దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్లలో ప్రధాన పాత్రధారి ఉగ్రవాది యాసిన్ భత్కల్‌కు బహిరంగ ఉరే సరి అని ఆ పేలుళ్లలో గాయపడి కాలును కోల్పోయిన భిక్కనూరు మండలం శివాయిపల్లి గ్రామస్తురాలు రజిత అన్నారు
భిక్కనూరు, న్యూస్‌లైన్ : దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్లలో ప్రధాన పాత్రధారి ఉగ్రవాది యాసిన్ భత్కల్‌కు బహిరంగ ఉరే సరి అని ఆ పేలుళ్లలో గాయపడి కాలును కోల్పోయిన భిక్కనూరు మండలం శివాయిపల్లి గ్రామస్తురాలు రజిత అన్నారు. గురువారం యాసిన్ భత్కల్‌ను ఎన్‌ఐఏ అధికారులు అరెస్టు చేయడంపై ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు. కసబ్‌ను యేళ్ల కొద్దీ జైల్లో పెట్టినట్లు భత్కల్‌ను జైల్లో పెట్టకుండా ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి విచారణ పూర్తి చేసి ఉరి తీయాల న్నారు. ఆరు నెలలుగా తాను, తన కుటుంబం ఎన్నో అవస్థలకు గురవుతున్నామని, ఇకముందు దేశంలో ఎక్కడా కూడా ఉగ్రవాద చర్యలు జరుగకుండా భత్కల్‌ను కఠినంగా శిక్షించాలన్నారు.