Siddu Jonnalagadda
-
తేడాకొట్టిన 'జాక్'.. తొలిరోజు కలెక్షన్ ఇంత తక్కువా?
'టిల్లు' సినిమాలతో ఆకట్టుకున్న సిద్ధు.. తాజాగా థియేటర్లలోకి 'జాక్'గా వచ్చాడు. ట్రైలర్ రిలీజైన దగ్గర నుంచి దీనిపై పెద్దగా అంచనాలేం లేవు. అయినా సరే ఏదైనా మ్యాజిక్ జరుగుతుందేమోనని అనుకున్నారు. కానీ అలాంటిదేం లేదు. తొలిరోజు మిక్స్ డ్ రివ్యూస్ రాగా.. రెండో రోజుకి నెగిటివ్ టాక్ వచ్చేసింది. (ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 21 సినిమాలు) హైప్ లేకపోవడంతో తొలిరోజే పెద్దగా ఎవరూ థియేటర్లలోకి రాలేదు. సిద్ధు, 'బేబీ' వైష్ణవి చైతన్య ఉన్న ఉపయోగం లేకుండా పోయింది. కంటెంట్ మరీ తీసికట్టుగా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే మొదటిరోజు చాలా తక్కువ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.సిద్ధు గత సినిమా 'టిల్లు స్క్వేర్'కి రూ.23 కోట్ల వరకు తొలిరోజు వసూళ్లు రాగా.. 'జాక్' చిత్రానికి మాత్రం రూ.కోటిన్నర నుంచి రూ.2 కోట్ల కలెక్షన్స్ మాత్రమే వచ్చాయని అంటున్నారు. టాక్ ఇలానే ఉంటే గనక వీకెండ్ తర్వాత బాక్సాఫీస్ దగ్గర మూవీ నిలబడటం కష్టమే!(ఇదీ చదవండి: ఎట్టకేలకు క్షమాపణలు చెప్పిన యాంకర్ రవి) -
Jack Movie Review: ‘జాక్’ మూవీ హిట్టా? ఫట్టా?
డీజే టిల్లు, టిల్లు స్వ్కేర్ చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని ఫుల్ జోష్‌లో ఉన్నాడు స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ (siddhu jonnalagadda). హ్యాట్రిక్ హిట్ కోసం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘జాక్’తో నేడు(ఏప్రిల్ 10) ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి సిద్ధు ఖాతాలో హ్యాట్రిక్ హిట్ పడిందా లేదా రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. పాబ్లో నెరుడా అలియాస్ జాక్ (సిద్ధు జొన్నలగడ్డ) రా (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) ఏజెంట్ కావాలని కలలు కంటాడు. తనకున్న టాలెంట్ అంతా ఉపయోగించి ఇంటర్వ్యూ వరకు వెళ్తాడు. ఆ రిజల్ట్ రాకముందే ఖాలీగా ఉండడం ఎందుకని దేశాన్ని కాపాడేందుకు రంగంలోకి దిగుతాడు. ఉగ్రవాదులు, హైదారాబాద్‌తో పాటు భారత్‌లోని ఇతర ప్రధాన నగరాల్లో విధ్వంసం సృష్టించేందుకు ప్లాన్ చేస్తున్నారనే విషయం తెలుసుకొని వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తాడు. మరోవైపు జాక్ ఏం పని చేస్తున్నాడో కనుక్కోమని ప్రైవేట్ డిటెక్టివ్ అఫిషాన్ బేగం (వైష్ణవి చైతన్య)కు లక్ష రూపాయలు ఇస్తాడు అతని తండ్రి పాన్ ఇండియా ప్రసాద్(నరేశ్). అఫిషాన్ బేగం భానుమతి పేరుతో జాక్కి దగ్గరై జాక్ పనిపై నిఘా పెడుతుంది. టెర్రరిస్టులను పట్టుకునే క్రమంలో పొరపాటున ‘రా’ఏజెంట్ మనోజ్(ప్రకాశ్ రాజ్)ని కిడ్నాప్ చేస్తాడు జాక్. ఆ తర్వాత ఏం జరిగింది? టెర్రరిస్ట్ గ్యాంగ్‌ని జాక్ పట్టుకోగలిగాడా లేదా? అసలు జాక్ ‘రా’ ఏజెంట్ కావాలని ఎందుకు అనుకున్నాడు? చివరకు తను కోరుకున్న ఉద్యోగం పొందగలిగాడా లేదా? అనేదే తెలియాలంటే జాక్(Jack Movie Review) సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..ఒక శిలై ఉన్నానని భూమి కుంగునా?నేనొక శిల్పానని దైవం తుళ్లునా?మలిచిన శిల్పం, మలచని రాయి ఈ రెంటిలోన గొప్పది ..శిల్పమా? శిలా? ఏ జవాబు అందినా పోరు ఆగేదేనా..? రెండిటి మధ్యన..!.. సినిమా ఎండింగ్లో బొమ్మరిల్లు భాస్కర్ చెప్పిన ‘రాయి – శిల్పం’ థియరీ ఇది. ఇందులో నిజంగానే ఏది గొప్పదో చెప్పలేం కానీ ఈ సినిమా విషయంలో మాత్రం శిల్పి(దర్శకుడు) లోపం చాలానే ఉంది. మంచి రాయి( హీరో) ఉన్నప్పటికీ దాన్ని అందమైన శిల్పంగా మార్చడంలో తడబడ్డాడు. బొమ్మరిల్లు భాస్కర్ తన స్టైల్ కథను పక్కకు పెట్టి తీసిన సినిమా ఇది. ఇంట్రెస్టింగ్ పాయింట్ రాసుకున్నాడు. హీరో పాత్రను కూడా ఆసక్తికరంగానే తీర్చిదిద్దాదు. కానీ కథనం విషయంలో జాగ్రత్త పడలేదు. దేశానికి ముందుడి ప్రమాదం రాకుండా ఆపేదే ‘రా’ అంటూ ‘రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్’ గురించి గొప్పగా చెప్పిన భాస్కర్.. కథలో మాత్రం ‘రా’ ఏజెంట్లను కమెడియన్ల కంటే తక్కువ చేసి చూపించారు. ‘రా’ , ఉగ్రవాదం ..ఇలాంటి కథలను సీరియస్‌గా చెప్తేనే ఆసక్తికరంగా ఉంటుంది. కానీ భాస్కర్ సీరియస్ సబ్జెక్ట్ ఎంచుకొని దానికి కామెడీ టచ్ ఇచ్చాడు. ఇది పూర్తిగా సఫలం కాలేదు. మదర్ సెంటిమెంట్ ఉన్నప్పటికీ.. దాన్ని పూర్తిగా వాడుకోలేకపోయాడు.‘వీడు కొంచెం క్రాక్’ అని సినిమాకు పెట్టిన ట్యాగ్‌లైన్‌కు తగ్గట్టుగానే హీరో క్యారెక్టర్ని మలిచాడు. ఫస్టాఫ్ అంతా ఫన్వేలో నడుస్తుంది. ఉగ్రవాదులను పట్టుకునేందుకు హీరో చేసే ప్రయత్నం క్రాక్గానే అనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో బలమైన సన్నివేశాలు లేనప్పటికీ స్క్రీన్‌ప్లేతో నెట్టుకొచ్చాడు. ఇంటర్వెల్ సీన్ అయితే మరీ సిల్లీగా అనిపిస్తుంది. ఇక సెకండాఫ్‌లో కథనం కాస్త ఆసక్తికరంగా సాగుతుంది. నేపాల్ ఎపిసోడ్ కొంతమేర ఆకట్టుకున్నా.. టెర్రరిస్టులతో జరిగే యాక్షన్ డ్రామా రక్తి కట్టించదు. బలమైన కథ లేకపోవడంతో ముగింపు కూడా రొటీన్‌గానే ఉంటుంది. బొమ్మరిల్లు భాస్కర్ ఈ శిల్పాన్ని మరింత అందంగా చెక్కాల్సింది.ఎవరెలా చేశారంటే..డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ చిత్రాలతో యూత్‌ని ఆకట్టుకున్న సిద్ధు..మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. కొంచెం క్రాక్ ఉన్న జాక్ పాత్రకు న్యాయం చేశాడు. తెరపై స్టైలీష్‌గా కనిపించాడు. క్లైమాక్స్‌లో ఫైట్ కూడా చేశాడు. అయితే జాక్ మాటలు, బిహేవియర్ చూస్తే ‘టిల్లు’ వద్దన్నా గుర్తుకు వస్తాడు. వైష్ణవి చైతన్య కు స్క్రీన్ స్పేస్ ఎక్కువే ఉన్నప్పటికీ ఆమె పాత్రకు అంతగా ప్రాధాన్యత ఉండదు. నటన పరంగాను మెప్పించడానికి అక్కడ స్కోపే లేదు. ఏదో హీరోయిన్ ఉండాలి కాబట్టి ఆ క్యారెక్టర్ని డిజైన్ చేశారు. ‘రా’ ఏజెంట్ మనోజ్‌గా ప్రకాశ్ రాజ్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. అయితే ఆయన పాత్రను అటు సీరియస్‌గాను..ఇటు పూర్తి కమెడియన్‌గాను మల్చలేక రెండింటికి మధ్య ఊగిసలాడేలా తీర్చిదిద్దారు. సుబ్బరాజు పాత్ర కూడా అంతే. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. పాటలు అంతగా గుర్తుపెట్టుకునేలా ఉండవు కానీ నేపథ్య సంగీతం ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు బాగా పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
‘జాక్’ట్విటర్ రివ్యూ: ‘టిల్లుగాడి’ సినిమాకు ఊహించని టాక్!
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన తాజా చిత్రం ‘జాక్’. ‘బొమ్మరిల్లు’ ఫేమ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ‘బేబీ’బ్యూటీ వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించింది. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం నేడు(ఏప్రిల్ 10) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, పాటలకు మంచి స్పందన వచ్చింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘జాక్’పై భారీ హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రానికి ఎక్స్(ట్విటర్)లో మిక్స్డ్ టాక్ వస్తోంది. సినిమా చూసిన నెటిజన్స్.. తమ అభిప్రాయాన్ని ఎక్స్‌లో తెలియజేస్తూ.. యావరేజ్ సినిమా అంటున్నారు. మరికొంతమంది అయితే సిద్ధు ఖాతాలో తొలిసారి డిజాస్టర్ పడిందని చెబుతున్నారు. ఇంకొంత మంది సినిమా బాగుంది. బ్లాక్ బస్టర్ హిట్ అని చెబుతున్నారు. నెటిజన్ల అభిప్రాయాలపై ఓ లుక్కేయండి. #Jack Only for Siddu!!Just some comedy scenes and Siddu role, Nothing worked in film. Siddu dialogues, Comedy timing, Action helped film atleast for a One time watch. Stroy, Screenplay, Music, Songs, BGM, cinematography Everything 👎Only for Siddu Character and Some One…— tolly_wood_UK_US_Europe (@tolly_UK_US_EU) April 10, 2025 ‘జాక్ సినిమా కేవలం సిద్ధుదే. కొన్ని కామెడీ సీన్లు, సిద్ధు క్యారెక్టర్ తప్ప మిగతావేవి ఆకట్టుకోలేవు. సిద్ధు డైలాగ్స్, కామెడీ టైమింగ్ సినిమాకు ప్లస్ అయ్యాయి. కథ, స్క్రీన్‌ప్లే, మ్యూజిక్, పాటలు, బీజీఎం, సినిమాటోగ్రఫీ..ఏది కూడా అంతగా ఆకట్టుకోలేకపోయాయి’ అంటూ ఓ నెటిజన్ 2 రేటింగ్ ఇచ్చాడు.#JACK - Half baked story which lacks connectivityRAW ni Royal ga chupinchali ila Rotha kadhu 🙏😭Prathi sari one liners tho cinema workout avvadhu Ani Inka yeppatiki ardam avvudho emo 🥱Intha cheppinaka kuda Theatre lo chusta ante velli ma laga Bugga avvandi #Tollywood pic.twitter.com/JX8h1lCMXD— 𝑺𝒖𝒋𝒆𝒆𝒗.𝑮 (@sujeev_Nani) April 9, 2025 జాక్ సగం వండి వదిలేసిన అన్నంలా ఉది. ఏ చోట కూడా కనెక్టివిటీ ఉండదు. ‘రా'ని రాయల్‌గా చూపించాలి కానీ ఇలా రోతలా కాదు. ప్రతిసారి వన్‌లైనర్‌తో సినిమా వర్కౌట్ అవ్వదని ఇంకా ఎప్పటికి అర్థం చేసుకుంటారో. ఇంత చెప్పినా కూడా థియేటర్లో సినిమా చూస్తా అంటే మీ ఇష్టం అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు.Bhaskar’s attempt at a commercial mix fails due to weak writing and a messy screenplay. Siddhu tries hard, but dull scenes and flat dialogues drag him down. The spy plot is bland, comedy rarely clicks, music is forgettable, and poor visuals make it hard to sit through. #jack pic.twitter.com/jcIDJYqxdj— Dingu420 (@dingu420) April 10, 2025 భాస్కర్ తొలిసారి ప్రయత్నించిన కమర్షియల్ మిక్స్ వీక్ రైటింగ్, స్క్రీన్‌ప్లే కారణంగా ఫెయిల్ అయింది. సిద్దు హార్డ్ వర్క్ చేశాడు కానీ బలమైన సన్నివేశాలు లేకపోవడం కారణంగా అతని పాత్ర కూడా ఆకట్టుకోలేకపోయింది. కామెడీ కొన్ని చోట్ల పర్వాలేదు. మ్యూజిక్ గురించి మర్చిపోవాలి. విజువల్స్ కూడా పూర్‌గా ఉన్నాయని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.#Jack is a spy action comedy that disappoints big time as both the spy portions and comedy fail to deliver for the most part. Director Bhaskar tried to pack all commercial aspects in this film but none of them could make a solid impact because of the clumsy screenplay and weak…— Venky Reviews (@venkyreviews) April 9, 2025 జాక్ అనేది ఓ స్పై కామెడీ యాక్షన్ మూవీ. కానీ అందులో స్పై మూమెంట్స్ కానీ కామెడీ కానీ వర్కౌట్ కాలేదు.బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాలో అన్ని కమర్షియల్ అంశాల్ని పొందుపర్చాలనుకున్నాడు. కానీ అందులో ఏ ఒక్క అంశం కూడా జనాలకు కనెక్ట్ అయ్యేలా లేదు.గందరగోళంగా నడిచే స్క్రీన్ ప్లే.. వీక్ రైటింగ్‌తో బోరింగ్ అనిపిస్తుంది అని ఇంకో నెటిజన్ ట్వీట్ చూస్తూ 2 రేటింగ్ ఇచ్చాడు.#Jack: StarBoy for a Reason? Not Quite!Rating: ⭐️⭐️Jack ends up being a major disappointment in the spy genre. Director Bhaskar seems lost between what he wrote and what he tried to direct. The film feels like a comic spoof of spy thrillers but falls flat with a boring and…— Chay Reviews (@chay_reviews) April 10, 2025It's mind-boggling to see movies like #Jack and #Spy just deliberately use the patriotism angle but execute it in an extremely poor way which ultimately looks/feels like they're demeaning or humiliating our army, police, the RAW and the Indian Government 😥— LoneBatman (@SampathGNV) April 10, 2025#JackReview:Heavily banks on Siddhu’s performance and a quirky lead character. While the theme is decent, the execution falls flat. Filled with illogical scenes, weak action, poor cinematography, cheap VFX and forgettable songs, it ends up as a half baked— Adesh Neradi (@AdeshNerad31345) April 9, 2025Show completed:- #jack My rating 2.25/5Half baked Raw movie Illogical scenes in 2nd half pic.twitter.com/1Xq7al7OoY— venkatesh kilaru (@kilaru_venki) April 9, 2025 -
సినిమాకు అతను చాలా ముఖ్యం.. లేకపోతే కాళ్లు, చేతులు ఆడవు: సిద్ధు జొన్నలగడ్డ
టిల్లు స్క్వేర్ తర్వాత టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించిన తాజా చిత్రం జాక్. ఈ మూవీకి బొమ్మిరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 10న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లలో భాగంగా హైదరాబాద్‌లో జాక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు.ఈ ఈవెంట్‌కు హాజరైన హీరో సిద్ధు జొన్నలగడ్డ ఆసక్తికర కామెంట్స్ చేశారు. మన సినీ ఇండస్ట్రీలో ఎడిటర్ గురించి ఎవరూ మాట్లాడరని అన్నారు. టిల్లు స్క్వేర్, తండేల్, మ్యాడ్ స్క్వేర్ హిట్ అయ్యాయంటే ఎడిటర్ నవీన్ నూలి మాత్రమే కారణమన్నారు. కానీ సినిమాకు ఎడిటర్ అనేవారు చాలా ముఖ్యం.. ఆయన లేకపోతే దర్శకుడికి కాళ్లు, చేతులు ఆడవని సిద్ధు అన్నారు. మనం చాలా తక్కువగా ఎడిటర్ గురించి మట్లాడతాం.. కానీ వారే సినిమాకు చాలా ప్రధానమని ఆయన తెలిపారు. మా జాక్ సినిమాకు నవీన్ నూలినే ఎడిటర్.. ఆయనతో కలిసి పనిచేయడం చాలా హ్యాపీగా ఉందన్నారు.అలాగే రానా ముఖ్య అతిథిగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరు కాకపోవడంపై కూడా సిద్ధు స్పందించారు. రానా ప్రస్తుతం ముంబయిలో ఉన్నారని తెలిపారు. రానా నాయుడు సీజన్-2 డబ్బింగ్‌తో బిజీగా ఉన్నారని సిద్ధు వెల్లడించారు. సాయంత్రం ఐదున్నరకు రావాల్సిన విమానం మిస్ కావడంతోనే రానా రాలేకపోయారని సిద్ధు క్లారిటీ ఇచ్చారు. -
‘జాక్’ మూవీ ప్రీరిజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
మా సినిమాలో వైష్ణవిని చాలా బ్యాడ్‌గా చూపిస్తాం: నిర్మాత నాగవంశీ కామెంట్స్
సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన తాజా చిత్రం జాక్. ఈ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్(Bommarillu Bhaskar) దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం థియేటర్లలో సందడి చేసేందుకు వస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్, బాపినీడు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న విడుదల కానుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.ఈ ఈవెంట్‌కు హాజరైన టాలీవుడ్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. జాక్ మూవీలో నటిస్తోన్న హీరోయిన్ను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సినిమాలో చాలా పద్ధతిగా వైష్ణవిని చూస్తారని ఆయన అన్నారు. ఆ తర్వాత మా ప్రాజెక్ట్‌లో తాను నటించబోతోందని వెల్లడించారు. అయితే మా సినిమాలో మాత్రం చాలా మాస్‌గా చూపిస్తామని తెలిపారు. చివరిసారిగా వైష్ణవిని ఈ సినిమాలో పద్ధతిగా చూడమని సలహా ఇచ్చారు. మా సినిమాలో అన్ని మోడరన్ బూతులే ఉంటాయని నాగవంశీ వ్యాఖ్యలు చేశారు. -
జాక్ ట్రైలర్లో బూతులు.. సెన్సార్ ఏ సర్టిఫికేట్ ఇచ్చిందంటే?
టాలీవుడ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda), బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య జంటగా నటించిన తాజా చిత్రం జాక్. ఈ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్(Bommarillu Bhaskar) దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం థియేటర్లలో సందడి చేసేందుకు వస్తోంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్, బాపినీడు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న విడుదల కానుంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.తాజాగా జాక్ మూవీ సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ వచ్చినట్లు చిత్ర నిర్మాణ సంస్థ వెల్లడించింది. అయితే ట్రైలర్లో ఎక్కువగా బూతులు వినియోగించడంతో సెన్సార్ విషయంలో ఇబ్బందులు రావొచ్చని ఊహించారు. కానీ ఎలాంటి కట్స్ లేకుండానే సెన్సార్ పూర్తియినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో వైష్ణవి చైతన్య తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తుండటం విశేషం. The equation is set 😎The chaos is calculated 🤟🏻#JACK certified 𝐔/𝐀 Rounding off the entertainment in the most explosive way ❤️🔥Bookings are now open 🎟️ https://t.co/6uRbOx5ekl#JackOnApril10th#SidduJonnalagadda @iamvaishnavi04 @baskifilmz @Prakashraaj #AchuRajamani… pic.twitter.com/9DbOmDuqb3— SVCC (@SVCCofficial) April 7, 2025 -
'జాక్' సినిమాకు 'వరుణ్ తేజ్' సినిమా నష్టాల దెబ్బ
టాలీవుడ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) 'జాక్' సినిమా ఏప్రిల్ 10న విడుదల కానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. తాజాగా విడుదలైన ట్రైలర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. సోషల్‌మీడియాలో సిద్ధూ డైలాగ్స్ బాగానే వైరల్ అవుతున్నాయి. అయితే, సినిమా థియేటర్స్‌లో చూద్దామని ఆశగా ఉన్న ప్రేక్షకులకు నిరాశ ఎదురుకానుంది అంటూ నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్, బాపినీడు నిర్మించిన ఈ చిత్రాన్ని బొమ్మరిల్లు భాస్కర్(Bommarillu Bhaskar) దర్శకత్వం వహించారు. ఇందులో వైష్ణవి చైతన్య తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తుండటం విశేషం.జాక్‌కు 'గాండీవధారి అర్జున' చిక్కులు2023లో విడుదలైన వరుణ్ తేజ్'గాండీవధారి అర్జున'(Gandeevadhari Arjuna) చిత్రాన్ని నిర్మించిన బీవీఎస్ఎన్ ప్రసాద్‌నే ఇప్పుడు జాక్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అప్పుడు ఆ చిత్రం పెద్ద డిజాస్టర్ కావడంతో చాలామంది నష్టపోయారు. ముఖ్యంగా గోదావరి ప్రాంత డిస్ట్రిబ్యూటర్లు న్యాయం చేయాలంటూ ఫిలిం ఛాంబర్లో ఫిర్యాదు చేశారట. గాండీవధారి అర్జున సినిమా విడుదల సమయంలో రికవరబుల్ అడ్వాన్స్ కింద సినిమాను కొన్నామని, అందుకు సంబంధించిన ఆధారాలతో ఫిర్యాదు చేశారట. ఆ సినిమాతో తాము పూర్తిగా మునిగిపోయినట్లు చెప్పుకొచ్చారని సమాచారం. డీల్ ప్రకారం తమకు డబ్బులు వెనక్కివ్వలేదని తెలిపిన వారు.. ఆ సెటిల్మెంట్ జరిగే వరకు ‘జాక్’ సినిమాను విడుదల కానివ్వమని పెద్ద పంచాయితీ పెట్టినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు గాండీవధారి నష్టాలు జాక్‌ను అడ్డుకుంటున్నాయిని నెటిజన్లు తెలుపుతున్నారు.వరుణ్ తేజ్, సాక్షి వైద్య జంటగా 'గాండీవధారి అర్జున' చిత్రానికి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించారు. పూర్తిగా ఫారిన్ బ్యాక్ డ్రాప్లో సుమారు రూ. 50 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. అయితే, ప్రీరిలీజ్ బిజినెస్ కేవలం రూ. 17 కోట్లు మాత్రమే చేసింది. ఆపై బాక్సాఫీస్ వద్ద రూ. 4 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టినట్లు ఇండస్ట్రీ లెక్కలు చెబుతున్నాయి. దీంతో చాలామంది పంపిణీదారులు ఈ సినిమాతో నష్టపోయారని తెలుస్తోంది. -
జాక్ ట్రైలర్ బీభత్సం..
-
ట్రైలర్లో ఎక్కువగా బూతులు.. అందుకే వాడాల్సి వచ్చింది: సిద్ధు జొన్నలగడ్డ
డీజే టిల్లుతో ఒక్కసారిగా స్టార్‌గా మారిన టాలీవుడ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ. గతేడాది టిల్లు స్క్వేర్తో మరో అభిమానులను మెప్పించిన సిద్ధు సినిమాతో అలరించేందుకు రెడీ అయిపోయాడు. సిద్ధు- బొమ్మరిల్లు భాస్కర్ కాంబోలో వస్తోన్న సరికొత్త యాక్షన్ మూవీ జాక్. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో హీరో సిద్ధు మాట్లాడారు. మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. అయితే జాక్ ట్రైలర్లో ఎక్కువగా బూతు పదాలు ఉపయోగించడంపై సిద్ధును ప్రశ్నించారు.అవును.. బూతులు వాడాం.. కానీ అక్కడ సీన్‌కు తగినట్లుగానే పెట్టాల్సి వచ్చిందని సిద్ధు అన్నారు. ఈ విషయంలో హీరో క్యారెక్టర్‌కు.. ఆ సమయంలో ఎమోషన్‌కి ఆ డైలాగ్స్ పెట్టామని తెలిపారు. పీక్ క్లైమాక్స్ కావడంతో ఆ ఎమోషన్‌కు అది కరెక్ట్ అని అలా చేసినట్లు సిద్ధు వెల్లడించారు. అలాగే మీ మూవీ సెన్సార్ పూర్తయిందా? అని ప్రశ్నించగా.. ఆ విషయం తనకు ఇంకా తెలియదని బదులిచ్చారు.కాగా.. ఈ చిత్రంలో సిద్ధు సరసన బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్, బాపినీడు నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 10న థియేటర్లలో సందడి చేయనుంది. -
'జాక్' నుంచి బ్లాక్‌బస్టర్ ట్రైలర్.. సిద్ధూ ఇరగదీశాడు
టాలీవుడ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) కొత్త సినిమా 'జాక్' (Jack) ట్రైలర్ వచ్చేసింది. ఇందులో వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya) జంటగా నటిస్తుంది. తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తుంటే ప్రేక్షకులకు డబుల్ ధమాకానే అనిపించేలా ఉంది. బొమ్మరిల్లు భాస్కర్(Bommarillu Bhaskar) దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్, బాపినీడు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న విడుదల కానుంది. ప్రకాశ్ రాజ్ వాయిస్‌తో ప్రారంభమైన ‘జాక్’ ట్రైలర్‌ను చూస్తే పూర్తి వినోదాత్మక చిత్రంలా ఉంది. ఇందులో వైష్ణవి చైతన్య తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తుండటం విశేషం. -
డబుల్ ధమాకా
ప్రేక్షకులకు డబుల్ ధమాకా ఇవ్వనున్నారు హీరోయిన్ వైష్ణవీ చైతన్య. ఆమె నటిస్తున్న తాజా చిత్రం ‘జాక్’లో ఆమె తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తుండటం విశేషం. తెలుగమ్మాయి అయిన వైష్ణవీ చైతన్య కెరీర్ ప్రారంభంలో ‘లవ్ ఇన్ 143 అవర్స్’, ‘ది సాఫ్ట్వేర్ డెవలపర్’, ‘అరెరే మానస’, ‘మిస్సమ్మ’ వంటి షార్ట్ ఫిల్మ్స్ చేశారు.ఆ తర్వాత ‘అల వైకుంఠపురములో’, ‘వరుడు కావలెను’ చిత్రాల్లో అతిథి పాత్రల్లో నటించిన ఆమె ‘బేబీ’(2023) మూవీతో హీరోయిన్గా మారారు. సాయి రాజేశ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలిచి, రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీతో ఆడియన్స్ లో బోలెడంత క్రేజ్ సొంతం చేసుకున్న వైష్ణవీ చైతన్య ఆ తర్వాత వరుస అవకాశాలతో దూసుకెళుతున్నారు. తాజాగా సిద్ధు జొన్నలగడ్డకి జోడీగా ఆమె నటిస్తున్న చిత్రం ‘జాక్’. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్, బాపినీడు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న విడుదల కానుంది. ఈ మూవీలో ఆమె ఫస్ట్ టైమ్ ద్విపాత్రాభినయం చేశారు. అదేవిధంగా ‘90 ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ వెబ్ సిరీస్‌కి సీక్వెల్‌గా రూపొందుతున్న సినిమాలో ఆనంద్ దేవరకొండకి జోడీగా నటిస్తున్నారు వైష్ణవి. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. -
ముద్దు పెట్టుకోవడానికి నాకంటూ ప్లేస్ లేదా.. పదా అంటూ 'జాక్' సాంగ్
సిద్ధు జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda) , ‘బేబీ’ ఫేమ్ వైష్ణవీ చైతన్య( Vaishnavi Chaitanya) జంటగా నటిస్తున్న చిత్రం ‘జాక్’. ‘కొంచెం క్రాక్’ అనేది ఈ మూవీ ఉపశీర్షిక. తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. బీవీఎస్‌ఎన్స్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కానుంది. ఇంతటి భాగ్యనగరంలో ముద్దు పెట్టుకునేందుకు మనకు ప్లేస్ లేకపోవడమా అంటూ సిద్ధు చెప్పిన డైలాగ్‌తో సాంగ్ మొదలౌతుంది. ఈ ఫన్స్ రైడర్ మూవీలో ప్రకాష్‌రాజ్, నరేష్, బ్రహ్మాజీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు అచ్చు రాజమణి సంగీతం అందిస్తున్నారు. -
టిల్లు క్యూబ్ లో డోస్ పెంచనున్న సిద్దూ
-
రామ్‌చరణ్‌తో పోటీపడేంతవాడివా సిద్ధూ...
సిద్ధు జొన్నలగడ్డ చిన్నస్థాయి నుంచి సినీ పరిశ్రమలో స్టార్ బాయ్‌గా ఎదగడం సినీ పరిశ్రమలోని ఔత్సాహిక నటీనటులకు పెద్ద ప్రేరణ. ఇప్పుడు ఏకంగా స్టార్ హీరో హోదా సాధించాడు. అయితే ఇదేమీ అలవోకగా సాధించేసింది కాదు. దాదాపుగా దశాబ్ధంన్నర పాటు పడిన కష్టం దీని వెనుక ఉంది. సీనియర్ హీరో రవితేజలాగా అత్యంత చిన్న స్థాయి పాత్రలు వేస్తూ పెద్ద స్టార్‌గా ఎదిగిన వర్ధమాన హీరోల్లో సిద్ధూ ముందు వరుసలో ఉంటాడు.డీజే టిల్లు 1, 2 భాగాలు సిద్ధూని ఒకేసారి పెద్ద స్టార్‌గా మార్చేశాయి. అతని తదుపరి సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. సిద్ధు జొన్నలగడ్డ డిజె టిల్లు ద్వారా పూర్తిగా వన్‌మ్యాన్ షో చేశాడని చెప్పాలి. ఆ సినిమాలో వెరైటీ మాడ్యులేషన్‌తో యాక్షన్, కామెడీని పండించి సరికొత్త హీరోయిజాన్ని రుచి చూపించిన సిద్ధూ ఆ సినిమాకి కధారచయితగా కూడా వ్యవహరించడం విశేషం. జోష్ సినిమాలో చిన్నపాత్రతో మొదలైన సిద్ధూ జొన్నలగడ్డ కెరీర్ తర్వాత కూడా డాన్ శీను, భీమిలి కబడ్డి జట్టు..లాంటి పలు చిత్రాల్లో అలాంటి పాత్రలతోనే కొనసాగింది. ఆ తర్వాత ఈ యువ హీరో లైఫ్ బిఫోర్ వెడ్డింగ్‌లో తొలిసారిగా ప్రధాన పాత్రలో అరంగేట్రం చేసిన సిద్ధూ హీరోగా మారి గుంటూరు టాకీస్ వంటి ఎ సర్టిఫైడ్ చిత్రాల ద్వారా హిట్స్ దక్కించుకున్నాడు. అదే విధంగా తను నటించిన చిత్రాల్లో కృష్ణ అండ్ హిజ్ లీల సినిమా కోవిడ్ సమయంలో ధియేటర్లలో విడుదలకు నోచుకోలేక కేవలం ఓటీటీలో మాత్రమే విడుదలైంది.పెద్దలకు మాత్రమే అన్నట్టుగా రూపొందిన ఈ చిత్రం అప్పట్లో రొమాంటిక్ మూవీగా హిట్ టాక్ తెచ్చుకుంది కూడా. ఆ తర్వాత మారిన పరిణామాల్లో సిధ్దూకి డిజె టిల్లు తెచ్చిపెట్టిన క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేస్తే బాగుంటుందనుకున్నారు. యూత్‌లో సిధ్దూకి ఉన్న ఫాలోయింగ్‌ని దృష్టిలో ఉంచుకుని వాలెంటైన్స్ డే సందర్భంగా ధియేటర్లలో విడుదల చేసేశారు కూడా. ఇక్కడ గమనించాల్సిన విశేషం ఏమిటంటే అదే రోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ చిత్రం రీ రిలీజ్ కూడా ఉండడం.అప్పట్లో ఆరెంజ్ సినిమా కు విమర్శకుల ప్రశంసలు వచ్చినప్పటికీ కమర్షియల్‌గా ఫ్లాప్ చిత్రంగానే నిలిచింది. ఈ నేపధ్యంలో ఈ సినిమా రీ రిలీజ్ అదే రోజు సిద్ధూ జొన్నలగడ్డ సినిమా రీ రిలీజ్ ఉండడం సినీ వర్గాల్లో ఆసక్తి నింపాయి. మరో చెప్పుకోదగ్గ విశేషం... నాటి ఆరెంజ్ చిత్రంలో సిద్ధు జొన్నలగడ్డ సైతం సంతోష్ అనే చిన్న పాత్రలో నటించాడు. ఆ సినిమాలో హీరో రామ్ చరణ్‌కి పోటీగా హీరోయిన్ ని ప్రేమలో పడేలా చేసే ముగ్గురు అబ్బాయిల్లో ఒకడిగా చేశాడు. ఆసక్తికరంగా... సిద్ధూ ఆరెంజ్ చిత్రాన్ని రూపొందించిన బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలోనే తదుపరి జాక్ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ నేపధ్యంలో ఈ వారం ఆసక్తికరంగా, సిద్ధు ’ఇట్స్ కాంప్లికేటెడ్’ (కృష్ణ అండ్ అతని లీల) పేరుతో ఆరెంజ్‌కి పోటీగా విడుదలైంది. ఓ యువ హీరో సినిమా రీ రిలీజ్‌కు నోచుకోవడం కూడా ఇదే తొలిసారి అని చెప్పొచ్చు. అయితే ముందూ వెనుకా చూసుకోకుండా సిద్ధూ తన సినిమాని రామ్‌చరణ్ సినిమా రీ రిలీజ్ రోజునే విడుదల చేయడంతో ఇప్పుడు వీరిద్దరిని పోలుస్తూ కామెంట్ చేయడం మొదలైంది. మరోవైపు రీరిలీజ్‌లో సిద్ధూ చిత్రం పూర్తిగా చతికిలబడగా రామ్ చరణ్ ఆరెంజ్ అనూహ్యంగా భారీ కలెక్షన్లు సాధించింది.తెలుగు చిత్రసీమలో సిద్ధూ ఎదుగుదల ప్రశంసించదగ్గదే. స్థిరత్వం అంకితభావంతో సినీ పరిశ్రమలో ఒక నటుడి జీవితం ఎలా మారుతుందో చెప్పడానికి సిద్ధూ ఒక ఉదాహరణ. అయితే పెద్దగా అండదండలు లేని హీరోల స్టార్ డమ్ ఎప్పుడూ నిలకడగా ఉండడం తెలుగు చిత్రసీమలో సాధ్యం కాదని సిధ్దూ గుర్తించాలి. అన్ని రకాలుగా తమకన్నా పెద్ద హీరోలతో పోటీ పడే విషయంలో యువ హీరోలు కాస్త వివేకంతో వ్యవహరించాలని సినీ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. -
సిద్ధు జొన్నలగడ్డ ‘ఇట్స్ కాంప్లికేటెడ్’ చిత్రం ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
సోషల్ మీడియాలో రిక్వెస్ట్‌లు వచ్చేవి
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్, షాలినీ వడ్నికట్టి హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కృష్ణ అండ్ హిజ్ లీల’. రవికాంత్ పేరేపు దర్శకత్వంలో రానా దగ్గుబాటి, సంజయ్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం 2020లో డైరెక్ట్‌గా ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజైంది. కాగా ఈ సినిమాను ‘ఇట్స్ కాంప్లికేటెడ్’ టైటిల్‌తో ఈ 14న థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం విలేకరుల సమావేశంలో రానా మాట్లాడుతూ– ‘‘సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి ఎప్పుడూ రిక్వెస్ట్‌లు వచ్చేవి. ఒక రోజు సిద్ధు ఈ సినిమా గురించి చెప్పారు. ఈ సినిమా రిలీజ్‌కి వేలంటైన్స్ డే పర్ఫెక్ట్ టైమ్. నేను ఆడియన్స్‌కు డిఫరెంట్ కథలు చూపించేందుకు ఇష్టపడతాను. కథ ఎంత కొత్తగా ఉంది? ఆడియన్స్‌కు మనం ఏం చెబుతున్నాం? అనేది కూడా చూస్తాను’’ అని తెలిపారు. ‘‘థియేటర్స్‌లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూవీ ఇది. ఈ సినిమాను థియేటర్స్‌లో రిలీజ్ చేసి ఉంటే సిక్స్ టైమ్స్ ఎక్కువ వచ్చేది’’ అన్నారు సిద్ధు జొన్నలగడ్డ. ‘‘లాక్డౌన్ సమయంలో ఈ సినిమాను థియేటర్స్‌లో రిలీజ్ చేయడం కుదర్లేదు. ఈ సినిమాతో అందరూ రిలేట్ అవుతారు’’ అని పేర్కొన్నారు రవికాంత్. -
అందమైన ప్రేమకథ
‘డీజే టిల్లు, టిల్లు స్క్వేర్’ వంటి హిట్ చిత్రాల తర్వాత సిద్ధు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘తెలుసు కదా’(Telusu Kada). స్టైలిస్ట్ నీరజ కోన ఈ సినిమా ద్వారా డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. రాశీ ఖన్నా, శ్రీనిధీ శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో వైవా హర్ష కీ రోల్ చేస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.కాగా శుక్రవారం (ఫిబ్రవరి 7) సిద్ధు జొన్నలగడ్డ పుట్టినరోజు సందర్భంగా ‘తెలుసు కదా’ నుంచి న్యూ పోస్టర్స్ రిలీజ్ చేశారు. ఓ ఫొటోలో శ్రీనిధీ శెట్టితో, మరో ఫొటోలో రాశీ ఖన్నాతో కలిసి ఉన్నారు సిద్ధు. ఇద్దరు అమ్మాయిలతో హీరో అందమైన ప్రేమకథను ప్రజెంట్ చేస్తున్నాయి పోస్టర్స్.వినోదాల జాక్... సిద్ధు జొన్నలగడ్డ హీరోగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వినోదాత్మక చిత్రం ‘జాక్–కొంచెం క్రాక్’. ఇందులో వైష్ణవీ చైతన్య హీరోయిన్. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. సిద్ధు జొన్నలగడ్డ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల కానుంది. -
'మీ నాన్నకు తెలియనంత జాబ్ ఏం చేస్తున్నావ్?'.. ఆసక్తిగా టీజర్
టిల్లు హీరో సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) 'జాక్' (Jack)మూవీతో అభిమానులను అలరించనున్నారు. గతేడాది టిల్లు స్క్వేర్తో ఫ్యాన్స్‌ను మెప్పించిన సిద్ధు మరోసారి ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమయ్యారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తోన్న జాక్‌లో బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటిస్తోంది. ఇవాళ సిద్ధు పుట్టిన రోజు కావడంతో మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. తాజాగా జాక్ మూవీ టీజర్‌ను ఫ్యాన్స్‌కు పరిచయం చేశారు.టీజర్ చూస్తే తండ్రి, కుమారుల మధ్య జరిగే స్టోరీగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇందులో సన్నివేశాలు ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందించినట్లు అర్థమవుతోంది. బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య, సిద్ధు మధ్య వచ్చే డైలాగ్స్ ఫ్యాన్స్‌ను అలరించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్, బాపినీడు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, వీకే నరేశ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. #Jack Konchem Crack 😉But adento adagoddu - It’s confidential 🤫 Presenting an exhilarating character who will run a MASSIVE entertainment show 🔥— https://t.co/VWrugmWs2n#JackTeaser out now! #JackOnApril10th#SidduJonnalagadda @iamvaishnavi04 @baskifilmz @SVCCofficial… pic.twitter.com/gQYQjYSW4o— SVCC (@SVCCofficial) February 7, 2025 -
'ఇట్స్ కాంప్లికేటెడ్' ట్రైలర్ చూశారా..?
సిద్ధూ జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) హీరోగా నటించిన ‘కృష్ణ అండ్ హిజ్ లీలా’ (Krishna and His Leela) సినిమా ఫబ్రవరి 14న థియేటర్లో విడుదల కానుంది. దీంతో తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. కరోనా కారణంగా 2020లో ఆహా, నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా విడుదలైన ఈ చిత్రం యూత్‌ను బాగా ఆకట్టుకుంది. సుమారు ఐదేళ్ల తర్వాత 'ఇట్స్ కాంప్లికేటెడ్' పేరుతో బిగ్ స్క్రీన్‌పై ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.‘క్షణం’ సినిమాతో టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు రవికాంత్ పేరపు ఈ యూత్‌ఫుల్ చిత్రాన్ని తెరకెక్కించాడు. సురేష్ ప్రొడక్షన్స్, వయకామ్ 18, సంజయ్ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్, షాలినీ వందికట్టి హీరోయిన్లుగా నటించారు. హీరో రానా దగ్గుబాటి సోషల్‌మీడియా వేదికగా రీసెంట్గా ఈ సినిమా విడుదల చేస్తున్నట్లు ప్రకటిస్తూ ఒక ఫన్నీ వీడియో చేసిన విషయం తెలిసిందే. -
ఐదేళ్ల తర్వాత విడుదల కానున్న సిద్ధూ జొన్నలగడ్డ సినిమా
సిద్ధూ జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) హీరోగా నటించిన ‘కృష్ణ అండ్ హిజ్ లీలా’ (Krishna and His Leela) సినిమా ఫబ్రవరి 14న థియేటర్లో విడుదల కానుంది. కరోనా కారణంగా 2020లో ఆహా, నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా విడుదలైన ఈ చిత్రం యూత్‌ను బాగా ఆకట్టుకుంది. ‘క్షణం’ సినిమాతో టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు రవికాంత్ పేరపు ఈ యూత్‌ఫుల్ చిత్రాన్ని తెరకెక్కించాడు. సురేష్ ప్రొడక్షన్స్, వయకామ్ 18, సంజయ్ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్, షాలినీ వందికట్టి హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా విడుదల సమయంలో హీరో రానా దగ్గుబాటి సోషల్‌మీడియా వేదికగా ప్రమోషన్స్ చేశారు. ఇప్పుడు థియేటర్స్‌లో విడుదల సందర్భంగా ఆయన మరోసారి ఈ చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నారు. తన సోషల్‌మీడియాలో ఒక ఫన్నీ వీడియోతో సినిమా విడుదల తేదీని ప్రకటించారు. అయితే, ఈసారి 'ఇట్స్ కాంప్లికేటెడ్' పేరుతో ఫిబ్రవరి 14 ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. Title endhuk marchamo adagakandi, It’s complicated anthe! Unexpected drama tho final ga theatres lo release avthundi ee Feb 14th ki. Catch us with your loved ones! Or two’s 😉#ItsComplicated #Starboy #FinallyIntheatres#SiddhuJonnalagadda @RanaDaggubati @ShraddhaSrinath… pic.twitter.com/vBOemAKPqD— Rana Daggubati (@RanaDaggubati) February 3, 2025 -
యంగ్ హీరోస్.. స్టార్ టైటిల్స్
-
థియేటర్లలో రిలీజ్‌కు ముందే ఓటీటీ ఫిక్స్.. ఆ టాలీవుడ్ సినిమాలివే!
సినీ ఇండస్ట్రీలో ఇప్పుడంతా ఓటీటీల హవానే నడుస్తోంది. దీంతో సినీ ప్రియులంతా కుటుంబంతో కలిసి మూవీ వీక్షించేందుకు సరికొత్త వేదికగా మారింది. ఈ నేపథ్యంలో కొత్త కొత్త చిత్రాలు ఓటీటీల్లో ఇప్పటికే సందడి చేస్తున్నాయి. అయితే ఈ రోజుల్లో కొన్ని థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఓటీటీకి వస్తే.. మరికొన్ని చిన్న చిత్రాలు డైరెక్ట్‌గా ఓటీటీలోనే విడుదల చేస్తున్నారు.అయితే ఈ సంక్రాంతి సందర్భంగా టాలీవుడ్ సినిమాలు రిలీజ్‌కు ముందే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ను ఫిక్స్ చేసుకున్నాయి. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ప్లిక్స్ వెల్లడించింది. ఇంతకీ ఆ సినిమాలేవో మీరు ఓ లుక్కేయండి.గతంలో విడుదలైన మ్యాడ్ మూవీ సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మూవీకి సీక్వెల్‌గా మ్యాడ్ స్క్వేర్ కూడా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా థియేటర్లో ఇంకా విడుదల కాలేదు. రిలీజ్ తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లోనే స్ట్రీమింగ్ కానుంది. సంక్రాంతి సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు.దీంతో పాటు డీజే టిల్లు ఫేమ్ హీరో సిద్ధు జొన్నల గడ్డ నటిస్తోన్న తాజా చిత్రం జాక్. ఈ సినిమా కూడా నెట్‌ఫ్లిక్స్‌లోనే స్ట్రీమింగ్ కానుందని పోస్టర్ రిలీజ్ చేశారు. మరో టాలీవుడ్ హీరో ప్రియదర్శి పులికొండ నటిస్తోన్న కోర్టు మూవీ కూడా ఈ ఓటీటీలోనే రానుంది. అలాగే రవితేజ హీరోగా వస్తున్న మాస్ జాతర, నవీన్ పొలిశెట్టి హీరోగా వస్తోన్న అనగనగా ఒక రాజు, పవన్ కల్యాణ్ ఓజీ చిత్రాల హక్కులను కూడా నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. పొంగల్ కానుకగా ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ రివీల్ చేసింది.Brace yourself for a mass jathara from the one and only Mass Maharaja! Mass Jathara, coming to Netflix in Telugu, Tamil, Malayalam & Kannada, after its theatrical release! #NetflixPandaga pic.twitter.com/zUpUbt2SdV— Netflix India South (@Netflix_INSouth) January 14, 2025 Grab your gold, the King is getting married! 🤭 Anaganaga Oka Raju, coming to Netflix, in Telugu, Tamil, Malayalam & Kannada, after its theatrical release! #NetflixPandaga pic.twitter.com/fewgneVXv8— Netflix India South (@Netflix_INSouth) January 14, 2025 The truth is on trial, and one lawyer is determined to prove it. ⚖️ Court: State vs A Nobody, coming to Netflix, in Telugu, Tamil, Kannada, Malayalam & Hindi, after its theatrical release! #NetflixPandaga pic.twitter.com/HzHtBdITgc— Netflix India South (@Netflix_INSouth) January 14, 2025 No plan, no limits, only guts 💥 Jack, coming to Netflix in Telugu, Tamil, Malayalam, Kannada & Hindi, after its theatrical release! #NetflixPandaga pic.twitter.com/90hJsZEYKd— Netflix India South (@Netflix_INSouth) January 14, 2025The boys are back with double the MADness! 🔥 Mad Square, coming to Netflix, in Telugu, Tamil, Kannada, Malayalam & Hindi, after its theatrical release! #NetflixPandaga pic.twitter.com/vW4nedPEsB— Netflix India South (@Netflix_INSouth) January 14, 2025 -
కొంచెం క్రాక్
‘డీజే టిల్లు, టిల్లు స్క్వేర్’ వంటి హిట్ చిత్రాల తర్వాత సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘జాక్ – కొంచెం క్రాక్’. ‘బొమ్మరిల్లు’ మూవీ ఫేమ్ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ‘బేబి’ మూవీ ఫేమ్ వైష్ణవీ చైతన్య హీరోయిన్గా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 10న విడుదల కానుంది. కాగా నూతన సంవత్సరం సందర్భంగా ఈ చిత్రం కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ‘‘సరికొత్త జోనర్లో ‘జాక్– కొంచెం క్రాక్’ మూవీ రూపొందుతోంది. ఫన్ రైడర్‌లా అందర్నీ మెప్పించే కథాంశంతో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. క్రాక్గాడిగా కనిపించే జాక్ పాత్రలో సిద్ధు జొన్నలగడ్డ ప్రేక్షకులను మెప్పించటం ఖాయం. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: అచ్చు రాజమణి. -
ఏప్రిల్‌లో జాక్
వేసవిలో థియేటర్స్‌కు రానున్నాడు జాక్. ‘డీజే టిల్లు’ ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ టైటిల్ రోల్లో నటిస్తున్న సినిమా ‘జాక్’. ‘కొంచెం క్రాక్’ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్ . ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ‘బేబీ’ ఫేమ్ వైష్ణవీ చైతన్య హీరోయిన్ గా నటిస్తున్నారు.శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ 80శాతంపైనే పూర్తయింది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లుగా వెల్లడించి, కొత్త పోస్టర్స్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘జాక్’ పూర్తి వినోదాత్మక చిత్రం. సిద్ధు పాత్ర అలరించేలా ఉంటుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: అచ్చు రాజమణి. -
ప్రభాస్ 'రాజాసాబ్' రిలీజ్ వాయిదా పడ్డట్లే
లెక్క ప్రకారం ప్రభాస్ 'రాజాసాబ్' సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ కావాలి. కానీ గత కొన్నిరోజుల నుంచి వాయిదా అని రూమర్స్ వస్తూనే ఉన్నాయి. అధికారికంగా ఏం చెప్పలేదు గానీ దాదాపు వాయిదా పడ్డట్లే. ఎందుకంటే యంగ్ హీరో సిద్ధు జొన్నల్లగడ్డ.. అదే తేదీకి తన కొత్త సినిమాని తీసుకొస్తున్నట్లు ప్రకటించడంతో ఈ క్లారిటీ వచ్చేసింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన సత్యదేవ్ కొత్త సినిమా)'టిల్లు' సినిమాలతో ఫేమస్ అయిన సిద్ధు.. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో 'జాక్' మూవీ చేస్తున్నాడు. 'బేబి' వైష్ణవి చైతన్య హీరోయిన్. షూటింగ్ చివరి దశలో ఉంది. ఇప్పుడు హఠాత్తుగా ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. 'రాజాసాబ్' వాయిదా గురించి వీళ్లకు క్లారిటీ ఉన్నట్లు ఉంది. అందుకే అంత కచ్చితంగా అదే డేట్ వేశారు.'రాజాసాబ్' వాయిదాకు ప్రబాస్ గాయమే ప్రధాన కారణమని తెలుస్తోంది. రెండు రోజుల క్రితం చీలమండ బెణికిందని న్యూస్ వచ్చింది. దీనికి సర్జరీ చేయించుకునేందుకు త్వరలో ఇటలీ వెళ్తున్నాడని, జనవరి చివరి వారంలో ప్రభాస్ తిరిగి స్వదేశానికి వస్తాడని తెలుస్తోంది. ఇది కూడా వాయిదాకు మరో కారణమని అంటున్నారు. (ఇదీ చదవండి: రూ.10 టికెట్లో కూర్చుని 'పుష్ప 2' చూశా: నటి సంయుక్త) -
మహారాష్ట్రలో తెలుసు కదా
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న చిత్రం ‘తెలుసు కదా’. ఈ చిత్రంలో రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లు. స్టైలిస్ట్ నీరజ కోన ఈ సినిమాతో దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు.కాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ మహారాష్ట్రలో ప్రారంభమైంది. 24 రోజుల పాటు జరగనున్న ఈ షెడ్యూల్లో సిద్ధు జొన్నలగడ్డ, శ్రీనిధి శెట్టి పాల్గొనగా ఓ పాట, ప్రధాన తారాగణంపై కొంత టాకీ పార్టు చిత్రీకరిస్తారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీతం: తమన్. -
కో కో రెస్టారెంట్ : డింపుల్ హయతీ, హెబ్బా పటేల్ సందడి
ఫుడ్ హబ్‌గా పేరుగాంచిన భాగ్యనగరానికి మరో హాట్‌స్పాట్ వచ్చింది. ముంబైకి చెందిన ప్రఖ్యాత లగ్జరీ ఆసియా డైనింగ్ రెస్టారెంట్ ‘కోకో’ మన నగరంలో ప్రారంభమైంది. వినూత్న కాంటోనీస్, జపనీస్ వంటకాలు నగరవాసులను నోరూరించేందుకు సిద్ధమైంది. #KoKo Restaurant Launch in #Hyderabad #dimplehayati pic.twitter.com/XUyCPnmWMt— Dimple Hayathi (Parody) (@hayathidimple) November 11, 2024ప్రారంభోత్సవంలో డింపుల్ హయాతీ, హెబ్బా పటేల్, సిద్దు జొన్నలగడ్డ, ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు హాజరై సరికొత్త రుచులను ఆస్వాదించారు. -
పరశురామ్, సిద్ధు జొన్నలగడ్డ మూవీ ఫిక్స్..?
-
స్టైలిష్ లుక్‌లో తెలుసు కదా!
‘డీజే టిల్లు, ‘టిల్లు స్క్వేర్’ వంటి హిట్ సినిమాల తర్వాత సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘తెలుసు కదా’. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన ఈ మూవీతో డైరెక్టర్‌గా పరిచయమవుతున్నారు. రాశీ ఖన్నా, శ్రీనిధీ శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో వైవా హర్ష కీలక పాత్ర పోషిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. ‘‘తెలుసు కదా’ చిత్రంలో సరికొత్త స్టైలిష్ లుక్‌లో కనిపించనున్నారు సిద్ధు జొన్నలగడ్డ . హైదరాబాద్‌లో నెల పాటు జరిగిన మొదటి షెడ్యూల్ పూర్తయింది. ఈ షెడ్యూల్లో సిద్ధు, రాశీ ఖన్నా, శ్రీనిధి, వైవా హర్షలపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించాం. అలాగే సిద్ధు, రాశీ ఖన్నాపై ఓ పాట కూడా తెరకెక్కించాం. ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తయింది. ఈ అవుట్‌పుట్‌తో సంతోషంగా ఉన్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: జ్ఞానశేఖర్ బాబా. -
జూ. ఎన్టీఆర్ తర్వాత తెలుగు రాష్ట్రాలకు సాయం చేసిన స్టార్స్ వీరే
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇలాంటి విపత్తు సమయంలో ప్రజలకు సాయం చేసేందుకు టాలీవుడ్ చిత్రపరిశ్రమ నుంచి పలువురు ముందుకొస్తున్నారు. మొదట జూనియర్ ఎన్టీఆర్ రూ. 1 కోటి సాయం ప్రకటించిన తర్వాత ఒక్కొక్కరు తమ వంతుగా సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు.సిద్దూ జొన్నలగడ్డ సాయంటాలీవుడ్ యంగ్ హీరో సిద్దూ జొన్నలగడ్డ రెండు తెలుగు రాష్ట్రాలకు తన వంతుగా సాయం ప్రకటించారు. వరద బాధితులకు తన వంతుగా రూ. 30 లక్షలు ప్రకటించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు రూ. 15లక్షలు, తెలంగాణకు రూ.15 లక్షలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. తాను అందిస్తున్న డబ్బు కొంతమందికైనా ఏదో ఒకవిధంగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. భారీ వర్షాల వల్ల తెలుగు ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూస్తుంటే ఇలాంటి పరిస్థితి ఇంకెవ్వరికీ రాకూడదని ఆయన కోరారు.త్రివిక్రమ్, నాగవంశీ సాయంభారీ వర్షాల వల్ల నష్టపోయిన తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాతలు రాధాకృష్ణ, నాగవంశీ సాయం ప్రకటించారు. తమ సొంత నిర్మాణ సంస్థలైన హారిక అండ్ హాసిని క్రియేషన్స్, సితార ఎంటర్టైన్మెంట్స్ పేర్లతో రూ. 50 లక్షలు ప్రకటించారు. తెలంగాణకు రూ. 25లక్షలు, ఏపీకి రూ. 25 లక్షలు ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ విపత్తు వల్ల ఆస్తి, ప్రాణ నష్టాలు తమను ఎంతగానో కలచి వేశాయని వారు చెప్పుకొచ్చారు. బాధితులు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు ఒక నోట్ విడుదల చేశారు.ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ రెండు రాష్ట్రాలకు చెరో రూ. 50 లక్షలు ప్రకటించారు. ఆపై యంగ్ హీరో విశ్వక్ సేన్ కూడా రెండు రాష్ట్రాలకు కలిపి రూ.10 లక్షలు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.దర్శకుడు వెంకీ అట్లూరి కూడా'సార్', 'తొలిప్రేమ' సిినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ దర్శకుడు వెెంకీ అట్లూరి కూడా తన వంతు సాయం అందజేశాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి తలో రూ.5 లక్షలు విరాళమిచ్చినట్లు ప్రకటించాడు.మహేశ్ బాబు కోటి రూపాయల విరాళం..టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు వరద బాధితుల సాయం అందించేందుకు ముందుకొచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలకు రూ.50 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఆపదలో ఉన్న వారిని అదుకోవాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను మహేశ్ బాబు కోరారు.In light of the floods impacting both the Telugu states, I am pledging a donation of 50 lakhs each to the CM Relief Fund for both AP and Telangana. Let’s collectively support the measures being undertaken by the respective governments to provide immediate aid and facilitate the…— Mahesh Babu (@urstrulyMahesh) September 3, 2024హీరోయిన్ విరాళం.. టాలీవుడ్ హీరోయిన్ అనన్య నాగళ్ల వరద బాధితులకు ఆర్థికసాయం ప్రకటించారు. తన వంతుగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో రూ.2.5 లక్షల చొప్పున సాయం అందించనున్నట్లు ట్వీట్ చేశారు. త్వరగా ఈ విపత్తు నుంచి కోలుకోవాలని ఆకాంక్షించారు. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు వర్షాల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. త్వరలోనే ఈ విపత్తు నుండి మన రాష్ట్రాలు కోలుకోవాలని కోరుకుంటూ, వరద నుండి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొనే చర్యలకి సహాయపడాలని నా వంతుగా ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి…— Ananya Nagalla (@AnanyaNagalla) September 3, 2024 హీరో నందమూరి బాలకృష్ణ భారీ విరాళం ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వరదల వల్ల విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి తలో రూ.50 లక్షలు విరాళం అందించారు. రెండు రాష్ట్రాల్లో అతి త్వరలోనే సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. -
ప్రభాస్ అన్న జోకర్ కాదు.. సక్సెస్ వెనక స్ట్రాంగ్ పిల్లర్: సిద్ధు
కల్కి సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఆహా ఓహో అని కీర్తించారు. మరో ప్రపంచానికి వెళ్లొచ్చినట్లు ఉందన్నారు. అంత అద్భుతంగా ఉండబట్టే బాక్సాఫీస్ దగ్గర దాదాపు రూ.1200 కోట్లు రాబట్టింది. నెట్‌ఫ్లిక్స్‌లో గురువారం (ఆగస్టు 22) నుంచి అందుబాటులోకి రానుంది. అయితే ఈ సినిమా తనకు ఏమాత్రం నచ్చలేదన్నాడు బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ. సెటైర్లుప్రతి సినిమా అందరికీ నచ్చాలని లేదులే అని ఫ్యాన్స్ ఏదో సర్దిపెట్టుకుందామనుకునేలోపే భైరవగా ప్రభాస్ లుక్ జోకర్లా ఉందని సెటైర్లు వేశాడు. ఊహించినంత ఏమీ లేదని విమర్శలు గుప్పించాడు. ఈయన వ్యాఖ్యలపై నెట్టింట పెద్ద దుమారమే చెలరేగింది. తాజాగా టాలీవుడ్ హీరో సిద్దు జొన్నలగడ్డ సోషల్ మీడియా వేదికగా అర్షద్ వార్సీ కామెంట్లపై విరుచుకుపడ్డాడు.అంత ఈజీ కాదుఅభిప్రాయాన్ని చెప్పే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. కొన్ని సినిమాలను ఇష్టపడతాం. కొన్నింటిని లైట్ తీసుకుంటా. నటీనటుల విషయంలోనూ అంతే.. ఎవరి ఇష్టాలు వారివి. కానీ మన అభిప్రాయాలను బయటకు ఎలా చెప్తున్నామనేది ముఖ్యం. సినిమా రంగంలోకి రావడం, ఇక్కడ నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదు. సద్విమర్శ మంచిదే కానీ.. జోకర్ వంటి పదాలు వాడటం కరెక్ట్ కాదు.ఒకే ఇండస్ట్రీలో ఉండి..సినిమా రంగంలోనే ఉండి ఇలాంటి కామెంట్లు చేస్తారా? కల్కి.. భారతీయ సినిమాకే గర్వకారణంలాంటిది. నాగ్ అశ్విన్ సృష్టించిన అద్భుతం రూ.1000 కోట్ల పైనే వసూలు చేయడం మామూలు విషయం కాదు. ఇండియన్ సినిమాలోని పెద్ద స్టార్స్‌లో ప్రభాస్ అన్న ఒకరు. అందుకు ఓ ప్రత్యేక కారణం ఉంది. మన హిట్ సినిమాలకు వచ్చే కలెక్షన్స్ కంటే ప్రభాస్ అన్న ఫ్లాప్ సినిమాలకు వచ్చే కలెక్షన్సే ఎక్కువ! అలాంటి స్టార్డమ్జయాపజయాలతో సంబంధం లేని స్టార్డమ్ తనది. కల్కి సక్సెస్ వెనక స్ట్రాంగ్ పిల్లర్‌లా నిలబడ్డాడు. ఇదే నిజం. భావప్రకటన స్వేచ్ఛ అందరికీ ఉంది. కానీ ఆ భావాన్ని ఎలా వ్యక్తీకరిస్తున్నామనేది ఆలోచించుకుని మాట్లాడండి. గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోండి అని సిద్ధు ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు. #SiddhuJonnalagadda slams the comments made by #ArshadWarsi on Rebel Star #Prabhas.#NagAshwin #Kalki2898AD #TeluguFilmNagar pic.twitter.com/lBdNhJNvDJ— NANI (@NANI_09_30) August 21, 2024 -
చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఉండదు: సిద్ధు జొన్నలగడ్డ
‘‘కమిటీ కుర్రోళ్ళు’ ట్రైలర్ చూస్తే చిన్న సినిమా కాదని అర్థమైంది. విజువల్స్ బాగున్నాయి. అసలు చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఉండదు. ఓ సినిమాకు తక్కువ ఖర్చు పెడతాం... మరో సినిమాకి ఎక్కువ ఖర్చు పెడతాం... అంతే’’ అని హీరో సిద్ధు జొన్నలగడ్డ అన్నారు. నూతన నటీనటులతో యదు వంశీ దర్శకత్వం వహించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్ఎల్పీ, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్‌పై పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మించారు. ఆగస్టు 9న విడుదల కానున్న ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ– ‘‘కొత్తవారితో ‘కమిటీ కుర్రోళ్ళు’ వంటి మంచి చిత్రాన్ని తీయడం మామూలు విషయం కాదు. ఇలాంటి సినిమాని ప్రేక్షకులు పెద్ద హిట్ చేస్తారు’’ అన్నారు. ‘‘ఈ సినిమా కోసం మూడేళ్లుగా పని చేస్తున్నాం. అందరూ వారి వారి పాత్రలకు ప్రాణం పోశారు’’ అన్నారు నిహారిక. ‘‘నిహారిక, ఫణిగార్లు లేకపోతే ఇంత మంచి సినిమా తీసేవాళ్లం కాదు’’ అన్నారు యదు వంశీ. ‘‘మంచి సినిమా తీశాం. అందరూ చూడండి’’ అన్నారు నిర్మాత ఫణి అడ΄ాక. ఈ వేడుకలో ఎగ్జిక్యూటివ్ ్ర΄÷డ్యూసర్ రమేశ్, మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ దేవ్, కెమెరామేన్ రాజు మాట్లాడారు. -
టిల్లుని పక్కకి పెట్టిన సిద్దూ.. ఇప్పట్లో కమ్ బ్యాక్ కష్టమే..
-
బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోలు
రూ.100 కోట్ల కలెక్షన్స్.. ఒకప్పుడు టాలీవుడ్‌కి ఇది రికార్డు కలెక్షన్స్. స్టార్ హీరోల సినిమాలకు మాత్రమే ఆ రేంజ్ కలెక్షన్స్ వచ్చేవి. మాములు హీరోల సినిమాలకు రూ.20 కోట్లు వస్తేనే అది సూపర్ హిట్. కానీ ఇప్పుడు టాలీవుడ్ బాక్సాఫీస్ పరిస్థితి మారింది. కుర్రహీరోలు సైతం బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్నారు. డిఫరెంట్ కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చి.. రికార్డు స్థాయి కలెక్షన్స్‌ని రాబడుతున్నారు. ఇంకా చెప్పాలంటే స్టార్ హీరోలకు సైతం సాధ్యం కానీ కలెక్షన్స్‌ని యంగ్ హీరోస్ రాబడుతున్నారు. మన టాలీవుడ్ బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న యంగ్ హీరోలపై ఓ లుక్కేయండి -
అఫీషియల్: ఓటీటీకి టిల్లు స్క్వేర్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన 'టిల్లు స్క్వేర్'. ఈ చిత్రాన్ని మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కించారు. డీజే టిల్లుకు సీక్వెల్‌గా ఈ సినిమాను రూపొందించారు. గతంలో రిలీజైన డీజే టిల్లు సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మార్చి 29 ప్రేక్షకుల ముందుకొచ్చిన టిల్లు స్క్వేర్ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ సొంతం చేసుకుంది. దాదాపు రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. టిల్లు స్క్వేర్ సూపర్ హిట్ కావడంతో ఎప్పుడెప్పుడు ఓటీటీకి వస్తుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఓటీటీకి స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది. ఈ నెల 26 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. తెలుగుతోపాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా పంచుకుంది. 'చరిత్ర పునరావృతం అవ్వడం సాధారణం. అదే టిల్లు వస్తే హిస్టరీ, మిస్టరీ, కెమిస్ట్రీ అన్నీ రిపీట్ అవ్వుతాయి. అట్లుంటది టిల్లుతోని. టిల్లు స్క్వేర్ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీలో నెట్‌ఫ్లిక్స్‌లో ఏప్రిల్ 26న వస్తుంది.' అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. History repeat avvadam normal. Adhe Tillu vasthe History, mystery, chemistry anni repeat avvuthai. Atluntadhi Tilluthoni. ✨🥰 Tillu Square arrives on 26 April, on Netflix in Telugu, Tamil, Malayalam, Kannada & Hindi. pic.twitter.com/SwEzFgJujb — Netflix India South (@Netflix_INSouth) April 19, 2024 -
నెల రోజుల్లోపే ఓటీటీకి టిల్లు స్క్వేర్.. స్ట్రీమింగ్ డేట్ అదేనా?
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన 'టిల్లు స్క్వేర్'. ఈ చిత్రాన్ని మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కించారు. డీజే టిల్లుకు సీక్వెల్‌గా ఈ సినిమాను రూపొందించారు. గతంలో రిలీజైన డీజే టిల్లు సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మార్చి 29 ప్రేక్షకుల ముందుకొచ్చిన టిల్లు స్క్వేర్ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ సొంతం చేసుకుంది. దాదాపు రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. టిల్లు స్క్వేర్ సూపర్ హిట్ కావడంతో ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్పై ఆసక్తి నెలకొంది. ఎప్పుడెప్పుడు ఓటీటీకి వస్తుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను భారీ ధరకు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. తాజా బజ్ ప్రకారం ఈనెలలోపే టిల్లు స్క్వేర్ ఓటీటీలో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 26 నుంచే స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఈ డేట్ ఫిక్స్ అయితే కేవలం నెల రోజుల్లోపే ఓటీటీలో అలరించనుంది. -
'టిల్లు స్క్వేర్' నుంచి అదిరిపోయే వీడియో సాంగ్ విడుదల
డీజే టిల్లుకు సీక్వెల్‌గా విడుదలైన 'టిల్లు స్క్వేర్' బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్‌తో దుమ్మురేపుతుంది. సిద్ధు జొన్నలగడ్డ- అనుపమ పరమేశ్వరన్ అల్లరికి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. మార్చి 29న విడుదలైన ఈ చిత్రాన్ని రెండోసారి కూడా చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిచూపుతున్నారు. మొదటి పార్ట్‌కు మించిన ఫన్ ఈ చిత్రంలో ఉండటంతో యూత్‌కు బాగా దగ్గరైంది. సిద్దు తనదైన స్టైల్లో వన్ లైనర్ డైలాగ్స్‌తో సినిమాను దడదడలాడించేశాడు. కథకు తగ్గట్టు హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కూడా చెలరేగిపోయింది. సినిమా విడుదలై మూడు వారాలు పూర్తి కావస్తుంది. దీంతో తాజాగా ఈ సినిమా నుంచి టికెట్టే కొనకుండా అనే వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. రామ్ మిరియాల ఈ పాటను పాడటమే కాకుండా మ్యూజిక్‌ను కూడా అందించారు. ట్రెండింగ్ సాంగ్ కావడంతో ప్రస్తుతం యూట్యూబ్‌లో దూసుకుపోతుంది. టిల్లు గాడి ఫన్‌కు మెచ్చిన ఆడియన్స్ ఇప్పటి వరకు రూ. 115 కోట్ల గ్రాస్‌ను కలెక్షన్స్ రూపంలో ఇచ్చేశారు. -
‘ టిల్లు స్క్వేర్’ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
Siddu Jonnalagadda : అవమానాలు, అవహేళనలే, వంద కోట్లకు బాటలు వేశాయ్!
కోవిడ్-19, లాక్డౌన్ సమయంలో ఆన్లైన్ సినిమాలకు అలవాటు పడిపోయాం. ఈ సమయంలో అతిచిన్న బడ్జెట్లో అద్భుతంగా తీసిన తమిళం,మళయాలం, తదితర కొన్ని భాషల సినిమాల మ్యాజిక్‌ను చూసి ఔరా అనుకున్నాం. గుండెలదిరిపోయే బీజీఎంలు, థియేటర్లలో సీటీలు కొట్టించే హీరోల ఎలివేషన్లు ఇవేవీ ఉండవు. విదేశాల్లో షూటింగ్‌లు, ఫైటింగులూ చేజింగ్లూ అంతకన్నా ఉండవు. చాలా సింపుల్‌గా సూటిగా ప్రేక్షకుడి మనసులో విషయం దూరిపోతుంది. ఒక్కోసారి మౌనంగా రోదిస్తాం.. మరోసారి సినిమాలోని సీన్లతో రోజంతా అలా ప్రయణిస్తూనే ఉంటాం. ఇదంతా ఎందుకంటే.. తాజాగా ల-బడ్జెట్ సినిమా అయినా.. కంటెంట్ ఉంటే చాలు నిరూపించాడు ‘టిల్లూ స్క్వేర్’ మూవీతో డీజే టిల్లు.. సిద్ధూ జొన్నలగడ్డ. కేవలం రూ. 20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఒక తెలుగు సినిమా వంద కోట్ల రూపాయల బాక్సాఫీస్ రికార్డు దిశగా దూసుకుపోతోంది. అదే ‘టిల్లూ స్క్వేర్’. డీజే టిల్లూ సినిమాతో హిట్ కొట్టి ఆ పేరుతోనే పాపులర్ అవుతున్న హీరో సిద్ధూ జొన్నలగడ్డ.రింగుల జుట్టు, టిపికల్ స్టయిల్, ఊర మాస్ డైలాగులతో జనాలను పొట్ట చేత పట్టుకునేలా (పడీ.. పడీనవ్వలేక) చేస్తున్నాడు. కాస్త గ్యాప్ ఇవ్వు బ్రో అని ప్రేక్షకులు అంటున్నారంటేఘీ స్టార్ బోయ్.. రేంజ్‌ను అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు రింగుల జుట్టు సుందరి,కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాకు పెద్ద ఎసెట్. మొత్తానికి టిల్లు , లిల్లీ బాక్సాఫీసును షేక్ చేస్తున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చి, ఒక్కో మెట్టు ఎక్కుతూ, టాలీవుడ్లో హీరోగా ఎదిగిన తానేంటో నిరూపించుకున్న యంగ్ హీరో టాలెంటెడ్ స్టార్ సిద్ధు జొన్నలగడ్డ. స్టైలిష్ లుక్, భాషతో ‘డీజే టిల్లు’ మూవీతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టాడు. యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నాడు. అయితే ఈ స్టార్డం అంత ఈజీగా రాలేదు. ఈ స్థాయికి రావడానికి 12 ఏళ్లు వేచి చూడాల్సి వచ్చింది. ఎన్నో కష్టాలు...మరెన్నో అవమానాలు. కెరీర్ మొదట్లో చాలా అవమానాలు ఎదుర్కొన్నాననీ, ముఖ్యంగా తన ముఖం మీద ఉన్న మచ్చల గురించి ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి అన్న మాటలు ఇప్పటికీ తనను బాధిస్తాయని ఒక సందర్భంగా సిద్ధూ గుర్తు చేసుకున్నాడు. కానీ ఆ మాటలు అతనిలో కసి పెంచాయి. కంట తడిని ఒత్తుకున్నాడు.. ప్రయత్నిస్తే ఏదైనా సాధించవచ్చు ఫిక్స్ అయిపోయాడు. సక్సెస్ కొట్టాడు. సిద్దూ కేవలం నటుడు మాత్రమే..అవసరమైతే రైటర్.. డైరెక్టర్ ఏ అవతారమైనా ఎత్తేస్తాడు. ఎందుకంటే లో-బడ్జెట్ కదా. దటీజ్ టిల్లూ..టిల్లు స్క్వేర్తో హిట్ కొట్టి డీజే డిల్లు మూవీలో అన్నట్టు అట్లుంటది మనతోని అని చెప్పకనే చెప్పాడు. మడత పెట్టేశాడు అన్నట్టు. డీజే టిల్లు 3 గురించి హింట్ ఇచ్చి ఫ్యాన్స్‌కు పూనకాలే తెప్పించాడు. ఇక సినిమా ఏం రేంజ్లో ఉంటుందో అని ఫ్యాన్స్ ఇప్పటినుంచే తెగ వెయిటింగ్. టిల్లన్నా.. నువ్వు సూపరన్నా.. నీకు సలాం అన్నా.. నీ రింగుల దెబ్బకు .. తానా తందనా ఈ సారి రామ్ మిర్యాలతో పాడిస్తాడేమో చూద్దాం..! -
బెంచ్ మార్క్ దగ్గర్లో 'టిల్లు స్క్వేర్' కలెక్షన్స్
డీజే టిల్లుకు సీక్వెల్‌గా విడుదలైన టిల్లు స్క్వేర్ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్‌తో దుమ్మురేపుతుంది. సిద్ధు జొన్నలగడ్డ- అనుపమ పరమేశ్వరన్ అల్లరికి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం అదిరిపోయే టాక్‌తో ఈ సినిమా దూసుకుపోతుంది. మొదటి పార్ట్‌కు మించిన ఫన్ ఈ చిత్రంలో ఉండటంతో యూత్‌కు బాగా దగ్గరైంది. తాజాగా ఈ సినిమా కలెక్షన్స్ వివరాలను మేకర్స్ ప్రకటించారు. సిద్దు తనదైన స్టైల్లో వన్ లైనర్ డైలాగ్స్‌తో సినిమాను దడదడలాడించేశాడు. కథకు తగ్గట్టు హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కూడా చెలరేగిపోయింది. ఇంకేముంది కేవలం ఆరు రోజుల్లో రూ.91 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చిపడ్డాయి. వంద కోట్ల బెంచ్ మార్క్‌కు దగ్గర్లో ఉంది ఈ చిత్రం. నేటి కలెక్షన్స్‌తో ఆ మార్క్‌ను బీట్ చేసే ఛాన్స్ ఉంది. సినిమా ఫస్ట్ షాట్ నుంచి చివరి షాట్ దాకా సిద్ధూ విశ్వరూపం చూపించాడని చెప్పవచ్చు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రాన్ని మల్లిక్ రామ్ డైరెక్టె చేశారు. ఈ మూవీలో సిద్ధు హీరో పాత్రతో పాటు రచన, స్క్రీన్‌ప్లేలో భాగమయ్యారు. ఓటీటీలో ఎప్పుడంటే.. మార్చి 29న విడుదలైన 'టిల్లు స్క్వేర్' హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టిల్లు స్క్వేర్ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. రూ. 15 కోట్లకు పైగానే ఈ సినిమా రైట్స్ కోసం వెచ్చించినట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమా థియేట్రికల్ రన్ నెల రోజులు పూర్తి అయిన తర్వాతే ఓటీటీలోకి రానుంది. అంటే ఏప్రిల్ చివరి వారం లేదా మే నెలలోని మొదటి వారంలో తప్పకుండా ఓటీటీలోకి టిల్లుగాడు వస్తాడని టాక్ వినిపిస్తుంది. #TilluSquare Double Blockbuster Run at the box-office is unstoppable, grosses over 𝟗𝟏 𝐂𝐑 𝐢𝐧 𝟔 𝐃𝐚𝐲𝐬! 💥 All set to cross 𝟏𝟎𝟎𝐂𝐑 𝐆𝐫𝐨𝐬𝐬 Mark!! 🔥😎 Our Starboy 🌟 shattering records all over! 🤘 - https://t.co/vEd8ktSAEW pic.twitter.com/lb0pYUwib4 — Sithara Entertainments (@SitharaEnts) April 4, 2024 -
టిల్లు 3 స్టోరీ లీక్ చేసిన హీరో సిద్దు
-
మెగాస్టార్ చిరంజీవి మెచ్చిన 'టిల్లు స్క్వేర్' (ఫొటోలు)
-
మెగాస్టార్ చిరంజీవి మెచ్చిన 'టిల్లు స్క్వేర్' (ఫొటోలు)
-
చిరంజీవితో సినిమా ఛాన్స్.. ఎందుకు నో చెప్పానంటే: సిద్ధు జొన్నలగడ్డ
సిద్ధు జొన్నలగడ్డ , అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ‘డీజే టిల్లు’ చిత్రానిక సీక్వెల్‌గా మార్చి 29న విడుదలైంది. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు కథ, మాటలు సిద్ధు జొన్నలగడ్డ అందించడం విశేషం. కేవలం రెండు రోజుల్లోనే రూ. 45 కోట్ల గ్రాస్‌ను రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. హిట్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ సినిమా రూ. 100 కోట్ల క్లబ్లో చేరడం ఖాయం అని చెప్పవచ్చు. యూత్‌లో మంచి క్రేజ్ ఉన్న సిద్ధూకు మెగాస్టార్ చిరంజివితో కలిసి నటించే ఛాన్స్ వచ్చింది. కానీ దానిని సిద్ధూనే వద్దనుకున్నాడని గతంలో చాలానే వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై ఆయన ఎక్కడా ఇప్పటి వరకు రియాక్ట్ కాలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తొలిసారి ఈ విషయంపై ఇలా స్పందించాడు. 'తెలుగు ఇండస్ట్రీలో నాకు బాగా నచ్చిన హీరో విక్టరీ వెంకటేష్ గారు.. ఆయనే నాకు ఆల్‌టైమ్ ఫేవరెట్. నా సినిమా కెరియర్‌పై ఆయన ప్రభావం కాస్త ఎక్కువగానే ఉంది. ఇండస్ట్రీలో చిరంజీవి గారు, అమితాబ్ బచ్చన్ గారు, రజనీకాంత్ గారు ఇలా టాప్ లెజండరీ హీరోలతో కలిసి పని చేయాలని కోరిక నాకు కూడా ఉంది. ఈ క్రమంలో చిరంజీవి గారితో కలిసి నటించే ఛాన్స్ వచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల అది సెట్ కాలేదు. తెలుగు సినిమా పరిశ్రమ అంటే మొదటగా ఎవరికైనా గుర్తుకువచ్చే పేరు చిరంజీవి.. ఆయనొక సూపర్ హ్యూమన్ అలాంటి హీరోతో కలిసి నటించే అవకాశం వస్తే.. అది బెస్ట్ ప్రాజెక్ట్ కావాలనేది నా అభిప్రాయం. ఆ సినిమా మరో ప్రపంచాన్ని చూపించాలి. చిరంజీవిగారితో కలిసి పనిచేశానని భవిష్యత్‌లో నా పిల్లలకు గర్వంగా చెప్పుకునేలా ఉండాలి. అలాంటి ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తున్నాను. దేవుడి దయ ఉంటే చిరంజీవి గారితో అలాంటి అవకాశం వస్తుంది. ఈ క్రమంలో ఎవరో ఒకరు అందుకు తగిన కథను ఆయనకు తప్పకుండా అందిస్తారు. ఆ రోజు వస్తుంది అనుకుంటున్నాను. మెగాస్టార్ స్టార్డమ్కు సమానంగా సినిమా తీయడం అంత సులభమైన విషయం కాదు. అలాంటి ఛాన్స్ వస్తుందని ఎదురుచూస్తున్నాను.' అని ఆయన చెప్పారు. -
కలెక్షన్స్‌తో మోత మోగిస్తున్న టిల్లుగాడు.. ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే
'టిల్లు స్క్వేర్'తో థియేటర్లలో మోత మోగిస్తున్నాడు డీజే టిల్లు గాడు.. బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌తో దూసుకుపోతున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. మరోసారి తన డిఫరెంట్ యాటిట్యూడ్ స్టైల్ యాక్టింగ్‌తో అదరగొట్టేశాడు. భారీ అంచనాలతో థియేటర్లోకి వచ్చిన వారిని టిల్లు గాడు విపరీతంగా నవ్వించడమే కాకుండా ఎంటర్టైన్మెంట్ను పంచాడు. అలా బాక్సాఫీస్ వద్ద టిల్లు స్క్వేర్తో సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ ర్యాంపేజ్ ఆడించారు. ఓటీటీలో ఎప్పుడంటే.. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తున్నా కూడా 'టిల్లు స్క్వేర్' హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. మార్చి 29న వచ్చిన ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టిల్లు స్క్వేర్ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. రూ. 15 కోట్లకు పైగానే ఈ సినిమా రైట్స్ కోసం వెచ్చించినట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమా థియేట్రికల్ రన్ నెల రోజులు పూర్తి అయిన తర్వాతే ఓటీటీలోకి రానుంది. అంటే ఏప్రిల్ చివరి వారం లేదా మే నెలలోని మొదటి వారంలో తప్పకుండా ఓటీటీలోకి టిల్లుగాడు వస్తాడని టాక్ వినిపిస్తుంది. సినిమాకు మంచి టాక్ వస్తుంది కాబట్టి మరో 20రోజుల తర్వాత ఓటీటీ ప్రకటన అధికారికంగా రావచ్చు. 'టిల్లు స్క్వేర్' కలెక్షన్స్ టిల్లుగాడి డీజేకు యూత్ బాగా ఫిదా అయ్యారు. దీంతో ఈ సినిమాకు మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 23.7 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు మూవీటీమ్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా రెండు రోజులకు రూ.45.3 కోట్లు వచ్చినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. రూ.100 కోట్ల గ్రాస్ టార్గెట్ పెట్టుకున్న నిర్మాతకు ఈ సినిమా అంతకు మించి కలెక్షన్స్ తెచ్చిబెట్టే ఛాన్స్ ఉంది. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక నేడు(మార్చి 31) ఆదివారం కాబట్టి మరింత భారీ కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. Tillanna Box-office RAMPAGE Continues, grosses over 𝟒𝟓.𝟑 𝐂𝐑 in 𝟐 𝐃𝐚𝐲𝐬 🔥🔥 Our Starboy 🌟 continues to shatter records all over! 💥💥 - https://t.co/vEd8ktSAEW #TilluSquare #Siddu @anupamahere @MallikRam99 @ram_miriyala @achurajamani #BheemsCeciroleo pic.twitter.com/Y3TeL0adtG — Sithara Entertainments (@SitharaEnts) March 31, 2024 -
Tillu Square Box Office Collection: బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘టిల్లుగాడు’
లేట్‌గా వచ్చినా లేటెస్ట్గా వచ్చినంటోన్నాడు సిద్దు జొన్నలగడ్డ. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘టిల్లు స్వ్కేర్’. మార్చి 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి రోజే హిట్ టాక్ సంపాదించుకుంది. టిల్లుగాడి మ్యానరిజం, పంచ్ డైలాగ్స్‌కి సినీ ప్రేక్షకులు మరోసారి ఫిదా అయ్యారు. ఫలితంగా తొలిరోజు భారీ కలెక్షన్స్ వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి ఫస్ట్‌డే రూ.23.7 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ అధికారికంగా ప్రకటించింది. (చదవండి: ‘టిల్లు స్వ్కేర్’ మూవీ రివ్యూ) అలాగే అమెరికాలో ఈ చిత్రం తొలిరోజు 1 మిలియన్ డాలర్స్‌కి పైగా వసూళ్లను రాబట్టింది. హిట్ టాక్ రావడంతో వీకెండ్లో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమా కచ్చితంగా రూ. 100 కోట్లకు పైగా వసూలు చేస్తుందని నిర్మాత నాగవంశీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2022లో వచ్చిన డీజే టిల్లు చిత్రానికి కొనసాగింపుగా వచ్చిన చిత్రమే ‘టిల్లు స్వ్కేర్’. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది. Tillu Registers a 𝐃𝐎𝐔𝐁𝐋𝐄 𝐁𝐋𝐎𝐂𝐊𝐁𝐔𝐒𝐓𝐄𝐑 Start at the Box-Office with 𝟐𝟑.𝟕 𝐆𝐑𝐎𝐒𝐒 on 𝐃𝐀𝐘 𝟏 🔥 Our Starboy 🌟 is shattering the records all over! 💥💥 Book your tickets here - https://t.co/vEd8ktSAEW #Siddu @anupamahere @MallikRam99 @ram_miriyala… pic.twitter.com/Dz7hqglg5Z — Sithara Entertainments (@SitharaEnts) March 30, 2024 -
‘టిల్లు స్క్వేర్’ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
టిల్లు- 3 గురించి ఆసక్తికర విషయాన్ని తెలిపిన నాగ వంశీ
'డీజే టిల్లు'గా ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించారు సిద్ధు జొన్నలగడ్డ. తాజాగా ఆ చిత్రానికి సీక్వెల్‌గా ‘టిల్లు స్క్వేర్’తో ప్రేక్షకుల ముందుకు మళ్లీ వచ్చేశాడు. ఇప్పుడు కూడా అంతే రేంజ్లో నవ్వించడమే కాకుండా ప్రేక్షకులను కూడా మెప్పించాడు. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ‘టిల్లు స్క్వేర్’ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ హీరోనే కాదు.. ఈ చిత్రానికి స్క్రిప్ట్ కూడా రాశాడు. హాస్యం ప్రధానంగా చాలా అద్భుతంగా కథను రాశాడు. అందుకే థియేటర్లలో సినిమా చూసిన ప్రేక్షకులు మంచి అనుభూతి కలిగిందని బయటకు వస్తున్నారు. మార్చి 29న విడుదలైన ‘టిల్లు స్క్వేర్’కు పాజిటివ్ టాక్ రావడంతో తాజాగా సిద్ధు జొన్నలగడ్డ ఇలా రియాక్ట్ అయ్యాడు. 'డీజే టిల్లు తీస్తున్నప్పుడే నన్ను నమ్మి మంచి ప్రమాణాలతో సినిమాని తీశారు నిర్మాతలు. అనుకున్నట్లు అది హిట్ కావడంతో సీక్వెల్ 'టిల్లు స్క్వేర్' విషయంలోనూ అదే జరిగింది. ఇలాంటి సినిమా చేసే అవకాశం ఇచ్చినందుకు నిర్మాతలకి కృతజ్ఞతలు. నేను నటుడి కంటే ముందు ఈ సినిమాకి రచయితను. ఎంతో నిజాయతీగా కథ ఉండాలని రాశాను. ఎక్కువ, తక్కువలు అనే అభిప్రాయాలు లేకుండా ప్రతి పాత్రని డిజైన్ చేశాను. వాస్తవంగా అనుపమను వంద శాతం ఊహించి కథ రాస్తే.. తన నటనతో వెయ్యి శాతం 'టిల్లు స్క్వేర్'లో ప్రభావం చూపించింది. ఈ సినిమాలో కథ ప్రభావం ఎంతమేరకు ఉండాలో అంత వరకు మాత్రమే ఉంది.' అని ఆయన అన్నారు. 'టిల్లు స్క్వేర్' చిత్రానికి తొలి షో నుంచే మంచి టాక్ వచ్చిందని నిర్మాత సూర్యదేవర నాగవంశీ చెప్పారు. రానున్న రోజుల్లో సెలవులు కూడా సినిమాకు కలిసొస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. 'టిల్లు స్క్వేర్' రూ.వంద కోట్ల కలెక్షన్స్ సాధిస్తుందనే నమ్మకం ఉందని ఆయన చెప్పాడు. త్వరలో మూడో భాగాన్ని కూడా ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. -
Tillu Square: ‘టిల్లు స్వ్కేర్’ మూవీ రివ్యూ
టైటిల్: టిల్లు స్వ్కేర్ నటీనటులు: సిద్ధు జొన్నలగడ్డ,అనుపమ పరమేశ్వరన్, ప్రిన్స్, మురళీధర్ గౌడ్, మురళీ శర్మ తదితరులు నిర్మాణ సంస్థ: సితార ఎంటర్టైన్మెంట్స్,ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య దర్శకత్వం:మల్లిక్ రామ్ నేపథ్య సంగీతం: భీమ్స్ సిసిరోలియో సినిమాటోగ్రఫీ: సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు ఎడిటింగ్: నవీన్ నూలి విడుదల తేది: మార్చి 29, 2024 స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన 'డీజే టిల్లు'(2022)ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం భారీ బ్లాక్ బస్టర్‌తో పాటు యూత్‌లో కల్ట్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన చిత్రమే ‘టిల్లు స్వ్కేర్’. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘టిల్లు స్వ్కేర్’పై అంచనాలు మరింత పెరిగాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని యూత్ ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. పలుమార్లు వాయిదా పడుతూ ఎట్టకేలకు నేడు(మార్చి 29) ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. టిల్లు స్వ్కేర్ కథేంటంటే.. రాధిక(నేహా శెట్టి) చేసిన మోసం నుంచి కోలుకున్న బాల గంగాధర తిలక్ అలియాస్ డీజే టిల్లు (సిద్ధు జొన్నలగడ్డ)..ఫ్యామిలీ,ఫ్రెండ్స్‌తో కలిసి ‘టిల్లు ఈవెంట్స్’ స్టార్ట్ చేస్తాడు. వెడ్డింగ్ ప్లానింగ్‌తో పాటు డీజే ఈవెంట్స్ చేస్తూ హాయిగా గడుపుతున్న టిల్లు జీవితంలోకి లిల్లీ(అనుపమ పరమేశ్వరన్) ఎంటర్ అవుతుంది. తొలి చూపులోనే ఆమెపై మనసు పారేసుకుంటాడు. ఆమెతో ఓ రాంత్రంతా గడుపుతాడు. తెల్లారి చూస్తే లిల్లి కనిపించదు. సరిగ్గా నెల రోజుల తర్వాత ఓ ఆస్పత్రిలో కనిపించి తాను గర్భవతి అని చెబుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు లిల్లి ఎవరు? టిల్లు జీవితంలోకి ఎందుకు వచ్చింది? ఇంతకు ముందు రాధిక మాదిరే ఇప్పుడు లిల్లితో టిల్లుకి వచ్చిన కొత్త సమస్యలు ఏంటి? వీళ్ళ కథతో పేరు మోసిన మాఫియా డాన్ మెహబూబ్ అలీ(మురళీ శర్మ) కి లింక్ ఏంటి? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో ‘టిల్లు స్వ్కేర్’ చూడాల్సిందే. ఎలా ఉందంటే.. 'డీజే టిల్లు' సక్సెస్‌కి ముఖ్యకారణం టిల్లుగాడి పాత్ర.. ఆ పాత్రతో పలికించిన సంభాషణలు. కథగా చూసుకుంటే'డీజే టిల్లు'లో కొత్తదనం ఏమి ఉండదు. కానీ టిల్లుగాడి మ్యానరిజం.. వాడు చేసిన మాటల మ్యాజిక్కే ఆ చిత్రానికి భారీ విజయాన్ని తెచ్చిపెట్టింది. 'టిల్లు స్క్వేర్'లోనూ అదే అప్లై చేశారు దర్శకరచయితలు. కథను కాకుండా టిల్లుగాడి, లిల్లిల కారెక్టరైజేషన్స్ను నమ్ముకున్నారు. సినిమా మొత్తం టిల్లు, లిల్లి పాత్రల చుట్టే తిరుగుతుంది. ప్రేక్షకులకు అల్రేడీ టిల్లు క్యారెక్టర్ గురించి అవగాహన ఉంటుంది కనుక.. సినిమా ప్రారంభం నుంచే ఆ పాత్రతో కనెక్ట్ అవుతారు. పార్ట్ 1 లాగే పార్ట్ 2లో కూడా లాజిక్స్‌ని పట్టించుకోలేదు. చాలా చోట్ల లాజిక్స్ మిస్ అవుతారు. కానీ టిల్లుగాడు తన మ్యానరిజంతో, డైలాగ్స్‌తో ఆ లోపాలను కప్పిపుచ్చుతాడు. మధ్య మధ్యలో వచ్చే కొన్ని ట్విస్టులు కూడా ప్రేక్షకుడికి బోర్ కొట్టకుండా చేస్తాయి. అలా అని ఆ ట్విస్టులు సర్ప్రైజింగ్గా ఉండవు. నిడివి తక్కువగా ఉండడం(దాదాపు 137 నిమిషాలు) కూడా సినిమాకు కలిసొచ్చింది. 'డీజే టిల్లు'లోని రాధిక ఎపిసోడ్‌ని చూపిస్తూ కథను ప్రారంభించాడు దర్శకుడు. దాన్నివల్ల సినిమా చూడని వారికి కూడా రాధిక పాత్రపై కాస్త అవగాహన వస్తుంది. ఆ తర్వాత టిల్లు లైఫ్‌స్టైల్ ఎలా ఉంటుందో చూపించి.. నేరుగా అసలు కథలోకి తీసుకెళ్లాడు. లిల్లి పరిచయం.. ఆ తర్వాత చిన్న టిస్టు.. బర్త్‌డే పార్టీ రోజు మరో షాక్.. ఇలా ఫస్టాఫ్ సాగుతుంది. ఇంటర్వెల్ టిస్టు బాగుంటుంది కానీ.. దాన్ని యాక్సెప్ట్ చేయడం కష్టంగా అనిపిస్తుంది. సెకండాఫ్‌లో కామెడీ డోస్ తగ్గుతుంది. ఇంటర్నేషనల్ మాఫియా కింగ్ ఎంట్రీ తర్వాత కథనం రొటీన్‌గా, సినిమాటిక్‌గా సాగుతుంది. అయితే ప్రీక్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు వచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. కొన్ని సంభాషణలను యూత్ బాగా ఎంజాయ్ చేస్తుంది. ఎవరెలా చేశారంటే.. టిల్లుగాడి పాత్ర సిద్ధూ జొన్నలగడ్డకు ఎంత పేరు సంపాదించిపెట్టిందో అందరికి తెలిసిందే. ఆ పాత్రను సిద్ధు తప్పా ఎవరూ చేయలేరు అనేంతలా నటించాడు. ఆల్రెడీ చేసిన పాత్రే కాబట్టి చాలా ఈజీగా ఆ పాత్రలో ఒదిగిపోయాడు. ఆయన మ్యానరిజం, డైలాగ్ డెలివరీ సినిమా స్థాయిని పెంచేసింది. అనుపమ ఈ సినిమాలో చాలా కొత్త పాత్రను పోషించింది. గతంలో ఎప్పుడూ ఇలాంటి పాత్రలో ఆమె నటించలేదు. లిల్లిగా ఆమె తెరపై అందాలను పంచడమే కాకుండా.. తనదైన నటనతో ఆకట్టుకుంది. ఆమె పాత్రలో వచ్చే సర్ప్రైజులు, ట్విస్టులు ఆకట్టుకుంటాయి. టిల్లు తండ్రిగా మురళీధర్ గౌడ్ పండించిన కామెడీ బాగా వర్కౌట్ అయింది. మురళీ శర్మ, ప్రిన్స్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా ఈ సినిమా బాగుంది. రామ్ మిరియాల కంపోజ్ చేసిన 'డీజే టిల్లు...' రీమిక్స్, 'రాధికా రాధికా' పాటలతో పాటు అచ్చు రాజమణి అందించిన 'ఓ మై లిల్లీ' సాంగ్ కూడా ఆకట్టుకునేలా ఉంటాయి. భీమ్ అందించిన బీజీఎం సినిమాకు మరో ప్రధాన బలం. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాగుంది. తక్కువ నిడివే ఉండడంతో సినిమా త్వరగానే అయిపోయిందనే ఫీలింగ్ కలుగుతుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్ -
టిల్లు స్క్వేర్ పబ్లిక్ టాక్.. ఎలా ఉందంటే!
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం 'టిల్లు స్క్వేర్'. అభిమానుల భారీ అంచనాల మధ్య ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. డీజే టిల్లు సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కించారు. ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇవాళ ఉదయాన్నే ఓవర్సీస్తో పాటు మొదటి షో థియేటర్లలో అలరిస్తోంది. ఈ సినిమా చూసిన అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. మరి ఈ సినిమా డీజే టిల్లు మరిపించిందా? అన్న విషయంపై ట్విటర్లో పోస్టులు పెడుతున్నారు. కొందరేమో ఫుల్ ఫన్ రోలర్‌కోస్టర్‌గా అలరించిందని కామెంట్స్ చేస్తున్నారు. సిద్ధు ఎనర్జీ, అనుపమ ఫర్మామెన్స్ కట్టిపడేశాయని అంటున్నారు. సిద్ధు గట్టి కమ్‌బ్యాక్ ఇచ్చాడని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. సిద్ధూ తన ట్రేడ్‌మార్క్ చూపించాడని పోస్ట్ చేస్తున్నారు. ఫన్ ఇంటర్వెల్ ట్విస్ట్ అద్భుతంగా ఉందని అంటున్నారు. ఫస్ హాఫ్ డీసెంట్‌గా ఉందని.. సెకండాఫ్‌లో ట్విస్టులు అదిరిపోయాయంటూ కామెంట్స్ చేస్తున్నారు. #TilluSquare is one hell of a movie; it's literally a square of entertainment that we had in DJ Tillu. Moreover, those one-liners 👌, as usual, Star Boy Siddu shines, Anupama did well, and the music is a big plus 💯. Overall: 3.5/5.#TilluSquarereview — keishhh (@FCB_LM_91) March 29, 2024 Show stealer siddhu buoy show throughout…same DJ Tillu treatment…if you love DJ Tillu you will love #TilluSquare ..just go to the theatres and enjoy the senseless lol ride 🍻🍻 https://t.co/Rbxi2TyWAd — 🌶️🔥 (@PenuToofan) March 29, 2024 First half of #TilluSquare is entertaining! Lot of Déjà Vu of #DJTillu in the movie. Siddhu 👍 https://t.co/C4pgRwbN0Q — idlebrain jeevi (@idlebrainjeevi) March 29, 2024 #TilluSquare - a rollercoaster of fun! Siddhu's energy lights up the screen, Anupama is good, and the never ending one-liners kept me hooked. Despite the occasional disjointed scenes & questionable green screens, it still manages to captivate! Perfect for a one-time watch! 3/5 😍 pic.twitter.com/W3qnppCjYF — Swathiiii 🌸 (@Swathi_Prasad96) March 29, 2024 #TilluSquare Decent 1st Half! Siddhu is back again with his trademark energetic avatar and one liners that are carrying the film. Comedy works in parts so far but feels redundant at times . Fun interval twist sets up the 2nd half well. — Venky Reviews (@venkyreviews) March 29, 2024 -
టిల్లుకి, నాకు ఆ ఒక్కటే తేడా : స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ
‘డీజే టిల్లు’ సమయంలో ప్రేక్షకుల్లో అంచనాల్లేవు. హీరో పాత్ర ఎలా ఉంటుంది అనేది ముందు తెలీదు. అందుకే ఆ పాత్రను చూసి ప్రేక్షకులు సర్ ప్రైజ్ అయ్యారు. ఇప్పుడు అదే పాత్రతో ‘టిల్లు స్వ్కేర్’ చేయాల్సి రావడంతో కాస్త ఒత్తిడి ఉండటం సహజం. అయితే ఒత్తిడిని జయించి మెరుగైన అవుట్ పుట్ని అందించడానికి ప్రయత్నించాం’ అన్నారు స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ. ఆయన ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘టిల్లు స్వ్కేర్’. 'డీజే టిల్లు'చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. మార్చి 29న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో గురువారం సిద్ధు జొన్నలగడ్డ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► ‘డీజే టిల్లు’ కథకి, టిల్లుగాడి పాత్రకి కొనసాగింపుగా ఈ చిత్రం ఉంటుంది. పాత్ర కొనసాగింపు పూర్తి స్థాయిలో ఉంటుంది. కథ కొనసాగింపు కూడా కొంత ఉంటుంది కానీ.. అది పాత కథను గుర్తుచేస్తూ కొత్త అనుభూతిని ఇస్తుంది. టిల్లు పాత్ర కూడా సీక్వెల్ లో ఇంకా ఎక్కువ ఎనర్జిటిక్ గా ఉంటుంది. ఎందుకంటే ఈసారి ఇంకా పెద్ద సమస్యలో ఇరుక్కుంటాడు. ఆ సమస్య ఏంటి అనేది ఇప్పుడే చెప్పను. థియేటర్ లో చూసి ఎంజాయ్ చేస్తారు. చాలా సర్ ప్రైజ్ లు, షాక్ లు ఉంటాయి. సినిమా అంతా నవ్వుకుంటూనే ఉంటారు. టిల్లు ఎక్కడా నవ్వడు.. కానీ అందరినీ ఫుల్ గా నవ్విస్తాడు. ► డీజే టిల్లులో హీరో, హీరోయిన్ రెండు పాత్రలకు ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పుడు టిల్లు స్క్వేర్ కూడా అలాగే ఉంటుంది. హీరో పాత్ర లేకపోతే హీరోయిన్ పాత్ర పండదు, అలాగే హీరోయిన్ పాత్ర లేకపోతే హీరో పాత్ర పండదు. ► ఈ సినిమాలోని టిల్లు పాత్ర నా ఆలోచనలు, నేను చూసిన అనుభవాల నుంచి పుట్టింది. టిల్లుకి, నాకు ఒక్కటే తేడా. టిల్లు తన మనసులో ఉన్నవన్నీ బయటకు అంటాడు. నేను మనసులో అనుకుంటాను అంతే తేడా. ► ఈ సినిమా నిడివిని కావాలని తగ్గించలేదు. సినిమాకి ఎంత అవసరమో అంత ఉంచాము. కామెడీ సినిమా కాబట్టి ఎక్కువ నిడివి లేకపోతేనే ఎక్కడా బోర్ కొట్టించకుండా ప్రేక్షకులను పూర్తిస్థాయి వినోదాన్ని అందించగలం. ► సీక్వెల్ చేద్దాం అనుకున్న సమయంలో విమల్ వేరే ప్రాజెక్ట్ కమిట్ అయ్యి ఉండటంతో అందుబాటులో లేరు. మరోవైపు నేను, మల్లిక్ ఒక సినిమా చేద్దామని అప్పటికే అనుకుంటున్నాము. మా కలయికలో డీజే టిల్లు సీక్వెల్ చేస్తే బాగుంటుంది అనిపించి.. అలా మల్లిక్ న దర్శకుడిగా తీసుకోవడం జరిగింది. ► త్రివిక్రమ్ గారి సలహాలు, సూచనలు ఖచ్చితంగా సినిమాకి హెల్ప్ అవుతాయి. అయితే ఆయన ఎప్పుడూ కథలో మార్పులు చెప్పలేదు. ఈ భాగం ఇంకా మెరుగ్గా రాస్తే బాగుంటుంది వంటి సలహాలు ఇచ్చేవారు. ► ఈ సినిమా సీక్వెల్ అనుకున్నప్పుడు లక్కీగా ఒక మంచి కథ తట్టింది. అలాగే పార్ట్-3 కి కూడా జరుగుతుందేమో చూడాలి. రెండు మూడు ఐడియాస్ ఉన్నాయి.. చూడాలి ఏమవుతుందో. అయితే టిల్లు-3 కంటే ముందుగా మరో విభిన్న కథ రాసే ఆలోచనలో ఉన్నాను. ప్రస్తుతం ఐతే నా దృష్టి అంతా టిల్లు స్క్వేర్ పైనే ఉంది. ► ఇలాంటి సినిమాలకు సంభాషణలే కీలకం. అవి ఎంతలా ప్రేక్షకులకు చేరువైతే అంత వినోదం పండుతుంది. సంభాషణలు నా మనసు నుంచి, నా మెదడు నుంచి పుట్టాయి కాబట్టి.. ఏ ఉద్దేశంతో రాశాను, ఎలా పలకాలి అనే దానిపై నాకు పూర్తి అవగాహన ఉంటుంది. అందుకే డీజే టిల్లు పాత్ర ప్రేక్షకులకు అంత దగ్గరైంది. -
నెగెటివ్ కామెంట్స్.. హర్టయిన అనుపమ, అందుకే డుమ్మా!
హీరోయిన్ అన్నాక అన్ని రోల్స్ చేయాలి. బరి గీసుకుని ఉంటే పెద్దగా అవకాశాలు రావు. ఆ విషయం తెలుసుకున్న అనుపమ పరమేశ్వరన్ బోల్డ్ పాత్రలకు ఓకే చెప్పింది. టిల్లు స్క్వేర్‌లో ముద్దులు, హగ్గులతో రెచ్చిపోయింది. ఇది అభిమానులకు అస్సలు నచ్చలేదు. అనుపమ కూడా ఇలా తయారైందేంటని కోపంతో ఊగిపోయారు. ఇవన్నీ అవసరమా? అని తిట్టినవాళ్లు కూడా ఉన్నారు. ఎప్పుడూ ఒకేరకమైన పాత్రలు చేస్తే బోర్ కొడుతుంది కదా.. అందుకే ఈ సినిమా ఒప్పుకున్నానని చెప్పినా ఫ్యాన్స్ ఆవేశం చల్లారలేదు. తనను ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఇబ్బంది పెట్టొద్దు బుధవారం (మార్చి 27న) టిల్లు స్క్వేర్ ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి అనుపమ డుమ్మా కొట్టింది. దీనిపై స్టేజీపైనే స్పందించాడు సిద్దు జొన్నలగడ్డ. అతడు మాట్లాడుతూ.. టిల్లు స్క్వేర్ నుంచి లేటెస్ట్గా ఓ పోస్టర్ రిలీజైంది. దానికింద చాలా కామెంట్స్ చేశారు. ఒక అమ్మాయి గురించినే ఏది పడితే అది అనేయడం అనడం కరెక్ట్ కాదు! మీకు మాట్లాడే హక్కు ఉంది.. నేను దాన్ని తప్పనడం లేదు. ఉదాహరణకు మనం ఒకరిని ఫ్లర్ట్ చేస్తే అవతలివాళ్లు ఎంజాయ్ చేసేలా ఉండాలి. కానీ వారిని ఇబ్బంది పెట్టేలా ఉండొద్దు. హర్ట్ అవడం వల్లే? తన గురించి పిచ్చిపిచ్చిగా కామెంట్స్ చేశారు. నా అభ్యర్థన ఏంటంటే దయచేసి వల్గర్‌గా మాట్లాడొద్దు. ఆరోగ్యకర వాతావరణం ఉంటే బాగుంటుంది' అని చెప్పుకొచ్చాడు. నెగెటివ్ కామెంట్స్‌కు హర్ట్ అయినందువల్లే అనుపమ ఈవెంట్‌కు రాలేదని తెలుస్తోంది. ఇకపోతే టిల్లు స్క్వేర్ మార్చి 29న రిలీజ్ కానుంది. చదవండి: లండన్‌లో కొత్త ఇల్లు? -
అవన్నీ భరిస్తేనే తెరపై హాట్‌గా కనిపిస్తాం: అనుపమ పరమేశ్వరన్
-
ఆ రేంజ్ ఫాలోయింగ్ వస్తుందని అసలు ఎక్సపెక్ట్ చేయలేదు
-
రామ్ మిరియాల లేకపోతే డీజే టిల్లు లేడు ఎందుకంటే..!
-
అనుపమ ని ఒక ఆట ఆడుకున్న సిద్దు
-
అందుకే అనుపమని బోల్డ్‌గా చూపించాం: 'టిల్లు స్క్వేర్' డైరెక్టర్
'టిల్లు స్క్వేర్'లో లిల్లీ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుంది.ఆమెది ఛాలెంజింగ్ రోల్. ఆ పాత్ర కోసం ఎందరో పేర్లను పరిశీలించాం. కానీ అనుపమనే పర్ఫెక్ట్ ఛాయిస్ అనిపించింది. ఆమెను బోల్డ్‌గా చూపించాలనే ఉద్దేశంతో లిల్లీ పాత్రను రాసుకోలేదు. లిల్లీ పాత్ర తీరే అలా ఉంటుంది. ఆ పాత్రకి అనుపమ న్యాయం చేయగలదని నమ్మాం. ఆమె ఆ పాత్రకి నూటికి నూరు శాతం న్యాయం చేసింది’ అన్నారు దర్శకుడు మల్లిక్ రామ్. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘టిల్లు స్కేవర్’. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన డీజే టిల్లు సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు రామ్ మల్లిక్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► సిద్ధుతో నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది. దాదాపు ఇద్దరం ఒకేసారి సినీ ప్రయాణం మొదలుపెట్టాం. నేను దర్శకత్వం వహించిన అద్భుతం మూవీ, డీజే టిల్లు ఇంచుమించు ఒకే సమయంలో వచ్చాయి. ఆ తర్వాత నేను, సిద్ధు కలిసి ఒక సినిమా చేయాలి అనుకున్నాం. అదే సమయంలో నాగవంశీ గారు 'టిల్లు స్క్వేర్' చేస్తే బాగుంటుందని చెప్పడం, డీజే టిల్లు దర్శకుడు విమల్ కృష్ణ ఇతర కమిట్ మెంట్స్ తో బిజీగా ఉండటంతో నేను ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చాను. మొదట కాస్త సంకోచించాను కానీ కథ బాగా వచ్చేసరికి ఇక వెనకడుగు వేయలేదు. ► సినిమాలో సిద్దు ప్రమేయం ఉటుందని..ప్రతి సీన్లోనూ తలదూర్చుతాడని బయట ఏవో కొన్ని వార్తలు వస్తుంటాయి కానీ వాటిలో వాస్తవం లేదు. సిద్ధు ఒక రచయితగా, నటుడిగా ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలో.. అంతవరకే ఇన్వాల్వ్ అవుతాడు. దర్శకుడికి ఇవ్వాల్సిన స్వేచ్ఛను దర్శకుడికి ఇస్తాడు. ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఇద్దరం చర్చించుకొని చేశాం. కథా చర్చల సమయంలో ఒక రచయితగా వ్యవహరిస్తాడు. చిత్రీకరణ సమయంలో ఒక నటుడిగా ఏం చేయాలో అది చేస్తాడు. ► డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ కి వ్యత్యాసం ఉంటుంది. డీజే టిల్లు డెడ్ బాడీ నేపథ్యంలో సాగే బ్లాక్ కామెడీ. కానీ టిల్లు స్క్వేర్ అలా ఉండదు. ఒక కమర్షియల్ సినిమాలా ఉంటుంది. టిల్లు పాత్ర తీరు అలాగే ఉంటుంది. రాధిక పాత్ర ప్రస్తావన ఉంటుంది. మొదటి భాగాన్ని ముడిపెడుతూ కొన్ని సన్నివేశాలు ఉంటాయి. డీజే టిల్లుని గుర్తు చేస్తూనే టిల్లు స్క్వేర్ మీకొక కొత్త అనుభూతిని ఇస్తుంది. ► ఇంటర్వెల్ తర్వాత ద్వితీయార్థం ప్రారంభ సన్నివేశాలు చాలా సినిమాల్లో తేలిపోతుంటాయి. ఫస్టాఫ్ బాగుంటుంది, క్లైమాక్ బాగుంటుంది. కానీ ఆ 15-20 నిమిషాలు ఆశించిన స్థాయిలో ఉండదు. టిల్లు స్క్వేర్ విషయంలో అలా జరగకూడదన్న ఉద్దేశంతో.. ఆ కొన్ని సన్నివేశాలు మరింత మెరుగ్గా రాసుకొని రీ షూట్ చేయడం జరిగింది. ► ముందు ఈ సినిమాకు పాటలు రామ్ మిరియాల, శ్రీచరణ్ పాకాల, నేపథ్య సంగీతం తమన్ అనుకున్నాం. రామ్ మిరియాల రెండు పాటలు ఇచ్చారు. శ్రీచరణ్ పాకాల ఒక పాట ఇచ్చారు. ఆ పాట బాగా వచ్చింది. కానీ అక్కడ సిట్యుయేషన్ మారడంతో మరో సంగీత దర్శకుడు అచ్చుత్తో పాట చేయించడం జరిగింది. తమన్ గారు ఇతర సినిమాలతో బిజీగా ఉండి అందుబాటులో లేకపోవడంతో..భీమ్స్ గారిని తీసుకున్నాం. ► ఈ చిత్రంలో ఎలాంటి సందేశం ఉండదు. కొందరి స్వభావం ఎలా ఉంటుందో చూపించాము కానీ ఇలా ఉండకండి మారండి అనే సందేశాలు మాత్రం ఇవ్వలేదు. -
స్టార్ హీరోయిన్‌తో సిద్ధు జొన్నలగడ్డ పెళ్లి.. !
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన పెళ్లిళ్ల హడావిడి నడుస్తోంది. ఈ క్రమంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు కూడా తమ పెళ్లి ప్రకటనలు ఇస్తూ అభిమానులను సంతోషపెడుతున్నారు. మరి కొందరు పెళ్లి వార్తలతో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటారు. తాజాగా సిద్ధు జొన్నలగడ్డ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అది కూడా ఇండస్ట్రీకి చెందిన టాప్ హీరోయిన్ను వివాహం చేసుకోబోతున్నట్లు ప్రచారం జరిగింది. ఈ విషయంపై తాజాగా సిద్దు జొన్నలగడ్డ సోదరుడు చైతన్య జోన్నలగడ్డ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. సిద్దు జొన్నలగడ్డ ఒక స్టార్ హీరోయిన్‌తో ప్రేమలో ఉన్నాడని.. వచ్చే ఏడాదిలో వివాహం చేసుకోబోతున్నారనే వార్తలు వస్తున్నాయి అనే ప్రశ్నకు చైతన్య ఆసక్తికరంగా సమాధానం ఇచ్చారు. 'స్టార్ హీరోయిన్ని పెళ్లి చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్ లేదు.. అదే స్టార్ హీరోని చేసుకుంటేనే ప్రాబ్లమ్ అవుతుంది కదా అని నవ్వేశాడు.' అతనకి కూడా పెళ్లి చేసుకోవాలని ఆసక్తి అయితే ఉంది. కానీ స్టార్ హీరోయిన్నే పెళ్లి చేసుకుంటాడో లేదో తనకు తెలియదని చెప్పారు. అన్నీ కుదురితే వచ్చే ఏడాది పెళ్లి కూడా జరగవచ్చని చెప్పారు. (ఇదీ చదవండి: టాలీవుడ్ డైరెక్టర్, నటుడు సూర్యకిరణ్ ఇకలేరు!) చైతన్య కూడా రీసెంట్గా బబుల్ గం సినిమాతో మంచి పేరు సంపాదించారు. 'డి.జె టిల్లు' సినిమాతో బాగా పాపులర్ అయిన సిద్దూ.. ఈ సినిమాతో యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. దీంతో 'టిల్లు స్క్వేర్'తో మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇలా ఉండగా తాజాగా ఆయన బ్రదర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. -
టిల్లు జోరు మామూలుగా లేదుగా
-
'టిల్లు 2'లో అనుపమ గ్లామర్ షో..
అనుపమ పరమేశ్వరన్.. ఈ పేరు చెప్పగానే క్లాస్ లుక్స్, పద్ధతిగా ఉండే పాత్రలు గుర్తొస్తాయి. కానీ అదంతా మొన్నటివరకు అని చెప్పొచ్చు. ఎందుకంటే రీసెంట్గా 'డీజే టిల్లు 2' ట్రైలర్ రిలీజైన తర్వాత అందరికీ ఒక్క నిమిషం మతి పోయింది. ఎందుకంటే హీరో సిద్ధుతో ఓ సీన్లో ఘాటైన ముద్దు సీన్లో కనిపించింది. అలానే లుక్స్ అన్నీ కూడా హాట్‌గానే ఉన్నాయి. చూస్తుంటే అస్సలు తగ్గినట్లు కనిపించట్లేదు. అయితే ఇలా గ్లామర్ ట్రీట్ ఇవ్వడం కోసం రెమ్యునరేషన్ కూడా గట్టిగానే అందుకుంటోందట. కేరళ కుట్టి అనుపమ.. సొంత భాషలో తీసిన 'ప్రేమమ్' మూవీతో హీరోయిన్ అయిపోయింది. 'అఆ' చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. దీని తర్వాత 'శతమానం భవతి', ఉన్నది ఒకటే జిందగీ, హలో గురు ప్రేమ కోసమే తదితర చిత్రాల్లో నటించింది. వీటన్నింటిలో కాస్త సంప్రదాయంగా ఉండే పాత్రల్లో కనిపించింది. కానీ ఎక్కడా గీత దాటినట్లయితే కనిపించలేదు. (ఇదీ చదవండి: క్షమాపణ చెప్పిన '12th ఫెయిల్' హీరో.. ఆ పోస్ట్ డిలీట్) కొన్నాళ్ల ముందు 'రౌడీ బాయ్స్' సినిమాలో నటించిన అనుపమ.. కొత్త కుర్రాడు ఆశిష్‌తో ముద్దు సన్నివేశాలు చేసి షాకిచ్చింది. దీని తర్వాత మళ్లీ కార్తికేయ 2, 18 పేజీస్ లాంటి సినిమాల్లో కాస్త నార్మల్‌గా కనిపించింది. ఇప్పుడు 'డీజే టిల్లు 2' పూర్తిగా రెచ్చిపోయింది. హాట్‌గా కనిపించడం, ఘాటైన లిప్ కిస్ సీన్స్ చేసింది. ఈ తరహా పాత్ర అనుపమకు తొలిసారి అని చెప్పొచ్చు. అయితే ఇప్పటివరకు ఒక్కో సినిమాకు రూ.కోటి నుంచి కోటిన్నర మధ్య రెమ్యునరేషన్ తీసుకుంటున్న అనుపమ.. 'టిల్లు స్వ్కేర్' కోసం మాత్రం రూ.2 కోట్ల వరకు పారితోషికం అందుకుందట. గ్లామర్ షో చేసినందుకు ఇదా అసలు కారణమని సినీ ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ ఈ మూవీ హిట్ అయితే ఇదే మొత్తాన్ని రెమ్యునరేషన్‌గా తీసుకోవాలని ఈ బ్యూటీ ఫిక్స్ అయిందట. మార్చి 29న 'డీజే టిల్లు 2' థియేటర్లలోకి రాబోతుంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి సూపర్‌స్టార్ సినిమా.. అనుకున్న టైమ్ కంటే ముందే!) -
'టిల్లు స్క్వేర్': ఇట్ల నవ్వే మా బతుకులు నవ్వులపాలు చేస్తరు!
‘డీజే టిల్లు’ వంటి హిట్ మూవీతో యూత్‌లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు హీరో సిద్ధు జొన్నలగడ్డ. ఆ సినిమా హిట్ కావడంతో దానికి సీక్వెల్‌గా 'టిల్లు స్క్వేర్' పేరుతో మరోసారి ప్రేక్షకుల ముందకు వచ్చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. 'ఆహా ఇట్ల నవ్వే.. మా బతుకు నవ్వులపాలు చేస్తారు తర్వాత.., పోయినసారికన్నా ఈసారి గట్టిగ తగిలేటట్లుంది దెబ్బ.. టిల్లు అనేటోడు నార్మల్ హ్యూమన్‌బీయింగ్ అయితే కాదు. నేనొక కారణజన్ముడిని..' అన్న డైలాగులు నవ్వు పుట్టిస్తున్నాయి. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. ఈ సినిమా మార్చి 29న విడుదల కానుంది. డీజే టిల్లు మాదిరే ఈ సినిమా కూడా అభిమానుల్నే కాకుండా ప్రేక్షకులందర్ని అలరిస్తుందని మేకర్స తెలిపారు. ‘టిల్లు స్క్వేర్’ కచ్చితంగా మరో మరిచిపోలేని వినోదాత్మక సినిమాగా నిలుస్తుందని వారు అభిప్రాయపడ్డారు. - పోడూరి నాగ ఆంజనేయులు -
‘టిల్లు స్క్వేర్’ ట్రైలర్ వచ్చేస్తోంది!
‘డీజే టిల్లు’ వంటి హిట్ మూవీతో యూత్‌లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు హీరో సిద్ధు జొన్నలగడ్డ. బుధవారం (ఫిబ్రవరి 7) ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా సిద్ధు నటిస్తున్న రెండు చిత్రాల (టిల్లు స్క్వేర్, జాక్) అప్డేట్స్ ఇచ్చారు మేకర్స్. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘జాక్’ అనే టైటిల్ ఖరారు చేసి, మోషన్‌పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ‘కొంచెం క్రాక్’ అనేది ట్యాగ్‌లైన్. ‘‘ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే మరిన్ని వివరాలను వెల్లడిస్తాం’’ అన్నారు బీవీఎస్ఎన్ ప్రసాద్. త్వరలో ట్రైలర్: ‘డీజే టిల్లు’కి సీక్వెల్‌గా రూపొందిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ సినిమా నుంచి స్పెషల్ బర్త్‌డే గ్లింప్స్‌ను విడుదల చేసింది యూనిట్. ఈ మూవీ ట్రైలర్ ఈ నెల 14న రిలీజ్ కానుంది. మార్చి 29న సినిమా రిలీజవుతోంది. -
వేసవిలో డీజే టిల్లు వస్తున్నాడు
వేసవికి థియేటర్స్‌లోకి వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు డీజే టిల్లు. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన ‘డీజే టిల్లు’ (2022) మంచి హిట్ సాధించింది. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ ‘డీజే టిల్లు స్క్వేర్’తో బిజీగా ఉన్నారు సిద్ధు జొన్నలగడ్డ. సీక్వెల్లో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్. మల్లిక్ రామ్ దర్శకత్వంలో శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాను ఫిబ్రవరి 9న విడుదల చేయాలనుకున్నారు. కొన్ని కారణాల వల్ల రిలీజ్‌ను మార్చి 29కి వాయిదా వేస్తున్నట్లుగా శుక్రవారం ప్రకటించారు మేకర్స్. ‘‘కొన్ని అనుకోని పరిస్థితుల కారణంగా ఫిబ్రవరి 9న అనుకున్న విడుదలను వాయిదా వేస్తున్నాం. వేసవి సెలవులను దృష్టిలో పెట్టుకొని చిత్రాన్ని మార్చి 29న విడుదల చేయాలని నిర్ణయించాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
ఒక్కక్లిక్ తో 4 సినిమాల అప్డేట్
-
ఎలా సహాయపడగలను రాధిక
‘‘చెప్పు రాధిక.. ఏం కావాల నీకు.. నేను నీకు ఎలా సహాయపడగలను రాధిక. ఈసారి నా కొంప ఎట్ల ముంచబోతున్నావు చెప్పు’’ అని సిద్ధు చెప్పే డైలాగ్‌తో ‘రాధిక..’ పాట ఆరంభమవుతుంది. ‘‘రాధిక ఎవరు.. నా పేరు రాధిక కాదు.. నా పేరు లిల్లీ’’ అంటుంది అనుపమ. సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా రూపొందిన ‘డీజే టిల్లు’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న ‘టిల్లు స్క్వేర్’లోని రెండో పాట ‘రాధిక..’. మల్లిక్ రామ్ దర్శకత్వంలో శ్రీకరా స్టూడియోస్ సమర్పణలో ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సహనిర్మాతగా సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరో సిద్ధు జొన్నలగడ్డ సరసన అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తున్నారు. చిత్ర సంగీతదర్శకుడు రామ్ మిరియాల ‘రాధిక..’ పాటను స్వరపరచి, పాడారు. ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. ‘రాధిక..’ పూర్తి పాటను సోమవారం విడుదల చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 9న ఈ చిత్రం రిలీజ్ కానుంది. -
'నా కొంప ఎలా ముంచబోతున్నావో చెప్పు రాధిక'..క్రేజీ సాంగ్ వచ్చేసింది!
'డీజే టిల్లు'తో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో సిద్ధు జొన్నలగడ్డ. ప్రస్తుతం టిల్లు స్క్వేర్తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 'డీజే టిల్లు' చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ మూవీలోని సెంకడ్ సింగిల్ పాటను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇప్పటికే విడుదలైన మొదటి సాంగ్ 'టికెట్టే కొనకుండా' అభిమానులను అలరిస్తోంది. తాజాగా 'రాధిక' పేరుతో వచ్చిన ఈ పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ గీతానికి కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. కాగా.. ఈ చిత్రం 2024, ఫిబ్రవరి 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి రామ్ మిరియాల సంగీతమందిస్తున్నారు. Here's the most energetic beat of the year, #Radhika from #TilluSquare 🕺 - https://t.co/X9teTtEAgl 🎹 & 🎤 @ram_miriyala ✍️ @LyricsShyam #Siddu @anupamahere @MallikRam99 @achurajamani @NavinNooli #SaiPrakash @vamsi84 #SaiSoujanya @SitharaEnts @Fortune4Cinemas… pic.twitter.com/EJ8t2CTfXV — Anupama Parameswaran (@anupamahere) November 27, 2023 -
Tillu Square: లేటుగా వస్తున్న ‘టిల్లుగాడు’
‘డీజే టిల్లు’ మూవీతో ఓవర్‌నైట్ స్టార్ అయ్యాడు సిద్ధు జొన్నలగడ్డ. అంతకుముందు పలు సినిమాల్లో నటించినప్పటికీ.. సిద్ధుకి తగిన గుర్తింపు రాలేదు. కానీ ఈ ఒక్క మూవీ మాత్రం ఈ యంగ్ హీరో జీవితాన్నే మార్చేసింది. సిద్దుని టిల్లు పాత్రలో మరోసారి చూడడానికి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండటంతో.. సిద్ధు, సితార ఎంటర్టైన్మెంట్స్ కలిసి 'డీజే టిల్లు' చిత్రానికి సీక్వెల్‌ను రూపొందించాలని నిర్ణయించారు. డీజే టిల్లు' సీక్వెల్ గా 'టిల్లు స్క్వేర్’ రూపొందింది. ఈ చిత్రం సెప్టెంబర్ 15న రాబోతున్నట్లు గతంలో ప్రకటించారు. కానీ అనూహ్యం వాయిదా వేస్తూ.. రిలీజ్ తేదిని త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. తాజాగా రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేసింది చిత్రబృందం. వచ్చే ఏడాది ఫిబ్రవరి 9న టిల్లుగాడు థియేటర్స్‌లో సందడి చేయనున్నాడు. డీజే టిల్లు చిత్రానికి ఏమాత్రం తగ్గకుండా పూర్తి వినోదాత్మకంగా మలచడానికే సినిమా విడుదల విషయంలో జాప్యం జరుగుతుందని మేకర్స్ అంటున్నారు. నిర్మాత సూర్యదేవర నాగ వంశీ మాట్లాడుతూ, టిల్లూ స్క్వేర్ కల్ట్ స్టేటస్‌ను అందుకుంటుందని, ఆ దిశగా కృషి చేస్తున్నామని తెలిపారు. ఇప్పుడు ఈ సినిమాను 2024 ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. టిల్ స్క్వేర్‌లో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తున్నారు. డీజే టిల్లులో నేహా శెట్టి పోషించిన రాధిక పాత్ర తరహాలో ఈ పాత్ర కూడా గుర్తుండిపోయేలా ఉంటుందని మేకర్స్ హామీ ఇచ్చారు. ఇప్పటికే, ఈ సినిమా ప్రచార చిత్రాల్లో అనుపమ కనిపిస్తున్న తీరు పెద్ద చర్చనీయాంశంగా మారింది. -
డిజె టిల్లు 2 విడుదల తేదీపై క్లారిటీ ఇవ్వని సిద్దు...
-
బెస్ట్ టీమ్‌తో కొత్త చిత్రాన్ని ప్రకటించిన 'సిద్ధు జొన్నలగడ్డ'
'గుంటూరు టాకీస్, కృష్ణ అండ్ హిజ్ లీలా' సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సిద్ధు జొన్నలగడ్డ ‘డి.జె టిల్లు’ సినిమాతో బాగా పాపులర్ అయ్యాడు. ఈ సినిమాతో యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. దీంతో డీజే టిల్లు సీక్వెల్ 'టిల్లు స్క్వేర్'తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇలా ఉండగా తాజాగా ఆయన నుంచి మరొక కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది. ఈ సినిమాకు తెలుసు కదా అనే సరికొత్త టైటిల్‌ను మేకర్స్ ఫిక్స్ చేశారు. సిద్దు జొన్నలగడ్డ సరసన రాశి ఖన్నాతో పాటు కెజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రానికి సంగీతం తమన్ అందిస్తుండగా.. యువరాజ్ కెమెరామెన్ బాధ్యతలు తీసుకున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన టీమ్ చాలా బలంగా కనిపిస్తోంది. సినిమా టైటిల్ వీడియో చాలా రిచ్‌గా చిత్రీకరించారు. ఈ వీడియో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో తమన్ అందించిన మ్యూజిక్ మనసును తాకేలా కూల్‌గా ఉంది. ఈ చిత్రానికి నేషనల్ అవార్డ్ విన్నింగ్ టెక్నిషియన్ శ్రీకర ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరించనుండటం విశేషం. (ఇదీ చదవండి: శ్రీలీల ఎవరి అమ్మాయో తెలిస్తే అంటూ షాకిచ్చిన అనిల్ రావిపూడి) టాలీవుడ్ స్టార్ రైటర్ కోన వెంకట్ ఫ్యామిలీ నుంచి బాద్షా చిత్రంతో కాస్ట్యూమ్ డిజైనర్‌గా ఇండస్ట్రీకి పరిచమైన నీరజ కోన ఈ చిత్రానికి మొదటిసారి దర్శకత్వం బాధ్యతలు తీసుకున్నారు. టాలీవుడ్లో స్టార్ హీరోల సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా గుర్తింపు పొందిన నీరజ దర్శకురాలిగా తొలిసారి మెగాఫోన్ పట్టారు. తెలుసు కదా సినిమా టీమ్ చూస్తే బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అని చెప్పవచ్చు. -
ఒకేసారి 3 సినిమాలు రిలీజ్ !
-
మజాక్ చేస్తున్న సత్తి... సీరియస్ అయినా సిద్దు
-
నా పెళ్ళికి కూడా ఇదే డీజే పెట్టుకుంటా..!
-
ఆ ఒక్క సాంగ్ కోట్లు తీసుకుని వచ్చింది: సిద్దు జొన్నలగడ్డ
-
విజయ్ దేవరకొండ స్టైల్ ని ఫాలో అవుతున్నావా..?
-
అన్ని సినిమాలు వేరు.. ఈ సినిమా వేరు
‘‘ఈ మధ్య కాలంలో నేను చూసిన మంచి ట్రైలర్లో ‘మంత్ ఆఫ్ మధు’ చిత్రం బెస్ట్. అన్ని సినిమాలు వేరు.. ఈ సినిమా వేరని ట్రైలర్లోనే తెలుస్తోంది. ఈ సినిమా సక్సెస్ అవుతుంది’’ అని హీరో సిద్ధు జొన్నలగడ్డ అన్నారు. నవీన్ చంద్ర, స్వాతీ రెడ్డి ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం ‘మంత్ ఆఫ్ మధు’. శ్రీకాంత్ నాగోతి దర్శకత్వంలో యశ్వంత్ ములుకుట్ల నిర్మించిన ఈ సినిమా ఈ నెల 6న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకి సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, సిద్ధు జొన్నలగడ్డ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ‘‘మంత్ ఆఫ్ మధు’ ట్రైలర్ బాగుంది’’ అన్నారు కీరవాణి. ‘‘ఇలాంటి సినిమాలు, ఇందులోనిపాత్రలు అరుదుగా వస్తుంటాయి’’ అన్నారు నవీన్ చంద్ర. ‘‘ఈ మూవీని ΄్యాషన్‌తో తీశాం.. ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు శ్రీకాంత్ నాగోతి, యశ్వంత్ ములుకుట్ల. -
ఈ ప్రేమకథలకు ట్రెండ్‌తో సంబంధం లేదు!
సినిమాల్లో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ నడుస్తుంది. ఒకసారి హారర్ది హవా అయితే ఇంకోసారి కామెడీది.. మరోసారి యాక్షన్ ఇరగదీస్తుంది.. అయితే ట్రెండ్‌తో సంబంధం లేని జానర్ ఏదంటే అది ‘లవ్’. అందుకే ఏడాది పొడవునా ‘ఇట్స్ లవ్ టైమ్’ అంటూ లవ్‌స్టోరీస్ రూపొందుతుంటాయి. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నవాటిలో, ఆన్ సెట్‌కి వెళ్లనున్న చిత్రాల్లో చాలా ప్రేమకథలు ఉన్నాయి. కొన్ని చిత్రాల గురించి తెలుసుకుందాం. పీరియాడికల్ లవ్... యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. అందులోనూ ఎక్కువగా యాక్షన్ సినిమాలే. జస్ట్ ఫర్ చేంజ్ అన్నట్టు అప్పుడప్పుడు ప్రేమకథలు ఒప్పుకుంటారు. ఆయన కెరీర్లో ‘వర్షం, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్’ వంటి పలు హిట్ ప్రేమకథా చిత్రాలున్నాయి. తాజాగా మరో లవ్ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట ప్రభాస్. ప్రేమకథా చిత్రాలను తనదైన శైలిలో ఆవిష్కరించే హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేయనున్నారని టాక్. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో పీరియాడికల్ లవ్‌స్టోరీగా ఈ సినిమా ఉంటుందట. అయితే ప్రభాస్ ప్రస్తుత కమిట్మెంట్స్ వల్ల హనుతో చేసే సినిమాకి ఇంకా టైమ్ పడుతుందట. గ్రామంలో ప్రేమ శ్రీకాకుళంలోని ఒక మారుమూల గ్రామం అది. ఓ అమ్మాయి–అబ్బాయి ప్రేమలో పడ్డారు. ఎవరెన్ని చేసినా విడదీయలేని ప్రేమ బంధం వారిది. అయితే అనుకోకుండా ఓ విపత్తు ఎదురవుతుంది. ఆ తర్వాత ఈ ప్రేమ జంట కథ ఎలాంటి మలుపు తీసుకుంది? అనే నేపథ్యంలో నాగచైతన్య హీరోగా ఓ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహించనున్నారు. మత్స్యకారుల నేపథ్యంలో సాగే ప్రేమకథగా ఈ చిత్రం ఉంటుంది. 2018లో గుజరాత్ వెరావల్ నుండి వేటకు వెళ్లి పాక్ కోస్ట్ గార్డ్‌కు చిక్కిన 21 మంది భారతీయుల్లో ఒక వ్యక్తి జీవితం నేపథ్యంలో ఈ చిత్రం ఉండనుందట. ఈ చిత్రం కోసం శ్రీకాకుళం యాస, భాషలు నేర్చుకుంటున్నారు నాగచైతన్య. ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ చివర్లో లేదా నవంబరులో ఆరంభం కానుంది. టిల్లు లవ్ అట్లుంటది మనతోని అంటూ రాధిక (నేహా శెట్టి) ప్రేమ కోసం వెంట పడి హిట్ సాధించారు సిద్ధు జొన్నలగడ్డ. విమల్ కృష్ణ దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ–నేహా శెట్టి జంటగా నటించిన చిత్రం ‘డీజే టిల్లు’. ఇప్పుడు ఆ ప్రేమని రెండు రెట్లు ఎక్కువగా అందించేందుకు సిద్ధమవుతున్నారు సిద్ధు జొన్నలగడ్డ. ఆయన హీరోగా మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా వచ్చే నెల 15న రిలీజ్ కానుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమాకి సంబంధించిన ‘టికెటే కొనకుండా.. ’ పాట లిరికల్ వీడియోలో హీరోయిన్ని ప్రేమలో పడేయడానికి హీరో పడే పాట్లు నవ్వులు తెప్పిస్తాయి. ‘డీజే టిల్లు’ కంటే ‘టిల్లు స్క్వేర్’లో నవ్వులు, ప్రేమ రెట్టింపు ఉంటాయని చిత్ర యూనిట్ ఇప్పటికే స్పష్టం చేసింది. మరి టిల్లు కొత్త ప్రేమ కహానీ ఏంటో తెలియాలంటే సెప్టెంబర్ 15 వరకూ వేచి చూడాలి. ఖుషీగా ప్రేమలో... హీరో విజయ్ దేవరకొండకి ప్రేమకథలు కొత్తేమీ కాదు. ‘అర్జున్ రెడ్డి, గీత గోవిందం, డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్’ వంటి ప్రేమ కథా చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత లవ్ స్టోరీస్ చేయకూడదనుకుని యాక్షన్ బాట పట్టారు. అయితే డైరెక్టర్ శివ నిర్వాణ చెప్పిన ప్రేమ కథ నచ్చడంతో ‘ఖుషి’ సినిమా చేశారు విజయ్. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా పలుమార్లు చె΄్పారు. ఈ మూవీలో సమంత హీరోయిన్. విప్లవ్ (విజయ్ దేవరకొండ), ఆరాధ్య(సమంత) ప్రేమించుకుంటారు. అయితే ఇంట్లో వాళ్లు ఒప్పుకోక΄ోవడంతో బయటకి వచ్చి పెళ్లి చేసుకుని కొత్త జీవితం మొదలెడతారు. ఆ తర్వాత తమ మధ్య తలెత్తిన మనస్పర్థలు, గొడవలను తట్టుకొని మళ్లీ ఎలా కలిశారు? అనే కథాంశంతో ‘ఖుషి’ రూపొందినట్లు టాక్. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 1న విడుదల కానుంది. ఇదిలా ఉంటే... ‘గీత గోవిందం’ (2018) వంటి ప్రేమకథా చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న హీరో విజయ్ దేవరకొండ–దర్శకుడు పరశురామ్ కాంబినేషన్లో మరో సినిమాకి శ్రీకారం జరిగింది. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్. ప్రేమకథ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోందని టాక్. -
ప్రేమలో ముగినితేలుతున్న టాలీవుడ్ హీరోలు
టాలీవుడ్లో ప్రేమ కథలకు మంచి ఆదరణ ఉంటుంది. కొంచెం కొత్తగా ప్రేమ కథను చెబితే చాలు ఆ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. అందుకే మన దర్శకనిర్మాతలు లవ్‌స్టోరీలకు అతి ప్రాధాన్యత ఇస్తారు. హీరోలు సైతం తొలుత లవ్‌స్టోరీలు చేయడానికే ఇష్టపడతారు. ఆ తర్వాత కొంతకాలానికి మాస్ ఇమేజ్‌ని కోరుకుంటారు. ఆ తరహా సినిమాలు వర్కౌట్ అయితే సరే, ఏ మాత్రం తేడా కొట్టినా.. ఉన్న ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. దాని నుంచి తేరుకునేందుకు మళ్లీ ప్రేమ బాట పడతారు. ప్రస్తుతం టాలీవుడ్ చెందిన కొంతమంది హీరోలు అదే పని చేస్తున్నారు. యాక్షన్‌ని నో చెప్పి ప్రేమలో మునిగితేలుతున్నారు. వరుసగా లవ్‌స్టోరీలు చేస్తూ బీజీగా ఉన్న హీరోలపై ఓ లుక్కేద్దాం. ప్యార్‌కి సై అంటున్న విజయ్ ‘లైగర్’తో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు విజయ్ దేవరకొండ. కానీ ఆ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. దీంతో విజయ్ యాక్షన్‌కి రాం రాం చెప్పాడు. హిట్ అందుకునేందుకు మళ్లీ ‘గీత గోవిందం’ పార్మెట్లోకి వెళ్లి పోయాడు. శివ నిర్మాణతో కలిసి ‘ఖుషి’ సినిమా చేస్తున్నాడు. సమంత హీరోయిన్. సెప్టెంబర్ 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత కూడా విజయ్ మరో ప్రేమ కథా చిత్రంతోనే ప్రేక్షకులను పలకరించనున్నాడు. గీత గోవిందం దర్శకుడు పరశురాంతో విజయ్ ఓ సినిమా చేస్తున్నాడు. ఇది కూడా లవ్‌స్టోరీనే. గీత గోవిందం చిత్రానికి ఇది సీక్వెల్. ఇలా విజయ్ యాక్షన్‌కి నో చెప్పి ఫ్యార్కి సై అంటున్నాడు. మరోసారి ప్రేమలో పడ్డ డీజే టిల్లు ప్రేమలో పడడమే పనిగా పెట్టుకున్నాడు సిద్దు జొన్నలగడ్డ. డీజే టిల్లుతో సూపర్ హిట్ కొట్టిన ఈ యంగ్ హీరో త్వరలోనే ఈ చిత్రం సీక్వెల్ ‘టిల్లు స్క్వేర్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇది కూడా లవ్ స్టోరీనే. ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ చూస్తే ఆ విషయం ఇట్టే అర్థమవుతుంది. ఇక ఈ చిత్రం తర్వాత కూడా మళ్లీ లవ్‌స్టోరీలోనే కనిపించబోతున్నాడు ఈ టిల్లుగాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సిద్దు ఓ సినిమా చేస్తున్నాడు. ఇది పూర్తి ప్రేమ కథా చిత్రమని తెలుస్తోంది. ఫేవరెట్ జానర్లోకి చైతూ రీఎంట్రీ మొదట్లో వరుసగా లవ్‌స్టోరీలు చేస్తూ లవర్ బాయ్‌గా ముద్ర వేసుకున్నాడు నాగ చైతన్య. ఆ ముద్ర నుంచి బయట పడేందుకు మధ్య మధ్యలో యాక్షన్ చిత్రాలు చేశాడు. కానీ అవేవి హిట్ కాలేదు. అయినప్పటికీ యాక్షన్‌ని వీడలేదు. కానీ ఆ మధ్య విడుదలైన ‘కస్టడీ’ చైతు కల్లు తెరిపించింది. విడుదలైన తొలి రోజే డిజాస్టర్ టాక్ వచ్చింది. దీంతో చై మళ్లీ తన ఫేవరెట్ జానర్లోకి తిరిగి వచ్చాడు. ప్రేమమ్ డైరెక్టర్ చందు మొండేటితో కలిసి త్వరలోనే పాన్ ఇండియా స్థాయిలో లవ్‌స్టోరీ చేయబోతున్నాడు. దానికి సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్ ఈ మధ్యే స్టార్ట్ అయింది. ఈ చిత్రంలో నాగచైతన్యకు జోడీగా కీర్తి సురేశ్ నటించబోతున్నట్లు సమాచారం. ఇలా మొత్తానికి టాలీవుడ్ యంగ్ హీరోలంతా మళ్లీ లవ్‌స్టోరీలు చేస్తూ ప్రేమలో మునిగిపోతున్నారు. -
Tillu Square: అనుపమతో డీజే టిల్లు ఫ్లర్టింగ్.. ప్రోమో అదిరింది!
‘డీజే టిల్లు’.. ఈ ఒక్క మూవీతో ఓవర్‌నైట్ స్టార్ అయ్యాడు సిద్ధు జొన్నలగడ్డ. అంతకు ముందు పలు సినిమాల్లో నటించినా సిద్దుకు తగిన గుర్తుంపు రాలేదు. కానీ డీజే టిల్లు మాత్రం అతని జీవితాన్ని మార్చేసింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రామ్ మల్లిక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సీక్వెల్‌కు టిల్లు స్క్వేర్ అని టైటిల్ ఫిక్స్ చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి ఓ అప్డేట్ ఇచ్చింది చిత్ర యూనిట్. సినిమాలోని 'టికెటే కొనకుండా' అనే పాటను జులై 26న రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ ప్రోమోని విడుదల చేసింది చిత్ర యూనిట్. అందులో సిద్ధు తనదైన స్టైల్లో అనుపమను ఫ్లర్టింగ్ చేశాడు. ఓ పార్టీలో వాష్ బేసిన్ వద్ద షూస్ క్లీన్ చేస్తున్న సిద్ధు.. అక్కడే ఉన్న అనుపమను చూస్తూ.. ‘మనసు విరిగినట్టున్నది ఎక్కడనో’అనడంతో ఆమె కోపంగా చూస్తుంది. ఉన్నడా బాయ్‌ఫ్రెండ్? అనడంతో.. ‘నీకెందుకు’ అంటుంది అను. అప్పుడు సిద్దు..‘ఒకవేళ ఉంటే నా షూ నేనేసుకుని వెళ్లిపోతా, లేడంటే.. ‘నిన్నేసుకొని పోతా’అంటాడు. ‘అబా.. ఎక్కడికి?’అని అను అంటే..‘నువ్వు ఏడికంటే ఆడికి’అని సిద్ధు రిప్లై ఇస్తాడు. ‘ఇప్పుడే కదరా కలిశాం. అప్పుడే ఓపెన్‌గా ఫ్లర్ట్ చేస్తావా’ అంటుంది అనుపమ. ‘మరి ఫ్లర్ట్ చేస్తున్న సంగతి నీకు తెల్వాలే గదా. లేకపోతే చేసి ఉపయోగం ఏముంది?’ అంటూ ఫన్నీగా ఆ ప్రోమో సాగుతుంది. ప్రోమోని ఇంత కామెడీగా ఉంది అంటే.. ఇక సినిమా ఏ రేంజ్లో ఉంటుందో అని ఫ్యాన్స్ అంచనాలు పెంచేసుకుంటున్నారు. -
మాస్ మల్టీస్టారర్
-
ఆ రింగ్ ఉంటే లైఫ్ రిచ్.. ఆసక్తికరంగా ‘భాగ్ సాలే’వీడియో గ్లింప్స్
శ్రీసింహా కోడూరి, నేహా సోలంకి హీరోహీరోయిన్లుగా నటించిన తాజా మూవీ ‘భాగ్ సాలే’. ప్రణీత్ బ్రాహ్మాండపల్లి దర్శకత్వంలో క్రైమ్ కామెడీ గా తెరకెక్కిన ఈ సినిమా జులై 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ‘వరల్డ్ ఆఫ్ భాగ్ సాలే’పేరుతో వీడియో గ్లింప్స్‌ను విడుదల చేశారు మేకర్స్. సిద్ధు జొన్నల గడ్డ వాయిస్ ఓవర్‌తో ఉన్న ఆ వీడియోలో ఓ వజ్రం వెనక ఉన్న కథను చెప్పారు.స్వాతంత్రం రాకముందు ఇండియాలో దొరిగిన ఓ వజ్రం అన్ని దేశాలు తిరిగి..ఒక ముక్క నైజాం రాజు వద్దకు వస్తుంది. దాన్ని నైజాం రాజు ఉంగరంగా మార్చుకొని వేలుకి పెట్టుకుంటే.. ఆ ఉంగరాన్ని కొట్టేసిన ఫ్యామిలీ అంటూ ఓ కథని తన వాయిస్ ఓవర్ తో చెప్పుకొచ్చాడు సిద్ధూ జొన్నలగడ్డ. ఆ వజ్రం చుట్టే ‘బాగ్ సాలే’ సినిమా ఉంటుందని ఈ వీడియో ద్వారా తెలుస్తోంది. (చదవండి: బిడ్డకు జన్మనిచ్చిన బుల్లితెర నటి.. సోషల్ మీడియాలో వైరల్!) సురేష్ బాబు సమర్పణలో వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై బిగ్ బెన్, సినీ వ్యాలీ మూవీస్ వారి అసోసియేషన్ తో అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల నిర్మిస్తున్న ఈసినిమాలో జాన్ విజయ్, రాజీవ్ కనకాల, వెన్నెల కిషోర్, నందినీరాయ్, సుదర్శన్, వంశీ నెక్కంటి, వైవా హర్ష, కిడ్ చక్రి, జయవాణి, బాష, యాదం రాజు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాలభైరవ సంగీతాన్ని అందిస్తున్నాడు. -
6 కోట్లు ఇస్తేనే ఆటోగ్రాఫ్ అట్లుంటది డీజే టిలుతో
-
పడతారండి ప్రేమలో మళ్లీ..!
నిన్నమొన్నటివరకూ పాన్ ఇండియా ట్రెండ్‌లో యాక్షన్ సినిమాలొచ్చాయి. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో మళ్లీ లవ్ట్రెండ్ మొదలైంది. యాక్షన్ సినిమాలు చేస్తున్న హీరోలు మళ్లీ వెండితెరపై ప్రేమలో పడటానికి ప్రేమకథలు వింటున్నారు. కొందరి ప్రేమకథలు ఆల్రెడీ ఆన్ సెట్స్‌లో ఉన్నాయి. ఈ వెండితెర ప్రేమికుల ప్రేమకథా చిత్రాల గురించి తెలుసుకుందాం. ► ప్రభాస్ అనగానే సినిమా లవర్స్ ఎక్కువగా ‘బాహుబలి’, ‘ఛత్రపతి’, ‘మిర్చి’, ‘సాహో’ వంటి యాక్షన్ మూవీస్ గురించి మాట్లాడుకుంటారు. కాగా ప్రభాస్ కెరీర్లో మంచి హిట్స్ సాధించిన ‘వర్షం’, ‘డార్లింగ్’, ‘మిస్టర్ పర్ఫెక్ట్’ వంటి ప్రేమకథా చిత్రాలు కూడా ఉన్నాయి. అయితే గడచిన పదేళ్లల్లో ప్రభాస్ ‘రాధేశ్యామ్’ (2022) తప్ప అన్నీ యాక్షన్ చిత్రాలే చేశారు. ప్రస్తుతం ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కె’ సినిమాలతో యాక్షన్ మోడ్‌లోనే ఉన్నారు. మళ్లీ ఓ ప్రేమక£ý చేయాలని ప్రభాస్ భావిస్తున్నారట. ఇందులో భాగంగా లవ్ స్టోరీస్ స్పెషలిస్ట్ డైరెక్టర్ హను రాఘవపూడి రెడీ చేసిన ఓ ప్రేమ కథను ప్రభాస్ విన్నారని, ఇది పీరియాడికల్ లవ్‌స్టోరీ అనీ సమాచారం. ► ‘100 పర్సెంట్ లవ్’, ‘ఏ మాయ చేసావె’, ‘మనం’ , ‘ఒక లైలా కోసం’, ‘ప్రేమమ్’, ‘మజిలీ’, ‘లవ్‌స్టోరీ’.... ఇలా చెప్పుకుంటూ పోతే నాగచైతన్య కెరీర్‌లోని మేజర్ పార్ట్ అంతా ప్రేమతోనే నిండిపోయి ఉంటుంది. కాగా తన గత చిత్రం ‘కస్టడీ’లో నాగ చైతన్య ఎక్కువగా యాక్షన్ చేశారు. అయితే చైతూ తన ప్రేమతో మరోసారి ఆడియన్స్‌ను ప్రేమలో పడేయనున్నారని తెలుస్తోంది. నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. సూరత్ బ్యాక్‌డ్రాప్‌తో సాగే ఓ లవ్‌స్టోరీగా ఈ చిత్రం తెరకెక్కనుందని, ఇందులో నాగచైతన్య బోటు డ్రైవర్ పాత్ర చేయనునున్నారనీ టాక్. ► హీరో విజయ్ దేవరకొండ కెరీర్లో ప్రేమ, మాస్ కథలు సమానంగా కనిపిస్తాయి. కానీ విజయ్‌కు ఇండస్ట్రీలో మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది మాత్రం మాస్ లవ్‌స్టోరీ ‘అర్జున్‌రెడ్డి’, క్లాస్ లవ్‌స్టోరీస్ ‘పెళ్ళి చూపులు’, ‘గీతగోవిందం’ వంటి సినిమాలే. దీంతో విజయ్ మరోసారి లవ్‌స్టోరీస్‌పై ఫోకస్ పెట్టినట్లు ఉన్నారు. దర్శకుడు శివ నిర్వాణతో విజయ్ ప్రస్తుతం ‘ఖుషి’ అనే లవ్‌స్టోరీ చేస్తున్నారు. ఇందులో సమంత హీరోయిన్. అలాగే ‘గీత గోవిందం’ తర్వాత దర్శకుడు పరశురామ్‌తో మరో సినిమా చేస్తున్నారు విజయ్. ఇది కూడా ప్రేమకథా చిత్రమేనన్నది ఫిల్మ్‌నగర్ టాక్. ► ‘డీజే టిల్లు’తో మరింత పాపులారిటీని సాధించిన సిద్ధు జొన్నలగడ్డ కెరీర్లో ‘కృష్ణ అండ్ హిజ్ లీల’, ‘మా వింత గాథ వినుమా’ వంటి ప్రేమకథా చిత్రాలు ఉన్నాయి. ప్రస్తుతం సిద్ధు ‘డీజే టిల్లు స్క్వేర్’తో బిజీగా ఉన్నారు. అలాగే దర్శకురాలు నందినీ రెడ్డితో ఓ సినిమా కమిట్ అయ్యారు. ఓ డిఫరెంట్ లవ్‌స్టోరీగా ఈ చిత్రం తెరకెక్కనుందని టాక్. ► ‘దొరసాని’ వంటి ప్రేమకథతో పరిచయం అయిన ఆనంద్ దేవరకొండ ఆ తర్వాత ‘హైవే’ వంటి క్రైమ్ థ్రిల్లర్ చేశారు. ఆనంద్ నటించిన మరో లవ్‌స్టోరీ ‘బేబీ’. ప్రేమకథా చిత్రంగా సాయిరాజేష్ తెరకెక్కించిన ఈ చిత్రం జూలై 14న రిలీజ్ కానుంది. మరికొందరు హీరోలు కూడా ఆడియన్స్‌ను ప్రేమలో పడేసేందుకు ప్రేమకథలు వింటున్నట్లు తెలుస్తోంది. ► ‘హలో’, ‘మిస్టర్ మజ్ను’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’... ఇలా కొన్ని ప్రేమకథల్లో నటించారు అఖిల్. అయితే అఖిల్ గత చిత్రం ‘ఏజెంట్’ ఫుల్ యాక్షన్ ఫిల్మ్. దీంతో తన తర్వాతి చిత్రాన్ని లవ్ జానర్లోనే చేయాలనుకుంటున్నారట అఖిల్. ఈ క్రమంలోనే అనిల్‌కుమార్ అనే ఓ కొత్త దర్శకుడి కథకు అఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనీ, ఫ్యాంటసీ లవ్‌స్టోరీ బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా కథనం ఉంటుందని, ‘ధీర’ టైటిల్‌ను పరిశీలిస్తున్నారనీ టాక్. -
వినాయక చవితి కు రిలీజ్ అవ్వనున్న టిల్లు స్క్వేర్
-
డీజే టిల్లు 2 రిలీజ్ డేట్ వచ్చేసింది
‘డీజే టిల్లు పేరు.. వీని స్టయిలే వేరు..’ అంటే యూత్‌తో పాటు ఫ్యామిలీస్‌ని కూడా ఆకట్టుకున్నాడు టిల్లు. సిద్ధు జొన్నలగొడ్డ టైటిల్ రోల్లో మీడియమ్ బడ్జెట్‌తో రూపొందిన ‘డీజే టిల్లు’ మంచి వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా సిద్ధు జొన్నలగడ్డతోనే నాగవంశీ, సాయి సౌజన్య ‘టిల్లు స్క్వేర్’ చిత్రం నిర్మిస్తున్నారు. మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్ కథానాయిక. ఈసారి రెట్టింపు వినోదం గ్యారంటీ అంటూ.. సెప్టెంబర్ 15న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు సోమవారం చిత్ర యూనిట్ ప్రకటించింది. అలాగే సిద్ధు, అనుపమల రొమాంటిక్ పోస్టర్ని రిలీజ్ చేసింది. ఈ చిత్రానికి సంగీతం: రామ్ మిరియాల, శ్రీ చరణ్ పాకాల, కెమెరా: సాయి ప్రకాశ్ ఉమ్మడిసింగు, సమర్పణ: శ్రీకర స్టూడియోస్. View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) -
సిద్దూ జొన్నలగడ్డతో సమంత? యంగ్ హీరోకు క్రేజీ ఆఫర్
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది.పాన్ ఇండియా మూవీ ఖుషితో పాటు సిటాడెల్ వంటి వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఇటీవల ఆమె నటించిన శాకుంతలం భారీ డిజాస్టర్‌గా నిలిచింది.ఇక ఈ మూవీ రిజల్ట్ గురించి పెద్దగా పట్టించుకోని సామ్ తను తర్వాత చేయబోయే సినిమాలై దృష్టి పెట్టింది. ఇప్పటికే కమిట్ అయిన ఖుషి, సిటాడెల్ తర్వాత సమంత ఓ యంగ్ హీరోతో జతకట్టనుందట. ఇండస్ట్రీలో క్రేజీ హీరోగా పేరున్న ఆ హీరోతో సామ్ ఓ మూవీ చేయబోతుందని ఇన్సైడ్ సినీ సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ హీరో మరెవరో కాదు సిద్దు జొన్నలగడ్డ. డీజే టిల్లుతో ఇండస్ట్రీలో క్రేజీ హీరోగా మార్క్ సంపాదించుకున్నాడు సిద్దు. డీజే టిల్లులో సిద్దు యాక్టింగ్, డైలాగ్ డెలివరీకి ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. వన్ మ్యాన్ షోలా డీజే టిల్లు మూవీని ఒంటి చేత్తో హిట్ చేయించాడు సిద్దు. దాంతో అతడు రాత్రికి రాత్రే స్టార్డమ్ తెచ్చుకున్నాడు. చదవండి: Jr Ntr : జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? ఇక ఈ క్రేజీ హీరోతో సినిమా చేసేందుకు నిర్మాత రామ్ తళ్లూరి ప్లాన్ చేస్తున్నాడ. ఈ ప్రాజెక్ట్‌కి నందినీరెడ్డి దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. నందినిరెడ్డి-సమంతల మధ్య మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. ఓ బేబీ మూవీ నుంచి నందిని రెడ్డి, సమంతలు మంచి స్నేహితులయ్యారు. సోషల్ మీడియాలో వారిద్దరు ఎప్పుడూ సరదాగా చిట్‌చాట్ చేసుకుంటుంటారు. దాంతో నందినిరెడ్డి ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పడంతో సమంత పాజిటివ్‌గా రెస్పాండ్ అయినట్టు టాక్. ఇక స్టార్ హీరోయిన్ సమంత సరసన నటించే ఛాన్స్‌ను ఎవరు వదులుకుంటారు? అందుకే సిద్దూ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నాయట. అంతా ఒకే అయితే త్వరలోనే తెరపైకి సమంత-సిద్దు కాంబినేషన్ రానుందని టాక్. మరి ఈ వార్తలపై క్లారిటీ రావాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే. చదవండి: వెంకటేశ్ మూవీలో విలన్‌గా బాలీవుడ్ నటుడు.. ఫస్ట్ లుక్ చూశారా? -
DJ టిల్లుతో సమంత రొమాన్స్..?
-
మరో మాస్ కాంబినేషన్
-
వాల్తేరు వీరయ్య...ఇప్పుడు DJ వీరయ్య
-
కాంబినేషన్ సెట్?
హీరో చిరంజీవి, దర్శకుడు కల్యాణ్ కృష్ణ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కేందుకు రంగం సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఆల్రెడీ చిరంజీవికి కల్యాణ్ కృష్ణ ఓ కథ వినిపించారట. ఈ స్క్రిప్ట్ చిరంజీవికి నచ్చిందని, త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలిసింది. అయితే ఈ సినిమా కథ రీత్యా ఓ కుర్ర హీరోకి కీలక పాత్రలో నటించేందుకు స్కోప్ ఉందట. ఈ కుర్ర హీరో పాత్రకు సిద్ధు జొన్నలగడ్డ అయితే బాగుంటుందని చిత్ర యూనిట్ భావిస్తోందని, ఆల్రెడీ సంప్రదింపులు జరిగాయని భోగట్టా. త్వరలోనే ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. చిరంజీవి టైటిల్ రోల్లో మెహర్ రమేష్ దర్శకత్వంలో రూ΄పొం దుతున్న తాజా చిత్రం ‘భోళా శంకర్’ ఆగస్టు 11న విడుదల కానున్న విషయం తెలిసిందే. -
Siddu Jonnalagadda : గేమింగ్ జోన్ ప్రారంభోత్సవంలో సందడి చేసిన డీజే టిల్లు (ఫొటోలు)
-
నేను ఆ డైరెక్టర్‌తో రిలేషన్ షిప్లో ఉన్నాను : 'డీజే టిల్లు' హీరో
సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన డీజే టిల్లు ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం సిద్దు కెరీర్లో సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. దీంతో ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ రాబోతుంది. ‘డీజే టిల్లు స్క్వేర్’గా తెరకెక్కుతున్న ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఏదో ఒక కాంట్రవర్సీ చుట్టుముడుతూనే ఉంది. ముందుగా ఈ సీక్వెల్ నుంచి డైరెక్టర్ విమల్ కృష్ణ తప్పుకున్నాడు. ఆ తర్వాత హీరోయిన్ల విషయంలో చాలామంది పేర్లు తెరపైకి వచ్చినా ఫైనల్‌గా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా ఫైనలైజ్ చేశారు. అయితే కొన్ని రోజుల క్రితం షూటింగ్ సెట్లో సిద్దూకి, అనుపమకి గొడవ జరగడంతో ఆమె వాకౌట్ చేసి వెళ్లిపోయినట్లు పలు రూమర్స్ తెరమీదకి వచ్చాయి. తాజాగా ఈ వార్తలపై సిద్దూ జొన్నలగడ్డ స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన ఈ వివాదాలపై క్లారిటీ ఇచ్చారు. 'సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. నిజానికి మేం ఈ సినిమాకు ముందుగా అప్రోచ్ అయ్యింది అనుపమనే. ఇక డైరెక్టర్ విమల్ కృష్ణతో గొడవపై స్పందిస్తూ.. లైవ్‌లోనే అతడికి కాల్ చేసి తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవు అంటూ క్లారిటీ ఇచ్చాడు. ''ప్రస్తుతం ‘డీజే టిల్లు స్క్వేర్’ డైరెక్ట్ చేస్తున్న మాలిక్ రామ్‌తో నేను రిలేషన్షిప్లో ఉన్నాను. అతడు మా ఇంట్లోనే ఉంటాడు. మా దగ్గరే తింటడు. అతను పడుకుంటే దుప్పటి కూడా నేనే కప్పుతా. అంతలా నేను డైరెక్టర్స్‌తో రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తా. కృష్ణ అండ్ హిస్ లీలా( Krishna And His Leela) డైరెక్టర్‌కు అయితే ముద్దు కూడా పెట్టాను'' అంటూ సరదాగా చెప్పుకొచ్చాడు సిద్దూ. -
డీజే టిల్లు-2 నుంచి అనుపమ ఫస్ట్‌లుక్ విడుదల
సిద్ధూ జొన్నలగడ్డ నటించిన ‘డీజే టిల్లు’ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్లను వసూలు చేసింది.ఇప్పుడీ సినిమాకు సీక్వెల్ రాబోతుంది. ‘డీజే టిల్లు స్క్వేర్’గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పలు హీరోయిన్లు పేర్లు వినిపించినా చివరికి అనుపమ పరమేశ్వరన్ ఫైనలైజ్ అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా సెట్స్‌మీదుంది. తాజాగా అనుపమ పుట్టినరోజు సందర్బంగా డీజే టిల్లు 2 నుంచి అనుపమ పోస్టర్ విడుదలైంది. ఇది ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక ఈ సందర్భంగా అనుపమకు పలువురు సెలబ్రిటీలు, నెటిజన్ల నుంచి బర్త్‌డే విషెస్ అందుతున్నాయి. Wishing the very gorgeous, our @anupamahere a very happy birthday.🤩 - team #TilluSquare #HBDAnupamaParameswaran ✨#Siddu @MallikRam99 @ram_miriyala @vamsi84 #SaiSoujanya @SitharaEnts @Fortune4Cinemas #SrikaraStudios pic.twitter.com/kCjtLPegij — Sithara Entertainments (@SitharaEnts) February 18, 2023 -
మహిళా డైరెక్టర్‌తో సిద్ధు జొన్నలగడ్డ కొత్త మూవీ!
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించనున్న కొత్త సినిమా షురూ అయింది. మంగళవారం (ఫిబ్రవరి 7) సిద్ధు జొన్నలగడ్డ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాను ప్రకటించారు. సిద్ధు కెరీర్లో 8వ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్నారు. ఈ సినిమాతో వైష్ణవి దర్శకురాలిగా పరిచయం కానున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి. Get ready to enter into the world of fun, love & entertainment 🥳❤️🤩 We are very happy to collaborate again with @SVCCOfficial for our next project 🎬 with Star Boy #SiddhuJonnalagadda. Directed by Vaisshnavi. #Siddhu8 on floors very soon. pic.twitter.com/ceJiPQfjHH — Sukumar Writings (@SukumarWritings) February 7, 2023 చదవండి: రూమర్లు ఎక్కువ, అవకాశాలు తక్కువ.. అవకాశాల కోసం నిధి వేట -
ఎల్బీ నగర్లో హీరో సిద్దు, హీరోయిన్లు అనుపమ, శ్రీలీల సందడి!
వాసవి ఆనంద నిలయం గేటెడ్ కమ్యూనిటీ ప్రారంభం లింగోజిగూడ: దక్షిణ భారత్‌లోనే అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటి ప్రాజెక్ట్ ఎల్బీనగర్లో ప్రారంభమైంది. ఎల్బీనగర్ మెట్రోస్టేషన్ వద్ద వాసవి నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో నూతనంగా చేపట్టిన ఆనంద నిలయం గేటెడ్ కమ్యూనిటీని ఆదివారం ప్రారంభించారు. శ్రీముఖి యాంకర్‌గా వ్యవహరించిన ఈ ప్రారంభోత్సవంలో ప్రముఖ సినీ నటులు సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్, శ్రీలీల పాల్గొని సందడి చేశారు. వాసవి నిర్మాణ సంస్థ చైర్మన్, ఎండీ ఎర్రం విజయ్‌కుమార్, డైరెక్టర్లతో కలసి సినీ నటులు ఆనంద నిలయం లోగో, ఎలివేషన్, బ్రోచర్లను అవిష్కరించారు. ఈ సందర్భంగా సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్, శ్రీలీలలు మాట్లాడుతూ వాసవి ఆనంద నిలయం ప్రాజెక్ట్‌ను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. వాసవి నిర్మాణ సంస్థ చైర్మన్, ఎండీ ఎర్రం విజయ్‌కుమార్ మాట్లాడుతూ ఆనంద నిలయంలో ప్రజల కోసం ఎన్నో సకల సౌకర్యాలు కల్పించనున్నామని అన్నారు. 29.3 ఎకరాలలో 11టవర్ల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. 3576 ఫ్లాట్లు అందుబాటులోకి రానున్నాయన్నారు. వీటితో పాటు పిల్లకోసం ఆట స్థలం, బ్యాడ్మింటన్, టెన్నిస్, క్రికె ట్ గ్రౌండ్, జిమ్ వంటి సౌకర్యాలు ఉంటయన్నారు. దక్షిణ భారత్‌లోనే అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీ అయిన ఆనంద నిలయంలో అతి తక్కువ ధరకే ప్రజలకు ఫ్లాట్లను అందుబాటులో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొగ్గరపు దయానంద్, టూరిజం డవపల్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రాంమోహన్, సంస్థ డైరెక్టర్లు ఎర్రం వైష్ణవి, ఎర్రం వనిత, దివ్య, సౌమ్య, రాజేశ్, అభిషేక్ చంద్రత తదితరులు పాల్గొన్నారు. -
డీజే టిల్లు-2 సెట్స్‌లో అనుపమ-సిద్ధూ గొడవపడ్డారా?
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన డీజే టిల్లు ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ రాబోతుంది. అయితే ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి వరుస వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. ముందుగా ఈ సీక్వెల్ నుంచి డైరెక్టర్ విమల్ కృష్ణ తప్పుకున్నాడు. ఆ తర్వాత హీరోయిన్ల విషయంలో మార్పులు జరుగుతూనే ఉన్నాయి. ముందుగా పెళ్లిసందD బ్యూటీ శ్రీలలను తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఏమైందో కానీ ఆమె ప్లేస్‌లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తుందంటూ పోస్టర్ రిలీజ్ చేశారు. తాజాగా ఆమె కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి ఆమె తప్పుకుందంటూ ఫిల్మ్‌నగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. సెట్లో సిద్దూతో అనుపమకు గొడవ అయ్యిందని, అందుకే ఈ సినిమా నుంచి తప్పుకుందని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో సిద్దు యూటిట్యూడ్‌పై రకరకాల వార్తలు షికార్లు చేస్తున్నాయి. “DJ టిల్లు హిట్ అవ్వడంతో సిద్ధు జొన్నలగడ్డకి హెడ్ వెయిట్ ఎక్కువ అయ్యింది. అందుకే ఈ సీక్వెల్ నుంచి దర్శకుడు విమల్ కృష్ణ తప్పుకున్నాడు, హీరోయిన్ శ్రీలల తప్పుకుంది. ఇప్పుడు అనుపమ కూడా వెళ్లిపోయింది అంటూ రకరకాలుగా ప్రచారం జరుగుతుంది. దీనిపై ప్రొడ్యూసర్ నాగవంశీ స్పందించాడు. డీజే టిల్లు-2కి సంబంధించిన ఓ వెబ్సైట్లో వచ్చిన వార్తలపై ఆయన ట్వీట్ చేస్తూ.. మీలో మంచి రైటర్ ఉన్నాడు. సినిమాల్లో ట్రై చేయండి అంటూ కౌంటర్ ఇచ్చాడు. కానీ హీరోయిన్ల మార్పుపై మాత్రం ప్రకటన చేయలేదు. దీంతో నెట్టింట చక్కర్లు కొడుతున్న వార్తల్లో నిజముందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. Success Gone Into #SidduJonnalagadda's Head? 👉VimalKrishna,who directed #DJTillu,dropped out of project.#Sreeleela was first choice for the heroine,She walked out 👉Now #AnupamaParameswaran walked out of the film. Anupama & Siddhu reportedly had a heated argument on the sets — PaniPuri (@THEPANIPURI) November 29, 2022 -
డీజే టిల్లుకు హీరోయిన్ల తిప్పలు.. అనుపమ కూడా అవుట్!
సిద్దు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన డీజే టిల్లు బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకున్న సంగతి తెలిసిందే. చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం సిద్దు కెరీర్లో సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది.విమల్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుంది. ఇప్పటికే షూటింగ్ కూడా ప్రారంభమయ్యింది. ఇప్పుడు హీరోయిన్ను మార్చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. డీజే టిల్లులో నటించిన నేహాశెట్టిని మొదట్లోనే సైడ్ చేశారు. ఆ తర్వాత శ్రీలలను తీసుకున్నట్లు వార్తలు వచ్చినా ఆమె ప్లేస్‌లో మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్‌ను ఫైనలైజ్ చేశారు. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది, ఇద్దరూ కలిసి షూటింగ్లో కూడా పాల్గొన్నారు. అయితే మళ్లీ ఏమైందో ఏమో తెలియదు కానీ అనుపమ కూడా ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తుంది. ఈసారి అనుపమ ప్లేస్‌లో ప్రేమమ్ బ్యూటీ మడోన్నా సెబాస్టియన్ నటిస్తుందని ఫిల్మ్‌నగర్ టాక్. మరి ఈ హీరోయిన్ అయినా మొత్తం సినిమా అయ్యే వరకు ఉంటుందా? లేక మధ్యలోనా తప్పిస్తారా అన్నది చూడాల్సి ఉంది. -
'డీజే టిల్లు' సీక్వెల్ రాబోతుంది.. హీరోయిన్ ఎవరో తెలుసా?
సిద్దు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన డీజే టిల్లు బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకున్న సంగతి తెలిసిందే. చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం సిద్దు కెరీర్లో సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ రాబోతుంది. దీనికి సంబంధించిన షూటింగ్ కూడా ప్రారంభం అయ్యింది.ముందుగా ఈ సినిమాలో శ్రీలీలను హీరోయిన్గా అనుకున్నారు.కానీ కొన్ని కారణాల వల్ల ఆమె ఈ సినిమా నుంచి తప్పుకుంది. దీంతో అనుపమ పరమేశ్వరన్ సిద్ధుకు జోడీగా నటించనుంది. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. మల్లిక్ రామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. దీపావళి సందర్భంగా డీజే టిల్లు-2 నుంచి స్పెషల్ వీడియోను వదిలారు. అందులో టిల్లు మద్యం మత్తులో ట్రాఫిక్ పోలీస్ తో వాదన పెట్టుకోవడం నవ్వులు పూయించింది. తాను హీరోనని, తన పక్కన హీరోయిన్ గా పూజా హెగ్డే ని తీసుకుందాం అనుకుంటే డేట్స్ ఖాళీగా లేవని చెప్పడం అలరించింది. వచ్చే ఏడాది 2023 మార్చిలో ఈ సినిమా సీక్వెల్ థియేరట్‌లో సందడి చేయనుంది. -
Unstoppable With NBK: హీరోయిన్‌కి ఫోన్ చేసి ఫ్లర్ట్ చేసిన బాలయ్య
నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే’ సీజన్-2 రికార్డులు బ్రేక్ చేస్తోంది. ఇటీవలె గ్రాండ్‌గా లాంచ్ అయిన ఈ షో సెకండ్ ఎపిసోడ్లో యంగ్ హీరోలు సిద్ధూ జొన్నలగడ్డ, విశ్వక్‌సేన్‌లు గెస్టులుగా వచ్చారు. కలిసి అన్‌స్టాపబుల్ వేదికపై బాలయ్య చేసిన రచ్చ మాములుగా లేదు. రావడం రావడంతోనే సిద్ధూ హెయిర్‌స్టైల్‌పై పంచ్ వేసిన బాలయ్య.. తలదువ్వకుండా పంపించారు హెయిర్ స్టైలిస్ట్ ఎక్కడా అంటూ ఫన్నీగా రియాక్ట్ అయ్యారు. దీనికి సిద్ధూ ఆన్సర్ ఇస్తూ.. 'ఇది మెస్సీ లుక్' అని చెప్పగా..'అలా నేను మెస్సీ లుక్‌తో కనిపించిన సినిమాలన్నీ మెస్సీ అయ్యాయమ్మా' అంటూ బాలయ్య సెటైర్ వేశారు. ఇక మీ ప్రజెంట్ క్రష్ ఎవరు అని బాలయ్యను అడగ్గా రష్మిక మందన్నా అని ఓపెన్‌గానే చెప్పేశారు. ఆ తర్వాత ఫ్లర్టింగ్ ఎలా చేయాలంటూ టిప్స్ అడిగి మరీ తెలుసుకున్న బాలయ్య ఓ హీరోయిన్‌కి కాల్ చేసి.. మీ వాయిస్ విని మీ ఫేస్ చందమామలా ఉంటదని నేను చెప్పగలను. నేనేమో చీకట్లో ఉంటాను. ఇద్దరం కలిస్తే పున్నమి రాత్రే అంటూ సరదాగా ఫ్టర్ట్ చేశారు. దీనికి సంబంధించిన ప్రోమోను ఆహా విడుదల చేసింది. -
డీజే టిల్లు 'రాధికా'కు షాక్.. ఆమె స్థానంలో మరో హీరోయిన్
యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డకు ఈ ఏడాది బ్రేక్ ఇచ్చిన సినిమా డీజే టిల్లు. విమల్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టింది ఈ చిత్రం. సిద్దూ నటన, డైలాగ్ డెలివరీ యూత్‌ను ఫిదా చేసింది. ఈ సినిమా సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో సిద్దూ జొన్నలగడ్డకు జోడీగా నేహా శెట్టికి బదులుగా మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరణ్ నటించనున్నట్లు తెలుస్తుంది. రౌడీ బాయ్స్ చిత్రంతో రొమాన్స్ డోస్ పెంచిన అనుపమ ఈ చిత్రానికి ఓకే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ప్రస్తతం అనుపమ టాలీవుడ్ బిజీ హీరోయిన్గా కొనసాగుతుంది. ఇప్పటికే ఆమె నిఖిల్‌తో ’18పేజీస్’, ‘బటర్‌ఫ్లై’ అనే చిత్రల్లో నటిస్తుంది. -
'డీజే టిల్లు 2'కు ముహూర్తం ఫిక్స్.. అప్పటి నుంచే షూటింగ్
Siddhu Jonnalagadda DJ Tillu Sequel To Go On Floors In August: చిన్న సినిమాగా విడుదలైన 'డీజే టిల్లు' బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపింది. సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 12న రిలీజ్ అయి ప్రేక్షకులతోటి 'అట్లుంటది మనతోని' అనేలా చేసింది. అయితే విమల్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ మూవీకి కొనసాగింపు కూడా ఉంటుందనేలా సినిమా చివర్లో హింట్ ఇచ్చారు. అంతేకాకుండా ఆడియెన్స్ సైతం ఈ సినిమాకు సీక్వెల్ వస్తే 'అట్లుంటది మాతోటి' అనేలా హిట్ ఇద్దామని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సినిమా నిర్మాత నాగవంశీ చేసిన ట్వీట్ ఆసక్తి రేపుతోంది. ఈ ట్వీట్‌తో 'డీజే టిల్లు' సినిమా సీక్వెల్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. స్క్రిప్ట్‌కు సంబంధించిన పుస్తకాన్ని దేవుడి పటాల ముందుంచి పూజ చేసిన ఫొటోను శనివారం (జూన్ 25) ట్విటర్ వేదికగా పంచుకున్నారు నాగవంశీ. ఈ ఫొటోకు 'ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫ్రాంచైజీ రౌండ్ 2 పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ క్రేజీ అడ్వెంచర్ షూటింగ్ ఆగస్టు నుంచి ప్రారంభమవుతుంది.' అని రాసుకొచ్చారు. (చదవండి: చై-సామ్ బాటలో మరో టాలీవుడ్ జంట?) The most awaited Franchise... Gearing up for Round 2 🔥 Crazy adventure starts filming in August! 🤩 pic.twitter.com/JX130Z4fpZ — Naga Vamsi (@vamsi84) June 25, 2022 దీంతో నెటిజన్స్ 'డీజే టిల్లు'కు సీక్వెల్ రానుందని భావిస్తున్నారు. అలాగే 'టిల్లు అన్న రెడీ అవుతున్నాడు' అని నెటిజన్స్ కామెంట్ చేయగా, దర్శక నిర్మాత మధుర శ్రీధర్ 'సోదరా.. పార్ట్ 2 కూడా బ్లాక్‌బస్టర్ కావాలి' అని విష్ చేస్తూ సిద్ధు జొన్నలగడ్డను ట్యాగ్ చేశారు. దీనికి 'థ్యాంక్యూ సర్' అని సిద్ధు రిప్లై ఇచ్చాడు. ఈ ట్వీట్లతో 'డీజే టిల్లు 2' రానుందని తెలుస్తోంది. (చదవండి: హీరోను దుమ్మెత్తిపోసిన నెటిజన్లు.. సైలెంట్‌గా ఉండమని కామెంట్లు.. 'నువ్వే కావాలి' నటుడికి నిర్మాత బెదిరింపులు.. పోలీసులకు ఫిర్యాదు 9 సార్లు పిల్లలను కోల్పోయిన స్టార్ హీరోయిన్..) -
విలన్‌గా మారనున్న డీజే టిల్లు!
ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజైన డీజే టిల్లు చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికి తెలిసిందే.ఈ మూవీతో ఓవర్ నైట్ సెన్సేషన్ గా మారాడు డీజే టిల్లు అలియాస్ సిద్ధూ జొన్నలగడ్డ. డీజే టిల్లు తర్వాత ఈ యంగ్ హీరో నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. ఇంతకీ టిల్లూ మ్యాన్ ఇప్పుడు ఏం చేస్తున్నట్లు..అంటే త్వరలోనే రెండు కొత్త సినిమాలను ప్రకటించబోతున్నాడట. అందులో ఒకటి డీజే టిల్లు సీక్వెల్. నిజానికి సినిమా రిలీజ్ కు ముందే ఈ మూవీకి సీక్వెల్‌ని ప్రకటించింది సితారా ఎంటర్ టైన్ మెంట్స్. మూవీ రిలీజ్ కావడం, బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించడంతో సీక్వెల్ పక్కా అని కన్ ఫర్ మేషన్ వచ్చేసింది. కొద్ది రోజులుగా ఈ సినిమా సీక్వెల్ స్క్రిప్ట్ పనుల్లో సిద్దూ బిజీగా ఉన్నాడట. సీక్వెల్లో టిల్లు నయా లుక్ లో సర్ ప్రైజ్ చేయనున్నాడని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్ లో డీజే వర్క్ పక్కన పెట్టి ఫారిన్ గర్ల్ లో లవ్ లోఉన్నట్లు టిల్లు క్యారెక్టర్ ను చూపించారు. సీక్వెల్లో మళ్లీ టిల్లు డీజే వైపు ఎందుకు వెళ్తాడు అనేది ఆసక్తికరంగా చూపించబోతున్నారట. డీజే టిల్లు 2 తో పాటు మరో కొత్త సినిమాలోనూ సిద్దూ నటించేందుకు రెడీ అవుతున్నాడట. ఈ మూవీలో హీరో క్యారెక్టర్ కాకుండా విలన్ రోల్ చేసి సర్ ప్రైజ్ చేస్తాడట. డీజే టిల్లుకు ముందు కల్కీ మూవీలోని విలన్ రోల్ చేసాడు సిద్ధూ. కాకపోతే ఈసారి సీరియస్ విలన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.