!['తెలంగాణ మతసామరస్యానికి ప్రతీక' - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/4/71470338626_625x300_4.jpg.webp?itok=2Myk_sn0)
'తెలంగాణ మతసామరస్యానికి ప్రతీక'
హైదరాబాద్: 'తెలంగాణ రాష్ట్రం మతసామరస్యానికి ప్రతీక'' అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. శుక్రవారం ఆయన హైదరాబాద్లో గురుకుల పాఠశాలల ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినాయక చవితి ఉత్సవాలు మరోసారి మతసామరస్యాన్ని నిరూపించాయని అన్నారు. బతుకమ్మ, దసరా, పీర్ల పండగలను కలిసి చేసుకునే సంస్కృతి తెలంగాణది'' అని తెలిపారు. అన్ని మతాలవారు కలిసిమెలిసి జీవించి బాగుండాలని కోరుకుంటున్నానని కేసీఆర్ చెప్పారు.
అదేవిధంగా వచ్చే విద్యా సంవత్సరం నాటికి తెలంగాణలో 160 మైనార్టీ గురుకులాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. గురుకులాల్లో 55 వేల మంది మైనార్టీ విద్యార్థులకు విద్యా బోధన తరగతులు నిర్వహించనున్నట్టు కేసీఆర్ తెలిపారు.