praises
-
చిన్న కోడలు రాధికపై నీతా అంబానీ ప్రశంసలు
రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక-ఛైర్పర్సన్ నీతా అంబానీ ఇటీవల ప్రతిష్టాత్మక హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్ 2025లో కీలకోపన్యాసం చేశారు. హార్వర్డ్ విశ్వ విద్యాలయంలో ఆమె ప్రసగించడం పలువురి ప్రశంసలందుకుంది. ఈ సందర్బంగా తన వ్యక్తిగత అనుభవాలను పంచుకున్నారు నీతా ముఖ్యంగా తాను చిన్నపుడు హార్వర్డ్ యూనివర్శిటీలో చదువు కోవాలని భావించడం, కానీ ఆర్థిక పరిస్థితుల రీత్యా ఆ కోరిక నెరవేరకపోవడం, ఇపుడు అక్కడి కీలకోపన్యాసం చేయడంతో తన తల్లి ఎంతో సంబర పడిపోయిన వైనాన్ని షేర్ చేశారు. తాజాగా తన చిన్నకోడలు రాధిక అంబానీపై ప్రశంసలు కురిపించడం విశేషంగా నిలిచింది.నీతా అంబానీ మాట్లాడుతూ తన చిన్న కొడుకు అనంత్ అంబానీ గురించి చెప్పుకొచ్చారు. అనంత్ ఆధ్యాత్మికంగా ఎలా ఉంటాడు, ఊబకాయంతో ఫైట్ చేస్తున్న తీరు ,రాధికతో ప్రేమను గుర్తు చేసుకున్నారు. అనారోగ్యంతో పోరాడుతున్న సమయంలో, అతనికి రాధిక లాంటి భార్య దొరకడం సంతోషం అన్నట్టు నీతా మాట్లాడారు. అనంత్ మతపరంగా, ఆధ్యాత్మికంగా చాలా దృఢంగా ఉంటాడు. జీవితాంతం ఊబకాయంతో పోరాడుతూ ఉన్నాడు. అయినప్పటికీ చాలా సానుకూలంగా ఉంటాడు. అలాగే తన జీవిత భాగస్వామి రాధికను కలవడం ద్వారా మరింత ఉత్సాహంగా మారాడు. వాళ్లిద్దరినీ అలా జంటగా చూడముచ్చటగా, అద్భుతంగా మ్యాజిక్‌లా ఉంటారంటూ చిన్న కోడల్ని కొనియాడారు.At the Harvard India Conference, Mrs. Nita Ambani speaks from the heart about her youngest son Anant - his journey through challenges, his positivity and spirituality, and finding his soulmate in Radhika! pic.twitter.com/yQNeMMFyZJ— Reliance Industries Limited (@RIL_Updates) February 18, 2025కాగా గత ఏడాది జూలై 12న అనంత్, రాధిక మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. అంబానీ నివాసం, యాంటిలియా, ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో వీరి వివాహం ఆరు రోజుల పాటు ఘనంగా జరిగింది. రాధిక మర్చంట్, అనంత్ చిన్నప్పటి నుంచి స్నేహితులు. అనంత్ రోడ్ ఐలాండ్‌లోని బ్రౌన్ విశ్వవిద్యాలయంలో చదువుకోగా రాధిక న్యూయార్క్‌లో చదువుకుంది. 2018 నుంచి డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా ఒకరినొకరు కళ్ళలోకి చూసుకుంటున్న ఒక ఫోటో వైరల్ కావడంతో వీరి ప్రేమ వ్యవహారం బైటపడింది. ఆ తరువాత అనంత్ సోదరి ఇషా అంబానీ నిశ్చితార్థ వేడుకలో, నీతా అంబానీ, ముఖేష్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ, శ్లోకా మెహతా వివాహ వేడుకలో కూడా రాధిక కనిపించారు.అయితే రాధిక తనకు దొరకడం అంటే 100 శాతం అదృష్టవంతుడిని అంటూ అనంత్ అంబానీ గతంలో తన ప్రేమను చాటుకున్నాడు. ఇప్పటికీ రాధికను కొత్తగా కనిసినట్టు అనిపిస్తుంది రాధికను చూసినప్పుడు తన హృదయంలో అగ్నిపర్వతాలు, భూకంపాలు, సునామీలొస్తాయంటూ చాలా భావోద్వేగంతో అనంత్ చెప్పిన సంగతి తెలిసిందే. -
డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డికి వైఎస్ జగన్ శుభాకాంక్షలు
సాక్షి,తాడేపల్లి: ప్రఖ్యాత వైద్యులు డా.నాగేశ్వర్‌రెడ్డికి కేంద్రప్రభుత్వం పద్మవిభూషణ్ ప్రకటించటంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం(జనవరి26) వైఎస్జగన్ ఎక్స్(ట్విటర్)లో ఒక ట్వీట్ చేశారు.‘విఖ్యాత వైద్యులు డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డిగారికి భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ ప్రకటించిన సందర్భంగా ఆయనకు నా శుభాకాంక్షలు. గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలో ఆయన చేసిన పరిశోధనలు వైద్యరంగంలో గొప్పగా నిలిచిపోతాయి. మంచి హస్తవాసి ఉన్న వైద్యుడు నాగేశ్వరరెడ్డి. రోగులకు ఆత్మీయత పంచడమేకాదు, వారు తిరిగి కోలుకునేందుకు వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపే గొప్ప మనసు ఆయనది. కొత్త కొత్త వ్యాధులకు చికిత్స అందించడంలో నాగేశ్వర్‌రెడ్డి సేవలు విశేషమైనవి. అత్యాధునిక వైద్య పద్ధతులు,చికిత్సా విధానాలను తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా విస్తరించడంలో ఆయనది కీలక పాత్ర. డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డిని దేశం గొప్పగా గౌరవించుకోవడం తెలుగువారందరికీ గర్వకారణం’ వైఎస్ జగన్ పేర్కొన్నారు.విఖ్యాత వైద్యులు డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డిగారికి భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ ప్రకటించిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు. గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలో చేసిన పరిశోధనలు వైద్యరంగంలో గొప్పగా నిలిచిపోతాయి. మంచి హస్తవాసి ఉన్న వైద్యుడు ఆయన. రోగులకు ఆత్మీయత పంచడమేకాదు, వారు తిరిగి…— YS Jagan Mohan Reddy (@ysjagan) January 26, 2025కేంద్ర ప్రభుత్వం రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటించిన పద్మ అవార్డుల్లో తెలుగు వారైన గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డికి పద్మ విభూషణ్ పురస్కారం దక్కిన విషయం తెలిసిందే. నాగేశ్వర్‌రెడ్డికి పద్మ విభూషణ్ దక్కడంపై ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు. -
ఖోఖో ప్రపంచ కప్ విజేత భారత్.. వైఎస్ జగన్ ప్రశంసలు
-
వైఎస్ జగన్ తెచ్చిన గ్రీన్ కో ప్రాజెక్ట్ పై పవన్ ప్రశంసలు
-
నాకు తెలుసు.. మీరు చాలా ఫేమస్: జైశంకర్‌తో ఇండోనేషియా అధ్యక్షుడు
బ్రెజిల్‌లోని రియో డి జనిరోలో G20 శిఖరాగ్ర సదస్సు జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకరర్‌పై ప్రశంసలు కురిపించారు. భారత్, ఇండోనేషియా మధ్య జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో ఈ దృశ్యం చోటుచేసుకుంది.ఇండోనేషియా క్షుడు జైశంకర్ తనను తాను పరిచేయం చేసుకున్నారు. ఈ క్రమంలో సుబియాంటో కరచాలనం చేస్తూ ‘నువ్వు నాకు తెలుసు, నువ్వు చాలా ఫేమస్’ అంటూ పేర్కొన్నారు. దీంతో అక్కడున్న మోదీ వారి వైపు చూస్తూ చిరునవ్వులు చిందించారు. మరోవైపు ఇండోనేషియా అధ్యక్షుడితో జరిగిన భేటీలో ప్రధాని మోదీ వాణిజ్యం, వాణిజ్యం, ఆరోగ్యం, భద్రత వంటి రంగాల్లో సహకారంపై చర్చించారు. ఇండోనేషియా అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంటో ఎన్నికైన తర్వాత ఇరువురు నేతలు భేటీ కావడం ఇదే తొలిసారి."I know you, you are very famous", Indonesia Prez Prabowo tells EAM Dr S Jaishankar after the latter introduces himself. Location : Ahead of PM Modi, Indonesia Prez Prabowo bilateral at Brazil G20 summit Vdo Source: Indonesia Govt pic.twitter.com/fqXb3ZeA86— Sidhant Sibal (@sidhant) November 19, 2024కాగా మంగళవారం జరిగిన జీ 20 సదస్సులో భాగంగా చైనా విదేశాంగమంత్రి మంత్రి వాంగ్ యితో జైశంకర్ చర్చలు జరిపారు. భారత్, చైనా మధ్య నేరుగా విమానాలు నడపాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. కైలాష్ మానస్ సరోవర్ యాత్రను కూడా..తిరిగి ప్రారంభించాలని ఇరుదేశాల ప్రతిపాదించాయి. తూర్పు లద్దాఖ్‌లోని డెమ్చోక్ సెక్టార్లో భారత బలగాల పెట్రోలింగ్ ప్రారంభం తర్వాత రెండు దేశాల మధ్య జరిగిన మొదటి ఉన్నత స్థాయి సమావేశం. -
భారత హాకీ జట్టు విజయం అద్భుతం: వైఎస్జగన్
సాక్షి,తాడేపల్లి: ఆసియా ఛాంపియన్స్ హాకీ ట్రోఫీలో భారత జట్టు గెలుపుపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్జగన్ హర్షం వ్యక్తం చేశారు. ట్రోఫీ ఫైనల్లో చైనాపై 1-0 తేడాతో భారత జట్టు సాధించిన విజయం అద్భుతం అని వైఎస్ జగన్ కొనియాడారు.ఈమేరకు మంగళవారం(సెప్టెంబర్17)ఎక్స్(ట్విటర్)లో ఆయన ఒక పోస్టు చేశారు. భారత హాకీ జట్టుసభ్యులకు అభినందనలు తెలిపారు.ఆసియా ఛాంపియన్స్ హాకీ ట్రోఫీ విజేతగా భారత్ నిలిచింది. ఫైనల్లో చైనాపై 1-0 తేడాతో సాధించిన విజయం అద్భుతం.Well done, Congratulations!#AsianChampionsTrophy2024— YS Jagan Mohan Reddy (@ysjagan) September 17, 2024 -
ఎన్టీఆర్ మించి సంక్షేమ పథకాలు అమలు చేశాం: కేసీఆర్
-
వైఎస్ జగన్‌ను మళ్లీ సీఎంగా చేసుకోవాలి: ఆర్.కృష్ణయ్య
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 50 ఏళ్ల నుంచి బీసీల కోసం నేను పోరాడుతున్నా. 12 వేల ఉద్యమాలు చేశాం. 2 వేల జీవోల సాధించామని ఆయన పేర్కొన్నారు. సీఎం జగన్‌ను చూసి దేశంలోని ఇతర రాష్ట్రాల సీఎంలు ఆశ్చర్యపోతున్నారు. సీఎం జగన్‌కి ఉన్నంత ధైర్యం, సాహసం, నిజాయితీ ఎవరికీ లేవు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చరిత్రలో ఎన్నడూ చేయనంత మేలు చేస్తున్నారు. గత ప్రభుత్వాలు మమ్మల్ని ఓట్లుగానే చూశాయి. సీఎం జగన్ మాత్రమే తన కుటుంబంలా చూసుకున్నారు. వైఎస్ జగన్‌ను మళ్లీ సీఎంగా చేసుకోవాలి. ప్రజల అభివృద్ధే సీఎం జగన్ అభివృద్ధి. ప్రజలు దేవుడి ఫోటోతో పాటు సీఎం జగన్ ఫోటోను పెట్టుకుంటున్నారు. నేను కర్నూలులో స్వయంగా చూశా. సీఎం జగన్ రాజకీయ నాయకుడు కాదు.. సంఘ సంస్కర్త.’’ అంటూ కృష్ణయ్య కొనియాడారు. ‘‘ఎలాంటి పోరాటం చేయకుండానే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సీఎం జగన్ మేలు చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలంతా నిజాయితీగా ఆలోచించాలి. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్‌ను ఓటేసి గెలిపించాలి’’ అని ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. -
ఆంధ్రాను అనుసరిస్తాం.. బంగ్లాదేశ్ బృందం ప్రశంసలు
సాక్షి, అమరావతి: ఆరోగ్య పరిరక్షణ, పౌష్టికాహారం, ఆహార భద్రత, మహిళా, రైతు సాధికారతకు ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని బంగ్లాదేశ్ ప్రతినిధి బృందం ప్రశంసించింది. ఇక్కడ అమలవుతున్న కార్యక్రమాల నుంచి తాము ఎంతో స్ఫూర్తి పొందామని, తమ దేశంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు అమలు చేస్తామని ప్రకటించింది. ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాల అమల్లో మహిళా సంఘాలు పోషిస్తున్న పాత్ర అద్భుతమని తెలిపింది. రాష్ట్ర పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్ ప్రతినిధి బృందం సభ్యులు మొహమ్మద్, రఫీకుల్ ఇస్లాం, తాఫిక్ హుస్సేన్ షా చౌదురి, ఆఫ్రిన్ సుల్తానా, కపిల్‌కుమార్‌పాల్, శంసాద్ ఫర్జానా, ఏకేఎం జహీరుల్ ఇస్లాంలు శనివారం ఏలూరు జిల్లాలోని పలు గ్రామాల్లో పర్యటించారు. న్యూట్రీ గార్డెన్స్, కిచెన్ గార్డెన్స్‌ను సందర్శించారు. పెదవేగి మండలం జనార్దనవరంలో మిచాంగ్ తుపానుపై ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించారు. చిరుధాన్యాలు, పోషక విలువలు కలిగిన దినుసులతో తయారు చేసిన పిండి పదార్థాలతోపాటు, ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించిన ఆకుకూరలు, కాయగూరలతో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించి, వాటి తయారీ గురించి తెలుసుకున్నారు. రైతు సాధికార సంస్థ థిమాటిక్ లీడ్ అరుణ పాల్గొన్నారు. -
గిరిజనుల దేవుడు సీఎం వైఎస్ జగన్..మాజీ ఎంపీ ప్రశంసలు
-
ఏపీ సర్కార్‌పై కేంద్రమంత్రి ప్రశంసలు
సాక్షి, విజయవాడ: నగరంలోని పాత ప్రభుత్వాసుపత్రిలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా శుక్రవారం పర్యటించారు. ఓల్డ్ జీజీహెచ్‌లో రూ.25 కోట్లతో నిర్మించనున్న క్రిటికల్ కేర్ బ్లాక్, బీఎస్ఎల్-3 ల్యాబ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కొత్తగా 1.25 కోట్లతో నిర్మించిన ఐపీహెచ్ఎల్ ల్యాబ్స్‌ను కేంద్రమంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, ఎంపీ సత్యవతి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ కృష్ణబాబు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మన్సుఖ్ మాండవియా మాట్లాడుతూ, ఏపీలో వైద్య ఆరోగ్య శాఖ పనితీరు చాలా బాగుందని ప్రశంసించారు. ఆరోగ్య రంగంలో ఏపీకి పూర్తి స్థాయిలో సహకరిస్తామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర సహకారంతోనే ప్రజలకు మరింత మేలు జరుగుతుందన్నారు. ఏపీ ప్రభుత్వం హెల్త్ సెక్టార్‌పై ప్రత్యేక దృష్టి సారించడం అభినందనీయమన్నారు. సీఎం జగన్‌కి, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనికి కేందమంత్రి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ‘‘ప్రజల ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. ప్రధాని మోదీ హెల్త్ సెక్టార్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. దేశవ్యాప్తంగా 1.70 లక్షల ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలను నిర్మించాం. గత తొమ్మిదేళ్లలో 350 కి పైగా కొత్త మెడికల్ కళాశాలలనుప్రదాని మోదీ నిర్మించారు. గ్రామీణ స్ధాయిలో హెల్త్ వెల్ నెస్ సెంటర్లని జిల్లా ఆసుపత్రులు, ఎయిమ్స్ లాంటి సంస్ధలతో అనుసంధానం చేశాం. గ్రామీణ ప్రాంతవాసులకు స్పెషలిస్ట్ సేవలు టెలీ కన్సల్టేషన్ ద్వారా ఉచితంగా అందిస్తున్నాం. ప్రతీ రోజూ 4 లక్షల వరకు టెలీ కన్సల్టేషన్ సేవలు అందిస్తున్నాం. ఆయుష్మాన్ భారత్ ద్వారా 5 లక్షల వరకు ఉచితంగా చికిత్స అందిస్తున్నాం’’ అని కేంద్రమంత్రి పేర్కొన్నారు. ఇదీ చదవండి: అందుకేనట బాబు రహస్య మంతనాలు! -
సీఎం వైఎస్ జగన్ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు
-
‘ఈసారి కూడా నా మనవడే సీఎం’
ద్వారకా తిరుమల: ‘ఈ మనవడు నాకెందుకు తెలీదు. నా పెద్ద మనవడే. వయసులో చిన్నోడైనా నాలాంటి ముసలోళ్లతోపాటు ఎంతోమంది పేదల జీవితాల్లో భరోసా నింపుతున్నాడు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా నేనే కాదు. రాష్ట్రంలోని అందరూ ఆయనకే ఓటేస్తారు. ఈసారి కూడా నా మనవడు జగనే సీఎం అవుతాడు’ అంటోంది ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం దొరసానిపాడుకు చెందిన ముద్దన ముస్సెమ్మ. గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం దొరసానిపాడులో ఇంటింటికీ వెళ్లి సీఎం జగన్ సంక్షేమ పాలనను వివరించారు. ఈ సందర్భంలో ముద్దన ముస్సెమ్మ అనే వృద్ధురాలు తారసపడగా.. ఎమ్మెల్యే ఆమెతో ముచ్చటించారు. ‘మా నమ్మకం నువ్వే జగన్’ కరపత్రంపై ఉన్న సీఎం జగన్ ఫొటోను బామ్మకు చూపి ‘ఈయన ఎవరో గుర్తు పట్టావా’ అని అడిగారు. అది చూసిన ముస్సెమ్మ విప్పారిన కళ్లతో ‘నా మనవడు నాకెందుకు తెలీదు. జగన్ మనవడి వల్లే సంతోషంగా బతుకుతున్నా. జగన్‌బాబే లేకపోతే మాలాంటి వాళ్ల బతుకులు ఏమైపోయేవో. ఆయన దయవల్ల ఎందరో పేదల బతుకులు బాగుపడ్డాయ్. మా అందరి ఆశీస్సులతో మళ్లీ నా మనవడే సీఎం అవుతాడు’ అంటూ అమితానందంతో జవాబిచ్చింది. చదవండి: ఇళ్లపైకి ‘పచ్చ’దొంగలు.. జాగ్రత్త! -
మాధవన్ పోస్టుకు ప్రధాని మోదీ స్పందన
బెంగళూరు: హీరో మాధవన్ పోస్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. కర్ణాటకలోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంపై మాధవన్ ప్రశంసలు కురిపించారు. ఇటీవలే అక్కడ ప్రారంభమైన రెండవ టెర్మినల్ పనులను ప్రస్తావించారు. అద్భుతంగా ఉన్నాయంటూ ట్విట్టర్ వేదికగా ఎయిర్‌పోర్టు దృశ్యాలను అభిమానులతో పంచుకున్నారు. 'దేశంలో మౌలిక సదుపాయాలు గణనీయంగా అభివృద్ధి చెందాయి. కెంపెగౌడ అయిర్పోర్టులో ఉన్నాను. నమ్మశక్యం కావడం లేదు. ప్రపంచంలోనే అద్భుతమైన మౌలిక వసతులు ఇక్కడ ఉన్నాయి. ఇందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది' అని మాధవన్ అన్నారు. View this post on Instagram A post shared by R. Madhavan (@actormaddy) ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాదాపు నాలుగు లక్షలకు పైగా లైకులు వచ్చాయి. ఈ పోస్టుపై ప్రధాని మోదీ కూడా స్పందించారు. 'భారత్ అభివృద్ధి కోసం మౌలిక సదుపాయాలు' అంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. కెంపెగౌడ ఎయిర్‌పోర్టు ఎంతో అద్భుతమైనదని మోదీ అన్నారు. ప్రపంచ దేశాల విమానాశ్రయాలకు పోటీగా నిలుస్తుందని అన్నారు. ఇదీ చదవండి: మీడియా ముందు నోరు జాగ్రత్త.. నేతలకు సోనియా హితవు -
గిరిజనులను సీఎం జగన్ సమాన అవకాశాలు కల్పిస్తున్నారు: సజ్జల
-
నీతి–మనా లోయ మహిళలపై ప్రధాని మోదీ ప్రశంసలు
డెహ్రాడూన్: భోజపత్ర కాలిగ్రఫీని జీవనోపాధిగా మార్చుకున్న ఉత్తరాఖండ్‌లోని నీతి–మనా లోయ మహిళలను ప్రధాని మోదీ ప్రశంసించారు. ఆదివారం ‘మన్ కీ బాత్’లో వారి కృషిని ఆయన ప్రస్తావించారు. ‘పురాతన కాలంలో మహాభారతాన్ని భోజపత్రపైనే రాశారు. మన సంస్కృతిలో భాగమైన భోజపత్రతో నీతి–మనా లోయ మహిళలు కళాఖండాలు, సావనీర్లు రూపొందిస్తున్నారు. దీనితో తమ జీవితాలనే మార్చేసు కున్నా రు’అని కొనియాడారు. ఈ లేఖనాలను అందరూ ఆసక్తిగా కొనుగోలు చేస్తున్నార న్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు సాంస్కృతిక వారసత్వాన్ని ఉపయోగించుకోవడం అభినందనీయమన్నారు. వీరి కృషి కారణంగా ఈ ప్రాంతం పర్యాటకపరంగా ప్రాచుర్యంలోకి వచ్చిందన్నారు. అక్టోబర్‌లో చైనా సరిహద్దు సమీపంలోని బద్రీనాథ్‌ను సందర్శించిన సమయంలో స్థానిక మహిళ ఒకరు అందమైన భోజపత్ర లేఖనాన్ని బహుమతిగా అందేజేసినట్లు గుర్తుకు తెచ్చుకున్నారు. నీతి–మనా లోయలోని మనా గ్రామాన్ని ప్రధాని మోదీ అప్పట్లో మొట్టమొదటి భారతీయ గ్రామంగా అభివర్ణించారు. -
బురద చల్లుతూనే ఉంటారు.. పట్టించుకోవద్దు: అంబటి రాయుడు
సాక్షి, గుంటూరు: స్వచ్ఛందంగా సేవలందించే వలంటీర్లను జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సంఘ విద్రోహ శక్తులతో పోల్చటాన్ని ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు తప్పుబట్టారు. వలంటీర్లకు దురుద్దేశాలను ఆపాదించడంపై ఆయన స్పందిస్తూ.. ‘‘వలంటరీ వ్యవస్థ గురించి ఎంత గొప్పగా చెప్పినా తక్కువే. మంచి పనులు చేసేటప్పుడు ఎవరో ఒకరు బురద చల్లుతూనే ఉంటారు. వాటిని మనం పట్టించుకోకూడదు. వలంటీర్లు అందరూ ధైర్యంతో ముందుకు వెళ్లాలి’’ అంటూ అంబటి రాయుడు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో వలంటరీ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుందని అంబటి అన్నారు. వలంటరీ వ్యవస్థ మన రాష్ట్రానికి ఫ్లాగ్ షిప్. దేశంలో 70 సంవత్సరాల నుంచి జరగనది మన రాష్ట్రంలో వలంటరీ వ్యవస్థ ద్వారా జరుగుతోంది. ప్రతి మనిషికి ఏది అందాలో అది వలంటరీ ద్వారా అందుతుందన్నారు. చదవండి: పవన్ అడ్డంగా దొరికిపోయాడు.. తన బట్టలు తానే ఊడదీసుకుని.. ‘‘వలంటరీ వ్యవస్థ ఏర్పాటు ఒక గొప్ప ఆలోచన. వలంటరీ వ్యవస్థ ద్వారా ప్రజలకు ఎంతో మంచి జరుగుతుంది. ప్రజలకు మంచిగా సేవలందించే వలంటరీ వ్యవస్థ మన రాష్ట్రంలో తప్ప దేశంలో ఎక్కడా లేదు. కరోనా సమయంలో వలంటీర్లు తమ ప్రాణాన్ని ఫలంగా పెట్టి అందరికీ సేవలందించారు. జీవితాంతం ప్రతి ఒక్కరూ దాన్ని గుర్తుపెట్టుకోవాలి’’ అని అంబటి రాయుడు పేర్కొన్నారు. చదవండి: పవన్ వ్యాఖ్యలపై వలంటీర్ల ఆగ్రహ జ్వాల -
నరేంద్ర మోదీ బిగ్ ఫ్రెండ్
మాస్కో: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ రష్యాకు గొప్ప మిత్రుడు(బిగ్ ఫ్రెండ్) అని పేర్కొన్నారు. మోదీ కొన్నేళ్ల క్రితం ప్రారంభించిన ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఎంతగానో ప్రభావితం చేస్తోందని కొనియాడారు. గురువారం మాస్కోలో ఏజెన్సీ ఫర్ స్ట్రాటెజిక్ ఇనీíÙయేటివ్స్(ఏఎస్ఐ) కార్యక్రమంలో పుతిన్ మాట్లాడారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. మనం కాకపోయినా, మన స్నేహితుడు చేసిన పని సత్ఫలితాలు ఇస్తుంటే అనుకరించడంలో తప్పేమీ లేదన్నారు. స్థానికంగా తయారీ సామర్థ్యాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా భారత నాయకత్వం ప్రభావవంతమైన విధానాలను సృష్టిస్తోందని, విదేశీ పెట్టుబడిదారులను అమితంగా ఆకర్శిస్తోందని చెప్పారు. పుతిన్, నరేంద్ర మోదీ చివరిసారిగా 2022 సెపె్టంబర్లో ఉజ్బెకిస్తాన్‌లో ఓ సదస్సు సందర్భంగా కలుసుకున్నారు. ద్వైపాక్షిక, వ్యూహాత్మక బంధాలు బలోపేతం చేసుకుందాం తమ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక, వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ నిర్ణయించుకున్నారు. ఇరువురు నేతలు శుక్రవారం ఫోన్లో మాట్లాడుకున్నారు. ఉక్రెయిన్‌లో సంఘర్షణతోపాటు అంతర్జాతీయ పరిణామాలపై చర్చించుకున్నారు. కీలక రంగాల్లో భారత్, రష్యా మధ్య ద్వైపాక్షిక సహకారంలో పురోగతిని ఇరువురూ సమీక్షించారు. ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా పరస్పర ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. రెండు దేశాల నడుమ వ్యాపార, వాణిజ్యాల విలువ నానాటికీ పెరుగుతుండడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌లో ఘర్షణ ఆగిపోవాలన్నదే తమ ఉద్దేశమని, దౌత్య మార్గాల్లో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని, ఉక్రెయిన్ నాయకత్వం అందుకు అంగీకరించడం లేదని మోదీకి పుతిన్ తెలియజేశారు. వివాదాలకు తెరదించడానికి దౌత్య ప్రయత్నాలు, చర్చలే మార్గమని మోదీ పునరుద్ఘాటించారు. మోదీ, పుతిన్ మధ్య అర్థవంతమైన, నిర్మాణాత్మక సంభాషణ జరిగిందని అధికార వర్గాలు వెల్లడించాయి. -
PM Modi Egypt Tour: ఇండియా హీరో మోదీ
కైరో: ‘ఇండియా హీరో నరేంద్ర మోదీ’ అంటూ ఈజిప్టులో నివసిస్తున్న ప్రవాస భారతీయులు భారత ప్రధానిపై ప్రశంసల వర్షం కురిపించారు. అమెరికా కాంగ్రెస్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో మోదీ చరిత్రాత్మక ప్రసంగం అద్భుతంగా ఉందంటూ కొనియాడారు. మోదీ నాయకత్వంలో ఇండియా అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ అమెరికాలో నాలుగు రోజుల అధికారిక పర్యటన ముగించుకొని శనివారం ఈజిప్టులో అడుగుపెట్టారు. గత 26 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఈజిప్టులో పర్యటిస్తుండడంఇదే మొదటిసారి. రాజధాని కైరోలో మోదీకి ఘన స్వాగతం లభించింది. ఆదివారం ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రిట్జ్ కార్ల్టన్ హోటల్లో ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. ఇండియా హీరో(కథానాయకుడు) మీరేనంటూ వారు ప్రశంసించగా మోదీ ప్రతిస్పందించారు. అందరికీ హీరో ఇండియా అని బదులిచ్చారు. ప్రజలంతా కష్టపడి పనిచేస్తున్నారని, అందుకే మన దేశం అభివృద్ధి సాధిస్తోందని అన్నారు. దేశ ప్రగతిలో ప్రవాస భారతీయుల కృషి ఎంతో ఉందని చెప్పారు. దేశ విజయంలో వారికి సైతం వాటా దక్కుతుందన్నారు. అనంతరం దావూదీ బోహ్రా వర్గం ముస్లింలతో నరేంద్ర మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గుజరాత్‌లోని దావూదీ బోహ్రా ముస్లింలతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఈజిప్టులో ప్రవాస భారతీయులు తనకు ఘన స్వాగతం పలికారని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. వారి ఆప్యాయత తన హృదయాన్ని కదిలించిందని పేర్కొన్నారు. ఈజిప్టువాసులు సైతం భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించి తనకు స్వాగతం పలికారని వెల్లడించారు. భారత్–ఈజిప్టు దేశాలు సంప్రదాయాలను సైతం పంచుకుంటున్నాయని వివరించారు. అల్–హకీం మసీదు, గ్రేట్ పిరమిడ్ల సందర్శన ఈజిప్టులో 11వ శతాబ్దం నాటి చరిత్రాత్మక అల్–హకీం మసీదును ప్రధాని మోదీ సందర్శించారు. ఈజిప్టులో మొదటి ప్రపంచ యుద్ధంలో భారతీయ సైనికులు చేసిన ప్రాణత్యాగాలకు గుర్తుగా నిర్మించిన హెలియోపోలిస్ కామన్వెల్త్ వార్ మెమోరియల్‌ను సందర్శించి, ఘనంగా నివాళులరి్పంచారు. ఇక్కడి సందర్శకుల పుస్తకంలో సంతకం చేశారు. ఈజిప్టులో జరిగిన మొదటి ప్రపంచ యుద్ధంలో 3,799 మంది భారతీయ సైనికులు అమరులయ్యారు. ప్రపంచ అద్భుతాల్లో ఒకటైన గిజా గ్రేట్ పిరమిడ్లను మోదీ సందర్శించారు. కైరో నగర శివార్లలో గిజా నెక్రోపోలిస్ అనే ప్రాంతంలో ఈ పిరిమిడ్లు ఉన్నాయి. ‘‘కైరో అల్–హకీం మసీదును సందర్శించడం ఆనందంగా ఉంది. ఈజిప్టు ఘనమైన వారసత్వానికి, సంస్కృతికి ఈ మసీదు దర్పణం పడుతోంది’’ అని మోదీ ట్వీట్ చేశారు. అవగాహనా ఒప్పందాలపై సంతకాలు వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించుకొనే దిశగా భారత్, ఈజిప్టు మరో అడుగు వేశాయి. భారత ప్రధాని మోదీ, ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్–సీసీ ఆదివారం చర్చలు జరిపారు. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నారు. ఇరువురు నేతలు నాలుగు అవగాహనా ఒప్పందాల(ఎంఓయూ)పై సంతకాలు చేశారని భారత విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా చెప్పారు. ఇందులో వ్యూహాత్మక భాగస్వామ్యానికి సంబంధించిన ఒప్పందం ఉందన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలు, ప్రాచీన, పురావస్తు కట్టడాల పరిరక్షణ, ‘కాంపిటీషన్ లా’కు సంబంధించిన మరో మూడు ఒప్పందాలపై సంతకాలు చేశారని తెలిపారు. మోదీకి ‘ఆర్డర్ ఆఫ్ ద నైలు’ ప్రదానం ఈజిప్టు అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ద నైలు’ను ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్–సీసీ ఆదివారం భారత ప్రధాని నరేంద్ర మోదీకి ప్రదానం చేశారు. ఈజిప్టు సహా ఇప్పటిదాకా 13 దేశాలు తమ అత్యున్నత పౌర పురస్కారాలతో మోదీని సత్కరించాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, పాలస్తీనా, అఫ్గానిస్తాన్, సౌదీ అరేబియా, మాల్దీవ్స్, రష్యా, బహ్రెయిన్, పపువా న్యూగినియా, ఫిజీ, రిపబ్లిక్ ఆఫ్ పాలౌ, భూటాన్ తదితర దేశాల నుంచి ఆయన ఈ పురస్కారాలు స్వీకరించారు. తనకు ఆర్డర్ ఆఫ్ ద నైలు పురస్కారం ప్రదానం చేసిన ఈజిప్టు ప్రభుత్వానికి, ప్రజలకు మోదీ ట్విట్టర్లో కృతజ్ఞతలు తెలియజేశారు. భారత్ పట్ల ఈజిప్టు ప్రజల ఆప్యాయత అనురాగాలకు ఇదొక నిదర్శనమని పేర్కొన్నారు. -
టీసీఎస్ హైదరాబాద్‌కు గవర్నర్ ప్రశంసలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రక్తదానానికి గణనీయ కృషి చేసినందుకు గాను ఐటీ దిగ్గజం టీసీఎస్ హైదరాబాద్ విభాగం తాజాగా తెలంగాణ గవర్నర్ తమిళిసై, రెడ్ క్రాస్ నుంచి ప్రశంసలు పొందింది. స్థానికంగా కార్యకలాపాలను మరింతగా విస్తరించడంతో పాటు రక్తదానం వంటి కార్యక్రమాల ద్వారా సమాజ శ్రేయస్సుకు పాటుపడనున్నట్లు పురస్కారం అందుకున్న సందర్భంగా టీసీఎస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వి. రాజన్న తెలిపారు. -
రైతు సంక్షేమం కోసం పాటుపడుతున్న సీఎం కేసీఆర్ సంకల్పం గొప్పదన్న స్వామిజీలు
-
భారత్‌కు థ్యాంక్స్ చెప్పిన చైనా.. ఎందుకంటే..?
న్యూఢిల్లీ: మధ్య హిందూ మహాసముద్రంలో చైనాకు చెందిన చేపల ఓడ మునిగిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు నావికులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ఓడలోని మిగతా 37 మంది నావికులను కాపాడేందుకు భారత నేవీ రంగంలోకి దిగి సాయం చేసింది. రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొని చైనాకు ఆపన్నహస్తం అదించింది. దీంతో భారత్ సహా రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొని తమ వంతు సాయం అందించించిన ఇండోనేషియా, ఆస్ట్రేలియా, శ్రీలంక, మాల్దీవ్‌కు చైనా విదేశాంగ శాఖ కృతజ్ఞతలు తెలిపింది. కష్టకాలంలో సాయం చేసినందుకు ప్రశంసల వర్షం కురిపించింది. చైనాకు చెందిన లుపెంగ్ యువాన్యు 028 చేపల ఓడ మంగళవారం హిందూ మహాసముద్రంలో మునిగిపోయింది. ఇందులో మొత్తం 39 మంది నావికులు ఉన్నారు. వీరిలో చైనాకు చెందన వారు 17 మంది, ఇండోనేషియాకు చెందినవారు 17 మంది, ఫిలిప్పైన్స్కు చెందిన ఐదుగురు ఉన్నారు. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. చైనాకు చెందిన 10 ఓడలు ఆ ఆపరేషన్‌లో భాగమయ్యాయి. ఇంకా మరిన్ని ఓడలను ఘటనా స్థలానికి చేర్చుతున్నారు. గల్లంతైన వారి కోసం సముద్రంలో ముమ్మరంగా గాలిస్తున్నారు. ఓడను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. చదవండి: అమెరికాలో న్యాయ పోరాటం.. భారత్‌కు అతిపెద్ద విజయం.. ‘రాణాను అప్పగించండి’ -
హైదరాబాద్ నుంచి విద్యార్థుల స్వస్థలాలకు చేర్చేందుకు స్పెషల్ బస్సులు
-
ఏపీ చాలా మంచి పనితీరు కనబర్చినట్లు కేంద్రం కితాబు
-
ఊసరవెల్లి చంద్రం
-
నరేంద్ర మోదీపై అమాంతం ప్రేమ కురిపిస్తోన్న చంద్రబాబు
-
ప్రజల గొంతు నొక్కేయగలరా?
న్యూఢిల్లీ: భారతదేశంలో ఉన్నంత భావ ప్రకటన స్వేచ్ఛ ప్రపంచంలో ఇంకెక్కడా లేదని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ అన్నారు. దేశంలో బీజేపీ పాలనలో ప్రజల గొంతు నొక్కేస్తున్నారంటూ కాంగ్రెస్ నేత సోనియా గాంధీ ఇటీవల ఓ పత్రిక వ్యాసంలో చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అవి తనకు బాధ కలిగించాయన్నారు. ప్రజల గొంతును ఎవరూ నొక్కేయలేరని చెప్పారు. బుధవారం ‘మన్‌కీ బాత్ 100 జాతీయ సదస్సు’ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతినెలా నిర్వహించే ఈ రేడియో కార్యక్రమం దేశానికి ఒక ఆశాదీపమన్నారు. దీనిద్వారా రాజకీయాలకు అతీతంగా మోదీ దేశానికి సందేశమిస్తున్నారని ప్రశంసించారు. కొందరు నాయకులు విదేశాలకు వెళ్లి, మన దేశాన్ని తూలనాడుతున్నారని మండిపడ్డారు. మోదీ హయాంలో ఎంతో అభివృద్ధి జరుగుతోందంటూ ప్రశంసల వర్షం కురిపించారు. మన్ కీ బాత్ 100 కాఫీ టేబుల్ బుక్ తదితరాలను ధన్‌ఖడ్ విడుదల చేశారు. ముఖ్యమైన భావప్రసారం: ఆమిర్ ఖాన్ మన్ కీ బాత్ చాలా ముఖ్యమైన భావప్రసార కార్యక్రమమని బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ ప్రశంసించారు. మన్ కీ బాత్ ద్వారా మోదీ దేశ ప్రజలతో అనుసంధానం అవుతున్నారని తెలిపారు. అత్యంత కీలకమైన అంశాలపై చర్చిస్తున్నారని, తన ఆలోచనలు పంచుకుంటూ చక్కటి సలహాలు, సూచనలు ఇస్తున్నారని అమీర్ ఖాన్ ప్రశంసించారు. -
ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలపై మల్లాడి కృష్ణ రావు ప్రశంశలు
-
గృహ నిర్మాణం పై ఏపీ ప్రభుత్వానికి కేంద్రం ప్రశంసలు
-
కాలు పోయినా కళను వీడలేదు.. నాట్యం నేర్చుకుని ప్రశంసలు పొందింది
-
తిరుపతిలో శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ మూడవ దశ నిర్మాణం పూర్తి
-
జగన్ అంటే అంతులేని అభిమానం..
-
సీఎం జగన్ తో వరల్డ్ బ్యాంక్ ప్రతినిధి బృందం భేటీ
-
సీఎం జగన్‌పై ప్రపంచబ్యాంకు ప్రతినిధి బృందం ప్రశంసలు..
సాక్షి, తాడేపల్లి: ప్రపంచబ్యాంకు భారత్ విభాగం డైరెక్టర్ ఆగస్టే టానో కౌమే నేతృత్వంలోని ప్రతినిధుల బృందం సీఎం జగన్‌తో సోమవారం భేటీ అయింది. వరల్డ్ బ్యాంకు సహకారంతో అమలవుతున్న మూడు కార్యక్రమాలను సమీక్షించింది. ఏపీ ప్రజారోగ్య బలోపేతం, ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ (సాల్ట్), ఏపీ ఇంటిగ్రేటెడ్ ఇరిగేషన్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్ (ఏపీఐఐఏటీపీ) ప్రాజెక్టుల అమలును పరిశీలించింది. అనంతరం ఆగస్టే టానో మాట్లాడుతూ.. సీఎం జగన్ సర్కార్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఆంధ్రప్రదేశ్‌ను మిగిలిన రాష్ట్రాలు ఒక ఉదాహరణగా తీసుకుని ముందుకు సాగవచ్చు అని కొనియాడారు. 'రాష్ట్రానికి రావడం ఇదే తొలిసారి. వివిధ రంగాల్లో మీరు చేరుకున్న లక్ష్యాలను ప్రత్యక్షంగా మేం చూశాం. ఒక ప్రభుత్వం తన ప్రజలకు ఏ విధంగా సేవలు అందించగలదు అనే దానికి మీరు ఉదాహరణగా నిలిచారు. దీనికి మనస్ఫూర్తిగా మీకు అభినందనలు తెలియజేస్తున్నా. మంచి వైద్యం, ఆరోగ్యం, మంచి విద్యను ఎలా అందించవచ్చు అన్నదానికి మీరు చక్కటి మార్గాన్ని చూపారు. నిర్దేశిత సమయంలోగా సేవలను పౌరులకు అందించడంలో మీరు గొప్ప ఉదాహరణగా నిలిచారు. దేశంలో దాదాపు 22 రాష్ట్రాలకు మేం రుణాలు ఇస్తున్నాం. వివిధ రంగాల్లో వృద్ధికోసం ఈ రుణాలు ఇస్తున్నాం. వచ్చే పాతికేళ్లలో మీ విజన్ కు, మీ మిషన్ కు ఈ సహకారం కొనసాగుతుంది.' అని పేర్కొన్నారు. మరింత భాగస్వామ్యం ఆశిస్తున్నాం.. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో తమ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలపై సమగ్రంగా అధ్యయనం చేయాలని సీఎం జగన్ ప్రపంచబ్యాంకు బృందాన్ని కోరారు. ఈ కార్యక్రమాల్లో మరింతగా ప్రపంచబ్యాంకు భాగస్వామ్యాన్ని ఆశిస్తున్నట్లు చెప్పారు. 'రాష్ట్రంలో మొత్తం స్కూళ్ల రూపు రేఖలన్నీ మారుస్తున్నాం. 12 రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నాం. 6వ తరగతి నుంచి ఐఎఫ్‌పీ ప్యానెల్స్ఏర్పాటు చేస్తున్నాం. వచ్చే జూన్ కల్లా వీటిని ఏర్పాటు చేస్తున్నాం. దీంతో బోధనా పద్ధతులను పూర్తిగా మార్చివేస్తున్నాం. డిజిటలైజేషన్ దిశగా వేస్తున్న పెద్ద అడుగు ఇది. రాష్ట్రంలో ఆరు పోర్టులు ఉన్నాయి, మరో నాలుగు వస్తున్నాయి. ఈ పోర్టు ఆధారిత పారిశ్రామిక వ్యవస్థలకు అవసరమైన నైపుణ్యం ఉన్న మానవవనరులు రాష్ట్రంలోనే తయారవుతాయి. ఈ కార్యక్రమాల్లో ప్రపంచబ్యాంకు భాగస్వామ్యం కావాలని కోరుతున్నా. వైద్యారోగ్యశాఖలో కొత్తగా సుమారు 40 వేలమందికిపైగా సిబ్బందిని రిక్రూట్ చేశాం. 17 కొత్త మెడికల్ కాలేజీలను నిర్మిస్తున్నాం. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలవుతోంది. ఆరోగ్యశ్రీని అత్యంత సమర్థవంతంగా అమలు చేస్తున్నాం.' అని సీఎం జగన్ వివరించారు. చదవండి: గవర్నర్‌తో సీఎం జగన్ మర్యాదపూర్వక భేటీ.. -
హాట్స్ ఆఫ్ రాజమౌళి ..!
-
ఏపీ విద్యా వ్యవస్థ భేష్.. స్విట్జర్లాండ్ మాజీ అధ్యక్షుడు ప్రశంసలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చాలా బాగున్నాయని, ప్రత్యేకించి విద్యా వ్యవస్థ అద్భుతమని స్విట్జర్లాండ్ మాజీ దేశాధ్యక్షుడు ఇగ్నా జియో క్యాసిస్ కొనియాడారు. జెనీవా నగరంలోని ఐక్యరాజ్య సమితి కార్యాలయంలో ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ ఫోరం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ‘ఎడ్యుకేషన్ ఫర్ ఫ్యూచర్’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో విద్యా వ్యవస్థ పెద్ద సవాళ్లను ఎదుర్కొంటోందన్నారు. అయితే ఇండియాలోని ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం అలాంటి పరిస్థితి లేదని తెలిపారు. ఆ రాష్ట్రంలో పేద విద్యార్థుల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన పథకాలు, కార్యక్రమాలు మంచి ఫలితాలిస్తున్నాయని కొనియాడారు. నాడు–నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖల్ని మార్చేశారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలను తలదన్నేలా ఉన్నాయన్నారు. విద్యార్థులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను ప్రభుత్వమే సమకూర్చుతోందని, ఇది గర్వించదగ్గ విషయం అని అన్నారు. కొంత కాలం తర్వాత ఏపీ విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభావంతులుగా నిలుస్తారని ఆకాంక్షించారు. ఇలాంటి కార్యక్రమాల నిర్వహణ అందరి వల్లా కాదని, విద్యార్థుల భవిష్యత్తుపై ప్రత్యేక దృష్టి ఉన్న వారికే సాధ్యమవుతుందని చెప్పారు. ఆకట్టుకున్న ఏపీ స్టాల్ ఎడ్యుకేషన్ ఫర్ ఫ్యూచర్ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల స్టాల్ పలువురిని ఆకట్టుకుంది. స్వయంగా దేశాధ్యక్షుడే ఏపీ విద్యా విధానాలపై ప్రశంసలు వ్యక్తం చేయడంతో స్విట్జర్లాండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ జనరల్ పాట్రిసియా దన్జీ స్టాల్‌ను సందర్శించారు. ప్రభుత్వ పథకాల గురించి ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. ఏపీలో ఎడ్యుకేషన్ కోసం నాడు–నేడులో తీసుకున్న నిర్ణయాలు, అమలవుతున్న తీరు, విద్యా ప్రమాణాలు మెరుగుదల.. తదితర విషయాలపై ఆయన ఏపీ ప్రభుత్వాన్ని అభినందించారు. డిజిటల్ లెర్నింగ్, క్వాలిటీ ఎడ్యుకేషన్‌లో భాగంగా విద్యార్థులకు ప్రభుత్వం ట్యాబ్‌ల పంపిణీ, పాఠశాలల ఆధునికీకరణ, డిజిటల్ బోర్డుల ఏర్పాటు, ఆధునిక పద్ధతుల్లో విద్యా బోధన తదితర కార్యక్రమాలన్నీ పేద విద్యార్థులకు ఎంతో మేలు చేస్తాయని కొనియాడారు. ఇలాంటి సౌకర్యాలు కల్పించడంతో సమాజంలో అన్ని వర్గాల వారు విద్యనభ్యసిస్తారని చెప్పారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం లో న్యూట్రిషన్ ఫుడ్ అందించడం మంచి పరిణామం అన్నారు. చదవండి: టీడీపీకి పుట్టగతులుండవని ‘ఈనాడు’ భయం లైబ్రరీ, ప్లేగ్రౌండ్స్, హైజెనిక్ బాత్రూమ్స్ అండ్ టాయిలెట్స్, యూనిఫాం, స్టేషనరీ కిట్స్, బుక్స్ అందిస్తున్న విధానం చాలా బాగుందన్నారు. ‘ఈక్విటబుల్ ఎడ్యుకేషన్ యాక్సెస్ టు ఆల్’ విధానం చాలా నచ్చిందన్నారు. ఏపీ స్టాల్‌ను ఇంటర్నేషనల్ యూనిసెఫ్ ప్రోగ్రామ్స్ స్పెషలిస్ట్ అతెనా లౌబాచెర్ సందర్శించారు. గరŠల్స్ ఎడ్యుకేషన్ విధానంతో అసమానతలను రూపుమాపవచ్చని అభినందించారు. డిజిటల్ ఎడ్యుకేషన్‌లో భాగంగా బైజూస్ ద్వారా అందిస్తున్న విద్యా విధానం నూతన పద్ధతుల్లో గొప్పగా ఉందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఇండియా నుండి ఐక్యరాజ్య సమితి శాశ్వత సభ్యుడు వున్నవ షకిన్ కుమార్ పాల్గొన్నారు. -
ఆర్ఆర్ఆర్ను రెండు సార్లు చూశానన్న ‘అవతార్’ డైరెక్టర్, జక్కన్నపై ప్రశంసలు
అంతర్జాతీయ వేదికలపై ఆర్ఆర్ఆర్ మూవీ పేరు మారుమ్రోగుతోంది. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకుని చరిత్ర సృష్టించిన ఈ చిత్రం రీసెంట్గా లాస్ ఎంజిల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అనే మరో అవార్డును గెలుచుకుంది. ఇలా ప్రపంచ స్థాయిలో రికార్డులు క్రియేట్ చేస్తున్న ఈ మూవీపై హాలీవుడ్ దిగ్గజం, అవతార్ మూవీ డైరెక్టర్ జెమ్స్ కామెరూన్ ప్రశంసలు కురిపించారు. చదవండి: తండ్రి అయిన స్టార్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ అయితే ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్‌కు నామినేట్ అయిన నేపథ్యంలో డైరెక్టర్ రాజమౌళి, ఎమ్ఎమ్ కీరవాణిలు అమెరికాలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో అమెరికాలో జరిగినో ఓ అవార్డు ఫంక్షన్లో రాజమౌళి, జెమ్స్ కామెరూన్ కలిశారు. ఈ సందర్భంగా కామెరూన్ ఆర్ఆర్ఆర్ మూవీ రెండు సార్లు చూశానని తనతో చెప్పారంటూ రాజమౌళి మురిసిపోయారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. ‘ది గ్రేట్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ ఆర్ఆర్ఆర్ మూవీ చూశారు. ఆయనకు సినిమా చాలా బాగా నచ్చింది. చదవండి: రష్మిక టాటూ అర్థమెంటో తెలుసా? దాని వెనక ఇంత స్టోరీ ఉందా! అంతేకాదు ఆర్ఆర్ఆర్ మూవీ చూడమని తన భార్య సుజిక్ జేమ్స్‌కి కూడా ఆయన ప్రతిపాదించారు. దీంతో ఆమెతో కలిసి ఆయన ఆర్ఆర్ఆర్ మూవీని మరోసారి చూశారట. ఈ సందర్భంగా ఆయన ఆర్ఆర్ఆర్ సినిమా గురించి పది నిమిషాల పాటు నాతో విశ్లేషించడం నమ్మలేకపోతున్నా. అదే విధంగా ‘మీరు ప్రపంచంలోనే టాప్ డైరెక్టర్’ అని ఆయన నాకు కితాబు ఇవ్వడం చాలా ఆనందగా ఉంది. మీకు ధన్యవాదాలు సార్’ అంటూ జక్కన్న ట్వీట్లో రాసుకొచ్చారు. The great James Cameron watched RRR.. He liked it so much that he recommended to his wife Suzy and watched it again with her.🙏🏻🙏🏻 Sir I still cannot believe you spent a whole 10 minutes with us analyzing our movie. As you said I AM ON TOP OF THE WORLD... Thank you both 🥰🥰🤗🤗 pic.twitter.com/0EvZeoVrVa — rajamouli ss (@ssrajamouli) January 16, 2023 -
సాక్షి యాంకర్ పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు
-
విద్యారంగంలో ఇది విప్లవాత్మక మార్పు : మంత్రి బొత్స సత్యనారాయణ
-
మళ్ళీ మీరే సీఎం కావాలి జగన్ మామా : విద్యార్థిని
-
బీసీల పల్లకీ మోస్తున్న మహానేత సీఎం జగన్ : ఉష శ్రీ చరణ్
-
పేదల ఇళ్లపై కూడా రాజకీయం చేస్తున్నారు : మంత్రి బొత్స సత్యనారాయణ
-
ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ ఇటువంటి సభ జరగలేదు : ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు
-
మన్మోహన్ సింగ్‌పై గడ్కరీ ప్రశంసల జల్లు
న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత, కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. రాజ్యసభ ఎంపీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై ఆయన ప్రశంసల జల్లు గుప్పించారు. ఆర్థిక సంస్కరణలకుగానూ దేశం మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు రుణపడి ఉందని గడ్కరీ మంగళవారం టీఐవోఎల్-2022 అవార్డుల కార్యక్రమంలో పేర్కొన్నారు. దేశంలోని పేదలకు ప్రయోజనాలు అందించాలంటే ఉదారవాద ఆర్థిక విధానం అవసరం. 1991లో ఆర్థిక మంత్రిగా మనోహ్మన్ సింగ్ ప్రారంభించిన ఆర్థిక సంస్కరణలు.. ఉదారవాద ఆర్థిక వ్యవస్థకు నాంది పలికి మన దేశానికి కొత్త దిశానిర్దేశం చేశాయి. సరళీకరణతో కొత్త దిశానిర్దేశం చేసిన మన్మోహన్ సింగ్‌కు ఈ దేశం రుణపడి ఉంది అని గడ్కరీ పేర్కొన్నారు. మాజీ ప్రధాని సింగ్ ప్రారంభించిన ఆర్థిక సంస్కరణల కారణంగానే 1990ల మధ్యకాలంలో తాను మహారాష్ట్రలో మంత్రిగా ఉన్నప్పుడు రోడ్లు నిర్మించడానికి డబ్బును సేకరించగలిగానని గడ్కరీ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఏ దేశమైనా అభివృద్ధిలో ఉదారవాద ఆర్థిక విధానం ఎంతగానో దోహదపడుతుందని, అందుకు చైనా మంచి ఉదాహరణ అని గడ్కరీ అన్నారు. ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడానికి, భారత్‌కు మరిన్ని క్యాపెక్స్ పెట్టుబడి అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదీ చదవండి: ‘ఒకే భూమి.. ఒకే కుటుంబం.. ఒకే భవిష్యత్తు’ -
వాళ్లు టాలెంటెడ్.. భారత్‌పై మరోసారి పుతిన్ ప్రశంసలు
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తాజాగా భారతీయులపై ప్రశంసలు కురిపించారు. భారతీయులు ప్రతిభావంతులని అన్నారు. భారతీయుల్లో అపార నైపుణ్య శక్తి ఉందని, అందులో ఏ అనుమానం లేదని అన్నారు. వీరు అభివృద్ధి పరంగా అత్యుత్తమ ఫలితాలను సాధించగల సమర్ధులని వ్యాఖ్యానించారు. నవంబర్ 4న రష్యా ఐక్యతా దినోత్సవం సందర్భంగా మాస్కోలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పుతిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత్‌పై పొగడ్తల జల్లు కురిపించారు. ‘ఒకసారి భారత్‌ను చూడండి. దేశ అభివృద్ధి కోసం పాటుపాడే ఎంతో మంది ప్రతిభావంతులు అక్కడ ఉన్నారు. అభివృద్ధి విషయంలో భారత్ కచ్చితంగా అత్యుత్తమ ఫలితాలు సాధిస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఆ దేశంలో దాదాపు 150 కోట్ల మందితో భారత్ ఇప్పుడు సమర్థవంతమైన దేశంగా ఉంది’ అంటూ కొనియాడారు. ఇండియాలాగే రష్యాకు విశిష్ట నాగరికత, సంస్కృతి ఉందని తెలిపారు. అయితే దేశంలో యూరోపియన్ సంస్కృతి కూడా ముడిపడి ఉందని తెలిపారు. చదవండి: ఉభయ కొరియాల మధ్య...ఉద్రిక్తతలు మరింత తీవ్రం కాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్‌పై ఈ విధంగా వ్యాఖ్యానించడం ఇదేం తొలిసారి కాదు. ఇటీవలి కాలంలో వరుసగా ప్రశంసలు కురిపిస్తున్నారు. వారం రోజుల క్రితం ప్రధాని మోదీ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని పొగడ్తలతో ముంచెత్తిన విషయం తెలిసిందే. మోదీ నిజమైన దేశభక్తుడని, ఆయన సారథ్యంలో భారత్ చాలా పురోగతి సాధించిందని కొనియాడారు. చదవండి: ట్విటర్ డీల్: మస్క్‌పై ధ్వజమెత్తిన అమెరికా అధ్యక్షుడు -
‘మోదీ’ గ్రేట్ అంటూనే సెటైర్లు.. ఆ సీఎం మామూలోడు కాదు!
జైపూర్: అధికార పార్టీ నేతలపై విపక్ష పార్టీల నేతలు ఆరోపణలు చేయడం సహజమే. కానీ, ప్రశంసలు కురిపించుకోవటం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఎప్పుడు నిప్పులు చెరిగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ తాజాగా ప్రశంసలు కురిపించారు. ప్రధాని మోదీ గ్రేట్ అంటూనే చురకలు అంటించారు. ఈ సంఘటన రాజస్థాన్ బాన్సవారా జిల్లాలోని మంగఢ్ హిల్‌పై నిర్వహించిన‘మంగఢ్ ధామ్ కి గౌరవ్ గాథా’ కార్యక్రమం వేదికపై కనిపించింది. వేదికపై పీఎం మోదీ, గుజరాత్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులు ఉన్నారు. ‘పీఎం మోదీ విదేశాలకు వెళ్లినప్పుడు ఆయన గొప్ప గౌరవాన్ని పొందుతారు. ఎందుకంటే ప్రజాస్వామ్యం లోతుగా పాతుకుపోయిన గాంధీ దేశానికి ఆయన ప్రధానమంత్రి. ప్రపంచం ఆ సత్యాన్ని గ్రహించి ఆ దేశానికి ప్రధాని మనల్ని కలిసేందుకు వచ్చారని గొప్పగా భావిస్తారు.’ - అశోక్ గెహ్లట్ , రాజస్థాన్ ముఖ్యమంత్రి. #WATCH | At 'Mangarh Dham ki Gaurav Gatha’, Raj CM Gehlot says, "...When PM Modi goes aborad, he receives great honour. Because he's PM of the nation of Gandhi, where democracy is deep-rooted. When world realises this, they feel proud that PM of that country is coming to them..." pic.twitter.com/Mi6HaqueRH — ANI (@ANI) November 1, 2022 ఇదే కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రులుగా అశోక్ గెహ్లట్‌తో కలిసి పని చేశామని గుర్తు చేసుకున్నారు. ‘ ముఖ్యమంత్రులుగా అశోక్ జీ, నేను కలిసి పని చేశాం. మన ముఖ్యమంత్రుల్లో ఆయన అత్యంత సీనియర్. ప్రస్తుతం వేదికపై ఉన్న సీఎంలలోనూ ఆయనే సీనియర్.’అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. రాజస్థాన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ట్రైబల్ కమ్యూనిటీ పోరాటం, త్యాగాలను గుర్తు చేసుకున్నారు. స్వాతంత్య్రం తర్వాత ట్రైబల్ కమ్యూనిటీలకు చరిత్రలో సరైన స్థానం లభించలేదన్నారు. అలాంటి దశాబ్దాల కాలం నాటి తప్పులను తాము సవరిస్తున్నామని పేర్కొన్నారు. ఇదీ చదవండి: ఈటల రాజేందర్ కాన్వాయ్‌పై రాళ్ల దాడి.. టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల ఘర్షణ -
ప్రధాని మోదీపై పుతిన్ ప్రశంసల జల్లు
-
ఎన్ని కష్టాలు వచ్చినా సీఎం జగన్ ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు : సజ్జల
-
కాంతార మూవీపై కంగనా రివ్యూ
-
‘కాంతార’ మూవీపై కంగనా రనౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు
కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి తెరకెక్కించిన 'కాంతార' సినిమా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో సంచలనంగా మారింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. తొలుత కన్నడనాట చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ చిత్రం ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందింది. వరుసగా తెలుగు, తమిళం, హిందీలో కాంతార విడుదల కాగా అన్ని వర్గాల ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సినీ ప్రముఖులు సైతం ఈ సినిమా అద్భుతమంటూ కొనియాడుతున్నారు. చదవండి: ఓటీటీకి వచ్చేసిన బింబిసార, అర్థరాత్రి నుంచి స్ట్రీమింగ్ తాజాగా ఈ సినిమా చూసిన ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కాంతారపై ప్రశంసలు కురిపించింది. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా తన అనుభవాన్ని పంచుకుంది. ‘‘ఇప్పుడే కుటుంబంతో కలిసి ‘కాంతార’ సినిమా చూశాను. ఇప్పటికీ నా శరీరం వణుకుతూనే ఉంది. ఇదొక అద్భుతమైన అనుభవం. సాంప్రదాయం, జానపద కథలు, దేశీయ సమస్యల సమ్మేళనమే ఈ చిత్రం. రిషబ్ శెట్టికి హ్యాట్సాఫ్. రచన, దర్శకత్వం, నటన.. అన్నీ మరోస్థాయిలో ఉన్నాయి. ప్రకృతి అందాలను చూపించిన విధానం, యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించిన తీరు అత్యద్భుతంగా ఉంది. చదవండి: కార్తీ ‘సర్ధార్’ మూవీ ట్విటర్ రివ్యూ సినిమా అంటే ఇది. ఇలాంటి చిత్రాన్ని తాము ఎప్పుడూ చూడలేదని థియేటర్లో ప్రేక్షకులు చెబుతున్నారు. ఇలాంటి అద్భుతమైన చిత్రాన్ని అందించిన టీమ్‌కు ధన్యవాదాలు. మరోవారం రోజులపాటు నేను ఈ అనుభూతిలోనే ఉంటాననిపిస్తుంది’ అంటూ చెప్పుకొచ్చింది. అలాగే మరో పోస్ట్ షేర్ చేస్తూ వచ్చే ఏడాది కాంతార ఆస్కార్ నామినేట్ అవ్వడం పక్కా అని పేర్కొంది. ఇంతకంటే గొప్ప చిత్రాలు రావోచ్చు కానీ, మన దేశ సంస్కృతిని, అద్భుతాన్ని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసే ఇలాంటి చిత్రాలను ఆస్కార్‌కు నామినేట్ చేయాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొంది. -
AP: రైతు భరోసా కేంద్రాలకు ఇథియోపియా బృందం ప్రశంసలు
సాక్షి, అమరావతి: ఇథియోపియా బృందంతో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ అయ్యారు. ఏపీ పర్యటనలో భాగంగా ముందుగా గన్నవరంలో ఇంటిగ్రేటెడ్ కాల్‌సెంటర్‌ను ఇథియోపియా బృందం సందర్శించింది. తర్వాత కృష్ణాజిల్లా ఉయ్యూరు మండలం గండిగుంటలో ఆర్బీకే -2 కేంద్రాన్ని సందర్శించింది. చదవండి: సీఎం జగన్‌ను కలిసిన అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ రైతు భరోసా కేంద్రాల వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తోందని, సీఎం జగన్ దార్శనికత కనిపిస్తోందని ఇథియోపియా వ్యవసాయశాఖ మంత్రి అన్నారు. ఆయన ఆలోచనలు క్షేత్రస్థాయిలో అద్భుతంగా అమలవుతున్నాయి. ఆర్బీకేల వ్యవస్థ రైతులకు చేదోడు వాదోడుగా నిలుస్తోంది. ఆర్బీకేల వ్యవస్థ విషయంలో ఈ ప్రభుత్వం నుంచి మేం నేర్చుకోవాల్సింది ఉంది. ఆర్బీకేల్లో వ్యవసాయరంగంలో వివిధ విభాగాల అనుసంధానం బాగుంది. డిజటల్, సాంకేతిక పరిజ్ఞానాన్ని బాగా వినియోగించుకుంటున్నారు. వ్యవసాయరంగంలో మీకున్న పరిజ్ఞానాన్ని మేం వినియోగించుకుంటాం. అలాగే మాకున్న పరిజ్ఞానాన్ని నైపుణ్యాలను మీతో పంచుకుంటాం. వ్యవసాయరంగంలో రైతుకు అండగా నిలవాలి, వారికి మంచి జరగాలన్న మీ అభిరుచి, సంకల్పం క్షేత్రస్థాయిలో మంచి మార్పులకు దారితీయడం మమ్మల్ని అబ్బురపరుస్తోందని’’ ఆయన అన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, ‘‘మీకు మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది, కొనసాగుతుంది. ఏ రూపంలో కావాలన్నా మేం తోడుగా ఉంటాం. అలాగే మీ సహాయాన్ని కూడా తీసుకుంటాం. ఆర్బీకేలను సందర్శించడం, అక్కడ రైతులతో మాట్లాడ్డం సంతోషకరం. ప్రతి గ్రామానికీ కూడా వ్యవసాయరంగంలో ప్రభుత్వం చేపట్టే కార్యకలాపాలు చేరుకోవాలన్నది లక్ష్యం, దీంట్లో భాగంగానే ఆర్బీకేలు వచ్చాయి. కల్తీ విత్తనాలు, కల్తీ పురుగుమందులు, ఎరువుల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్న ఘటనలు ఉన్నాయి. ఈ సమస్యకు పరిష్కారం కోసం మార్గాన్వేషణ చేశాం. అదే సమయంలో రైతుకు సరైన మార్గనిర్దేశం, అవగాహన కల్పించాలన్నది ఉద్దేశం. పంట చేతికి వచ్చిన తర్వాత ధర లేకపోతే రైతులు ఇబ్బంది పడతారు. ఇవన్నీకూడా మిలియన్ డాలర్ల ప్రశ్నలు. వీటికి సమాధానాలు వెతికే ప్రయత్నం చేశాం. అలాగే పారదర్శకతకు పెద్దపీట వేయాలని నిర్ణయించాం. ప్రభుత్వం ఏదైనా కార్యక్రమం చేపడితేం అర్హులందరికీ అది అందాలి. ఈ ఆలోచనల క్రమంలోనే ఆర్బీకేలు, గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ వచ్చింది. గ్రామ సచివాలయానికి విస్తరణగా ఆర్బీకేలు తీసుకు వచ్చాం. అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్‌ను ఆర్బీకేలో పెట్టాం. ఆక్వా ప్రాంతాల్లో ఆరంగంలో గ్రాడ్యుయేట్‌ను, హార్టికల్చర్ సంబంధిత గ్రాడ్యుయేడ్‌ను ఆర్బీకేల్లో ఉద్యోగాల్లో ఉంచాం. ఆర్బీకేల్లో కియోస్క్‌ను కూడా పెట్టాం. ఆర్డర్ ఇచ్చిన వాటిని రైతుల దగ్గరకే చేరుస్తున్నాం. తద్వారా కల్తీ విత్తనాలు, కల్తీ ఎరువులను నివారిస్తున్నాం. ఆర్బీకేల్లో వ్యవసాయ సలహామండళ్లను ఏర్పాటు చేశాం. ఇ–క్రాపింగ్ కూడా చేస్తున్నాం జియో ట్యాగింగ్ కూడా చేస్తున్నాం ఇ– క్రాపింగ్‌ను రైతులు కూడా ఆధీకృతం చేస్తున్నారు. ఫిజికల్ రశీదు, డిజిటల్ రశీదును కూడా ఇస్తున్నాం. పంటలకు వచ్చే ధరలను నిరంతరం పర్యవేక్షించడానికి సీఎంయాప్‌ను కూడా వినియోగిస్తున్నాం. ఎక్కడైనా ధరలు తగ్గితే అలర్ట్ వస్తున్నాయి. ప్రభుత్వం నుంచి జోక్యం చేసుకుని రైతులకు నష్టంరాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నాం. రైతులకు కనీస మద్దతు ధరలు అందిస్తున్నాం. ప్రతిరోజూకూడా విలేజ్‌అగ్రికల్చర్ అసిస్టెంట్ల నుంచి పంటల ధరలపై నివేదికలు తీసుకుంటున్నాం. వ్యవసాయ రంగంలో క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలకు పరిష్కారంగా ఈ విధానాలను అనుసరిస్తున్నాం. అంకిత భావంతో పనిచేసే అధికారుల వల్ల ఇవన్నీకూడా సాకారమవుతున్నాయి. వ్యవసాయంతోపాటు పాడిపరిశ్రమకు తోడ్పాటు ఇవ్వడం ద్వారా రైతులకు అదనపు ఆదాయాలు వచ్చేలా కృషిచేస్తున్నాం. జీవనోపాధి కోసం పట్టణాలకు వచ్చే వలసలను నివారించేందుకు ఈ బృహత్తర కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. విచక్షణ రహితంగా ఎరువులు, రసాయనాలు, పురుగు మందులు వాడకుండా నివారించాలన్నది మరో లక్ష్యం. దీనికోసం మార్చి, ఏప్రిల్, మే నెలల్లో భూసార పరీక్షలు కూడా నిర్వహించడానికి కార్యక్రమాన్ని రూపొందించాం. సాయిల్ టెస్ట్ ఫలితాల ఆధారంగా ఎలాంటి పంటలు వేయాలి? ఎంత మోతాదులో ఎరువులు, రసాయనాలు వాడాలి? అన్నదానిపై రైతులకు పూర్తి అవగాహన కల్పిస్తాం. దీనికి సంబంధించి రిపోర్టు కార్డులను కూడా ఇస్తాం. ప్లాంట్ డాక్టర్ కాన్సెప్ట్‌ను వచ్చే ఏడాది జూన్ నుంచి అమల్లోకి తీసుకు వస్తాం’’ అని సీఎం అన్నారు. ఆర్బీకేల్లో డిజిటల్ సొల్యూషన్స్ విషయంలో తమకు సహకారాన్ని అందించాల్సిందిగా ఇథియోపియా బృందం కోరగా, కచ్చితంగా సహకారం అందిస్తామని సీఎం జగన్ వెల్లడించారు. ఈ భేటీలో ఇథియోపియా బృందంతో పాటు వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, వ్యవసాయశాఖ కమిషనర్ సీహెచ్ హరికిరణ్, ఏపీస్టేట్ సీడ్స్ డవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ డాక్టర్ జి. శేఖర్‌బాబు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
ఏపీలో సీఎం జగన్ పాలన అద్భుతం: మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రశంసలతో ముంచెత్తారు. ఏపీ కష్టాల్లో కూరుకుపోయినపుడు జగన్ ముందుండి నడిపించిన తీరును ఆయన కొనియాడారు. రీ డిజైన్ చేసిన హిందూ ఇంగ్లీష్ పేపర్‌ను బుధవారం కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హిందూ ఎడిటోరియల్ టీమ్‌తో మాట్లాడిన కేటీఆర్.. సంక్షేమ పథకాలపై ఫోకస్ పెట్టిన వైఎస్ జగన్ అభివృద్ధిని పట్టించుకోకుండా పాలన సాగిస్తున్నారని కొంత మంది చేస్తున్న ఆరోపణలను ఖండించారు. కరోనా వైరస్ ఉధృతిలోనూ ఏపీ ఆర్థిక పరిస్థితిని జగన్ చక్కదిద్దారని మంత్రి కేటీఆర్ అన్నారు. చదవండి: (వైఎస్సార్సీపీ శాశ్వత అధ్యక్ష పదవిపై సజ్జల క్లారిటీ) -
‘సీతారామం’ చూసిన ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.. ఏమన్నదంటే..
సీతారామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌పై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నిన్న సీతారామం సినిమా చూసిన ఆమె సోషల్ మీడియా వేదికగా చిత్ర దర్శకుడు హాను రాఘవపూడి, మూవీ టీంకు శుభాకాంక్షలు తెలిపింది. అంతేకాదు మూవీ చాలా అద్భుతంగా ఉందని, ఈ ఎపిక్ లవ్‌స్టోరీ చూస్తున్నంత సేపు మధురానుభూతి కలిగిందంటూ తన అనుభవాన్ని పంచుకుంది. చదవండి: ప్రియుడితో శ్రీసత్య ఎంగేజ్మెంట్ బ్రేక్.. అసలు కారణమిదే! స్క్రీన్‌ప్లే అయితే అత్యంత అద్భుతమంటూ కంగనా సీతారామం చిత్రాని కొనియాడింది. అలాగే హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గురించి స్పెషల్‌గా మరో పోస్ట్ పెట్టింది. ‘ఈ సినిమాలోని నటీనటులందరు చాలా అద్భుతంగా నటించారు. అందులో మృణాల్ నటన బాగా ఆకట్టుకుంది. భావోద్యేగ సన్నివేశాల్లో ఆమె నటించిన తీరు అత్యద్భుతం. తనలా మరేవరూ నటించలేరు అనేంతగా నటన కనబరించింది. మృణాల్ నిజంగానే రాణి. జిందాబాద్ ఠాకూర్ సాబ్. ఇక ముందు ముందు కాలం మీదే’ అంటూ మృణాల్‌పై ప్రశంసలు కురిపించి కంగనా. కాగా దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో అందమైన ప్రేమ కావ్యంగా రూపొందిన ‘సీతారామం’ మూవీ అన్ని భాషల్లో ఘనవిజయం సాధించింది. అన్నివర్గాల ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మారథం పట్టారు. మొత్తంగా ఈ చిత్రం రూ. 100 కోట్ల కలెక్షన్స్‌ను దాటింది. ఇక ఇటీవల ఈ మూవీ హిందీ వెర్షన్ విడుదల కాగా అక్కడ సైతం ఈ మూవీ విశేష ప్రేక్షాదర పొందుతుంది. ఇప్పటికే ‘ది కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి తన రివ్యూ ప్రకటిస్తూ మూవీ హీరోహీరోయిన్లపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. చదవండి: SSMB28: మహేశ్ బాబు-త్రివిక్రమ్ సినిమాకు బ్రేక్! అసలు కారణమిదేనా? -
ఏ జట్టులోనైనా సూర్యకు చోటు ఖాయం.. ఎందుకంటే: ఆసీస్ దిగ్గజం
దుబాయ్: భారత బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌పై ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ ప్రశంసలు కురిపించాడు. అతని ఆట తనను ఎంతో ఆకట్టుకుందని, విధ్వంసకర శైలి ఏబీ డివిలియర్స్‌ను గుర్తుకు తెస్తోందని పాంటింగ్ అన్నాడు. భారత జట్టు తరఫున అతను నాలుగో స్థానంలో ఆడటమే సరైందని పాంటింగ్ సూచించాడు. ‘సూర్యకుమార్ కూడా డివిలియర్స్ తరహాలోనే మైదానమంతా 360 డిగ్రీ షాట్లు ఆడతాడు. ల్యాప్ షాట్, కట్ షాట్, ర్యాంప్ షాట్ల గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. లెగ్‌సైడ్ వైపు మరింత అద్భుతంగా ఆడే సూర్య అటు పేస్ బౌలింగ్, ఇటు స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కోగలడు. ఏ జట్టులోనైనా సూర్యకు చోటు ఖాయం. షాట్లు ఆడే సమయంలో ఎక్కడా వెనక్కి తగ్గకుండా ఆడే సూర్యకుమార్ ఆత్మవిశ్వాసం నన్ను ఆకర్షించింది. నాకు తెలిసి అతను మిడిలార్డర్లో ఆడటం సరైంది. మ్యాచ్‌ను సరిగా నడిపించడంతో పాటు చివర్లో క్రీజ్‌లో ఉంటే చెలరేగిపోగలడు’ అని ఆసీస్ మాజీ కెప్టెన్ విశ్లేషించాడు. చదవండి: Hasin Jahan: ఇండియా పేరు మార్చండి.. ప్రధాని మోదీకి క్రికెటర్ షమీ ‘భార్య’ అభ్యర్ధన -
భారత్‌పై మరోసారి పొగడ్తల వర్షం కురిపించిన ఇమ్రాన్‌ఖాన్
ఇస్లామాబాద్: భారత్‌పై మరోసారి ప్రశంసలు జల్లు కురిపించాడు పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. ఒకవైపు పశ్చిమ దేశాలు రష్యా చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై వస్తున్న విమర్శలను ఖండిస్తూ... పాక్ మాజీ ప్రధాని భారత్ అనుసరిస్తున్న విదేశాంగ విధానాలపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ మేరకు లాహోర్‌లోని భారీ సభను ఉద్దేశిస్తూ... భారత విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ రష్యా చమురు కొనుగోలు విషయమై స్లోవేకియాలో జరిగిన బ్రాటిస్లావా ఫోరమ్‌లో జూన్ 3న మాట్లాడిన వీడియో క్లిప్‌ని ప్లే చేశాడు. రష్యా నుంచి చౌకగా చమురు కొనుగోలు చేయడం విషయంపై భారత్‌పై అమెరికా ఒత్తిడి పెరిగింది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్ పై యుద్ధం చేసేలా రష్యాకు నిధులు చేకూరుస్తున్నారంటూ అమెరికా దాని మిత్ర దేశాలై పశ్చిమ దేశాలు పెద్దఎత్తున్న భారత్‌పై ఆరోపణలు చేశాయి. ఆ సమయంలో విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రజలకు కావల్సినంత మేర గ్యాస్ కొంటాం అని స్పష్టం చేశారు. యూరప్ దేశాలు రష్యా నుంచి గ్యాస్ దిగుమతి చేసుకుంటుండగా కేవలం భారత్‌నే ఎందుకు ప్రశ్నిస్తున్నారని అడిగారు. మరోవైపు రష్యా ఉక్రెయిన్ పై దాడికి దిగడానిన భారత్ ఖండిస్తుందని ఇరుదేశాలు సామరస్య పూర్వకంగా సమస్యలు పరిష్కరించుకునే దిశగా తమ వంతు సాయం అందిస్తామని కూడా భారత్ చెప్పిన విషయాన్ని ఇమ్రాన్ ఖాన్ ప్రస్తావించారు. భారత్-పాకిస్తాన్ ఒకే సమయంలో స్వాతంత్య్రాన్ని పొందాయి. కానీ తమ ప్రజలకు అనుగుణంగా భారత్ విదేశాంగ విధానాన్ని రూపొందించిందని ప్రశంసించారు. అంతేకాదు రష్యా చమురు కొనుగోలు విషయంలో భారత్ పై వస్తున్న విమర్శలను ఖండించడమే కాకుండా న్యూఢిల్లీ అమెరికా ఒత్తిడికి తలవొంచకుండా తీసుకున్న దృఢమైన వైఖరిని ఎంతగానో మెచ్చుకున్నారు. పైగా భారత్ అమెరికా వ్యూహాత్మక మిత్రదేశమని కూడా అన్నారు. కానీ పాక్.. భారత్‌లా చెప్పలేదు. పాక్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం అమెరికా ఒత్తిడికి నో చెప్పే ధైర్యం చేయలేకపోయింది. పైగా ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్నాయి, ప్రజలు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారని వివరణ ఇచ్చుకోలేక పోయింది. అంతేకాదు ఇమ్రాన్ ఖాన్ మరో విషయం గురించి ప్రస్తావిస్తూ... కేవలం భారత్ చౌకగా రష్యా చమురు కొనుగోలుతో యుద్ధానికి నిధులు సమకూరుస్తే మరీ యూరప్ దేశాలు కూడా రష్య చమురు కొనుగోలు చేస్తున్నాయి కదా మరీ అవి కూడా యుద్ధానికి నిధులు సమకూర్చినట్లేనా! ఒక్కసారి ఆలోచించండి అని భారత్‌కి మద్ధతుగా మాట్లాడారు. ( చదవండి: మా చేతులు కట్టేసినట్లు ఉండేది.. ప్రతి చోట బెదిరింపులే: ఇమ్రాన్ ఖాన్) -
అఖిల్ 'ఏజెంట్' టీజర్‌పై మహేశ్ బాబు రివ్యూ..
Mahesh Babu Praises On Akhil Agent Teaser: అఖిల్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఏజెంట్’. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఆగస్ట్ 12న విడుదల కానుంది. హై ఓల్టేజ్ యాక్షన్ అండ్ స్పై థ్రిల్లర్‌గా తరెక్కిన ఈ చిత్రం టీజర్ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. మూవీ టీజర్, అఖిల్ లుక్స్ సినిమాపై అంచనాలు పెంచేసింది. కాగా ఈ మూవీ టీజర్‌ను, అఖిల్ లుక్స్‌ను పలువురు కొనియాడారు. తాజాగా ఈ టీజర్‌పై సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రశంసలు కురిపించారు. 'ఏజెంట్ టీజర్ అద్భుతంగా ఉంది. విజువల్స్, సినిమా థీమ్ ఎంతో నచ్చింది. చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్.' అని ట్విటర్ వేదికగా ట్వీట్ చేశాడు మహేశ్ బాబు. ఈ ట్వీట్‌పై అఖిల్ స్పందించాడు. 'థ్యాంక్యూ బ్రదర్. మీ సపోర్ట్, ప్రోత్సాహాం ఎంతో విలువైనది.' అని రీట్వీట్ చేశాడు. అలాగే శర్వానంద్ ట్వీట్‌పై కూడా స్పందించాడు అఖిల్. ప్రస్తుతం 'ఏజెంట్' టీజర్ యూట్యూబ్‌లో మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతోంది. చదవండి: మళ్లీ పొట్టి దుస్తుల్లో రష్మిక పాట్లు.. వీడియో వైరల్ అలియా భట్‌కు కవలలు ? రణ్‌బీర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. చోర్ బజార్లో రూ.100 పెట్టి జాకెట్ కొన్నా: స్టార్ హీరో #AgentTeaser looks absolutely stunning!! Love the visuals and the theme of the film! All the best @mammukka sir @AkhilAkkineni8 @AnilSunkara1 @DirSurender and the entire team! Looking forward! :)https://t.co/ecNasoflIr — Mahesh Babu (@urstrulyMahesh) July 16, 2022 Thank you so much brother 🙏🏻 we are thrilled to see your support and encouragement. Means a lot 🙏🏻 https://t.co/ps7kOMeAdT — Akhil Akkineni (@AkhilAkkineni8) July 16, 2022 -
'ఆర్ఆర్ఆర్'పై కేండ్రా లస్ట్ ట్వీట్.. నెట్టింట జోరుగా చర్చ
Kendra Lust Tweet On RRR: జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ మల్టీస్టారర్‌గా దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ ఏడాది మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డు సృష్టించింది. విజువల్ ఎఫెక్ట్స్, మ్యూజిక్, యాక్టింగ్.. ఇలా అన్ని కోణాల్లో తిరుగులేదు అనిపించింది ఈ మూవీ. థియేటర్లలో కాసుల వర్షం కురిపించిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రస్తుతం ఓటీటీలోనూ దుమ్ములేపుతోంది. అంతేకాకుండా ఈ సినిమాపై హాలీవుడ్ రచయితలు, దర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. తాజాగా ఈ మూవీని ఒక పోర్న్ స్టార్ పొగడ్తలతో ముంచెత్తింది. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారింది. 'ఆర్ఆర్ఆర్' సినిమాను ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో చూసిన పోర్న్ స్టార్ కేండ్రా లస్ట్ ట్విటర్ వేదికగా కొనియాడింది. ''నెట్‌ఫ్లిక్స్‌లో 'ఆర్ఆర్ఆర్' సినిమా చూశాను. చాలా అద్భుతంగా ఉంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ నటన, స్టంట్స్, డైలాగ్ డెలీవరీ, పాటలు, సినిమాటోగ్రఫీ .. ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉంది. హీరోలిద్దరూ చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు. వారిద్దరి నటన 'ఆర్ఆర్ఆర్'కు ఆత్మలాంటింది'' అని ట్వీటింది కేండ్రా లస్ట్. ప్రస్తుతం సోషల్ మీడియాలో 'ఆర్ఆర్ఆర్'పై కేండ్రా లస్ట్ ట్వీట్ చేయడం గురించి నెటిజన్లు జోరుగా డిస్కషన్ పెట్టారు. మరిన్ని ఇండియన్ మూవీస్ చూసి తన అభిప్రాయం చెప్పమని కోరుతున్నారు. అలాగే 'డాక్టర్ స్ట్రేంజ్' రైటర్ సి రాబర్ట్ గిల్, 'స్పైడర్ మ్యాన్ వర్స్' రైటర్, నిర్మాత క్రిస్టోఫర్ మిల్లర్ తదితరులు కూడా నెట్‌ఫ్లిక్స్‌లో 'ఆర్ఆర్ఆర్'ను వీక్షించి ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. చదవండి: నా భర్త నేను ఎప్పుడో ఓసారి కలుసుకుంటాం: స్టార్ హీరోయిన్ 36 ఏళ్ల క్రితం సినిమాలకు సీక్వెల్.. ఈ హీరోలకు కమ్‌బ్యాక్ హిట్.. నితిన్‌కు అసలు డ్యాన్సే రాదు: అమ్మ రాజశేఖర్ ధనుష్ కోసం ఇండియా వస్తున్న హాలీవుడ్ దర్శకులు.. -
అందుకు నాకు అర్హత లేదు: మహేశ్ బాబు
ఉలగ నాయగన్ (లోక నాయకుడు) కమల్ హాసన్ సూపర్ హిట్ కమ్‌బ్యాక్ ఇచ్చిన చిత్రం 'విక్రమ్'. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్‌గా మారింది. జూన్ 3న విడుదలై సక్సెస్ సాధించడమే కాకుండా జులై 8 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్కు సిద్ధంగా ఉంది. రూ. 400 కోట్లకుపైగా వసూళ్లు కొల్లగొట్టిన 'విక్రమ్' సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటోంది. తాజాగా ఈ మూవీపై టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు పొగడ్తల వర్షం కురిపించాడు. ఇప్పటి సినిమాల్లో న్యూ ఏజ్ కల్ట్ క్లాసిక్ మూవీగా అభివర్ణించాడు. 'విక్రమ్ బ్లాక్‌బస్టర్ సినిమా. ఒక న్యూ ఏజ్ కల్ట్ క్లాసిక్ చిత్రం. లోకేశ్ కనకరాజ్.. నేను మిమ్మల్ని కలిసి విక్రమ్ మూవీ ప్రారంభం నుంచి చివరి వరకు షూటింగ్ ఎలా జరిగిందో తెలుసుకోవాలని ఉంది. విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ తమ అద్భుతమైన నటనతో మెరిపించేశారు. అనిరుధ్ బెస్ట్ మ్యూజిక్ అందించాడు. చాలాకాలం తర్వాత నా ప్లే లిస్ట్ టాప్‌లో విక్రమ్ ఉంది. ఇక చివరిగా లెజెండ్ కమల్ హాసన్ నటన గురించి చెప్పేందుకు నాకు అర్హత లేదు. ఒక అభిమానిగా చాలా గర్వంగా ఉంది. మీకు, మీ అద్భుతమైన బృందానికి శుభాకాంక్షలు.' అని మహేశ్ బాబు ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. చదవండి: ఫ్రెండ్‌తో బెడ్ షేర్.. అబార్షన్.. ఎలాంటి పశ్చాత్తాపం లేదు: నటి 3 సార్లు పెళ్లి వరకు.. దేవుడు దయతో బయటపడ్డ: స్టార్ హీరోయిన్ And finally about the legend @ikamalhaasan... not qualified enough to comment about the acting 😊 All I can say is.. as your biggest fan, it was one of my proudest moments!! Congrats to you Sir and your wonderful team. 👍👍👏👏👏@RKFI @Udhaystalin — Mahesh Babu (@urstrulyMahesh) July 2, 2022 -
‘విరాట పర్వం’ మూవీపై తమిళ స్టార్ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు
టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన సినిమాల్లో ‘విరాటపర్వం’ ఒకటి. దగ్గుబాటి రానా, హీరోయిన్ సాయిపల్లవి జంటగా నటించిన ఈ చిత్రం జూన్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ హిట్‌టాక్‌తో దూసుకుపోతుంది. తొలిసారి నక్సలిజం నేపథ్యంలో ఓ ప్రేమ కథా చిత్రం కావడంతో ప్రేక్షకులను ఈ మూవీ బాగా ఆకట్టుకుంటుంది. అందులోనే 1990లో నక్సలైట్ల చేతిలో హత్యకు గురైన సరళ అనే యువతి జీవితంలో చోటుచేసుకున్న సంఘటనల ఆధారంగా విరాట పర్వం రూపొందింది. చదవండి: ‘విక్రమ్’ మూవీలో విలన్స్‌తో ఫైట్ చేసిన ఈ పని మనిషి ఎవరో తెలుసా? రానా కామ్రేడ్ రవన్న పాత్ర పోషించగా.. సాయి పల్లవి లీడ్రోల్లో కనిపించింది. ఇక ప్రియమణి, నవీన్ చంద్ర తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఇక ఈ మూవీలో రానా, సాయి పల్లవిల నటలకు ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు సైతం ఫిదా అవుతున్నారు. ఇప్పటికే దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావుతో పాటు చిరంజీవి, వెంకటేశ్ వంటి స్టార్ హీరోలు ఈ మూవీని కొనియాడారు. తాజాగా తమిళ స్టార్ డైరెక్టర్ సైతం విరాట పర్వం మూవీపై స్పందించడం విశేషం. ప్రముఖ తమిళ డైరెక్టర్ పా రంజిత్ సోషల్ మీడియా వేదికగా విరాట పర్వం మూవీపై ప్రశంసలు కురిపించాడు. చదవండి: మరో పెళ్లి చేసుకోబోతున్న సీనియర్ హీరో నరేష్ ! ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. ‘ఈ మధ్య కాలంలో నేను చూసిన సినిమాల్లో విరాట పర్వం అత్యుత్తమైంది. ఎక్కడా రాజీ పడకుండా ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు వేణు ఉడుగుల, నిర్మాతలు ప్రశంసలకు అర్హులు. రానా వంటి స్టార్ హీరో ఇలాంటి పాత్రను అంగీకరించి చేసినందుకు అతడిని ప్రత్యేకంగా అభినందించాల్సిందే. ఇక సాయి పల్లవి అయితే చాలా అద్భుతంగా నటించింది. ఇలాంటి మంచి సినిమాను అందించిన మూవీ టీమ్‌కు స్పెషల్ థ్యాంక్స్’ అంటూ రాసుకొచ్చాడు. కాగా, విరాట పర్వం చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్, శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో సుధాకర్ చెరుకూరి, సురేశ్ బాబులు సంయుక్తంగా నిర్మించారు. #Viraataparvam is the best Telugu film I've watched in recent times. Producers & dir @venuudugulafilm deserve much appreciation for making this film without any compromises.Special appreciations to @RanaDaggubati for accepting &doing this role & @Sai_Pallavi92 has done superbly👏 — pa.ranjith (@beemji) June 19, 2022 -
'విరాట పర్వం' సినిమాపై రాఘవేంద్ర రావు రివ్యూ..
Director Raghavendra Rao Praises Virata Parvam: టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూసిన సినిమాల్లో ‘విరాటపర్వం’ ఒకటి. దగ్గుబాటి రానా, టాలెంటెడ్ హీరోయిన్ సాయిపల్లవి జంటగా నటించడం, తొలిసారి నక్సలిజం నేపథ్యంలో ఓ ప్రేమ కథా చిత్రం వస్తుండడంతో సినీ ప్రేమికులకు ‘విరాటపర్వం’పై ఆసక్తి పెరిగింది. ఈ మూవీ అనేక అంచనాల మధ్య జూన్ 17న విడుదలైంది. రిలీజైనప్పటి నుంచి మంచి టాక్‌తో దూసుకుపోతోంది. రానా, సాయి పల్లవి నటనపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ డైరెక్టర్ దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు 'విరాట పర్వం' సినిమాను కొనియాడారు. 'కుర్రవాడైన వేణు ఊడుగుల దర్శకత్వం ఎంతో అద్భుతంగా ఉంది. చాలా అనుభవమున్న డైరెక్టర్ అనిపించుకున్నాడు. అలాగే రానా, సాయి పల్లవి నటన ఎక్సలెంట్. కచ్చితంగా చూడాల్సిన చిత్రం విరాట పర్వం.' అని దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు కితాబిచ్చారు. చదవండి: థియేటర్లో అందరిముందే ఏడ్చేసిన సదా.. వీడియో వైరల్ ఆ హీరోలా ఎఫైర్స్ లేవు.. కానీ ప్రేమలో దెబ్బతిన్నా: అడవి శేష్ ఓటీటీలోకి 'విరాట పర్వం'.. ఎప్పుడంటే ? -
వైఎస్ జగన్ ప్రభుత్వానికి కేంద్రమంత్రి మురుగన్ ప్రశంసలు
-
పేదలకు ఇళ్ల కల్పనలో ఏపీ టాప్.. కేంద్రమంత్రి ప్రశంస
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): పేదలందరికీ ఇళ్ల కల్పనలో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉందని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ప్రశంసించారు. ప్రధాని మోదీ, సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో దేశం, రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయన్నారు. ఆదివారం విశాఖలో పీఎంఏవై, ఉజ్వల పథకాల లబ్ధిదారులతో నిర్వహించిన ముఖాముఖిలో ఆయన పాల్గొన్నారు. హర్దీప్ సింగ్ మాట్లాడుతూ.. ప్రతి పేద కుటుంబానికి ఇల్లు ఉండాలనేది ప్రధాని మోదీ లక్ష్యమని చెప్పారు. దేశవ్యాప్తంగా కోటి కుటుంబాలకు ఇళ్లు నిర్మించాలని నిర్ణయించగా.. అంచనాలకు మించి ఇప్పటివరకు కోటి 22 లక్షల ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు. చదవండి: ఏది నిజం?: బాబు కోసమే ఆ ‘మత్తు’!! ఇందులో ఏపీకి 20 లక్షల ఇళ్లు కేటాయించినట్లు చెప్పారు. ఏపీకి మరో 5 లక్షల ఇళ్లు మంజూరు చేయాల్సిన అవసరముందని మంత్రి జోగి రమేష్ తన దృష్టికి తీసుకొచ్చారని.. త్వరలో వాటిని కూడా మంజూరు చేసేందుకు కృషి చేస్తానన్నారు. ఉజ్వల పథకం ద్వారా దేశవ్యాప్తంగా 8 కోట్ల కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించగా.. అంచనాకు మించి ఇప్పటివరకు 9 కోట్ల కనెక్షన్లు ఇచ్చామన్నారు. ముఖాముఖిలో లబ్ధిదారుల మనోభావాలు తనకెంతో ఆనందాన్ని ఇచ్చాయని చెప్పారు. పలువురు లబ్ధిదారులకు ఇళ్ల తాళాలు కేంద్రమంత్రి అందజేశారు. అలాగే రూ.203.56 కోట్లను 42,343 మంది పీఎంఏవై లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ రాష్ట్రవ్యాప్తంగా 17 వేలకు పైగా జగనన్న కాలనీలను నిర్మిస్తున్నారని వివరించారు. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్, ఎమ్మెల్సీ మాధవ్, కలెక్టర్ మల్లికార్జున పాల్గొన్నారు. ఒక్క రూపాయికే రిజిస్ట్రేషన్ గతంలో ప్రభుత్వమిచ్చిన ఇంటిని రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు రూ.లక్షలు చెల్లించేవారని.. కానీ సీఎం వైఎస్ జగన్ కేవలం ఒక్క రూపాయికే నా పేరున ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించారు. మా కుటుంబం మొత్తం ఎలాంటి ఇబ్బంది లేకుండా సొంతింట్లో ఉంటున్నాం. – తులసి త్రివేణి, లబ్ధిదారు -
ఏపీ ప్రభుత్వంపై కేంద్రమంత్రి ప్రశంసలు
-
ఏపీ ప్రభుత్వంపై కేంద్రమంత్రి ప్రశంసలు
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై కేంద్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ ప్రశంసలు కురిపించారు. కోవిడ్ టీకాలు అందించడంలో ఏపీ ప్రభుత్వం పనితీరు అభినందనీయమన్నారు. ఏపీలో కోవిడ్ వ్యాక్సినేషన్ శరవేగంగా సాగిందన్నారు. ఏపీ ప్రభుత్వం 99 శాతం రెండు డోసుల టీకాలను అందించిందన్నారు. చదవండి: చిరు వ్యాపారులకు గుడ్‌న్యూస్.. ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు.. కోవిడ్ వ్యాక్సినేషన్‌ను శరవేగంగా అందించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఫెడరల్ స్ఫూర్తితో రాష్ట్రాలతో కలిసి పనిచేస్తున్నామన్నారు. ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు 3 మెడికల్ కళాశాలలు మంజూరు చేశామని.. మిగిలిన వాటిని దశల వారీగా మంజూరు చేస్తామని కేంద్రమంత్రి వెల్లడించారు. -
దేవుడినైనా ఏమార్చవచ్చు.. కానీ ఏఆర్ రెహమాన్‌ను ఏమార్చలేం: డైరెక్టర్
చెన్నై సినిమా: సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ (AR Rahman) కాదంటే ఈ చిత్రం ఉండేది కాదని 'ఇరవిన్ నిళల్' (Iravin Nizhal) చిత్ర దర్శకుడు, కథానాయకుడు పార్తిపన్ (Parthiban) అన్నారు. ఈయన సింగిల్ షాట్లో తెరకెక్కించి గిన్నీస్ రికార్డు కెక్కిన ఈ చిత్రానికి ఏఆర్. రెహ్మాన్ సంగీతం అందించారు. ఈ చిత్ర విడుదల హక్కులను నిర్మాత కలైపులి ఎస్. ధాను పొంది ఈ నెల 24వ తేదీన విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా, చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని పార్తిపన్ ఆదివారం రాత్రి స్థానిక ఐఐటీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పార్క్ ఆవరణలో వైవిధ్యభరితంగా నిర్వహించారు. సంగీత దర్శకుడిగా 30 వసంతాలు పూర్తి చేసుకున్న ఏఆర్ రెహమాన్‌ను ఈ వేదికపై ఘనంగా సత్కరించారు. ఈ వేడుకకు బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ ముఖ్య అతిథిగా హాజరుకావడం విశేషం. పార్తిపన్ మాట్లాడుతూ వైవిధ్యభరిత కథా చిత్రాన్ని చేయాలనుకున్నప్పుడు మంచి సపోర్ట్ అవసరం అయ్యిందని, ఆ సపోర్టే ఏఆర్ రెహమాన్ అని పేర్కొన్నారు. అయితే భగవంతుడినైనా అభిషేకంతో ఏమార్చవచ్చు గానీ మన ఏఆర్ రెహమాన్‌ను ఏమార్చలేమని అభిప్రాయపడ్డారు. చదవండి: భూమిక ఇంగ్లీషులో భయంకరంగా తిట్టింది: నిర్మాత ఎంఎస్ రాజు దెయ్యాలంటే భయం లేదు.. కానీ ఆరోజు చావును దగ్గర నుంచి చూశా: స్టార్ హీరోయిన్ పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్.. ఇప్పుడు మరో నటుడితో ప్రేమాయణం -
రాజమౌళి సార్ మీకు మాకు ఒకటే తేడా: సుకుమార్
RRR Movie: Sukumar Praise On SS Rajamouli: ఓటమెరుగని దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చిత్రం రౌద్రం.. రణం.. రుధిరం.. 'ఆర్ఆర్ఆర్'. యావత్ భారతదేశం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఈ చిత్రం మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియాగా తెరకెక్కిన ఈ మూవీ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తుంది. సూపర్ హిట్ టాక్‌తో ఏ థియేటర్ వద్ద చూసినా సందడి వాతావరణం నెలకొంది. ఇక రామ్‌చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొమురం భీమ్‌గా తారక్, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్ నటనకు జనం నీరాజనాలు పడుతున్నారు. దేశం నలువైపుల నుంచి జక్కన్న, మూవీ టీంపై ప్రశంసలు కురుస్తున్నాయి. చదవండి: 'ఆర్ఆర్ఆర్'పై కెఆర్కె రివ్యూ.. జక్కన్నపై షాకింగ్ కామెంట్స్ ఈ క్రమంలోనే 'ఆర్ఆర్ఆర్'ను వీక్షించిన క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ జక్కన్నను పొగడ్తలతో ముంచెత్తారు. 'మీరు పక్కనే ఉన్న మిమ్మల్ని అందుకోవాలంటే పరిగెత్తాలి.. మేం ఆకాశంలో ఉన్నా మిమ్మల్ని చూడాలంటే మేం తలెత్తాలి', 'రాజమౌళి సార్ మీకూ మాకు ఒకటే తేడా.. ఇలాంటి సినిమా మీరు తీయగలరు.. మేం చూడగలం అంతే..' అని సుకుమార్ ఆయన ఫేస్బుక్ అకౌంట్లో ఒక పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక డైరెక్టర్ మరో డైరెక్టర్‌ను ఇలా ప్రశంసించిన సుకుమార్ పట్ల నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. నిజానికి సుకుమార్‌కి రాజమౌళి అభిమాని. ఎనర్జీటిక్ స్టార్ రామ్ హీరోగా సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన జగడం మూవీలోని ఒక షాట్‌కి తను ఎప్పటికీ ఫ్యాన్ అని పలు ఇంటర్వ్యూల్లో జక్కన్న చెప్పిన సంగతి తెలిసిందే. చదవండి: ఆర్ఆర్ఆర్ మూవీ ఎలా ఉందంటే.. -
ప్రాణాలకు ముప్పని తెలిసినా.. అమెరికాకు తెగేసి చెప్పాడు..
కీవ్: దండెత్తి వచ్చింది బాహుబలి. ఎదిరించేందుకు తన బలం, బలగం ఏమాత్రమూ చాలవు. అయినా సరే, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ చూపుతున్న తెగువపై ప్రశంసల వర్షం కురుస్తోంది. రష్యా తన దగ్గరున్న మారణాయుధాలన్నీ మోహరించి అన్నివైపుల నుంచి భీకరమైన దాడి చేస్తున్నా నాయకుడిగా సైన్యాన్ని జెలెన్స్కీ ముందుండి నడిపిస్తున్న తీరు అందరి హృదయాలను గెలుచుకుంటోంది. పరాజయం తప్పదన్నప్పుడు ఎవరైనా సాధారణంగా పలాయన మంత్రం పఠిస్తాస్తారు. కానీ జెలెన్స్కీ మాత్రం పోరాటమే తన బాట అంటున్నారు. ఉక్రెయిన్ నుంచి క్షేమంగా బయట పడేస్తామంటూ అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఇచ్చిన ఆఫర్‌ను కూడా ఆయన తిరస్కరించారు. తనకి ఇప్పుడు కావల్సింది ఆయుధాలే తప్ప పలాయనం కాదని తెగేసి చెప్పి ఉక్రెయిన్ సేనల ఆత్మస్థైర్యాన్ని పెంచారు. చదవండి: (ఉక్రెయిన్ రాజధాని... కీవ్‌లో రణరంగం) అఫ్గానిస్థాన్‌లో 2021 ఆగస్టు 15న తాలిబన్లు కాబూల్ సరిహద్దుల్లోకి రాగానే ప్రాణభయంతో దేశం వదిలి పారిపోయిన అప్పటి అధ్యక్షుడు హమీద్ కర్జాయ్‌తో జెలెన్స్కీని ప్రజలు పోల్చి చూసుకుంటున్నారు. అప్పట్లో ఇరాక్‌ను ఆక్రమించిన అమెరికా, అధ్యక్షుడు సద్దాం హుస్సేన్‌కు పారిపోవడానికి అవకాశమిచ్చినా ఆయన ఇష్టపడలేదు. కానీ ఓటమి తప్పదని తేలాక అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అమెరికాకు ముచ్చెమటలు పట్టించిన అంతర్జాతీయ ఉగ్రవాది బిన్ లాడెన్ కూడా అగ్రరాజ్యం తనను వేటాడేందుకే నిర్ణయించుకుందని తెలిసి ప్రాణభయంతో వణికిపోయారు. 11 ఏళ్లపాటు రహస్య జీవితం గడిపారు. కానీ ఓటమి వెక్కిరిస్తోందని, రాజధాని కీవ్ కూలిపోతుందని తెలుస్తూనే ఉన్నా, తన ప్రాణాలే ప్రమాదంలో ఉన్నాయని అర్థమవుతున్నా జెలెన్స్కీ మాత్రం ఉక్రెయిన్ను వదిలే ప్రసక్తే లేదని ప్రకటించి శెభాష్ అన్పించుకుంటున్నారు. — Володимир Зеленський (@ZelenskyyUa) February 26, 2022 రష్యన్ అనర్గళంగా మాట్లాడే యూదు అయిన జెలెన్స్కీ తొలుత నటుడు. కామెడీ షోలతో ప్రేక్షకుల్ని అలరిస్తూ అనుకోకుండా అధ్యక్షుడయ్యారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ పిచ్చుకపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినప్పటికీ వెన్ను చూపకుండా చివరికంటూ పోరాటం చేయాలని కృతనిశ్చయంతో ముందుకు వెళుతున్నారు. ఒంట్లోని ఆఖరి రక్తం బొట్టు ఉన్నంతవరకు పోరాడాలన్న స్ఫూర్తిని రగిలిస్తున్నారు. నాయకుడు ప్రదర్శిస్తున్న ధైర్య సాహసాలను చూసిన ఉక్రెయిన్ ప్రజలు కూడా ధైర్యం చిక్కబట్టుకుంటున్నారు. భార్యా పిల్లల్ని సురక్షిత ప్రాంతాలకు పంపిస్తూ మగవాళ్లు కదన రంగంలోకి దూకుతున్నారు. కన్నీళ్లకే కన్నీళ్లు వచ్చే దయనీయ పరిస్థితుల్లో యుద్ధభూమిని వదలకూడదన్న జెలెన్స్కీ పోరాటపటిమను చూసిన వారు రీల్ లైఫ్‌లో కమేడియన్ అయినా రియల్ లైఫ్‌లో ఆయనే హీరో అంటూ కీర్తిస్తున్నారు. -
సితార డ్యాన్స్ వీడియోపై మహేశ్ ఏమన్నాడంటే..
Mahesh Babu Comments On Sitara Cute Dance To Kalavathi Song: సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కూతురు సితార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆరేళ్ల వయసులోనే సోషల్ మీడియాలోకి అడుగుపెట్టి తన యూనిక్ స్టైల్‌తో బోలెడంత పాపులారిటీ సంపాదించుకుంది. తండ్రికి తగ్గ కూతురిగానే కాకుండా తనకంటూ స్పెషల్ ఇమేజ్ను ఏర్పరచుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సితార తాజాగా తండ్రి, మహేశ్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాలోని కళావతి సాంగ్‌కు స్టైలిష్ స్టెప్పులేసి మెస్మరైజ్ చేసింది. ఇది చూసిన సూపర్ స్టార్ మహేశ్‌బాబు.. 'మై స్టార్.. నన్ను బీట్ చేసింది' అంటూ ఇన్‌స్టాలో కూతురిపై ప్రశంసలు కురిపించారు. మహేశ్ భార్య నమ్రత సైతం ఇంకేం చెప్పగలను? లవ్యూ మై లిటిల్ వన్ అని పేర్కొంది. ఇక సితార డ్యాన్స్‌కు మహేశ్ అభిమానులు సహా నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అచ్చం నాన్నలాగే సూపర్‌స్టార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: 'కళావతి' పాటకు మహేశ్ బాబు కూతురు సితార స్టెప్పులు View this post on Instagram A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni) -
సీఎం జగన్‌పై చినజీయర్ స్వామి ప్రశంసలు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై చినజీయర్ స్వామి ప్రశంసలు కురిపించారు. సీఎం జగన్ నిబద్ధతను చూసి ఆశ్చర్యపోయానన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అన్ని వర్గాల ప్రజలకు నాణ్యమైన విద్యను అందిస్తున్న వైఎస్ జగన్‌ను అభినందిస్తున్నానని చినజీయర్ స్వామి తెలిపారు. చదవండి: అగ్రి ఇన్ఫ్రా ప్రాజెక్టుల్లో గణనీయ పురోగతి కనిపించాలి: సీఎం జగన్ ప్రతీ పాలకుడు అందరినీ సమానంగా చూస్తూ వారి అవసరాలను గుర్తించి వాటిని పూర్తి చేయాలన్నారు. విద్య, వయస్సు, ధనం, అధికారం నాలుగు కలిగి ఉన్నవారు ఇతరుల సలహాలు తీసుకోరు. కానీ ఇవన్నీ ఉన్న వైఎస్ జగన్‌లో ఎలాంటి గర్వం లేదని చినజీయర్ స్వామి అన్నారు. వైఎస్ జగన్ అందరి సలహాలను స్వీకరిస్తారు.. సలహాలను పాటిస్తారు. వైఎస్ జగన్ మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని కోరుకుంటున్నానని చినజీయర్ స్వామి అన్నారు. వైఎస్సార్‌ను గుర్తు చేసిన చినజీయర్ స్వామి.. దివంగత మహానేత వైఎస్సార్‌ను చినజీయర్ స్వామి గుర్తు చేశారు. శ్రీరామానుజ సహస్రాబ్ధి ఉత్సవాల్లో ఆయన మాట్లాడుతూ, వైఎస్సార్ అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేశారన్నారు. -
అల్లు అర్జున్,యశ్‌లపై కంగనా సంచలన వ్యాఖ్యలు..
ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాలతో పాటు కాంట్రవర్సరీలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంది. తాజాగా సౌత్ స్టార్స్‌పై కంగనా చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. బాలీవుడ్ కల్చర్, నెపోటిజాన్ని తీవ్రంగా వ్యతిరేకించే కంగనా తాజాగా మరోసారి తనదైన స్టైల్లో బాలీవుడ్‌పై విరుచుకుపడింది. అయితే ఈసారి సౌత్ ఇండస్ట్రీని పొగడ్తలతో ముంచెత్తింది. సౌత్ స్టార్స్ అల్లు అర్జున్,యశ్‌ల ఫోటోలు షేర్ చేసిన కంగనా దక్షిణాది హీరోలకు, సినిమాలకు ఎందుకు అంత ఆదరణ లభిస్తుందన్నది ప్రస్తావించింది. దక్షిణాది స్టార్స్ మన దేశ సంస్కృతి సంప్రదాయ మూలాలకు కట్టుబడి ఉంటారు. వారు తమ కుటుంబాలకు, బాంధవ్యాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. సినిమాపై సినిమాపై వారికున్న ప్యాషన్, వృతిపరమైన నిబద్ధత అపారమైనది అంటూ ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చింది. అంతేకాకుండా బాలీవుడ్ మిమ్మల్ని పాడు చేయడానికి ప్రయత్నించవచ్చు. వారి వలలో చిక్కుకోకండి అంటూ పేర్కొంది. దీనికి పుష్పలోని ఊ అంటావా.. ఊఊ అంటావా అనే సాంగ్‌ను సైతం యాడ్ చేసింది. ఇక కేజీఎఫ్, పుష్ప సినిమాలతో యశ్, అల్లుఅర్జున్ పాన్ ఇండియా స్థాయిలో ఎంతలా పాపులారిటీ తెచ్చుకున్నారో తెలిసిందే. -
కమలతో కలిసే 2024లో పోటీ!
వాషింగ్టన్: వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్‌తో కలిసే పోటీ చేస్తానని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ప్రకటించారు. కమల పనితీరుపై ఆయన ప్రశంసలు కురిపించారు. 2024లో తాను అధ్యక్ష పదవికి, కమల ఉపాధ్యక్ష పదవికి కలిసే పోటీ చేస్తామన్నారు. కమల పనితీరుపై ఇటీవల కాలంలో మీడియాలో నెగెటివ్ కథనాలు వస్తున్న నేపథ్యంలో బైడెన్ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. రాబోయే ఎన్నికల్లో డెమొక్రాట్ టికెట్‌పై పోటీచేస్తారా? అన్న ప్రశ్నకు ఇప్పుడే ఏమీ చెప్పలేనని బుధవారం కమలా హారిస్ చెప్పిన సంగతి తెలిసిందే! దీంతో ఆమె మరోమారు బరిలోకి దిగకపోవచ్చన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే బైడెన్ తాజా ధ్రువీకరణతో కమల బరిలో ఉంటుందని స్పష్టమైంది. 2024కు బైడెన్‌కు 81 సంవత్సరాలు వస్తాయి. ఆ వయసులో ఆయన మరోమారు అధ్యక్ష పదవికి పోటీ చేయడంపై పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే బైడెన్, కమల మధ్య సంబంధాలు కూడా ఇటీవల కాలంలో కొంత మసకబారినట్లు వార్తలున్నాయి. తన సామర్ధ్యాన్ని పార్టీ పూర్తిగా ఉపయోగించుకోవడం లేదని, క్లిష్ట విషయాల్లో తనను బలిపశువును చేస్తున్నారని కమల భావిస్తున్నట్లు కొన్ని వర్గాలు తెలిపాయి. కానీ బహిరంగంగా మాత్రం వీరిద్దరూ ఒకరిపై ఒకరు ప్రశంసలు గుప్పించుకుంటూనే ఉన్నారు. ఉక్రెయిన్‌తో పూర్తి స్ధాయి యుద్ధానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ సాహసించకపోవచ్చని బైడెన్ అభిప్రాయపడ్డారు. అదే జరిగితే పుతిన్ తగిన మూల్యం చెల్లించాల్సివస్తుందని హెచ్చరించారు. అయితే ఏదో రూపంలో రష్యా ఉక్రయిన్పై చర్యలకు ఉపక్రమించవచ్చని ఆయన అంచనా వేశారు. -
'పుష్ప'రాజ్‌కు బాలీవుడ్ ఫిదా.. జాన్వీ కపూర్ ప్రశంసలు
Janhvi Kapoor Praises Allu Arjun For Pushpa Movie: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషనల్లో వచ్చిన క్రేజీ హ్యాట్రిక్ చిత్రం 'పుష్ప: ది రైజ్'. డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ పాన్ ఇండియా మూవీ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. తెలుగులో మించి హిందీలో అత్యధిక కలెక్షన్లు రాబట్టింది. ఇటీవల ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియోలో జనవరి 7న దక్షిణాది భాషల్లో విడుదలైంది పుష్ప చిత్రం. కానీ హిందీలో ఇంకా విడుదల కాలేదు. త్వరలో జనవరి 14న సంక్రాంతి కానుకగా హిందీలో కూడా రిలీజ్ చేయనుంది అమెజాన్. ఇదిలా ఉంటే బాలీవుడ్లో 'పుష్ప' ఫైర్ గట్టిగానే అంటుకుంది. స్టార్ హీరోలు, ప్రొడ్యూసర్లతోపాటు హీరోయిన్లు కూడా పుష్ప రాజ్‌కు ఫిదా అవుతున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనపై రీసెంట్గా దర్శకనిర్మాత కరణ్ జోహార్ ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. అలాగే బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ కూడా అల్లు అర్జున్ను, 'పుష్ప' సినిమాను పొగిడాడు. ఆర్య సినిమా నుంచే బన్నీకి ఫ్యాన్ అంటూ తన ఇన్‌స్టా గ్రామ్‌లో రాసుకొచ్చాడు. తాజాగా అర్జున్ చెల్లెలు జాన్వీ కపూర్ సైతం పుష్పరాజ్‌ను మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. సోషల్ మీడియా వేదికగా పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ యాక్టింగ్‌పై ప్రశంసలు కురిపించింది. అంతేకాకుండా ప్రపంంచంలోనే కూలెస్ట్ మ్యాన్ అంటూ స్టోరీ పెట్టింది. ఇప్పటికే బీటౌన్‌లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ, ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు మంచి గుర్తింపు ఉంది. తాజాగా అల్లు అర్జున్ కూడా బాలీవుడ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకోవడం 'అబ్బా సాయిరాం' అన్నట్లుగా ఉంది. ఇదీ చదవండి: నోట్లో థర్మామీటర్‌తో జాన్వీ.. కరోనాగా అనుమానం -
Bureau Of Energy Efficiency: ఇంధన సంరక్షణలో ఏపీ భేష్
సాక్షి, అమరావతి: ఇంధన సంరక్షణ కార్యక్రమాల అమలుకు ఏపీ చేస్తున్న కృషిని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) డైరెక్టర్ జనరల్ అభయ్ భాక్రే ప్రశంసించారు. అన్ని స్టేట్ డిజిగ్నేటెడ్ ఏజెన్సీలతో (ఎస్డీఏ) ఆదివారం జరిగిన వెబినార్‌లో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ఇంధన సంరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) ఆధ్వర్యంలో డిసెంబర్ 14 నుంచి 20 వరకు జరిగిన జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో వివిధ అవగాహన కార్యక్రమాలను నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇంధన శాఖను ఆయన అభినందించారు. చదవండి: సర్వతోముఖాభివృద్ధి దిశగా ఏపీ దేశంలో ఇంధన–పొదుపు పెట్టుబడి సామర్థ్యం 2031 నాటికి దాదాపు రూ. 10.02 లక్షల కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నట్లు భాక్రే తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లాగే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లో ఇంధన రంగాన్ని బలోపేతం చేయడానికి, పర్యావరణాన్ని మెరుగుపరచడానికి, ఆర్థిక వ్యవస్థను పెంచడానికి ఇంధన సామర్థ్యం, దాని ప్రయోజనాలను గుర్తించాలని ఆయన సూచించారు. ఆ దిశగా పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఏపీలో రూ. 2,185 కోట్ల ఇంధన మిగులు పారిశ్రామిక రంగంలో ఇంధన పొదుపు సామర్థ్యం రూ. 5.15 లక్షల కోట్లుగా అంచనా వేయగా, రవాణా రంగంలో రూ. 2.26 లక్షల కోట్లు, గృహ రంగంలో రూ. 1.2 లక్షల కోట్లు ఉందని డీజీ వివరించారు. పెర్ఫార్మ్ అచీవ్ ట్రేడ్ పథకం (సైకిల్–1–2) అమలు చేయడం ద్వారా పారిశ్రామిక రంగం దాదాపు రూ. 40,945 కోట్ల విలువైన 21.95 మిలియన్ టన్నుల చమురును ఆదా చేసిందన్నారు. ఏపీలో 30 పరిశ్రమల్లో రూ. 2,185 కోట్ల విలువైన ఇంధనాన్ని మిగల్చడం శుభ పరిణామమని ఆయన అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా 2020–21 నుంచి 2024 –25 వరకు రూ. 4,200 కోట్ల అంచనా వ్యయంతో అన్ని రంగాల్లో ఇంధన సామర్థ్య కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు డీజీ వెల్లడించారు. దీనివల్ల 2030 నాటికి సంవత్సరానికి 557 మిలియన్ టన్నుల కార్బన్డయాక్సైడ్ తగ్గే అవకాశం కలుగుతుందన్నారు. ఈ సమావేశంలో బీఈఈ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అశోక్ కుమార్, డైరెక్టర్లు మిలింద్ డియోర్, సునీల్ ఖండరే, ఏపీఎస్ఈసీఎం సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డి పాల్గొన్నారు. -
సీఎం బాగా పనిచేస్తున్నారు: బీజేపీ ఎమ్మెల్యే
థానే: రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే బాగా పనిచేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే మందా మాత్రే ప్రశంసించారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష నాయకులతో సహా ఎవరైనా ఏదైనా విషయం గురించి ముఖ్యమంత్రిని కలిస్తే, ఆయన ఓపికగా వింటారని, ఉపయోగకరమైన సలహాలు ఇస్తారని పేర్కొన్నారు. నవీ ముంబైలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి సీఎం అనుమతిని ఇచ్చారని, ఇది చాలామంది ప్రజలకు ఉపయోగపడుతుందని ఆమె తెలిపారు. ప్రతిపక్ష నాయకుల ప్రాజెక్టులకు కూడా ముఖ్యమంత్రి సహకరిస్తున్నప్పుడు ఆయన బాగా పనిచేస్తున్నారని పేర్కొనకుండా ఎలా ఉంటామని వ్యాఖ్యానించారు. బీజేపీ ముఖ్యమంత్రిని విమర్శిస్తోంది కదా అని విలేకరులు అడగగా, ముఖ్యమంత్రి రాష్ట్రం మొత్తం కోసం పనిచేస్తారని, అందుకోసం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. సీఎం బాగా పనిచేస్తున్నారని తాము ప్రశంసిస్తే తప్పేముంటుందని ఎదురు ప్రశ్నించారు. కాగా, రాష్ట్రంలో మహిళలపై పెరుగుతున్న నేరాల గురించి ఇటీవల ముఖ్యమంత్రికి లేఖ రాసిన 12 మంది బీజేపీ ఎమ్మెల్యేల్లో మాత్రే కూడా ఉన్నారు. చదవండి: (జేసీ దివాకర్‌రెడ్డిపై ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆగ్రహం) -
ఏపీకి పార్లమెంట్ కమిటీ ప్రశంసలు
సాక్షి, విశాఖపట్నం: ఏపీపై పార్లమెంట్ మహిళా భద్రత, సాధికారిత కమిటీ ప్రశంసలు కురిపించింది. విశాఖలోని ‘దిశ’ పోలీస్‌స్టేషన్‌ను పార్లమెంట్ కమిటీ శనివారం సందర్శించింది. కమిటీకి దిశ పీఎస్ పనితీరును దిశ స్పెషల్ అధికారి డీఐజీ రాజకుమారి, సీపీ మనీష్‌కుమార్ వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో దిశ పోలీస్‌స్టేషన్ పనితీరు అద్భుతమని పార్లమెంట్ కమిటీ ప్రశంసించింది. చదవండి: Disha App: ‘దిశ’ యాప్ కేరాఫ్ మన అన్న.. భద్రతకు ‘దిశ’ నిర్దేశం -
సీఎం జగన్ పాలనపై రాపాక ప్రశంసలు
-
40 ఏళ్ల క్రితం ఈ అమ్మాయి కనిపిస్తే నాకు విడాకులు అయ్యేవి కావు: ఆర్జీవీ
RGV Praises Heroine Megha Akash : ‘‘డియర్ మేఘ’’ అద్భుతమైన రొమాంటిక్ ఫిల్మ్. ఇలాంటి రొమాంటిక్ లవ్‌స్టోరి ఈ మధ్య కాలంలో రాలేదు’’ అని దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అన్నారు. మేఘా ఆకాష్, అదిత్ అరుణ్, అర్జున్ సోమయాజుల ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘డియర్ మేఘ’. సుశాంత్ రెడ్డి దర్శకత్వం వహించారు. అర్జున్ దాస్యన్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 3న విడుదల కానుంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ..‘‘మేఘా ఆకాష్ 40 ఏళ్ల కిందట కనిపించి ఉంటే నాకు విడాకులు అయ్యేవి కావు. ఆమె చాలా క్యూట్‌గా, హోమ్లీగా ఉంది. నా సినిమాలకు సెట్ అవ్వదు. అరుణ్ అదిత్‌తో త్వరలో ఓ సినిమా చేయబోతున్నాను’’ అన్నారు. ‘‘శ్రీదేవిగారితో పని చేయడం ఆర్జీవీగారికి ఎంత కిక్ ఇచ్చిందో, మేఘాతో పని చేయడం నాకూ అంతే కిక్ ఇచ్చింది’’ అన్నారు సుశాంత్ రెడ్డి. ‘‘ఈ సినిమా అమ్మాయి వైపు నుంచి కథను చెబుతుంది’’ అన్నారు అర్జున్ దాస్యన్. చదవండి : అల్లు అర్జున్ సరికొత్త రికార్డు.. ‘సౌత్ కా సుల్తాన్’గా ఐకాన్ స్టార్ Drugs Case: ఈడీ ముందుకు సినీ ప్రముఖులు -
అధికారులను అభినందించిన సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ స్వచ్ఛభారత్ మిషన్ అర్బన్‌లో భాగంగా అందించే వాటర్ ప్లస్ సర్టిఫికేషన్‌కు ఏపీ నుంచి మూడు నగరాలకు చోటు దక్కడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధికారులను అభినందించారు. దేశవ్యాప్తంగా 9 నగరాలు మాత్రమే వాటర్ ప్లస్ సర్టిఫికెట్ సాధించగా వాటిలో 3 నగరాలు ఏపీ నుంచి అర్హత సాధించాయని సీఎం జగన్‌కు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వివరించారు. (చదవండి: ఆ నలుగురి మరణం ‘పోలీస్ కుటుంబానికి తీరని లోటు’) గ్రేటర్ విశాఖ, విజయవాడ, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లు వాటర్ ప్లస్ సర్టిఫికెట్ పొందాయని తెలిపారు. జగనన్న కాలనీలు, మౌలిక వసతులపై సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో వాటర్ ప్లస్ అంశాన్ని మంత్రి బొత్స తెలిపారు. ఇళ్లు, వాణిజ్య సముదాయాల నుంచి డ్రైన్లు, నాలాలతో పాటు ఇతర వ్యర్ధ జలాల శుద్ధి, నిర్వహణ, పునర్వినియోగాన్ని నిర్దేశిత ప్రమాణాల మేరకు సమర్ధవంతంగా నిర్వహించే నగరాలకు వాటర్ ప్లస్ సర్టిఫికెట్ అందిస్తున్న విషయం తెలిసిందే. అధికారులను అభినందించిన అనంతరం సీఎం ఉత్తమ తాగునీటి సరఫరా విధానాలు, మురుగునీటి నిర్వహణపై మార్గదర్శకాలను కలెక్టర్లు, కమిషనర్లకు పంపించాలని ఆదేశించారు. అన్ని మున్సిపాల్టీల్లో అవి అమలయ్యేలా చూడాలని చెప్పారు. పట్టణాలు ఉన్నత ప్రమాణాలు దిశగా అడుగులు వేయాలని తెలిపారు. ప్రతి నగరం, మున్సిపాల్టీ కూడా సర్టిఫికెట్ పొందిన నగరాల స్థాయిని చేరుకోవాలని అభిలషించారు. చదవండి: ‘హీరోయిన్లా జట్టు విరబూసుకుని రావొద్దు’ ‘సెల్ఫీలు దిగొద్దు’) సమావేశంలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, గృహ నిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్, గృహ నిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, టిడ్కో ఎండీ శ్రీధర్, గృహ నిర్మాణశాఖ కార్యదర్శి రాహుల్ పాండే, ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ నారాయణ భరత్ గుప్తా ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
హీరో ఆర్యను ప్రశంసించిన కమల్‌హాసన్
చెన్నై: సార్పట్ట పరంపరై చిత్ర యూనిట్‌ను నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమలహాసన్ అభినందించారు. నటుడు ఆర్య కథానాయకుడిగా పా.రంజిత్ తెరకెక్కించిన చిత్రం సార్పట్ట పరంపరై. ఇటీవల అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ఆదరణ పొందుతోంది. విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. కాగా ఈ చిత్ర యూని ట్ను శనివారం కమలహాసన్ కలిసి ప్రత్యేకంగా అభినందించారు. ఈ చిత్రాన్ని తాను చూశానన్నారు. ఈ చిత్రం చూస్తున్నప్పుడు గత కాలాన్ని ప్రత్యక్షంగా చూస్తున్న భావన జరిగిందన్నారు. దర్శకుడు పా.రంజిత్ పనితీరును ప్రశంసించారు. -
జీఎస్టీ చెల్లింపులపై టీటీడీకి కేంద్రం ప్రశంస
తిరుమల: జీఎస్టీ చెల్లింపులకుగాను టీటీడీకి కేంద్రం నుంచి ప్రశంసాపత్రం లభించింది. దేశంలోని 11 రాష్ట్రాల్లో టీటీడీ జీఎస్టీæ రిజిస్ట్రేషన్ చేసుకుంది. 2 రాష్ట్రాల్లో టీటీడీ జరిపిన లావాదేవీల జీఎస్టీ చెల్లింపులకుగాను ఈ ప్రశంస లభించింది. దేశంలో 1.3 కోట్ల సంస్థలు జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోగా.. ఇందులో 54,439 సంస్థలు జీఎస్టీని కచ్చితంగా చెల్లిస్తున్నాయి. దేశంలో జీఎస్టీ ప్రవేశపెట్టి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా క్రమం తప్పకుండా పన్నులు చెల్లించిన వారిని సన్మానించాలని కేంద్రం నిర్ణయించింది. 2021 మార్చి 31వ తేదీ వరకు జీఎస్టీ రిటర్న్ ఫైల్ చేయడంలోనూ, పన్ను చెల్లింపులకుగాను టీటీడీకి కేంద్రం ప్రశంసాపత్రం అందించింది. -
హీరో సూర్యకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి : సూపర్‌స్టార్
చెన్నై: కన్నడ సూపర్‌స్టార్ సుదీప్ నటుడు సూర్యను పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేశారు. ఇటీవల ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సూరరై పోట్రు చిత్రం, కథానాయకుడిగా చేసిన సూర్య గురించి మాట్లాడారు. ‘నేను ఇటీవల సూరరై పోట్రు చిత్రం చూశాను. అందులో నటనకు సూర్యకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి. అందుకు ఆయన అర్హుడు. నేను కలిసిన అరుదైన నటుల్లో సూర్య ఒకరు. చాలా నిజాయితీ గల వ్యక్తి’ అని అన్నారు. కాగా నటుడు సూర్య నటించి నిర్మించిన చిత్రం సూరరై పోట్రు ఇటీవల ఓటీటీలో విడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందుతోంది. ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. -
సీఎం జగన్‌పై ప్రశంసలు కురిపించిన ఎన్ఈపీ ఛైర్మన్ కస్తూరి రంగన్
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యా సంస్కరణలను ఎన్ఈపీ ఛైర్మన్ కస్తూరి రంగన్ ప్రశంసించారు. 11వ వర్శిటీ డిస్టింగ్విష్ లెక్చర్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో విద్యా సంస్కరణల పట్ల ఆయన అభినందించారు. వర్చువల్ ద్వారా పాల్గొన్న కస్తూరి రంగన్‌కు సీఎం జగన్ నాయకత్వంలో జరుగుతున్న విద్యా సంస్కరణలను ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వివరించారు. ఏపీలో అమలవుతున్న విద్యా పథకాలపై సీఎం వైఎస్ జగన్‌ను కస్తూరి రంగన్ ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ఈపీ 2020 అమలులో మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉందన్నారు. సీఎం జగన్ నాయకత్వంలో సమర్థవంతంగా విద్యా సంస్కరణలు అమలవుతున్నాయని అభినందించారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ నిధులు, ఖర్చుకు వెనుకాడకుండా పలు విద్యా పథకాల అమలుపై కస్తూరి రంగన్ ప్రశంసలు కురిపించారు. -
కరోనాపై యూపీ పోరు భేష్
వారణాసి: కరోనాను సమర్థంగా ఎదుర్కొన్నారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా, కరోనా రెండో వేవ్‌ను అద్వితీయ రీతిలో, అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొన్నారన్నారు. యూపీలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అవినీతి, ఆశ్రిత పక్షపాతం లేకుండా, అభివృద్ధి దాయక పాలన అందిస్తోందన్నారు. యూపీలోని తన సొంత లోక్‌సభ నియోజకవర్గం వారణాసికి ప్రధాని మోదీ గురువారం వచ్చారు. బెనారస్ హిందూ యూనివర్సిటీ– ఐఐటీ(ఐఐటీ–బీహెచ్‌యూ) వద్ద రూ. 15 వందల కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఇప్పటికే పూర్తయిన కొన్ని ప్రాజెక్టులను ప్రారంభించారు. ఆ తరువాత, జపాన్ సహకారంతో నిర్మితమైన ‘ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్– రుద్రా„Š ’ను ప్రారంభించారు. కోవిడ్ 19పై ఉత్తరప్రదేశ్ పోరాటం అద్వితీయమని ఈ సందర్భంగా ప్రధాని కొనియాడారు. ‘యూపీ జనాభా డజనుకు పైగా దేశాల జనాభా కన్నా ఎక్కువ. ఆ రకంగా చూస్తే కరోనాను యూపీ కట్టడి చేసిన తీరు అద్వితీయం అని చెప్పవచ్చు’ అని ప్రశంసించారు. గతంలో రాష్ట్రంలో ఆరోగ్య వసతులు సరిగ్గా ఉండేవి కావని, చిన్న చిన్న సమస్యలు కూడా ప్రాణాంతకమయ్యేవని ప్రధాని గుర్తు చేశారు. యూపీలో మెదడువాపు వ్యాధి వంటి జబ్బులను కట్టడి చేయడంలో చాలా ఇబ్బంది ఎదురైందన్నారు. కానీ అత్యంత తీవ్రమైన కోవిడ్ మహమ్మారిని ప్రస్తుత ప్రభుత్వం గొప్పగా ఎదుర్కొన్నదన్నారు. గత కొన్ని నెలలు మానవాళికి అత్యంత కఠినమైనవని, వాటిని కూడా కాశి(వారణాసి) ప్రజలు గొప్పగా ఎదుర్కొన్నారని ప్రశంసించారు. ‘యూపీలో న్యాయమైన పాలన నడుస్తోంది. మాఫియారాజ్, ఉగ్రవాదాలను సమర్థవంతంగా నిరోధించారు. నేరస్తులు మన అక్క చెల్లెళ్ల వైపు కన్నెత్తి చూసే సాహసం కూడా చేయడం లేదు’ అని వ్యాఖ్యానించారు. యోగి ఆదిత్యనాథ్ సమర్థవంతమైన పాలన కారణంగా రాష్ట్రంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయన్నారు. ఈ ప్రాంతంలో ఇప్పుడు 8 వేల కోట్ల ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయన్నారు. -
మీలాంటి ముఖ్యమంత్రి ఉండడం వల్ల ప్రతి మహిళ ధైరంగా ఉండగలుగుతున్నారు
-
వివిధ రంగాల్లో ఏపీ అభివృద్ధి పథంలో నడుస్తోంది: నీతి అయోగ్
-
ఏపీ అభివృద్ధి పథంలో నడుస్తోంది: నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై నీతి ఆయోగ్ వైస్‌ఛైర్మన్ రాజీవ్‌కుమార్ ప్రశంసలు కురిపించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం జగన్.. గురువారం సాయంత్రం రాజీవ్‌కుమార్‌తో సమావేశమయ్యారు. గంటకుపైగా కొనసాగిన సమావేశంలో వివిధ అంశాలపై చర్చించారు. పోలవరం ప్రాజెక్ట్, పేదలకు ఇళ్ల నిర్మాణాల్లో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర నిధులు, సహకారంపై సీఎం జగన్ చర్చించారు. ఈ సందర్భంగా సీఎం జగన్.. పేదలందరికి ఇళ్ల పథకం కింద చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 30.76 లక్షల ఇళ్లపట్టాలు ఇచ్చామని, దీనికోసం 68,381 ఎకరాలు సేకరించామన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీతో 17,005 కొత్త కాలనీలు ఏర్పడ్డాయని, వీటి మౌలిక సదుపాయాల ఏర్పాటు చేయడానికి రూ.34,109 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశామన్నారు. ఈ ఏడాది కొత్తగా 15 లక్షలకుపైగా ఇళ్లు పేదలకోసం నిర్మిస్తున్నామని, మొత్తంగా 28.30 లక్షల ఇళ్లు పేదలకోసం నిర్మిస్తున్నామని వెల్లడించారు. ఇంత మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే మోయడం కష్టసాధ్యమని తెలిపారు. మౌలిక సదుపాయాలకు అయ్యే ఖర్చును పీఎంఏవైలో భాగంగా చేయాలని కోరారు. అనంతరం సీఎం వైఎస్ జగన్ పాలనలోని ఏపీ అభివృద్ధిని రాజీవ్‌కుమార్ కొనియాడుతూ ట్వీట్ చేశారు. ‘పలు రంగాల్లో ఏపీ అభివృద్ధి పథంలో నడుస్తోంది. 2020-21 సుస్థిర అభివృద్ధి రాష్ట్రాల్లో ఏపీ మూడో స్థానంలో ఉంది. ఏపీ వేగంగా అభివృద్ధి చెందాల్సిన అవశ్యకతను సీఎం జగన్ తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, లక్ష్యాలను సీఎం జగన్ వివరించారు’ అని ఆయన ట్వీట్ చేశారు. చదవండి : పోలవరం కోసం రాష్ట్ర ప్రభుత్వ వనరుల నుంచి నిధులు ఖర్చు చేస్తున్నాం Met with the Hon'ble Chief Minister of Andhra Pradesh @ysjagan, to understand the context of growth & development in the state; in the recently released @NITIAayog #SDGIndiaIndex for 20-21, #AndhraPradesh ranked third basis its stellar performance in multiple categories. pic.twitter.com/F9YLcF5ZGh — Rajiv Kumar 🇮🇳 (@RajivKumar1) June 10, 2021 -
వందశాతం విద్యుదీకరణ భేష్: ఏపీకి నీతి ఆయోగ్ ప్రశంస
సాక్షి, అమరావతి: వందశాతం గృహ విద్యుదీకరణ చేపట్టినందుకు ఆంధ్రప్రదేశ్‌ను నీతి ఆయోగ్ ప్రశంసించింది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో ‘క్లీన్ అండ్ అఫర్డబుల్ ఎనర్జీ’ కేటగిరీలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉన్నట్టు పేర్కొంది. నీతి ఆయోగ్ విడుదల చేసిన సస్టయినబుల్ డెవలప్మెంట్ గోల్స్‌లో ప్రథమ స్థానం సాధించడమే ఇందుకు నిదర్శనమని తెలిపింది. దీనిపై విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందిస్తూ.. ఆంధ్రప్రదేశ్‌ను క్లీన్ ఎనర్జీకి గమ్యస్థానంగా మార్చేందుకు ఈ చర్యలన్నీ దోహదపడతాయన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందించిన సంపూర్ణ మద్దతు కారణంగానే గత రెండేళ్లలో విద్యుత్ రంగం ఆశించిన స్థాయిలో పురోగతి సాధించిందన్నారు. చదవండి: ఇది ఆంధ్రప్రదేశ్ పాడి రైతుల అదృష్టం విద్యారంగం.. పురోగమనం -
ఏపీ బడ్జెట్‌పై స్వరూపానందేంద్రస్వామి హర్షం
విశాఖపట్టణం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌పై విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్రస్వామి హర్షం వ్యక్తం చేశారు. అర్చకుల వేతనాల కోసం బడ్జెట్ కేటాయింపులపై స్పందించారు. అర్చకుల వేతనాల కోసం బడ్జెట్లో రూ.120 కోట్లు కేటాయించడం హర్షణీయమని తెలిపారు. దశాబ్దాలుగా అర్చకుల వేతనాలపై గత పాలకులు పట్టించుకోలేదని పేర్కొన్నారు. అర్చకుల జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం జగన్ అభినందనీయులు అని స్వరూపానందేంద్ర స్వామి కొనియాడారు. సీఎం జగన్‌కు రాజశ్యామల అమ్మవారి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉంటాయని చెప్పారు. శాసనసభలో గురువారం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. రెండు లక్షల 29 వేల కోట్ల బడ్జెట్ తీసుకొచ్చారు. ఈ బడ్జెట్లో సంక్షేమానికి పెద్ద పీట వేశారు. దీంతోపాటు బ్రాహ్మణుల సంక్షేమానికి రూ.359 కోట్లు కేటాయించారు. ప్రభుత్వ కేటాయింపులపై అర్చకులు, బ్రాహ్మణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు చెబుతున్నారు. -
సీఎం జగన్‌పై జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రశంసలు
-
సీఎం జగన్‌పై జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రశంసలు
తాడిపత్రి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నైతిక విలువలున్న వ్యక్తి అని టీడీపీ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రశంసల జల్లు కురిపించారు. గురువారం ఆయన అనంతపురం జిల్లా తాడిపత్రి మునిసిపల్ చైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం కార్యాలయం వెలుపల విలేకరులతో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ సహకారం లేకుంటే..తాను ఈరోజు మునిసిపల్ చైర్మన్ అయ్యుండే వాడిని కాదన్నారు. ఆయన తల్చుకుంటే ఏమైనా చేసి ఉండొచ్చని.. కానీ ఆయనలోని నైతిక విలువలను ఈరోజు స్పష్టంగా గమనించానని తెలిపారు. హ్యాట్సాఫ్ టు సీఎం అని ప్రశంసించారు. తాడిపత్రి అభివృద్ధికి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, ఎంపీ తలారి రంగయ్యతో కలిసి పనిచేస్తానన్నారు. పట్టణాభివృద్ధికి నిధులను కోరేందుకు త్వరలోనే ముఖ్యమంత్రి జగన్‌ను కలుస్తానని, ఆయన తప్పకుండా న్యాయం చేస్తారన్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సాగేందుకు పోలీసులు తీసుకున్న చర్యలు భేష్ అని జేసీ కితాబిచ్చారు. చదవండి: బడుగు వర్గాలకే పెద్దపీట: 86 స్థానాల్లో ఎవరెవరు? నాడు కట్టెలు కొట్టిన మహిళ.. నేడు చిత్తూరు మేయర్ -
అల్లరి గతం.. పేరు మార్చేయ్...!
సాక్షి,హైదరాబాద్ : నాంది సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హీరో అల్లరి నరేష్‌ని టాలీవుడ్ నేచురల్ స్టార్ నానీ పొగడ్తల్లో ముంచెత్తారు. భవిష్యత్తంతా బంగారుబాటే అన్న సంకేతాలిస్తూ.. నరేష్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ మేరకు నాని ట్వీట్ చేస్తూ.. ”మొత్తానికి ‘నాంది’ సినిమా చూశాను. రేయ్ రేయ్ రేయ్.. ‘అల్లరి నరేష్’ పేరు మార్చేయ్ ఇంక.. అల్లరి గతం.. భవిష్యత్తుకు ఇది నాంది. ఒక గొప్ప నటుడిని నీలో చూశాను. చాలా సంతోషంగా ఉంది. ఇకపై ఇలాంటివి నీ నుంచి మరిన్ని రావాలని కోరు కుంటున్నాను..” అని నాని పోస్ట్ చేశారు. దీంతో అభిమానుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. (ఎనిమిదేళ్లు పట్టింది.. అల్లరి నరేశ్ ఎమోషనల్) కాగా గమ్యం సినిమాలోని గాలి శ్రీను క్యారెక్టర్‌తో తన నటనను మరింత ఎత్తుకు తీసుకెళ్లిన అల్లరి నరేష్ తాజా చిత్రం నాంది. ఎస్వీ 2 ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సతీష్ వేగేశ్న నిర్మించిన నాంది మూవీ హిట్‌టాక్‌తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలోనే హీరో నాని చేసిన ట్వీట్ ఇపుడు వైరల్‌గా మారింది. Finally got to watch #Naandhi రేయ్ రేయ్ రేయ్..@Allarinaresh పేరు మార్చేయ్ ఇంక అల్లరి గతం భవిష్యత్తుకి ఇది నాంది Super happy for you ra .. hope to see you exploring the artist in you more and more here after 🤗 — Nani (@NameisNani) February 28, 2021 -
అనంత కలెక్టర్‌కు సీఎం జగన్ అభినందనలు
సాక్షి, అమరావతి / అనంతపురం అర్బన్: ఇటీవల కేంద్ర వ్యవసాయ శాఖ నుంచి పీఎం కిసాన్ సమ్మాన్ జాతీయ అవార్డు అందుకున్న అనంతపురం కలెక్టర్ గంధం చంద్రుడును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. గురువారం ఆయన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పనితీరుపై సీఎం ప్రశంసించారు. ప్రభుత్వ పథకాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లి, అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూర్చే దిశగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక సీఎస్ పూనం మాలకొండయ్య, జేడీఏ రామకృష్ణ పాల్గొన్నారు. చదవండి: (పీఎం కిసాన్ అవార్డు అందుకున్న ‘అనంత’ కలెక్టర్) -
కోర్టు విచారణ.. జడ్జికే లైన్ వేసిన ముద్దాయి
వాషింగ్టన్: కోర్టు విచారణ సమయంలో నిందితులు ఎంతో పద్దతిగా ప్రవర్తిస్తారు. పోలీసుల దగ్గర కాస్త అతి చేసినా చెల్లుతుంది కానీ.. కోర్టులో మాత్రం ఎలాంటి పిచ్చి వేశాలు వేయకూడదు. అడిగిన దానికి సమాధానం చెప్పడం... మన వాదన వినిపించడం ఇదే జరిగేది. మన సినిమాల్లో కూడా న్యాయవాదులు, కోర్టులపై ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు, సీన్లు ఉండవు. చాలా దేశాల్లో ఇలాగే ఉంటుంది. ఇంతటి అత్యున్నత స్థానం ఉన్న కోర్టులో ఓ నిందితుడు పిచ్చి వేషాలు వేశాడు. ఏకంగా జడ్జికే లైన్ వేయడమేకాక.. పడిపోయాను అన్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఆ వివరాలు.. దక్షిణ ఫ్లోరిడా కోర్టులో తబితా బ్లాక్‌మోన్ జడ్జిగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వారం రోజుల క్రితం ఓ కేసు విచారణ సందర్భంగా ప్రతివాది డెమెట్రిస్ లూయిస్ బ్రోవార్డ్ కౌంటీ జడ్జి తబితా బ్లాక్‌మోన్ ముందు వర్చువల్ విచారణలో హాజరయ్యాడు. కెమరా ముందుకు వచ్చాక లూయిస్.. జడ్జిని ఫ్లర్ట్ చేసే ప్రయత్నం చేశాడు. ‘‘జడ్జి గారు మీరు ఎంత అందంగా ఉన్నారో తెలుసా.. నిజంగా మీరు చాలా అందంగా ఉన్నారు. మీకు పడిపోయాను’’ అంటూ జడ్జి తబితాను మోసే ప్రయత్నం చేశాడు. అతడి పొగడ్తలకు ఆమె నవ్వుకుని.. ‘‘థాంక్యూ.. నేను అందంగా ఉన్నానని నాకు తెలుసు. పొగడ్తలు ఎక్కడైనా పని చేస్తాయేమో కానీ ఇక్కడ కాదు’’ అని తెలిపారు. ఇక లూయిస్‌పై నమోదయిన కేసు ఏంటంటే కొద్ది రోజుల క్రితం అతడు తల్లి, ముగ్గురు కుమార్తెలు ఉన్న ఓ ఇంట్లోకి ప్రవేశించే ప్రయత్నం చేశాడు. డోర్ పగులగొట్టేందుకు ప్రయత్నించాడు. ఈ తతంగాన్ని సదరు ఇంటి ఓనర్ డోర్‌బెల్ కెమెరా ద్వారా చూసి.. ఇరుగుపొరుగు వారికి సమాచారం ఇచ్చింది. వారు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు. ఈ నేరానికి గాను కోర్టు లూయిస్‌కి 50 వేల డాలర్ల జరిమానా విధించింది. ఇక గతంలో మరణాయుధం కలిగి ఉన్నాడనే నేరం కింద లూయిస్ నాలుగేళ్లు జైల్లో గడిపి 2019లో బయటకు వచ్చాడు. చదవండి: ఇంటిపెద్దకు కాకుంటే ఇంకెవరికి ఫిర్యాదు చేయాలి? జడ్జీలూ సోషల్ మీడియా బాధితులే -
ఇది రైతన్నలను బాగుచేసే బడ్జెట్: మోదీ
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 2021–22 వార్షిక బడ్జెట్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. పల్లెలను, రైతన్నలను ఈ బడ్జెట్ తన గుండెల్లో నిలుపుకుందని అన్నారు. దేశంలో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడం, అన్నదాతల ఆదాయాన్ని పెంచడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు తెలిపారు. వ్యవసాయ మండీల (మార్కెట్ల) సాధికారతే లక్ష్యంగా భారీగా నిధులు కేటాయించినట్లు గుర్తు చేశారు. ఆర్థిక మంత్రి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అనంతరం ప్రధాని మోదీ మీడియా ద్వారా మాట్లాడారు. కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలు ఎన్నో ఉన్నా యని తెలిపారు. రైతులకు ఇకపై మరింత సుల భంగా రుణాలు అందుతా యని వెల్లడించారు. సంపద సృష్టి, సంక్షే మాన్ని లక్ష్యంగా పెట్టు కొని బడ్జెట్‌కు రూప కల్పన చేశారని ఉద్ఘాటిం చారు. 2021–22 బడ్జెట్ భారతదేశ దృఢ సంక ల్పాన్ని, ఆత్మనిర్భరతను ప్రపంచానికి చాటు తోందని ప్రధాని మోదీ ప్రశంసించారు. కొత్త దశాబ్దికి పటిష్ట పునాది అసాధారణ పరిస్థితుల మధ్య బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారని ప్రధాని మోదీ వివరించారు. సామా న్యులపై ప్రభుత్వం మరింత భారం మోప నుందని నిపుణులు అంచనా వేసిన ప్పటికీ బడ్జెట్ వివరా లను ప్రకటించిన ఒకటి రెండు గంటల్లోనే పెద్ద ఎత్తున సానుకూల స్పందన వ్యక్తం కావడం మంచి పరిణామం అని అన్నారు. ఆత్మనిర్భర్ భారత్ (స్వావలంబన భారత్) స్ఫూర్తిని ప్రతి బింబించే ఈ బడ్జెట్ కొత్త దశాబ్దం ప్రారంభానికి ఒక పటిష్టమైన పునాది అని వ్యాఖ్యానించారు. కరోనా వైరస్ వ్యాప్తి, దిగజారిన ఆర్థిక వ్యవస్థ వంటి ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితుల్లో ఈ బడ్జెట్ ప్రపంచానికి నూతన విశ్వాసాన్ని అందించిందని అన్నారు. ప్రజల జీవనం.. సులభతరం ప్రగతి కోసం కొత్త అవకాశాలను విస్తరింప జేయడం, యువత కోసం కొత్త అవకాశాల సృష్టి, మానవ వనరులకు కొత్తరూపు ఇవ్వడం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సాంకేతికత వైపు అడు గులు, కొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టడం అనే కీలక అంశాలను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్‌ను రూపొందించినట్లు మోదీ తేల్చిచెప్పారు. ఇది సంపద సృష్టికి, సంక్షేమానికి ఊపునిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దక్షిణ, ఈశాన్యభారత్‌తోపాటు లద్దాఖ్‌పై దృష్టి పెడుతూ దేశంలోని అన్ని ప్రాంతాల్లో సమగ్రాభివృద్ధిని ఈ బడ్జెట్ ఆకాంక్షి స్తోందని అన్నారు. కోస్తా తీరప్రాంత రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్‌లను బిజినెస్ పవర్‌హౌస్‌లుగా మార్చే దిశగా ఇదొక గొప్ప ముందడుగు అని స్పష్టం చేశారు. నియమ నిబం ధనలను సరళతరం చేయడం ద్వారా ప్రజల జీవనాన్ని ఇంకా సులభతరంగా మార్చడం బడ్జెట్ లక్ష్యమని చెప్పారు. మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, పెట్టుబ డులు తదితర రంగాల్లో ఇకపై సానుకూల మార్పులు వస్తాయ న్నారు. ఆవిష్కరణలపై దృష్టి కేంద్ర బడ్జెట్లోని పార దర్శకతను నిపుణులు సైతం కొనియాడుతున్నారని ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. దేశంలో ఉద్యోగ, ఉపాధి అవకా శాలను పెంచడానికి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) బడ్జె ట్లో నిధుల కేటాయింపులను రెట్టింపు చేసినట్లు తెలిపారు. పరిశోధనలు, నూతన ఆవిష్కరణలపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టడం యువతకు ఎంతగానో ఉపకరిస్తుందని అన్నారు. ఆరోగ్యం, పారిశుధ్యం, పౌష్టికాహారం, సురక్షిత తాగునీరు, సమాన అవకాశాలు వంటివి అందక సామాన్య ప్రజలు, మహిళలు ఒత్తిడి ఎదుర్కొంటున్నారని, ఇకపై ఆ సమస్య దూరమవుతుందని వివరించారు. మౌలిక సదుపాయాల అభివృద్ధికి భారీగా నిధులి వ్వడం, విధానరమైన సంస్కరణలతో కొత్త ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తాయని, తద్వారా ప్రగతి పరుగులు తీస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. -
జగన్ సర్కార్‌పై మహిళా ప్రముఖుల ప్రశంసలు
సాక్షి, అమరావతి: మహిళా సాధికారత లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సర్కారు అనేక వినూత్న కార్యక్రమాలు చేపడుతోందని వివిధ రాష్ట్రాలు, పలు రంగాలకు చెందిన మహిళా ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. ఒకేసారి 30 లక్షల మంది మహిళలకు నివాసస్థల పట్టాలు ఇవ్వడమనేది దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయే అధ్యాయమని వారు కొనియాడారు. అలాగే, అమ్మఒడి అద్భుత కార్యక్రమమని, దీని ద్వారా పిల్లలను చదివించే బాధ్యతను సీఎం జగన్ మహిళలపై పెట్టారని వారు ప్రశంసించారు. తల్లి విద్యావంతురాలైతే కుటుంబమంతా విద్యావంతులవుతారనే సత్యాన్ని గ్రహించి ముఖ్యమంత్రి ఈ కార్యక్రమం చేపట్టారని, ఇందుకు వైఎస్ జగన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. పేద అక్కచెల్లెమ్మలకు శుక్రవారం పెద్దఎత్తున నివాస స్థలాల పట్టాలు అందిస్తున్న సందర్భంలో అనేకమంది మహిళా ప్రముఖులు స్పందించారు. వారి అభిప్రాయాలు వారి మాటల్లోనే.. గర్వించదగ్గ విషయం సమాజ సర్వతోముఖాభివృద్ధికి మహిళా సాధికారత దోహదపడుతుంది. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల పేరుతో 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తుండటం ఆనందదాయకం. ఇది అందరూ గర్వించదగ్గ విషయం. – పద్మభూషణ్ అవార్డు గ్రహీత పీవీ సింధు మహిళా సాధికారతకు విప్లవాత్మక చర్యలు మహిళా సాధికారత దిశగా ఏపీ ప్రభుత్వం అనేక వినూత్న కార్యక్రమాలు అమలుచేస్తోంది. అమ్మఒడి అద్భుత కార్యక్రమం. పేద మహిళల ఆర్థిక స్వావలంబనకు వైఎస్సార్ ఆసరా ఎంతో దోహదపడుతుంది. మహిళల పేరుతో ఇంత పెద్ద సంఖ్యలో ఇళ్ల స్థల పట్టాలు ఇచ్చి, ఇళ్లు నిర్మాణానికి శ్రీకారం చుడుతుండటం ప్రశంసనీయం. – సంగీత రెడ్డి, అపోలో ఆస్పత్రి జేఎండీ ప్రతి మహిళను మహారాణిగా చేసే కార్యక్రమాలు రాష్ట్రంలో ప్రతి మహిళను లక్షాధికారిగా, మహారాణిగా చేసేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక వినూత్న, విప్లవాత్మక కార్యక్రమాలు చేపడుతున్నారు. మహిళల పేరుతో ఆస్తి సమకూర్చే ఇళ్ల పట్టాలు ఇవ్వడం అభినందనీయం. ఇందుకు ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు. – జమున, పద్మావతి మహిళా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ మహిళలకు ప్రాధాన్యం ప్రశంసనీయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అమ్మ ఒడి అమలు, ఇళ్ల పట్టాల పంపిణీ అభినందనీయం. – మెర్లిన్ ఫ్రీడా, ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ పురుషులతో సమానంగా అభివృద్ధికి చర్యలు మహిళలను అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా ప్రగతిబాటలో నడిపించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఇళ్ల పట్టాల పంపిణీ ప్రశంసనీయం. – డా. యాస్మిన్ ఆలీ హాక్, యునిసెఫ్ ఇండియా జగన్ ప్రభుత్వ కార్యక్రమాలు ప్రశంసనీయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల మహిళల అభ్యున్నతికి అమలు చేస్తున్న కార్యక్రమాలు ఎంతో ప్రశంసనీయం. – ప్రమీలనాయుడు, కర్ణాటక మహిళా కమిషన్ చైర్పర్సన్ అన్నింటా మహిళలకు అగ్రాసనం జగనన్న ప్రభుత్వం అన్నింటా మహిళలకు అగ్రాసనం వేస్తోంది. నామినేటెడ్ పోస్టులు, నామినేటెడ్ పనుల్లో 50 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పించింది. ఇప్పుడు ఒకేసారి 30 లక్షల ఇళ్ల పట్టాలు మహిళల పేరుతో ఇస్తోంది. మహిళా సాధికారతలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రభాగాన ఉంది. – ఆర్కే రోజా, ఎమ్మెల్యే మహిళల భద్రతకు ‘దిశ’ మహిళా సాధికారత కోసం సీఎం వైఎస్ జగన్ సర్కారు ఎంతో కృషిచేస్తోంది. ఇళ్ల పట్టాల పంపిణీ కూడా ఇందులో భాగమే. అందుకే ఈ సర్కారుకు మహిళా పక్షపాత ప్రభుత్వంగా పేరొచ్చింది. మహిళల భద్రతకు దిశ చట్టం తెచ్చి పటిష్టంగా అమలుచేస్తోంది. – మేకతోటి సుచరిత, రాష్ట్ర హోంమంత్రి మహిళా సాధికారతకు కొత్త అర్థం వినూత్న కార్యక్రమాల ద్వారా మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త అర్ధం చెబుతోంది. 30 లక్షల ఇళ్ల పట్టాలు మహిళల పేరుతో ఇవ్వాలని నిర్ణయించినందుకు సీఎం వైఎస్ జగన్‌కు రాష్ట్ర మహిళల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. – వాసిరెడ్డి పద్మ, ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ -
అనంత కలెక్టర్‌కు ప్రధాని మోదీ ప్రశంస
సాక్షి, అనంతపురం: అంతర్జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా ఈనెల 11న కలెక్టర్ గంధం చంద్రుడు నిర్వహించిన ‘బాలికే భవిష్యత్తు’కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే కేంద్ర మంత్రి జవదేకర్ అభినందించగా.. తాజాగా ప్రధాని మోదీ స్పందించారు. తన ‘మన్‌కీ బాత్’లో ప్రశంసించారు. అనంతపురం జిల్లాలో ‘బాలికే భవిష్యత్తు’ పేరిట ఒక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం చేపట్టి, కార్యాలయ అధికారులుగా ఒక రోజు పనిచేసే అవకాశం బాలికలకు కల్పించారని ప్రధాని పేర్కొన్నారు. (అనంత కలెక్టర్‌కు కేంద్రమంత్రి ప్రశంసలు) -
అనంత కలెక్టర్‌కు కేంద్రమంత్రి ప్రశంసలు
సాక్షి, అనంతపురం : అంతర్జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా ఈనెల 11న ‘బాలికే భవిష్యత్’ పేరుతో జిల్లాలో నిర్వహించిన కార్యక్రమానికి కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ నుంచి ప్రశంసలు దక్కాయి. కలెక్టర్ గంధం చంద్రుడు ఆ రోజు జిల్లా కార్యాలయ అధికారులుగా బాలికలకు అవకాశం కల్పించడంపై కేంద్ర మంత్రి స్పందించారు. ఒక రోజు కలెక్టర్‌గా ఇంటర్ విద్యార్థిని ఎం.శ్రావణితో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఒక రోజు అధికారులుగా బాలికలు పనిచేశారు. దీనిపై కేంద్ర మంత్రి ట్విటర్ వేదికగా అభినందించారు. బాలికలకు ఇలాంటి అవకాశాన్ని జిల్లా యంత్రాంగం కల్పించడం స్ఫూర్తిదాయకమని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. 16-year old M. Sravani, brave daughter of a farm labourer of Anantapur AP, assumed office of Anantapur Dist. Collector on 11th Oct. for one day. District Administration had decided to give an opportunity to one girl each as head of all govt. offices in the district.#NewIndia pic.twitter.com/zNCv7pqEzg — Prakash Javadekar (@PrakashJavdekar) October 20, 2020 -
ఏపీలో 108,104 వాహనాల ప్రారంభం పై ప్రశంసలు
-
మీ చొరవ అసమానం
సాక్షి, హైదరాబాద్: లద్దాఖ్‌లో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో అమరుడైన కల్నల్ సంతోష్‌బాబు కుటుంబానికి అత్యంత ఉదారంగా పునరావాస ప్యాకేజీని ప్రకటించడమే కాకుండా, సత్వరమే అందజేయడంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చూపిన చొరవను డిప్యూటీ చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ ఎంఎస్ పవార్ కొనియాడారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ నెల 24న ఆయన లేఖ రాశారు. ఉన్నత ప్రమాణాలను నిర్దేశించారు.. ‘సంతోష్‌బాబు కుటుంబానికి ప్యాకేజీ ప్రకటించి, సత్వరంగా అందించడానికి మీరు చూపిన చొరవ అసమానమైనది. ఇతరులు అనుసరించడానికి ఉన్నతమైన ప్రమాణాలను నిర్దేశించింది. మాతృభూమి రక్షణ కోసం ప్రాణత్యాగానికి భారతీయ సైనికుడు ఎప్పుడూ భయపడడు అనేదానికి చరిత్రే సాక్ష్యం. జాతీయ యుద్ధ స్మారక వనంలో చెక్కిన అనేక మంది అమరవీరుల పేర్లు ఇందుకు నిదర్శనం. నా కార్యాలయానికి రోజూ వెళ్లే సమయంలో సౌత్‌బ్లాక్ కారిడార్లలో శౌర్య పురస్కారాలు అందుకున్న వీరుల చిత్రాలను చూస్తూ గర్వపడుతుంటాను. యుద్ధరంగంలో ఎలాంటి పరిణామాలు ఎదురైనా దేశం మా కుటుంబాలకు అండగా నిలుస్తుందని సైనికులకు మీరు నిలిపిన ఈ ప్రమాణాలు భరోసా ఇస్తాయి. అనుసరించడానికి ఉన్నతమైన ప్రమాణాలను నిర్దేశించింది. మాతృభూమి రక్షణ కోసం ప్రాణత్యాగానికి భారతీయ సైనికుడు ఎప్పుడూ భయపడడు అనేదానికి చరిత్రే సాక్ష్యం. జాతీయ యుద్ధ స్మారక వనంలో చెక్కిన అనేక మంది అమరవీరుల పేర్లు ఇందుకు నిదర్శనం. నా కార్యాలయానికి రోజూ వెళ్లే సమయంలో సౌత్‌బ్లాక్ కారిడార్ల లో శౌర్య పురస్కారాలు అందుకున్న వీరుల చి త్రాలను చూస్తూ గర్వపడుతుంటాను. యుద్ధరంగంలో ఎలాంటి పరిణామాలు ఎదురైనా దేశం మా కుటుంబాలకు అండగా నిలుస్తుందని సైనికులకు మీరు నిలిపిన ఈ ప్రమాణాలు భరోసా ఇస్తాయి. అమరుడైన ఓ సైనికుడి కుటుంబాన్ని ఓదార్చడానికి ఒక రాష్ట్ర సీఎం వందల కిలోమీట ర్లు ప్రయాణించడం అరుదైన విషయం. సంతోష్‌బాబు కుటుంబంతో పాటు ఆయన సహచరులైన మిగిలిన 19 మంది సైనికులు తెలంగాణవాసులు కాకపోయినా వారి పట్ల మీరు చూపిన ఆదరణ.. మీ నాయకత్వ లక్షణాలు, సైన్యం పట్ల మీ దృక్పథానికి, సహృద్భావానికి అద్దంపడుతోంది. ఈ విషయంలో మీ కుమార్తె కె.కవిత చూపిన చొరవ సైతం ప్రశంసనీయం’అని పవార్ తన లేఖలో పేర్కొన్నారు. కోరుకొండలోని సైనిక్ స్కూల్‌ను సందర్శించాలని సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించారు. కల్నల్ సంతోష్ ఇక్కడి పూర్వ విద్యార్థి అని, ఇక్కడ తెలంగాణకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉన్నారని తెలిపారు. -
భారతీయులు భళా: ట్రంప్
వాషింగ్టన్: భారత్ శాస్త్రవేత్తలు, పరిశోధకులు చాలా గొప్పవారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసల జల్లు కురిపించారు. కోవిడ్ రోగులకు చికిత్స అందించడానికి మందులు, వ్యాక్సిన్ అభివృద్ధి చేయడంలో ఇండియన్ అమెరికన్ శాస్త్రవేత్తలు చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. వైట్‌హౌస్ రోజ్ గార్డెన్లో శుక్రవారం ట్రంప్ విలేకరులతో మాట్లాడారు. ‘కోవిడ్‌ను ఎదుర్కోవడానికి వ్యాక్సిన్, మందులు కనుక్కోవడంలో ఇండియన్ అమెరికన్ శాస్త్రవేత్తలు, పరిశోధనకారులు చేస్తున్న కృషి మరువలేనిది’అని అన్నారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్ పరిశోధనకారులు, శాస్త్రవేత్తల్ని ప్రశంసిస్తూ మాట్లాడడం ఇదే తొలిసారి. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వర్సిటీలు, రీసెర్చ్ వర్సిటీలు, బయో ఫార్మా స్టార్టప్‌లలో ఇండియన్ అమెరికన్ శాస్త్రవేత్తలు కోవిడ్‌పై మందులు, వ్యాక్సిన్ కనుగొనే ప్రయత్నాల్లో ఉన్నారు. భారత్, అమెరికా సంయుక్త కృషితో ఈ ఏడాది చివరి నాటికి వ్యాక్సిన్ కనుక్కుంటామని ట్రంప్ చెప్పారు. భారత్‌కు వెంటిలేటర్లు పంపిస్తామన్న ట్రంప్..స్నేహం బలపడిందన్న మోదీ కోవిడ్ రోగులకు చికిత్స అందించడంలో ఎక్కువగా ఉపయోగపడే వెంటిలేటర్లను భారత్‌కు ఇవ్వడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారు. భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనకు మంచి మిత్రుడని మరోసారి స్పష్టం చేశారు. ‘‘మా మిత్రదేశమైన భారత్‌కు వెంటిలేటర్లు పంపిస్తాం. భారత్‌కు అండగా ఉంటాం’అని ట్వీట్ చేశారు. దీనికి ప్రధాని మోదీ ట్వీట్ ద్వారా ట్రంప్‌కి ధన్యవాదాలు తెలిపారు. భారత్, అమెరికా మధ్య మైత్రికి మరింత బలోపేతంగా మారిందని అన్నారు. వైరస్ సోకిన తొలి రోజుల్లో అమెరికాకి క్లోరోక్విన్ మాత్రల్ని భారత్ భారీగా పంపడం తెల్సిందే. కరోనాను ఎదుర్కోవడానికి కలసికట్టుగా కృషి చేయాలని, ఈ సంక్షోభ సమయంలో ప్రపంచదేశాలన్నీ సమష్టిగా పోరుబాట పడితే ఆరోగ్యకరమైన ప్రపంచం ఆవిష్కృతమవుతుందని మోదీ పేర్కొన్నారు. శ్వేతసౌధంలోని రోజ్ గార్డెన్లో శనివారం జరిగిన కార్యక్రమంలో గర్ల్ స్కౌట్ ట్రూప్ 744 సభ్యురాలు శ్రావ్యా అన్నపరెడ్డిని సత్కరిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ -
కోహ్లి అన్నీ గెలిపిస్తాడు: లారా
న్యూఢిల్లీ: విరాట్ కోహ్లి సారథ్యంలో భారత్ ఐసీసీ టోర్నీలన్నీ గెలుస్తుందని వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా అన్నాడు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ ‘ఐసీసీ మెగా ఈవెంట్లను గెలిపించే సత్తా, సామర్థ్యం కోహ్లికి ఉంది. ఈ టోర్నీల్లో ప్రత్యర్థులందరి లక్ష్యం భారతే అవుతుంది. టీమిండియాని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకుంటాయి. భారత్‌తో జరిగే మ్యాచ్ తమకు కీలకంగా మిగతా జట్లు భావిస్తాయి. అంత పటిష్టంగా భారత జట్టు ఎదిగింది’ అని అన్నాడు. విరాట్ సారథ్యంలో భారత్ ఇటు టెస్టుల్లో అటు వన్డేల్లో అత్యున్నత శిఖరాలను అధిరోహించిందని చెప్పాడు. తాను టెస్టుల్లో నెలకొల్పిన 400 పరుగుల అజేయమైన రికార్డును చెరిపేసే సత్తా ఆసీస్ ఓపెనర్ వార్నర్‌తో పాటు భారత స్టార్లు రోహిత్ శర్మ, కోహ్లిలకు ఉందని అన్నాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగే స్టీవ్ స్మిత్ మేటి బ్యాట్స్‌మన్ అయినప్పటికీ... తన రికార్డును చేరుకోలేడని... వార్నర్, కోహ్లి, రోహిత్‌లాంటి అటాకింగ్ బ్యాట్స్‌మెన్ చెరిపేస్తారని చెప్పాడు. -
మద్యనిషేదం పై మహిళల హర్షం
-
మనసున్న మారాజు కేసీఆర్: పల్లా
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మనసున్న మారాజులా నిర్ణయం తీసుకున్నారని ఎమ్మెల్సీ, రైతు సమన్వయ సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. ఆర్టీసీ సమ్మెకు కేసీఆర్ మంచి ముగింపు ఇచ్చారన్నారు. రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ దీక్ష చేసి పదేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్లో దీక్షా దివస్‌ను నిర్వహించారు. ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డితో కలసి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం పల్లా రాజేశ్వర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. 2009 నవంబర్ 29న చేసిన దీక్షతో కేంద్రం దిగివచ్చి తెలంగాణ ఇచ్చిందన్నారు. 2014, 2018లో రాష్ట్ర ప్రజలు టీఆర్ఎస్కు మద్దతు పలకడం ద్వారా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి జరుగుతోందన్నారు. ఉద్యమ నేతకు వందనం: కల్వకుంట్ల కవిత కేసీఆర్ చిత్తశుద్ధి వల్లే తెలంగాణ ఏర్పాటు కల సాకారమైందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. శుక్రవారం దీక్షా దివస్ సందర్భంగా ఈ మేరకు తన ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ‘‘తెలంగాణ ఉద్యమనేత కేసీఆర్‌కు, ఆయన వెంట నడిచిన తెలంగాణ ప్రజలందరికీ అభినందనలు. ప్రజలు కోరుకున్నప్పుడు తను వారి వెంట కేసీఆర్ ఉన్నారు. సరిగ్గా పదేళ్ల క్రితం ఆయన చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష తెలంగాణ ఉద్యమానికి కొత్త ఉత్తేజాన్నిచ్చింది’’అని ట్వీట్లో పేర్కొన్నారు. తెలంగాణ సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన ఉద్యమ నేత కేసీఆర్ తన ప్రాణాలను కూడా లెక్కచేయకుండా ఉక్కు సంకల్పాన్ని చాటి చెప్పిన రోజు అని మంత్రి హరీశ్‌రావు ట్వీట్ చేశారు. రాజ్యసభ సభ్యుడు సంతోశ్‌కుమార్, మంత్రులు దయాకర్‌రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్‌గౌడ్, మాజీ మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, నన్నపునేని నరేందర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ట్విట్టర్ వేదికగా దీక్షా దివస్ సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. -
‘మహిళా రక్షణలో పోలీసులు భేష్’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మహిళల రక్షణకు పోలీసులు తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని మోల్డ్ టెక్ ప్యాకేజింగ్ సీఎండీ లక్ష్మణ్ ప్రశంసించారు. చిన్నారులు, మహిళలపై నమోదవుతున్న కేసుల్లో వేగంగా స్పందించేందుకు ఏర్పాటు చేసిన షీటీమ్స్, భరోసా కేంద్రాల పనితీరును ఆయన మెచ్చుకున్నారు. కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా రూ. 20 లక్షలను డీజీపీ మహేందర్‌రెడ్డి, విమెన్ సేఫ్టీ వింగ్ చీఫ్, ఐజీ స్వాతి లక్రాకు అందజేశారు. -
హామీలను మించి లబ్ధి
సాక్షి, అమరావతి: సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ రాష్ట్రంలో నవ శకానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాంది పలికారని బీసీ సంఘాల నేతలు, ప్రముఖులు కొనియాడుతున్నారు. రాజ్యాధికారంలో బీసీలకు సింహభాగం కల్పించడమే కాకుండా.. బడ్జెట్లో బీసీల సంక్షేమానికి అగ్ర ప్రాధాన్యమిచ్చారని ప్రశంసిస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ తొలి బడ్జెట్లో బీసీ ఉప ప్రణాళికకు మేనిఫెస్టోలో చెప్పినదానికంటే అధికంగా నిధుల కేటాయింపుతో చరిత్ర తిరగరాశారని హర్షం వ్యక్తం చేస్తున్నారు. తద్వారా రాష్ట్రంలో బీసీల రాజకీయ, సామాజిక, ఆర్థిక అభ్యున్నతికి మార్గం సుగమం చేశారని వ్యాఖ్యానిస్తున్నారు. జస్టిస్ ఈశ్వరయ్య గౌడ్ (రిటైర్డ్), బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య వంటి ప్రముఖులతోపాటు బీసీ కులాల ప్రతినిధులు కూడా ఈ విషయంలో ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. రాజ్యాధికారం అంటే ఇదీ.. బీసీలకు నిజమైన రాజ్యాధికారం అంటే ఏమిటో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చూపించారని బీసీ సామాజికవర్గ ప్రముఖులు కొనియాడుతున్నారు. అందుకు ఆయన మంత్రివర్గ కూర్పే నిదర్శనమని ఆర్.కృష్ణయ్య అభిప్రాయపడ్డారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్ని పదవుల్లోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం కేటాయిస్తామని వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. అన్నట్టుగానే ఆ వర్గాలకు తన మంత్రివర్గంలో ఏకంగా 60 శాతం పదవులు కేటాయించారు. అంతేకాకుండా బీసీవర్గానికి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్‌ను ఉప ముఖ్యమంత్రిగా నియమించారు. బీసీ వర్గానికి చెందిన మంత్రులకు కీలకమైన శాఖలను కేటాయించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కీలకమైన రెవెన్యూ, పురపాలక, జలవనరులు, ఆర్ అండ్ బి, కార్మిక శాఖలను ఆ వర్గాలకు ఇచ్చారు. అతి ముఖ్యమైన అసెంబ్లీ స్పీకర్ పదవిని కూడా బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారాంకు ఇవ్వడం విశేషం. ఇక మీదట నియమించనున్న అన్ని నామినేటెడ్ పోస్టుల్లోనూ బీసీలకే అగ్ర ప్రాధాన్యం ఇస్తామని కూడా సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. దాంతో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బీసీలను రాజ్యాధికారంలో భాగస్వాములను చేయడానికి ముఖ్యమంత్రి కృతనిశ్చయంతో ఉన్నట్లుగా స్పష్టమవడంతో ఆ వర్గాలకు ఆనందం కలిగిస్తోంది. చట్టసభల్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు ఉండాలని వైఎస్సార్సీపీ పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టడాన్ని ఆర్.కృష్ణయ్య ప్రముఖంగా ప్రస్తావించారు. దేశంలో బీసీ పార్టీలని చెప్పుకుంటున్న పార్టీలు కూడా ఇంత వరకు ఆ దిశగా ప్రయత్నించలేదన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం సామాజిక న్యాయ సాధన కోసం చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ల కల్పనకు తమ పార్టీ ద్వారా బిల్లును ప్రవేశపెట్టడం మంచి పరిణామమన్నారు. ఆయన ప్రయత్నం దేశంలో చర్చకు దారి తీసిందని, సామాజిక న్యాయ సాధనకు ముందడుగు వేశారని ప్రశంసించారు. మేనిఫెస్టోలో చెప్పిన దానికంటే అధికం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకంటే ఎక్కువగా బీసీల అభ్యున్నతికి సీఎం వైఎస్ జగన్ బడ్జెట్లో నిధులు కేటాయించారని బీసీ వర్గాలు కొనియాడుతున్నాయి. బీసీ ఉప ప్రణాళికకు ఏటా రూ.15 వేల కోట్లు చొప్పున కేటాయిస్తామని వైఎస్సార్సీపీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. కానీ అంతకంటే కొంచెం ఎక్కువగానే 2019–20 బడ్జెట్లో బీసీ ఉప ప్రణాళికకు రూ.15,061కోట్లు కేటాయించడం ప్రభుత్వ చిత్తశుద్దికి నిదర్శనమని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ, బీసీ నేత జంగా కృష్ణమూర్తి చెప్పారు. గత ఏడాది టీడీపీ ప్రభుత్వం కేటాయించిన దానికంటే 23.46 శాతం అధికంగా కేటాయించడం విశేషం. బీసీల సంక్షేమానికి ఇంత భారీ మొత్తంలో నిధులు కేటాయించడం ద్వారా సీఎం వైఎస్ జగన్ దేశంలో అందరి దృష్టిని ఆకర్షించారని జస్టిస్ ఈశ్వరయ్య (రిటైర్డ్) అన్నారు. కార్పొరేషన్లతో 139 కులాలకు నేరుగా లబ్ధి బీసీ కుటుంబాలకు నేరుగా ప్రభుత్వ పథకాలు అందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టమైన కార్యాచరణ చేపట్టారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రశంసించారు. ప్రస్తుతం ఏపీలో 29 బీసీ కులాలకే ప్రత్యేక కార్పొరేషన్లు ఉన్నాయి. దాంతో ఆయా ఉప కులాల్లోని పేదలకు సంక్షేమ పథకాలు అందించడంలో ప్రభుత్వం విఫలమవుతూ వచ్చింది. బీసీల్లోని అన్ని ఉప కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని వైఎస్సార్సీపీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. అన్నట్లుగానే బీసీల్లోని 139 కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని తొలి బడ్జెట్లోనే ప్రకటించింది. అంటే కొత్తగా మరో 110 కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దాంతో ఇక ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా ఆయా బీసీ ఉప కులాల్లోని లబ్ధిదారులకు అందించడం సాధ్యపడుతుంది. వైఎస్సార్ చేయూత పథకం ద్వారా మహిళలకు నాలుగు విడతలుగా ఇచ్చే రూ.75 వేలను ఈ కొత్త కార్పొరేషన్ల ద్వారానే అందిస్తారు. దళారుల బెడద లేకుండా ఇతర ప్రభుత్వ పథకాలు కూడా లబ్ధిదారులకు సకాలంలో అందుతాయి. ఇది బీసీలందరికీ ప్రయోజనం కలిగిస్తుందని బీసీ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమ పథకాల్లో సగం బీసీలకే ప్రత్యక్షంగా, పరోక్షంగా కూడా బీసీలకే అత్యధికంగా లబ్ధి కలిగేలా ప్రభుత్వ పథకాలను సీఎం వైఎస్ జగన్ రూపొందించారని జస్టిస్ ఈశ్వరయ్య (రిటైర్డ్) పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ పథకాల్లోను దాదాపు 50 శాతం మంది లబ్ధిదారులు బీసీ వర్గాలకు చెందినవారే ఉన్నందున ఈ ప్రభుత్వం దూరదృష్టితో వ్యవహరించిందనడానికి నిదర్శనమన్నారు. అందులో అత్యధికంగా విద్య, ఉపాధి కల్పనకు సంబంధించిన పథకాలు ఉండటం బీసీ వర్గాలు సామాజికంగా, ఆర్థికంగా ఎదిగేందుకు ఉపకరిస్తుందన్నారు. ప్రభుత్వం రూపొందించిన జగనన్న అమ్మ ఒడి, జగనన్న విద్యాదీవెన, సామాజిక పింఛన్లు, కౌలు రైతుల సంక్షేమం.. ఇలా అన్ని పథకాల్లోనూ సగం మంది లబ్ధిదారులు బీసీలేనన్నది సుస్పష్టం. ఈ దృష్ట్యా ప్రధానంగా బీసీ విద్యార్థుల విద్యాభ్యాసానికి సీఎం వైఎస్ జగన్ బాసటగా నిలిచారని జస్టిస్ ఈశ్వరయ్య (రిటైర్డ్) ప్రశంసించారు. జగనన్న అమ్మ ఒడి పథకం ద్వారా పిల్లలను బడికి, కాలేజీలకు పంపే తల్లులకు ఏటా రూ.15 వేలు చొప్పున ఇవ్వనున్నారు. తద్వారా రాష్ట్రంలో 4.50 లక్షల మంది తల్లులకు ప్రయోజనం కలగనుంది. వారిలో దాదాపు 50 శాతం అంటే 2 లక్షల మందికిపైగా బీసీలు ఉన్నారు. వారి కోసమే రూ.1,294.73 కోట్లు కేటాయించడం విశేషం. ఇక వసతి గృహాల్లో ఉంటూ చదువుకునే విద్యార్థుల కోసం ‘జగనన్న విద్యా దీవెన’ పథకం కింద విద్యార్థుల తల్లులకు రూ.20 వేలు చొప్పున చెల్లిస్తారు. తద్వారా రాష్ట్రంలో 15,35,911 మంది విద్యార్థుల తల్లులకు ఊరట కలుగుతుంది. వారిలో దాదాపు 7.82 లక్షల మంది బీసీ వర్గాలకు చెందినవారే ఉంటారని అధికారుల అంచనా. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద విద్యార్థుల ఫీజు మొత్తాన్ని ప్రభుత్వమే భరించాలని నిర్ణయించారు. అందుకోసం ఏకంగా రూ.3,151.74 కోట్లు కేటాయించారు. దీని ద్వారా రాష్ట్రంలో 7.82 లక్షల మంది బీసీ విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. బీసీ రైతులకు బాసట బీసీ రైతుల కష్టాలు తీర్చడం కోసం సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక శ్రద్ధ కనబరిచారని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి చెప్పారు. చరిత్రలో తొలిసారి కౌలు రైతులకు ప్రభుత్వ పథకాలు వర్తింపజేసిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు. రైతులకు పెట్టుబడి సహాయం అందించేందుకు ఉద్దేశించిన ‘వైఎస్సార్ రైతు భరోసా’ పథకాన్ని కౌలు రైతులకు కూడా వర్తింపజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆ పథకం కింద రైతులకు ఏటా రూ.12,500 ఆర్థిక సహాయం చేస్తారు. దాంతో రాష్ట్రంలో 64.07లక్షల మంది రైతులు, 15.37 లక్షల మంది కౌలు రైతులకు ప్రయోజనం కలగనుంది. రైతుల్లో దాదాపు 40 శాతం మంది, కౌలు రైతుల్లో 50 శాతం మంది బీసీలే ఉన్నారని ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి. దాంతో రైతు భరోసా పథకం ద్వారా దాదాపు 26 లక్షల మంది బీసీ రైతులు, దాదాపు 8 లక్షల మంది బీసీ కౌలు రైతులకు లబ్ధి చేకూరనుంది. పింఛన్ల ద్వారా భారీగా లబ్ధి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం సామాజిక పింఛన్ల పెంపు ద్వారా బీసీల సామాజిక భద్రతకు అండగా నిలిచిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య కొనియాడారు. సామాజిక పింఛన్లను దశల వారీగా రూ.3 వేలకు పెంచుతామని మేనిఫెస్టోలో ప్రకటించారు. మొదటి దశగా ఈ ఏడాది రూ.2,250కు పెంచింది. అంతే కాకుండా వృద్ధాప్య పింఛన్ల అర్హత వయసును 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించింది. తలసేమియా, పక్షవాతం, కుష్టు రోగులు, డయాలసిస్ పేషంట్లకు నెలకు రూ.10 వేలు పింఛన్ ఇవ్వాలని నిర్ణయించింది. దాంతో ప్రస్తుతం పింఛన్ అందుకుంటున్న 53.32 లక్షల మందికి అదనంగా మరో 11.20 లక్షల మంది అర్హులవుతారు. అంటే సామాజిక పింఛన్ల లబ్ధిదారులు 64.52 లక్షల మందిలో దాదాపు 30 లక్షల మంది బీసీలే ఉంటారని ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇంతేకాకుండా బీసీ కమిషన్‌ను పునరుద్ధరించాలన్న ప్రభుత్వ నిర్ణయంతో బీసీలకు సామాజిక న్యాయం త్వరితగతిన సాధ్యమవుతుందని ఆర్.కృష్ణయ్య అభిప్రాయపడ్డారు. మనసున్న ప్రభుత్వం.. బీసీల సంక్షేమం అంటే చంద్రబాబులా కేవలం నాలుగు కత్తెర్లు, ఇస్త్రీ పెట్టెలు ఇవ్వడం కాదు.. వారికి ఆర్థిక స్వావలంబన కలిగిస్తానని సీఎం వైఎస్ జగన్ తన పాదయాత్రలో తరచూ చెప్పేవారు. అన్నట్లుగానే సీఎం కాగానే తొలి బడ్జెట్లో బీసీల ఆర్థిక, సామాజిక అభ్యున్నతికి పెద్దపీట వేశారు. బీసీల్లోని అన్ని వర్గాలకు లబ్ధి చేకూర్చేలా బడ్జెట్‌ను ప్రవేశ పెట్టి కుల వృత్తులకు అండగా నిలిచారు. మత్య్సకారులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, నాయి బ్రాహ్మణులు, రజకులు.. ఇలా అన్ని బీసీ కులాల సంక్షేమానికి ఉపక్రమించారు. దర్జీలు, ఆటో డ్రైవర్లు.. ఇలా బీసీలే అత్యధికంగా ఉండే వివిధ కార్మిక వర్గాల అభ్యున్నతికి పెద్దపీట వేశారు. ఇక జగనన్న అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, ఫీజు రీయింబర్స్మెంట్, సామాజిక పింఛన్లు.. ఇలా అన్ని ప్రభుత్వ పథకాల్లోనూ 50 శాతం వరకు బీసీలకే లబ్ధి చేకూరునుందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. మత్స్యకారులకు వరాలు పొడవైన తీర ప్రాంతం ఉన్న మన రాష్ట్రంలో భారీ సంఖ్యలో ఉన్న మత్స్యకారులపై సీఎం వైఎస్ జగన్ వరాల జల్లు కురిపించారని విశాఖ కోస్టల్ మెక్‌నైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోషియేషన్ అధ్యక్షుడు బర్రి కొండ బాబు సంతోషం వ్యక్తం చేశారు. సముద్రంలో వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించే మత్స్యకారుల కుటుంబాలకు రూ.10 లక్షలు పరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించింది. తద్వారా రాష్ట్రంలో దాదాపు 7 లక్షల మత్స్యకార కుటుంబాలకు చెందిన 30 లక్షల మంది జీవితాలకు ప్రభుత్వం భరోసా కల్పించింది. సముద్రంలో చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకార కుటుంబాలకు ప్రస్తుతం ఇస్తున్న భృతి రూ.4 వేలను ఏకంగా రూ.10 వేలకు పెంచారు. అందుకోసం రూ.100 కోట్లు కేటాయించారు. దాంతో మత్స్యకార కుటుంబాల్లో ధైర్యాన్ని కల్పించారు. సముద్రంలో వేటకు వెళ్లే బోట్ల డీజిల్‌పై రాయితీని రూ.6.03 నుంచి రూ.12.93కు పెంచారు. దాంతో బోటు యజమానులైన మత్స్యకారులకు భరోసా కలిగిందని రాజు అనే మత్స్యకారుడు ఆనందంతో చెప్పారు. చేనేత కుటుంబాలకు ఏటా రూ.24 వేలు అందిస్తామని ప్రకటించారు. తద్వారా దాదాపు లక్ష కుటుంబాలు ప్రయోజనం పొందనున్నాయి. కుల వృత్తులపై ఆధారపడిన నాయిబ్రాహ్మణ, రజక కుటుంబాలకు ఏటా రూ.10 వేలు ఇస్తామని ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో దాదాపు 1.92 లక్షల మంది రజకులు, 23 వేల మంది నాయిబ్రాహ్మణులకు లబ్ధి చేకూరనుంది. ఇందుకోసం ప్రభుత్వం రూ.200 కోట్లు కేటాయించింది. వైఎస్సార్ బీమా పథకంతో బీసీ కుటుంబాలకు భరోసా కలిగించారు. బీమా మొత్తాన్ని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచారు. వైఎస్సార్ కల్యాణ కానుక పథకం ద్వారా బీసీ యువతుల వివాహానికి ప్రభుత్వం చేయూతనివ్వనుంది. ఒక్కో వధువుకు రూ.50 వేలు ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించారు. తద్వారా ఒక్క 2019–20లో 75 వేల మంది వధువులకు ప్రయోజనం కలుగుతుంది. -
ఆ నమ్మకం భయపెడుతోంది
విన్ డీజిల్, రాబర్ట్ డౌనీ జూనియర్... ఒకరేమో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్ టాప్ స్టార్. మరొకరు అవెంజర్స్‌లో రాక్‌స్టార్. తాజాగా రాబర్ట్ నాకు స్ఫూర్తి ఇస్తుంటాడు అని పొగడ్తల్లో ముంచెత్తారు విన్ డీజిల్. ఈ విషయాన్ని ఆయన పంచుకుంటూ– ‘‘తనకు ఎదురైన ప్రతి ఒక్కరిలో ఎంతో కొంత స్ఫూర్తినింపుతుంటాడు రాబర్ట్. తను ఎంపిక చేసుకునే పాత్రలు కూడా అలానే ఉంటాయి. ప్రస్తుతం ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. అయినప్పటికీ తను ఎప్పటిలానే ఉన్నాడు. ‘నెక్ట్స్ నీ సినిమా అలానే కలెక్ట్ చేస్తుంది. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సీరిస్ ఇండస్ట్రీను పెద్ద స్థాయి తీసుకెళ్తుంది’ అని చెబుతున్నాడు. ఆ నమ్మకం నన్ను చాలా భయపెడుతోంది. నీతో ఫ్రెండ్షిప్ దొరికినందుకు సంతోషంగా ఉంది రాబర్ట్’’ అన్నారు. ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9’ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదల కానుంది. ∙విన్ డీజిల్, రాబర్ట్ -
మోదీపై నారాయణమూర్తి కీలక వ్యాఖ్యలు
సాక్షి, బెంగళూరు: ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎకనామిక్స్ టైమ్స్‌కు ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్యూలో ఆయన పలు అంశాలపై స్పందించారు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు. ఆయన మరోసారి అధికార పగ్గాలు చేపట్టడం మంచిదని పేర్కొన్నారు. దేశ అభివృద్ధి పట్ల ఆసక్తి ఉన్న జాతీయ నాయకుడిగా మోదీకి మనం కృతజ్ఞులై ఉండాలి. గత అయిదేఏళ్ళలో ఆయన దేశంలో అవినీతి నిర్మూలనకు, క్రమశిక్షణ, పరిశుభ్రతపై దృష్టి కేంద్రీకరించారని తాను భావిస్తున్నానన్నారు. ఆర్థికవ్యవస్థ పురోగమించింది. ఇది మంచి విషయం. దేశంలో అవినీతికి వ్యతిరేకంగా దృఢంగా పోరాడుతున్న మోదీ సర్కార్ మళ్లీ అధికారంలోకి రావడం దేశానికి మంచిదని వ్యాఖ్యానించారు. సాధారణ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న తరుణంలో ఇన్ఫీ నారాయణ మూర్తి వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మరోవైపు దేశాన్ని పట్టి కుదిపేస్తున్న రఫేల్ డీల్‌పై వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. సరైన సమాచారం లేని కారణంగా నిజం ఏమిటో తనకు తెలియదని పేర్కొన్నారు. అలాగే ఆర్బీఐ వివాదంపై స్పందిస్తూ.. ఆయా సంస్థలు దృఢంగా ఉండాలన్నారు. అభివృద్ధిని పక్కన పెట్టి ప్రభుత్వం గుళ్లూ, విగ్రహాల వైపు చూస్తోందన్న ఆరోపణలపై మాట్లాడుతూ ఇవన్నీ తాను దృష్టిపెట్టాల్సిన అంశాలు కావన్నారు. 1.3 బిలియన్ల భారతీయుల్లో ప్రతి ఒక్కరు దేశానికి ఎంతో ముఖ్యం. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, విశ్వాసం, నిర్భయంగా వ్యవహరించే స్వేచ్ఛ ప్రతి పౌరుడికి లభించడమే నిజమైన ప్రజాస్వామ్యంగా పేర్కొన్నారు. అలాగే ప్రపంచంలో అతి కాలుష్య నగరంగా దేశ రాజధాని ఢిల్లీ నిలవడంపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అయితే గ్రామ గ్రామానికి వెళ్లి అక్కడి కాలుష్యం, పరిశుభ్ర పరిస్థితులను ప్రధాని గమనించ లేరు కదా , అది ఆయన బాధ్యత కాదు అని నారాయణ పేర్కొన్నారు. మనం చాలా బాధ్యతారాహిత్యంగా, క్రమశిక్షణా రహితంగా ఉన్నాం. ఈ సమస్య భారతీయల మనస్తత్వంతో, వ్యక్తిత్వాలతో ముడిపడి వుందన్నారు. అంతేకాదు దేశంలో ఆర్థిక పరివర్తన సాధించాలంటే తక్షణమే సాంస్కృతిక పరివర్తన చాలా అవసమని మూర్తి అభిప్రాయపడ్డారు. జీఎస్టీ, ఐబీసీ వంటి కీలక సంస్కరణల్లో అమలుపై ప్రశ్నకు ప్రధాని ఆధ్వర్యంలో ఆర్థిక వ్యవస్థ పురోగతి సాధించిందంటూ మరోసారి స్పష్టం చేశారు. వీటి వైఫల్యానికి మోదీని తప్పు బట్టలేం. ఇది ప్రజాప్రతినిధులు చేయాల్సిన పనంటూ చెప్పుకొచ్చారు. -
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై నాగం ప్రశంసలు
-
నా అభిమానులే మీకు పాఠాలు చెబుతారు
సాక్షి ప్రతినిధి, చెన్నై: రాజకీయ నాయకులెవ్వరూ తన అభిమానులకు పాఠాలు నేర్పాల్సిన అవసరం లేదని, వారే ఎదుటి వారికి పాఠాలు చెప్పగల నేర్పులని నటుడు రజనీకాంత్ విమర్శకులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. చెన్నైలో ప్రజా సంఘాల సమావేశాల్లో ఆయన మాట్లాడారు. 32 ఏళ్ల చరిత్ర కలిగిన అభిమాన సంఘాల నుంచి తమ పార్టీ ఉద్భవిస్తోందని, తాము ఇప్పుడు చేయాల్సిందల్లా వాటిని మరింత బలోపేతం చేయడమేనని అన్నారు. జిల్లాల్లో ఇన్‌చార్జ్‌ల నియామకం పూర్తయ్యాక రాష్ట్ర పర్యటన చేపడతానన్నారు. కమల్ సమర్థుడు.. ఇటీవల పార్టీ స్థాపించిన సహ నటుడు కమల్ హాసన్‌పై రజనీకాంత్ ప్రశంసలు కురిపించారు. కమల్ సమర్థుడని, ఆయన ప్రజల విశ్వాసం చూరగొంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజకీయాల్లోకి రాబోతున్న తనది, కమల్‌ది రెండు వేర్వేరు దారులని, అయినా ఇద్దరి అంతిమ లక్ష్యం ప్రజా సంక్షేమమేనని అన్నారు. -
కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతం
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర జలవనరుల మంత్రి నితిన్ గడ్కరీ ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణ తాగు, సాగు అవసరాల కోసం చేపడుతున్న ఈ ప్రాజెక్టు పనితీరు భేష్ అని కితాబిచ్చారు. ప్రాజెక్టు నిర్మాణానికి అధిక నిధుల కేటాయింపు, వేగవంతంగా పనులు కొనసాగించడం తదితరాలను ప్రశంసించారు. బుధవారం ఢిల్లీలో నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ) ఆధ్వర్యంలో 14వ అంతర్రాష్ట్రీయ నదుల అనుసంధానంపై గడ్కరీ అధ్యక్షతన భేటీ జరిగింది. మంత్రి హరీశ్‌రావు, నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్కె జోషీ పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్యాలు, పనుల పురోగతిని గడ్కరీ ప్రశంసించారు. భేటీలో తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడులకు చెందిన నదుల అనుసంధానంపై చర్చించారు. గోదావరే శరణ్యం: హరీశ్ గోదావరి–కావేరి నదులను తొలి దశలో, మహానది–గోదావరిలను రెండో దశలో అనుసంధానిస్తామని కేంద్రం ప్రతిపాదించింది. వీటిపై రాష్ట్ర ప్రభుత్వం 4 ప్రధానాంశాలను లేవనెత్తింది. నీటి లభ్యత, నీటి వనరులు–నీటి తరలింపు, ప్రత్యామ్నాయ మార్గాలు, తక్కువ ఖర్చుతో ఎక్కువ నీటి ఉపయోగం–పర్యావరణ అనుకూలత తదితరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. మహానది–గోదావరి అనుసంధానాన్నే తొలి దశలో చేపట్టి, ఆ తర్వాతే గోదావరి–కావేరి అనుసంధానంపై చర్చించాలని హరీశ్ సూచించారు. కేంద్రం చెబుతున్నట్టుగా ఏటా 3,000 టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తున్నట్టయితే అనుసంధానానికి తెలంగాణ పూర్తి మద్దతిస్తుందని స్పష్టం చేశారు. ‘‘రెండు నదుల మధ్య ఉన్న తెలంగాణను ప్రధానంగా నీటి కోసమే సాధించుకున్నాం. కాబట్టి మాకిది చాలా ప్రాధాన్యాంశం. కృష్ణాలో నీటి లభ్యత రోజురోజుకు తగ్గిపోతోంది. అందులో 300 టీఎంసీ నికర జలాలు, 70 టీఎంసీ మిగులు జలాలు తెలంగాణ హక్కు. బ్రిజేశ్ ట్రిబ్యునల్ తుది కేటాయింపులు జరపాల్సి ఉంది. కానీ కృష్ణాలో అంత నీరు తెలంగాణకు దక్కడం లేదు. కర్ణాటక ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచుకునేందుకు ట్రిబ్యునల్ అనుమతించింది. దాంతో కృష్ణాలో నీటి లభ్యత ఇంకా తగ్గుతుంది. కాబట్టి తెలంగాణలోని కృష్ణా పరీవాహక ప్రాంతం కూడా గోదావరి నీటిపైనే ఆధారపడాల్సి ఉంటుంది. గోదావరి జలాల్లో 954 టీఎంసీలు తెలంగాణ హక్కు. తెలంగాణ ఏర్పడ్డాక ప్రాజెక్టుల నిర్మాణం వేగవంతం చేసి ఈ హక్కును పూర్తి స్థాయి లో వినియోగించుకోవాలని మా ప్రభుత్వం కృషి చేస్తోంది. కాళేశ్వరం, దేవాదుల, తుపాకులగూడెం, సీతారామ తదితరాలతో తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు ప్రయత్నిస్తోంది. సీతారామ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం సస్యశ్యామలమవుతుంది. దీనితో రాష్ట్ర పరి«ధిలోనే నదుల అనుసంధానం చేపడుతున్నాం. కృష్ణా పరీవాహక ప్రాంతంలో నాగార్జునసాగర్ ఆయకట్టుకు కూడా సీతారామ ద్వారా నీరిస్తున్నాం. మొత్తంగా కృష్ణా, గోదావరుల నుంచి తెలంగాణకు 1,700 టీఎంసీలు కావాలి. ఇది పోను ఇంకా మిగులు జలాలుంటే ఇవ్వడానికి మేం సిద్ధం’’అని వివరించారు. అక్కనపల్లికి ఒప్పుకోం! అక్కనపల్లి వద్ద బ్యారేజీ కట్టాలన్న కేంద్రం యోచనపై హరీశ్ అభ్యంతరం వెలిబుచ్చారు. ‘‘అది సీతారామపై ప్రభా వం చూపుతుంది. పైగా అక్కనపల్లి వద్ద నీటి లభ్యత లేదని మా అధ్యయనంలో తేలింది. ‘అక్కనపల్లి వల్ల తెలంగాణలో 42 వేల ఎకరాలు, 45 గ్రామాలు ముంపు నకు గురవుతాయి. ఇందుకు మేం సిద్ధం గా లేం. మొదట మహానది–గోదావరిని కలిపి గోదావరి నుంచి కృష్ణాకు, కృష్ణా నుంచి కావేరికీ కలిపి నీరు తీసుకెళ్తే అభ్యంతరం లేదు. ప్రభుత్వం చెబుతున్నట్టు ఏటా 3,000 టీఎంసీలు సము ద్రంలో కలుస్తున్నాయా అన్నదానిపై లెక్కతేల్చాలి. తెలంగాణకు కాళేశ్వరం, కంతనపల్లి ప్రాజెక్టులకు అనుమతులిచ్చే ముందు 40 ఏళ్ల సిరిస్ ఆధారంగా నీటి లభ్యతను లెక్కగట్టిన కేంద్రం, అక్కనపల్లి విషయంలో మాత్రం 110 ఏళ్ల సిరిస్ ఆధారంగా లెక్కించి 170 టీఎంసీల లభ్యత ఉందనడం సరికాదు. గోదావరి, కృష్ణా నుంచి తెలంగాణ నీటి అవసరాలను పక్కన పెట్టిన అనంతరం మిగులు జలాలను ఇవ్వడంలో అభ్యంతరం లేదు. నీటిలభ్యతపై సీడబ్ల్యూసీ, ఎన్‌డబ్ల్యూడీఏ, రాష్ట్ర అధికారుల అధ్వర్యంలో కమిటీ వేసి అధ్యయనం చేయించాలి’’అని భేటీలో కోరినట్టు హరీశ్ మీడియాకు తెలిపారు. ప్రాజెక్టు పనుల పరిశీలనకు రావాల్సిందిగా కోరగా గడ్కరీ సానుకూలంగా స్పందించారన్నారు. -
సత్యరాజ్ క్షమాపణపై కమల్ స్పందన
చెన్నై:తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల మధ్య కావేరీ జలాలపై కట్టప్ప వ్యాఖ్యలు-బాహుబలి వివాదం నేపథ్యంలో సత్యరాజ్ కన్నడిగులకు క్షమాపణ చెప్పడంపై నటుడు, దర్శకుడు కమల్‌హాసన్ స్పందించారు. కమల్ సత్యరాజ్‌కు శనివారం ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. సత్యరాజ్ గొప్ప మానవుడని కొనియాడారు. "సంక్లిష్ట వాతావరణంలో హేతుబద్ధతను కాపాడిన సత్యరాజ్‌కు అభినందనలు" అని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన సినిమా విరుమాందిలోని క్షమాపణ కోరినవాడే గొప్పమానవుడు అన్న మాటలను ఉటంకించారు. మరోవైపు తమిళనాడు బీజేపీ నాయకుడు, మాజీ ఎంఎల్ఏ రాజా సత్యరాజ్, కమల్ హాసన్‌లపై మండిపడ్డారు. వారికి డబ్బుమీద ధ్యాస తప్ప తమిళుల మీద ప్రేమ లేదని ట్విట్టర్ లో ధ్వజమెత్తారు. వారు డబ్బు గురించి మాత్రమే బాధపడతారు , తమిళనాడు, తమిళ సెంటిమెంట్‌పై వారికి పైపైన ప్రేమ మాత్రమేనేని విమర్శించారు. డబ్బు కోసం ఆత్మగౌరవంలేని చర్య గా ఆయన అభివర్ణించారు. కాగా తొమ్మిదేళ్ళ క్రితం సినీ నటుడు సత్యరాజ్, కావేరీ జలాల వివాదంపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ వివాదం 'బాహుబలి' (ది కన్‌క్లూజన్) సినిమా విడుదలకు అడ్డంకిగా మారింది. ఈ నేపథ్యంలో దర్శకుడు రాజమౌళి సత్యరాజ్ తరపున క్షమాపణలు చెప్పారు. అయినా సత్యరాజ్ క్షమాపణలు చెప్పాల్సిందే అని కన్నడిగులు పట్టుబట్టడంతో కర్నాటక ప్రజలపై తనకెప్పుడూ చిన్న చూపు లేదనీ, తనవ్యాఖ్యలకు ఎవరైనా బాధపడి వుంటే క్షమించమంటూ సత్యరాజ్ కోరిన సంగతి తెలిసిందే. Congrats Mr. Sathyaraj for maintaining rationality in a troubled environement. Quoting VirumaaNdi மன்னிப்புக் கேக்கறவன் பெரியமனுசன். Bravo — Kamal Haasan (@ikamalhaasan) April 22, 2017 Whether it is Kamal or Sathyaraj they are bothered only about money. Their love for Tamil and their Tamil sentiment is only skin deep — H Raja (@HRajaBJP) April 21, 2017 -
ప్రధానిపై కేజ్రీవాల్ ప్రశంసల జల్లు
న్యూఢిల్లి: సందు దొరికితే చాలు కేంద్ర ప్రభుత్వంపైన, ప్రధానమంత్రి నరేంద్రమోదీపైన విరుచుకుపడే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ఉన్నట్టుండి ప్రధానమంత్రిపై ప్రశంసల జల్లు కురిపించారు. మహారాష్ట్రలోని లాతూర్ ప్రజలు ఎదుర్కొంటున్న నీటి సమస్యను పరిష్కరించడంలో నరేంద్రమోదీ తీసుకున్న చొరవను అభినందిస్తూ కేజ్రీవాల్ లేఖ రాశారు. "21వ శతాబ్దంలో భారతదేశంలో ఎవరైనా దాహంతో చనిపోతే అది దేశానికే అరిష్టం. లాతూర్ ప్రజల దాహార్తిని తీర్చడానికి దేశమంతా సిద్ధంగా ఉండాలి. లాతూర్ కు అన్నిరాష్ట్రాల ముఖ్యమంత్రులు సాయమందించాలి'' అని కేజ్రీవాల్ తన లేఖలో పేర్కొన్నారు. లాతూర్ ప్రజలకు సాయమందించడానికి ఢిల్లీ ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు. -
పవన్‌ను వాడేసుకుంటున్న యంగ్‌హీరోలు
-
ఫాదర్‌గా చాలా గర్వపడుతున్నాను
-
సల్మాన్ ఖాన్ పై మోడీ ప్రశంసల వర్షం!
న్యూఢిల్లీ: స్వచ్ఛ భారత్ ప్రచారంలో పాలుపంచుకున్న బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ను ప్రధాని నరేంద్రమోడీ ప్రశంసలతో ముంచెత్తారు. యువతకు, ఇతరులకు సల్మాన్ ప్రచారం స్పూర్తిగా నిలుస్తుందనే అభిప్రాయాన్ని మోడీ వ్యక్తం చేశారు. స్వచ్ఛ భారత్ మిషన్ లో ప్రజలు పాలుపంచుకునేందుకు సల్మాన్ సేవలు స్పూర్తిగా నిలుస్తాయని మోడీ ట్విటర్ లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. స్వచ్చ భారత్ కార్యక్రమంలో భాగంగా సల్మాన్ ఖాన్ మంగళవారం ముంబైలోని కజ్రాత్ ప్రాంతంలో క్లీనింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని తన ఫేస్ బుక్ లోని ఫ్యాన్స్, తన ట్విటర్ అకౌంట్ లోని ఫాలోవర్స్ తోపాటు, అమీర్ ఖాన్, అజీమ్ ప్రేమ్ జీ, చందా కొచ్చర్, ఒమర్ అబ్దుల్లా, ప్రదీప్ దూత్, రజత్ శర్మ, రజనీకాంత్, వినీత్ జైన్ లను నామినేట్ చేశారు. The effort by @BeingSalmanKhan is a significant one that will inspire several people to join Swachh Bharat Mission. #MyCleanIndia — Narendra Modi (@narendramodi) October 22, 2014 And I nominate Aamir Khan, Azim Premji, Chanda Kochhar, Omar Abdullah, Pradeep Dhoot, Rajat Sharma, Rajinikanth & Vineet Jain. — Salman Khan (@BeingSalmanKhan) October 22, 2014 First, I nominate my fans on Facebook and followers on Twitter. Each one of us can make a difference. — Salman Khan (@BeingSalmanKhan) October 22, 2014 -
రెజీనాను పొగడ్తలతో ముంచెత్తిన మాస్ రాజా
-
20 ఏళ్ల కుర్రాడిగా కనిపించబోతోన్న హీరో