tribal welfare schools
-
గిరిసీమలో ‘కొత్త’బడులు
సాక్షి, అమరావతి: గిరిజన స్కూళ్లకు మహర్దశ పట్టింది. ఇప్పటి వరకు చెట్ల కింద, పూరిపాకల్లో కొనసాగుతున్న గిరిజన గ్రామాల్లో చదువులకు ప్రభుత్వం కొత్త రూపునిస్తోంది. తక్కువ మంది విద్యార్థులున్న బడులకు సైతం పక్కా భవనాలు నిర్మింస్తోంది. మరిన్ని శిథిలమైన భవనాలకు మెరుగులు అద్దుతోంది. ఆరు జిల్లాల్లో 1,331 గిరిజన సంక్షేమ పాఠశాలలు సరికొత్త రూపును సంతరించుకుంటున్నాయి. గత ప్రభుత్వంలో మైదాన ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలను నిర్లక్ష్యం చేస్తే.. గిరిజన గ్రామాల్లో పూర్తిగా గాలికి వదిలేశారు. రవాణా సౌకర్యం లేని మారుమూల ప్రాంతాల్లో విద్యను పట్టించుకోకపోవడంతో అక్కడి పిల్లలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే, వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన ‘మనబడి నాడు–నేడు’తో దాదాపు 1,331 గిరిజన స్కూళ్లను సుమారు రూ.500 కోట్లతో సరికొత్తగా తీర్చిదిద్దుతున్నారు. వీటితో పాటు మరో 817 పాఠశాల భవనాల్లో విద్యుత్, తాగునీరు, టాయిలెట్ సౌకర్యాలు కల్పింస్తున్నారు. ఇప్పటికే నాడు–నేడు మొదటి దశలో 350, రెండో దశలో మరో 74.. మొత్తం 424 గిరిజన సంక్షేమ పాఠశాలలను పూర్తి చేశారు. కొండ ప్రాంతాల్లోని గూడేల్లో ఎన్నో ఏళ్లుగా పాఠశాలలున్నా వాటిలో అత్యధిక ప్రాంతాల్లో పక్కా భవనాల్లేవు. ఇలాంటి చోట బడులు, పాకలు లేదా చెట్ల కింద నామమాత్రంగా నడుస్తున్నాయి. మరికొన్ని చోట్ల ఉన్న పాఠశాలల భవనాలు బీటలు వారి శిథిలమయ్యాయి. ఇలాంటి పాఠశాలలకు కొత్త భవనాలు నిర్మించడంతో పాటు పాత వాటికి మెరుగులు దిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. మారుమూల బడుల్లోనూ సకల సదుపాయాలు తొలి విడతలో 26 జిల్లాల్లోనూ 20 మంది కంటే ఎక్కువ మంది విద్యార్థులున్న 1,331 స్కూళ్లను గుర్తించారు. వీటిలో కొత్త భవనాలు నిర్మించాల్సినవి దాదాపు 500 వరకూ ఉండగా, మిగిలినవి మెరుగులు దిద్దాల్సినవి. మొత్తం రూ.500 కోట్లతో ఆయా పనులు చేపట్టారు. ఇప్పటికే 424 స్కూళ్ల పనులు పూర్తిచేయగా, మిగిలిన స్కూళ్లను రెండు నెలల్లో పూర్తి చేయాలని పాఠశాల విద్యాశాఖ మౌలిక వసతుల కల్పన విభాగం లక్ష్యంగా నిర్దేశించుకుంది. కేవలం భవనాలు నిర్మింంచడమే కాకుండా వాటికి విద్యుత్, తాగునీరు, మరుగు దొడ్లను సైతం తప్పనిసరి చేసింది. ప్రస్తుతం నాడు–నేడు రెండో దశ పనుల్లో భాగంగా ఈ స్కూళ్లను బాగుచేస్తుండగా, మూడో విడతలో ఏజెన్సీలోని 20 మంది కంటే తక్కువ విద్యార్థులున్న పాఠశాలలను తీర్చిదిద్దాలని నిర్ణయించారు. -
ఇంటివద్దకే బడి
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులు బడికి వెళ్లి చదువుకోవడం, లాక్డౌన్ కారణంగా ఆన్ లైన్ పాఠాలు, టీవీల్లో వీడియో తరగతులు వినడం చూశాం. కానీ, గిరిజన సంక్షేమ శాఖ బోధన ప్రక్రియలో సరికొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఆ శాఖ పరిధిలోని ఆశ్రమ, ప్రభు త్వప్రాథమికోన్నత పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం బడినే ఇంటివద్దకు తీసుకెళ్తోంది. ఆన్లైన్ , వీడియో పాఠాలతో పాటు సంబం ధిత బోధకుడు నేరుగా విద్యార్థి ఇంటికి వెళ్లి 2గంటల పాటు పాఠ్యాంశాన్ని బోధిస్తారు. ఈ మేరకు చర్యలు చేపట్టాల్సిందిగా గిరిజన సంక్షేమ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇంటింటికీ చదువు... గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో దాదాపు 320 ఆశ్రమ పాఠశాలలు, 1,510 ప్రభుత్వ పాథమిక పాఠశాలలు (జీపీఎస్) ఉన్నాయి. ఆశ్రమ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుడితో పాటు టీచర్లు, సీఆర్టీ(కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్)లు ఉంటారు. తాజాగా హెచ్ఎంలు, టీచర్లు, సీఆర్టీలు ఏయే రకమైన విధులు నిర్వహించాలనే దానిపై గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రతి ఉపాధ్యాయుడు, సీఆర్టీ ఆయా తరగతిలోని పిల్లల్ని అడాప్ట్ చేసుకుని బోధన, అభ్యసన కార్యక్రమాలు కొనసా గించాలి. గిరిజన ఆవాసాల్లో ఉండే జీపీఎస్‌లలో ఒక్కో టీచర్ ఉండగా... 10 మందిలోపు పిల్లలున్నారు. ఈ స్కూళ్లలో పనిచేసే టీచర్లు పూర్తిగా అదే ఆవాసానికి చెందిన వారే కావడంతో స్థానికంగా విద్యార్థి ఇంటికి వెళ్లి బోధ న, అభ్యసన కార్యక్రమాలు నిర్వహించడం ఇబ్బందికరమేమీ కాదు. విద్యార్థికి బోధన కార్యక్రమాలను మరింత చేరువ చేసేందుకే ఆ శాఖ ఈ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. -
మారిస్తే మెరుగైపోద్దా!
రెసిడెన్షియల్ పాఠశాలలుగా మారనున్న గిరిజన వసతిగృహాలు సిబ్బందే లేరు... ఫలితాలెలా! దిక్కుతోచని స్థితిలో మార్చిన వసతిగృహాలు అప్‌గ్రేడ్ పాఠశాలలదీ అదే దారి... ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకా? లేక పూర్తిగా ప్రభుత్వ విద్యా వ్యవస్థ లేకుండా ఉండేందుకా? అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. తాజాగా రాష్ట్రంలోని పలు గిరిజన వసతిగృహాలను రెసిడెన్షియల్ పాఠశాలలలుగా మార్చేందుకు నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే దీని అమలుకు కూడా చర్యలు చేపట్టింది. అయితే గతంలో ఇలా చేసిన పలు పాఠశాలల్లో నేటికీ ఉపాధ్యాయులు లేక విద్యాభివృద్ధి కుంటుపడింది. విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. అప్‌గ్రేడ్ పాఠశాలల్లో కూడా ఇదే పరిస్థితి. మరి తాజాగా మరిన్ని వసతిగృహాలను ఇలా మార్చడంలో ప్రభుత్వ ఉద్దేశమేంటో అర్ధం కావడం లేదని పలువురు పేర్కొంటున్నారు. ఏది చేసినా పక్కా ప్రణాళికా ప్రకారం చేస్తే మంచిదేనని కానీ అలా జరగకపోవడం వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని పలువురి తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.... సీతంపేట : రాష్ట్రంలోని 70 గిరిజన వసతిగృహాలను రెసిడెన్షియల్ పాఠశాలలుగా మారుస్తామని వచ్చే విద్యా సంవత్సరం నుంచే దీన్ని అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించేసింది. అయితే మరి ఆయా పాఠశాలకు కావాల్సిన సిబ్బంది నియూమకం తదితర పరిస్థితులేమిటన్నది ప్రస్తుత ప్రశ్న. గతంలో ఇదే మాదిరిగా గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని పలు వసతిగృహాలను మార్పు చేసింది. వాటి పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా తయూరైంది. వాటికే నియమించలేని సిబ్బందిని ఇప్పుడు కొత్త వాటికి ఎక్కడ ఎలా నియమిస్తారని, విద్యార్థుల విద్య సంగతేంటని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం శ్రీకాకుళః జిల్లాలో రెండు గిరిజన వసతిగృహాలు మాత్రమే రెసిడెన్షియల్ పాఠశాలలుగా మారనున్నారుు. భామిని, పాలకొండల్లో వసతిగృహాలు నడుస్తున్నారుు. వీటిని మార్పు చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ విద్యార్థులు వసతిగృహాల్లో ఉంటూ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విద్యనభ్యసించే వారు. ప్రభుత్వ నిర్ణయం మేరకు ఇకపై వసతిగృహంలోనే ఉంటూ అక్క డే విద్యనభ్యసిస్తారు. రెండేళ్ల కిందట సీతంపేట, టెక్కలి, శ్రీకాకుళం, మందస వసతిగృహాలను ఆశ్రమ పాఠశాలలలుగా ప్రభుత్వం మార్చేసింది. ఇప్పటి వరకు ఆయూ పాఠశాలల్లో ఉపాధ్యాయ సిబ్బందినే నియమించలేదు. దీంతో విద్యార్థుల చదువులు అంతంతమాత్రంగానే సాగుతున్నారుు. కేవలం సీఆర్టీలు, డెప్యుటేషన్‌పై వచ్చిన సిబ్బందితో పాఠశాలలు నడిపిస్తున్నారు. వీటి పరిస్థితే ఇలా ఉంటే కొత్త వాటి పరిస్థితి ఎలాగని పలువురి సందేహం. మొత్తంగా ప్రభుత్వం విద్యా వ్యవస్థను ఒక ప్రణాళిక ప్రకారం నిర్వీర్యం చేసేస్తుందా? అన్నది పలువురి అనుమానంగా ఉంది. అప్‌గ్రేడ్ పాఠశాలలదీ అదేదారి... పేరుకే అవి అప్‌గ్రేడ్ పాఠశాలలు. ఆచరణలో మాత్రం వెనుకబాటు తనమే కనిపిస్తుంది. గిరిజన విద్యను బలోపేతం చేస్తామని ఆదరాబాదరాగా ప్రభుత్వం రెండేళ్ల క్రితం అప్‌గ్రేడ్ చేసింది. విద్యాభివృద్ధి చేయడానికి కావాల్సిన ఉపాధ్యాయులను మాత్రం మరిచారు. అప్‌గ్రేడ్ చేసిన అన్ని పాఠశాలల్లో ఇదే పరిస్థితి నెలకొంది. గుర్రాన్ని కొని కళ్లేన్ని మరిచిన చందంగా అప్‌గ్రేడ్ పాఠశాలల తీరు తయారైంది. ఐటీడీఏ పరిధిలో మూడేళ్ల క్రితం 15 ఆశ్రమ పాఠశాలలను అప్‌గ్రేడ్ చేశారు. సబ్జెక్టు టీచర్లును నియమించలేదు. దీంతో తిప్పలు తప్పడం లేదు. ఏడో తరగతి వరకు ఉన్న పాఠశాలలను ఎనిమిదో తరగతికి ఎనిమిది నుంచి పదో తరగతి వరకు ఇలా అప్‌గ్రేడ్ చేశారు. జిల్లాలో 44 ఆశ్రమ పాఠశాలలున్నాయి. వీటిలో సామరెల్లి, ఎస్ఎస్ మణుగు, తర్లి,నేలబొంతు, బరణికోట, చీపీ, లొత్తూరు, పెద్దపొల్ల, బుడగరాయి, ముత్యాలు, మనుమకొండ, బడ్డుమాసింది, మర్రిగూడ, గొట్టిపల్లి పాఠశాలలను గతంలో అప్‌గ్రేడ్ చేశారు. ముఖ్య సబ్జెక్టులు ఆంగ్లం, సైన్సు, గణితం వంటి సబ్జెక్టులకు టీచర్లు లేని పరిస్థితి ఆయా పాఠశాలల్లో ఉంది. దీంతో గిరిజన విద్య మిథ్యగా మారుతోంది. ఈ విషయమై గిరిజన సంక్షేమశాఖ డీడీ ఎంపీవీ నాయిక్ వద్ద సాక్షి ప్రస్తావించగా కొత్త టీచర్ పోస్టులకు గిరిజన సంక్షేమ క మిషనర్‌కు ప్రతిపాదనలు పంపించినట్టు తెలిపారు.