Pravin Pawar
-
ఏపీ ప్రభుత్వంపై కేంద్రమంత్రి ప్రశంసలు
-
ఏపీ ప్రభుత్వంపై కేంద్రమంత్రి ప్రశంసలు
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై కేంద్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ ప్రశంసలు కురిపించారు. కోవిడ్ టీకాలు అందించడంలో ఏపీ ప్రభుత్వం పనితీరు అభినందనీయమన్నారు. ఏపీలో కోవిడ్ వ్యాక్సినేషన్ శరవేగంగా సాగిందన్నారు. ఏపీ ప్రభుత్వం 99 శాతం రెండు డోసుల టీకాలను అందించిందన్నారు. చదవండి: చిరు వ్యాపారులకు గుడ్‌న్యూస్.. ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు.. కోవిడ్ వ్యాక్సినేషన్‌ను శరవేగంగా అందించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఫెడరల్ స్ఫూర్తితో రాష్ట్రాలతో కలిసి పనిచేస్తున్నామన్నారు. ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు 3 మెడికల్ కళాశాలలు మంజూరు చేశామని.. మిగిలిన వాటిని దశల వారీగా మంజూరు చేస్తామని కేంద్రమంత్రి వెల్లడించారు. -
ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన కేంద్ర మంత్రి
-
12–18 ఏళ్ల వారికి పరిశీలనలో కోవిడ్ టీకా
న్యూఢిల్లీ: దేశంలోని 12–18 ఏళ్ల గ్రూపు బాలలకు కోవిడ్ టీకా ఇచ్చే విషయంలో నిపుణుల కమిటీ (నెగ్వ్యాక్), వ్యాధినిరోధకతపై ఏర్పాటైన జాతీయ సాంకేతిక సలహా బృందం(ఎన్టీఏజీఐ) శాస్త్రీయ ఆధారాలను పరిశీలించి, చర్చలు జరుపుతున్నాయని కేంద్రం శుక్రవారం లోక్‌సభలో తెలిపింది. ఈ మేరకు ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. దేశీయంగా కేడిలా హెల్త్‌కేర్ సంస్థ తయారు చేసిన జైకోవ్–డి టీకాను పరిమితులకు లోబడి అత్యవసర పరిస్థితుల్లో 12 ఏళ్లు పైబడిన వారికి ఇచ్చేందుకు అనుమతివ్వాలంటూ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ)కి దరఖాస్తు అందిందని తెలిపారు. అదేవిధంగా, భారత్ బయోటెక్ సంస్థ కూడా కోవాగ్జిన్ టీకా బీఆర్డీతో 2–18 ఏళ్ల వయస్సుల వారిపై చేపట్టిన 2/3 దశల క్లినికల్ డేటా వివరాలతో మధ్యంతర నివేదికను డీసీజీఐకి అందజేసిందన్నారు. సీరం ఇన్స్టిట్యూట్ 2–17 ఏళ్ల వారికి కోవోవ్యాక్స్ టీకాతో 2/3 దశల క్లినికల్ ట్రయల్స్ చేపట్టిందన్నారు. బయోలాజికల్–ఈ సంస్థ 5–18 ఏళ్ల వారి కోసం రూపొందించిన టీకా 2/2 దశల క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తోందన్నారు. జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ 12–17 ఏళ్ల వారి కోసం తయారు చేసిన ఏడీ.26కోవ్.2ఎస్ టీకాతో భారత్ సహా పలు ప్రపంచదేశాల్లో 2/3 క్లినికల్ ట్రయల్స్ జరుపుతోందని చెప్పారు. క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను బట్టి అనుమతులిచ్చే విషయం పరిశీలిస్తామన్నారు. -
కేసుల నిరూపణలో ఏసీబీ విఫలం
సాక్షి, ముంబై: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు పథకం ప్రకారం వలపన్ని అనేక మంది అవినీతిపరులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటున్నారు. కాని కోర్టులో తగిన రుజువులు సమర్పించడంలో విఫలమవుతున్నారు. ఫలితంగా కొంతమంది అవినీతిపరులకు మాత్రమే జైలు శిక్ష పడుతోందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ ఆఖరు వరకు వేయి మందికిపైగా అవినీతిపరులను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కాని నేరం రుజువు కాకపోవడంతో కేవలం 23 శాతం మందికి మాత్రమే జైలు శిక్ష పడింది. కాగా 2009-2014 (అక్టోబర్ ఆఖరు వరకు) కాలవ్యవధిలో 2,266 మందిని పట్టుకోగా వారిలో కేవలం 519 మందికి శిక్ష పడింది. మిగిలిన 1,747 మంది నిర్ధోషులుగా విడుదలయ్యారు. సర్ధార్ వల్లభాయి పటేల్ జయంతి పురస్కరించుకుని ఏసీబీ అక్టోబర్ 27 నుంచి నవంబర్ ఒకటి వరకు భద్రత జనజాగృతి వారోత్సవాలు నిర్వహించింది. ఇందులో అవినీతిపరుల వివరాలు వెల్లడించింది. అవినీతి, ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టుకోవడం తదితర కేసుల్లో పట్టుబడిన వారిలో అత్యధిక శాతం నాసిక్‌కు చెందినవారున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రత్యేక కోర్టుల్లో ప్రస్తుతం మొత్తం 2,794 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అదేవిధంగా ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్న 318 కేసులు సైతం పెండింగ్‌లో ఉన్నాయి. ఇదిలా ఉండగా, ఏసీబీ అధికారులు కూడా తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. కాగా, అవినీతి పరులు లంచం తీసుకుంటుండగా రహస్యంగా తీసిన ఫొటోలు లేదా స్ట్రింగ్ ఆపరేషన్ ద్వారా వీడియో చిత్రీకరణ దృశ్యాలు ఏసీబీకి పంపిస్తే కొంత ఫలితముంటుందని నాసిక్ రీజియన్ సూపరింటెండెంట్ ప్రవీణ్ పవార్ అభిప్రాయపడ్డారు.