RRR Movie: Sukumar Praise On SS Rajamouli: ఓటమెరుగని దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చిత్రం రౌద్రం.. రణం.. రుధిరం.. 'ఆర్‌ఆర్‌ఆర్'. యావత్ భారతదేశం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఈ చిత్రం మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియాగా తెరకెక్కిన ఈ మూవీ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తుంది. సూపర్ హిట్ టాక్‌తో ఏ థియేటర్ వద్ద చూసినా సందడి వాతావరణం నెలకొంది. ఇక రామ్‌చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొమురం భీమ్‌గా తారక్, అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్ నటనకు జనం నీరాజనాలు పడుతున్నారు. దేశం నలువైపుల నుంచి జక్కన్న, మూవీ టీంపై ప్రశంసలు కురుస్తున్నాయి.
చదవండి: 'ఆర్ఆర్ఆర్'పై కెఆర్‌కె రివ్యూ.. జక్కన్నపై షాకింగ్ కామెంట్స్
ఈ క్రమంలోనే 'ఆర్ఆర్ఆర్'ను వీక్షించిన క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ జక్కన్నను పొగడ్తలతో ముంచెత్తారు. 'మీరు పక్కనే ఉన్న మిమ్మల్ని అందుకోవాలంటే పరిగెత్తాలి.. మేం ఆకాశంలో ఉన్నా మిమ్మల్ని చూడాలంటే మేం తలెత్తాలి', 'రాజమౌళి సార్ మీకూ మాకు ఒకటే తేడా.. ఇలాంటి సినిమా మీరు తీయగలరు.. మేం చూడగలం అంతే..' అని సుకుమార్ ఆయన ఫేస్‌బుక్ అకౌంట్‌లో ఒక పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక డైరెక్టర్ మరో డైరెక్టర్‌ను ఇలా ప్రశంసించిన సుకుమార్ పట్ల నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. నిజానికి సుకుమార్‌కి రాజమౌళి అభిమాని. ఎనర్జీటిక్ స్టార్ రామ్ హీరోగా సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన జగడం మూవీలోని ఒక షాట్‌కి తను ఎప్పటికీ ఫ్యాన్ అని పలు ఇంటర్వ్యూల్లో జక్కన్న చెప్పిన సంగతి తెలిసిందే.
చదవండి: ఆర్‌ఆర్‌ఆర్ మూవీ ఎలా ఉందంటే..
Comments
Please login to add a commentAdd a comment