మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని గజ్వేల్, వర్గల్, తూప్రాన్, కొండపాక, జగదేవ్‌పూర్ మండల కేంద్రాల్లో రూ. 100 కోట్లతో కొత్తగా ఎస్సీ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణం
గజ్వేల్ : మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని గజ్వేల్, వర్గల్, తూప్రాన్, కొండపాక, జగదేవ్‌పూర్ మండల కేంద్రాల్లో రూ. 100 కోట్లతో కొత్తగా ఎస్సీ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖామంత్రి హరీష్‌రావు ప్రకటించారు. గురువారం గజ్వేల్ మండలం అహ్మదీపూర్‌లో పెద్ద చెరువు మినీట్యాంక్‌బండ్‌గా మార్చే పనులకు, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో ఆయన మాట్లాడుతూ ఎస్సీల విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్తశుద్దితో కృషి చేస్తున్నారని తెలిపారు. ఆయన ఈ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని పేర్కొన్నారు. ఈ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని వెల్లడించారు.