కాంబినేషన్‌ సెట్‌? | Chiranjeevi and Siddu Jonnalagadda Blockbuster Collaboration | Sakshi
Sakshi News home page

కాంబినేషన్‌ సెట్‌?

Published Fri, May 5 2023 4:07 AM | Last Updated on Fri, May 5 2023 4:07 AM

Chiranjeevi and Siddu Jonnalagadda Blockbuster Collaboration - Sakshi

చిరంజీవి, సిద్ధు జొన్నలగడ్డ

హీరో చిరంజీవి, దర్శకుడు కల్యాణ్‌ కృష్ణ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కేందుకు రంగం సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఆల్రెడీ చిరంజీవికి కల్యాణ్‌ కృష్ణ ఓ కథ వినిపించారట. ఈ స్క్రిప్ట్‌ చిరంజీవికి నచ్చిందని, త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలిసింది.

అయితే ఈ సినిమా కథ రీత్యా ఓ కుర్ర హీరోకి కీలక పాత్రలో నటించేందుకు స్కోప్‌ ఉందట. ఈ కుర్ర హీరో పాత్రకు సిద్ధు జొన్నలగడ్డ అయితే బాగుంటుందని చిత్ర యూనిట్‌ భావిస్తోందని, ఆల్రెడీ సంప్రదింపులు జరిగాయని భోగట్టా. త్వరలోనే ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. చిరంజీవి టైటిల్‌ రోల్‌లో మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో రూ΄పొం దుతున్న తాజా చిత్రం ‘భోళా శంకర్‌’ ఆగస్టు 11న విడుదల కానున్న విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement