pay hike
-
మరోసారి టీసీఎస్
న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవ లకు దేశంలో నంబర్ వన్.. టాటా కన్సల్టెన్సీ సర్విసెస్(టీసీఎస్) మరోసారి పటిష్ట ఫలితాలు సాధించింది. మార్చితో ముగిసిన గతేడాది (2023–24)తోపాటు చివరి త్రైమాసికంలోనూ ప్రోత్సాహకర పనితీరు ప్రదర్శించింది. కన్సాలిడేట్ ప్రాతిపదికన క్యూ4 (జనవరి–మార్చి)లో రూ. 12,434 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతక్రితం ఏడాది(2022–23) ఇదే కాలంలో సాధించిన రూ. 11,392 కోట్లతో పోలిస్తే 9 శాతం అధికం. త్రైమాసిక ప్రాతిపదికన(రూ. 11,058 కోట్లు) సైతం 12 శాతంపైగా వృద్ధి నమోదైంది. ఇందుకు మెరుగుపడిన మార్జిన్లు, దేశీ బిజినెస్‌లో వృద్ధి దోహదపడ్డాయి. మొత్తం ఆదాయం వార్షికంగా 3.5 శాతం పుంజుకుని రూ. 61,237 కోట్లను తాకింది. అంతక్రితం రూ. 59,162 కోట్ల టర్నోవర్ సాధించింది. కంపెనీ బోర్డు షేరుకి రూ. 28 చొప్పున వాటాదారులకు మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. పూర్తి ఏడాదిలో.. గత ఆర్థిక సంవత్సరానికి టీసీఎస్ 9 శాతం అధికంగా రూ. 45,908 కోట్ల నికర లాభం ప్రకటించింది. నిర్వ హణ లాభ మార్జిన్లు 1.5 శాతం బలపడి 26 శాతాన్ని తాకా యి. మొత్తం ఆదాయం 7% వృద్ధితో రూ. 2,40,893 కోట్లయ్యింది. టర్నోవర్‌లో అతిపెద్ద మార్కెట్ ఉత్తర అమెరికా వాటా 2.3% తగ్గి 50 శాతానికి పరిమితమైంది. 24.6% నిర్వహణ మార్జిన్లు సాధించింది. దేశీ బిజినెస్ 38% ఎగసింది. దీంతో మొత్తం ఆదాయంలో దేశీ వాటా 5% నుంచి 6.7 శాతానికి బలపడింది. 40ఏళ్లపాటు బాధ్యతలు నిర్వహించిన సీవోవో ఎన్.గణపతి సుబ్రమణ్యం వచ్చే నెలలో పదవీ విరమణ చేయనున్నట్లు కంపెనీ సీఈవో కృతివాసన్ పేర్కొన్నారు. అయితే కొత్త సీవోవోగా ఎవరినీ ఎంపిక చేయబోమని, సీనియర్లకు బాధ్యతలు పంపిణీ చేస్తామని తెలియజేశారు. ఉద్యోగు లకు 4.7% వార్షిక వేతన పెంపును చేపట్టనున్నట్లు హెచ్ఆర్ చీఫ్ మిలింద్ లక్కడ్ వెల్లడించారు. అత్యుత్తమ పనితీరు చూపినవారికి రెండంకెలలో పెంపు ఉంటుందని తెలియజేశారు. ఫలితాల నేపథ్యంలో టీసీఎస్ 0.5% పెరిగి రూ. 4,005 వద్ద ముగిసింది. ఇతర విశేషాలు ► క్యూ4లో కంపెనీ చరిత్రలోనే గరిష్టస్థాయిలో 13.2 బిలియన్ డాలర్ల ఆర్డర్లు పొందింది. ► పూర్తి ఏడాదికి 42.7 బిలియన్ డాలర్ల విలువైన డీల్స్ కుదుర్చుకుంది. ► క్యూ4లో యూకే బీమా దిగ్గజం అవైవాతో 15 ఏళ్ల కాలానికి మెగా డీల్‌ను సాధించింది. ► ఉద్యోగ వలసల (అట్రిషన్) రేటు 13.3 శాతం నుంచి 12.5 శాతానికి దిగివచి్చంది. ► క్యూ4లో సుమారు 2,000 మంది తగ్గడంతో మొత్తం సిబ్బంది సంఖ్య 6,01,546కు చేరింది. ► వరుసగా మూడు త్రైమాసికాలలో మొత్తం 13,249 మంది సిబ్బంది తగ్గారు. ► 2004లో టీసీఎస్ లిస్టింగ్ తదుపరి గతేడాదిలోనే తొలిసారి ఉద్యోగుల సంఖ్యలో కోతపడింది. అనిశ్చితిలోనూ లాభాల మార్జిన్, ఆర్డర్ బుక్ సమర్ధవంత ఎగ్జిక్యూషన్, పటిష్ట బిజినెస్ మోడల్ కంపెనీ విలువను తెలియజేస్తున్నాయి. ప్రపంచ అనిశ్చితిలోనూ కీలకమైన, ప్రాధాన్యతగల అంశాలలో మెరుగైన సేవలను అందించాం. విభిన్న ఆఫరింగ్స్, కొత్తతరహా సామర్థ్యాలు, నాయకత్వ సలహాల ద్వారా కస్టమర్లకు మద్దతిచ్చాం. – కె.కృతివాసన్, సీఈవో, ఎండీ, టీసీఎస్ -
ఉద్యోగులు వణికిపోతుంటే.. సీఈవోకి ఆనందం!
ఉద్యోగులకు వణికిపోతుంటే.. సీఈవోకి ఆనందం ఏంటి అనుకుంటున్నారా? రెండింటికీ సంబంధం లేదు కానీ ఆ అంతర్జాతీయ బ్యాంకింగ్ దిగ్గజంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఇది. వేలాది మంది ఉద్యోగులను తొలంచాలని యోచిస్తున్న సిటీ గ్రూప్ తమ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) జేన్ ఫ్రేజర్ వేతన పరిహారాన్ని మాత్రం పెంచింది. సీఈవో జేన్ ఫ్రేజర్ 2023 వేతన పరిహారం సుమారు 6 శాతం పెరిగి 26 మిలియన్ డాలర్లకు (సుమారు రూ.215 కోట్లు) చేరుకుందని సిటీ గ్రూప్ తాజా ఫైలింగ్‌లో తెలిపింది. ఇందులో ఆమె మూల వేతనం 1.5 మిలియన్ డాలర్లు (సుమారు రూ.12.5 కోట్లు) కాగా 3.7 మిలియన్ డాలర్లు (సుమారు రూ.30 కోట్లు) క్యాష్ బోనస్. మిగిలిన 20.8 మిలియన్ డాలర్లు (సుమారు రూ.172 కోట్లు) పర్ఫామెన్స్ ఆధారిత స్టాక్స్ అని ఫైలింగ్ ద్వారా తెలుస్తోంది. 2008 ఆర్థిక సంక్షోభం నుంచి కంపెనీ సంస్థాగత, నిర్వహణలో మార్పులను అమలు చేయడంలో, అంతర్జాతీయంగా వ్యాపార వృద్ధిలో ఫ్రేజర్ చేసిన కృషి ఆధారంగా వేతన పరిహారాన్ని నిర్ణయించినట్లు బ్యాంక్ బోర్డు పేర్కొంది. ఇతర బ్యాంకింగ్ సంస్థల్లోనూ సీఈవోల వేతన పరిహారాలు ఇటీవల పెరిగాయి. జేపీ మోర్గాన్ చేజ్ సీఈవో జామీ డిమోన్ పరిహారం 4.3 శాతం, మోర్గాన్ స్టాన్లీస్ మాజీ సీఈవో జేమ్స్ గోర్మాన్ 17 శాతం పెరిగాయి. ఇక గోల్డ్‌మ్యాన్ సాచ్స్ సీఈవో వేతన పరిహారమైతే ఏకంగా 24 శాతం పెరిగింది. యూఎస్ మల్టీనేషన్ ఇన్వెస్టర్ బ్యాంకు సిటీ గ్రూప్ గత నెలలో ప్రకటించిన త్రైమాసిక ఫలితాల్లో భారీ నష్టాలను పోస్ట్ చేసింది. దాదాపు రూ.15 వేలకోట్ల మేర నష్టాలు నమోదైనట్లు రిగ్యులేటరీకు రిపోర్ట్ చేసింది. కంపెనీ బ్యాలెన్స్ షీట్లో నష్టాలు, నిర్వహణ ఖర్చులను తగ్గించుకోవడం కోసం రాబోయే రెండేళ్లలో కనీసం 20,000 ఉద్యోగాల్లో కోత విధించాలని యోచిస్తోంది. -
ఆ జాబ్ పోతేనేం, మూడు రోజుల్లో..భారీ ఆఫర్: ఓ మహిళ స్టోరీ వైరల్
న్యూఢిల్లీ: ట్విటర్, గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ కంపెనీలు సహా, అనేక కంపెనీల్లో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతూనే ఉన్నాయి ఉద్యోగాన్ని కోల్పోయిన చాలామంది తమ మనోభావాలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. తాజాగా ఒక మహిళ అనుభవం వైరల్‌గా మారింది. ఉద్యోగాన్ని కోల్పోయిన మూడు రోజులకే.. 50 శాతం పెంపుతో జీతం, వర్క్ ఫ్రం హోం ఆప్షన్, ఇతర ప్రయోజనాలతో మరో జాబ్ఆఫర్ కొట్టేశారు. ఈ స్టోరీ ఇపుడు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. babyCourtfits అనే మహిళన తన అనుభవాన్ని ట్విటర్లో షేర్ చేశారు. మంగళవారం తొలగించారు. శుక్రవారం 50 శాతం ఎక్కువ వేతనం, WFH, ఇతర ఆఫర్లతో కొత్త జాబ్వ చ్చిందంటూ పేర్కొన్నారు. ఈ ట్వీట్ 7.1 మిలియన్ల వ్యూస్‌ను 5వేలక పైగా రీట్విట్లు, వందల కామెంట్లను సాధించింది. ఎపుడూ మనపై మనకుండే విశ్వాసానికి ఇదొక రిమైంటర్. మనం ఎవరో, ఎలా ఉండాలో శాసించేలా ఇతరులకు అవకాశం ఇవ్వొద్దు. చాలా రోజులుగా ఆత్మన్యూనతలో గడిపిన తర్వాత ఈ మాట చెబుతున్నానన్నారు. అంతేకాదు క్లిష్ట సమయంలో తనకు మద్దతిచ్చిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. సపోర్టివ్ మెసేజెస్ పంపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పారు. గతవారం చాలా కష్టంగా నడిచింది. కానీ తాను స్ట్రాంగ్ విమెన్ని అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఆమెకు ట్విటర్లో అభినందనల వర్షం కురుస్తోంది. Life update: I was fired on Tuesday. On Friday I got a job offer that pays me 50% more, WFH option, and more PTO. — babyCourtfits (@2020LawGrad) January 29, 2023 -
జీతం సరిపోట్లేదు... సమ్మె బాటపట్టిన టీచర్లు, లెక్చరర్లు తపాలా సిబ్బంది..
లండన్: పెరుగుతున్న జీవన వ్యయానికి తగ్గట్లుగా వేతనాలను పెంచాలని కోరుతూ యూకేలో వేల సంఖ్యలో పోస్టల్ సిబ్బంది, యూనివర్సిటీ లెక్చరర్లు, స్కూల్ టీచర్లు గురువారం సమ్మెకు దిగారు. ఇప్పటికే వివిధ రంగాల సిబ్బంది సమ్మెల్లో పాల్గొనడంతో దేశంలో రవాణా వ్యవస్థ స్తంభించింది. వీధుల్లో చెత్తాచెదారం గుట్టలుగా పేరుకుపోయింది. ఇటీవల లాయర్లు, నర్సులు కూడా పలుమార్లు విధులను బహిష్కరించారు. గురువారం యూనివర్సిటీల్లో 70 వేల మంది లెక్చరర్లు బోధన విధులను బహిష్కరించారు. ఈ నెల 30వ తేదీన మరోసారి స్ట్రైక్ చేస్తామని తెలిపారు. సమ్మె ప్రభావం సుమారు 25 లక్షల మంది విద్యార్థులపై పడింది. స్కాట్లాండ్లో టీచర్ల సమ్మెతో దాదాపు సూళ్లన్నీ మూతబడ్డాయి. రాయల్ మెయిల్ ఉద్యోగులు గురు, శుక్రవారాలతోపాటు క్రిస్టమస్ రోజున కూడా సమ్మెకు దిగుతామన్నారు. చదవండి: మలేసియా నూతన ప్రధానిగా అన్వర్ ఇబ్రహీం.. మద్ధతు ఇచ్చిన బద్ధ శత్రువు -
టీసీఎస్ ఉద్యోగులకు వేతన పెంపు
ముంబై : కోవిడ్-19తో ఆర్థిక మందగమనం కార్పొరేట్ కంపెనీలను వణికిస్తుంటే తమ ఉద్యోగులందరికీ వేతన పెంపు చేపట్టనున్నట్టు టెక్ దిగ్గజం టీసీఎస్ ప్రకటించింది. కంపెనీలోని అన్ని విభాగాల ఉద్యోగుల వేతనాలను పెంచనున్నట్టు టీసీఎస్ హెచ్ఆర్ వర్గాలు పేర్కొన్నాయని ఓ జాతీయ వెబ్సైట్ వెల్లడించింది. కంపెనీ గతంలో ఇచ్చిన తరహాలోనే అదే ఆనవాయితీని కొనసాగిస్తూ వేతన పెంపును చేపట్టినట్టు టీసీఎస్ హెచ్ఆర్ అధికారి స్పష్టం చేశారు. కరోనా వైరస్ వ్యాప్తితో ఆర్థిక వ్యవస్థ కుదేలైన క్రమంలో ఐటీ కంపెనీలు కొద్దినెలలుగా వ్యయ నియంత్రణ చర్యలు చేపడుతున్నాయి. చదవండి : టీసీఎస్ మరో బంపర్ బైబ్యాక్ కరోనా కట్టడికి విధించిన దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో వాణిజ్య, ఆర్థిక రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పలు కంపెనీలు లేఆఫ్‌లు, వేతన కోతలు విధించడంతో పాటు ఏడాది పాటు ప్రమోషన్లు, వేతన పెంపులను నిలిపివేసిన నేపథ్యంలో టీసీఎస్ వేతన పెంపును చేపట్టడం ఐటీ రంగానికి తీపికబురుగా మారింది. మరోవైపు టీసీఎస్‌లో నియామకాల ప్రక్రియా ఊపందుకుంది. భారత్‌లో 7,000 మంది ట్రైనీలను, అమెరికాలో 1000 మందిని ట్రైనీలను నియమించుకోనుంది. -
భారీగా పెరిగిన టీసీఎస్ సీఈవో వేతనం
ముంబై : దేశంలో అతిపెద్ద టెక్ దిగ్గజంగా పేరున్న టీసీఎస్‌ను నడిపిస్తున్న సీఈవో రాజేష్ గోపినాథన్ వేతనం భారీగా పెరిగింది. ఆయన వేతానాన్ని గతేడాది కంటే ఈ ఏడాది రెండింతలు చేసింది ఆ కంపెనీ. 2018 ఆర్థిక సంవత్సరంలో గోపినాథన్ దాదాపు రూ.12 కోట్లకు పైగా ఆర్జించారని, ఇది 2017 ఆర్థిక సంవత్సరానికి రెండింతలు ఎక్కువని కంపెనీ తన వార్షిక రిపోర్టులో వెల్లడించింది. టాప్ జాబ్‌కు ఆయన్ను ఎంపిక చేసిన అనంతరమే ఈ పెంపును కంపెనీ భారీగా చేపట్టింది. అంతకముందు గోపినాథన్ టీసీఎస్‌లో చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్‌గా పనిచేసేవారు. గోపినాథన్ అందుకునే రెమ్యునరేషన్లో రూ.1.02 కోట్ల బేస్ శాలరీ, రూ.10 కోట్ల కమిషన్, రూ. 86.8 లక్షల ఇతర అలవెన్స్‌లు, ఇతరాత్రవి ఉన్నాయి. 2017 ఆర్థిక సంవత్సరంలో ఆయన కేవలం రూ.6.2 కోట్లను మాత్రమే ఇంటికి తీసుకెళ్లేవారు. ప్రస్తుతం గోపినాథన్ పుచ్చుకుంటున్న రెమ్యునరేషన్, సాధారణ టీసీఎస్ ఉద్యోగి అందుకునే రెమ్యునరేషన్ ఆర్జించే స్థాయి కంటే 212 సార్లు ఎక్కువ. ఇతర ఎగ్జిక్యూటివ్‌లు, నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల వేతనాలను కూడా కంపెనీ బయటికి విడుదల చేసింది. వారిలో టాప్‌లో రెండో స్థానంలో ఉన్న సీఓఓ ఎన్ గణపతి సుబ్రహ్మణ్యం రూ.9 కోట్లకు పైగా రెమ్యునరేషన్ పొందుతున్నట్టు తెలిసింది. ఈయన కూడా ముందటి ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ.6.15 కోట్లను మాత్రమే పరిహారాలుగా పొందేవారు. 2017 ఫిబ్రవరిలోనే వీరిద్దరూ తమ బాధ్యతలను స్వీకరించారు. గోపినాథన్ 2001 నుంచి టీసీఎస్‌లో పనిచేస్తున్నారు. 2013 ఫిబ్రవరిలో కంపెనీ సీఎఫ్ఓగా ఎంపికయ్యారు. టాటా ఇండస్ట్రీస్‌లో కూడా పనిచేసిన అనుభవం ఈయనకు ఉంది. మార్చి క్వార్టర్ ఫలితాల సందర్భంగా క్వార్టర్లీ ఇచ్చే వేరియబుల్ పేను 120 శాతం ఆఫర్ చేస్తున్నట్టు ప్రకటించింది. తమకు వచ్చిన మెరుగైన క్వార్టర్ ఫలితాల ప్రయోజనాలను ఉద్యోగులకు చేరవేస్తామని తెలిపింది. 2019 ఆర్థిక సంవత్సరంలో వేతన పెంపులు 2 శాతం నుంచి 6 శాతం వరకు ఉంటాయని కంపెనీ చెప్పింది. -
టాప్ ఐటీ బాస్‌లకు ముఖేశ్ అంబానీ సందేశం
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత , బిలియనీర్ ముఖేశ్ అంబానీ మరోసారి తన ప్రత్యేకతను నిలబెట్టుకున్నారు. కంపెనీ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా తాను తీసుకుంటున్న వేతనంలో ఎలాంటి మార్పులేకుండా ఈ ఏడాది కూడా నిర్ణయం తీసుకున్నారు. వరుసగా తొమ్మిదో సం.రం కూడా రూ.15 కోట్ల వార్షిక వేతనానికి పరిమితమయ్యారు. అలాగే ఇతర బోర్డు డైరెక్టర్లు పొందుతున్న స్టాక్ ఆప్షన్‌ను కూడా ఆయన తీసుకోవడం లేదు. మరోవైపు కంపెనీ లోని ఇతర అధికారుల వార్షిక ఇంక్రిమెంట్ పెంపును మాత్రం గణనీయంగా అమలు చేయడం విశేషం. 2008-09 నుండి రూ .15 కోట్లతో తన జీతం, ఇతర ఆదాయం కలిపి మొత్తం వార్షిక ఆదాయం దాదాపు 24 కోట్ల రూపాయలు. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వేతనం మొత్తం రూ. 38.75 కోట్లకు చేరుకుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వార్షిక నివేదిక ప్రకటనలో పేర్కొంది. 2009లో తన వార్షిక వేతనంపై అంబానీ స్వచ్ఛందంగా పరిమితి విధించుకున్నారు. పరిమితి గత తొమ్మిదేళ్లుగా ఇది అలాగే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 2007-08 సంవత్సరానికిగాను రూ.44కోట్ల వార్షిక వేతనంతో అత్యధిక వేతనం తీసుకుంటున్న టాప్ ఎగ్జిక్యూటివ్‌గా ముఖేశ్ అంబానీ నిలిచారు. మరోవైపు ఇన్ఫోసిస్ టాప్ ఎగ్జిక్యూటివ్ భారీగా పెరుగుతూ వుండటంపై ఇన్ఫీ ఫౌండర్స్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అంబానీ నిర్ణయం ఆకర్షణీయంగా నిలిచింది. ముఖ్యంగాఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్.ఆర్.నారాయణ మూర్తి వ్యాఖ్యల్ని నిపుణులు గుర్తు చేశారు. ఎంట్రీ లెవల్ అధికారులను తొలగించటానికి బదులుగా ముఖేష్ అంబానీ నిర్ణయాన్ని ఆదర్శంగా తీసుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా యువత ఉద్యోగాలను రక్షించుకోవాలంటే సీనియర్ మేనేజ్మెంట్ ఉద్యోగులు తమ వేతనాల్లో కోత విధించుకోవాలని నారాయణ మూర్తి భావించిన సంగతి తెలిసిందే. -
ప్రొఫెసర్లకు గుడ్ న్యూస్
న్యూఢిల్లీ : ఉన్నత విద్యాసంస్థల ఫ్యాకల్టీ, స్టాఫర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. ఎన్నో రోజుల నుంచి వేచిచూస్తున్న వేతనాల సవరణను ప్రభుత్వం చేపడుతోంది. ఈ సవరణతో ఉద్యోగుల వేతనాలు సగటును 15 శాతం మేర పెరుగనున్నాయి. గురుపూర్ణిమ(జూలై9) సందర్భంగా వీరికి గుడ్ న్యూస్ చెప్పాలని ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ ప్రతిపాదనను సిద్ధం చేసిన మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ దీన్ని కేబినెట్ ముందుకు తీసుకువస్తోంది. దీనిపై కేబినెట్ ఆమోదం తెలుపగానే, దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర, రాష్ట్ర యూనివర్సిటీలకు చెందిన ఎనిమిది లక్షల మంది ఫ్యాకల్టీ, స్టాఫ్ కు 15 శాతం మేర వేతనాలు పెరుగనున్నాయని తెలిసింది. కేంద్ర, రాష్ట్ర యూనివర్సిటీలతో పాటు ఐఐటీలు, ఐఐఎంలు, ఎన్ఐటీలు, ఐఐఎస్ఈఆర్ల ఫ్యాకల్టీ, స్టాఫ్ లకు కూడా ఈ మేరకునే వేతనాలను పెంచనున్నట్టు అధికార వర్గాలు చెప్పాయి. ఈ వేతనాల పెంపుతో ప్రభుత్వంపై మూడేళ్ల వరకు రూ.75వేల కోట్ల భారం పడనుందని వెల్లడైంది. ఈ విషయంపై పీఎంఓ సోమవారమే సమావేశం ఏర్పాటుచేసింది. చివరి సారిగా వీరి వేతనాలను 2006లో పెంచారు. సివిల్ సర్వెంట్ కంటే అధికంగా వీరి వేతనాలు అప్పట్లో పెంచారు. ఈ వేతనాల పెంపుతో రాష్ట్రప్రభుత్వానికి చెందిన కాలేజీలు, యూనివర్సిటీల 7.5-8లక్షల మంది ఫ్యాకల్టీ, స్టాఫ్ కు ప్రయోజనం చేకూరనుంది. అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీలకు చెందిన 30వేల మంది ఉద్యోగులకు, కేంద్రప్రభుత్వంతో నడిచే టెక్నికల్ ఇన్ స్టిట్యూట్స్ కు చెందిన 30వేల మందికి ప్రయోజాలను చేకూరనున్నట్టు తెలిసింది. వచ్చే మూడేళ్ల వరకు ఈ వేతనాల పెంపు అమలు ఉంటుందని, 7వ వేతన సంఘ సిఫారసుల మేరకే వీరికి సగటున 15 శాతం ఇంక్రిమెంట్ చేపడుతున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే 20 శాతం వరకు పెంపు చేపట్టాలని యూజీసీ రిపోర్టు చేసింది. -
టెక్ దిగ్గజం ఇన్ఫీలో మళ్లీ 'ప్యాకేజీ' రగడ
బెంగళూరు : టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ రాజుకున్న ప్యాకేజీ రగడ ఇంకా సద్దుమణగలేదు. మరోసారి ఎగ్జిక్యూటివ్ లకు చెల్లించే వేతనాలపై కంపెనీ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి అసంతృప్తి వ్యక్తంచేశారు. అయితే ఈ సారి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ యూబీ ప్రవీణ్ రావుకు పెంచిన పరిహారాలపై ఆయన మండిపడ్డారు. టాప్-లెవల్ వ్యక్తులకు పెంచే పరిహారాలు, ఇతర ఉద్యోగులకు పెంచే వేతనాలు సరిగ్గా లేవని ఉద్దేశిస్తూ నారాయణమూర్తి ఆదివారం ఓ లేఖ రాశారు. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ యూబీ ప్రవీణ్ రావుకు వేతన పెంపు విషయంలో జరిగిన ప్రమోటర్ల ఓటింగ్ ఫలితాల అనంతరం నారాయణమూర్తి తన అభిప్రాయాన్ని బహిర్గతం చేశారు. అయితే యూబీ ప్రవీణ్ రావుకు వేతనం పెంచడానికి కేవలం 24 శాతం ప్రమోటర్లు మాత్రమే అంగీకారం తెలిపారు. మిగతావారు ఓటింగ్ కు దూరంగా ఉన్నారని బొంబై స్టాక్ ఎక్స్చేంజ్ కు ఆదివారం సమర్పించిన పోస్టల్ బ్యాలెట్లో ఫలితాల్లో వెల్లడైంది. రావుకు వార్షికంగా స్థిర పరిహారాల కింద రూ.4.62 కోట్లు, వేరియబుల్ పరిహారాల కింద రూ.3.88 కోట్లు చెల్లించాలని కంపెనీ నిర్ణయించినట్టు ఇన్ఫోసిస్ గత అక్టోబర్ లో ప్రకటించింది. ఫిబ్రవరి 23న దీనిపై ఓటింగ్ వచ్చింది. శుక్రవారంతో ఈ ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. ఈ ఓటింగ్ ప్రక్రియపైన మూర్తి ఆదివారం స్పందిస్తూ...'' కంపెనీలో చాలామంది వ్యక్తులకు పరిహారాలు కేవలం 6 శాతం నుంచి 8 శాతం పెంచుతున్నప్పుడు టాప్ -లెవల్ వ్యక్తులకు 60 శాతం నుంచి 70 శాతం పరిహారాలు పెంచుతున్నారు. నా అభిప్రాయం ప్రకారం ఇది అనైతికం'' అని బోర్డుకు చురకలంటించారు. ఇది కంపెనీ మేనేజ్మెంట్, బోర్డులపై ఉద్యోగులకున్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని హరిస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ పోస్టల్ బ్యాలెట్ విషయంలో డీఎన్ ప్రహ్లాద్ ను స్వతంత్ర డైరెక్టర్ గా నియమించేందుకు ఓటింగ్ వేయాలని కోరింది. కంపెనీ సీఈవో విశాల్ సిక్కా ప్యాకేజీ పెంపు విషయంలో కూడా వ్యవస్థాపకులు బోర్డు సభ్యుల నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. -
వేతనాల పెంపు హర్షణీయం
నారాయణఖేడ్: కొన్ని సంవత్సరాలుగా తెంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో పార్ట్ టైం ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న ఉద్యోగుల వేతనాలను ప్రభుత్వం పెంచడం హర్షణీయమని పార్ట్‌టైం ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జే శర్ణప్ప, జిల్లా అధ్యక్షుడు నర్వ పండరి, ప్రధాన కార్యదర్శి బాల్‌రాజ్, కోశాధికారి రవి పేర్కొన్నారు. శనివారం వారు స్థానిక విలేకరులతో మాట్లాడారు. అనేక సంవత్సరాల నుంచి అతి తక్కువ వేతనంతో కష్ట నష్టాలకు ఓర్చి విద్యార్థుల బాగోగుల కోసం తాము నిరంతరం కృషి చేశామన్నారు. తమ కష్టాన్ని గుర్తించి సీఎం కేసీఆర్, విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి, గురుకులాల కార్యదర్శి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్, ప్రిన్సిపాల్ సెక్రటరరీ ఎక్కాకు, గురుకుల పాఠశాలల జేఏసీ నాయకులు రంగారెడ్డి, రవీందర్‌రెడ్డి, బాల్‌రాజ్, యాదయ్య, నరేందర్, కాశీనాథ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. పీఈటీలుగా పని చేస్తున్న ఉపాధ్యాయులకు రూ.12,500లు, అటెండర్లకు రూ.10,500 పెంచాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో నాయకులు అమృత్, కె.పండరి, నరేష్కుమార్, సురేష్, మల్గొండ, జయసుహాన్ పాల్గొన్నారు. -
అంగన్వాడీల వయోపరిమితి పెంపు
హైదరాబాద్ :ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పని చేస్తున్న అంగన్వాడీలకు శుభవార్త. అంగన్ వాడీ కార్యకర్తలకు, సహాయకులకు వయోపరిమితిని పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వారి గరిష్ట వయోపరిమితి 60 ఏళ్లుగా నిర్ణయిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. అరవై ఏళ్లు పూర్తయిన అంగన్ వాడీ కార్యకర్తలకు రూ. 50 వేలు, సహాయకులకు రూ.20 వేలను పదవీ విరమణ ప్రయోజనంగా ఇవ్వాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. -
‘అంగన్వాడీ’ వేతనాలు పెంపు
హైదరాబాద్: సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐసీడీఎస్)లో పని చేస్తున్న అంగన్వాడీ వర్కర్లు, సహాయకులకు గౌరవ వేతనాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వేతన పెంపుతో పాటు వర్కర్లు, హెల్పర్లు నిర్వహించాల్సిన విధులు, బాధ్యతలు, క్రమశిక్షణ చర్యలకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేసింది. మార్చి ఒకటో తేదీ నుంచే వేతన పెంపు అమల్లోకి వస్తుందని, వేతనాలను నేరుగా బ్యాంకు ఖాతాలకే జమ చేయాలని సీడీపీవోలను ప్రభుత్వం ఆదేశించింది. ఏడాదికి 12 క్యాజువల్ సెలవులతో పాటు ప్రత్యేక పరిస్థితుల్లో సెలవు అవకాశాలను కూడా కల్పించింది. కాగా, ఆరోగ్యలక్ష్మి పథకం కింద గర్భిణులు, బాలింతలకు ఒకపూట ఆహారాన్ని అంగన్వాడీల్లోనే అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం అంగన్వాడీల్లో అందిస్తున్న ఆహార పరిమాణాన్ని, ధరలను పెంచుతూ ప్రభుత్వం మరో ఉత్తర్వును జారీ చేసింది. ప్రతిరోజూ ఒక్కో వ్యక్తికి అందించే ఆహార పరిమాణం పెంచడంతో పాటు ప్రస్తుతం వ్యయాన్ని రూ.15 నుంచి రూ.21 కు పెంచింది. అంగన్వాడీల్లో విధులిలా.. అంగన్వాడీ కేంద్రాల్లో వర్కర్లకు 24 రకాలు, హెల్పర్లకు 7 రకాల విధులను సూచిస్తూ ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. అంగన్వాడీ కేంద్రాన్ని ప్రతిరోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించాలి. చిన్నారులకు ఉడకబెట్టిన గుడ్లను ప్రతిరోజూ ఉదయం 10 గంటలకు పంపిణీ చేయాలి. ప్రత్యేక రోజుల్లో బాలామృతం, 8 గుడ్లు ఇవ్వాలి. ఇమ్యునైజేషన్, డీవార్మింగ్ నిమిత్తం ఏఎన్ఎంలు, ఆశావర్కర్లను భాగస్వాములు చేయాలి. ఐసీడీఎస్ వేదికల (ఐజీఎంఎస్‌వై, ఆర్ ఎస్బీకే,కేఎస్‌వై.. తదితర)తో సమన్వయం చేసుకోవాలి. అంగన్వాడీ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచాలి, పరిశుభ్రమైన ఆహారాన్ని పంపిణీ చేయాలి. చిన్నారులను అంగన్వాడీ కేంద్రాలకు తీసుకురావాలి. అంగన్వాడీ వర్కర్లు చెప్పిన విధులను నిర్వహించాలి. ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలనైనా నిర్వహించేందుకు వర్కర్లు, హెల్పర్లు సిద్ధంగా ఉండాలి.