస్తూ ఈ నెల 19న ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును ఖరారు చేసే విషయం లో సంబంధిత కోర్టు జడ్జి కేసును ఉమ్మడి హైకోర్టుకు నివేదించారు. దీనిపై న్యాయమూర్తులు జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్ ఎం.ఎస్. కె.జైశ్వాల్‌ల ధర్మా సనం సోమవారం విచారించింది. ఎన్ఐఏ తరఫు న్యాయవాది విష్ణువర్ధన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. కేసుపై సత్వర విచారణ చేపట్టా లని కోరారు. ఇదే సమయంలో కింది కోర్టు తమకు విధించిన ఉరిశిక్షను సవాలు చేస్తూ అసదుల్లా అక్తర్, జియావుర్ రెహ్మాన్, మహ్మద్ తహసీన్ అక్తర్, యాసిన్ భత్కల్, ఎజాజ్ షేక్‌లు అప్పీల్ దాఖలు చేశారని వారి తరఫు న్యాయవాది మహదేవన్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీనికి హైకోర్టు రిజిస్ట్రీ ఇంకా నం బర్ కేటాయించలేదన్నారు. దీంతో ధర్మాసనం ఉరిశిక్ష ఖరారు కేసుతో పాటు ఈ అప్పీల్‌ను కూడా జత చేయాలని, నంబర్ కేటాయించిన తరువాత రెండింటినీ తమ ముందుంచాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. -
హైకోర్టుకు దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసు
హైదరాబాద్: దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసు హైకోర్టుకు చేరింది. ఈ కేసు తీర్పు ధ్రువీకరణ కోసం ఎన్ఐఏ కోర్టు సోమవారం హైకోర్టుకు పంపగా, రెఫర్ ట్రయల్ కేసు నమోదు చేసింది. మరోవైపు ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పును నిందితులు సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. కాగా ఎన్ఐఏ కోర్టు అయిదుగురిని దోషులుగా తేల్చి ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే. కాగా దిల్‌సుఖ్‌నగర్‌లో 2013 ఫిబ్రవరి 21న జరిగిన జంట పేలుళ్ల ఘటనలో ఐదుగురు దోషులకు ఉరిశిక్ష విధిస్తూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు గత సోమవారం తీర్పునిచ్చిన విషయం విదితమే. ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులుండగా ప్రధాన సూత్రధారి రియాజ్ భత్కల్ ఇంకా పరారీలోనే ఉన్నాడు. ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాద సంస్థ దేశంలో పాల్పడిన ఘాతుకాలకు సంబంధించి విచారణ పూర్తయి తీర్పు వెలువడిన తొలి కేసు ఇదే! -
ఇక్కడ ఉరి తీసేందుకు వీలుందా?
దిల్సుఖ్నగర్ పేలుళ్ల కేసులో దోషులుగా తేల్చిన ఐదుగురికి ఉరిశిక్ష విధిస్తూ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చింది గానీ.. ఆ తీర్పును అమలు చేయడానికి తెలంగాణలో ఎక్కడైనా వీలు కుదురుతుందా? ప్రస్తుతానికి అయితే అలాంటి అవకాశమే లేదు. ఎందుకంటే.. ఇక్కడున్న రెండు సెంట్రల్ జైళ్లలో ఎక్కడా అసలు ఉరికంబం అన్నదే లేదు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఒక్క రాజమండ్రి సెంట్రల్ జైలులో మాత్రమే ఉరికంబం ఉంది. తెలంగాణలోని చంచల్‌గూడ, వరంగల్ సెంట్రల్ జైళ్లకు ఉరికంబాలు కావాలని ఇక్కడి జైళ్ల శాఖ ప్రతిపాదన పంపింది గానీ, దానికి ఇంకా అనుమతి రాలేదు. ఈ విషయాన్ని జైళ్ల శాఖ చీఫ్ వీకే సింగ్ చెప్పారు. దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో ఉన్న సెంట్రల్ జైళ్లలో కనీసం ఒకటైనా ఉరి కంబం ఉంది. కానీ తెలంగాణలో మాత్రం లేదు. ఇది కొత్త రాష్ట్రం కావడంతో.. ఇంకా అసలు దాని అవసరం ఉంటుందని కూడా జైళ్ల అధికారులు భావించి ఉండకపోవచ్చన్నది సీనియర్ల అభిప్రాయం. రాజమండ్రి సంగతేంటి.. ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి సెంట్రల్ జైలు రికార్డుల ప్రకారం దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 42 మందిని అక్కడ ఉరితీశారు. 1930లోనే ఇక్కడ ఉరికంబం నిర్మాణం జరిగినా, 1949 నుంచే ఉరితీతలు మొదలయ్యాయి. చిట్టచివరిసారిగా 1976 ఫిబ్రవరిలో అనంతపురం జిల్లాకు చెందిన నంబి కిష్టప్ప అనే ఖైదీని ఉరితీశారు. ఆ తర్వాత ఇంతవరకు అక్కడ ఉరిశిక్షలు అమలుకాలేదు. 1980లో ఉరికంబాన్ని జైల్లోనే బహిరంగ ప్రదేశానికి తరల్చారు గానీ, ఆ తర్వాత ఎవరినీ ఉరి తీయలేదు. -
ఏ-1ఎక్కడ?
►రియాజ్ భత్కల్ నేతృత్వంలోనే సాగిన ‘రెండు ఆపరేషన్స్’ ►ఇప్పటికీ చిక్కని ప్రధాన నిందితుడు ►దిల్సుఖ్నగర్ పేలుళ్ల కేసులో శిక్షలు ఖరారు ►2008 నుంచి పాకిస్థాన్‌లో తలదాచుకున్న ఉగ్రవాది రియాజ్ భత్కల్... 2007 నాటి గోకుల్ చాట్, లుంబినీపార్క్ , 2013 నాటి దిల్సుఖ్నగర్ పేలుళ్లకు సూత్రధారిగా, ఈ కేసుల్లో ప్రధాన నిందితుడిగా (ఏ–1) ఉన్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది. తెలంగాణ సహా తొమ్మిది రాష్ట్రాల్లో నమోదైన విధ్వంసాల కేసుల్లో ఇతని పేరు ప్రముఖంగా ఉంది. ఉగ్రవాదం ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారం సైతం నిర్వహించాడు. దిల్సుఖ్నగర్ పేలుళ్ల కేసు విచారణ పూర్తయి దోషులకు శిక్ష సైతం పడింది. 2007 నాటి జంట పేలుళ్ల కేసు విచారణ దశలో ఉంది. ఇప్పటికీ ఏ–1 చిక్కలేదు. అసలు ఎవరీ రియాజ్, ఉగ్రవాదిగా ఎలా మారాడు? ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం.. సాక్షి, సిటీబ్యూరో: రియాజ్ భత్కల్ అసలు పేరు రియాజ్ అహ్మద్ షహబంద్రి. కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా భత్కల్ గ్రామంలో 1976 మే 19న పుట్టాడు. ఈ ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలు, స్మగ్లింగ్ వ్యవహారాలు ఎక్కువ. ఆ ప్రభావంతోనే నేరబాట పట్టాడు. వీరి కుటుంబం కొన్నాళ్ల పాటు మహారాష్ట్రలోని ముంబైలో నివసించింది. ఇతనికి ఆదినుంచీ డబ్బుపైన ఆశ ఎక్కువే. ఆ యావలోనే నేరబాట పట్టి ముంబై గ్యాంగ్‌స్టర్ ఫజల్–ఉర్–రెహ్మాన్ ముఠాలో చేరాడు. బెదిరింపులు, కిడ్నాప్‌లు తదితర వ్యవహారాల ద్వారా డబ్బు సంపాదించడం ప్రారంభించాడు. ఈ మేరకు ఇతనిపై కోల్‌కతా, ముంబయి, కర్ణాటకల్లో అనేక కేసులు నమోదైనా... ఒక్కసారీ అరెస్టు కాలేదు. ఈ గ్యాంగు నుంచి బయటకు వచ్చిన తరవాత కుర్లా ప్రాంతంలో ‘ఆర్ఎన్’ పేరుతో కొత్తముఠా కట్టి కొంతకాలం వ్యవహారాలు సాగించాడు. అక్కడ ఉండగా స్థానికంగా ఓ ప్రార్థన స్థలంతో పాటు ప్రత్యేక కార్యక్రమాలకు తరచు వెళ్లేవాడు. ఆ ప్రోద్బలంతో నిషిద్ధ స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (సిమి)లో కొంతకాలం పని చేశాడు. అప్పడికే ఇతని అన్న ఇక్బాల్ భత్కల్ పాక్ ప్రేరేపిత లష్కరేతోయిబాతో సంబంధాలు పెట్టుకోవడంతో అతని ద్వారా ఉగ్రవాదం వైపు మళ్లారు. ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఏర్పాటులో కీలక పాత్ర పోషించి, రెండో కమాండ్ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నాడు. ఆసిఫ్ రజా కమెండో ఫోర్స్ పేరుతో ఉగ్రవాద సంస్థను ప్రారంభించిన కోల్‌కతా వాసి అమీర్ రజాఖాన్ నుంచి అందే ఆదేశాల ప్రకారం చేపట్టాల్సిన విధ్వంసాలకు పేలుడు పదార్థాలు, మనుషులు, డబ్బు ఏర్పాటు చేస్తుంటాడు. ధనార్జన కోసం రియల్టర్ అవతారం... జిహాద్ పేరుతో యువకులను ఉగ్రవాదం వైపు నడిపించి వారి భవితను భత్కల్ బుగ్గిపాలు చేశాడు. తాను మాత్రం ఉగ్రవాదం పేరు చెప్పి వసూలు చేసిన నిధులను భారీగా దారిమళ్లించి రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహించాడు. మరిన్ని నిధుల కోసం పూణేకు చెందిన వ్యాపారులను కిడ్నాప్ చేయాలని కుట్రపన్నాడు. విధ్వంసాలకు శిక్షణ, పేలుడు పదార్థాలు కొనుగోలు, ఆయుధాల సేకరణ పేరుతో కొన్ని విదేశీ సంస్థల నుంచి హవాలా ద్వారా భారీగా నిధులు సమీకరించాడు. అయితే వాటిని తన సొంత ‘ఖాతా’ల్లోకి మార్చుకుంటూ మంగుళూరు సమీపంలోని థోయ్యత్తు, ఉల్లాల్ పరిసరాల్లో భారీగా రియల్ ఎస్టేట్ వెంచర్లు నిర్వహించాడు. హైదరాబాద్, జైపూర్, బెంగళూరు, అహ్మదాబాద్ పేలుళ్ల నిమిత్తం అంటూ విదేశీ సంస్థల నుంచి రూ.లక్షల్లో నిధులు సమీకరించాడు. భత్కల్ ఇండియన్ ముజాహిదీన్‌లో సెకండ్ కమాండ్ ఇన్చార్జి హోదాలో ఉండటంతో నిధులపై అజమాయిషీ ఇతనిదే. దీంతో జమాఖర్చులు అడిగే సాహసం మాడ్యుల్లోని ఎవరూ చేయలేకపోయారు. ‘ఐఎం’ గుట్టు బయటపడింది ఇతని వల్లే... ఐఎంలో కీలక వ్యక్తిగా ఉన్న రియాజ్ భత్కల్ అనేక పేలుళ్ల సందర్భంలో కొన్ని ఈ–మెయిల్స్ రూపొందించి మీడియా సంస్థలకు పంపాడు. ఇలా చేయడాన్ని మరో ఉగ్రవాదైన సాదిక్ షేక్ పూర్తిగా వ్యతిరేకించాడు. దీని వల్ల తమ ఉనికి బయటపడుతుందని, దర్యాప్తు సంస్థలకు పట్టుబడే అవకాశం ఉందని వాదిస్తూ వచ్చాడు. తమ లక్ష్యం నెరవేరాలంటే సాధ్యమైనంత ఎక్కువ కాలం తెరవెనుకే ఉండటం మంచిదని రియాజ్‌తో చెప్పాడు. అయితే ఈ మాటలను రియాజ్ పెడచెవిన పెట్టాడు. ప్రతి విధ్వంసానికీ అత్యంత పకడ్బందీగా వ్యూహరచన చేసి కథనడిపేది తామైతే... చివరకు పేరు మాత్రం సీమాంతర ఉగ్రవాద సంస్థలకు రావడం రియాజ్‌కు రుచించలేదు. తమ సంస్థ పేరు బయటకు వచ్చి ప్రచారం జరిగితే నిధులు సైతం భారీగా వస్తాయంటూ సాదిక్‌తో వాదనకు దిగాడు. చివరకు తన పంతం నెగ్గించుకుని ప్రతి విధ్వంసానికీ ముందు ఈ–మెయిల్ పంపడం ప్రారంభించాడు. ఈ మెయిల్స్ వచ్చిన ఐపీ అడ్రస్ ఆధారంగా దర్యాప్తు చేసిన అధికారులు ఐఎంకు సంబంధించిన కొన్ని వివరాలు సేకరించారు. అలా ప్రారంభమైన దర్యాప్తుతోనే 2008లో ఐఎం గుట్టురట్టయింది. దీంతో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన రియాజ్... ప్రస్తుతం పాకిస్థాన్‌లోని కరాచీ సమీపంలో ఉన్న డిఫెన్స్ ఏరియాలో తలదాచుకుంటున్నాడు. ముష్కరులను వెంటనే ఉరితీయాలి అమాయకులను పొట్టన పెట్టుకున్న ముష్కరులను వెంటనే ఉరితీయాలి. కాలయాపన చేయకుండా శిక్ష అమలు చేస్తేనే అమరుల ఆత్మ శాంతిస్తుంది. ఆనాటి ఘటనలో గాయపడిన క్షతగాత్రులను ప్రభుత్వం ఆదుకోవాలి. – పి.రామకృష్ణ, : పేలుళ్లలో గాయపడ్డ బాధితుడు పేలుళ్లలో గాయపడ్డ బాధితుడు శిక్షిస్తేనే చట్టాలపై నమ్మకం కలుగుతుంది...చట్టాలపై ప్రజల్లో నమ్మకం కలగాలంటే తీవ్రవాదులకు వెంటనే ఉరిశిక్ష అమలు చేయాలి. వారు శిక్ష నుంచి బయటపడకుండా చూస్తేనే ప్రజలు హర్షిస్తారు. బాంబు పేలుడు ఘటన జరిగిన ప్రదేశానికి ఎప్పుడు వెళ్లినా ఒళ్లు జలదరిస్తుంది. – సుధాకర్‌రెడ్డి : ప్రత్యక్ష సాక్షి, దిల్సుఖ్నగర్ -
ఆ ముష్కరులకు ఉరే సరి!
-
ఉరే సరి
దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసులో ఐదుగురు ముష్కరులకు ఉరిశిక్ష - ఖరారు చేసిన ఎన్ఐఏ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు - మొత్తం ఆరుగురు నిందితుల్లో ఐదుగురికి శిక్షలు ఖరారు - పాక్‌లో తలదాచుకున్న మరో ఉగ్రవాది రియాజ్ భత్కల్ - కోర్టులో ఏమాత్రం పశ్చాత్తాపం కనబర్చని ఉగ్రవాదులు - ఏ శిక్షకైనా సిద్ధమంటూ న్యాయమూర్తితో వ్యాఖ్య - భారత్‌లో ‘ఇండియన్ ముజాహిదీన్’ ఘాతుకాలకు సంబంధించి శిక్షలుపడ్డ తొలి కేసు ఇదే.. - తీర్పును సవాల్ చేస్తామన్న దోషుల తరఫు న్యాయవాది సాక్షి, హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లో మారణహోమం సృష్టించిన ఐదుగురు ముష్కరులకు కోర్టు ఉరిశిక్షలను ఖరారు చేసింది. ఈ మేరకు చర్లపల్లి కేంద్ర కారాగారంలోని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. గత మంగళవారమే వీరిని దోషులుగా నిర్ధారించిన న్యాయస్థానం.. తాజాగా వారందరికీ ఉరిశిక్ష విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులుగా ఉండగా.. ప్రధాన సూత్రధారి రియాజ్ భత్కల్ పరారీలో ఉన్నాడు. భారత్‌లో ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) పాల్పడిన ఘాతుకాలకు సంబంధించి విచారణ పూర్తయి, దోషులకు శిక్షలు పడిన తొలి కేసు ఇదే. పాకిస్తాన్లో తలదాచుకున్న రియాజ్ భత్కల్ ఆదేశాల మేరకు ఉగ్రవాదులు 2013 ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌లో పేలుళ్లకు పాల్పడ్డారు. ఇందులో భత్కల్ సోదరుడు మహ్మద్ అహ్మద్ సిద్ధిబప్ప అలియాస్ యాసీన్ భత్కల్‌తోపాటు అసదుల్లా అక్తర్ అలియాస్ హడ్డీ, జియా ఉర్ రెహ్మాన్ అలియాస్ వకాస్(పాకిస్తాన్), మహ్మద్ తెహసీన్ అక్తర్ అలియాస్ మోను, ఎజాజ్ షేక్ పాలుపంచుకున్నట్టు ఎన్ఐఏ తన దర్యాప్తులో తేల్చింది. విధ్వంసంలో నేరుగా పాల్గొనని కారణంగా యాసీన్ భత్కల్ను ఐదో నిందితుడిగా చేర్చింది. ఆరుగురు ఉగ్రవాదుల్లో ప్రస్తుతం ఐదుగురికి ఉరిశిక్ష పడగా.. పాక్‌లో ఉన్న రియాజ్ భత్కల్‌పై ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసులు జారీ చేసింది. దిల్‌సుఖ్‌నగర్‌లోని 107 బస్టాప్, ఏ–1 మిర్చి సెంటర్ వద్ద జరిగిన పేలుళ్లలో గర్భస్థ శిశువు సహా 18 మంది మరణించగా... 131 మంది గాయాలైన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని మలక్‌పేట, అప్పటి సైబరాబాద్ (ఇప్పటి రాచకొండ) కమిషనరేట్‌లోని సరూర్‌నగర్ ఠాణాల్లో నమోదైన ఈ కేసులను ఎన్ఐఏకు బదిలీ చేశారు. ఈ రెండు కేసులకు కీలక ప్రాధాన్యం ఇచ్చిన ఎన్ఐఏ అధికారులు 157 మంది సాక్షులతో పాటు 502 డాక్యుమెంట్లు, 201 ఆధారాలను కోర్టు ముందు ఉంచారు. ఏ శిక్షకైనా సిద్ధమన్న ఉగ్రవాదులు సోమవారం ఉదయం ఐదుగురు ముష్కరులను పోలీసులు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ఈ ముష్కరులకు ఊరి శిక్షే సరైందని ఎన్ఐఏ తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. ఆ సమయంలో కోర్టులోనే ఉన్న ముష్కరులకు వారి వాదన వినిపించుకోవడానికి న్యాయమూర్తి అవకాశం ఇచ్చారు. అయితే ఏమాత్రం పశ్చాత్తాపం కనబర్చని ఆ ముష్కరులు.. తాము ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నామంటూ న్యాయమూర్తికి చెప్పారు. దీంతో అభియోగాలతోపాటు సాక్ష్యాధారాలు, వాదోపదవాదాలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం ఐదుగురికీ ఉరి శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పును హైకోర్టులో సవాల్ చేస్తామని, దోషుల బంధువుల నుంచి ఈ మేరకు విజ్ఞప్తి అందిందని డిఫెన్స్ లాయర్ ప్రకటించారు. రెండు కోణాల్లో ఇదే తొలి కేసులు.. దేశవ్యాప్తంగా విధ్వంసాలకు పాల్పడేందుకు ఆసిఫ్ రజా కమాండో ఫోర్స్‌గా (ఏఆర్‌సీఎఫ్) ఏర్పడిన ఉగ్రవాద బృందం.. ఆపై రియాజ్ భత్కల్ నేతృత్వంలో ‘ఉసాబా’గా పేరు మార్చుకుంది. 2002లో ఇండియన్ ముజాహిదీన్‌గా (ఐఎం) మారి దేశంలోని తొమ్మిది రాష్ట్రాల్లో పేలుళ్లకు పాల్పడింది. 2007 ఆగస్టు 25న హైదరాబాద్‌లోని లుంబినీ పార్క్, గోకుల్చాట్ల్లోనూ విధ్వంసం సృష్టించింది ఐఎం ఉగ్రవాదులే. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా జరిగిన 26 విధ్వంసాలకు సంబంధించి ఐఎంపై కేసులు నమోదయ్యాయి. పదుల సంఖ్యలో ఉగ్రవాదులు అరెస్టు అయ్యారు. 2007లో హైదరాబాద్‌లో జంట పేలుళ్లతోపాటు అన్ని కేసులూ వివిధ కోర్టుల్లో విచారణ దశల్లోనే ఉన్నాయి. దేశంలో ఐఎం ఘాతుకాలకు సంబంధించి కేసు విచారణ పూర్తయి, నిందితులను దోషులుగా తేల్చి శిక్షలు వేసిన తొలి కేసు దిల్సుఖ్నగర్ పేలుళ్లదే కావడం గమనార్హం. నగరంలో 1990ల నుంచీ ఉగ్రవాద ఛాయలు ఉండటంతోపాటు అనేక కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఈ కేసుల్లో ఎవరికీ ఉరి శిక్ష పడిన దాఖలాలు లేవు. దీంతోపాటు ఒకే ఉందంతానికి సంబంధించి దోషులందరికీ ఉరి శిక్షలు వేసిన కేసులు కూడా లేవు. ఈ కేసులో ఐదుగురికి ఉరిశిక్ష పడటంతో ఈ కోణంలోనూ ఇదే తొలి కేసుగా రికార్డులకెక్కింది. 2011 ఏప్రిల్ 18న ఎన్ఐఏ హైదరాబాద్ యూనిట్‌కు పోలీసుస్టేషన్ హోదా లభించింది. నాటి నుంచి తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి తదితర ప్రాంతాలకు సంబంధించి ఎన్నో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఎవరి పాత్ర ఏంటి? రియాజ్ భత్కల్: కీలక సూత్రధారి యాసీన్ : నేపాల్ నుంచి కుట్రను అమలు చేశాడు వఖాస్: బాంబుల తయారీ, 107 బస్టాప్ వద్ద బాంబుతో ఉన్న సైకిల్ పెట్టాడు మోను: ఏ–1 మిర్చి సెంటర్ వద్ద బాంబుతో ఉన్న సైకిల్ పెట్టాడు హడ్డీ: అబ్దుల్లాపూర్ మెట్లో షెల్టర్ తీసుకొని సైకిళ్లు, ఇతర కొనుగోళ్లకు సహకరించాడు ఎజాజ్: ముష్కరులకు అవసరమైన పేలుడు పదార్థాలు, నగదు సమకూర్చాడు ఎక్కడి వారు? రియాజ్ భత్కల్: కర్ణాటకలోని భత్కల్‌లో ఉన్న తెంగినగుడి అసదుల్లా అక్తర్: ఉత్తరప్రదేశ్‌లోని అజామ్గఢ్లోని గులమ్కాపూర్ జకీ ఉర్ రెహ్మాన్: పాకిస్తాన్‌లోని పంజాబ్ రాష్ట్రం గోజారా తెహసీన్ అక్తర్: బీహార్‌లోని సమిస్తిపూర్ జిల్లా ముట్కాపూర్ యాసీన్ భత్కల్: కర్ణాటకలోని భత్కల్‌లో ఉన్న ముగ్దుం కాలనీ ఎజాజ్ షేక్: మహారాష్ట్రలో ఉన్న పుణే ఘోర్పేట్ ఎప్పుడు, ఎక్కడ చిక్కారంటే? ఎజాజ్ షేక్‌ను 2013 సెప్టెంబర్ 6న ఉత్తరప్రదేశ్‌లోని పశ్చిమ ప్రాంతమైన సహరంగ్‌పూర్ రైల్వే స్టేషన్లో పట్టుకున్నారు. యాసీన్, హడ్డీలను 2013 ఆగస్టు 29న బిహార్‌లోని రక్సౌల్ ప్రాంతంలో బంధించారు. జియా ఉర్ రెహ్మాన్‌ను 2014 మార్చి 22న రాజస్తాన్‌లోని అజ్మీర్ రైల్వేస్టేషన్లో పట్టుకున్నారు. తెహసీన్ అక్తర్‌ను పశ్చిమ బెంగాల్‌లోని కాఖర్‌ర్బిత ప్రాంతంలో 2014 మార్చి 25న పట్టుకున్నట్లు ఎన్ఐఏ తన రికార్డుల్లో పేర్కొంది. యాసీన్ అరెస్టు తర్వాతే ఎజాజ్ షేక్‌కు దిల్సుఖ్నగర్ పేలుళ్లలో పాత్ర ఉన్నట్లు తేలింది. దీనికి ముందు అతడిని ఢిల్లీ స్పెషల్ సెల్ మరో కేసులో అరెస్టు చేసింది. ఆపై వీరందరినీ వేర్వేరు సమయాల్లో ఎన్ఐఏ హైదరాబాద్‌కు తీసుకువచ్చి దిల్సుఖ్నగర్ పేలుళ్ల కేసుల్లో అరెస్టు చేసింది. అభియోగాలు ఎప్పుడంటే: దిల్సుఖ్నగర్ పేలుళ్లకు సంబంధించి యాసీన్, హడ్డీలపై 2013 మార్చి 14న, రియాజ్, వఖాస్ తెహసీన్‌లపై 2014 సెప్టెంబర్ 16, ఎజాజ్ షేక్‌పై 2015 జూన్ 6న ఎన్ఐఏ అభియోగపత్రాలు దాఖలు చేసింది. విచారణ.. శిక్ష: 2016 నవంబర్ 21న విచారణ పూర్తి కాగా.. డిసెంబర్ 13న ఐదుగురిని దోషులుగా తేల్చింది. 19న (సోమవారం) శిక్షలు ఖరారు చేసింది. ఏఏ చట్టాలు, సెక్షన్ల కింద అభియోగాలు: – ఐపీసీ 302, 307, 324, 326, 316, 436, 474, 466, 121, 121 ఎ, 122, 201, 120బి సెక్షన్లు – పేలుడు పదార్థాల చట్టంలోని 3, 5 సెక్షన్లు – చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టంలోని 10, 16, 17,18, 20, 38 (2), 39 (2) సెక్షన్లు – ప్రభుత్వ ఆస్తులకు నష్టం చట్టంలోని సెక్షన్ 4 మృతుల కుటుంబీకుల స్పందన ఇదీ.. దేవుడు సరైన శిక్ష విధించాడు దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్లలో నా కొడుకును కోల్పోయా. వారికి దేవుడు సరైన శిక్షే విధించాడు. పరారీలో ఉన్న ఉగ్రవాదులకూ ఉరిశిక్ష వేయాలి. – ఆనంద్‌కుమార్ తల్లి రాణెమ్మ, ఉరవకొండ, అనంతపురం జిల్లా ఉరి సంతోషకరం మా బిడ్డను ఉగ్రవాదులు అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారు. కాస్త ఆలస్యమైనా నిందితులకు ఉరిశిక్ష పడటం సంతోషకరం. – భారతమ్మ, పోరెడ్డి స్వప్నారెడ్డి తల్లి, రక్షాపురం కాలనీ, హైదరాబాద్ వెంటనే ఉరి తీయాలి.. మాలాంటి వాళ్లకు పుత్రశోకం మిగిల్చిన రాక్షసులకు మరో అవకాశం లేకుండా వెంటనే ఉరి తీయాలి. ఇలాంటి నరహంతకులను క్షమించొద్దు. ఎన్నో కుటుంబాలకు తీరని బాధను మిగిల్చిన హంతకులకు సరైన శిక్షపడింది. ఇలాంటి ద్రోహులు పై కోర్టులకు వెళ్లకుండా వెంటనే శిక్ష వేయాలి. కొడుకు దూరమైన బాధను ఇంకా దిగమింగుకోలేకపోతున్నం. – ఒడ్డె వినయ్‌కుమార్ తల్లిదండ్రులు దేవేంద్ర–లచ్చమ్మ గాయపడ్డ వారిని మరచిపోయారు బాంబు పేలుళ్ల బాధితులకు తగిన న్యాయం చేయడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తోంది. గోకుల్ చాట్ బాంబు పేలుళ్లలో గాయపడ్డ బాధితులకు ఇప్పటికీ పరిహారం అందలేదు. – జయప్రకాశ్, బాంబు పేలుళ్ల బాధితుల సంఘం గౌరవ అధ్యక్షుడు అన్యాయంగా పొట్టన పెట్టుకున్నరు నా బిడ్డను అన్యాయంగా పొట్టనపెట్టుకున్నరు. నాలాంటి తల్లులకు కడుపుకోతలు పెట్టిన ఆ ఉగ్రవాదులను పట్టుకున్న నాడే సంపనుండే. – గుంట తిరుపతి తల్లి రాజమ్మ, గోదావరిఖని పరశురాం నగర్, పెద్దపల్లి జిల్లా నా కొడుకు కళ్లముందే కనిపిస్తున్నడు నా కొడుకు హైదరాబాద్‌లో ట్రైనింగ్ కోసం వెళ్లిండు. కానీ నరరూప రాక్షసులు బాంబులు పేల్చి పొట్టన పెట్టుకున్నరు. వారికి ఉరిశిక్ష వేయడం మంచిదే. – అమృత రవి తల్లి లక్ష్మి, బేగంపేట్, పెద్దపల్లి జిల్లా పోయిన నా బిడ్డ తిరిగి రాడు కదయ్యా.. ఒక్కగానొక్క కొడుకు బాంబు పేలుళ్లలో చనిపోయాడు. వాళ్లకు ఉరేస్తే అందని లోకాలకు పోయిన నా కొడుకు మళ్లీ రాడు కదయ్యా. – శ్రీనివాసరెడ్డి తల్లి పుల్లమ్మ, పాలువాయి (రెంటచింతల) ఆలస్యమైనా న్యాయం జరిగింది కూలీ చేసుకుంటూ కొడుకును చదివించినం. హైదరాబాద్ వెళ్లి పుస్తకాలు కొనుక్కొస్త అని హైదరాబాద్ పోయిన కొడుకు లేడని తెలిసి ఏడ్వడం తప్ప ఏమీ చేయలేకపోయినం. మా కొడుకును పొట్టన పెట్టుకున్న ఆ రాక్షసులకు ఆలస్యమైనా ఉరి శిక్ష వేసి న్యాయం చేసిండ్రు. – పద్మ, పోచయ్య చర్లపల్లి వద్ద కట్టుదిట్టమైన భద్రత హైదరాబాద్: దిల్సుఖ్నగర్ పేలుళ్ల కేసు తీర్పు నేపథ్యంలో చర్లపల్లి కేంద్ర కారాగారం వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రత్యేక పోలీసు బలగాలతోపాటు ఆక్టోపస్ దళాలను మోహరించారు. భత్కల్ టు పుణే - అక్కడే ఉగ్రపాఠాలు నేర్చిన యాసీన్ ∙ పాక్‌లో దాక్కున్న అతడి సోదరుడు రియాజ్ సాక్షి, బెంగళూరు: దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసులో ఐదో నిందితుడిగా ఉన్న మహ్మద్ అహ్మద్ సిద్ధి బప్ప అలియాస్ యాసీన్ భత్కల్ (33) కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా భత్కల్ పట్టణానికి చెందిన వాడు. ఇతని తల్లిదండ్రులు బట్టల వ్యాపారులు. స్థానికంగా ప్రాథమిక విద్య పూర్తి చేసిన భత్కల్.. తర్వాత çపుణేæ వెళ్లి వారి కుటుంబంతో గతంలో పరిచయమున్న ఇక్బాల్ బండారి పంచన చేరారు. అక్కడే ఉగ్రవాదం పట్ల ఆకర్షితుడయ్యాడు. బాంబుల తయారీ, అమర్చడం, వాటిని పేల్చడంలో శిక్షణ పొందాడు. ఆ తర్వాత ఇతడి సోదరుడు రియాజ్ భత్కల్ (ఏ1) (ప్రస్తుతం పాక్‌లో తలదాచుకుంటున్నాడు) సూచనల మేరకు భారత్‌లో ఇండియన్ ముజాహిదీన్ సంస్థ కార్యకలాపాలు చూశాడు. ఈ క్రమంలో 2010 ఏప్రిల్ 17న బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద బాంబులు పేల్చగా, ఐదుగురు భద్రతా సిబ్బందితోపాటు 15 మంది గాయపడ్డారు. ఢిల్లీ, పుణేలోని జర్మన్ బేకరీలో జరిగిన బాంబు పేలుళ్లలోనూ ఇతడి హస్తం ఉన్నట్లు సమాచారం. నా కొడుకు తప్పు చేయలేదు: భత్కల్ తల్లి తన కుమారుడు ఎలాంటి తప్పు చేయలేదని, తాజా తీర్పుపై హైకోర్టుకు వెళ్తామని యాసీన్ భత్కల్ తల్లి బీబీ రహానే పేర్కొన్నారు. హైకోర్టులో న్యాయం దొరక్కపోతే సుప్రీంకోర్టుకు వెళ్తామని భత్కల్‌లో మీడియా ప్రతినిధులతో అన్నారు. ఈ తీర్పు ఒక గుణపాఠం: దత్తాత్రేయ సాక్షి, హైదరాబాద్: దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసులో ఐదుగురు ఉగ్రవాదులకు ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం ఉరిశిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పును కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ స్వాగతించారు. తీవ్రవాదులు, విచ్ఛిన్నకర శక్తుల కార్యకలాపాలకు తోడ్పడే వారికి, సహకారం అందిస్తున్న వారికి ఈ తీర్పు ఓ గుణపాఠమని పేర్కొన్నారు. పాకిస్తాన్‌కు పారిపోయిన నిందితుడు రియాజ్ భత్కల్ను పట్టుకుని, కఠినశిక్ష విధించేలా ఎన్ఐఏ కృషి చేయాలన్నారు. ఈ తీర్పు హైదరాబాద్ ప్రజలకు ఉపశమనం కలిగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు చెందిన అయిదుగురికి ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం ఉరిశిక్ష విధించడాన్ని బీజేపీ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ స్వాగతించారు. -
‘దిల్సుఖ్నగర్’ గుణపాఠం
భాగ్యనగరిపై ఉగ్ర పంజా విసిరి దిల్‌సుఖ్‌నగర్‌లో 16మంది అమాయకుల ప్రాణా లను బలిగొన్న అయిదుగురు ముష్కరులకు ఉరిశిక్ష విధిస్తూ జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ప్రత్యేక న్యాయస్థానం సోమవారం వెలువరించిన తీర్పు బాధిత కుటుంబాలకు సాంత్వన కలగజేస్తుంది. ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక న్యాయ స్థానం 453మంది సాక్షులను విచారించి, 152 డాక్యుమెంట్లను పరిశీలించింది. ఇండియన్ ముజాహిదీన్(ఐఎం)కు చెందిన నిందితులంతా మారణహోమాన్ని సృష్టించి పౌరుల్లో భయోత్పాతాన్ని కలగజేసే ఉద్దేశంతో రెండు నిర్దిష్ట ప్రాంతాలను ఎంపిక చేసుకుని పేలుళ్లకు పాల్పడిన తీరుపై ఎన్ఐఏ సకల సాక్ష్యాధారాలనూ సేక రించిందని న్యాయస్థానం అభిప్రాయపడింది. అయితే దాడి సూత్రధారి రియాజ్ భత్కల్ ఇంకా పరారీలోనే ఉన్నాడు. అతను పాకిస్తాన్లో తలదాచుకున్నాడంటున్నారు. అలాగే శిక్షపడినవారిలో ఒకడు పాకిస్తాన్ పౌరుడు. ఈ జంట పేలుళ్ల కేసులో అయిదుగురు నిందితులూ దోషులేనని ఈ నెల 13నే ప్రత్యేక కోర్టు నిర్ధారించింది. ఆరు రోజుల తర్వాత ఇప్పుడు శిక్షలు ఖరారు చేసింది. ప్రత్యేక కోర్టు దోష నిర్ధారణ చేశాక తమను ఇందులో అన్యాయంగా ఇరికించారని, విచారణ ఏకపక్షంగా జరిగిం దని నిందితులు వేర్వేరుగా లేఖలు రాశారు. నిబంధనల ప్రకారం ప్రత్యేక న్యాయ స్థానం ఇప్పుడు విధించిన ఉరిశిక్షనూ ఎటూ హైకోర్టు ఖరారు చేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో ఈ అయిదుగురి వాదనలు కూడా వినే అవకాశం ఉంది. ఎన్ఐఏ అధికారులు, సిబ్బంది, దర్యాప్తు బృందం సమష్టిగా పనిచేయడంవల్లే ఈ కఠిన శిక్షల విధింపు సాధ్యమైందని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేందర్‌రావు చెప్పిన మాట నిజమే కావొచ్చు. కానీ ఇందుకు దాదాపు నాలుగేళ్ల సమయం పట్టిం దన్న సంగతి మరువకూడదు. ఇది ఉగ్రవాద దాడి గనుక, దీని వెనక అంతర్జాతీయ ముఠాల ప్రాబల్యం ఉన్నది గనుక దీన్ని ఛేదించడం చాలా సంక్లిష్టమైన వ్యవహార మని కొందరు చేస్తున్న వాదనల్లో నిజం లేకపోలేదు. అయితే ఇలాంటి ఉగ్ర దాడుల ఉద్దేశం ప్రజానీకంలో భయోత్పాతాన్ని, అభద్రతాభావాన్ని కలగజేయడం గనుక దర్యాప్తు శరవేగంతో నడవాలని అందరూ కోరుకుంటారు. నిందితుల్ని పట్టుకోవడంలో, వారి నేరాలకు సంబంధించిన సాక్ష్యాధారాలను సేకరించడంలో, న్యాయ స్థానం ఎదుట వాటిని రుజువు చేయడంలో విఫలమైతే పౌరుల్లో నిరాశా నిస్పృహలు, అభద్రత ఏర్పడతాయి. ఇందుకు భిన్నంగా సత్వర దర్యాప్తు, విచారణ సాగి వెనువెంటనే శిక్షలు పడితే నేరగాళ్ల వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటి నేరాలకు పాల్పడే దుస్సాహసం మరెవరూ చేయరు. ఉగ్రవాదం నేడో, రేపో సమసిపోయే సమస్య కాదు. అది నిరంతరం కాచుకుని ఉంటుంది. అవకాశం కోసం ఎదురు చూస్తుంది. ఇంటెలిజెన్స్ సంస్థలు మొదలుకొని సాధారణ పౌరుల వరకూ అందరికందరూ అప్రమత్తంగా ఉంటే తప్ప దాన్ని ఓడించడం సాధ్యం కాదు. ఒక్క సారి అలసత్వం ప్రదర్శించినా, నిర్లిప్త ధోరణితో ఉన్నా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. భారీయెత్తున ప్రాణనష్టం, ఆస్తి నష్టం సంభవించే ప్రమాదం ఉంటుంది. నిజానికి ఆ కోణంలో చూస్తే దిల్సుఖ్ నగర్ పేలుళ్లు నివారించదగ్గవే. పేలుళ్లకు రెండు రోజుల ముందు నిఘా సంస్థల హెచ్చరికల్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియ జేశామని అప్పటి కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే చెప్పారు. అవి అందిన మాట నిజమే అయినా అలాంటివి సాధారణంగా ఎప్పుడూ వస్తూనే ఉంటాయని ఆనాటి సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇవి చాలు... మన ప్రభుత్వాలు ఎంత అలసత్వంగా ఉన్నాయో చెప్పడానికి! వచ్చిన సమాచారాన్ని బట్వాడా చేయడమే తన ధర్మమని కేంద్రం అనుకుంటే... ఇందులో కొత్తేముందని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఆ జంట పేలుళ్లు హైదరాబాద్ నగరంలో అయిదో ఉగ్ర వాద దాడి కాగా... అందులో దిల్సుఖ్నగర్ ప్రాంతాన్ని ఉగ్రవాదులు మూడు సార్లు ఎంచుకున్నారని గుర్తుంచుకుంటే ఇదెంత బాధ్యతారాహిత్యమో అర్ధమవు తుంది. పైగా ఆ దాడులన్నీ గురువారాల్లోనే జరిగాయి. ప్రభుత్వ యంత్రాంగం అప్రమ త్తంగా ఉంటే మిగిలిన ప్రాంతాల మాటెలా ఉన్నా దిల్సుఖ్నగర్లోనైనా పటిష్టమైన నిఘా ఏర్పాటు చేసేది. అంతక్రితం ఉగ్రవాదులు ఏ ఏ రూపాల్లో దాడి చేశారో తెలుసు గనుక అందుకు సంబంధించిన జాడలేమైనా ఉన్నాయేమో నన్న ఆరా పోలీ సులకు ఉండేది. సాధారణ పౌరులను సైతం అప్రమత్తం చేసి ఉంటే ఉగ్రవాదుల కదలికలు అంత సులభమయ్యేవి కాదు. ఈ పేలుళ్లకు ముందు ముంబై దాడి కారకుడైన కసబ్‌ను ఉరి తీయడం, పార్లమెంటుపై దాడి కేసులో అఫ్జల్ గురుకు ఉరి అమలు చేయడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. వీటిపై తాము ప్రతీకారం తీర్చుకుంటామని ఉగ్రవాద సంస్థలు హెచ్చరించాయి కూడా. అటువంట ప్పుడు కేంద్రం నుంచి వచ్చిన హెచ్చరికలు ‘రొటీనే’ అను కున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడంలో అర్ధం లేదు. దిల్సుఖ్నగర్ జంట పేలుళ్లలో చిక్కుకుని గాయాలపాలైనవారు, ఆప్తుల్ని కోల్పోయినవారు ఇప్పటికీ ఆ ఉదంతాలను తల్చుకుని వణికిపోతున్నారంటే అవి సృష్టించిన భయోత్పాతం ఏ స్థాయిలో ఉందో వెల్లడవుతుంది. నిఘా వ్యవస్థల్ని పటిష్టపరిచి, ఉగ్రవాదుల్ని మొగ్గలోనే తుంచేలా ఎప్పటికప్పుడు చర్యలు తీసు కుంటే తప్ప ఇలాంటి స్థితి పోదు. అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలమధ్య సమన్వయం, వెనువెంటనే రంగంలోకి దిగే చురుకుదనం అవసరమవుతాయి. సీసీ కెమెరాలను పెట్టడమే కాదు... అవి ఎలా పనిచేస్తున్నాయో తరచుగా తనిఖీ చేసే వ్యవస్థ ఉండాలి. పోలీసు విభాగాల సంసిద్ధత ఏ స్థాయిలో ఉన్నదో సమీక్షిస్తుం డాలి. ఇవన్నీ నిరంతరం జరుగుతున్నపుడే దిల్సుఖ్ నగర్ ఉదంతాల వంటివి పునరావృతం కాకుండా ఉంటాయి. ఈ జంట పేలుళ్ల కేసు ఒక కొలిక్కి రావడానికి ఇంత కాలం పట్టింది. ఈ కేసుకు సంబంధించి ఉన్నత న్యాయస్థానాల్లో సాధ్య మైనంత త్వరగా విచారణ ప్రక్రియ పూర్తి కావాలని, నేరగాళ్లకు శిక్షలు ఖరారు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. -
జంటనగరాల్లో భారీ బందోబస్తు
హైదరాబాద్: దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల నిందితులకు ఉరిశిక్ష ఖరారు కావడంతో జంట నగరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎల్బీనగర్ క్యాంపు కార్యాలయంలో రాచకొండ జాయింట్ సీపీ శశిధర్‌రెడ్డి సోమవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రధాన కూడళ్లు, షాపింగ్ మాల్స్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల ఘటనలో ఐదుగురు దోషులకు ఉరిశిక్ష విధిస్తూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు సోమవారం తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. -
భత్కల్ సహా ఆ ఐదుగుర్ని వెంటనే ఉరితీయాలి
అప్పీలు చేసే అవకాశం ఇవ్వకూడదు రక్షాపురం (చంద్రాయణగుట్ట): దిల్సుఖ్నగర్ జంటపేలుళ్ల కేసులో ప్రధాన సూత్రధారులైన ఐదుగురు ఉగ్రవాదులకు ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఉరిశిక్ష విధించడంపై మృతుల కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 18మంది అమాయకుల ప్రాణాల్ని పొట్టనబెట్టుకున్న ముష్కరుల్ని వెంటనే ఉరితీయాలని, వారికి హైకోర్టులో, సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకునే అవకాశం ఇవ్వకూడదని వారు కోరుతున్నారు. 2013 ఫిబ్రవరి 21న దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన సంగతి తెలిసిందే. యావత్ హైదరాబాద్‌ను దిగ్భ్రాంతపరిచిన ఈ ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. 140మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో చంద్రాయణగుట్ట రక్షాపురానికి చెందిన స్వప్నారెడ్డి కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఐదుగురు ఉగ్రవాదులకు ఉరిశిక్ష విధిస్తూ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును స్వప్నారెడ్డి కుటుంబసభ్యులు స్వాగతించారు. అమాయకుల ప్రాణాల్ని పొట్టనబెట్టుకున్న దోషులకు హైకోర్టులో, సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకునే అవకాశం ఇవ్వకూడదని, వారిని తొందరగా ఉరితీయాలని వారు డిమాండ్‌చేశారు. స్వప్నారెడ్డిని ఉగ్రవాదులు ఆ కారణంగా పొట్టనబెట్టుకున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నగరవాసులకు చేదు అనుభవం మిగిల్చిన దిల్సుఖ్నగర్ జంట పేలుళ్లపై విచారణ జరిపిన ఎన్ఐఏ కోర్టు.. దోషులు యాసీస్ భత్కల్‌తో పాటు అసదుల్లా అక్తర్, జియావుర్ రెహ్మాన్ (పాకిస్తానీ), మహ్మద్ తెహసీన్ అక్తర్ అలియాస్ మోను, ఎజాజ్ షేక్‌లకు ఉరిశిక్ష విధించిన సంగతి తెలిసిందే. -
ఆ ఐదుగురికి ఉరిశిక్ష
హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లో 2013 ఫిబ్రవరి 21న జరిగిన జంట పేలుళ్ల ఘటనలో ఐదుగురు దోషులకు ఉరిశిక్ష విధిస్తూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు సోమవారం తీర్పునిచ్చింది. ఈ ఐదుగురూ దోషులేనని గత మంగళవారం నిర్ధారించిన కోర్టు ఇవాళ వారికి శిక్షలను ఖరారు చేసింది. ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులుండగా ప్రధాన సూత్రధారి రియాజ్ భత్కల్ ఇంకా పరారీలోనే ఉన్నాడు. ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాద సంస్థ దేశంలో పాల్పడిన ఘాతుకాలకు సంబంధించి విచారణ పూర్తయి తీర్పు వెలువడిన తొలి కేసు ఇదే! తీర్పు వెలువరిస్తున్న నేపథ్యంలో కోర్టు ఉన్న చర్లపల్లి జైలు వద్ద సోమవారం అత్యంత పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పాకిస్తాన్లో తలదాచుకున్న రియాజ్ భత్కల్ ఆదేశాల మేరకు జరిగిన ఈ ఆపరేషన్‌లో అతడి సోదరుడు మహ్మద్ అహ్మద్ సిద్ధిబప్ప అలియాస్ యాసీస్ భత్కల్‌తో పాటు అసదుల్లా అక్తర్ అలియాస్ హడ్డీ, జియావుర్ రెహ్మాన్ అలియాస్ వకాస్ (పాకిస్తానీ), మహ్మద్ తెహసీన్ అక్తర్ అలియాస్ మోను, ఎజాజ్ షేక్ పాలుపంచుకున్నారని ఎన్ఐఏ తేల్చింది. విధ్వంసంలో యాసీన్ భత్కల్ నేరుగా పాల్గొననందున అతణ్ని ఐదో నిందితుడిగా చేర్చింది. దిల్‌సుఖ్‌నగర్‌లోని 107 బస్టాప్, ఏ–1 మిర్చి సెంటర్ వద్ద జరిగిన ఈ పేలుళ్లలో 18 మంది మరణించగా ఏకంగా 131 మంది క్షతగాత్రులవడం తెలిసిందే. దీనిపై హైదరాబాద్‌లోని మలక్‌పేట, అప్పటి సైబరాబాద్, ఇప్పటి రాచకొండ కమిషనరేట్‌లోని సరూర్‌నగర్ ఠాణాల్లో కేసులు నమోదవగా, అనంతరం వాటిని ఎన్ఐఏకు బదలాయించారు. ఈ రెండు కేసులకు కీలక ప్రాధాన్యమిచ్చిన ఎన్ఐఏ అధికారులు 157 మంది సాక్షులతో పాటు 502 డాక్యుమెంట్లు, 201 ఆధారాలను కోర్టు ముందుంచారు. నిందితులపై చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం 10, 16, 17, 19, 20, ఐపీసీ 120 (బి), 302, 307, 324, 326, 316, 121, 121 (ఎ), 122, 474, 466, పేలుడు పదార్థాల చట్టం 3, 5 సెక్షన్ల కింద ఎన్ఐఏ అభియోగాలు మోపింది. ఆరుగురు ఉగ్రవాదుల్లో ఐదుగురు దోషులుగా తేలగా, పాకిస్థాన్‌లో ఉన్న రియాజ్ భత్కల్‌పై ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసులు జారీ చేసింది. దేశంలోనే తొలి కేసుగా రికార్డు దేశవ్యాప్తంగా విధ్వంసాలకు పాల్పడటానికి ఆసిఫ్ రజా కమాండో ఫోర్స్‌గా (ఏఆర్‌సీఎఫ్) ఏర్పడిన ఉగ్రవాద బృందం ఆపై రియాజ్ భత్కల్ నేతృత్వంలో ‘ఉసాబా’గా పేరు మార్చుకుంది. 2002లో ఇండియన్ ముజాహిదీన్‌గా (ఐఎం) మారి తొమ్మిది రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో పేలుళ్లకు పాల్పడింది. ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, సూరత్, బెంగళూరు, వారణాసి... ఇలా వీరు విరుచుకుపడని మెట్రో, నగరం లేవు. 2007 ఆగస్టు 25న హైదరాబాద్‌లోని లుంబినీ పార్కు, గోకుల్ చాట్‌ల్లోనూ విధ్వంసం సృష్టించింది ఐఎం ఉగ్రవాదులే. 2007 నవంబర్ 25న వారణాసి కోర్టుల్లో పేలుడుకు పాల్పడిన ఈ ముష్కరులు పేలుడుకు బాధ్యత వహిస్తున్నట్లు మీడియాకు ఈ–మెయిల్ పంపారు. అప్పుడే తొలిసారిగా ఐఎం పేరు వెలుగులోకి వచ్చింది. ఈ సంస్థలో ఉన్నదెవరు, దాన్ని నడిపిస్తున్నదెవరనే అంశాలు మరో ఏడాది దాకా బయట పడలేదు. 2008 సెప్టెంబర్‌లో ఢిల్లీలోని జామియానగర్‌లో ఉన్న బాట్లా హౌస్‌లో ఎన్కౌంటర్ జరిగింది. అక్కడ దొరికిన ముష్కరుల విచారణతో ఐఎం గుట్టు రట్టయింది. అంతకుముందు, ఆ తర్వాత దేశవ్యాప్తంగా జరిగిన విధ్వంసాలకు సంబంధించి ఐఎంపై 60 కేసులు నమోదయ్యాయి. పదుల సంఖ్యలో ఉగ్రవాదులు అరెస్టయ్యారు. 2007 నాటి హైదరాబాద్ జంట పేలుళ్లతో పాటు అన్ని కేసులూ పలు కోర్టుల్లో విచారణ దశల్లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో ఐఎం ఘాతుకాలకు సంబంధించి విచారణ పూర్తై, నిందితులను దోషులుగా తేల్చిన తొలి కేసుగా దిల్సుఖ్నగర్ పేలుళ్లు రికార్డుకెక్కాయి. -
హైదరాబాద్ పేలుళ్ల సూత్రధారి లగ్జరీ లైఫ్
హైదరాబాద్: ఓ వైపు దిల్ సుఖ్ నగర్ పేలుళ్లను అమలు చేసిన ఇండియన్ మొజాహిద్దీన్(ఐఎమ్) ఉగ్రవాది యాసిన్ బత్కల్ ను జాతీయ దర్యాప్తు సంస్ధ(ఎన్ఐఏ) అరెస్టు చేసి ఆఖరి తీర్పుకు కోర్టులో ప్రవేశపెట్టేందుకు సిద్ధమౌతుండగా.. మరో వైపు పేలుళ్ల సూత్రధారి, ఐఎమ్ సహవ్యవస్ధాపకుడు రియాజ్ బత్కల్ పాకిస్తాన్ లో లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. రియాజ్ బత్కల్ కరాచీలోని ఓ గుర్తు తెలియని ప్రదేశంలోని భవనంలో పాకిస్తాన్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ నీడన రాజభోగాలు అనుభవిస్తున్నట్లు తెలిసింది. హైదరాబాద్ లో పేలుళ్లు చేసినందుకుగాను ఐఎస్ఐ పెద్ద ఎత్తున డబ్బును రియాజ్ బత్కల్ కు ఇచ్చినట్లు ఎన్ఐఏ అధికారులు అంటున్నారు. ఈ మేరకు దిల్ సుఖ్ నగర్ పేలుళ్ల చార్జిషీటులో రియాజ్ బత్కల్, అతని సోదరుడు ఇక్బాల్ బత్కల్ లకు ఐఎస్ఐ ఆశ్రయం ఇస్తోందని పేర్కొన్నట్లు తెలిసింది. ఐఎస్ఐకు సాయం చేస్తానని రియాజ్ ఒప్పుకోవడంతోనే ఐఎమ్ లో చీలిక వచ్చిందని ఎన్ఐఏ అధికారులు చెబుతున్నారు. మాజీ ఐఎమ్ నేత షఫీ అర్మర్ రియాజ్ తో విభేదించి ఐఎస్ లేదా అల్ ఖైదా సంస్ధ పుట్టుకురావడానికి కారణమయ్యాడని చెప్పారు. రియాజ్ వద్ద పాకిస్తాన్ పాస్ పోర్టు కూడా ఉన్నట్లు తెలిసింది. దిల్ సుఖ్ నగర్ పేలుళ్ల కోసం హవాలా మార్గం ద్వారా ఒకసారి రూ.1.25లక్షలు, మరోసారి యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి వెస్ట్ టర్న్ యూనియన్ మనీ ట్రాన్స్ ఫర్ ద్వారా రూ.75 వేలు యాసిన్ బత్కల్ కు రియాజ్ పంపినట్లు చెప్పారు. ముస్లింలకు వ్యతిరేకంగా హైదరాబాద్ లో సాగుతున్న కార్యకలాపాలను అడ్డుకునేందుకు రియాజ్ బత్కల్ పేలుళ్ల కుట్ర పన్నినట్లు పేర్కొన్నారు. పేలుళ్ల కోసం అసదుల్లా అక్తర్ అలియస్ హద్దీ, మహమ్మద్ తహసీన్ అక్తర్ అలియాస్ హసన్, జియా ఉర్ రెహమాన్ అలియాస్ వకాస్ లను యాసిన్ బత్కల్ కు పరిచయం చేసి దిల్ సుఖ్ నగర్ తో పాటు దేశంలోని మరికొన్ని ప్రాంతాల్లో పేలుళ్లు చేయాలని పథకం రచించాడు. పేలుళ్లకు ఒకరోజు ముందు వ్యుహం సఫలీకృతం కావాలని దేవుడిని ప్రార్ధించాలని రియాజ్ బత్కల్, యాసిన్ బత్కల్ ను కోరినట్లు అధికారులు చెప్పారు. పేలుళ్లకు తొలుత పిక్రిక్ యాసిడ్ ను ఉపయోగించాలని యాసిన్ భావించాడని కానీ, సహచరుల సలహాలతో ఆ ఆలోచనను విరమించుకున్నట్లు తెలిసింది. పేలుళ్లలో 50 ఇంప్రొవైజ్ డ్ ఎక్స్ ప్లోజివ్ డివైజెస్(ఐఈడీ)లను ఉపయోగించినట్లు చెప్పారు. పేలుళ్లు పూర్తయ్యేవరకూ యాహు మెసేంజర్ ద్వారా రియాజ్ ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటూ ఉన్నట్లు వెల్లడించారు. -
ముప్పుతిప్పలు పెట్టాడు!
సాక్షి, సిటీబ్యూరో: ఆధునిక ఉగ్రవాదానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిన యాసీన్ భత్కల్ దిల్సుఖ్నగర్ పేలుళ్ళ కేసు విచారణ నేపథ్యంలో దర్యాప్తు సంస్థలతో పాటు పోలీసులు, జైళ్ళ శాఖ అధికారులకు చుక్కలు చూపించాడు. ఓసారి జేబులో ‘అనుమానాస్పద వస్తువుతో’, మరోసారి ఫోన్ కాల్‌తో హడలెత్తించాడు. యాసీన్ కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి జిల్లా భత్కల్‌లో 1983లో జన్మించాడు. అంజుమన్–హమి–ఇ–ముస్లమీన్ పాఠశాలలో ప్రాథమిక విద్యతో ప్రారంభమై... ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. పుణేకు మాకాం మార్చిన యాసీన్... తనకు సోదరుడి వరుసయ్యే రియాజ్ భత్కల్ ద్వారా ఉగ్రవాదం వైపు మళ్ళాడు. రియాజ్ దేశం విడిచి పారిపోయిన తర్వాత విధ్వంస రచనలో యాసీన్ కీలకంగా మారాడు. ఇండియన్ ముజాహిదీన్ సంస్థకు కో–ఫౌండర్ బాధ్యతలు స్వీకరించి సౌత్ ఇండియా చీఫ్‌గా మారాడు. జైపూర్, అహ్మదాబాద్, బెంగళూరు, ఢిల్లీ పేలుళ్ళ తర్వాత ఇతడి పేరు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. 2013లో ఢిల్లీ స్పెషల్ సెల్ అరెస్టు చేసిన తర్వాత ఎన్ఐఏ అధికారులు హైదరాబాద్ తరలించారు. ‘సినిమా’ చూపించాడు... దిల్సుఖ్నగర్ పేలుళ్ళ కేసు విచారణ...తొలుత ఎల్బీనగర్లోని రంగారెడ్డి జిల్లా కోర్టు ప్రాంగణంలోనే జరిగింది. ఆ సమయంలో ఓసారి యాసీన్ భత్కల్ కోర్టుకు హాజరైనప్పుడు అతడి జేబులో ‘ఓ అనుమానాస్పద వస్తువు’ మీడియాకు చిక్కింది. ఆకారాన్ని బట్టి అది సెల్‌ఫోన్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో మరోసారి అతడికి కోర్టుకు తీసుకువచ్చినప్పుడు దాన్ని బయటకు తీయించిన అధికారులు అదో పుస్తకంగా తేల్చారు. చర్లపల్లి జైలు నుంచి తన కుటుంబంతో ఫోల్లో మాట్లాడినట్లు, ఆ నేపథ్యంలోనే తాను ఐసిస్ ఉగ్రవాదుల సాయంతో తప్పించుకోనున్నట్లు చెప్పాడని నిఘా వర్గాలు గుర్తించాయి. దీంతో కేసు విచారణ కోసం చర్లపల్లి జైలులోనే కోర్టు ఏర్పాటు చేయించిన అధికారులు విచారణ అక్కడకు మార్చారు. జైలులో ఉన్న యాసీన్ అనేక న్యాయ పుస్తకాలను అధ్యయనం చేశారని తెలుస్తోంది. వీటి ఆధారంగా ప్రాసిక్యూషన్ లాయర్లను ఎదురు ప్రశ్నించేవాడని సమాచారం. మరోపక్క టెస్ట్ ఐడెంటిఫికేషన్ పెరేడ్ నేపథ్యంలోనే యాసీన్ తన హావభావాలతో అనేక మంది సాక్షుల్ని బెదిరించడానికి ప్రయత్నించాడని సమాచారం. ఎవరు... ఎప్పుడు... ఎక్కడ చిక్కారంటే... కేంద్ర నిఘా సంస్థ, ఢిల్లీ స్పెషల్ స్పెల్ అధికారులు సంయుక్తంగా నేపాల్‌లో చేసిన ఆపరేషన్‌లో 2013 ఆగస్టు 29న యాసీన్, అసదుల్లా అక్తర్ చిక్కారు. వీరిని బీహార్–నేపాల్ సరిహద్దుల్లోని రక్సెల్ ప్రాంతంలో అరెస్టు చూపించారు. దిల్సుఖ్నగర్ పేలుళ్ళు చోటు చేసుకున్నది, వీరిద్దరూ చిక్కింది గురువారమే కావడం యాధృచ్ఛికం. వీరిద్దరూ చిక్కడంతో దిల్సుఖ్నగర్ పేలుళ్ళ కేసు కొలిక్కివచ్చింది. విచారణలో తెహసీన్, వఖాస్ల పాత్ర పూర్తిస్థాయిలో నిర్థారణైంది. దీంతో వీరిద్దరిపై జాతీయ దర్యాప్తు సంస్థ 2013 సెప్టెంబర్ 24న రూ.10 లక్షల చొప్పున రివార్డు ప్రకటించింది. సీన్, అసదుల్లా విచారణలోనే వఖాస్ భారత్‌లోనే ఉన్నాడని కర్నాటక, ఒడిస్సా, పశ్చిమ బెంగాల్, కేరళ, మహారాష్ట్రల్లో సంచరిస్తున్నాడని వెలుగులోకి వచ్చింది. దీంతో పక్కా నిఘా ఉంచిన ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు 2014 మార్చి 23న ముంబై నుంచి రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు చేరుకున్న వఖాస్‌ను అక్కడి రైల్వేస్టేషన్లో పట్టుకున్నారు. ఇతడిచ్చిన సమాచారంలో జైపూర్, జోధ్‌పూర్‌ల్లో మరో ముగ్గురిని అరెస్టు చేసి భారీ పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఇక అప్పటికి పరారీలో ఉన్న మోను ఆచూకీ కోసం అనేక సాంకేతిక ఆధారాలు, క్షేత్రస్థాయి పరిణామాలను పరిశీలించిన నిఘా వర్గాలు మోను రాజస్థాన్‌కు చేరుకున్నట్లు గుర్తించాయి. అజ్మీర్‌లో గైడ్ ముసుగులో ఉంటున్న ఇతడిని ఢిల్లీ స్పెషల్ సెల్ అధికారులు 2014 మార్చి 25న పశ్చిమ బెంగాల్‌లోని కాఖర్‌ర్బిత ప్రాంతంలో పట్టుకున్నారు. అదే ఏడాది సెప్టెంబర్ 5న ఎజాజ్ షేక్‌ను మహారాష్ట్రలో అరెస్టు చేశారు. -
‘దిల్సుఖ్నగర్’ దోషులకు 19న శిక్షలు ఖరారు
- ప్రత్యేక న్యాయస్థానం నిర్ధారణ - ఐదుగురు నిందితులపైనా నేరం నిరూపణ - పరారీలో సూత్రధారి రియాజ్ భత్కల్ - వచ్చే సోమవారం శిక్షలు ఖరారు - ఇండియన్ ముజాహిదీన్ కేసుల్లో నేరం రుజువైన తొలి కేసు సాక్షి, హైదరాబాద్ రాజధానిలోని దిల్‌సుఖ్‌నగర్‌లో 2013 ఫిబ్రవరి 21న చోటు చేసుకున్న బాంబు పేలుళ్ల కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురూ దోషులేనని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు మంగళవారం నిర్ధారించింది. ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులుండగా ప్రధాన సూత్రధారి రియాజ్ భత్కల్ ఇంకా పరారీలోనే ఉన్నాడు. దోషులకు వచ్చే సోమవారం (19న) శిక్షలు ఖరారు చేయనున్నారు. ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాద సంస్థ దేశంలో పాల్పడిన ఘాతుకాలకు సంబంధించి విచారణ పూర్తయి తీర్పు వెలువడిన తొలి కేసు ఇదే! తీర్పు వెలువరిస్తున్న నేపథ్యంలో కోర్టు ఉన్న చర్లపల్లి జైలు వద్ద మంగళవారం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పాకిస్తాన్లో తలదాచుకున్న రియాజ్ భత్కల్ ఆదేశాల మేరకు జరిగిన ఈ ఆపరేషన్‌లో అతడి సోదరుడు మహ్మద్ అహ్మద్ సిద్ధిబప్ప అలియాస్ యాసీస్ భత్కల్‌తో పాటు అసదుల్లా అక్తర్ అలియాస్ హడ్డీ, జియావుర్ రెహ్మాన్ అలియాస్ వకాస్ (పాకిస్తానీ), మహ్మద్ తెహసీన్ అక్తర్ అలియాస్ మోను, ఎజాజ్ షేక్ పాలుపంచుకున్నారని ఎన్ఐఏ తేల్చింది. విధ్వంసంలో యాసీన్ భత్కల్ నేరుగా పాల్గొననందున అతణ్ని ఐదో నిందితుడిగా చేర్చింది. దిల్‌సుఖ్‌నగర్‌లోని 107 బస్టాప్, ఏ–1 మిర్చి సెంటర్ వద్ద జరిగిన ఈ పేలుళ్లలో 18 మంది మరణించగా ఏకంగా 131 మంది క్షతగాత్రులవడం తెలిసిందే. దీనిపై హైదరాబాద్‌లోని మలక్‌పేట, అప్పటి సైబరాబాద్, ఇప్పటి రాచకొండ కమిషనరేట్‌లోని సరూర్‌నగర్ ఠాణాల్లో కేసులు నమోదవగా, అనంతరం వాటిని ఎన్ఐఏకు బదలాయించారు. ఈ రెండు కేసులకు కీలక ప్రాధాన్యమిచ్చిన ఎన్ఐఏ అధికారులు 157 మంది సాక్షులతో పాటు 502 డాక్యుమెంట్లు, 201 ఆధారాలను కోర్టు ముందుంచారు. నిందితులపై చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం 10, 16, 17, 19, 20, ఐపీసీ 120 (బి), 302, 307, 324, 326, 316, 121, 121 (ఎ), 122, 474, 466, పేలుడు పదార్థాల చట్టం 3, 5 సెక్షన్ల కింద ఎన్ఐఏ అభియోగాలు మోపింది. ఆరుగురు ఉగ్రవాదుల్లో ఐదుగురు దోషులుగా తేలగా, పాకిస్థాన్‌లో ఉన్న రియాజ్ భత్కల్‌పై ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసులు జారీ చేసింది. కేసులో ‘ప్రత్యేకత’లెన్నో దిల్సుఖ్నగర్ పేలుళ్ల కేసులో అనేక ‘ప్రత్యేకతలు’న్నాయి. ఈ ఘాతుకానికి పాల్పడిన ఉగ్రవాదుల్ని ఢిల్లీ స్పెషల్ సెల్ అధికారులు పట్టుకున్నారు. వీరిపై దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో కేసులు నమోదై ఉన్నాయి. ఢిల్లీ నుంచి ఉగ్రవాదుల్ని ప్రిజనర్స్ ట్రాన్సిట్ వారెంట్‌పై హైదరాబాద్ తీసుకొచ్చారు. అలాగే వారిని మిగతా రాష్ట్రాలకూ తీసుకెళ్లాల్సి ఉంది. కానీ ప్రాధాన్యం దృష్ట్యా ఇక్కడి కేసుల విచారణ పూర్తయ్యేదాకా వారిని మరో ప్రాంతానికి తరలించే ఆస్కారం లేకుండా తెలంగాణ సర్కారు 2014లో ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. ముష్కరుల్ని చర్లపల్లి కేంద్ర కారాగారంలో ఉంచారు. కేసు విచారణ తొలుత ఎల్బీనగర్లోని రంగారెడ్డి జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయస్థానంలో జరిగింది. భద్రతా కారణాలతో పాటు విచారణ త్వరిగతగతిన పూర్తి చేయడానికి చర్లపల్లి కేంద్ర కారాగారంలోనే ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేశారు. ఓ సందర్భంలో ఐసిస్ ఉగ్రవాదుల సాయంతో యాసీన్ భత్కల్ తప్పించుకునే అవకాశం ఉందనే హెచ్చరికలు వెలువడ్డాయి. దీంతో జైలు వద్ద నిత్యం ఆక్టోపస్ కమాండోల పహారా ఏర్పాటు చేశారు. ఈ పేలుడులో మరణించిన 17 మందిలో ఓ మహిళ గర్భవతి. గర్భస్థ శిశువును హత్య చేయడం నేరమేనంటూ మృతుల సంఖ్యను 18గా దర్యాప్తు అధికారులు నిర్థారించారు. దేశంలోనే తొలి కేసుగా రికార్డు దేశవ్యాప్తంగా విధ్వంసాలకు పాల్పడటానికి ఆసిఫ్ రజా కమాండో ఫోర్స్‌గా (ఏఆర్‌సీఎఫ్) ఏర్పడిన ఉగ్రవాద బృందం ఆపై రియాజ్ భత్కల్ నేతృత్వంలో ‘ఉసాబా’గా పేరు మార్చుకుంది. 2002లో ఇండియన్ ముజాహిదీన్‌గా (ఐఎం) మారి తొమ్మిది రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో పేలుళ్లకు పాల్పడింది. ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, సూరత్, బెంగళూరు, వారణాసి... ఇలా వీరు విరుచుకుపడని మెట్రో, నగరం లేవు. 2007 ఆగస్టు 25న హైదరాబాద్‌లోని లుంబినీ పార్కు, గోకుల్ చాట్‌ల్లోనూ విధ్వంసం సృష్టించింది ఐఎం ఉగ్రవాదులే. 2007 నవంబర్ 25న వారణాసి కోర్టుల్లో పేలుడుకు పాల్పడిన ఈ ముష్కరులు పేలుడుకు బాధ్యత వహిస్తున్నట్లు మీడియాకు ఈ–మెయిల్ పంపారు. అప్పుడే తొలిసారిగా ఐఎం పేరు వెలుగులోకి వచ్చింది. ఈ సంస్థలో ఉన్నదెవరు, దాన్ని నడిపిస్తున్నదెవరనే అంశాలు మరో ఏడాది దాకా బయట పడలేదు. 2008 సెప్టెంబర్‌లో ఢిల్లీలోని జామియానగర్‌లో ఉన్న బాట్లా హౌస్‌లో ఎన్కౌంటర్ జరిగింది. అక్కడ దొరికిన ముష్కరుల విచారణతో ఐఎం గుట్టు రట్టయింది. అంతకుముందు, ఆ తర్వాత దేశవ్యాప్తంగా జరిగిన విధ్వంసాలకు సంబంధించి ఐఎంపై 60 కేసులు నమోదయ్యాయి. పదుల సంఖ్యలో ఉగ్రవాదులు అరెస్టయ్యారు. 2007 నాటి హైదరాబాద్ జంట పేలుళ్లతో పాటు అన్ని కేసులూ పలు కోర్టుల్లో విచారణ దశల్లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో ఐఎం ఘాతుకాలకు సంబంధించి విచారణ పూర్తై, నిందితులను దోషులుగా తేల్చిన తొలి కేసుగా దిల్సుఖ్నగర్ పేలుళ్లు రికార్డుకెక్కాయి. వచ్చే సోమవారం శిక్షలు ఖరారు చేస్తే, శిక్షలు పడిన తొలి కేసుగానూ ఇదే నిలుస్తుంది. -
జంట పేలుళ్ల కేసులో తీర్పు వెల్లడి
-
జంట పేలుళ్ల కేసులో తీర్పు వెల్లడి
దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసులో ఆరుగురు నిందితులను దోషులుగా ఖరారు చేశారు. వారికి ఏ శిక్ష విధించేదీ సోమవారం (ఈనెల 19వ తేదీన) వెల్లడిస్తారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా ప్రత్యేక సెషన్స్ కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. 2013 ఫిబ్రవరి 21న దిల్సుఖ్నగర్ వద్ద జరిగిన జంట బాంబు పేలుళ్లలో 22 మంది మృతి చెందగా.. 140 మంది గాయపడ్డారు. దోషులలో ఇండియన్ ముజాహిదీన్ సహ వ్యవస్థాపకుడు యాసీన్ భత్కల్ తో పాటు అసదుల్లా అక్తర్, తహసీన్ అక్తర్, జియ ఉర్ రహమాన్, ఎజాజ్ షేక్‌లను ఎన్ఐఏ ఇంతకుముందు అరెస్ట్ చేసింది. వీరంతా చర్లపల్లి జైలులో విచారణ ఖైదీలుగా ఉన్నారు. కాగా పేలుళ్ల సూత్రధారి రియాజ్ భత్కల్ పరారీలో ఉన్నాడు. అరెస్టయిన ఐదుగురినీ ఎన్ఐఏ వర్గాలు మంగళవారం నాడు కోర్టులో హాజరుపరిచాయి. నిందితులపై దేశద్రోహం, హత్యానేరంతో పాటు పేలుడు పదార్థాల యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అభియోగపత్రంలో 524 మందిని సాక్షులుగా చూపింది. ప్రాసిక్యూషన్ హాజరుపర్చిన 157 మంది సాక్షుల వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసింది. -
దిల్‌సుఖ్‌నగర్‌లో పోలీసుల తనిఖీలు
హైదరాబాద్: దిల్‌సుఖ్‌నగర్‌లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. స్థానిక సాయిబాబా ఆలయంలో సోమవారం ఉదయం సోదాలు నిర్వహించారు. సరూర్‌నగర్ పోలీసులు, బాంబుస్క్వాడ్ సిబ్బందితో పాటు ఆలయ పరిసరాల్లో సోదాలు చేస్తున్నారు. దీంతో పాటు వాహనాలను కూడా విస్త్రతంగా తనిఖీలు చేశారు. బ్లాక్‌డే నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా సోదాలు చేపట్టినట్లు పోలీసులు చెప్పారు. -
దిల్సుఖ్నగర్ పేలుళ్లపై తీర్పు వాయిదా
-
దిల్సుఖ్నగర్ పేలుళ్లపై తీర్పు వాయిదా
హైదరాబాద్: 2013 దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసుపై తుది తీర్పును డిసెంబర్13కు వాయిదా వేస్తున్నట్లు ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు సోమవారం పేర్కొంది. పేలుళ్ల ఘటనలో 18మంది మరణించగా, 138మంది గాయాలపాలయ్యారు. రియాజ్ భత్కల్, అసదుల్లా అక్తర్, తహసీన్ అక్తర్, యాసిన్ భత్కల్, జియ ఉర్ రహమాన్, ఎజాజ్ షేక్ లు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. వీరిలో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, రియాజ్ భత్కల్ పరారీలో ఉన్నాడు. నిందితులపై దేశద్రోహం, హత్యానేరం, పేలుడు పదార్ధాల యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఈ కేసులో 157మంది సాక్షులను విచారించిన కోర్టు.. ఇందుకు సంబంధించిన 502 డాక్యుమెంట్లను పరిశీలించింది. -
దిల్ సుఖ్ నగర్ పేలుళ్లపై తుది తీర్పు
-
దిల్సుఖ్నగర్ పేలుళ్లు..వాదనలు పూర్తి
హైదరాబాద్ : దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో వాదనలు ముగిశాయి. ఈనెల 21న నిందితులకు శిక్షలను ఖరారు చేస్తూ చర్లపల్లిలోని ఎన్ఐఏ కోర్టు తీర్పు ఇవ్వనున్నది. 2013 సంవత్సరం ఫిబ్రవరి 21న జరిపిన పేలుళ్లలో 22మంది మృతి చెందగా 138మంది గాయపడిన విషయం విదితమే. ఈ కేసులో అసదుల్లా అక్తర్, యాసిన్ భత్కల్, తహ సిన్ అక్తర్, జియావుర్ రెహ్మాన్ (పాక్), ఎజాజ్ షేక్‌లను ఎన్ఐఏ అరెస్టు చేసింది. వీరిపై చర్లపల్లిలోని ఎన్ఐఏ కోర్టులో విచారణ జరిగింది. 157మంది సాక్షులను కోర్టు విచారించగా 502 డాక్యుమెంట్లను ఎన్ఐఏ సేకరించింది. కాగా పాకిస్థాన్‌లో తలదాచుకున్న నిషిద్ధ ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) మాస్టర్‌మైండ్ రియాజ్ భత్కల్ సూత్రధారిగా, బంగ్లాదేశ్ కేంద్రంగా పని చేసిన ఐఎం ఆపరేషనల్ చీఫ్ యాసిన్ భత్కల్ పేలుళ్లకు పాల్పడిన విషయం తెలిసిందే. Dilsukh nagar Blasts, NIA court, hearing, verdict, Yasin Bhatkal, దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్లు, వాదనలుపూర్తి, ఎన్ఐఏ, యాసిన్ భత్కల్ -
ముక్కలైన భవిష్యత్తు
జీవనోపాధి లేక రోడ్డున పడిన యువకుడి విషాదగాధ దిల్సుఖ్నగర్ బాంబుపేలుళ్ల బాధితుడి దుస్థితి ఉద్యోగం ఇప్పిస్తామని మొండిచేయి చూపిన ప్రజాప్రతినిధులు అంగవైకల్యంతో మూడేళ్లుగా ఎదురుచూస్తున్న వైనం పాపం ఒకరిదైతే.. శిక్ష అనుభవిస్తోంది మరొకరు. ఉన్నత చదువు చదివి.. తల్లిదండ్రులను ఏలోటూ లేకుండా చూసుకోవాలని తాపత్రయపడిన ఆ యువకుడి భవిష్యత్తుపై ఉగ్రపంజా కోలుకోలేని దెబ్బతీసింది. మృత్యుముఖం వరకు వెళ్లొచ్చిన అతడిని అంగవైకల్యం వెక్కిరించగా, ప్రభుత్వ కొలువుతో జీవితానికి భరోసా కల్పిస్తామన్న ప్రజాప్రతినిధుల హామీ నీటిరాతగానే మిగిలింది. చిన్న ఉద్యోగం ఇవ్వండంటూ అతడు మూడేళ్లుగా ప్రాధేయపడుతున్నా.. పాలకుల మనస్సు కరగడం లేదు. చింతూరుకు చెందిన పురాలశెట్టి దుర్గాప్రసాద్ హైదరాబాద్‌లో ఎంబీఏ చదువుతుండగా, 2013 ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన బాంబుపేలుళ్లలో తీవ్రంగా గాయపడ్డాడు. కాలికి, చేతులకు తీవ్ర గాయాలయ్యా యి. ప్రాణాపాయం నుంచి బయటపడిన అతడు మధ్యలోనే చదువు నిలిపేశాడు. ఆరు నెలల పాటు వైద్యసేవలు పొందిన అనంతరం పట్టుదలతో ఎంబీఏ పూర్తిచేశాడు. అతడిని పరామర్శించేందుకు వచ్చిన నేతలు ప్రభుత్వం తరపున ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. వారి హామీ నేటికీ నెరవేరకపోవడంతో దుర్గాప్రసాద్ తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఎంబీఏ పూర్తిచేసిన అతను ఉద్యోగ వేటలో అలసిపోయి, ప్రస్తుతం ఖాళీగా ఉన్నాడు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పోషించాల్సిన బాధ్యత అతడిపైనే ఉండడంతో కంటబడిన నేతలందరినీ ఉద్యోగం కోసం ప్రాధేయపడుతున్నాడు. అప్పట్లో ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రితో పాటు భద్రాచలం ఎమ్మెల్యేను కలిశాడు. హైదరాబాద్‌లో ఘటన జరగడంతో తెలంగాణ ప్రభుత్వం ఏమైనా ఉద్యోగం ఇస్తుందేమోనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు డిప్యూటీ సీఎం, హోంమంత్రి, అసెంబ్లీ స్పీకర్‌ను కలసి తన గోడును వెళ్లబోసుకున్నాడు. పోనీ ఆంధ్రాలో ఉంటున్నందున ఇక్కడి ప్రభుత్వం ఏమైనా ఆదుకుంటుందన్న ఆశతో విలీన మండలాల పర్యటనకు వచ్చిన ఉప ముఖ్యమంత్రి చినరాజప్పను కలసి ప్రాధేయపడ్డాడు. అయినా ప్రయోజనం లేకపోయింది. అంగవైకల్యంతో ఉన్న తనకు ఇప్పటికైనా ప్రభుత్వం దయతలచి ఉద్యోగం ఇవ్వాలని దుర్గాప్రసాద్ కోరుతున్నాడు. -
సౌదీ అరేబియాలో చిక్కిన అబిదీన్
దిల్సుఖ్నగర్ పేలుళ్ల కేసులో నిందితుడు ♦ ఎక్స్‌ప్లోజివ్ మాడ్యూల్లో కీలక పాత్రధారి ♦ మరో నిందితుడు అబు సూఫియాన్ సైతం అదుపులోకి.. ♦ ఇరువురినీ భారత్‌కు రప్పించేందుకు ఎమ్హెచ్ఏ యత్నం సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో 2013 ఫిబ్రవరి 21న జరిగిన జంట పేలుళ్ల కేసులో మరో కీలక నిందితుడు జైనుల్ అబిదీన్ సౌదీ అరేబియాలో చిక్కాడు. నిషిద్ధ ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్(ఐఎం) ఎక్స్‌ప్లోజివ్స్ మాడ్యుల్ చీఫ్ ఇస్మాయిల్ అఫాఖీకి అబిదీన్ ప్రధాన అనుచరుడు. అఫాఖీ ద్వారా రియాజ్‌తో సంబంధాలు... హైదరాబాద్‌ను 2007 తరవాత మరోసారి టార్గెట్ చేయాలని ఐఎం మాస్టర్ మైండ్ రియాజ్ భత్కల్ 2012లోనే పథకం వేశాడు. ఆ మేరకు సెప్టెంబర్‌లో అసదుల్లా అక్తర్ అలి యాస్ హడ్డీ, జియా ఉర్ రెహ్మాన్ అలియాస్ వఖాస్‌లను కర్ణాటకలోని మంగుళూరుకు పంపి చాటింగ్ ద్వారా సంప్రదింపులు జరిపా డు. అబిదీన్ సైతం కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఉన్న భత్కల్ ప్రాంతానికి చెందినవాడే. అదే ప్రాంతానికి చెందిన, బెంగళూరులో హోమియోపతి డాక్టర్‌గా చెలామణి అయిన సయ్యద్ ఇస్మాయిల్ అఫాఖీ అలియాస్ డాక్టర్ సాబ్ ద్వారా పాకిస్తాన్లో తలదాచుకున్న ఐఎం మాస్టర్‌మైండ్ రియాజ్ భత్కల్‌తో సంబంధాలు ఏర్పడ్డాయి. 2013 ఫిబ్రవరి మొదటి వారంలో చాటింగ్ ద్వారా హడ్డీని సంప్రదించిన రియాజ్ ‘టార్గెట్ హైదరాబాద్’ విషయం చెప్పాడు. దీనికి అవసరమైన పేలుడు పదార్థాలు అందించే బాధ్యతల్ని బెంగళూరులో ఉంటున్న సయ్యద్ ఇస్మాయిల్ అఫాఖీకి అప్పగించాడు. ఎక్స్‌ప్లోజివ్స్ బాధ్యతలు అఫాఖీకి... రియాజ్ భత్కల్ 2009 నుంచి పాకిస్తాన్లో తలదాచుకున్నాడు. అప్పటి నుంచి పేలుళ్లకు అవసరమైన ఎక్స్‌ప్లోజివ్ (అమ్మోనియం నైట్రేట్ స్లర్రీ) సమీకరించే బాధ్యతల్ని అఫాఖీకి అప్పగించాడు. ఇతడినే ఐఎం ఎక్స్‌ప్లోజివ్ మాడ్యుల్ చీఫ్‌గా మార్చాడు. అఫాఖీ 2005లో పాకిస్తాన్ కరాచీకి చెందిన అర్సాలా అబీర్ అనే యువతిని వివాహం చేసుకున్నాడు. దీంతో అఫాఖీని ఎవరూ అనుమానించరనే ఉద్దేశంతో రియాజ్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. అనుమానం రాకుండా ‘మీన్ తూటా’లతో ఎక్స్‌ప్లోజివ్స్ సమీకరణకు కర్ణాటకలోని ఉడిపి, రత్నగిరి తీరప్రాంతాలకు చెందిన మత్స్యకారులు చేపల వేటకు వినియోగించే ‘మీన్ తూటా’లను అఫాఖీ ఎంచుకున్నాడు. ఎక్స్‌ప్లోజివ్‌ను జాగ్రత్తలతో సముద్రంలో పేల్చడం ద్వారా చేపలు పట్టే విధానాన్ని అక్కడి మత్స్యకారులు ‘మీన్ తూటా’ అంటారు. సద్దాం, అబిదీన్ల ద్వారా సమీకరణ... పేలుడు పదార్థం సేకరించే బాధ్యతల్ని భత్కల్కే చెందిన స్క్రాప్ వ్యాపారి సద్దాం హుస్సేన్‌తో పాటు అబిదీన్ మరికొందరికి అప్పగించాడు. ఇలా ఉడిపి, రత్నగిరిల నుంచి మీన్ తూటాలు తెప్పించేవాడు. వాటిని పేలుళ్లు జరిపే ప్రాంతాల్లో ఉన్న ఉగ్రవాదులకు పంపడం లేదా వారినే మంగుళూరు, బెంగళూరు రప్పించి అప్పగించడం చేసేవాడు. ఈ అమ్మోనియం నైట్రేట్ స్లర్రీని వినియోగించి తయారు చేసిన బాంబుల్నే ఉగ్రవాదులు దిల్సుఖ్నగర్ సహా అనేక చోట్ల పేల్చారు. 2013 హైదరాబాద్ పేలుడు తరవాత సౌదీ అరేబియా వెళ్లిపోయాడు. ఐఎం ఎక్స్‌ప్లోజివ్స్ మాడ్యుల్ చీఫ్‌గా ఉన్న అఫాఖీతో పాటు సద్దాం తదితరుల్ని బెంగళూరు పోలీసులు ఈ ఏడాది జనవరిలో అరెస్టు చేశారు. ఇతడి విచారణ నేపథ్యంలోనే అబిదీన్ పాత్ర వెలుగులోకి వచ్చింది. విచారణలో వెలుగులోకి.... అబిదీన్ సౌదీలో ఉద్యోగం చేస్తున్నాడని తెలుసుకున్న నిఘా వర్గాలు పాస్‌పోర్ట్ నంబర్ ఆధారంగా అక్కడి ఏజెన్సీలను అప్రతమత్తం చేశాయి. దీంతో ఇటీవల అబిదీన్‌ను అదుపులోకి తీసుకున్న అక్కడి ఏజెన్సీలు ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ)కు సమాచారం ఇచ్చాయి. నేరస్తుల మార్పిడి ఒప్పందం ప్రకారం అబిదీన్‌ను సౌదీ నుంచి తీసుకురావడానికి ఎంహెచ్ఏ సన్నాహాలు చేస్తోంది. నగరవాసి అసద్ ఖాన్ సైతం... సౌదీ అరేబియాకు చెందిన ఏజెన్సీలు ఐఎం ఉగ్రవాది అబిదీన్తో పాటు హైదరాబాద్‌కు చెందిన హర్కత్ ఉల్ జిహాద్ అల్ ఇస్లామీ (హుజీ) సానుభూతిపరుడు అసద్ ఖాన్ అలియాస్ అసదుల్లా ఖాన్ అలియాస్ అబు సూఫియాన్‌ను అదుపులోకి తీసుకున్నాయి. నగరంలోని మాసబ్‌ట్యాంక్ ప్రాంతానికి చెందిన సూఫియాన్ బెంగళూరుకు చెందిన హుజీ కేసులో వాంటెడ్‌గా ఉన్నాడు. రియాద్ కేంద్రంగా కుట్ర చేసిన ముష్కరులు హైదరాబాద్‌తో పాటు బెంగళూరు, హుబ్లీ, కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన ప్రముఖుల్ని ఏకకాలంలో హత్య చేయడానికి కుట్రపన్నారు. దీన్ని 2012లో ఛేదించిన బెంగళూరు పోలీసులు 16 మందిని అరెస్టు చేశారు. వీరిలో పాతబస్తీకి చెందిన ఒబేదుర్ రెహ్మాన్ కూడా ఒకడు. ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దర్యాప్తు చేస్తున్న ఈ కేసులో వాంటెడ్‌గా ఉన్న నిందితుల్లో అబు సూఫియాన్‌తో పాటు హైదరాబాద్‌కే చెందిన మరో ఐదుగురు సైతం ఉన్నారు. వీరి అరెస్టుకు సహకరించాల్సిందిగా ఎంహెచ్ఏ కోరిన నేపథ్యంలోనే సౌదీ ఏజెన్సీలు అబిదీన్తో పాటు సూఫియాన్‌ను పట్టుకున్నాయి. హత్యల కుట్ర అమలుకు అవసరమైన ఆర్థిక, నైతిక సహకారం అందించడంలో సూఫియాన్ పాత్ర ఉన్నట్లు ఎన్ఐఏ ఆరోపిస్తోంది. -
దిల్‌సుఖ్‌నగర్‌లో అర్ధరాత్రి కలకలం
-
ఉగ్రవాదిని దేశం దాటించాడు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో నిందితుడైన జియా ఉర్ రెహమన్ అలియాస్ వఖాస్‌ను దేశ సరిహద్దులు దాటించిన పాకిస్తానీ మహమ్మద్ నసీర్ నగర పోలీసులకు దొరికిపోయాడు. ముష్కరుల నుంచి ప్రమాదం పొంచి ఉందన్న ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికల నేపథ్యంలో హైదరాబాద్‌ను జల్లెడపడుతున్న సిటీ పోలీసులకు నిషేధిత ఉగ్రవాద సంస్థ హర్కత్ ఉల్ జిహాదీ అల్ ఇస్లామి(హుజి)తో సంబంధమున్న పాకిస్తానీ మహమ్మద్ నసీర్తో పాటు ఫైజల్ మహమ్మద్ (బంగ్లాదేశ్), జోయ్నల్ అబెదిన్ (బంగ్లాదేశ్), జియా ఉర్ రెహ్మాన్ (మయన్మార్)ని అరెస్టు చేశారు. అక్రమంగా వలస వచ్చి హైదరాబాద్‌లో నివాసముంటున్న వీరికి నివాస వసతి కల్పించడంతో పాటు విదేశాలకు వెళ్లేందుకు పాస్‌పోర్టులు సమకూర్చి సాయం చేస్తున్న హైదరాబాద్ వాసులు మహమ్మద్ మసూద్ అలీ ఖాన్(చంచల్‌గూడ), సోహైల్ పర్వేజ్ ఖాన్ (బాలాపూర్,సైబరాబాద్)లను కూడా నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి నాలుగు భారత పాస్‌పోర్టులు, ఒక బంగ్లాదేశ్ పాస్‌పోర్టు, సిమ్ కార్డులున్న తొమ్మిది సెల్ఫోన్లు, జిహాదీ సాహిత్యం, ఓటరు గుర్తింపు కార్డులు, ఆధార్ కార్డులు, బర్త్ సర్టిఫికెట్లు, పాస్‌పోర్టు డెలివరీ ఎన్వెలప్లు, అఫిడవిట్లు... ఇలా సుమారు వంద ఐడీ ప్రూఫ్‌లు స్వాధీనం చేసుకున్నారు. సిట్ ఏసీపీ డి.హరికుమార్ ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న మరికొందరు నిందితులను పట్టుకునేందుకు ముమ్మర గాలింపు చేపట్టారు. సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్)లో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో జాయింట్ పోలీసు కమిషనర్ టి.ప్రభాకర్‌రావు కేసు వివరాలను వెల్లడించారు. ప్రధాన నిందితుడు మహమ్మద్ నసీర్ పుట్టింది బంగ్లాదేశ్ అయినా జీవనోపాధి కోసం పాకిస్తాన్‌కు వెళ్లి స్థిరపడ్డాడు. అంతకుముందే పాకిస్తాన్ వెళ్లి స్థిరపడిన బంధువైన అబ్దుల్ జబ్బర్‌కు మరింత సన్నిహితుడయ్యాడు నసీర్. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉంటున్న జబ్బార్ హుజీకి సానుభూతిపరుడిగా వ్యవహరిస్తున్నాడు. నసీర్‌కు జిహాదీ సాహిత్యాన్ని ప్రచారం చేస్తూ చట్టవ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించేందుకు భారత్‌కు పంపించాడు. దాడుల్లో దొరికారు... రెండు నెలల క్రితం తెలంగాణకు వచ్చి మెదక్ జిల్లా జహీరాబాద్‌లో ఉంటున్న ఫైజల్ మహమ్మద్, జోయ్నల్ అబెడిన్, జియా ఉర్ రెహ్మాన్‌లను మసూద్ ఆలీ ఖాన్‌కు పరిచయం చేశాడు నసీర్. మసూద్ ఆలీఖాన్ ఇంట్లోనే షెల్టర్ కూడా ఇప్పించేలా ఏర్పాటు చేశాడు. ఓటరు గుర్తింపు కార్డులు, ఆధార్ కార్డులతో పాటు జాబ్ వీసాలపై ఇతర దేశాలకు వెళ్లి చట్టవ్యతిరేక కార్యకలపాలు నిర్వహించేందుకు భారత్ పాస్‌పోర్టులను కూడా సమకూర్చారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అనుమానం వచ్చి దాడులు చేయగా వీరంతా పట్టుబడ్డారు. వఖాస్‌కు సహకరించిన నసీర్.. హుజి నేత అబ్దుల్ జబ్బర్ ఆదేశాల మేరకు దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్లలో నిందితుడైన జియా ఉర్ రెహ్మాన్ అలియాస్ వఖాస్‌ను పశ్చిమ బెంగాల్లో కలుసుకుని.. భారత సరిహద్దును దాటించి బంగ్లాదేశ్‌కు పంపించానని నసీర్ కేసు విచారణలో అంగీకరించినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే మళ్లీ భారత్‌కు వచ్చిన వఖాస్... బిహార్ నుంచి రాజస్థాన్‌కు వచ్చాడు. ఈ సమాచారం అందుకున్న ఎన్ఐఏ అధికారులు గతేడాది జనవరిలో అతన్ని రాజస్థాన్‌లో అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో విచారణ కోసం చర్లపల్లి జైలులోనే ఉన్నాడు. హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ అడిషనల్ డిప్యూటీ పోలీసు కమిషనర్ ఎన్.కోఠి రెడ్డి పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ మల్లేశ్, ఎస్ఐలు కె.వెంకటేశ్వర్లు, జాకీర్ హుస్సేన్, డి.వెంకటేశ్వర్లు తదితర సిబ్బంది దాడుల్లో పాల్గొన్నారు. కాగా, ఈ కేసును విచారించేందుకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) రంగంలోకి దిగే అవకాశముందని తెలుస్తోంది. ఐదేళ్ల క్రితమే భారత్‌కు... నసీర్ 2010లో భారత్‌లో అడుగుపెట్టాడు. అప్పటి నుంచి వివిధ ప్రాంతాల్లో మకాం మారుస్తూ వచ్చిన నసీర్... ఇప్పుడు హైదరాబాద్ బాలాపూర్‌లోని జల్పల్లిలో ఉంటున్నాడు. ఈ క్రమంలోనే అక్కడే ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సొహైల్ పర్వేజ్ ఖాన్‌తో నసీర్‌కు స్నేహం ఏర్పడింది. చెంచల్‌గూడలో ఎంఎం జిరాక్స్ సెంటర్ నిర్వహిస్తున్న తన బావ మసూద్ ఆలీ ఖాన్‌ను నసీర్‌కు పరిచయం చేశాడు. తన పరిచయస్తులను విదేశాలకు పంపించేందుకు పాస్‌పోర్టులను రూపొందించి ఇవ్వాలని మసూద్‌ను కోరాడు.అంగీకరించిన మసూద్... ఇప్పటివరకు దాదాపు 15 మందికి పాస్‌పోర్టులు ఇప్పించి విదేశాలకు వెళ్లేందుకు సహకరించాడు. -
యాసిన్ భత్కల్ విచారణ ఇక చర్లపల్లి జైలులోనే..
కుషాయిగూడ: దిల్సుఖ్నగర్ బాంబు కేసును విచారిస్తున్న ఎల్బీనగర్ ఐదో మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి శ్రీనివాసరావు గురువారం చర్లపల్లి కారాగారాన్ని సందర్శించారు. బాంబు కేసు నిందితుడు భత్కల్ను కోర్టు తరలిస్తున్న క్రమంలో చోటు చేసుకుంటున్న భద్రతా పరమైన అంశాలను దృష్టిలో ఉంచుకొని ఆయన జైలును సందర్శించారు. ప్రతిసారీ కోర్టుకు తరలించే క్రమంలో భత్కల్ బృందం పాల్పడుతున్న చర్యలకు చెక్ పెట్టాలని భావించిన అధికారులు చర్లపల్లి జైలులోనే విచారణ జరిపేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా జైలు కోర్టు హాలును ఆయన పరిశీలించి వెళ్లినట్లు జైలు పర్యవేక్షణాధికారి కొలను వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. అయితే గతంలో 2006-07 సంవత్సరంలో దీన్దార్ బాంబు కేసు నిందితులను కూడ ఇదే తరహాలో విచారించినట్లు ఆయన పేర్కొన్నారు. కరడుగట్టిన నేరస్థుల విషయంలో భద్రతా పరమైన చర్యలను దృష్టిలో ఉంచుకొని ఇలాంటి విచారణ చేయడం సర్వసాధారణమేనన్నారు. -
కలకలం రేపుతున్న యాసిన్ భత్కల్
తాజాగా మరోసారి లేఖ విసిరిన యాసిన్ హైదరాబాద్: దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఇండియన్ ముజాహిద్దీన్(ఐఎం) ఉగ్రవాద సంస్థ సహ వ్యవస్థాపకుడు యాసిన్భత్కల్ కలకలం రేపుతున్నాడు. బాంబు పేలుళ్ల కేసులో ట్రయల్స్ నిమిత్తం జాతీయ దర్యాప్తు సంస్థ న్యాయస్థానానికి హాజరైనప్పుడల్లా ఏదో ఒకరకమైన చర్యలతో పోలీసులను పరుగులు పెట్టిస్తున్నాడు. తాజాగా మంగళవారం కోర్టు విచారణకు హాజరైన భత్కల్ ఒక లేఖను విసిరేశాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈసారి విసిరిన లేఖలో తనకు జైల్లో తగిన సదుపాయాలు కల్పించాలని న్యాయమూర్తిని కోరిన ట్లు సమాచారం. ఇప్పటికే భత్కల్ పరారీకి పలు ఉగ్రవాద సంస్థలు కుట్ర చేస్తున్నాయనే ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకున్నారు. ఈ నెల 6న కోర్టుకు వచ్చినప్పుడు కూడా ఒక లేఖ విసిరేశాడు. తనకు తగిన భద్రత కల్పించాలని అందులో విన్నవించాడు. రెండోసారి పువ్వును ప్రదర్శించిన అతడు తాజాగా మరోసారి లేఖ విసిరేశాడు. అయితే భత్కల్ ఇలాంటి చర్యలు ఎందుకు చేస్తున్నాడనే దానిపై పోలీసులు, నిఘా వర్గాలు లోతుగా ఆరా తీస్తున్నాయి. -
భత్కల్ పరారీకి ఐఎస్ఐఎస్ ప్లాన్!
మరోసారి హెచ్చరికలు జారీ చేసిన ఇంటెలిజెన్స్ భత్కల్ కదలికలపై డేగకన్ను చర్లపల్లి జైలు వద్ద ఆక్టోపస్ బలగాలు హైదరాబాద్: దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు, ఇండియన్ ముజాయిద్దీన్ (ఐఎం) వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ను జైలు నుంచి తప్పించేందుకు ఐఎస్ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా) పెద్ద కుట్ర చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) గుర్తించింది. చర్లపల్లి జైలు నుంచి భత్కల్‌తో పాటు మిగతా ఉగ్రవాదులను తప్పించేందుకు స్లీపర్ సెల్స్ ప్రణాళికలు రచిస్తున్నట్లు కేంద్ర నిఘా వర్గాల ద్వారా జైలు అధికారులకు సమాచారం చేరింది. నెల రోజుల వ్యవధిలో రెండవసారి కేంద్రం నుంచి హెచ్చరికలు జారీ కావడంతో జైలు అధికారులు అప్రమత్తమయ్యారు. భత్కల్ కదలికలను గమనించేందుకు ఆయన ఉంటున్న బ్యారక్ వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సమాచారం. జైలు గోడలను బద్దలు కొట్టైనా బయటకొస్తానంటూ భత్కల్ తన భార్యకు ఫోన్లో చెప్పినట్లు నిఘా వర్గాలు భావిస్తుండటంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఉగ్రమూకలను సమర్థంగా తిప్పికొట్టగలిగే ఆక్టోపస్ బలగాలను రంగంలోకి దించారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి 30 మంది బలగాలు జైలు పరిసరాలలో గస్తీ నిర్వహిస్తున్నాయి. నిఘా వర్గాల సీరియస్.. ఇటీవలి కాలంలో భత్కల్ వ్యవహరిస్తున్న తీరును నిఘా వర్గాలు సీరియస్‌గా తీసుకున్నాయి. దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసుకు సంబంధించి ట్రయల్స్ నిమిత్తం కోర్టుకు తీసుకెళ్లిన ప్రతీసారి భత్కల్ చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ఈ మధ్య కాలంలో రంగారెడ్డి కోర్టుకొచ్చిన మూడుసార్లు భత్కల్ వ్యవహరించిన శైలిపై పోలీసులు అనుమానిస్తున్నారు. ఈనెల 6వ తేదీన కోర్టుకు వచ్చిన భత్కల్.. భద్రత పేరుతో లేఖ రాసి కోర్టు ఆవరణలో విసిరాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఒక గులాబీ పువ్వును ప్రదర్శించాడు. మూడవసారి ఒక నోట్‌బుక్‌ను చూపిస్తూ హల్చల్ చేశాడు. అయితే వీటిని నిఘా వర్గాలు సీరియస్‌గా తీసుకున్నాయి. మూడుసార్లు భిన్నంగా వ్యవహరించడానికి కారణాలేంటి అనేదానిపై విశ్లేషిస్తున్నట్లు సమాచారం. భత్కల్ ఎవరికైనా ఇండికేషన్స్ ఇస్తున్నాడా? స్లీపర్ సెల్స్ ఏమైనా ఫాలో అవుతున్నాయా అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా భత్కల్ నోటి నుంచి ఐఎస్ఐఎస్ విషయాలు వెలుగులోకి రావడంతో పోలీసులు మరింత సీరియస్‌గా తీసుకున్నారు. ఐఎస్ఐఎస్తో భత్కల్‌కు గల సంబంధంపై నిఘా వర్గాలు లోతుగా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. రెండు, మూడు రోజులుగా కశ్మీర్లో ఐఎస్ జెండాలు ప్రదర్శించడంతో మరింత అప్రమత్తమయ్యారు. ఇలాంటి చర్యల నేపథ్యంలో ఓ వైపు భత్కల్ కదలికలపై నిఘా వేస్తూనే, మరో వైపు జైలు భద్రతపై అధికారులు దృష్టి సారించారు. -
ఉగ్రవాది భత్కల్ను కోర్టులో హాజరుపర్చిన పోలీసులు
కోర్టు హాల్ నుంచి పేపర్ విసరడంతో కలకలం.. నాగోలు: దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల ప్రధాన నిందితుడు, ఐఎస్ఐ ఉగ్రవాది యాసిన్ భత్కల్‌తో పాటు మరికొంత మంది నిందితులను కేసు విచారణ నిమిత్తం సోమవారం రంగారెడ్డి జిల్లా కోర్టుకు తీసుకొచ్చారు. చర్లపల్లి జైలు అధికారులు భారీ బందోబస్తు మధ్య వీరిని కోర్టుకు తీసుకొచ్చి జడ్జి ఎదుట హాజరుపరిచారు. విచారణ సమయంలో భత్కల్ కోర్టు హాల్ కిటికీలోంచి బయటికి తాను రాసిన పేపర్‌ను విసిరాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. అక్కడే ఉన్న పోలీసు అధికారులు వెంటనే అప్రమత్తమై ఆ కాగితాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. విచారణ అనంతరం భత్కల్‌తో పాటు మిగతా నిందితులను పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. కాగా, ఎన్ఐఏ అధికారులు కావాలనే తనను వేధిస్తున్నారని, తనను చంపడానికి ప్రయత్నిస్తున్నారని కోర్టులో భత్కల్ పిటిషన్ వేసినట్లు తెలిసింది. కాగా, పేపర్ విషయంపై ఎల్బీనగర్ సీఐ శ్రీనివాస్‌రెడ్డిని వివరణ కోరగా తాము ఎలాంటి పేపర్‌ను స్వాధీనం చేసుకోలేదన్నారు. -
జైల్లో నుంచి తప్పించుకుంటా!
ఢిల్లీలోని భార్యతో ఫోన్లో ఐఎం ఉగ్రవాది యాసిన్ భత్కల్ బయటపడ్డాక సిరియా రాజధాని డమాస్కస్ పారిపోదాం ఫోన్ సంభాషణల ఆధారంగా గుర్తించిన కేంద్ర నిఘా వర్గాలు భద్రత రెట్టింపునకు ప్రభుత్వం ఆదేశాలు హైదరాబాద్: ప్రపంచ దేశాలకు సవాల్ విసురుతున్న ఐఎస్ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా) ఉగ్రవాద సంస్థ దేశంలో మారణహోమం సృష్టించడంతోపాటు జైళ్లలోని ఉగ్రవాదులను ఎలాగైనా తప్పించేందుకు కుట్రపన్నుతున్నట్లు కేంద్ర నిఘా వర్గాలు పసిగట్టాయి. దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు, ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ను హైదరాబాద్‌లోని చర్లపల్లి జైలు నుంచి తప్పించేందుకు వ్యూహరచన చేస్తున్నట్లు యాసిన్ ఇటీవల తన భార్య జెహిదాతో మాట్లాడిన ఫోన్ సంభాషణల ఆధారంగా గుర్తించాయి. సిరియా రాజధాని డమాస్కస్‌లోని స్నేహితులు త్వరలో తనను జైలు నుంచి తప్పిస్తారని...అవసరమైతే జైలు గోడలు బద్దలు కొట్టైనా బయటకు తెస్తారని అతను చెప్పినట్లు తెలుస్తోంది. అనంతరం డమాస్కస్ పారిపోదామని భార్యతో పేర్కొన్నట్లు తెలియవచ్చింది. అప్రమత్తమైన నిఘా వర్గాలు... దేశంలో దాదాపు 40 బాంబు పేలుళ్ల కేసుల్లో నిందితుడైన యాసిన్ భత్కల్ తన భార్యతో జరిపిన ఫోన్ సంభాషణల నేపథ్యంలో కేంద్ర నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. జైళ్లలోని ఉగ్రవాదులపై నిఘా పెంచాలని, భద్రతను రెట్టింపు చేయాలని, ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా పరిశీలించాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించాయి. మరోవైపు యాసిన్ భత్కల్‌కు న్యాయస్థానం ఆదేశాల మేరకు ఫిబ్రవరి 18 నుంచి కుటుంబ సభ్యులతో ల్యాండ్‌లైన్ ఫోన్లో మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు జైళ్లశాఖ డీఐజీ నర్సింహ తెలిపారు. భత్కల్ ఇప్పటివరకు 27 సార్లు ఫోన్లో మాట్లాడాడని, అరబిక్, ఉర్దూలలో సాగిన అతని సంభాషణలను ప్రత్యేక నిపుణుల కమిటీ విశ్లేషిస్తున్నట్లు శనివారం విలేకరుల సమావేశంలో ఆయన చెప్పారు. భత్కల్‌కు అందరి ఖైదీల మాదిరిగానే వారానికి రెండుసార్లు ఫోన్ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. భత్కల్ తన భార్య జెహిదా, తల్లి రెహానాలతో మాట్లాడేందుకు అనుమతి కోరగా తాము ఆయా ఫోన్ నంబర్లను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలతో సంప్రదించి వారి ఆదేశాల మేరకే అనుమతించామన్నారు. జైల్లో కేవలం ఎస్టీడీ ఫోన్ సౌకర్యమే ఉంటుందని, ఐఎస్డీకి అవకాశం లేదని డీఐజీ స్పష్టం చేశారు. చర్లపల్లి కేంద్రకారాగారంలో మొత్తం 13 మంది ఉగ్రవాదులున్నారన్నారు. 2013 సెప్టెంబర్ 24 నుంచి భత్కల్ చర్లపల్లి జైల్లో ఉంటున్నాడని, మధ్యలో ఒకట్రెండుసార్లు అతన్ని వివిధ కేసులరీత్యా ఢిల్లీలోని తీహార్ జైలుకు తరలించామన్నారు. గతేడాది నవంబర్ 16 నుంచి అతన్ని పూర్తి స్థాయిలో చర్లపల్లి జైల్లోనే ఉంచామన్నారు. -
భత్కల్ను తప్పించేందుకు ఐఎస్ఐఎస్ కుట్ర
హైదరాబాద్ :రాష్ట్ర రాజధాని హైదరాబాద్ దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్లతో పాటు దేశవ్యాప్తంగా సుమారు 40 బాంబు పేలుళ్ల కేసులో నిందితుడైన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది యాసిన్ భత్కల్ను జైలు నుంచి తప్పించేందుకు ఐఎస్ఐఎస్ పథకం వేసింది. అయితే ఈ విషయాన్ని కేంద్ర నిఘా వర్గాలు పసిగట్టాయి. ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్న భత్కల్ తన భార్య జహిదాతో ఫోన్లో మాట్లాడినట్లు నిఘావర్గాలు గుర్తించాయి. తనను త్వరలో ఐఎస్ఐఎస్ జైలు నుంచి తప్పిస్తుందని అతడు..ఢిల్లీలో ఉంటున్న భార్యకు ఫోన్లో చెప్పినట్లు సమాచారం. డమాస్కస్‌లోని స్నేహితులు.. తనను త్వరలో జైలు నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారని, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత డమాస్కస్ వెళ్లిపోదామని భత్కల్ తన భార్యతో చెప్పినట్లు తెలుస్తోంది. భత్కల్ చెప్తున్న డమాస్కస్‌లోని స్నేహితులు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులుగా కేంద్ర నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. అంతేకాక చర్లపల్లి జైలు నుంచి భత్కల్ తన భార్యకు 10 ఫోన్‌కాల్స్ చేశాడని... భార్యతోపాటు ఇంకొంతమందితోనూ అతడు ఫోన్లో మాట్లాడాడని ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. యాసిన్ భత్కల్ ఫోన్‌కాల్స్‌ను రికార్డ్ చేసిన కేంద్ర నిఘా వర్గాలు... అతని వెనకున్న ఉగ్రవాదులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో చర్లపల్లి జైలు వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు భత్కల్‌కు సెల్ ఫోన్ ఎలా అందుబాటులోకి వచ్చిందనే దానిపై కూడా ఆరా తీస్తున్నారు. -
సాయిబాబా గుడికి బాంబు బెదిరింపు
-
దిల్సుఖ్నగర్ సాయిబాబా గుడికి బాంబు బెదిరింపు
దిల్సుఖ్ నగర్ సాయిబాబా ఆలయానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఆలయంలో బాంబు పెట్టామని, అది పేలుతుందని గుర్తు తెలియని వ్యక్తులు కాల్ చేశారు. దాంతో భక్తులను అక్కడినుంచి ఖాళీ చేయించి బాంబు స్క్వాడ్‌ను పిలిపించి తనిఖీలు చేశారు. ఆకతాయి వ్యక్తి 7863656157 నెంబర్ నుంచి 100కు ఫోన్ చేసి బాంబు పెట్టినట్లు తెలిపాడు. తనిఖీలు నిర్వహించిన పోలీసులు ఎటువంటి బాంబు దొరకపోవడంతో ఊపరి పీల్చుకున్నారు. తరచూ ఆకతాయిలు, పోలీసుల్ని ఆటపట్టించడానికి ఇటువంటి కాల్స్ చేస్తూ వారి సహనాన్ని పరీక్షిస్తున్నారు. అయితే ఇంతకుముందు పలుమార్లు ఈ ప్రాంతంలో బాంబు పేలుళ్లు జరగడం లేదా ఇక్కడ బాంబులను గుర్తించడం లాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. 2002 సంవత్సరంలో తొలిసారిగా ఆలయం సమీపంలో బాంబు పేలుడు జరిగింది. 2007 సంవత్సరంలో బాంబు అమర్చారు గానీ, అది పేలకముందే ఓ పోలీసు కానిస్టేబుల్ దాన్ని గుర్తించడంతో ప్రమాదం తప్పింది. తాజాగా 2013 సంవత్సరంలో దిల్సుఖ్ నగర్ ప్రాంతంలోనే ఆలయానికి కొద్ది దూరంలో ఉన్న ఎ-1 మిర్చి సెంటర్, వెంకటాద్రి థియేటర్ ఎదురుగా గల బస్ స్టాపు వద్ద కొద్దిపాటి తీవ్రతతో బాంబులు పేలాయి. మరోసారి ఇప్పుడు ఆలయానికి బాంబు బెదిరింపు రావడం గమనార్హం. -
దిల్సుఖ్నగర్ పేలుళ్ల వెనక ‘డాక్టర్ సాబ్’
* పేలుడు పదార్థం సరఫరాదారు అతనే.. * మంగుళూరులో అందుకున్న ఉగ్రవాది అసదుల్లా * రెండు కేసుల్లోనూ నిందితులుగా అఫాఖీ, సద్దాం * రియాజ్ అహ్మద్ సయీదీ పాత్రపై సాగుతున్న దర్యాప్తు బెంగళూరు నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి శ్రీరంగం కామేష్: హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో 2013 ఫిబ్రవరి 21న జరిగిన జంట పేలుళ్లకు వాడిన పేలుడు పదార్థాన్ని ఉగ్రవాది హడ్డీకి మంగుళూరులో అందించింది ఎవరో నిగ్గుతేలింది. బెంగళూరు పోలీసులు అరెస్టు చేసిన ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఎక్స్‌ప్లోజివ్స్ మా డ్యుల్ చీఫ్, హోమియోపతి డాక్టర్ సయ్యద్ ఇస్మాయిల్ అఫాఖీనే దీన్ని సరఫరా చేసినట్లు బయటపడింది. కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఉన్న భత్కల్ ప్రాంతానికి చెందిన అఫాఖీ ఆ ప్రాంతంతోపాటు బెంగళూరులో నూ హోమియోపతి డాక్టర్‌గా చెలామణి అవుతున్నాడు. స్థానికులకు డాక్టర్ సాబ్‌గా సుపరిచితుడైన అఫాఖీ పాకిస్తాన్లో తలదాచుకున్న ఐఎం మాస్టర్‌మైండ్ రియాజ్ భత్కల్ ఆదేశాల మేరకు పని చేస్తున్నాడు. గత నెల 8న బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) అధికారులు ఇతడితోపాటు భత్కల్ ప్రాంతానికే చెం దిన సద్దాం హుస్సేన్, అబ్దుల్ సుబూర్లను, 10న రియాజ్ అహ్మద్ సయీదీలను అరెస్టు చేశారు. వీరి విచారణలోనే దిల్సుఖ్నగర్ పేలుళ్లకు సంబంధించిన కీలకాంశాలు వెలుగులోకి వచ్చాయి. పాక్‌లో తలదాచుకుంటున్న ఐఎం వ్యవస్థాపకుడు రియాజ్ భత్కల్ హైదరాబాద్‌ను టార్గెట్ చేయాలని 2012లో నిర్ణయించుకున్నాడు. ఆ ఏడాది సెప్టెంబర్‌లోనే ఉత్తరప్రదేశ్‌లోని ఆజంగఢ్‌కు చెందిన అసదుల్లా అక్తర్ అలియాస్ హడ్డీ, పాక్ జాతీయుడైన జియా ఉర్ రెహ్మాన్ అలియాస్ వఖాస్‌లను మంగుళూరుకు పంపి అక్కడ షెల్టర్ ఏర్పాటు చేసుకోవాల్సిందిగా ఆదేశించాడు. దీంతో అక్కడకు వెళ్లిన ఇద్దరూ హంపన్‌కట్ట ప్రాంతంలోని జఫైర్ హైట్స్ అపార్ట్మెంట్ మూడో అంతస్థులోని 301 ఫ్లాట్ అద్దెకు తీసుకున్నారు. అక్కడ ఉంటూనే హడ్డీ ఫల్మిన్ సైబర్ పాయింట్, ఏంజిల్ సైబర్ గ్యాలరీ, సైబర్ ఫాస్ట్ పేర్లతో ఉన్న సైబర్ కేఫ్‌ల నుంచి రియాజ్ భత్కల్‌తో అతడి ఈ-మెయిల్ ఐడీ (patarasingh@yahoo.com)కి చాటింగ్ ద్వారా సంప్రదింపులు జరిపేవాడు. ఎజాజ్‌తో నగదు.. అఫాఖీతో ఎక్స్‌ప్లోజివ్ రియాజ్ భత్కల్ 2013 ఫిబ్రవరి మొదటి వారంలో చాటింగ్ ద్వారా హడ్డీకి కీలక ఆదేశాలు జారీ చేశాడు. ఈసారి హైదరాబాద్‌ను టార్గెట్ చేశామని చెప్పి వఖాస్, బిహార్‌లోని దర్భంగావాసి తెహసీన్ అక్తర్ అలియాస్ మోనుతో కలసి ఈ ఆపరేషన్ పూర్తి చేయాలని నిర్దేశించాడు. ఇందుకోసం రూ.6.8 లక్షలు హడ్డీకి అందించే బాధ్యతల్ని మహారాష్ట్రలోని పుణేలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న ఎజాజ్ షేక్‌కు, పేలుడు పదార్థాలను ఇచ్చే బాధ్యతల్ని బెంగళూరులో ఉంటున్న సయ్యద్ ఇస్మాయిల్ అఫాఖీకి అప్పగించాడు. ఎజాజ్ మంగుళూరులోని హంపన్‌కట్టలో ఉన్న వెస్ట్రన్ యూనియన్ మనీ ట్రాన్స్ఫర్ సంస్థ ఔట్లెట్ సుపమ ఫోరెన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తోపాటు మార్కెట్ రోడ్డులో హవాలా వ్యాపారం నిర్వహించే డింగ్‌డాంగ్ దుకాణం యజమాని ద్వారా హడ్డీకి నగదు పంపాడు. మిగిలిన ఉగ్రవాదులు మోను, వఖాస్ హైదరాబాద్ చేరుకుని, అబ్దుల్లాపూర్‌మెట్‌లో గదిని అద్దెకు తీసుకున్నారు. పేలుడు పదార్థాల కోసం మంగుళూరులోనే వేచి ఉన్న హడ్డీకి రియాజ్ భత్కల్ నుంచి ఆ ఏడాది ఫిబ్రవరి 4న మంగుళూరు వెళ్లాల్సిందిగా ఆదేశాలు వచ్చాయి. మంగుళూరులోని యూనిటీ హెల్త్ సెంటర్ వద్ద ఓ వ్యక్తి అందిస్తాడని చెప్పడంతో అక్కడకు వెళ్లాడు. రియాజ్ సూచించిన ప్రకారం భత్కల్ ప్రాంతానికే చెందిన సద్దాం హుస్సేన్ ద్వారా 25 కేజీల పేలుడు పదార్థం (అమ్మోనియం నైట్రేట్), 30 డిటోనేటర్లు సమీకరించిన అఫాఖీ వాటిని బంగారు రంగులో ఉన్న ట్రాలీ బ్యాగ్‌లో తీసుకువచ్చి యూనిటీ హెల్త్ సెంటర్ వద్ద హడ్డీకి అప్పగించాడు. ఇతడీ పేలుడు పదార్థాన్ని సద్దాం హుస్సేన్ ద్వారా సేకరించినట్లు వెలుగులోకి వచ్చింది. ఒకరికొకరు తెలియకుండా... దిల్సుఖ్నగర్ పేలుళ్లలో పాలుపంచుకున్న యాసీన్ భత్కల్ (నేపాల్ నుంచి సహకరించాడు), తెహసీన్ అక్తర్ (ఏ-1 మిర్చ్ సెంటర్ దగ్గర బాంబు పెట్టాడు), వఖాస్ (107 బస్టాప్ దగ్గర బాంబు పెట్టాడు), హడ్డీ (నగదు, పేలుడు పదార్థాలు చేరవేశాడు)లకు ఎజాజ్ షేక్ (నిధులు అందించాడు), అఫాఖీలు ఒకరికొకరు తెలియకుండా రియాజ్ భత్కల్ జాగ్రత్తలు తీసుకున్నాడు. అఫాఖీ, ఎజాజ్ షేక్లకూ ఎలాంటి పరిచయం లేదని, హడ్డీకి పేలుడు పదార్థాలు ఇచ్చినప్పుడు అతడు ఎవరనేది అఫాఖీకి తెలియదని సీసీబీ చీఫ్‌గా ఉన్న బెంగళూరు క్రైమ్స్ డీసీపీ అభిషేక్ గోయల్ ‘సాక్షి’తో అన్నారు. ప్రస్తుతం యాసీన్, తెహసీన్, హడ్డీ, వఖాస్‌లు హైదరాబాద్ జైల్లో ఉండగా... ఎజాజ్ షేక్ ఢిల్లీ, అఫాఖీ, సద్దాం బెంగళూరు జైళ్లల్లో ఉన్నారు. వీరిని న్యాయస్థానం అనుమతితో హైదరాబాద్ తరలించేందుకు ఎన్ఐఏ సన్నాహాలు చేస్తోంది. అఫాఖీ, సద్దాం కూడా దిల్సుఖ్నగర్ కేసుల్లో నిందితులుగా మారడంతో పరారీలో ఉన్న భత్కల్ సహా నిందితుల సంఖ్య ఎనిమిదికి చేరింది. దిల్‌సుఖ్‌నగర్‌లో బాంబు తయారీ సర్క్యూట్స్‌ను సయీదీ అందించినట్లు అనుమానించి పోలీసులు ఆరా తీస్తున్నారు. బెంగళూరు నుంచి 'సాక్షి' ప్రత్యేక ప్రతినిధి కామేష్ -
పథకం ప్రకారమే పేలుళ్లు!
దిల్సుఖ్నగర్ ఘటనలో మృతులు 18 మంది! మృతుల్లో గర్భిణి ఉండటంతో పెరిగిన సంఖ్య గర్భస్థ శిశువు మరణాన్నీ పరిగణనలోకి తీసుకున్న ఎన్ఐఏ జంట పేలుళ్ల కేసుకు సంబంధించి రెండో చార్జ్‌షీట్ దాఖలు రియాజ్ భత్కల్ సహా ముగ్గురిపై అభియోగాలు హైదరాబాద్: దిల్సుఖ్ నగర్లో గతేడాది ఫిబ్రవరిలో జరిగిన బాంబు పేలుళ్ల దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 18గా పరిగణిస్తూ ఎన్ఐఏ తన తాజా చార్జిషీటును దాఖలు చేసింది. వాస్తవానికి ఈ ఘటనలో 17 మంది మృతులయ్యారు. 131 మంది గాయపడ్డారు. అయితే మృతులైన వారిలో ఓ గర్భిణి కూడా ఉండడం, ఆమె గర్భంలోని శిశువూ మృతిచెందడాన్ని తీవ్రంగా పరిగణించిన జాతీయ దర్యాప్తు సంస్థ సీఆర్పీసీ (క్రిమినల్ ప్రొసీజర్ కోడ్)లోని వెసులుబాటు వినియోగించుకొని మృతుల సంఖ్యను 18గా ధ్రువీకరించింది. ఈ మేరకు నాంపల్లిలోని న్యాయస్థానంలో బుధవారం దాఖలు చేసిన రెండో చార్జ్‌షీట్‌లో ఈ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించింది. పేలుళ్లను నిందితులు పక్కా ప్రణాళికతో చేపట్టినట్లు దర్యాప్తు సంస్థ నిగ్గుతేల్చింది. మరో ముగ్గురిపైనా అభియోగాలు ఈ కేసులో ఇప్పటికే యాసిన్ భత్కల్, అసదుల్లా అక్తర్ అలియాస్ హడ్డీలపై తొలి చార్జ్‌షీట్ వేసింది. దీనికి అదనంగా మరో ముగ్గురు రియాజ్ భత్కల్, జకీ ఉర్ రెహ్మాన్ అలియాస్ వఖాస్, తెహసీన్ అక్తర్ అలియాస్ తబ్రేజ్‌లపై తాజా చార్జ్‌షీట్‌లో అభియోగాలు మోపింది. ఈ ముగ్గురినీ ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు గతేడాది అరెస్టు చేయగా... ఈ ఏడాది మేలో ఎన్ఐఏ అధికారులు హైదరాబాద్ తీసుకువచ్చి విచారించారు. పాకిస్థాన్‌లో తలదాచుకున్న నిషిద్ధ ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) మాస్టర్‌మైండ్ రియాజ్ భత్కల్ సూత్రధారిగా, బంగ్లాదేశ్ కేంద్రంగా పని చేసిన ఐఎం ఆపరేషనల్ చీఫ్ యాసిన్ భత్కల్ పేలుళ్లకు వ్యూహరచన చేసినట్లు ఎన్ఐఏ నిర్ధారించింది. పాకిస్థాన్ నుంచే రియాజ్ భత్కల్ 2013 ఫిబ్రవరి తొలి వారంలో హడ్డీకి నగదు, పేలుడు పదార్థాలను కర్ణాటకలోని మంగుళూరులో అందించాడని పేర్కొంది. అక్కడి హంపన్‌కట్టలో ఉన్న వెస్ట్రన్ యూనియన్ మనీ ట్రాన్స్ఫర్ సంస్థ ఔట్లెట్ సుపమ ఫోరెన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో పాటు మంగుళూరులోని మార్కెట్ రోడ్డులో హవాలా వ్యాపారం చేసే డింగ్ డాంగ్ దుకాణం యజమాని నుంచి హడ్డీ నగదు అందుకున్నాడని తేల్చింది. మంగుళూరులోనే ఉన్న యూనిటీ హెల్త్ సెంటర్ వద్ద ట్రాలీ బ్యాగ్‌లో ఉన్న 25 కేజీల అమ్మోనియం నైట్రేట్, 30 డిటోనేటర్లను కూడా తీసుకున్నట్లు, వాటితో పేలుళ్లు జరపడానికి 16 రోజుల ముందే హైదరాబాద్ చేరుకున్నట్లు వెల్లడించింది. వఖాస్, తెహసీన్ అక్తర్ వచ్చిన తరవాత అబ్దుల్లాపూర్‌మెట్‌లోని గదుల్లోనే గతేడాది ఫిబ్రవరి 21న బాంబులు తయారు చేసి అదే రోజు సైకిళ్లకు అమర్చి దిల్సుఖ్నగర్ ప్రాంతంలో పేల్చారని తేల్చింది. వీరు సమాచార మార్పిడి కోసం నింబస్, యాహూ, పాల్‌టాక్, జీమెయిల్, ఫేస్‌బుక్‌ల ద్వారా చాటింగ్ చేసుకున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. వీటి ద్వారా చాటింగ్ చేయడానికి వినియోగించిన ఐడీలను కూడా కనుగొన్నారు. రియాజ్ భత్కల్ (ఞ్చ్ట్చట్చటజీజజిఃడ్చజిౌౌ. ఛిౌఝ), యాసీన్ భత్కల్ (ౌఠ్ఛిట్చఝ361ఃడ్చజిౌౌ.ఛిౌఝ), తెహసీన్ (జిజీజిౌ్ఛడ93ఃడ్చజిౌౌ.ఛిౌఝ), అసదుల్లా (జిౌఠీఠీటఠఛ్ఛ్చీటఃడ్చజిౌౌ.ఛిౌఝ) తరహాలో సృష్టించారని అధికారులు తేల్చారు. దిల్సుఖ్నగర్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉండి, ప్రస్తు తం పరారీలో ఉన్న రియాజ్ భత్కల్ అరెస్టుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎన్ఐఏ ప్రకటిం చింది. మరోపక్క తెహసీన్ అక్తర్, వఖాస్ సహా మరికొందరిపై రాజస్థాన్ యాంటీ టైరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు శుక్రవారం అక్క డి కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేయనున్నారు. -
అదరహో..
-
దిల్సుఖ్నగర్ పేలుళ్ల నిందితులకు రిమాండ్
హైదరాబాద్ : దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో నిందితులు వకాస్, తహసీన్ అక్తర్లను ఎన్ఐఏ అధికారులు శనివారం నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. న్యాయస్థానం వారికి జూన్ 23 వరకూ రిమాండ్ విధించింది. దిల్‌సుఖ్‌నగర్‌లోని ఏ-1 మిర్చ్ సెంటర్, 107 బస్టాప్‌ల వద్ద గత ఏడాది ఫిబ్రవరి 21న జరిగిన జంట పేలుళ్ల కేసుల్లో వారు నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. వారికి మూడు రోజుల ట్రాన్సిట్ రిమాండ్‌కు ఢిల్లీలోని ప్రత్యేక న్యాయస్థానం అనుమతించింది. ఈ సందర్భంగా నాంపల్లి కోర్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మీడియాను కూడా లోనికి అనుమతించలేదు. స్థానిక కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేసి ఇద్దరు ఉగ్రవాదుల్నీ తమ కస్టడీలోకి తీసుకుని దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసులో విచారణ జరపాలని ఎన్ఐఏ సన్నాహాలు చేస్తోంది. ఈ కేసులో రెండు, ఐదో నిందితులుగా ఉన్న అసదుల్లా అఖ్తర్, యాసీన్ భత్కల్‌లను గత ఏడాదే నగరానికి తరలించి విచారించారు. -
ఆ బాంబులు నేనే కూర్చాను
దిల్సుఖ్నగర్ పేలుళ్లపై భత్కల్ సహచరుడు అక్తర్ వాంగ్మూలం న్యూఢిల్లీ: గతేడాది ఫిబ్రవరిలో హైదరాబాద్ దిల్సుఖ్నగర్ ప్రాంతంలో జరిగిన పేలుళ్లలో వాడిన బాంబులు తానే తయారు చేశానని ఉగ్రవాది యాసిన్ భత్కల్ సహచరుడు అసదుల్లా అక్తర్ అంగీకరించాడు. నాడు బాంబులను తయారు చేసి, వాటిని ఎలా పేల్చాలన్న విషయంలో ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాద సంస్థ సభ్యులకు మార్గదర్శనం చేశానని తెలిపాడు. ఈ మేరకు గత అక్టోబర్‌లో మేజిస్ట్రేట్‌కు వాం గ్మూలమిచ్చాడు. దీన్ని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఢిల్లీ కోర్టులో దాఖలు చేసింది. యాసిన్ భత్కల్, అక్తర్, మరో ఇద్దరు ఉగ్రవాదులపై చార్జిషీట్లు దాఖలు చేసింది. వాంగ్మూలం వివరాలివీ.. ''ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న రియాజ్ భత్కల్(ఐఎం సహ వ్యవస్థాపకుడు) సూచనల మేరకు నేను దిల్సుఖ్నగర్ ప్రాంతంలో బాంబు పేలుళ్లు నిర్వహించాను. 2012 డిసెంబర్లో రియాజ్, నేను మాట్లాడుకున్నాం. హైదరాబాద్‌లో ఏదో ఒకటి చేయాలనుకున్నాం. అదే నెలలో మాకు హవాలా ద్వారా బెంగళూరుకు డబ్బులు వచ్చాయి. గతేడాది జనవరిలో రియాజ్ నుంచి పేలుడు పదార్థాలు అందాయి. ఆ తర్వాత 2013 ఫిబ్రవరి 18న దిల్‌సుఖ్‌నగర్‌లో రెక్కీ చేశాం. బాంబు పేల్చడానికి తగిన ప్రాంతాల్ని నేను నిర్ణయించాను. మూడు చోట్ల పేలుళ్లు చేపట్టాలనుకున్నా.. పేలుడు పదార్థాలు సరిపోకపోవడంతో రెండు చోట్లే బాంబులు పేల్చడానికి సిద్ధమయ్యాం. దిల్‌సుఖ్‌నగర్‌లో పేలుళ్లు చేపట్టడానికి ముందు శాంపిల్‌గా చిన్న పేలుడు కూడా నిర్వహించి చూశాం. అంతా ఓకే అనుకున్నాక.. నేను పేలుడు పదార్థాలను కూర్చాను. ఉగ్రవాది మోను.. ఏ1 మిర్చి సెంటర్ వద్ద, వకాస్ దిల్సుఖ్నగర్ బస్టాండ్ వద్ద బాంబులు పెట్టారు. ఆ సమయంలో నేను వారి దగ్గరలోనే ఉన్నాను'' అని అసదుల్లా అక్తర్ చెప్పాడు. -
మానని గాయం.
-
దావత్ అంటే తెలుసా..!
‘భాయ్ దావత్ కర్లేంగే’... హైదరాబాదీలకు ఈ మాట సుపరిచితమే. అయితే ఉగ్రవాదుల పరిభాషలో దావత్ అంటే ఏమిటో తెలుసా..! వాళ్లు ఆ విందుకు సన్నద్ధమైతే ఏం జరుగుతుందో ఊహించగలరా..? గత ఏడాది ఫిబ్రవరి 21న అలాంటి దావత్నే ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ముష్కరులు దిల్‌సుఖ్‌నగర్‌లో చేసుకోవడంతో18 ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇంతకీ ఆ దావత్ కథాకమామిషు తెలుసుకోవాలని అనుకుంటున్నారా..! అయితే ‘విందు కాదు... విధ్వంసం’ చదవండి. విందు కాదు.. విధ్వంసం పేలుళ్లను ‘దావత్’గా పిలిచిన ఉగ్రవాదులు కోడ్‌వర్డ్స్‌తో పథకాన్ని అమలు చేసిన వైనం యాసీన్ భత్కల్ విచారణలో వెలుగులోకి డీకోడ్ చేస్తున్న ముంబై ఏటీఎస్ అధికారులు సాక్షి, సిటీబ్యూరో: ‘వర్క్ నీడ్స్ టు బి డన్ ఇన్ ‘హెచ్’... (‘హెచ్’లో పని పూర్తి చేయాల్సిందే) ‘యు షుడ్ ఎరేంజ్ ఫర్ ఏ దావత్’... (అక్కడ విందు కోసం నువ్వే ఏర్పాట్లు చేయాలి) దిల్‌సుఖ్‌నగర్‌లో గతేడాది ఫిబ్రవరి 21న విధ్వంసం జరగడానికి కొన్ని రోజుల ముందు ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) మాస్టర్‌మైండ్ రియాజ్ భత్కల్ నుంచి ఆ సంస్థ కో-ఫౌండర్ యాసీన్ భత్కల్‌కు ఇంటర్నెట్ ద్వారా వచ్చిన ఆఫ్‌లైన్ మెసేజ్ ఇది. దీన్ని డీకోడ్ చేసిన ముంబై యాంటీ టైస్ట్ స్క్వాడ్ ( ఏటీ ఎస్) అధికారులు ‘హైదరాబాద్‌ను టార్గెట్ చేయాల్సిందే. అక్కడ విధ్వంసానికి నువ్వే ఏర్పాట్లు చేయాలి’ అని ఉందని నిర్థారించారు. యాసీన్ భత్కల్‌తో పాటు అతడి ప్రధాన అనుచరుడు హడ్డీలను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న ఏటీఎస్ ఈ తరహాకు చెందిన మరికొన్ని కోడ్వర్డ్స్ను గుర్తించింది. గుర్తించే అవకాశం లేని డమ్మీ ఐడీలు... పాకిస్తాన్‌లోని కరాచీ సమీపంలో ఉన్న డిఫెన్స్ కాలనీలో తలదాచుకున్న రియాజ్ భత్కల్ భారత్‌లోని తన అనుచరులను సంప్రదించేందుకు, ఆదేశాలు జారీ చేసేందుకు ఇంటర్నెట్తో పాటు సోషల్ నెట్వర్కింగ్ సైట్సే ఎక్కువగా వినియోగించినట్లు ఏటీఎస్ గుర్తించింది. అయితే నిఘా వర్గాల సాంకేతిక విశ్లేషణకు కూడా చిక్కకుండా ఉండేందుకు ఆఫ్‌లైన్ మోడ్‌లోనే ఈ సమాచార మార్పిడి చేసుకున్నారని వెల్లడైంది. ఏ కోణంలోనూ తమ వివరాలు బయటపడని, ఎవరూ అనుమానించని విధంగా డమ్మీ పేర్లతో ఐడీలను సృష్టించారని ఏటీఎస్ విచారణలో వెల్లడైంది. రియాజ్ భత్కల్ సృష్టించుకున్న ఐడీల్లో ‘పటారాసింగ్’, యాసిన్ భత్కల్‌కు చెందిన దాంట్లో ‘హెచ్ బహద్దూర్’లతో మొదలయ్యేవి ఉన్నాయని ఏటీఎస్ స్పష్టం చేస్తోంది. ఉగ్రవాదులు ఎక్కువగా ఫ్రీ ఫోన్‌కాల్స్, ఎస్సెమ్మెస్, మెసెంజింగ్ సర్వీసుల్ని అందించే వెబ్‌సైట్స్‌నే వాడారు. ఒక్కోటి ఒక్కోసారే వినియోగం... ఈ తరహాలో రూపొందించుకున్న ఐడీలను సైతం ముష్కరులు ఎక్కువ కాలం వినియోగించట్లేదు. ఓసారి తయారు చేసుకున్న ఐడీని ఆ సందర్భంలో సంప్రదింపులు, సమాచార మార్పిడి కోసం మాత్రమే వాడారని ఏటీఎస్ గుర్తించింది. మరోసారికి ఇంకో కొత్త ఐడీ సృష్టించుకోవడం వంటి అనేక జాగ్రత్తలు తీసుకుని తమ ‘పనులు’ పూర్తి చేశారు. ప్రతి సందర్భంలోనూ ఒకరి ఐడీ మరొకరికి ఎన్క్రిప్టెడ్ ఫైల్స్ రూపంలో ఇంటర్నెట్, సెల్‌ఫోన్‌లోని మెసెంజర్ల సాయంతో పంపుకునే వారు. ఇంటర్నెట్, సెల్‌ఫోన్ మెసెంజర్స్‌లో ఉండే సభ్యులు, వినియోగదారుల సంఖ్య భారీ సంఖ్యలో ఉండటంతో వీటిని గుర్తించడం నిఘా వర్గాలకూ పెను సవాల్‌గా మారింది. ఎన్క్రిప్టెడ్ ఫైల్స్ రూపంలో ఉండటంతో ఇది మరింత ఇబ్బందికరంగా పరిణమించింది. -
ఉగ్ర ఫైనాన్షియర్ చిక్కాడు
అబుదాబిలో దొరికిన ఐఎం ఉగ్రవాది ఇంటర్‌పోల్ అదుపులో అబ్దుల్ వహీద్ విధ్వంసానికి డబ్బు పంపింది ఇతడే భారత్‌కు తెచ్చేందుకు యత్నాలు దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసులో మరో నిందితుడు చిక్కాడు. ఈ విధ్వంసానికి ఆర్థిక సాయం చేసిన వ్యక్తిగా వహీద్‌ను నిఘా వర్గాలు గుర్తించాయి. అతనిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయి ఉండటంతో ఇంటర్‌పోల్ అబుదాబిలో అదుపులోకి తీసుకుంది. భారత్ తీసుకువచ్చేందుకు జాతీయ నిఘా, దర్యాప్తు సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వహీద్ దిల్సుఖ్నగర్ విధ్వంసం కేసులో ఆరో నిందితుడిగా మారనున్నాడు. - సాక్షి, సిటీబ్యూరో పాకిస్థాన్‌లోని కరాచీలో ఉన్న డిఫెన్స్ ఏరియాలో తలదాచుకుంటున్న ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) వ్యవస్థాపకుడు రియాజ్ భత్కల్ 2007లో మాదిరిగానే 2013లోనూ హైదరాబాద్‌ను మరోసారి టార్గెట్ చేయాలని 2012లోనే నిర్ణయించుకున్నాడు. దీనికోసం యాసీన్ భత్కల్ ద్వారా అదే ఏడాది సెప్టెంబర్‌లో అసదుల్లా అక్తర్ అలియాస్ హడ్డీ (ఆజామ్ఘడ్), వఖాస్ (పాకిస్థాన్)లను మంగుళూరుకు పంపి అక్కడ డెన్ ఏర్పాటు చేసుకోవాల్సిందిగా ఆదేశించాడు. అక్కడకు వెళ్లిన ఇద్దరూ హంపన్‌కట్ట ప్రాంతంలోని జఫైర్ హైట్స్ అపార్ట్మెంట్ మూడో అంతస్తులోని 301 ఫ్లాట్ అద్దెకు తీసుకున్నారు. అక్కడ ఉంటూనే హడ్డీ ఫల్మిన్ సైబర్ పా యింట్, ఏంజిల్ సైబర్ గ్యాలరీ, సైబర్ ఫాస్ట్ అనే పేర్లతో కూడిన సైబర్ కేఫ్‌ల నుంచి రియాజ్ భత్కల్‌కు చెందిన ఈ-మెయిల్ ఐడీ (ఞ్చ్ట్చట్చటజీజజిఃడ్చజిౌౌ.ఛిౌఝ)తో చాటింగ్ ద్వారా సంప్రదింపులు జరిపేవాడు. వహీద్ ద్వారా నగదు సరఫరా రియాజ్ భత్కల్ గత ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలో ఈసారి హైదరాబాద్‌ను టార్గెట్ చేశామని హడ్డీకి చాటింగ్‌లో చెప్పాడు. వఖాస్, తెహసీన్ అక్తర్ అలియాస్ మోను (బీహార్‌లోని దర్భంగా వాసి)లతో కలిసి ఈ ఆపరేషన్ పూర్తి చేయాలని నిర్దేశించాడు. అందుకు అవసరమైన పేలుడు పదార్థాలతో నగదు త్వరలోనే అందుతాయంటూ చెప్పాడు. డబ్బును వెస్ట్రన్ యూనియన్ మనీ ట్రాన్స్ఫర్, హవాలా మార్గాల్లో పంపుతానని రియాజ్ భత్కల్ పేర్కొన్నాడు. ఈ నగదు బదిలీ బాధ్యతల్ని రియాజ్... తనకు నమ్మినబంటు అయిన వహీద్ అబ్దుల్ సిద్ధిబపకు అప్పగించాడు. పేలుళ్లకు అవసరమైన నిధు లు సమీకరించిన వహీద్... దుబాయ్ నుంచి మంగుళూరులోని హంపన్‌కట్టలో ఉన్న వెస్ట్రన్ యూనియన్ మనీ ట్రాన్స్ఫర్ సంస్థ ఔట్లెట్ సుపమ ఫోరెన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో పాటు మంగుళూరులోని మార్కెట్ రోడ్డులో హవాలా వ్యాపారం నిర్వహించే డిం గ్ డాంగ్ దుకాణం యజమాని ద్వారా డబ్బు పంపాడు. ఈ మొత్తాన్ని హడ్డీ తీసుకున్నాడు. పేరు బయటపెట్టిన యాసీన్ భత్కల్ అనుకున్న ప్రకారం హడ్డీ, మోను, వఖాస్‌లు హైదరాబాద్ చేరుకోవడం, అబ్దుల్లాపూర్‌మెట్‌లో మకాం వేయడం, గత ఏడాది ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌లోని ఏ-1 మిర్చ్ సెంటర్, 107 బస్టాప్‌ల్లో పేలుళ్లకు పాల్పడటం జరిగిపోయాయి. ఈ కేసులో రియాజ్, యాసీన్, వఖాస్, హడ్డీ, మోనులను నిందితులుగా దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. గత ఏడాది ఆగస్టు 29న కేంద్ర నిఘా వర్గాలు యాసీన్, అసదుల్లా అక్తర్ అలియాస్ హడ్డీల్ని నేపాల్ సరిహద్దుల్లో పట్టుకున్నాయి. యాసీన్ భత్కల్ విచారణ నేపథ్యంలోనే ఫైనాన్షియర్ వహీద్ పేరు వెలుగులోకి వచ్చింది. దిల్సుఖ్నగర్ పేలుళ్లకు నగదు దుబాయ్ నుంచి మనీ ట్రాన్సఫర్, హవాలా ద్వారా పంపింది ఇతడే అని వెల్లడించాడు. దీంతో జాతీయ దర్యాప్తు సంస్థతో పాటు నిఘా వర్గాలు సైతం ఇతడి కోసం వేట ముమ్మరం చేశాయి. ‘పార్ట్‌టైమ్’ ఉగ్రవాదిగా వహీద్ కర్ణాకటలో భత్కల్ ప్రాంతంలోని మగ్దూం కాలనీకి చెందిన వహీద్ కొన్నేళ్ల క్రితమే వ్యాపారం నిమిత్తం దుబాయ్‌లో స్థిరపడ్డాడు. రియాజ్, ఇక్బాల్, యాసీన్‌లకు సమీప బంధువైన ఇతగాడు సౌదీ దేశాల్లో ఉన్న సానుభూతిపరుల నుంచి ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమీకరిస్తుంటాడు. భత్కల్ బ్రదర్స్ ఆదేశాల మేరకు వాటిని భారత్‌కు పంపిస్తుంటాడు. ఏ పేలుడులోనూ నేరుగా పాల్గొనని, ఆయా సమయాల్లో భారత్‌లో కూడా లేని వహీద్ పార్ట్‌టైమ్‌గా ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొం టున్నా... దుబాయ్ మాడ్యుల్లో కీలక వ్యక్తిగా నిఘా వర్గాలు భావిస్తున్నాయి. 2006 నాటి ముంబై సీరియల్ బ్లాస్ట్, బెంగళూరు స్టేడియం పేలుళ్లతో పాటు 2010 నాటి ఢిల్లీ వరుస పేలుళ్లలోనూ ఇతడి ‘ఆర్థిక పాత్ర’ ఉన్నట్లు తేలడంతో దర్యాప్తు సంస్థలు ఇంటర్‌పోల్ సాయంతో రెడ్ కార్నర్ నోటీసు జారీ చేశాయి. యాసీన్, హడ్డీల అరెస్టు తరవాత గాలింపు మరింత ముమ్మరం చేశాయి. గత వారం దుబాయ్ నుంచి వ్యాపార పనులపై అబుదాబి వచ్చిన వహీద్‌ను ఇంటర్‌పోల్ వర్గాలు అదుపులోకి తీసుకున్నాయి. ఈ మేరకు కేంద్ర నిఘా వర్గాలతో పాటు జాతీయ దర్యాప్తు సంస్థకూ సమాచారం అందించాయి. ‘గుర్తింపు’ చూపితేనే అప్పగింత వహీద్‌ను భారత్‌కు తీసుకురావడానికి నిఘా, దర్యాప్తు సంస్థలు ప్రయత్నాలు ప్రారంభిం చాయి. దీనికోసం ప్రత్యేక బృందాలు అబుదాబి చేరుకున్నాయి. అయితే తమకు వాంటెడ్‌గా ఉన్న వహీద్, అబుదాబిలో చిక్కిన వహీద్ ఒకరే అంటూ ఇంటర్‌పోల్‌కు కొన్ని ఆధారాలు, గుర్తింపు పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయితేనే నిందితుడిని భారత్‌కు తరలించేందుకు ఆయా సంస్థలు అంగీకరిస్తాయి. దీంతో నిఘా వర్గాలు ‘గుర్తింపుల్ని’ సేకరించే పనిలో పడ్డాయి. దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్లకు సూత్రధారిగా ఉండటంతో రియాజ్ భత్కల్ను ఈ కేసులో ప్రధాన నిందితుడిగా (ఏ-1)గా చేర్చిన జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు నేరుగా ప్రమేయం లేని, పేలుడు పదార్థాలు సరఫరా చేసినట్లు, సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న యాసీన్‌ను ఐదో నిందితుడు (ఏ-5)గా చేర్చారు. హడ్డీ, వఖాస్, మోనులను ఏ-2, ఏ-3, ఏ-4గా నిర్థారించారు. ఇప్పుడు వహీద్‌ను అబుదాబి నుంచి తీసుకువచ్చి ఈ కేసులో చేరిస్తే ఆరో నిందితుడిగా మారనున్నాడు. -
ట్యాంకర్లు, రైళ్లే బాంబులు
సాక్షి, హైదరాబాద్: ‘టార్గెట్ చేసిన ప్రాంతాల్లో బాంబుల్ని పేల్చినప్పుడు పదుల సంఖ్యలోనే మరణిస్తున్నారు. అదును చూసుకుని వీటి స్థానంలో ట్యాంకర్లు, రైళ్లను పేలిస్తే...’ నిషిద్ధ ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) పన్నాగమిది. దీనికోసం మాగ్నెటిక్ పరిజ్ఞానంతో పనిచేసే బాంబుల్ని తయారుచేస్తోంది. ఈ కుట్రను అమలుచేసే బాధ్యతల్ని తెహసీన్ అక్తర్ మాడ్యుల్‌కు అప్పగించింది. ప్రస్తుతం బెంగళూరు పోలీసుల కస్టడీలో ఉన్న ఐఎం సహ వ్యవస్థాపకుడు, దిల్సుఖ్నగర్ పేలుళ్ల నిందితుడు యాసిన్ భత్కల్ బయటపెట్టిన విషయాలివి. గత సెప్టెంబర్‌లో కర్ణాటకలోని మంగళూరులో ఉన్న ఐఎం స్థావరంలో పోలీసులు చేసిన సోదాల్లో చిక్కిన 90 బాంబుల్లో కొన్ని మాగ్నెటిక్ పరిజ్ఞానంతో కలిగినవి కూడా ఉండటం దీనికి బలాన్నిస్తోంది. ప్రస్తుతం పాకిస్థాన్ కరాచీలోని డిఫెన్స్ ఏరియాలో తలదాచుకున్న ఐఎం మాస్టర్‌మైండ్ రియాజ్ భత్కల్ ఆదేశాల మేరకు ఇది జరుగుతున్నట్లు నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. తెహసీన్ కనుసన్నల్లో 13 మాడ్యుల్స్... యాసిన్ భత్కల్ అరెస్టు తర్వాత పూర్తి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన తెహసీన్ అక్తర్ దేశ వ్యాప్తంగా నాలుగు ప్రాంతాల్లో 13 మాడ్యుల్స్‌ను తయారుచేసుకున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. - ఉత్తరప్రదేశ్‌లోని ఆజాంగఢ్‌లో ఐదు, బీహార్‌లోని దర్భంగాలో నాలుగు, ఛత్తీస్‌గఢ్‌లోని రాంచీలో ఒకటి, కర్ణాటకలోని మంగుళూరు పరిసరాల్లో మరో రెండింటితో పాటు హైదరాబాద్‌లోనూ వీటిని విస్తరించినట్లు భావిస్తున్నారు. - అయస్కాంత పరిజ్ఞానంతో కూడిన ఐఈడీలను పేల్చడానికి వీటిని వినియోగించవచ్చని హెచ్చరిస్తున్నాయి. - ఈ తరహా బాంబుల తయారీ, వీటి రూపురేఖలతో పాటు ఇంధనాన్ని రవాణా చేసే ట్యాంకర్లు, రైళ్ల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలతో కూడిన మార్గదర్శకాలు, విధివిధానాలను రూపొందించి సంబంధిత విభాగాలకు పంపేందుకు కేంద్ర నిఘా వర్గాలు కసరత్తు ప్రారంభించాయి. రైల్వేస్టేషన్లు, జనసమ్మర్ద ప్రాంతాలే లక్ష్యం - ఈ ఆధునిక మాగ్నెటిక్ మెకానిజంతో కూడిన ఐఈడీలను ట్యాంకర్లు, రైళ్లకు అతికించే ముందు అవి ప్రయాణించే మార్గాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఐఎం ఉగ్రవాదులకు స్పష్టంచేసింది. - జనసమ్మర్ద ప్రాంతాలు, కీలక రైల్వేస్టేషన్ల మీదుగా వెళ్లే వాటిని ఎంచుకుని వీటిని పేలిస్తేనే అనుకున్న లక్ష్యాలు నెరవేరతాయని ఉగ్ర సంస్థ భావిస్తోంది. - పరారీలో ఉన్న ఉగ్రవాదులు తెహసీన్ అక్తర్, వకాస్లు ఈ బాంబుల్ని తయారుచేయడంలో నిష్ణాతులైనప్పటికీ రెండో వ్యక్తి పాకిస్థానీ కావడంతో స్లీపర్ సెల్స్ సహకారంతో ఈ ఆపరేషన్లు పూర్తిచేసే బాధ్యతల్ని తెహసీన్కే భత్కల్ అప్పగించాడని నిఘా వర్గాలు గుర్తించాయి. - గత సెప్టెంబర్‌లో దర్యాప్తు అధికారులు మంగళూరులో ఉన్న ఉగ్రవాదుల అడ్డా జఫైర్ హైట్స్‌పై దాడి చేసినప్పుడు తెహసీన్, వకాస్లు త్రుటిలో తప్పించుకున్నా.. పేల్చడానికి సిద్ధంగా ఉన్న 90 ఐఈడీలను స్వాధీనం చేసుకున్నాయి. వీటిలో 50 వరకు మాగ్నెటిక్ పరిజ్ఞానంతో చేసినట్లు నిపుణులు నిర్ధారించారు. ఇంధన రవాణాలే లక్ష్యంగా... - ఇప్పటివరకు ఐఎం ఉగ్రవాదులు ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్ (ఐఈడీ) పరిజ్ఞానంతో తయారుచేసిన బాంబుల్నే వినియోగిస్తున్నారు. ప్రధానంగా పేలుడు పదార్థమైన అమ్మోనియం నైట్రేట్‌తో చేసే వీటిని విధ్వంసం సృష్టించాల్సిన ప్రదేశంలో పెట్టిన తరవాత టైమర్, డిజిటల్ వాచ్, సెల్‌ఫోన్ అలారమ్‌లను వినియోగించి నిర్ణీత సమయంలో పేలుస్తున్నారు. - వీటికి మరింత ఆధునికత జోడించి మాగ్నెటిక్ పరిజ్ఞానాన్నీ అందుబాటులోకి తెచ్చింది ఐఎం. ఈ ఐఈడీలకు శక్తిమంతమైన అయస్కాంతాన్ని జోడించడం ద్వారా భారీ ఇనుప వస్తువుల్ని పట్టి ఉండేలా చేస్తారు. - ఇలాంటి ఐఈడీలను కొన్ని రకాలైన యాసిడ్లతో పాటు పెట్రోల్, డీజిల్ వంటి త్వరతగతిన మండే, మంటల్ని త్వరగా విస్తరింపజేసే లక్షణం ఉన్న వాటిని రవాణా చేస్తున్న ట్యాంకర్లు, గూడ్స్ రైళ్లకు అతికించాలన్నది ఉగ్ర సంస్థ పన్నాగం. - ఈ రకమైన ‘అతికించే బాంబులు’ అఫ్ఘానిస్థాన్, ఇరాక్‌ల్లో సుపరిచితమే అయినా... భారత్‌లో మాత్రం వీటి వినియోగం అరుదు. - 2012 ఫిబ్రవరి 13న ఢిల్లీలోని ఇజ్రాయిల్ దౌత్య కార్యాలయం సమీపంలో ఇలాంటి బాంబుతో కూడిన కారే పేలింది. ఇది తక్కువ తీవ్రత కలిగింది కావడంతో నలుగురికి గాయాలయ్యాయి. అంతకు మించి అయస్కాంత పరిజ్ఞానం ఉన్న బాంబుల తయారీ, వినియోగానికి సంబంధించి పోలీసు విభాగాలకే పూర్తి అవగాహన లేదు. -
అన్వేషణలో హైదరాబాద్‌కు అగ్రస్థానం!
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఈ ఏడాది నెటిజన్ల హాట్ ఫేవరేట్‌గా నిలిచింది. మన దేశంలో అత్యధిక మంది నెటిజన్లు భాగ్యనగరం కోసం ఇంటర్నెట్లో శోధించారు. సెర్జ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్‌లో 2013లో ఎక్కువ మంది హైదరాబాద్ సమాచారం కోసం అన్వేషించారు. మెట్రో నగరాలు ముంబై, బెంగళూరులను వెనక్కి నెట్టి 'మన సిటీ' కోసం వెతికారు. ఫిబ్రవరిలో దిల్‌షుఖ్‌నగర్ జంట బాంబు పేలుళ్లు సంభవించడంతో హైదరాబాద్ సమాచారం కోసం ఎక్కువ మంది ఆన్లైన్లో అన్వేషించారు. జంట పేలుళ్లకు 17 మంది ప్రాణాలు కోల్పోగా, 100 మందిపైగా గాయపడిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగిన జూలై, ఆగస్టు మాసాల్లో కూడా హైదరాబాద్ కోసం అత్యధికులు శోధించారు. సెప్టెంబర్‌లో ఐపీఎల్, తీవ్రవాది యాసిన్ భత్కల్ను హైదరాబాద్ పోలీసులు ప్రశ్నించినప్పుడు, అక్టోబర్‌లో వాల్వో బస్సు దుర్ఘటన జరిగినప్పుడు భాగ్యనగరం కోసం నెటిజన్లు ఆతృతగా శోధించారని గూగుల్ ఇండియా వెల్లడించింది. -
దిల్సుఖ్నగర్ పేలుళ్ల నిందితులను ఢిల్లీకి తరలించిన ఎన్ఐఏ
దిల్సుఖ్ నగర్ జంట బాంబు పేలుళ్ల కేసులో నిందితులు యాసిన్ భత్కల్, అసదుల్లా అక్తర్లను ఎన్ఐఏ అధికారులు ఆదివారం ఉదయం హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీకి తరలించారు. దిల్సుఖ్నగర్ బాంబ్ కేసులో విచారణ నిమిత్తం ఆ ఇద్దరు నిందితులను ఎన్ఐఏ అధికారులు కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ తీసుకువచ్చారు. ఇటీవల దేశ సరిహద్దుల వద్ద యూసిన్ భత్కల్‌తోపాటు మరోకరిని బీహార్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దేశంలోని వివిధ బాంబు పేలుళ్లలో భత్కల్ కీలక పాత్ర పోషించాడని నిఘా వర్గాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. -
పాకిస్ధాన్ నుంచి ఈమెయిల్స్ ద్వారా యాసిన్‌కు సూచనలు
-
దిల్సిఖ్నగర్ పేలుళ్లపై వెలుగుచూస్తున్న వాస్తవాలు
-
భక్తల్ ఆదేశాల మేరకే బాంబు పేలుళ్లు: తబ్రేజ్
హైదరాబాద్ : దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసు విచారణలో ఎన్ఐఏ పురోగతి సాధించింది. ఎన్ఐఏ విచారణలో అసదుల్లా అక్తర్ అలియాస్ తబ్రేజ్ పలు కీలక విషయాలు వెల్లడించాడు. ప్రయివేట్ ట్రావెల్స్‌లో మంగళూరు నుంచి వచ్చి రెక్కీ నిర్వహించేవారని తెలిపాడు. అబిడ్స్, మలక్‌పేట, దిల్సుఖ్ నగర్లో రెక్కీ నిర్వహించినట్లు అసదుల్లా అక్తర్ వెల్లడించాడు. మంగళూరులోని యూనిట్ హెల్త్‌కేర్ వద్ద ఓ వ్యక్తి రియాజ్ భక్తల్ పేరుతో కొంత పేలుడు సామాగ్రిని అందచేశాడని చెప్పాడు. అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నామని, పేలుళ్లకు రెండు రోజుల ముందే బాంబులను పరీక్షించినట్లు పేర్కొన్నాడు. జుమారాత్బజార్, మలక్‌పేట్‌లలో పాత సైకిల్ విడిభాగాలు కొన్నామని... సేకరించిన విడిభాగాలతో రెండు సైకిళ్లు తయారు చేసినట్లు చెప్పాడు. పేలుళ్ల రోజు మలక్‌పేట రైల్వేస్టేషన్లో సైకిళ్లు ఉంచి, ఆ సైకిళ్లకు టిఫిన్ బాక్స్ బాంబులు అమర్చినట్లు అసదుల్లా అక్తర్ తెలిపాడు. దిల్సుఖ్ నగర్ బస్టాప్ వద్ద ఓ సైకిల్‌ను వాఖత్ ఉంచగా, A1 మిర్చి సెంటర్ వద్ద తహసీన్ మరో సైకిల్ ఉంచినట్లు అసదుల్లా అక్తర్ వెల్లడించాడు. రియాజ్ భక్తల్ ఆదేశాల మేరకే బాంబు పేలుళ్లు జరిగాయని, పేలుళ్లు జరిగిన రోజే బెంగళూరు వెళ్లిపోయినట్లు తెలిపాడు. బెంగళూరు నుంచి మంగళూరు వెళ్లి అక్కడ నుంచి నేపాల్ చేరుకున్నట్లు చెప్పాడు. -
పేలుళ్లకు నెల్లాళ్ల ముందే బాంబులు సిద్ధం
ఎన్ఐఏ విచారణలో భత్కల్, తబ్రేజ్ వెల్లడి సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కోసం ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులు పక్కా పథకం ప్రకారం నెల్లాళ్ల ముందుగానే బాంబులు సిద్ధం చేసుకున్నట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. ఈ ఏడాది ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌లో విధ్వంసం సృష్టించేందుకు జనవరిలోనే బాంబులు సిద్ధం చేసుకున్నట్లు ఉగ్రవాదులు యాసిన్ భత్కల్, అసదుల్లా అక్తర్ అలియాస్ తబ్రేజ్‌లు దర్యాప్తులో వెల్లడించాడు. బాంబుల తయారీ కోసం ఒక వ్యక్తి యాసిన్ భత్కల్‌కు పేలుడు పదార్థాలను సమకూర్చినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో వెల్లడైంది. ఆ వ్యక్తి కోసం ఎన్ఐఏ అధికారులు గాలిస్తున్నారు. యాసిన్ భత్కల్ నెల్లాళ్ల ముందుగానే నగరంలో మకాం వేసినట్లు వారు అనుమానిస్తున్నారు. దిల్సుఖ్నగర్ పేలుళ్లకు మొత్తం ఐదుగురు ఉగ్రవాదులను బాధ్యులుగా గుర్తించారు. -
యాసిన్ భత్కల్‌కు అక్టోబరు 17 వరకు రిమాండ్
హైదరాబాద్: దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసు నిందితుడు, నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) సహవ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ను హైదరాబాద్ పోలీసులు ఈరోజు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. అక్టోబరు 17 వరకు కోర్టు భత్కల్ను రిమాండ్ విధించింది. దిల్సుఖ్నగర్ పేలుళ్లకు ప్రధాన సూత్రధారులైన యాసిన్, తబ్రేజ్‌లను గత నెల 28న భారత్-నేపాల్ సరిహద్దులో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. భత్కల్ను హైదరాబాద్ అధికారుల కస్టడీకి ఇవ్వడానికి ఢిల్లీ కోర్టు అనుమతించింది. దాంతో హైదరాబాద్ ఎన్ఐఏ అధికారులు భత్కల్ను విచారిస్తున్నారు. ఫిబ్రవరి 21న జరిగిన దిల్సుఖ్నగర్ జంట బాంబు పేలుళ్లకు తానే వ్యూహం పన్నినట్లు యాసిన్ భత్కల్ అంగీకరించాడు. గత వారంలో ఎన్ఐఏ అధికారులు భత్కల్ను ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి గోవా తీసుకెళ్లారు. అక్కడ అంజునా, పనాజి సమీపంలోని చింబెల్ అనే మురికివాడలో అతడు నివసించిన ఇళ్లలో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా కొన్ని యాసిడ్ బాటిళ్లు, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. చింబెల్ ఇందిరానగర్ నుంచి విచారణ నిమిత్తం ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, అంజునాలో భత్కల్ అద్దెకు ఉన్న నివాసం నుంచి ఎన్ఐఏ అధికారులు బాంబు తయారీ పరికరాలు స్వాధీనం చేసుకున్నట్టు గోవా సీఎం మనోహర్ పారికర్ చెప్పారు. -
హైదరాబాద్ అధికారుల కస్టడీకి భత్కల్
న్యూఢిల్లీ: దిల్సుఖ్నగర్ పేలుళ్ల కేసు నిందితుడు, నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) సహవ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ను హైదరాబాద్ లోని నేరపరిశోధనా సంస్థ (ఎన్ఐఏ)అధికారుల కస్టడీకి ఇవ్వడానికి ఢిల్లీ కోర్టు అనుమతించింది. హైదరాబాద్ ఎన్ఐఏ అధికారులు భత్కల్ను విచారించనున్నారు. ఢిల్లీ కోర్టు భత్కల్ను రెండురోజులపాటు కస్టడీకి అనుమతించింది. ఫిబ్రవరి 21న జరిగిన దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల ఘటనకు ప్రధాన సూత్రధారులైన యాసిన్, తబ్రేజ్‌లను గత నెల 28న భారత్-నేపాల్ సరిహద్దులో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దిల్సుఖ్నగర్ జంట బాంబు పేలుళ్లకు తానే వ్యూహం పన్నినట్లు యాసిన్ భత్కల్ అంగీకరించాడు. గత వారంలో ఎన్ఐఏ అధికారులు భత్కల్ను ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి గోవా తీసుకెళ్లారు. అక్కడ అంజునా, పనాజి సమీపంలోని చింబెల్ అనే మురికివాడలో అతడు నివసించిన ఇళ్లలో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా కొన్ని యాసిడ్ బాటిళ్లు, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. చింబెల్ ఇందిరానగర్ నుంచి విచారణ నిమిత్తం ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, అంజునాలో భత్కల్ అద్దెకు ఉన్న నివాసం నుంచి ఎన్ఐఏ అధికారులు బాంబు తయారీ పరికరాలు స్వాధీనం చేసుకున్నట్టు గోవా సీఎం మనోహర్ పారికర్ చెప్పారు. చాలామంది నేరస్తులు గోవాను ఆశ్రయంగా ఎంచుకుంటున్నారని, అందువల్ల స్థానికులు తమ ఇళ్లను అద్దెకు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. -
తబ్రేజ్‌కు 15 రోజుల కస్టడీ
సాక్షి, హైదరాబాద్: రాజధాని హైదరాబాద్‌లోని దిల్సుఖ్నగర్ బాంబుపేలుళ్ల కేసులో నిందితుడైన ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది అసదుల్లా అక్తర్ అలియాస్ హాదీ తబ్రేజ్‌ను 15 రోజులపాటు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కస్టడీకి అప్పగిస్తూ నాంపల్లి కోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం నుంచి అక్టోబర్ 4 వరకు తబ్రేజ్‌ను కస్టడీలో విచారించొచ్చని, గడువు ముగిసిన తర్వాత వైద్యుల ధ్రువీకరణపత్రంతో అతన్ని 5న కోర్టులో హాజరుపర్చాలని మొదటి అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి జి.లక్ష్మీపతి తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. తబ్రేజ్‌ను పీటీ వారంట్‌పై ఢిల్లీ నుంచి తీసుకొచ్చిన ఎన్ఐఏ అధికారులు గురువారం కోర్టులో హాజరుపర్చారు. కోర్టు అతనికి అక్టోబర్ 17 వరకు రిమాండ్ విధించింది. అతనికి హైదరాబాద్‌లో ఆశ్రయమిచ్చిందెవరు? నిషేధిత పేలుడు పదార్థాలు ఎక్కడి నుంచి తెచ్చారు? ఇందుకు సహకరించిందెవరు? విధ్వంసం తర్వాత ఎవరి సహాయంతో తప్పించుకున్నారు? తదితర అంశాలపై తబ్రేజ్ నుంచి సమాచారం రాబట్టాల్సి ఉందని, అతన్ని కస్టడీలో విచారించేందుకు అనుమతించాలని ఎన్ఐఏ దాఖలు చేసిన పిటిషన్ మేరకు కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. కోర్టు ఆదేశాలతో తబ్రేజ్‌ను రిమాండ్ నిమిత్తం ఎన్ఐఏ అధికారులు రాత్రి 8.15 గంటలకు చర్లపల్లి జైలుకు తరలించారు. అంతకుముందు ఒక కాన్వాయ్ జైలు వరకు పరిశీలనకు వెళ్లొచ్చింది. తీరా జైలు నిబంధనల ప్రకారం సమయం ముగిసిందని చెప్పి జైలు అధికారులు తబ్రేజ్‌ను వెనక్కి పంపించివేశారు. శుక్రవారం ఉదయం చర్లపల్లి జైలులో హాజరుపరిచిన తరువాతే అతన్ని ఎన్ఐఏ అధికారులు కస్టడీలోకి తీసుకోనున్నారు. తండ్రి వైద్యుడు... కొడుకు ఉగ్రవాది! ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) వ్యవస్థాపకుల్లో ఒకడైన యాసిన్ భత్కల్‌కు కుడి భుజంగా ఎదిగిన తబ్రేజ్ స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని ఆజామ్‌గఢ్. అతనికి జావేద్ అక్తర్, హడ్డీ, షకీర్, డానియల్ అనే మారుపేర్లు కూడా ఉన్నాయి. లక్నోలోని ఇంటిగ్రల్ యూనివర్సిటీ నుంచి బి.ఫార్మసీ పూర్తి చేశాడు. తబ్రేజ్ తండ్రి డాక్టర్ జావేద్ అక్తర్ ప్రముఖ వైద్యుడు. ఎముకల వైద్యు నిపుణుడిగా పేరొందిన అతను గత లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగానూ పోటీ చేశారు. 2008లో ఉద్యోగం కోసమంటూ ఢిల్లీకి వెళ్లిన తబ్రేజ్ తిరిగి ఇంటికి రాలేదని అతడి కుటుంబీకులు చెప్తుంటారు. 2011లో ముంబై పేలుళ్లు, గత ఏడాది ఆగస్టు 1న పుణేలోని జేఎం రోడ్డు పేలుళ్లలో ఇతని పాత్ర స్పష్టం కావడంతో నిఘా వర్గాలు వేట ముమ్మరం చేశాయి. హైదరాబాద్‌లోని దిల్సుఖ్నగర్, అబిడ్స్, బేగంబజార్ తదితర ప్రాంతాల్లో బాంబు పేలుళ్లకు రెక్కీ నిర్వహించిన ఆరోపణలపై ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు గత ఏడాది నలుగురు ఐఎం ఉగ్రవాదుల్ని అరెస్టు చేశారు. వీరిలో నగరంలో నివసించిన మగ్బూల్ కూడా ఒకరు. ఈ కేసు ఢిల్లీ స్పెషల్ సెల్ నుంచి ఎన్ఐఏకు బదిలీ అయింది. -
నాంపల్లి కోర్టులో తబ్రేజ్ ను హాజరుపరిచిన ఎన్ఐఏ
-
నాంపల్లి కోర్టులో తబ్రేజ్ ను హాజరుపరిచిన ఎన్ఐఏ
హైదరాబాద్ : దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు తబ్రేజ్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు గురువారం నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. జంట పేలుళ్లలో నేరుగా పాల్గొన్న తబ్రేజ్ ను ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు తీసుకు వచ్చారు. ఢిల్లీ కోర్టు అనుమతి పొందిన ఎన్ఐఏ అధికారులు ఈరోజు కోర్టు ముందు హాజరు పరిచారు. ఈ కేసులో యాసిన్ ,తబ్రేజ్‌ను ఎన్ఐఏ అధికారులు 15 రోజులు కస్టడీ కోరారు. దేశవ్యాప్తంగా పేలుళ్లకు కుట్ర పన్నిన కేసులో ఎన్ఐఏ ఇప్పటికే భత్కల్, తబ్రేజ్‌ను కస్టడీలోకి తీసుకుని విచారించింది. కాగా దేశంలోని ప్రధాన నగరాల్లో విధ్వంసాలకు ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాద సంస్థ పన్నిన కుట్ర దిల్సుఖ్నగర్ పేలుళ్ల నిందితులు యాసిన్ భత్కల్, తబ్రేజ్‌ల అరెస్టుతో త్రుటిలో తప్పింది. ఈ పేలుళ్లకు ముందు, తర్వాత తబ్రేజ్తోపాటు ఉగ్రవాదులు ఆశ్రయం పొందిన రహస్య ప్రాంతంలో పెద్దసంఖ్యలో బాంబులను పోలీసులు ఇటీవల కనుగొన్న విషయం తెలిసిందే. -
దిల్‌సుఖ్‌నగర్‌లో పేలిన బాంబులు గోవాలో తయారయినవా?
హైదరాబాద్: దిల్సుఖ్నగర్ జంట పేలుళ్లకు వాడిన బాంబులను గోవాలో తయారు చేసినట్లు తెలుస్తోంది. ఎన్ఐఏ సోదాల్లో గోవాలో బాంబుతయారీ ల్యాబ్ ఒకటి బయటపడింది. బాంబుతయారీ పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్టుగా గోవా సీఎం పారిక్కర్ వెల్లడించారు. ఆ ల్యాబ్ దిల్సుఖ్నగర్ జంట పేలుళ్లకు బాధ్యుడైన యాసిన్ భత్కల్‌కు చెందినదిగా అనుమానిస్తున్నారు. దిల్సుఖ్నగర్ జంట బాంబు పేలుళ్లకు తానే వ్యూహం పన్నినట్లు నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహుద్దీన్ అగ్రనేత యాసిన్ భత్కల్ అంగీకరించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లో గత ఫిబ్రవరిలో జరిగిన బాంబు పేలుళ్లతో పాటు దేశవ్యాప్తంగా సుమారు 40 బాంబు పేలుళ్ల కేసులో యాసిన్ భత్కల్ నిందితుడు. వరుస దాడులకు దిగుతూ ప్రభుత్వానికి కంటి మీద కునుకులేకుండా చేసిన భత్కల్ను ఇటీవల భారత్ -నేపాల్ సరిహద్దులో అరెస్ట్ చేశారు. -
త్వరలో హైదరాబాద్‌కు తబ్రేజ్
దిల్సుఖ్నగర్ కేసులో తీసుకురానున్న ఎన్ఐఏ సాక్షి, హైదరాబాద్: దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసులో ప్రిజనర్ ట్రాన్సిట్ వారంట్‌పై ఉగ్రవాది తబ్రేజ్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు హైదరాబాద్‌కు తీసుకురానున్నారు. పేలుళ్లలో నేరుగా పాల్గొన్న తబ్రేజ్‌ను ఇక్కడకు తీసుకు వచ్చేందుకు ఢిల్లీ కోర్టు నుంచి ఎన్ఐఏ అధికారులు అనుమతి పొందారు. ఈనెల 19 లోపు హైదరాబాద్‌కు తీసుకువచ్చి, స్థానిక కోర్టులో హాజరుపరచనున్నారు. కేసులో తబ్రేజ్‌ను ఎన్ఐఏ అధికారులు కస్టడీకి కోరే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా పేలుళ్లకు కుట్ర పన్నిన కేసులో ఎన్ఐఏ ఇప్పటికే తబ్రేజ్‌ను కస్టడీలోకి తీసుకుని విచారించింది. భత్కల్, తబ్రేజ్‌ల అరెస్టుతో తప్పిన భారీ ముప్పు: మంగళూరులో 90 ఐఈడీలు స్వాధీనం దేశంలోని ప్రధాన నగరాల్లో విధ్వంసాలకు ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాద సంస్థ పన్నిన కుట్ర దిల్సుఖ్నగర్ పేలుళ్ల నిందితులు యాసిన్ భత్కల్, తబ్రేజ్‌ల అరెస్టుతో త్రుటిలో తప్పింది. ఈ పేలుళ్లకు ముందు, తర్వాత తబ్రేజ్తోపాటు ఉగ్రవాదులు ఆశ్రయం పొందిన రహస్య ప్రాంతంలో పెద్దసంఖ్యలో బాంబులను పోలీసులు ఇటీవల కనుగొన్నారు. కర్ణాటక రాష్ట్రం మంగళూరులోని జఫర్ హైట్స్ భవంతి మూడో అంతస్తులో ఎన్ఐఏ అధికారులు దాడులు చేసి పేలుళ్ల కోసం సిద్ధం చేసిన 90 అధునాతన పేలుడు పరికరాలను(ఐఈడీ) స్వాధీనం చేసుకున్నారు. గత నెల 28న భారత్-నేపాల్ సరిహద్దులో యాసిన్, తబ్రేజ్‌లను అరెస్టు చేయడం తెలిసిందే. తబ్రేజ్ వెల్లడించిన సమాచారం ఆధారంగా మంగళూరులోని రహస్య డెన్‌ను ఈ నెల 7న గుర్తించారు. తబ్రేజ్‌ను తీసుకెళ్లి డెన్‌లోని ఐఈడీలను స్వాధీనం చేసుకున్నారు. -
హైదరాబాద్‌కు ఉగ్రవాది అసదుల్లా అక్తర్
హైదరాబాద్ : ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది అసదుల్లా అక్తర్ అలియాస్ తబ్రేజ్‌ను విచారణ కోసం ఎన్ఐఏ హైదరాబాద్ తీసుకొచ్చింది. అసదుల్లా అక్తర్‌ను పీటీ వారెంట్‌పై తీసుకొచ్చిన ఎన్ఐఏ అధికారులు దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసులో విచారిస్తున్నట్లు సమాచారం. దిల్సుఖ్నగర్ జంట పేలుళ్లకు ముందు అసదుల్లా నివాసమున్న బహదూరుపూరా ఇంట్లో కొన్ని బాంబులు కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. పేలుళ్లలో 17 మంది ప్రాణాలు తీయడంతో పాటు 119 మంది గాయాలకు కారణమైన జంట పేలుళ్లపై మలక్‌పేట (146/2013), సరూర్‌నగర్ (56/2003) పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. యాసిన్, తబ్రేజ్‌లు స్వయంగా దిల్‌సుఖ్‌నగర్‌లో బాంబులు పెట్టినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో నిర్ధారణైంది. రెగ్జిన్ బ్యాగ్‌ను వీపునకు తగిలించుకుని 107 బస్టాప్‌లో సైకిల్‌కు యాసిన్భత్కల్ బాంబు పెట్టినట్లు సీసీ కెమెరాల వీడియో దృశ్యాల ద్వారా గుర్తించారు. ఈ కేసులో యాసిన్ భత్కల్‌కు సహాయంగా తహసీన్ అక్తర్ అలియాస్ హసన్ కూడా ఉన్నట్లు బయటపడింది. కోణార్క్ థియేటర్ సమీపంలోని టిఫిన్ సెంటర్ వద్ద అసదుల్లా అక్తర్ సైకిల్ బాంబును అమర్చినట్లు తేలింది. బాంబును అమర్చిన సైకిల్‌ను తబ్రేజ్ తోసుకుంటూ వెళ్లిన దృశ్యాలు రోడ్డు మీద ట్రాఫిక్ పరిశీలన కోసం ఏర్పాటుచేసిన సీసీ కెమేరా ద్వారా గుర్తించారు. -
హైదరాబాద్‌కు ఉగ్రవాది అసదుల్లా అక్తర్
-
మంగళూరులో మూలాలు
దిల్సుఖ్నగర్ పేలుళ్లపై కీలక ఆధారాలు సంపాదించిన ఎన్ఐఏ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని దిల్‌సుఖ్‌నగర్‌లో జంట పేలుళ్లకు పాల్పడిన ఉగ్రవాదులు కర్ణాటకలోని మంగళూరులో ఆశ్రయం పొందినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) విచారణలో బయటపడింది. ఆ పేలుళ్లకు ముందు అక్తర్ అలియాస్ తబ్రేజ్ మరో ఉగ్రవాది వకాస్ అలియాస్ అహ్మద్ మంగళూరు నుంచి పలుమార్లు హైదరాబాద్‌కు వచ్చివెళ్లినట్లు తేలింది. వారు ఆశ్రయం పొందిన మంగళూరు పట్టణం జఫర్ హైట్స్‌లోని ఫ్లాటును ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. తమ కస్టడీలో ఉన్న తబ్రేజ్‌ను ఆ ఫ్లాట్‌కు తీసుకువెళ్లి సోదాలు చేశారు. ఆ ఫ్లాటులో బాంబుల్లో టైమర్లుగా ఉపయోగించే 50 డిజిటల్ వాచీలు, కొన్ని సెల్ఫోన్లు, ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, కొంత అమ్మోనియం నైట్రేట్, మండే స్వభావం కలిగిన ఆయిల్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఫిబ్రవరి 21న జరిగిన దిల్సుఖ్నగర్ పేలుళ్ల అనంతరం మంగళూరుకు వెళ్లిన తబ్రేజ్, వకాస్ మార్చి నెల వరకు కూడా అదే ఫ్లాట్‌లో ఉన్నట్లు విచారణలో బయటపడింది. ఆ తరువాతే దేశం వదిలివెళ్లినట్లు పోలీసుల విచారణలో తబ్రేజ్ వెల్లడించినట్లు సమాచారం. కోణార్క్ థియేటర్ సమీపంలోని టిఫిన్ సెంటర్ వద్ద తబ్రేజ్ సైకిల్ బాంబు పెట్టాడు. మరో ఉగ్రవాది వకాస్ ఆయనకు సహాయంగా ఆ ప్రాంతానికి వచ్చినట్లు పోలీసులు ఇప్పటికే గుర్తించారు. వెంకటాద్రి థియేటర్ ఎదురుగా ఉన్న బస్టాప్‌లో యాసిన్ భత్కల్ బాంబు పెట్టగా.. అతనికి సహాయంగా తహసీన్ అక్తర్ అలియాస్ హసన్ ఉన్నట్లు విచారణలో తేలింది. కర్ణాటకలో యాసిన్ భత్కల్ను గుర్తించే అవకాశం ఎక్కువగా ఉండటంతో అతను మాత్రం హైదరాబాద్‌లోనే ఆశ్రయం పొంది నట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. యాసిన్ భత్కల్, హసన్ హైదరాబాద్‌లోనే మకాం వేసి పేలుళ్లకు అవసరమైన బాంబులను తయారుచేసినట్లు గుర్తించారు. దిల్సుఖ్నగర్ పేలుళ్లకు వారం ముందు నుంచే నగరంలో మకాం వేసిన భత్కల్, హసన్ పేలుళ్లు జరిగిన మరుసటి రోజు ఇక్కడి నుంచి వెళ్లినట్లు బయటపడింది. అయితే, యాసిన్భత్కల్ ఎక్కడ ఆశ్ర యం పొందాడు? పేలుళ్లకు ఉపయోగించిన సైకిళ్లను ఎక్కడి నుంచి సేకరించాడు? స్థానికంగా సహకరించిన మాడ్యూల్ ఏమిటి? అనే అంశాలను ఎన్ఐఏ అధికారులు శోధిస్తున్నారు. దేశవ్యాప్తంగా వంద పేలుళ్లకు కుట్ర! కరాచీ ఆపరేషన్ పేరుతో దేశవ్యాప్తంగా వంద భారీ పేలుళ్లు జరిపేందుకు కుట్ర పన్నినట్లు ఎన్ఐఏ విచారణలో యాసిన్ భత్కల్ వెల్లడించినట్లు సమాచారం. పాకిస్థాన్ సహకారంతో 2008 నుంచి ఇప్పటివరకు 44 పేలుళ్లకు పాల్పడ్డామని, మిగతా పేలుళ్లు కూడా ఎక్కడెక్కడ జరపాలనేదానిపై ఒక ప్రణాళిక రూపొందించుకున్నామని చెప్పినట్లు తెలిసింది. ఆ పేలుళ్ల కోసం పేలుడు పదార్థాలను కూడా సమీకరించామని భత్కల్ చెప్పాడు. దిల్సుఖ్నగర్ పేలుళ్ల తర్వాత మరిన్ని పేలుళ్ల కోసం మంగళూరులోని అపార్ట్మెంట్లో పేలుడు పదార్థాలను సమకూర్చుకున్నట్లు వెల్లడించాడు. అయితే, హైదరాబాద్ సహా పలు పట్టణాల్లో వరుస పేలుళ్లకు కుట్ర చేసిన విషయాలన్నీ యాసిన్ భత్కల్ నుంచి ఒక్కొక్కటిగా దర్యాప్తు అధికారులు రాబడుతున్నారు. -
బాంబులు పెట్టింది నేనే
హైదరాబాద్/న్యూఢిల్లీ: బాంబులతో దారుణ మారణకాండకు పాల్పడి, హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో 17 మంది అమాయకులను పొట్టనబెట్టుకున్నది తానేనని ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది యాసిన్ భత్కల్ అంగీకరించాడు. ఆ ఘటనలో వాడిన బాంబులను తయారు చేయడంతో పాటు, తానే స్వయంగా అమర్చానని భత్కల్ పోలీసుల విచారణలో వెల్లడించినట్లు సమాచారం. 2008 నుంచి దేశవ్యాప్తంగా జరిగిన వివిధ పేలుళ్లకు పాల్పడింది కూడా తానేనని అంగీకరించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో బాంబు పేలుళ్లకు పాల్పడాల్సిందిగా పాకిస్థాన్‌లో ఉన్నవారి నుంచి తనకు ఆదేశాలు అందినట్లు చెప్పాడు. ఫిబ్రవరి 21న హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన జంట బాంబు పేలుళ్లలో 17 మంది మరణించగా.. 100 మందికి పైగా తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ పేలుళ్లకు పాల్పడ్డ భత్కల్ను భారత్-నేపాల్ సరిహద్దుల్లో పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం భత్కల్‌తో పాటు మరో ఉగ్రవాది తబ్రేజ్‌ను బీహార్ పోలీసులు, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), నిఘా సంస్థల సిబ్బంది విచారించారు. ఆ విచారణలో ‘దిల్సుఖ్నగర్ పేలుళ్లకు ఎలా రెక్కీ నిర్వహించిందీ? బాంబులను తయారుచేసి స్వయంగా ఎలా పేలుళ్లకూ పాల్పడిందీ?’ తదితర విషయాలను భత్కల్ వెల్లడించినట్లు తెలుస్తోంది. దిల్సుఖ్నగర్ పేలుళ్ల ప్రాంతాన్ని, అక్కడి ఆధారాలను పరిశీలించిన రాష్ర్ట ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నిపుణులు అప్పట్లోనే పలు కీలక విషయాలను వెల్లడించారు. రెండు బాంబులూ స్థానికంగానే తయారయ్యాయని, నిపుణులే వాటిని తయారుచేసి ఉంటారని కూడా గుర్తించారు. బాంబుల తయారీకి ఉపయోగించిన పదార్థాలన్నీ స్థానికంగా సేకరించుకున్నట్లు కూడా తేలింది. అత్యంత నైపుణ్యంతో ఎక్కువ నష్టం కలిగించేలా ఆ బాంబులను రూపొందించారు. అయితే.. ఆ బాంబుల తయారీకి పేలుడు పదార్థాల సేకరణలో స్థానికంగా భత్కల్‌కు ఎవరు సహకరించారు? భత్కల్ హైదరాబాద్‌లో ఎక్కడ షెల్టర్ తీసుకున్నాడు? తదితర విషయాలు భత్కల్ను ఎన్ఐఏ కస్టడీలోకి తీసుకుని విచారిస్తే వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. యాసిన్ భత్కల్ అరెస్టు సమయంలో రెండు ల్యాప్‌టాప్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈమెయిళ్ల డీకోడింగ్ తలనొప్పే పేలుళ్ల సమయంలో మాత్రమే బినామీ అడ్రస్‌ల ద్వారా తీసుకున్న సిమ్‌కార్డులతో సెల్ఫోన్లు ఉపయోగించే భత్కల్.. సాధారణ సమయంలో తన మాడ్యుల్‌తో ఈ-మెయిళ్ల ద్వారానే సంబంధాలు నెరిపేవాడని తేలింది. హైదరాబాద్‌లోని కొందరితో కూడా ఈ-మెయిళ్ల ద్వారానే సంప్రదింపులు జరిపినట్లు భత్కల్ అంగీకరించినట్లు తెలిసింది. కానీ, ‘కోడ్’ల రూపంలో ఉన్న ఆ మెయిళ్లను ‘డీకోడ్’ చేయడం అధికారులకు సమస్యగా మారినట్లు సమాచారం. ‘డీకోడ్’ చేయగలిగితే దిల్సుఖ్నగర్ పేలుళ్లకు సహకరించిన స్థానికులెవరనేది గుర్తించడం సాధ్యమవుతుందని అంటున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా జరిగిన పలు పేలుళ్లకు తానే బాంబులను తయారు చేసినట్లు కూడా భత్కల్ బీహార్ పోలీసుల విచారణలో అంగీకరించినట్లు తెలిసింది. బాంబుల నమూనాలు, ఆకారాల్లో మార్పులు చేస్తూ అధికారులను బురిడీ కొట్టించానన్నాడు. బాంబుల తయారీలో వంద మంది యువకులకు శిక్షణ ఇచ్చాననీ భత్కల్ వెల్లడించినట్లు సమాచారం. నేపాల్ ద్వారానే.. భారత్-నేపాల్‌ల మధ్య వీసా అవసరం లేకుం డా సులువుగా ప్రయాణించగల అవకాశాన్ని తాము ఉపయోగించుకున్నట్లు భత్కల్ చెప్పాడు. ఇరు దేశాల మధ్య తనతో పాటు మరో ఉగ్రవాది అసదుల్లా అక్తర్ తరచూ ప్రయాణించేవారమన్నాడు. తన సోదరులు ఇక్బాల్, రియాజ్ భత్కల్‌లు ఇండియాకు వచ్చేవారు కాదని, ఇక్బాల్ మాత్రం నేపాల్‌కు వచ్చే వాడనీ చెప్పాడు. అక్కడి నుంచి పాకిస్థాన్‌లోని వారితో శాటిలైట్ ఫోన్లద్వారా మాట్లాడేవారమన్నాడు.అంతేగాకుండా దేశవ్యాప్తంగా ఉగ్రదాడుల కోసం బీహార్ యువకులను పెద్ద సంఖ్యలో ఇండియన్ ముజాహిదీన్‌లో చేర్చినట్లు భత్కల్ చెప్పారని సమాచారం. అందుకే పాత సైకిళ్లు... దిల్సుఖ్నగర్ పేలుళ్లకు, 2010 పుణెలో జర్మన్ బేకరీ పేలుళ్లకూ సైకిళ్లనే ఉపయోగించినప్పటికీ.. కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు భత్కల్ చెప్పినట్లు తెలిసింది. పుణె పేలుళ్లలో కొత్త సైకిళ్లను వాడటంతో ఛాసిన్ నంబరు ఆధారంగా వాటిని కొనుగోలు చేసినవారిని దర్యాప్తు అధికారులు గుర్తిం చారు. అందువల్ల దిల్సుఖ్నగర్ పేలుళ్లకు మాత్రం రెండూ పాత సైకిళ్లనే ఉపయోగించామన్నాడు. దిల్సుఖ్నగర్ పేలు ళ్ల తర్వాత అధికారులు రెండు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నప్పటికీ బాగా పాతవి కావడంతో అవి ఎక్కడివి? ఎవరు కొనుగోలుచేశారు? అనేవి గుర్తించలేకపోయారు. -
యాసిన్ భత్కల్ చిక్కాడు
ఇంటెలిజెన్స్ వలలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది భారత్-నేపాల్ సరిహద్దులో అరెస్టు చేసిన బీహార్ పోలీసులు దేశవ్యాప్తంగా 40 బాంబు పేలుళ్ల కేసుల్లో నిందితుడు దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల సూత్రధారి, పాత్రధారి ఇతనే వెంకటాద్రి థియేటర్ ఎదురుగా 107 బస్‌స్టాప్‌లో స్వయంగా బాంబులు పెట్టిన యాసిన్ ఇదే కేసులో మరో నిందితుడు తబ్రేజ్ కూడా అరెస్టు సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ/పాట్నా: రాష్ర్ట రాజధాని హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లో గత ఫిబ్రవరిలో జరిగిన బాంబు పేలుళ్లతో పాటు దేశవ్యాప్తంగా సుమారు 40 బాంబు పేలుళ్ల కేసులో నిందితుడైన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది యాసిన్ భత్కల్ ఎట్టకేలకు ఇంటెలిజెన్స్ అధికారులకు చిక్కాడు. భారత్-నేపాల్ సరిహద్దుల్లో బీహార్ పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) అగ్రనేత అయిన యాసిన్‌పై రూ.35 లక్షల రివార్డు ఉంది. పలుమార్లు దొరికినట్టే దొరికి చాకచక్యంగా తప్పించుకు తిరుగుతున్న ఇతని కోసం గత ఐదేళ్లుగా గాలింపు కొనసాగుతోంది. ఇతనితో పాటు దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో మరో నిందితుడైన అసదుల్లా అక్తర్ అలియాస్ తబ్రేజ్ అలియాస్ ‘హడ్డి’ని కూడా బీహార్ పోలీసులు అరెస్టు చేశారు. వీరిని శుక్రవారం ప్రత్యేక విమానంలో ఢిల్లీ తీసుకువచ్చి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులకు అప్పగించనున్నారు. బీహార్‌లోని మోతిహరి మేజిస్ట్రేట్ వీరిని మూడురోజుల ట్రాన్సిట్ రిమాండ్‌కు అనుమతించారు. ఇద్దరు కరుడుగట్టిన ఉగ్రవాదుల అరెస్టును కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే ధ్రువీకరించారు. ‘బుధవారం రాత్రి భారత్-నేపాల్ సరిహద్దులో ఉన్న యాసిన్ భత్కల్ను ఇంటెలిజెన్స్ సంస్థలు గుర్తించాయి. ప్రస్తుతం బీహార్ పోలీసుల అదుపులో ఉన్న అతన్ని అధికారులు ప్రశ్నిస్తున్నారు..’ అని షిండే గురువారం పార్లమెంటు వెలుపల విలేకరులకు చెప్పారు. యాసిన్ పట్టుబడిన విషయం జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్ ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ దృష్టికి తీసుకెళ్లారు. పాకిస్థాన్ నుంచి నేపాల్ మీదుగా బంగ్లాదేశ్ వెళ్లి తన సంబంధీకులను కలుసుకోవాలని యాసిన్ ప్రయత్నించాడని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పాట్నాకు 100 కిలోమీటర్ల దూరంలోని భారత్-నేపాల్ సరిహద్దులో తూర్పుచంపారన్ జిల్లా రక్సువల్ సబ్ డివిజన్లోని నహర్ చౌక్ సమీపంలో యాసిన్‌ను, తబ్రేజ్‌ను అరెస్టు చేసినట్లు బీహార్ అదనపు డీజీపీ రవీంద్రకుమార్ పాట్నాలో విలేకరులకు చెప్పారు. యాసిన్ మరో పేలుడుకు కుట్ర చేస్తున్నట్టుగా సమాచారం ఉందన్నారు. లష్కరే తోయిబా ఉగ్ర సంస్థ మాస్టర్‌మైండ్, బాంబుల నిపుణుడిగా భావించే అబ్దుల్ కరీమ్ తుండా పట్టుబడిన పక్షం రోజులకే యాసిన్ భత్కల్ సైతం చిక్కడం అనేక బాంబు పేలుళ్ల కేసుల దర్యాప్తులో కీలకమలుపు కాగలదని భావిస్తున్నారు. ముప్పై ఏళ్ల యాసిన్ ఆచూకీ తెలిపిన వారికి ఢిల్లీ ప్రభుత్వం, ఎన్ఐఏలు రూ.10 లక్షల చొప్పున, ముంబయి పోలీసులు రూ.15 లక్షలు రివార్డు ప్రకటించారు. -
‘ఉగ్ర’ భత్కల్‌కు ఉరే సరి
భిక్కనూరు, న్యూస్‌లైన్ : దిల్సుఖ్నగర్ జంట పేలుళ్లలో ప్రధాన పాత్రధారి ఉగ్రవాది యాసిన్ భత్కల్‌కు బహిరంగ ఉరే సరి అని ఆ పేలుళ్లలో గాయపడి కాలును కోల్పోయిన భిక్కనూరు మండలం శివాయిపల్లి గ్రామస్తురాలు రజిత అన్నారు. గురువారం యాసిన్ భత్కల్ను ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేయడంపై ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు. కసబ్‌ను యేళ్ల కొద్దీ జైల్లో పెట్టినట్లు భత్కల్ను జైల్లో పెట్టకుండా ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి విచారణ పూర్తి చేసి ఉరి తీయాల న్నారు. ఆరు నెలలుగా తాను, తన కుటుంబం ఎన్నో అవస్థలకు గురవుతున్నామని, ఇకముందు దేశంలో ఎక్కడా కూడా ఉగ్రవాద చర్యలు జరుగకుండా భత్కల్ను కఠినంగా శిక్షించాలన్నారు. -
ఉగ్రవాది యాసిన్ భత్కల్ అరెస్ట్
-
మోస్ట్ వాంటెడ్ తీవ్రవాది యాసిన్ భత్కల్ అరెస్ట్
ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిద్దీన్ సహ వ్యవస్థాపకుడు, మోస్ట్ వాంటెడ్ తీవ్రవాది యాసిన్ భత్కల్(30) ఎట్టకేలకు పట్టుబడ్డాడు. నేపాల్ సరిహద్దులో అతన్ని అరెస్ట్ చేసినట్ట్టు సమాచారం. ఢిల్లీ, కర్ణాటక పోలీసుల జాయింట్ ఆపరేషన్‌లో అతడు పట్టుబడ్డాడు. అతడిని ఎక్కడికి తరలించాలనే దానిపై ఇంటెలిజెన్స్ అండ్ లా ఎన్ఫోర్స్మెంట్ సంస్థలు నిర్ణయం తీసుకోనున్నాయి. మనదేశంలో జరిగిన పలు బాంబు పేలుళ్లలో భత్కల్ ప్రధాన నిందితుడు.మన రాష్ట్రంలో హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన జంటపేలుళ్లలో భత్కల్ కీలక సూత్రధారి. గోకుల్ ఛాట్, లుంబినీపార్క్ బాంబు పేలుళ్ల వెనుక కూడా ఇతడి హస్తం ఉన్నట్టు అనుమానిస్తున్నారు. భత్కల్ తలపై ప్రభుత్వం పది లక్షల రూపాయల రివార్డు ప్రకటించింది. 2010లో పుణెలో జర్మన్ బేకరీ, బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో భత్కల్ ప్రధాన నిందితుడు. కర్ణాటక చెందిన యాసిన్ భత్కల్ తన సోదరుడు రియాజ్, అబ్దుల్ సుబాన్ ఖురేషీతో కలిసి 2008లో ఇండియన్ ముజాహిద్దీన్ స్థాపించాడు. పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే ఇ తోయిబా అండదండలతో పనిచేస్తున్నట్టు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) భావిస్తోంది. -
దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో పురోగతి