residential schools
-
సమీకృత గురుకులాలకు అంకురార్పణ
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ సౌకర్యాలతో, అత్యాధునిక డిజైన్లతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించ తలపెట్టిన యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలలకు అంకురార్పణ జరిగింది. తొలిదశలో భాగంగా రాష్ట్రంలోని 28 నియోజకవర్గాల్లో 28 రెసిడెన్షియల్ పాఠశాలలకు శుక్రవారం శంకుస్థాపనలు జరిగాయి. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొందుర్గులో సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేయగా, ఇతర ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.మధిర నియోజకవర్గంలోని బోనకల్లు మండలం గోవిందాపురంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని గంధంవారి గూడెంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడవిసోమన్‌పల్లిలో ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండలం తంగళపల్లి, మానకొండూరు నియోజకవర్గం తిమ్మాపూర్ పరిధిలోని యాదవులపల్లిలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఖమ్మం జిల్లా పొన్నేకల్‌లో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సమీకృత పాఠశాల భవనాలకు భూమిపూజ చేశారు.కొడంగల్, హుజూర్నగర్, ములుగు, పాలేరు, ఖమ్మం, వరంగల్, కొల్లాపూర్, ఆందోల్, చాంద్రాయణగుట్ట, మంచిర్యాల, భూపాలపల్లి, అచ్చంపేట, స్టేషన్‌ఘన్‌పూర్, తుంగతుర్తి, మునుగోడు, చెన్నూరు, జడ్చర్ల, పరకాల, నారాయణఖేడ్, దేవరకద్ర, నాగర్‌కర్నూల్, నర్సంపేటల్లో పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ పార్టీ నేతలు శంకుస్థాపనలు నిర్వహించారు. ఈ పాఠశాలల్లో విద్యాబోధన అంతర్జాతీయ ప్రమాణాలతో ఉంటుందని, ఒక్కో స్కూల్ కాంప్లెక్స్‌లో 2,560 మంది చదువుకునే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ గురుకులాల్లో లైబ్రరీ, డిజిటల్ క్లాస్రూంలు, డైనింగ్ హాల్, డారి్మటరీ, బాత్రూమ్లు, విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు నివాస సముదాయాలు, ఇండోర్, అవుట్డోర్ క్రీడా మైదానాలు, ఆడిటోరియం, హాస్పిటల్ తదితర సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నారు. ఐదో తరగతి నుంచి ఇంటరీ్మడియట్ వరకు ఇక్కడ చదువుకోవచ్చు. -
కేసీఆర్ కట్టింది గడీలు.. మేం కట్టేది బడులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘గత ముఖ్యమంత్రి గడీలు, పార్టీ ఆఫీసులు కడితే.. మేము పేద పిల్లల కోసం సమీకృత గురుకుల పాఠశాలలు నిర్మిస్తున్నాం. తెలంగాణలోని 28 నియోజకవర్గాల్లో వీటిని కడుతున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలను ఒకే గొడుగు కిందికి తీసుకురావడం ద్వారా కుల రహిత సమాజ స్థాపనే ప్రభుత్వ లక్ష్యం..’అని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. 25 ఎకరాల్లో, రూ.125 కోట్ల అంచనా వ్యయంతో రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం కొందుర్గులో అత్యాధునిక హంగులతో నిర్మించ తలపెట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవనానికి శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. అయినవాళ్లకు పదవులు..పేదలకు బర్రెలు‘కేసీఆర్ గత పదేళ్లలో విద్యావ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఏడు లక్షల కోట్లు అప్పు చేశారు కానీ విద్యాలయాలకు పైసా విదల్చలేదు. పైగా ఐదు వేలకుపైగా స్కూళ్లను మూసి వేయించారు. ఒక నియోజకవర్గానికో, ఒక కులానికో గురుకులాన్ని ఏర్పాటు చేసినా వాటిలో కనీస సదుపాయాలు కల్పించలేదు. నలుగురు ఉండాల్సిన గదుల్లో 40 మంది పిల్లలను కుక్కారు. చదువుకున్నోళ్లకు ఎవరైనా ఆయా రంగాల్లో ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కలి్పంచాలి. కానీ ఆయన మాత్రం తన కొడుకు, అల్లుడికి మంత్రి పదవులు, కూతురుకు ఎమ్మెల్సీ, మరో కొడుక్కి రాజ్యసభ పదవులు కట్టబెట్టాడు. నమ్ముకున్న పేదలకు మాత్రం గొర్రెలు, బర్రెలు, పందులు పంచి పెట్టాడు.నీ కొడుకును, అల్లుడిని, బిడ్డను బర్రెలు, గొర్రెలు కాయడానికి పంపుతావా? పేదోడు చదువుకుంటే ఎక్కడ వారిలో చైతన్యం వస్తుందో అని, ఎక్కడ తన తప్పులను ప్రశి్నస్తారో అని భయపడి చదువుకు దూరం చేసి, వారిని బానిసలుగా చూశాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అంటూ విడదీసి ఒకేచోట కలిసి మెలసి ఉండాల్సిన పిల్లల మెదడులో విషం నింపాడు. సమాజ విచ్ఛిన్నానికి కుట్రపన్నాడు. 10 జిల్లాలను 33 జిల్లాలుగా విభజించాడు. ఆయా జిల్లాల్లో పార్టీ కార్యాలయాల కోసం ప్రభుత్వ భూములను అప్పనంగా కొట్టేసి నిర్మాణాలు చేపట్టాడు. కానీ పేదలకు స్కూళ్లు, ఆస్పత్రులు కట్టేందుకు మాత్రం ఆయనకు మనసు రాలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్కు గుండు సున్నా ఇచ్చారు. అయినా ఆ పార్టీ నేతల బుద్ధి మారలేదు..’అని రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రవీణ్‌కుమార్ కూడా దొరలాగే మాట్లాడుతున్నాడు ‘ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అంటే నాకు గౌరవం ఉంది. అణగారిన కులం నుంచి వచ్చి ఐపీఎస్ అయినందుకు ఆయన్ను మనస్ఫూర్తిగా అభినందించా. బీఎస్పీలో ఉంటారో? బీఆర్ఎస్లో ఉంటారో ఆయన ఇష్టం. ఆయన గురుకులాలకు కార్యదర్శిగా పని చేశారు. షాద్‌నగర్ బిడ్డలకు రూ.125 కోట్లతో ఇంటిగ్రేటెడ్ గురుకులం నిర్మిస్తుంటే అభినందించాల్సింది పోయి అడ్డుపడుతున్నాడు. కేసీఆర్ చెప్పిందే ఆయన మాట్లాడుతున్నాడు. బీఆర్ఎస్లో చేరిన తర్వాత ఆయన కూడా పేదలు బర్రెలు, గొర్రెలు, పందులు కాసుకోవాలని దొరలాగే సూచిస్తున్నాడు..’అని సీఎం ధ్వజమెత్తారు. సమీకృత స్కూళ్లకు పీవీ ఆద్యుడు ‘నిర్వీర్యమైన విద్యా వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నా. ఎలాంటి విమర్శలకు తావు లేకుండా ఇప్పటికే 34 వేల మంది ఉపాధ్యాయులను బదిలీ చేశాం. 21 వేల మందికి పదోన్నతులు కలి్పంచాం. ఇందులో అధికారుల కృషి అభినందనీయం. ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు దివంగత ప్రధాని పీవీ నరసింహారావు ఆద్యుడు. ఆయన సర్వేల్, నాగార్జునసాగర్‌లో ఏర్పాటు చేసిన స్కూళ్లలో చదువుకున్న అనేకమంది ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, డాక్టర్లు, లాయర్లు, పారిశ్రామిక వేత్తలుగా ఎదిగారు. ఒకప్పుడు సర్వేల్ స్కూల్లో చదువుకున్న బుర్ర వెంకటేశం ఐఏఎస్ అయ్యారు. మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి కూడా ఇదే స్కూల్లో చదువుకున్నారు..’అని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్, రాంమోహన్‌రెడ్డి, కాలె యాదయ్య, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం, కలెక్టర్ శశాంక పాల్గొన్నారు. విద్యార్థులందరిదీ ఒక్కటే కులం కొందుర్గు: విద్యాభ్యాసం చేస్తున్న బాలబాలికలందరిదీ ఒక్కటే కులమని, అది విద్యార్థి కులమని కొందుర్గు విద్యార్థి మణికంఠ అన్నాడు. సీఎం పాల్గొన్న సభలో అతను మాట్లాడుతూ.. పేదలు, మధ్య తరగతి విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యను అందించడానికి, కుల, మతాలకతీతంగా విద్యార్థులందరూ ఒకేచోట చదువుకునేందుకు వీలుగా ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేయడం సంతోషకరమైన విషయమని అన్నాడు. ‘నేను ప్రమాణం చేసి చెప్తున్నా.. ఈ విషయమై ఎప్పుడూ సీఎం రేవంత్‌రెడ్డికి రుణపడి ఉంటాం..’అని చెప్పాడు. ఈ సందర్భంగా మణికంఠతో పాటు మరో విద్యార్థి జ్యోతిని ముఖ్యమంత్రి అభినందించారు. -
సమీకృత గురుకు భవనాలకు నేడు శంకుస్థాపన
సాక్షి, హైదరాబాద్/కొందుర్గు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల భవన నిర్మాణ పనులు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏకకాలంలో ఈ భవనాలకు ప్రభుత్వం శంకుస్థాపన చేయనుంది. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కొందుర్గులో సమీకృత గురుకుల పాఠశాల భవన భూమిపూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొననున్నారు.అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాల్లో మంత్రులు, జిల్లా ఇన్చార్జ్ మంత్రులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. శంకుస్థాపన ఏర్పాట్లకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం సచివాలయం నుంచి ఆయా జిల్లా కలెక్టర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొందుర్గులో నిర్వహించే కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మధిర నియోజకవర్గంలో జరిగే కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పాల్గొంటారని సీఎస్ చెప్పారు. ఈ కార్యక్రమాలకు ఆయా జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిధులందరినీ ఆహ్వానించాలని సూచించారు.ఇప్పటికే సంబంధిత అధికారులు శంకుస్థాపన జరిగే ప్రాంతాన్ని పరిశీలించినట్లు కలెక్టర్లు సీఎస్‌కు వివరించారు. ప్రస్తుతం భూమి లభ్యత ఉన్న 28 నియోజకవర్గాల్లో శంకుస్థాపన నిర్వహిస్తున్నామని, రెండో దశలో ఇతర ప్రాంతాల్లో భూమిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని సీఎస్ చెప్పారు.మొదటి విడత కింద ఎంపిక చేసినవి..కొడంగల్, మధిర, హుస్నాబాద్, నల్లగొండ, హుజూర్నగర్, మంథని, ములుగు, పాలేరు, ఖమ్మం, వరంగల్, కొల్లాపూర్, అందోల్, చాంద్రాయణగుట్ట, మంచిర్యాల, భూపాలపల్లి, అచ్చంపేట్, స్టేషన్ ఘన్పూర్, తుంగతుర్తి, మునుగోడు, చెన్నూరు, షాద్‌నగర్, పరకాల, నారాయణ్ ఖేడ్, దేవరకద్ర, నాగర్ కర్నూల్, మానకొండూర్, నర్సంపేట నియోజకవర్గాలున్నాయి.కొందుర్గులో సీఎం సభరంగారెడ్డి జిల్లా కొందుర్గు మండల కేంద్రంలో రూ.125 కోట్లతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ చేయనున్నారు. అనంతరం బహిరంగసభలో మాట్లాడ నున్నారు. ఇందుకోసం కొందుర్గు శివారులోని 109 సర్వే నంబర్లో 20 ఎకరాలను కేటాయించారు. సీఎం రాక నేపథ్యంలో జిల్లా కలెక్టర్ శశాంక, షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పనులను పర్యవేక్షించారు. -
11న సమీకృత గురుకులాలకు శంకుస్థాపన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రాజెక్టు’కు ఈనెల 11వ తేదీన శంకుస్థాపన చేయనున్నట్టు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. దసరా పండుగకు ముందురోజున రాష్ట్రవ్యాప్తంగా 19 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సమీకృత గురుకుల పాఠశా లల నిర్మాణ పనులకు భూమిపూజ జరుగుతుందని తెలిపారు. ఏడాదిలో వాటి నిర్మాణ పనులు పూర్తి చేసి, అందుబాటులోకి తేవాల ని రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ఆదివారం సచివా లయంలో సమీకృత గురుకుల పాఠశాలల నిర్మాణ పనులపై మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌తో కలిసి భట్టి మీడి యాతో మాట్లాడారు.‘‘సమీకృత గురుకుల విద్యాసంస్థల నిర్మాణాల కోసం 2024–25 బడ్జెట్లో రూ.5వేల కోట్లు కేటాయించాం. ఇది చారిత్రాత్మక నిర్ణయం. తెలంగాణ మానవ వనరులు ప్రపంచంతో పోటీపడేలా కావాల్సిన నిధులు కేటాయించి విద్యాభివృద్ధికి చర్యలు చేపట్టాం. ఒక్కో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌ను 20 నుంచి 25 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలలన్నీ ఒకే ప్రాంగణంలోకి వస్తాయి. ఐదో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు విద్యార్థులు ఉంటారు.ప్రస్తుతం రాష్ట్రంలో చాలా గురుకుల పాఠశాలలకు శాశ్వత భవనాలు లేవు. 1,023 గురుకుల స్కూళ్లు ఉంటే అందులో 662 స్కూళ్లు అద్దె భవనాల్లోనే ఉన్నాయి. పక్కా భవనం లేనప్పుడు బోధన, అభ్యసన కార్యక్రమాల అమలు ఇబ్బందికరంగా ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే బడుగు, బలహీనవర్గాలను ఒకే గొడుగు కిందకు తెచ్చి చదువు చెప్పించే లక్ష్యంతో సమీకృత గురుకులాలను తీసుకొస్తున్నాం..’’ అని భట్టి తెలిపారు.తొలుత 19 నియోజకవర్గాల్లో..ఇప్పటివరకు 25 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి కావాల్సిన భూమి, ఇతర అంశాలకు సంబంధించి ప్రతిపాదనలు వచ్చాయని భట్టి తెలిపారు. అందులో ఈ నెల 11న 19 చోట్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తున్నామని.. మిగతా నియోజ కవర్గాల్లో పూర్తిస్థాయి సమాచారం అధారంగా పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మా ణాన్ని స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నిర్మించా లని నిర్ణయించామని.. విద్యార్థులకే కాకుండా బోధన, బోధనేతర సిబ్బందికి అక్కడే క్వార్టర్స్ ఉంటాయని చెప్పారు. ఈ పాఠశా లల్లో చదువుల పేరిట ఒత్తిడి సృష్టించే వాతావరణం కాకుండా క్రీడలు, వినోదం వంటివి కూడా విద్యార్థులకు అందిస్తామన్నారు.ఒకరోజు ముందే దసరా పండుగ: మంత్రి వెంకట్రెడ్డిరాష్ట్ర ప్రభుత్వం ఒకేరోజు 19 సమీకృత గురుకుల పాఠశాలల పనుల కు శంకుస్థాపన చేయడం శుభపరిణామమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. గురుకుల పిల్లలకు ఒకరోజు ముందే దసరా పండుగ వచ్చినట్టేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న గురుకులాల్లో సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మూసీ పరీవాహక ప్రాంత ప్రజలకు మంచి భవిష్యత్తు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే కొందరు ప్రతిపక్ష పార్టీ నేతలు అనవసర వివాదాలు రేపుతున్నారని మండిపడ్డారు.అన్ని నియోజకవర్గాల్లో సమీకృత గురుకులాలు: మంత్రి పొన్నంరాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమీకృత గురుకుల పాఠశాలలు నిర్మిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే రూ.1,100 కోట్లు ఖర్చు పెట్టి అమ్మ ఆదర్శ పాఠశాలల పేరిట స్కూళ్ల మరమ్మతులు పూర్తిచేశామన్నారు. గురుకుల విద్యాసంస్థల్లో కొత్త నియామకాలు పూర్తి చేశామని.. ప్రభుత్వ స్కూళ్లలో బదిలీలు, పదోన్నతులు చేపట్టామని చెప్పారు.11న శంకుస్థాపన చేయనున్న సమీకృత గురుకులాలు ఇవే..కొడంగల్, మధిర, మంథని, హుస్నాబాద్, నల్లగొండ, హుజూర్నగర్, ములుగు, ఖమ్మం, కొల్లాపూర్, చాంద్రాయణ్‌గుట్ట, మంచిర్యాల, అచ్చంపేట, తిరుమలగిరి, పాలేరు, వరంగల్, ఆందోల్, భూపాలపల్లి, స్టేషన్ ఘన్పూర్, తుంగతుర్తి. -
మొన్న రిజల్ట్..నిన్న వెరిఫికేషన్..నేడు జాబితా..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీ), అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్ల (యూఆర్ఎస్)లో కాంట్రాక్టు పోస్టుల భర్తీలో సమగ్ర శిక్షా అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. గురువారం సాయంత్రం పరీక్ష ఫలితాలు విడుదల చేసి, శుక్రవారం ఉదయం 10 గంటలకే సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు రావాలని ఆదేశాలు జారీచేశారు. గుట్టుచప్పుడు కాకుండా వచ్చిన వాళ్లతో ఆ ప్రక్రియను మమా అనిపించి, శనివారం ఫైనల్ లిస్టు ఇచ్చి, సెలెక్టయినవారు రేపు జాయినింగ్ కావాలని ఆదేశాలిచ్చారు. రెండ్రోజుల్లోనే తంతు ముగించడంపై అభ్యర్థులు మండిపడుతున్నారు. రాష్ట్రంలో కేజీబీవీ, యూఆర్ఎస్ల్లో ఖాళీగా ఉన్న 1,241 సీఆర్టీ, పీజీసీఆర్టీ, స్పెషల్ ఆఫీసర్ తదితర పోస్టులకు గతనెల 24, 25, 26 తేదీల్లో సమగ్ర శిక్ష అధికారులు ఆన్లైన్ పరీక్షలు నిర్వహించారు. ఈ పోస్టులకు మొత్తం 43,056 మంది దరఖాస్తు చేసుకోగా, 34,797 మంది హాజరయ్యారు. పరీక్షల నిర్వహణ సమయంలో భారీ వర్షాలు వచ్చినా.. ప్రభుత్వం అధికారికంగా సెలవులు ప్రకటించినా ఎగ్జామ్స్ మాత్రం యథాతథంగా నిర్వహించారు. ఈ సమయంలో చాలామంది అభ్యర్థులు అనేక ఇబ్బందులతో పరీక్షలకు హాజరుకాగా, కొందరు వర్షాలతో అటెండ్ కాలేదు. అభ్యర్థులకు రాత్రి పూట ఫోన్లు మెరిట్ లిస్టులను డీఈఓలకు గురువారం రాత్రి సమగ్ర శిక్ష ఆఫీసు నుంచి పంపించారు. డీఈఓ ఆఫీసు సిబ్బంది జిల్లాలోని పోస్టులకు అనుగుణంగా రోస్టర్ తయారు చేసి, 1: 3 మెరిట్లో అభ్యర్థులను ఎంపిక చేశారు. రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాలతో రాత్రి 8 గంటల నుంచి 12 వరకూ మెరిట్ అభ్యర్థులకు డీఈఓ సిబ్బంది ఫోన్లు చేశారు. మరోపక్క గురుకుల పరీక్షలు నడుస్తున్నాయి. ప్రస్తుతం చాలామంది ఆ పరీక్షలు రాస్తుండగా, కొందరు హైదరాబాద్‌లో వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. కొందరు ఇతర ప్రాంతాల్లో ఉన్నారు. వారందరికీ రాత్రి కాల్ చేసి, ఉదయం 10 గంటలకే రావాలంటూ చెప్పడంపై అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్టిఫికెట్లు ఒక చోట.. తాము మరోచోట ఉన్నామనీ కొందరు, సర్టిఫికెట్లు కాలేజీల్లో ఉన్నాయనీ ఇంకొందరు వారికి సమాధానం చెప్పినా పట్టించుకోలేదు. ఉద్యోగం కావాలంటే తప్పకుండా రావాల్సిందేననీ హుకుం జారీచేశారు. అయితే, కొందరు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ముందుగానే సమాచారం ఇచ్చి, రెడీగా సర్టిఫికెట్లు పెట్టుకోవాలనీ ఎస్ఎస్ఏలో కొందరు అధికారులు సమాచారం ఇచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మూడ్రోజుల్లో మమ... డీఈఓలకు శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లో సమావేశం ఉంటడంతో, చాలామంది గురువారం మధ్యాహ్నమే హైదరాబాద్‌కు బయల్దేరారు. తర్వాతి రెండ్రోజులూ రెండో శనివారం, ఆదివారం సెలవు దినాలు. ఈ క్రమంలో ఇంత హడావుడి చేయడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 10వ తేదీ రాత్రి ఫలితాలు ఇచ్చి, 11న ఉదయం 1:3 నిష్పత్తిలో అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్.. అదే రోజు 1:1 మెరిట్ లిస్టు రిలీజ్ చేయనున్నారు. 12న రెండోశనివారం మధ్యాహ్నం వరకు ఆబ్జెక్షన్లు తీసుకొని, ఫైనల్ లిస్టు రిలీజ్ చేస్తారు. ఎంపికైన వారు 13న ఆదివారం సాయంత్రం 5 గంటలకు జాయిన్ కావాల్సి ఉంటుంది. అయితే, కనీసం 1:3 అభ్యర్థుల మెరిట్ లిస్టు కూడా బయట పెట్టకుండా చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరోపక్క ఈ సెలెక్షన్ కమిటీకి చైర్మన్‌గా కలెక్టర్, వైస్‌చైర్మన్‌గా జాయింట్ కలెక్టర్ ఉన్నారు. సెలవు రోజుల్లో వారు ఉంటారో ఉండరో అనే విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోకుండా ఉత్తర్వులు ఇవ్వడంపై డీఈఓలూ మండిపడుతున్నారు. దీనివెనుక భారీగా డబ్బులు చేతులు మారాయని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. మరోపక్క కొందరు కోర్టును ఆశ్రయించే పనిలో ఉన్నారు. -
విద్యార్థుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు
సాక్షి, అమరావతి: గిరిజన విద్యాసంస్థల్లో చదువుకొనే పిల్లల ఆరోగ్యాల పట్ల నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమశాఖ మంత్రి పీడిక రాజన్న దొర హెచ్చరించారు. గిరిజన విద్యాసంస్థల్లో విద్యార్థుల సంరక్షణకు అవసరమైన చర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో మంగళవారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో రాజన్నదొర పలు అంశాలను సమీక్షించి అధికారులకు ఆదేశాలను జారీ చేసారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్యాలను పరిరక్షించడానికి గతంలో ఉన్న ఏఎన్ఎంల సేవలను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో 590 మంది ఏఎన్ఎంలను నియమించడంతో పాటుగా ఆయా పాఠశాలల పరిధిలోని సచివాలయాల్లో ఉండే ఏఎన్ఎంతో గిరిజన విద్యార్థులను ముందుగా మ్యాపింగ్ చేయించాలని సూచించారు. పాఠశాలలకు సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో సమన్వయం చేసుకొని విద్యార్థుల ఆరోగ్య పరీక్షలను ఎప్పటికప్పుడు చేయించాలని చెప్పారు. అత్యవసరమైన పరిస్థితుల్లో అన్ని స్థాయిల్లోని అధికారులు తక్షణమే స్పందించి విద్యార్థులను ఆస్పత్రులకు చేరవేసి అవసరమైన చికిత్సలను చేయించాలన్నారు. ఈ విషయంలో ఏ అధికారులైనా నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని రాజన్న దొర స్పష్టం చేసారు. గిరిజన విద్యా సంస్థల్లో భద్రతను పెంచడంలో భాగంగా ఇదివరకే ఉన్న సీసీ కెమెరాలకు మరమ్మత్తులు చేయించాలని, అవసరమైన అన్ని చోట్లా కొత్తగా కెమెరాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. 10వ తరగతి పరీక్షల్లో గిరిజన విద్యార్థులు మంచి ఫలితాలను సాధించేలా డీటీడబ్ల్యుఓలు, డీడీలు, ఇతర అధికారులు పాఠశాలల పర్యవేక్షణను మరింత పటిష్టం చేయాలని కూడా అధికారులను ఆదేశించారు. చింతపల్లిలోని ఎస్టీ డిగ్రీ కళాశాలకు అవసరమైన సదుపాయాలను సమకూర్చాలని, సీతంపేటలోని జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలకు భవనాలను నిర్మించడానికి చర్యలు చేపట్టాలని అధఇకారులను కోరారు. మాతృభాషా వాలంటీర్లకు సంబంధించిన గౌరవ వేతనాలను సక్రమంగా చెల్లించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. జీసీసీలో చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ల పదోన్నతులు, కారుణ్య నియామకాల ప్రక్రియను వేగవంతం చేయాలని రాజన్న దొర అధికారులను ఆదేశించారు. కాఫీ రైతులకు సంబంధించిన బకాయిలను త్వరితగతిన చెల్లించడానికి, కాఫీ రైతులకు గిట్టుబాటు ధరలను కల్పించడానికి చర్యలు తీసుకోవాలని జీజీసీ అధికారులను కోరారు. గిరిజన సంక్షేమశాఖలో ఔట్ సోర్సింగ్ విధానంలో పని చేస్తున్న 1633 మంది టీచర్లు, జూనియర్ లెక్చరర్ల వేతనాల పెంపు అంశాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. సీఆర్టీ టీచర్లు తమకు 12 నెలల వేతనాలు ఇవ్వాలంటూ కోరుతున్న విషయాన్ని కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల వినియోగాన్ని సమీక్షిస్తూ, సబ్ ప్లాన్ నిధులతో గిరిజన ప్రాంతాల్లో అవసరమైన రహదారుల నిర్మాణానికి చర్యలను చేపట్టాలని ఇంజనీరింగ్ విభాగం అధికారులను రాజన్న దొర ఆదేశించారు. గిరిజన సంక్షేమ పథకాలు అందరికీ అందేలా చూడాలని, అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే, అడిషనల్ డైరెక్టర్ రవీంద్రబాబు, జీసీసీ ఎండీ సురేష్ కుమార్, ఇఎన్సీ శ్రీనివాసులు, ట్రిప్ కో ఎండీ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
కొత్తగా 86 గురుకుల జూనియర్ కాలేజీలు
సాక్షి, హైదరాబాద్: కేజీ టు పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్య అమల్లో భాగంగా తలపెట్టిన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సంఖ్య అంచెలంచెలుగా పెరుగుతోంది. ఇప్పటికే వెయ్యికి పైగా సంస్థలు ఉండగా, కొత్తగా 86 జూనియర్ కాలేజీలు రానున్నాయి. 2022–23 విద్యా సంవత్సరంలో వీటిని ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో 75 ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలో, 7 గిరిజన గురుకుల సొసైటీలో, 4 బీసీ గురుకుల సొసైటీ పరిధిలో ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న గురుకుల పాఠశాలలకు అనుబంధంగా వీటిని నిర్వహించనున్నారు. అయితే ఒకే ఆవరణ అయినప్పటికీ వేర్వేరు భవనాల్లో నిర్వహించాలని గురుకుల సొసైటీలకు ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు అనువైన భవనాలను గుర్తించి ప్రభుత్వానికి నివేదించాలని సీఎస్ సోమేశ్‌కుమార్ ఆయా సొసైటీల కార్యదర్శులను ఆదేశించారు. శుక్రవారం బూర్గుల రామకృష్ణారావు భవన్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల కార్యదర్శులు, గురుకుల సొసైటీల కార్యదర్శులతో ఆయన సమావేశం నిర్వహించారు. కొత్త కాలేజీల ఏర్పాటు అంశాన్ని అత్యంత ప్రాధాన్యతతో చూడాల్సిందిగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూచించినట్లు తెలిపారు. అందువల్ల ఇవి త్వరగా ఏర్పాటయ్యేలా చర్యలు చేపట్టాలని చెప్పారు. ప్రస్తుతం కొనసాగుతున్న గురుకుల పాఠశాలల నిర్వహణను సీఎస్ సమీక్షించారు. వంట సిబ్బందికి శిక్షణ ఇచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి జిల్లాలో స్టడీ సర్కిల్ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో స్టడీ సర్కిల్ ఉండాలని సీఎస్ చెప్పారు. వీటి ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. ప్రస్తుతం ఉన్న స్టడీ సర్కిళ్లు, కొత్తగా ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలి తదితర అంశాలపై సంక్షేమ శాఖలు నివేదికను రూపొందించాలని ఆదేశించారు. సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, పంచాయతిరాజ్ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి అహ్మద్ నదీమ్, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా చొంగ్తూ, ఎస్సీ, ఎస్టీ గురుకుల సొసైటీల కార్యదర్శి రొనాల్డ్ రోస్, బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి మల్లయ్య బట్టు, మైనార్టీ గురుకుల సొసైటీ కార్యదర్శి బి.షఫివుల్లా తదితరులు పాల్గొన్నారు. -
‘ఇంద్రేశం’లో 25 మంది విద్యార్థినులకు కరోనా
పటాన్‌చెరుటౌన్/జూలూరుపాడు: విద్యాలయాల్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. వేర్వేరు గురుకులాలు, కేజీబీవీల్లో గురువారం 34 మంది విద్యార్థినులు కరోనా బారినపడ్డారు. ఒక్క సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇంద్రేశంలోని మహత్మ జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలోనే 25 మంది బాలికలకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విద్యాసంస్థలో బుధవారం ముగ్గురికి పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. గురువారం 966 విద్యార్థినులకు గాను అనుమానం ఉన్న 300 మందికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా 25 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 28కి చేరింది. కోవిడ్ సోకిన బాలికలను ప్రత్యేక ఐసోలేషన్ గదిలో ఉంచారు. ఇదే జిల్లా ముత్తంగిలోని మహాత్మ జ్యోతిరావుపూలే బాలికల గురుకుల విద్యాలయంలో గురువారం మరో ఆరుగురు విద్యార్థినులు కరోనా బారిపడ్డారు. ఇటీవల ఈ విద్యాసంస్థలో 47 మంది విద్యార్థినులు, ఒక ఉపాధ్యాయురాలికి వైరస్ సోకిన విషయం తెలిసిందే. గురువారం అనుమానం ఉన్న మరో 40 మందికి పరీక్షలు నిర్వహించగా ఆరుగురికి పాజిటివ్‌గా తేలింది. వీరిని ఐసోలేషన్‌లో ఉంచారు. స్కూల్లో మిగిలిన మొత్తం 426 మంది విద్యార్థులు, సిబ్బందికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులంతా ఇళ్లకు వెళ్లిపోయారు. జూలూరుపాడులో ముగ్గురు విద్యార్థినులకు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం/కళాశాలలో ముగ్గురు విద్యార్థినులకు గురువారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణైంది. ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థినులు ఆరుగురు రెండ్రోజులుగా జలుబు, దగ్గుతో గత బాధపడుతుండగా స్థానిక పీహెచ్సీలో వీరిద్దరికీ పరీక్ష చేయించగా, కరోనా పాజిటివ్‌గా తేలింది. అనంతరం కేజీబీవీలోని మొత్తం విద్యార్థినులకు పరీక్షలు చేయించగా, మరొకరికి కరోనా ఉన్నట్లు తేలింది. ముగ్గురినీ ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. -
ఏజెన్సీలో 3 చోట్ల ఏకలవ్య మోడల్ పాఠశాలలు
పాడేరు/అరకులోయ: విశాఖ ఏజెన్సీలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణ పనుల ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. అరకులోయ మండలం గన్నెల రోడ్డులోని మజ్జివలస, పెదబయలు, జి.మాడుగుల మండల కేంద్రాల్లో మూడు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఉదయం 11 గంటలకు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఈ మూడు చోట్లా నిర్మించనున్న పాఠశాలలకు ఏపీ ప్రభుత్వం అనువైన స్థలాలను కేటాయించింది. ఒక్కో పాఠశాలను 15 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తారు. ఈ సందర్భంగా గిరిజన గురుకుల విద్యాలయాల కార్యదర్శి డాక్టర్ శ్రీకాంత్ ప్రభాకర్ ఆదివారం మజ్జివలసలో పాఠశాల నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. -
స్కూల్‌కి పోదాం.. ఛలో!
సాక్షి, అమరావతి: కరోనా కారణంగా దీర్ఘకాలంగా ఇంటికే పరిమితమైన విద్యార్థులు మళ్లీ స్కూళ్లలో అడుగు పెట్టేందుకు సర్వం సిద్ధమవుతోంది. స్కూళ్లలో అడ్మిషన్ల ప్రక్రియకు మార్గదర్శకాలు ఖరారవుతున్నాయి. సర్టిఫికెట్లు, ఇతర ధ్రువపత్రాల కోసం ఒత్తిడి చేయకుండా విద్యార్థులను చేర్చుకోవడం, పరీక్షల్లేకుండా అందరినీ పై తరగతులకు ప్రమోట్ చేశారు కనక అవసరమైన వారిని ఇతర స్కూళ్లకు పంపటం వంటి ప్రక్రియను చేపట్టనున్నారు. ఇతర స్కూళ్లలో చేరాలనుకున్నవారికి టీసీలు జారీ చేయడానికి కూడా స్పష్టమైన మార్గదర్శకాలు వెలువడనున్నాయి. ఎవ్వరినీ బలవంతంగా ఇతర స్కూళ్లకు పంపకుండా, అదంతా తల్లిదండ్రుల అనుమతితోనే జరిగేలా చర్యలు తీసుకోబోతున్నారు. ప్రవేశాల కోసం విద్యార్థులను స్కూళ్లకు రప్పించకూడదు.. ► వచ్చే నెల నుంచి విద్యా సంస్థలను పునఃప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్చుకోవడానికి, పై తరగతులకు ప్రమోట్ చేయడానికి అవసరమైన మార్గదర్శకాలను పాఠశాల విద్యాశాఖ సిద్ధం చేసింది. వీటి ప్రకారం... కోవిడ్ పరిస్థితులున్నాయి కనక ప్రవేశాల కోసం విద్యార్థులను స్కూళ్లకు రప్పించరు. ప్రోటోకాల్‌ను అనుసరిస్తూ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు దీనిని పూర్తి చేస్తారు. ► 5, 7వ తరగతుల విద్యార్థులు తదుపరి చదువుల కోసం ఇతర పాఠశాలలకు వెళ్లాల్సి వస్తే తల్లిదండ్రుల అభిప్రాయాలను స్వీకరించి ప్రవేశాలను చేపట్టాలి. ఈ మేరకు ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్లు, జిల్లా విద్యాశాఖాధికారులు క్షేత్రస్థాయిలో మార్గనిర్దేశం చేస్తారు. ► 5, 7వ తరగతులు చదివిన విద్యార్థులు తదుపరి ఏ స్కూల్లో చదవదల్చుకున్నారో తల్లిదండ్రులతో హెడ్మాస్టర్లు మాట్లాడి నిర్ధారించుకోవాలి. ఆ సమాచారాన్ని పిల్లలు చేరదలచుకున్న పాఠశాలల హెడ్మాస్టర్లకు లిఖితపూర్వకంగా తెలియచేయాలి. తల్లిదండ్రులతో మాట్లాడి ఆయా స్కూళ్లలో ప్రవేశాలు సజావుగా జరిగేలా చూడాలి. ప్రాథమిక పాఠశాలల విషయంలో ఎంఈవోలు, హైస్కూళ్ల విషయంలో ఉపవిద్యాధికారులు దీన్ని పర్యవేక్షించాలి. ► తల్లిదండ్రుల సమ్మతి లేకుండా ఏ విద్యార్థినీ ఇతర స్కూళ్లలోకి పంపకూడదు. విద్యార్థి ఏ స్కూల్లో చేరదలుచుకున్నా తల్లిదండ్రుల ఆప్షన్‌ను లిఖితపూర్వకంగా తీసుకోవాలి. ► తల్లిదండ్రుల సమ్మతి తీసుకున్నాక విద్యార్థి స్కూల్ రికార్డు, టీసీలను విద్యార్థి చేరదలుచుకున్న పాఠశాల హెడ్మాస్టర్/ప్రిన్సిపాల్‌కు అందించాలి. ఇందుకు సంబంధించిన రసీదును కూడా తీసుకోవాలి. ► స్వస్థలాలకు చేరుకున్న ఉపాధి కూలీల పిల్లలకు ఎలాంటి గుర్తింపు పత్రాలు అడగకుండా పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించాలి. బదిలీ సర్టిఫికెట్ల (టీసీ) కోసం బలవంతం చేయకుండా... గతంలో చదివిన తరగతి తాలూకు నిర్థారణ పత్రాలు అడగకుండా... తల్లిదండ్రులిచ్చిన సమాచారం సరైనదిగా భావించి సదరు తరగతిలో పిల్లలకు ప్రవేశం కల్పించాలి. ► అక్టోబర్ 5 నుంచి పాఠశాలలను ప్రారంభించాలని ప్రాథమికంగా ఓ నిర్ణయానికి వచ్చినా, తుది నిర్ణయం మాత్రం కేంద్రం ప్రకటించే లాక్డౌన్ నిబంధనలకు అనుగుణంగా తీసుకుంటారు. రెసిడెన్సియల్, మోడల్ స్కూళ్లలో ఇలా... ► రెసిడెన్సియల్ స్కూళ్లు, మోడల్ పాఠశాలలు, కస్తూర్బా బాలికా విద్యాలయాల్లో ప్రవేశాల ప్రక్రియ ఆన్లైన్లో జరుగుతున్నందున వారికి సంబంధించిన ధ్రువపత్రాలు, రికార్డులను సంబంధిత ప్రిన్సిపాళ్లు రసీదులు తీసుకొని అప్పగించాలి. ప్రత్యేక అవసరాలున్న పిల్లలను వారి సామర్థ్యాలను అనుసరించి తగిన తరగతిలో ప్రవేశం కల్పించాలి. బడి బయటి పిల్లలను హెడ్మాస్టర్లు, టీచర్లు గుర్తించి వారికి కూడా ప్రవేశాలు కల్పించాలి. వీరి విషయంలో ధ్రువపత్రాలు, రికార్డుల కోసం తల్లిదండ్రులను ఒత్తిడి చేయకుండా తొలుత పిల్లలను స్కూళ్లలో చేర్చుకోవాలి. జాబితాలు సిద్ధం చేయాలి... ► కోవిడ్ నేపథ్యంలో స్కూళ్లు మార్చి నుంచే మూతపడడంతో 2019–20 విద్యాసంవత్సరం వార్షిక పరీక్షలు నిర్వహించలేదు. అన్ని తరగతుల విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు ప్రకటిస్తూ “ఆల్ పాస్’ ఉత్తర్వులను ఇప్పటికే జారీ చేశారు. ఈ మేరకు అన్ని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులను పై తరగతులకు పదోన్నతి కల్పిస్తూ జాబితాలను సిద్ధం చేయాలని ప్రధానోపాధ్యాయులకు విద్యాశాఖ సూచించనుంది. ► ప్రాథమిక పాఠశాల్లో 1 నుంచి 4వ తరగతి వరకు, ప్రాథమికోన్నత పాఠశాలల్లోని 1 నుంచి 6వ తరగతి వరకు, హైస్కూళ్లలో 6 నుంచి 9వ తరగతి వరకు చదివిన పిల్లలను పై తరగతులకు ప్రమోట్ చేస్తూ వారి పేర్లను రిజిస్టర్లలో నమోదు చేయాలి. -
వసతి గృహాల్లో అన్ని సౌకర్యాలు ఉండాలి
-
వసతి గృహాల్లో అన్ని సౌకర్యాలు ఉండాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి : ‘మన పిల్లలను ఏదైనా స్కూలుకు పంపిస్తున్నప్పుడు మనం ఎలా ఆలోచిస్తామో.. ప్రభుత్వం రెసిడెన్షియల్ స్కూళ్లు, పాఠశాలలు, హాస్టళ్లుకూడా అలాగే ఉన్నాయో లేదో ఆలోచన చేయాలి’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారు. సాంఘిక, గిరిజన, మైనార్టీ సంక్షేమ శాఖలపై గురువారం సమీక్ష నిర్వహించిన ఆయన ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. గురుకుల పాఠశాలలు, వసతి గృహాలు నాణ్యంగా ఉండాలని, దీని మీద అధికారులు ఎప్పటికప్పుడు దృష్టి సారించాలని పేర్కొన్నారు. పాఠశాలలకు సంబంధించి తొమ్మిది రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని, వీటిని మూడు దశల్లో అమలు చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ఇక అధికారులు క్రమం తప్పకుండా వసతి గృహాల్లో కనీస సౌకర్యాల ఉన్నాయో లేదో పరిశీలిస్తూ, నిరంతరం తనిఖీలు నిర్వహించాలని సూచించారు. గురుకుల పాఠశాలలు, వసతి గృహాళ్లో చేపట్టాల్సిన పనులపై ప్రణాళిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. డిమాండు ఉన్నచోట కొత్త హాస్టళ్ల కోసం ప్రతిపాదనలు ఇవ్వాలని, ప్రతి వసతి గృహంలోనూ టాయిలెట్స్‌ను వెంటనే ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. హాస్టళ్లలో వసతుల సౌకర్యం కోసం కలెక్టర్లకు నిధులు ఇచ్చారా? లేదా? అని సీఎం ప్రశ్నించగా.. ఇచ్చామని అధికారులు తెలిపారు. వచ్చే ఏడాది నుంచి స్కూలు తెరిచే సమయానికి ఎట్టి పరిస్థితుల్లోనూ యూనిఫామ్స్, పుస్తకాలు అందాలని పేర్కొన్నారు. 309 వసతి గృహాల్లో వంట మనుషులు, వాచ్‌మన్ సహా ఖాళీగా ఉన్న 927 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని, దీనికి వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. నామినేటెడ్ పోస్టులు, పనుల్లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అవకాశం కల్పించాలని సూచనలు చేశారు. రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా అందరికీ ప్రభుత్వ పథకాలు అందాలని, పథకాల అమల్లో పారదర్శకత ఉండాలని పేర్కొన్నారు. వచ్చే ఏడాది నుంచి 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ మహిళలకు ప్రతి ఏటా రూ. 1870 సంతృప్తికర స్థాయిలో వైఎస్సార్ చేయూతను ఇవ్వనున్నట్లు వెల్లడించారు. సాలూరులో గిరిజన యూనివర్శిటీ, పాడేరులో గిరిజన వైద్య కళాశాల, కురుపాంలో గిరిజన ఇంజినీరింగ్ కళాశాలతోపాటు, 7 ఐటీడీఏ ప్రాంతాలు (అరుకు, పాలకొండ, పార్వతీపురం, రంపచోడవరం, చింతూరు, కె.ఆర్.పురం, దోర్నాల)లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిల ఏర్పాటుకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. గిరిజనులకు అటవీ భూముల పట్టాలు ఇవ్వడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఈ విషయంలో ఎదురవుతున్న ఇబ్బందుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఎస్సీలకు, ఎస్టీలకు వేర్వేరుగా కమిషన్లు ఏర్పాటు చేయాలని, ఈ మేరకు అసెంబ్లీలో బిల్లు ప్రవేశ పెట్టాలని సూచించారు. -
టెన్త్ కోసం టైం టేబుల్
సాక్షి, హైదరాబాద్: గురుకుల పాఠశాలల్లో అత్యుత్తమ ఫలితాల సాధన కోసం ప్రత్యేక కార్యాచరణ అమలుకు గురుకుల సొసైటీలు నిర్ణయించాయి. ప్రస్తుతం కొనసాగుతున్న సమయపాలనకు అదనంగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్లనున్నాయి. 2018–19 వార్షిక సంవత్సరంలో గురుకుల పాఠశాలల్లో పదోతరగతి ఫలితాల్లో 94.5 శాతం సగటు ఉత్తీర్ణతను సాధించాయి. ఈసారి నూరు శాతం ఫలితాలు సాధించేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. అలాగే ఎక్కువ మంది విద్యార్థులు 10 జీపీఏ పాయింట్లు సాధించేలా చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాలు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాయి. నాలుగు గురుకుల సొసైటీలు ఉమ్మడిగా రూపొందించిన ఈ ప్రణాళికను వచ్చే నెల రెండో వారం నుంచి అమలు చేసేందుకు ఏర్పాట్లు చేపట్టాయి. 4 గురుకుల సొసైటీలు ఉమ్మడిగా రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక అమలు పర్యవేక్షణ సైతం రోజువారీగా నిర్వహించనున్నాయి. గురుకుల సొసైటీ కార్యాలయాల్లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనున్నారు. క్షేత్రస్థాయిలో విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసిన తర్వాత ఆ వివరాలను గురుకుల ప్రిన్సిపాళ్లు సంబంధిత సొసైటీ కార్యాలయాలకు పంపించాలి. అలా వచ్చిన వివరాలను సొసైటీలు అంచనా వేస్తాయి. దీంతో సొసైటీ పరిధిలోని పాఠశాలల పనితీరుపై స్పష్టత వస్తుంది. ప్రతిరోజు రెండు స్పెషల్ క్లాసులు గురుకుల సొసైటీలు రూపొందించిన ఉమ్మడి ప్రణాళికను ప్రస్తుతం పదోతరగతి చదువుతున్న వారికే అమలు చేయనున్నారు. ఈ ప్రత్యేక ప్రణాళికలో భాగంగా ప్రతిరోజు రెండు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు. దీంతో వారంలో ప్రతి సబ్జెక్టును రెండు సార్లు ప్రత్యేక తరగతుల్లో బోధిస్తారు. ఇందులో ఒక తరగతిలో రివిజన్, మరో తరగతిలో అభ్యాసన కార్యక్రమాలు ఉంటాయి. వారాంతంలో శని లేదా ఆదివారాల్లో స్లిప్‌టెస్టులు నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో వచ్చిన ఫలితాలను బేరీజు వేసుకుంటూ విద్యార్థి సామర్థ్యాన్ని అంచనా వేస్తారు. సబ్జెక్టులో వెనుకబడినట్లు గుర్తిస్తే వారికి మరింత సాధన చేయించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే నెల రెండో వారం నుంచి ప్రత్యేక తరగతులు ప్రారంభమవుతాయి. -
సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఘర్షణ
-
‘గురుకుల’ పోస్టుల విభజనకు కమిటీ
సాక్షి, హైదరాబాద్: గురుకుల పాఠశాలలకు మంజూరు చేసిన పోస్టుల భర్తీకి గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు(టీఆర్‌ఈఐఆర్‌బీ) చర్యలు చేపట్టింది. అయితే, రాష్ట్రంలో అందుబాటులోకి వచ్చిన కొత్త జోనల్ విధానం ప్రకారం పోస్టులను విభజించాల్సి ఉంది. జిల్లా, జోనల్, మల్టీ జోనల్ స్థాయి పోస్టులేమిటనే దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. పోస్టుల విభజనపై ఇటీవల గురుకుల నియామకాల బోర్డు ప్రభుత్వాన్ని వివరణ కోరగా మీరే తేల్చుకుని వివరాలివ్వాలని సూచించింది. ఈ క్రమంలో పోస్టుల విభజనపై గురుకుల నియామకాల బోర్డు ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేసింది. గురుకుల విద్యాసంస్థల సొసైటీల నుంచి ఎనిమిది మంది సీనియర్ అధికారులను ఇందులో నియమించింది. ఉద్యోగాల కేటగిరీ, వర్క్ పర్ఫార్మెన్స్, పేస్కేల్ తదితర అంశాలను ప్రాతిపదికన తీసుకుని పోస్టుల విభజన చేసేందుకు మార్గాలను అన్వేషిస్తోంది. గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న అన్ని కేటగిరీలతోపాటు సొసైటీ కార్యాలయాలు, రీజినల్ కార్యాలయాల్లోని ఉద్యోగుల సమాచారాన్ని కమిటీ సేకరించి పరిశీలిస్తోంది. పోస్టుల విభజనపై నివేదికను రూపొందించిన తర్వాత ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు గురుకుల నియామకాల బోర్డు కన్వీనర్ నవీన్ నికోలస్ ‘సాక్షి’తో అన్నారు. విభజన పూర్తయితేనే కొత్త నియామకాలు కొత్త జోనల్ విధానం అందుబాటులోకి రావడంతో పోస్టుల విభజన అనివార్యమైంది. దీంతో పోస్టుల విభజన అంశాన్ని పలు శాఖలు ప్రభుత్వానికి వదిలేశాయి. అయితే, గురుకుల పాఠశాలల్లో కొత్త పోస్టులను ప్రభుత్వం మంజూరు చేస్తున్న తరుణంలో సొసైటీ పరిధిలోని పోస్టులను విభజించేందుకు గురుకుల బోర్డు చర్యలు చేపట్టింది. సొసైటీకి ప్రత్యేక సర్వీసు నిబంధనలు ఉండటంతో ఆ మేరకు పోస్టులు విభజించొచ్చనే భావనతో గురుకులబోర్డు చర్యలు వేగవంతం చేసింది. దీంతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి పరిశీలన పూర్తిచేయాలని ఆదేశించింది. వారంలోగా కమిటీ నివేదిక వచ్చే అవకాశం ఉంది. అనంతరం ప్రభుత్వానికి సమర్పించి ఆమోదింపజేసుకోవచ్చని అధికారులు యోచిస్తున్నారు. -
గురుకులాల్లో ‘సమగ్ర వార్షిక ప్రణాళిక’
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యాలయాల్లో సమగ్ర విద్యావిధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం గురుకుల సొసైటీల నిర్ణయాలకు తగినట్లుగా ఆయా పాఠశాలల్లో బోధన, బోధనేతర కార్యక్రమాలు సాగుతున్నాయి. కేజీ టు పీజీ విద్యా కార్యక్రమంలో భాగంగా అన్ని గురుకుల పాఠశాలల్లో ఒకే తరహా బోధన, అభ్యసనతోపాటు బోధనేతర కార్యక్రమాలన్నీ ఒకే పద్ధతిలో ఉండాలని నిర్ణయించింది. దీంతో అన్ని గురుకుల సొసైటీలకు సమగ్ర వార్షిక ప్రణాళికను రూపొందించి అమలు చేయాల్సిందిగా సూచించింది. సమగ్ర వార్షిక ప్రణాళిక రూపకల్పనకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ గురుకుల సొసైటీ కార్యదర్శులకు సూచనలు చేసింది. ప్రస్తుతం సొసైటీల వారీగా రూపొందించిన ప్రణాళిక ఆధారంగా సమగ్ర ప్రణాళికను తయారు చేస్తారు. జూన్ 1 నుంచే అమలు.. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది పాఠశాల ప్రారంభం నుంచి ముగింపు వరకు చేపట్టే కార్యక్రమాలకు సంబంధించి అకడమిక్ క్యాలెండర్ తయారు చేస్తారు. ఈ క్యాలెండర్ ఆధారంగా ప్రభుత్వ పాఠశాలల్లో రోజువారీ కార్యక్రమాలు అమలు చేస్తారు. ఇదే తరహాలో గురుకుల విద్యా సంస్థల సొసైటీ సైతం ప్రత్యేకంగా కార్యాచరణ ప్రణాళికను తయారు చేస్తుంది. సొసైటీలు ఎవరికివారు ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకుంటున్నప్పటికీ.. కొన్ని కార్యక్రమాల్లో వ్యత్యాసం ఉండటంతో ఒకే తరహా ఫలితాలు రావడం లేదనే భావన ఉంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు అన్ని గురుకుల పాఠశాలల్లో సమగ్ర వార్షిక ప్రణాళికను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో అన్ని సొసైటీ కార్యదర్శులకు సూచనలు చేసిన ప్రభుత్వం.. ఈ నెలాఖరులోగా ప్రభుత్వానికి నివేదించాలని స్పష్టం చేసింది. సొసైటీ కార్యదర్శులు తయారు చేసిన సమగ్ర ప్రణాళికకు ప్రభుత్వ ఆమోదం దక్కిన వెంటనే అమల్లోకి వస్తుంది. జూన్ 1 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానుండటంతో ఆ రోజు నుంచే సమగ్ర ప్రణాళిక అమలు చేసేలా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. ఒకే సమయపాలన, ఒకేసారి పరీక్షలు.. సమగ్ర ప్రణాళికతో అన్ని గురుకుల పాఠశాలల పనివేళలు ఒకే తరహాలో ఉంటాయి. విద్యార్థుల డైట్ మెనూ, పాఠ్యాంశ బోధన, అభ్యసనా కార్యక్రమాలు, సమ్మెటివ్, ఫార్మెటివ్ పరీక్షలు కూడా ఒకేసారి జరుగుతాయి. బోధన కార్యక్రమాలతో పాటు బోధనేతర కార్యక్రమాలైన క్రీడలు, ఇతర శిక్షణ కార్యక్రమాలు నిర్ణీత తేదీల్లో ఉండటంతో జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల నిర్వహణ సులభతరమవుతుంది. విద్యార్థుల కార్యక్రమాలతోపాటు ఉపాధ్యాయులు కూడా అన్ని సొసైటీలకు కలిపి ఒకేచోట శిక్షణ కార్యక్రమాలు చేపడితే నిధుల వ్యయం కూడా కలసి వస్తుందని భావించిన ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. -
కొత్తగా మరో గురుకుల సొసైటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో గురుకుల సొసైటీ ఏర్పాటు కానుంది. ఇప్పటివరకు 5 సంక్షేమ శాఖల పరిధిలో 5 గురుకుల సొసైటీలు ఉన్నాయి. ఎస్సీలకు ఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్, గిరిజనులకు టీటీడబ్ల్యూఆర్‌ఈఐ ఎస్, బీసీలకు ఎంజేపీటీఎస్‌బీసీడబ్ల్యూ ఆర్ఈఐఎస్, మైనారిటీలకు ఎండబ్ల్యూఆర్‌ఈఐఎస్, విద్యాశాఖ పరిధిలో టీఎస్‌ఆర్‌ఈఐఎస్ పేరుతో గురుకుల విద్యాలయ సొసైటీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. తాజాగా ఏకలవ్య గురుకుల విద్యా సంస్థల సొసైటీ పేరుతో ఏర్పాటు కానుంది. ఈ సొసైటీకి నిధులు, విధులన్నీ కేంద్రమే నిర్వహించనుంది. దీనిపై రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యాచరణ మొదలుపెట్టింది. సులభంగా నిధుల వినియోగం.. ఈఎంఆర్‌ఎస్‌లకు నిధులు కేంద్రమే ఇస్తుంది. వీటిని గిరిజన సంక్షేమ శాఖకు విడుదల చేయడంతో అక్కడి నుంచి అవసరాలను బట్టి నిధు లు వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో నిధులు నేరుగా కాకుండా ప్రత్యేక పద్దుల ద్వారా ఖర్చు కావడంతో ప్రాధాన్యాంశాలు, అత్యవర కేటగిరీల్లో నిధుల వినియోగంలో సమస్యలు తలెత్తుతున్నాయి. కొత్తగా గురుకుల సొసైటీ ఏర్పాటు చేస్తే నిధులను నేరుగా విడుదల చేయడం సులభతరం కానుంది. గురువారం కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జుయల్ ఓరమ్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమావేశమయ్యారు. త్వరలో సొసైటీ ప్రతిపాదనలు పంపేందుకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కసరత్తు చేస్తోంది. కొత్తగా మరో 13 ఈఎంఆర్ఎస్లు రాష్ట్రంలో 11 ఈఎంఆర్ఎస్లు ఉన్నాయి. ఇవన్నీ గిరిజన మండలాల్లోనే ఉన్నాయి. తాజాగా మరో 13 ఈఎంఆర్ఎస్లను మంజూరు చేసేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. ఇవన్నీ వచ్చే విద్యా సంవత్సరంలోగా అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. -
నవోదయకు దీటుగా ‘ఏకలవ్య’
హైదరాబాద్: జవహర్ నవోదయ పాఠశాలలకు దీటుగా ఏకలవ్య పాఠశాలలను తీర్చిదిద్దుతామని గిరిజన వ్యవహారాల కేంద్ర సహాయమంత్రి జశ్వంత్ సిన్హ్ సుమన్ భాయ్ భభోర్ అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ సహకారంతో కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో ఈఎం ఆర్ఎస్ (ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్) తొలి ‘ఫస్ట్ నేషనల్ స్పోర్ట్స్ మీట్’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సోమవారం ప్రారం భమైన ఈ స్పోర్ట్స్ మీట్ 16 వరకు జరగనుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏకలవ్య పాఠశాలలు నెలకొల్పాలన్న దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి ఆలోచననే ప్రధాని నరేంద్ర మోదీ ఆచరణలో పెట్టారని తెలిపారు. 2022లోగా 400 ఏకలవ్య మోడల్ స్కూళ్లు ప్రారంభించి, వాటిని ఆదర్శవంతంగా తీర్చిదిద్దతామన్నారు. స్వాతంత్య్ర సంగ్రామంలో కీలకంగా నిలిచిన ఆదివాసీల సంక్షేమం, అభివృద్ధికి మోదీ కృషి చేస్తున్నారని తెలిపారు. ఏకలవ్యకు నిధులు పెంచాం.. ఈఎంఆర్ఎస్ టలకు 2014–15 బడ్జెట్‌తో పోలీస్తే.. 2018–19 బడ్జెట్లో నిధులు అధికంగా కేటాయించామని వివరించారు. వ్యక్తిత్వ వికాసానికి క్రీడలు దోహదం చేస్తాయని, అందరూ పట్టుదలతో కృషి చేసి క్రీడల్లో రాణించాలని పిలుపునిచ్చారు. గిరిజన యువతలో ఎంతో ప్రతిభా పాటవాలు దాగి ఉంటాయని, అందుకు క్రికెటర్ ధోనీ, బాక్సర్ మేరికోమ్లే నిదర్శనమని అన్నారు. 20 వేల జనాభాకు ఒక గురుకులం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఏక్ భారత్ – శ్రేష్ట భారత్ నినాదంతో దేశ అభివృద్ధికి మోదీ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ఈఎంఆర్ఎస్ విద్యార్థులు స్వచ్ఛ భారత్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, హరితహారం నృత్యాలు, వివిధ రాష్ట్రాల విద్యార్థులు ప్రదర్శించిన కోయ, లంబాడీ నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో గిరిజన వ్యవహారాల కేంద్ర డిప్యూటీ డైరెక్టర్ జనరల్ బిశ్వజిత్ దాస్, రాష్ట్ర గిరిజన సంక్షేమ కార్యదర్శి డాక్టర్ బెన్హూర్ మహేశ్ దత్ ఎక్క, కమిషనర్ డాక్టర్ క్రిస్టినా జడ్ చోగ్తు, టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్ సెక్రటరీ ప్రవీణ్‌కుమార్, కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ డైరెక్టర్ రాజేంద్ర కుమార్, శాట్స్ చైర్మన్ ఎ.వెంకటేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో మరో 296 మైనారిటీ గురుకులాలు
భీమారం (వరంగల్ అర్బన్): రాష్ట్రంలో మరో 296 మైనారిటీ గురుకుల పాఠశాలల ఏర్పాటుకు ప్రభుత్వం యోచిస్తోందని రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సయ్యద్ అక్బర్ హుస్సేన్ వెల్లడించారు. ఆదివారం ఆయన వరంగల్ అర్బన్ జిల్లా భీమారంలోని మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల విద్య కోసం 204 గురుకుల పాఠశాలలు, 8 జూని యర్ కాలేజీలు ప్రారంభించిందన్నారు. దేశంలో ఎక్కడ కూడా మైనారిటీ వర్గాలకు ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాలలు లేవన్నారు. ముస్లిం జనాభా అధికంగా ఉన్న జమ్మూ కశ్మీర్లో కూడా ముస్లింలకు గురుకుల వ్యవస్థ లేదని వివరించారు. గురుకుల పాఠశాలల్లో చదువుతున్న ఒక్కో విద్యార్థిపై ప్రభు త్వం రూ.1.31 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. -
‘రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరు చేయండి’
సాక్షి, హైదరాబాద్: ‘‘ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 119 రెసిడెన్షియల్ పాఠశాలలు వెంటనే మంజూరు చేయాలని, ఆలస్యంగా ప్రారంభిస్తే విద్యార్థులకు ఏమాత్రం ఉపయోగం ఉండదని’’ బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ విడుదల చేశారు. పేద విద్యార్థులు అప్పులుచేసి ప్రైవేట్ పాఠశాలల్లో అడ్మిషన్లు తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 12శాతం జనాభా ఉన్న మైనారిటీలకు 204 రెసిడెన్షియల్ పాఠశాలలు, 15శాతం జనాభా ఉన్న ఎస్సీలకు 268 రెసిడెన్షియల్ పాఠశాలలు, 6శాతం జనాభా ఉన్న ఎస్టీలకు 169 రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయని, 52శాతం ఉన్న బీసీలకు 142 మాత్రమే ఉన్నా యన్నారు. జనాభా నిష్పత్తి ప్రకారం బీసీలకు 890 రెసిడెన్షియల్ పాఠశాలలు ఉండాలన్నారు. -
జూనియర్ కాలేజీలుగా 27 గురుకులాలు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో విద్యాశాఖ పరిధిలోని 27 గురుకుల పాఠశాలలను గురుకుల జూనియర్ కాలేజీలుగా ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేసింది. ఇందులో 13 బాలుర, 14 బాలికల పాఠశాలలను జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆ కాలేజీల్లో రెండేళ్ల ఇంటర్మీడియట్ కోర్సును 2018–19 విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఈసారి ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో ప్రవేశాలు కల్పించాలని, ప్రతి గ్రూప్‌లో 40 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాలని సూచించారు. ఇందుకు 405 పోస్టులను మంజూరు చేయాలని, అందుకోసం రూ.117.79 కోట్లు విడుదల చేయాలని విద్యా శాఖ గురుకులాల సొసైటీ కార్యదర్శి ప్రతిపాదనలు పంపారు. అయితే పోస్టుల మంజూరుకు సంబంధించిన ఉత్తర్వులను వేరుగా జారీ చేస్తామని వెల్లడించారు. జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేసిన గురుకులాలు బాలుర గురుకులాలు (ప్రాంతం–జిల్లా).. బెల్లంపల్లి– మంచిర్యాల, పెద్దాపూర్ క్యాంపు– జగిత్యాల, మేడారం– పెద్దపల్లి, వేలేర్– వరంగల్ అర్బన్, బండారుపల్లి– జయశంకర్ భూపాలపల్లి, ఎంకూర్– ఖమ్మం, తుంగతుర్తి– సూర్యాపేట, పోచంపాడు– నిజామాబాద్, మద్నూర్– కామారెడ్డి, బీచుపల్లి– జోగుళాంబ గద్వాల, తూప్రాన్– మెదక్, లింగంపల్లి– సంగారెడ్డి, బోరబండ– హైదరాబాద్. బాలికల గురుకులాలు (ప్రాంతం–జిల్లా).. నిర్మల్– నిర్మల్, తాటిపల్లి– జగిత్యాల, నేరెళ్ల– సిరిసిల్ల రాజన్న, వంగర– వరంగల్ అర్బన్, నెక్కొండ– వరంగల్ రూరల్, కొడకండ్ల– జనగాం, బూర్గంపాడ్– భద్రాద్రి కొత్తగూడెం, చౌటుప్పల్– యాదాద్రి భువనగిరి, పోచంపాడు– నిజామాబాద్, బోధన్– నిజామాబాద్, మెదక్– మెదక్, దిగ్వాల్– సంగారెడ్డి, బోరబండ– హైదరాబాద్, తాండూరు– వికారాబాద్. -
సమత్వమే ’గురుకుల’ పునాది
అభిప్రాయం సామాజిక, ఆర్థిక అంతరాలున్నంత వరకూ విద్యార్జనలో అనేక అంతరాలు కొనసాగుతూనే ఉంటాయి. సర్కారీ స్కూళ్ళను గురుకులాలతో సమాంతరంగా పటిష్టం చేసే చర్యలు తీసుకుంటే విద్యా వ్యవస్థలో ఆశించిన ఫలితాలు వస్తాయి. ప్రజాస్వామిక ప్రభుత్వాలు సామాన్య ప్రజల, అణగారిన వర్గాల అభివృద్ధికి సంపూర్ణ సంక్షేమం అందించాలని ఆకాంక్ష. అందులో భాగంగానే ఇటు తెలంగాణలోనూ, అటు ఏపీలోనూ ప్రభుత్వాలు రెసిడెన్షియల్ స్కూల్స్ విధానాన్ని తీసుకొచ్చాయి. అయితే కేవలం విద్యాలయాలు ఏర్పాటు చేయగానే ప్రజలకు సంక్షేమం పరిగెత్తుకు రాదనీ, దానితో పాటు సామాజిక ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి ఫలితాలు అందకుండా ఉండేందుకు చాలా అడ్డంకులు ఉంటాయనీ ప్రభుత్వాలు గుర్తించాయి. కనుకనే ఈ అవరోధాలు అధిగమించే సదుద్దేశంతో గురుకుల విద్యాసంస్థల వ్యవస్థ ముందుకు తేవడం అనేది ఆయా వర్గాలకు విద్యాసంబంధిత సంక్షేమ కార్యక్రమాలకు ఊతమిచ్చింది. కేవలం అణగారిన వర్గాలకు చదువు చెప్పడమే కాదు. ఆ చెప్పిన చదువు వారి జీవితాలను మార్చాలనే సంకల్పంతో ఈనాడు అనేక పథకాలను ప్రవేశ పెట్టడం కూడా జరిగింది. కానీ టెక్నాలజీని వారికి అందేలా చేయడం ఒక చాలెంజ్‌గా తయారయ్యింది. టెక్నాలజీ మార్కెట్ శక్తుల చేతుల్లో బందీ అయి వుంది. కాబట్టి సంక్షేమ లబ్ధిదారులకే కాకుండా ప్రతిభ పేరుతోనైనా మార్జినల్ సెక్షన్స్‌కి ఈ అవకాశాలు అందుబాటులోనికి వస్తాయో రావోననే అనుమానం కూడా వున్నది. కాబట్టి అణగారిన వర్గాల్లో ప్రతిభను వెలికితీసి, దానికి సాంకేతికతను జోడించి, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పేద, అణగారిన వర్గాల విద్యార్థులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా గురుకులాలను బలోపేతం చేస్తోన్న తెలంగాణ ప్రభుత్వ విధానాన్ని నేను అభినందిస్తున్నాను. సమత్వమూ, ప్రతిభ.. రెండింటికీ మధ్య సంబంధం ఉన్నది. సమానత్వ భావనని పక్కన పెట్టి ప్రతిభను కొలవలేం. సమానత్వం లేకుండా ప్రతి భకు అర్థం లేదు. సమానత్వం లేకుండా పేద, అణగారిన వర్గాల ప్రతిభను వెలికితీయలేం. ఎవరైతే సమాజంలో అణచివేతకూ, అన్యాయానికీ గురవుతున్నారో ఆయా వర్గాల వారికి టెక్నాలజీ అనే ఖరీదైన వ్యవహారం అందుబాటులోనికి రాదు. కాబట్టి రెసిడెన్షియల్ వ్యవస్థను పటిష్టం చేయాలంటే బయట ఉన్న విద్యావ్యవస్థను కూడా సమాంతరంగా అభివృద్ధి చేయాలి. గురుకుల వ్యవస్థలో విద్యార్థులు సర్కారీ స్కూళ్ళ నుంచి వచ్చిన వారే. ఆ సర్కారీ స్కూళ్ళ నుంచి కనీసం గురుకులాలను అందుకోగలగాలంటే కూడా వారికి కనీసం ప్రాథమిక పునాది గట్టిగా ఉండాలి. ఆ వ్యవస్థలో సమర్థులైన ఉపాధ్యాయులు ఉన్నారు. కానీ విద్యాబోధనలో సమత్వం లేదు. కాబట్టి ప్రభుత్వం ఏ లక్ష్యంతోనైతే గురుకులాలను పటిష్టం చేస్తున్నదో, ఇంకా ఇంకా చేయాలనుకుంటున్నదో దానికి అనుబంధంగా సర్కారీ స్కూళ్లలో కూడా టీచింగ్ అండ్ లెర్నింగ్ వ్యవస్థను పటిష్టం చేయాలి. విద్యార్థులకు తగిన సౌకర్యాలు కల్పించి, విషయాన్ని సమగ్రంగా అర్థం చేసుకునేందుకు లెర్నింగ్ ఎఫెక్టివ్‌గా చేయగలిగితే ఆశించిన ఫలితాలొస్తాయి. సమాజంలో సామాజిక, ఆర్థిక అంతరాలున్నంత వరకూ ఈ విద్యార్జనలోనూ, విషయసంగ్రహంలోనూ అనేక అంతరాలు కొనసాగుతూనే ఉంటాయి. అందుకే ఉన్నత విద్యాభ్యాసం చేస్తోన్న అణగారిన, దళిత, ఆది వాసీ బలహీన వర్గాల పిల్లలకు విశ్వవిద్యాలయాల్లో ప్రత్యేక శిక్షణనివ్వాలని యూజీసీ నిబంధనలు చెబుతున్నాయి. అదేవిధంగా కొంత ప్రత్యేక శిక్షణ ద్వారా, కొన్ని మినహాయింపుల ద్వారా ఆయా వర్గాల నుంచి వచ్చిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మెరుగైన విద్యాబోధనను అందించేందుకు సైతం ప్రత్యేక శిక్షణ అవసరం. దానికోసం ప్రత్యేక ప్రణాళిక కూడా ప్రభుత్వాలకు ఉండాలి. పిల్లల్లో ఉన్న శూన్యతని తొలగించాలి. అయితే ఇది చాలా కష్టతరమైనది మాత్రమే కాకుండా తక్షణ ఫలితాలనివ్వకపోవచ్చు. ఈ ప్రక్రియని సుదీర్ఘకాలం అమలు చేస్తే దీర్ఘకాలంలోనైనా ఇది అణగారిన వర్గాల పిల్లలకు మెరుగైన విద్యను తద్వారా ఉన్నతమైన జీవితాలను సుసాధ్యం చేయగలుగుతుంది. కేవలం బోధన ద్వారానో, లేదా వారికి విషయగ్రహణలో ఎదురౌతోన్న సమస్యలను అధిగమించేందుకు ఇచ్చే మనోబలం ద్వారా మాత్రమే ఇది సాధ్యం కాదు. ఆయా వర్గాల ఆర్థిక, సామాజిక పరిస్థితుల్లో సైతం ఎప్పటికప్పుడు మార్పులను అంచనావేసి మెరుగైన ప్రమాణాల కోసం కృషి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. అభివృద్ధి చెందుతోన్న సాంకేతికతను వారు అందిపుచ్చుకునే ప్రత్యేక శిక్షణలు మిగిలిన సమాజానికి వారిని దూరం కాకుండా చూస్తాయి. వివిధ ఉపాధి అవకాశాలను సైతం వారు కోల్పోకుండా చూస్తాయి. కాబట్టి సర్కారీ స్కూళ్ళను గురుకులాలతో సమాంతరంగా పటిష్టం చేసే చర్యలు తీసుకుంటే ఆశించిన ఫలితాలు వస్తాయి. వారి ప్రగతికి పాఠశాల విద్య ఒక బలమైన పునాదిగా మారుతుంది. సర్కారీ స్కూళ్ళను మెరుగుపర్చకుండా, సమర్థులైన ఉపాధ్యాయవ్యవస్థను సద్విని యోగం చేసుకోకుండా మార్పు రాదు. రాష్ట్రం ఎదుర్కొం టోన్న ఎన్నో సమస్యలను ముఖ్యమంత్రి కేసిఆర్‌గారు వజ్రసంకల్పంతో పరిష్కరిస్తున్నప్పుడు ఈ విషయంలో కూడా జాగ్రత్త వహిస్తే ఈ స్వప్నం సంపూర్ణం అవుతుం దని నా అభిలాష. - చుక్కా రామయ్య వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త, శాసనమండలి మాజీ సభ్యులు -
ఆశ్రమ పాఠశాలల్లో ‘స్టీమ్ కుకింగ్’
సాక్షి, హైదరాబాద్: గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో వంటశాలల రూపురేఖలు మారనున్నాయి. కట్టెల పొయ్యి, గ్యాస్ స్టవ్‌ల స్థానంలో స్టీమ్ కుకింగ్ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. ఇంధన భారం తగ్గించుకోవడంతో పాటు పర్యావరణ హిత పద్ధతిలో వంటలు చేసేందుకుగాను స్మార్ట్ కిచెన్ల వైపు గిరిజన సంక్షేమ శాఖ దృష్టి సారించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇందుకు పచ్చజెండా ఊపడంతో చకచకా ఏర్పాట్లు చేస్తోంది. 2018–19 విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ఈ వ్యవస్థ అందుబాటులోకి రానుందని అధికారులు చెబుతున్నారు. 1.2 లక్షల మంది విద్యార్థులు.. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ప్రస్తుతం 319 ఆశ్రమ పాఠశాలలు నడుస్తున్నాయి. ఒక్కో పాఠశాలలో సగటున 4 వందల మంది కలిపి మొత్తంగా 1.20 లక్షల మంది విద్యార్థులున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. వీరికి నిర్దేశిత మెనూ ప్రకారం 3 పూటల భోజనం అందజేస్తున్నా.. వంట తయారీలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆశ్రమ పాఠశాలలన్నీ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండటం.. అక్కడ గ్యాస్ సరఫరాలో సమస్యలు తలెత్తుతుండటంతో వంట చెరకుతో వంటలు చేస్తున్నారు. దీంతో పొగ ఎక్కవగా వెలువడటం, సిబ్బంది అనారోగ్యం పాలవడంతోపాటు వంట రుచిలో తేడాలొస్తున్నాయి. దీన్ని అధిగమించేందుకు స్టీమ్ కుకింగ్ పద్ధతిని ప్రవేశపెట్టాలని గిరిజన సంక్షేమ శాఖ నిర్ణయించింది. ముందు 300 స్కూళ్లలో స్టీమ్ కుకింగ్ ఏర్పాట్లు చేయనున్నట్లు ఆ శాఖ అదనపు సంచాలకులు నవీన్ నికోలస్ వెల్లడించారు. -
ఎస్టీల అభివృద్ధికి సలహాలివ్వండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎస్టీల అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలు, ప్రవేశ పెట్టాల్సిన పథకాలు, తీసుకోవాల్సిన చర్యలను సూచించాలని ఎస్టీ ప్రజా ప్రతినిధులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కోరారు. ఎస్టీలంతా ఐక్యంగా ఉండి ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందాలని, పేదరికాన్ని తరిమి కొట్టడానికి సమైక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమస్యలుంటే పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. సమస్యలు, ఇబ్బందులను సర్కారు దృష్టికి తీసుకురావాలని కోరారు. ‘రాష్ట్రంలో 30 లక్షల మందికి పైగా ఎస్టీలున్నారు. వారి అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోంది. ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్న ప్రత్యేక గ్రామ పంచాయతీల కోరిక ను నెరవేరుస్తోంది. ప్రత్యేక ప్రగతి నిధి తీసుకొచ్చింది. ఎస్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు నెలకొల్పింది. ప్రభుత్వ సంకల్పాన్ని ఎస్టీలు అర్థం చేసుకోవాలి’ అని సీఎం అన్నారు. శుక్రవారం ప్రగతి భవన్లో ఎస్టీ ప్రజా ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ఎస్టీలకు ఇంకా కొన్ని సమస్యలున్నాయి. కొన్ని ఎస్టీ ఆవాస ప్రాంతాల్లో త్రీఫేజ్ కరెంటు రావడం లేదు. కొన్నింటికి కరెంటే లేదు. కొన్ని ప్రాంతాల్లో రోడ్లు, బస్సు సౌకర్యం లేదు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలను గుర్తించే విషయం లో సమస్యలున్నాయి. పోడు భూముల్లో వ్యవసాయం చేసుకునే వారికి ప్రభుత్వ సాయం విషయంలో చిక్కులున్నాయి. రెవెన్యూ, అటవీ భూముల లెక్కలు తేలక అక్కడక్కడ గిరిజనులు ఇబ్బంది పడుతున్నారు. 1/70 చట్టం అమలు విషయంలో కొన్ని ఇబ్బందులున్నాయి. ఎస్టీ ధ్రువీకరణ పత్రాల సమస్యలున్నాయి. స్వయం ఉపాధి పథకాలకు బ్యాంకులు సహకరించటం లేదు. ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపులు కొన్ని చోట్ల జరగాల్సి ఉంది. అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం’ అని సీఎం స్పష్టం చేశారు. ఏం చేస్తే బాగుంటుంది? ఎస్టీలు ఎదుర్కొంటున్న సమస్య లేంటి, వాటికున్న పరిష్కార మార్గాలేంటి, ఎస్టీలకు ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, ఎలాంటి పథకాలు ప్రవేశ పెట్టాలి లాంటి అంశాలపై ఎస్టీ ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలని సీఎం కోరారు. ఓట్ల కోసం కాక ఎస్టీల్లో నిజమైన మార్పు కోసం పనిచేద్దాం అని పిలుపు నిచ్చారు. ఎస్టీ ప్రజాప్రతినిధులంతా శనివారం సమావేశం నిర్వహించుకుని సరైన ప్రతిపాదనలతో ప్రగతి భవన్ రావాలని కోరారు. మరోసారి సమావేశమై ఎస్టీల కోసం తీసుకోవాల్సిన చర్యలపై స్పష్టతకు రావాలని నిర్ణయించారు. -
ఒకేరోజు.. 169 గురుకులాలు
- రికార్డు స్థాయిలో రెసిడెన్షియల్ స్కూళ్ల ప్రారంభం: సీఎం కేసీఆర్ - దేశ చరిత్రలోనే ఇది రికార్డు.. అధికారులకు అభినందనలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఒకే రోజు 169 గురుకులాలను ప్రారంభించామని.. దేశ చరిత్రలోనే ఇది రికార్డు అని సీఎం కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ‘కేజీ టు పీజీ’లో భాగంగా పేద విద్యార్థులకు అత్యుత్తమ ప్రమాణాలతో విద్యను ఉచితంగా అందించేందుకే గురుకులాలను ప్రారంభించామని సోమవారం ఓ ప్రకటనలో చెప్పారు. తాజా విద్యా సంవత్సరంలో కొత్తగా 255 బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రారంభించాలని లక్ష్యం గా పెట్టుకున్నామని తెలిపారు. అందులో 169 స్కూళ్లను రికార్డు స్థాయిలో ఒకేరోజు ప్రారంభించేలా కృషి చేసిన అధికార యంత్రాంగాన్ని అభినందించారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కలిపి 259 రెసిడెన్షియల్ స్కూళ్లు మాత్రమే ఉండేవని.. తాము కేవలం మూడేళ్లలో కొత్తగా 527 రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రారంభించామని పేర్కొన్నారు. బాలికల విద్యను ప్రోత్సహిం చేందుకు సగం స్కూళ్లను వారికే కేటాయించామన్నారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఇంటర్ వరకు ఉచిత విద్య, భోజనం, వసతి కల్పిస్తున్నట్లు వివరించారు. భారీగా గురుకులాలు తెలంగాణ ఏర్పాటుకాక ముందు ఎస్సీలకు 134 రెసిడెన్షియల్ స్కూళ్లు ఉండేవి. రాష్ట్రం ఏర్పాటైన మరుసటి సంవత్సరమే ఎస్సీలకు 104 రెసిడెన్షియల్ స్కూళ్లు, ఎస్సీ మహిళల కోసం 30 డిగ్రీ రెసిడెన్షియల్స్ ప్రారంభించారు. ఇక తెలంగాణ రాకముందు ఎస్టీలకు 94 రెసిడెన్షియల్స్ ఉండేవి. రాష్ట్రం ఏర్పాటయ్యాక కొత్తగా 51 రెసిడెన్షియల్స్‌ను ప్రారంభించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో బీసీలకు కేవలం 19 రెసిడెన్షియల్స్ ఉండగా.. ఇప్పుడు కొత్తగా 119 రెసిడెన్షియల్స్ ప్రారంభమవుతున్నాయి. బీసీ విద్యార్థులకు ప్రయోజనకరంగా.. రాష్ట్రంలో సోమవారం ఒకేరోజు 119 బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రారంభమయ్యాయి. వీటిలో 56 బాలురకు, 63 బాలికలకు కేటాయించారు. తొలి ఏడాది 5, 6, 7 తరగతుల్లో.. ఒక్కో తరగతిలో రెండు సెక్షన్ల చొప్పున మొదటి ఏడాది ఒక్కో రెసిడెన్షియల్లో 240 మందికి ప్రవేశం కల్పించారు. ఐదేళ్లపాటు ఒక్కో ఏడాది ఒక్కో తరగతి పెంచుకుంటూ 12వ తరగతి వరకు తరగతులు నిర్వహిస్తారు. అప్పుడు ఒక్కో రెసిడెన్షియల్లో విద్యార్థుల సంఖ్య 640కు చేరుతుంది. ఐదేళ్లలో మొత్తం బీసీ గురుకులాల్లో విద్యార్థుల సంఖ్య 91,520కు చేరుకుంటుంది. ఇక ప్రస్తుతం మైనారిటీ విద్యాసంస్థల్లో 50 వేల మందికి ప్రవేశం కల్పించగా.. ఐదేళ్లలో ఈ సంఖ్య లక్షా 30 వేలకు చేరుతుంది. కాగా ప్రస్తుతం అద్దె భవనాలు తీసుకుని స్కూళ్లు ప్రారంభించారు. వీటికి శాశ్వత భవనాల నిర్మాణం కోసం స్థలం సేకరించాల్సిందిగా ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. వారంలో మరో 71 గురుకులాలు.. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 169 రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రారంభంకాగా.. అందులో 119 బీసీ, 50 మైనారిటీ స్కూళ్లు ఉన్నాయి. ఈ నెల 15న మరో 50, 19న ఇంకో 21 మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రారంభం కానున్నాయి. ఇవి కాకుండా 15 ఎస్టీ మహిళా డిగ్రీ కాలేజీలను సైతం ఈ విద్యా సంవత్సరంలోనే ప్రారంభించనున్నారు. ఈ స్కూళ్లకు 24 వేల మంది అధ్యాపకులు అవసరమని అంచనా. వారిని దశల వారీగా నియమించే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. -
కాళేశ్వరంలో కాల్వలే ముందు
బ్యారేజీ, పంప్‌హౌస్‌లు పూర్తయ్యేలోగా కాల్వలు నిర్మించాలి - అందుకు ప్రత్యేక చొరవ చూపండి: ఎమ్మెల్యేలకు సీఎం సూచన - దేవాదుల, ఎస్సారెస్పీ కాల్వలకు మరమ్మతులు చేయించండి - భగీరథ పనుల పురోగతిపై దృష్టి పెట్టండి - గ్రేటర్ వరంగల్ గ్రామాలకు గొర్రెల యూనిట్లు ఇవ్వాలని ఆదేశం సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో కాల్వల నిర్మాణం, మరమ్మతులపై ఎమ్మెల్యేలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీ, పంప్‌హౌస్‌ల నిర్మాణం పూర్తయ్యేలోగా కాల్వల నిర్మాణం పూర్తి చేయాలని, ఈ విషయంలో ఆయా ప్రాంత ఎమ్మెల్యేలు శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు. ఎస్సారెస్పీ, దేవాదుల తదితర ప్రాజెక్టులకు ఇప్పటికే కాల్వలున్నాయని, వాడకంలో లేక ఫీడర్ చానళ్లు, పంట కాల్వలు పూడుకుపోయాయని చెప్పారు. వాటిని వెంటనే మరమ్మతులు చేయాలని ఆదేశించారు. ఎక్కడ ఏ పనులు అవసరమో గుర్తించి, వాటిని అధికారులతో చేయించాలన్నారు. రాష్ట్రంలో సాగునీటి కోసం అనేక ప్రాజెక్టులు కడుతున్నామని, వాటి ద్వారా నీరందించాల్సింది కాల్వలే కాబట్టి అవి ముందుగా సిద్ధం చేయాలని స్పష్టంచేశారు. బ్యారేజీల నిర్మాణం కన్నా ముందే పంప్‌హౌజ్‌ల ద్వారా నీటిని తరలించే ప్రతిపాదనలున్నాయని, కాబట్టి కాల్వలు సిద్ధంగా ఉంటే చెరువులు నింపుకోవచ్చని సూచించారు. ఆదివారం ప్రగతి భవన్లో పలువురు ఎమ్మెల్యేలతో సీఎం సమావేశమ య్యారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మండలి ఉపాధ్యక్షుడు విద్యాసాగర్, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రెడ్యా నాయక్, కోనేరు కోనప్ప, తీగల కృష్ణారెడ్డి, కాలె యాదయ్య, పువ్వాడ అజయ్, స్టీఫెన్ సన్, సుధీర్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, రేఖా నాయక్, బాబురావు రాథోడ్, సాయన్న, హైదరాబాద్ మేయర్ రామ్మోహన్, వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్ ఇందులో పాల్గొన్నారు. ‘భగీరథ’పై దృష్టి పెట్టండి తమ నియోజకవర్గాల పరిధిలో మిషన్ భగీరథ పనులపై కూడా ఎమ్మెల్యేలు దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. నియోజకవర్గానికి నీళ్లందించే ఇన్‌టేక్ వెల్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంటు, పంప్‌హౌస్‌లు, సబ్స్టేషన్లు, పైప్లైన్ల నిర్మాణ పురోగతి? తదితర అంశాలను గమనించాలన్నారు. ఎక్కడ ఏ సమస్య తలెత్తినా మిషన్ భగీరథ వైస్ చైర్మన్, అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎమ్మెల్యేలు పట్టించుకుంటే పనులు మరింత వేగంగా జరిగే అవకాశం ఉందన్నారు. ఈ ఏడాది చివరి నాటికి అన్ని గ్రామాలకు నీళ్లు వస్తాయని, గ్రామాల్లో వాటర్ ట్యాంకుల నిర్మాణం, అంతర్గత పైపులైన్ల నిర్మాణానికి ఎమ్మెల్యేలు చొరవ చూపాలని సూచించారు. ఆ 42 గ్రామాలకూ గొర్రెల పథకం గ్రేటర్ వరంగల్‌లో విలీనమైన 42 గ్రామాల్లో కూడా గొర్రెల పంపిణీ పథకంలో యాదవులు, కుర్మలకు గొర్రెల యూనిట్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లోని యాదవులు, కుర్మలకు గొర్రెల యూనిట్లు మంజూరు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో, వరంగల్ నగర పరిధిలో చేరిన గ్రామాలు అవకాశం కోల్పోయాయని ఆ జిల్లా మేయర్ నన్నపునేని నరేందర్ ముఖ్యమంత్రిని కలసి విన్నవించారు. ఈ గ్రామాల్లో యాదవులు, కుర్మలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని, ప్రభుత్వ పథకంలో వారినీ భాగస్వాములను చేయాలని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన సీఎం విలీన గ్రామాల్లోని యాదవులు, కుర్మలను సొసైటీల్లో చేర్పించి, పథకం వర్తింప చేయాలని వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలిని ఆదేశించారు. జూన్‌లో రెసిడెన్షియల్ స్కూళ్లు రాష్ట్రంలో ఎస్టీ బాలికలకు ఏర్పాటు చేసే రెసిడెన్షియల్ స్కూళ్లు ఈ ఏడాది జూన్‌లోనే ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి ఆదేశిం చారు. ఎస్టీలు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఈ రెసిడెన్షియల్ స్కూళ్లు నడపాలని కోరారు. ఈ మేరకు వెంటనే తుది జాబితా రూపొందిం చాలని చందూలాల్‌ను ఆదేశించారు. గవర్నర్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ రాష్ట్ర అవతరణ వేడుకలు, పెండింగ్ సమస్యలపై చర్చ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌తో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు భేటీ అయ్యారు. ఆదివారం సాయంత్రం రాజ్‌భవన్‌కు వెళ్లిన సీఎం.. గవర్నర్‌తో అరగంటసేపు చర్చలు జరిపారు. జూన్ 2న జరిగే అవతరణ దినోత్సవ వేడుకలు, ఏర్పాట్లు, రాష్ట్ర పునర్విభజనకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న వివిధ అంశాలపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలిసింది. ఇటీవల తొమ్మిదో షెడ్యూల్ సంస్థల ఆస్తుల పంపిణీకి సంబంధించి కేంద్ర హోం శాఖ స్పష్టతనిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తొమ్మిదో షెడ్యూల్ సంస్థల ఆస్తుల పంపిణీతో పాటు ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ఇటీవల రెండు రాష్ట్రాల మంత్రుల కమిటీ భేటీలో చర్చకు వచ్చిన అంశాలపైనా తెలంగాణ వాదనలను గవర్నర్‌కు సీఎం వివరించినట్లు సమాచారం. వీలైనంత త్వరగా ఈ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని సీఎం గవర్నర్‌ను కోరినట్లు తెలిసింది. -
పాఠశాలలను బాగుచేయండి
ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి ఎంపీ కవిత, ఎమ్మెల్యేల వినతి సానుకూలంగా స్పందించిన మంత్రి కడియం శ్రీహరి సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు, రెసిడెన్షియల్ స్కూళ్ల ను పటిష్టం చేయాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి, ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు. గురువారం సచివాలయంలో కడియం శ్రీహరితో ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, షకీల్ అహ్మద్, బిగాల గణేష్, బాజిరెడ్డి గోవర్ధన్, వేముల ప్రశాంత్‌రెడ్డి తదితరులు సమావేశమయ్యారు. తమ నియోజకవర్గాల్లోని పాఠశాలలు, కాలేజీల పరిస్థితులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వారి విజ్ఞప్తిపై కడియం సానుకూలంగా స్పందించారు. విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కిషన్‌ను పిలిచి సమస్యలపై చర్చించారు. వాటి పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కాగా, తమ నియోజకవర్గాల పరిధిలో కొత్తగా ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీలు, రెసిడెన్షియల్ స్కూళ్లు మంజూరు చేయాలని వారు కడియంను కోరారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు నిధులు విడుదల చేయాలని కోరారు. పాఠశాలలు, కాలేజీలకు కొత్త భవనాలు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. తాము ఏ గ్రామానికి వెళ్లినా ఇంగ్లిషు మీడియం పాఠశాలలకు అనుమతులు ఇప్పించాలన్న డిమాండ్ తీవ్రంగా ఉందని ఎంపీ, ఎమ్మెల్యేలు ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ప్రతి పాఠశాలలో స్కౌట్స్ అండ్ గైడ్స్ తప్పనిసరి చేసి కొంత వెయిటేజీ మార్కులు ఇవ్వాలని ఎంపీ కవిత కోరారు. సమస్యలు పరిష్కరిస్తాం.. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల పటిష్టత కోసం ఎంపీ, ఎమ్మెల్యేలు కలసి రావడంపై కడియం హర్షం వ్యక్తం చేశారు. తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచడంలో ఎమ్మెల్యేలు తమ వంతు పాత్ర పోషించాలన్నారు. పాఠశాలల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలిస్తామని, కాలేజీల్లో ఎన్సీసీని తప్పనిసరి చేసే అంశాన్ని ఇప్పటికే పరిశీలిస్తున్నామని కడియం చెప్పారు. -
ఆశ్రమాలు, వసతి గృహాలకు గ్యాస్ స్టౌలు
► తప్పనున్న పొగ తిప్పలు ► డిసెంబర్ నుంచి కట్టెలకు బిల్లులు బంద్ ► స్టౌల సరఫరాకు రూ.30.60 లక్షలు ► 450 స్టౌలు సరఫరా.. ఒక్కో దానికి రూ.6,800 ఉట్నూర్ : ఐటీడీఏ గిరిజన సంక్షేమ శాఖ ఆధీనంలోని ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో ఇక పొగ కష్టాలు దూరం కానున్నారుు. నాలుగు జిల్లాల్లో కట్టెల పొరుు్యపై వంట తిప్పలు తప్పనున్నారుు. ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాల్లో గ్యాస్ స్టౌలపై వంటలు వండాలని ఐటీడీఏ నిర్ణయం తీసుకోవడంతోపాటు జూన్‌లో గ్యాస్ స్టౌల సరఫరాకు టెండర్లు నిర్వహించింది. దీంతో ప్రస్తుతం ఆయూ హాస్టళ్లకు గ్యాస్ స్టౌలు సరఫరా అవుతున్నారుు. నెలాఖరు వరకు అన్ని ఆశ్రమాలు, వసతి గృహాలకు గ్యాస్ స్టౌలు సరఫరా చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి కట్టెల బిల్లులు నిలిపి వేస్తున్నట్లు ఐటీడీఏ ప్రకటించింది. నిర్మల్, మంచిర్యాల, ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో 123 ఆశ్రమ పాఠశాలలు, ఏడు వసతి గృహాలు ఉన్నారుు. వీటిలో దాదాపు 40 వేలకు పైగా గిరిజన విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరికి ఉచిత భోజన, వసతి సౌకర్యాలను ఐటీడీఏ కల్పిస్తోంది. ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల భోజనాల కోసం ఏళ్ల తరబడిగా కట్టెల పొరుు్యలు ఉపయోగిస్తున్నారు. దీంతో సకాలంలో వంటలు కాకపోవడం, కట్టెల కొరతతో నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 1995 నుంచి 2004 మధ్యకాలంలో 96 ఆశ్రమ పాఠశాలలకు దాదాపు రూ.38,81,654 వెచ్చించి గ్యాస్ స్టౌల సౌకర్యం కల్పించారు. వాటి నిర్వహణ, మరమ్మతుల కోసం 2004-08 మధ్య కాలంలో రూ.3,33,300 కేటారుుంచారు. ఆయా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను బట్టి ఆశ్రమ పాఠశాలలకు నాలుగు నుంచి 32 సిలిండర్ల వరకు అందించారు. గ్యాస్ స్టౌలను వినియోగించడంలో సిబ్బంది విఫలమవడం, మరమ్మతులు లేక మూలనపడడం జరిగింది. తాజాగా ఐటీడీఏ మళ్లీ గ్యాస్ స్టౌలపై వంటలకు శ్రీకారం చుట్టింది. దీంతో ఒక్కో స్టౌకు రూ.6,800 వెచ్చించి 450 గ్యాస్ స్టౌల సరఫరాకు జూన్‌లో రూ.30.60 లక్షలకు టెండర్లు నిర్వహించింది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా రెండు నుంచి నాలుగు స్టౌల సరఫరాకు చర్యలు చేపట్టింది. కట్టెల పేర అక్రమాలకు చెక్ ఆశ్రమ పాఠశాలల్లో వంటల కోసం కట్టెల పొయ్యిలను ఉపయోగిస్తున్నారు. నిత్యం వార్డెన్లు ఎడ్లబండ్ల సహా యంతో సమీప అటవీ ప్రాంతాల నుంచి కట్టెలు తెప్పిస్తున్నారు. దూరభారాన్ని బట్టి ఒక్కో ఎడ్లబండికి రూ.800 నుంచి రూ.1,200 వరకు చెల్లిస్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని కొంతమంది సిబ్బంది ఒక నెలలో వంట కోసం తెప్పించిన ఎడ్లబండ్ల కంటే రెండింతలు ఎక్కువగా రాస్తూ నిధులు స్వాహా చేస్తున్నారనే ఆరోపణలున్నారుు. పలుమార్లు అధికారుల దృష్టికి వెళ్లినా ఫలితం ఉండేది కాదు. ఎట్టకేలకు గ్యాస్ స్టౌలు సరఫరా చేస్తుండడంతో కట్టెల పేరిట జరిగే అక్రమాలకు చెక్ పడనుంది. సిలిండర్ల సంఖ్య పెంచితెనే ఫలితం గతంలో ఆశ్రమ పాఠశాలల్లో గ్యాస్ స్టౌలపై వంటలు చేయడం అమలు కావడంతో విద్యార్థుల సంఖ్యను బట్టి ఒక్కో ఆశ్రమ పాఠశాలకు నాలుగు నుంచి 32 సిలిండర్ల వరకు అందించారు. కొన్నాళ్లకే గ్యాస్ స్టౌలు నిర్వహణ లేక మూలనపడ్డారుు. గ్యాస్ సిలిండర్లు పక్కాదారి పట్టాయి. ఆశ్రమ పాఠశాలల్లో విధులు నిర్వర్తించే కొందరు తమ సొంత అవసరాలకు ఇళ్లకు తీసుకెళ్లారు. వాటి విషయమై ఆరా తీసే వారు లేకపోవడంతో అప్పట్లో అందించిన సిలిండర్లు.. ఇప్పుడున్న సిలిండర్లకు లెక్క కుదరడం లేదు. మిగిలిన నాలుగైదు సిలిండర్లు మినహా మిగితా వాటి జాడలేదు. ఐటీడీఏ అధికారులు పూర్తి స్థారుులో విచారణ జరిపితే అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. గతంలో కంటే ప్రస్తుతం ఆశ్రమాల్లో విద్యార్థుల సంఖ్య మూ డింతలు పెరిగింది. నాలుగు సిలిండర్లు ఉన్న ఆశ్రమా ల్లో సిలిండర్ల కొరత ఏర్పడే అవకాశం ఉంది. అదీగాక నాలుగు జిల్లాల్లోని ఆశ్రమాలు మారుమూల ప్రాంతా ల్లో ఉన్నారుు. సకాలంలో సిలిండర్లు సరఫరా కాకుంటే విద్యార్థులు పస్తులుండాల్సి వస్తుంది. సిలిండర్ల సంఖ్య పెంచాలని నిర్వాహకులు కోరుతున్నారు. మంచి నిర్ణయం 1989 నుంచి ఆశ్రమ పాఠశాలల్లో కుక్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. ఇన్నాళ్లకు ఆశ్రమాల్లో గ్యాస్ పొరుు్యలు ఏర్పాటు చేయడం సంతోషం. కట్టెల పొరుు్యలపై వంట చేస్తుండడంతో నిత్యం పొగ చూరి కుక్‌లకు కంటి వ్యాధులు వస్తున్నారుు. ఇప్పటికే చాలామంది కంటి సమస్యలతో ఉద్యోగాలు మానుకున్నారు. - అక్బర్, కుక్, బాలుర ఆశ్రమ పాఠశాల, ఉట్నూర్ డిసెంబర్ నుంచి గ్యాస్‌పై వంటలు నాలుగు జిల్లాల్లోని ఆశ్రమ, వసతి గృహాలకు గ్యాస్ పొరుు్యలు సరఫరా చేస్తున్నాం. డిసెంబర్ నుంచి కట్టెలకు బిల్లులు చెల్లించెది లేదని స్పష్టం చేశాం. గ్యాస్ పొయ్యిలు అందుబాటులోకి రావడంతో పలు ఆశ్రమాల్లో కట్టెల పేరుతో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట పడనుంది. ఇప్పటికే చాలా ఆశ్రమాలకు పొరుు్యలు చేరారుు. నెలాఖరు వరకు అన్ని ఆశ్రమ పాఠశాలలకు గ్యాస్ పొరుు్యల సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నాం.- రాంమూర్తి, గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు -
వేతనాల పెంపు హర్షణీయం
నారాయణఖేడ్: కొన్ని సంవత్సరాలుగా తెంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో పార్ట్ టైం ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న ఉద్యోగుల వేతనాలను ప్రభుత్వం పెంచడం హర్షణీయమని పార్ట్‌టైం ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జే శర్ణప్ప, జిల్లా అధ్యక్షుడు నర్వ పండరి, ప్రధాన కార్యదర్శి బాల్‌రాజ్, కోశాధికారి రవి పేర్కొన్నారు. శనివారం వారు స్థానిక విలేకరులతో మాట్లాడారు. అనేక సంవత్సరాల నుంచి అతి తక్కువ వేతనంతో కష్ట నష్టాలకు ఓర్చి విద్యార్థుల బాగోగుల కోసం తాము నిరంతరం కృషి చేశామన్నారు. తమ కష్టాన్ని గుర్తించి సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి, గురుకులాల కార్యదర్శి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్, ప్రిన్సిపాల్ సెక్రటరరీ ఎక్కాకు, గురుకుల పాఠశాలల జేఏసీ నాయకులు రంగారెడ్డి, రవీందర్‌రెడ్డి, బాల్‌రాజ్, యాదయ్య, నరేందర్, కాశీనాథ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. పీఈటీలుగా పని చేస్తున్న ఉపాధ్యాయులకు రూ.12,500లు, అటెండర్లకు రూ.10,500 పెంచాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో నాయకులు అమృత్, కె.పండరి, నరేష్కుమార్, సురేష్, మల్గొండ, జయసుహాన్ పాల్గొన్నారు. -
'తెలంగాణ మతసామరస్యానికి ప్రతీక'
హైదరాబాద్: 'తెలంగాణ రాష్ట్రం మతసామరస్యానికి ప్రతీక'' అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో గురుకుల పాఠశాలల ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినాయక చవితి ఉత్సవాలు మరోసారి మతసామరస్యాన్ని నిరూపించాయని అన్నారు. బతుకమ్మ, దసరా, పీర్ల పండగలను కలిసి చేసుకునే సంస్కృతి తెలంగాణది'' అని తెలిపారు. అన్ని మతాలవారు కలిసిమెలిసి జీవించి బాగుండాలని కోరుకుంటున్నానని కేసీఆర్ చెప్పారు. అదేవిధంగా వచ్చే విద్యా సంవత్సరం నాటికి తెలంగాణలో 160 మైనార్టీ గురుకులాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. గురుకులాల్లో 55 వేల మంది మైనార్టీ విద్యార్థులకు విద్యా బోధన తరగతులు నిర్వహించనున్నట్టు కేసీఆర్ తెలిపారు. -
రెసిడెన్షియల్స్‌లోకి హాస్టల్స్ విద్యార్థులు: రావెల
ప్రభుత్వ సంక్షేమ వసతి గృహల్లోని విద్యార్థులను రెసిడెన్షియల్ పాఠశాలల్లోకి మార్చండని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం రామకృష్ణాపురం లోని ఏపీ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో సోమవారం నిర్వహించిన 70వ స్వాతంత్య్రదినం వేడుకల్లో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని జాతీయ జెండాను ఎగుర వేసి మాట్లాడారు. రాష్ట్రంలో గురుకుల పాఠశాలల అదనపు భవనాలకు రూ. 500 కోట్లు, నూతన భవన నిర్మాణాలకు రూ. 500 కోట్లు కేటాయించామన్నారు. రూ. 21 కోట్ల నాబార్డు నిధులతో సత్తెనపల్లికి ఏపీ సాంఘీక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల, కళాశాల మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఫైల్ ప్రాసెస్‌లో ఉందని, ఈ వారంలో క్లియర్ అవుతుందన్నారు.ఈ నిధులతో నిర్మించే భవనం ఫైవ్‌స్టార్ హోటల్ మాదిరిగా ఉంటుందన్నారు. ప్రస్తుతం తాత్కాలికంగా భవనం తీసుకొని ఈ ఏడాది నుంచే తరగతులు ప్రారంభించడం జరుగుతుందన్నారు. అంబేడ్కర్ ఓవర్సీస్ పథకం కింద విదేశాలలో ఉచితంగా విద్యనభ్యసించేందుకు ఈ ఏడాది రాష్ట్రం నుంచి 200 మంది విద్యార్థులను అమెరికా వంటి దేశాలకు పంపామన్నారు. -
1794 పోస్టుల భర్తీకి అనుమతి
తెలంగాణ ప్రభుత్వం కొలువుల కోసం భారీ ప్రకటన విడుదల చేసింది. సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో 1794 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతినిచ్చింది. గతంలో అనుమతించిన 758 పోస్టులకు అదనంగా తాజా పోస్టులను భర్తీ చే యనున్నారు. గురుకుల పాఠశాల ల్లో 1164, గురుకుల మహిళా డిగ్రీ కళాశాలల్లో 630 పోస్టుల భర్తీ జరగనుంది. -
వసతిగహాలను పున:ప్రారంభించాలి
అనుమసముద్రంపేట : సంక్షేమ వసతిగహాలను మూసివేయడం తగదని వెంటనే పున:ప్రారంభించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మండల కేంద్రంలోని ఉన్నతపాఠశాలలు, కళాశాలలును మూసివేయించి బంద్ నిర్వహించారు. ఈసందర్బంగా బస్టాండు సెంటర్లో మానవహారం ఏర్పాటుచేశారు. ప్రభుత్వం మెస్ చార్జీలను రూ.1,050కి పెంచాలని, పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిఫ్‌ల బకాయిలు విడుదల చేయాలన్నారు. ఈకార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివిజన్ ఉపాధ్యక్షుడు ఆసిఫ్, మండలాధ్యక్ష, కార్యదర్శులు నాగూర్, రాహిల్, నాయకులు ఫహిమ్, వంశీ, చైతన్య, బాబు, జహిర్, మహిళా నాయకులు సుహన, సాలెహ షర్మిల పాల్గొన్నారు. సంగం : విద్యార్థులకు పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలంటూ ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్లు సంగంలో సోమవారం విద్యాసంస్థలను మూయించి బంద్ చేశాయి. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మండలాధ్యక్షుడు ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ వసతిగహాల్లో చదువుకునే విద్యార్థులను చిన్నచూపు చూస్తోందన్నారు. ఏఐఎస్ఎఫ్ మంఢలాధ్యక్షుడు ఖాదర్‌బాష మాట్లాడుతూ గురుకుల పాఠశాలల్లో మౌలిక వసతులు సరిగాలేవని, వెంటనే కల్పించాలని కోరారు. నాయకులు వెంకటరమణ, హరి పాల్గొన్నారు. -
గురుకులాలపై ఇకపై నిఘా
శ్రీకాకుళం : గురుకులాలపై ఇకపై నిఘా పెరగనుంది. పటిష్ట భద్రతకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా బాలికల పాఠశాల, కళాశాలలు ఒకే ప్రాంగణంలో ఉండడంతో విద్యార్థినులకు రక్షణతోపాటు అధ్యాపకులు, సిబ్బంది పర్యవేక్షణ కోసం ఇటువంటి నిఘాను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా గురుకులాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో ఏడు సాంఘిక సంక్షేమ బాలికలు, నాలుగు బాలుర సంక్షేమ గురుకులాలు ఉన్నాయి. వీటితోపాటు ఏపీ గురుకులాలు, నాలుగు బీసీ సంక్షేమ గురుకులాలు నడుస్తున్నారుు. అయితే తొలి విడతగా సాంఘిక సంక్షేమ గురుకులాల్లో మాత్రమే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు యోచిస్తున్నారు. అలాగే అధ్యాపకులు, సిబ్బంది, ఉపాధ్యాయులు విధులకు సకాలంలో హాజరవుతున్నారా, లేదా, సమయపాలన పాటిస్తున్నారా అనే విషయూలను గుర్తించేందుకుగాను బయోమెట్రిక్ విధానాన్ని కూడా ఈ ఏడాది నుంచే అమలు చేయనున్నారు. వారితోపాటు విద్యార్థుల హాజరును కూడా బయోమెట్రిక్ విధానం ద్వారానే నమోదు చేయనున్నారు. దీని ద్వారా ఎంతమంది హాజరయ్యారు, ఎంతమంది భోజనాలు చేస్తున్నారన్నది తెలుసుకోవచ్చన్నది అధికారుల భావన. సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ యంత్రాల ఏర్పాటునకు అవసరమైన పరిశీలన ఇప్పటికే పూర్తయినట్లు తెలుస్తోంది. దీంతో అతి త్వరలోనే ఈ యంత్రాలను ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమమైంది. జూలై మొదటి వారం లోగా వీటి ఏర్పాటు పూర్తయ్యే అవకాశాలున్నాయి. -
రూ.100 కోట్లతో రెసిడెన్షియల్ స్కూళ్లు
గజ్వేల్ : మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని గజ్వేల్, వర్గల్, తూప్రాన్, కొండపాక, జగదేవ్‌పూర్ మండల కేంద్రాల్లో రూ. 100 కోట్లతో కొత్తగా ఎస్సీ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖామంత్రి హరీష్‌రావు ప్రకటించారు. గురువారం గజ్వేల్ మండలం అహ్మదీపూర్‌లో పెద్ద చెరువు మినీట్యాంక్‌బండ్‌గా మార్చే పనులకు, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో ఆయన మాట్లాడుతూ ఎస్సీల విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్తశుద్దితో కృషి చేస్తున్నారని తెలిపారు. ఆయన ఈ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని పేర్కొన్నారు. ఈ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని వెల్లడించారు. -
రెసిడెన్షియల్ స్కూళ్లకు స్థలాలు గుర్తించండి
♦ అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం ♦ రెసిడెన్షియల్ స్కూళ్లు లేని 32 నియోజకవర్గాలకు ప్రాధాన్యం ♦ వచ్చే సంవత్సరం నుంచి ప్రారంభించాలని సూచన ♦ మెదక్ జిల్లాలో ఫారెస్ట్ కాలేజీ డిజైన్‌కు ఆమోదం సాక్షి, హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరం నుంచే కొత్త రెసిడెన్షియల్ విద్యా సంస్థలను ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. కొత్త భవనాలు నిర్మించడానికి అనువైన స్థలాలను గుర్తించాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం ప్రారంభించ తలపెట్టిన 180 రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీలపై బుధవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. ఇందులో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్, ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు. వెనుకబడిన ప్రాంతాలు, ఎస్సీ, ఎస్టీ జనాభా ఉన్న ప్రాంతాలు, గిరిజన తండాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీలను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా సీఎం పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్లతో సమావేశమై స్థలాలను నిర్ణయించాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిని ఆదేశించారు. మండల కేంద్రాల్లోనే విద్యా సంస్థలు ఉండాలన్న నిబంధనేమీ లేదని... విద్యార్థులకు అనువైన స్థలం, ప్రభుత్వ భూమి ఉన్న ప్రాంతాన్ని ఎంపిక చేయాలని సూచించారు. మైనారిటీలకు ఇప్పటికే ప్రకటించిన 70 రెసిడెన్షియల్ పాఠశాలలు, విద్యాసంస్థలను కూడా ప్రారంభించాలని... ఇవన్నీ కేజీ టు పీజీలో భాగం కావాలని స్పష్టం చేశారు. ఇప్పటికీ అసలు రెసిడెన్షియల్ పాఠశాలలు లేని 32 నియోజకవర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఫారెస్ట్ కాలేజీకి 118 పోస్టులు మెదక్ జిల్లాలో నెలకొల్పబోయే ఫారెస్ట్ కాలేజీకి అవసరమైన 118 పోస్టులను ముఖ్యమంత్రి మంజూరు చేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచే కాలేజీని ప్రారంభించాలని ఆదేశించారు. కొత్త భవనం నిర్మించేలోపు దూలపల్లిలోని ఫారెస్ట్ అకాడమీలో తరగతులు నిర్వహించాలని సూచించారు. హార్టికల్చర్ వర్సిటీ, ఫారెస్ట్ కాలేజీ భవనాల నమూనాలను ముఖ్యమంత్రికి అధికారులు చూపించారు. ఫారెస్ట్ కాలేజీ డిజైన్‌కు ఆమోదం తెలిపిన సీఎం హార్టికల్చర్ వర్సిటీ డిజైన్‌కు కొన్ని మార్పులు సూచించారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉద్యానవనాల సాగుకు దళిత రైతులను ప్రోత్సహించాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి పార్థసారథి, వ్యవసాయ యూనివర్సిటీ వీసీ ప్రవీణ్‌రావు, హరిత హారం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ తదితరులు పాల్గొన్నారు. -
మారిస్తే మెరుగైపోద్దా!
రెసిడెన్షియల్ పాఠశాలలుగా మారనున్న గిరిజన వసతిగృహాలు సిబ్బందే లేరు... ఫలితాలెలా! దిక్కుతోచని స్థితిలో మార్చిన వసతిగృహాలు అప్‌గ్రేడ్ పాఠశాలలదీ అదే దారి... ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకా? లేక పూర్తిగా ప్రభుత్వ విద్యా వ్యవస్థ లేకుండా ఉండేందుకా? అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. తాజాగా రాష్ట్రంలోని పలు గిరిజన వసతిగృహాలను రెసిడెన్షియల్ పాఠశాలలలుగా మార్చేందుకు నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే దీని అమలుకు కూడా చర్యలు చేపట్టింది. అయితే గతంలో ఇలా చేసిన పలు పాఠశాలల్లో నేటికీ ఉపాధ్యాయులు లేక విద్యాభివృద్ధి కుంటుపడింది. విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. అప్‌గ్రేడ్ పాఠశాలల్లో కూడా ఇదే పరిస్థితి. మరి తాజాగా మరిన్ని వసతిగృహాలను ఇలా మార్చడంలో ప్రభుత్వ ఉద్దేశమేంటో అర్ధం కావడం లేదని పలువురు పేర్కొంటున్నారు. ఏది చేసినా పక్కా ప్రణాళికా ప్రకారం చేస్తే మంచిదేనని కానీ అలా జరగకపోవడం వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని పలువురి తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.... సీతంపేట : రాష్ట్రంలోని 70 గిరిజన వసతిగృహాలను రెసిడెన్షియల్ పాఠశాలలుగా మారుస్తామని వచ్చే విద్యా సంవత్సరం నుంచే దీన్ని అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించేసింది. అయితే మరి ఆయా పాఠశాలకు కావాల్సిన సిబ్బంది నియూమకం తదితర పరిస్థితులేమిటన్నది ప్రస్తుత ప్రశ్న. గతంలో ఇదే మాదిరిగా గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని పలు వసతిగృహాలను మార్పు చేసింది. వాటి పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా తయూరైంది. వాటికే నియమించలేని సిబ్బందిని ఇప్పుడు కొత్త వాటికి ఎక్కడ ఎలా నియమిస్తారని, విద్యార్థుల విద్య సంగతేంటని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం శ్రీకాకుళః జిల్లాలో రెండు గిరిజన వసతిగృహాలు మాత్రమే రెసిడెన్షియల్ పాఠశాలలుగా మారనున్నారుు. భామిని, పాలకొండల్లో వసతిగృహాలు నడుస్తున్నారుు. వీటిని మార్పు చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ విద్యార్థులు వసతిగృహాల్లో ఉంటూ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విద్యనభ్యసించే వారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు ఇకపై వసతిగృహంలోనే ఉంటూ అక్క డే విద్యనభ్యసిస్తారు. రెండేళ్ల కిందట సీతంపేట, టెక్కలి, శ్రీకాకుళం, మందస వసతిగృహాలను ఆశ్రమ పాఠశాలలలుగా ప్రభుత్వం మార్చేసింది. ఇప్పటి వరకు ఆయూ పాఠశాలల్లో ఉపాధ్యాయ సిబ్బందినే నియమించలేదు. దీంతో విద్యార్థుల చదువులు అంతంతమాత్రంగానే సాగుతున్నారుు. కేవలం సీఆర్టీలు, డెప్యుటేషన్‌పై వచ్చిన సిబ్బందితో పాఠశాలలు నడిపిస్తున్నారు. వీటి పరిస్థితే ఇలా ఉంటే కొత్త వాటి పరిస్థితి ఎలాగని పలువురి సందేహం. మొత్తంగా ప్రభుత్వం విద్యా వ్యవస్థను ఒక ప్రణాళిక ప్రకారం నిర్వీర్యం చేసేస్తుందా? అన్నది పలువురి అనుమానంగా ఉంది. అప్‌గ్రేడ్ పాఠశాలలదీ అదేదారి... పేరుకే అవి అప్‌గ్రేడ్ పాఠశాలలు. ఆచరణలో మాత్రం వెనుకబాటు తనమే కనిపిస్తుంది. గిరిజన విద్యను బలోపేతం చేస్తామని ఆదరాబాదరాగా ప్రభుత్వం రెండేళ్ల క్రితం అప్‌గ్రేడ్ చేసింది. విద్యాభివృద్ధి చేయడానికి కావాల్సిన ఉపాధ్యాయులను మాత్రం మరిచారు. అప్‌గ్రేడ్ చేసిన అన్ని పాఠశాలల్లో ఇదే పరిస్థితి నెలకొంది. గుర్రాన్ని కొని కళ్లేన్ని మరిచిన చందంగా అప్‌గ్రేడ్ పాఠశాలల తీరు తయారైంది. ఐటీడీఏ పరిధిలో మూడేళ్ల క్రితం 15 ఆశ్రమ పాఠశాలలను అప్‌గ్రేడ్ చేశారు. సబ్జెక్టు టీచర్లును నియమించలేదు. దీంతో తిప్పలు తప్పడం లేదు. ఏడో తరగతి వరకు ఉన్న పాఠశాలలను ఎనిమిదో తరగతికి ఎనిమిది నుంచి పదో తరగతి వరకు ఇలా అప్‌గ్రేడ్ చేశారు. జిల్లాలో 44 ఆశ్రమ పాఠశాలలున్నాయి. వీటిలో సామరెల్లి, ఎస్ఎస్ మణుగు, తర్లి,నేలబొంతు, బరణికోట, చీపీ, లొత్తూరు, పెద్దపొల్ల, బుడగరాయి, ముత్యాలు, మనుమకొండ, బడ్డుమాసింది, మర్రిగూడ, గొట్టిపల్లి పాఠశాలలను గతంలో అప్‌గ్రేడ్ చేశారు. ముఖ్య సబ్జెక్టులు ఆంగ్లం, సైన్సు, గణితం వంటి సబ్జెక్టులకు టీచర్లు లేని పరిస్థితి ఆయా పాఠశాలల్లో ఉంది. దీంతో గిరిజన విద్య మిథ్యగా మారుతోంది. ఈ విషయమై గిరిజన సంక్షేమశాఖ డీడీ ఎంపీవీ నాయిక్ వద్ద సాక్షి ప్రస్తావించగా కొత్త టీచర్ పోస్టులకు గిరిజన సంక్షేమ క మిషనర్‌కు ప్రతిపాదనలు పంపించినట్టు తెలిపారు. -
వేసవి సెలవుల్లోనూ మధ్యాహ్న భోజనం
* హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో అమలుకు సర్కారు నిర్ణయం * మండల, నియోజకవర్గ కేంద్రాల్లోనే గురుకుల పాఠశాలల ఏర్పాటు * జూన్ నుంచే రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభించేలా చర్యలు * విద్యా శాఖ ఉన్నతాధికారులతో సమీక్షలో డిప్యూటీ సీఎం కడియం సాక్షి, హైదరాబాద్: వేసవి సెలవుల్లోనూ ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అందించాలని సర్కారు నిర్ణయించింది. హైదరాబాద్ జిల్లా మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, మండలాల్లో ఈ పథకాన్ని కొనసాగించాలని నిర్ణయించినట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. మధ్యాహ్న భోజన పథకం అమలు, రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటు అంశాలపై సచివాలయంలో శనివారం వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందూలాల్ సమీక్షలో పాల్గొన్నారు. అనంతరం సమీక్ష వివరాలను కడియం వివరించారు. కరువు పరిస్థితులు నెలకొన్న ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 8వ తరగతుల విద్యార్థులకు మాత్రమే మధ్యాహ్న భోజన పథకాన్ని మరో 42 రోజుల పాటు కొనసాగించాలని కేంద్రం సూచించినట్లు చెప్పారు. అయితే ప్రకటించిన 231 కరువు మండలాలతో అన్ని ప్రాంతాల్లోనూ ఈ పథకాన్ని అమలు చేయాలని, 9, 10 తరగతుల విద్యార్థులకు కూడా అందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించినట్లు తెలిపారు. సెలవు రోజుల్లో ఈ పథకం అమలు, బాధ్యతల అప్పగింతపై ఈ నెల 18న అన్ని జిల్లాల కలెక్టర్లతో జరగనున్న వీడియో కాన్ఫరెన్స్‌లో నిర్ణయిస్తామన్నారు. సెలవు రోజుల్లో ఉదయం 9 గంటలకు విద్యార్థులు బడికి వస్తే గంట పాటు ఆటపాటలు గానీ, తరగతులు గానీ నిర్వహించి, 10 గంటలకు భోజనం పెట్టి 11 గంటల్లోపు ఇళ్లకు పంపేలా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. మండల కేంద్రాల్లో రెసిడెన్షియల్ స్కూళ్లు కేజీ టు పీజీ ఉచిత విద్య అమల్లో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల కోసం రాష్ట్రంలో 250 గురుకుల (రెసిడెన్షియల్) పాఠశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని కడియం శ్రీహరి చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న రెసిడెన్షియల్ స్కూల్స్ మండల లేదా నియోజకవర్గ కేంద్రాల్లోనే ఉండేలా చర్యలు చేపట్టామన్నారు. ప్రస్తుతం పాఠశాలలు ఉన్న ప్రాంతంలో కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ స్కూళ్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 20న ఆయా శాఖల అధికారులతో జరిగే సమావేశంలో పాఠశాలలు ఏర్పాటు చేసే ప్రాంతాలపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఒక్కో గురుకుల పాఠశాలకు రూ.22కోట్లు వెచ్చించనున్నామని, ఏ ప్రాంతంలోనైనా ప్రభుత్వ స్థలం లేకపోయినట్లయితే పాఠశాల కోసం ఐదెకరాల భూమిని కొనుగోలు చేస్తామన్నారు. ఒక్కో పాఠశాలకు 640 మంది చొప్పున మొత్తం 1.60 లక్షల మంది విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియంలో 5 నుంచి 12వ తరగతి వరకు చదువుకునే అవకాశం లభిస్తుందన్నారు. రెసిడెన్షియల్ పాఠశాలలను 2016-17 విద్యా సంవత్సరం నుంచే ప్రారంభిస్తామన్నారు. తొలి ఏడాది 5 నుంచి 8 తరగతులు, రెండో సంవత్సరం 9, 10, మూడో సంవత్సరంలో ఇంటర్మీడియట్ తరగతులు ప్రారంభమవుతాయన్నారు. నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాటు చేయనున్న డిగ్రీ కాలేజీల్లోనూ తొలి ఏడాది ఫస్టియర్‌ను ప్రారంభించి మూడేళ్లలో పూర్తిస్థాయిలో నిర్వహించేలా చర్యలు చేపట్టామన్నారు. -
వసతికి మంగళం
► వచ్చే విద్యా సంవత్సరంలో 18 హాస్టళ్ల మూత ► వాటిల్లోని విద్యార్థులను రెసిడెన్షియల్ స్కూళ్లలో విలీనం ► జిల్లా నుంచి నివేదికలు కోరిన ప్రభుత్వం ► ఆఘమేఘాల మీద సిద్ధం చేస్తున్న అధికారులు మూతపడనున్న హాస్టళ్లు ఇవే బీసీ నంబర్-1 అనంతపురం, మరూరు, పామిడి, వజ్రకరూరు, గుంతకల్లు, యాడికి, చిగిచెర్ల, ఎనుములవారిపల్లి, తగరకుంట, బుక్కపట్నం మండలం సిద్ధరాంపురం, కల్లుమర్రి, బాలుర వసతి గృహం కదిరి, పట్నం, కొండకమర్ల, లేపాక్షి, పరిగి, డి. హీరేహాల్, రాయదుర్గం. అనంతపురం ఎడ్యుకేషన్ : విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందన్న సాకుతో 50 మందిలోపు విద్యార్థులున్న సాంఘిక సంక్షేమ హాస్టళ్లను ఇప్పటికే మూసివేశారు. ఈ క్రమంలో జిల్లాలో గతేడాది 26 ఎస్సీ హాస్టళ్లు మూతపడ్డాయి. ఈ ఏడాది మరో 25 హాస్టళ్లు ఈజాబితాలో చేరనున్నాయి. ప్రభుత్వం ఇంతటితో ఆగకుండా బీసీ హాస్టళ్లపైనా దృష్టి సారించింది.50 మందిలోపు విద్యార్థులున్న బీసీ హాస్టళ్లనూ మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో 18 బీసీ వసతి గృహాలను గుర్తించారు. ఏళ్ల కింద స్థాపించిన ఈ హాస్టళ్లలో వేలాదిమంది విద్యార్థులు చదువుకున్నారు. అలాంటి హాస్టళ్లు ఇక శాశ్వతంగా కనుమరుగవుతున్నాయి. విద్యార్థుల ప్రవేశాలను పెంచేందుకు చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం కేవలం విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నారనే సాకు చూపి వాటికి మంగళం పాడేందుకు కంకణం కట్టుకుంది. 50 మందిలోపు విద్యార్థులున్న హాస్టళ్లను రద్దుచేసి, అందులో చదువుతున్న విద్యార్థులను రెసిడెన్షియల్ స్కూళ్లలో విలీనం చేసేలా అడుగులేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం జిల్లా అనంతపురం హౌసింగ్‌బోర్డులోని బీసీ నంబర్-1 వసతి గృహంలో 3 నుంచి 10వ తరగతి విద్యార్థులు 34 మంది ఉన్నారు. వచ్చేవిద్యా సంవత్సరం నుంచి ఈ హాస్టల్‌ను మూసివేస్తున్నారు. వీరిని సుమారు50 కిలోమీటర్ల దూరంలో ఉన్నఉరవకొండలోని బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలో విలీనం చేయాలని నిర్ణయించారు. ఇలా ఈ ఒక్క హాస్టలే కాదు జిల్లాలో 18బీసీ హాస్టళ్లు కనుమరుగుకానున్నాయి. వీటిన్నింటినీ మూసి వేసేందుకు రంగం సిద్ధమవుతోంది.అధికారులకు నివేదికలు కోరుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారులు నివేదికలు సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. రెసిడెన్షియల్ స్కూళ్లలో విలీనం మూతపడనున్న హాస్టళ్లలోని విద్యార్థులను బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లలో విలీనం చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నిర్ణయం ఎంతమాత్రం విజయవంతమవుతుందనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే ప్రస్తుతమున్న హాస్టళ్లకు 50 నుంచి వంద కిలోమీటర్ల దూరం ఉన్న రెసిడెన్షియల్ స్కూళ్లలో చేరేందుకు విద్యార్థులు, చేర్పించేందుకు తల్లిదండ్రులు ఎంతమాత్రం ఆసక్తి చూపుతారనే ప్రశ్న ఉదయిస్తోంది. డ్రాపౌట్స్ మారే ప్రమాదమూ లేకపోలేదు. హాస్టళ్లలో సహజంగానే చుట్టుపక్కల గ్రామాల పిల్లలే ఎక్కువగా చేరుతుంటారు. మరి అలాంటిది ఒక్కసారిగా అంతదూరం వెళ్తారా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఉదాహరణకు కదిరి రూరల్ మండలంలోని పట్నం బీసీ హాస్టల్లో చదువుతున్న విద్యార్థులను 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న లేపాక్షి రెసిడెన్షియల్ స్కూల్లో విలీనం చేసేందుకు జిల్లా అధికారులు నివేదిక సిద్ధం చేశారు. ఇలా 18 హాస్టళ్లలోని విద్యార్థులను జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోని బీసీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో విలీనం చేయనున్నారు. నివేదికలు అడిగారు 50 మందిలోపు విద్యార్థులున్న హాస్టళ్ల వివరాలను అడిగారు. ఆయా హాస్టళ్లలోని విద్యార్థులను విలీనం చేసేందుకు అనుకూలమైన బీసీ రెసిడెన్షియల్ స్కూళ్ల వివరాలను అడిగారు. ఈ క్రమంలో నివేదిక సిద్ధం చేశాం. ప్రభుత్వానికి నివేదించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. -రమాభార్గవి, బీసీ సంక్షేమశాఖ డీడీ -
పీడీ మాకొద్దు బాబోయ్
పెదబయలు : చిత్రహింసలకు గురిచేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయుడు(పీడీ) మాకొద్దం టూ మండలం కేంద్రం పెదబయలులోని ఆశ్రమ పాఠశాల విద్యార్థులు సుమారు 400 మంది బుధవారం ఇంటిముఖం పట్టారు. పీడీ శెట్టి ధనుంజయ్ బూటు కాలితో తన్నడం, కొట్టడంతోపాటు దురుసుగా ప్రవర్తిస్తున్నాడంటూ వాపోయారు. పాఠశాలలో 440 మంది విద్యార్థులు ఉన్నారు. మానసికంగా ఇబ్బంది పెడుతున్న పీడీని తొలగించాలని డిమాండ్ చేశారు. అతనిని వెనకేసుకొస్తున్న హెచ్ఎంపై చర్యలు చేపట్టాలని కోరారు. బ్యాంకు అకౌంటు, ఐడీ కార్డుల కోసం హెచ్ఎం ఒక్కొక్కరి నుంచి రూ.600 చొప్పున వసూలు చేశారని, పాఠశాలలో మెనూ సక్రమంగా అమలు కావడం లేదంటూ ఐటీడీఏ పీవోకు అడ్రస్ చేస్తూ లేఖరాసి నోటీసు బోర్డులో అంటించి వెళ్లిపోయారు. బుధవారం వేకువజామున 4 గంటల నుంచి విద్యార్థులు విడతలు విడతలుగా స్వగ్రామాలకు వెళ్లిపోయారు. ప్రస్తుతం 40 మంది మాత్రమే ఉన్నారు. ఎవరైనా అధికారులు వస్తే సమాధానం చెప్పడానికి తామున్నామంటూ వారు తెలిపారు. గతంలోనూ ఈ పాఠశాలలో ఇదే పరిస్థితి నెలకొంది. 2012 నవంబరు 21న ఇలాగే విద్యార్థులు ఇంటిముఖం పట్టారు. పీడీ, హెచ్‌ఎంలపై వేటు.. : పాఠశాల విద్యార్థులు ఇంటిముఖం పట్టారన్న సమాచారం మేరకు గిరిజన సంక్షేమశాఖ డీడీ కమల ఉదయాన్నే పాఠశాలకు చేరుకున్నారు. ఉపాధ్యాయులను మందలించారు. సిబ్బంది తీరుపై ఆరా తీశారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పీడీ ధనుంజయ్, హెచ్ఎం వేణుగోపాలంలను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. పాఠశాల ఉపాధ్యాయుల మధ్య విభేదాలను గుర్తించామన్నారు. మొత్తం సిబ్బందిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేస్తామని విద్యార్థులకు నచ్చజెప్పారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం విద్యార్థులు ఇంటి ముఖం పట్టడానికి కారకులైన వారిపై చర్యలు చేపడతామన్నారు. ఇక ముందు ఇలాంటి సంఘటనలు పునానవృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఇళ్లకు వెళ్లిన విద్యార్థులు తిరిగి రావాలని డీడీ కోరారు. ఆమె వెంట ఏటీడబ్ల్యూవో శాంతకుమారి,ఎంపీడీవో సూర్యనారాయణ, తహాశీల్దార్ నెహ్రూబాబు, ఎంఈవో ఎస్‌బిఎల్ స్వామి, గిరిజన ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎం. అప్పారావు, వీఆర్వో రమేష్‌కుమార్ ఉన్నారు. -
ప్రతి నియోజకవర్గంలో పది రెసిడెన్షియల్ స్కూళ్లు
హైదరాబాద్: ప్రతి నియోజకవర్గంలో పది రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటుచేస్తామని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు అన్నారు. తెలంగాణలో ఉన్న అన్ని రెసిడెన్షియల్ కాలేజీలను ఒకే గొడుగుకిందకు తీసుకొస్తామని చెప్పారు. బుధవారం విద్యాశాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1,190 రెసిడెన్షియల్ స్కూల్స్ ద్వారా ఇంటర్ వరకు పేద విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తామని తెలిపారు. కుల, మతాలతో సంబంధం లేకుండా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తామని ఆయన చెప్పారు. సాంకేతిక విద్యా విధానంలో కూడా అవసరమైన మార్పులు చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. -
'జిల్లాకో బాలికల ఆశ్రమ పాఠశాల'
భూపాల్పల్లి (వరంగల్): తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి.. ఆపై చదివిన బాలికల కోసం ప్రత్యేక ఆశ్రమ పాఠశాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి వెల్లడించారు. వరంగల్ జిల్లా భూపాలపల్లి మండలంలోని మంజూర్‌నగర్‌లో సోమవారం సింగరేణి చేపట్టిన హరితహారం కార్యక్రమానికి శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసుదనాచారితోపాటు శ్రీహరి హాజరై మాట్లాడారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని ఆడపిల్లలకు మెరుగైన విద్యను అందించటం కోసం చర్యలు తీసుకోవాలని ఆదేశించారని చెప్పారు. ఇప్పటివరకు కస్తూర్బా విద్యాలయాల్లో పదో తరగతి చదువుకుంటున్న బాలికలకు ఆవాసం కల్పించి విద్యను అందజేస్తున్నామని... సీఎం ఆదేశాలతో ఇంటర్, డిగ్రీ చదువుకునే బాలికలకు సైతం రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రతి జిల్లాకు ఒక రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేస్తామన్నారు. -
హాస్టళ్ల స్థానే రెసిడెన్షియల్ స్కూళ్లు
చోడవరం : ఎస్టీ,ఎస్టీ విద్యార్థులకు కార్పోరేట్ స్ధాయి ఉన్నత చదువు కోసం ప్రస్తుతం ఉన్న హాస్టళ్లస్థానే రెసిడెన్సియల్ స్కూళ్లను ఏర్పాటుచేసేందుకు పరిశీలిస్తున్నామని రాష్ట్ర గిరిజన,సాంఘిక సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు. ఆదివారం రాత్రి చోడవరం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎస్టీ,ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు పూర్తిస్థాయిలో అభివృద్ధి పనులకు ఖర్చుచేస్తామన్నారు. ఏ గ్రామంలోనైనా 40శాతానికి మించి ఎస్టీ,ఎస్టీలు ఉంటే సబ్‌ప్లాన్ నిధులతో అంతర్గతరోడ్లనిర్మాణం,ఇతర అభివృద్ధి పనులకు వందశాతం నిధులు మంజూరుచేస్తామన్నారు. విదేశాల్లో చదువుకోసం ఆసక్తి చూపే పేద విద్యార్థులకు అంబేడ్కర్ ఓవర్సిస్ విద్యానిధి పథకం ఏర్పాటుచేస్తున్నామని, ఐఏఎస్, ఐపీఎస్ చదువుకోసం ఎన్టీఆర్ విద్యోన్నతి పథకంలో ఆర్థికసాయం అందజేస్తామన్నారు. నిరుద్యోగ యువకులకు స్వయం ఉపాధి పథకాలు అమలు చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం సబ్‌ప్లాన్ నిధులను తప్పుదారి పట్టించదని, తమ ప్రభుత్వం నిధులను సక్రమంగా వినియోగిస్తుందన్నారు. లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందన్నారు. చోడవరం నియోజకవర్గంలో పలు గిరిజన గ్రామాల అబివృద్దికి చోడవరం ఎమ్మెల్యే రాజు ప్రతిపాదనలు ఇచ్చారని, వాటిని మంజూరుకు కృషిచేస్తానని మంత్రి చెప్పారు. ఎమ్మెల్యే రాజు, సుగర్స్ చైర్మన్ గూనూరు మల్లునాయుడు, జెడ్పీటీసీలు మచ్చిరాజు, జోషఫ్ పాల్గొన్నారు. -
విద్యతోనే వికాసం
సమాజంలో దశాబ్దాల తరబడి అణచివేతకు గురైనవారి జీవితాలలో విద్యతోనే సమూల మార్పు వస్తుందని తెలంగాణ గురుకులాల సంఘం కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. ఆదివారం ఆయన భీమ్గల్లోనూ, ఆర్మూరు మండలం సుర్బిర్యాలలోనూ అంబేద్కర్ విజ్ఞాన కేంద్రాలను ప్రారంభించారు. వీటిని గురుకుల పాఠశాలల పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేశారు. ఆర్మూర్ టౌన్ : సమాజంలో శతాబ్దాల తరబడి అణచివేతకు గురైనవారి జీవితాల్లో విద్యతోనే మార్పు సాధ్యమని తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల విభాగం కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. విజ్ఞాన కేంద్రాల ఏర్పాటు లక్ష్యం ఇదేనన్నారు. ఆదివారం సుర్బిర్యాల్‌లో స్వేరోస్( ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న బాణాలు, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల పూర్వ విద్యార్థులు) సంస్థ ఆధ్వర్యంలో, గ్రామవాసి డాక్టర్ రాజేశ్వర్ సౌజన్యంతో అంబేద్కర్ విజ్ఞాన కేం ద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రవీణ్‌కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలను గౌరవించని దేశాలు బాగుపడవన్నారు. ఇది చరిత్ర చెప్పిన సత్యమని పేర్కొన్నారు. స్త్రీలను గౌరవించాలని సూచించారు. సాహసంతో ముందుకు సాగితే సాధించలేనిది ఏదీ లేదన్నారు. ఇందుకు గురుకుల విద్యార్థులు మాలవత్ పూర్ణ, ఆనంద్ సాక్ష్యమన్నారు. ఇంకా ఆయన ఏం మాట్లాడారంటే.. టీవీలు చూస్తూ, సినిమాల గురించి చర్చించుకుంటూ ఉండడం వల్ల ప్రయోజనం ఉండదు. లక్ష్యాలను నిర్దేశించుకుని, దానిని చేరేందుకు అవిశ్రాంతంగా కృషి చేయాలి. తల్లిదండ్రులు పిల్లల మనోభావాలను గౌరవించాలని, వారి ఆలోచనా విధానాలను గుర్తించి సక్రమ మార్గంలో నడిపించాలి. పిల్లలకు మహనీయుల జీవితాలను వివరించాలి. తద్వారా వారిలో తాము ఉన్నత స్థాయికి ఎదగాలనే ఆకాంక్ష బలోపేతమవుతుంది. పిల్లలను నిరుత్సాహ పరచవద్దు. వారిపై అది తీవ్ర ప్రభావం చూపుతుంది. తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పటి నుంచే సుగుణాలను అలవర్చాలి. పిల్లలపై ప్రేమతో ఇంటివద్దనే చదివించాలని చూడవద్దు. అవసరమైతే వారిని దూర ప్రాంతానికి పంపి చదివించడానికీ వెనుదీయవద్దు. కార్యక్రమంలో ప్రవీణ్‌కుమార్‌ను డాక్టర్ రాజేశ్వర్ సన్మానించారు. ఈ సందర్భంగా పోచంపాడ్, కంజర గురుకుల పాఠశాలల విద్యార్థినుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను అలరించాయి. కార్యక్రమంలో సర్పంచ్ భారతి మోహన్ రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు సత్తెమ్మ లింగారెడ్డి, నందిపేట తహశీల్దార్ బావయ్య, పీఆర్ ఏఈ రాజేశ్వర్, స్వేరోస్ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్, జిల్లా అధ్యక్షుడు రాజన్న, వైద్యులు బాబూరావు, ప్రవీణ్, ఐఆర్ఎస్ సాధించిన మదన్ తదితరులు పాల్గొన్నారు. పుస్తకమే ప్రపంచం కావాలి భీమ్‌గల్ : విద్యార్థికి పుస్తకమే ప్రపంచం కావాలని, చదువే సర్వస్వమవ్వాలని రాష్ర్ట సాంఘిక సంక్షేమ గురకుల పాఠశాలల సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సూచించారు. ఆదివారం ఆయన భీమ్‌గల్‌లోని ముచ్కూర్ రోడ్లో అంబేద్కర్ విజ్ఞాన కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. మంచి పుస్తకాలు జీవితాన్నే మార్చేస్తాయన్నారు. మహాత్ముల జీవిత చరిత్రల ద్వారా జీవన శైలిని మార్చుకోవచ్చని, వ్యక్తిత్వ వికాసాన్ని పెంచుకోవచ్చని పేర్కొన్నారు. చిన్నప్పటినుంచే చదవడం అలవాటు చేసుకోవాలన్నారు. చక్కగా చదివితే ఉద్యోగాలు వాటంతటవే వస్తాయన్నారు. ఈ విజ్ఞాన కేంద్రాన్ని మరింత విస్తరించాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ గుగులోత్ రవినాయక్, డిచ్పల్లి ఎంఈఓ సాయిలు, ప్రొఫెసర్ సుధాకర్, డాక్టర్లు అశోక్, ప్రేమానందం, రాజన్న తదితరలు పాల్గొన్నారు. -
ఆశ్రమాల్లో బోధనకు బ్రేక్
ఉట్నూర్ : ఐటీడీఏ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ఆశ్రమ పాఠశాలల్లో విద్యాబోధనకు బ్రేక్ పడింది. డిమాండ్ల సాధన కోసం సీఆర్టీలు(కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్లు) ఆరు రోజులుగా ఆందోళన బాట పట్టడంతో చదువు ముందుకు సాగడం లేదు. అరకొరగా ఉన్న ఉపాధ్యాయులతో గిరిజన విద్య కుంటుపడుతుండగా.. సీఆర్టీల ఆందోళన పదో తరగతి విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గిరిజన సంక్షేమ శాఖ ఆధీనంలో 123 ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 34వేల మంది వరకు విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీటిలోని 71 ఆశ్రమ పాఠశాలల్లో పదో తరగతి వరకు విద్యాబోధన సాగుతోంది. 2,683 ఉపాధ్యాయ పోస్టులుండగా ఇందులో 645 ఖాళీలతోపాటు 2013లో మంజూరైన మరో 569 ఖాళీలున్నాయి. ఈ విద్యాసంవత్సరంలో సుమారు 1,200 సీఆర్టీలను నియమించి విద్యాబోధన చేయిస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం సీఆర్టీలు విధులు బహిష్కరించి ఆరు రోజులుగా ఐటీడీఏ ఎదుట ఆందోళన కొనసాగిస్తున్నారు. సీఆర్టీల్లో స్కూల్ అసిస్టెంట్లకు రూ.5,500, ఎస్జీటీలకు రూ.4,500 ఐటీడీఏ చెల్లిస్తున్నా చాలీచాలని వేతనాలు ఎప్పుడు వస్తాయో తెలియక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫలితాలపై ప్రభావం గత విద్యాసంవత్సరంలో ఆశ్రమ పాఠశాలల్లో పదో తరగతి ఫలితాలు ఎన్నటూ లేనంత దారుణంగా 35.55శాతానికి పడిపోయాయి. దీని దృష్ట్యా అధికారులు మొదటి నుంచి ఉత్తమ ఫలితాలు సాధించేలా విద్యార్థులను తీర్చిదిద్దాలని ఆశ్రమ పాఠశాలల ఉపాధ్యాయులపై ఒత్తిడి పెంచుతున్నారు. అందుకు అనుగుణంగా సిలబస్ పూర్తి చేసి రివిజన్ తరగతులు నిర్వహించాలని, చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని కొద్ది రోజుల క్రితం కలెక్టర్ జగన్మోహన్ ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సమావేశంలో ఆదేశాలు జారీ చేశారు. ఈ సమయంలో సీఆర్టీలు ఆందోళన బాట పట్టడం పదో తరగతి విద్యార్థులు, వార్షిక పరీక్షల్లో సాధించే ఫలితాలపై ప్రభావం చూపే అవకాశాలున్నాయి. మార్చిలో వార్షిక పరీక్షల నిర్వహణ ఉండగా అంతకుముందు అర్ధ వార్షిక, యూనిట్ తదితర పరీక్షల నిర్వహణ ఉంది. సీఆర్టీలు ఆందోళనబాట పట్టడంతో ఆశ్రమాల్లో బోధించేవారు కరువయ్యారు. ఉపాధ్యాయులు తప్పా మిగితా సమయంలో పాఠ్యాంశాలు బోధించే వారు లేక తరగతి గదులు వెలవెలబోతున్నాయి. సకాలంలో సిలబస్ పూర్తి కాకపోతే విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లనుంది. సర్వీస్‌తో సంబంధం లేకుండా సీఆర్టీలందరినీ క్రమబద్ధీకరించాలి. కేజీబీవీల్లో స్కూల్ అసిస్టెంట్లకు రూ.14,860, ఎస్జీటీలకు రూ.10,900 వేతనం చెల్లిస్తున్నట్లుగానే సీఆర్టీలకు చెల్లించాలి. పతి నెల మొదటి తేదీన వేతనాలు విడుదల చేయాలి. సీఆర్టీలకు సంవత్సరానికి 22 సీఏల్ మంజూరు చేయాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. మహిళా సీఆర్టీలకు ప్రసుతి సెలవులు ఇవ్వాలి. నాలుగు నెలలుగా ఉన్న పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి. -
వస్తువులు పెట్టేదెక్కడ!
ఉట్నూర్ : ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న గిరిజన విద్యార్థులకు అన్ని సౌకర్యాలూ కల్పించి.. వారి విద్యాభివృద్ధికి బాటలు వేస్తున్నామని చెబుతున్న ఐటీడీఏ మాటలు క్షేత్రస్థాయిలో ఎక్కడా రుజువు కావడం లేదు. విద్యా సంవత్సరం ఆరంభమై ఏడు నెలలు గడుస్తున్నా విద్యార్థులకు ఇంతవరకు ట్రంకు పెట్టెలు అందించిన దాఖలాలు లేవు. అదీకాక ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేయలేదంటూ అధికారులు చేతులెత్తేస్తున్నారు. దీనిపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆగ్రహం చెందుతున్నారు. అవసరం 11,406.. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆశ్రమ పాఠశాలల్లో దాదాపు 38,963 మంది గిరిజన విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఈ ఏడాది కొత్తగా చేరిన విద్యార్థులతో పాటు పెట్టెలు తీసుకుని ఐదేళ్లు దాటిన విద్యార్థులకు కొత్త ట్రంక్ పెట్టెలు అందించాల్సి ఉంది. ఇందుకోసం గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ఈ విద్యా సంవత్సరంలో సుమారు 11,406 ట్రంకు పెట్టెలు అవసరమని తేల్చి ఒక్కో పెట్టెకు రూ.550 చొప్పున రూ.62 లక్షల 73 వేల 300 అవసరమని ప్రణాళికలు సిద్ధం చేసి ఆగస్టులో ప్రభుత్వానికి నివేదించారు. కానీ.. ఇంతవరకూ ప్రభుత్వం నుంచి గిరిజన సంక్షేమ శాఖకు నిధులు విడుదల కాకపోవడంతో ట్రంకు పెట్టెలకు టెండర్లు నిర్వహించలేదు. బడ్జెట్ వస్తేగానీ టెండర్లు నిర్వహించి పెట్టెలు విద్యార్థులకు అందించలేమని అధికారులు వాపోతున్నారు. విద్యార్థుల ఇబ్బందులు.. గిరిజన సంక్షేమ శాఖ అధీనంలోని 123 ఆశ్రమ పాఠశాలల్లో ఈ ఏడాది దాదాపు 4,500 మంది విద్యార్థులు కొత్తగా చేరారు. వీరందరికీ ఐటీడీఏ ఉచిత భోజన వసతితోపాటు నిత్యావసర వస్తువులు, మౌలిక వసతులు కల్పిస్తోంది. ఏటా ఆశ్రమాల్లో కొత్తగా చేరే విద్యార్థులకు, చేరి ఐదేళ్లు దాటిన విద్యార్థులకు కొత్త ట్రంకు పెట్టెలు అందిస్తోంది. ఈసారి ఇంతవరకూ ఇవ్వకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పుస్తకాలు, ప్లేట్, గ్లాస్, బట్టలు, పెన్నులు, చద్దర్లు, ఇతర సామగ్రి ఎక్కడ భద్రపరుచుకోవాలో తెలియక బాధలు అనుభవిస్తున్నారు. ఆర్థికంగా ఉన్న విద్యార్థులు ఇళ్ల ఉంచి పెట్టెలు కొనుగోలు చేసుకున్నారు. కొందరు తోటి విద్యార్థుల పెట్టెల్లో సామగ్రి దాచుకుంటున్నారు. అలా అవకాశం లేని విద్యార్థులేమో దుకాణాల్లో లభించే అట్టపెట్టెలను కొనుగోలు చేసి అందులో సామగ్రి పెడుతున్నారు. పిల్లలకు అన్నిరకాల వసతులు కల్పించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం చెందుతున్నారు. గిరిజన విద్యార్థులకు మౌలిక సదుపాయాల కల్పనలో ఐటీడీఏ విఫలమవుతోందని గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నాయి. -
విద్యార్థులు కావలెను
ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోంది. స్థానికంగా ఉండని వార్డెన్లు, వసతుల లేమికి అధికారుల నిర్లక్ష్యం తోడు కావడంతో ఏటా విద్యార్థుల సంఖ్య పడిపోతోంది. ఈ ఏడాది సంక్షేమ హాస్టళ్ల లో ఏకంగా ఏడు వేల సీట్లు ఖాళీగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. తల్లిదండ్రులు సైతం అన్ని వసతులు ఉన్న కేజీబీవీ, గురుకుల, మోడల్ పాఠశాలల్లోనే తమ పిల్లలను చేర్పించేందుకు ఆసక్తి చూపుతుండడంతో సంక్షేమ హాస్టళ్లలో సంఖ్య తగ్గిపోతోంది. కనీసం 50 మంది విద్యార్థులైనా లేకపోతే పక్కనున్న హాస్టల్లో కలిపేస్తామన్న ఉన్నతాధికారుల హెచ్చరికలతో.. విద్యార్థులకోసం సంక్షేమాధికారులు పడరాని పాట్లు పడుతున్నారు. ఇందూరు : ఒకప్పుడు సంక్షేమ వసతి గృహాల్లో ప్రవేశం కోసం విద్యార్థులు పోటీపడేవారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. విద్యార్థులకోసం హాస్టళ్ల అధికారులు తిరగాల్సి వస్తోంది. జిల్లాలో 67 ఎస్సీ, 13 ఎస్టీ, 60 బీసీ సంక్షేమ వసతి గృహాలున్నాయి. వీటిలో 12,500 సీట్లుండగా ఏడు వేల సీట్లు ఖాళీగానే ఉన్నాయి. ఎస్సీ హాస్టళ్లలో 3,500, ఎస్టీ హాస్టళ్లలో 500, బీసీ వసతి గృహాల్లో 3 వేల సీట్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. సగానికిపైగా సీట్లు ఖాళీగా ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. విద్యార్థుల బాగోగులను, కనీస సౌకర్యాలను పట్టించుకోలేని సంక్షేమాధికారులు వైఖరే ఇందుకు కారణమన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సౌకర్యాలు లేని సంక్షేమ హాస్టళ్ల కన్నా.. అన్ని వసతులతో నాణ్యమైన విద్య అందించే కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ), గురుకుల పాఠశాలలు, మోడల్ స్కూళ్లలో తమ పిల్లలను చేర్పించేందుకే తల్లిదండ్రులు ఉత్సాహం చూపుతున్నారు. దీంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ వసతి గృహాలు ఖాళీలతో వెక్కిరిస్తున్నాయి. వార్డెన్లకు తిప్పలే! జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాల్లో భారీగా ఖాళీలు ఉండటంపై ఉన్నతాధికారులు దృష్టిసారించారు. ప్రతి వసతి గృహంలో కనీసం 50 మంది విద్యార్థులైనా ఉండేలా చర్యలు తీసుకోవాలని వార్డెన్లకు సూచించారు. లేదంటే వేరే హాస్టల్లో కలిపేస్తామని హెచ్చరించారు. దీంతో వార్డెన్లు తమ పరిధిలోని గ్రామాలకు వెళ్లి హాస్టల్లో చేరాలని విద్యార్థులను కోరుతున్నారు. అయితే తమ పిల్లలను సంక్షేమ హాస్టళ్లలో చేర్పించేందుకు తల్లిదండ్రులు సిద్ధంగా లేరని, వారు మోడల్, కేజీబీవీ, గురుకుల పాఠశాలలవైపే చూస్తున్నారని పలువురు వార్డెన్లు పేర్కొంటున్నారు. ఇలాగైతే హాస్టళ్లను నింపడం సాధ్యం కాదంటున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ ప్రద్యుమ్న చొరవ తీసుకున్నారు. మహిళా సంఘాల ద్వారా వసతి గృహాలలో విద్యార్థులను చేర్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రతి పేద మహిళ తమ పిల్లలను వసతిగృహంలో చేర్పించాలని గ్రామ సంఘాల సమావేశాల్లో తీర్మానాలు చేయించారు. తమ పిల్లలను చేర్పించడమే కాకుండా గ్రామంలోని ఇతర పిల్లలను చేర్పించేలా చూడాలని ఐకేపీ పీడీ ద్వారా మహిళా సంఘాలకు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు వారు గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ పిల్లలను సంక్షేమ హాస్టళ్లలో చేర్పించాలని సూచిస్తున్నారు. ఇటు వార్డెన్లు.. అటు మహిళా సంఘాలు ప్రయత్నిస్తున్నా సంక్షేమవసతి గృహాల్లో పిల్లలను చేర్పించేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. వసతులు మెరుగు పరిచి, నాణ్యమైన భోజనం పెడితే తప్ప పరిస్థితి మెరుగు పడదని పలువురు మహిళా సంఘాల సభ్యులు పేర్కొంటున్నారు. మారని అధికారులు విద్యాసంవత్సరం ప్రారంభమైనప్పటికీ ఇంత వరకు విద్యార్థులకు అవసరమైన సామగ్రి హాస్టళ్లను చేరలేదు. విద్యార్థులకు బెడ్షీట్లు, కార్పెట్లు, ప్లేట్లు, గ్లాసులు, ట్రంకు బాక్సులు, చెప్పులు, బ్యాగులు, పరుచుకునే చాపలు, యూనిఫాంలు, నోట్ బుక్కులు తదితర వస్తువులు అందించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి గతనెలలోనే టెండర్లు నిర్వహించాలి. కానీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి ఈనెలలో టెండర్లు వేశారు. దీంతో సామగ్రి హాస్టళ్లను చేరలేదు. దీంతో ప్రస్తుత విద్యార్థులు ఇంకో పదిహేను రోజుల వరకు పాత సామాన్లతో సర్దుకోవాల్సిందే. సీట్ల భర్తీకి చర్యలు జిల్లాలోని వసతి గృహాలలో ఖాళీగా ఉన్న సీట్లను అన్నింటిని భర్తీ చేయడానికి చర్యలు చేపట్టాం. గ్రామాల్లోకి వెళ్లి విద్యార్థులను చేర్చుకోవాలని వార్డెన్లను ఆదేశించాం. కలెక్టర్ ఆదేశాల మేరకు మహిళా సంఘాలు కూడా సహకరిస్తున్నాయి. విద్యార్థులను హాస్టళ్లలో చేర్పించేందుకు వారు కృషి చేస్తున్నారు. -విమలాదేవి, జిల్లా బీసీ సంక్షేమాధికారి -
రెసిడెన్షియల్స్ స్కూల్స్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభం
గచ్చిబౌలి, న్యూస్‌లైన్: ఏపీ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్స్ స్పోర్ట్స్ మీట్ బుధవారం ప్రారంభమైంది. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో మొదలైన ఈ పోటీలను బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ ఎ.వాణి ప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి లాంఛనంగా ప్రారంభించారు. విద్యార్థుల వికాసానికి క్రీడలు ఎంతగానో దోహదం చేస్తాయని ఆమె పేర్కొన్నారు. పాఠ్యాంశాల్లో లేని ఎన్నో అంశాలను ఆటల ద్వారా తెలుసుకోవచ్చని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థుల మార్చ్ఫాస్ట్, స్కౌట్స్ అండ్ గైడ్స్ విన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. రాష్ట్ర వ్యాప్తంగా 45 పాఠశాలలకు చెందిన 550 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి మల్లయ బట్టు తదితరులు పాల్గొన్నారు.