తీహార్ జైలుకు ‘దిల్‌సుఖ్‌నగర్’ దోషులు
ఉరిశిక్ష పడిన ఉగ్రవాదుల తరలింపునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి
సాక్షి, హైదరాబాద్: దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల దోషులను ఢిల్లీలోని తీహార్ జైలుకు తరలించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. 2014లో పేలుళ్ల అనంతరం ఈ ఐదుగురు ఉగ్రవాదు లను విచారించేందుకు నేషనల్ ఇన్వె స్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) హైదరాబాద్ రేంజ్ అధికారులు పీటీ వారెం ట్‌పై రాష్ట్రానికి తీసుకువచ్చారు. పే లుళ్ల కేసు విచారణ పూర్తయ్యే వరకు ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు న్యాయశాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇటీవల ఈ కేసులో ఐదుగురు ఉగ్రవాదులను దోషులుగా నిర్ధారించిన ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానం.. వారికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. హైదరాబాద్‌లో విచారణ పూర్తయినందున ఈ ఐదుగురి ని తాము విచారించాల్సి ఉందని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అక్కడి న్యాయస్థానంలో పీటీ వారెంట్ పొందారు.
అంతేకాకుండా నిందితులను దర్యాప్తు అధికారులు పీటీ వారెంట్‌పై తీసుకొస్తే తిరిగి అప్పగించాల్సి ఉంటుంది. ఈ మేరకు వీరిని తీహార్ జైలుకు తరలిం చాలని విజ్ఞప్తి చేయగా.. రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. దీనిపై ఇప్పటికే రాష్ట్ర హోంశాఖ, డీజీపీ కి జైళ్ల శాఖ డీజీ లేఖలు రాశారు. 4 రోజుల్లోగా ఈ ఐదుగురిని తీహార్ జైలు కు తరలించేందుకు చర్యలు చేపడుతు న్నామని.. ఇందుకు భద్రతా చర్యలు తీసుకోవాలని అందులో కోరారు. ఈ ఐదుగురు ఉగ్రవాదులను వచ్చే వారం విమానంలో ఢిల్లీకి తరలించనున్నట్లు సమాచా రం. వారిని ఢిల్లీ స్పెషల్ పోలీసులు, అనంతరం మహా రాష్ట్రలోని థానే పోలీసులు విచారించనున్నారు. బెంగ ళూర్, పుణె, కోల్‌కతా, అహ్మదాబాద్, బిహార్, జైపూర్ పేలుళ్ల కేసులోనూ ఈ ఉగ్రవాదులే నిందితులుగా ఉండటంతో అక్కడి పోలీసులు సైతం విచారించేందుకు ప్రయత్నిస్తు న్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి.