నారాయణఖేడ్: కొన్ని సంవత్సరాలుగా తెంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో పార్ట్ టైం ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న ఉద్యోగుల వేతనాలను ప్రభుత్వం పెంచడం హర్షణీయమని పార్ట్‌టైం ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జే శర్ణప్ప, జిల్లా అధ్యక్షుడు నర్వ పండరి, ప్రధాన కార్యదర్శి బాల్‌రాజ్, కోశాధికారి రవి పేర్కొన్నారు. శనివారం వారు స్థానిక విలేకరులతో మాట్లాడారు.
అనేక సంవత్సరాల నుంచి అతి తక్కువ వేతనంతో కష్ట నష్టాలకు ఓర్చి విద్యార్థుల బాగోగుల కోసం తాము నిరంతరం కృషి చేశామన్నారు. తమ కష్టాన్ని గుర్తించి సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి, గురుకులాల కార్యదర్శి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్, ప్రిన్సిపాల్ సెక్రటరరీ ఎక్కాకు, గురుకుల పాఠశాలల జేఏసీ నాయకులు రంగారెడ్డి, రవీందర్‌రెడ్డి, బాల్‌రాజ్, యాదయ్య, నరేందర్, కాశీనాథ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.
పీఈటీలుగా పని చేస్తున్న ఉపాధ్యాయులకు రూ.12,500లు, అటెండర్లకు రూ.10,500 పెంచాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో నాయకులు అమృత్, కె.పండరి, నరేష్‌కుమార్, సురేష్, మల్గొండ, జయసుహాన్ పాల్గొన్నారు.