Communal harmony
-
మానవత్వమే మనిషికి ముఖ్యం!
వైరల్: మత సామరస్యం.. మతోన్మాదులకు మింగుడు పడని విషయం. కష్టకాలంలో మనిషి.. మతానికి ఓటేస్తాడా? మానవత్వానికి ఓటేస్తాడా? మనిషంటే ఒక నమ్మకం.. ఆత్మీయత, అంతకు మించి అభిమానం. మానవత్వం ఎంతో గొప్పది. ఎందుకనో టీవీల్లో కూడా సరైన విషయాలను చూపించరు. ఒక పిల్లవాడు గాయపడితే.. ముందు అతన్ని పైకి లేపుతాం. గాయానికి మందు వేసి అతన్ని ఓదారుస్తాం. అంతేగానీ.. ఏ మతం బాబూ నీది అని అడగం. అసహ్యించుకోం. హిందువులు మా ఇంట కార్యక్రమాలకు హాజరవుతారు. అదే విధంగా మేం వాళ్ల కార్యక్రమాలకు హాజరవుతాం... దేశంలోని ప్రస్తుత పరిస్థితులపై మొహమ్మద్ రిజ్వాన్ ఖాన్ చెప్తున్న మాటలివి. రిజ్వాన్ ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా వైరల్ అవుతున్నాడు. తన దుకాణంలో పని చేసే రామ్‌దేవ్ షా అంత్యక్రియలను దగ్గరుండి నిర్వహించాడు రిజ్వాన్. బీహార్ రాజధాని పాట్నాలో రిజ్వాన్‌కు ఓ కుట్లు అల్లికల ఉత్పత్తుల షోరూం ఉంది. తన దగ్గర పాతికేళ్ల పాటు నమ్మకంగా పని చేసిన రామ్ దేవ్ షా ఈ మధ్యే వృద్ధాప్య సమస్యలతో కన్నుమూశారు. విషయం తెలిసిన రిజ్వాన్.. ఆ కుటుంబానికి అండగా నిలిచాడు. ఆ పెద్దాయన పాడె మోసి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. రిజ్వాన్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా అంతిమ యాత్ర సమయంలో వెంటే ఉన్నారు. ‘‘పాతికేళ్ల కిందట ఓ పెద్దాయన రిజ్వాన్ దుకాణానికి వచ్చి పని ఏమైనా ఉందా? అని అడిగాడు. మోటు పని చేయలేవులే అన్నాను. లెక్కలు రాసే పని అయినా ఇమ్మని బతిమాలాడు. ఆయనెంతో సాదాసీదాగా కనిపించాడు. అందుకే పని ఇచ్చా. ఇరవై ఏళ్లకు పైగా ఆయన నా దగ్గరే పని చేశారు. వయసు రిత్యా ఇబ్బందులతో బాధపడుతుంటే.. నెల నెల కొంత డబ్బు పంపించా. షా నాకు తండ్రి లాంటి వారు. నాకు ఒక పెద్ద దిక్కు. ఆయన కుటుంబం.. మా కుటుంబంతో సమానం. ఆయన లేని లోటు పూడ్చలేనిది. నాకు చేతనైన రీతిలో ఆ కుటుంబాన్ని ఆదుకుంటా అంటూ గద్గద స్వరంతో మాట్లాడాడు రిజ్వాన్. ఎన్డీటీవీ సౌజన్యంతో.. -
"ఈశ్వర్ అల్లా" అంటే ఇదేనేమో
పశ్చిమబెంగాల్: ఇటీవల కాలంలో మతాల పేర్లుతో కోట్లాడుకోవడాలు చూసి ఉంటాం. అలాగే మాట వరసకు ఏదైనా చిన్న మాట అంటే చాలు మా మతాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారంటూ పెద్ద ఎత్తున ఘర్షణకి దిగిపోతారు. అంతేందుకు ఒక ప్రాంతం లేదా గల్లీ మొత్తం ఒక మతంగా నివశిస్తారు. కానీ వాటిన్నింటకి విరుద్ధంగా ఒక ముస్లీం కుటుంబం హిందూ దేవుళ్ల విగ్రహాలను తయారు చేయడమే కాక అన్ని మతాలు ఒకటే భావనను కలిగిస్తున్నారు. (చదవండి: సార్ నా గర్ల్‌ఫ్రెండ్ సాక్స్ ఉతక లేదు.... కాబట్టి ఆఫీస్‌కి రాలేను) అసలు విషయంలోకి వెళ్లితే....పశ్చిమ బెంగాల్‌లోని పశ్చిమ మేదినీపూర్‌లో దాస్పూర్ గ్రామంలోనే ఇస్మాయిల్ కుటుంబం నలభై సంవత్సారాలుగా నివాసం ఉంటున్నారు. ఈ 61 ఏళ్ల ఇస్మాయిల్ వృత్తి రీత్యా విగ్రహాలు తయారు చేస్తాడు. అందులోనూ కాళీ విగ్రహాలు తయారు చేయడంలో సిద్ధహస్తుడు. అక్కడున్న గ్రామస్తులకు కాళివిగ్రహాలు కావాలంటే ఇస్మాయిల్కే ప్రాధాన్యత ఇస్తారు. అంతేకాదు ఈ కాళిమాత విగ్రహాలను అతని భార్య , ఐదుగురు కుమార్తెలు కలిసి తయారు చేస్తారు. పైగా ఇస్మాయిల్‌కి తన తన కూతుళ్లను చదివించడం తనకు భారమే అయినప్పటికీ నా పిల్లలకి "ఈశ్వర్" "అల్లా" అనే ఇద్దరి దేవుళ్ల ఆశీస్సులు ఉంటాయి కాబట్టి వాళ్లు బాగా చదువుకుని మంచి జీవితాన్ని గడుపుతారని నమ్మకంగా చెబుతాడు. ఈ మేరకు ఇస్మాయిల్ మాట్లాడుతూ..." “నేను చిన్నప్పటి నుండి ఇదే చేస్తున్నాను. మా ఊరి గ్రామస్తులే కాక ఇతర ప్రాంతాల నుండి సైతం ప్రజలు విగ్రహాల కోసం నా వద్దకే వస్తారు. నేను పేదవాడిని కానీ అందరి దీవెనలతో నా కుటుంబాన్ని చక్కగా నడపగలుగుతున్నాను. అంతేకాదు నాకు విగ్రహాలు సిద్ధమైనప్పుడు చాలా గొప్పగా అనిపిస్తుంది." అని అన్నాడు. ఈ క్రమంలో ఆ గ్రామంలోని బీరేంద్ర రాయ్ అనే స్థానికుడు మాట్లాడుతూ....ఈ గ్రామంలోని ప్రతి హిందువు దేవతా విగ్రహన్ని ఇస్మాయిల్ తయారు చేస్తాడు. ఇది మాకు కొత్తేమి కాదు. అయినా మనమందరం కలిసి పెరిగాం, కలిసి ఉంటున్నాం, ఇదే మన సంస్కృతి" అని అన్నాడు. కానీ ఈ చిన్న గ్రామం నిజంగా మత సామరస్యాంగా ఎలా జీవించాలో ఎలా కొనసాగించాలో ఐక్యతగా జీవిస్తూ చూపించింది. ఈ మేరకు ఇస్మాయిల్ ప్రజలు ఐక్యత గురించి తెలుసుకునేలా ప్రపంచంలో ఇలాంటి దస్పూర్ గ్రామాలు మరిన్ని ఉండాలని ఆకాంక్షిస్తున్నాను అని అన్నాడు. (చదవండి: ఎదురుగా కంగారుల సమూహం.. ఇప్పుడు నేనెలా ఆడాలి?) -
'తెలంగాణ మతసామరస్యానికి ప్రతీక'
హైదరాబాద్: 'తెలంగాణ రాష్ట్రం మతసామరస్యానికి ప్రతీక'' అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో గురుకుల పాఠశాలల ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినాయక చవితి ఉత్సవాలు మరోసారి మతసామరస్యాన్ని నిరూపించాయని అన్నారు. బతుకమ్మ, దసరా, పీర్ల పండగలను కలిసి చేసుకునే సంస్కృతి తెలంగాణది'' అని తెలిపారు. అన్ని మతాలవారు కలిసిమెలిసి జీవించి బాగుండాలని కోరుకుంటున్నానని కేసీఆర్ చెప్పారు. అదేవిధంగా వచ్చే విద్యా సంవత్సరం నాటికి తెలంగాణలో 160 మైనార్టీ గురుకులాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. గురుకులాల్లో 55 వేల మంది మైనార్టీ విద్యార్థులకు విద్యా బోధన తరగతులు నిర్వహించనున్నట్టు కేసీఆర్ తెలిపారు. -
హనుమాన్ యాత్రకు ముస్లింల తోడ్పాటు
హనుమాన్ జయంతి శోభాయాత్ర సందర్భంగా జంటనగరాల్లో మతసామరస్యం మరోసారి రుజువు వైంది. కాచిగూడ- నారాయణగూడ రహదారిపై పెట్రోల్ బంక్ వద్ద ముస్లిం సేవా సంస్థల ఆధ్వర్యంలో మంచినీరు, మజ్జిగ అందుబాటులో ఉంచారు. శోభాయాత్రలో పాల్గొనే వారికి వీటిని అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు. -
మత మార్పిడి నిరోధక చట్టం తెద్దాం!
* లోక్‌సభలో చర్చకు బదులిస్తూ వెంకయ్యనాయుడు సూచన * రాష్ట్రాలూ ఆ తరహా చట్టాలు చేయాలి * మత సామరస్యానికి కట్టుబడి ఉన్నాం * ఆరెస్సెస్‌ను విమర్శిస్తే ఊరుకోం * ప్రభుత్వ తీరుపై విపక్షం ధ్వజం న్యూఢిల్లీ: మతమార్పిడుల నిరోధక చట్టాలను రూపొందించాల్సి ఉందని ప్రభుత్వం అభిప్రాయపడింది. అన్ని పార్టీలు అంగీకరిస్తే.. సమగ్ర చర్చ జరిపి, మతమార్పిడి నిరోధక బిల్లును రూపొందించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. లోక్‌సభలో గురువారం మతమార్పిడులపై జరిగిన చర్చకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు బదులిస్తూ.. కేంద్రంతో పాటు అన్ని రాష్ట్రాలు మత మార్పిడి నిరోధక చట్టాలను రూపొందించుకోవాలని సూచించారు. అలాగే, మత సామరస్యానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. శాంతిభద్రతలు రాష్ట్రాల పరిధిలోని అంశమైనా.. ఈ విషయంలో రాష్ట్రాలు కోరితే ఏ సాయమందించేందుకైనా సిద్ధమని పేర్కొన్నారు. అంతకుముందు, మతమార్పిడుల అంశం పార్లమెంటును వరుసగా రెండో రోజూ కుదిపేసింది. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో పలువురు ముస్లింలను హిందూ మతంలోకి మార్చిన అంశంపై విపక్షాలు కలసికట్టుగా ప్రభుత్వంపై ధ్వజమెత్తి, లోక్‌సభలో చర్చకు అంగీకరించేలా చేశాయి. లోక్‌సభ ప్రారంభం కాగానే కాంగ్రెస్, టీఎంసీ, ఎస్పీ, ఆర్జేడీ తదితర ప్రతిపక్ష పార్టీల సభ్యులు వెల్ వద్దకు దూసుకెళ్లి ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసి, మతమార్పిడుల అంశంపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. ‘హిందూ, ముస్లిం, సిఖ్ భాయి భాయి’ అనే నినాదాలతో హోరెత్తించారు. వారి ఆందోళనను పట్టించుకోకుండానే స్పీకర్ మహాజన్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని కొనసాగించారు. తామిచ్చిన వాయిదా తీర్మానాన్ని ఆమోదించాలని కోరుతూ ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే.. దేశ లౌకిక ముద్రపై బురద జల్లేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, దేశంలో విషబీజాలు నాటుతూ, దేశానికి చెడ్డపేరు తెస్తున్నారని విమర్శించారు. ఈ దశలో జోక్యం చేసుకున్న పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు.. ఇది తీవ్రమైన అంశమేనని, దీనిపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రతిపక్షాలు కలసివస్తే మతమార్పిడులను నిషేధిస్తూ చట్టం తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా దేశ సమైక్యత, సమగ్రతలకు వచ్చిన ప్రమాదమేం లేదని, ఈ అంశాన్ని రాజకీయం చేయొద్దని విపక్షాలకు సూచించారు. చర్చకు పట్టుబడుతూ విపక్షాలు సభలో గందరగోళం సృష్టించడంతో స్పీకర్ సభను పలుమార్లు వాయిదా వేశారు. ఇవేనా మంచి రోజులంటే..? మధ్యాహ్నం తరువాత మతమార్పిడులపై స్వల్పకాలిక చర్చను కాంగ్రెస్ సభ్యుడు జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభిస్తూ.. ‘యూపీలో హిందూమతంలోకి మారితే రేషన్ కార్డులిస్తామని ముస్లింలకు హామీ ఇచ్చారు. ఇదేనా మీరు చెప్పిన మంచిరోజులు రావడం’ అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. ఎంఐఎం సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ బలవంతపు మతమార్పిడుల గురించి ముస్లింలకు భయమేమీ లేదన్నారు. హిందూ సంస్థలను ప్రభుత్వం అదుపులో పెట్టాలని సూచించారు. బీజేపీ, ఆరెస్సెస్‌ల మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని ప్రస్తావించిన సమయంలో బీజేపీ సభ్యులు గట్టిగా అరుస్తూ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. కాషాయ తలపాగా ధరించినంతమాత్రాన స్వామి కాలేరంటూ సీపీఎం సభ్యుడు సలీమ్ చేసిన వ్యాఖ్యపై బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మత మార్పిడులపై చర్చ అనవసరమని, ఇది యూపీలోని ఒక చిన్న ప్రాంతంలో జరిగిన చిన్న ఘటన అని ఎస్పీ అధినేత ములాయం పేర్కొన్నారు. అనంతరం చర్చకు వెంకయ్య నాయుడు బదులిస్తూ అబద్ధపు ప్రచారాలతో సంఘ్ పరివార్‌పై, మోదీ ప్రభుత్వంపై బురద జల్లేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయన్నారు. ‘ఆరెస్సెస్‌ను తిడు తుంటే మౌనంగా ఎలా ఉండగలను?’ అన్న వెంకయ్య వ్యాఖ్యలపై కాంగ్రెస్, ఎస్పీ, ఎంఐఎం సహా ఇతర ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేసి సభ నుంచి వాకౌట్ చేశారు. 25న మళ్లీ మతమార్పిడి: హిందూ జాగరణ్ఙఞ్చటఆగ్రా: ఒకవైపు ఆగ్రా ఘటనపై దుమారం చెలరేగుతుండగానే, యూపీలోని అలీగఢ్‌లో హిందూమతంలోకి పునఃచేరిక కార్యక్రమాన్ని ఈ నెల 25న పెద్ద ఎత్తున నిర్వహించనున్నామని హిందూ జాగరణ్ సమితి నేత రాజేశ్వర్ సింగ్ ప్రకటించారు. దీన్ని స్థానిక బీజేపీ ఎంపీ స్వాగతించారు. కాగా, ‘ఆగ్రా’ ఘటనపై సమగ్ర నివేదిక సమర్పించాలంటూ కేంద్ర హోంశాఖ యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మత మార్పిడి కార్యక్రమ మూలకర్త నందకిశోర్ బాల్మికి కోసం గురువారం పోలీసులు పలు చోట్ల గాలించారు.