రెసిడెన్షియల్ పాఠశాలలుగా మారనున్న గిరిజన వసతిగృహాలు
సిబ్బందే లేరు... ఫలితాలెలా!
దిక్కుతోచని స్థితిలో మార్చిన వసతిగృహాలు
అప్‌గ్రేడ్ పాఠశాలలదీ అదే దారి...
ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకా? లేక పూర్తిగా ప్రభుత్వ విద్యా వ్యవస్థ లేకుండా ఉండేందుకా? అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. తాజాగా రాష్ట్రంలోని పలు గిరిజన వసతిగృహాలను రెసిడెన్షియల్ పాఠశాలలలుగా మార్చేందుకు నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే దీని అమలుకు కూడా చర్యలు చేపట్టింది. అయితే గతంలో ఇలా చేసిన పలు పాఠశాలల్లో నేటికీ ఉపాధ్యాయులు లేక విద్యాభివృద్ధి కుంటుపడింది. విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. అప్‌గ్రేడ్ పాఠశాలల్లో కూడా ఇదే పరిస్థితి. మరి తాజాగా మరిన్ని వసతిగృహాలను ఇలా మార్చడంలో ప్రభుత్వ ఉద్దేశమేంటో అర్ధం కావడం లేదని పలువురు పేర్కొంటున్నారు. ఏది చేసినా పక్కా ప్రణాళికా ప్రకారం చేస్తే మంచిదేనని కానీ అలా జరగకపోవడం వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని పలువురి తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే....
సీతంపేట : రాష్ట్రంలోని 70 గిరిజన వసతిగృహాలను రెసిడెన్షియల్ పాఠశాలలుగా మారుస్తామని వచ్చే విద్యా సంవత్సరం నుంచే దీన్ని అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించేసింది. అయితే మరి ఆయా పాఠశాలకు కావాల్సిన సిబ్బంది నియూమకం తదితర పరిస్థితులేమిటన్నది ప్రస్తుత ప్రశ్న. గతంలో ఇదే మాదిరిగా గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని పలు వసతిగృహాలను మార్పు చేసింది. వాటి పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా తయూరైంది. వాటికే నియమించలేని సిబ్బందిని ఇప్పుడు కొత్త వాటికి ఎక్కడ ఎలా నియమిస్తారని, విద్యార్థుల విద్య సంగతేంటని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం శ్రీకాకుళః జిల్లాలో రెండు గిరిజన వసతిగృహాలు మాత్రమే రెసిడెన్షియల్ పాఠశాలలుగా మారనున్నారుు. భామిని, పాలకొండల్లో వసతిగృహాలు నడుస్తున్నారుు. వీటిని మార్పు చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.
ఇప్పటి వరకు ఈ విద్యార్థులు వసతిగృహాల్లో ఉంటూ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విద్యనభ్యసించే వారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు ఇకపై వసతిగృహంలోనే ఉంటూ అక్క డే విద్యనభ్యసిస్తారు. రెండేళ్ల కిందట సీతంపేట, టెక్కలి, శ్రీకాకుళం, మందస వసతిగృహాలను ఆశ్రమ పాఠశాలలలుగా ప్రభుత్వం మార్చేసింది. ఇప్పటి వరకు ఆయూ పాఠశాలల్లో ఉపాధ్యాయ సిబ్బందినే నియమించలేదు. దీంతో విద్యార్థుల చదువులు అంతంతమాత్రంగానే సాగుతున్నారుు. కేవలం సీఆర్‌టీలు, డెప్యుటేషన్‌పై వచ్చిన సిబ్బందితో పాఠశాలలు నడిపిస్తున్నారు. వీటి పరిస్థితే ఇలా ఉంటే కొత్త వాటి పరిస్థితి ఎలాగని పలువురి సందేహం. మొత్తంగా ప్రభుత్వం విద్యా వ్యవస్థను ఒక ప్రణాళిక ప్రకారం నిర్వీర్యం చేసేస్తుందా? అన్నది పలువురి అనుమానంగా ఉంది.
అప్‌గ్రేడ్ పాఠశాలలదీ అదేదారి...
పేరుకే అవి అప్‌గ్రేడ్ పాఠశాలలు. ఆచరణలో మాత్రం వెనుకబాటు తనమే కనిపిస్తుంది. గిరిజన విద్యను బలోపేతం చేస్తామని ఆదరాబాదరాగా ప్రభుత్వం రెండేళ్ల క్రితం అప్‌గ్రేడ్ చేసింది. విద్యాభివృద్ధి చేయడానికి కావాల్సిన ఉపాధ్యాయులను మాత్రం మరిచారు. అప్‌గ్రేడ్ చేసిన అన్ని పాఠశాలల్లో ఇదే పరిస్థితి నెలకొంది. గుర్రాన్ని కొని కళ్లేన్ని మరిచిన చందంగా అప్‌గ్రేడ్ పాఠశాలల తీరు తయారైంది. ఐటీడీఏ పరిధిలో మూడేళ్ల క్రితం 15 ఆశ్రమ పాఠశాలలను అప్‌గ్రేడ్ చేశారు. సబ్జెక్టు టీచర్లును నియమించలేదు. దీంతో తిప్పలు తప్పడం లేదు. ఏడో తరగతి వరకు ఉన్న పాఠశాలలను ఎనిమిదో తరగతికి ఎనిమిది నుంచి పదో తరగతి వరకు ఇలా అప్‌గ్రేడ్ చేశారు. జిల్లాలో 44 ఆశ్రమ పాఠశాలలున్నాయి. వీటిలో సామరెల్లి, ఎస్‌ఎస్ మణుగు, తర్లి,నేలబొంతు, బరణికోట, చీపీ, లొత్తూరు, పెద్దపొల్ల, బుడగరాయి, ముత్యాలు, మనుమకొండ, బడ్డుమాసింది, మర్రిగూడ, గొట్టిపల్లి పాఠశాలలను గతంలో అప్‌గ్రేడ్ చేశారు. ముఖ్య సబ్జెక్టులు ఆంగ్లం, సైన్సు, గణితం వంటి సబ్జెక్టులకు టీచర్లు లేని పరిస్థితి ఆయా పాఠశాలల్లో ఉంది. దీంతో గిరిజన విద్య మిథ్యగా మారుతోంది. ఈ విషయమై గిరిజన సంక్షేమశాఖ డీడీ ఎంపీవీ నాయిక్ వద్ద సాక్షి ప్రస్తావించగా కొత్త టీచర్ పోస్టులకు గిరిజన సంక్షేమ క మిషనర్‌కు ప్రతిపాదనలు పంపించినట్టు తెలిపారు.