Kangana Ranaut Praises Kantara Movie After Watching With Family, Deets Inside - Sakshi
Sakshi News home page

Kangana Ranaut-kantara Movie: కాంతార మూవీపై కంగనా రివ్యూ, ఏం చెప్పిందంటే..

Published Fri, Oct 21 2022 12:06 PM | Last Updated on Fri, Oct 21 2022 12:38 PM

Kangana Ranaut Praises Kantara Movie After Watching With Family - Sakshi

కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి తెరకెక్కించిన 'కాంతార' సినిమా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో సంచలనంగా మారింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. తొలుత కన్నడనాట చిన్న సినిమాగా రిలీజ్‌ అయిన ఈ చిత్రం ఇప్పుడు పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందింది. వరుసగా తెలుగు, తమిళం, హిందీలో కాంతార విడుదల కాగా అన్ని వర్గాల ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సినీ ప్రముఖులు సైతం ఈ సినిమా అద్భుతమంటూ కొనియాడుతున్నారు.

చదవండి: ఓటీటీకి వచ్చేసిన బింబిసార, అర్థరాత్రి నుంచి స్ట్రీమింగ్‌

తాజాగా ఈ సినిమా చూసిన ఫైర్‌ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ కాంతారపై ప్రశంసలు కురిపించింది. ఈ మేరకు ఆమె సోషల్‌ మీడియా వేదికగా తన అనుభవాన్ని పంచుకుంది. ‘‘ఇప్పుడే కుటుంబంతో కలిసి ‘కాంతార’ సినిమా చూశాను. ఇప్పటికీ నా శరీరం వణుకుతూనే ఉంది. ఇదొక అద్భుతమైన అనుభవం. సాంప్రదాయం, జానపద కథలు, దేశీయ సమస్యల సమ్మేళనమే ఈ చిత్రం. రిషబ్‌ శెట్టికి హ్యాట్సాఫ్‌. రచన, దర్శకత్వం, నటన.. అన్నీ మరోస్థాయిలో ఉన్నాయి. ప్రకృతి అందాలను చూపించిన విధానం, యాక్షన్‌ సన్నివేశాలను తెరకెక్కించిన తీరు అత్యద్భుతంగా ఉంది.

చదవండి: కార్తీ ‘సర్ధార్‌’ మూవీ ట్విటర్‌ రివ్యూ

సినిమా అంటే ఇది. ఇలాంటి చిత్రాన్ని తాము ఎప్పుడూ చూడలేదని థియేటర్‌లో ప్రేక్షకులు చెబుతున్నారు. ఇలాంటి అద్భుతమైన చిత్రాన్ని అందించిన టీమ్‌కు ధన్యవాదాలు. మరోవారం రోజులపాటు నేను ఈ అనుభూతిలోనే ఉంటాననిపిస్తుంది’ అంటూ చెప్పుకొచ్చింది. అలాగే మరో పోస్ట్‌ షేర్‌ చేస్తూ వచ్చే ఏడాది కాంతార ఆస్కార్‌ నామినేట్‌ అవ్వడం పక్కా అని పేర్కొంది. ఇంతకంటే గొప్ప చిత్రాలు రావోచ్చు కానీ, మన దేశ సంస్కృతిని, అద్భుతాన్ని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసే ఇలాంటి చిత్రాలను ఆస్కార్‌కు నామినేట్‌ చేయాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement