Industrial sector
-
ప్రపంచం చూపు.. భారత్ వైపు
న్యూఢిల్లీ: ప్రపంచమంతా భారత్‌ను నమ్మకమైన భాగస్వామిగా చూస్తోందని, ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి భారీ స్థాయిలో చర్యలు చేపట్టాలని పారిశ్రామిక రంగానికి ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. తయారీ రంగాన్ని, ఎగుమతులను మరింతగా ప్రోత్సహించేందుకు త్వరలోనే ప్రభుత్వం రెండు పథకాలను ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. నియంత్రణలు, పెట్టుబడులు, సులభతరమైన వ్యాపార నిర్వహణకు సంబంధించిన సంస్కరణలపై బడ్జెట్ తదనంతర వెబినార్‌లో మాట్లాడుతూ ఆయన ఈ అంశాలను పేర్కొన్నారు.ప్రపంచ డిమాండ్‌ను తీర్చగలిగేలా భారత్‌లో తయారు చేయగల కొత్త ఉత్పత్తులను గుర్తించాలని పారిశ్రామికవేత్తలను ఆయన కోరారు. ‘దీన్ని సాకారం చేసే సత్తా మన దేశానికి, మీకు (పరిశ్రమలు) ఉంది. ఇదొకొ గొప్ప అవకాశం. ప్రపంచ ఆకాంక్షల విషయంలో మన పరిశ్రమలు ప్రేక్షక పాత్ర వహించకుండా, అందులో కీలకపాత్ర పోషించాలి. మీకు మీరే అవకాశాలను అందింపుచ్చుకోవాలి’ అని పారిశ్రామికవేత్తలకు మోదీ సూచించారు. ‘భారత్ ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వృద్ధి ఇంజిన్‌గా నిలుస్తోంది. అందుకే ప్రతి దేశం భారత్‌తో ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాలనుకుంటోంది. మన తయారీ రంగం దీన్ని సద్వినియోగం చేసుకోవాలి’ అని పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈలకు చౌక రుణాలివ్వాలి... దేశవ్యాప్తంగా ఉన్న ఆరు కోట్ల సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థ (ఎంఎస్ఎంఈ)లకు సకాలంలో, తక్కువ వడ్డీ రేట్లకు నిధులను అందించే దుకు కొత్త తరహా రుణ పంపిణీ విధానాలను రూపొందించాల్సిన అవసరం ఉందని మోదీ నొక్కి చెప్పారు. 5 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ మహిళా ఎంట్రప్రెన్యూర్లకు తొలిసారిగా రూ. 2 కోట్ల వరకు రుణాలను అందించనున్నట్లు తెలిపారు. ఎంఎస్ఎంఈలకు కేవలం రుణాలివ్వడమే కాకుండా, మార్గనిర్దేశం, తోడ్పాటు అందించేలా మెంటార్షిప్ ప్రోగ్రామ్‌లను రూపొందించాలన్నారు. ఏ దేశ ప్రగతికైనా మెరుగైన వ్యాపార పరిస్థితులు చాలా కీలకమని, అందుకే తమ ప్రభుత్వం కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో 40,000కు పైగా నిబంధనల అమలు అడ్డంకులను తొలగించిందన్నారు. జనవిశ్వాస్ 2.0 చట్టాన్ని తీసుకొస్తామని చెప్పారు. బడ్జెట్లో ఎంఎస్ఎంఈ రుణాలపై గ్యారంటీ కవరేజీని రెట్టింపు స్థాయిలో రూ.20 కోట్లకు పెంచామని, వర్కింగ్ క్యాపిటల్ అవసరాల నిమిత్తం రూ.5 లక్షల వరకు పరిమితితో క్రెడిట్ కార్డులను అందించనున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. -
ఇండ్రస్టియల్ ఆల్కహాల్‌పై చట్టాలు చేసే హక్కు రాష్ట్రాలదే
న్యూఢిల్లీ: పారిశ్రామిక(ఇండ్రస్టియల్) ఆల్కహాల్ ఉత్పత్తి, సరఫరా నియంత్రపై చట్టాలు చేసే చేసే అధికారం రాష్ట్రాలకే ఉందని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. 1990లో ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఇచి్చన తీర్పును కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం బుధవారం ఈ మేరకు తీర్పు వెలువరించింది. రాష్ట్రాలకు ఈ విషయంలో ఉన్న అధికారాన్ని తొలగించలేమని తేలి్చచెప్పింది. ఇండస్ట్రియల్ ఆల్కహాల్ ఉత్పత్తి, సరఫరాపై నియంత్రణ అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదని ధర్మాసనం వెల్లడించింది. తొమ్మిది మంది సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం 8:1 మెజారీ్టతో బుధవారం తీర్పును ప్రకటించింది. అయితే, ఈ తీర్పుతో ధర్మాసనంలోని జస్టిస్ నాగరత్న విభేదించారు. 1990లో సింథటిక్స్, కెమికల్స్ కేసులో అప్పటి ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఇండ్రస్టియల్ ఆల్కహాల్ ఉత్పత్తిని నియంత్రించే అధికారం కేంద్రానికి ఉందని తీర్పు ఇచి్చంది. దీనిపై పలు అభ్యంతరాలు వచ్చాయి. 2010లో ఈ అంశాన్ని తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనానికి సమీక్ష కోసం పంపించారు. ఇండస్ట్రియల్ ఆల్కహాల్ అనేది మానవ వినియోగం కోసం కాదని ఈ ధర్మాసనం పేర్కొంది. -
చిన్న పరిశ్రమలపై భారీ ఆశలు
సాక్షి, హైదరాబాద్: పారిశ్రామిక రంగం పురోగతి, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, ఉద్యోగాల కల్పన, ప్రపంచ మార్కెట్‌తో పోటీ పడటం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఆరు ప్రత్యేక విధానాలకు రూపకల్పన చేస్తోంది. ఎంఎస్ఎంఈలు, ఎగుమతులు, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రిక్ వాహనాలు, మెడికల్ టూరిజం, గ్రీన్ ఎనర్జీకి సంబంధించి ఆరు విధానాల రూపకల్పనకు కసరత్తు జరుగుతోంది. ఈ క్రమంలోనే ‘సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) పాలసీ–2024’ను సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం ఆవిష్కరించనున్నారు. ఎంఎస్ఎంఈల స్థాపన, అభివృద్ధి దిశగా ఈ విధానం ఉంటుందని, కొత్త పాలసీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తుందని పరిశ్రమల శాఖ వర్గాలు చెప్తున్నాయి. ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటున్న సమస్యలకు కొత్త పాలసీ పరిష్కారం చూపుతుందనే ఆశలు రేకెత్తుతున్నాయి.ఐదు అంశాలకు పెద్దపీట: రాష్ట్రం శరవేగంగా ఆర్థికాభివృద్ధిని సాధించడంలో ఎంఎస్ఎంఈలు కీలక పాత్ర పోషిస్తాయని రాష్ట్ర ప్రభుత్వ భావిస్తోంది. ఈ నేపథ్యంలో 15కు పైగా పారిశ్రామిక సంఘాలను భాగస్వాములను చేస్తూ నిపుణుల నుంచి వందకు పైగా సలహాలు, సూచనలు స్వీకరించి ‘ఎంఎస్ఎంఈ పాలసీ 2024’ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించారు. ఇందులో ఐదు అంశాలకు పెద్దపీట వేసినట్లు సమాచారం. ‘ఎస్సీ, ఎస్టీలు, మహిళలు సహా అందరికీ లబ్ధి’, ‘అన్ని ప్రాంతాల్లో ఎంఎస్ఎంఈలు సమరీతిలో అభివృద్ధి’, ‘ఉత్పాదక సామర్థ్యం పెంపుదల’, ‘ఉపాధి కల్పన పెంచడం’, ‘టెక్నాలజీ ఆధునీకరణ’కు ప్రాధాన్యతను ఇవ్వనున్నారు. ఎంఎస్ఎంఈల సవాళ్లకు పరిష్కారం: భూమి, నిధులు, ముడి సరుకులు, కారి్మకులు, సాంకేతికత, మార్కెటింగ్ తదితర రూపాల్లో ఎంఎస్ఎంఈలు అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. ఈ సవాళ్ల పరిష్కారం కోసం నూతన పాలసీలో అనేక ప్రతిపాదనలు రూపొందించినట్లు తెలిసింది. ఎంఎస్ఎంఈ ల అభివృద్ధి కేంద్రాలు, కామన్ ఫెసిలిటీ సెంటర్లు, ప్రత్యేక ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తారు. ఇందులో మహిళలకు 10 శాతం వరకు రిజర్వేషన్లు కలి్పంచే అవకాశం ఉంది. మూల ధన పెట్టుబడిపై సబ్సిడీ, నైపుణ్య శిక్షణ కోసం ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’లో ఎంఎస్ఎంఈలకు ఉపయోగపడే కోర్సులు వంటివి ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఉన్న ఎంఎస్ఎంఈల్లో సాంకేతికత ఆధునీకరణ కోసం రూ.100 కోట్ల నిధితో ఓ ప్రత్యేక పథకాన్ని కూడా ప్రవేశ పెట్టే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మరోవైపు ఎంఎస్ఎంఈల ఉత్పత్తుల కొనుగోలుకు ప్రత్యేక సేకరణ విధానంపై కూడా కసరత్తు జరుగుతున్నట్లు తెలిసింది. -
సేవల రంగం.. సుస్థిర ప్రగతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక పురోగతిలో సేవల రంగం కీలకపాత్ర పోషిస్తోందని, కరోనా విపత్తు తర్వాత కోలుకున్న ఈ రంగం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలుస్తోందని గణాంకాలు చెబుతున్నాయి. వ్యవసాయ అనుబంధ రంగాలు, పారిశ్రామిక, ఉత్పత్తి రంగాల్లో అభి వృద్ధి కనిపిస్తున్నప్పటికీ అస్థిరత, మందగమనం కూడా నమోదవు తున్నా యని ఈ గణాంకాలను బట్టి స్పష్టమవుతోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించిన సమగ్ర నివేదికను ప్రభుత్వం 16వ ఆర్థిక సంఘం ముందుంచింది. మంగళవారం ప్రజాభవన్‌లో జరిగిన సమావే శంలో, ఈ నివేదికలోని అంశాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో ఆర్థిక శాఖ వివరించింది. ⇒ రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)లో స్థిరంగా అభివృద్ధి కనిపిస్తోంది. జీఎస్డీపీ వృద్ధి రేటు జాతీయ సగటు 10.1 శాతం కాగా, తెలంగాణ 12.8% వృద్ధి నమోదు చేసుకుంటోంది. దేశ జనాభాలో తెలంగాణ జనాభా 2.8% కాగా, జీడీపీలో తెలంగాణ వాటా 5.1%. ⇒ రాష్ట్ర తలసరి ఆదాయం దేశ సగటుతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంది. ఈ వ్యత్యాసం ఏటా భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం దేశ తలసరి ఆదాయం రూ. 1.84 లక్షలు కాగా, తెలంగాణ తలసరి ఆదాయం రూ.3.57 లక్షలు. ⇒ 2014–15 నుంచి 2022–23 వరకు బడ్జెట్ ప్రతిపాదనలను పరిశీలిస్తే కేవలం 81 శాతం మాత్రమే ఖర్చు నమోదయింది. అంటే రూ.100 బడ్జెట్లో ప్రతిపాదిస్తే రూ.81 మాత్రమే ఖర్చు చేయగలిగాం. ⇒ రెవెన్యూ ఆదాయంలో అస్థిరత ఆర్థిక ప్రగతిలో హెచ్చుతగ్గులు, ద్రవ్యలోటుకు దారితీస్తోంది. జీఎస్డీపీతో పోలిస్తే దేశంలోని ఇతర రాష్ట్రాల రెవెన్యూ ఆదాయం 14.6 శాతం కాగా, తెలంగాణ ఆదాయం 12.2 శాతం మాత్రమే. ⇒ జీఎస్డీపీతో పోలిస్తే ద్రవ్యలోటు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ మూడో స్థానంలో ఉంది. పంజాబ్ (4.5 శాతం), కేరళ (4.90 శాతం) తర్వాతి స్థానంలో రాష్ట్రం ఉంది. ⇒జీఎస్డీపీతో పోలిస్తే అప్పులు 2014–15లో 18.1 శాతం ఉంటే, 2023–24 నాటికి 27.4 శాతానికి చేరాయి. రూ.5 వేల కోట్లు ఇప్పించండికేంద్ర ప్రభుత్వం నుంచి దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న దాదాపు రూ.5 వేల కోట్లకు పైగా నిధులను ఇప్పించాలని 16వ ఆర్థిక సంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం (2014)లోని సెక్షన్ 94(2) ప్రకారం రూ.1,800 కోట్లు, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద రూ.1,188.88 కోట్లు, ఏపీ నుంచి రావాల్సిన రూ.408.49 కోట్లు, 2014–15 సంవత్సరంలో లెవీ కింద ఎక్కువగా తీసుకున్న రూ.1,468 కోట్లు, 2023–24 ఆర్థిక సంవత్సరంలోని మూడు, నాలుగు త్రైమాసికాలకు గాను జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఇవ్వాల్సిన రూ.323.73 కోట్లు ఇప్పించాలని విజ్ఞప్తి చేసింది. ప్రజెంటేషన్‌లో రంగాల వారీగా పేర్కొన్న గణాంకాలివే..వ్యవసాయ అనుబంధ రంగాలు (ప్రైమరీ సెక్టార్)సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్) ప్రకారం ఈ రంగంలో దేశ సగటు 3.5 శాతంతో పోలిస్తే తెలంగాణ సగటు 5.4 శాతంగా నమోదయింది. ఈ మేరకు ప్రగతి శాతం ఎక్కువగానే ఉన్నా ఈ రంగంలో అస్థిర పురోగతి నమోదవుతోంది. జీఎస్డీపీలో ఈ రంగం వాటా పరిశీలిస్తే పశువులు, జీవాలు 7.7 శాతం, మైనింగ్ 7.4 శాతం, మత్స్య పరిశ్రమ 6.4 శాతంగా నమోదయ్యాయి. పారిశ్రామిక రంగం (సెకండరీ సెక్టార్): ఈ రంగంలో ప్రగతి అస్థిరంగా ఉంది. దేశ సగటు 5.9 శాతంతో పోలిస్తే మందగమనం కనిపిస్తోంది. ఈ రంగంలో తెలంగాణ సగటు కేవలం 5.7శాతం మాత్రమే. జీఎస్డీపీలో ఈ రంగం వాటా కింద నిర్మాణ రంగం 7.6 శాతం, తయారీ రంగ పరిశ్రమలు 5.4 శాతం నమోదు చేస్తున్నాయి. సేవల రంగం (టెరిటరీ సెక్టార్): ఈ రంగంలో మాత్రం అభివృద్ధి సుస్థిరంగా కనిపిస్తోంది. దేశ సగటు 6.5 శాతంగా ఉంటే తెలంగాణ సగటు 8.1 శాతంగా నమోదవుతోంది. జీఎస్డీపీలో ఈ రంగం వాటా పరిశీలిస్తే వాణిజ్య సేవలు 12.4 శాతం, స్టోరేజీ 12, వాయు రవాణా 10.9 శాతం, రియల్ ఎస్టేట్, ప్రొఫెషనల్ సేవలు 8.9 శాతంగా నమోదు చేసుకున్నాయి. -
నెమ్మదించిన పరిశ్రమలు
న్యూఢిల్లీ: పారిశ్రామిక రంగం జూన్‌లో నెమ్మదించింది. ఐదు నెలల్లో ఎన్నడూ లేనంత తక్కువ స్థాయిలో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) 4.2 శాతంగా నమోదయ్యింది. ఐఐపీ సూచీలో మెజారిటీ వెయిటేజ్ కలిగిన తయారీ రంగం పనితీరు నిరుత్సాహ పరిచినప్పటికీ విద్యుత్, మైనింగ్ రంగాలు చక్కటి ఫలితాలను నమోదుచేశాయి. 2024 జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో సూచీ వరుసగా 4.2%, 5.6%, 5.5%, 5.0%, 6.2 శాతం వృద్ధి రేట్లను (2023 ఇవే నెలలతో పోల్చి) నమోదుచేసుకుంది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో సూచీ 5.2 శాతంగా నమోదయ్యింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ వృద్ధి రేటు 4.7 శాతం. గత ఏడాది జూన్‌లో ఐఐపీ వృద్ధి రేటు 4 శాతంగా నమోదయ్యింది. అంటే అప్పటికన్నా తాజా సమీక్షా నెల జూన్‌లో (4.2 శాతం) కొంత మెరుగైన ఫలితం వెలువడ్డం గమనార్హం. 2023 అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో 11.9 శాతం ఐఐపీ వృద్ధి నమోదైంది. -
పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేస్తాం
సాక్షి, అమరావతి: పారిశ్రామిక వృద్ధిలో అత్యుత్తమ స్థానాన్ని పొందిన గుజరాత్ తరహాలో ఆంధ్రప్రదేశ్‌లోను పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పారిశ్రామిక, వాణిజ్య, ఆహారశుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. గుజరాత్ తరహాలో మన రాష్ట్రంలో కూడా గిఫ్ట్ సిటీ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. ఆయన గురువారం సచివాలయంలో రాష్ట్ర పారిశ్రామిక, వాణిజ్య, ఆహారశుద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం మాట్లాడుతూ దేశ, విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి తరలివచ్చి పరిశ్రమలు స్థాపించేందుకు అనువైన వాతావరణం కల్పిస్తామన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎన్ఆర్ఐల సహకారంతో యువతకు ఉపాధిరాష్ట్ర చిన్న, మధ్య సూక్ష్మ పరిశ్రమల, సెర్ప్, ఎన్ఆర్ఐ సంబంధాల శాఖ మంత్రిగా కొండపల్లి శ్రీనివాస్ గురువారం రాష్ట్ర సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో చిన్న పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు. ఎన్ఆర్ఐల సహకారంతో యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడానికి, డ్వాక్రా గ్రూప్ మహిళలు పారిశ్రామికంగా ఎదుగుదలకు ఒక రోడ్ మ్యాప్‌ను త్వరలోనే రూపొందిస్తామని వివరించారు. తాను బాధ్యతలు స్వీకరించిన అనంతరం 20 ఆదర్శ మండలాలకు రూ.10లక్షలు చొప్పున నిధులు, ఎస్సీ, ఎస్టీ ఎస్‌హెచ్‌జీలకు అందుబాటులో ఉన్న నిధులతో వడ్డీలేని రుణాలు మంజూరు చేస్తూ రెండు ఫైళ్లపై సంతకాలు చేసినట్లు మంత్రి శ్రీనివాస్ చెప్పారు.బీసీ స్టడీ సర్కిళ్లలో ఉచిత డీఎస్సీ కోచింగ్రాష్ట్రంలోని బీసీ స్టడీ సర్కిళ్లలో వెనకబడిన తరగతుల విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉచిత డీఎస్సీ కోచింగ్ అందించనున్నట్టు బీసీ, ఈడబ్ల్యూఎస్, చేనేత, జౌళి శాఖల మంత్రి సంజీవిరెడ్డిగారి సవిత తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో గురువారం ఆమె మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. బీసీ స్టడీ సర్కిళ్ళలో ఉచిత డీఎస్సీ కోచింగ్, ఎన్టీఆర్ విదేశీ విద్య పథకంపై మొదటి, ద్వితీయ సంతకాలు చేశారు. వెనకబడిన తరగతుల్లోని నిరుద్యోగులకు ఉచిత డీఎస్సీ కోచింగ్ ఫైల్‌పై తొలి సంతకం చేసినట్టు సవిత తెలిపారు. 2014–19 లో ఉమ్మడి 13 జిల్లాలకు మంజూరు చేసిన బీసీ భవన్ల నిర్మాణాలను పూర్తి చేస్తామన్నారు. వారానికి ఒక్కసారైనా సచివాలయ ఉద్యోగులు, రాష్ట్ర ప్రజలు చేనేత వస్త్రాలు ధరించాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి సవిత ముఖ్య కార్యదర్శి సునీతతో కలిసి మూడో బ్లాకులోని లేపాక్షి ఎంపోరియంను సందర్శించారు. -
ఇంధనం సంరక్షణకు ‘పాట్’ పడుతున్న ఏపీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పారిశ్రామిక రంగంలో ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించడం, సమర్ధవంతంగా ఇంధన వ్యయాన్ని తగ్గించడం, కర్భన ఉద్గారాలను కట్టడి చేయడం వంటి లక్ష్యాలను సాదించడంలో భాగంగా, పెర్ఫార్మ్, అచీవ్, ట్రేడ్ (పాట్) పథకం ద్వారా భారీ పరిశ్రమల్లో ఇంధన సామర్థ్యం, సాంకేతికతను ప్రవేశ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతోంది. పాట్ సైకిల్–3 వరకు 1.16 మిలియన్ టన్ ఆఫ్ ఆయిల్ ఈక్వెలెంట్ (ఎంటీఓఈ) ఇంధనాన్ని రాష్ట్రం ఆదా చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఎనర్జీ ఎఫిషియన్సీ పాలసీని కూడా రూపొందించింది. ఈ పాలసీ వల్ల ఏటా 16,875 మిలియన్ యూనిట్లు (మొత్తం డిమాండ్‌లో 25.6 శాతం) ఆదా అవుతుందని, వాటి విలువ రూ.11,779 కోట్లుకు పైగానే ఉంటుందని అంచనా. తద్వారా దాదాపు 14.34 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గే అవకాశం ఉంది. ప్రయోజనాలు ఎన్నో.. ప్రభుత్వం అందిస్తున్న విద్యుత్‌ను సమర్థవంతంగా వినియోగించుకోవటం ద్వారా విద్యుత్‌ను ఆదా చేయటమే కాకుండా పారిశ్రామిక ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించవచ్చు. తద్వారా ఉత్పత్తుల నాణ్యత పెరుగుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ‘పాట్’ పథకానికి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది. నూతన ఇంధన సామర్ధ్య సాంకేతికత సహాయంతో తక్కువ విద్యుత్‌తో ఎక్కువ పారిశ్రామిక ఉత్పత్తి సాధించడంపై పారిశ్రామికవేత్తలకు అవగాహన కలి్పస్తోంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్(ఐఓటీ) ఆధారిత పరికరాలను సమకూరుస్తోంది. రాష్ట్రంలో 65 ఎంఎస్ఎంఈల్లో వీటిని అమర్చింది.ఇవి విద్యుత్ వినియోగాన్ని, యంత్రాల పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తగిన సూచనలు అందించడం ద్వారా ఇంధన ఆదాకు దోహదపడుతున్నాయి. దీంతో సరిపెట్టకుండా పాట్ పథకం కింద లక్ష్యాలను సాధించిన పరిశ్రమలకు ఇంధన పొదుపు సరి్టఫికెట్లను బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) ద్వారా అందిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇలా 4 లక్షలకు పైగా సర్టిఫికెట్లను అందించింది. వీటిని మార్కెట్లో విక్రయించడం ద్వారా ఆయా పరిశ్రమలు ఆరి్థక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది.భారీ పరిశ్రమల్లో ప్రత్యేకంగా విద్యుత్ క్యాప్టివ్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వమే నిరంతర విద్యుత్‌ను సరఫరా చేస్తోంది. దీనివల్ల పరిశ్రమలు విద్యుత్‌పై చేసే వ్యయం తగ్గుతుంది. మరోవైపు పరిశ్రమలలో ఆధునిక విధానాల్లో ఇంధనాన్ని సక్రమంగా వినియోగించే సాంకేతికతను ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రభుత్వం పాట్ పథకాన్ని అమలు చేస్తోంది.ఆదర్శంగా నిలుస్తున్న ఏపీ 2030 నాటికి దేశ వ్యాప్తంగా 1 బిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించాలని, 2070 నాటికి వాటిని అసలు లేకుండా చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్య సాధనలో ఏపీ చురుకైన పాత్ర పోషిస్తోంది. 65 సూక్ష్మ చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో ఐఓటీ ఆధారిత ఎనర్జీ ఎఫిషియన్సీ డెమోన్‌్రస్టేషన్ ప్రాజెక్టుల అమలు, న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్లో ఇంధన సామర్థ్య చర్యలు, పెర్ఫార్మ్, అచీవ్ – ట్రేడ్ (పాట్)లో పథకంలో 1.160 మిలియన్ టన్నుల చమురుకు సమానమైన ఇంధన పొదుపు, స్థానిక సంస్థల్లో ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ (ఈసీబీసీ) అమలు వంటి కార్యక్రమాలు దేశ వ్యాప్తంగా ఏపీకి గుర్తింపుతెచ్చాయి. -
కుదేలైంది యంత్రం కాదు..రామోజీ కుతంత్రం!
అక్షరమనే వజ్రాయుధాన్ని ఎంతగా భ్రషు్టపట్టించాలో అంతగానూ రామోజీ భ్రషు్టపట్టిస్తున్నారు..ఈనాడు అంటేనే ఏవగింపు కలిగేలా అబద్ధాలు, కుళ్లూ కుట్రల రాతలతో పత్రికను నింపేస్తున్నాడీ ఎల్లో పెద్ద మనిషి. చంద్రబాబంటే ఆమడదూరం పారిపోయే పారిశ్రామికవేత్తలు వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయిన తర్వాతే తెప్పరిల్లారు. కోవిడ్ వంటి కష్టకాలంలోనూ జగన్ పరిశ్రమలను ఆదుకున్నారని దేశంలోనే గొప్ప పేరు తెచ్చుకున్న సీఎంగా గుర్తింపు పొందారు. అయిదేళ్ల కిందట తమకు దక్కని రాయితీలను పారిశ్రామిక వేత్తలు జగన్ ప్రభుత్వంలోనే అందుకుంటున్నారు. ఈ ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహకాల ఫలితంగానే పారిశ్రామిక వికాసం, ఉద్యోగ కల్పన పెరిగాయనడానికి తలసరి ఆదాయ వృద్ధే నిదర్శనం...ఈ నిజం రామోజీకి తెలిసినా, తప్పుడు రాతలకే కంకణం కట్టుకున్నారు కనుక కట్టుకథలనే అల్లుతారు.. జగన్ ప్రభుత్వంలోనే రాష్ట్ర ఎగుమతులు పెరిగాయి...చంద్రబాబు హయాంలో ఉన్న ఎంఎస్ఎంఈల సంఖ్యతో పోలిస్తే జగన్ ప్రభుత్వంలో ఇప్పుడు ఆరింతలుగా పెరిగింది...వాస్తవాలెప్పుడూ రామోజీకి చేదుగానే ఉంటాయి...అందుకే అక్షర గరళాన్ని జగన్ ప్రభుత్వంపై చిమ్ముతూనే ఉంటాడీయన... చంద్రబాబు ఎంఎస్ఎంఈలకు బకాయిలు పెట్టి జారుకుంటే...ఆ మొత్తాన్ని జగన్ తీర్చడమే కాదు...వాటికి ప్రోత్సాహకాలనూ అందిస్తూ...పారిశ్రామిక ప్రగతికి జగన్ అహరహం అడుగులు వేస్తున్నారు...ఆయన భరోసాయే పారిశ్రామికవేత్తలకు కొండంత అండ...ఏ వర్గానికీ మంచి జరగాలని చంద్రబాబు ఏనాడూ కోరుకోలేదు...రామోజీదీ అదే వరుస...అయినా వాస్తవాలు చెరిపేస్తే చెరిగిపోవు...చింపేస్తే చిరిగిపోవన్నది రామోజీ గుర్తించాలి... సాక్షి, అమరావతి: తనవాడి పాలన అయితే తందాన తాన...తనకు నచ్చని వ్యక్తి అయితే ఎడాపెడా కారుకూతల రాతల విషం చిమ్మడం రామోజీకి అలవాటైపోయింది. చంద్రబాబు అధికారంలో ఉంటే పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వకపోయినా రాష్ట్రంలో పారిశ్రామిక వెలుగులు అంటూ రాతలు రాస్తారు. అదే తనకు గిట్టని వాళ్లు అధికారంలో ఉంటే మాత్రం తిట్టిపోయడం రామోజీకి అలవాటై పోయింది. ఎంఎస్ఎంఈలకు బాబు పెట్టిన బకాయిలను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీర్చినా సరే రాష్ట్రంలో పారిశ్రామిక రంగం తిరోగమనం ...అంటూ క్షుద్ర రాతలు రాస్తారు. ప్రపంచం ఎప్పుడూ చూడని విధంగా కోవిడ్ వంటి మహమ్మారి కాలంలోనూ రాష్ట్రంలో ఒక్క పరిశ్రమా మూత పడకుండా జగన్మోహన్రెడ్డి పారిశ్రామికవేత్తలను చేయిపట్టి నడిపించారు. రాష్ట్రంలో పారిశ్రామిక రంగమే కనుక తిరోగమనంలో ఉండి ఉంటే గత ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో పారిశ్రామిక రంగ వాటా పెరగడం ఎలా సాధ్యమవుతుందో రామోజీ జవాబివ్వగలరా? 2019–20లో రాష్ట్ర జీఎస్డీపీలో 22.04 శాతంగా ఉన్న పరిశ్రమల వాటా 2022–23 నాటికి 23.36 శాతానికి చేరిన విషయం వాస్తవమో, కాదో రామోజీ బదులివ్వగలరా? పారిశ్రామిక ప్రగతి, ఉద్యోగ కల్పన లేకపోయి ఉంటే తలసరి ఆదాయం ఎలా పెరిగిందో రామోజీ మట్టిబుర్రకు తట్టలేదా? గతేడాది దేశంలో తలసరి ఆదాయం సగటున రూ.23,476 పెరిగితే, మన రాష్ట్రంలో దాన్ని మించి రూ.26,931గా ఎలా పెరిగిందో ఈనాడు చెబుతుందా? 2021–22లో రూ.1,92,587గా ఉన్న రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం 2022–23 నాటికి రూ.2,19,518కు చేరిన విషయం రామోజీకి తెలియదా?. పారిశ్రామికవేత్తల అభిప్రాయాల అధారంగా ప్రకటిస్తున్న సులభతర వాణిజ్య ర్యాంకుల్లో వరుసగా మూడేళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలుస్తోంది. రాష్ట్ర ఎగుమతులు రూ.90,000 కోట్ల నుంచి రూ.1,60,000 కోట్లకు చేరుకున్నాయి. చంద్రబాబు హయాంలో 1.93 లక్షలుగా ఉన్న ఎంఎస్ఎంఈల సంఖ్య ఇప్పుడు ఏకంగా ఏడు లక్షలు దాటింది. కోవిడ్ సమయంలో రీస్టార్ ప్యాకేజీ, వైఎస్ఆర్ నవోదయం వంటి పథకాలను జగన్ ప్రభుత్వం సమర్థంగా అమలు చేయడం ద్వారా ఎంఎస్ఎందఈ రంగం ఎలా పురోగమించిందో ఈ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. గత బకాయిలను విడుదల చేసింది ఈ ప్రభుత్వమే రామోజీ .. గత ప్రభుత్వం ఎంఎస్ఎంఈలను పూర్తిగా నిర్లక్ష్యం చేయగా, జగన్ ప్రభుత్వం ప్రోత్సాహకాలను ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ ఆదుకుంది. గత ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు, స్పిన్నింగ్ మిలు్లలకు కలిపి బకాయి పెట్టిన రూ.1,588 కోట్లను విడుదల చేయడమే కాకుండా రూ.2,087 కోట్ల ప్రోత్సాహకాలను విడుదల చేసి ఆదుకున్న విషయం వాస్తవం కాదా రామోజీ? గతంలో పట్టణాలు నగరాలకు దూరంగా ఉన్న ఆటోనగర్లు, పారిశ్రామిక వాడలు పట్టణీకరణలో భాగంగా చాలాచోట్ల నగర మధ్య భాగంలోకి రావడంతో కాలుష్యకారక పరిశ్రమలను చాలా వరకు దూరప్రాంతాలకు ప్రభుత్వం తరలించింది. దీంతో పాత యూనిట్ల స్థలాలు వృధాగా ఉన్నాయి. కొన్ని సంస్థలు వాటి వ్యాపార కార్యకలాపాలను మార్చుకున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత భూములను ఇతర వాణిజ్య కార్యక్రమాలకు వినియోగించడం ద్వారా మరింత మందికి ఉపాధి కల్పించవచ్చని పారిశ్రామిక సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించి జీవో నెంబర్ 5, 6ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ చర్యనూ తప్పు పడుతూ రామోజీ తన కలంతో ప్రభుత్వంపై విషం కక్కారు. అన్ని మౌలికవసతులు కల్పిస్తూ అభివృద్ధి చేసిన భూమి ధర మార్కెట్ రేటు కంటే అధికంగా ఉంటుంది. ఈ విషయాన్ని చిన్న పిల్లాడినా అడిగినా చెబుతాడు. ఏపీఐఐసీ పారిశ్రామిక పార్కు అభివృద్ధికి అయిన వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుని భూమి ధరలను నిర్ణయిస్తుంది. మార్కెట్ ధరలతో పోలిస్తే పారిశ్రామిక పార్కుల్లో భూమి ధర ఎక్కువగా ఉందంటూ రామోజీ రాస్తున్నారంటే ఏ స్థాయికి దిగజారిపోయారో రాష్ట్రమంతటికీ అర్థమవుతోంది. -
‘పాట్’ అమలులో ఏపీ ఉత్తమం
సాక్షి, అమరావతి: పెర్ఫార్మ్, అచీవ్ ట్రేడ్ (పాట్) పథకం అమలులో రాష్ట్రం ఉత్తమ ఫలితాలు సాధిస్తోందని ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ చెప్పారు. పారిశ్రామికరంగంలో ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించడం, ఇంధన వ్యయాన్ని తగ్గించడం, గ్రీన్హౌస్ ఉద్గారాలను కట్టడిచేయడం వంటి లక్ష్యాలను సాధించడంలో భాగంగా పరిశ్రమల్లో ఎనర్జీ మేనేజర్లకు పాట్ పథకంపై బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) బుధవారం విజయవాడలో రీజనల్ వర్క్‌షాప్ నిర్వహించింది. ఈ వర్క్‌షాప్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న విజయానంద్ ఏపీఎస్ఈసీఎం సీఈవో కుమారరెడ్డి, ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కె.సంతోషరావు, నెడ్‌క్యాప్ వీసీ, ఎండీ నందకిషోర్‌రెడ్డి, ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్ సీఎండీ కమలాకర్‌బాబు, బీఈఈ సీనియర్ సెక్టార్ ఎక్స్పర్ట్ నవీన్‌కుమార్‌లతో కలిసి పాట్‌పై బుక్‌లెట్‌ను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పరిశ్రమల్లో ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించేందుకు పాట్ పథకం అమలు చేయటం, సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించడం, ఎంఎస్ఎంఈ క్లస్టర్లలో డీకార్బనైజేషన్ చర్యలు నిర్వహించడం వంటి పటిష్టమైన ప్లాన్‌ను రూపొందించిన ఉత్తమ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటని చెప్పారు. ఈ పథకం దేశవ్యాప్తంగా అద్భుతమైన ఫలితాలను సాధించిందన్నారు. పాట్ సైకిల్–1లో 8.67 మిలియన్ టన్ ఆఫ్ ఆయిల్ ఈక్వివాలెంట్ (ఎంటీవోఈ) ఇంధనాన్ని ఆదా చేయడం వల్ల సుమారు 31 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలను నివారించగలిగామని చెప్పారు. పాట్ సైకిల్–2లో 14.08 ఎంటీవోఈ ఇంధనం ఆదా చేయడంద్వారా 68 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గించామని తెలిపారు. ఈ పథకంలో భాగంగా రాష్ట్రంలో పరిశ్రమలు ఇంధన సామర్థ్య చర్యలను అమలు చేయడం ద్వారా పాట్ సైకిల్–3 వరకు 1.16 ఎంటీవోఈ ఇంధనాన్ని ఆదా చేశాయని చెప్పారు. పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్‌ను అందించడమే కాకుండా పారిశ్రామిక ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరచడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని ఆయన తెలిపారు. వర్క్‌షాప్‌లో ఏపీ, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలకు చెందిన సిమెంట్, టెక్స్టైల్స్, పవర్ప్లాంట్లు, ఎరువులు, ఇనుము, ఉక్కు, ఎరువులు, సిమెంట్, అల్యూమినియం, పేపర్, క్లోర్–ఆల్కల్ పరిశ్రమల నుంచి 100 మందికిపైగా ప్రతినిధులు పాల్గొన్నారు. -
దేశాభివృద్ధిలో భాగస్వామ్యం అవుతాయ్
న్యూఢిల్లీ: కార్పొరేట్ ప్రపంచం దేశాభివృద్ధి లక్ష్యాలతో మమేకం అవుతుందన్న విశ్వాసమున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. తద్వారా అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ఆవిర్భవించడంలో భాగస్వాములవుతాయని తెలియజేశారు. వెరసి శత వసంత స్వాతంత్య్ర దినోత్సవ (2047) సమయానికల్లా వికసిత్ భారత్‌గా ఆవిర్భవించే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. భవిష్యత్ తరాలకు అత్యుత్తమ భారత్‌ను అందించే బాటలో ప్రధాని నరేంద్ర మోదీ వికసిత్ భారత్‌ను సాధించేందుకు స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించినట్లు పేర్కొన్నారు. ‘వికసిత్ భారత్ ః 2047: వికసిత్ భారత్– ఇండస్ట్రీ’ పేరుతో ఫిక్కీ నిర్వహించిన సదస్సులో ఆమె ప్రసంగించారు. 2047కల్లా లక్ష్యాలను సాధించడంలో పారిశ్రామిక రంగం పాత్ర కీలకమన్నారు. -
ఒక్క ఏడాదిలోనే రూ. 2.46 లక్షల కోట్లు
సాక్షి, అమరావతి: పారిశ్రామిక రంగాన్ని సీఎం జగన్ వెన్నుతట్టి ప్రోత్సహిస్తుండటంతో రిలయన్స్, బిర్లా, టాటా లాంటి పారిశ్రామిక దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. గతేడాది మార్చిలో విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సులో కుదిరిన ఒప్పందాలు వేగంగా వాస్తవ రూపంలోకి వస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో రూ.4,178 కోట్లతో ఆదిత్య బిర్లా గ్రూప్, రిలయెన్స్ ఎనర్జీ, హెల్లా ఇన్ఫ్రా, వెసువియస్ ఇండియా లిమిటెడ్, ఏపీఐఐసీ, ఏపీ ఎంఎస్ఎంఈ కార్పొరేషన్‌కు సంబంధించిన మొత్తం 8 ప్రాజెక్టులకు బుధవారం వెలగపూడి సచివాలయం నుంచి ఆయన వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ‘ఏపీ ఎంఎస్ఎంఈ వన్’ వెబ్‌సైట్‌ను లాంఛనంగా ప్రారంభించారు. పెట్టుబడులు పెడుతున్న రిలయన్స్, ఆదిత్య బిర్లా, హెల్లా ఇన్ఫ్రా సంస్థలకు సీఎం తరఫున ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చే వారికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహాయ, సహకారాలను అందిస్తుందని పునరుద్ఘాటించారు. సాధారణంగా దేశంలో పెట్టుబడుల సదస్సులోజరిగే ఒప్పందాల్లో 16 నుంచి 17 శాతం మాత్రమే వాస్తవ రూపంలోకి వస్తాయని, మన రాష్ట్రంలో మాత్రం సదస్సు జరిగి ఏడాది కాకుండానే 19 శాతం పెట్టుబడులు వాస్తవ రూపంలోకి రావడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. జీఐఎస్‌లో మొత్తం రూ.13.11 లక్షల కోట్ల విలువైన 386 ఒప్పందాలు జరగ్గా రూ.2.46 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన పనులు వేర్వేరు దశల్లో ఉన్నట్లు వివరించారు. పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఒక్క ఫోన్ కాల్ దూరంలో ఉందని ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన భరోసాతో పెట్టుబడులకు పరిశ్రమలు ముందుకొస్తున్నాయని చెప్పారు. గత మూడేళ్లుగా దేశంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచిందని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా 11 పారిశ్రామిక కారిడార్లను నెలకొల్పుతుండగా ఏపీ పరిధిలో విశాఖ–చెన్నె, చెన్నె–బెంగళూరు, బెంగళూరు–హైదరాబాదు పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటవుతున్నట్లు చెప్పారు. మౌలిక వసతుల కల్పనలో భాగంగా రూ.1,000 కోట్లతో నక్కపల్లి, శ్రీకాళహస్తి నోడ్లను అభివృద్ధి చేస్తున్నామని, ఈ రెండు పారిశ్రామిక పార్కుల ద్వారా సుమారు రూ.60,000 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందన్నారు. తీర ప్రాంత అభివృద్ధిపై దృష్టి సుదీర్ఘంగా 974 కి.మీ. పొడవైన సముద్ర తీరాన్ని కలిగి ఉన్న మన రాష్ట్రం పరిశ్రమల ఏర్పాటుకు ఎంతో అనుకూలమని మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక సుమారు రూ.20 వేల కోట్లతో నాలుగు ప్రధాన పోర్టులను నిర్మిస్తుండగా రామాయపట్నం పోర్టు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందని తెలిపారు. మరో రూ.నాలుగు వేల కోట్లతో 10 ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. స్థానిక యువత ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించేందుకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగానే గత నాలుగేళ్లలో 2.50 లక్షల ఎంఎస్ఎంఈ యూనిట్ల ఏర్పాటు ద్వారా ఆరు లక్షల మందికి పైగా ఉపాధి కల్పించినట్లు వెల్లడించారు. యువతకు స్థానికంగా ఉపాధి అవకాశాలను విస్తృతం చేసేందుకు 50కిపైగా పారిశ్రామిక క్లస్టర్ల ఏర్పాటుకు కృషి జరుగుతోందన్నారు. సమావేశంలో పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్, ఏపీఐఐసీ ఎండీ ప్రవీణ్‌కుమార్, పరిశ్రమల శాఖ కమిషనర్ సిహెచ్.రాజేశ్వర్‌రెడ్డితోపాటు కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
AP: రాష్ట్రంలో మూడు రెట్లు పెరిగిన స్టార్టప్‌లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని యువత నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ సరికొత్త ఆలోచనలతో ఆవిష్కరణల దిశగా అడుగులు వేసేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పలు చర్యలు చేపట్టారు. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీల ద్వారా అందిస్తున్న సహకారంతో రాష్ట్రంలో స్టార్టప్‌ల సంఖ్య భారీగా పెరిగింది. వీటి ద్వారా సాంకేతిక నిపుణులైన యువత స్వయం ఉపాధి పొందడమే కాకుండా, వేలాది మందికి ఉద్యోగాలూ వస్తున్నాయి. గత ఐదేళ్లలో రాష్ట్రంలో స్టార్టప్‌ల సంఖ్య మూడు రెట్లకు పైగా పెరిగినట్లు డిపార్టమెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) వెల్లడించింది. ఆ సంస్థ తాజా గణాంకాల ప్రకారం.. 2019లో రాష్ట్రంలో 161 స్టార్టప్‌లు ఉండగా ఇప్పుడు వాటి సంఖ్య 586 దాటింది. వీటిలో పనిచేసే ప్రత్యక్ష ఉద్యోగుల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరిగింది. 2019లో 1,552 మంది వీటిలో పనిచేస్తుండగా, ఆ సంఖ్య ఇప్పుడు 5,669కు చేరింది. గత చంద్రబాబు ప్రభుత్వం కేవలం ఇంక్యుబేషన్ సెంటర్ పేరుతో ప్రచారానికే పరిమితమవడంతో స్టార్టప్‌లలో రాష్ట్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. వైఎస్ జగన్ ప్రభుత్వం దానికి భిన్నంగా స్టార్టప్‌ల ప్రోత్సాహానికి అనేక చర్యలు చేపట్టింది. స్టార్టప్‌లకు మెంటార్షిప్, ఫండింగ్, ఇండస్ట్రీ కనెక్ట్‌లతో పాటు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునే విధంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ సీఈవో అనిల్ తెంటు ‘సాక్షి’కి తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తొలి నాలుగో తరం పారిశ్రామిక రంగం ఇండస్ట్రీ 4కు చెందిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని కల్పతరువు పేరిట విశాఖలో ఏర్పాటు చేసింది. దీంతోపాటు నాస్కామ్ సహాయంతో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగాల స్టార్టప్‌ల కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలను కూడా విశాఖలో ఏర్పాటు చేసింది. ఆంధ్రా యూనివర్సిటీలో ఏ హబ్, ఓడల నిర్మాణంపైన, మెడ్‌టెక్ జోన్‌లోనూ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీటి ద్వారా పలు స్టార్టప్‌లు ఏర్పాటవుతున్నాయని తెలిపారు. -
త్వరలో కొత్త పారిశ్రామిక పాలసీ
సాక్షి, హైదరాబాద్: ప్రజలు కోరుకున్న మార్పును తీసుకురావడంలో భాగంగా అందరి సలహాలు, సూచనలతో త్వరలో కొత్త పారిశ్రామిక విధానం రూపొందిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రకటించారు. అందరి అభిప్రాయాలు తీసుకుని చిన్న, మధ్య తరగతి పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) తోడ్పాటును అందిస్తామని భరోసానిచ్చారు. వివిధ వాణిజ్య, పారిశ్రామిక సంస్థలు ఎఫ్‌టీసీసీఐ, ఫిక్కి, సీఏఏ, ఎఫ్టీఎస్ఏసీ, డిక్కి సంస్థల ప్రతినిధులతో బుధవారం శ్రీధర్‌బాబు భేటీ అయ్యారు. పారిశ్రామిక కారిడార్ విషయంలోనూ సలహాలు, సూచనలు స్వీకరించడంతో పాటు అన్ని జిల్లాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామన్నారు. చైనా కంటే ఉత్తమంగా అన్ని ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుతో అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. పారిశ్రామిక రంగానికి నూతన ఉత్తేజం కల్పించడంతోపాటు అర్బన్, రీజనల్, సెమీ అర్బన్ క్లస్టర్లుగా విభజించి పరిశ్రమల స్థాపనను ప్రోత్సహిస్తామని ఆయన చెప్పారు. డ్రైపోర్ట్ విషయంలోనూ త్వరలో కీలక నిర్ణయం తీసుకుంటామని, నల్లగొండ నుంచి పాత ముంబై హైవే ప్రాంతాలను అనుసంధానం చేయడాన్ని పరిశీలిస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిస్తాం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చి న హామీ మేరకు రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడంతో పాటు పారిశ్రామిక రంగం అభివృద్ధితో లక్షలాది మంది ఉద్యోగాలు వచ్చేలా కృషి చేస్తామని శ్రీధర్ బాబు చెప్పారు. యువ పారిశ్రామికవేత్తలను తయారు చేసే దిశగా ‘ప్లాన్ 2050’అమలు చేస్తామన్నారు. ప్రపంచానికి కోవిడ్ వ్యాక్సిన్ అందించిన హైదరాబాద్‌ను అభివృద్ధి చెందిన దేశాలు కూడా గుర్తించేలా ‘ఫార్మా ఇండస్ట్రీ హబ్’గా తీర్చిదిద్దుతామన్నారు. హైదరాబాద్‌లో తయారైన క్షిపణులు ఇజ్రాయెల్‌కు ఎగుమతి అవుతున్న వైనం రాష్ట్ర పారిశ్రామిక పురోగతికి అద్దం పడుతోందన్నారు. అదానీ కంపెనీ వ్యవహారంలో కొంతమంది కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేస్తున్నారని మండిపడ్డారు. అన్ని వర్గాల పారిశ్రామిక వేత్తలకు అవకాశం రావాలన్నది కాంగ్రెస్ పార్టీ ఉద్దేశమని, తమ నాయకుడు రాహుల్ గాంధీ అదానీని వ్యతిరేకించారు కానీ అభివృద్ధిని కాదని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో అదానీ పెట్టుబడులు ఉన్నాయని, రాష్ట్ర అభివృద్ధిపైనే తమ ఆలోచన ఉంటుందని శ్రీధర్‌బాబు అన్నారు. -
రూ.2,851 కోట్ల పెట్టుబడులు
సాక్షి, అమరావతి: ఆహార శుద్ధి, పరిశ్రమల రంగంలో మొత్తం 13 కీలక ప్రాజెక్టులకు సంబంధించి రూ.2,851 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తరలి వచ్చాయి. వీటి ద్వారా 6,705 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుండగా ఆహార శుద్ధి యూనిట్ల ద్వారా 90,700 మంది రైతులు ప్రయోజనం పొందనున్నారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వర్చువల్‌గా వీటికి భూమి పూజ, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు. ఏడు ప్రాజెక్టుల పనులకు శ్రీకారం పరిశ్రమల రంగంలో రూ.2,294 కోట్ల విలువైన ఏడు ప్రాజెక్టుల నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి జగన్ వర్చువల్‌గా భూమి పూజ నిర్వహించనున్నారు. ఏడు ప్రాజెక్టుల ద్వారా 4,300 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. అనంతపురం జిల్లా డి.హీరేహళ్లో రూ.544 కోట్లతో ఎకో స్టీల్ ఇండియా, తిరుపతి నాయుడుపేటలో రూ.800 కోట్లతో గ్రీన్‌లామ్ సౌత్, బాపట్ల జిల్లా కొరిసిపాడు వద్ద శ్రావణి బయో ఫ్యూయల్ రూ.225 కోట్లు, శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో రూ.200 కోట్లతో నాగార్జునా ఆగ్రో కెమికల్స్, తూర్పుగోదావరి జిల్లా ఖండవల్లి వద్ద రూ.150 కోట్లతో రవళి స్పిన్నర్స్, శ్రీసత్యసాయి జిల్లా గూడుపల్లి వద్ద రూ.125 కోట్లతో యునైటెడ్ ఇండస్ట్రీస్ ఆటో ప్లాస్టిక్, శ్రీసత్యసాయి జిల్లా మడకశిర వద్ద రూ.250 కోట్లతో ఎవరెస్ట్ స్టీల్ బిల్డింగ్ యూనిట్ల నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. పులివెందులలో అరటి ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభం ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో రూ.557 కోట్ల పెట్టుబడులకు సంబంధించి సీఎం చేతుల మీదుగా భూమి పూజ, ఉత్పత్తి ప్రారంభం, ఒప్పందాలు జరగనున్నాయి. వీటి ద్వారా 2,405 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుండగా 90,700 మంది రైతులు ప్రయోజనం పొందనున్నారు. 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రూ.65 కోట్లతో 13 మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ల నిర్మాణ పనులను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. తిరుపతి జిల్లా కంచరపాలెం వద్ద రూ.168 కోట్లతో ఏటా 40,000 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు చేసిన డీపీ చాక్లెట్స్ యూనిట్‌ను సీఎం ప్రారంభిస్తారు. విశాఖపట్నం జిల్లా మద్ది వద్ద రూ.50 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఓరిల్ ఫుడ్స్ నిర్మాణ పనులకు, అనకాపల్లి జిల్లా కొడవాటిపూడి వద్ద రూ.20 కోట్లతో ఏర్పాటు చేస్తున్న నేటివ్ అరకు కాఫీ నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. తూర్పు గోదావరి జిల్లా అయ్యవర్తం వద్ద రూ.350 కోట్లతో 3 ఎఫ్ ఆయిల్ యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోనున్నారు. కడప జిల్లా పులివెందులలో రూ.4 కోట్లతో ఏర్పాటు చేసిన అరటి ప్రాసెసింగ్ యూనిట్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. -
యాంకర్ యూనిట్లకు ప్రత్యేక రాయితీలు
భారీ పరిశ్రమలను ఆకర్షించేలా యాంకర్ యూనిట్లకు ప్రత్యేక రాయితీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానం 2023 – 27 విధివిధానాలను తాజాగా విడుదల చేసింది. 2023 ఏప్రిల్ 1 నుంచి 2027 మార్చి 30 వరకు నూతన పాలసీ అమల్లో ఉంటుంది. ఈ కాలపరిమితిలో ఉత్పత్తి ప్రారంభించిన యూనిట్లకు ప్రత్యేక రాయితీలు లభిస్తాయి. యాంకర్ యూనిట్లతో పాటు లార్జ్, మెగా, అల్ట్రా మెగా, ఎంఎస్ఎంఈలకు రాయితీలు, ప్రోత్సాహకాలపై స్పష్టమైన విధి విధానాలను ప్రభుత్వం విడుదల చేసింది. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించేలా ప్రభుత్వం నూతన పాలసీ విధివిధానాలను రూపొందించింది. యాంకర్ యూనిట్లకు ప్రత్యేక రాయితీలు అందించాలని నిర్ణయించింది. దీని ప్రకారం.. యాంకర్ యూనిట్ రూ.500 కోట్లకు పైబడి పెట్టుబడితో ఏర్పాటవ్వాలి. కనీసం 1,000 మందికి ఉపాధి కల్పించాలి. ఈ యూనిట్ ఆధారంగా కనీసం మరో ఐదు యూనిట్లు ఏర్పాటవ్వాలి. ఇటువంటి యూనిట్లకు పారిశ్రామిక పాలసీ 2023 – 27లో పేర్కొన్న ప్రోత్సాహకాలతో పాటు అదనపు రాయితీలు కూడా లభిస్తాయి. యూనిట్ ఏర్పాటు వల్ల రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కలిగే ప్రయోజనం, ఉపాధి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ యూనిట్ ప్రతిపాదనలను బట్టి టైలర్ మేడ్ రాయితీలను ఇవ్వనున్నారు. తొలుత యాంకర్ యూనిట్ పూర్తి నివేదిక (డీపీఆర్)ను రాష్ట్ర పరిశ్రమల శాఖ కమిషనర్‌కు సమర్పించాలి. వారు కోరుకొనే రాయితీలను ప్రజంటేషన్ రూపంలో చూపించాలి. ఆ రాయితీలు ఇవ్వడానికి సహేతుక కారణాలను వివరించాలి. ఈ ప్రతిపాదనలను ఎస్ఐపీసీ, ఎస్ఐపీబీ ముందుకు తేవాలి. వాటిని ఎస్ఐపీబీ పరిశీలించి భూమి ధరలు, ప్రత్యేక రాయితీలపై నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉత్పత్తి ప్రారంభించిన యూనిట్లు విస్తరణ చేపట్టినా, లేక వేరే రంగంలో పెట్టుబడులు పెట్టినా వాటికి కూడా నిబంధనలకు అనుగుణంగా రాయితీలు అందుతాయి. రాష్ట్రంలో ఉత్పత్తి ప్రారంభించిన ప్రతి పరిశ్రమకు ఆధార్ తప్పనిసరిగా తీసుకోవాలని, ఉద్యోగుల్లో 75 శాతం స్థానికులకే అవకాశం కల్పించాలని, అటువంటి సంస్థలకే ఈ రాయితీలు, ప్రోత్సాహకాలు లభిస్తాయని స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు ఎస్సీ, ఎస్టీ, పారిశ్రామికవేత్తలు స్థాపించే పరిశ్రమలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ జగనన్న బడుగు వికాసం కింద ప్రత్యేక రాయితీలు ఇవ్వనుంది. ఇందులోనూ మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనుంది. ఇందుకు విధివిధానాలను నూతన పాలసీలో పొందుపరిచింది. ఈ పరిశ్రమల్లో 100 శాతం పెట్టుబడి ఎస్సీలు, ఎస్టీల పేరు మీద ఉండాలి. 100 శాతం పెట్టుబడి ఎస్సీ, ఎస్టీ మహిళల పేరు మీద ఉంటే వాటిని ఎస్సీ, ఎస్టీ మహిళా యూనిట్లుగా పరిగణిస్తారు. అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీ మహిళలను తొలి తరం పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కేవలం ఆర్థిక ప్రోత్సాహకాలు మాత్రమే కాకుండా వారిని చేయిపట్టుకొని నడిపించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు నూతన పాలసీలో ప్రభుత్వం పేర్కొంది. జగనన్న కాలనీల్లో వాక్ టు వర్క్ విధానంలో పనిచేసుకునే విధంగా ఉమ్మడి వసతులతో కూడిన సూక్ష్మ యూనిట్లు ఏర్పాటు చేయడానికి క్లస్టర్లను ఏర్పాటు చేయనుంది. ఈ క్లస్టర్లలో ఎస్సీ, ఎస్టీలకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఈ కాలనీల్లో యూనిట్లు ఏర్పాటు చేసేలా ఎస్సీ, ఎస్టీలను ప్రోత్సహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. -
గోదాం వసతుల్లో 13–15 శాతం వృద్ధి
ముంబై: పారిశ్రామిక, వేర్ హౌస్ లాజిస్టిక్స్ పార్క్ సరఫరా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 13–15 శాతం మేర పెరుగుతుందని ఇక్రా రేటింగ్స్ అంచనా వేసింది. ఎనిమిది ప్రధాన మార్కెట్లలో గోదాముల వసతి విస్తీర్ణం 435 మిలియన్ చదరపు అడుగులుగా ఉంటుందని పేర్కొంది. ముఖ్యంగా 50 శాతం గోదాం వసతి గ్రేడ్ ఏ రూపంలోనే వస్తుందని తెలిపింది. అయితే, కొత్తగా వచ్చే వసతిలో వినియోగం 39 మిలియన్ చదరపు అడుగులుగానే ఉంటుందని పేర్కొంది. థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ (రవాణా), ఆటోమొబైల్ రంగాల నుంచి గోదాముల పరిశ్రమ స్థిరమైన డిమాండ్‌ను చూస్తోందని, 2023 మార్చి నాటికి మొత్తం వేర్‌హౌసింగ్ లీజు విస్తీర్ణంలో ఈ రంగాల వాటా 53 శాతంగా ఉందని వివరించింది. దీనికి అదనంగా ఈ కామర్స్, అనుబంధ సేవల రంగాలు వేగంగా విస్తరిస్తుండడం కూడా గోదాములకు డిమాండ్‌ను పెంచుతోందని తెలిపింది. ప్రభుత్వం తయారీకి ప్రోత్సాహకాలు ఇస్తుండడం కూడా డిమాండ్ వృద్ధికి ఊతంగా నిలుస్తున్నట్టు వివరించింది. దేశవ్యాప్తంగా టాప్–8 పట్టణాల్లో గ్రేడ్ ఏ వేర్‌హౌస్ వసతి 17 శాతం వృద్ధి చెంది 195 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంటుందని అంచనా వేసింది. 2023 మార్చి నాటికి ఇది 167 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. కొత్తగా గ్రేడ్ ఏ విభాగంలో వచ్చే మార్చి నాటికి 28 మిలియన్ చదరపు అడుగుల వసతి అందుబాటులోకి వస్తుందని తన నివేదికలో ఇక్రా రేటింగ్స్ వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న గ్రేడ్ ఏ గోదాముల వసతిలో 30 శాతాన్ని అంతర్జాతీయ ఆపరేటర్లు, ఇన్వెస్టర్లు అయిన సీపీపీఐబీ, జీఎల్పీ, బ్లాక్‌స్టోన్, ఈఎస్ఆర్, అలియాంజ్, జీఐసీ, సీడీపీ గ్రూప్ ఆక్రమించినట్టు తెలిపింది. దీర్ఘకాలంలో మెరుగైన వృద్ధి అవకాశాలు దీర్ఘకాలంలో గ్రేడ్–ఏ గోదాముల వసతి వృద్ధికి మెరుగైన అవకాశాలున్నట్టు ఇక్రా రేటింగ్స్ నివేదిక తెలిపింది. థర్డ్ పార్టీ లాజిస్టిక్స్, ఆటోమొబైల్ రంగాలే అందుబాటులోని గోదాముల విస్తీర్ణంలో సగం వాటా ఆక్రమిస్తున్నాయి. థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ నుంచి 8–9 శాతం, ఆటోమొబైల్ రంగం 6–9 శాతం వృద్ధి ఉంటుందని తెలిపింది. ముంబై, ఢిల్లీ ఎన్సీఆర్, పుణె, చెన్నై, కోల్‌కతా మార్కెట్లు వేర్‌హౌసింగ్‌కు టాప్ మార్కెట్లుగా ఉన్నాయని, ఈ పట్టణాలే మొత్తం వసతుల్లో 75–78 శాతం వాటా కలిగి ఉన్నాయని వివరించింది. ముంబై, ఢీల్లీ ఎన్సీఆర్ మార్కెట్లే 50% వాటా ఆక్రమిస్తున్నట్టు తెలిపింది. -
Andhra Pradesh: ‘పారిశ్రామిక’ పరుగులు
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ జిల్లా కడప సమీపంలోని కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ పార్క్ కేంద్రంగా పారిశ్రామిక రంగం పరుగులు పెడుతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. అల్ డిక్సన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్‌ను సోమవారం ఆయన ప్రారంభించారు. అలాగే, సీఎం సమక్షంలో టెక్నోడోమ్ (టీవీ యూనిట్), వర్చువల్ మేజ్, సంస్థలకు సీఎం శంకుస్థాపన చేయగా.. టెక్నోడోమ్ (వాషింగ్ మెషీన్ యూనిట్), ఛానెల్ ప్లే ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలతో ఎంఓయూలు కుదుర్చుకున్నారు.అంతకుముందు.. కడప గడపలో రూ.5.61 కోట్లతో ఆధునికీకరించిన రాజీవ్‌మార్గ్, రూ.1.37 కోట్లతో ఏర్పాటుచేసిన రాజీవ్ పార్కునూ ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. కొప్పర్తిలో పారిశ్రామికరంగం ఊపందుకుందన్నారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా ఇన్చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానమ్, జెడ్పీ చైర్మన్ అమర్నాథ్రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జునరెడ్డి, ఎమ్మెల్సీలు గోవిందరెడ్డి, రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు ఎస్.రఘురావిురెడ్డి, డాక్టర్ సుధీర్‌రెడ్డి, డాక్టర్ సుధా, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, రాచమల్లు శివప్రసాదరెడ్డి, మేడా మల్లికార్జున రెడ్డి నగర మేయర్ సురేష్‌బాబు, చీఫ్ సెక్రటరీ కేఎస్ జవహర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ వి. విజయరామరాజు, జేసీ గణేష్‌కుమార్, ఎస్పీ అన్బురాజన్, ట్రెయినీ కలెక్టర్ రాహుల్ మీనా, జెడ్పీటీసీ నరేన్ రామాంజనేయరెడ్డి, అల్ డిక్సన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ముగిసిన మూడ్రోజుల పర్యటన దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈనెల 8న వైఎస్సార్ జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన సోమవారం ముగిసింది. ఈ సందర్భంగా ఆయన జమ్మలమడుగు, పులివెందుల, కడపలలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మరోవైపు.. సోమవారం మధ్యాహ్నం జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు జగన్‌కు ఆత్మీయ వీడ్కోలు పలికారు. 2.05 గంటలకు కడప విమానాశ్రయం నుంచి గన్నవరానికి బయల్దేరి వెళ్లారు. సంస్థల వివరాలు.. – అల్ డిక్సన్ టెక్నాలజీస్.. అల్ డిక్సన్ కంపెనీలో సీసీ కెమెరాలు, డిజిటల్ వీడియో రికార్డర్లు మొదలైన ఎలక్ట్రానిక్ పరికరాలను ఉత్పత్తి చేస్తారు. ఐదేళ్ల కాలవ్యవధిలో రూ.127 కోట్ల పెట్టుబడితో నిర్మించిన ఈ సంస్థలో 1,800 మందికి ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. అలాగే, ఉత్పత్తి సామర్థ్యం పెంపులో భాగంగా మరో రూ.80 కోట్ల పెట్టుబడితో ‘ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, సెక్యూరిటీ కెమెరాలు మొదలైన పరికరాలు తయారుచేస్తారు. తద్వారా మరో 1,100 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అలాగే, రూ.125.26 కోట్ల పెట్టుబడితో ఏర్పాటుచేసే మరో యూనిట్ ద్వారా 630 మందికి ఉద్యోగావకాశాలు అందించే లక్ష్యంతో అల్ డిక్సన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ముందుకు సాగుతోంది. మొదటి దశలో ఉత్పత్తులు ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటివరకు కంపెనీ 860 మందికి ఉపాధి కల్పిస్తోంది. వర్చువల్ మేజ్ సాఫ్టీస్ ప్రైవేట్ లిమిటెడ్.. 2007 నుంచి వర్చువల్ మ్యాప్ ఆధారిత సాఫ్ట్వేర్ సొల్యూషన్స్‌ను అభివృద్ధి చేస్తున్న ‘వర్చువల్ మేజ్ సాఫ్టీస్ ప్రైవేట్ లిమిటెడ్’ ఉత్పత్తులు ప్రారంభించేందుకు ముందుకొచ్చింది. ఎలక్ట్రిక్ వాహనాలకు వాడే బ్యాటరీలు, జీపీఎస్ ట్రాకర్, స్మార్ట్ పీసీబీ వంటి అధునాతన డివైస్‌లను ఇక్కడ ఉత్పత్తి చేస్తారు. రూ.71 కోట్ల పెట్టుబడితో పర్యావరణ హితమైన యూనిట్ ఏర్పాటుకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. దీని ద్వారా సుమారు 1,350 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. టెక్నోడోమ్ సంస్థ.. అరబ్ దేశాల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన ఎలిస్టా కంపెనీకి అనుబంధంగా ‘టెక్నోడోమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ‘కన్సూ్యమర్ ఎలక్ట్రానిక్ కంపెనీ రూ.52 కోట్లతో ఏర్పాటవుతోంది. దుబాయ్‌లో వీరి ప్రధాన కార్యాలయం ఉండగా, నోయిడాలో భారత్ ప్రధాన కార్యాలయం ఉంది. ట్రేడింగ్ కంపెనీగా ఈ సంస్థ గుర్తింపు పొందుతోంది. బ్రాండెడ్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, ప్రముఖ ఐటీ ఉత్పత్తుల సరఫరాదారులలో ఒకటిగా మారిన ఈ సంస్థ.. ఏపీ పారిశ్రామిక అభివృద్ధిలో భాగస్వామ్యమైంది. గృహోపకరణాలు, గృహ వినోదం, వంటగది ఉపకరణాలు, ఐటీ వస్తువులు, కార్ ఆడియో, గేమింగ్ ఉత్పత్తులు, స్మార్ట్ వాచీలను ఉత్పత్తి చేయనుంది. ప్రత్యక్షంగా 200 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఛానెల్ ప్లే ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ.. రూ.100 కోట్ల పెట్టుబడితో ఆడియో సిస్టం భాగాలను ఉత్పత్తి చేయనున్న ఛానెల్ ప్లే ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కన్సల్టింగ్, రీసెర్చ్ సంస్థ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఎగ్జిక్యూషన్లో నైపుణ్యం కలిగి 8,000 పైగా ప్రాజెక్టు సిబ్బందితో మంచి వార్షిక ఆదాయంతో పెద్ద సంస్థగా గుర్తింపు పొందింది. ఇక్కడ 2,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ సొల్యూషన్స్ సేల్స్ ఫోర్స్ ఔట్సోర్సింగ్, విజువల్ మర్చండైజింగ్, లాయల్టీ ప్రోగ్రాంలు వున్నాయి. అలాగే, వీరి ముఖ్య ఉత్పత్తులు సౌండ్బార్లు, వూఫర్లు, మల్టీమీడియా స్పీకర్లు, పార్టీ స్పీకర్లు, టవర్లు వంటివి తయారుచేస్తారు. -
ఎంఎస్ఎంఈలపై త్రిముఖ సూత్రం
సాక్షి, అమరావతి: అత్యధిక సంఖ్యలో ఉపాధి కల్పిస్తూ పారిశ్రామిక రంగంలో కీలకపాత్ర పోషిస్తున్న సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి (ఎంఎస్ఎంఈ) పరిశ్రమల ఎగుమతులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. వివిధ దేశాలకు ఎగుమతులు చేసే విధంగా డిమాండ్, టెక్నాలజీ, మార్కెటింగ్ లాంటి మూడు అంశాలపై ప్రధానంగా దృష్టిపెట్టి ప్రభుత్వం మార్గదర్శనం చేయాలని సూచించారు. ఎంఎస్ఎంఈలు తయారు చేసే ఉత్పత్తులను విక్రయించేందుకు కేవలం స్థానిక మార్కెట్లపైనే ఆధారపడకుండా ఎంఎన్‌సీలతో (బహుళ జాతి కంపెనీలు) అనుసంధానిస్తే మెరుగైన మార్కెటింగ్ ఫలితాలు ఉంటాయని సూచించారు. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాల అమలుపై సీఎం జగన్ సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రంగాల వారీగా సమీక్షించారు. ఎంఎస్ఎంఈలను మరింత ప్రోత్సహించేలా పరిశ్రమల శాఖలో ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పి కార్యదర్శిని నియమించాలని ఆదేశించారు. డిగ్రీలకు తోడు నైపుణ్యాలను పెంపొందించడం ద్వారా పరిశ్రమలకు నిపుణులైన మానవ వనరులను అందుబాటులోకి తేవాలన్నారు. రూ.3,39,959 కోట్ల పెట్టుబడులకు ఆమోదం వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పది దఫాలు ఎస్ఐపీబీ సమావేశాలను నిర్వహించిం 59 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినట్లు అధికారులు తెలిపారు. వీటిద్వారా రూ.3,39,959 కోట్ల పెట్టుబడులు రానుండగా 2,34,378 మందికి ఉద్యోగాలు లభించనున్నాయన్నారు. విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో పరిశ్రమలు వాణిజ్య శాఖ తరఫున 100 ఒప్పందాలు చేసుకోగా ఇప్పటికే రూ.2,739 కోట్ల విలువైన 13 ఒప్పందాలు వాస్తవ రూపం దాల్చినట్లు తెలిపారు. వీటిద్వారా 6,858 మందికి ఉద్యోగాలు లభించాయన్నారు. రానున్న నెలల్లో మరిన్ని కంపెనీలు పనులు మొదలు కానున్నాయి. 2024 జనవరిలోపు 38 కంపెనీలు, మార్చి లోపు మరో 30 కంపెనీలు పనులు పూర్తి చేసుకుని ఉత్పత్తిని ప్రారంభిస్తాయని వివరించారు. గత ప్రభుత్వ హయాంలో భాగస్వామ్య సదస్సుల్లో 1,739 ఎంవోయూల ద్వారా రూ. 18,87,058 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు చేసుకోగా 10 శాతం కూడా వాస్తవరూపం దాల్చలేదన్నారు. విశాఖ ఖ్యాతిని పెంచేలా ఐటీ హబ్ ఐటీ, ఐటీ ఆధారిత సేవలకు విశాఖను హబ్‌గా తీర్చిదిద్దేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ప్రముఖ సంస్థలతో నిరంతరం సంప్రదింపులు కొనసాగించాలన్నారు. దీనివల్ల విశాఖ నగర ఖ్యాతి పెరిగి ఐటీకి చిరునామాగా మారుతుందన్నారు. గత గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో ఐటీ, ఐటీ ఆధారిత, ఎలక్ట్రానిక్స్ రంగంలో రూ.44,963 కోట్ల విలువైన 88 ఒప్పందాలు కుదిరినట్లు అధికారులు తెలిపారు. ఇందులో ఇప్పటికే 85 శాతం కంపెనీలు నిర్మాణ పనులు ప్రారంభించడం / ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. జీఐఎస్‌లో కుదిరిన పెట్టుబడుల్లో ఇప్పటికే రూ.38,573 కోట్లు వాస్తవ రూపం దాల్చినట్లు తెలిపారు. రూ.8.85 లక్షల కోట్ల విద్యుత్ ప్రాజెక్టులు విశాఖ సదస్సు ద్వారా 25 విద్యుత్ ప్రాజెక్టుల కోసం ఒప్పందాలు కుదుర్చుకోగా 8 ఎస్ఐపీబీ ఆమోదం కోసం పంపినట్లు అధికారులు తెలిపారు. మరో నాలుగు ప్రాజెక్టుల్లో పనులు ప్రారంభం కానుండగా మరో 8 ప్రాజెక్టుల డీపీఆర్‌లు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. విశాఖ సదస్సు కంటే ముందు 20 విద్యుత్ ప్రాజెక్టుల ఒప్పందాలు కుదరగా 6 ప్రాజెక్టుల్లో పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. మరో 11 ప్రాజెక్టుల డీపీఆర్‌లు సిద్ధమైనట్లు అధికారులు పేర్కొన్నారు. వీటి ద్వారా రూ.8.85 లక్షల కోట్ల పెట్టుబడులతో 1,29,650 మందికి ఉద్యోగాలు లభించనున్నట్లు తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడుల ప్రతిపాదనలను వీలైనంత త్వరగా కార్యరూపంలో తెచ్చేలా కృషి చేయాలని సీఎం ఆదేశించారు. డిమాండ్‌లో తరచూ తీవ్ర వ్యత్యాసం ఉండే టమాటా, ఉల్లి లాంటి పంటల విషయంలో ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పే పనులను వేగవంతం చేయాలన్నారు. నాలుగేళ్లలో వృద్ధి బాగుంది – స్థిర ధరల సూచీ ప్రకారం 2019లో రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి 5.36 శాతం. ఇది దేశ సగటు 6.5 శాతం కన్నా తక్కువ – గత నాలుగేళ్లలో మాత్రం రాష్ట్రం మంచి ప్రగతి సాధించింది ట – 2021–22లో రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి రేటు 11.43 శాతానికి పెరిగింది – 2022–23లో జీఎస్డీపీలో గ్రోత్ రేట్ 16.22 శాతంగా ఉంది. – ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో వరుసగా నంబర్ వన్ స్థానంలో నిలుస్తున్న ఏపీ – జీడీఎస్‌డీపీలో రాష్ట్ర పారిశ్రామిక రంగం వాటా దాదాపు రూ.13 లక్షల కోట్లు. పారిశ్రామికరంగం వాటా 21 నుంచి 23 శాతానికి పెరుగుదల. – 2022 జనవరి – డిసెంబరు మధ్య రాష్ట్రానికి రూ.45,217 కోట్ల పెట్టుబడుల రాక. – 2022–23లో రాష్ట్రం నుంచి రూ.1.6 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తుల ఎగుమతి. – 2021–22లో ఎగుమతుల విలువ రూ.1.43 లక్షల కోట్లు కాగా గత ఆర్థిక సంవత్సరంలో రూ. రూ.1.6 లక్షల కోట్లకు పెరుగుదల. -
పరిశ్రమకు ‘ప్రోత్సాహం’
సాక్షి, హైదరాబాద్: పారిశ్రా మికాభివృద్ధి ప్రోత్సాహకాల కు పెద్దపీట వేస్తూ పారిశ్రా మిక రంగానికి 2023–24 రాష్ట్ర వార్షిక బడ్జెట్లో రూ.4,037 కోట్లు ప్రతిపాదించారు. ప్రస్తుత (2022–23) బడ్జెట్‌తో పోలిస్తే రూ.817 కోట్లు అదనంగా కేటాయించారు. నిర్వహణ పద్దు కింద రూ.254.77 కోట్లు, ప్రగతి పద్దు కింద వివిధ అవసరాల కోసం రూ.2,235.29 కోట్లు కేటాయించారు. వీటితో పాటు ఎస్సీ అభివృద్ధి నిధి నుంచి రూ.834.67 కోట్లు, ఎస్టీ అభివృద్ధి నిధి నుంచి రూ.717.25 కోట్లు కేటాయించారు. పారిశ్రామిక ప్రోత్సాహకాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ రూ.2,937.20 కోట్లు (సుమారు 72 శాతం) కేటాయించారు. విద్యుత్ సబ్సిడీకి రూ.316.39 కోట్లు, చిన్న, సూక్ష్మ పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు పావలావడ్డీని వర్తింప చేస్తూ రూ.266.20 కోట్లు ప్రతిపాదించారు. నేత కార్మికుల బీమాకు రూ.50 కోట్లు నేత కార్మికుల బీమాకు రూ.50 కోట్లు, పరిశ్రమల శాఖకు అనుబంధంగా ఉన్న చేనేత, జౌళి పరిశ్రమల అభివృద్ధి కోసం రూ.2 కోట్లు చొప్పున కేటాయించారు. ఇసుక తవ్వకానికి టీఎస్ఎండీసీ వెచ్చిస్తున్న ఖర్చులను తిరిగి చెల్లించేందుకు రూ.120 కోట్లు ప్రతిపాదించారు. వాణిజ్యం, ఎగుమతులు, చెరుకు, గనులు, భూగర్భ వనరులు, హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్, టీఎస్ లిప్కో తదితరాలకు నామమాత్ర కేటాయింపులే దక్కాయి. ఐటీ రంగానికి రూ.366 కోట్లు ఐటీ రంగానికి నిర్వహణ, ప్రగతి పద్దులను కలుపుకుని రూ.366 కోట్లను తాజా బడ్జెట్లో ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రస్తుత ఏడాదితో పోలిస్తే ప్రగతిపద్దు కింద రూ.6 కోట్ల మేర స్వల్ప పెంపుదల కనిపించింది. టీ హబ్ ఫౌండేషన్‌కు రూ.177.61 కోట్లు, వీ హబ్‌కు రూ.7.95 కోట్లు కేటాయించింది. ఓఎఫ్సీ టెక్నాలజీతో అన్ని మండలాల్లోని ప్రధాన ప్రభుత్వ కార్యాలయాల్లో వీడియో సమావేశ సదుపాయాల కోసం రూ.18.14 కోట్లు కేటాయించారు. స్టేట్ ఇన్నోవేషన్ సెల్‌కు రూ.8.88 కోట్లు, టీ ఎలక్ట్రానిక్స్‌కు రూ.8 కోట్లు కేటాయించింది. -
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు మంత్రి కేటీఆర్ లేఖ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పారిశ్రామిక పురోగతికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌కు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. తెలంగాణ వంటి రాష్ట్రాలకు సహకరిస్తే దేశానికి సహకరించినట్లేనని లేఖలో పేర్కొన్నారు. 'దేశ పారిశ్రామిక రంగంలో తెలంగాణ కీలకంగా మారింది. తెలంగాణకు కేంద్ర ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి. న్యాయంగా దక్కాల్సిన నిధులు, ప్రాజెక్టులను కేటాయించాలి. హైదరాబాద్‌లో నేషనల్ డిజైన్ సెంటర్ ఏర్పాటు చేయాలి. హైదరాబాద్ ఫార్మాసిటీకి బడ్జెట్లో నిధులు కేటాయించాలి. వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ అభివృద్ధికి తోడ్పాటు అందించాలి' అని కోరారు. 'హైదరాబాద్- విజయవాడ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి నిధులివ్వాలి. ఆదిలాబాద్‌లో సీసీఐ రీ ఓపెన్ చేయాలి. డిఫెన్స్ ఇండిస్ట్రియల్ ప్రొడక్షన్ కారిడార్‌లో హైదరాబాద్‌ను చేర్చాలి. చేనేత రంగానికి జీఎస్టీ మినహాయించాలి. ఐటీఐఆర్ లేదా సమాన ప్రాజెక్టు ఇవ్వాలి. జహీరాబాద్ నిమ్జ్‌కు కూడా నిధులు కేటాయించాలి' అని మంత్రి కేటీఆర్ లేఖలో కోరారు. చదవండి: (అమెరికాలో సంపాదించి.. ఆంధ్రాలో పోటీ చేయాలని..!) -
Andhra Pradesh: అభి'వృద్ధి'లో అగ్రగామి
సాక్షి, అమరావతి: వృద్ధి రేటు పరంగా 2022లో ఆంధ్రప్రదేశ్ రికార్డు నెలకొల్పింది. 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దేశంలోనే అత్యధిక వృద్ధిరేటు నమోదు చేసిన రాష్ట్రంగా నిలిచింది. కోవిడ్ సంక్షోభంలోనూ రాష్ట్ర ప్రభుత్వం అవలంబించిన విధానాలు, ప్రోత్సాహకాల కారణంగా 2021–22లో వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో భారీ వృద్ధి నమోదైంది. కోవిడ్‌కు ముందు 2018–19 చంద్రబాబు హయాంలో వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో వృద్ధి కేవలం సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. అయితే, 2021–22లో స్థిర ధరల ఆధారంగా వ్యవసాయ రంగంలో 11.27 శాతంతో రెండంకెల వృద్ధి నమోదు కాగా.. పారిశ్రామిక రంగంలో ఏకంగా 12.78 శాతంతో రెండంకెల వృద్ధి నమోదైంది. సేవా రంగంలో కూడా 2018–19 కన్నా 2021–22లో 9.73 శాతం వృద్ధి నమోదైంది. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 11.43 శాతం వృద్ధి మరోవైపు.. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యధికంగా 11.43 శాతం వృద్ధి సాధించినట్లు ఆర్బీఐతో పాటు కేంద్ర గణాంకాలు, కార్యక్రమాలు అమలు మంత్రిత్వ శాఖ నివేదికలు ఇటీవలే వెల్లడించాయి. ఇదే 2018–19 చంద్రబాబు హయాంలో 5.36 శాతమే వృద్ధి నమోదైంది. కోవిడ్ సంక్షోభంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం, పారిశ్రామిక రంగాలకు అండగా నిలవడంవల్లే సాధారణ పరిస్థితులకు మించి రెండంకెల వృద్ధి నమోదవ్వడానికి కారణమని తేలింది. కోవిడ్ కారణంగా రాష్ట్ర సొంత ఆదాయంతో పాటు కేంద్రం నుంచి వచ్చే నిధుల వాటాలో తగ్గుదల ఉన్నప్పటికీ వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు కుంటుపడకుండా అవసరమైన ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించడంతోనే ఈ రంగాలు నిలదొక్కుకుని దేశంలోనే అత్యధిక వృద్ధి సాధించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలబడింది. ఆదాయ వనరులు తగ్గినప్పటికీ కూడా ప్రజల జీవనోపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ‘నవరత్నాలు’ పథకాలను నిరాటంకంగా అమలుచేసింది. దీంతో ప్రజల కొనుగోలు శక్తి పెరగడంతో ఆ ప్రభావం రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధిపైన స్పష్టంగా కనిపించింది. అలాగే, కోవిడ్ ఆంక్షలున్నప్పటికీ వ్యవసాయ, పారిశ్రామిక కార్యకలాపాలు కొనసాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది. రైతులకు అవసరమైన పెట్టుబడి సాయాన్ని చెప్పిన తేదీకి ఇవ్వడమే కాకుండా రైతులు పండించిన పంటలను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయడం, రైతులకు అవసరమైన రుణాలను బ్యాంకుల ద్వారా ఇప్పిండం వంటి చర్యలను ప్రభుత్వం పక్కాగా అమలుచేసింది. దీనివల్లే.. 2021–22లో వ్యవసాయ రంగం వృద్ధి 11.27శాతంగా నమోదైంది. అదే 2018–19లో కేవలం 3.54కు పరిమితమైంది. పారిశ్రామిక వృద్ధి ఇలా.. ఇక పారిశ్రామిక రంగం విషయానికొస్తే.. 2018–19లో చంద్రబాబు హయాంలో 3.17 శాతమే వృద్ధి నమోదు కాగా అదే 2021–22లో 12.78 శాతంతో రెండంకెల వృద్ధి నమోదైంది. రాష్ట్ర ప్రభుత్వం అవలంబించిన విధానంతో పాటు పారిశ్రామిక రాయితీలను సకాలంలో విడుదల చేసింది. 2021–22లో సాధారణ కేటగిరిలో 1,046 ఎంఎస్ఎంఈలకు రూ.191.10 కోట్ల రాయితీలను విడుదల చేసింది. ఓబీసీ కేటగిరిలో 479 ఎంఎస్ఎంఈలకు రూ.101.31 కోట్ల రాయితీలను విడుదల చేసింది. వైఎస్సార్ నవోదయం పేరుతో ఒకసారి ఎంఎస్ఎంఈ రుణాల పునర్వ్యవస్థీకరణ అమలుచేశారు. ఏకంగా 1,78,919 ఖాతాలకు సంబంధించిన రుణాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. దీంతోపాటు 2021–22లో రూ.1,762.31 కోట్ల పెట్టుబడితో 5,907 ఎంఎస్ఎంఈలు ఏర్పాటవ్వడంతో 37,604 మందికి ఉపాధి లభించింది. అలాగే, కోవిడ్ కష్టాల్లోనూ పాక్షిక ఆంక్షలు, నిబంధనలు అమలుచేయడంతో సేవా రంగంలో కూడా 2021–22లో 9.73 % వృద్ధి నమోదైంది. అదే 2018–19 బాబు హయాంలో కేవలం 4.84 శాతమే. 2021–22లో కేంద్రం విడుదల చేసిన నివేదిక మేరకు స్థిర ధరల ఆధారంగా రాష్ట్రాల జీఎస్‌డీపీల శాతం ఇలా.. -
రాష్ట్రంలో రూ.400 కోట్ల ‘ఇంధన’ పెట్టుబడులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పరిశ్రమల్లో రూ.400 కోట్ల ఇంధన సామర్థ్య ప్రాజెక్టులు రానున్నాయి. పారిశ్రామిక రంగంలో ఇంధన సామర్థ్య ప్రాజెక్టులకు అవసరమైన పెట్టుబడులను సులభంగా అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో పరిశ్రమలు, ఆర్థికసంస్థలను ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు దేశంలో తొలిసారిగా పెట్టుబడుల సదస్సులకు రాష్ట్ర ప్రభుత్వం అంకురార్పణ చేసింది. వరుసగా రెండేళ్లు విశాఖపట్నంలో రాష్ట్ర ఇంధన శాఖకు చెందిన ఇంధన పరిరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) ఈ పెట్టుబడుల సదస్సులు నిర్వహించింది. ఈ సదస్సులు ఆదర్శంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) మరికొన్ని రాష్ట్రాల్లో ఈ తరహా సదస్సులు ఏర్పాటుచేసింది. పెట్టుబడిదారులు, పరిశ్రమల మధ్య సమన్వయం కోసం కొద్దిరోజుల కిందట ఒక ఫెసిలిటేషన్ సెంటర్‌ను కూడా ప్రారంభించింది. దేశవ్యాప్తంగా నిర్వహించిన పెట్టుబడుల సదస్సుల్లో 73 పారిశ్రామిక ఇంధన పొదుపు ప్రాజెక్టులను గుర్తించింది. వీటిద్వారా రూ.2,500 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేశారు. ఢిల్లీలో సోమవారం నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో వాటి జాబితాను విడుదల చేసింది. దాని ప్రకారం 14 ప్రాజెక్టులతో ఆంధ్రప్రదేశ్.. దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఆదర్శంగా ఏపీ సిమెంట్, స్టీల్, పవర్ప్లాంట్లు, ఫెర్టిలైజర్లు, కెమికల్స్, టెక్స్టైల్స్ రంగాలకు చెందిన ఈ 73 ప్రాజెక్టుల ప్రతిపాదనల్లో 45 ప్రాజెక్టులను బీఈఈ ఫెసిలిటేషన్ సెంటర్ వద్ద నమోదైన 22 ఆర్థికసంస్థలకు సిఫార్సు చేసింది. వీటిని అమల్లోకి తీసుకురావడం వల్ల ఆయా పరిశ్రమల్లో సుమారు 125 ఇంధన సామర్థ్య సాంకేతిక మార్పులు చేపట్టవచ్చు. ఇందుకు రూ.2,218 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. దీనివల్ల ఏడాదికి 67.06 లక్షల మెగా వాట్ అవర్ (ఎండబ్ల్యూహెచ్) విద్యుత్ ఆదా అవుతుంది. 49,078 మెట్రిక్ టన్నుల బొగ్గు, 2.56 కోట్ల స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల (ఎస్సీఎం) సహజ వాయువు, 95 వేల లీటర్ల హైస్పీడ్ డీజిల్ ఆదా అవుతాయి. 6.2 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గుతాయి. ఫలితంగా పరిశ్రమల్లో ఉత్పాదకత, ఆదాయాలు మెరుగుపడతాయి. రాష్ట్రంలో ఇప్పటికే ఇంధన పొదుపు, ఇంధన సామర్థ్య కార్యక్రమాల ద్వారా దాదాపు రూ.3,800 కోట్ల విలువైన 5,600 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అయింది. తద్వారా 4.76 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించి రాష్ట్రం దేశానికి ఆదర్శమైంది. అదితితో సమన్వయం పెట్టుబడుల ప్రక్రియను సులభతరం చేయడానికి ‘అదితి’ పేరుతో రూపొందించిన ప్రత్యేక వెబ్ పోర్టల్‌ని న్యూఢిల్లీలో సోమవారం బీఈఈ ఆవిష్కరించింది. ఈ సందర్భంగా బీఈఈ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అశోక్‌కుమార్ మాట్లాడుతూ ఇంధన సామర్థ్య ప్రాజెక్టులు చేపట్టే పరిశ్రమలకు ఐదుశాతం వడ్డీ రాయితీ ఇవ్వాలని ఏపీ చేసిన ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని చెప్పారు. ఇంధన సామర్థ్య ప్రాజెక్టుల అమలులో చురుగ్గా వ్యవహరిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ను అభినందించారు. రాష్ట్రం నుంచి వచ్చిన మరిన్ని ప్రాజెక్టులను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఏపీ నుంచి ఈ సదస్సుకు హాజరైన ఏపీఎస్ఈసీఎం సీఈవో ఎ.చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ పగటిపూట రైతుకు తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా చేస్తూనే, పరిశ్రమలకు, గృహాలకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా అందుబాటులో ఉండేలా వ్యవస్థను మరింత బలోపేతం చేయడం కోసం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. బీఈఈ డైరెక్టర్ వినీత కన్వాల్ మాట్లాడుతూ పరిశ్రమలు, బ్యాంకులు, ఆర్థికసంస్థల మధ్య బీఈఈ ఫెసిలిటేషన్ సెంటర్ సమన్వయకర్తగా పనిచేస్తుందని చెప్పారు. -
Pre-Budget 2023: ఉపాధి కల్పనే ధ్యేయంగా బడ్జెట్..
న్యూఢిల్లీ: వినియోగాన్ని పెంచడానికి ఉపాధి కల్పనే ధ్యేయంగా వచ్చే ఆర్థిక సంవత్సరం (2023–24) బడ్జెట్‌ను రూపొందించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు పారిశ్రామిక రంగం విజ్ఞప్తి చేసింది. వస్తు సేవల పన్ను (జీఎస్టీ), వ్యక్తిగత ఆదాయపు పన్ను శ్లాబ్‌లను హేతుబద్ధీకరించాలని, తద్వారా పన్ను బేస్‌ను విస్తృతం చేసే చర్యలపై బడ్జెట్ దృష్టి పెట్టాలని ఆర్థిక మంత్రితో సోమవారం జరిగిన వర్చువల్ ప్రీ–బడ్జెట్ సమావేశంలో కోరాయి. ఈ సమావేశంలో తమ ప్రతినిధులు చేసిన సూచనలపై పారిశ్రామిక వేదికలు చేసిన ప్రకటనల ముఖ్యాంశాలు.. ప్రైవేటీకరణకు ప్రాధాన్యం: సీఐఐ ‘అంతర్జాతీయ పరిణామాలు కొంతకాలం పాటు అననుకూలంగా కొనసాగే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో దేశీయ డిమాండ్, అన్ని రంగాల పురోగతి, వృద్ధి పెంపునకు చర్యలు అవసరం. ఉపాధి కల్పనను ప్రోత్సహించడం ద్వారా మన దేశీయ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసుకోవాలి. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ దూకుడుపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి మధ్య భారతదేశ ఆర్థిక వ్యవస్థను గాడి తప్పకుండా చూడ్డానికి పెట్టుబడులకు దారితీసే వృద్ధి వ్యూహంపై దృష్టి పెట్టాలి. మూలధన వ్యయాల కేటాయింపుల పెంపునకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఉపాధి కల్పనను పెంచేందుకు ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని ప్రవేశపెట్టాలి. ముఖ్యంగా పట్టణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. వ్యాపారాలకు సంబంధించి పన్ను ఖచ్చితత్వం అవసరం. ఇందుకుగాను కార్పొరేట్ పన్ను రేట్లను ప్రస్తుత స్థాయిలో కొనసాగించాలి. పన్నుల విషయంలో మరింత సరళీకరణ, హేతుబద్ధీకరణ, చెల్లింపులో సౌలభ్యత, వ్యాజ్యాల తగ్గింపు ప్రధాన ప్రాధాన్యతలుగా ఉండాలి’ అని సీఐఐ ప్రెసిడెంట్ సంజీవ్ బజాజ్ పేర్కొన్నారు. పంచముఖ వ్యూహం: పీహెచ్‌డీసీసీఐ ‘కేంద్ర బడ్జెట్ (2023–24) భౌగోళిక–రాజకీయ అనిశ్చితులు, అధిక ద్రవ్యోల్బణం, ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగమనం వంటి కీలకమైన తరుణంలో రూపొందుతోంది. ఈ తరుణంలో స్థిరమైన ఆర్థిక వృద్ధి పథాన్ని కొనసాగించడానికి, దేశీయ వృద్ధి వనరులను పెంపొందించడానికి కీలక చర్యలు అవసరం. ముఖ్యంగా ప్రైవేట్ పెట్టుబడులను పునరుద్ధరించడానికి పంచముఖ వ్యూహాన్ని అవలంభించాలి. వినియోగాన్ని పెంచడం, కర్మాగారాల్లో సామర్థ్య వినియోగాన్ని పెంచడం, ఉద్యోగాల అవకాశాల కల్పన, సామాజిక మౌలిక సదుపాయాల నాణ్యతను మెరుగుపరచడం, భారతదేశ ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం వంటి చర్యలు ఇందులో కీలకమైనవి’అని పీహెచ్‌డీసీసీఐ ప్రెసిడెంట్ సాకేత్ దాల్మియా సూచించారు.æ శుక్రవారం రాష్ట్రాల ఆర్థికమంత్రులతో భేటీ కాగా, ఆర్థికమంత్రి సీతారామన్ వచ్చే శుక్రవారం (25వ తేదీ) రాష్ట్రాల ఆర్థికమంత్రులతో న్యూఢిల్లీలో ప్రీ–బడ్జెట్ సమావేశం నిర్వహించనున్నారు. -
23న విశాఖలో ఇంధన సామర్థ్య పెట్టుబడుల సదస్సు
సాక్షి, అమరావతి: ఇంధన సామర్థ్యం పెట్టుబడుల సదస్సు (ఇన్వెస్ట్మెంట్ బజార్)ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) సమన్వయంతో 23న విశాఖలో నిర్వహించనున్నట్టు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ(బీఈఈ) డైరెక్టర్ జనరల్ అభయ్ బాక్రే ప్రకటించారు. రాష్ట్ర ఇంధన శాఖ, ఏపీఎస్ఈసీఎం అధికారులతో ఆదివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర పారిశ్రామిక రంగంలో ఇంధన సామర్థ్య సాంకేతికతను అందుబాటులోకి తేవటం, దానిని వినియోగించుకోవడం కోసం పరిశ్రమలకు ఆర్థిక సహకారం అందించడమే లక్ష్యంగా ఆసక్తి గల పరిశ్రమలను, బ్యాంకులను, ఆర్థిక సంస్థలను ఒకే వేదిక పైకి తెచ్చేందుకు సదస్సును నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ ఇన్వెస్ట్మెంట్ బజార్ వేదికగా పెట్టుబడులకు అవకాశమున్న ప్రాజెక్టులను గుర్తిస్తామని, సదస్సులో ఎంపికైన పరిశ్రమలకు ప్రాజెక్టులు అమలు చేసేందుకు ఆర్థిక సహకారం అందే ఏర్పాటు చేస్తామని అభయ్ బాక్రే చెప్పారు. గతేడాది మార్చిలో ఇదే విశాఖలో దేశంలో తొలిసారిగా ఇంధన సామర్థ్య పెట్టుబడుల సదస్సును నిర్వహించిన ఘనత ఏపీకి దక్కుతుందని, విద్యుత్ రంగంలో ప్రత్యేకించి ఇంధన సామర్థ్యం, పునరుత్పాదక ఇంధన రంగాల్లో ఏపీ పనితీరును గుర్తించి మరోసారి విశాఖలో సదస్సు నిర్వహించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. ఇంధన సామర్థ్య ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, పరిశ్రమల నుంచి ఏపీఎస్ఈసీఎంకు ప్రతిపాదనలు వస్తే వాటికి అవసరమైన సాంకేతిక ప్రక్రియ నిర్వహించి, ఆర్థిక సంస్థలకు పంపుతామని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ తెలిపారు. సమావేశంలో ఏపీఎస్ఈసీఎం సీఈవో చంద్రశేఖరరెడ్డి, ఇంధన శాఖ అధికారులు పాల్గొన్నారు. -
పారిశ్రామిక రంగానికి ‘సెప్టెంబర్’ ఊరట
న్యూఢిల్లీ: పారిశ్రామిక రంగం సెప్టెంబర్‌లో కొంత సానుకూల ఫలితాన్ని సాధించింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) సమీక్షా నెల్లో 3.1 శాతం (2021 ఇదే నెలతో పోల్చి) పెరిగింది. తయారీ, మైనింగ్, విద్యుత్ రంగాలు సెప్టెంబర్‌లో మంచి ఫలితాలను అందించినట్లు గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ పే ర్కొంది. ఆగస్టులో ఐఐపీలో అసలు వృద్ధిలేకపోగా 0.7% క్షీణతను నమోదుచేసుకుంది. జూలై లో వృద్ధి కేవలం 2.2%. అయితే 2021 సెప్టెంబర్‌లో పారిశ్రామిక వృద్ధి 4.4 శాతంకన్నా, తాజా వృద్ధి రేటు తక్కువగానే ఉండడం గమనార్హం. ► తయారీ: మొత్తం ఐఐపీలో దాదాపు దాదాపు 70 శాతం వెయిటేజ్ కలిగిన తయారీ రంగం సమీక్షా నెల్లో 1.8 శాతం పురోగమించింది. 2021 ఇదే నెల్లో వృద్ధి 4.3 శాతం. ► విద్యుత్: ఈ రంగం వృద్ధి రేటు 11.6%గా ఉంది. 2021 ఇదే నెల్లో ఈ రేటు కేవలం 0.9%. ► మైనింగ్: వృద్ధి 8.6% నుంచి 4.6%కి తగ్గింది. ► క్యాపిటల్ గూడ్స్: ఉత్పత్తి 10.3 శాతం పెరిగింది. 2021 ఇదే నెల్లో ఈ రేటు 3.3 శాతం. ► కన్జూమర్ డ్యూరబుల్స్: 4.5% క్షీణించింది. గతేడాది ఈ నెల్లో 1.6% వృద్ధి జరిగింది. ఆరు నెలల్లో 7 శాతం పురోగతి కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో (2022–23, ఏప్రిల్–సెప్టెంబర్) ఐఐపీ వృద్ధి రేటు 7 శాతంగా నమోదైంది. -
స్టార్టప్‌లకు ‘కల్పతరువు’
సాక్షి, అమరావతి: పారిశ్రామికరంగంలో నాలుగో తరం టెక్నాలజీ ఆవిష్కరణలకు విశాఖ వేదిక అవుతోంది. విశాఖ ఉక్కు (ఆర్ఐఎన్ఎల్)తో కలిసి సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) సంయుక్తంగా ‘కల్పతరువు’ పేరుతో ఏర్పాటుచేసిన ఇండస్ట్రీ–4.0 సీవోఈ (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ) కార్యకలాపాలు సెప్టెంబర్ 20 నుంచి లాంఛనంగా ప్రారంభం కానున్నాయి. దేశంలోని స్టార్టప్‌లను ఆకర్షించేలా ఓపెన్ చాలెంజ్ ప్రోగ్రాం–1 (ఓసీపీ–1)ను కల్పతరువు సీఓఈ ప్రకటించింది. విశాఖపట్నంలో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలు ఆర్ఐఎన్ఎల్, ఎన్టీపీసీ, వైజాగ్ పోర్టు, హెచ్‌పీసీఎల్ వంటి పరిశ్రమల్లో మానవ వనరుల వినియోగం తగ్గించి ఖర్చులను నియంత్రించే నూతన టెక్నాలజీ ఆవిష్కరణలను పెంచి తద్వారా స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు కల్పతరువు సీవోఈని ఏర్పాటుచేసినట్లు ఎస్టీపీఐ విశాఖ అడిషనల్ డైరెక్టర్ సురేష్ ‘సాక్షి’కి తెలిపారు. ఇందులో భాగంగా.. ముందుగా విశాఖ ఉక్కు పరిశ్రమకు సంబంధించిన ఆరు సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఓసీపీ–1 పేరుతో స్టార్టప్‌లను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఒక్కో సమస్యకు ఇండస్ట్రీ–4 టెక్నాలజీతో చక్కటి పరిష్కరం చూపిన ప్రోటోటైప్ స్టార్టప్‌ను ఎంపికచేసి రూ.4 లక్షలు బహుమతిగా ఇవ్వడమే కాక, కల్పతరువు సీవోఈ ద్వారా ప్రాజెక్టు ఫండింగ్ సౌకర్యం కల్పిస్తారు. పరిశ్రమల్లో ఆటోమేషన్ పెంచేందుకు బిలియన్ డాలర్లు వ్యయం చేస్తున్నారని, ఇందులో నూతన ఆవిష్కరణలకు విశాఖ వేదిక కానుందని కల్పతరువు ప్రాజెక్టు మేనేజ్మెంట్ గ్రూపు సభ్యుడు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఐటాప్) ప్రెసిడెంట్ శ్రీధర్ కోసరాజు తెలిపారు. రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి సౌరభ్ గార్గ్, ఆర్ఐఎన్ఎల్ సీఎండీ, కేంద్ర ఐటీ శాఖ అధికారులతో వర్చువల్‌గా మంగళవారం ఓసీపీ–1ను ప్రారంభించనున్నారు. రూ.20 కోట్లతో ‘కల్పతరువు’ సుమారు రూ.20 కోట్లతో కల్పతరువు ఇండస్ట్రీ–4 సీవోఈ అభివృద్ధి చేస్తున్నారు. ఆరు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటవుతున్న ఈ సీవోఈ పనులు వేగంగా జరుగుతున్నట్లు సురేష్ తెలిపారు. ఇప్పటికే ల్యాబ్ పనులు మొదలయ్యాయని, రెండు నెలల్లో ఈ సీవోఈని అధికారికంగా ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఓసీపీ–1లో ఎంపికైన స్టార్టప్‌లతో కల్పతరువును ప్రారంభించడానికి ఓపెన్ ఛాలెంజ్ ప్రోగ్రాంను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఈ పోటీలో గెలిచిన స్టార్టప్‌లు కల్పతరువులో ఏర్పాటుచేసిన ల్యాబొరేటరీ, ఇంక్యుబేషన్ వినియోగించుకోవడంతోపాటు ఎస్టీపీఐ నుంచి ఫైనాన్సింగ్, మానిటరింగ్ సహకారం లభిస్తాయి. -
‘కొలువుకు టాటా’.. ప్రపంచవ్యాప్తంగా రాజీనామాల ట్రెండ్
ప్రపంచాన్ని గడగడలాడించి 65 లక్షల మందిని కబళించిన కరోనా దిగ్గజ కంపెనీలకూ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కోవిడ్ విజృంభన మొదలైనప్పటి నుంచీ లక్షల మంది ఉద్యోగాలు మానేస్తున్నారు. ప్రపంచమంతటా ఇదే ట్రెండ్ నడుస్తోంది. కరోనా కల్లోలం సద్దుమణిగినా రాజీనామాల జోరు మాత్రం తగ్గడం లేదు. గత ఫిబ్రవరి– ఏప్రిల్ మధ్య అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా, ఇండియా, సింగపూర్లలో 13,382 మంది ఉద్యోగులపై మెకిన్సే సర్వే చేసింది. రాజీనామాలకు కారణాలతో పాటు ఏం చేస్తే ఉద్యోగం మానకుండా ఉంటారో తెలుసుకోవడం దీని ఉద్దేశం. కనీసం 40 శాతం మంది తమ ఉద్యోగం పట్ల అసంతృప్తితో ఉన్నట్టు తేలింది. వీరంతా మూడు నుంచి ఆర్నెల్లలో రాజీనామా యోచనలో ఉన్నారట. చేస్తున్న ఉద్యోగం కంటే మెరుగైన, మరింత తృప్తినిచ్చే పనులు చేయాలని కోరుకుంటున్నారట. ఎదుగుదలకు అవకాశాల్లేక మానేసినట్టు 41 శాతం మంది చెప్పారు. మొత్తమ్మీద ఆశించిన వేతనం, ఇతరత్రా తగినన్ని లాభాలు లేకపోవడం రాజీనామాలకు ప్రధాన కారణమని సర్వే తేల్చింది. ఈ ఏడాదిలో ఒక్క అమెరికాలోనే ఇప్పటిదాకా దాదాపు 40 లక్షల మంది ఉద్యోగాలు మానేసినట్లు తేలింది. 2022 అంతా ఇదే ట్రెండ్ కొనసాగొచ్చన్నది నిపుణుల అంచనా. ఇందుకు కరోనా కొంతవరకే కారణమని మెకిన్సే నివేదికను సిద్ధం చేసిన వారిలో ఒకరైన బోనీ డౌలింగ్ అన్నారు. ‘‘ఉద్యోగమనే భావనే సమూలంగా మారుతున్న వైనం కొన్నాళ్లుగా స్పష్టంగా కన్పిస్తోంది. జీవితంలో ప్రాథమ్యాల విషయంలో ఆలోచనా శైలిలోనే మార్పు కనిపిస్తోంది. ఏ ఉద్యోగం చేసినా తమకు నచ్చినట్లు ఉండాలని ఆశిస్తున్నారు’’ అని వివరించారు. ఉద్యోగుల మార్కెట్ ఇప్పుడిప్పుడే కరోనా ముందునాటి స్థితికి చేరుకోవడం కష్టమేనన్నారు. నచ్చని రంగాలకు గుడ్‌బై... కరోనా తరువాత రాజీనామా చేసిన వాళ్లలో సగం ఇతర రంగాలకు మళ్లుతున్నట్లు మెకిన్సే చెబుతోంది. సర్వేలో భాగంగా గత రెండేళ్లలో ఉద్యోగాలు మానేసిన ఐటీ, ఫార్మా, హాస్పిటాలిటీ, నర్సింగ్ రంగాలకు చెందిన 2,800 మందిని ఇందుకోసం ప్రత్యేకంగా ప్రశ్నించింది. వీరిలో 48 శాతం ఇతర రంగాల్లో అవకాశాలను వెతుక్కుంటున్నట్లు తేలింది. ‘‘కరోనా వేళ విపరీతమైన ఒత్తిడికి గురై శక్తివిహీనంగా మారిపోయిన భావన తట్టుకోలేక పలువురు ఉద్యోగాలు మానేశారు. ఉన్న రంగంలో మెరుగైన ఆదాయం కష్టమని కొందరు ఇతర రంగాల వైపు మళ్లారు. రిటైల్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ రంగాల్లో మానేసిన వారిలో ఏకంగా 60 శాతం రంగం మారడమో, పూర్తిగా మానేయడమో చేశార’’ని తేల్చింది. భారత్‌లోనూ... భారత ఐటీ కంపెనీల్లో ఈ ఏడాది వేలకొద్ది రాజీనామాలు జరిగాయి. గత ఏప్రిల్– జూన్ మధ్య కాలంలో ఇన్ఫోసిస్‌కు ఏకంగా 28.4 శాతం మంది రాజీనామా చేశారు. తర్వాత స్థానాల్లో విప్రో (23.3), టెక్ మహీంద్రా (22), టీసీఎస్ (19.7) ఉన్నాయి. ‘‘ఒకే కంపెనీలో మూడేళ్ల కంటే ఎక్కువ ఉంటే ఎదుగుదలకు అవకాశాలు బాగా తగ్గుతున్నాయి. కెరీర్ కోసం అవసరమైతే ఏడాదిలో రెండు ఉద్యోగాలు కూడా మారతాం’’ అని ఓ ఐటీ కంపెనీలో సీనియర్ మేనేజర్ రఘురామ మంచినేని అన్నారు. భారత ఐటీ పరిశ్రమలో ఉద్యోగులు భారీగా ఉండటమూ రాజీనామాలకు ఓ కారణమని ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్ టి.వి.మోహన్‌దాస్ పాయ్ అభిప్రాయపడ్డారు. ‘‘వాళ్లంతా పెద్ద కంపెనీల్లో చేరి కెరీర్‌ను నిర్మించుకోవాలని కోరుకుంటున్నారు’’అని సాక్షి ప్రతినిధితో అన్నారు. స్వయం ఉపాధే బెటర్... మరో ఉద్యోగం చూసుకోకుండానే రాజీనామా చేసిన వారిలో 29 శాతమే మళ్లీ సంప్రదాయ కొలువుల్లో చేరారు. మిగతా వారిలో చాలామంది సొంత వ్యాపారాలకు మొగ్గారు. కొందరు పార్ట్‌టైం కొలువులకు జై కొట్టారు. కరోనా సమయంలో అమెరికాలో సొంత వ్యాపారాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 30 శాతం పెరిగిందట. 2021లోనే 54 లక్షల దరఖాస్తులు వచ్చాయని వైట్‌హౌస్ వెల్లడించింది. మనోళ్లు అక్కడలా... అమెరికాలోని భారత సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు కరోనా సమయంలో వర్క్ ఫ్రమ్ హోం కాసులు కురిపించింది. ఓవైపు వేలాది మంది రాజీనామాలు చేస్తుంటే మనవాళ్లేమో ఫుల్ టైం కొలువుకు తోడు రెండు, మూడు కాంట్రాక్టు ఉద్యోగాలు కూడా చేశారు. ఇది వారికీ, అటు ఉద్యోగుల కొరతతో అల్లాడిన పలు కంపెనీలకూ కలిసొచ్చింది. కానీ యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు ఇకపై వారానికి కనీసం 3 రోజులు విధిగా ఆఫీసుకు రావడం తప్పనిసరి చేయడంతో చాలామంది పార్ట్ టైం కొలువులకు స్వస్తి పలకాల్సి వస్తోంది. - కంచర్ల యాదగిరిరెడ్డి -
రూ.1,26,622.23 కోట్ల విలువైన పెట్టుబడులకు ఎస్ఐపీబీ ఆమోదం
సాక్షి, అమరావతి: రాష్ట్ర పారిశ్రామిక రంగంలో నూతన శకాన్ని లిఖిస్తూ రూ.1,26,622.23 కోట్ల విలువైన పెట్టుబడులకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) ఆమోదం తెలిపింది. గ్రీన్ ఎనర్జీ, ఫార్మా, ఎలక్ట్రిక్ వాహనాలు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు చెందిన వివిధ పెట్టుబడుల ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. ఆయా కంపెనీల ఏర్పాటు ద్వారా 36,380 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. ఇందులో ఒక్క గ్రీన్ ఎనర్జీ రంగంలోనే రూ.81,043 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇండోసోల్ సోలార్, ఆస్త్రా గ్రీన్, షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్, అరబిందో రియాల్టీ అండ్ ఇన్ఫ్రా, ఏఎం గ్రీన్ ఎనర్జీ, గ్రీన్కో వంటి సంస్థలు పర్యావరణ ఉపయుక్తమైన ఆరు పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ ఆరు గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ల ద్వారా 17,930 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కానుంది. ఈ యూనిట్ల ద్వారా 20,130 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. వీటితో పాటు నెల్లూరు జిల్లా రామాయపట్నం వద్ద ఇండోసోల్ సోలార్ కంపెనీ మరో రూ.43,143 కోట్లతో మెటలర్జికల్ గ్రేడ్ సిలికాన్, పాలీ సిలికాన్, ఫ్లోట్.. రోల్డ్ గ్లాసెస్ తయారీ యూనిట్‌తో పాటు సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. కాకినాడ సెజ్ వద్ద రూ.1,900 కోట్ల పెట్టుబడితో లైఫిజ్ ఫార్మా, వైఎస్సార్ జిల్లా కొప్పర్తి వద్ద కాసిస్ రూ.386.23 కోట్లతో ఎలక్ట్రిక్ బస్సుల తయారీ కేంద్రం, కృష్ణా జిల్లా మల్లవల్లి వద్ద రూ.150 కోట్లతో అవిశాఫుడ్స్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రతిపాదనలకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి (గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ) బూడి ముత్యాలనాయుడు, విద్యుత్, అటవీ, పర్యావరణ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, కార్మిక, ఉపాధి, శిక్షణ శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్, సీఎస్ సమీర్ శర్మ, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఎస్ఐపీబీ సమావేశంలో మంత్రులు, అధికారులతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పెట్టుబడుల ప్రతిపాదనల వివరాలు ► రూ.286.23 కోట్లతో కాసిస్ ఎలక్ట్రిక్ బస్సుల తయారీ యూనిట్. ► వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో పరిశ్రమను ఏర్పాటు చేయనున్న కాసిస్ ఇ – మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్. ► రూ.386.23 కోట్ల పెట్టుబడి పెట్టనున్న కంపెనీ. ఇందులో ఎలక్ట్రిక్ బస్సుల తయారీ కోసం రూ.286.23 కోట్లు, చార్జింగ్ మౌలిక సదుపాయాల కోసం రూ.100 కోట్ల పెట్టుబడి. ► తొలి విడతలో అత్యాధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని 1,000 ఎలక్ట్రిక్ బస్సులు తయారు చేయాలని లక్ష్యం. ► 1200 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు. రూ.1,900 కోట్లతో లైఫిజ్ ఫార్మా యూనిట్ ► కాకినాడ ఎస్ఈజెడ్లో యూనిట్ ఏర్పాటు చేయనున్న లైఫిజ్ ఫార్మా. ► మొత్తంగా రూ.1,900 కోట్ల పెట్టుబడి పెట్టనున్న కంపెనీ. ► 2 వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు. ► ఏప్రిల్ 2024 నాటికి కంపెనీ ఏర్పాటు పూర్తి చేయాలని లక్ష్యం. ► ఏపీఐ డ్రగ్ తయారీలో చైనా దిగుమతులపై ఆధార పడకుండా.. స్వయం సమృద్ధి సాధించే దిశగా అడుగులు. ► పరిశ్రమ కోసం ఇప్పటికే 236.37 ఎకరాలు సేకరించిన కంపెనీ. రూ.150 కోట్లతో అవిశా ఫుడ్స్ ప్రాసెసింగ్ యూనిట్ ► కృష్ణా జిల్లా మల్లవల్లిలో మెగా ఫుడ్‌పార్క్‌ను ఏర్పాటు చేయనున్న అవిశా ఫుడ్స్ లిమిటెడ్. ► రూ.150 కోట్ల పెట్టుబడి, 2,500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు. ► 2023 మార్చి నాటికి పూర్తి చేసే దిశగా కంపెనీ అడుగులు. ► ఇందు కోసం 11.64 ఎకరాల భూమి కేటాయింపు. రూ.43,143 కోట్లతో ఇంటిగ్రేటెడ్ సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్ ► మెటలర్జికల్ గ్రేడ్ సిలికాన్, పాలీ సిలికాన్, ఫ్లోట్ అండ్ రోల్డ్ గ్లాసెస్ తదితర వాటి తయారీ కోసం పరిశ్రమతో పాటు సోలార్ విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్న ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్. ► మూడు విడతల్లో మొత్తంగా రూ.43,143 కోట్ల పెట్టుబడి. ► 11,500 మందికి ప్రత్యక్షంగా, 11 వేల మందికి పరోక్షంగా ఉద్యోగాలు. ► నెల్లూరు జిల్లా రామాయపట్నం వద్ద 5,147 ఎకరాల్లో తయారీ పరిశ్రమ, దీంతో పాటు 50 గిగావాట్లు, 10 గిగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టులను నెలకొల్పనున్న ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్. రైతుల ఆదాయం పెరుగుతుంది: సీఎం రాష్ట్రంలో కొత్తగా వస్తున్న పెట్టుబడులతో రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రం మారడంతో పాటు క్లీన్ ఎనర్జీలో రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. పెద్దగా ఆదాయం రాని భూముల్లో గ్రీన్ ఎనర్జీ యూనిట్లు ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు లీజు రూపంలో ఏటా ఎకరాకు రూ.30,000 ఆదాయం వస్తుందన్నారు. ‘గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చబోతున్నాయి. ప్రాజెక్టుల్లో భారీగా ఉద్యోగాల కల్పన జరుగుతుంది. ఆర్థిక వ్యవస్థ పురోగమించడమే కాకుండా క్లీన్ ఎనర్జీలో దేశానికి ఆదర్శంగా నిలుస్తాం. రైతులకు పెద్దగా ఆదాయాలు రాని భూములకు లీజు కింద డబ్బు వస్తుంది. దీనివల్ల వారికి ఆదాయాలు పెరుగుతాయి. పరిశ్రమల ఏర్పాటు, వాటి నిర్వహణ తదితర వాటి కోసం పెద్ద ఎత్తున సంస్థలు ప్రవేశిస్తాయి. వాటి ద్వారా నైపుణ్యాభివృద్ధి జరుగుతుంది’ అని చెప్పారు. ఆరు గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు ఇవీ.. ► వైఎస్సార్ జిల్లా వొంగిమల్ల వద్ద 1,800 మెగావాట్ల పంప్డ్ హైడ్రో స్టోరేజీ పవర్ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్న ఆస్తా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్. దీనికోసం రూ.8,240 కోట్ల పెట్టుబడి. ప్రత్యక్షంగా 4 వేల మందికి ఉద్యోగాలు. 1,390 ఎకరాల్లో ప్రాజెక్టు ఏర్పాటు. డిసెంబర్ 2029 నాటికి ఏర్పాటు చేయాలని లక్ష్యం. ► సోమశిల, ఎర్రవరం వద్ద రెండు పంప్డ్ హైడ్రో స్టోరేజీ పవర్ ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ ఆమోదం. సోమశిల వద్ద 900 మెగావాట్లు, ఎర్రవరం వద్ద 1,200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి. 2,100 మెగావాట్ల ప్రాజెక్టు కోసం రూ.8,855 కోట్లు ఖర్చు చేయనున్న షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్. 1600 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు. జూలై 2029 నాటికి పూర్తి చేయాలని లక్ష్యం. ► అవుకు, సింగనమల వద్ద రెండు పంప్డ్ హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిన ఎస్ఐపీబీ. మొత్తంగా రూ.6,315 కోట్ల పెట్టుబడి పెట్టనున్న అరబిందో రియాల్టీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. 1,600 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు. అవుకు వద్ద 800 మెగావాట్లు, సింగనమల వద్ద 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు. డిసెంబర్ 2028 నాటికి ఈ రెండు ప్రాజెక్టులు పూర్తి చేయాలని లక్ష్యం. ► వైఎస్సార్ జిల్లా పైడిపాలెం వద్ద పంప్డ్ హైడ్రో, సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్న ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్. 7,200 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి కోసం రూ.33,033 కోట్లు ఖర్చు చేయనున్న కంపెనీ. పైడిపాలెం ఈస్ట్ 1,200 మెగావాట్లు, నార్త్ 1,000 మెగావాట్లు, 3,500 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు, 1500 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టుల ఏర్పాటు. 7,200 మందికి ప్రత్యక్షంగా ఉపాధి. డిసెంబర్ 2028 నాటికి పూర్తి చేయాలని లక్ష్యం. ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపిన ఎస్ఐపీబీ. ► కర్నూలు, నంద్యాల జిల్లాల్లో సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్న ఏఎం గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్. రూ.5 వేల కోట్ల పెట్టుబడి. ఆమోదం తెలిపిన ఎస్ఐపీబీ. 1,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు. 700 మెగావాట్ల సోలార్, 300 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్న కంపెనీ. మార్చి 2025 నాటికి ప్రాజెక్టులు పూర్తి చేయాలని లక్ష్యం. ► కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పంప్డ్, సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్న గ్రీన్కో. 1,680 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు, 2,300 మెగావాట్ల సోలార్, 250 మెగావాట్ల విండ్ ప్రాజెక్ట్‌లను ఏర్పాటు చేయనున్న గ్రీన్కో. మొత్తంగా రూ.19,600 కోట్ల పెట్టుబడి. 4,230 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు. సెప్టెంబర్ 2026 నాటికి పూర్తి చేయాలని లక్ష్యం. -
‘పాట్’లో మరిన్ని పరిశ్రమలు
సాక్షి, అమరావతి: ఇంధన వనరులను మరింత సమర్థంగా వినియోగించుకునేందుకు ఉద్దేశించిన పెర్ఫార్మ్, అచీవ్, ట్రేడ్ (పాట్) పథకం పరిధిలోకి కొత్తగా మరికొన్ని పరిశ్రమలు, సెక్టార్లను తేవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే పథకం పరిధిలో ఉన్న సెక్టార్ల నుంచి కొత్తగా 143 పరిశ్రమలను గుర్తించారు. అదనంగా 4›పారిశ్రామిక సెక్టార్లను పాట్ పథకంలోకి తేవడం ద్వారా మరో 85 పరిశ్రమలకు పథకం వర్తిస్తుంది. బీఈఈకి ప్రతిపాదనలు పరిశ్రమల్లో విద్యుత్, ఇతర ఇంధన వనరులను సమర్ధంగా వినియోగించుకోవడం ద్వారా వృథాను అరికట్టేందుకు ప్రభుత్వం పాట్ పథకాన్ని అమలు చేస్తోంది. దీనివల్ల తక్కువ ఇంధనంతో ఎక్కువ ఉత్పత్తి సాధించేందుకు వీలవుతుంది. తద్వారా పారిశ్రామిక రంగంలో 2031 నాటికి దేశవ్యాప్తంగా 47.5 ఎంటీవోఈ (మిలియన్ టన్ ఆఫ్ ఆయిల్ ఈక్వెలెంట్) ఇంధనం ఆదా చేయాలని కేంద్రం లక్ష్యంగా నిర్దేశించుకుంది. రాష్ట్రంలో 36 భారీ పరిశ్రమల్లో పాట్ పథకం అమలు చేయటం ద్వారా రూ.5709 కోట్ల విలువైన 0. 818 ఎంటీవోఈ ఇంధనాన్ని ఆదా చేయగలిగారు. క్లోర్–ఆల్కలీ, స్టీల్, సిమెంట్, వాణిజ్య భవనాలు (ఎయిర్ పోర్ట్, హోటళ్లు), టెక్స్టైల్స్ తదితర సెక్టార్లలో కొత్తగా 143 పరిశ్రమలను పాట్ పథకంలోకి తీసుకొస్తోంది. కొత్తగా ఫార్మా, ఇంజనీరింగ్ , ఆటోమొబైల్, సిరామిక్స్, ఆహారం, మత్స్య పరిశ్రమల సెక్టార్లకు చెందిన 85 పరిశ్రమలను పాట్ పథకంలోకి తెచ్చేందుకు బీఈఈకి ప్రతిపాదనలు పంపాలని రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. పాట్ ప్రగతి నివేదిక విడుదల ఆంధ్రప్రదేశ్‌లో పాట్ పథకం ప్రగతి నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఆదివారం విడుదల చేశారు. అన్ని శాఖల్లో ఇంధన పరిరక్షణ విభాగాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, శాఖల విభాగాధిపతులకు సూచించారు. ఏపీఎస్ఈసీఎం, ఏపీ స్టేట్ ఎనర్జీ ఎఫిషియెన్సీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ సమన్వయంతో ఇంధన పొదుపు, సామర్థ్య కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ తెలిపారు. -
పరిశ్రమలకు రాచబాట
పారిశ్రామిక రంగంలో ఏపీ మరింత పురోగమించేలా బిర్లా గ్రూప్ ప్రభుత్వంతో కలిసి అడుగులు వేస్తోంది. ఇక్కడ పరిశ్రమలు పెట్టడానికి ఎంతో ఆసక్తితో ఉన్నాం. ఏపీలోని విశాల తీర ప్రాంతం, మల్టీ మోడల్ కనెక్టివిటీ, మానవ వనరులకు తోడు అన్ని విధాలా సహకారం అందించే ప్రభుత్వం.. వెరసి పెట్టుబడుల రంగంలో ఏపీ అగ్రస్థానంలో నిలుస్తుందని గట్టిగా నమ్ముతున్నా. జగన్ మంచి విజన్ ఉన్న యువ ముఖ్యమంత్రి. – కుమార మంగళం బిర్లా, చైర్మన్, ఆదిత్య బిర్లా గ్రూపు సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తూ చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. పర్యవసానంగా ప్రభుత్వంపై ఎంతో నమ్మకంతో పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ముందడుగు వేస్తున్నారని చెప్పారు. అనుమతులను సరళతరం చేయడంతో పాటు ఎలాంటి సాయం కావాలన్నా వేగంగా స్పందిస్తున్నామని తెలిపారు. ఇలాంటి చర్యలన్నింటి వల్లే పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారన్నారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో రూ.2,470 కోట్ల పెట్టుబడితో ఆదిత్య బిర్లాకు చెందిన గ్రాసిమ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నెలకొల్పిన క్లోర్ ఆల్కాలిక్ మాన్యుఫాక్చరింగ్ (కాస్టిక్ సోడా యూనిట్) ప్లాంట్‌ను గురువారం ఆయన స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇలాంటి కంపెనీలు ఎంతో నమ్మకంతో రాష్ట్రంలో అడుగులు వేయడంతో మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు బాగా పెరుగుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. చాలా ఆనందంగా ఉంది ► ఈ రోజు ఒక మంచి రోజు. ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ కంపెనీ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు.. రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు అభినందనలు. మొత్తం మూడు విడతల్లో పూర్తయ్యే గ్రాసిమ్ పరిశ్రమ ద్వారా రాష్ట్రానికి రూ.2,700 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. తొలి దశలో రూ.1,000 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన తొలి ప్లాంట్‌ను ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. ► ప్రత్యక్షంగా 1,300, పరోక్షంగా 1,150 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే గొప్ప కార్యక్రమం ఇది. దేశ వ్యాప్తంగా రూ.6 లక్షల కోట్ల మార్కెట్ విలువ, దాదాపుగా లక్షా 40 వేల మందికి ఉద్యోగాలు కల్పించిన మంచి వ్యక్తి, మంచి పారిశ్రామిక వేత్త కుమార మంగళం బిర్లా. ఇలాంటి వాళ్లు మన ప్రభుత్వంపై నమ్మకంతో ఇక్కడకు వచ్చి పారిశ్రామికంగా అడుగులు ముందుకు వేయడం రాష్ట్రానికి మంచి పరిణామం. ► నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో రాష్ట్రంలో ఏర్పాటు చేసే పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు కచ్చితంగా స్థానికులకే ఇచ్చే విధంగా ప్రత్యేకంగా చట్టాన్నే తీసుకువచ్చాం. వీళ్లు (ఆదిత్య బిర్లా గ్రూపు) ఈ చట్టాన్ని గౌరవిస్తూ ఇక్కడ పరిశ్రమ స్థాపనకు చూపిన చొరవతో దేశంలో మిగిలిన వారందరికీ గొప్ప ముందడుగు అవుతుంది. కాలుష్యానికి తావు లేకుండా చర్యలు ► ఇదివరకు 2010–12 మధ్య పరిశ్రమ ఏర్పాటులో కంపెనీ రకరకాల ఇబ్బందులు పడుతూ వచ్చింది. కేప్టివ్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసే విషయంలో ఈ ప్రాంతంలో పలు గ్రామాల ప్రజలు దానిని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టారు. చివరకు గ్రాసిమ్ సంస్థ ఈ ప్రాజెక్టు చేపట్టి అడుగులు ముందుకేసింది. ► పరిశ్రమలు ఏర్పాటైతే వాతావరణ కాలుష్యం, భూగర్భ జలాలు కలుషితమవుతాయని ప్రజల్లో నెలకొన్న భయాలను పొగొట్టకుండా గత పాలకులు ఎన్నికలకు రెండు నెలల ముందు గ్రాసిమ్ సంస్థకు అప్పగిస్తూ సంతకాలు చేశారు. ► మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిజంగానే ఇక్కడ సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరిస్తూ ఒక మార్గం చూపించి ఈ పరిశ్రమ ఇక్కడ పెట్టించగలిగితే వేల కోట్లు పెట్టుబడులు రావడమే కాకుండా, సుమారు 2,500 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయనే ఆలోచనతో సమస్యలన్నింటినీ అధిగమించేందుకు పరిష్కారం చూపుతూ అడుగులు వేశాం. ► కేప్టివ్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ వినియోగంలోకి వస్తే దాని వల్ల ఈ భయాలు ఇంకా ఎక్కువవుతాయని, అందువల్ల ఆ ప్లాంట్‌ను పెట్టకూడదని ఆదిత్య బిర్లా గ్రూపు యాజమాన్యాన్ని ఒప్పించాం. స్థానికులలో ఉన్న భయాందోళనలు పోగొట్టి, పరిశ్రమకు అనుమతులు మంజూరు చేశాం. వ్యర్థాల వల్ల నీరు కలుషితం కాకుండా టెక్నాలజీలో అనేక మార్పులు చేయించాం. ► గతంలో ఇదే ప్లాంట్‌లో ఉన్న మెర్క్యురీ మెంబ్రేన్ టెక్నాలజీ ద్వారా ఉత్పత్తి అయ్యే పాత పద్దతిలో మార్పు చేయించాం. ఎలక్ట్రాలసిస్‌లో కూడా మెరుగైన విధానాన్ని క్రోడీకరించి కాలుష్యానికి ఏవిధమైన అవకాశం ఇవ్వకుండా అడుగులు ముందుకు వేశాం. ► జీరో లిక్విడ్ వేస్ట్ విధానంలో లిక్విడ్‌వేస్ట్ డిశ్చార్జ్ అనేది ఎక్కడా ఉండకూడదని యాజమాన్యాన్ని ఒప్పించగలిగాం. వీటన్నింటి వల్ల అందరికీ మంచి జరుగుతుంది. ప్రధానంగా సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బులిటీ) నిధులతో పరిశ్రమ పరిసర గ్రామాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవచ్చు. ముఖ్యమంత్రి ముఖచిత్ర జ్ఞాపికను వైఎస్ జగన్‌కు అందజేస్తున్న బిర్లా 131 మందిపై కేసుల ఎత్తివేతకు జీవో ► కంపెనీ ప్రతినిధుల కోసం మీ (వేదిక దిగువన ఉన్న ప్రజలు, ప్రజాప్రతినిధులు) అనుమతితో కొన్ని విషయాలు ఇంగ్లిష్‌లో చెబుతున్నా. ఇది ఆసియాలో అత్యాధునిక ప్లాంట్. దేశంలో కాస్టిక్ సోడా ఉత్పత్తిలో ఏకైక అతి పెద్ద యూనిట్. భవిష్యత్‌లో అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు ఇది దోహదం చేస్తుంది. ► గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమ పరిసర గ్రామాల్లో 131 మంది అమాయకులపై పాలకులు పోలీసుల ద్వారా అక్రమంగా కేసులు పెట్టించారు. నాడు ఇచ్చిన మాట ప్రకారం ఆ అక్రమ కేసులన్నింటినీ ఎత్తి వేసేందుకు ఈ రోజే జీవో 321 జారీ చేస్తున్నాం. ► ఈ కార్యక్రమంలో మంత్రులు గుడివాడ అమర్నాథ్, తానేటి వనిత, పినిపే విశ్వరూప్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, దాడిశెట్టి రాజా, ఎంపీలు భరత్‌రామ్, వంగా గీత, చింతా అనురాధ, పిల్లి సుభాష్ చంద్రబోస్, కలెక్టర్ మాధవిలత, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ప్లాంట్‌లో కలియదిరిగిన సీఎం తొలుత చైర్మన్ కుమార మంగళం బిర్లా ప్రత్యేక వాహనంలో సీఎం వైఎస్ జగన్‌తో కలిసి కలియదిరుగుతూ ప్లాంట్ పని తీరును స్వయంగా చూపించారు. కాలుష్య రహిత పరిశ్రమ కోసం వినియోగించిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం గురించి వివరించారు. ఆదిత్య బిర్లా గ్రూపు తరఫున వెండితో ప్రత్యేకంగా తయారు చేయించిన జగన్ ముఖచిత్ర జ్ఞాపికను కుమార మంగళం బిర్లా సీఎంకు స్వయంగా అందజేశారు. -
ఇంధన పొదుపునకు ‘ఫిక్కీ’ సాయం
సాక్షి, అమరావతి: ఏపీ అమలు చేస్తున్న ఇంధన పొదుపు చర్యలను గుర్తించిన కేంద్రం.. వాటికి మరింత ఊతమిచ్చేందుకు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ)ని ఎక్స్పర్ట్ ఏజెన్సీగా నియమించింది. పెర్ఫార్మ్ అచీవ్ అండ్ ట్రేడ్ (పాట్) పథకం కింద పారిశ్రామిక రంగంలో ఇంధన సామర్థ్య చర్యలను అమలు చేయడంలో ఏపీ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. దీనిని గుర్తించిన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) రాష్ట్రంలో ఇంధన పొదుపు చర్యలకు మరింత ఊతమిచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రం నిర్దేశించుకున్న ఇంధన సామర్థ్య లక్ష్యాలను సాధించేందుకు, పాట్ కార్యకలాపాల పర్యవేక్షణకు ఫిక్కీ సహకారం అందించనుంది. రాష్ట్రంపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశంగా బీఈఈ చెబుతోంది. లక్ష్యాన్ని చేరుకునేలా.. దేశవ్యాప్తంగా 2070 నాటికి కర్బన ఉద్గారాలను లేకుండా చేయాలనే లక్ష్యంలో భాగంగా 2030 నాటికి ఒక బిలియన్ టన్నుల ఉద్గారాలను తగ్గించాలని, అందులో మన రాష్ట్రం 2030 నాటికి 6.68 మిలియన్ టన్స్ ఆఫ్ ఆయిల్ ఈక్వలెంట్ ఇంధనాన్ని ఆదా చేయాలని బీఈఈ నిర్దేశించింది. ఈ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే ఉన్న రంగాలతోపాటు కొత్త రంగాల్లోని వినియోగదారులను గుర్తించడంలో ఫిక్కీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ (ఏపీఎస్ ఈసీఎం) తోడుగా నిలుస్తుంది. ఫిక్కీ ఇతర రాష్ట్రాలు, దేశాలు అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులు, కొత్త సాంకేతికతలను అధ్యయనం చేసి ఏపీకి అన్వయిస్తుంది. రాష్ట్ర పరిశ్రమల శాఖ సహకారంతో పాట్ పథకం సైకిల్–1లో దాదాపు రూ.1,600 కోట్ల విలువైన 2,386 మిలియన్ యూనిట్ల ఇంధనానికి సమానమైన దాదాపు 0.20 మిలియన్ టన్స్ ఆఫ్ ఆయిల్ ఈక్వలెంట్ మేర ఇంధనాన్ని పొదుపు చేయగలిగింది. సైకిల్–2లో దాదాపు రూ.2,356.41 కోట్ల విలువైన 3,430 మిలియన్ యూనిట్లకు సమానమైన 0.295 మిలియన్ టన్స్ ఆఫ్ ఆయిల్ ఈక్వలెంట్ను ఆదా చేసింది. పాట్ పథకం ప్రస్తుతం 13 రంగాల్లో 1,073 డీసీల (భారీ ఇంధనం ఉపయోగించే పరిశ్రమల)ను కవర్ చేస్తుంది. ఇవి పారిశ్రామిక ఇంధన వినియోగంలో సగం మాత్రమే. కనీసం 80 శాతాన్ని కవర్ చేయడానికి ఈ పథకంలో రవాణా, విమాన యానం, ఆస్పత్రులు, విశ్వవిద్యాలయాలు, షిప్పింగ్ వంటి అదనపు రంగాలను బీఈఈ చేర్చింది. వేగంగా ‘పాట్’ అమలు దేశంలోని మొత్తం ఇంధనంలో 40 శాతం పారిశ్రామిక రంగం మాత్రమే వినియోగిస్తోంది. భవిష్యత్‌లో ఈ రంగంలో ఇంధన వినియోగం భారీగా పెరగనుంది. ఈ నేపథ్యంలో ఏపీ వంటి రాష్ట్రాల్లో వేగంగా పాట్ పథకాన్ని అమలు చేయడంలో సహకారం అందించేందుకు ఫిక్కీని ఎక్స్పర్ట్ ఏజెన్సీగా నియమించింది. – అభయ్ భాక్రే, డైరెక్టర్ జనరల్, బీఈఈ ఫిక్కీ సహకారం శుభపరిణామం పారిశ్రామిక రంగానికి నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. పరిశ్రమల్లో ఇంధన పొదుపు కార్యక్రమాల అమలులో ఏపీకి మద్దతిస్తూ.. ఫిక్కీని ఎక్స్పర్ట్ ఏజెన్సీగా బీఈఈ నియమించడం శుభపరిణామం. – బి. శ్రీధర్, కార్యదర్శి, ఇంధన శాఖ -
ఉరకలేస్తున్న ఉత్తరాంధ్ర పారిశ్రామిక రంగం
సాక్షి, అమరావతి: రాయలసీమ, కోస్తాంధ్రలకు దీటుగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలను పారిశ్రామికంగా, ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి సత్ఫలితాలనిస్తోంది. విశాఖ, గంగవరం పోర్టులకు అదనంగా శ్రీకాకుళం జిల్లా భావనపాడు వద్ద నూతన ఓడరేవు నిర్మిస్తుండటంతో పోర్టు ఆధారిత పరిశ్రమలు ఉత్తరాంధ్రవైపు చూస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన 2019 జూన్ నుంచి ఇప్పటి వరకు ఉత్తరాంధ్రలో 33 భారీ యూనిట్లు ఉత్పత్తి ప్రారంభించాయి. మరో 20 యూనిట్ల ప్రతిపాదనలు వివిధ దశల్లో ఉన్నాయి. ఉత్పత్తి ప్రారంభించిన యూనిట్ల ద్వారా రూ.5,801.37 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 8,226 మందికి ఉపాధి లభించింది. వీటిలో రెయిన్ సీఐఐ కార్బన్ వైజాగ్ లిమిటెడ్, చెట్టినాడ్ సిమెంట్ కార్పొరేషన్, శ్రీమాన్ కెమికల్స్, డాక్టర్ రెడ్డీస్, దివీస్ ల్యాబ్, నాట్కో, డెక్కన్ ఫైన్ కెమికల్స్ తదితర కంపెనీలున్నాయి. వివిధ దశల్లో ఉన్న 20 యూనిట్ల ద్వారా ఉత్తరాంధ్రలోకి మరో రూ.18,,235.5 కోట్ల పెట్టుబడులతో పాటు 24,380 మందికి ఉపాధి లభించనుంది. జపాన్‌కు చెందిన యకోమా గ్రూపునకు చెందిన ఏటీసీ టైర్స్ రూ.1,750 కోట్లతో భారీ టైర్ల తయారీ యూనిట్, రూ.2,000 కోట్లతో సెయింట్ గోబిన్ విస్తరణ, రూ.6,700 కోట్లతో అన్‌రాక్ అల్యూమినియం, రూ.485 కోట్లతో కనాŠస్య్ నెర్లాక్ పెయింట్స్, రూ.750 కోట్లతో జిందాల్ ఇండియా ప్రతిపాదనలు వివిధ దశల్లో ఉన్నాయి. ఇవి కాకుండా ఒక్క హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) రూ.28,000 కోట్ల పెట్టుబడులు పెడుతోంది. విజయనగరం జిల్లాలో కొత్తవలస ఇన్ఫ్రా వెంచర్స్ రూ.2,000 కోట్లు, శారద మెటల్స్ రూ.1,500 కోట్ల పెట్టుబడితో స్థాపించే పరిశ్రమల ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. ఐటీ రంగంలో అదానీ గ్రూపు 130 ఎకరాల్లో రూ14,000 కోట్లతో డేటా, కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణం చేపడుతోంది. స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు ఇప్పటికే రెండు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలు విశాఖలో ఏర్పాటయ్యాయి. గడిచిన 30 నెలల కాలంలో ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో 2,412 ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటయ్యాయి. వీటి ద్వారా రూ.1,866.53 కోట్ల విలువైన పెట్టుబడులతో పాటు 21,212 మందికి ఉపాధి లభించింది. రూపు మారనున్న భోగాపురం పరిపాలన రాజధానిగా విశాఖను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం దానికి అనుగుణంగా పలు చర్యలు చేపట్టింది. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, పర్యాటకాభివృద్ధిలో కీలకపాత్ర పోషించే విశాఖ ఓ హబ్‌గా ఎదిగేలా చర్యలు చేపడుతోంది. భోగాపురంలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటికే భూ సేకరణ సమస్యలను పరిష్కరించి జీఎంఆర్‌కు కాంట్రాక్టు అప్పగించింది. దీని నిర్మాణానికి కేంద్రం నుంచి నిరభ్యంతర సర్టిఫికెట్ కోసం స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి లేఖ రాశారు. భోగాపురం నుంచి భీమిలి వరకు ఆరులేన్ల రహదారిని అభివృద్ధి చేసి, దానికి ఇరువైపులా పారిశ్రామికంగా అభివృద్ధి చేయనున్నారు. ఇదే సమయంలో విశాఖకు పర్యాటకులను ఆకర్షించేలా భారీ పర్యాటక ప్రాజెక్టులను ప్రభుత్వం చేపట్టింది. వేగంగా విశాఖ నోడ్ అభివృద్ధి విశాఖ–చెన్నై కారిడార్‌లో భాగంగా ఏడీబీ నిధులతో విశాఖ నోడ్‌ను ఏపీఐఐసీ వేగంగా అభివృద్ధి చేస్తోంది. అచ్చుతాపురం, రాంబిల్లి, నక్కపల్లిలో పారిశ్రామిక పార్కుల్లో అన్ని మౌలిక వసతులను అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే మొదటి దశ పనులు చివరికి వచ్చాయి. రెండో దశ పనులు వేగంగా సాగుతున్నాయి. వీటికి అదనంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల కోసం బొబ్బిలి వద్ద 661.33 ఎకరాల్లో గ్రోత్ సెంటర్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇందులో ఇప్పటికే 206 యూనిట్లకు భూములు కేటాయించగా అందులో 131 యూనిట్లు ఉత్పత్తిని ప్రారంభించాయి. -
Andhra Pradesh: 'ఇండస్ట్రీ' రికార్డు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన విధానాలు, ప్రోత్సాహకాల ఫలితంగా కోవిడ్ సంక్షోభంలోనూ 2021–22లో పారిశ్రామిక రంగంలో భారీ వృద్ధి నమోదైంది. సాధారణ పరిస్థితులున్న వేళ టీడీపీ హయాంలో 2018–19లో పారిశ్రామిక రంగంలో వృద్ధి 3.17 శాతంతో కేవలం సింగిల్ డిజిట్‌కే పరిమితం కాగా ఇప్పుడు నాలుగు రెట్లకుపైగా పెరగడం గమనార్హం. 2021–22లో ఏకంగా 12.78 శాతంతో రెండంకెల వృద్ధినమోదైంది. సేవల రంగంలో 2018–19లో కేవలం 4.84 శాతం వృద్ధి నమోదు కాగా ఇప్పుడు 9.73 శాతం వృద్ధి సాధించడం రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు నిదర్శనంగా నిలుస్తోంది. కోవిడ్ సంక్షోభం నుంచి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే పూర్వ స్థాయికి చేరుకుంటోంది. కరోనా విపత్తు వేళ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన చేయూతతో వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో భారీగా వృద్ధి నమోదైందని సామాజిక, ఆర్థిక సర్వే నివేదికలో విశ్లేషించింది. తయారీ, నిర్మాణం, మైనింగ్, రవాణా రంగాలన్నింటిలోనూ వృద్ధి కారణంగా పారిశ్రామిక రంగం వృద్ధి 12.78 శాతానికి చేరుకుంది. ఉత్తమ విధానాలు, రాయితీలు, బకాయిల చెల్లింపు.. పారిశ్రామికంగా తీర్చిదిద్ది ఉపాధి అవకాశాలను పెంపొందించేలా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ పారిశ్రామిక విధానాన్ని తేవడంతో పాటు రాయితీలను సకాలంలో విడుదల చేసింది. కష్టకాలంలో పరిశ్రమలను ఆదుకుంది. గత సర్కారు హయాంలోని బకాయిలు కూడా చెల్లించడంతోపాటు ప్రోత్సాహకాలు, రాయితీల కింద దాదాపు రూ.2,300 కోట్లు పరిశ్రమలకు అందచేసి కరోనా సమయంలో అండగా నిలిచింది. సాధారణ కేటగిరిలో 1,046 ఎంఎస్ఎంఈలకు రూ.191.10 కోట్లు రాయితీగా ఇచ్చింది. ఓబీసీ కేటగిరిలో 479 ఎంఎస్ఎంఈలకు రూ.101.31 కోట్లు రాయితీలను అందచేసింది. ఎంఎస్ఎంఈలకు వైఎస్సార్ నవోదయం ద్వారా ఊరట కల్పించి ఏకంగా 1,78,919 ఖాతాల రుణాలను పునర్వ్యవస్థీకరించింది. 2021–22లో రూ.1,762.31 కోట్ల పెట్టుబడితో 5,907 ఎంఎస్ఈలు ఏర్పాటు కావడంతో 37,604 మందికి ఉపాధి లభిస్తోంది. కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ పాక్షిక ఆంక్షలు, నిబంధనలు అమలు చేయడంతో సేవా రంగంలో కూడా 2021–22లో 9.73 శాతం వృద్ధి నమోదైంది. 21 రోజుల్లోనే అనుమతులు.. 2021–22లో రాష్ట్రంలో పది పెద్ద మెగా పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. రూ.2,030 కోట్ల పెట్టుబడితో ఏర్పాటైన మెగా ప్రాజెక్టుల ద్వారా 3,889 మందికి ఉపాధి లభించింది. ఎస్సీలకు చెందిన 2018 ఎంఎస్ఈలకు రూ.111.84 కోట్ల రాయితీలను, ఎస్టీలకు చెందిన 384 ఎంఎస్ఎంఈలకు రూ.24.40 కోట్ల రాయితీలను ప్రభుత్వం విడుదల చేసింది. 46 పెద్ద మెగా టెక్టైల్స్ పరిశ్రమలకు రూ.242.12 కోట్ల రాయితీలను ఇచ్చింది. సులభతర వాణిజ్యం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) నిబంధనల మేరకు పరిశ్రమలకు అన్ని అనుమతులను 21 రోజుల్లోనే అందిస్తోంది. ఎగుమతుల పనితీరును 2019–20లో 7వ ర్యాంక్ నుంచి 2020–21లో నాలుగో ర్యాంకుకు చేరడం ద్వారా మెరుగుపరుచుకుంది. 2020–21లో ఎగుమతులు 16.8 బిలియన్ డాలర్లకు పెరిగాయి. అంతకు ముందు ఏడాదితో పోల్చి చూస్తే 13.8 శాతం వృద్ధి సాధించింది. జాతీయ ఎగుమతుల్లో రాష్ట్రం వాటా 5.8 శాతంగా ఉంది. 2030 నాటికి ఎగుమతుల్లో రాష్ట్ర వాటాను పది శాతానికి పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. దేశవ్యాప్తంగా క్షీణించినా.. కరోనా సంక్షోభంతో దేశ స్థాయిలో వృద్ధి రేటు క్షీణించినప్పటికీ రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో మాత్రం వృద్ధి నమోదవుతూనే ఉంది. స్ధిర ధరల ఆధారంగా చూస్తే రాష్ట్ర స్థూల ఉత్పత్తి 2021–22లో 11.48 శాతం నమోదైంది. ఇక రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.6,70,913 కోట్లకు చేరింది. వ్యవసాయ రంగానికి, రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇవ్వడంతో వ్యవసాయం, అనుబంధ రంగాల్లో వృద్ధి ఏకంగా 11.27 శాతం నమోదైంది. ప్రభుత్వ ప్రోత్సాహంతో.. కోవిడ్ సంక్షోభ సమయంలోనూ పారిశ్రామికోత్పత్తికి ఎలాంటి విఘాతం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలతోనే ఈ స్థాయిలో భారీ వృద్ధి రేటు నమోదైంది. కరోనా సెకండ్, థర్ద్ వేవ్‌లో వ్యాపార వర్గాలకు నష్టం కలగకుండా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. – నీరజ్ శారద, చైర్మన్, సీఐఐ, ఏపీ చాప్టర్ పూర్వ స్థితికి చేరుకుంటున్నాం కరోనా సమయలో పారిశ్రామిక రంగం దెబ్బ తినకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్విరామ కృషి చేసింది. దీంతో భారీ వృద్ధి రేటు నమోదయ్యింది. పరిశ్రమలు, సేవల రంగాలు పూర్వ స్థితికి చేరుకుంటున్నాయి. –సీవీ అచ్యుతరావు, అధ్యక్షుడు, ఫ్యాప్సీ -
పారిశ్రామిక ఉత్పత్తి ఓకే!
న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి జనవరిలో 1.3 శాతం పురోగతి (2021 ఇదే కాలంతో పోల్చి) సాధించింది. గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ శుక్రవారం ఈ మేరకు పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) గణాంకాలు విడుదల చేసింది. 2021 జనవరిలో ఐఐపీలో అసలు వృద్ధి నమోదుచేసుకోకపోగా 0.6 శాతం క్షీణతలో ఉంది. 2021 డిసెంబర్లో వృద్ధి రేటు కేవలం 0.7 శాతంగా ఉంది. మైనింగ్, మొత్తం సూచీలో మెజారిటీ వాటా కలిగిన తయారీ రంగాలు తాజా సమీక్షా నెల్లో కొంత మెరుగ్గా ఉండగా, భారీ పెట్టుబడులకు ప్రాతిపదిక అయిన క్యాపిటల్ గూడ్స్ విభాగం ఇంకా క్షీణతలోనే ఉంది. ఏప్రిల్ నుంచి జనవరి వరకూ 13.7 శాతం వృద్ధి కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2021 ఏప్రిల్ నుంచి 2022 జనవరి వరకూ పారిశ్రామిక ఉత్పత్తి సూచీ 13.7 శాతంగా నమోదయ్యింది. దీనికి లో బేస్ ఎఫెక్ట్ కూడా ఒక కారణం. ‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్. ఇక్కడ 2020–21 ఆర్థిక సంవత్సరం ఇదే కాలాన్ని పరిశీలిస్తే, అసలు వృద్ధిలేకపోగా 12 శాతం క్షీణత నమోదయ్యింది. 2020 మార్చి నుంచి ఒడిదుడుకుల బాట... మహమ్మారి కరోనా భయాలతో 2020 మార్చి 25 మే 31వ తేదీ వరకూ నాలుగు దశల్లో (మార్చి 25– ఏప్రిల్ 14, ఏప్రిల్ 15– మే 3, మే 4– మే 17, మే 18–మే 31) కఠిన లాక్డౌన్ అమలు జరిగిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచీ ఐఐపీ తీవ్ర ఒడిదుడుకుల బాటన పయనించింది. 2020 మార్చి (మైనస్ 18.7 శాతం) నుంచి ఆ ఏడాది ఆగస్టు వరకూ క్షీణతలోనే నడిచింది. అటు తర్వాత కొన్ని నెలల్లో భారీ వృద్ధి కనబడినా, దానికి ప్రధాన కారణం లో బేస్ ఎఫెక్ట్ కారణంగా కనబడింది. పలు నెలల నుంచి క్షీణతలో కొనసాగిన పారిశ్రామిక ఉత్పత్తి 2021 మార్చి నుంచి స్థిరంగా సానుకూల శ్రేణిలో కదిలింది. కీలక గణాంకాలను పరిశీలిస్తే... చదవండి: రిస్క్ ప్రాజెక్టులకు ఈక్విటీ నిధులే బెటర్! -
చిన్న పరిశ్రమలకు పెద్ద సాయం
సాక్షి, అమరావతి: పారిశ్రామిక రంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, విధానాలతో పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పారిశ్రామికరంగానికి ఊతమిచ్చేలా పలు చర్యలు చేపట్టారు. గత ఏడాది కోవిడ్ సమయంలో విధించిన లాక్‌డౌన్‌తో దేశవ్యాప్తంగా పరిశ్రమలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు)పై ఎక్కువ ప్రభావం పడింది. అయితే, రాష్ట్రంలోని పరిశ్రమలకు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేయూతనివ్వడంతో ఇక్కడి ఎంఎస్ఎంఈలు నిలదొక్కుకోవడమే కాదు.. కొత్త పరిశ్రమలూ క్యూ కడుతున్నాయి. కోవిడ్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక కష్టాలు ఉన్నప్పటికీ పారిశ్రామిక రాయితీలు సకాలంలో ఇస్తుండటం, కొత్త యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంది. రీస్టార్ట్ ప్యాకేజీ కింద రెండు విడతల్లో రూ.2,086 కోట్లపైన ఇచ్చింది. ఇతరత్రా సహాయ సహకారాలు అందించింది. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను కూడా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించింది. ప్రస్తుతం బకాయిలేమీ లేకుండా ప్రభుత్వ పరంగా చెల్లించాల్సినవి ఎప్పటికప్పుడు చెల్లిస్తోంది. ప్రభుత్వ చర్యలతో అత్యధిక ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఈ రంగానికి రాష్ట్రం వేదికగా మారుతోంది. పరిశ్రమల శాఖ గణాంకాల ప్రకారం సీఎంగా జగన్ అధికారం చేపట్టినప్పటి నుంచి గత ఏడాది (2021) డిసెంబర్ వరకు రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా 19,997 ఎంఎస్ఎంఈలు కొత్తగా ఏర్పాటయ్యాయి. ఈ యూనిట్ల ద్వారా రూ.4,558.01 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 1,09,829 మందికి ఉపాధి లభించింది. గడిచిన 12 నెలల్లోనే 6,875 యూనిట్ల ప్రతిపాదనలు వచ్చాయి. వీటిలో కొన్ని ఇప్పటికే ఏర్పాటు కాగా, మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. వీటి ద్వారా రాష్ట్రంలోకి రూ.2,055.01 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. 45,932 మందికి ఉపాధి లభిస్తోంది. చిన్న పరిశ్రమలకు అందిస్తున్న సహకారం రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకాన్ని పెంచుతోందని పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను కూడా చెల్లించడంతో పాటు ప్రస్తుత పారిశ్రామిక బకాయిలు సకాలంలో అందిస్తున్నారని ఫ్యాఫ్సియా అధ్యక్షులు వి.మురళీకృష్ణ తెలిపారు. కోవిడ్ కారణంగా పరిశ్రమలు మూతపడే సమయంలో రాయితీలు ఇవ్వడం ద్వారా పరిశ్రమ నిలబడటానికి ప్రభుత్వం ఊతమిచ్చిందని చెప్పారు. కోవిడ్‌తో ఏర్పడిన సమస్యలు ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతున్నాయన్నారు. మౌలిక వసతుల అభివృద్ధి రాష్ట్రంలో ఎంఎస్ఎంఈలకు అన్ని సదుపాయాలు ఒకేచోట లభించేలా మౌలిక వసతులు కల్పించడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా దృష్టిసారించింది. ఇందుకోసం ఎంఎస్ఎంఈ పార్కుల అభివృద్ధితో పాటు ఎంఎస్ఈసీడీపీ పథకం కింద వివిధప్రాజెక్టులను చేపట్టింది. రూ.214 కోట్లతో ఎంఎస్ఎం ఈ క్లస్టర్లు, కా మన్ ఫెసిలిటీ సెంటర్లను అభి వృద్ధి చేస్తోంది. రూ.27.60 కోట్లతో మూడు ఎంఎస్ఎంఈ పార్కులు, ఆరుచోట్ల రూ.75.76 కోట్లతో కామన్ ఫెసిలిటీ సెంటర్స్‌ను, రూ.95.53 కోట్లతో మరో ఆరు ఎంఎస్ఎంఈ పార్కులను అభివృద్ధి చేస్తోంది. రూ.15.11 కోట్లతో ఫ్లాట ర్డ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌ను అభివృద్ధి చేస్తోంది.రాష్ట్ర పారిశ్రామిక విధానం 2020–23లో ఎం ఎస్ఎంఈలకు ప్రత్యేక రాయితీలివ్వడం, కొత్తగా ఏర్పాటుచేసే సంస్థలకు ప్రతిపాదనలు ద గ్గర నుంచి ఉత్పత్తి మొదలయ్యేవరకు సహకా రం అందించేలా సిడ్బీతో కూడా ఒప్పందం కుదుర్చుకోవడం పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున రాష్ట్రంవైపు చూసేలా చేస్తోందని పరిశ్రమల శాఖ అధికారులు తెలిపారు. -
అమూల్‌తో శ్వేత విప్లవం
సాక్షి, హైదరాబాద్: పారిశ్రామిక రంగంతో పాటు ఇతర రంగాల సమగ్ర అభివృద్ధికి సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ముందుకు సాగుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. వ్యవసాయ రంగం సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అనేక వినూత్న కార్యక్రమాలు చేపట్టిందన్నారు. మత్స్య, మాంస ఉత్పత్తుల రంగంతో పాటు పాడి రంగానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందుతున్న ప్రోత్సాహంతో అభివృద్ధి చెందిందన్నారు. రాష్ట్రంలో అమూల్ పెట్టుబడుల ద్వారా పాడి పరిశ్రమ అభివృద్ధి చెంది శ్వేత విప్లవం వేగం పుంజుకుంటుందన్నారు. దేశంలో పాడి పరిశ్రమల రూపురేఖలు మార్చిన అమూల్ తమ పెట్టుబడులకు తెలంగాణను ఎంచుకోవడం పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. రాష్టంలో అమూల్ భవిష్యత్ ప్రణాళికలకు సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. వ్యక్తిగత కారణాలతో బుధవారం జరిగిన ఒప్పంద కార్యక్రమానికి హాజరు కాలేకపోయిన అమూల్ ఎండీ ఆర్ఎస్ సోధి శుభాకాంక్షలు తెలిపారు. త్వరలో జరిగే ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరవుతానని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అమూల్ తరఫున సభర్కాంత జిల్లా మిల్క్ ప్రొడ్యూసర్స్ కో–ఆపరేటివ్ సొసైటీ యూనియన్ ఎండీ బాబు భాయ్ ఎం. పటేల్, రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్‌రంజన్, రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ డైరెక్టర్ అఖిల్ తదితరులు పాల్గొన్నారు. -
మైనింగ్, విద్యుదుత్పత్తి జోరు
సాక్షి, అమరావతి: కోవిడ్ సంక్షోభం నుంచి పారిశ్రామిక రంగం వేగంగా పుంజుకుంటోంది. ముఖ్యంగా మైనింగ్, విద్యుత్ ఉత్పత్తి రంగాల్లో దేశీయ సగటు కంటే రాష్ట్రం మెరుగైన వృద్ధిరేటు నమోదు చేసినట్లు గణాంకాల శాఖ తాజా నివేదికలో పేర్కొంది. కోవిడ్‌తో భారీగా దెబ్బతిన్న మైనింగ్ రంగం ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల కాలానికి (ఏప్రిల్ – జూలై) 37.4 శాతం వృద్ధి నమోదు చేసింది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా మైనింగ్ రంగంలో 25.3 శాతం వృద్ధి మాత్రమే నమోదైంది. ఇక 2020–21 ఏప్రిల్ – జూలైతో పోలిస్తే విద్యుత్ ఉత్పత్తిలో రాష్ట్రంలో 23.1 శాతం వృద్ధి నమోదైంది. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా విద్యుత్ ఉత్పత్తిలో వృద్ధి రేటు 15.2 శాతానికే పరిమితమైంది. నాలుగు నెలల కాలానికి రాష్ట్ర తయారీ రంగంలో 20.7 శాతం వృద్ధి నమోదు కాగా దేశవ్యాప్తంగా 39 శాతం వృద్ధి నమోదైంది. మొత్తం మీద చూస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల కాలంలో రాష్ట్ర పారిశ్రామికోత్పత్తిలో 22.8 శాతం వృద్ధి నమోదైనట్లు గణాంకాల శాఖ తెలిపింది. పెరుగుతున్న కొనుగోళ్ల శక్తి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లో కొనుగోళ్ల శక్తిని పెంచుతున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది నాలుగు నెలల కాలంలో వివిధ రంగాల్లో ప్రజల వినియోగంలో గణనీయమైన వృద్ధిరేటు నమోదైంది. గతేడాది నిర్మాణ రంగంలో నాలుగు నెలల కాలంలో 41.7 శాతం క్షీణత నమోదు కాగా ఈ ఏడాది ఏకంగా 56 శాతం వృద్ధి నమోదు కావడం గమనార్హం. ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగంలో 57.8 శాతం, పేస్టులు, సౌందర్య సాధనాలు, ఇంటిని శుభ్రపరచే నాన్ కన్జూమర్ డ్యూరబుల్స్ వినియోగంలో 156.4 శాతం వృద్ధి నమోదైనట్లు గణాంకాల శాఖ పేర్కొంది. గతేడాది కోవిడ్‌తో దెబ్బతిన్న ప్రైమరీ, క్యాపిటల్ గూడ్స్, ఇంటర్మీడియట్ గూడ్స్ రంగాలు కూడా క్రమంగా వృద్ధి బాట పట్టాయి. -
ఇంధన ఆదా రూ. 2,350 కోట్లు!
సాక్షి, అమరావతి: ఇంధనాన్ని సమర్థవంతంగా వినియోగించడం, పొదుపు చేయడంలో ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన పనితీరును ప్రదర్శించింది. పారిశ్రామిక రంగంలో అమలు చేస్తున్న పాట్ (పెర్ఫార్మ్, అచీవ్, ట్రేడ్) పథకంలో భాగంగా సైకిల్–2లో 3,430 మిలియన్ యూనిట్ల విద్యుత్‌కు సమానమైన (0.295 మిలియన్ టన్స్ ఆఫ్ ఆయిల్ ఈక్వలెంట్ – ఏంటీవోఈ) ఇంధనాన్ని ఆదా చేసింది. దీని విలువ సుమారు రూ.2,350 కోట్లు ఉంటుంది. 1.38 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ విడుదలను తగ్గించగలిగింది. కేంద్ర విద్యుత్ శాఖకు చెందిన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) ఈ వివరాలను అధికారికంగా ప్రకటించింది. పాట్ మొదటి దశతో పోల్చితే మన రాష్ట్రం పాట్ సైకిల్–2లో 40 శాతం ఎక్కువ ఇంధనాన్ని ఆదా చేసినట్లు బీఈఈ తెలిపింది. మొదటి దశలో ఏపీ 0.205 ఎంటీవోఈ ఇంధనాన్ని పొదుపు చేసింది. పారిశ్రామిక ఇంధన వినియోగంలో ఆధునిక విధానాలను అవలంబించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ఈ ఘనత సాధించిందని బీఈఈ ప్రశంసించింది. ఈ మేరకు నిర్వహించిన వెబినార్‌లో ఇంధన పొదుపు సర్టిఫికెట్లను కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి అలోక్‌కుమార్ విడుదల చేసినట్లు రాష్ట్ర ఇంధన పర్యవేక్షణ మిషన్ సీఈవో ఎ.చంద్రశేఖర్‌రెడ్డి సోమవారం తెలిపారు. ఇంధన సామర్థ్య సాంకేతికతను అభివృద్ధి చేసి విస్తృతంగా వినియోగంలోకి తెస్తే భారీ పరిశ్రమలే కాకుండా చిన్న, మధ్యతరహా పరిశ్రమలు కూడా ప్రయోజనం పొందుతాయని వెబినార్‌లో అలోక్‌కుమార్ అన్నారు. బీఈఈ డైరెక్టర్ జనరల్ అభయ్ బాక్రే మాట్లాడుతూ.. పాట్ అమలుకు రాష్ట్రాలకు సహకరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రాష్ట్ర పరిశ్రమల శాఖతో కలిసి ప్రత్యేక పాట్ సెల్ ద్వారా పథకాన్ని పకడ్బందీగా అమలు చేసిన ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్‌ను ఈ సందర్భంగా అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంధన సామర్థ్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని శ్రీకాంత్ వివరించారు. దీనివల్ల రాష్ట్రంలో ప్రతి కుటుంబం ప్రయోజనం పొందుతోందన్నారు. దేశవ్యాప్తంగా 542 పరిశ్రమల ఎంపిక దేశవ్యాప్తంగా పరిశ్రమల రంగంలో 11 సెక్టార్లకు సంబంధించిన 542 పరిశ్రమలను పాట్ సైకిల్–2లో ఎంపిక చేశారు. వాటిలో 349 పరిశ్రమలు ఇంధన పొదుపు లక్ష్యాలను సాధించాయి. వీటికి 57.38 లక్షల ఎనర్జీ సేవింగ్ సర్టిఫికెట్లను అందజేశారు. లక్ష్యాలు చేరుకోని 193 పరిశ్రమలు 36.67 లక్షల సర్టిఫికెట్లు కొనుగోలు చేయాల్సి ఉంది. దేశవ్యాప్తంగా పాట్ సైకిల్–1లో 8.8 ఏంటీవోఈ ఇంధనం ఆదా చేయగా.. పాట్ సైకిల్–2లో 14.08 ఏంటీవోఈ ఆదా అయ్యింది.ఆయా పరిశ్రమలు పవర్ ఎక్సే్ఛంజీల్లో సర్టిఫికెట్లను విక్రయించడం ద్వారా లాభాలు ఆర్జించవచ్చు. పాట్ సైకిల్–2 ట్రేడింగ్ సెప్టెంబర్ చివరి నాటికి ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. -
టీఎస్ ఐపాస్ ద్వారా రూ.2.2 లక్షల కోట్లు పెట్టుబడులు
సాక్షి, నందిగామ: పారిశ్రామిక రంగంలో దేశంలోనే తెలంగాణ ముందు వరుసలో ఉందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. 2015 నవంబర్ నుంచి ఇప్పటి వరకు టీఎస్ ఐపాస్ ద్వారా రాష్ట్రానికి రూ.2.2 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం మేకగూడలో పోకర్ణ ఇంజనీర్డ్ స్టోన్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటు చేసి క్వాంట్రా క్వార్జ్ (గ్రానైట్) పరిశ్రమను శనివారం మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సబితాఇంద్రారెడ్డితో కలసి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సమర్థవంతమైన నాయకత్వం, సుస్థిరతతో కూడిన ప్రభుత్వం ఉన్నం దునే పెట్టుబడులు తరలివస్తున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో సమతుల్యమైన అభివృద్ధి జరుగుతోందని, ఐటీ, పారిశ్రామిక రంగాలకు ప్రాధాన్యం ఇస్తూనే ఉపాధికి అవకాశాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం 2015 నవంబర్‌లో టీఎస్ ఐపాస్ విధానాన్ని ప్రవేశపెట్టిందని, పెట్టుబడిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనేది పాలసీ ఉద్దేశమని స్పష్టం చేశారు. టీఎస్ ఐపాస్ ద్వారా పరిశ్రమను స్థాపించాలనుకునే వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే చాలు 15 రోజుల్లోనే అన్ని అనుమతులు ఇస్తామని చెప్పారు. పోకర్ణ కంపెనీ రూ.500 కోట్లతో ఈ పరిశ్రమను స్థాపించడం అభినందించదగ్గ విషయమన్నారు. ఈ పరిశ్రమతో సుమారు 500 మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి వివరించారు. పరిశ్రమల స్థాపనకు అన్ని రకాలుగా సహకారం అందిస్తామని, మౌలిక సదుపాయాలు సైతం కల్పిస్తామని ఆయన అన్నారు. అంతకు ముందు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు సుమారు 500 ఎకరాల్లో రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెస్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పరిశ్రమ ఎండీ గౌతం చంద్ జైన్, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు అంజయ్య యాదవ్, మర్రి జనార్దన్ రెడ్డి, కాలే యాదయ్య, దానం నాగేందర్, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణ రెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి పాల్గొన్నారు. -
పారిశ్రామిక రంగంలో తెలంగాణ ముందు వరసలో ఉంది : కేటీఆర్
-
కేంద్ర ప్రభుత్వ తీరుపై మంత్రి కేటీఆర్ అసంతృప్తి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం ఐటీశాఖ 2020-21 7వ వార్షిక నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. '' విపక్ష , స్వపక్ష అనే తేడా లేకుండా అందరినీ సమ దృష్టితో చూడాలి. రాష్ట్రాలను కలుపుకుని పోతేనే అభివృద్ధి సాధ్యం. కరోనా వల్ల పారిశ్రామిక రంగం దెబ్బతింది. ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. ఇక 2020-21కి సంబంధించిన ఐటీశాఖ వార్షిక నివేదికను పారదర్శకత కోసం విడుదల చేశాం. క్లిష్ట పరిస్థితుల్లో అభివృద్ధి సాధించాం.అన్ని రంగాల్లో తెలంగాణ దూసుకెళ్తోంది. ఐటీ, పారిశ్రామిక రంగాల్లో అద్భుత ప్రగతి సాధించాం. జాతీయ వృద్ధిరేటుతో పోల్చితే తెలంగాణ వృద్ధిరేటు రెండింతలు అధికం. ప్రస్తుత ఏడాది రూ.1,45,500 కోట్ల ఎగుమతులు చేశాం'' అని తెలిపారు. చదవండి: భాష వివాదంపై మంత్రి కేటీఆర్ స్పందన ప్రజల జీవితాలతో చెలగాటమాడతారా? -
కుబేరులు డబ్బుల్!
దేశంలో పారిశ్రామిక బిలియనీర్లు (బిలియన్ డాలర్లు/రూ.7,300 కోట్లు అంతకుమించిన సంపద కలిగిన వారు) రోజురోజుకీ మరింత బలపడుతున్నారు. ఏటేటా వీరి సంఖ్య కూడా పెరుగుతూ వెళుతోంది. దేశంలో అగ్రగామి 15 రంగాలకు చెందిన బిలియనీర్ల ఉమ్మడి సంపద గత ఐదేళ్లలో ఏకంగా 60 శాతం పుంజుకుని 2020 డిసెంబర్ చివరికి రూ.37.39 లక్షల కోట్లకు చేరుకున్నట్టు హురూన్ ఇండియా నివేదిక తెలిపింది. 2016లో ఈ 15 పరిశ్రమల్లోని బిలియనీర్ల ఉమ్మడి సంపద విలువ రూ.23.26 లక్షల కోట్లుగా ఉన్నట్టు పేర్కొంది. 2016లో టాప్–15 రంగాల్లో 269 మంది బిలియనీర్లు ఉంటే 2020 నాటికి ఈ సంఖ్య 613కు విస్తరించింది. ముఖ్యంగా ఫార్మా రంగం అత్యధిక సంపద పరులతో ఈ జాబితాలో ముందుంది. 2020లో దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను అమలు చేసిన కాలంలోనూ ఫార్మా రంగం ఎటువంటి ఆటంకాల్లేకుండా పనిచేసిన విషయాన్ని ఈ నివేదిక ప్రస్తావించింది. తిరుగులేని ఫార్మా... దేశీయంగా సంపదపరుల జాబితాలో ఫార్మా రంగం 2016 ఏడాది నుంచి ఏటా మొదటి స్థానంలోనే ఉంటూ వస్తోంది. 2016 నాటికి ఈ రంగంలో 39 మంది బిలియనీర్లు ఉండగా.. 2020 చివరికి వచ్చేసరికి ఈ సంఖ్య 121కు వృద్ధి చెందింది. అలాగే, 2016 నాటికి ఉన్న ఉమ్మడి సంపద రూ.5,20,800 కోట్ల నుంచి రూ.8,12,800 కోట్లకు విస్తరించింది. కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్ రంగంలోని 55 మంది బిలియనీర్ల ఉమ్మడి సంపద రూ.3.43 లక్షల కోట్లుగా ఉంది. ఎక్కువ మంది బిలియనీర్లతో 2016లో రెండో స్థానంలో ఉన్న ఎఫ్ఎంసీజీ రంగం.. ఐదేళ్లు తిరిగేసరికి 11వ స్థానానికి పడిపోయింది. సంఖ్యా పరంగా దిగువకు వచ్చినప్పటికీ.. ఈ రంగంలోని బిలియనీర్ల సంపద రూ.2.45 లక్షల కోట్ల నుంచి రూ.3.55 లక్షల కోట్లకు పెరిగింది. టెక్నాలజీయే ముందుకు తీసుకెళ్లేది.. ‘‘భారత కంపెనీలు దేశ చరిత్రలో అత్యంత వేగంగా విలువను వృద్ధి చేసుకున్నట్టు ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. టెక్నాలజీ ఆధారిత సంపద సృష్టి పూర్తి సామర్థ్యాన్ని అందుకుంటే అప్పుడు బిలియనీర్ల విషయంలో అమెరికాను భారత్ వెనక్కి నెట్టేస్తుంది’’ అని హురూన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అనాస్ రెహమాన్ పేర్కొన్నారు. 2020 చివరికి సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ రంగం 50 మంది బిలియనీర్లను కలిగి ఉండగా, వీరి ఉమ్మడి సంపద రూ.5,70,300 కోట్లుగా ఉంది. 2016లో ఈ రంగం 21 మంది బిలియనీర్లతో, రూ.2,42,800 కోట్లతో మూడో స్థానంలో ఉండడం గమనార్హం. ఐదేళ్ల తర్వాత కూడా ఈ రంగం అత్యధిక బిలియనీర్ల పరంగానూ అదే స్థానాన్ని కాపాడుకుంది. ముంబైలో బిలియనీర్ల సంఖ్య 217కు చేరుకుంది. ఇదే నగరంలో 2016 చివరికి 104 బిలియనీర్లు ఉన్నారు. 129 మందితో ఢిల్లీ రెండో స్థానంలోనూ, 67 మంది బిలియనీర్లతో బెంగళూరు, 50 మంది బిలియనీర్లతో హైదరాబాద్, 38 మంది బిలియనీర్లతో అహ్మదాబాద్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. బిలియనీర్ల సంఖ్య విషయంలో ఈ ఐదు నగరాలు గత ఐదేళ్లలోనూ టాప్–5లోనే కొనసాగాయి. చెన్నైలో 37 మంది, కోల్‌కతాలో 32 మంది బిలియనీర్లు ఉన్నారు. -
వలస కూలీలకు భరోసా
సాక్షి, అమరావతి: కరోనా సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తున్న తరుణంలో రాష్ట్ర ఆర్థిక రంగంలో కీలక పాత్ర పోషించే వలస కూలీలను కాపాడుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గతేడాది లాక్‌డౌన్‌తో వలస కూలీలు స్వస్థలాలకు వెళ్లిపోవడంతో అన్ని చోట్లా తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా రాష్ట్ర పారిశ్రామిక రంగం ముందస్తు చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో లాక్డౌన్ విధించే అవకాశాలు లేవని, కోవిడ్ ప్రోటోకాల్‌ను పాటిస్తూ వాణిజ్య కార్యకలాపాలను కొనసాగించుకోవచ్చంటూ పారిశ్రామికవేత్తలకు భరోసాను కల్పిస్తున్నట్లు పరిశ్రమల శాఖ డైరెక్టర్ జవ్వాది సుబ్రమణ్యం ‘సాక్షి’కి తెలిపారు. రాష్ట్రంలో ప్రధానంగా టెక్స్టైల్, గ్రానైట్, నిర్మాణ రంగాల కార్యకలాపాల్లో లక్షలాది మంది వలస కూలీలు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో లాక్డౌన్ ప్రకటనలు వస్తుండటంతో రాష్ట్రంలోని యాజమాన్యాలు, వలస కూలీల్లో ఒకరకమైన అభద్రతా భావం నెలకొని ఉన్న విషయం గమనించి ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. పనిచేసే చోట కోవిడ్ నిబంధనలు ఎలా పాటించాలో ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలను ప్రభుత్వం జారీ చేసిందన్నారు. కరోనా ఉధృతి ఎక్కువగా ఉన్న ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల నుంచి వలస కూలీలు తరలి వెళ్లిపోతున్నారని, ఏపీలో అలాంటి పరిస్థితులు ఉండబోవని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేక క్వారంటైన్లు.. లాక్డౌన్ తర్వాత గత నవంబర్ నెల నుంచి తిరిగి వచ్చిన వలస కూలీలతో రాష్ట్ర పారిశ్రామిక రంగం కళకళలాడుతోంది. ఇప్పుడు సెకండ్ వేవ్ దెబ్బతో వలస కూలీలు మారోమారు వెళ్లిపోకుండా ఉండటానికి యాజమాన్యాలు కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. ఇందుకోసం యూనిట్లలో పనిచేసే కూలీలకు ప్రత్యేక వైద్యం, వసతిని ఏర్పాటు చేస్తున్నాయి. కూలీల్లో ఎవరికైనా కోవిడ్ సోకితే వారి నుంచి ఇతరులకు విస్తరించకుండా ఉండటం కోసం పరిశ్రమల్లోనే ప్రత్యేక క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ టెక్స్టైల్ మిల్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు దండ ప్రసాద్ తెలిపారు. మార్చి నెల నుంచి వలస కూలీల్లో ఆందోళన మొదలైనప్పటికీ ఇంత వరకు ఎవ్వరూ వెనక్కి వెళ్లలేదని, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో కార్యకలాపాలు యథావిధిగా కొనసాగిస్తున్నట్లు ఏపీ స్మాల్ స్కేల్ గ్రానైట్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వై.కోటేశ్వరరావు తెలిపారు. గత లాక్డౌన్ సమయంలో తిరిగి వెళ్లిపోయిన వలస కూలీల్లో 65 శాతం మంది వెనక్కి వచ్చారని, ఇప్పుడు వారు తిరిగి వెళ్లకుండా ఉండేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. -
పారిశ్రామిక రంగానికి రూ.3,077 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2021–22లో పారిశ్రామిక రంగానికి రూ.3,077 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ఏడాది పారిశ్రామిక రంగ కేటాయింపుల్లో సింహభాగం రూ.2,500 కోట్లు పరిశ్రమల రాయితీలు, ప్రోత్సాహకాలే ఉండటం గమనార్హం. గతేడాది 2020–21 వార్షిక బడ్జెట్‌తో పోలిస్తే ఈ ఏడాది పారిశ్రామిక రంగ కేటాయింపులు రూ.1,079 కోట్ల మేర పెరి గాయి. కాగా ఈ ఏడాది పారిశ్రామిక రంగ కేటాయింపుల్లో జీతభత్యాలు, వాహనాలు, కార్యాలయాల నిర్వహణ తదితరాల కోసం నిర్వహణ పద్దు కింద రూ.330.96 కోట్లు కేటాయించారు. ప్రగతి పద్దు పేరిట పరిశ్రమల విభాగంతో పాటు ఇతర అనుబంధ శాఖలకు రూ.1,616.31 కోట్లు, ఎస్సీ, ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ కింద సుమారు మరో రూ.1,130 కోట్లు కేటాయించారు. విద్యుత్, ఎస్జీఎస్టీ, నైపుణ్య శిక్షణ, స్టాంప్ డ్యూటీ, భూ బదలాయింపు, పెట్టుబడి రాయితీ తదితరాలకు సంబంధించి రాష్ట్రంలోని వివిధ కేటగిరీలకు చెందిన సుమారు 3 వేల మంది పారిశ్రామికవేత్తలకు రూ.2,800 కోట్ల మేర రాయితీలు, ప్రోత్సాహ కాలకు సంబంధించిన బకాయిలు ఉన్నాయి. గతేడాది బడ్జెట్లో రాయితీలు, ప్రోత్సాహకాల బకాయిలు చెల్లించేందుకు 1,500 కోట్లు కేటాయించినా అరకొర చెల్లింపులే జరిగాయి. ప్రస్తుత బడ్జెట్లో పారిశ్రామిక రాయితీలు, ప్రోత్సాహకాల కోసం రూ.2,500 కోట్లు కేటాయించడంతో పారిశ్రామికవేత్తలకు మరీ ముఖ్యంగా చిన్న, మధ్య తరహా పరిశ్రమల నిర్వాహకులకు ఊరట దక్కనుంది. ప్రతిష్టాత్మక పార్కుల ప్రస్తావన లేదు.. రాష్ట్ర పారిశ్రామిక విధానం టీఎస్ ఐపాస్‌లో భాగంగా 14 ప్రధాన రంగాల కోసం ప్రత్యేక పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జాతీయ పెట్టుబడులు, ఉత్పాదక మండలి (నిమ్జ్) జహీరాబాద్, హైదరాబాద్ ఫార్మాసిటీ, వరంగల్ కాకతీయ టెక్స్టైల్ పార్కు కోసం వేలాది ఎకరాల భూమిని సేకరించింది. వీటితో పాటు పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం పలు పర్యాయాలు లేఖలు రాసింది. అయితే ప్రస్తుత రాష్ట్ర వార్షిక బడ్జెట్లో నిమ్జ్‌లో భూసేకరణకు రూ.2 కోట్లు కేటాయించగా, ఇతర పారిశ్రామిక పార్కుల ప్రస్తావన కనిపించలేదు. నిర్వహణ పద్దు, రాయితీలు పోగా పారిశ్రామిక రంగానికి చేసిన కేటాయింపుల్లో అనుబంధ శాఖలైన చేనేత, మౌలిక వసతులు, పెట్టుబడులు, చక్కెర, గనులు, భూగర్భ వనరుల శాఖకు నామమాత్రంగా నిధులు దక్కాయి. ప్రస్తుత బడ్జెట్లో నేత కార్మికుల కోసం రూ.338 కోట్లు ప్రతిపాదించగా ఇందులో నేత కార్మికులకు ఆర్థిక సాయం కోసం రూ.141.42 కోట్లు, చేనేత, వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి రూ.226.76 కోట్లు కేటాయించారు. ఐటీ రంగానికి రూ.360 కోట్లు.. ఐటీ రంగంలో ఎగుమతుల వృద్ధి రేటు విషయంలో దేశ సగటు 8.09 శాతంతో పోలిస్తే రాష్ట్రంలో వృద్ధిరేటు 17.93 శాతంగా ఉంది. ఐటీ, స్టార్టప్‌లకు హబ్‌గా పేరొందిన హైదరాబాద్‌లోని కొంపల్లి, కొల్లూరు, శంషాబాద్, ఉప్పల్, పోచారం తదితర కొత్త ప్రాంతాలకు ఐటీ రంగం విస్తరిస్తోంది. మరోవైపు ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లో ఐటీ టవర్లు మనుగడలోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐటీ రంగానికి కొత్త ప్రాంతాలకు విస్తరించ డంతో పాటు ఐటీ రంగంలో మౌలిక వసతులు మెరుగుపర్చేందుకు రూ.360 కోట్లను ప్రస్తుత వార్షిక బడ్జెట్లో ప్రతిపాదించారు. పారిశ్రామిక రంగానికి కేటాయింపుల స్వరూపమిదీ.. కేటగిరీ కేటాయింపు(రూ.కోట్లలో) గ్రామీణ చిన్న తరహా పరిశ్రమలు 1,379.40 భారీ, మధ్య తరహా పరిశ్రమలు 70.90 స్టేట్ సెక్టార్స్కీమ్స్ 12.06 మౌలిక వసతులు, పెట్టుబడులు 29.55 చక్కెర శాఖ 1.62 గనులు, భూగర్భ వనరులు 122.76 ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధులు 501.58 ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధులు 628.30 నిర్వహణ పద్దు 330.96 మొత్తం 3,077 -
వ్యాపార పద్మాలు అయిదుగురు..
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలు ఈసారి వ్యాపార, పారిశ్రామిక రంగంలో అయిదుగురికి దక్కాయి. రజనీకాంత్ దేవీదాస్ ష్రాఫ్, రజనీ బెక్టార్, జస్వంతీబెన్ జమ్నాదాస్ పోపట్, పి. సుబ్రమణియన్, శ్రీధర్ వెంబు ఇందులో ఉన్నారు. వీరిలో ఒకరికి పద్మభూషణ్ పురస్కారం రాగా, మిగతావారికి పద్మశ్రీ పురస్కారం దక్కింది. వారి వివరాలు.. రజనీకాంత్ దేవీదాస్ ష్రాఫ్ (పద్మభూషణ్): పంట సంరక్షణ ఉత్పత్తుల సంస్థ యునైటెడ్ ఫాస్ఫరస్ లిమిటెడ్ (యూపీఎల్) వ్యవస్థాపకుడు. ఈ సంస్థ క్రిమిసంహారకాలు, విత్తనాలు మొదలైనవి ఉత్పత్తి చేస్తోంది. ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకారం ష్రాఫ్ 1.7 బిలియన్ డాలర్ల సంపదతో దేశీ కుబేరుల్లో 93వ స్థానంలో ఉన్నారు. రజనీ బెక్టార్ (పద్మశ్రీ): మిసెస్ బెక్టార్స్ ఫుడ్ కంపెనీ అధినేత. రూ. 20,000 పెట్టుబడితో ప్రారంభించిన ఐస్–క్రీమ్స్ వ్యాపారాన్ని నేడు రూ. 1,000 కోట్ల స్థాయికి విస్తరించారు. ఇటీవలే ఇది ఐపీఓ ద్వారా విజయవంతంగా లిస్ట్ అయింది. జస్వంతీబెన్ జమ్నాదాస్ పోపట్ (పద్మశ్రీ): అప్పడాల తయారీ సంస్థ లిజ్జత్‌ను ఏర్పాటు చేసిన వ్యవస్థాపకుల్లో ఒకరు. ఓ సామాజిక సేవా కార్యకర్త నుంచి అప్పుగా తీసుకున్న రూ. 80తో 1950లలో ప్రారంభమైన లిజ్జత్ ప్రస్తుతం 800 కోట్ల పైచిలుకు వ్యాపారం సాగిస్తోంది. పి. సుబ్రమణియన్ (పద్మశ్రీ): గేర్ మ్యాన్ ఆఫ్ కోయంబత్తూర్‌గా పిల్చుకునే సుబ్రమణియన్.. 1969లో శాంతి ఇంజినీరింగ్ అండ్ ట్రేడింగ్ కంపెనీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అది శాంతి గేర్స్గా మారింది. మురుగప్ప గ్రూప్‌నకు దీన్ని విక్రయించాక సుబ్రమణియన్ .. తను సొంతంగా ఏర్పాటు చేసిన శాంతి సోషల్ సర్వీస్ అనే సంస్థ ద్వారా సామాజిక సేవా కార్యకలాపాల్లో నిమగ్నమయ్యారు. ఆయన మరణానంతరం పద్మశ్రీ పురస్కారం దక్కింది. శ్రీధర్ వెంబు (పద్మశ్రీ): క్లౌడ్ ఆధారిత బిజినెస్ సాఫ్ట్వేర్ సేవల సంస్థ జోహో వ్యవస్థాపకుడు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కేవలం పట్టణ ప్రాంతాలకు మాత్రమే పరిమితం చేయకుండా గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించే ప్రయత్నాల్లో ఉన్నారు. -
ఏపీలో పట్టాలెక్కిన పారిశ్రామిక ప్రగతి
-
ఇక నుంచి వారు పారిశ్రామికులు
-
ఇది దేవుడిచ్చిన వరం
దసరా పండుగ సందర్భంగా మంచి కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇది నా అదృష్టంగా, దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నా. స్టాంప్ డ్యూటీ రద్దు.. విద్యుత్ చార్జీల్లో, రుణాలపై వడ్డీలో, భూ కేటాయింపుల్లో, స్టేట్ జీఎస్టీలో రాయితీ ఇస్తున్నాం. క్వాలిటీ సర్టిఫికేషన్, పేటెంటింగ్ రిజిస్ట్రేషన్ రాయితీ వంటి అనేక ప్రోత్సాహకాలు ఈ కొత్త విధానంలో తీసుకొచ్చాం. వీటన్నింటి వల్ల ఎస్సీ, ఎస్టీలు ఎవ్వరికీ తీసిపోని విధంగా పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతారు. –సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీలు శ్రామికులుగా మిగిలిపోయే కాలం పోవాలని, ఎవ్వరికీ తీసిపోని విధంగా పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్షించారు. ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు పూర్తి ప్రోత్సాహం ఇచ్చేందుకు 2020–23 ప్రత్యేక పారిశ్రామిక విధానం రూపొందించామని చెప్పారు. ఇందులో భాగంగా సోమవారం ఆయన ‘జగనన్న–వైఎస్సార్ బడుగు వికాసం’ పథకాన్ని తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలు ఎవరైనా పరిశ్రమ పెట్టాలనుకుంటే.. ఏం చేయాలి? ఎవరిని కలవాలి? వంటి వాటిపై అధికారులు దృష్టి పెట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఎప్పుడూ, ఎక్కడా జరగని విధంగా కోటి రూపాయల వరకు ప్రోత్సాహక మొత్తం (ఇన్సెంటివ్) ఇస్తున్నామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలను పారిశ్రామిక వేత్తలుగా తయారు చేసేందుకు కొత్త కొత్త కార్యక్రమాలు తీసుకు వస్తున్నామన్నారు. ప్రత్యేకంగా ఫెసిలిటేషన్ సెల్స్ (సదుపాయాల కల్పన) కూడా ఏర్పాటు చేశామని, వారిలో నైపుణ్యం పెంచేలా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు రూపొందించామని వివరించారు. ఏపీఐఐసీ భూ కేటాయింపుల్లో 16.2 శాతం ఎస్సీలకు, 6 శాతం ఎస్టీలకు కచ్చితంగా ఇవ్వాలని నిర్ణయించామని, ఇది ఎస్సీ, ఎస్టీలు పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు ఊతం ఇస్తుందన్నారు. ఈ చొరవ వల్ల ఎస్సీ, ఎస్టీల నుంచి కొత్త పారిశ్రామిక వేత్తలు తయారు కావాలని పిలుపునిచ్చారు. సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. నవరత్నాలతో ఆదుకుంటున్నాం – పేదరికంలో ఉన్న ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలతో పాటు, అగ్రవర్ణాల్లోని పేదలందరికీ మంచి జరగాలని, వారి కాళ్ల మీద వారు నిలబడాలని, వారి జీవితాలు సంపూర్ణంగా మార్చాలన్న ఉద్దేశంతో అడుగులు వేశాం. – పేదలకు అమ్మ ఒడి పథకం తీసుకున్నా, రైతు భరోసా, ఆరోగ్యశ్రీ, పెన్షన్ల పెంపు.. ఇలా ఏ పథకం తీసుకున్నా పేదలకు పెద్దపీట వేస్తున్నాం. 30 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు అక్క చెల్లెమ్మల పేరు మీదే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నాం. – గ్రామ, వార్డు వలంటీర్లు, సచివాలయ వ్యవస్థలో దాదాపు 82 శాతం ఉద్యోగాలు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలకు దక్కాయి. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా చదువుల కోసం ఏ ఒక్కరూ అప్పులపాలు కాకుండా చూస్తున్నాం. వారి కాళ్ల మీద వారు నిలబడాలని.. – నాకు ఓటు వేయకపోయినా పర్వాలేదు.. అర్హులైతే చాలు, వారికి మంచి జరగాలనే ఉద్దేశంతో గ్రామ, వార్డు, వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేశాం. – చేయూత, ఆసరా తదితర పథకాల ద్వారా పేదలు పారిశ్రామికంగా వారి కాళ్ల మీద వారు నిలబడాలనే దిశలో ఊతమిస్తూ అడుగులు ముందుకు వేస్తున్నాం. మార్కెటింగ్‌లో ఇబ్బందులు పడకూడదని అమూల్, పీ అండ్‌జీ, రిలయన్స్, హిందుస్తాన్ లీవర్, ఐటీసీ వంటి పెద్ద పెద్ద సంస్థలను తీసుకు వచ్చాం. – నేటి విద్యార్థులు భావితరంతో పోటీ పడే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను ప్రవేశ పెడుతున్నాం. ప్రతి ప్రభుత్వ పాఠశాల రూపు రేఖలను మార్చే ‘నాడు–నేడు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. రాబోయే రోజుల్లో పేదల స్థితిగతులను పూర్తిగా మార్చాలని పలు కార్యక్రమాలు చేపట్టాం. అందరికీ మంచి జరగాలని, మరింత మంచి చేసే అవకాశాన్ని దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను. – ఈ కార్యక్రమంలో మంత్రులు మేకపాటి గౌతమ్‌రెడ్డి, పి.విశ్వరూప్, బాలినేని శ్రీనివాసరెడ్డి, తానేటి వనిత, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఏపీఐఐసీ చైర్పర్సన్ ఆర్కె రోజా, ఎంపీలు నందిగం సురేష్, చింతా అనురాధ, ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేరుగు నాగార్జున, టీజేఆర్ సుధాకర్‌బాబు, కొండేటి చిట్టిబాబు, తలారి వెంకట్రావు, జొన్నలగడ్డ పద్మావతి, అలజంగి జోగారావు, పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవెన్, ఆ శాఖ డైరెక్టర్ జె.సుబ్రమణ్యం, పలువురు సీనియర్ అధికారులు, ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక పారిశ్రామిక విధానం 2020–23 లో కీలక అంశాలు – 2020లో రీస్టార్ట్ ఒన్ కింద ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు రూ.278 కోట్లను ఇన్సెంటివ్ రూపంలో ప్రభుత్వం చెల్లించింది. గతంలో ఏటా సగటున ఎస్సీలకు రూ.53 కోట్లు, ఎస్టీలకు రూ.15 కోట్లు మాత్రమే ఇచ్చేవారు. – ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ పార్కుల్లో 16.2 శాతం ఎస్సీలకు, 6 శాతం ఎస్టీలకు భూములు కేటాయిస్తారు. 25 శాతం చెల్లిస్తే భూములను అప్పగిస్తారు. మిగిలిన 75 శాతాన్ని 8 శాతం నామమాత్రపు వడ్డీతో 8 ఏళ్లలో చెల్లించవచ్చు. – 100 శాతం స్టాంపు డ్యూటీని, ట్రాన్స్ఫర్ డ్యూటీని రీయింబర్స్ చేస్తారు. భూముల లీజు, షెడ్డు, భవనాలు, తనఖా తదితరాలపై 100 శాతం స్టాంపు డ్యూటీని రీయింబర్స్ చేస్తారు. – ఇండస్ట్రియల్ ఎస్టేట్, ఇండస్ట్రియల్ పార్కుల్లో ఎంఎస్ఈల కోసం భూములను 50 శాతం రిబేటుపై (రూ.20 లక్షల వరకు) ఇస్తారు. – ల్యాండ్ కన్వెర్షన్ చార్జీల్లో 25 శాతం వరకు, గరిష్టంగా రూ.10 లక్షల వరకు ఎంఎస్ఈలకు రిబేటు ఇస్తారు. – ఉత్పత్తి ప్రారంభమైన నాటి నుంచి తదుపరి 5 ఏళ్ల వరకు వాడుకున్న కరెంట్‌లో యూనిట్‌కు రూ.1.50 రీయింబర్స్ చేస్తారు. – ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లో 45 శాతం వరకు, గరిష్టంగా కోటి రూపాయల వరకు ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ లభిస్తుంది. – సర్వీసులు, రవాణా రంగాల్లో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లో 45 శాతం వరకు, గరిష్టంగా రూ.75 లక్షల వరకు ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ లభిస్తుంది. – ఉత్పత్తి ప్రారంభించిన ఎంఎస్ఈలకు ఐదేళ్లపాటు 3 శాతం నుంచి 9 శాతం వరకు వడ్డీ రాయితీ లభిస్తుంది. నెట్ ఎస్జీఎస్టీలో 100 శాతం రీయింబర్స్ లభిస్తుంది. మధ్యతరహా పరిశ్రమలకు 75 శాతం, భారీ పరిశ్రమలకు 50 శాతం రీయింబర్స్మెంట్ అందుతుంది. – క్వాలిటీ సర్టిఫికేషన్, పేటెంట్ రిజిస్ట్రేషన్లకు అయ్యే ఖర్చులో ఎంఎస్ఈలకు రూ.3 లక్షల వరకు ప్రభుత్వం భరిస్తుంది. కొత్తగా మైక్రో యూనిట్లు ఏర్పాటు చేయదలచుకునే వారికి సీడ్ కేపిటల్ అసిస్టెన్స్ కింద మెషినరీ ఖర్చులో 25 శాతం అందుతుంది. -
జగనన్న వైఎస్ఆర్ బడుగు వికాసానికి సీఎం జగన్ శ్రీకారం
-
ఇది నా అదృష్టం.. దేవుడిచ్చిన వరం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీలు శ్రామికులుగా మిగిలిపోయే కాలం పోయిందని, పారిశ్రామిక వేత్తలుగా ఎదిగే సమయం ఆసన్నమైందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. వారిని ప్రోత్సహించేవిధంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని, ఇందులో భాగంగా ఎస్సీలకు 16.2 శాతం, ఎస్టీలకు 6శాతం మేర ఇండస్ట్రియల్ పార్కుల్లో భూములు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. పరిశ్రమ పెట్టాలనుకున్న వారు.. ఎలా ముందుకు వెళ్లాలి? ఎవరిని కలవాలి? అన్న అంశాలపై అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2020–23 ప్రత్యేక పారిశ్రామిక విధానాన్ని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ‘‘జగనన్న వైఎస్సార్ బడుగు వికాసం’’ పేరిట రూపొందించిన సరికొత్త కార్యక్రమాన్ని సీఎం జగన్, తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ప్రారంభించారు. (చదవండి: పోలవరానికి నిధులు రాబట్టండి) ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. దసరా పండుగ సందర్భంగా మంచి కార్యక్రమాన్ని ప్రారంభించామని హర్షం వ్యక్తం చేశారు. ఇది తన అదృష్టంగా, దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘‘ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు, రాష్ట్రంలో ఎప్పుడూ , ఎక్కడా జరగని విధంగా రూ. 1 కోటి రూపాయిల ఇన్సెంటివ్‌లు ఇస్తున్నాం. వారిలో నైపుణ్యాలను పెంచడానికి స్కిల్ డెవలప్మెంట్, ఫెసిలిటేషన్‌కార్యక్రమాలను చేపడుతున్నాం. స్టాంపు డ్యూటీ, వడ్డీ రాయితీ, ఎస్జీఎస్టీల్లో రాయితీలు, క్వాలిటీ సర్టిఫికేషన్.. పేటెంట్ రుసుముల్లో రాయితీలు... ఇలా ఎన్నెన్నో ప్రోత్సాహకాలు ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు లభిస్తున్నాయి. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీలు, అలాగే అగ్రవర్ణాల్లోని పేదలకు కూడా మంచి జరగాలి. వారి కాళ్లమీద వారు నిలబడాలనే ఉద్దేశంతో వారి జీవితాలను మార్చాలనే నవరత్నాలు సహా అనేక కార్యక్రమాలు చేపట్టాం. సచివాలయాల్లో కూడా 82శాతం ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే దక్కాయి. పూర్తి ఫీజు రియింబర్స్ మెంట్ అమలుచేస్తున్నాం. అవినీతి లేకుండా, పక్షపాతం లేకుండా, కుల,మత, వర్గ, రాజకీయ పార్టీలకు అతీతంగా అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో, ప్రతి ఒక్కరికీ పథకాలు అందించేందుకు గ్రామ, వార్డు, వాలంటీర్ల వ్యవస్థను చేపట్టాం. ఆసరా, చేయూత లాంటి పథకాలను ప్రవేశపెట్టాం. (చదవండి: బీసీ కార్పొరేషన్లతో సామాజిక విప్లవం) అదే విధంగా మార్కెటింగ్‌లో ఇబ్బందులు పడకూడదని అమూల్‌ను, పీ అండ్‌జీని, రిలయన్స్‌లాంటి సంస్థలను తీసుకువచ్చాం. అంతేగాక చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. ప్రతి ప్రభుత్వ పాఠశాల రూపు రేఖలను మార్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. రాబోయే రోజుల్లో పేదల స్థితిగతులను పూర్తిగా మార్చాలని ఈ కార్యక్రమాలు చేపట్టాం. అందరికీ మంచి జరగాలని, అలాగే మరింత మంచి చేసే అవకాశాన్ని దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. -
వైట్‌కాలర్ ఉద్యోగాలు హుష్
సాక్షి, అమరావతి: వైట్ కాలర్ జాబ్స్ (నైపుణ్య ఉద్యోగాలు) అంటే ఎంతో క్రేజ్. కానీ.. కరోనా మహమ్మారి వ్యాప్తి, లాక్డౌన్ తదనంతర పరిణామాలు దేశంలో వైట్ కాలర్ ఉద్యోగాలకే ఎక్కువగా కోత పెట్టాయి. దేశంలో ఏకంగా 66.60 లక్షల ఉద్యోగాల్లో కోత పడ్డాయని సెంటర్ ఫర్ మోనిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) నివేదిక వెల్లడించింది. కోత పడిన ఉద్యోగుల్లో పారిశ్రామిక రంగంలోని కార్మికులు రెండో స్థానంలో ఉన్నారు. దాదాపు 50 లక్షల మంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోయారు. నివేదికలోని ప్రధానాంశాలివీ ► దేశంలో మే నుంచి ఆగస్టు వరకు 66.60 లక్షల మంది వైట్ కాలర్ ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ► 2019 మే– ఆగస్టు మధ్య దేశవ్యాప్తంగా ప్రైవేటు రంగంలో 1.88 కోట్ల మంది వైట్ కాలర్ ఉద్యోగులుండేవారు. కాగా 2020 మే–ఆగస్టు మధ్య 1.22 కోట్ల మంది వైట్ కాలర్ ఉద్యోగులు మాత్రమే మిగిలారు. ► ఈ రంగంలో 2020 మే–ఆగస్టులో దాదాపు 66.60 లక్షల ఉద్యోగాలకు కోత పడింది. ► దేశంలో జాబ్స్ కోల్పోయిన వైట్ కాలర్ ఉద్యోగుల్లో ఇంజనీర్లు, ఫిజీషియన్లు, ఉపాధ్యాయులు, అకౌంటెంట్లు, అనలిస్టులు మొదలైనవారు ఎక్కువగా ఉన్నారు. ► ఈ ఏడాది మే–ఆగస్టు మధ్య పారిశ్రామిక రంగంలో దాదాపు 50 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఈ రంగం 26 శాతం ఉద్యోగాల కోతతో రెండో స్థానంలో నిలిచింది. ► కార్పొరేట్ సంస్థల కంటే చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమల్లోనే ఎక్కువ ఉద్యోగాలు కోతపడ్డాయి. ► పారిశ్రామిక రంగంలో క్లరికల్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత ఉండటం గమనార్హం. ఇతరులతో పోలిస్తే బీపీవోలు, కియోస్క్‌లలో ఆపరేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు వంటి వారికి ఉద్యోగ భద్రత ఎక్కువగా ఉంది. వారికి ‘వర్క్ ఫ్రం హోమ్’కు అవకాశం ఉండటమే దీనికి కారణం. అన్‌లాక్‌తో ఊరట ► దేశంలో దశల వారీగా లాక్డౌన్ తొలగించటంతో ప్రస్తుత పరిస్థితి గణనీయంగా మెరుగుపడిందని సీఎంఐఈ నివేదిక పేర్కొంది. ► దేశంలో 1.21 కోట్ల వైట్ కాలర్ ఉద్యోగాలకు కోత పడొచ్చని ఈ ఏడాది ఏప్రిల్‌లో సీఎంఐఈ అంచనా వేసింది. ► కానీ.. దశల వారీగా లాక్‌డౌన్‌ను ఎత్తివేయడంతో ఆగస్టు నుంచి ఆర్థిక రథచక్రం తిరిగి జోరందుకుంది. ► దాంతో ఉద్యోగాల కోతకు తెరపడిందని సీఎంఐఈ వెల్లడించింది. -
ఇంధన పొదుపులో ఏపీ బెస్ట్
సాక్షి, అమరావతి: పారిశ్రామిక ఇంధన పొదుపులో ఆంధ్రప్రదేశ్ పురోగతి సాధిస్తోందని కేంద్ర ప్రభుత్వ సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ) ప్రశంసించింది. రాష్ట్ర ఇంధన శాఖ ఈ విషయాన్ని ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. పారిశ్రామిక రంగంలో కేంద్రం అమలు చేస్తోన్న ‘పెర్ఫార్మ్, అచీవ్ అండ్ ట్రేడ్’ (పాట్) పథకంలో ఏపీ అత్యుత్తమ ఫలితాలు సాధించినట్లు తెలిపింది. పలు పరిశ్రమల్లో రూ.1,600 కోట్ల విలువైన 2,386 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఏపీ పొదుపు చేసిందని వివరించింది. విద్యుత్ వినియోగం అధికంగా ఉండే సిమెంట్, ఫెర్టిలైజర్స్, పవర్ జనరేషన్, పేపర్ అండ్ పల్ప్, రసాయన రంగాలకు చెందిన 22 పరిశ్రమల్లో ‘పాట్’ పకడ్బందీగా అమలు చేసినట్లు ఇంధన శాఖ వెల్లడించింది. -
పరిశ్రమాభివృద్ధిరస్తు
సాక్షి, అమరావతి : రాష్ట్ర బడ్జెట్లో పరిశ్రమలు, ఐటీ, మౌలిక వసతుల కల్పన, నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేస్తూ ఏకంగా రూ.4,455 కోట్లు కేటాయించారు. ఇందులో రూ.1,826.04 కోట్లు పారిశ్రామిక రాయితీలు, పరిశ్రమల ప్రోత్సాహకానికి కేటాయించడం విశేషం. కడప ఉక్కు కర్మాగారం నిర్మాణానికి రూ.250 కోట్లు కేటాయించారు. స్థానిక యువతకు ఉపాధి కల్పించే విధంగా పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించడానికి రూ.856.64 కోట్లు కేటాయించింది. రంగాలవారీగా కేటాయింపులు ఇలా.. పెట్టుబడుల ఆకర్షణకు మౌలిక వసతుల కల్పనకు.. 696.61 కోట్లు ►ఈ మొత్తంలో ఓడరేవుల అభివృద్ధికి రూ.63.82 కోట్లు కేటాయింపు ►ఎయిర్‌పోర్టుల అభివృద్ధికి రూ.632.79 కోట్లు ►సాగరమాల ప్రాజెక్టులో భాగంగా కాకినాడ యాంకరేజ్ పోర్టులో మౌలిక వసతుల అభివృద్ధి ►ఈ ఏడాది మచిలీపట్నం, రామాయపట్నం, భావనపాడు పోర్టుల నిర్మాణం ►భోగాపురం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దగదర్తిలో ఎయిర్‌పోర్టుల నిర్మాణం చేపట్టడం ►ఈ ఏడాది 600 టెలికాం టవర్ల నిర్మాణం ►కడప ఎయిర్‌పోర్టులో నైట్ ల్యాండింగ్ సదుపాయం ►ఓర్వకల్లు విమానాశ్రయం పనులు పూర్తి చేసి ఈ ఏడాది అందుబాటులోకి తీసుకురావడం పరిశ్రమలకు భారీ ప్రోత్సాహకాలు ►పెట్టుబడులను ఆకర్షించే విధంగా కొత్త పారిశ్రామిక విధానం తీసుకురావడం ►అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందే విధంగా ఇండస్ట్రియల్ క్లస్టర్ల ఏర్పాటు ►సూక్ష్మ, చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)ల మౌలిక వసతుల కల్పనకు రూ.100 కోట్లు ►ఏపీ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్‌కు రూ.180.77 కోట్లు ఐటీలో 25 వేల మందికి ఉపాధి లక్ష్యం ►ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగం కోసం రూ.197.37 కోట్ల బడ్జెట్ కేటాయింపులు ►ఐటీ రంగంలో కొత్త పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఎగుమతులు పెంచుకోవడంపై ప్రత్యేక దృష్టి ►పారదర్శకత పెంచడానికి పరిపాలనలో నూతన టెక్నాలజీ వినియోగం పెంచడం ►స్టార్టప్‌ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు ►ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగంలో ఈ ఏడాది 25 వేల మందికి ఉపాధి కల్పన లక్ష్యం ►ఎలక్ట్రానిక్స్ రంగంలో రూ.2,000 కోట్లు, ఐటీ రంగంలో రూ.250 కోట్ల పెట్టుబడుల ఆకర్షణ స్కిల్ డెవలప్మెంట్కు రూ.856.64 కోట్లు ►ఈ మొత్తంలో వ్యవసాయ రంగంలో స్కిల్ డెవలప్మెంట్ కోసం రూ.279.09 కోట్లు కేటాయింపు ►ఐటీఐల్లో మౌలిక వసతుల పెంపునకు రూ.229.24 కోట్లు ►పాలిటెక్నిక్ కాలేజీల అభివృద్ధికి రూ.348.31 కోట్ల కేటాయింపు ►ఎస్టీలకు అరకు, చింతపల్లి, భద్రగిరి, సీతంపేట, కేఆర్ పురంలో ఐటీఐల ఏర్పాటు ►మాచర్ల, కడపలో ఎస్సీల కోసం రెండు రెసిడెన్షియల్ ఐటీఐల నిర్మాణం ►టెక్నికల్ కాలేజీల్లో కాలానికి అనుగుణంగా ప్రతి ఐదేళ్లకు సిలబస్ మార్పు ఇతరాలు.. ►జౌళి శాఖ, సహకార చక్కెర కర్మాగారాలు, ఆహార శుద్ధి, తదితరాలకు రూ.347.56 కోట్లు -
పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి
-
విశాఖను పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చేస్తాం
సాక్షి, విశాఖపట్నం : లాక్డౌన్ నుంచి పారిశ్రామికవేత్తలు కోలుకునే పరిస్థితి తిరిగి వస్తుందంటూ మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. విశాఖను పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారన్నారు. ఈ ఏడాదిలో 39 కొత్త పరిశ్రమల ద్వారా 30 వేల మందికి ఉపాధి లభించిందన్నారు. రాష్ట్రంలో ఐదు భారీ పరిశ్రమల ఏర్పాటుతో కొత్తగా రూ. 600 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. లాక్డౌన్ సమయంలోనూ సీఎం జగన్ పరిశ్రమలకు భారీ ప్రోత్సాహకాలు ఇచ్చి ఆదుకుంటున్నారని తెలిపారు. జిల్లాలోని రాచపల్లి, గుర్రంపాలెం వద్ద ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. ప్రతీ పార్లమెంటు పరిధిలో స్కిల్‌డెవలప్‌మెంట్ కాలేజీలు ఏర్పాటుతో పాటు విశాఖలో స్కిల్ డెవలప్మెంట్ వర్సిటీ ఏర్పాటుకు సీఎం జగన్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారంటూ మంత్రి తెలిపారు. చిన్న పరిశ్రమలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ముంజూరు చేయడంలో ఎప్పుడూ ముందుంటదని తెలిపారు. వలస వెళ్ళిన కార్మికులు తిరిగి పరిశ్రమల్లో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారని అవంతి వెల్లడించారు. -
ఆ సత్తా విశాఖకు మాత్రమే ఉంది : సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి : హైదరాబాద్, బెంగళూరులాంటి నగరాలతో పోటీపడే సత్తా విశాఖకు మాత్రమే ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. విశాఖలో స్కిల్ డెవలప్మెంట్ కోసం అత్యున్నతస్థాయి ఇంజినీరింగ్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. మౌలిక సదుపాయాల విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక బలం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఉందని.. లోక్‌సభలో నాలుగో అతిపెద్ద పార్టీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉందని సీఎం జగన్ గుర్తుచేశారు. గత ప్రభుత్వం రాయితీలను కూడా అమ్ముకుందని.. కానీ ఈ ప్రభుత్వంలో అవినీతికి తావులేదని స్పష్టం చేశారు. వ్యవస్థలో పూర్తిస్థాయిలో మార్పులు తీసుకొచ్చామని చెప్పారు. మన పాలన-మీ సూచన కార్యక్రమంలో భాగంగా గురువారం పారిశ్రామిక రంగంపై తాడేపల్లిలోని క్యాంపు ఆఫీస్‌లో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ పరిశ్రమల ఏర్పాటు, ఉద్యోగ అవకాశాల పెంపుపై సీఎం జగన్ చర్చించారు. పారిశ్రామికవేత్తలు, లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ‘రాష్ట్ర విభజనతో మనకు నష్టమే జరిగింది. ప్రత్యేక హోదా ఇస్తారని మాట ఇచ్చి ఇవ్వలేదు. ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే అనేక రాయితీలు ఇచ్చేవారు.. పరిశ్రమలు వచ్చేవి. జీఎస్టీతోపాటు అనేక పన్నుల్లో మినహాయింపులు వచ్చేవి. 2014-19 వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కాపురం చేసినా హోదా రాలేదు. కేంద్రంలో సంపూర్ణ మెజార్టీ రాకపోయి ఉంటే రాష్ట్రానికి ప్రయోజనం జరిగి ఉండేది. ప్రత్యేక హోదా ఇస్తే ఎవరితోనైనా కలిసిపోతామని ఆనాడే చెప్పాం. కానీ కేంద్రంలో పూర్తి మెజార్టీతో ప్రభుత్వం ఏర్పడింది. ఎప్పుడు అవకాశం వచ్చినా కేంద్రంతో ప్రత్యేక హోదా గురించి అడుగుతూనే ఉన్నాం. ఎప్పటికైనా ప్రత్యేక హోదాను సాధించి తీరుతాం. మనం చెప్పే మాటల్లో నిజాయితీ, నిబద్ధత ఉండాలి. గత ప్రభుత్వం మాదిరిగా నేను అబద్ధాలు చెప్పను. గత ప్రభుత్వం రూ.20 వేల కోట్ల పెట్టుబడులు, 40 లక్షలు ఉద్యోగాలంటూ ప్రచారం చేసింది. అన్ని విదేశీ సంస్థలు వచ్చేస్తున్నాయని ప్రచారం చేశారు. గత ప్రభుత్వం అబద్ధాలు చెబుతూ గ్రాఫిక్స్‌తో కాలం గడిపింది. గత ప్రభుత్వం రాయితీలు ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. 2014-19 వరకు రూ.4వేల కోట్లు బకాయిలు ఉన్నాయి. గత ప్రభుత్వం డిస్కంలకు రూ.20వేల కోట్ల బకాయిలు పెట్టింది. వ్యవస్థల్లో పూర్తిస్థాయిలో మార్పులు తీసుకొచ్చాం.. గత ప్రభుత్వ హయాంలో ఈజ్ ఆఫ్ బిజినెస్ అంటూ క్రమం తప్పకుండా విదేశీ పర్యటనలు చేశారు తప్ప.. చేసిందేమీ లేదు. వారి అనుకూల మీడియా కూడా అబద్ధాలు ప్రచారం చేసింది. మాట ఇచ్చిందే చేస్తామని చెప్పాం. నిజాయితీ, నిబద్ధతకు కట్టుబడి ఉన్నాం, ఇదే విషయాన్ని పరిశ్రమలకు చెప్పాం. మౌలిక సదుపాయల విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక బలం ఉంది. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఉంది. లోక్‌సభలో నాలుగో అతిపెద్ద పార్టీగా వైఎస్ఆర్ సీపీ ఉంది. ఏపీకి 972 కిలోమీటర్ల కోస్తా తీరం ఉంది.. మంచి రోడ్డుమార్గం, రైల్వే కనెక్టవిటీ ఉంది. నాలుగు పోర్టులు, ఆరు ఎయిర్‌పోర్టులున్నాయి. గత ప్రభుత్వం రాయితీలను కూడా అమ్ముకుంది.. కానీ ఈ ప్రభుత్వంలో అవినీతికి తావులేదు. వ్యవస్థల్లో పూర్తిస్థాయిలో మార్పులు తీసుకొచ్చాం. దేశంలో ఎక్కడాలేని విధంగా జ్యుడిషీయల్ ప్రివ్యూ కమిషన్ ఏర్పాటు చేశాం. రివర్స్ టెండరింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాం. దీని ద్వారా పారదర్శకత పెరిగింది. దేశంలోనే అత్యున్నత పోలీసు వ్యవస్థ ఇక్కడ ఉంది. కియా వెళ్లిపోయిందని ప్రచారం చేశారు.. రాష్ట్రంలో విద్యుత్ కొరత లేదు.. బలమైన బ్యాంకింగ్ వ్యవస్థ ఉంది. పరిశ్రమలకు భూమి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పరిశ్రమలకు నీరు ఇచ్చేందుకు బలమైన వ్యవస్థ ఉంది. ప్రాథమికస్థాయి నుంచి ఇంగ్లిష్ మీడియం అమలు చేస్తున్నాం. పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా చట్టం చేశాం. పరిశ్రమలను ప్రోత్సహించే కార్యక్రమాలు చేస్తున్నాం. కియా వెళ్లిపోతుందంటూ చంద్రబాబు, ఎల్లోమీడియా దుష్ప్పచారం చేసింది. చివరికి కియా యాజమాన్యం ముందుకొచ్చి.. ఏపీలో మంచి ప్రభుత్వం ఉంది.. మేమెందుకు వెళ్తామని చెప్పింది. కొత్తగా 13,122 సూక్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు వచ్చాయి. రూ. 11,500 కోట్లతో పరిశ్రమలు పెట్టేందుకు 1466 కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. మరో 23 ప్రముఖ సంస్థలు కూడా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి. సుమారు 90వేల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను నిలబెట్టుకోవాల్సి ఉంది. ఈ పరిశ్రమలను కాపాడుకుంటేనే ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి. 2014-19 వరకు పెండింగ్‌లో ఉన్న బకాయిలతోపాటు.. సూక్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను కాపాడుకునేందుకు రూ.968 కోట్లు కేటాయించాం. మొదటి విడతగా రూ.450 కోట్లు విడుదల చేశాం. సూక్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు సుమారు రూ.1200 కోట్లు ప్యాకేజీ ఇచ్చాం. రూ.15వేల కోట్లతో కడపలో స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు. స్టీల్‌ప్లాంట్ అభివృద్ధి కోసం ప్రైవేట్ కంపెనీలు ముందుకొస్తే... వారితో కలిసి పని చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఆ సత్తా విశాఖకు మాత్రమే ఉంది.. హైదరాబాద్, బెంగళూరులాంటి నగరాలతో పోటీపడే సత్తా విశాఖకు మాత్రమే ఉంది. విశాఖలో స్కిల్ డెవలప్మెంట్ కోసం అత్యున్నతస్థాయి ఇంజినీరింగ్ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తాం. ఎల్జీ పాలిమర్స్‌లో జరిగిన ప్రమాదంపై వేగంగా స్పందించాం. రూ.50 కోట్లు విడుదల చేసి బాధితులకు 10 రోజుల్లోనే ఇచ్చాం. సంఘటన జరిగిన గంటలోపే అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఘటనపై కేంద్ర, రాష్ట్రప్రభుత్వ కమిటీలు విచారణ జరుపుతున్నాయి. కమిటీల నివేదిక తర్వాత బాధ్యులెవరైనా చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు. -
నేడు పారిశ్రామిక రంగంపై ముఖాముఖి
-
నేడు పారిశ్రామిక రంగంపై సదస్సు
సాక్షి, అమరావతి: ‘మన పాలన – మీ సూచన’ కార్యక్రమంలో భాగంగా గురు వారం పారిశ్రామిక రంగంపై సదస్సు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా పారిశ్రామికవేత్తలు, లబ్ధిదారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖాముఖి మాట్లాడతారు. లాక్‌డౌన్‌తో దెబ్బతిన్న పారిశ్రామిక రంగాన్ని తిరిగి గాడిన పెట్టడానికి ప్రవేశపెట్టిన, చేపట్టా ల్సిన కార్యక్రమాలపై సదస్సులో చర్చి స్తారు. గత ఏడాది కాలంలో రాష్ట్రంలో కొత్తగా పెట్టుబడులను ఆకర్షించడానికి చేపట్టిన కార్యక్రమాలు, తిరిగి కొత్త పెట్టు బడులను ఆకర్షించ డంపై కూడా చర్చ జరుగుతుంది. అదేవిధంగా ఇప్పటికే ఉన్న పరిశ్రమలకు భరోసా కల్పించే విధంగా తీసుకున్న నిర్ణయాలు, వలస కూలీలను స్థానిక పరిశ్రమల్లో వినియో గించుకునేందుకు వారికి కల్పించాల్సిన నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలపై చర్చిస్తారు. త్వరలో తీసుకురానున్న నూతన పారిశ్రామిక విధానంపై పారిశ్రా మిక సంఘాలు, పారిశ్రామికవేత్తల సూచనలు, సలహాలు తీసుకుంటారు. ఈ సదస్సుకు పరిశ్ర మలు, పెట్టుబ డులు, మౌలిక వసతుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ సమన్వయకర్తగా వ్యవహరి స్తారు. పరిశ్ర మల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డితోపాటు పరిశ్రమలు, రహదారులు, వాటర్‌గ్రిడ్, మారిటైమ్ బోర్డు, స్కిల్ డెవలప్మెంట్, హౌసింగ్, ఫైబర్ నెట్ వంటి వివిధ శాఖలకు చెందిన అధికారులు సదస్సుకు హాజరవుతారు. -
చేయూతనిస్తే నిర్మాణానికి ఊతం!
సాక్షి, హైదరాబాద్: ‘మునుముందు నిర్మాణ రంగంలో ‘సెమీ మెకనైజ్డ్ విధానం’ అనుసరించడం ద్వారా కార్మికుల కొరతను అధిగమించవచ్చు. ప్రస్తుత అనిశ్చిత పరిస్థితి మరో 3 – 4 నెలల్లో సమసిపోతుంది. కొత్త ప్రాజెక్టుల ప్రారంభం కంటే ప్రస్తుతం పురోగతిలో ఉన్న ప్రాజెక్టుల పూర్తిపై నిర్మాణ సంస్థలు దృష్టిపెట్టాలి. పారిశ్రామిక రంగం తరహాలో ఈ రంగానికీ ప్రభుత్వం రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వాలి. చెన్నై, బెంగళూరు వంటి ప్రధాన నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో నిర్మాణ రంగానికి కరోనా సంక్షోభంలోనూ మంచి భవిష్యత్తు ఉంది’ అని క్రెడాయ్ తెలంగాణ అధ్యక్షుడు చెరుకు రామచంద్రారెడ్డి అన్నారు. నిర్మాణరంగం స్థితిగతులపై ‘సాక్షి’తో ఆయన తన అభిప్రాయాలు పంచుకున్నారు. కూలీల కొరత సమస్య కాదు.. కరోనాకు ముందు తెలంగాణలో, ప్రత్యేకించి హైదరాబాద్‌లో నిర్మాణ రంగం మార్కెటింగ్‌పరంగా మంచి స్థితిలో ఉంది. లాక్‌డౌన్‌తో ఏర్పడిన అనిశ్చితికి తోడు కార్మికులు స్వస్థలాలకు వెళ్లిపోవడంతో పురోగతిలో ఉన్న ప్రాజెక్టులు కొంత ఆలస్యం కావచ్చు. నిర్మాణ రంగంలో యంత్రాల వినియోగం పెంచడం ద్వారా కూలీల కొరత పెద్ద సమస్య కాబోదు. దుబాయ్, అబుదాబి వంటి దేశాల్లో నిర్మాణరంగంలో ‘సెమి మెకనైజ్డ్ సిస్టమ్’ వినియోగిస్తున్నారు. నిజానికి హైదరాబాద్ నిర్మాణ రంగంలోనూ 2013 తర్వాత నుంచి ఈ విధానం క్రమంగా పెరుగుతోంది. అంటే టవర్ క్రేన్లు, హీస్ట్, ప్లాస్టరింగ్ మెషీన్ల వినియోగం పెరిగింది. కాబట్టి ఈ రంగం కార్మికుల కొరతను తట్టుకునే అవకాశం ఉంది. కాకపోతే, ఎంఎస్ఎంఈ రంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం ఇచ్చే ప్రయోజనాలను రియల్ ఎస్టేట్ రంగానికి కూడా వర్తింపచేస్తే మేలు జరుగుతుంది. ఇలాచేస్తే ఉత్తమం.. ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడం కంటే ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తిచేయడంపైనే దృష్టిపెట్టాలి. సాధారణంగా పెద్ద వెంచర్లు రెండున్నర నుంచి నాలుగైదేళ్లలో ప్రాజెక్టులను పూర్తి చేస్తుంటాయి. ప్రస్తుతం 3–4 నెలల సమయం వృథా కావడం, కొత్త ప్రాజెక్టులు ప్రారంభమయ్యే పరిస్థితి లేకపోవడంతో ఫ్లాట్స్ లభ్యత తగ్గితే మార్కెట్ కూడా స్థిరీకరణ చెందుతుంది. నెలన్నర పాటు పని లేకున్నా కార్మికులకు వేతనాలివ్వడం, ఇతర సౌకర్యాల కల్పనతో నిర్మాణ సంస్థల వద్ద ఉన్న నగదు నిల్వలు ఆవిరైపోయాయి. మరోవైపు కొనుగోలుదారులకు వేతనాల్లో కోత, ఉద్యోగ భద్రత వంటి అంశాలు కొత్త బుకింగ్‌లపై ప్రభావం చూపుతాయి. ఈ నేపథ్యంలో పారిశ్రామిక రంగం తరహాలో నిర్మాణరంగానికి కూడా ప్రభుత్వం రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వాలి. పెట్టుబడులకు మరింత అవకాశం హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలకు నిర్మాణరంగం విస్తరిస్తోంది. భూమి లభ్యత తగ్గడంతో డిమాండ్ పెరుగుతోంది. ప్రస్తుతం తెలంగాణలో స్థిరమైన ప్రభుత్వం, సానుకూల విధానాలతో ఫార్మా, ఐటీ, పారిశ్రామిక రంగాల్లోకి పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయి. మరోవైపు చైనా పై అమెరికా, యూరోప్ దేశాలకు ఉన్న అపనమ్మకం కూడా హైదరాబాద్‌లో పెట్టుబడులకు అనుకూలంగా మారుతుంది. కరోనా మూలంగా అమెరికా ఎదుర్కొన్న సంక్షోభంతో ఔట్సోర్సింగ్ విధానం మనకు అనుకూలించే అంశం. వివిధ రంగా ల్లో ఉద్యోగాల కల్పన పెరగడం ద్వారా నిర్మాణ రంగానికి మంచి భవిష్యత్తు ఉంది. ఇక, ఈ రం గంలో ధరల విషయానికొస్తే పొరుగునున్న చెన్నై, బెంగళూరు, ముంబై నగరాలతో పోలిస్తే మన దగ్గర ఫ్లాట్లు, విల్లాలు, ఇళ్ల ధరలు తక్కువే. సడలింపులిస్తే మంచిది పురోగతిలో ఉన్న ప్రాజెక్టులకు అదనంగా 20 శాతం రుణాన్ని తక్షణమే అందుబాటులోకి వచ్చేలా చూడాలి. రుణాలు, కిస్తీలపై మారటోరియంను విడతలు గా కాకుండా ఒకేసారి ఏడాది పాటు పొడిగిస్తే ప్ర యోజనం. నిరర్ధక ఆస్తుల నిబంధనలను సడలించి రుణాలు పొందేందుకు మార్గం సుగమం చేయాలి. బ్యాంకు రుణాల చెల్లింపు వాయిదా గడువు పెంపు, ఆస్తిపన్ను, విద్యుత్ బిల్లులు, జీఎస్టీలో సడలింపులిస్తే కొనుగోలుదారులు ముందుకొస్తారు. రిజిస్ట్రేషన్ చార్జీలను కూడా ప్రస్తుతమున్న ఆరు శాతం నుంచి తొలి మాసంలో రెండు శాతం, తర్వాతి నెలకు మూడు నుంచి మూడున్నర శాతం మేర తగ్గిస్తే కొనుగోలుదారులకు ప్రోత్సాహం లభిస్తుంది. తద్వారా జరిగే లావాదేవీల ద్వారా ప్రభుత్వానికి కూడా పన్నుల రూపంలో 30 శాతానికిపైగా ఆదాయం సమకూరుతుంది. -
సడలింపులపై అయోమయం!
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ, మున్సిపాలిటీల పరిధిలోని పరిశ్రమలకు కొన్ని షరతులతో లాక్డౌన్ నిబంధనల నుంచి మినహాయింపును ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు పరిశ్రమల శాఖతో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఏప్రిల్ 28న ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రకటన వెలువడి ఐదు రోజులు కావస్తున్నా మార్గదర్శకాల్లో స్పష్టత లేకపోవడంతో పారిశ్రామికవర్గాల్లో అయోమయం నెలకొంది. పారిశ్రామిక పార్కుల్లో ఉన్న పరిశ్రమలకు ఎలాంటి అనుమతులు అవసరం లేదని మార్గదర్శకాల్లో పేర్కొంది. అయితే మున్సిపాలిటీల పరిధిలోని పరిశ్రమలు జిల్లా పరిశ్రమల కేంద్రం వద్ద అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. దీంతో పారిశ్రామిక పార్కుల వెలుపల ఉన్న పరిశ్రమల యాజమాన్యాలు డీఐసీలను సంప్రదిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. పరిశ్రమలు నడుపుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ రాత పూర్వక అనుమతి ఇచ్చేది లేదని డీఐసీ అధికారులు చెప్తున్నారు. వాణిజ్య సంస్థలు తెరిస్తేనే! పరిశ్రమలు నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓ వైపు అనుమతి జారీ చేసినా, మరో కోణంలో ఇబ్బందులు తప్పవని పారిశ్రామికవర్గాలు అంటున్నాయి. పరిశ్రమలు ఎక్కువ సంఖ్యలో రెడ్ జోన్ పరిధిలో ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిలాల్లోనే ఉండటంతో రవాణా, కార్మికులు, ముడిసరుకుల సమస్య తలెత్తుతుందని మేడ్చల్ జిల్లాకు చెందిన ఓ పరిశ్రమ యజమాని చెప్పారు. పారిశ్రామిక ఉత్ప త్తుల మార్కెటింగ్ అంతా హైదరాబాద్‌లోనే కేంద్రీకృతం కావడంతో, ఉత్పత్తి చేసినా అమ్ముకునే పరిసి ్థతి లేదని యాజమాన్యాలు చెబుతున్నాయి. దుకాణాలు, వాణిజ్య సంస్థలు తెరుచుకుంటేనే ముడి సరుకులు రావడం, ఫినిషింగ్ గూడ్స్ మార్కెట్‌కు వెళ్లడం సాధ్యమవుతుందని చెప్తున్నారు. వెళ్లేందుకే వలస కార్మికుల మొగ్గు లాక్డౌన్ నిబంధనలను సడలిస్తూ పరిశ్రమలను నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించినా కార్మికుల కొరత తలెత్తే అవకాశముందనే ఆందోళన కూడా యాజమాన్యాల్లో కనిపిస్తోంది. తమ సంస్థలో బిహార్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన 20 మంది కార్మికులు పనిచేస్తున్నారని, ప్రయాణానికి అనుమతిస్తే స్వస్థలాలకు వెళ్లేందుకు వారంతా సిద్ధంగా ఉన్నారని సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడకు చెందిన ఓ పారిశ్రామికవేత్త వెల్లడించారు. కార్మికులు స్వస్థలాలకు వెళ్తే మరో రెండు మూడు నెలల పాటు తిరిగి వచ్చే అవకాశం లేదని ఆందోళన వెలిబుచ్చారు. స్పష్టత కోసం ఎదురుచూపులు పరిశ్రమలపై ప్రభుత్వ మార్గదర్శకాల్లో స్పష్టత లోపించింది. ఈ నేపథ్యంలో ఈ నెల ఐదో తేదీన సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశం తర్వాతే అన్ని అంశాలపై స్పష్టత వస్తుందని అధికారులు చెప్తున్నారు. పరిశ్రమలతో పాటు దుకాణాలు, వాణిజ్య సంస్థలు తెరుచుకుంటేనే తిరిగి లావాదేవీలు పట్టాలెక్కుతాయని అటు అధికారులు, ఇటు పారిశ్రామికవర్గాలు చెబుతున్నాయి. దీంతో పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చిన తర్వాతే ఉత్పత్తి ప్రారంభించాలనే యోచనలో మెజారిటీ పరిశ్రమల యాజమాన్యాలు ఉన్నాయి. -
చతికిలబడ్డ పారిశ్రామిక రంగం!
న్యూఢిల్లీ: భారత పారిశ్రామిక రంగం తీవ్ర గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. 2019 మార్చిలో (2018 మార్చితో పోల్చి) పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో అసలు వృద్ధి నమోదుకాలేదు. (మైనస్) 0.1 శాతం క్షీణత నమోదయ్యింది. పారిశ్రామిక రంగంలో ఈ తరహా క్షీణత పరిస్థితి తలెత్తడం 21 నెలల్లో ఇది తొలిసారి. మొత్తం సూచీలో దాదాపు 78 శాతం కలిగిన తయారీ రంగం పేలవ పనితీరు మొత్తం సూచీపై ప్రతికూల ప్రభావం చూపింది. శుక్రవారం విడుదలైన గణాంకాల్లో ముఖ్యాంశాలు చూస్తే... ► 2018 మార్చిలో ఐఐపీ వృద్ధి రేటు 5.3 శాతం. ► 2017 జూన్‌లో 0.3 శాతం క్షీణత నమోదయ్యింది. అటు తర్వాత ఈ తరహా ఫలితం ఇదే తొలిసారి. ►ఫిబ్రవరిలో ఐఐపీ వృద్ధి రేటునూ దిగువముఖంగా సవరించడం గమనార్హం. ఇంతక్రితం ఈ రేటు 0.1 శాతం అయితే ఇప్పుడు 0.07 శాతానికి కుదించారు. ► మార్చి నెలలో తయారీ రంగాన్ని చూస్తే, వృద్ధిలేకపోగా 0.4 శాతం క్షీణించింది. 2018 ఇదే నెలలో ఈ రంగం 5.7 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకుంది. మొత్తం 23 గ్రూపుల్లో 12 గ్రూపులు క్షీణతను నమోదుచేసుకున్నాయి. ►భారీ పెట్టుబడులకు ప్రతిబింబమైన భారీ యంత్రసామాగ్రి ఉత్పత్తికి సంబంధించి క్యాపిటల్ గూడ్స్ విభాగం మార్చి నెలలో మరింతగా క్షీణించింది. 2018 మార్చిలో 3.1 శాతం క్షీణతలో ఉన్న ఈ విభాగం, తాజాగా 8.7 శాతం కిందకు దిగింది. ► విద్యుత్ రంగం ఉత్పత్తి వృద్ధిలోనే ఉన్నా... ఈ స్పీడ్ 5.9 శాతం నుంచి (2018 మార్చి) 2.2 శాతానికి (2019 మార్చి) పడిపోయింది. ► మైనింగ్ రంగంలోనూ విద్యుత్ రంగం ధోరణే కనబడింది. వృద్ధి రేటు 3.1 శాతం నుంచి 0.8 శాతానికి పడిపోయింది. ► కన్జూమర్ డ్యూరబుల్స్ విభాగంలో –5.1 శాతం క్షీణత నమోదయితే, కన్జూమర్ నాన్– డ్యూరబుల్స్ విభాగంలో కేవలం 0.3 శాతం వృద్ధి నమోదయ్యింది. 2018–19లో మూడేళ్ల కనిష్టస్థాయి వార్షిక ప్రాతిపదికన చూస్తే, 2018 ఏప్రిల్ నుంచి 2019 మార్చి వరకూ పారిశ్రామిక వృద్ధి రేటు కేవలం 3.6 శాతంగా నమోదయ్యింది. ఈ రేటు మూడేళ్ల కనిష్టస్థాయి. 2017–18లో వృద్ధి రేటు 4.4 శాతం. 2016–17లో 4.6 శాతం, 2015–16లో 3.3 శాతం వృద్ధి రేట్లు నమోదయ్యాయి. -
పారిశ్రామిక వృద్ధి అర శాతమే..!
న్యూఢిల్లీ: పారిశ్రామిక రంగం నవంబర్‌లో పేలవ పనితీరును ప్రదర్శించింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) ఈ నెలల్లో కేవలం 0.5 శాతంగా (2017 ఇదే నెలతో పోల్చి) నమోదయ్యింది. సూచీలోని తయారీ, వినియోగ రంగాల్లో అసలు వృద్ధి నమోదుకాకపోగా, క్షీణ రేటు నమోదయ్యింది. భారీ యంత్ర పరికరాల డిమాండ్‌ను సూచించే క్యాపిటల్ గూడ్స్‌లో కూడా ఇదే ధోరణి నెలకొంది. కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్ఓ) శుక్రవారం విడుదల చేసిన నవంబర్ పారిశ్రామిక ఉత్పత్తి లెక్కల్లో ముఖ్యమైన అంశాలు... మొత్తం సూచీలో 77.63 శాతం వాటా కలిగిన తయారీ రంగంలో నవంబర్‌లో వృద్ధిలేకపోగా –0.4 శాతం క్షీణత నమోదుచేసుకుంది. 2017 ఇదే నెలలో ఈ రేటు 10.4 శాతం. ఈ విభాగంలోని మొత్తం 23 పారిశ్రామిక గ్రూపుల్లో 10తప్ప మిగిలినవి ప్రతికూల వృద్ధిరేటును నమోదుచేసుకున్నాయి. డిమాండ్‌కు ప్రతిబింబమైన క్యాపిటల్ గూడ్స్ విభాగంలో కూడా వృద్ధిలేకపోగా –3.4 శాతం క్షీణత నమోదయ్యింది. 2017 ఇదే నెలలో ఈ రంగం వృద్ది రేటు 3.7 శాతం. కన్జూమర్ డ్యూరబుల్స్ రంగంలో కూడా 3.1 శాతం వృద్ధి రేటు 0.9 శాతం క్షీణతలోకి జారింది. కన్జూమర్ నాన్ డ్యూరబుల్స్ విషయంలో కూడా 23.7 శాతం భారీ వృద్ధిరేటు 0.6% క్షీణతలోకి పడిపోవడం గమనార్హం. మైనింగ్ వృద్ధి రేటు 1.4% నుంచి 2.7 శాతానికి పెరిగింది. విద్యుత్ రంగంలో ఉత్పత్తి 3.9% నుంచి 5.1%కి ఎగసింది. 2017 నవంబర్‌లో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ది రేటు 8.5%. ప్రస్తుతం నమోదయిన తక్కువ స్థాయి వృద్ధి రేటు 2017 జూన్ తరువాత ఎప్పుడూ నమోదుకాలేదు. ఆ నెల్లో పారిశ్రామిక రంగంలో అసలు వృద్ధిలేకపోగా –0.3 శాతం క్షీణత నమోదయ్యింది. 2018 అక్టోబర్‌లో వృద్ధిరేటును 8.1 శాతం నుంచి 8.4 శాతానికి పెంచడం విశేషం. ఏప్రిల్ నుంచి నవంబర్ వరకూ పర్లేదు... కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య పారిశ్రామిక ఉత్పత్తి (2017 ఇదే కాలంతో పోల్చి) 3.2 శాతం నుంచి 5 శాతానికి పెరిగింది. ఆర్థిక సంవత్సరం మొత్తంగా 5 నుంచి 6 శాతం శ్రేణిలో ఈ రేటు ఉంటుందని అంచనా -
పారిశ్రామిక విప్లవానికి నాంది పలికాం: కవిత
సాక్షి, హైదరాబాద్: టీఎస్–ఐపాస్ ద్వారా పారిశ్రామిక విప్లవానికి తెలంగాణ నాంది పలికిందని ఎంపీ కవిత అన్నారు. గత పాలకులు పరిశ్రమలను నిర్లక్ష్యం చేయడంతో ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయని, ప్రస్తుతం రాష్ట్రంలో పారిశ్రామిక రంగం పునర్ నిర్మాణమవుతుందని పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో ఈ రంగం స్థితిగతులను స్వయంగా చూసిన సీఎం కేసీఆర్ పారిశ్రామిక రంగంపై ప్రత్యేక దృష్టి సారించారని మంగళవారం ట్విట్టర్లో పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న టీఎస్–ఐపాస్ ప్రశంసలు అందుకుంటుందన్నారు. ఎస్సీ, ఎస్టీలు పరిశ్రమలు స్థాపించేందుకు టీఫ్రైడ్ ద్వారా రుణాలు అందుతున్నాయని తెలిపారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు ఐటీ విస్తరణ లక్ష్యంతో తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ పనిచేస్తోందన్నారు. 2016–17 ఆర్థిక సంవత్సరంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్‌గా నిలిచిందని గుర్తుచేశారు. ఇప్పటివరకు 7,802 పరిశ్రమలు రాష్ట్రంలో ఏర్పాటయ్యాయని, 1.31 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. -
పరిశ్రమల పరుగు
న్యూఢిల్లీ: పారిశ్రామిక రంగం పరుగులు పెడుతోంది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ(ఐఐపీ) వృద్ధి రేటు జూన్‌లో 7%గా నమోదైంది. మే నెలలో ఈ రేటు 3.9% కాగా, 2017 జూన్‌లో వృద్ధి అసలు లేకపోగా, –0.3% క్షీణత నమోదయ్యింది. సూచీలో దాదాపు 77 శాతంగా ఉన్న తయారీతోపాటు మైనింగ్, విద్యుత్ రంగాల నుంచి మెరుగైన ఉత్పత్తి జూన్‌లో మంచి వృద్ధి ఫలితానికి దారితీసింది. తయారీ: జూన్‌లో ఉత్పత్తి వృద్ధి రేటు 6.9 శాతంగా నమోదయ్యింది. 2017 ఇదే నెలలో ఈ విభాగంలో అసలు వృద్ధిలేకపోగా –0.7%క్షీణించింది. ఇక ఈ విభాగాన్ని ఏప్రిల్ నుంచి జూన్ మధ్య చూస్తే వృద్ధిరేటు 1.6% నుంచి (2017 ఇదే కాలంతో పోల్చి) 6.2 శాతానికి చేరింది. తయారీ రంగంలోని 23 పారిశ్రామిక గ్రూపుల్లో 19 సానుకూల వృద్ధి తీరును నమోదుచేసుకున్నాయి. మైనింగ్: జూన్‌లో వృద్ధి రేటు 0.1 శాతం నుంచి 6.6 శాతానికి పెరిగింది. ఏప్రిల్–జూన్ మధ్య ఈ రేటు 1.1 శాతం నుంచి 5.4 శాతానికి చేరింది. విద్యుత్: వృద్ధి రేటు 2.1 శాతం నుంచి 8.5 శాతానికి పెరిగింది. అయితే ఏప్రిల్–జూన్ మధ్య కాలంలో ఈ రేటు 5.3% నుంచి 4.9%కి తగ్గింది. క్యాపిటల్ గూడ్స్: భారీ యంత్రపరికరాల డిమాండ్‌కు సంబంధించిన ఈ విభాగంలో వృద్ధి రేటు 9.6%. గత ఏడాది ఇదే నెలలో వృద్ధిలేకపోగా –6.1 శాతం క్షీణత నమోదయ్యింది. కన్జూమర్ డ్యూరబుల్స్: –3.5 శాతం క్షీణత భారీగా 13.1 శాతం వృద్ధికి మారింది. ఆరునెలల్లో...: ఐఐపీ వృద్ధి రేటు ఏప్రిల్–జూన్ మధ్య కాలంలో 5.2 శాతంగా నమోదయ్యింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ రేటు 1.9 శాతం. -
పెప్సీలో ‘ఇంద్రా’ శకానికి తెర!
న్యూయార్క్: భారతీయ మహిళలు వ్యాపార నిర్వహణలోనూ దిట్టలు అని నిరూపించిన మహిళ... ప్రపంచ స్థాయి కంపెనీని సైతం విజయవంతంగా భవిష్యత్తులోకి నడిపించగలరని నిరూపించిన నారీశక్తి... ప్రపంచ పారిశ్రామిక రంగంలో అసాధారణ మహిళగా గుర్తింపు పొందిన ఇంద్రా నూయి (62) పెప్సీకో కంపెనీ నాయకత్వ బాధ్యతల్ని విడిచిపెట్టబోతున్నారు. శీతలపానీయాలు, ప్యాకేజ్డ్ ఫుడ్స్ తయారీలో ప్రపంచ రెండో అగ్రగామి సంస్థ, అమెరికాకు చెందిన ‘పెప్సీకో’ సీఈవోగా పనిచేస్తున్న భారతీయ అమెరికన్ ఇంద్రానూయి త్వరలో తన పదవి నుంచి తప్పుకోనున్నారు. 12 ఏళ్ల పాటు కంపెనీకి సారథ్యం వహించిన ఆమె అక్టోబర్ 3న తన బాధ్యతలను కొత్త సారథికి అప్పగించనున్నారు. కంపెనీ ప్రెసిడెంట్ రామన్ లగుర్తాను నూతన సీఈవోగా కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఎంపిక చేసింది. ఇవి మినహా కంపెనీ యాజమాన్యంలో మరే మార్పులు లేవని కంపెనీ స్పష్టం చేసింది. పెప్సీకోతో ఇంద్రానూయికి ఉన్న 24 ఏళ్ల అనుబంధం కూడా త్వరలోనే ముగిసిపోనుంది. సీఈవోగా వైదొలిగినా, వచ్చే ఏడాది ఆరంభం వరకు చైర్‌పర్సన్‌గా కొనసాగనున్నారు. తాజా పరిణామంపై ఆమె స్పందిస్తూ కంపెనీకి మంచి రోజులు ఇంకా రావాల్సి ఉందన్నారు. ‘‘భారత్‌లో పెరుగుతున్న నేను ఈ స్థాయి కంపెనీని నడిపించే అవకాశం లభిస్తుందనుకోలేదు. గడిచిన 12 సంవత్సరాల్లో వాటాదారుల ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లేందుకు మేం చేసిన కృషికి గర్విస్తున్నాం. ఉత్తమ కంపెనీగా మారేందుకు, ఉత్తమ కంపెనీగానూ కొనసాగేందుకు మా ప్రపంచ బృందం చేసిన అద్భుత ప్రయాణాన్ని ప్రశంసిస్తున్నాను’’అని ఇంద్రా నూయి ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘‘ఈ రోజు నాకు భావోద్వేగాల మిశ్రమంతో కూడినది. పెప్సీకోతో 24 ఏళ్ల ప్రయాణం. నా హృదయంలో కొంత భాగం కంపెనీతోనే ఉంటుంది. భవిష్యత్తు కోసం మేం చేసిన దాని పట్ల గర్విస్తున్నాం. పెప్సీకోకు మంచి రోజులు రావాల్సి ఉంది. పర్యావరణ వినియోగాన్ని పరిమితం చేస్తూనే ప్రజల జీవితాలపై అర్థవంతమైన ప్రభావం చూపించాం. ఉజ్వలమైన భవిష్యత్తుకు వృద్ధిని కొనసాగించే బలమైన స్థితిలో పెప్సీకో ఉంది’’ అని నూయి పేర్కొన్నారు. మార్పు దిశగా నడిపించారు... రామన్ లగుర్తా సైతం పెప్సీకో సీనియర్ ఉద్యోగుల్లో ఒకరు. 22 ఏళ్లుగా కంపెనీలో పనిచేస్తున్నారు. ఈ కాలంలో ఎన్నో నాయకత్వ బాధ్యతలను నిర్వహించారు. గతేడాది సెప్టెంబర్ నుంచి కంపెనీ ప్రెసిడెంట్‌గా సేవలు అందిస్తున్నారు. ప్రపంచవ్యాప్త కార్యకలాపాలు, కార్పొరేట్ విధానాలు, పబ్లిక్ పాలసీ, ప్రభుత్వ వ్యవహారాలను ఆయన పర్యవేక్షిస్తున్నారు. ఇంద్రానూయి నాయకత్వాన్ని ఈ సందర్భంగా రామన్ ప్రశంసించారు. తన సాహసోపేతమైన దృష్టి, అసాధారణ నాయకత్వంతో కంపెనీని మార్చివేశారని పేర్కొన్నారు. వాటాదారులకు లాభాలు... ఇంద్రా సారథ్యంలో పెప్సీకో మంచి ఫలితాలను సాధించింది. 2006 నుంచి 2017 నాటికి వాటాదారులకు 162% ప్రతిఫలం లభించింది. వాటాదారులకు డివిడెండ్లు, షేర్ల తిరిగి కొనుగోలు ద్వారా 2006 ప్రారంభం నుంచి 2017 చివరి నాటికి 79.4 బిలియన్ డాలర్ల (రూ.5.39 లక్షల కోట్లు) లాభాలను పంచారు. 2006లో 35 బిలియన్ డాలర్లుగా ఉన్న ఆదాయాన్ని 2017 నాటికి 63.5 బిలియన్ డాలర్లకు చేర్చారు. గత 12ఏళ్లలో అసాధారణ నాయకత్వాన్ని అందించారని కంపెనీ డైరెక్టర్ల బోర్డు తరఫున ప్రిసైడింగ్ డైరెక్టర్ ఇయాన్‌కుక్ పేర్కొన్నారు. శక్తివంతమైన వ్యాపార మహిళ ఇంద్రానూయి పెప్సీకో సీఈవోగా తప్పుకోవడం వెనుక కారణం ఏంటన్నది ఇంకా స్పష్టం కాలేదు. అతిపెద్ద శీతల పానీయాల కంపెనీ సారధిగా ఆమె ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందారు. ‘ప్రపంచంలో శక్తివంతమైన వ్యాపార మహిళ’ (అమెరికా వెలుపల)గా ఫార్చ్యూన్స్ జాబితా 2017లో 2వ స్థానంలో ఉన్నారు. ప్రపంచంలో టాప్–100 శక్తిమంతమైన మహిళల్లో ఒకరిగా 2014లో ఫోర్బ్స్ జాబితాలో 13వ స్థానంలో నిలిచారు. అత్యధిక పారితోషికం అందుకునే మహిళా సీఈవోగానూ అగ్ర స్థానంలో ఉన్నారు. కార్పొరేట్ అమెరికా ప్రపంచంలో తనదైన ముద్ర వేశారు. ప్రపంచ దిగ్గజ సంస్థను నడిపించిన భారత మహిళామణుల్లో ఒకరిగానూ చరిత్ర సృష్టించారు. చెన్నై నుంచి అమెరికాకు.. మద్రాస్‌లో జన్మించిన ఇంద్రా కృష్ణమూర్తి నూయి అక్కడే పాఠశాల విద్య పూర్తి చేసుకున్నారు. యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ పరిధిలోని క్రిస్టియన్ కాలేజీలో 1974లో డిగ్రీ ముగించారు. ఐఐఎం, కల్కత్తా నుంచి ఎంబీఏ చేశారు. దేశీయంగానే జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీలో ప్రొడక్ట్ మేనేజర్‌గా ఉద్యోగ ప్రస్థానం మొదలు పెట్టారు. 1978లో యేల్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో చేరి పబ్లిక్, ప్రైవేటు మేనేజ్మెంట్లో డిగ్రీ పొందారు. తర్వాత బోస్టన్ గ్రూపులో చేరారు. అనంతరం మోటరోలా, ఏసీ బ్రౌన్ బొవేరిలోనూ పనిచేశాక 1994లో పెప్సీకో ఉద్యోగిగా మారారు. 2001లో సీఎఫ్‌వోగా నియమితులయ్యారు. 2006లో సీఈవోగా, ప్రెసిడెంట్‌గా ఎంపికయ్యారు. 44 ఏళ్ల పెప్సీకో కంపెనీకి ఆమె ఐదో సీఈవో. యుమ్ బ్రాండ్ పునరుద్ధరణ, ట్రోపికానా కొనుగోలు, క్వాకర్ ఓట్స్ విలీనం, గాటొరేడ్ కొనుగోలులో కీలక పాత్ర పోషించారు. -
పారిశ్రామిక రంగానికి ‘తయారీ’ దన్ను
న్యూఢిల్లీ: ఆర్థిక సంవత్సరం (2018–19) తొలి నెల ఏప్రిల్‌లో పారిశ్రామిక రంగం మెరుగైన పనితీరును ప్రదర్శించింది. వృద్ధి రేటు 4.9 శాతంగా నమోదయింది. మార్చి నెలలో ఈ రేటు 4.6 శాతం కాగా, గత ఏడాది ఇదే నెలలో 3.2 శాతంగా నమోదయ్యింది. మెరుగైన వృద్ధికి తయారీ, మైనింగ్ ప్రధాన కారణమయ్యాయి. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ మంగళవారం విడుదల చేసిన వివిధ విభాగాల వృద్ధి రేట్లను గమనిస్తే... తయారీ: మొత్తం సూచీలో దాదాపు 77 శాతం వాటా ఉన్న ఈ విభాగంలో ఏప్రిల్ వృద్ధి రేటు 5.2 శాతంగా నమోదయ్యింది. 2017 ఇదే నెలలో ఈ రేటు 3 శాతం. 23 విభాగాల్లో 16 సానుకూల వృద్ధిని నమోదుచేసుకున్నాయి. ♦ మైనింగ్: ఈ రంగంలో కూడా వృద్ధి రేటు 3 శాతం నుంచి 5.1 శాతానికి పెరిగింది. ♦ విద్యుత్: వృద్ధి 5.4% నుంచి 2.1%కి తగ్గింది. ♦ క్యాపిటల్ గూడ్స్: పెట్టుబడులకు సంకేతంగా భారీ పారిశ్రామిక ఉత్పత్తులకు సంబంధించిన ఈ విభాగం భారీ వృద్ధిని నమోదుచేసుకుంది. 13% వృద్ధి రేటు నమోదయ్యింది. గత ఏడాది ఇదే నెలలో –4.8% క్షీణత నమోదయ్యింది. -
పెట్టుబడులతో రండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో దాదాపు సగం పట్టణ ప్రాంతమేనని, నగరీకరణ, పట్టణీకరణ శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో వ్యర్థాల నిర్వహణ రంగానికి ప్రాధాన్యమిస్తున్నామని రాష్ట్ర మునిసిపల్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వ్యర్థాల నిర్వహణ పరిష్కారాల కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. ఈ విషయంలో జపాన్‌కు చెందిన టకుమ కంపెనీతో భాగస్వామ్యానికి సిద్ధంగా ఉన్నామని వివరించారు. విదేశీ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ మంగళవారం దక్షిణ కొరియాలో పర్యటించిన విషయం తెలిసిందే. బుధవారం జపాన్ రాజధాని టోక్యోలో పర్యటించిన ఆయన.. అక్కడి 12 కంపెనీల ప్రతినిధులతో విస్తృత చర్చలు జరిపారు. ఈ క్రమంలో టకుమ కంపెనీ ప్రతినిధులతో సమావేశమై వ్యర్థాల నిర్వహణ రంగంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ ప్రముఖ ఇంజనీరింగ్ కంపెనీ జేఎఫ్‌ఈ ప్రతినిధి ఇజుమి సుగిబయాషి, మరో ఇంజనీరింగ్ కంపెనీ మినెబీయా ప్రతినిధులతో కేటీఆర్ సమావేశమయ్యారు. ప్రపంచంలోని 59 ప్రాంతాల నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న మినెబీయా కంపెనీ విస్తరణ కోసం తెలంగాణను పరిశీలించాలని ఆహ్వానించారు. ఈఎస్ఈ ఫుడ్స్ చైర్మన్ హికోనోబు ఐసెతో సమావేశమై రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ వ్యాపారానికి ఉన్న విస్తృత అవకాశాలను వివరించారు. మేయిజి షియికా ఫార్మా కంపెనీ ప్రతినిధులతో సమావేశమై వ్యవసాయం, వెటర్నరీ మందుల ఉత్పత్తి రంగంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. సుమిటోమో ఫారెస్ట్రీ కంపెనీ, టోరే ఇండస్ట్రీస్ ప్రతినిధులతో చర్చలు జరిపారు. జపనీస్ కంపెనీలు, ప్రపంచ ఇన్నోవేషన్ కమ్యూనిటీలకు అనుసంధానకర్తగా వ్యవహరిస్తున్న జపాన్ ఇన్నోవేషన్ నెట్వర్క్ బృందంతో కేటీఆర్ సమావేశమై రాష్ట్రంలో ఇన్నోవేషన్‌కు ఇస్తున్న ప్రాధాన్యాన్ని తెలిపారు. టీ హబ్, టీ ఫైబర్ తదితర ప్రాజెక్టులపై చర్చించారు. పర్యటనలో కేటీఆర్‌తోపాటు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జి.వివేక్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ఉన్నారు. భారత రాయబారితో సమావేశం జపాన్ పర్యటనలో భాగంగా కేటీఆర్ బృందం తొలుత అక్కడి భారత రాయబారి సుజయ్ చినోయ్‌తో సమావేశమై ఈ పర్యటన ఉద్దేశాలను వివరించింది. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించాలనే లక్ష్యంతో పర్యటన చేస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. సాంకేతిక ప్రగతి, పారిశ్రామిక రంగం, వేస్ట్ మేనేజ్మెంట్ వంటి రంగాల్లో జపాన్ అనుసరిస్తున్న పద్ధతులను ఆదర్శంగా తీసుకుంటామని తెలిపారు. జపాన్, తెలంగాణల మధ్య మరింత బలమైన ఆర్థిక, వ్యాపార భాగస్వామ్యాలను నెలకొల్పేందుకు సహకారం అందించాలని చినోయ్‌ను కోరారు. జైకా వంటి జపాన్ సంస్థలు ఇప్పటికే రాష్ట్రంలో పలు ప్రాజెక్టులకు రుణ సహాయం అందించాయని, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మరిన్ని ప్రాజెక్టులకు ఈ ఆర్థిక భాగస్వామ్యాన్ని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం జపాన్ ఆర్థిక, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి యూజిముటోతో సమావేశమై.. వ్యాపార, వాణిజ్య సంబంధాల బలోపేతంపై చర్చించారు. -
జారుడు బల్లపైకి పారిశ్రామిక ఉత్పత్తి!
♦ జూన్ నెల్లో వృద్ధిలేకపోగా –0.1 శాతం క్షీణత ♦ ఈ తరహా ఫలితం ఏడాదిలో ఇదే తొలిసారి ♦ తయారీ, క్యాపిటల్ గూడ్స్ రంగాల బలహీనత ♦ మరింత రేటు కోత తప్పదంటున్న ♦ పారిశ్రామిక ప్రతినిధులు న్యూఢిల్లీ: పారిశ్రామిక రంగం ఉత్పత్తి జూన్ నెల్లో అత్యంత నిరాశను మిగిల్చింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) అసలు వృద్ధిలేకపోగా –0.1 శాతం క్షీణతలోకి జారిపోయింది. అంటే 2016 జూన్ నెల ఉత్పత్తితో పోల్చితే 2017 జూన్ నెలలో ఉత్పత్తిలో అసలు వృద్ధిలేకపోగా –0.1 శాతం క్షీణించిందన్నమాట. 2016 జూన్ నెలలో వృద్ధి భారీగా 8 శాతంగా ఉంది. గడచిన 12 నెలల కాలాన్ని చూస్తే, ‘క్షీణ’ ఫలితం ఇదే తొలిసారి. మొత్తం సూచీలో దాదాపు 77 శాతం వాటా ఉన్న తయారీ రంగం పేలవ పనితీరును ప్రదర్శించింది. ఇక ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్–జూన్) చూసినా, వృద్ధి రేటు 7.1 శాతం నుంచి 2 శాతానికి పడిపోయింది. తాజా ఫలితం నేపథ్యంలో తక్షణం పావుశాతం రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6 శాతం) తప్పదని పారిశ్రామిక వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. . అన్ని రంగాలూ నేలచూపే... ⇔ తయారీ: 2016 జూన్ నెలలో 7.5 శాతం వృద్ధి 2017 జూన్‌లో ఏకంగా –0.4 శాతం క్షీణతకు జారింది. ఇక త్రైమాసికంగా చూస్తే ఈ రేటు 6.7 శాతం నుంచి 1.8 శాతానికి పడింది. ఈ రంగంలోని 23 పారిశ్రామిక గ్రూపుల్లో 15 ప్రతికూల ఫలితాన్ని చూశాయి. ⇔ మైనింగ్: నెలలో వృద్ధి రేటు 10.2 శాతం నుంచి 0.4 శాతానికి జారింది. మూడు నెలల్లో ఈ రేటు 6.7 శాతం నుంచి 1.8 శాతానికి చేరింది. ⇔ విద్యుత్: వృద్ధి రేటు నెల్లో 9.8 శాతం నుంచి 2.1 శాతానికి చేరింది. త్రైమాసికంలో రేటు 10 శాతం నుంచి 5.3 శాతానికి పడిపోయింది. ⇔ కేపిటల్ గూడ్స్: భారీ పరిశ్రమల వస్తు ఉత్పత్తికి, డిమాండ్‌కు సూచిక అయిన ఈ రంగంలో రేటు 14.8 శాతం వృద్ధి నుంచి 6.8 శాతం క్షీణతకు పడిపోయింది. ⇔ వినియోగం: కన్జూమర్ డ్యూరబుల్స్‌లో – 2.1 శాతం క్షీణ వృద్ధి నమోదయితే, నాన్–డ్యూరబుల్స్ విషయంలో 4.9 శాతం వృద్ధిరేటు నమోదయ్యింది. -
బాబు పాలనలో పారిశ్రామిక రంగం నిర్వీర్యం
ఎంఎస్‌ఈడీసీ అధ్యక్షుడు బీవీ రామారావు డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ): రాష్ట్రంలో పారిశ్రామిక రంగం నిర్వీర్యం కావడానికి ప్రధాన కారకుడు సీఎం చంద్రబాబేనని మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎంఎస్‌ఈడీసీ) అధ్యక్షుడు బీవీ రామారావు మండిపడ్డారు. పెద్దఎత్తున ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ సదస్సులు నిర్వహించి ఏం సాధించారని ప్రశ్నించారు. పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు ఆడుకుంటున్నారని, విద్యుత్ చార్జీల పెంపుతో ఉన్న పరిశ్రమలు కూడా మూతపడటం ఖాయమని ఆందోళన వ్యక్తం చేశారు. వీజేఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ తీసుకోవడం వల్ల చంద్రబాబుకే ఉపయోగం తప్ప పారిశ్రామికవేత్తలకు ఎటువంటి ఉపయోగం లేదన్నారు. ప్రత్యేక ప్యాకేజీ తీసుకుంటే రాబోయే రోజుల్లో ఓట్ల కొనుగోలుకు ఉపయోగపడుతుందన్న కుయుక్తిలో చంద్రబాబు ఉన్నారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పరిశ్రమలు ఏవీ రాకపోగా..ప్రభుత్వ వ్యతిరేక విధానాల వల్ల పారిశ్రామిక రంగం కుదేలవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఐఐ భాగస్వామ్యసదస్సులో ఒక ఏడాది 4 లక్షల 83 వేల కోట్లు, రెండో సంవత్సరంలో 11 లక్షల 22 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని, లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తామని బాహాటంగా అబద్ధాలు చెప్పారని విమర్శించారు. పెంచిన విద్యుత్ చార్జీలు తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. -
దాడులు ప్రతికూలమేమీ కాదు..
♦ కఠినంగా వ్యవహరించాల్సిన తరుణమే ♦ పాక్‌పై కేంద్రం విధానానికి పారిశ్రామిక రంగం మద్దతు న్యూఢిల్లీ: నియంత్రణ రేఖ సమీపంలో పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ముష్కర మూకరులపై భారత ఆర్మీ చేసిన దాడులకు దేశీయ పారిశ్రామిక రంగం సైతం బాసటగా నిలిచింది. కఠినంగా వ్యవహరించాల్సిన సమయం ఇదని, దేశీయ ఆర్థిక రంగం, వాణిజ్యంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండబోదని స్పష్టం చేసింది. కఠినంగా వ్యవహరించాలి.. నాగరిక భావాలు కలిగివున్నందున, మనం గతంలో (ఉడి ఆర్మీ శిబిరంపై జరిగిన దాడులు వంటివాటికి) ప్రతిదాడులు చేయలేదు. కానీ ప్రస్తుతం గట్టిగా సమాధానమివ్వాల్సివుంది. - కిరణ్ మజుందార్‌షా, సీఎండీ, బయోకాన్ కొంత అనిశ్చితి... వాణిజ్య రంగంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదు. పాకిస్తాన్‌కు ఇచ్చిన అత్యంత సానుకూల దేశం హోదాను సమీక్షించాలన్న నిర్ణయం... భవిష్యత్తు వాణిజ్యంపై ఎగుమతి దారులను కొంత అనిశ్చితికి గురి చేసింది. - అజయ్ సహాయ్, డెరైక్టర్ జనరల్. ఎఫ్ఐఈవో ఏం చేయాలన్నది ఆర్మీకి తెలుసు.. ఆర్మీపై విశ్వాసం ఉంది. ఉరీ దాడి నేపథ్యంలో ఎలా వ్యవహరించాలి, ప్రతీకారం ఎలా తీర్చుకోవాలన్నది వారికి తెలుసు. - ఆనంద్ మహీంద్రా, చైర్మన్, మహీంద్రా అండ్ మహీంద్రా ఆటు పోట్లు స్వల్పమే.. ఆటుపోట్లు కూడా స్వల్ప కాలమే. దేశం నుంచి పాకిస్తాన్ ఎగుమతులు 2.17 బిలియన్ డాలర్లు మాత్రమే. మొత్తం ఎగుమతుల్లో ఇవి 0.83%. దిగుమతులు 500 మిలియన్ డాలర్లే. ఇవి సైతం మొత్తం దిగుమతుల్లో 0.13%గానే ఉన్నాయి. - మహేశ్‌గుప్తా, ప్రెసిడెంట్, పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆర్థిక రంగానికి తగిన సామర్థ్యం.. పాకిస్తాన్‌తో ప్రస్తుత ఉద్రిక్తతల అనంతరం ఎదురయ్యే ఎలాంటి ప్రభావాన్ని అయినా తట్టుకునే శక్తి ఆర్థిక రంగానికి ఉంది. మార్కెట్లు స్పందించిన తీరు అర్థం చేసుకోతగినదే. - డీఎస్ రావత్, సెక్రటరీ, అసోచామ్ -
జీఎస్టీ 18% దాటొద్దు
♦ 2017 ఏప్రిల్ నుంచి కష్టమే... ♦ తగినంత సమయం కావాలి ♦ పారిశ్రామిక రంగం సూచనలు న్యూఢిల్లీ: ప్రతిపాదిత వస్తు సేవల పన్ను (జీఎస్టీ) రేటు గరిష్టంగా 18 శాతంగానే నిర్ణయించాలని పారిశ్రామిక రంగం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇలా చేస్తే ద్రవ్యోల్బణం పెరగకుండానే పన్నుల ద్వారా తగినంత ఆదాయం సమకూరుతుందని సూచించింది. జీఎస్టీపై మంగళవారమిక్కడ రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన సాధికార కమిటీతో వాణిజ్య, పారిశ్రామిక సంఘాలు సమావేశమయ్యాయి. ఈ సందర్భంగా పరిశ్రమ వర్గాల నుంచి వచ్చిన మరో ప్రధాన సూచన ఏమిటంటే... జీఎస్టీని 2017 ఏప్రిల్ నుంచి అమలు చేయడం కష్టమని, ఐటీ వసతులు సమకూర్చుకునేందుకు తగినంత సమయం ఇవ్వాలని కోరాయి. సేవల సరఫరా దారులు విడిగా ప్రతీ రాష్ట్రంలోనూ నమోదు చేసుకునే ఇబ్బంది లేకుండా దేశవ్యాప్తంగా ఏకీకృత నమోదుకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశాయి. ఈసీ చైర్మన్, పశ్చిమబెంగాల్ ఆర్థిక మంత్రి అమిత్ మిత్రా పరిశ్రమ వర్గాల నుంచి వచ్చిన ఆందోళనలను పరిగణనలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. జీఎస్టీకి పార్లమెంటు ఆమోదం తర్వాత ఈసీకి ఇదే తొలి భేటీ. ద్రవ్యోల్బణానికి చెక్ పెట్టాలి..: ప్రామాణిక పన్ను రేటు అన్నది సహేతుక స్థాయిలో ఉండాలి. ద్రవ్యోల్బణానికి, పన్నుల ఎగవేత ధోరణికి చెక్ పెట్టాలని ఫిక్కీ సూచించింది. పన్ను మోసాలు లేదా వసూలు చేసిన పన్నును జమ చేయకపోవడం వంటివి మినహా మిగిలిన అంశాల్లో చట్టపరమైన విచారణ, శిక్షలకు సంబంధించి నిబంధనల్లో మొదటి రెండేళ్లు సడలింపు ఇవ్వాలని అసోచామ్ కోరింది. కాగా, జీఎస్టీ విధానం నుంచి తమకు మినహాయింపు కల్పించాలని ఈ కామర్స్ రంగం నుంచి బలమైన డిమాండ్ వినిపించింది. ‘మేము వర్తకులు, వినియోగదారుల మధ్య ప్లాట్‌ఫామ్ అందుబాటులో ఉంచుతున్నాం. అమ్మకాల ద్వారా ఆదాయం గడించడం లేదు. మా పోర్టళ్ల ద్వారా సరుకులను విక్రయిస్తున్నవారే జీఎస్టీ చెల్లించాలి’ అని ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్, అమేజాన్ వాదించాయి. 18 శాతం రేటు చాలు గరిష్టంగా 18 శాతం పన్ను రేటు అన్నది ప్రామాణికంగా భావిస్తున్నాం. దీనివల్ల తటస్థ ఆదాయానికి తోడు పన్ను పరంగా తగినంత సానుకూలత ఉంటుంది. జీఎస్టీని ఏప్రిల్ 1 నుంచి అమలు చేయడానికి సిద్ధంగానే ఉన్నాం. అయితే ఈ గడువుకు అనుగుణంగా ముందుకు వెళ్లాలంటే కొన్ని నిబంధనలపై ముందుగానే స్పష్టత వస్తే వెంటనే మా సొంత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వ్యవస్థను అమల్లో పెడతాం. - నౌషద్ ఫోర్బ్స్, ప్రెసిడెంట్, సీఐఐ -
వ్యవసాయంలో ‘పశ్చిమ’ ఫస్ట్
- జిల్లాలకు ర్యాంకులు ప్రకటించిన ప్రభుత్వం - పారిశ్రామిక రంగంలో విశాఖకు మొదటి ర్యాంకు - అన్నింట్లోనూ చివరి స్థానాల్లో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్రంలోని 13 జిల్లాలకు ప్రభుత్వం ర్యాంకులిచ్చింది. 2015-16 సంవత్సరానికి రంగాలవారీగా ఈ ర్యాంకులు ప్రకటించారు. వ్యవసాయ రంగంలో పశ్చిమగోదారి జిల్లా మొదటి ర్యాంకు పొందగా కృష్ణా, గుంటూరు జిల్లాలు రెండు, మూడు ర్యాంకుల్లో ఉన్నాయి. ఈ రంగంలో శ్రీకాకుళం జిల్లా అన్నిటికంటే వెనుకబడింది. మొత్తంగా ఉత్తరాంధ్ర జిల్లాలు మూడూ వ్యవసాయ రంగంలో చివరి స్థానాల్లో నిలిచాయి. విశాఖపట్నం 11, విజయనగరం 12వ ర్యాంకు పొందాయి. అయితే పారిశ్రామిక రంగంలో విశాఖపట్నం మొదటి ర్యాంకును సాధించింది. తూర్పుగోదావరి రెండు, కృష్ణా జిల్లా మూడో ర్యాంకును పొందాయి. శ్రీకాకుళం జిల్లా ఈ రంగంలోనూ చివరి స్థానంలో నిలిచింది. సేవా రంగంలో విశాఖ, కృష్ణా, గుంటూరులు వరుసగా మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు ఈ రంగంలోనూ చివరి స్థానాల్లో ఉన్నాయి. తలసరి ఆదాయంలో విశాఖపట్నం ముందుండగా కృష్ణా, పశ్చిమగోదావరి రెండు, మూడు ర్యాంకులు పొందాయి. వృద్ధి రేటులో కృష్ణాజిల్లా అగ్ర స్థానంలో ఉండగా విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. రాష్ట్ర వృద్ధి రేటు 10.50 శాతం ఉండగా కృష్ణా జిల్లా వృద్ధి రేటు 12.88 శాతం, విశాఖ వృద్ధి రేటు 12.23 శాతంగా ఉంది. శ్రీకాకుళం జిల్లా చిట్ట చివరన ఉంది. వృద్ధి రేటు, తలసరి ఆదాయంతో పాటు కీలకమైన మూడు రంగాల్లోనూ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు వెనుకబడ్డాయి. రాయలసీమ, ప్రకాశం నెల్లూరు జిల్లాలు మధ్య ర్యాంకులు పొందాయి. -
ఇదేమి వృద్ధి?
ముఖ్యమంత్రి సొంత జిల్లాలో వృద్ధి 6 శాతం మాత్రమే వ్యవసాయ రంగంలో వెనుకబాటు పారిశ్రామిక రంగంలో ఐదో స్థానం సేవారంగంలో ఆరో స్థానం అటవీ ఉత్పత్తుల్లో మాత్రం ఫస్ట్ నిత్యం ప్రగతి గురించి ప్రవచించే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లాలో వృద్ధి రేటు మందగమనంగా ఉంది. పదమూడు జిల్లాల్లో వృద్ధిరేటును పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. సాక్షాత్తూ సీఎం బుధవారం కలెక్టర్ల సమావేశంలో జిల్లాలవారీగా వృద్ధిరేటును వెల్లడించారు. అటవీ ఉత్పత్తులు మినహా మిగిలిన అన్ని రంగాల్లో వెనుకబాటే కనిపించింది. ముఖ్యంగా వ్యవసాయ రంగం అట్టడుగున నిలిచింది. పారిశ్రామిక రంగమూ పెద్దగా ప్రగతి సాధించింది లేదు. తిరుపతి: జిల్లా అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగడం లేదు. ఒకట్రెండు మినహా మిగతా అన్ని రంగాల్లోనూ వెనుకబాటే కనిపిస్తోంది. ప్రధానంగా వ్యవసాయ రంగం నానాటికీ వెనుకబడిపోతోంది. సాగునీటి కొరత, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా జిల్లాలో వ్యవసాయ రంగం నానాటికీ దిగజారిపోయింది. కేవలం అటవీ ఉత్పత్తులు, పరిశ్రమల రంగంలోనే కొద్దోగొప్పో పురోగతి కనిపిస్తోంది. బుధవారం విజయవాడలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో సర్కారు వివిధ రంగాల వారీగా విడుదల చేసిన గణాంకాలు దీన్ని తేటతెల్లం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సొంత జిల్లా అయిన ప్పటికీ జిల్లా పూర్తిస్థాయిలో వృద్ధి రేటు 6 శాతమే కావడం గమనార్హం. వ్యవసాయ రంగంలో 8వ ర్యాంక్ 2015-16 ఆర్థిక సంవత్సరంలో జిల్లా వ్యవసాయం ఆశించిన మేర వృద్ధి కనిపించలేదు. ఈ రంగంలో జిల్లాకు 8వ స్థానం లభించింది. సాగునీరు, విత్తనాల కొరతతో పాటు సరైన మార్కెటింగ్ సదుపాయాలు కొరవడటం, -
పరిశ్రమలకు షాక్!
రెండుశాతం పెరగనున్న విద్యుత్‌చార్జీలు పెంచిన ధరలు నేటినుంచీ అమలు జిల్లాపై ఏడాదికి రూ. 3.61 కోట్ల అదనపు భారం ఆందోళనలో పారిశ్రామిక రంగం విజయనగరం మున్సిపాలిటీ : మూలిగే నక్కపై తాడి పండు పడ్డట్టు అంటే ఇదేనేమో. అసలే నిర్వహణభారం పెరిగి ఒకవైపు పరిశ్రమలు మూతపడుతుంటే తాజాగా చంద్రబాబు ప్రభుత్వం విద్యుత్ చార్జీల పేరుతో హైఓల్టేజీ షాక్ ఇచ్చింది. కమర్షియల్ కేటగిరీలకు చెందిన సర్వీసులపైనా భారం మోపింది. ప్రస్తుతం ఉన్న చార్జీలపై 2 శాతం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ తూర్పుప్రాంత విద్యుత్‌పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్) ప్రతిపాదించిన ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ) గురువారం నిర్ణయాన్ని ప్రకటించింది. పెంచిన విద్యుత్ చార్జీలు ఏప్రిల్ ఒకటినుంచి అమల్లోకి రానుండగా... హైఓల్టేజీ కనెక్షన్లపై ఆర్ధిక భారం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గృహ వినియోగదారులకు ఎటువంటి చార్జీలు పెంచకున్నా గృహేతర వినియోగదారులపై భారానికి పచ్చజెండా ఊపింది. దీంతో ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ పరిధిలో ఉన్న 6,43,350 వినియోగదారులపై ఏడాదికి అదనంగా రూ3.61 కోట్లు భారం పడుతుంది. కష్టాల్లో పారిశ్రామిక రంగం వెనుక బడిన ప్రాంతంగా పేరొందిన విజయనగరం జిల్లాలో అత్యధిక శాతం ప్రజలు వ్యవసాయ, పారిశ్రామిక రంగాలపైనే ఆధారపడి జీవిస్తున్నారు. కొన్నేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వాలు వరుసగా ప్రతి ఏటా విద్యుత్ చార్జీలు పెంచేయడంతో పరిశ్రమల నిర్వహణ కష్టతరంగా మారుతోందంటూ సంబంధిత యాజమాన్యాలు లాకౌట్ ప్రకటిస్తున్నాయి. జిల్లాలో పరిశీలిస్తే ఇప్పటి వరకు 10 ఫెర్రో ఎల్లాయీస్ పరిశ్రమలు, 8 జూట్ పరిశ్రమలు మూతపడ్డాయి. దీంతో ఆయా పరిశ్రమల్లో ఉపాధి పొందుతున్న సుమారు 20వేల కార్మికులకు చెందిన 80వేల మంది ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. కొన్నేళ్లుగా మూతపడి ఉన్న ఫెర్రో ఎల్లాయీస్ పరిశ్రమలకు రాయితీపై విద్యుత్ సరఫరా చేస్తారని ఇప్పటివరకూ ఆశించినా ప్రయోజనం లేకపోయింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత పారిశ్రామిక రంగానికి చేయూతనిస్తామనీ, యూనిట్ల ఏర్పాటుకు ముందుకు వచ్చే వారికి సహకారం అందిస్తామని చెప్పి... ఇప్పుడు 2016-17 సంవత్సరానికి హైఓల్టేజీ విద్యుత్ కనెక్షన్ల యూనిట్ ధరను పెంచటంతో ఆ రంగం అభివృద్ధిపై నీలినీడలు కమ్ముకునే పరిస్థి దాపురించింది. -
ఏదీ.. పరిశ్రమల జాడ
విశాఖపట్నం: విశాఖలో పారిశ్రామిక రంగం ఉరకలేస్తుందని పాలకులు కొద్ది నెలలుగా చెబుతున్నారు. దేశ, విదేశీ సంస్థలు క్యూ కడుతున్నాయని గొప్పలు చెబుతున్నారు.. తాజాగా ప్రభుత్వ రంగంలోని మినీరత్న సంస్థ బాల్మర్ లారీ దాదాపు రూ.220 కోట్ల పెట్టుబడితో మల్టీమోడల్ లాజస్టిక్ హబ్ నిర్మించేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించింది. అయితే ఇంతవరకూ హడావిడే తప్ప ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు దిశగా అడుగులు పడిన దాఖలా లేదు. ఒప్పంద పత్రాల తర్వాత ఆయా సంస్థలూ ముందుకు రావడం లేదని తెలుస్తోంది. ప్రచారానికే పరిమితం: రాష్ట్ర ఆర్ధిక ప్రగతికి పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరముందనడం నిస్సందేహం. అయితే ఇందుకు భారీగా మలిక సదుపాయాలు అవసరం. ఒప్పందాలపై చూపిస్తున్న ఆసక్తి మౌలిక సదుపాయలపై చూపడం లేదనే విమర్శ పారిశ్రామిక వర్గల నుంచి వినిపిస్తున విమర్శ. సింగిల్ విండో విధానంలో 21 రోజుల్లో అనుమతులు ఇచ్చేస్తామని చెప్పడం మినహా పరిశ్రమల స్థాపనకు ముందకు వస్తున్న వారికి ఎలాంటి సాయం చేయడం లేదు. ముఖ్యంగా భూములు సమకూర్చే విషయంలోనే తొలి అడ్డంకి మొదలవుతోంది. పరిహారం విషయంలో నిర్వాసితులను సంతృప్తి పరచలేకపోవడం వల్ల వారితో పరిశ్రమలకు ఇబ్బందులు తప్పడం లేదు. మరోవైపు రాజకీయ జోక్యం ఎక్కువగా ఉండటం వల్ల పరిశ్రమల నిర్వహణ కష్టంగా ఉంటోందని ఇటీవల సీఎం చంద్రబాబుకు విశాఖలో పారిశ్రామిక వేత్తలు నిర్మొహమాటంగా చెప్పారు. అడ్డంకులు తొలగేదెపుడు: ఏషియన్ పెయింట్స్‌కు 125 ఎకరాలను రాంబిల్లి మండలం పూడి వద్ద ఇటీవలే కేటాయించారు. ఇంత వరకూ అక్కడ ప్లాంటుకు సంబంధించి ఎలాంటి పనులు ప్రారంభం కాలేదు. ఏన్టీపీసీ రూ.25 వేల కోట్లతో 1200 ఎకరాల్లో ప్లాంటు నెలకొల్పుతానంటే నిన్నమొన్నటి వరకూ భూమి చూపించలేకపోయారు. అచ్చుతాపురం మండలంలో భూమి ఇచ్చినా నిర్వాసితుల సమస్యను పూర్తిగా పరిష్కరించలేదు. పూడిమడక గ్రామానికి చెందిన మత్స్యకారులు తమ గ్రామం కాలుష్యం కోరల్లో చిక్కకుంటుందనే భయంతో ప్రాజెక్టుకు అడ్డుచెబుతున్నారు. రాంబిల్లి మండలంలో సోలార్ ఇండస్ట్రీకి దాదాపు 97 ఎకరాలు ఈమధ్యనే ఇచ్చారు. ఇక్కడ ఇవ్వాల్సిన దానికంటే తక్కువ పరిహారం ఇచ్చారంటూ కొందరు నిర్వాసితులు అసంతృప్తితో ఉండటంతో పాటు న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి సిద్ధమవుతున్నారు.ఏపీఐఐసీ చేతిలో ఉన్న 1000 ఎకరాల్లో 500 ఎకరాలను లాజిస్టిక్ పార్క్‌కు, 100 ఎకరాలను ప్యాకేజింగ్ పరిశ్రమకు, 8 ఎకరాలను ప్యాకేజింగ్ ఇన్స్టిట్యూట్కు, 98 ఎకరాలను ఎలక్ట్రానిక్స్ మానిఫెక్చరింగ్ క్లస్టర్లకు కేటాయిస్తామన్నారు. ఇంతవరకూ ఆ పని చేయలేదు. అవి రాలేదు. నరవ వద్ద 30-40 ఎకరాలు, నడిపూడి వద్ద 440 ఎకరాలు, కాపులుప్పాడ వద్ద 1350 ఎకరాలు గుర్తించారు. వీటిని ఐటి సంస్థలకు కేటాయిస్తామన్నారు. ఒక్కదానికి కూడా ఇచ్చింది లేదు. సింగపూర్ ఐటి కంపెనీ ఐటి పార్క్‌లో ఇంక్యుబేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని దానికి 6వేల చదరపు అడుగులు కావాలని కోరుతోంది. ఐటి శాఖ 2 వేల అడుగులే అందుబాటులో ఉందని చెబుతోంది. దీంతో ప్రతిపాదన ముందుకు వెళ్లడం లేదు. ఆశలు రేపిన ప్రకటనలివి: ఏషియన్ పెయింట్స్ దాదాపు 125 ఎకరాల్లో దేశంలోనే అదిపెద్ద ప్లాంట్‌ను విశాఖలో నెలకొల్పేందుకు ముందుకు వచ్చింది. ఏన్టీపీసీ రూ.25 వేల కోట్లతో 1200 ఎకరాల్లో ప్లాంటు నెలకొల్పుతానంటోంది. 500 ఎకరాల్లో లాజిస్టిక్ పార్క్, 100 ఎకరాల్లో ప్యాకేజింగ్ పరిశ్రమ, 8 ఎకరాల్లో ప్యాకేజింగ్ ఇన్స్టిట్యూట్, 98 ఎకరాల్లో ఎలక్ట్రానిక్స్ మానిఫెక్చరింగ్ క్లస్టర్లు రానున్నాయి.ఎలిప్ కంపెనీ అచ్చుతాపురంలో 20-30 ఎకరాలు ఇస్తే ఇండస్ట్రీ పెడతామంటోంది. {ఫెంచ్ దేశానికి చెందిన కెన్యూస్ సంస్థ భవన నిర్మాణంలో వాడే పౌడర్ వంటి పదార్ధాన్ని తయారు చేసే పరిశ్రమ స్థాపించేందుకు ముందుకు వచ్చింది.సింగపూర్ ఐటి కంపెనీ ఐటి పార్క్‌లో ఇంక్యుబేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామంటోంది.చైనీస్ ఇండస్ట్రీయల్ పార్క్‌ను 200 ఎకరాల్లో నెలకొల్పుతామని ఇప్పటికే అక్కడి అధికారుల నుంచి వర్తమానం అందింది. -
మేలో పారిశ్రామిక ఉత్పత్తి నిరాశ
- ఐఐపీ వృద్ధి రేటు కేవలం 2.7% - తయారీ రంగం పేలవ పనితీరు న్యూఢిల్లీ: పారిశ్రామిక రంగం ఉత్పత్తి మే నెల్లో తీవ్ర నిరాశ పరిచింది. 2014 మే నెలతో పోల్చితే 2015 మే నెలలో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) ఆధారిత ఉత్పత్తి వృద్ధి రేటు కేవలం 2.7 శాతం పెరిగింది. గత ఏడాది మే నెలలో ఈ వృద్ధి రేటు 5.6 శాతం. 2015 ఏప్రిల్ రేటు 4.1 శాతం. శుక్రవారం కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్ఓ) విడుదల చేసిన సమాచారం ప్రకారం ముఖ్య రంగాల పనితీరు ఇలా ఉంది... తయారీ: మేలో వృద్ధి రేటు 5.9 శాతం నుంచి 2.2 శాతానికి పడిపోయింది. ఏప్రిల్‌లో ఈ రేటు 5.1 శాతంగా ఉంది. కాగా ఏప్రిల్-మే నెలల్లో వృద్ధి రేటు 4.5% నుంచి 3.2 శాతానికి పడింది. మొత్తం ఐఐపీలో ఈ రంగం వాటా దాదాపు 72 శాతం. మైనింగ్: మే నెలలో వృద్ధి రేటు 2.5 శాతం నుంచి 2.8%కి పెరిగింది. అయితే రెండు నెలల్లో చూస్తే వృద్ధి రేటు 2.1% నుంచి 1.5 శాతానికి పడింది. విద్యుత్: ఈ రంగంలో మే నెల వృద్ధి రేటు 6.7% నుంచి 6%కి తగ్గగా... ఏప్రిల్-మే నెలల్లో ఈ రేటు భారీగా 9.2 శాతం నుంచి 2.8 శాతానికి జారింది. -
తెలివిని పంచి... పరిశ్రమను పెంచాలి!!
పరిశ్రమల రంగంలో తనదైన ముద్ర వేస్తున్న మహిళ గజ్జెల శకుంతలమ్మ. దేశంలో ట్రాన్స్ఫార్మర్ మీటరు బాక్సుల తయారు చేస్తున్న ఏకైక మహిళ. ‘బతకడం అంటే పదిమందికి బతుకునివ్వడం’... అని నమ్మే ఈమె తన అనుభవాలను పంచుకున్నారిలా... మేము మొదట్లో రిఫ్రిజిరేటర్ విడిభాగాలు తయారు చేసి ఆల్విన్ కంపెనీకి సరఫరా చేసేవాళ్లం. ఆకంపెనీ మూత పడిన తర్వాత అనేక కంపెనీలకు అనేక రకాల వస్తువులను తయారు చేస్తూ పరిశ్రమను విస్తరించాం. ఇప్పటి వరకు దాదాపు 150 రకాల వస్తువులు తయారు చేశాం. మా కుటుంబంలో తొలి మహిళా పారిశ్రామికవేత్తను నేనే. గడచిన 23 ఏళ్లుగా పరిశ్రమను నడిపిస్తున్నాను. నా దగ్గర ఇప్పుడు మహిళలు, మగవాళ్లు అంతా ముప్ఫై మంది పనిచేస్తున్నారు. అందరికీ కచ్చితంగా హాజరుపట్టీలు నిర్వహించడం, వేతనంతో కూడిన వారాంతపు సెలవుతోపాటు శ్రామికులకు వర్తించాల్సిన చట్టాలకు లోబడి ఇండస్ట్రీని నడిపిస్తున్నాను. మాయ చేయరాదు, మెప్పించాలి! ఒకసారి తయారైన వస్తువు అది స్టూలైనా, కుర్చీ అయినా పదేళ్లు, పాతికేళ్లయినా విరగనంత పటిష్టంగా ఉండాలి. పలుచటి మెటీరియల్‌తో చేసిన ఫైబర్ కుర్చీలు, స్టూళ్ల మీద కూర్చుంటే కాళ్లు వంగిపోతుంటాయి. వాటి మన్నిక తక్కువ కావడంతో ఏడాదిలోపే విరిగి రీసైక్లింగ్‌కి వస్తాయి. రీఫిల్ అయిపోక ముందే విరిగిపోయే పెన్నులు కూడా ఇదే కోవలోకి వస్తాయి. మార్కెట్లో తక్కువ ధరతో దొరికే నాసిరకం వస్తువుల ధాటికి తట్టుకోలేక మేము ట్రాన్స్ఫార్మర్ మీటరు బాక్సుల తయారీ వంటి ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకున్నాము. ఇదో పరిశోధన! పరిశ్రమను విజయవంతంగా నడిపించాలంటే సమాజంలో మార్పులను గమనిస్తూ ఉండాలి. ఒక కొత్త వస్తువు మార్కెట్లోకి వచ్చిన వెంటనే దానికి అనుబంధ వస్తువుల అవసరం ఏర్పడుతుంది. సెల్ఫోన్లు వచ్చాయి... వాటిని చార్జింగ్ పెట్టడానికి ప్లగ్ పాయింట్ పక్కనున్న కిటికీనో, రీడింగ్ టేబుల్‌నో ఆసరా చేసుకోవడాన్ని చూసి వీటికో స్టాండు తయారు చేద్దామనుకున్నాను. అనుకున్నంత త్వరగా దానిని డిజైన్ చేయించకపోవడంతో నేను పని మొదలు పెట్టేసరికే మార్కెట్లోకి ఆ స్టాండులు వచ్చేశాయి. ఆ తర్వాత మేము చేసినా కూడా అనుకరణ అవుతుందే కానీ రూపకల్పన అనిపించుకోదు. ఫ్రిజ్‌లో వస్తువులు పెట్టుకోవడానికి అనువుగా ఎత్తు తక్కువగా ప్లాస్టిక్ ట్రేలు చేయించాను. అవి బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఇప్పుడు దేవుడి బొమ్మల తయారీ మీద దృష్టి పెట్టాను. రోజ్‌వుడ్‌తో చేసిన వేంకటేశ్వర స్వామి బొమ్మ సైజుని బట్టి లక్ష రూపాయల పై మాటే. అదే ఫైబర్‌తో చేసి రాళ్లు పొదిగి మధ్యతరగతి వారికి అందుబాటు ధరల్లో అందిస్తున్నా. - వాకా మంజులారెడ్డి ఫొటోలు: రాజేశ్‌రెడ్డి రెండు చక్రాలు... ఎవరూ చదువుని, తెలివిని వృథా చేయకూడదు. ఉమ్మడి కుటుంబాలు లేని నేటి పరిస్థితుల్లో భర్త పారిశ్రామికవేత్త అయితే భార్య కూడా పరిశ్రమ నిర్వహణలో కీలకంగా మారాలి. భార్యాభర్త రెండు చక్రాలుగా పరిశ్రమను నడిపించాలి. భర్త లక్షలు, కోట్లు సంపాదిస్తున్నా సరే, సమయాన్ని వృథా చేస్తూ షాపింగులతో కాలం వెళ్లబుచ్చవద్దని నాకు కనిపించిన వారందరికీ చెబుతుంటాను. - గజ్జెల శకుంతలమ్మ, నవ్య పాలిమర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహకురాలు, హైదరాబాద్ -
పరిశ్రమలకు బాసట
బడ్జెట్లో పారిశ్రామిక రంగానికి రూ.1165.74 కోట్లు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పరిశ్రమలకు ఊతమివ్వడంతోపాటు కొత్త పరిశ్రమల స్థాపనపై రాష్ట్ర సర్కారు దృష్టి సారించింది. ఇందులో భాగంగా బడ్జెట్లో ప్రణాళిక పద్దులో రూ.1165.74 కోట్లు కేటాయించిం ది. గ్రామీణ చిన్న తరహా పరిశ్రమలకు రూ.832.74 కోట్లు, ఆహార నిల్వలు, గిడ్డంగులకు రూ.188.13 కోట్లు, చేనేత జౌళి శాఖకు రూ.134 కోట్లు కేటాయిం చింది. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్షర్ కార్పొరేషన్(టీఎస్ఐఐసీ)కు రూ.100 కోట్లు కేటాయించింది. సమైక్య రాష్ట్రంలో పరిశ్రమలకు ఇన్సెంటివ్ రూపంలో చెల్లించాల్సిన రూ. 638 కోట్లు చెల్లించేం దుకు నిర్ణయించింది. బడ్జెట్లోనే అందుకు నిధులు ప్రతిపాదించింది. పరిశ్రమలకు విద్యుత్ సబ్సిడీలు అందించేందుకు రూ. 100 కోట్లు కేటాయించింది. హైదరాబాద్‌లో ఐటీఐఆర్ ప్రాజెక్టుకు రూ. 90 కోట్లు ప్రతిపాదించింది. రాష్ట్రంలో హైదరాబాద్‌తో పాటు ఇతర నగరాల అభివృద్ధికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. వరంగల్‌లో టెక్స్టైల్ పార్కు, హైదరాబాద్‌లో రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు బడ్జెట్లో ప్రకటించింది. మెదక్ జిల్లాలో 12,365 ఎకరాల్లో ఇన్వెస్ట్మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. అభివృద్ధికి మార్గం... ‘తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధి రేటు 2012-13లో మైనస్ 0.9 శాతానికి పడిపోయింది. 2013-14లో కొద్దిగా పెరిగి 2.7 శాతానికి పెరిగింది. ఇంకా చాలా ప్రగతి సాధించాల్సి ఉంది. పారిశ్రామికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానం అమలుచేస్తుంది. కొత్త పరిశ్రమలకు అనుమతులు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కార్యాలయంలోనే ఛేజింగ్ సెల్ ఏర్పాటు చేస్తున్నాం ’ అని ఆర్థిక శాఖ మంత్రి ఈటెల తన ప్రసంగంలో ప్రస్తావించారు. సింగరే ణి ద్వారా విదేశాలలో బొగ్గు గనులను నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపింది. అలాగే ఎస్సీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం బడ్జెట్లో రూ.97.51 కోట్లు కేటాయించింది. పేద కార్మికులకు ఉన్న రుణాలను లక్ష రూపాయాల వరకు మాఫీ చేయనుంది. -
పారిశ్రామిక గుమ్మం
సాక్షి ప్రతినిధి, ఖమ్మం : సింగరేణి బొగ్గు గనులు, అపార అటవీ సంపద, ఇతర సహజ వనరులకు పుట్టినిల్లుగా విరాజిల్లుతున్న ఖమ్మం.. పారిశ్రామిక రంగం వైపు కూడా వేగంగా అడుగులు వేస్తోంది. జిల్లాలో లభిస్తున్న ఖనిజ సంపదను వినియోగించి అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో ఇక్కడి నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. బయ్యారంలోని అపార ఖనిజ సంపదను పూర్తిస్థాయిలో వినియోగించి అక్కడ స్టీల్ కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్న పోరాటం ఫలించబోతోంది. ఉక్కు కర్మాగారం నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉండటం, రాష్ట్ర ప్రభుత్వం సైతం ఇందుకు సంబంధించిన పనులను వేగవంతం చేయడంతో ఏజెన్సీ వాసుల కల త్వరలోనే నెరవేరనుంది. ఈ ఫ్యాక్టరీ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 10 వేల మందికి ఉపాధి లభిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే నిర్ణయాలతోనే కాలం గడుపుతున్న ప్రభుత్వాలు దీనికి సంబంధించి కార్యాచరణ మాత్రం ఇంకా ప్రారంభించకపోవడంతో జిల్లా ప్రజల్లో ఒకింత ఈ ప్రాజెక్టు నిర్మాణంపై అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. వేలాది కోట్ల రూపాయల విలువ గల ఖనిజ సంపద గల ఈ ప్రాంతంలో కర్మాగారం నిర్మిస్తారా.. లేదా.. ముడిసరుకు రవాణాకు అనువైనప్రాంతంలో ఫ్యాక్టరీని నిర్మిస్తారా..? అనే అంశంపై ఇంకా జిల్లా ప్రజల్లో కొంత సందిగ్ధత నెలకొంది. ఫ్యాక్టరీ నిర్మాణం మాత్రం వచ్చే రెండేళ్లల్లో పూర్తవుతుందనే ఆశ ఈ ప్రాంత వాసుల్లో నెలకొంది. అలాగే జిల్లాలో మరో పారిశ్రామిక వాడగా ఎదగడానికి అన్ని హంగులున్న మణుగూరులో సైతం థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని స్థాపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు జిల్లా ప్రజలు చిరకాలంగా చేస్తున్న పోరాటం ఫలించినట్టే అని తెలుస్తోంది. తెలంగాణకు ఖమ్మం జిల్లాను విద్యుత్ హబ్‌గా మార్చాలనే కేసీఆర్ కృతనిశ్చయం.. జిల్లా ప్రజల జీవన ప్రమాణాల్లో కొత్త వెలుగులు నింపుతుందన్న గంపెడాశ వ్యక్తమవుతోంది. అలాగే కొత్తగూడెంలో సైతం థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి కసరత్తు చేస్తున్న ప్రభుత్వం రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ కొరతను నివారించడానికి వీలైనంత త్వరలో ఈ ప్రాజెక్టులను ప్రారంభించి పూర్తి చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతోంది. దీనికి సంబంధించి అన్ని రకాల పాలనా పరమైన ఆటంకాలను అధిగమించడానికి అధికారులను ఫైళ్లతో పరుగుల తీయిస్తోంది. భూ సేకరణ, నిర్వాసితుల నష్ట పరిహారం తదితర అంశాలను సత్వరమే పరిష్కరించడంతోపాటు న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా చూసేందుకు అధికారులు ఆఘమేఘాల మీద ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వచ్చే ఏడాది నాటికి ఈ ప్రాజెక్టుకు తుది రూపం రానుంది. అలాగే విస్తారమైన బొగ్గు నిల్వలున్న సత్తుపల్లి ప్రాంతంలో సైతం మరో విద్యుత్ ప్రాజెక్టు నిర్మించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే.. దీనికి సంబంధించిన విధి విధానాల రూపకల్పన స్థాయిలోనే ఈ ప్రాజెక్టు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందువల్ల జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు, భద్రాచలం తదితర ప్రాంతాలతోపాటు జిల్లా కేంద్రమైన ఖమ్మం రూపురేఖలు అభివృద్ధి పరంగా మారనున్నాయి. జిల్లాలో కొత్తగా అపార బొగ్గు నిక్షేపాలున్న ప్రాంతాలను గుర్తించిన సింగరేణి సంస్థ అక్కడ బిగ్గు తవ్వకాలను సత్వరం ప్రారంభిస్తే కొత్తగా నిర్మించనున్న విద్యుత్ ప్రాజెక్టులకు చేదోడుగా వాదోడుగా ఉండటంతోపాటు జిల్లాలోని వేలాది మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉపాధి లభించే అవకాశం ఉంది. ఇప్పటికే జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సాధించిన ఖమ్మం గ్రానైట్ నిరంతర విద్యుత్ కోతల వల్ల సంక్షోభంలో కూరుకుపోతోంది. గ్రానైట్ ఉత్పత్తికి సంబంధించి అవసరమైన వనరులు పుష్కలంగా ఉన్నా విద్యుత్‌కోత గ్రానైట్ వ్యాపారుల పట్ల శాపంగా మారింది. వేలాది మంది ఆధారపడి ఉన్న గ్రానైట్ పరిశ్రమకు ప్రభుత్వం చేయూతనిస్తే జిల్లాలో ఈరంగం మూడుపువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతుందన్న విశ్వాసం జిల్లా ప్రజల్లో వ్యక్తమవుతోంది. జిల్లాలోని గిరిజనులు తమ ఉపాధికి ప్రధాన మార్గంగా ఎంచుకున్న తునికాకు సేకరణకు సంబంధించి ఇప్పటి వరకు సరైన విధానం అమల్లో లేదు. దీంతో గిరిజనులు శ్రమ దోపిడీకి గురవుతున్నారన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. గిరిజనుల ఉపాధి పరిరక్షణకు భద్రాచలం ప్రాంతంలో బీడీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్ తెలంగాణ ప్రభుత్వంలోనైనా సాకారమైతే తమ జీవితాల్లో కొత్త వెలుగులు వస్తాయని గిరిజనులు గంపేడాశలతో ఉన్నారు. ఇప్పటికే పలు పరిశ్రమలతో పారిశ్రామిక వాడగా వెలుగొందుతున్న పాల్వంచలో ఎరువుల కర్మాగారం నిర్మించాలన్న డిమాండ్ సైతం ఆది నుంచి ఉంది. దీనిపై సైతం ప్రభుత్వం ఒకింత దృష్టి సారిస్తే తెలంగాణలో ఖమ్మం జిల్లా తిరుగులేని పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందని ఇక్కడి ప్రజలు ఆశాభావంతో ఉన్నారు. -
మహిళల్లోనే వ్యాపార మెళకువలు
మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రభుత్వం ప్రోత్సహించాలి గోవా గవర్నర్ మృదులా సిన్హా ప్రారంభమైన మహిళా పారిశ్రామిక వేత్తల సదస్సు సాక్షి, హైదరాబాద్: ‘మగవారి కంటే మహిళల్లోనే వ్యాపార మెళకువలు మెండుగా ఉంటా యి. పారిశ్రామిక, రాజకీయ రంగాల్లో వారి ప్రాతినిధ్యం మరింత పెరగాలి. ఈ దిశగా కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా పారిశ్రామిక వేత్తలకు తగిన విధంగా ప్రోత్సాహకాలను అందించాలి’ అని గోవా రాష్ట్ర గవర్నర్ మృదులా సిన్హా సూచించారు. మహిళా పారిశ్రామిక వేత్తల సమాఖ్య(కోవె) ఆధ్వర్యంలో శనివారమిక్కడ హెచ్ఐసీసీలో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సు ‘వైజ్- 2014’ను మృదులా సిన్హా ప్రారంభించారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి 750 మంది మహిళా పారిశ్రామిక వేత్తలు ఈ సదస్సుకు హాజరయ్యారు. గవర్నర్ మృదులా సిన్హా మాట్లాడుతూ తాము స్థాపించిన పరిశ్రమల ద్వారా వినూత్న ఉత్పత్తులను తెచ్చేందుకు మహిళా పారిశ్రామిక వేత్తలు ఎంతగానో శ్రమిస్తున్నారని, మెరుగైన ఆలోచనలు చేస్తున్నారని చెప్పారు. ఆయా ఉత్పత్తులకు సరైన విమర్శకు లు కూడా మహిళలేనన్నారు. రవాణామంత్రి పి.మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ మహిళా పారి శ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసిందన్నారు. పరిశ్రమలు స్థాపించాలనుకున్న వారికి కేవలం 15 రోజుల్లో అన్ని అనుమతులు, మౌలిక వసతులు కల్పించేలా సీఎం కేసీఆర్ చర్యలు చేపట్టారని చెప్పారు. ఈ సందర్భంగా పలువురు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు గవర్నర్ మృదులా సిన్హా, మంత్రి మహేందర్‌రెడ్డి చేతుల మీదుగా అవార్డులను ప్రదానం చేశారు. అవార్డులను అం దుకున్న వారిలో పారిశ్రామిక వేత్తలు వందన, లలిత, విజయశారద, రుమానా, జానకి, శైలశ్రీ, జ్యోత్స్న, రిఖితాభాను, రాజేశ్వరి తదితరులున్నారు. కార్యక్రమంలో మహిళా పారిశ్రామిక వేత్తల సమాఖ్య(కోవె) అధ్యక్షురాలు సౌదామినీ, ఉపాధ్యక్షురాలు గిరిజారెడ్డి, కార్యదర్శి గీతాగోటే, ఐఎఎస్ అధికారులు ప్రదీప్‌చంద్ర, రత్నప్రభ తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధి కల్పనే లక్ష్యం
సాక్షి, బెంగళూరు : రానున్న ఐదేళ్లలో 15 లక్షల ఉద్యోగాలను పారిశ్రామిక రంగంలో సృష్టించాలనే లక్ష్యంతో నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందించామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. ఇందులో కూడా స్థానికులకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నూతన పారిశ్రామిక విధానాన్ని (ఇండస్ట్రియల్ పాలసీ) సీఎం సిద్ధరామయ్య శుక్రవారం సాయంత్రం విధాన సౌధాలోని బాంక్వెట్ హాల్లో జరిగిన కార్యక్రమంలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... నూతనంగా రూపొందించిన పాలసీ ఈ ఏడాది నుంచి ఐదేళ్ల పాటు (2014-2019 వరకూ) అమల్లో ఉంటుందన్నారు. ఈ సమయంలో రూ. ఐదు లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం, 15 లక్షల నూతన ఉద్యోగాలను సృష్టించడం ప్రధాన లక్ష్యాలుగా నూతన పాలసీను అమలు చేయనున్నామన్నారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామం (పీపీపీ) పద్ధతిలో నూతన పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేసే విధానాన్ని మొదటి సారిగా ఇదే పాలసీలో పొందుపరిచామన్నారు. ప్రతి ఏడాది ఒక్కొక్కటి 5,000 నుంచి 8,000 ఎకరాల విస్తీర్ణంలో కనిష్టంగా ఐదు పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. చాలా పరిశ్రమల స్థాపన మైనింగ్ రంగంతో ముడిపడి ఉంటుందన్నారు. అందువల్ల నూతన మైనింగ్ పాలసీను రూపొందించాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామన్నారు. నూతన పారిశ్రామిక పాలసీలో ఏరోస్పేస్, మిషన్టూల్, స్టీల్, సీమెంట్ రంగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. అతిచిన్న, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి కూడా అధిక ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా గరిష్ట పెట్టుబడి మొత్తాన్ని కూడా రెట్టింపు చేశామన్నారు. ఔత్సాహిక ఎస్సీ, ఎస్టీ, వెనుక బడిన తరగతులు, మహిళలు, వికలాంగులకు, విశ్రాంత సైనికులు పరిశ్రమల స్థాపనకు ముందుకు వస్తే ఎక్కువ సబ్సిడీలు కల్పించనున్నామన్నారు. అదేవిధంగా పరిశ్రామిక వాడకు కేటాయించిన మొత్తం భూమి విస్తీర్ణంలో 22.5 శాతం ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారికి తప్పక కేటాయించేలా నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందించమని తెలిపారు. అదే విధంగా నూతన పాలసీ వ్యవధి లోపు రెండు పారిశ్రామిక వాడలను మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి పారిశ్రామిక వాడ విస్తీర్ణంలో ఐదు శాతాన్ని వారికి తప్పక కేటాయిస్తామని సిద్ధరామయ్య వివరించారు. -
పవర్ స్ట్రోక్
పడకేసిన పారిశ్రామిక రంగం కార్మికులకు ఉపాధి కరువు చిన్నతరహా పరిశ్రమలకు కోలుకోలేని దెబ్బ ఇప్పటికే సగం యూనిట్లు మూత గ్రేటర్లో రోజుకు రూ.150 కోట్ల నష్టం ఒక ఇంటికి విద్యుత్ సరఫరా నిలిచిపోతే ఆ కుటుంబంలోని నలుగురైదుగురు సభ్యులు మాత్రమే ఇబ్బంది పడతారు. ఒక వీధికి కరెంట్ లేకపోతే పది, పన్నెండు ఇళ్ల వారు సమస్యలు ఎదుర్కొంటారు. అది కూడా పూర్తిగా వారి అవసరాలు తీర్చుకునేందుకే అవస్థలు పడాలి. కానీ ఒక పరిశ్రమకు విద్యుత్ నిలిచిపోతే... ఆ యాజమాన్యంపై ఆధారపడిన పదులు...వందల సంఖ్యలోని కార్మికులు... వారినే నమ్ముకున్న వేలాది మంది కుటుంబ సభ్యులు ఏకంగా రోడ్డున పడాల్సి వస్తుంది. వారానికి రెండు రోజులు పవర్ హాలీడే కారణంగా ప్రస్తుతం నగరంలోని అనేక మందికి ఇదే సమస్య ఎదురవుతోంది. సాక్షి, సిటీబ్యూరో, కాటేదాన్,జీడిమెట్ల: జీడిమెట్ల ఎస్వీ కో ఆపరేటివ్ సొసైటీలోని ఆర్ఎస్ మాలిక్యూల్స్ పరిశ్రమ విద్యుత్ కోతల కారణంగా బ్యాంకు నుంచి తీసుకున్న రుణ వాయిదాలు చెల్లించలేక నష్టాల్లో కూరుకుపోయింది.విద్యుత్ సరఫరా సరిగా లేకపోవడంతో పరిశ్రమకు అర్డర్లు తగ్గాయి. వారానికి రెండు రోజులు పవర్‌హాలిడేతో విద్యుత్ లేక, జనరేటర్లతో పరిశ్రమను నడపలేక యాజమాన్యం చేతులె త్తేసింది. ఇటీవల వేరొకరికి లీజుకు ఇచ్చింది. కొత్తగా వచ్చిన యాజమాన్యం మీకు ఇక్కడ పనిలేదు అని చెప్పడంతో 25 మంది కార్మికులు ఒక్కసారిగా రోడ్డున పడ్డారు. జీడిమెట్ల ఫేజ్-1లోని బీటా లాక్టమ్ ల్యాబ్స్ యూనియన్ బ్యాంకులో తీసుకున్న అప్పును చెల్లించకపోవడంతో అధికారులు ఈ పరిశ్రమను మూసివేసి, స్వాధీనం చేసుకున్నారు. దీనికి ప్రధాన కారణం విద్యుత్ సరఫరా లేక ఉత్పత్తి క్షీణించడమే. ఎన్ఆర్ఆర్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ డీజిల్‌తో నడిపేందుకు నెలకు రూ.3 లక్షలు వెచ్చిస్తోంది. డీజిల్ ఖర్చు తడిసి మోపెడు కావడంతో బ్యాంకు లోన్లు చెల్లించలేక ఈ పరిశ్రమ దివాళా దిశగా ప్రయాణిస్తోంది. ఇవీ గ్రేటర్ వ్యాప్తంగా పారిశ్రామిక వాడల్లో చిన్న, మధ్యతరహా, భారీ పరిశ్రమలు ఎదుర్కొంటున్న కరెంట్ కష్టాలకు కొన్ని ఉదాహరణలు. మహానగరంలో విద్యుత్ కోతలు, వారానికి రెండు రోజుల పాటు అమలు చేస్తున్న పవర్‌హాలిడే పారిశ్రామిక రంగంలో చీకట్లు నింపుతున్నాయి. కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాల్సిన విద్యుత్... వారి బతుకుల ను అంధకారంలోకి నెట్టేస్తోంది. దీనికి తోడు అనధికారిక కోతలతో చిన్న, మధ్యతరహా పరిశ్రమల యజమానులు పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోతున్నారు. ఒకవైపు బ్యాంకులకు వాయిదాలు చెల్లించలేక, కోతల వల్ల ఉత్పత్తులు మందగించి, అమ్మకాలు, కొనుగోళ్లు నిలిచిపోయి, అనేక మంది పరిశ్రమలను లీజుకు ఇచ్చేస్తున్నారు. కొందరు తాళాలు వేసేస్తున్నారు. వాటినే నమ్ముకున్న కార్మికులు ఉపాధి కోల్పోయి, రోడ్డున పడుతున్నారు. విద్యుత్ కోతలతో నగర పారిశ్రామిక రంగం రోజుకు రూ.150 కోట్ల మేర నష్టపోతున్నట్లు సమాచారం. గుండె గు‘బిల్లు’ ప్లాస్టిక్, బోర్‌వెల్స్, మైనింగ్, డ్రిల్లింగ్, ప్యాకేజింగ్, టవర్స్, ఇంజినీరింగ్ వంటి పరిశ్రమలకు కేంద్రమైన చర్లపల్లిలో పెరిగిన విద్యుత్ బిల్లులతో చాలా వరకు మూతపడ్డాయి. ఐదేళ్ల క్రితం రూ.25 వేల కరెంట్ బిల్లు చెల్లించిన వారు ఇప్పుడు రూ.లక్షకుపైగా చెల్లించాల్సి వస్తోంది. రూ 2.5 లక్షలు చెల్లించిన పరిశ్రమలపైన రూ. 5 లక్షలకు పైగా భారం పడింది. 150 హార్స్పవర్ విద్యుత్ వినియోగించే పరిశ్రమలను సైతం లోటెన్షన్ (ఎల్టీ) నుంచి హైటెన్షన్ (హెచ్‌టీ)కి మార్చడం వల్ల గతంలో ఒక కేవీఏకు రూ.150 చొప్పున చెల్లించిన వాళ్లు ఇప్పుడు రూ.350 చెల్లించాల్సి వస్తోంది. సర్‌చార్జ్ సర్దుబాటు(ఎఫ్ఎస్ఏ) రూపంలోనూ పరిశ్రమలపై ప్రభుత్వం భారం మోపింది. నాచారంలో ఒకప్పుడు పెద్ద ఎత్తున ఆటో మొబైల్ సంబంధితవస్తువులను ఉత్పత్తి చేసి బెంగళూరుకు విక్రయించిన డ్రాగన్ఫోర్జ్ కంపెనీ యజమాని కేవలం విద్యుత్ సంక్షోభం కారణంగానే చేతులెత్తేశారు. మల్లాపూర్, నాచారంల లోని వందలాది కెమికల్, ఇంజినీరింగ్, స్టీల్రోలింగ్, టెక్స్టైల్స్, ఫుడ్స్ పరిశ్రమల్లో విద్యుత్ సంక్షోభం కారణంగా దివాళా దిశగా నడుస్తున్నాయి. రుణాలు చెల్లించలేక... ఒకవైపు విద్యుత్ సంక్షోభం... మరోవైపు బ్యాంకులు నాన్ పెర్ఫార్మెన్స్ అకౌంట్ (ఎన్పీఏ) నోటీసుల పేరిట పరిశ్రమల యజమానులను బెంబేలెత్తిస్తున్నాయి. సాధారణంగా బ్యాంకు రుణాలపై 30 రోజులకు ఒకసారి వడ్డీ చెల్లించాలి. ఇలా చెల్లించ లేని పరిశ్రమలకు ఈ ఎన్పీఏ నోటీసులను జారీ చేస్తాయి. వరుసగా 3 సార్లు వడ్డీ చెల్లించకుండా నోటీసులు అందుకున్న పరిశ్రమలను స్వాధీనం చేసుకొనే అధికారం బ్యాంకులకు లభిస్తుంది. ప్రస్తుతం ఉన్న కోతలు, పెరిగిన చార్జీల దృష్ట్యా ఎన్‌పీఏను 90 నుంచి 120 రోజులకు పెంచాలని పరిశ్రమలు కోరుతున్నాయి. డీజిల్‌కు డిమాండ్ విద్యుత్ కోతలతో గ్రేటర్లో డీజిల్ వినియోగం అనూహ్యంగా పెరుగుతోంది. మహానగర పరిధిలో ఉన్న 300 పెట్రోల్ బంకుల్లో నిత్యం 17 లక్షల లీటర్ల డీజిల్ విక్రయాలు జరుగుతుండగా.. కోతల వల్ల అది 20 లక్షల లీటర్లకు చేరింది. ముఖ్యంగా ఇండస్ట్రియల్ ఏరియాల్లో ఉన్న సుమారు వందకుపైగా బంకుల్లో డీజిల్ అమ్మకాలు భారీగా పెరిగాయి. ఆస్పత్రులు, సినిమా హాళ్లు, ఫార్మా పరిశ్రమలు, ప్రింటింగ్, హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర పరిశ్రమలు జనరేటర్ల పైనే ఆధారపడాల్సిన దుస్థితి తలెత్తింది. 30 శాతం యూనిట్లు మూత జీడిమెట్ల, కుత్బులాలపూర్, గాజులరామారం, ఎలీప్ పారిశ్రామిక వాడల్లో 2500, చర్లపల్లిలోని ఐదు పారిశ్రామికవాడల్లో ఉన్న 851 పరిశ్రమల్లో 30 శాతం యూనిట్లు ఇప్పటికే మూతపడ్డాయి. మల్లాపూర్, నాచారం ప్రాంతాల్లోని 700 పరిశ్రమల్లో ఇప్పటికే వంద యూనిట్లు ఏదో ఒక కారణంతో మూతపడ్డాయి. పాతబస్తీలోని 60కి పైగా చిన్నతరహా పరిశ్రమలు భారంగా నడుస్తున్నాయి. ఉప్పల్‌లోని 200 పరిశ్రమల్లో 20 శాతానికిపైగా నష్టాల బాటలోనే నడుస్తున్నాయి. కాటేదాన్ పారిశ్రామికవాడలో రెండువేల పరిశ్రమల్లో సుమారు 300 మూతపడే స్థితిలో ఉన్నాయి. కోతలతో నష్టపోతున్నాం విద్యుత్ కోతలతో ప్రస్తుతం కార్మికుల వేతనాలు, కరెంట్ బిల్లులు చెల్లించడం కష్టతరంగా మారింది. దీనిని ఆసరాగా చేసుకుని గుజరాత్ వంటి రాష్ట్రాలు మన రాష్ట్రానికి ఉత్పత్తులను దిగుమతి చేస్తూ లాభాల బాటలో నడుస్తున్నాయి. ప్రభుత్వం విద్యుత్ కోతలను పూర్తిగా ఎత్తివేసి పరిశ్రమల నిర్వహణకు తోడ్పాటు నందించాల్సిన అవసరం ఉంది. - శివకుమార్ గుప్తా, పారిశ్రామికవేత్త, కాటేదాన్ ఉపాధి పోయి రోడ్డున పడ్డా నేను గత ఆరేళ్లుగా ఆర్ఎస్ మాలిక్యూల్స్ పరిశ్రమలో పని చేస్తున్నాను. నాకు నెలకు రూ.12 వేల జీతం వచ్చేది. ఒక్కసారిగా ప్రభుత్వం వారానికి రెండు రోజులు పరిశ్రమలకు విద్యుత్ నిలిపివేసింది. యాజమాన్యం జీతాలు చెల్లించలేకపోవడంతో మేం రోడ్డుపై పడ్డాం. - మహమూద్, కార్మికుడు, జీడిమెట్ల విధిలేక నడుపుతున్నాం నాచారం పారిశ్రామికవాడలో సుమారు 500 పరిశ్రమలు ఉన్నాయి. విద్యుత్ కోతలతో ఇప్పటికే చాలా పరిశ్రమలు సంక్షోభంలో కూరుకునానయి. ఆర్డర్స్ రావడం లేదు. వచ్చిన వాటికి సకాలంలోఉత్పత్తులను అందించలేకపోతున్నాం. కార్మికులకు జీతాలు చెల్లించలేక, పరిశ్రమలను మూసుకోలేక విధిలేని పరిస్థితిలో తప్పనిసరై నడపాల్సి వస్తోంది. - మహిపాల్‌రెడ్డి, నాచారం ఇండస్ట్రియల్ అసోసియేషన్ అధ్యక్షుడు -
పరి'శ్రమ'..?
అనుబంధ పరిశ్రమలపై సింగరేణి శీతకన్ను - ఔత్సాహికులకు ప్రోత్సాహం కరువు - ఎనిమిది నెలలుగా వర్క్ ఆర్డర్లు లేక ఇక్కట్లు - బ్యాంక్ రుణాలు చెల్లించడానికి అభ్యర్థుల అగచాట్లు - ముఖం చాటేస్తున్న ఉన్నతాధికారులు ఇలా వీరిద్దరే కాదు.. దాదాపు పదిమూడు మంది వరకు పరిశ్రమలు పెట్టుకుని నేడు నిరుత్సా హంలో కొట్టుమిట్టాడుతున్నారు. గని కార్మికుల పిల్లల్ని పారిశ్రామికరంగంవైపు తీసుకురావాలని సింగరేణి యాజమాన్యం నిర్ణయించింది. బయటి నుంచి తీసుకొస్తున్న సింగరేణికి అవసరమయ్యే చిన్నచిన్న పరికరాల్ని స్థానికంగానే తయారు చేయించాలనుకుని బెల్లంపల్లి రీజియన్ పరిధిలోని ఔత్సాహికులను అను బంధ పరిశ్రమల స్థాపన కోసం 2013లో ఆహ్వానిం చింది. 13 మందిని ఎంపిక చేసింది. ఒక్కొక్కరు బ్యాంకుల్లో రూ.10లక్షల నుంచి రూ.45లక్షల వరకు అప్పు తీసుకుని రూఫ్ బోల్టింగ్, వైండింగ్ వైర్, హౌజింగ్ వైర్, ఫిష్ ప్లేట్లు, జీఐ వైరింగ్ తదితర పరి కరాలు తయారీ పరిశ్రమలు పెట్టుకున్నారు. సింగరేణి కొన్ని నెలలపాటు వీరికే ఆర్డర్లు ఇచ్చింది. ఆ తర్వాత ఏమైందో గానీ, దాదాపు ఎనిమిది నెలలుగా ఆర్డర్లను నిలిపివేసిందని పరిశ్ర మల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంస్థను నమ్ముకుని లక్ష లు అప్పు చేసి ఫ్యాక్టరీలు పెట్టుకున్నామని, ఇప్పుడు వాటిని కట్టలేక నగలు, ఆస్తిపాస్తులు అమ్ముకునే స్థితి కి చేరుకున్నామని వాపోతున్నారు. ఇప్పటికైనా సంస్థ స్పందించి అనుబంధ పరిశ్రమలకు ప్రోత్సా హం అందించాలని వేడుకుంటున్నారు. ప్రోత్సహిస్తేనే బతుకుదెరువు సింగరేణి యాజమాన్యం సంపూర్ణ సహకారం అందిస్తేనే తమకు బతుకుదెరువు లభిస్తుందని అనుబంధ పరిశ్రమల యజమానులు ఆర్.శ్రీని వాస్, సతీష్‌కుమార్, సాగర్, శంకరయ్య, నర్సిం హా, రాజేష్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక సింగరేణి స్టోర్స్‌లో విలేక రులతో వారు గోడు వెల్లబోసుకున్నారు. సంస్థను నమ్మి లక్షల రూపా యలు అప్పుతెచ్చి పరిశ్రమలు పెట్టామని, 8నెల లుగా వర్క్ ఆర్డర్లు లేకపోవడం తో ఆర్థిక సమ స్యలు ఎదుర్కొంటున్నామని తెలిపారు. తమకు న్యాయం చేయాలని కోరారు. -
ప్రగతిలో విశాఖ ప్రథమం
విశాఖ రూరల్ : అభివృద్ధిలో విశాఖ ఇతర జిల్లాల కంటే ముందంజలో ఉంది. పదమూడు జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో విశాఖ జిల్లా వాటా 18 శాతం కావడమే దీనికి నిదర్శనం. జిల్లా స్థూల ఉత్పత్తి రెట్టింపునకు ప్రణాళిక సిద్ధమవుతోంది. ఆదాయ వనరుల పెంపుతో జిల్లా ప్రగతికి కసరత్తు జరుగుతోంది. ప్రభుత్వ ఆదేశాలతో ‘జిల్లా విజన్ డాక్యుమెంట్’ రూపకల్పన మొదలైంది. నెల రోజుల్లో దీన్ని పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. విశాఖదే అగ్రభాగం: 2012-2013 వార్షిక నివేదిక ప్రకారం విశాఖ జిల్లా స్థూల ఉత్పత్తి రూ.56,668 కోట్లు. ఇందులో అధికంగా సర్వీసు రంగం రూ.31,372 కోట్లతో డీడీపీలో 55.36 శాతం వాటాతో అగ్రభాగంగా ఉంది. ఆ తర్వాత పారిశ్రామిక రంగం రూ.19,811 కోట్లతో 34.96 శాతం వాటాతో రెండో స్థానంలో ఉండగా, వ్యవసాయ రంగం వాటా రూ.5485 కోట్లతో 9.6 శాతంగా ఉంది. వ్యవసాయ రంగంలో కూడా అధిక శాతం ఉద్యాన పంటల ద్వారా ఎక్కువగా వస్తోంది. రూ.1152 కోట్లు హార్టీకల్చర్ ద్వారా పురోగతి కనిపిస్తోంది. పదమూడు జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో డీడీపీలో విశాఖ జిల్లా ప్రథమ స్థానంలో ఉండటం విశేషం. ఇందులో ప్రధానంగా సర్వీసు, పారిశ్రామిక రంగాలు కీలకంగా ఉన్నాయి. రూ.లక్ష కోట్లు లక్ష్యం జిల్లా స్థూల ఉత్పత్తిని రూ.56,668 కోట్ల నుంచి 2019 నాటికి రూ.లక్ష కోట్లకు పెంచేందుకు అధికారులు జిల్లా విజన్ డాక్యుమెంట్‌ను రూపొందిస్తున్నారు. ఇది రాష్ట్ర బడ్జెట్‌కు సమానం. ముందుగా నియోజకవర్గంలో ఒక మండలం, మండలంలో గ్రామాన్ని తీసుకొని ప్రణాళిక రూపకల్పనలో నిమగ్నమయ్యారు. పదిహేను నియోజకవర్గాల్లో 15 మండలాల్లో పైలట్ ప్రాజెక్టు కింద డాక్యుమెంట్‌ను తయారు చేస్తున్నారు. ఆయా మండలాల్లో కీలక రంగాన్ని ఆధారంగా చేసుకొని స్థూల ఉత్పత్తి రెట్టింపునకు అనుసరించాల్సిన విధానాలతో దీన్ని తీర్చిదిద్దనున్నారు. ఇందుకోసం ఆంధ్ర, గీతం విశ్వవిద్యాలయాల నుంచి ప్రొఫెసర్లతో కమిటీ ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక నిపుణుల బృందాన్ని జిల్లాకు పంపించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ తెలిపారు. -
నేను సివిల్స్ ప్రిలిమ్స్‌కు సిద్ధమవుతున్నాను
నేను సివిల్స్ ప్రిలిమ్స్‌కు సిద్ధమవుతున్నాను. ఎకానమీలో అత్యధిక మార్కులు సాధించడం ఎలా? -ఎస్.కిశోర్, కోఠి కాంపిటీటివ్ కౌన్సెలింగ్: గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే ప్రిలిమ్స్‌లో ఎకానమీ నుంచి 15 నుంచి 20 ప్రశ్నలు వస్తున్నాయి. ఉపాధి, పంచవర్ష, వార్షిక ప్రణాళికలు, ద్రవ్యం, బ్యాంకింగ్, వ్యవసాయం, ప్రభుత్వ విత్తం, జ నాభా, పేదరికం, విదేశీ వాణిజ్యం, అవస్థాపనా సౌకర్యాలు వంటివి పరీక్ష కోణంలో ముఖ్యమైన టాపిక్స్. ప్రశ్నలు ఈ అంశాల నుంచే ఎక్కువగా వస్తున్నాయి. ముఖ్యంగా 2013 సివిల్స్ ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాన్ని గమనిస్తే ప్రశ్నలన్నీ కాన్సెప్ట్ బేస్డ్గా ఉన్నాయి. కాబట్టి ఎకానమీకి సంబంధించి ప్రాథమిక అంశాలపై అవగాహన కోసం ఎన్సీఈఆర్టీ ఆరో తరగతి నుంచి 12వ తరగతి పాఠ్యపుస్తకాలను అధ్యయనం చేయాలి. గతేడాది ప్రిలిమ్స్‌లో బ్యాంకింగ్ నుంచి నాలుగు ప్రశ్నలు, అంతర్జాతీయ వాణిజ్యం నుంచి మూడు ప్రశ్నలు ఇవ్వడం గమనార్హం. కాబట్టి అభ్యర్థులు ఆర్థిక నివేదికలు, వ్యవసాయం, సేవా రంగం, పారిశ్రామిక రంగం, బ్యాంకింగ్, జాతీయాదాయం, యూఎన్డీపీ నివేదిక, 12వ పంచవర్ష ప్రణాళిక, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ప్రపంచ వాణిజ్య సంస్థ, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ, ప్రపంచ బ్యాంక్, ద్రవ్యం - బ్యాంకింగ్, సుస్థిర అభివృద్ధి, సాంఘిక అభివృద్ధి వంటి అంశాలను విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయాలి. కార్పొరేట్ గవర్నెన్స్‌పై సెబీ జారీ చేసిన మార్గదర్శకాలు, రిజర్వ్ బ్యాంక్ - కొత్త బ్యాంకులకు సంబంధించిన లెసైన్స్‌ల మంజూరు, కరెంట్ అకౌంట్ లోటు వంటివి కూడా ముఖ్యమైనవే. ప్రిపరేషన్లో కేవలం సిలబస్‌కే పరిమితం కాకుండా సంబంధిత అంశాలను కరెంట్ అఫైర్స్‌కు అన్వయించి చదువుకోవాలి. ముఖ్యమైన అంశాలను నోట్స్ రూపంలో రాసుకోవాలి. ఆ నోట్స్‌ను ప్రతిరోజూ రివిజన్ చేసుకోవాలి. ప్రిపరేషన్ స్థాయిని తెలుసుకోవడానికి స్వీయ పరీక్షను నిర్వహించుకోవాలి. ఇన్పుట్స్: తమ్మా కోటిరెడ్డి, సీనియర్ ఫ్యాకల్టీ, సివిల్స్ జాబ్స్, అడ్మిషన్స్ అలర్ట్స ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ పోస్టులు: సబ్ ఇన్స్పెక్టర్ (స్టాఫ్ నర్స్): 8 అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఫార్మసిస్ట్): 13 అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ల్యాబ్ టెక్నీషియన్): 4 హెడ్ కానిస్టేబుల్ (మిడ్వైఫ్): 10 ఎంపిక: ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, వైవా-వోక్ ఎగ్జామినేషన్ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబరు 5 వెబ్సైట్: http://itbpolice.nic.in సీటెట్ - సెప్టెంబరు 2014 సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) ‘సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ - సెప్టెంబరు 2014’ నోటిఫికేషన్ విడుదల చేసింది. సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ - 2014 పేపర్ - 1 (ఒకటి నుంచి ఐదో తరగతి) అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో సీనియర్ సెకండరీ/ఇంటర్ లేదా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో డిప్లొమా/ బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఉండాలి. పేపర్ - 2 (ఆరు నుంచి ఎనిమిది తరగతులు) అర్హతలు: ఏదైనా డిగ్రీ/ బీఎడ్/ డీఎడ్/ బీఈఎల్ఎడ్ ఉండాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: ఆగస్టు 4 పరీక్ష తేది: సెప్టెంబరు 21, వెబ్సైట్: www.ctet.nic.in సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్(సీ-డాక్) కోర్సు: పీజీ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్ డిజైన్ అర్హతలు: 55 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: ఆగస్టు 4 వెబ్సైట్: http://www.cdachyd.in/ -
పెట్టుబడులతో తరలిరండి!
ప్రపంచ దిగ్గజ సంస్థలను ఆకర్షించడానికి సర్కారు కసరత్తు 160 దేశాల ప్రాతినిధ్యంతో భాగస్వామ్య సదస్సుకు యోచన డిసెంబర్ లేదా జనవరిలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం హైదరాబాద్: పారిశ్రామిక, వ్యాపార రంగాల్లోని ప్రపంచ దిగ్గజ సంస్థల నుంచి భారీ పెట్టుబడులను ఆకర్షించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసుకుంటోంది. ఇం దులో భాగంగా 160 దేశాల్లోని పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రులు, కార్యదర్శులను, అగ్రశ్రేణి కంపెనీల ప్రతినిధులను ఆహ్వానించి, హైదరాబాద్‌లో భాగస్వామ్య సదస్సును నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. భవిష్యత్ పారిశ్రామిక, వ్యాపార అవకాశాలకు, వాటి విస్తరణకు తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన వేదిక అని ప్రపంచ దేశాలకు చెప్పడానికి ఈ సదస్సును వేదికగా చేసుకోవాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రాథమిక స్థాయి ఏర్పాట్లకు, అనుసరించాల్సిన వ్యూహం వంటివాటిపై ప్రతిపాదనలను సిద్ధం చేయాలని పరిశ్రమలు, ఐటీ శాఖ అధికారులను తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ఈ విషయంలో రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖమంత్రి కె.తారక రామారావు చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే సీఐఐ, ఫిక్కీ ప్రతినిధులతో కేటీఆర్ పలు దఫాలు సమావేశమయ్యారు. బ్రాండ్ ఇమేజీనే ట్రంప్‌కార్డుగా... ఐటీ, పారిశ్రామిక రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించడానికి హైదరాబాద్‌కు ఉన్న బ్రాండ్ ఇమేజీని ట్రంప్‌కార్డుగా వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. అంతేకాకుండా ఉపాధితో పాటు అభివృద్ధికి కీలకమైన పరిశ్రమల్లో పెట్టుబడుల కోసం ఆకర్షణీయమైన పారిశ్రామిక విధానం ఉంటుందని కేటీఆర్ పేర్కొంటున్నారు. పారిశ్రామిక విధానంపై కసరత్తు ఆగస్టులో పూర్తవుతుందని చెబుతున్నారు. దీనిపై ప్రకటన రాగానే భాగస్వామ్య సదస్సుకు సంబంధించిన ప్రతిపాదనలు, ఏర్పాట్లు, వ్యూహం వంటివాటిపై అడుగులు వేయనున్నారు. డిసెంబర్ చివర్లో లేదా జనవరిలో ప్రతిష్టాత్మకంగా ఈ సదస్సును నిర్వహించాలని భావిస్తున్నారు. సదస్సును రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో ప్రారంభింపజేయాలని యోచిస్తున్నారు. ప్రతి కంపెనీతో ప్రత్యక్ష సంబంధాలు... ప్రపంచ, జాతీయ స్థాయి ప్రముఖ కంపెనీలతో నేరుగా ప్రత్యక్ష సంబంధాలను కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. గతంలో చంద్రబాబు సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ 44 దేశాలతో భాగస్వామ్య సదస్సు జరిగింది. అయితే, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి రూ.43,800 కోట్ల విలువైన ఎంఓయూ(ఒప్పందాలు) జరిగినా, ఆచరణలో రూ.వంద కోట్లు కూడా రాలేదు. ఈ నేపథ్యంలో భాగస్వామ్య సదస్సుకు హాజరైనవారితో పాటు భారీ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నవారితో ప్రభుత్వ యంత్రాంగమే నేరుగా సంబంధాలను కొనసాగించాలని అనుకుంటోంది. కీలకపాత్ర పోషిస్తున్న కేటీఆర్... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన రోజునే మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి హార్వర్డ్ బంగారు పతకం వచ్చింది. ఈ విషయం తెలిసిన వెంటనే ఆనంద్ మహీంద్రాకు మంత్రి కేటీఆర్ అభినందనలు తెలుపుతూ మెయిల్ పంపిం చారు. అలాగే జహీరాబాద్‌లో ఉన్న మహీంద్రా కంపెనీ కన్నా పెద్ద పరిశ్రమలను ఏర్పాటుచేయాలని కేటీఆర్ ఆయన్ను ఆహ్వానించారు. దీనికి ఆనంద్మహీంద్రా కూడా సానుకూలంగా స్పందించారు. వీటితోపాటు హీరోహోండాకు తెలంగాణలో తలెత్తిన చిన్నచిన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కేటీఆర్ ఆదేశించారు. బెల్జియంకు చెందిన యూరోపియన్ బిజినెస్ అండ్ టెక్నాలజీ సెంటర్, యూరోపియన్ టెక్నాలజీ ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రాంతీయ కేంద్రాన్ని బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు మారుస్తున్నారు. ఇందులోనూ కేటీఆర్ కీలకంగా వ్యవహరించారు. ఒకటి రెండు కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం తరపున చురుకుగా వ్యవహరించడం వల్ల అవే కంపెనీలు పెట్టుబడులు పెట్టకపోయినా, ఆ సంకేతాలతో కార్పొరేట్ సంస్థల్లో సానుకూల చర్చ జరిగే అవకాశం ఉంటుందని, తద్వారా ఇతర సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి అది ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. పారిశ్రామిక రంగానికి చేయూత: మంత్రి కేటీఆర్ హైదరాబాద్: చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి చేయూతనిచ్చేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని ఐటీ, పంచాయత్‌రాజ్ శాఖా మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. శనివారం చర్లపల్లి పారిశ్రామికవేత్తల సంఘం, ఎంఎస్ఎంఈ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమస్య పరిష్కారానికి ట్రాన్స్మిషన్లు, ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటు చేస్తామన్నారు. సింగిల్ విండో విధానంతోనే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు అనుమతులు మంజూరయ్యేలా చూస్తామని తెలిపారు. కార్యక్రమంలో టీఐఐసీ ఎండీ జయేశ్ రంజన్, తెలంగాణ పారిశ్రామిక వేత్తల సమాఖ్య అధ్యక్షుడు కె.సుధీర్ రెడ్డి, ఫ్యాప్సియా అధ్యక్షుడు జె.నాగేశ్వర్ రావు, సిన్మియాస్ చైర్మన్ ఎస్.మనోహరన్, మేనేజింగ్ కమిటీ ప్రతినిధులు మిరుపాల గోపాలరావు, పి.చంద్రశేఖర్ రెడ్డి, వై.సుధాకర్ రెడ్డి, పరిశ్రమల యజమానులు పాల్గొన్నారు. మానవ సంబంధాలు ప్రభావితం: సోషల్‌మీడియా మానవ సంబంధాలనే తిరగరాస్తుందని, ప్రస్తుత కాలంలో ఓట్ల కంటే ‘ట్వీట్ల’ను ఇవ్వడానికే ప్రజలు ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం బేగంపేట మనోహర్ హోటల్లో పబ్లిక్ రిలేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ‘సోషల్ మీడియా ఇన్ టుడేస్ వరల్డ్’ అంశంపై నిర్వహించిన చర్చలో ఆయన పాల్గొన్నారు. ఐటి పరిశ్రమను పటిష్టం చేస్తాం: రాష్ట్రంలో ఐటీ పరిశ్రమను మరింత పటిష్టపరిచేందుకు చర్యలు తీసుకుంటామని కేటీఆర్ తెలిపారు. గచ్చిబౌలి శాంతిసరోవర్‌లోని గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో శనివారం బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలోని రిట్రీట్ కార్యక్రమ మూడో వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. -
పరిశ్రమలకు ప‘వర్రీ’
విజయనగరం మున్సిపాలిటీ : విద్యుత్ సంక్షోభం పరిశ్రమలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మూడు నెలలుగా విధిస్తున్న అధికారి క, అనధికారిక కోతలతో పారిశ్రామిక రంగం కుదేలవగా....గోరు చుట్టుపై రోకలి పోటులా తాజాగా పారి శ్రామిక రంగానికి మళ్లీ అధికారిక కోతలు విధిస్తున్న ట్టు విద్యుత్ శాఖ అధికారులు ప్రకటించారు. ప్రస్తు తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో బొగ్గు నిల్వలు పడిపోవడం, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ధర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు మూతపడడంతో 2000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో కోత లు విధిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నెల రోజుల క్రితం పరిశ్రమలకు విద్యుత్ కోతలు ఎత్తివేస్తున్నట్లు అధికారులు ప్రకటించినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మళ్లీ కోతలు అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతి రోజు సాయంత్రం 6.30 గం టల నుంచి ఉదయం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. ఆ సమయంలో పరిశ్రమల్లో కేవలం విద్యుత్ దీపాల వినియోగానికి మాత్రమే అనుమతిస్తారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా పరిశ్రమల్లోని యంత్రాలను నడిపితే అటువంటి వారిపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరి స్తున్నారు. విద్యుత్ కోతల విధింపుపై యాజమాన్యాల తో పాటు అటు కార్మికులు నష్టపోయే పరిస్థితి నెల కొంది. ఇప్పటికే జిల్లాలో గల ఫెర్రోఎల్లాయీస్ పరిశ్రమలు పూర్తిగా మూతపడే పరిస్థితికి చేరుకున్నాయి. ఈనేపథ్యంలో అధికారిక కోతలు విధించటం వారిని కలవరపెడుతోంది. గృహావసరాలకు తగ్గనున్న కోతలు జిల్లాలోని గృహావసర విద్యుత్ కనెక్షన్లకు కోతలు వేళలు తగ్గనున్నాయి. ఈ మేరకు ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ ఎస్ఈ సి.శ్రీనివాసమూర్తి నూతనంగా అమలు చేసే కోతలను ప్రకటిం చారు. షెడ్యూల్ లోడ్‌రిలీఫ్ పేరిట విధించే కోతల్లో భాగంగా జిల్లా కేంద్రానికి రోజులో రెండు గంటలు, మున్సిపాలిటీల్లో నాలుగు గంటలు, మండల కేంద్రా లు, గ్రామీణ ప్రాంతాల్లో ఆరు గంటల పాటు కోతలు విధించనున్నట్లు వెల్లడించారు. అయితే ఈ కోతలను ఉత్పత్తి కేటాయింపుల పరిస్థితులను బట్టి అమలు చేయనున్నారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మెరుగైన సరఫరా ఇచ్చేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. -
ప్రతిజిల్లా పరిశ్రమవ్వాలి: కె.నాగేశ్వర్
* అపార ఖనిజ సంపద తెలంగాణ సొంతం * పారిశ్రామిక ప్రగతి అన్ని జిల్లాలకూ విస్తరించాలి * విద్యుత్ మిగులు రాష్ట్రంగా మార్చాలి * జిల్లాల్లోనూ విమానాశ్రయాలు నిర్మించాలి * అప్పుడే నవతెలంగాణ సాధ్యం ఆధునిక ఆర్థిక వ్యవస్థలకు పారిశ్రామిక రంగం.. ముఖ్యంగా వస్తూత్పత్తి రంగం ఆలంబన అవుతుంది. సమాచార సాంకేతికరంగం లాంటి సేవల రంగంలో హైదరాబాద్ విశిష్ట ప్రగతి సాధించింది. దేశంలోనే సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో నాలుగో స్థానంలో ఉంది. అయితే సేవల రంగం ఆధునిక ఉపాధి కల్పించినా అది పరిమితం. వస్తూత్పత్తి రంగమే ఉపాధి కల్పించి విస్తృత అభివృద్ధికి బాటలు వేస్తుంది. ఔషధ పరిశ్రమలు మొదలుకొని ఎలక్ట్రానిక్స్, మెషీన్‌టూల్స్, ఏరోనాటిక్స్ రంగాలకు చెందిన భారీ పరిశ్రమలు హైదరాబాద్‌లో ఉన్నాయి. అయితే ఆయా రంగాల్లో మరింత ప్రగతి, ఆధునికత సాధించడంతోపాటు తెలంగాణ వ్యాప్తంగా పారిశ్రామికీకరణ జరగాలి. ముడిపదార్థాలున్నా.. నిస్తేజంగా.. ప్రస్తుతం ఉత్తర తెలంగాణలో బొగ్గు గనులు, కొన్ని జిల్లాల్లో సిమెంట్ కర్మాగారాలు, మెదక్ జిల్లాలో మోటారు పరిశ్రమలు, నిజామాబాద్‌లో చక్కెర, బీడీ పరిశ్రమ, ఆదిలాబాద్‌లో జిన్నింగ్ మిల్లులు, నల్లగొండలో బియ్యం మిల్లులు మొదలుగునవి ఉన్నప్పటికీ, ఇతర అనేక పరిశ్రమల ఏర్పాటుకవసరమైన ముడి పదార్థాల లభ్యత తెలంగాణ ప్రత్యేకత. తెలంగాణ రాష్ట్రంలో వస్త్ర, కాగితం, పరిశ్రమల అభివృద్ధికి కూడా విస్తారమైన అవకాశాలున్నాయి. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల, నల్లగొండ జిల్లా పోచంపల్లి, మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల్ ప్రాంతాలు వస్త్ర పరిశ్రమకు అవకాశాలున్నా నిస్తేజంగా పడిఉన్నాయి. అద్భుత నైపుణ్యం ఉన్న నేతకారులు కళావిహీనులై నగరంలో సెక్యూరిటీ గార్డులుగా పనిచేయడం నాగరికతకే తలవంపు. యువతను ఊరిస్తున్న ఐటీఐఆర్ ఆదిలాబాద్ జిల్లాలో మాంగనీస్, కరీంనగర్, నల్లగొండ జిల్లాల్లో సున్నపురాయి, నల్లమల అటవీసంపద వివిధ రకాల పరిశ్రమలకు అవకాశాలు ఇస్తున్నాయి. నిజామాబాద్‌లో పసుపు, నల్లగొండ, వరంగల్ తదితర జిల్లాల్లో మిర్చి, రంగారెడ్డిలో హైదరాబాద్‌కు ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో ఫ్లోరీ కల్చర్‌కు ఉన్న అవకాశాలు పారిశ్రామికాభివృద్ధికి బాటలు వేయగలవు. వరంగల్, మహబూబ్‌నగర్, కరీంనగర్ లాంటి జిల్లాల్లోని టైర్-2, టైర్-3 నగరాలకు సమాచార సాంకేతిక పరిశ్రమను విస్తరించేందుకు అవకాశాలున్నాయి. హైదరాబాద్‌లో ఏర్పాటు కానున్న సమాచార సాంకేతిక పెట్టుబడుల ప్రాంతం(ఐటీఐఆర్) నగర యువతను ఉవ్విళ్లూరిస్తోంది. మసిబారుతున్న యువత భవిత ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో విస్తరించి ఉన్న బొగ్గుగనులు వేలాది కుటుంబాలకు జీవనోపాధినిచ్చి జీవి తాలు మార్చాయి. కానీ ఈ గనుల్లో క్రమంగా ఉపాధి తగ్గి పోవడంతో స్థాని క యువత భవిత మసిబారుతోంది. కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లోని గ్రానైట్ పరిశ్రమ గందరగోళంలో ఉంది. కాబట్టి సమగ్ర పారిశ్రామిక పునరుజ్జీవనాన్నీ, సరికొత్త పారిశ్రామికీకరణ కోసం నవతెలంగాణ ఎదురుచూస్తోంది. ఎన్నెన్నో అవకాశాలు తెలంగాణ ఖనిజాల గని. ఆదిలాబాద్ జిల్లాలో మాంగనీసు, ఖమ్మం, వరంగల్ జిల్లాల సరిహద్దులో ఇనుప ఖనిజం, ఉత్తర తెలంగాణలో బొగ్గు, ప్రాణహిత పరివాహక ప్రాంతంలో బొగ్గు ఆధారిత మీథేన్(సీబీఎం) గ్యాస్ నిక్షేపాలున్నాయి. ఇంకా గణనీయ స్థాయిలో సున్నపురాయి నిక్షేపాలున్నాయి. ఇవికాక చైనా క్లే, గ్రానైట్, స్పటికం, మైకా మొదలుగు నిక్షేపాలు మెదక్, నల్లగొండ లాంటి ఇతర తెలగాణ జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ పారిశ్రామిక ముడి పదార్థాలే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో సుమారు 45శాతం అటవీ సంపద తెలంగాణలోనే ఉంది. దేశంలోని మొత్తం బొగ్గు నిక్షేపాలలో 20శాతం తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయని అంచనా. వ్యవసాయాధారిత, ఆహారోత్పత్తి పరిశ్రమలతో పాటు బయో టెక్నాలజీ లాంటి విజ్ఞాన ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు కూడా అవకాశాలు ఎన్నెన్నో. వెక్కిరిస్తున్న విద్యుత్ కొరత ముడి పదార్థాలున్నా, మురిపించే అవకాశాలున్నా ఆచరణలోకి రావాలంటే కావలసిందల్లా దార్శనికత గల రాజకీయ నాయకత్వమే. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామికీకరణకు అతిపెద్ద సవాల్ చాలినంత విద్యుత్ లేకపోవడమే. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న మొత్తం విద్యుత్ సామర్థ్యం 16,500 మెగావాట్లు. ఇందులో 10,500 మెగావాట్లు సీమాంధ్ర ప్రాంతంలోనే. తెలంగాణ ప్రాంతంలో ఉన్న మిగిలిన విద్యుత్‌లో గణనీయమైన భాగం జలవిద్యుత్తే. దీని ఉత్పత్తికి నీటి వనరుల లభ్యత ఎప్పుడూ సమస్యే. విద్యుత్ కొరత పారిశ్రామికీకరణకు ఆటంకంగా మారక తప్పదు. అతి తక్కువ కాలంలో విద్యుత్ లోటునుంచి విద్యుత్ మిగులు రాష్ట్రంగా తెలంగాణను మార్చేందుకు అధికారంలోకి రానున్న రాజకీయ నాయకత్వం ప్రణాళికలు రచించి అమలు చేయాలి. సమగ్ర జల విధానాన్ని అమలు చేయడం ద్వారా భూగర్భ జలాల వినియోగాన్ని తగ్గించి, ఉపరితల జలాల వినియోగాన్ని పెంచి తద్వారా విద్యుత్ వినియోగాన్ని నియంత్రించాలి. విమానయానం జిల్లాలకూ విస్తరించాలి హైదరాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం ఆధునిక పారిశ్రామికీకరణకు గొప్ప అవకాశాన్ని ఇస్తోంది. అయితే హైదరాబాద్‌తోపాటు తెలంగాణ రాష్ర్టంలో ఇతర నగరాలను కూడా పారిశ్రామిక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలంటే విమానయానరంగం విస్తరించాలి. ఆదిలాబాద్, వరంగల్ లాంటి నగరాల్లో ఇప్పటికే విమానాశ్రయాల ఏర్పాటుకు అవకాశం ఉంది. తెలంగాణ జిల్లాల్లో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రైల్వేలైన్లు అభివృద్ధి కావాలి. అందుబాటులో ఉన్న ముడి పదార్థాలను ఉపయోగిస్తూ మానవ వనరులను అభివృద్ధి చేయాలి. మౌలిక వసతులు కల్పిస్తూ ఉపాధి అవకాశాలే లక్ష్యంగా నూతన పారిశ్రామిక యుగానికి నవ తెలంగాణలో నాంది పలకాలి. - ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ పొన్నాల లక్ష్మయ్య ఖిలాషాపురం, వరంగల్ గిది మీ ఊరే..! - సగం కూలిన ప్రాథమిక పాఠశాల భవనం.. ఆరుబయట చదువులు - విద్య, వైద్యం, మంచినీటికి ఇబ్బందులు - అద్దె ఇంట్లో ఆరోగ్య ఉపకేంద్రం - వ్యవసాయ పరికరాలు నిల్వచేసుకునే స్థలంగా గ్రంథాలయ భవనం - కంకరతేలి భయపెడుతున్న రోడ్లు - చెంతనే అశ్వరావుపల్లి రిజర్వాయర్ ఉన్నా తాగునీటికి ఇక్కట్లు - పర్యాటకంగా అభివృద్ధి చేయకపోవడంతో కూలుతున్న సర్దార్ సర్వాయి పాపన్న కోట - మాదారం-ఖిలాషాపురం మధ్య వాగులో వంతెన నిర్మించకపోవడంతో వర్షాకాలంలో వాగుపొంగి సమీప గ్రామాలతో ఖిలాషాపురానికి తెగిపోతున్న సంబంధాలు ఒక్కడే... అనావుకుడిగా వచ్చి... అసెంబ్లీలో పాగ అవి జనతాపార్టీ గాలి ఉధృతంగా వీచే రోజు లు. ఎమ్మెల్యే టిక్కెట్ ట్రై చేద్దావూ! అనుకున్నా రు... మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్‌లోని ఓ ఆర్ఎంపీ జి.నర్సిములునాయుడు. అనుకు న్నదే తడవుగా జనతాపార్టీ టిక్కెట్ కోసం హైదరాబాద్‌లోని ఆ పార్టీ కార్యాలయానికి వెళ్లారు. సాయంత్రం వరకు వేచిచూసి నిరాశగా వెనుదిరిగారు. ‘ఎలాగూ ఇంత దూరం వచ్చా కదా.. గాంధీభవన్‌ను చూసి వెళ్దాం’ అనుకుని అక్కడికి వెళ్లి ఎందుకైనా మంచిదనుకుని వెంట తెచ్చుకున్న దరఖాస్తును అక్కడ సమర్పించారు. అంతే ఆయున రొట్టె విరిగి నేతిలో పడింది. ‘ఇందిరా కాంగ్రెస్ టికెట్‌కు మీరొక్కరే దరఖాస్తు చేసుకున్నారు...టికెట్ మీకే వచ్చింది’అంటూ గాంధీభవన్ నుంచి అతనికి వర్తమానం వచ్చింది. దీంతో అనూహ్యంగా ఆయున కాంగ్రెస్ టికెట్‌పై బరిలో దిగి 1978లో మక్తల్ ఎమ్మెల్యే అయ్యారు. ఒక ఆర్ఎంపీ ఒక పార్టీకి దరఖాస్తు చేసేందుకు వెళ్లి మరోపార్టీకి దరఖాస్తు సమర్పించి ఏకంగా ఎమ్మెల్యే కావడం అప్పట్లో ఓ సంచలనం. -న్యూస్‌లైన్, నారాయణపేట సాకలోల్ల కట్టం తీరకచ్చె రాజులు బోవట్టే.. రాజ్యాలు బోవట్టే గని మా సాకలోల్ల బతుకుల సీమంత సుక మారకచ్చినై. మా తాతముత్తాతల కాడికెళ్లి గిదే బతుకు. పొద్దుగల్ల లేసి.. కారంబువ్వ దిని.. ఇళ్లిళ్లూ దిరిగి ఊళ్లె బట్టలన్నీ ముళ్లెగట్టుకుని చెరొడ్డుకు దీస్కచ్చి ఉతుకుడే దెలుసు. బట్టలకంటిన మైలైతే బోవట్టే గని మా బతుకు కట్టం తీరకచ్చె. ఇగ మా బతుకంతా చాకిరేవు కాడ్నే బోవట్టే. మాకు దెల్సింది గిదొక్కటే పని. గిది గుడ సక్కగ సేసుకోలేక పోతున్నం. బట్టల్ని ఉతుకుదమంటే నీళ్లుంట లేవు. చెరువుల, కుంటల కాడ ఉతకస్త లేదు. గా దోబిగాట్లు కట్టిపియుండ్రి సారూ.. అని పెద్దమనుషులందర్ని అడిగినం. ఇగ ఎలచ్చన్ల సంగతేందో.. గ లీడరుసాబుల ముచ్చటేందో. ఐదేండ్లకోపారి గిట్ల ఇంటిమొకాన అత్తరు. ఏమే అవ్వ మంచిగున్నాయే.. అని తియ్యగ మాట్లడతరు. ఈసారి గూడ నాకే ఓటు గుద్దే అవ్వ.. నీకు పించినిప్పిత్తా.. ఇళ్ల జాగ ఇప్పిత్తా అని జెప్తరు. ఓట్లేశేనాడు ఆటోల గూసుండ వెట్టి దీస్కపోతరు. తీస్కత్తరు. గంతే.. మల్ల ఒక్కనాడు సుక కన్పియ్యరు. మాకు పెద్దకోర్కెలు ఏముంటయ్ బిడ్డా.. కడుపుకింత తిండి, కట్టుకునతందుకు బట్ట, ఉండతందుకు ఇంత ఇల్లు సాలు. ఇగ గివి గూడ ఇయ్యకపోతే గౌర్నమెంటు ఎందుకు.. గీ లీడరుసాబులు ఎందుకు. - సాకలి లచ్చవ్వ, బూర్గుల్, నిజామాబాద్ -
చిన్నపరిశ్రమలకు వైఎస్ పెద్దపీట
గెస్ట్ కాలం: ‘సగటు అభివృద్ధి రేటు ప్రకారం చూస్తే పరిశ్రమల సంఖ్య, పెట్టుబడులు, ఉపాధి విషయూల్లో తెలంగాణే అగ్రస్థానంలో ఉన్న విషయుం అర్థవువుతుంది. అలాగే 2004-09 వుధ్యకాలంలో సాధించిన పెరుగుదలను చూసినా కూడా తెలంగాణే మొదటి స్థానంలో ఉన్న సంగతి గవునించవచ్చు. తెలంగాణతో పోల్చితే కోస్తాంధ్రలో అభివృద్ధి ఆరుశాతం తక్కువ ఉంది.’ - వి.హనుమంతరావు ఆర్థిక విశ్లేషకులు తెలంగాణ అభివృద్ధిని నిరోధించిన నేతగా డాక్టర్ వై.ఎస్ రాజశేఖరరెడ్డిని చిత్రించి చూపడానికి కొందరు ప్రయుత్నించిన సంగతి తెలియునిది కాదు. వారి దృష్టిలో వైఎస్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను చిదిమివేసిన వ్యక్తి. ఇది గోబెల్స్ ప్రచారం తప్ప వురొకటి కాదు. దేశంలో చిన్న, లఘు పరిశ్రవుల రంగం ఉత్పత్తుల విలువ 2001- 02 ధరల ప్రకారం రూ.4,71,700 కోట్లు. ఆ పరిశ్రవుల సంఖ్య 130 లక్షలు. వాటిలో పని చేసే వారి సంఖ్య 420 లక్షలు. వాటి ఎగువుతుల విలువ ప్రస్తుత ధరల ప్రకారం రూ.1,77,600 కోట్లు. తయూరీ రంగంలో జరిగే ఉత్పత్తుల్లో 45 శాతం, ఎగువుతుల్లో 40 శాతం చిన్న, లఘు పరిశ్రవులదే. పారిశ్రామికరంగాన్ని పరిశీలించేటపుడు పరి శ్రవుల సంఖ్య, పెట్టుబడి, వాటి ఉత్పత్తుల విలువ ఆధారంగా విశ్లేషిస్తారు. తెలంగాణ అనగానే హైదరా బాద్ నగరాన్ని మినహారుుస్తే మిగిలిన తెలంగాణ జిల్లాలన్నీ వెనుకబడే ఉన్నాయున్నది పలువురి నిశ్చితాభిప్రాయుం. అందుకే ఈ పరిశీలనను ఆంధ్ర, తెలంగాణ, సీవు అనే వుూడు ప్రాంతాలుగా కాకుండా హైదరాబాద్ నగరం ప్రభావం ఉన్న చుట్టు పక్కల ప్రాంతాలు రంగారెడ్డి, మెదక్, వుహబూ బ్‌నగర్ జిల్లాలను కలిపి ఈ ప్రాంతాన్ని హైదరా బాద్ నగర ప్రాంతంగా, మిగిలిన జిల్లాలు (ఆదిలాబాద్, నిజావూబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, ఖవ్ముం) మిగిలిన తెలంగాణగా తీసుకోవడం జరిగింది. కోస్తా జిల్లాలను దక్షిణ కోస్తా గా, ఉత్తర కోస్తా ప్రాంతాలుగా, రాయులసీవు నాలుగు జిల్లాలను వురో ప్రాంతంగా పరిగణించి విశ్లేషించి, అభివృద్ధిని సగటు వార్షికాభివృద్ధి రేటు పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. దీని ప్రకారం పరిశ్రవుల సంఖ్య, పెట్టుబడి, ఉద్యోగాల విష యూల్లో కోస్తాంధ్ర, రాయుల సీవుల కన్నా తెలంగాణ అగ్రస్థా నంలో ఉంది. (వుూడు ప్రాంతాల గ్రాఫ్ చూడండి... గణాంకాలు పరిశ్రవుల శాఖ ఇచ్చినవి). 2004-09 వుధ్య కాలంలో సాధించిన పెరుగుదలను చూసినా కూడా తెలంగాణే మొదటి స్థానంలో ఉంది. కోస్తాంధ్రలో అభివృద్ధి తెలంగాణలో జరిగిన అభివృద్ధి కన్నా ఆరు శాతం తక్కువగా ఉంది. తెలంగాణలో ఈ పెరుగుదల అంతా వైఎస్ వుుఖ్యవుంత్రిగా ఉన్న కాలంలోనే జరిగిందన్నది గవునార్హం. 2005లో సెజ్‌లు ఏర్పాటు చట్టం రూపొందింది. తరువాత 72 సెజ్‌లను రాష్ట్రంలో నోటిఫై చేయుగా, అందులో 44 సెజ్‌లు (61.1శాతం) తెలం గాణలోనే ఉన్నారుు. ఇందులో అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో ఉన్నారుు. చిన్న, లఘు పరిశ్రవుల పనితీరును అధ్యయునం చేయుగా 1995-2009 వుధ్యకాలంలో 2007 - 08, 2008 - 09 సంవత్సరాల్లో ప్రశంసనీయుమైన అభివృద్ధి జరిగింది. 2007-08, 2008-09 సంవత్సరాల్లో హైదరాబాద్ ప్రాంతంలో 50.6, 41.9 శాతం, మొత్తం తెలంగాణ ప్రాంతంలో 44.8 శాతం, 38.3శాతం పెట్టుబడులు పెరిగారుు. ఆంధ్ర ప్రాంతంలో పెట్టుబడులు ఇంతకన్నా తక్కువే. ఆ పరిశ్రమల్లో 1995-2004 వుధ్యకాలంలో (చంద్రబాబు హయూంలో) పెట్టుబడులు రూ. 163కోట్ల నుంచి రూ. 4,452 కోట్లకు పెరగగా, ఆ తరువాత 2009 వుధ్యకాలంలో రూ. 10,504 కోట్లకు పెరిగారుు. ఇందుగలరందు లేరనే...! రాష్ట్రంలోని మునిసిపాలిటీలు, పంచాయతీలు, స్థానిక సంస్థల్లో 1.2 లక్షలు, వివిధ ప్రభుత్వ శాఖల్లో లక్షా ఎనభైవేలకు పైగా తాత్కాలిక ఉద్యోగులు, కార్మికులు ఉన్నారు. ఇక ఆర్టీసీ, సింగరేణి, విద్యుత్ శాఖ, టూరిజం వంటి ప్రభుత్వ సంస్థల్లో దాదాపు లక్షా ముఫ్పై వేల మంది తాత్కాలిక ఉద్యోగులు ఉన్నారు. ఎన్‌ఎంఆర్‌లు, పార్ట్‌టైం ఉద్యోగులు, కంటింజెంట్ ఉద్యోగులు, క్యాజువల్ ఉద్యోగులు మరో 30 వేల మందికిపైగా ఉన్నారు. ప్రైవేటు రంగంలో కాలేజీల్లో 1.5 లక్షల మంది ఉన్నారు. ఇక హమాలీలు, కూలీలూ అసంఘటిత రంగంలోనే.. అది కష్టాల ‘కుప్ప’ం అది కుప్పం. టీడీపీ అధినేత చంద్రబాబు నియోజకవర్గం. అక్కడ 25 వేల మంది అసంఘటిత కార్మికులు చలువరాళ్లు చెక్కుతారు. పిల్లా జెల్లా ముసలి ముతక కలిపి సుమారు లక్ష మంది జీవిస్తుంటారు. ఆ తెల్లరాయి ఎంతో కఠినమైంది. దాన్ని చెక్కే ఉలి మూణ్ణెళ్లలోనే సగం అవుతుందట. ఆ విరిగిన ఇనుప ముక్కలు కార్మికుల దేహాన్ని తూట్లు పొడుస్తాయి. కళ్లకు తగిలి చూపుపోయిన వారెందరో. వారికి వైద్యం చేయించుకునే దిక్కు లేదు. ఇజ్రాయెల్ నుంచి సాంకేతిక పరిజ్ఞానం మోసుకొచ్చి కుప్పంలో వ్యవసాయం అభి వృద్ధి చేశానని చెప్పే చంద్రబాబుకు అదే కుప్పంలో చలువరాతి కొండల్లోని ‘బండ’ బతుకులు కనబడలేదెందుకో? ఆ కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించాలని, వైద్య సహా యం అందించాలని, కనీస వేతనాలు చెల్లించేలా చూడాలనే ఆలోచన ఏనాడూ రాలేదు... కారుచౌకగా కార్మిక శక్తి... అభివృద్ధి చెందిన దేశాల్లో కార్మికులు దొరకడమే దుర్లభం. ఒకవేళ దొరికినా, వారిని నియమించుకుంటే వారికి చెల్లించాల్సిన జీతభత్యాలు తక్కువేమీ కాదు. ప్రపంచీకరణ నేపథ్యంలో అభివృద్ధి చెందిన దేశాల్లోని కంపెనీ లు తమ పనులను కార్మికశక్తి కారుచౌకగా దొరికే దేశాలకు ‘ఔట్‌సోర్స్’ చేస్తున్నాయి. తృతీయ ప్రపంచ దేశాల్లోను, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోను ఒక్కొక్క కార్మికునికి గంటకు చెల్లించే వేతనం డాలరు (రూ.60) కంటే తక్కువే. కార్మికశక్తి కారుచౌకగా దొరికే తొలి పది దేశాలు... 1. మడగాస్కర్ (0.18 డాలర్లు-రూ.10.77), 2. బంగ్లాదేశ్ (0.23 డాలర్లు-రూ.13.77), 3. పాకిస్థాన్ (0.32 డాలర్లు-రూ.19.17), 4. ఘనా (0.32-రూ.19.17), 5. వియత్నాం (0.39 డాలర్లు-రూ.23.36), 6. భారత్ (0.48 డాలర్లు-రూ.28.75), 7. కెన్యా (0.50-రూ.29.96), 8. సెనెగల్ (0.52-రూ.31.16), 9. శ్రీలంక (0.62 డాలర్లు-రూ.37.14), 10. ఈజిప్టు (0.80 డాలర్లు-రూ.47.94). కళ్లు చెదిరే కనీస వేతనాలు... అభివృద్ధి చెందిన పలు దేశాలు కార్మికులకు కళ్లు చెదిరే కనీస వేతనాలను చెల్లిస్తున్నాయి. వారి కనీస వేతనాల ముందు మన దేశంలో కాస్త పెద్ద ఉద్యోగాలు చేసే వారి జీతాలూ దిగదుడుపే. కార్మికులకు గంటకు అత్యధిక కనీస వేతనాలు చెల్లించే తొలి పది దేశాలు... 1. నార్వే (57.53 డాలర్లు-రూ.3446), 2. స్విట్జర్లాండ్ (53.20 డాలర్లు-రూ.3186), 3. బెల్జియం (50.70 డాలర్లు-రూ.3032), 4. డెన్మార్క్ (45.48 డాలర్లు-రూ.2720), 5. స్వీడన్ (43.81 డాలర్లు- రూ.2620), 6. జర్మనీ (43.76 డాలర్లు-రూ.2617), 7. ఫిన్లాండ్ (42.30 డాలర్లు-రూ.2531), 8. ఆస్ట్రియా (41.07 డాలర్లు-రూ.2457), 9. నెదర్లాండ్స్ (40.92 డాలర్లు-రూ.2448), 10. ఆస్ట్రేలియా (40.60 డాలర్లు-రూ.2429). -
‘సమైక్యం’పై నీళ్లు!
విమానాశ్రయం, పారిశ్రామికవాడ ఏర్పాటు, ఆర్కిటెక్చర్ కళాశాల అభివృద్ధికి ఆమోదం ఏళ్లతరబడి పెండింగ్‌లో ఉన్నా ఆకస్మికంగా నిర్ణయం ప్రపంచబ్యాంకు రుణ లింకు నిధులు వచ్చేదెప్పుడో? అమలు జరిగేదెప్పుడో? ప్రభుత్వ చిత్తశుద్ధిపై అనుమానాలు సాక్షి, మచిలీపట్నం : సమైక్య ఉద్యమంపై నీళ్లు చల్లేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. రాష్ట్ర విభజన ప్రకటనతో రగిలిపోతున్న జిల్లా వాసులను శాంతింపజేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్రపంచబ్యాంకు నుంచి అప్పుతెచ్చి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామంటూ ప్రతిపాదనలు చేసింది. కీలకమైన విమానాశ్రయం, పారిశ్రామిక రంగం అభివృద్ధి, ప్లానింగ్, ఆర్కిటెక్చర్ సంస్థ ఏర్పాటు తదితర వరాల జల్లు కురిపించింది. ఇందుకు శుక్రవారం హైదరాబాదులో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆమోదముద్ర వేసింది. రెండు నెలల విరామం తరువాత జరిగిన మంత్రివర్గ సమావేశం కేవలం ప్రపంచబ్యాంకు ఇచ్చే అప్పుపై ఆధారపడి అభివృద్ధి ప్రతిపాదనలు చేయడం శోచనీయం. రాష్ట్రంలో 2009-10లో వచ్చిన భారీ వరదలకు దెబ్బతిన్న రోడ్లు, మంచినీటి వనరులు, విద్యా సంస్థల అభివృద్ధికి ప్రపంచ బ్యాంకును అడిగిన వెయ్యి కోట్ల రూపాయల అప్పు వస్తే అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఈ ప్రతిపాదనలు చేయడం గమనార్హం. ఉద్యమ ప్రభావాన్ని తగ్గించేందుకే ఎత్తులు.. రాష్ట్ర విభజనకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్న తరుణంలో జిల్లాల్లో పారిశ్రామిక అభివృద్ధిపై హామీలు గుప్పిస్తే.. సమైక్య ఉద్యమ ప్రభావాన్ని తగ్గించవచ్చన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఎత్తులు వేసిందనే ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలోనే అత్యంత కీలకమైన గన్నవరం విమానాశ్రయం దశాబ్దాల కాలంగా అభివృద్ధికి నోచుకోలేదు. విజయవాడ నగరానికి అత్యంత చేరువలో ఉన్న గన్నవరం విమానాశ్రయం విస్తరణకు చేసిన ప్రతిపాదనలు ఏళ్ల తరబడి అడుగు ముందుకు పడలేదు. విమానాశ్రయాన్ని విస్తరించేందుకు అవసరమైన భూసేకరణకు గత రెండేళ్లుగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదు. ప్రస్తుతం దీని అభివృద్ధిపై మంత్రివర్గం హడావుడిగా ఆమోదముద్ర వేసింది. పారిశ్రామిక అభివృద్ధి విషయంలోనూ అదే పరిస్థితి. జిల్లాలో ఎన్నో ఏళ్లుగా కాగితాలకే పరిమితమైన ఈ రంగం అభివృద్ధికి హఠాత్తుగా గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం అందులో భాగమేనని పేర్కొంటున్నారు. జగ్గయ్యపేటకు సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న అటవీ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి కోసం ప్రభుత్వం 498 ఎకరాలను ఏపీఐఐసీకి అప్పగించేందుకు నిర్ణయించింది. జయంతిపురం గ్రామం గుంటూరు-కృష్ణా జిల్లాల సరిహద్దున ఉండటమే కాకుండా తెలంగాణలోని నల్గొండ జిల్లాకు కూడా ఇది సరిహద్దు గ్రామం కావడం గమనార్హం. పూర్తిగా అటవీ ప్రాంతం కావడంతో అక్కడ తండా(ఎస్టీ)లు నివాసం ఉంటున్నారు. అదే ప్రాంతంలో సుమారు 30 ఏళ్ల నుంచి మద్రాసు సిమెంట్స్ లిమిటెడ్ (ఎంసీఎల్) ఫ్యాక్టరీ, ఇటీవల మరో ఐరన్ ఓర్ ఫ్యాక్టరీ ఏర్పాటుచేశారు. అక్కడ యూరియా, పవర్‌ప్లాంట్ తదితర పరిశ్రమలు ఏర్పాటు చేయాలంటూ జిల్లాకు చెందిన నేతలు మూడేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేశారు. ఇప్పుడు దానిపై అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆర్కిటెక్చర్ కళాశాల ఏర్పాటుకు ఆమోదముద్ర విజయవాడ నగర సమీపంలో ప్లానింగ్, ఆర్కిటెక్చర్ కళాశాల ఏర్పాటుకు కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఇందుకు అవసరమైన స్థలాన్ని సేకరించి కేంద్ర ప్రభుత్వానికి అప్పగించేలా రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. పటమటలో ఈ కళాశాల ఏర్పాటుకు అవసరమైన స్థలం విషయంలో జిల్లా ఉన్నతాధికారులు ఆరు నెలల క్రితమే ప్రభుత్వానికి నివేదించగా, పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన 9.66 ఎకరాలు కేటాయించింది. మొత్తానికి సమైక్య సెగతో కకావికలమవుతున్న రాష్ట్ర ప్రభుత్వం సీమాంధ్రకు వరాల వర్షం కురిపించడం ద్వారా ఉద్యమ సెగ చల్లార్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో వేచిచూడాలి. -
పారిశ్రామిక రంగంలో రాష్ట్రానిది రెండో స్థానం
రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖామంత్రి గీతారెడ్డి సాక్షి, హైదరాబాద్: పారిశ్రామిక రంగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే రెండోస్థానంలో ఉందని రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్ జె. గీతారెడ్డి చెప్పారు. ఎస్సి, ఎస్టి ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ఇగ్నైట్ పేరుతో హైదరాబాద్‌లో బుధవారం జరిగిన 21రోజుల శిక్షణా తరగతుల ప్రారంభ కార్యక్రవుంలో గీతా రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైక్రో, స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ (నిమ్స్ మే)లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ పదేళ్ళ కిందట పరిశ్రమ రంగంలో ఏడో స్థానంలో ఉన్న రాష్ట్రం రెండోస్థానానికి ఎదగడం గర్వకారణమని, త్వరలోనే ప్రథమస్థానాన్ని కైవసం చేసుకుంటుందని అన్నారు. కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి జె.డీ. శీలం మాట్లాడుతూ పారిశ్రామిక రంగంలో పలువురికి ఉద్యోగాలు కల్పించేస్థాయికి దళితులు ఎదగాలన్నారు. రాష్ట్ర మంత్రులు డొక్కా మాణిక్య వరప్రసాద రావు, కొండ్రు మురళీ మోహన్, పసుపులేని బాలరాజు మాట్లాడారు. -
మహిళలకు నాయకత్వ లక్షణాలు అవసరం
మాదాపూర్, న్యూస్‌లైన్: మహిళలు పారిశ్రామిక రంగంలో రాణించాలంటే ప్రతి ఒక్కరూ నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలని కెనైటిక్ ఇంజినీరింగ్ లిమిటెడ్ వైస్ చైర్మన్ సులజ్జ చిరోబియా మోత్వానీ పేర్కొన్నారు. సోమవారం మాదాపూర్‌లోని ఓ హోటల్లో ఫిక్కీ మహిళా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ‘లీడర్షిప్ ఇన్ ఉమెన్’ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. మహిళా పారిశ్రామికవేత్తల సాధికారత కోసం ఏర్పాటు చేసిన సంస్థ వారికి పలు సలహాలు, సూచనలు అందిస్తుందన్నారు. ఫిక్కీ మహిళా ఆర్గనైజేషన్ చైర్మన్ జోత్స్నా అంగారా మాట్లాడుతూ మహిళలకు కావాల్సిన నాయకత్వ లక్షణాలు, పారిశ్రామిక రంగాల్లో ముందుకు దూసుకువెళ్లడానికి అవసరమైన సూచనలు అందిస్తామన్నారు.