సాక్షి, అమరావతి: వందశాతం గృహ విద్యుదీకరణ చేపట్టినందుకు ఆంధ్రప్రదేశ్‌ను నీతి ఆయోగ్ ప్రశంసించింది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో ‘క్లీన్ అండ్ అఫర్డబుల్ ఎనర్జీ’ కేటగిరీలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉన్నట్టు పేర్కొంది. నీతి ఆయోగ్ విడుదల చేసిన సస్టయినబుల్ డెవలప్‌మెంట్ గోల్స్‌లో ప్రథమ స్థానం సాధించడమే ఇందుకు నిదర్శనమని తెలిపింది. దీనిపై విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందిస్తూ.. ఆంధ్రప్రదేశ్‌ను క్లీన్ ఎనర్జీకి గమ్యస్థానంగా మార్చేందుకు ఈ చర్యలన్నీ దోహదపడతాయన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అందించిన సంపూర్ణ మద్దతు కారణంగానే గత రెండేళ్లలో విద్యుత్ రంగం ఆశించిన స్థాయిలో పురోగతి సాధించిందన్నారు.
చదవండి: ఇది ఆంధ్రప్రదేశ్ పాడి రైతుల అదృష్టం
విద్యారంగం.. పురోగమనం
Comments
Please login to add a commentAdd a comment