టీడీపీని గెలిపించాలన్నదే ఆయన ధ్యాస
జనసేనను నమ్ముకున్నవారిని నట్టేట ముంచేస్తున్నారు
ఆ పార్టీని నమ్ముకుని నేను ఎన్నో రకాలుగా నష్టపోయా
వైఎస్ జగన్‌తోనే ప్రజలకు మేలు జరుగుతుంది
పవన్ కల్యాణ్ ఓటమే ధ్యేయంగా పనిచేస్తా
సాక్షితో జనసేన మాజీ మహిళా నేత చిట్టె సుభాషిణి ఇంటర్వ్యూ..
‘మహిళల్ని అన్ని విధాలుగా దోచుకోవడం... పై నుంచి కిందివరకూ అన్ని స్థాయిల్లో ప్యాకేజీలు తీసుకోవడం... తెలుగుదేశం పార్టీని గెలిపించడం తప్ప మరో సిద్ధాంతాలేవీ జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌కు లేవు. ఆ పార్టీలో ఎంతో ఉన్నతాశయంతో చేరిన నేను ఎంతగానో నష్టపోయా. అందులో పనిచేశాక ఆయన మనస్తత్వం తెలుసుకుని ఇక ఉండలేక బయటకు వచ్చేశా.’ అని ఆ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసి ఇటీవలే వైఎస్సార్‌సీపీలో చేరిన ఎన్‌ఆర్‌ఐ చిట్టె సుభాషిణి అన్నారు. జనసేన వల్ల తాను ఏవిధంగా నష్టపోయిందీ సాక్షికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే...
అమెరికా నుంచి వచ్చి అగచాట్లు..
తూర్పుగోదావరి జిల్లాలోని నిడదవోలు దగ్గర సింగవరం గ్రామం మాది. నా భర్త సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఆయన ఉద్యోగరీత్యా 2011లో అమెరికా వెళ్లాం. నా భర్తకు మొదటి నుంచీ పవన్‌కల్యాణ్ అంటే పిచ్చి. ఆయన గురించి గొప్పగా ప్రచారం చేసే కొన్ని చానళ్లు, కొన్ని వీడియోలు నాకూ చూపించేవారు. నెమ్మదిగా నేను కూడా ఆయన అభిమానిగా మారాను. ఆ పిచ్చితోనే ఉద్యోగం సహా అన్నీ వదిలేసుకుని ఇండియా వచ్చేసి జనసేన పార్టీలో చేరిపోయాను.
పేరుకే జనసేన... టీడీపీ గెలుపే దాని లక్ష్యం!
తూర్పు గోదావరి జిల్లాలోని ముఖ్య నియోజకవర్గమైన గోపాలపురం వేదికగా జనసేన పార్టీతో నా అనుబంధం మొదలైంది. నియోజకవర్గం మొత్తం తిరిగి పార్టీ తరపున ప్రచారం చేశాను. ఆ క్రమంలోనే నాకు ఆ పార్టీలో పరిస్థితులు అర్థమయ్యాయి. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు టీడీపీ కోవర్టు. అతడే కాదు జనసేన ముఖ్యనాయకులందరూ అంతే. నాలా జనసేన కోసం నిస్వార్థంగా, చిత్తశుద్ధితో పనిచేసే వారిని అడ్డుకోవడమే వారి ధ్యేయం. ఐదేళ్లు పార్టీకోసం నిరంతరం పనిచేసినా ఏ చిన్న పదవి కూడా నాకివ్వలేదు.
దళితులంటే చిన్నచూపు..
ఆ పార్టీలో ప్రతి ఒక్కడూ నాయకుడే అన్నట్టు ప్రవర్తించేవారు. నేను పవన్‌తో ఫొటో దిగాలంటే రూ.2 లక్షలు డొనేషన్ అడిగారంటే అక్కడ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఆ పార్టీలో దళితుల్ని ఎదగనీయకుండా చేయడమే వారి ఆలోచన. అందుకే నా లాంటి దళిత మహిళ అభ్యర్థి ని ప్రోత్సహించాలనే ఆలోచన చేయ లేదు.
వీర అంటూనే... వేధిస్తారు!
వీరమహిళ అనే గొప్ప పేర్లు పెడతారు. కానీ అదంతా మోసం. అయినా వీర మహిళలమేమిటి? ఇలాంటి పైపై మెరుగులు ఆపాదిస్తే ఏమీ ఆశించకుండా అలా పడి ఉంటారనీ, మొగుళ్లని ఇళ్లను వదిలేసి తమ వెనుక తిరుగుతారని భ్రమలు కల్పిస్తారు. అంతేగాదు పవన్‌కి ఎంత మహిళాదరణ ఉందో అంటూ అందరూ అనుకోవాలని మాత్రమే తప్ప మహిళలకి ఎటువంటి ఆదరణ లేదు. నమస్కారం పెడితే ప్రతి నమస్కారం పెట్టే సంస్కారం కూడా లేని మహిళకి అధికార ప్రతినిధి పదవి ఇచ్చారు. నన్ను ఎన్నో రకాలుగా వేధించారు. శారీరకంగా, ఆరి్థకంగా దోచుకో వాలని చూశారు.
రియల్ లీడర్ వైఎస్ జగన్..
అమాయకుల అభిమానాన్ని అడ్డం పెట్టు కుని పవన్‌లా పావలా.. పరకా పోగేసుకోవడం నాయకత్వం అనిపించుకోదు. నాయకుడు అంటే సామాన్యులను కూడా నాయకులుగా మార్చాలి. ఆ సత్తా వైఎస్ జగన్‌కు మాత్రమే ఉంది. చిన్న చిన్న వారిని కూడా ఆయన గెలిపించుకున్నారు. అప్పట్లో నేను చేసిన తప్పు ఏమిటంటే వైఎస్సార్‌సీపీని అసలు గమనించలేనంతగా జనసేన పిచ్చిలో కూరుకుపోవడం. వీరుడైనా, శూరుడైనా ప్రజానాయకుడు అన్నా జగన్‌కు మాత్రమే నప్పుతుంది. ఆయన నాయకత్వంలోనే మహిళలకు మంచి జరుగుతుంది.
కుటుంబాన్ని వదిలేసి పార్టీకోసం పాటుపడ్డా..
నా సొంత ఖర్చులు పెట్టుకుని పిలల్ని, భర్తని హైదరాబాద్‌లో వదిలేసి తూర్పు గోదావరి జిల్లాలో కాళ్లరిగిపోయేలా తిరిగాను. అవసరమైన సమయంలో పిల్లల్ని సరిగా పట్టించుకోకపోవడం వల్ల వారికి మాటలు కూడా సరిగా రాలేదు. గుండె పగిలిపోయేంత ఆవేదనతో చెబుతున్నా. నా ఉసురు తప్పకుండా పవన్‌కి తగులుతుంది. రూ.కోటిన్నరకి పైగా డబ్బు కోల్పోయాను. అయినా పవన్ పిచ్చి వదలని నా భర్తతో కూడా గొడవలు పడాల్సి వచ్చింది. జనసేన పార్టీలో నేనెన్ని అవమానాలు భరిస్తున్నానో విడమరిచి చెప్పాను. ఇప్పుడు ఆయన రియలైజ్ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment