సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై కేంద్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ ప్రశంసలు కురిపించారు. కోవిడ్ టీకాలు అందించడంలో ఏపీ ప్రభుత్వం పనితీరు అభినందనీయమన్నారు. ఏపీలో కోవిడ్ వ్యాక్సినేషన్ శరవేగంగా సాగిందన్నారు. ఏపీ ప్రభుత్వం 99 శాతం రెండు డోసుల టీకాలను అందించిందన్నారు.
చదవండి: చిరు వ్యాపారులకు గుడ్‌న్యూస్.. ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు..
కోవిడ్ వ్యాక్సినేషన్‌ను శరవేగంగా అందించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఫెడరల్ స్ఫూర్తితో రాష్ట్రాలతో కలిసి పనిచేస్తున్నామన్నారు. ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు 3 మెడికల్ కళాశాలలు మంజూరు చేశామని.. మిగిలిన వాటిని దశల వారీగా మంజూరు చేస్తామని కేంద్రమంత్రి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment