టాప్ ఐటీ బాస్‌లకు ముఖేశ్ అంబానీ సందేశం
టాప్ ఐటీ బాస్‌లకు ముఖేశ్ అంబానీ సందేశం
Published Wed, Jun 28 2017 4:00 PM | Last Updated on Tue, Sep 5 2017 2:42 PM
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత , బిలియనీర్ ముఖేశ్ అంబానీ మరోసారి తన ప్రత్యేకతను నిలబెట్టుకున్నారు. కంపెనీ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా తాను తీసుకుంటున్న వేతనంలో ఎలాంటి మార్పులేకుండా ఈ ఏడాది కూడా నిర్ణయం తీసుకున్నారు. వరుసగా తొమ్మిదో సం.రం కూడా రూ.15 కోట్ల వార్షిక వేతనానికి పరిమితమయ్యారు. అలాగే ఇతర బోర్డు డైరెక్టర్లు పొందుతున్న స్టాక్ ఆప్షన్‌ను కూడా ఆయన తీసుకోవడం లేదు. మరోవైపు కంపెనీ లోని ఇతర అధికారుల వార్షిక ఇంక్రిమెంట్ పెంపును మాత్రం గణనీయంగా అమలు చేయడం విశేషం.
2008-09 నుండి రూ .15 కోట్లతో తన జీతం, ఇతర ఆదాయం కలిపి మొత్తం వార్షిక ఆదాయం దాదాపు 24 కోట్ల రూపాయలు. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వేతనం మొత్తం రూ. 38.75 కోట్లకు చేరుకుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వార్షిక నివేదిక ప్రకటనలో పేర్కొంది. 2009లో తన వార్షిక వేతనంపై అంబానీ స్వచ్ఛందంగా పరిమితి విధించుకున్నారు. పరిమితి గత తొమ్మిదేళ్లుగా ఇది అలాగే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 2007-08 సంవత్సరానికిగాను రూ.44కోట్ల వార్షిక వేతనంతో అత్యధిక వేతనం తీసుకుంటున్న టాప్ ఎగ్జిక్యూటివ్‌గా ముఖేశ్ అంబానీ నిలిచారు.
మరోవైపు ఇన్ఫోసిస్ టాప్ ఎగ్జిక్యూటివ్ భారీగా పెరుగుతూ వుండటంపై ఇన్ఫీ ఫౌండర్స్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అంబానీ నిర్ణయం ఆకర్షణీయంగా నిలిచింది. ముఖ్యంగాఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్.ఆర్.నారాయణ మూర్తి వ్యాఖ్యల్ని నిపుణులు గుర్తు చేశారు. ఎంట్రీ లెవల్ అధికారులను తొలగించటానికి బదులుగా ముఖేష్ అంబానీ నిర్ణయాన్ని ఆదర్శంగా తీసుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ముఖ‍్యంగా యువత ఉద్యోగాలను రక్షించుకోవాలంటే సీనియర్ మేనేజ్మెంట్ ఉద్యోగులు తమ వేతనాల్లో కోత విధించుకోవాలని నారాయణ మూర్తి భావించిన సంగతి తెలిసిందే.
Advertisement
Advertisement