Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Kadapa Court Shock For Sharmila And Sunita
కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: పీసీసీ చీఫ్‌ షర్మిల, సునీతలకు కడప కోర్టు మరోమారు షాక్ ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య కేసు ప్రస్తావించరాదన్న కడప కోర్టు జారీ చేసిన అర్డర్‌ను డిస్మిస్ చేయాలంటూ సునీత వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఇటీవల హైకోర్టులో సునీత పిటిషన్ దాఖలు చేయగా, కడప కోర్టులోనే తేల్చుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది.హైకోర్టు ఆదేశాల మేరకు కడప కోర్టు విచారణ చేపట్టింది. ఇరువురి వాదనలు విన్న కోర్టు.. సునీత, షర్మిల దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. తప్పుడు సమాచారంతో పిటిషన్ వేశారంటూ సునీత, షర్మిలకు రూ.10 వేల జరిమానాను ర్టు విధించింది. జరిమానాను జిల్లా లీగల్ సెల్‌కు కట్టాలని కడప కోర్టు పేర్కొంది.

CM Jagan Election Campaign Meetings Schedule On May 9th
సీఎం జగన్‌ రేపటి ప్రచార సభల షెడ్యూల్‌ ఇలా..

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు (గురువారం) మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. సీఎం జగన్‌ ఎన్నికల ప్రచార సభల మే 9 వ తేదీ షెడ్యూల్‌ను వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ బుధవారం విడుదల చేశారు.సీఎం జగన్‌.. గురువారం ఉదయం 10 గంటలకు  కర్నూలు పార్లమెంట్ పరిధిలోని  కర్నూలు సిటీ  వై ఎస్సార్ సర్కిల్‌లోని ఎస్‌వీ కాంప్లెక్స్ రోడ్డులో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు అనంతపురం  పార్లమెంట్ పరిధిలోని కళ్యాణ దుర్గం నియోజకవర్గం కొల్లపురమ్మ టెంపుల్ రోడ్డులో  జరిగే సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు రాజంపేట   పార్లమెంట్ పరిధిలో రాజంపేట  నియోజకవర్గంలో కోడూరు రోడ్డులో జరిగే ప్రచార సభలో సీఎం పాల్గొంటారు.

Sam Pitroda Resigns From Congress Party
కాంగ్రెస్‌కు శామ్‌ పిట్రోడా రాజీనామా

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీకి శామ్‌ పిట్రోడా బుధవారం(మే8) సాయంత్రం రాజీనామా చేశారు. పిట్రోడా రాజీనామా చేసిన వెంటనే పార్టీ దానిని ఆమోదించింది. భారత్‌లోని వివిధ ప్రాంతాల వారి శరీర రంగులపై పిట్రోడా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ముఖ్యంగా దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లలా  ఉంటారనడంపై దుమారం రేగింది. పిట్రోడా వ్యాఖ్యలతో తమ పార్టీకి సంబంధం లేదని కాంగ్రెస్‌ ఇప్పటికే ప్రకటించింది. పిట్రోడా వ్యాఖ్యలను ప్రధాని మోదీ కూడా ఎన్నికల ప్రచార సభలో ప్రస్తావించడంతో వివాదం  పెద్ద దైంది. మొత్తం వ్యవహారం పిట్రోడా రాజీనామాతో క్లైమాక్స్‌కు చేరింది.  

YS Avinash Reddy Strong Political Counter To Sunitha And Sharmila
మా అక్కలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా నిలబడతా: వైఎస్‌ అవినాష్‌

సాక్షి, వైఎస్సార్‌: టీడీపీ అధినేత చంద్రబాబు కుట్రలో సునీత, షర్మిల పావులుగా మారారు. వీరితో పోరాడే శక్తిని ప్రజలే నాకు ఇస్తారని అన్నారు వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి. ప్రతీరోజు నన్ను తిట్టడమే పనిగా పెట్టుకుని పచ్చ మీడియాకు వత్తాసు పలుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.కాగా, వైఎస్‌ అవినాష్‌ రెడ్డి బుధవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినాష్‌ రెడ్డి మాట్లాడుతూ.. 2021 తర్వాత చంద్రబాబు కుట్రలో సునీత, షర్మిల పావులుగా మారారు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు నోటికి ఎంత మాట వస్తే అంత వరకు తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. వాళ్లు అలా మాట్లాడుతుంటే కోపం కంటే ఎక్కువగా బాధేస్తోంది. వాళ్లే నన్ను టార్గెట్‌ చేస్తున్నారు.రెండున్నరేళ్లు ఎవరూ మాట్లాడలేదు. వాచ్‌మెన్‌ రంగన్నకు నార్కో అనాలసిస్‌ టెస్ట్‌ చేసినా ఏమీ మాట్లాడలేదు. రెండున్నరేళ్ల తర్వాత రంగన్న మాట్లాడుతున్నాడు. ఓవైపు తానే చంపానని చెబుతున్న దస్తగిరి గురించి వీరద్దరూ ఏమీ అనడం లేదు. అతను ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసి బయట తిరుగుతున్నాడు. అన్నీ తప్పుడు వాంగ్మూలాలు, తప్పుడు మాటలు చెబుతున్నారు.వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి అందరికీ అందుబాటులో ఉండి ఏ పని కావాలన్నా చేసే వ్యక్తి. అలాంటి వ్యక్తిని జైల్లో పెట్టించారు. నా తప్పు లేకపోయినా నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా గట్టిగా నిలబడతాం. మీ అందరి మద్దతుతో గెలిచి తీరుతాను. ఇప్పుడు తిట్టిన వాళ్లే మళ్లీ క్షమాపణలు చెప్పాలి.. అది నేను వినాలి. వివేకం చిన్నాన్నను చంపిన వాస్తవం వెలుగులోకి వస్తుంది. ఈ కుట్రలు ఎవరో చేశారో తప్పకుండా బయటకు వస్తుంది.దివంగత వైఎస్సార్‌ తాను బ్రతికినంత కాలం.. టీడీపీ, ఈనాడుతో పోరాడారు. అటువంటి వారితో ఇప్పుడు వీరిద్దరూ చేతులు కలిపారు. మీరు వాళ్ల వారసులా.. లేక వైఎస్సార్‌ వారసులా?. నన్ను కనుమరుగు చేయాలంటే దేవుడు ఒప్పుకోడు. మా అక్కలతో పోరాడే శక్తిని ప్రజలే ఇస్తారు. వైఎస్సార్‌సీపీ ఓట్లు చీల్చి టీడీపీకి లబ్ధి చేకూర్చాలనేది షర్మిలకు కాంగ్రెస్‌ పెట్టిన టాస్క్‌. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఎవరిది నాటకమో.. ఎవరు నిజమో ప్రజలే నిర్ణయిస్తారు అని కామెంట్స్‌ చేశారు. 

AP Elections 2024: May 8th Politics Latest News Updates Telugu
May 8th: ఏపీ ఎన్నికల సమాచారం

AP Political And Elections News Updates In Telugu  2:30 PM, May 8th, 2024కుప్పంలో బాబు ఓడిపోతున్నాడు: లక్ష్మి పార్వతి సంఘ విద్రోహులు చంద్రబాబు అండ్ కొఎన్టీఆర్ వెన్నుపోటులో పురందేశ్వరి ప్రధాన పాత్ర పోషించిందినేతి బీరకాయలో నెయ్యి లాంటిది పురందేశ్వరి మంచితనంపురందేశ్వరి కూడా చంద్రబాబు లాంటి మనిషిFIRలో వైఎస్సార్‌ పేరును చేర్చిన కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరడం ఏమిటి..?వీరందరినీ చంద్రబాబు ఆడిస్తున్నారురాజకీయ నీచుడు చంద్రబాబుబాబు కంటే సీఎం జగన్ అధిక పెట్టుబడులు తీసుకొచ్చారుఏపీ అభివృద్ధిలో విశాఖ కీలకంఏం మాట్లాడాలో అర్ధంకాక బాబు ఇచ్చిన స్క్రిప్ట్ మోడీ చదివాడుసీఎం జగన్‌ను గెలిపించాలని ప్రజలు నిర్ణయించుకున్నారుఉత్తరాంధ్ర అభివృద్ధి జరగాలి అంటే సీఎం జగన్ అధికారంలోకి రావాలినేను రాష్ట్రం మొత్తం తిరిగానుగీతం మూర్తి ఎన్టీఆర్ వెన్నుపోటులో కీలక పాత్ర పోషించిన దుర్మార్గుడుగీతం భరత్‌ను ఓడించాలిగీతం అంటేనే భూ కబ్జాలుఏయూను నాశనం చెయ్యాలనే ఉద్దేశంతోనే గీతంను అభివృద్ధి చేశారు.1:50 PM, May 8th, 2024మోదీకి కుటుంబం లేదన్న వ్యక్తి చంద్రబాబు: జోగి రమేష్‌జోగి రమేష్ కామెంట్స్ఎన్డీఏ కూటమి కొత్త కూటమి ఏమి  కాదు .2014లో ఇదే కూటమి జతకట్టింది.కలిసి పోటీ చేయడం ఎందుకు.. విడిపోవడం ఎందుకు..పవన్ వలన మేము గెలవలేదని చంద్రబాబు అన్నాడు.మోడీకి కుటుంబం లేదు అన్న వ్యక్తి బాబు.మేనిఫెస్టోలో ఒక్క పథకం కూడా చంద్రబాబు అమలు చేయలేదు.అందుకే గత ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయారు..కుట్రలతో ఇప్పుడు కూటమి ఏర్పాటు చేశారు.పొత్తులు ముక్కలవడం ఖాయం .అన్నం పెట్టే జగన్న కు ప్రజలు మద్దతుగా ఉన్నారురెండు ఓట్లు ఫ్యాన్ కే వేస్తామని ప్రజలు అంటున్నారు.మంచి చేశాడు కాబట్టే ప్రజల గుండెల్లో జగన్ ఉన్నారు 1:30 PM, May 8th, 2024టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలి: తానేటి వనితటీడీపీ నేతల రౌడీయిజంపై చర్యలు తీసుకోవాలిటీడీపీ నేతల దాడులు నశించాలిప్రజాస్వామ్యం పరిరక్షించాలినేనున్న ఇంటిపై దాడి చేయాల్సిన అవసరం ఏమి వచ్చింది?ఎవరు ఎంత రెచ్చగొట్టినా కార్యకర్తలు రెచ్చిపోవద్దుప్రజల్లో మనం ఉన్నాము సర్వేలు బాగున్నాయిప్రజలంతా కూడా జగనన్న పరిపాలనకు ముక్తులై.. మనకే ఓటేయాలని ఎదురుచూస్తున్నారుటీడీపీ కార్యకర్తలు రౌడీ రాజకీయాలు, గూండా రాజకీయాలు చేస్తున్నారుభౌతికంగా దాడులు చేసి.. మనం చేసినట్టు లైవ్‌లు పెట్టారు.గోపాలపురం నియోజకవర్గంలో ఒక రెడ్ బుక్ ఉందని అంటున్నారు.ఒక్కసారి కూడా ఎన్నిక కాని వారు గూండా రాజకీయాలు చేస్తున్నారురాత్రి జరిగిన దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసామునేనేమీ వారికి ఛాలెంజ్‌లు కూడా చేయలేదుమా నాయకుడు చేసిన మంచే మాట్లాడాను.జగనన్న నాకు హోం మంత్రి పదవి ఇచ్చారుజగనన్న నాకు రాజ్యాధికారం ఇచ్చారుదళితలమైన నాపై దాడులు చేస్తూ కించపరిచేలా అసభ్యకరంగా మాట్లాడుతున్నారుఈరోజు నాపై దాడి చేశారు అధికారం లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి?నోటికి వచ్చిన వాగ్దానాలు ఇస్తున్నారు.చట్టం ఎవరికీ చుట్టం కాదు.ప్రతీ కార్యకర్త ఎలక్షన్‌పై దృష్టి పెట్టాలి. 12:30 PM, May 8th, 2024చంద్రబాబుపై ఎమ్మెల్సీ రుహుల్లా ఫైర్‌మైనార్టీల 4% రిజర్వేషన్ గురించి మోదీతో మాట్లాడే దమ్ము చంద్రబాబుకు ఉందా?.విజయవాడ పర్యటనలో మోదీతో చంద్రబాబు మైనార్టీల గురించి మాట్లాడించాలి.హజ్ యాత్రకు వెళ్లే మైనార్టీలను సీఎం జగన్ ఆర్థికంగా అందుకున్నారు.గుంటూరులో దళితులపై దేశద్రోహి కేసులు పెట్టిన దుర్మార్గుడు చంద్రబాబు.రాష్ట్రంలో ఉన్న మైనారిటీలు అందరూ ఈ విషయంపై ఆలోచించాలి.మైనారిటీలను ఓట్ల కోసం వాడుకుంది చంద్రబాబు నాయుడురాష్ట్రంలో మైనార్టీలు అంటే చంద్రబాబు, బీజేపీకి చిన్న చూపు.సీఎం జగన్ మైనార్టీలకు అభివృద్ది చేశారుమైనార్టీల ద్రోహి చంద్రబాబు నాయుడుమైనార్టీలకు ద్రోహం చేయడానికి చంద్రబాబు మోదీతో జత కట్టారు 12:00 PM, May 8th, 2024పవన్‌పై ముద్రగడ సంచలన కామెంట్స్‌పవన్ కళ్యాణ్ నిఖార్సైన కాపో కాదో లోకానికి తెలియాలినేను నిఖార్సైన కాపు‌ని.. నా కుటుంబం కూడా స్వచ్చమైన కాపు కుటుంబంపవన్ కుటుంబం స్వచ్చమైన కాపు ఐతే చరిత్ర బయట పెట్టమనండి.మాటి మాటికీ కాపు ముసుగులో ఉండి కాపులకు సాయం చేయ్యరా అని అడుగుతున్నావ్.మా వంగా గీతా కాపు  కాదా?కొందరు దుష్టుల వల్ల నా కూతురు దూరమైపోయిందిమళ్ళీ వచ్చే జన్మలోనే కలుసుకుందాం 11:30 AM, May 8th, 2024అభివృద్ధి అంటే జగనే: దేవినేని అవినాష్ప్రతీ గడపలో జగన్  ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారుఅభివృద్ధి లేదు అంటున్న టీడీపీ నేతలు మూడో డివిజన్‌లో పర్యటించాలిఐదేళల్లో జగన్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి చూసి ఓటు వేయమని కోరుతున్నాంఈ డివిజన్ మొత్తం సీసీ రోడ్లు వేసిన ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కుతుందిటీడీపీ ఎమ్మెల్యేకు ఈ ప్రాంతం, నియోజకవర్గ అభివృద్ధిపై చిత్త శుద్ధి లేదుఅభివృద్ధి సంక్షేమం చూసి మీ బిడ్డగా ఒక్క అవకాశం ఇవ్వాలిఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి ఆశీర్వదించండి 11:00 AM, May 8th, 2024ఎమ్మెల్యే అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాస్ కామెంట్స్సీఎం జగన్ ప్రభుత్వంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారు.జగనన్న పథకాలపై ఈసీకి ఫిర్యాదుకు చేసి వాటిని ఆపిన దుర్మార్గుడు చంద్రబాబు.చంద్రబాబుకు పేద ప్రజల పట్ల అంత అసూయ ఎందుకు?.ప్రజలను ఇబ్బంది పెట్టడం చంద్రబాబుకు అలవాటే.గతంలో చంద్రబాబు పసుపు కుంకులకు ఎలక్షన్ సమయంలో పర్మిషన్ ఇచ్చారు.ఎలక్షన్ కోడ్ రాకముందు అందించిన సంక్షేమ పథకాలను ఎందుకు ఆపారు.ఎన్నికల కమిషనర్ ఈ విషయాన్ని పున: పరిశీలన చేయాలి.విద్యాదీవెన ఆపిన కారకులు చంద్రబాబు, జనసేన, బీజేపీదుర్మార్గపు ఆలోచనలకు కేరాఫ్ అడ్రస్ వీరి ముగ్గురే.పేద ప్రజలపై కక్ష సాధింపు చర్యలు వద్దు.సీఎం జగన్ పేద ప్రజలకు కవచంలా అండగా ఉంటారు. 10:30 AM, May 8th, 2024బాబుకు ఓటమి భయం పట్టుకుంది: మంత్రి పెద్దిరెడ్డిమంత్రి పెద్దిరెడ్డి కామెంట్స్కుప్పంలో చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందిఇందుకే పిచ్చి పట్టినట్లు బాబు మాట్లాడుతున్నారుసీఎం జగన్‌తో పాటు నాపై చంద్రబాబు ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారువేల కోట్లు నేను సంపాదించానని చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటుచంద్రబాబు ఆరోపణలకు రుజువులు ఉన్నాయా?.ఈసారి కుప్పంలో చంద్రబాబును ప్రజలు రాజకీయంగా భూస్థాపితం చేయనున్నారు. 10:00 AM, May 8th, 2024చంద్రబాబుపై మాట మార్చిన మోదీ..నాడు చంద్రబాబు పోలవరాన్ని ఏటీఎం మార్చుకున్నాడని మోదీ వ్యాఖ్యలునేడు చంద్రబాబుపై మోదీ ప్రశంసలు. వెన్నుపోటు, పార్టీలు మార్చడం, తిట్టినవారి చంకనెక్కడంలో బాబు నిపుణుడు.మోదీ కూడా చంద్రబాబులాగే మాట్లాడుతున్నాడు. వచ్చే ఎన్నికల్లో మన ఫ్యాన్‌ గుర్తుకు ఓటువేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించండి.  చంద్రబాబు గురించి గత ఎన్నికల ముందు మోడీ గారు ఏమన్నారో గుర్తుందా? పోలవరాన్ని ఏటీఎంగా మార్చుకున్నాడని, వెన్నుపోట్లు, పార్టీలు మార్చడం, తిట్టినవారి చంకనెక్కడంలో చంద్రబాబు నిపుణుడని, అత్యంత అవినీతిపరుడని చెప్పారు. కానీ ఇప్పుడు అదే మోడీ గారు ఎన్డీయే గూటికి చేరిన చంద్రబాబుని ఇంతకంటే… pic.twitter.com/rSUlLqQzQB— YS Jagan Mohan Reddy (@ysjagan) May 7, 2024 08:45 AM, May 8th, 2024మోదీ, బాబుకు వడ్డే శోభనాద్ధీశ్వర రావు సవాల్ప్రధాని మోదీ, చంద్రబాబుకి మాజీ మంత్రి వడ్డే శోభనాద్ధీశ్వర రావు సవాల్ల్యాండ్ టైటిలింగ్‌ యాక్ట్‌ని రద్దు చేయించగలరా?ల్యాండ్ టైటిలింగ్‌ యాక్ట్ సిఫార్సు చేసింది కేంద్ర ప్రభుత్వమే కదా?.ల్యాండ్ టైటిలింగ్‌ యాక్ట్‌కి అసెంబ్లీలో పయ్యావుల కేశవ్ మద్దతు పలకలేదా?టీడీపీ లోపల మద్దతు పలుకుతూ, పైకి మాటల గాంభీర్యం ప్రకటించడం కరెక్టేనా?ఈటీవీ, అన్నదాతల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనుకూల కథనాలు ప్రసారం చేయడం వాస్తవం కాదా?ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై చంద్రబాబు మోదీని ప్రశ్నించాలి, నిలదీయాలి.మోదీ విజయవాడ పర్యటనలో ల్యాండ్ టైటిలింగ్‌ యాక్ట్ రద్దు చేయించే హామీని ఇవ్వగలవా చంద్రబాబు? 07:35 AM, May 8th, 2024టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారు: తానేటి వనితహోంమంత్రి తానేటి వనిత కామెంట్స్‌.. టీడీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుంది. మహిళ అని చూడకుండా దాడికి ప్రయత్నించారు. హోంమంత్రి దాడి చేయడమంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా?. మాకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకపోతున్నారు. 07:15 AM, May 8th, 2024తానేటి వనితపై టీడీపీ నేతల దాడి యత్నం..తూర్పుగోదావరిలో రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్‌నల్లజర్లలో టీడీపీ కార్యకర్తల బీభత్సంహోంమంత్రి తానేటి వనితపై దాడికి యత్నం. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది. హోంమంత్రిని సురక్షితంగా గదిలో ఉంచిన సెక్యూరిటీ. వైఎస్సార్‌సీపీ ప్రచార వాహనాన్ని ధ్వంసం చేసిన టీడీపీ కార్యకర్తలు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ శ్రేణుల మూకుమ్మడి దాడి.టీడీపీ శ్రేణుల దాడిలో వైఎస్సార్‌సీపీ నేతలకు తీవ్ర గాయాలు. టీడీపీ శ్రేణుల దాడిలో వాహనాలు, ఫర్నీచర్‌ ధ్వంసంసీసీ కెమెరాలో రికార్డయిన టీడీపీ నేతల దాడి దృశ్యాలు. నల్లజర్లలో భారీగా పోలీసుల మోహరింపు.  07:00 AM, May 8th, 2024గాజువాక  రోడ్‌షోలో సీఎం జగన్‌ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..మరో ఆరు రోజుల్లో జరగనున్న కురుక్షేత్ర మహా సంగ్రామం జగన్‌కు ఓటు వేస్తే పథకాల కొనసాగింపు, చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాల ముగింపు, ఇదే చరిత్ర చెప్పే సత్యంప్రతి రంగంలోనూ అనూహ్యమైన మార్పులు తీసుకురాగలిగాం, బటన్‌ నొక్కుతూ నేరుగా లబ్ధి అందజేశాంగతంలో దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం జరిగింది13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చడమే కాక ప్రజలకు మరింత దగ్గరయిన ప్రభుత్వం మీ బిడ్డదివిశాఖను ఎగ్జిక్యూటివ్‌ రాజధానిగా చేయడమే కాక జూన్‌ 4 న మీ బిడ్డ ప్రమాణ స్వీకారం చేసేది, తర్వాత పాలన కొనసాగించేది విశాఖ నుంచే..ఈ 59 నెలల్లో మీ బిడ్డ చేసిన అభివృద్ది గమనించండి అని చెబుతున్నా, చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా గ్రామ స్వరాజ్యానికి అర్ధం చెప్పాడు మీ బిడ్డలంచాలకు, వివక్షకు తావులేకుండా ఇంటివద్దకే పౌరసేవలు, అన్ని పథకాలు, ఇది కాదా అభివృద్దిఉద్దానం సమస్యను గతంలో ఎవరైనా పట్టించుకున్నారా, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీ ప్రతి ఏడాది మొదటి స్ధానమే, మీ బిడ్డ పాలనలో ఏకంగా రూ. లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చాయిసస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌ అంటే ఇది కాదా అని అడుగుతున్నారాష్ట్రాన్ని వెనక్కి తీసుకుపోవడానికి కూటమిగా ఏర్పడి ప్రయత్నిస్తున్నారునాడు నేడు ద్వారా స్కూల్స్, ఆసుపత్రులు రూపురేఖలు మారుతున్నాయి,ప్రధాని విమర్శలు చూస్తుంటే నాకు ఒకటనిపించింది, మోదీ గారు ఇదే చంద్రబాబు గురించి ఎన్నికల ముందు ఏమన్నారో గుర్తు తెచ్చుకోండి, వెన్నుపోట్లు, అత్యంత అవినీతిపరుడన్న నోటితోనే ఇవాళవారితో ఉంటే ఒకలా, లేకపోతే మరోలా మాటమారుస్తున్నారు, రాజకీయాలు ఇంత దిగజారిపోయాయా*బాబు, దత్తపుత్రుడు, మోదీ గారు కలిసి ఆడుతున్న ఈ డ్రామాలో రాష్ట్ర ప్రజలకు మీ హామీ ఏంటి, ప్రత్యేక హోదా ఇస్తామని జట్టు కట్టారా, స్టీల్‌ ప్లాంట్‌ ప్రేవేట్‌ పరం చేయమని జట్టు కట్టారా అందరూ ఆలోచించండిమీ జగన్‌ ఆమోదం లేదు కాబట్టే స్టీల్‌ ప్లాంట్‌ ప్రేవేటీకరణ విషయంలో కేంద్రం వెనకడుగు వేసింది, జగన్‌ ఒప్పుకోలేదు కాబట్టే అది జరగలేదు, ఈ ఎన్నికల్లో స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకం ఆపేలా బాబు, దత్తపుత్రుడు బీజేపీ కూటమిని ఓడించి నా తమ్ముడు అమర్‌కు ఓటేసి దేశానికి ఒక గట్టి మెసేజ్‌ ఇక్కడి నుంచి పంపండి 06:50 AM, May 8th, 2024నేడు ఏపీలో మోదీ ప్రచారంనేడు ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంమధ్యాహ్నం ప్రత్యేక విమానం తిరుమలకు మోదీరాజంపేట లోక్‌సభ పరిధిలో కలికిరిలో ఎన్నికల ప్రచారంసాయంత్రం విజయవాడలో రోడ్‌ షో 06:40 AM, May 8th, 2024అప్పుడూ ఇప్పుడూ 'అంతే'పేదల పొట్ట కొట్టడమే లక్ష్యంగా వికృతరూపం దాల్చిన బాబు పెత్తందారీ పోకడవారికి లబ్ధి జరిగేది ఏదైనా అడ్డుకోవడమే ఆయన లక్ష్యంఅప్పట్లో ఇళ్ల స్థలాల పంపిణీ, ఇంగ్లిష్‌ మీడియం చదువులు అడ్డుకునేందుకు ఎల్లోగ్యాంగ్‌ చేయని ప్రయత్నంలేదు.. ఇప్పుడు ఎన్నికల కోడ్‌ను అడ్డంపెట్టుకుని ఎప్పటినుంచో కొనసాగుతున్న డీబీటీలకూ అడ్డంకులుతొలి నుంచీ పేదలకు మేలు జరగకుండా కోర్టులకు వెళ్లి మరీ అడ్డుకున్న బాబు బ్యాచ్‌తాజాగా కోడ్‌ పేరుతో విద్యా దీవెన, రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, మహిళలకు చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాలను అడ్డుకున్న పచ్చముఠా.. ఐదేళ్లుగా కొనసాగుతున్న పథకాలపైనా కుట్రలుతెలంగాణలో ఇన్‌పుట్‌ సబ్సిడీకి ఓకే చెప్పిన ఈసీ.. ఏపీలో మాత్రం నో 06:30 AM, May 8th, 2024మీడియాతో ఏపీ సీఈవో ఎంకే మీనాప్రభుత్వం ఇచ్చే పథకాలనేవీ ఆపమని ఎన్నికల సంఘం చెప్పలేదుకొంత కాలం తర్వాత ఇవ్వమని ఎన్నికల సంఘం స్పష్టం చేసిందిపోస్టల్ బ్యాలెట్ వినియోగానికి మరో రోజు గడువు పొడిగింపుకొన్ని చోట్ల 12-డి ఫారాలు అందడంలో జాప్యం జరిగిందిఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోని ఇవాళ, రేపు ఓటేసుకోవచ్చుసెక్యూర్టీకి డ్యూటీకి వెళ్లిన వారికి ఈ నెల 9వ తేదీన కూడా అవకాశంఅలాగే సొంత సెగ్మెంట్లల్లోవి ఫెసిలిటేషన్ సెంటర్లల్లో కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటు వినియోగించుకోవచ్చువచ్చే నెల మూడో తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్ గడువు పొడిగించడం కష్టంఇప్పటికే సుమారు 20 రోజుల సమయం ఇచ్చాంకొన్ని ఫెసిలిటేషన్ సెంటర్ల వద్ద ఓటర్లను ప్రలోభ పెడుతున్నారుకొందరు ఓటుకు డబ్బులను డిజిటల్ పేమెంట్లు చేస్తున్నారుఒంగోలులో కొందరు ఉద్యోగులు ఈ ప్రలోభాలకు లోనైనట్టు నిర్థారణకు వచ్చాంకొందరు వచ్చిన మొత్తాన్ని తిప్పి పంపారుదీనిపై విచారణ చేపడుతున్నాంతప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటాంపోలింగ్ సందర్భంగా అక్రమాలకు పాల్పడిన ఓ పోలీస్ కానిస్టేబులును సస్పెండ్ చేశాంలీడర్లకు సెక్యూర్టీగా ఉన్న సిబ్బంది.. రేపటి ప్రధాని బందోబస్తులో ఉన్న వాళ్లకు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేలా వెసులుబాట్లు కల్పిస్తున్నాంపల్నాడులో హోలో గ్రామ్ ద్వారా ఓటర్లను ప్రలోభ పెడుతున్నారుపల్నాడు ఎపిసోడ్ పై విచారణ చేపడుతున్నాం

Ksr Comments On Chandrababu Political Stratagies On Farmers
‘రైతుల భూ డాక్యుమెంట్లను బుగ్గిపాలు చేసింది బాబేగా!’

ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజల సెంటిమెంట్‌తో ఆడుకుంటున్నారు. ప్రత్యేకించి రైతుల మనోబావాలతో చెలగాటమాడుతున్నారు. ఎవరికైనా భూమితో ఉండే సంబంధం చెప్పనవసరం లేదు. అందులోను రైతులకు మరింతగా ఉంటుంది. వారు భూమిని దైవంగా పరిగణిస్తారు. ఎంతో పవిత్రంగా చూసుకుంటారు. ఆ భూముల డాక్యుమంట్లను చాలా జాగ్రత్తగా భద్రపరచుకుంటారు. వాటిని తమ కుటుంబ భవిష్యత్తుకు చిహ్నాలుగా చూసుకుంటారు. అలాంటి డాక్యుమెంట్లను చంద్రబాబు నాయుడు దగ్దం చేసే సాహసం చేశారు. ఆయన చేసింది చాలా పెద్ద తప్పు. వైఎస్ జగన్‌ ప్రభుత్వంపై ఆయనకు ఎంత ద్వేషమైనా ఉండవచ్చు. ఎంత అక్కసు అయినా ఉండవచ్చు.కాని జగన్‌ను దూషించడానికి రైతుల డాక్యుమెంట్లను తగులబెట్టి దారుణమైన చర్యకు ఉపక్రమించారు. పైగా అదేదో గొప్ప పని మాదిరి ఏమి తమ్ముళ్లూ తగులబెట్టానా? అంటూ ఒకటికి రెండుసార్లు సభలో వికటాట్టహాసం చేయడం. ఈ మధ్యకాలంలో చంద్రబాబుకు ఎవరు ఇలాంటి దిక్కుమాలిన ఐడియాలు ఇస్తున్నారో కాని, ఆయన చేష్టలన్నీ రోత పుట్టిస్తున్నాయి. జగన్‌ ప్రభుత్వంపై విమర్శలు చేయడాన్ని అర్ధం చేసుకోవచ్చు. బూతులు తిట్టడం, డాక్యుమెంట్లు కాల్చడం ఏమిటి? 2014-2019 టరమ్‌లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతులను పీడించి 33 వేల ఎకరాలను సమీకరించారు. కొందరు ఇష్టంతోనే ఇచ్చినా, చాలామంది అందుకు సిద్దపడలేదు. వారిపై రకరకాల కేసులు పెట్టి, చివరికి వారి పంటలను కూడా దహనం చేయించారన్న విమర్శలకు అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం గురి అయింది. దాని ప్రభావంతో ఏపీలో ఆయన ఏకంగా అధికారాన్ని కోల్పోయి, కేవలం 23 సీట్లకే పరిమితం అయ్యారు. వైఎస్సార్‌సీపీకు 151సీట్లతో స్వీప్ వచ్చింది.అమరావతి రాజధాని గ్రామాలు ఉన్న తాడికొండ, మంగళగిరిలలో కూడా టీడీపీ ఓటమిపాలైంది. మంగళగిరిలో స్వయంగా చంద్రబాబు కుమారుడు లోకేష్ పోటీచేసినా ఫలితం దక్కలేదు. దానిని తట్టుకోలేక చంద్రబాబు నాయుడు మొదటి నుంచి ఏదో ఒక వివాదం సృష్టిస్తూ జగన్‌ ప్రభుత్వాన్ని సజావుగా నడవకుండా అడ్డుపడుతూ వచ్చారు. అలాగే మళ్లీ 2024 ఎన్నికల సమయంలో కూడా అనేక గొడవలు సృష్టించడానికి, అబద్దపు ప్రచారాలు చేయడానికి చంద్రబాబు బృందం పూనుకుంది. నిప్పుకు గాలి తోడైనట్లు పవన్‌ కల్యాణ్‌, రామోజీరావు, రాధాకృష్ణ వంటి మరికొందరు ఆ బాచ్‌లో చేరి అడ్డగోలు ప్రచారాలకు దిగుతున్నారు. చంద్రబాబు నాయుడు నిజానికి తానేమి చేస్తున్నాననో అర్ధం చేసుకోలేని మానసిక స్థితిలో ఉన్నట్లు అనిపిస్తుంది.ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని నీ అమ్మమొగుడు, అమ్మమ్మ మొగుడు, నానామ్మ మొగుడు.. ఇలా పిచ్చి మాటలు మాట్లాడతారా? మైండ్ ఉన్నవాళ్లెవరైనా ఇలాంటి బూతులు మాట్లాడతారా? రెండు రోజుల క్రితమే మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఒక సమావేశంలో మాట్లాడుతూ బూతులు తిట్టే రాజకీయ నేతలను ఓడించాలని పిలుపు ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబును ఓడించాలని వెంకయ్య నాయుడు పిలుపు ఇస్తే బాగుంటుంది. ఎన్నికల సంఘం కూడా చంద్రబాబు పట్ల చాలా ఔదార్యంతో వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తుంది. తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పై రెండు రోజుల నిషేధం పెట్టిన ఎన్నికల సంఘం చంద్రబాబుపై మాత్రం ఆ స్థాయిలో చర్య తీసుకోవడం లేదు. జగన్‌ను చంపితే ఏమి అవుతుందని చంద్రబాబు ప్రశ్నించినా, ఎన్నికల సంఘం మాత్రం చూస్తూ ఊరుకుంటోంది. అదే సమయంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నేతలు వైఎస్సార్‌సీపీ పైన, సీనియర్ అధికారులపై ఫిర్యాదు చేస్తే చాలు.. ఆఘమేగాల మీద చర్యలు చేపట్టి వారిని బదిలీ చేస్తోంది. తద్వారా చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకున్న లక్ష్యాన్ని ఎన్నికల సంఘం కూడా నెరవేర్చుతున్నట్లు అనిపిస్తుంది.కేంద్ర హోం మంత్రి అమిత్-షా వచ్చిన రోజున డీజీపీని బదిలీ చేసి, ప్రధాని మోదీ ఏపీకి వచ్చిన రోజున మరికొందరు సీనియర్ ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేసి కూటమి నేతలను సంతోషపెట్టినట్లు అనిపిస్తుంది. ఎన్నికల సంఘం ఏపీలో ఎప్పటి నుంచో అమలు అవుతున్న ఆయా స్కీములకు గాను ప్రజలకు వెళ్లవలసిన డబ్బు వెళ్లకుండా అడ్డుపడుతోంది. కూటమి నేతలు చంద్రబాబు, దగ్గుబాటి పురందేశ్వరి, పవన్‌ కల్యాణ్‌ వంటివారు చేసే ఫిర్యాదుల ఆధారంగా ఈసి పనిచేస్తున్నదన్న విమర్శలు వస్తున్నాయి. ఆ క్రమంలోనే ముఖ్యమంత్రి జగన్‌ కూడా ఎన్నికల సంఘంపై విమర్శలు చేశారు. ఎన్నికలనైనా సజావుగా జరగనిస్తారా? అన్న సందేహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని పక్కనబెడితే, రైతు భూమి డాక్యుమెంట్ను చంద్రబాబు దగ్దం చేయడానికి కారణం ఏమిటని పరిశీలిస్తే అందులోను చంద్రబాబు డబుల్ గేమ్ బయటపడుతుంది. రామోజీ జర్నలిజాన్ని ఎంతగా దిగజార్చింది అర్దం అవుతుంది.2019 జూలైలో శాసనసభలో లాండ్ టైటిలింగ్ యాక్ట్ బిల్లును జగన్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అది చాలా గొప్ప చట్టమని, కేంద్రం దీనిపై ఎప్పటినుంచో కసరత్తు చేస్తోందని, పలు దేశాలలో ఇప్పటికే ఈ తరహా చట్టాలు ఉన్నాయని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మెచ్చుకున్నారు. అప్పుడు చంద్రబాబు ఎక్కడా వద్దనలేదు. కాని శాసనసభ ఎన్నికలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో దానిని కాంట్రవర్శీ చేసి రాజకీయ లబ్ది పొందడానికి యత్నిస్తున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి. తదితర ఎల్లో మీడియా అడ్డగోలు కధనాలు రాసి ప్రజలలో భయాందోళనలు సృష్టించాలని తలపెట్టాయి. మొదట వైఎస్సార్‌సీపీ అంత సీరియస్‌గా తీసుకోలేదు. కాని ప్రజల్ని నమ్మించడానికి చంద్రబాబు, రామోజీ, రాధాకృష్ణ, పవన్‌ కల్యాణ్‌లు కుయుక్తులు పన్నారన్న విషయం అర్దం చేసుకున్న వైఎస్సార్‌సీపీ నాయకులు మేల్కొని అసలు విషయాలు చెప్పడం ఆరంభించారు. ఆ క్రమంలో అసెంబ్లీలో టీడీపీ ఈ బిల్లుకు మద్దతు ఇచ్చిన వీడియోని, రామోజీకి చెందిన టీవీలలో ఈ బిల్లు గొప్పదని చెప్పిన సంగతులను బయటపెట్టారు. దాంతో వారికి నోట మాటరాని పరిస్థితి ఏర్పడింది. వెంటనే ఈనాడు, ఆంద్రజ్యోతి వంటివి ప్లేట్ పిరాయించాయి. ఇంత తొందరేముంది అంటూ మరో చెత్త కధనాన్ని వండి యత్నం చేశాయి. చంద్రబాబు అయితే నిర్లజ్జగా ఆ టైటిలింగ్ యాక్ట్ పై ప్రజలను తప్పుదోవ పట్టించడం కోసం మరింత వికృతంగా వ్యవహరించారు. అందులో భాగంగానే రైతుల సెంటిమెంట్‌ దెబ్బతినే విదంగా వారి భూ డాక్యుమెంట్ను దగ్దం చేశారు. ఆ పనేదో ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్-షాల సభలలో వారి సమక్షంలోనే తగులబెడితే వారు ఏమి చెప్పేవారో తెలిసేది కదా? కాని ఆ పని చేయరు.కేవలం ప్రజలను మోసం చేయడానికి, తాను ఆత్మరక్షణలో పడిన విషయాన్ని కప్పిపుచ్చడానికి డాక్యుమెంట్లను దగ్దం చేసి రైతుల మనోభావాలను దారుణంగా దెబ్బతీశారని చెప్పాలి. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా డబుల్ గేమ్ ఆడారు. ఒకటికి రెండుసార్లు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలం అంటూ కేంద్రానికి చంద్రబాబు లేఖలు రాశారు. తీరా కేంద్రం తెలంగాణ ఏర్పాటుకు రెడీకాగానే సోనియాగాంధీని దెయ్యం, బూతం అంటూ బండబూతులు తిట్టారు. ఆంధ్రుల పొట్టకొట్టిందని అన్నారే తప్ప తాను సమైక్యవాదినని, తాను ఇచ్చిన లేఖను ఉపసంహరించుకుంటున్నానని మాత్రం చెప్పలేదు. తెలంగాణలో జరిగిన సభలలో తనవల్లే రాష్ట్రం వచ్చిందని గొప్పగా చెప్పుకున్నారు. ఇలా ఎన్నిసార్లు డబుల్ గేమ్ ఆడారో లెక్కలేదు. రెండు నాలుకల దోరణిలో బహుశా దేశంలోనే చంద్రబాబుకు అగ్రస్థానం ఉండవచ్చు. వలంటీర్ల వ్యవస్థను రకరకాలుగా దూషించారు. ఆ తర్వాత తాను అదే వ్యవస్థను కొనసాగిస్తానని, ఇంకా ఎక్కువ వేతనం ఇస్తానని అంటారు.జగన్‌ సంక్షేమ స్కీములు అమలు చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోయిందని అన్న చంద్రబాబు అంతకు రెట్టింపు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తానని హామీ ఇస్తుంటారు. ఈ డబుల్ టాక్‌తో రాజకీయ ప్రయోజనం కోసం ఆయన ఎంతకైనా దిగజారుతారు. అలాగే ఇప్పుడు లాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన డబుల్ టాక్ చేసి అప్రతిష్టపాలయ్యారు. అమలులోకి రాని చట్టంతో ఏదో ప్రమాదం జరిగినట్లు పచ్చి అబద్దాలను ఈనాడు, ఆంధ్రజ్యోతి ప్రచారం చేయడం, చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ పిచ్చి ప్రసంగాలు చేయడం నిత్యకృత్యం అయింది. అందులో బాగంగా చంద్రబాబు రైతుల బూమి డాక్యుమెంట్ ను దగ్దం చేసి రైతుల సెంటిమెంట్‌ను దెబ్బతీశారు. గతంలో అమరావతిలో పంటపొలాలు దహనం చేయించిన తర్వాత ఘోర పరాజయం చెందారు. అలాగే ఈసారి రైతుల భూమి డాక్యుమెంట్ను బుగ్గిపాలు చేయడం ద్వారా కూటమి అదికారంలోకి వస్తే రాష్ట్రాన్ని కూడా అలాగే తగులబెడతామని ప్రజలకు వారికి తెలియకుండానే సంకేతం పంపించారు. కనుక భూ డాక్యుమెంట్ తగులబెట్టిన చంద్రబాబుకు మరోసారి ఓటమి తప్పదన్న భావన వ్యక్తం అవుతోంది.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

Actor Janagaraj Latest Look is Unrecognisable
స్టార్‌ హీరోలతో యాక్టింగ్‌.. ఆ కమెడియన్‌ ఇలా అయిపోయాడేంటి!

కాలం వేగంగా పరిగెడుతోంది. ఒకప్పుడు వెండితెరపై వెలుగులు పంచిన ఎందరో తారలు తర్వాతి కాలంలో గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. కమెడియన్‌ జనగరాజ్‌ కూడా ఇదే కోవలోకి వస్తాడు. అప్పట్లో తమిళ చిత్రపరిశ్రమలో సెంథిల్‌, గౌడమణి తర్వాత ఆ స్థాయిలో నవ్వులు పంచింది ఈయనే!కామెడీ రోల్స్‌తో..మొదట్లో దర్శకుడు భారతీరాజా వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశాడు. అలా భారతీరాజా సినిమాలో చిన్న పాత్రలో నటించాడు. అందులో క్లిక్కవడంతో జనగరాజ్‌కు నటుడిగా అవకాశాలు వచ్చాయి. విలనిజం పండే పాత్రలు చేశాడు. కామెడీ రోల్స్‌తోనూ అదరగొట్టాడు. రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌ వంటి స్టార్స్‌తో కామెడీ సీన్లలో పోటీపడి నటించేవాడు. అప్పట్లో ఏడాదికి 15-20 సినిమాలు చేశాడు. జెట్‌ స్పీడులో మూవీస్‌ చేసిన ఆయన 2000వ సంవత్సరంలో అడుగుపెట్టేసరికి కాస్త స్లో అయ్యాడు.ఇండస్ట్రీకి దూరంతెలుగులో జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌గా నటించాడు. దాడి చిత్రంలోనూ యాక్ట్‌ చేశాడు. నెమ్మదిగా సినిమాలు తగ్గించుకుంటూ పోయి తర్వాత ఇండస్ట్రీలోనే కనిపించకుండా పోయాడు. దీంతో అతడు అమెరికా వెళ్లి సెటిలైపోయాడని వార్తలు వచ్చాయి. కానీ ఓ ఇంటర్వ్యూలో అవన్నీ ఉట్టి పుకార్లేనని కొట్టిపారేశాడు. దాదాపు పదేళ్ల తర్వాత విజయ్‌ సేతుపతి 96 మూవీతో రీఎంట్రీ ఇచ్చాడు. ఇటీవల తాత అనే షార్ట్‌ ఫిలింలో నటించాడు.గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నటుడుఈ షార్ట్‌ ఫిలింలో అతడు గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. అలాగే అతడి లేటెస్ట్‌ ఫోటో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో నటుడు బక్కచిక్కిపోయి ఉన్నాడు. వయసు 68 ఏళ్లు కావడంతో వృద్ధాప్య చాయలు ఆయన ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. నటుడి ఫోటో చూసిన అభిమానులు ఒక్కసారిగా షాకవుతున్నారు. ఒకప్పుడు ఎలా ఉండేవాడు.. ఇప్పుడేంటి? ఇలా అయిపోయాడని విచారం వ్యక్తం చేస్తున్నారు.చదవండి: భర్తతో విడిపోయిన టాలీవుడ్‌ హీరోయిన్‌.. ఒంటరినే అంటూ పోస్ట్‌

Bjp Paying Money To Buy Votes: Mamata Banerjee
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్‌

కోల్‌కతా : బీజేపీ డబ్బులతో ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తోందంటూ పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ  ఆరోపించారు. ఆరంబాగ్‌లో పార్టీ అభ్యర్ధి మితాలీ బాగ్‌కు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు.  ఈ సందర్భంగా మమతా బెనర్జీ మాట్లాడుతూ.. రూ.5,000, రూ.10,000, రూ.15,000 వరకు డబ్బులు చెల్లించి బీజేపీ ఓట్లను కొనుగోలు చేస్తోందని అన్నారు.తమపై తప్పుడు ప్రచారం చేసేలా మహిళలకు బీజేపీ డబ్బులిచ్చి ఉసిగొల్పిందని,  సందేశ్‌ఖాలీలోని మహిళల పరువును ఎలా తీసిందో మీరో చూడండి అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని 26 వేల మంది టీచర్ల ఉద్యోగాలను బీజేపీ లాక్కుందని, సుప్రీం కోర్టు తీర్పుతో నిజం గెలిచిందని సంతోషం వ్యక్తం చేశారు.  100 రోజుల పనికి సంబంధించిన డబ్బును మా పార్టీ దొంగిలించిందని మోదీ అంటున్నారు. అవన్ని అవాస్తవాలే. రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల పని కింద రూ. 24 కోట్లు ఆదా చేసిందని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. 

Brian Lara Advice For Suryakumar Which Dravid Rohit May Not Like
T20 WC: ద్రవిడ్‌, రోహిత్‌కు నచ్చకపోవచ్చు.. కానీ నా సలహా ఇదే!

టీ20 వరల్డ్‌కప్‌-2024 నేపథ్యంలో టీమిండియా కూర్పు గురించి వెస్టిండీస్‌ దిగ్గజం బ్రియన్‌ లారా కీలక వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచ నంబర్‌ వన్‌ స్టార్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ను టాపార్డర్‌కు ప్రమోట్‌ చేయాలని సూచించాడు.తన సూచన టీమిండియా హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు నచ్చకపోవచ్చని.. అయితే, జట్టు ప్రయోజనాల కోసమే తాను ఈ సలహా ఇస్తున్నానని లారా పేర్కొన్నాడు. కాగా జూన్‌ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్‌ వేదికగా ఐసీసీ టోర్నీ ఆరంభం కానున్న విషయం తెలిసిందే.ఇందులో భాగంగా జూన్‌ 5న భారత జట్టు తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది. ఐర్లాండ్‌తో మ్యాచ్‌తో తాజా వరల్డ్‌కప్‌లో తమ ప్రయాణం మొదలుపెట్టనుంది. ఈ నేపథ్యంలో రోహిత్‌ శర్మ సారథ్యంలో పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది.ఒంటిచేత్తో జట్టును గెలిపించిఇదిలా ఉంటే.. గాయం నుంచి కోలుకున్న తర్వాత ఐపీఎల్‌-2024 బరిలో దిగిన ముంబై ఇండియన్స్‌ స్టార్‌ సూర్యకుమార్‌ ఆరంభంలో తడబడ్డాడు. అయితే, త్వరగానే తిరిగి ఫామ్‌ అందుకున్న స్కై.. ఆఖరిగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో దుమ్ములేపాడు.నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 51 బంతుల్లోనే 12 ఫోర్లు, ఆరు సిక్స్‌ల సాయంతో 102 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఒంటిచేత్తో జట్టును గెలిపించాడు. కాగా సూర్య సాధారణంగా మిడిలార్డర్‌లోనే బ్యాటింగ్‌కు వస్తాడన్న విషయం తెలిసిందే.అయితే, టీ20 ప్రపంచకప్‌-2022 తర్వాత వన్‌డౌన్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు దూరంగా ఉన్న సమయంలో మూడో స్థానంలో దిగాడు సూర్య. అలా 14 ఇన్నింగ్స్‌ ఆడి 479 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, నాలుగు అర్ధ శతకాలు ఉండటం విశేషం.మూడో నంబర్‌లోనే ఆడించాలిఇక నాలుగో స్థానంలో ఓవరాల్‌గా టీమిండియా తరఫున ఇప్పటి వరకు 35 ఇన్నింగ్స్‌ ఆడిన సూర్య 1402 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలో బ్రియన్‌ లారా ఆసక్తికర విశ్లేషణతో ముందుకు వచ్చాడు.‘‘టీమిండియా మేనేజ్‌మెంట్‌కు నచ్చుతుందో లేదో గానీ నా సలహా మాత్రం ఇదే. సూర్యను మూడో నంబర్‌లోనే బ్యాటింగ్‌కు పంపాలి. వన్‌డౌన్‌లోనే అతడు ఆడాలి.టాపార్డర్‌లో ఆడటమే సరైందిటీ20 అత్యుత్తమ ప్లేయర్లలో సూర్య ఒకడు. సర్‌ వివియన్‌ రిచర్డ్స్‌లాంటి వాళ్లతో మాట్లాడితే.. తాను మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌ చేయడం ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతారు.అలాగే స్కై కూడా టాపార్డర్‌లో ఆడటమే సరైందని నేను భావిస్తాను. అతడు ఎలాగూ ఓపెనర్‌ కాదు.. కాబట్టి కనీసం మూడో స్థానంలోనైనా పంపిస్తే బాగుంటుంది.10- 15 ఓవర్ల పాటు సూర్య క్రీజులో ఉంటే ఏం జరుగుతుందో మనకి తెలిసిందే. తొలుత బ్యాటింగ్‌ చేసినా.. లక్ష్య ఛేదనలో అయినా సూర్య వన్‌డౌన్‌లో వస్తే ప్రయోజనకరం.కోహ్లి త్యాగం చేయాలికాబట్టి కోహ్లి నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ చేస్తే బెటర్‌. సూర్య స్టార్‌ టీ20 ప్లేయర్‌ కాబట్టి అతడి కోసం తన స్థానం త్యాగం చేయాలి’’ అని బ్రియన్‌ లారా చెప్పుకొచ్చాడు. కాగా టీ20 ప్రపంచకప్‌-2024లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో పాటు కోహ్లి ఓపెనింగ్‌ చేయనున్నాడన్న వార్తల నడుమ బ్రియన్‌ లారా ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.చదవండి: SRH vs LSG: ఉప్పల్‌ మ్యాచ్‌కు వెళ్తున్న వారికి అలర్ట్‌! ప్రత్యేకంగా మీకోసమే..

తనిష్క్ జ్యువెలరీ నెక్లెస్‌
ఆధునిక డైలీ వేర్ జ్యువెలరీ శ్రేణి - ‘గ్లామ్‌డేస్’ ను విడుదల చేసిన తనిష్క్

ఏప్రిల్ 2024: అక్షయ తృతీయ శుభ సందర్భం సమీపిస్తున్న తరుణంలో, టాటా గ్రూప్ కు చెందిన,  భారతదేశపు అతి పెద్ద జ్యువెలరీ రిటైల్ బ్రాండ్ అయిన తనిష్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిజైన్‌ల నుండి ప్రేరణ పొంది  అద్భుతమైన మరియు వైవిధ్యమైన  శ్రేణి సమకాలీన,  రోజువారీ ధరించే ఆభరణాల శ్రేణి ‘గ్లామ్‌డేస్’ని ఆవిష్కరించింది. ఆధునిక ఫ్యాషన్-ఫార్వర్డ్ సౌందర్యంతో చక్కదనాన్ని మిళితం చేస్తూ, గ్లామ్‌డేస్ మీ దైనందిన శైలిని మెరుగుపరుస్తుందని వాగ్దానం చేస్తుంది, ఇది ప్రతి మహిళ యొక్క వార్డ్‌రోబ్‌కు ఒక నిధిలా అదనపు జోడింపుగా మారుతుంది.ఈ వైవిధ్యమైన శ్రేణికి తో పాటుగా, తనిష్క్ తమ స్టోర్‌లలో ఆకర్షణీయమైన మరియు ఇంటరాక్టివ్ స్టైలింగ్ సెషన్‌లను సైతం నిర్వహిస్తుంది. ఈ స్టైలింగ్ సెషన్‌లు,  కస్టమర్‌లకు వారి వ్యక్తిగత శైలి మరియు వ్యక్తిత్వానికి తగినట్టుగా,  ఖచ్చితమైన రీతిలో రోజువారీ ధరించే ఆభరణాలను కనుగొనడంలో సహాయపడటానికి నిపుణుల సలహాలు మరియు మార్గదర్శకాలను అందించే విధంగా స్టైలిస్ట్‌లతో వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడానికి నిర్వహించబడతాయి.ఎంచుకోవటానికి అనువుగా 10,000 కంటే ఎక్కువ ప్రత్యేకమైన డిజైన్‌ల నుంచి ఎంచుకోవచ్చు మరియు అద్భుతమైన కొత్త రూపాన్ని సృష్టించవచ్చు మీరు మరియు మీ ఆభరణాలు తో ప్రతి రోజూ ప్రకాశించవచ్చు (#MakeEverydaySparkle). విభిన్న గ్లోబల్ డిజైన్‌ల నుండి స్ఫూర్తిని పొందుతూ, గ్లామ్‌డేస్,  ఆకర్షణీయమైనప్పటికీ వైవిధ్యమైన రోజువారీ ధరించే ఆభరణాలతో చక్కదనాన్ని పునర్నిర్వచించింది, వీటిని ప్రతిరోజూ ఉదయం నుండి సాయంత్రం  వరకు అలంకరించవచ్చు. ఇది సున్నితమైన మనోజ్ఞతను వెదజల్లుతున్న పూల పెండెంట్‌లు, బోల్డ్ ఇంకా రిఫైన్డ్ గోల్డ్ హుప్స్, ఎవర్‌గ్రీన్ ఇన్ఫినిటీ రింగ్‌లు లేదా చిక్ గోల్డ్ బ్రాస్‌లెట్‌లు అయినా, గ్లామ్‌డేస్ సమకాలీన శ్రేణి బంగారం మరియు వజ్రాల రోజువారీ ధరించే ఆభరణాలను అందిస్తుంది, ఇది పగటిపూట వైభవము నుండి సాయంత్రం గ్లామర్ కు అప్రయత్నంగా మారుతుంది. ఈ శ్రేణి ప్రతిరోజూ అందమైన కొత్త రూపాన్ని సృష్టించడానికి విభిన్న శైలి ప్రాధాన్యతలను అందిస్తుంది. ఉత్సాహాన్ని పెంచడానికి, తనిష్క్, తమ వినియోగదారులకు బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జీలు మరియు డైమండ్ జ్యువెలరీ విలువపై 20%* వరకు తగ్గింపును అందిస్తోంది.అదనంగా, కస్టమర్‌లు తనిష్క్ యొక్క ‘గోల్డ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్’ని కూడా ఉపయోగించుకోవచ్చు, ఇందులో కస్టమర్‌లు భారతదేశంలోని ఏదైనా ఆభరణాల నుండి కొనుగోలు చేసిన పాత బంగారంపై 100%* వరకు మార్పిడి విలువను పొందవచ్చు. వివాహ ఆభరణాల కస్టమర్లు బంగారు వివాహ ఆభరణాలపై 18% ఫిక్స్‌డ్ మేకింగ్ ఛార్జీల అద్భుతమైన ఆఫర్‌ను పొందవచ్చు*. ఆఫర్‌లు పరిమిత కాల వ్యవధి వరకు మాత్రమే చెల్లుతాయి*. ఈ శ్రేణిలోని ప్రతి పీస్  18కేరట్  మరియు 22కేరట్  బంగారంలో విస్తృతమైన శ్రేణి  డిజైన్‌లతో,  నేటి మహిళల డైనమిక్ జీవనశైలిని  సంపూర్ణం  చేయడానికి ఆలోచనాత్మకంగా రూపొందించబడింది.ప్రపంచం నలుమూలల నుండి ప్రేరణ పొందిన డిజైన్‌లు మరియు విభిన్న సాంకేతికతలను ఉపయోగించడంతో, గ్లామ్‌డేస్ ప్రతి రూపానికి వైవిధ్యమైన  సహచరుడిగా రూపొందించబడిన ఒక ప్రత్యేకమైన కలెక్షన్ ను  అందిస్తుంది, అది పాలిష్డ్ ప్రొఫెషనల్ లుక్ కోసం లేదా  కుటుంబ విందులు, ఇంట్లో విశ్రాంతి రోజులు లేదా వాటిని మీ మినిమలిస్ట్ వస్త్రధారణ తో జోడించడం వరకూ, ఎక్కడైనా సరే ఆనందం అందిస్తుంది. స్వీయ-వ్యక్తీకరణను అందించే మరియు విశ్వాసాన్ని పెంచే ఆభరణాల శ్రేణిని నిర్వహించడంలో తనిష్క్ యొక్క నిబద్ధతను గ్లామ్‌డేస్ ప్రతిబింబిస్తుంది. ఎంచుకోవడానికి అనేక రకాల స్టైల్స్‌తో, గ్లామ్‌డేస్ విభిన్నమైన నెక్లెస్‌లు, చెవిరింగులు, బ్రాస్‌లెట్‌లు మరియు ఉంగరాలను అందజేస్తుంది, ఇది మహిళలకు వారి ప్రత్యేక ప్రాధాన్యతలు మరియు రోజువారీ దుస్తులు స్టైలింగ్‌కు అనుగుణంగా వ్యక్తిగతీకరించిన రూపాన్ని క్యూరేట్ చేయడానికి అందిస్తుంది.మీ రోజువారీ శైలి మరియు #MakeEverydaySparkleని పూర్తి చేయడానికి సరైన ఉపకరణాలను కనుగొనండి. గ్లామ్‌డేస్ ఇప్పుడు అన్ని తనిష్క్ షోరూమ్‌లలో మరియు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లో అందుబాటులో ఉంది, ధరలు రూ . 15,000/- నుండి ప్రారంభమవుతాయి.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement

ఫోటో స్టోరీస్

View all