TSRTC bus
-
ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు డిమాండ్
-
పండుగ బస్సు..‘ప్రత్యేక’ చార్జీ
సాక్షి, హైదరాబాద్: పండుగపూట ప్రయాణికులను సురక్షి తంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. సంక్రాంతిని పురస్కరించు కుని 6,432 ప్రత్యేక బస్సులను నడపనుంది. పండుగ సందర్భంగా ఈ నెల 10, 11, 12 తేదీల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని సంస్థ అంచనా వేస్తోంది. ఈ నేప థ్యంలో ఆయా రోజుల్లో ప్రత్యేక బస్సులను అందుబాటు లో ఉంచి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటోంది. అదేవిధంగా ఈ నెల 19, 20 తేదీల్లో తి రుగు ప్రయాణ రద్దీ దృష్ట్యా కూడా ప్రత్యేక బస్సులు ఏ ర్పాటు చేస్తోంది.హైదరాబాద్‌లో ఎంజీబీఎస్, జేబీఎస్ బ స్స్టేషన్లు, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఆరాంఘర్, ఎల్బీనగర్ క్రా స్ రోడ్స్, కేపీహెచ్‌బీ, బోయిన్పల్లి, గచ్చిబౌలి ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు ప్రారంభమవుతాయి. ఆయా ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం షామియానాలు, కుర్చీలు, పబ్లిక్ అడ్రస్ సిస్టం, తాగునీటి సదుపాయం, మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేసింది. కాగా, పండుగపూట నడిపే ప్రత్యేక బస్సుల చార్జీలను ఆర్టీసీ సవరించింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒకటిన్నర రెట్ల వరకు ధరలను సవరిస్తున్నట్లు సంస్థ తెలిపింది. పెంచిన చార్జీలు ప్రత్యేక బస్సుల్లో మాత్రమే అమలు చేస్తారు.ఈ నెల 10, 11, 12 తేదీలతో పాటు తిరుగు ప్రయాణ రద్దీ ఎక్కువగా ఉండే 19, 20 తేదీల్లో మాత్రమే సవరించిన చార్జీలను అమలు చేస్తామని, స్పెషల్ బస్సులు మినహా రెగ్యులర్ బస్సుల్లో సాధారణ చార్జీలే అమల్లో ఉంటాయని టీజీఎస్ఆర్టీసీ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా సంక్రాంతికి నడిపే పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరి, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం యథావిధిగా అమల్లో ఉంటుంది. ఇదిలా ఉండగా పండుగలు, ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం www. tgsrtcbus. in వెబ్‌సైట్‌ను సందర్శించాలని టీజీఎస్ఆర్టీసీ వెల్లడించింది. మరిన్ని వివరాల కోసం ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040–69440000, 040–23450033 సంప్రదించాలని సూచించింది. -
బస్సు చార్జీల పెంపు అవాస్తవం: సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: బతుకమ్మ, దసరా పండుగ నేపథ్యంలో టీజీఎస్ఆర్టీసీ టికెట్ ధరలు పెంచిందని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆర్టీసీ ఎండి సజ్జనార్ స్పష్టం చేశారు. స్పెషల్ బస్సుల చార్జీలను మాత్రమే సంస్థ సవరించిందని, రెగ్యులర్ సర్వీసుల టికెట్ చార్జీల్లో ఎలాంటి మార్పు లేదని ఒక ప్రకటనలో తెలిపారు.పండుగ సమయాల్లో సొంతూళ్లకు వెళ్లేప్పుడు బస్సుల్లో ప్రయాణికులు అధికంగా ఉంటారని, వారిని దింపి బస్సులు ఖాళీగా నగరానికి రావలసి ఉంటుందని పేర్కొన్నారు. ఇలాంటి సందర్భాల్లో డీజిల్ ఖర్చుకు సరిపడా ఆదాయం కూడా ఉండదని తెలిపారు. అందుకోసం స్పెషల్ బస్సుల్లో చార్జీలను స్వల్పంగా సవరించే వెసులుబాటు ఉందని వెల్లడించారు. -
Hyderabad : పేరుకే మహా నగరం..తీరు చూస్తే మహా నరకం (ఫొటోలు)
-
వోల్వో.. వద్దు
సాక్షి, హైదరాబాద్: గరుడ ప్లస్ కేటగిరీ బస్సులు కనుమరుగుకానున్నాయి. ఆ పేరుతో ఆర్టీసీలో తిరుగుతున్న ఒక్కో వోల్వో బస్సుకు నెలకు సగటున రూ.లక్షకు పైగా నిర్వహణ ఖర్చు వస్తోంది. పైగా చిన్న రిపేరు చేయాల్సి వచ్చినా.. కంపెనీకి తరలించాల్సి రావటం, ఒక్కో పనికి రూ.3–4 లక్షల వరకు బిల్లు వస్తుండటంతో వాటిని వదిలించుకోవాలని ఆర్టీసీ నిర్ణయించింది. తాజాగా 20 వరకు బస్సులను పక్కన పెట్టేసింది. త్వరలో మరికొన్నింటిని తుక్కు కింద మార్చబోతోంది. వాటి స్థానంలో అశోక్ లేలాండ్ కంపెనీ నుంచి కొంటున్న లహరి స్లీపర్, స్లీపర్ కమ్ సీటర్ బస్సులను నడపబోతోంది. సామర్థ్యానికి మించి నడపటంతోనే.. ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు ఎప్పటికప్పుడు ఆధునిక బస్సులు అందుబాటులోకి తెస్తుండటంతో ఆర్టీసీ కూడా ఆ శ్రేణి బస్సులను సమకూర్చటం అనివార్యమైంది. రెండు దశాబ్దాల క్రితం గరుడ పేరుతో బస్సులు ప్రారంభించారు. ఆకర్షణీయంగా ఉండేలా మెర్సిడస్ బెంజ్, ఇసుజు కంపెనీల బస్సులు నడిపారు. ఆ తర్వాత మల్టీ యాక్సెల్ బస్సులను గరుడ ప్లస్ పేరుతో ప్రవేశపెట్టారు. ఈ కేటగిరీలో వోల్వో, స్కానియా బస్సులు వాడారు. 2016–17లో కొత్త వోల్వో బస్సులు కొన్నారు. సాధారణంగా ఆ కంపెనీ బస్సులు ఏడెనిమిది లక్షల కిలోమీటర్ల వరకు తిప్పొచ్చని నిపుణులు చెబుతారు. అంతకంటే ఎక్కువ తిప్పితే సమస్యలు ఏర్పడతాయి. ఒక్కో బస్సు ధర రూ.1.3 కోట్ల వరకు ఉండటంతో వెంటవెంటనే కొత్తవి సమకూర్చటం కుదరదు. అంత ధర పెట్టి కొని తక్కువ కిలోమీటర్లు తిప్పి తుక్కు కింద మార్చటానికి ఆర్టీసీ అధికారులకు మనస్కరించటం లేదు. దీంతో ఏకంగా 14 లక్షల నుంచి 15 లక్షల కి.మీ. వరకు తిప్పుతున్నారు. దీంతో ఆ బస్సుల్లో తీవ్ర సాంకేతిక సమస్యలు ఏర్పడుతున్నాయి. సాధారణంగా ఆర్టీసీ బస్సుల మరమ్మతులను సొంత సిబ్బందే చేస్తుంటారు. కానీ వోల్వో కంపెనీలో ఆయిల్ మార్చటం లాంటి చిన్నచిన్న పనులు తప్ప మిగతా సాంకేతిక సమస్యలన్నీ ఆ కంపెనీ ఇంజనీర్లే సరిదిద్దాల్సి ఉంటుంది. సాంకేతిక సమస్య తలిత్తితే బస్సును నిలిపివేసి ఆ కంపెనీ నిపుణులకు కబురు పెట్టాల్సిందే. వారొచ్చి మరమ్మతు చేసి రూ.మూడు నాలుగు లక్షల బిల్లు వేసి వెళుతున్నారు. ఇది ఆర్టీసీ చేతి చమురు వదిలిస్తోంది. ఒక్కో బస్సుకు ప్రతినెలా రూ.లక్షల్లో ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో 14 లక్షల కి.మీ. దాటిన బస్సులను పక్కన పెట్టాలని తాజాగా నిర్ణయించి అమలు ప్రారంభించింది. ఆ కంపెనీ బస్సులు కొనటం ఆర్థికంగా ఇబ్బందిగా మారటంతో అశోక్ లేలాండ్ కంపెనీ నుంచి సమకూర్చుకుంటున్న లహరి స్లీపర్ కమ్ సీటర్ బస్సులను వాటి బదులు తిప్పుతోంది. ఇటీవలే 16 లహరి బస్సులను వాటికి చేర్చింది. త్వరలో 40 వోల్వో బస్సులను పక్కన పెట్టాలని నిర్ణయించింది. మిగతా వాటిని దశలవారీగా ఆపేయనుంది. పోటీని తట్టుకోగలదా..? ప్రస్తుతానికి బహుళజాతి కంపెనీ బస్సులు కొనొద్దని ఆర్టీసీ నిర్ణయించింది. కానీ ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు బెంగళూరు, షిర్డీ, చెన్నై లాంటి దూర ప్రాంతాలకు బహుళజాతి కంపెనీలకు చెందిన ఆధునిక బస్సులు సమకూర్చుకుంటున్నాయి. ఆ కేటగిరీ బస్సులు ఆర్టీసీలో లేకపోవటం వెలితిగానే మారనుంది. ఇది ప్రయాణికుల ఆదరణపై ప్రభావం చూపే అవకాశముంది. అప్పటి పరిస్థితిని పరిశీలించి వాటిని కొనాలని ప్రభుత్వం నిర్ణయిస్తే తప్ప ఇప్పట్లో వాటిని కొనొద్దని ఆర్టీసీ నిర్ణయించటం గమనార్హం. -
ఆర్టీసీ బస్సులో సీటు కోసం సిగపట్లు!
మహబూబాబాద్: ఆర్టీసీ బస్సులో సీటు కోసం మహిళలు సిగపట్లు పట్టుకున్నారు. ఈ ఘటన వరంగల్ జిల్లాలో శుక్రవారం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించిన విషయం తెలిసిందే. దీంతో మహిళలంతా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం చేస్తుండడంతో బస్సులన్నీ రద్దీగా ఉంటున్నాయి. వరంగల్ నుంచి నర్సంపేటకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో మొదట ఓ మహిళ సీటు కోసం రుమాలు వేసింది. ఆమెకంటే ముందు ఎక్కిన మరో మహిళ ఆ సీటులో కూర్చుంది. బస్సు నర్సంపేట రూట్లో వెళ్తుండగానే ఆ తరువాత ఎక్కిన మొదటి మహిళ నా సీటులో ఎలా కూర్చుంటావంటూ ప్రశ్నించింది. ఇద్దరి మధ్య మాటామాట పెరిగి జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు. ఆ తరువాత మరో మహిళ వచ్చి మా సీట్లో కూర్చున్నావంటూ అడిగింది. వీరిద్దరి మధ్య ఘర్షణ జరిగి కొట్టుకున్నారు. తోటి ప్రయాణికులు వారిని ఆపారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఇవి చదవండి: ఇండ్లు.. రేషన్‌కార్డులకే ఎక్కువ! -
ఇంకా కొన్ని పల్లెలకు చేరని ‘మహాలక్ష్మి’ భాగ్యం!
చిలుకూరు: రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీ పథకాల అమల్లో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. కానీ పలు గ్రామాల్లోని మహిళలకు ఈ పథకం అందడం లేదు. జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాలకు ఆర్టీసీ బస్సులు నడవకపోవడంతో గ్రామీణ మహిళలు ఈ పథకానికి దూరమవుతున్నారు. తాము ఆటోలు, ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నామని, పల్లెలకు బస్సులు నడిపించాలని వారు కోరుతున్నారు. జిల్లాలో ఇలా.. జిల్లాలో కోదాడ, సూర్యాపేట డిపోలు ఉన్నాయి. కోదాడ డిపో పరిధిలో పల్లెవెలుగు బస్సులు 40, ఎక్స్‌ప్రెస్‌లు 18 ఉన్నాయి. సూర్యాపేట ఆర్టీసీ డిపో పరిధిలో పల్లెవెలుగు బస్సులు 62, ఎక్స్‌ప్రెస్‌లు 45 ఉన్నాయి. ఈ రెండు డిపోల్లో మరో 25 వరకు అద్దె బస్సులు ఉన్నాయి. కోదాడ డిపో పరిధిలోని చిలుకూరు మండలంలో 17 గ్రామ పంచాయతీలు ఉండగా కేవలం జాతీయ రహదారిపై ఉన్న చిలుకూరు మండల కేంద్రం, సీతారాంపురం గ్రామాలకు మాత్రమే ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది. బేతవోలు, ఆచార్యులగూడెం, చెన్నారిగూడెం, నారాయణపురం తదితర ప్రధాన గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. అదేవిధంగా మునగాల మండల పరిధిలోని 22 గ్రామాలకు నరసింహులగూడెం తప్ప ఏ గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. ప్రధానంగా నేలమర్రి, కలకోవ, జగన్నాథపురం తదితర గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. నడిగూడెం మండల పరిధిలో నడిగూడెంతో పాటు రామచంద్రాపురం, సిరిపురం, రత్నవరం తదితర ప్రధాన గ్రామాలకు కూడా బస్సు సౌకర్యం లేదు. కోదాడ మండల పరిధిలో ఎర్రవరం గ్రామానికి వెళ్లే రహదారిలో తప్ప మిగిలిన గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. హుజూర్నగర్ పరిధిలో సైతం జాతీయ రహదారుల వెంట ఉన్న గ్రామాలు, ప్రసిద్ది చెందిన పుణ్య క్షేత్రాలకు వెళ్లే రహదారులకు తప్ప మిగిలిన గ్రామాలకు కూడా బస్సు సౌకర్యం లేదు. ఇక.. సూర్యాపేట ఆర్టీసీ డిపో పరిధిలో కండగట్ల, యల్కారం, సోల్‌పేట, రామచంద్రాపురం, లోయపల్లి, కుంచమర్తి, మాచిడిరెడ్డి పల్లి, మామిడిపల్లి తదితర గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. బస్సు సౌకర్యం కల్పించాలి మా గ్రామానికి ఆర్టీసీ బస్సులు రావడం లేదు. దీంతో మేము ఉచిత బస్సు ప్రయాణం పథకానికి దూరమవుతున్నాం. గతంలో మా గ్రామానికి ఆర్టీసీ బస్సు వచ్చేది. ఇప్పుడు రావడం లేదు. కేవలం ఆటోలే దిక్కు. పల్లెలకు బస్సు సౌకర్యం కల్పించాలి. – కల్పన, జెర్రిపోతులగూడెం, చిలుకూరు మండలం కేవలం ప్రధాన రహదారులకే.. కరోనా అనంతరం ప్రజలు వ్యక్తిగత వాహనాల్లో ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఆదాయం రావడం లేదని, పల్లెలకు ఆర్టీసీ బస్సులను రద్దు చేసింది. దీనికి తోడు కాలం చెల్లిన వాటి స్థానంలో నూతన బస్సులు ఏర్పాటు చేయకపోవడంతో కేవలం ఆదాయం వచ్చే ప్రధాన రహదారుల్లోనే బస్సులు నడపిస్తున్నారు. తాజాగా ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభించడంతో తమ గ్రామాలకు బస్సులను నడపాలని గ్రామీణ ప్రాంత మహిళలు వేడుకుంటున్నారు. -
97 డిపోలకు గాను 96 లాభాల్లో..
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సుల్లో ఒక్కసారిగా ప్రయాణికులు పెరగడంతో దశాబ్దం తర్వాత సంస్థ లాభాలను ఆర్జిస్తోంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణం కలి్పంచడంతో, వారి రూపంలో కోల్పోయే మొత్తాన్ని ప్రభుత్వం సంస్థకు రీయింబర్స్ చేస్తుందన్న ఉద్దేశంతో అధికారులు లెక్కలు ఖరారు చేశారు. గత సోమవారం (డిసెంబర్ 18) ఒక్కరోజే రూ.21.11 కోట్ల ఆదాయం నమోదైంది. ఈనెలలో ఇప్పటివరకు వచ్చిన ఆదాయం రూ.259 కోట్లకు చేరుకుంది. తెలంగాణ ఆర్టీసీ పరిధిలో 97 డిపోలుంటే, సోమవారం ఏకంగా 96 డిపోలు లాభాలు ఆర్జించాయి. సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ పరిధిలో ఉన్న కోస్గి డిపో ఒక్కటే రూ.2 వేలు నష్టం చవిచూసింది. ఇలా 96 డిపోలు లాభాల్లోకి రావటం టీఎస్ఆర్టీసీ చరిత్రలో ఆల్‌టైం రికార్డుగా నిలిచింది. డిసెంబరులో ఇప్పటివరకు 49 డిపోలు లాభాలు ఆర్జించాయి. దీంతో ఈనెల మొత్తానికి రూ.3.14 కోట్ల లాభం నమోదవుతుందని ఆర్టీసీ అంచనా వేస్తోంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఇలా ఒక నెల మొత్తానికి లాభాలు నమోదవడం ఇదే తొలిసారి కానుండటం విశేషం. బస్సుల్లో సాధారణ రోజుల్లో కంటే సోమవారం రద్దీ అధికంగా ఉంటుంది. జీరో టికెట్ల జారీ మొదలైన తర్వాత తొలి సోమవారం (18వ తేదీ) 51.74 లక్షల మంది బస్సుల్లో ప్రయాణించినట్టు తేలింది. సోమవారం 30.12 లక్షల జీరో టికెట్లు (మహిళలకు ఇచ్చేవి) జారీ అయ్యాయి. కొత్త ఉత్సాహం కొన్ని డిపోలు సోమవారం ఒక్కరోజే 14 లక్షలకు మించి లాభాలు ఆర్జించటం విశేషం. ఒక్కో డిపో రోజుకు ఐదారు లక్షల నష్టాలను చవిచూసే పరిస్థితికి అలవాటుపడ్డ ఆర్టీసీకి తాజా లెక్కలు ఉత్సాహాన్నిచ్చాయి. సోమవారం హనుమ కొండ డిపో రూ.14.10 లక్షలు, దేవరకొండ డిపో రూ.13.94 లక్షలు, మహబూబ్‌నగర్ డిపో రూ. 13.61 లక్షలు, హైదరాబాద్–1 డిపో రూ. 13.55 లక్షలు.. ఇలా పలు డిపోలు భారీ లాభాలు నమో దు చేసుకున్నాయి. ఒక్క కోస్గి డిపో ఒక్కటే రూ.2 వేలు నష్టం పొందటంతో మొత్తం డిపోల జాబితాలో నష్టాలు పొందిన ఏకైక డిపోగా మిగిలింది. 450కు మించి టికెట్ల జారీ సాధారణంగా జిల్లా సర్విసుల్లో ఒక కండక్టర్ గరిష్టంగా 300 వరకు టికెట్లు జారీ చేస్తుంటారు. కానీ, ప్రస్తుతం వాటిల్లో 450కి మించి టికెట్లు జారీ చేయాల్సి వస్తోంది. మహిళలకు జీరో టికెట్ జారీ చేస్తున్నా.. వారు ఎక్కడి వరకు ప్రయాణిస్తారో తెలుసుకోవడం, వారు తెలంగాణ నివాసితులా కాదా అని ధ్రువపత్రాలు పరిశీలించడం లాంటి వాటి వల్ల టికెట్ల జారీలో ఆలస్యం జరుగుతోంది. -
ఏసీ బస్సుల్లో ‘స్నాక్స్’ బాదుడు!.. తప్పక చెల్లించాల్సిందే..
సాక్షి, హైదరాబాద్: ఏసీ బస్సుల టికెట్ ధరలను ఆర్టీసీ సవరించింది. ప్రయాణించే దూరంతో సంబంధం లేకుండా ప్రతి టికెట్‌పై రూ.30 చొప్పున పెంచింది. ఏసీ స్లీపర్ సర్వీసు లహరి, గరుడ, గరుడ ప్లస్, రాజధాని బస్సుల్లో ఈ మార్పు చోటు చేసుకుంది. ఏసీ బస్సుల్లో ప్రయాణికులకు తృణధాన్యాలతో చేసిన స్నాక్స్ ప్యాకెట్‌ను అందించటాన్ని ప్రారంభించిన ఆర్టీసీ, ఆ తినుబండారాల చార్జీ రూపంలో రూ.30 చొప్పున పెంచుతూ టికెట్ ధరలను సవరించింది. ఈ కొత్త ధరలను ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచి అమలులోకి తెచ్చింది. చిరు ధాన్యాలతో స్నాక్స్ రూపొందించే ట్రూ గుడ్ అన్న సంస్థతో ఇటీవలే ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పుడు ఆ సంస్థ వాటిని ప్రయాణికులకు సరఫరా చేస్తోంది. నో ఛాయిస్.. సాధారణంగా ఇలాంటి తినుబండారాలను అందించేటప్పుడు ప్రయాణికుల ఇష్టాయిష్టాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఇటీవల సూపర్ లగ్జరీ బస్సుల్లో అరలీటరు మంచినీటి సీసాను అందించే నిర్ణయం తీసుకున్నప్పుడు రూ.10 చొçప్పున టికెట్ ధరను పెంచిన విషయం తెలిసిందే. ప్రయాణికుల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా, కచ్చితంగా పెంచిన ధరను చెల్లించేలా అమలులోకి తెచ్చింది. ఇప్పుడు కూడా, స్నాక్స్ ప్యాకెట్‌ను విధిగా తీసుకోవాల్సిందే. టికెట్లోనే దాని ధరను చేర్చినందున స్నాక్స్ ప్యాకెట్ రుసుమును కచ్చితంగా చెల్లించాల్సినట్టవుతుంది. ఏముంటాయంటే.. టికెట్ తీసుకోగానే ప్రయాణికుడికి ఓ ప్యాకెట్ ఇస్తారు. ట్రూ గుడ్–ఆర్టీసీ సంయుక్త వివరాలతో ఈ ప్యా కెట్లను రూపొందించారు. ఆ ప్యాకెట్లో చిరుధాన్యా లతో రూపొందించిన 25 గ్రాముల మురుకులు/కా రప్పూస, పప్పు చెక్క, సేగు (ఇవి ఒక్కో ప్యాకెట్లో ఒ క్కోరకం ఉంటుంది), 20 గ్రాముల మిల్లెట్ చిక్కీ, ఒక మిల్లెట్ రస్్కలతో కూడిన విడివిడి ప్యాకెట్లు ఉంటా యి. ఐక్యరాజ్య సమితి 2023వ సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో, ఆరోగ్యాన్ని అందించే చిరుధాన్యాలతో రూపొందించిన చిరుతిండిని అందించాలని నిర్ణయిం చినట్టు గతంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. ‘స్నాక్స్’వల్ల పెరిగే ఆదాయం ఏమేరకు? ప్రస్తుతం ఆర్టీసీ ఏసీ బస్సుల్లో నిత్యం దాదాపు 16 వేల నుంచి 18 వేల మంది వరకు ప్రయాణిస్తున్నారు. ఒక్కో టికెట్‌పై రూ.30 చొప్పున అదనంగా వసూలు చేస్తున్నందున ఆర్టీసీకి నెలకు రూ.కోటిన్నర వరకు ఆదాయం పెరుగుతుంది. అయితే, తయారీ కంపెనీ నుంచి ఒక్కో ప్యాకెట్‌పై ఆర్టీసీ రూ.18 వరకు వెచ్చిస్తున్నట్టు సమాచారం. ఆ లెక్కన దీన్ని పెద్ద ఆదాయంగా పరగణించాల్సిన అవసరం ఉండదు. -
ఆర్టీసీ బిల్లుపై మరిన్ని వివరాలు అడిగిన తెలంగాణ గవర్నర్
-
పుణ్యక్షేత్రాలకు వెళ్లేవారికి గుడ్‌న్యూస్..
నిజామాబాద్: ఆర్టీసీ ద్వారా ప్రయాణికులు సురక్షితంగా ప్రయాణించేందుకు.. వారి ఆర్థికభారాన్ని తగ్గించేందుకు అధికారులు వివిధ రకాల ప్యాకేజీలను తీ సుకొచ్చారు. గ్రామీణ ప్రాంతంలో ముఖ్యంగా మ హిళా ప్రయాణికులకు అనువుగా ఉండేందుకు టీ 9–30, టీ9–60 వంటి పథకాలను తీసుకొచ్చింది. ఆటోల్లో ప్రయాణికులు వెళ్లకుండా పల్లెవెలుగు ద్వారా ప్రయాణం చేయడానికి ఈ పథకాలు ఉపయోగపడుతాయని ఆర్టీసీ భావిస్తోంది. అంతేకాకుండా తిరుపతి, అరుణాచల క్షేత్రంకు భక్తులు అధిక సంఖ్య లో వెళ్తున్నారు. వీరు టూరిస్టు బస్సులను నమ్మి మోసపోయిన ఘటనలున్నాయి. దీంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి తిరుపతి, అరుణాచలం వెళ్లేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. అరుణాచలం గిరి ప్రదర్శనకు.. తమిళనాడులోని అరుణాచలంలో జరిగే గిరి ప్రదక్షిణకు నిజామాబాద్ నుంచి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ బస్సులకు సంస్థ నియమ నిబంధనలకు అనుసరించి ఎలాంటి అదనపు చార్జీలు లేకుండా నడుపుతారు. ప్రయాణికుల సౌలభ్యం కోసం వారి కాలనీల్లో 30 మంది ప్రయాణికులు ఉంటే కాలనీకే బస్సు పంపిస్తారు. దీంతోపాటు కాణిపాకంతో పాటు గోల్డెన్ టెంపుల్, అరుణాచలం గిరి క్షేత్రం ఉంటుంది. ఈ నెల 30న నిజామాబాద్ నుంచి ప్రారంభించే బ స్సును పౌర్ణమి రోజు చేర్చేందుకు ఏర్పాటు చేశారు. టీ9–30 కి.మీ వెళ్లే వారికి రాయితీ.. రెండు రోజుల క్రితం ఉమ్మడి జిల్లాలోని ప్రయాణికులకు ఆర్థికభారం తగ్గించేందుకు ఆర్టీసీ టీ9–30 పథకం ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా రూ. 50 చెల్లిస్తే 30 కి.మీ ప్రయాణం చేయవచ్చు. టీ 9 పథ కాన్ని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అమలు ఉపయోగం ఉంటుంది. ఉదయం 9 గంటల నుంచి రా త్రి 9 గంటల వరకు ప్రయాణించవచ్చు. టీ9 టిక్కెట్లు పల్లెవెలుగు బస్సు కండక్టర్ల వద్ద అందుబాటు లో ఉంటాయి. ఈ టికెట్ తీసుకుంటే ఒక్కొక్కరికి రూ.10 నుంచి రూ.30 వరకు ఖర్చు తగ్గుతుందన్నా రు. రూ.20 కాంబోతో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ప్రయా ణించే సదుపాయం ఉంది. ఆటోల్లో ప్రయాణించకుండా పల్లెవెలుగు ద్వారా ప్రయాణం చేయడానికి సులువుగా ఉంటుంది. నిజామాబాద్ నుంచి తిరుపతికి.. గతేడాది ఆర్టీసీ తిరుపతికి ప్రత్యేక దర్శనం కల్పించడానికి బస్సులను ఏర్పాటు చేసింది. జిల్లా నుంచి ప్రతిరోజు తిరుపతి వెంకటేశ్వర దర్శనం చేసుకోవడానికి వెళ్తుంటారు. అయితే ఆర్టీసీ తిరుపతి బస్సు టికెట్‌తో పాటు దర్శనం టికెట్ అందించడంతో ఈ బస్సులో ప్రయాణికుల సంఖ్య పెరిగింది. జిల్లా కేంద్రం నుంచి తిరుపతికి బస్సులు వెళ్తున్నాయి. తిరుపతికి పెద్దలకు రూ. 3,190 కాగా పిల్లలకు రూ. 2,280 టికెట్ ధర ఉంది. ఈ బస్సులో ప్రయాణించడానికి నెలరోజుల ముందు బుకింగ్ చేసుకుంటే సీటు దొరికే అవకాశాలున్నాయి. టీ9 టికెట్‌తో 60 కి.మీ వరకు.. ఉమ్మడి జిల్లాలోని ప్రయాణికులకు ఆర్థికభారం తగ్గించడానికి ఆర్టీసీ టీ9–60 పథకం ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా రూ.100 చెల్లిస్తే 60 కి.మీ ప్రయాణం చేయవచ్చు. టీ9 పథకాన్ని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది. టీ9 టికెట్లు పల్లెవెలుగు బస్సు కండక్టర్ల వద్ద అందుబాటులో ఉంటాయి. ఈ టికెట్ ద్వారా ఒక్కొక్కరికి రూ. 20 నుంచి రూ. 40 వరకు ఖర్చు తగ్గుతుందన్నారు. రూ. 20 కాంబితో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ప్రయాణించే సదుపాయం ఉందన్నారు. సద్వినియోగం చేసుకోవాలి దైవదర్శనానికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశాం. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రయాణించేవారికి ఆర్టీసీ టీ9–30, టీ9–60 వంటి పథకాలను తీసు కొచ్చింది. ఈ పథకాలతో ప్రయాణించే వారికి ఆర్థికభారం తగ్గుతుంది. ఆటోలలో ప్రయాణించే బదులు బస్సుల్లో ప్రయాణించాలి. ఆర్టీసీలో ప్రయాణం సురక్షితంగా ఉంటుంది. – జానీ రెడ్డి, ఆర్ఎం, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా -
ఆర్టీసీ డ్రైవర్ రాములుకు సజ్జనార్ అభినందన!
జగిత్యాల: ఆర్టీసీ డ్రైవర్ రాములును ఆ సంస్థ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ ద్వారా అభినందించారు. పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద గురువారం ఆర్టీసీ బస్సు కిందపడి ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించగా, డ్రైవర్ రాములు వెంటనే అప్రమత్తమై బస్సును నిలిపివేశాడు. ఈ సంఘటనలో ఆమెకు ప్రాణాప్రాయం తప్పింది. గాయాలతో ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతోంది. విషయం తెలుసుకున్న ఎండీ సజ్జనార్.. డ్రైవర్‌ను అభినందించారు. ‘చాకచక్యం, అప్రమత్తతతో నిండు ప్రాణం నిలిచింది. సమయస్ఫూర్తితో వ్యవహరించి ఓ మహిళ ప్రా ణాలు కాపాడిన డ్రైవర్ రాములుకు అభినందనలు’ అని సజ్జనార్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. సమయస్పూర్తితో వ్యవహారించి ఓ మహిళ ప్రాణాలు కాపాడిన మెట్పల్లి డిపో డ్రైవర్ పి.రాములుకు అభినందనలు. డ్రైవర్ చాకచాక్యం, అప్రమత్తత వల్ల ఓ నిండు ప్రాణం నిలిచింది. మెట్పల్లిలో జగిత్యాలకు వైపునకు వెళ్తొన్న బస్ కింద పడి ఆత్మహత్య చేసుకునేందుకు ఓ మహిళ యత్నించింది. బస్ కదలిక గమనించిన… pic.twitter.com/fylJs7zsH5 — V.C. Sajjanar, IPS (@SajjanarVC) July 21, 2023 -
బస్సులో చనిపోయిన ప్రయాణికుడు.. టీఎస్ఆర్టీసీ మానవత్వం..
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్ఆర్టీసీ)కు ప్రయాణీకులు దైవంతో సమానమని, టిక్కెట్ తీసుకుని ప్రయాణిస్తున్నవారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన బాధ్యత తమపై ఉందని సంస్థ వీసీ అండ్ ఎండీ శ్రీ వి.సి.సజ్జనర్, ఐ.పి.ఎస్ గారు అన్నారు. విధి నిర్వహణలో ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించడమే కాదు వారిపట్ల మానవత్వంతో వ్యవహరించడంలోనూ సిబ్బంది స్ఫూర్తిదాయకంగా నిలుస్తుండటం శుభపరిణామమని ఆయన కొనియాడారు. బస్సులో గుండెపోటుతో మరణించిన ఓ ప్రయాణికుడి మృతదేహాన్ని మానవతా దృక్ఫథంతో వ్యవహరించి అదే బస్సులో ఇంటికి చేర్చిన మహబూబాబాద్ డిపో కండక్టర్ కె.నాగయ్య, డ్రైవర్ డి.కొమురయ్యలను శనివారం హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో అయన అభినందించారు. ప్రత్యేకించి ఆ సమయంలో చొరవ తీసుకున్న మహబూబాబాద్ డిపో మేనేజర్ విజయ్ ను కూడా ప్రశంసించి శాలువా, ప్రశంసా పత్రంతో పాటు ప్రత్యేక బహుమతి అందించి వారి సేవలు ప్రశంసనీయమన్నారు. బస్సులో మృతదేహాన్ని తరలించడంలో పెద్దమనసుతో సహకరించిన ప్రయాణికులకు కూడా ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విధి నిర్వహణలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు స్పందించే గుణం సిబ్బందిలో ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వివరాల్లోకి వెళితే, మహబుబాబాద్ డిపోకు చెందిన బస్సు ఈ నెల 14న సాయంత్రం ఖమ్మం నుంచి మహబుబాబాద్‌కు 52 మంది ప్రయాణికులతో బయలుదేరింది. కురవి మండలం మోదుగులగూడెనికి చెందిన కె.హుస్సేన్(57), బస్సు మైసమ్మ గుడి దగ్గరికి రాగానే నిద్రలోనే గుండెపోటుకు గురయ్యారు. విషయం తెలుసుకున్న బస్సు కండక్టర్ కె.నాగయ్య, డ్రైవర్ కొమురయ్యలు సమయస్పూర్తితో వ్యవహారించారు. తోటి ప్రయాణికుల సాయంతో సీపీఆర్ నిర్వహించారు. లాభం లేకపోవడంతో 108కి సమాచారం అందించారు. అప్పటికే హుస్సేన్ మృతి చెందినట్లు వారు ధృవీకరించారు. మృతదేహాన్ని బాధితుడి స్వగ్రామానికి తీసుకెళ్లడానికి 108 సిబ్బంది నిరాకరించారు. దీంతో కండక్టర్, డ్రైవర్ ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి.. బస్సులోనే 30 కిలోమీటర్లు మృతదేహాన్ని జాగ్రత్తగా ఇంటికి చేర్చారు. కండక్టర్, డ్రైవర్ల చొరవ అభినందనీయమని, సంస్థ వారిని చూసి ఎంతో గర్విస్తోందని సంస్థ ఎండీ సజ్జనర్ చెప్పారు. టిఎస్ఆర్టీసీ సిబ్బంది మానవతా దృక్పథంతో వ్యవహరించడం ద్వారా ప్రజలకు సంస్థపై విశ్వాసం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. సేవా భావంతో వ్యవహరిస్తున్న సిబ్బందికి సంస్థలో తప్పక గుర్తింపు ఉంటుందన్నారు. -
TSRTC: మహిళలకు శుభవార్త.. రూ.80కే సిటీ మొత్తం చుట్టేయొచ్చు!
సాక్షి, హైదరాబాద్: మహిళలకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) శుభవార్త చెప్పింది. వేసవి నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రయాణించే మహిళల ఆర్థికభారం తగ్గించేందుకు వారికి టీ-24 టికెట్‌ను రూ.80కే అందించాలని నిర్ణయించింది. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో 24 గంటల పాటు ప్రయాణించే ఆ టికెట్ ధరను సాధారణ ప్రయాణికులకు రూ.90గా, సీనియర్ సిటిజన్లకు రూ.80గా ఇటీవల టీఎస్ఆర్టీసీ యాజమాన్యం తగ్గించింది. తాజాగా మహిళా ప్రయాణికులకూ రూ.10 తగ్గించి రూ.80కే అందించాలని నిర్ణయించింది. ఈ కొత్త టి-24 టికెట్ ధర మంగళవారం నుంచి అందుబాటులోకి వస్తుంది. సిటీ పరిధిలో తిరిగే ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోని కండక్టర్ల వద్ద ఈ టికెట్లు అందుబాటులో ఉంటాయి. అనూహ్య స్పందన ప్రయాణికుల ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అందుబాటులోకి తెచ్చిన టి-24 టికెట్‌కు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందని టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ తెలిపారు. ''సిటీ బస్సుల్లో 24 గంటల పాటు ప్రయాణించే ఆ టికెట్ ధరను రూ.100 నుంచి రూ.90కి సంస్థ ఇటీవల తగ్గించింది. కొత్తగా సీనియర్ సిటీజన్లకు రూ.80కే ఆ టికెట్‌ను అందిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులు టి-24 టికెట్లను ఎక్కువగా కొనుగోలు చేసి బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఆ ధర తగ్గింపు తర్వాత ప్రతి రోజు సగటున 40 వేల వరకు టి-24 టికెట్లు అమ్ముడవుతున్నాయి. గతంలో రోజుకి 25 వేలు మాత్రమే ఉండే ఆ సంఖ్య గణనీయంగా పెరిగింది. మహిళా ప్రయాణికులకు మరింతగా దగ్గరఅయ్యేందుకు రూ.80కే టి-24 టికెట్ అందించాలని సంస్థ నిర్ణయించింది." అని వారు పేర్కొన్నారు. మహిళలు, సీనియర్ సిటీజన్ల కోసం టి-6 టికెట్ ను ఇటీవల ప్రారంభించామని, రూ.50 కి ఆ టికెట్ ను కొనుగోలు చేస్తే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వారు ప్రయాణించవచ్చని చెప్పారు. అలాగే, కుటుంబ సభ్యులు, స్నేహితుల సౌకర్యార్థం ఎఫ్-24 టికెట్ ను అందుబాటులోకి తెచ్చామని వివరించారు. వీకెండ్స్, సెలవు రోజుల్లో రూ.300 చెల్లించి నలుగురు 24 గంటల పాటు ప్రయాణించవచ్చని పేర్కొన్నారు. హైదరాబాద్ సిటీలో తీసుకువచ్చిన టి-24, టి-6, ఎఫ్-24 టికెట్లను కొనుగోలు చేసి.. క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. మెరుగైన, నాణ్యమైన సేవలందిస్తోన్న టీఎస్ఆర్టీసీని ప్రజలు ఆదరించాలని కోరారు. సంస్థ ఏ కార్యక్రమం తీసుకువచ్చిన ప్రజలు ప్రోత్సహిస్తున్నారని, వారి ఆదరణ మరువలేనిదని సంస్థ చైర్మన్, ఎమ్యెల్యే బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ అన్నారు. (చదవండి: TS: జేపీఎస్‌లకు ప్రభుత్వం నోటీసులు.. జాబ్స్ నుంచి తొలగిస్తాం!) -
హైదరాబాద్: అదిరిపోయే ఆఫర్లును ప్రకటించిన టీఎస్ఆర్టీసీ.. రూ.50 చెల్లిస్తే..
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఎండీగా వీసీ సజ్జనార్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తనదైన మార్క్ పని తీరుతో ఆకట్టుకుంటున్నారు. టీఎస్ఆర్టీసీ ప్రమోట్ చేసేందుకు ప్రత్యేక కార్యక్రమాలతో పాటు సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నారు. తాజాగా ప్రయాణికుల కోసం మరో రెండు కొత్త పథకాలను ప్రవేశపెట్టారు. కొత్త ఆఫర్ వచ్చేసింది.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రయాణించే వారి కోసం ఆర్టీసీ ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. టీ-6, ఎఫ్-24 టికెట్ల పేరిట సరికొత్త ఆఫర్లను ప్యాసింజర్లకు కోసం తీసుకొచ్చింది. ఈ ఆఫర్‌కు సంబంధించిన పోస్టర్లను టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆవిష్కరించారు. టీ-6 ఆఫర్ ఏంటంటే.. మహిళలు, సీనియర్ సిటిజన్ల టీ-6ని ఉపయోగించుకోవచ్చు. వీళ్లు రూ. 50 చెల్లించి టీ-6 టికెట్ కొనుగోలు చేస్తే.. 6 గంటల పాటు (అనగా ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు) సిటీ ఆర్డినరీ బస్ లేదా మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ప్రయాణించవచ్చు. ఎఫ్-24 .. కుటుంబ సభ్యులు, లేదా స్నేహితుల కోసం ఈ టికెట్‌ను ప్రవేశపెట్టారు. ఇది శనివారం, ఆదివారం, సెలవు దినాలలో వర్తిస్తుంది. రూ. 300 చెల్లించి ఈ టికెట్‌పై 4 వ్యక్తులు రోజంతా సిటీ ఆర్డినరీ బస్ లేదా మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులలో ప్రయాణించే వెసులుబాటు కల్పించారు. గతంలో ప్రవేశపెట్టిన టీ-24 టికెట్‌కు ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభించిందని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి వరకు 33.38 కోట్ల మంది ప్రయాణికులు టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించగా.. వారిలో 55.50 లక్షల మంది T-24 టిక్కెట్లు కొనుగోలు చేసినట్లు చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్‌లో రెండు ప్రత్యేక ఆఫర్లను #TSRTC ప్రకటించింది. మహిళలు, సీనియర్ సిటిజన్ల కోసం టి-6ను, వారాంతాలు, సెలవుల్లో కుటుంబసభ్యులు, స్నేహితుల సౌకర్యార్థం 'ఎఫ్-24' టికెట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. టి-24 మాదిరిగానే ఈ టికెట్లను ఆదరించాలని #TSRTC యాజమాన్యం కోరుతోంది. pic.twitter.com/0qSvQ6mceF — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) March 9, 2023 -
పాఠశాల బస్సును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
ఎల్లారెడ్డిపేట (సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మంగళవారం ఉదయం విజ్ఞాన్ ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది విద్యార్థులు గాయపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఎల్లారెడ్డిపేటలోని విజ్ఞాన్ స్కూల్లో చదువుతున్న మండలంలోని అల్మాస్పూర్, రాజన్నపేట గ్రామాలకు చెందిన 22 మంది విద్యార్థులు స్కూల్‌బస్సులో ఉదయం 7.30 గంటల ప్రాంతంలో పాఠశాలకు వెళ్తున్నారు. ఎల్లారెడ్డిపేట శివారులోని రెండోబైపాస్ మూలమలుపు వద్ద కామారెడ్డి ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు వెనుక నుంచి వచ్చి అతివేగంగా ఢీకొట్టింది. దీంతో స్కూల్ బస్సు వెనుకభాగం ధ్వంసమైంది. ఆర్టీసీ బస్సులోని ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. డ్రైవర్ వెంటనే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ ఘటనలో స్కూల్ బస్సులోని వెనుకసీట్లో కూర్చున్న విద్యార్థులు విహాన్, ఆదిత్య, దినేశ్, వినయ్, శివ, శివారెడ్డి, శ్రీనివాస్, తనుశ్రీ, మల్లికార్జున్, కావ్య, ధరణి, వర్షిణి, మణిసూదన్, మణిదీప్, సిద్దేశ్తోపాటు బస్సు క్లీనర్ అజయ్‌లు గాయపడ్డారు. రక్తం కారుతుండడంతో పిల్లలు భయాందోళనకు గురై రోదించారు. ప్రమాదం విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు హుటాహుటిన ఆస్పత్రికి తరలిరావడంతో అక్కడ పరిస్థితి రోదనలతో మిన్నంటింది. ఫోన్లో ఆరా తీసిన మంత్రి కేటీఆర్ ప్రమాదం విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్ వెంటనే కలెక్టర్ అనురాగ్ జయంతి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యలతో ఫోన్లో మాట్లాడారు. పిల్లల ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. అవసరమైతే వెంటనే హైదరాబాద్‌కు తరలించాలని సూచించారు. ఈ ఘటనపై స్పందించిన కలెక్టర్ అనురాగ్ జయంతి వెంటనే డీఈవో రాధాకిషన్‌ను అప్రమత్తం చేశారు. ఎల్లారెడ్డిపేట ఆస్పత్రికి చేరుకున్న డీఈవో రాధాకిషన్ ప్రమాద సంఘటనపై వివరాలు సేకరించి, విద్యార్థులను పరామర్శించారు. -
ఆర్టీసీ బస్సుకు తృటిలో తప్పిన ఘోర ప్రమాదం
శ్రీశైలం ప్రాజెక్ట్/దోమలపెంట: శ్రీశైలం నుంచి మహబూబ్‌నగర్‌కు వెళ్తున్న తెలంగాణ ఆర్టీసీ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో శ్రీశైలం నుంచి మహబూబ్‌నగర్ బయలుదేరిన ఆర్టీసీ అద్దె బస్సు శ్రీశైలం డ్యామ్ సమీపంలోని తలకాయ టర్నింగ్ వద్ద ప్రమాదానికి గురైంది. వేగంగా వస్తున్న బస్సు మలుపు వద్ద సక్రమంగా ప్రయాణించక ఎదురుగా ఉన్న సైడ్వాల్ను ఢీకొట్టింది. ప్రమాదాలు తరచూ జరిగే స్థలం కాబట్టి ఆర్ అండ్ బీ అధికారులు ఆ మలుపుల వద్ద ఇనుప గడ్డర్లతో బారికేడ్లు ఏర్పాటు చేశారు. బారికేడ్‌ను ఢీకొన్న బస్సు అక్కడే నిలిచిపోయింది. లేదంటే కింద ఉన్న లోయలోకి పడిపోయి ఘోర ప్రమాదం జరిగి ఉండేది. ప్రమాద సమయంలో 30 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నట్టు సమాచారం. బస్సు ఏమాత్రం ముందుకెళ్లినా వంద అడుగుల లోతున ఉన్న లోయలో పడేదని ప్రయాణికులు తెలిపారు. బ్రేక్ పడకపోవడం వల్లే బస్సు ముందుకు దూసుకెళ్లినట్టు తెలిసింది. ప్రమాదం తర్వాత డ్రైవర్ చాకచక్యంగా బస్సును వెనక్కి మళ్లించి ప్రయాణికులతో సహా మహబూబ్‌నగర్ వెళ్లిపోయారు. -
శ్రీశైలం ఘాట్ రోడ్డులో తృటిలో తప్పిన పెను ప్రమాదం..
సాక్షి, శ్రీశైలం: శ్రీశైలం ప్రాజెక్ట్ వద్ధ ఘాట్ రోడ్డులో తృటిలో పెను ప్రమాదం తప్పింది. టీఎస్ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. తృటిలో ఈ ప్రమాదం నుంచి 30 మంది ప్రయాణీకులు ప్రాణాలతో బయటపడ్డారు. దీంతో, అందరూ ఊపిరిపీల్చుకున్నారు. వివరాల ప్రకారం.. శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఆర్టీసీ ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. టీఎస్ఆర్టీసీ బస్సు శ్రీశైలం నుంచి మహబూబ్ నగర్ వెళ్తుండగా.. అదుపు తప్పి ప్రాజెక్ట్ లోయ వద్ద డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ క్రమంలో డ్రైవర్ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సు డివైడర్ రైయిలింగ్‌కు ఆనుకుని ఆగిపోయింది. కాగా, ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇక, ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
Hyderabad: ఐటీ ఉద్యోగులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త..
సాక్షి, హైదరాబాద్: ఐటీ ఉద్యోగులకు శుభవార్త. నగరంలోని ఐటీ కారిడార్‌లో ప్రత్యేక షటిల్ బస్‌లను నడపాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) నిర్ణయించింది. హైటెక్‌సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఈ సర్వీస్‌లను త్వరలోనే నడిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఐటీ ఉద్యోగులు వ్యక్తిగత వాహనాల్లో గంటల కొద్దీ ప్రయాణించి అవస్థలు పడుతుండడంతో ప్రత్యేక షటిల్ సర్వీసుల సదుపాయంతో తక్కువ వ్యయంతోనే సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ షటిల్ సర్వీస్‌ల కోసం ఆన్లైన్ సర్వే ద్వారా ఐటీ ఉద్యోగుల నుంచి అభిప్రాయాలను టీఎస్ఆర్టీసీ కోరుతోంది. ఆ సర్వే వివరాల మేరకు భవిష్యత్‌లో ఐటీకారిడార్‌లో మరిన్ని షటిల్ సరీ్వసులను నడుపుతామని ప్రకటించింది. ఈ షటిల్ సర్వీస్ సదుపాయాన్ని వినియోగించుకోవాలనుకునే ఐటీ ఉద్యోగులు ‘షార్ట్‌యూఆర్‌ఎల్.ఏటీ/ఏవీసీహెచ్‌ఐ’ లింక్‌పై క్లిక్ చేసి వివరాలను నమోదు చేసుకోవాలని టీఎస్ఆర్టీసీ సూచించింది. ఉద్యోగులు తమ కంపెనీ వివరాలు, లొకేషన్, పికప్, డ్రాపింగ్ ప్రాంతాలను విధిగా నమోదు చేయడంతో పాటు తమ విలువైన సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరింది. బుకింగ్‌కు ప్రత్యేక యాప్... ఐటీ ఉద్యోగులు సురక్షితంగా గమ్యస్థానాలను చేర్చడమే ప్రత్యేక షటిల్ బస్ సర్వీస్ ప్రధాన ఉద్దేశం. అందుకు సాంకేతికత ద్వారా ఈ సేవలను సులువుగా అందించాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఈ సేవలను వినియోగించుకునేందుకు ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తోంది. ఆ యాప్‌లోనే టికెట్ బుకింగ్ సదుపాయాన్ని కల్పించనుంది. ఈ సరీ్వస్‌లకు ట్రాకింగ్ సదుపాయం కూడా ఉంది. ప్రస్తుతం బస్ ఎక్కడుంది, ఏఏ ప్రాంతాల్లో తిరుగుతుంది అనే విషయాలను ట్రాకింగ్ సదుపాయం ద్వారా తెలుసుకోవచ్చు. మహిళల భద్రత నేపథ్యంలో షటిల్ బస్సుల్లో ట్రాకింగ్ సదుపాయాన్ని కల్పించినట్లు టీఎస్ఆర్టీసీ తెలిపింది. యాప్‌లో సర్వీస్ నంబర్, డ్రైవర్, కండక్టర్ ఫోన్ నంబర్లు, ఇతర వివరాలూ ఉంటాయని వివరించింది. ఈ సదుపాయాన్ని ఐటీ ఉద్యోగులు విరివిగా వినియోగించుకోవాలని సూచించింది. చదవండి: అమెరికా టూ ఇండియా!.. తక్కువ ధరకే విమాన టికెట్.. నమ్మితే అంతే! -
తెలంగాణ ఆర్టీసీ బస్సులు డొక్కుడొక్కు.. అద్దె బస్సులపై కన్ను?
సాక్షి, హైదరాబాద్: బస్సులు సరిపోక ఇబ్బంది పడుతున్న ఆర్టీసీ అద్దె బస్సులను కొనుక్కునే అంశాన్ని పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీలో దాదాపు 3,100 అద్దె బస్సులు కొనసాగుతున్నాయి. ప్రైవేటు వ్యక్తులు సొంతంగా బస్సులు కొని ఆర్టీసీకి అద్దెకిచ్చి తిప్పుతున్న విషయం తెలిసిందే. 2019లో ఆర్టీసీలో సమ్మె జరిగిన సమయంలో ప్రభుత్వం వాటిని పెంచుకునేందుకు అనుమతించి టెండర్లు పిలవడంతో వాటి సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. కానీ ఇప్పుడు వాటిల్లో చాలా బస్సులు నడవటం లేదు. వాటిని కొనేందుకు ఆర్టీసీ ఆలోచిస్తోంది. వాటినే ఎందుకు? ఆర్టీసీ కొన్నేళ్లుగా సరిపడినన్ని బస్సులు కొనటం లేదు. 2015లో 800 బస్సులు కొనటం మినహా ఆ తర్వాత కొత్తవి సమకూర్చుకోలేకపోయింది. దీంతో క్రమంగా ఉన్న బస్సులు పాతబడి డొక్కుగా మారిపోయాయి. గత్యంతరం లేక వాటినే మరమ్మతు చేసుకుంటూ, నిత్యం మెయింటెనెన్స్ పనులు జరుపుతూ నెట్టుకొస్తోంది. కొన్ని సరిగా నడవని పరిస్థితి ఉంది. ఆదివారం వికారాబాద్ శివారులో అనంతగిరి గుట్ట దిగుతూ ఓ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఇది డొక్కు బస్సు కావటం వల్లనే అదుపు తప్పిందని కార్మిక సంఘాలు ఆరోపణలు ఎక్కుపెట్టాయి. ఇలాంటి బస్సులు దాదాపు రెండున్నర వేలున్నాయని పేర్కొంటున్నారు. ఇటీవలే 675 కొత్త బస్సుల కోసం టెండర్ల ప్రక్రియ ముగిసింది. అవి వచ్చే మార్చి నాటికి చేతికందబోతున్నాయి. కానీ ప్రస్తుతం ఉన్న కొరతను అవి తీర్చలేవు. ఈ నేపథ్యంలో అద్దె బస్సులవైపు ఆర్టీసీ దృష్టి సారించింది. నిష్క్రమించినవి 600 కొన్ని నెలలుగా గిట్టుబాటు ఉండటం లేదంటూ అద్దె బస్సు నిర్వాహకులు క్రమంగా వైదొలుగుతూ వస్తున్నారు. ఇప్పటికే దాదాపు 600 బస్సులు అలా అర్టీసీ నుంచి నిష్క్రమించాయి. ఇంకా చాలామంది యజమానులు వాటిని విరమించుకునే యత్నంలో ఉన్నారు. ఆరేడేళ్ల వయసున్న బస్సులను వారు రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల ధరకు విద్యాసంస్థలు, ఇతర సంస్థలకు అమ్ముకుంటున్నారు. ఆర్టీసీ అదే కొత్త బస్సు కొనాలంటే రూ.35 లక్షల వరకు వెచ్చించాల్సి వస్తుంది. తక్కువ ధరలో వస్తున్నందున ఆ బస్సులను కొని సొంత వర్క్‌షాపులో మెరుగుపరిస్తే కనీసం ఏడెనిమిదేళ్ల వరకు ఇబ్బంది ఉండదనేది అధికారుల యోచన. ఆ బస్సుల కొనుగోలు ఎంతవరకు సరైన నిర్ణయమనేది తేల్చేందుకు ఓ కమిటీని నియమించారు. ఆ కమిటీ ఇచ్చే నిర్ణయం ఆధారంగా చర్యలు తీసుకోనున్నారు. ఈలోపు ఎన్ని అద్దె బస్సులు అమ్మకానికి ఉన్నాయనే వివరాలను సేకరిస్తున్నారు. ఇదీ చదవండి: ఆరోగ్యశ్రీ కింద.. రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం -
Hyderabad: బస్సులన్నీ మునుగోడు వైపు.. శివారు వాసుల అవస్థలు
సాక్షి, హైదరాబాద్: సుబ్బి పెళ్లి.. ఎంకి చావుకొచ్చిందన్న చందంగా మారింది ఆర్టీసీ వ్యవహారం చూస్తే. నగర శివారు డిపోల నుంచి నిత్యం సుమారు 150 బస్సుల్లో మునుగోడు నియోజకవర్గం పరిధిలోని ఆరు మండలాల ఓటర్లను నగర శివార్లలోని మన్నెగూడకు తరలించేందుకు ఏర్పాటు చేయడంతో.. శివారు వాసులు, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం పలు రూట్లలో రాకపోకలు సాగించేందుకు బస్సులు అందుబాటులో లేక నానా అవస్థలు పడుతున్నారు. శివారు డిపోల నుంచి ప్రతి మండలానికి నిత్యం 20– 30 బస్సులను తరలిస్తున్నట్లు తెలిసింది. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా.. ఖరీదైనదిగా మునుగోడు ఉపఎన్నిక మారిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గానికి చెందిన వివిధ సామాజిక వర్గాలకు చెందిన వేలాది మంది ఓటర్లను టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు శివార్లలోని మన్నెగూడలోని కన్వెన్షన్ సెంటర్లకు తరలించి పోటాపోటీగా ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహిస్తున్నారు. గత వారం రోజులుగా ఈ వ్యవహారం ఊపందుకుంది. కులాల వారీగా తాయిలాలు ప్రకటించి ఓటర్లను తమ వైపునకు తిప్పుకొనేందుకు అధికార, విపక్ష పార్టీలన్నీ ప్రయత్నిస్తున్నాయి. బస్సులు లేక శివారు వాసుల అవస్థలు గ్రేటర్ పరిధిలో 29 ఆర్టీసీ డిపోలుండగా.. శివారు ప్రాంతాల్లో ఉన్న బండ్లగూడ, హయత్‌నగర్–1, 2, ఇబ్రహీంపట్నం, మిధాని, ఫరూఖ్‌నగర్ తదితర డిపోలకు చెందిన 150 బస్సులు నిత్యం మునుగోడు ఓటర్లను సామాజికవర్గాల వారీగా ఆతీ్మయ సమ్మేళనం పేరిట మన్నెగూడకు తరలించేందుకు వినియోగిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆర్టీసీ నిర్ణయించిన చార్జీలు చెల్లించి ఈ బస్సులను తరలిస్తున్నట్లు ఆయా పారీ్టల నేతలు చెబుతున్నారు. నగరంలో అరకొరగా ఉన్న ఆర్టీసీ బస్సులను మునుగోడుకు తరలించడంతో నగరంలోని 1050 ఆర్టీసీ రూట్లుండగా.. వీటిలో 250 రూట్లలో నిత్యం 1500 ట్రిప్పులకు కోత పడుతోంది. ఈ మార్గాల్లో ప్రయాణించే వేలాది మంది సెవన్‌సీటర్ ఆటోలు,క్యాబ్‌లు ఆశ్రయించి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. శివారు ఆర్టీసీ డిపోల నుంచి ఓఆర్ఆర్ పరిధిలోని 190 గ్రామాలకు రాకపోకలు సాగించే బస్సులే అధికంగా ఉన్నాయి. ఉన్నపళంగా ఈ బస్సులు మునుగోడు బాట పట్టడంతో ఆయా గ్రామాల వాసులు ఉదయం, రాత్రి వేళల్లో అవస్థలు పడుతున్నారు. కాగా బస్సుల తరలింపు వ్యవహారంపై ఆర్టీసీ హైదరాబాద్ రీజియన్ ఆర్ఎంను ‘సాక్షి’ ఫోన్లో సంప్రదించేందుకు ప్రయత్నించగా...ఆయన అందుబాటులోకి రాలేదు. -
TSRTC: అరచేతిలో ఆర్టీసీ బస్సు
సాక్షి, హైదరాబాద్: ఏ బస్సు ఎక్కడుందో తెలుసుకునే సాంకేతిక సదుపాయం అందుబాటులోకి వచ్చింది. మొబైల్ ఫోన్లలో ‘టీఎస్ఆర్టీసీ బస్‌ట్రాకింగ్’ యాప్ ద్వారా బస్సుల కచ్చితమైన జాడను తెలియజేసే ట్రాకింగ్ సేవలను మంగళవారం ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే పుష్పక్ ఏసీ బస్సులతో పాటు, హైదరాబాద్ నుంచి విజయవాడ, శ్రీశైలం, భద్రాచలం, ఏలూరు, విశాఖపట్టణం, తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించే దూరప్రాంత బస్సుల్లోనూ ట్రాకింగ్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 96 డిపోల్లో ప్రత్యేకంగా ఎంపిక చేసిన 4170 బస్సులను ట్రాకింగ్ వ్యవస్థ పరిధిలోకి తెచ్చేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. దీంతో ఇంటి నుంచి బయలుదేరిన ప్రయాణికుడు తాను ఎక్కవలసిన బస్సు ఎక్కడుందో ఇట్టే తెలుసుకోవచ్చు. అలాగే ప్రయాణికుడు ఎదురు చూసే బస్టాపునకు ఆ బస్సు ఎంత సమయంలో చేరుకుంటుందనే సమాచారం కూడా మొబైల్ యాప్ ద్వారా తెలిసిపోతుంది. ప్రయాణికులు గూగుల్ ప్లేస్టోర్ నుంచి ‘టీఎస్ఆర్టీసీ బస్‌ట్రాకింగ్’ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. తెలంగాణతో పాటు ఇరుగు పొరుగు రాష్ట్రాల్లోనూ టీఎస్ఆర్టీసీ బస్సుల సమాచారం తెలుసుకోవచ్చని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ప్రయోగాత్మకంగా 140 బస్సులను గుర్తించారు, వీటిలో కంటోన్మెంట్, మియాపూర్–2 డిపోలకు చెందిన 40 ఏసీ పుష్పక్ బస్సులలో ట్రాకింగ్ సేవలను ప్రవేశపెట్టారు. అలాగే శ్రీశైలం, విజయవాడ, ఏలూరు, భద్రాచలం, విశాఖపట్నం, తదితర రూట్లలో నడిచే మరో 100 బస్సుల్లోనూ ట్రాక్ సేవలను ప్రవేశపెట్టారు. త్వరలో నగరంలోని అన్ని రిజర్వేషన్ సేవలు, ప్రత్యేక తరహా సేవలను కూడా ట్రాకింగ్ యాప్‌లో అందుబాటులోకి తేనున్నారు. అత్యవసర సేవలు సైతం... ఈ మొబైల్ యాప్‌లో బస్సుల ప్రస్తుత లొకేషన్, సమీప బస్ స్టాప్‌ను వీక్షించడంతో పాటు మహిళా హెల్ప్‌లైన్ సేవలను కూడా అందజేయనున్నారు. అత్యవసర పరిస్థితుల్లో మహిళా ప్రయాణికులు ఈ హెల్ప్‌లైన్ సహాయం కోరవచ్చునని ఎండీ పేర్కొన్నారు. కండక్టర్, డ్రైవర్, తదితర సిబ్బంది ప్రవర్తనపైన కూడా ప్రయాణికులు తమ అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు. (చదవండి: కేసీఆర్‌ను ఓడించకపోతే నా జీవితానికి సార్థకత లేదు ) -
పిల్లల చదువులకు పాసులభారం.. ఐదు కిలో మీటర్లకు రూ.35 వడ్డన
మిర్యాలగూడ టౌన్ : ఆర్టీసీలో బస్‌పాస్‌ల జారీ ప్రక్రియ ప్రారంభమైంది. విద్యాసంస్థలు ప్రారంభమై పక్షం రోజులు కావడంతో ఆ సంస్థ అధికారులు ఇప్పటికే ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అయితే, ఈ విద్యా సంవత్సరం పెరిగిన చార్జీలతోనే విద్యార్థులకు కూడా రాయితీ బస్ పాస్‌లను జారీ చేయనున్నట్లు ఆ సంస్థ అధికారులు ప్రకటించారు. దీంతో గత ఏడాదితో పొలిస్తే ప్రస్తుత విద్యా సంవత్సరంలో విద్యార్థులపై అదనంగా భారం పడుతోంది. ఐదు కిలో మీటర్ల ప్రయాణిస్తే పెరిగిన చార్జీల కారణంగా భారం రూ.35 పడుతుండగా ఆపై కిలో మీటర్లు ప్రయాణించే విద్యార్థులకు అదనంగా చెల్లించాల్సిందేనని ఆ సంస్థ అధికారులు స్పష్టం చేస్తున్నారు. విద్యార్థులు బస్‌పాస్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వెంటనే సంబంధిత పాఠశాల, కళాశాల యాజమాన్యానికి ఇచ్చిన లాగెన్‌లోకి వెళ్తుంది. ఆ విద్యా సంస్థల యాజమాన్యం విద్యార్థులు చేసుకున్న దరఖాస్తులను ధ్రువీకరించి తిరిగి ఆర్టీసీ అధికారులకు పంపిస్తే ఆయా బస్టాండ్‌లోని కేంద్రాల్లో బస్‌పాస్‌లను పొందవచ్చని పేర్కొంటున్నారు. చదవండి👉🏻ఖైరతాబాద్ భారీ గణనాథుని రూపం ఆవిష్కరణ అడ్మినిస్ట్రేషన్ చార్జీలు లేవు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు అడ్మినిస్ట్రేషన్ చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే, ప్రైవేట్ విద్యాసంస్థల్లో అభ్యసించే విద్యార్థులకు ఈ సదుపాయం వర్తించదని ఆ సంస్థ అధికారులు పేర్కొంటున్నారు. బస్‌పాస్ పొందాలనుకునే విద్యార్థులు తొలుత అకౌంట్ ఆఫీసర్, టీఎస్ఆర్టీసీ నల్లగొండ పేరిట డీడీ తీయాల్సి ఉంటుంది. యాజమాన్యం ఆ డీడీని తీసుకువచ్చి సంబంధిత బస్టాండ్ బస్సుపాస్ కౌంటర్లలో నమోదు చేయించాలి. అనంతరం ఇనిస్టిట్యూట్ వివరాలు బస్సుపాస్ కౌంటర్లలో పొందుపరుస్తారు. వెంటనే నమోదు చేసిన మొబైల్‌కు యూజర్ ఐడీ, పాస్వర్డ్ వస్తుంది. 15ఏళ్ల లోపు బాలికలు, 12ఏళ్ల లోపు బాలురకు ఉచితంగా.. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు మధ్యలోనే చదువు మానేయకుండా, బాలికలను విద్యలో ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఆర్టీసీ 15ఏళ్లలోపు బాలికలు, 12ఏళ్లలోపు బాలురకు ఉచిత బస్‌పాస్ సౌకర్యం కల్పిస్తోంది. అదే విధంగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో కూడా అడ్మినిస్ట్రేషన్ చార్జీలపై ఆర్టీసీ రాయితీని అందిస్తోంది. విద్యార్థులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు కోరుతున్నారు. చదవండి👉🏻ఇష్టం లేని పెళ్లి.. పిల్లలు పుట్టడానికి మందు అని చెప్పి, ప్రియుడితో కలిసి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు బస్‌పాస్ పొందేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించాం. ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు వారికి కేటాయించిన విధంగా ప్రెష్, రెన్యువల్ ఆడ్మినిస్ట్రేషన్ చార్జీలను తక్షణమే చెల్లించాలి. – బొల్లెద్దు పాల్, ఆర్టీసీ డిపో మేనేజర్, మిర్యాలగూడ -
టీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులో మంటలు
సాక్షి, మహబూబ్ నగర్: టీఎస్ఆర్టీసీ బస్సు మంటల్లో దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తతో 16 మంది ప్రాణాలను కాపాడాడు. వివరాల ప్రకారం.. బెంగళూరు-హైదరాబాద్ జాతీయ రహదారిపై దగ్ధమైన హైదరాబాద్ డిపో-1కు చెందిన టీఎస్ఆర్టీసీ లగ్జరీ బస్సు ఆదివారం అర్దరాత్రి మంటల్లో కాలిపోయింది. కర్నూలు నుంచి హైదరాబాద్ బయలుదేరిన లగ్జరీ బస్సు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం దివిటిపల్లి వద్దకు రాగానే ఒక్కసారిగా అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ క్రమంలో అప్రమత్తమైన డ్రైవర్.. బస్సును నిలిపివేసి ప్రయాణికులను కిందకు దింపాడు. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 16 మంది ప్రయాణికులకు ముప్పు తప్పింది. అయితే, షార్ట్ సర్య్కూట్ కారణంగానే మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. బస్సు అగ్ని ప్రమాదానికి గురైన విషయం తెలుసుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునేలోపే.. మంటల్లో బస్సు పూర్తిగా కాలిపోయింది. ఇది కూడా చదవండి: అగ్నిపథ్ వల్ల ఆర్మీ బలహీన పడుతుంది -
Nalgonda: కెనడాలో పరిచయం.. 15 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే..
నకిరేకల్: పెళ్లయిన 15రోజులకే రోడ్డు ప్రమాదంలో నవ వరుడు మృతిచెందిన ఘటన మండలంలోని గోరెంకలపల్లి శివారులో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన ఆద పృథ్వీ(29)కి గత నెల 26న విజయవాడకు చెందిన భార్గవితో వివాహం జరిగింది. వీరిద్దరూ కెనడాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. గురువారం ఉదయం పృథ్వీ తన తండ్రి రాజేందర్‌తో కలిసి కారులో నకిరేకల్ మీదుగా హాలియాకు బయల్దేరాడు. ఈ క్రమంలో నకిరేకల్ మండలం గోరెంకలపల్లి శివారులోని మూలమలుపు వద్ద కరీంనగర్ డిపో–2కు చెందిన ఆర్టీసీ బస్సు కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పృథ్వీ తీవ్రంగా గాయపడడంతో ఆస్పపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. అతడి తండ్రి రాజేందర్ ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డాడు. కెనడాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేసున్న క్రమంలోనే భార్గవితో పరిచయం కావడంతో ఇరువురు ఇండియాకు వచ్చి పెళ్లి చేసుకున్నారు. మరో వారం రోజుల్లో కెనడాకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. పెళ్లయిన 15రోజులకే పృథ్వీ మృతిచెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతుడి తండ్రి రాజేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రంగారెడ్డి తెలిపారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నామని ఎస్ఐ వివరించారు. ఇది కూడా చదవండి: రెండు నెలల క్రితమే పెళ్లి.. కోడలు రాకతోనే ప్రమాదం జరిగిందని -
స్టూడెంట్స్పై ఆర్టీసీ దెబ్బ.. భారీగా పెరిగిన బస్ పాస్ చార్జీలు
సాక్షి, హైదరాబాద్: ‘ఉరుము ఉరిమి మంగళం మీడ పడ్డట్టు’ చమురు ధరలు విపరీతంగా పెరగడంతో విద్యార్థుల బస్‌పాస్‌లపై పెను ప్రభావం చూపింది. ఆర్టీసీ పిడుగుపాటులా పెంచిన చార్జీలతో విద్యార్థి లోకంపై అశనిపాతమే అయింది. కోవిడ్ కారణంగా రెండేళ్ల పాటు ఆఫ్‌లైన్ చదువులతో ఢక్కామొక్కీలు తిన్న విద్యార్థులు.. ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న పరిస్థితులతో స్కూళ్లు, కాలేజీలకు వెళ్లి చదువుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ పెంచిన బస్‌పాస్ చార్జీలు గ్రేటర్‌లోని లక్షలాది మంది విద్యార్థులను బెంబేలెత్తిస్తున్నాయి. ఇప్పటి వరకు కేవలం రూ.165 తో నెల రోజుల పాటు ప్రయాణం చేసినవారు.. ఇక నుంచి ఏకంగా రూ.400 చెల్లించాల్సి ఉంటుంది. తాజాగా బస్‌పాస్ చార్జీలను పెంచడంతో పాటు రెండు దశాబ్దాల క్రితం నాటి రాయితీలను కూడా సవరించడంతో భారం రెండింతలైంది. దీంతో పేద, మధ్యతరగతి విద్యార్థుల చదువులకు ఇప్పుడు ఆర్టీసీ చార్జీలే గుదిబండగా మారాయి. మరోవైపు విద్యార్థుల బస్‌పాస్ రాయితీల నుంచి ఆర్టీసీ క్రమంగా తప్పుకొనేందుకే ఈ భారాన్ని మోపినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిణామం పట్ల విద్యార్ధి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పెంచిన చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. కొత్త చార్జీల ప్రకారమే.. సుమారు 5 లక్షల మంది విద్యార్ధులు నెలవారీ, మూడు నెలల సాధారణ బస్‌పాస్‌లతో పాటు గ్రేటర్ హైదరాబాద్ పాస్‌లు,రూట్ పాస్‌లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. జిల్లా బస్సుల్లో నగర శివార్ల వరకు అనుమతించే బస్‌పాస్‌లు కూడా ఉన్నాయి. మూడు నెలల పాటు సిటీ బస్సుల్లో ప్రయాణం చేసేందుకు తీసుకొనే క్వార్టర్లీ పాస్ ధర రూ.490 నుంచి ఇప్పుడు ఏకంగా రూ.1200కు పెరిగింది. ప్రతి రోజు ఒకే మార్గంలో రాకపోకలు సాగించేందుకు తీసుకొనే రూట్‌పాస్‌లు 8 కిలోమీటర్ల వరకు రూ.200 ఉండగా ప్రస్తుతం రూ.600కు పెంచారు. చదవండి: ఉప్పల్ కష్టాల్: అడుగడుగునా ట్రాఫికర్.. నలుదిక్కులా దిగ్బంధనం ప్రస్తుతం వివిధ రకాల విద్యార్థుల పాస్‌లపై ఆర్టీసీకి ప్రతి నెలా రూ.8 కోట్ల వరకు ఆదాయం లభిస్తుండగా చార్జీల పెంపుతో మరో రూ.15 కోట్లకుపైగా అదనంగా లభించనుంది. ప్రతి సంవత్సరం విద్యార్థులపై రూ.180 కోట్లకుపైగా అదనపు భారం పడనుంది. ఈ విద్యా సంవత్సరం కోసం విద్యార్థుల నుంచి ఆర్టీసీ బస్‌పాస్ దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ నెల 10 నుంచి దరఖాస్తులను స్వీకరించి 15 నుంచి జారీ చేయనుంది. కొత్త చార్జీల ప్రకారమే ఈ పాస్‌లను అందజేయనున్నారు. ఆందోళన ఉద్ధృతం చేస్తాం: ఇప్పటికే కోవిడ్ కారణంగా చదువులకు దూరమైన విద్యార్థులపై బస్‌పాస్ చార్జీల భారం మోపడం దారుణం. నిరుపేద పిల్లలు విద్యకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది, బస్‌పాస్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా ఆందోళన ఉద్ధృతం చేస్తాం. – రాథోడ్ సంతోష్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మోయలేని భారం బస్‌పాస్ చార్జీలు ఒక్కసారిగా ఇలా పెంచడం అన్యాయం. సిటీబస్సులపై ఆధారపడి కాలేజీకి వెళ్లే నాలాంటి వారికిది ఎంతో భారం. పెంచిన బస్‌పాస్ చార్జీలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి. – వంశీ, ఇంటర్ విద్యార్ధి రూట్ పాస్‌లు కిలోమీటర్లు ప్రస్తుతం పెంచిన చార్జీ (రూ.లలో) 4 165 450 8 200 600 12 245 900 18 280 1150 22 330 1350 -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురి దుర్మరణం
ముదిగొండ: బంధువుల ఇంట్లో కర్మకాండలకు ఆటోలో వెళ్లి వస్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గోకినేపల్లి సమీపాన గురువారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. నేలకొండపల్లి మండలం సదాశివపురం గ్రామానికి చెందిన తమలపాకుల భారతమ్మ(60), ఆమె కుమారుడు ఉపేందర్, మనవడు హర్షవర్ధన్ (6) ఆటోలో ఖమ్మం అర్బన్ మండలం ఏదులాపురంలోని బంధువుల ఇంట్లో జరిగిన కర్మకాండలకు హాజరై తిరుగు పయనమయ్యారు. వీరి ఆటో గోకినేపల్లి సమీపానికి చేరుకోగానే కోదాడ నుంచి ఖమ్మం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న భారతమ్మ, ఆమె మనవడు హర్షవర్ధన్ అక్కడికక్కడే మృతిచెందగా.. ఉపేందర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో భారతమ్మ తల తెగిపడింది. కాగా, మధ్యలో వీరు ప్రయాణిస్తున్న ఆటోఎక్కిన కారేపల్లి మండలం కొత్త కమలాపురం గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి చాగంటి రమేశ్ (36) కూడా ఈ ప్రమాదంలో మృతి చెందారు. నల్లగొండ జిల్లా నడిగూడెం మండలం సింగవరం గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ బొడ్డు ఉప్పలయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఖమ్మం– కోదాడ ప్రధాన రహదారిపై ఈ ప్రమాదం జరగడంతో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. మృతుల కుటుంబీకులు ప్రమాద స్థలానికి చేరుకుని తమకు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. ఖమ్మం రూరల్ ఏసీపీ బస్వారెడ్డి, సీఐ, ఎస్సైలు ఆందోళన చేస్తున్న వారికి నచ్చచెప్పి మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
మళ్లీ బుసకొట్టిన సెస్.. ఈసారి డీజిల్ సెస్ వడ్డించిన ఆర్టీసీ
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ చార్జీల పెంపునకు ప్రభుత్వం అనుమతివ్వడంలో జాప్యం జరుగుతుండటం, డీజిల్ ధరలు భారీగా పెరుగుతుండటంతో ఆర్టీసీ తన స్థాయిలో సెస్‌లను ఎడాపెడా వడ్డిస్తోంది. ఇప్పటికే సేఫ్టీ సెస్, ప్యాసింజర్ ఎమినిటీస్ సెస్ పెంపుతో టికెట్ ధరలను సవరించిన ఆర్టీసీ తాజాగా డీజిల్ సెస్ విధించింది. పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో ప్రతి టికెట్‌పై 2 రూపాయలు, ఎక్స్‌ప్రెన్, డీలక్స్, సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్ సర్వీసుల్లో ప్రతి టికెట్‌పై 5 రూపాయల చొప్పున సెస్ వడ్డించింది. సూపర్ లగ్జరీ సహా ఇతర ఏసీ కేటగిరీ సర్వీసుల్లో ఈ సెస్ పేరుకు 5 రూపాయలుగానే నిర్ధారించినా వాటిల్లో టికెట్ ధరలు రూ. 10 గుణిజంతో ఉన్నందున ప్రభావం నేరుగా రూ. 10గా ఉండనుంది. టికెట్ బేస్ ధరపై ఈ సెస్‌ను విధించి చిల్లర సమస్య రాకుండా ఆ మొత్తాన్ని రౌండ్ ఆఫ్ చేసింది. సిటీ ఆర్డినరీ, పల్లెవెలుగు బస్సుల్లో ధరను సమీపంలోని రూ. 5కు రౌండాఫ్ చేయగా ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సిటీ ఇతర సర్వీసుల్లో దాన్ని తదుపరి రూ. 5కు పెరిగేలా రౌండాఫ్ చేశారు. సూపర్ లగ్జరీ, ఇతర ఏసీ కేటగిరీల్లో దాన్ని తదుపరి రూ. 10కి రౌండాఫ్ చేశారు. నిజామాబాద్ టూర్‌కు వెళ్లిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అక్కడ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దీనిపై చర్చించి తుది నిర్ణయం తీసుకున్నారు. శనివారం తొలి సర్వీసు నుంచి డీజిల్ సెస్ అమల్లోకి తేనున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. రూ. 100 కోట్ల భారం.. ఈ కొత్త సెస్, దాని రూపంలో టికెట్ చార్జీని రౌండ్ ఆఫ్ చేయడం... వెరసి ఆర్టీసీకి సాలీనా రూ. 100 కోట్ల అదనపు రాబడి సమకూరనుంది. గత కొద్ది రోజులుగా ఆర్టీసీ వడ్డించిన సెస్‌లు, ఇతర రౌండింగ్ ఆఫ్ సవరింపులతో జనంపై వార్షికంగా రూ. 350 కోట్ల అదనపు భారం పడినట్టయింది. ఇక ప్రభుత్వం వద్ద పెండింగులో ఉన్న టికెట్ ధరల పెంపు ప్రతిపాదన అమలులోకి వస్తే సాలీనా మరో రూ. 900 కోట్లకుపైగా అదనపు భారం పడుతుంది. పెంపు భారం ఇలా.. పల్లెవెలుగు బస్సుల్లో 15 కి.మీ.తర్వాత (మూడో స్టేజీ) రూ.15గా ఉన్న టికెట్ ధర రూ.20గా, 20 కి.మీ. తర్వాత రూ. 20 టికెట్ రూ. 25గా, ఇలా ఐదు చొప్పున పెరుగుదల నమోదవుతుంది. సిటీ ఆర్డినరీ బస్సుల్లో రెండో స్టేజీ నుంచి కనీస టికెట్ చార్జీ రూ.10 నుంచి రూ. 15కు పెరుగుతుంది. మెట్రో ఎక్స్‌ప్రెస్‌లో రూ. 15 నుంచి రూ. 20కి, మెట్రో డీలక్స్‌లో రూ. 20 నుంచి రూ. 25కు పెరుగుతుంది. జిల్లా ఏసీ కేటగిరీల్లో రూ.10 మేర పెరుగుదల నమోదవుతుంది. చదవండి: టెన్త్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం -
Hyderabad: ఆర్టీసీ చార్జీల బాదుడు.. ఏ స్టాప్‌కు ఎంత పెంచారంటే?
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ గుట్టుచప్పుడు కాకుండా చార్జీలు పెంచింది. శుక్రవారం తెల్లవారుజాము నుంచే పెరిగిన చార్జీలు అమల్లోకి వచ్చేలా గ్రేటర్ హైదరాబాద్‌లోని అన్ని డిపోలకు సందేశాలు చేరాయి. సాధారణ చార్జీల పెంపు కాకుండా సేఫ్టీ సెస్ రూపంలో వీటిని పెంచింది. ప్రమాదాలు, విపత్తులు, వాహనాల బీమా తదితర అవసరాల దృష్ట్యా ఆర్టీసీ మూలనిధి కోసం కొత్తగా భద్రతా సెస్ చార్జీలను విధించినట్లు ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ మేరకు గ్రేటర్లో ఆర్డినరీ బస్సులకు నాలుగు స్టేజీల వరకు అంటే 8 కిలో మీటర్ల వరకు ప్రస్తుతం ఉన్న చార్జీలే యథాతథంగా ఉంటాయి. ఆ తర్వాత ప్రతి మూడు, నాలుగు స్టేజీలకు రూ..5 చొప్పున పెంచారు. మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్ బస్సుల్లో మొదటి రెండు స్టేజీల వరకు చార్జీలు యథాతథంగానే ఉన్నాయి. ఆ తర్వాత రూ.5 చొప్పున పెరిగాయి. ప్రయాణికులపై తప్పని భారం.. ఆర్టీసీ మూల నిధి కోసం ఇప్పుడు ఉన్న చార్జీలపై భద్రతా సెస్ రూపంలో మాత్రమే అదనపు చార్జీలను విధిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. నగరంలోని ప్రయాణికులపై ప్రతి నెలా రూ.5 కోట్ల నుంచి రూ.6 కోట్లకుపైగా అదనపు భారం పడనుంది. నగరంలో ప్రతిరోజు సుమారు 16 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ సేవలను వినియోగించుకుంటున్నారు. వీరిలో మెట్రో బస్సుల్లో మొదటి రెండు స్టేజీలు, ఆర్డినరీ బస్సుల్లో మొదటి నాలుగు స్టేజీలు ప్రయాణించే వారు నాలుగైదు లక్షల మంది మాత్రమే ఉంటారు. మిగతా ప్రయాణికులకు సిటీ బస్సుల్లో ప్రయాణం భారంగా మారింది. చదవండి: యూనివర్సల్ బేకరీ.. ఓ స్వీట్ మెమొరీ.. మూతపడటానికి కారణాలేమిటి? ఆర్డినరీ బస్సుల్లో.. ►ప్రస్తుతం ఆర్డినరీ బస్సుల్లో మొదటి రెండు స్టేజీలకు ప్రస్తుతం ఉన్న రూ.10 చార్జీలో ఎలాంటి మార్పు ఉండదు. ఆ తర్వాత మరో రెండు స్టేజీల వరకు ప్రస్తుతం ఉన్న రూ.15 చార్జీ యథావిధిగా ఉంటుంది. అంటే ప్రయాణికులు తాము బయలుదేరిన చోటు నుంచి 4 స్టేజీల వరకు అంటే 8 కి.మీ వరకు పాత చార్జీల ప్రకారమే చెల్లించాల్సి ఉంటుంది. ►10 కి.మీ తర్వాత చార్జీల పెంపు అమల్లోకి వస్తుంది. ఈ మేరకు 5వ స్టేజీ నుంచి రూ.5 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు 5 స్టేజీల వరకు ఇప్పటి వరకు రూ.15 చార్జీ ఉండగా ప్రస్తుతం రూ.20 కి పెంచారు. ► 6వ స్టేజీ నుంచి 9వ స్టేజీ వరకు అంటే 12 కి.మీ నుంచి 18 కి.మీ వరకు ఇప్పుడు ఉన్న చార్జీని రూ.20 నుంచి రూ.25కు పెంచారు. ►ఆ తర్వాత 10వ స్టేజీ అంటే 20 నుంచి 28 కి.మీ (14వ స్టేజీ) వరకు ఇప్పటి వరకు రూ.25 ఉండగా తాజాగా రూ.30కి పెంచారు. ►30 కి.మీ నుంచి 40 కి.మీ వరకు అంటే 15వ స్టేజీ నుంచి 19వ స్టేజీ వరకు ఇప్పటి వరకు రూ.30 చార్జీ ఉండగా దానిని తాజాగా రూ.35కు పెంచారు. ► 40 కి.మీ వరకు (20వ స్టేజీ) ఇప్పటి వరకు రూ.35 ఉండగా, తాజాగా రూ.40కి పెంచారు. మెట్రో ఎక్స్‌ప్రెస్‌లో... ►మూడో స్టేజీ వరకు అంటే 6 కి.మీ వరకు ఇప్పుడున్న రూ.15ను రూ.20కి పెంచారు. ఆ తర్వాత 8 నుంచి 14 కి.మీ వరకు అంటే 4వ స్టేజీ నుంచి 7వ స్టేజీ వరకు ఇప్పుడు ఉన్న రూ.20 చార్జీలను రూ.25కు పెంచారు. ►16 కి.మీ నుంచి 24 కి.మీ వరకు అంటే 8వ స్టేజీ నుంచి 12వ స్టేజీ వరకు రూ.25 నుంచి రూ.30కి పెంచారు. ఆ తర్వాత 4 స్టేజీల వరకు రూ.5 చొప్పున అంటే రూ.30 నుంచి రూ.35కు పెంచారు. 36 కి.మీ నుంచి (17వ స్టేజీ నుంచి) 40 కి.మీ వరకు (20వస్టేజీ వరకు) రూ.35 నుంచి రూ.40కి పెంపు. మెట్రో డీలక్స్ బస్సుల్లో.. ►మొదటి 2 కి.మీ వరకు రూ.15 చార్జీలో ఎలాంటి మార్పు లేదు. 4 కి.మీటర్లకు రూ.15 నుంచి రూ.20కి పెంచారు. ఆ తర్వాత 6 కి.మీ నుంచి (3వ స్టేజీ నుంచి) 12 కి.మీ వరకు (6వ స్టేజీ) రూ.20 నుంచి రూ.25కు చార్జీలు పెంచారు. ► 8వ స్టేజీ నుంచి అంటే 14 నుంచి 22 కి.మీ వరకు (11వ స్టేజీ)రూ.25 నుంచి రూ.30కి పెంచారు. ఆ తర్వాత రెండు స్టేజీల వరకు అంటే 26 కి.మీ వరకు రూ.30 నుంచి రూ.35 చొప్పున, ఆ తర్వాత వచ్చే రెండు స్టేజీల వరకు అంటే 30 కి.మీ వరకు రూ.35 నుంచి రూ.40 చొప్పున చార్జీలు పెరిగాయి. ►17వ స్టేజీ నుంచి 18వ స్టేజీ వరకు అంటే 34 కి.మీ నుంచి 36 కి.మీ వరకు రూ.40 నుంచి రూ.45కు పెంచారు. ►18వ స్టేజీ నుంచి 20వ స్టేజీ వరకు అంటే 36 నుంచి 40 కి.మీ వరకు ఇప్పటి వరకు ఉన్న చార్జీ రూ.45 నుంచి రూ.50కి పెంచారు. -
రెండు ఆర్టీసీ బస్సుల ఢీ..
భైంసా(ముధోల్): నిర్మల్ జిల్లా భైంసా మండలం వానల్పాడ్ గ్రామ సమీపంలో రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్న ఘటనలో 40 మందికి గాయాలయ్యాయి. వివరాలివి. సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో భైంసా నుంచి నిర్మల్‌కు నిర్మల్ డిపోకు చెందిన బస్సు వెళ్తోంది. ఇందులో 43 మంది ప్రయాణికులున్నారు. వెనకాలే భైంసా డిపోకు చెందిన బస్సు సారంగపూర్ వెళ్తోంది. ఇందులో 37 మంది ప్రయాణికులున్నారు. ఈ క్రమంలో భైంసా డిపో బస్సు నిర్మల్ డిపో బస్సును ఓవర్ టేక్ చేసే క్రమంలో వెనకనుంచి ఢీ కొట్టింది. ఇద్దరు డ్రైవర్లు బ్రేక్ వేయడంతో రెండు బస్సుల్లో 40 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఆర్టీసీ అధికారులు, పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను భైంసా, నిర్మల్ ఆసుపత్రులకు తరలించారు. ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
మట్టి పనికిపోతే.. బస్సు మృత్యువై వచ్చింది
సాక్షి, యాదాద్రి: వారంతా కూలీలు.. జాతీయ రహదారి మధ్యలోని మీడియన్పై మట్టిపని చేస్తు న్నారు.. వాహనాలకు సూచికగా రోడ్డుపై బారికేడ్లు పెట్టారు.. ఓ మహిళాకూలీ హెచ్చరికగా ఎర్రజెండా పట్టుకుని కూడా నిలబడింది.. అంతా మరో గంట లో పని ముగించుకుని ఇంటికి బయలుదేరే వారే. అంతలోనే వారిని ఆర్టీసీ డీలక్స్ బస్సు ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో నలుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్– వరంగల్ జాతీయ రహదారిపై యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు బైపాస్ వద్ద ఆదివారం సాయంత్రం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కూలీపనికని వచ్చి.. ఆలేరు వద్ద జాతీయ రహదారిపై మీడియన్‌లో మొక్కలు నాటేందుకు వీలుగా మట్టిని తొలగించే పని ఇటీవల ప్రారంభమైంది. ఆదివారం ఉదయం భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని రాయగిరికి చెందిన ఎనిమిది మంది కూలీలు అదే ప్రాంతానికి చెందిన ఊరెళ్లి శ్యామ్ ఆటోలో పనికి వచ్చారు. శ్యామ్ భార్య లావణ్య కూడా కూలిపనికి వచ్చింది. సాయంత్రం వీరందరినీ తిరిగి రాయగిరికి తీసుకెళ్లేందుకు శ్యామ్ అక్కడికి వచ్చాడు. సుమారు 4 గంటల సమయంలో వరంగల్ వైపు నుంచి అతివేగంగా వస్తున్న ఆర్టీసీ డీలక్స్ బస్సు (ఏపీ 36 జెడ్ 0275) కూలీలపైకి దూసుకొచ్చింది. ఎర్ర జెండా హెచ్చరికను దాటి.. రోడ్డు పక్కన పని జరిగే ప్రాంతంలో ఎర్రజెండా ఊపుతూ నిలబడిన అంకర్ల లక్ష్మిని తొలుత బస్సు ఢీకొట్టింది. తర్వాత కవిత, లావణ్య, శ్యామ్‌లపైకి దూసుకెళ్లింది. లక్ష్మి (37) అక్కడికక్కడే చనిపోగా.. కవిత, లావణ్య తీవ్రగాయాలతో ఎగిరిపడ్డారు. శ్యామ్(32) బస్సు కింద ఇరుక్కోగా 200 మీటర్ల దూరం లాక్కెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందా డు. లావణ్య(27), కవిత(32) ను హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయారు. ఘటనాస్థలంలో రోదిస్తున్న మృతుల బంధువులు ట్రాక్టర్‌ను, జేసీబీని ఢీకొని.. మితిమీరిన వేగంతో కూలీలపై నుంచి దూసుకుపోయిన బస్సు.. రోడ్డుపక్క మట్టి నింపుకొంటున్న ట్రాక్టర్‌ను, దాని తర్వాత ఉన్న జేసీబీని ఢీకొట్టి ఆగిపోయింది. ఆ ధాటికి ట్రాక్టర్ తిరగబడింది. బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులున్నా రు. వారిలో కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. కాగా, చనిపోయిన కూలీలకు న్యాయం చేయాలని గ్రామస్తులు, బంధువులు జాతీయరహదారిపై రాస్తారోకో చేశారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ పోలీసులు సైమన్‌పై కేసు నమోదు చేశారు. దంపతులు.. తోడి కోడళ్లు.. రోడ్డుప్రమాదంలో మృతిచెందిన నలుగురిలో ఆటోడ్రైవర్ ఊరెళ్లి శ్యామ్, లావణ్య దంపతులు. మరో ఇద్దరు అంకర్ల లక్ష్మి, అంకర్ల కవిత ఇద్దరూ తోడి కోడళ్లు. 3 కుటుంబాల్లోనూ చిన్న పిల్లలున్నారు. దంపతులైన లావణ్య, ఊరెళ్ల శ్యాం మృతిచెందడం తో వీరిద్దరి పిల్లలు అనాథలుగా మిగిలారు. వీరికి సొంత ఇళ్లు లేదు. పిల్లలను చూసి పలువురు కంటతడి పెట్టారు. మంత్రి దిగ్భ్రాంతి.. ఎమ్మెల్యేల పరామర్శ ప్రమాద ఘటనపై రవాణామంత్రి పువ్వాడ అజయ్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామన్నారు. క్షతగాత్రులకు మెరుగైన సేవలు అందించాలని అధికారులను ఆదే శించారు. బాధితులను ఆలేరు, భువనగిరి ఎమ్మెల్యే లు సునీతామహేందర్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి పరామర్శించారు. బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టింది వరంగల్ వైపు నుంచి బస్సు వేగంగా వచ్చి నలుగురిని ఢీకొట్టింది. నేను ట్రాక్టర్ నడుపుతున్నా. బ స్సు ముందు ఎర్రజెండా చూపుతున్న మహిళను.. ఆపై మరో ఇద్దరిని ఢీకొట్టింది. అదే వేగంతో శ్యాంను ఢీకొట్టింది. 15 రోజులుగా ఎర్రజెండా పాతి పని చేస్తున్నాం. కానీ, ఈ రోజిలా జరిగింది. –స్వామి, ట్రాక్టర్ డ్రైవర్ ప్రత్యక్ష సాక్షి -
హైదరాబాద్: అయోమయంలో ఆర్టీసీ.. చేతులెత్తేసిన జీహెచ్ఎంసీ!
ఏళ్లకు ఏళ్లుగా తీవ్ర నిర్లక్ష్యానికి, నిరాదరణకు గురవుతున్న గ్రేటర్ ఆర్టీసీ ఏ రోజుకు ఆ రోజు జీవన్మరణ పోరాటం చేస్తోంది. ప్రతి రోజు రూ.కోట్లల్లో నష్టాలను చవి చూస్తోంది. ఒకప్పుడు మహానగరంలో అతిపెద్ద ప్రజా రవాణా సంస్థగా వెలుగొందిన ఆర్టీసీ ప్రాభవం క్రమంగా కనుమరుగవుతోంది. ప్రభుత్వ సాయం అందితే తప్ప బస్సు చక్రం కదలలేని పరిస్థితి నెలకొంది. హైదరాబాద్‌లో ఆర్టీసీ నిర్వహణను జీహెచ్ఎంసీకి అప్పగించనున్నట్లు అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఏడాది లోపే ఆ ప్రతిపాదన అటకెక్కింది. దీంతో ఆర్టీసీ మనుగడ కోసం తిరిగి ఒంటరి పోరాటాన్ని నమ్ముకొంది. -సాక్షి, హైదరాబాద్ సుదీర్ఘమైన కార్మికుల సమ్మె, రెండేళ్లుగా పట్టిపీడించిన కోవిడ్ మహమ్మారి వంటి పరిణామాలు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్‌ను మరింత కుంగదీశాయి. కొద్ది కొద్దిగా కోలుకుంటున్న తరుణంలో పెరిగిన డీజిల్ ధరల భారం మరోసారి శరాఘాతంగా మారింది. ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రతిసారి ఎంతో ఆశగా ఎదురు చూడడం, ఆ తరువాత తీవ్రమైన నిరాశకు గురకావడం ఆర్టీసీకి తప్పడం లేదు. మరి కొద్ది రోజుల్లో బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. మరోసారి సాయం కోసం ఆర్టీసీ పడిగాపులు కాస్తోంది. చేతులెత్తేసిన జీహెచ్ఎంసీ... గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రజా రవాణా సదుపాయాన్ని జీహెచ్ఎంసీ పరిధిలోకి తెచ్చేందుకు ప్రభుత్వం గతంలో ప్రతిపాదనలు చేసింది. ఈ మేరకు సిటీ బస్సులను, సిబ్బందిని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని భావించారు. కానీ బస్సుల నిర్వహణ భారంగా మాతుందని జీహెచ్ఎంసీ అధికారులు భావించారు. ఆర్ధిక సాయానికి మాత్రమే ముందుకు వచ్చారు. రెండు దశల్లో సుమారు రూ.300 కోట్ల వరకు నిధులు అందజేశారు. కానీ ఆ తరువాత ఏటేటా నిధులు ఇచ్చి ఆర్టీసీని ఆదుకొనేందుకు జీహెచ్ఎంసీ నిరాకరించింది. ముంబయి వంటి నగరరాల్లో ప్రజా రవాణా, విద్యుత్ సదుపాయం వంటివి బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉండగా, జీహెచ్ఎంసీ మాత్రం అలాంటి ప్రతిపాదనకు చేతులెత్తేయడం గమనార్హం. ఆదాయానికి రెట్టింపు నష్టాలు... నగరంలో సుమారు 2650 బస్సులకు పైగా ఉన్నాయి. రోజుకు 20 లక్షల మందికి రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నట్లు అంచనా. గతంలో 3850 బస్సులు ఉండేవి. 34 లక్షల మంది పయనించేవారు ప్రతి రోజు 42 వేల ట్రిప్పులు తిరిగేవి.కానీ బస్సుల సంఖ్య తగ్గిపోవడం, ప్రయాణికుల ఆదరణ కూడా క్రమంగా తగ్గడంతో 12 వేలకు పైగా ట్రిప్పులను తగ్గించారు. కోవిడ్ మూడో దశ తరువాత సిటీ బస్సులకు ప్రయాణికుల ఆదరణ కొంత మేరకు పెరిగింది. కానీ బస్సుల నిర్వహణ మాత్రం భారంగానే ఉంది. ఆర్టీసీలో కార్మికుల సుదీర్ఘమైన సమ్మెకు రోజుకు రూ.కోటి వరకు నష్టం వస్తే ఇప్పుడు అది రోజుకు రూ.2.35 కోట్లకు చేరుకుంది.కోటిన్నర ఆదాయం లభిస్తే అంతకు రెట్టింపు నష్టాన్ని చవి చూడాల్సి వస్తుంది. ఇలా ప్రతి నెలా సుమారు రూ. 75 కోట్ల నష్టాలను ఆర్టీసీ మూటగట్టుకొంటోంది. ఏడాది కాలంలో రూ.850 కోట్ల వరకు చేరినట్లు అంచనా. ప్రతి రోజు డీజిల్ పైనే రూ.1.4 కోట్ల వరకు ఖర్చు చేయవలసి వస్తుందని అధికారులు తెలిపారు. ఇదంతా ఒకవైపు అయితే మరోవైపు మెట్రో రైలు, ఓలా, ఉబెర్, రాపిడో వంటి యాప్ ఆధారిత రవాణా సదుపాయాలు నగర ఆర్టీసీకి తీవ్రమైన పోటీనిస్తున్నాయి. కొత్త బస్సుల కొనుగోళ్లకు నిధుల కొరత... సుమారు 300 ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోళ్లకు ఆర్టీసీ తాజాగా సన్నాహాలు చేపట్టింది. కానీ నిధుల కొరత అతి పెద్ద సమస్యగా మారింది. ప్రభుత్వం ఆదుకొంటే తప్ప ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్న ఆర్టీసీలో కొత్త బస్సుల కొనుగోళ్లకు ప్రభుత్వం తగిన నిధులు కేటాయించడం ఒక్కటే పరిష్కారం. ప్రగతి చక్రం తిరిగి పరుగులు పెట్టాలంటే కొత్త బస్సులు రోడ్డెక్కాల్సిందే. -
సిటీజనులకు గుడ్‌న్యూస్.. మేడారం జాతరకు ఆర్టీసీ బస్సులు.. ఇలా బుక్ చేసుకోండి
సాక్షి, సిటీబ్యూరో: సిటీ ఆర్టీసీ బస్సులను అద్దెకు ఇవ్వనున్నారు. ప్రయాణికులు నేరుగా తమ ఇంటి వద్ద నుంచే బయలుదేరేందుకు వీలుగా ఇవి అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా పెళ్లిళ్లు, జాతరల కోసం అద్దె ప్రాతిపదికన బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు వెళ్లే భక్తులు కనీసం 30 మంది ఉంటే చాలు. బస్సు అద్దెకు తీసుకొని వెళ్లవచ్చు. ఆర్టీసీ బస్సులు నేరుగా సమ్మక్క గద్దె వరకు వెళ్తాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంధువులను తీసుకెళ్లేందుకు బస్సులను అద్దెకు ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. సమీపంలోని డిపో మేనేజర్‌ను సంప్రదించి బస్సును బుక్ చేసుకోవచ్చు. ఆర్టీసీ వెబ్సైట్ www. tsrtconline.in ద్వారా సంప్రదించి బస్సులను అద్దెకు తీసుకోవచ్చు. (చదవండి: బీజేపీ Vs టీఆర్ఎస్.. చిచ్చురేపిన వాట్సాప్ మెసేజ్) -
జర్నీకి ఝలక్.. సగానికి పైగా బస్సులు ఖాళీ!
సాక్షి, సిటీబ్యూరో: చాలా రోజులుగా పీకల్లోతు నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్‌కు కోవిడ్ మూడో ఉధృతి మరింత గట్టి షాక్‌నిచ్చింది. సంక్రాంతి వరకు సిటీ బస్సులు కళకళలాడాయి. గత వారం రోజులుగా ఆక్యుపెన్సీ దారుణంగా పడిపోయింది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో సిటీ బస్సులు సగానికి పైగా ఖాళీగా కనిపిస్తున్నాయి. బస్సెక్కేవారేరీ... ► నగరంలో ప్రయాణికుల రాకపోకలు భారీగా తగ్గాయి. రోజు రోజుకూ కోవిడ్ కేసులు భారీగా నమోదవుతుండంతో జనం స్వీయనియంత్రణ పాటిస్తున్నారు. అవసరమైతేనే ప్రయాణం చేస్తున్నారు. దీంతో బస్సెక్కేవారి సంఖ్య తగ్గింది. సొంత వాహనాలు ఉన్న వారు సైతం తప్పనిసరి అవసరాలకే బయటకు వస్తున్నారు. దీంతో రోడ్లపైన వాహనాల రద్దీ కూడా తగ్గింది. ► సాధారణంగా గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రతి రోజు 2750 సిటీ బస్సులు రాకపోకలు సాగిస్తాయి. 30వేల ట్రిప్పులకు పైగా తిరుగుతాయి. కోవిడ్ రెండో ఉద్ధృతి అనంతరం అన్ని రూట్లలోనూ పూర్తిస్థాయిలో బస్సులను పునరుద్ధరించారు. నగర శివార్లలోని విద్యాసంస్థలకు రాకపోకలు సాగించే విద్యార్ధుల కోసం ప్రతి రోజు ఉదయం, సాయంత్రం 1500 బస్సులు నడిచేవి. ► ప్రస్తుతం స్కూళ్లు, కాలేజీలు తిరిగి ఆన్లైన్ బోధన ప్రారంభించడంతో విద్యార్థులు ఇళ్లకు పరిమితమయ్యారు.మరోవైపు కోవిడ్ నేపథ్యంలోనే అనేక సంస్థలు వర్క్‌ఫ్రమ్ హోమ్ ప్రకటించాయి. దీంతో సిటీ బస్సుల వినియోగం చాలా తగ్గింది . పడిపోయిన ఆక్యుపెన్సీ... ► సంక్రాంతికి ముందు ప్రయాణికుల ఆక్యుపెన్సీ 65శాతం వరకు ఉంటే ఇప్పుడు ఏకంగా 45శాతానికి తగ్గినట్లు అంచనా. ► కొన్ని రూట్లలో ఇంధనం ఖర్చులు కూడా లభించడం లేదని, ట్రిప్పులను రద్దు చేసుకోవలసి వస్తుందని అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అదేబాటలో క్యాబ్‌లు... ► క్యాబ్‌లలోనూ ప్రయాణికుల రాకపోకలు తగ్గాయి. ఐటీ కారిడార్లకు ప్రయాణాలు తగ్గాయి. గతంలో రోజుకు 60 వేల క్యాబ్‌లు నడిస్తే ఇప్పుడు వాటి సంఖ్య 30వేలకు పడిపోయిందనిడ్రైవర్లు చెబుతున్నారు. ► క్యాబ్‌లు నడిపేందుకు ఓలా, ఉబర్ సంస్థలు సరైన సదుపాయాలు కల్పించడం లేదని తెలంగాణ క్యాబ్ అండ్ ఫోర్ వీలర్స్ డ్రైవర్స్ జేఏసీ అధ్యక్షులు షేక్ సలావుద్దీన్ తెలిపారు. రవాణా రంగంపై మరోసారి కోవిడ్ పిడుగు పడింది. కొద్ది రోజులుగా పెరిగిన కరోనా ఉధృతితో ప్రయాణికుల రాకపోకలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. విమానాలు, రైళ్లతో పాటు బస్సుల్లోనూ ప్రయాణికులు తగ్గారు. కోవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ఆ ప్రభావం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)పై పడింది. ఇదిలా ఉండగా విమాన ప్రయాణికుల సంఖ్య కూడా బాగా తగ్గిపోయింది. సర్వీసులు ప్రారంభించిన కొద్ది రోజులకే విమానయానరంగంపై ఈ ప్రభావం తీవ్రంగా పడింది. -
ఆర్టీసీ ఆదాయానికి గండి.. 4 గంటల్లో విజయవాడకు’ అంటూ..
హయత్‌నగర్‌కు చెందిన రామకృష్ణ విజయవాడలో ఓ శుభకార్యానికి అత్యవసరంగా వెళ్లాల్సి వచ్చింది. ఎల్బీనగర్లో బస్సులు నిలిపే చోటుకి వెళ్లాడు. ‘ఆర్టీసీ బస్సులో వెళ్తే 6 గంటలు పడుతుంది. కారులో 4 గంటలే.. రండి’ అని పిలుపు వినపడటంతో అటు చూశాడు. వరుసగా 10 వరకు కార్లు ఆగి ఉన్నాయి. వాటి డ్రైవర్లూ ఇలాగే అరుస్తున్నారు. వెంటనే వెళ్లి ఓ ఇన్నోవాలో కూర్చున్నాడు. తిరుగు ప్రయాణంలోనూ ఇన్నోవాలోనే వచ్చాడు. సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్–విజయవాడ మధ్య ఒకటి కాదు, రెండు కాదు.. దాదాపు 700 కార్లు షటిల్ సర్వీసుల్లా తిరుగుతున్నాయి. ఆర్టీసీకి సమాంతరంగా మరో రవాణా వ్యవస్థనే నిర్వహిస్తున్నాయి. ‘తక్కువ సమయంలో గమ్యం’ పేరుతో ప్రయాణికులను లాగేసుకుంటున్నాయి. దీంతో పెద్దమొత్తంలో ఆదాయాన్ని ఆర్టీసీ కోల్పోతోంది. ప్రైవేటు ట్రావెల్స్ స్టేజీ క్యారియర్ల అవతారమెత్తటంతో సాలీనా రూ.2వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోతున్నట్టు ఆర్టీసీ గతంలోనే తేల్చింది. ఇప్పుడు ఆ బస్సులకు తోడు కార్లూ ఆర్టీసీకి ప్రమాదకరంగా మారాయి.నిత్యం దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్ స్టేజీల వద్ద బస్సులు ఆగే బస్‌బేలలోనే నిలిపి దర్జాగా ప్రయాణికులను కార్లు తన్నుకుపోతున్నాయి. ట్రాఫిక్‌తో ప్రయాణ సమయం పెరిగి.. విజయవాడ హైవే విస్తరించాక ప్రయాణ సమయం గంటన్నర మేర తగ్గింది. కానీ కొంతకాలంగా కార్లు, ఈ రోడ్డు మీదుగా వెళ్లే ఇతర వాహనాల సంఖ్య భారీగా పెరిగింది. రెండేళ్లలో ఈ వాహనాల సంఖ్య మరీ పెరిగి ఇప్పుడు బస్సు విజయవాడ చేరేందుకు 6 గంటలకుపైగా పడుతోంది. దీంతో జనం కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రయాణికులను కార్లు మళ్లించుకుపోతున్నా ఆర్టీసీ మాత్రం పట్టించుకోవట్లేదు. గత దసరా రోజు తాత్కాలికంగా సిబ్బందిని ఏర్పాటు చేసి రవాణా శాఖ ఆధ్వర్యంలో 55 కేసులు నమోదు చేయించి చేతులు దులిపేసుకుంది. చదవండి: నుమాయిష్‌పై కోవిడ్ ఎఫెక్ట్.. ఈ ఏడాది పూర్తిగా రద్దు.. నిత్యం 214 సర్వీసులు తిరగాల్సి ఉన్నా.. విజయవాడ వైపు నిత్యం 214 తెలంగాణ సర్వీ సులు తిరగాలి. వీటిల్లో 115 నాన్ ఏసీ బస్సులు, మిగతావి రాజధాని, గరుడ, గరుడ ప్లస్ సర్వీసులుండాలి. కానీ 20 సర్వీసులకు డీజిల్ ఖర్చుకు సరిపడా డబ్బులు కూడా రావట్లేదు. ఇలాంటి వాటిని విజయవాడకు కాకుండా రాష్ట్రంలోనే అంతర్గతంగా తిప్పుతున్నారు. ప్రస్తుతం సగటున 160 సర్వీసులే రోజూ విజయవాడ తిరుగుతున్నాయి. వీటి సగటు ఆక్యుపెన్సీరేషియో 55% మాత్రమే. విజయవాడ–హైదరాబాద్ మధ్య ఏపీ బస్సులు 225 వరకు తిరుగుతున్నాయి. మరో 230 ప్రైవేటు బస్సులున్నాయి. వీటికి తోడు ఇప్పుడు వందల సంఖ్యలో కార్లు తిరుగుతుండటంతో నష్టాలు పెరుగుతున్నాయి. ట్యాక్సీ ప్లేట్ లేని కార్లు కూడా షటిల్ సర్వీసుల్లో ఉంటున్నాయి. కో ఆర్డినేట్ చేస్తూ.. కార్లు ఎక్కిస్తూ.. కార్లను కో ఆర్డినేట్ చేసేందుకు కొందరు సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఓ డ్రైవరు తనకు ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉంటే మరో కారుకు వారిని సమన్వయంతో పంపిస్తున్నారు. కారు డ్రైవరు తిరుగుప్రయాణానికి కూడా ప్రయాణికులకు విజయవాడ నుంచి మరో కారులో సీట్ బుక్ చేస్తున్నారు. ఇందుకు కమీషన్ తీసుకుంటున్నాడు. ఇంత పక్కాగా నడుస్తున్నా ఆర్టీసీ కళ్లు తెరవటం లేదు. చదవండి: కుటుంబం ఆత్మహత్య కేసు.. వనమా రాఘవ అరెస్ట్ ఓలా, ఉబర్ల నుంచి వైదొలిగి.. ఇంతకుముందు హైదరాబాద్‌లో ఓలా, ఉబర్ లాంటి సంస్థల్లో దాదాపు 70 వేలకుపైగా కార్లు ఉండేవి. ఇప్పుడు వీటి సంఖ్య సగానికి పడిపోయింది. డీజిల్ భారంతో మిగులు అంతగా లేదని వాటి నుంచి వైదొలిగి డ్రైవర్లు ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారు. అలా కొందరు షటిల్ సర్వీసులపై దృష్టి సారించారు. ఒక్కో కారులో ఐదారుగురిని తరలిస్తున్నారు. విజయవాడకు ఒక్కొక్కరికి రూ.600 నుంచి రూ.800 వరకు వసూలు చేస్తున్నారు. నిత్యం గిరాకీ ఉంటుండటంతో ఆదాయంపై కచ్చితమైన భరోసా ఉంటోంది. దీంతో ఒకరిని చూసి మరొకరు ఇటు మళ్లుతున్నారు. అలా దాదాపు 2 వేల క్యాబ్‌లు షటిల్ సర్వీసుల్లోకి వచ్చినట్టు అంచనా. -
TSRTC: ఆర్టీసీ బస్సు.. అదరహో!
సాక్షి, హైదరాబాద్: చూడగానే తళతళ మెరిసేలా, ఎక్కగానే కళకళలాడేలా ఆర్టీసీ బస్సు కొత్తదనాన్ని సంతరించుకుంటోంది. రంగులు, హంగులతో ప్రయాణికులను ఆకట్టుకునేలా ముస్తాబవుతోంది. కొత్తగా అనిపించేలా మురిపించనుంది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బస్సులన్నింటికీ కొత్తగా రంగులేస్తున్నారు. ఎక్కడికక్కడ డిపోల్లో ఆర్టీసీ గ్యారేజీ సిబ్బంది ఈ పనుల్లో నిమగ్నమయ్యారు. అప్పట్లో ఆదాయం కోసం ఆర్టీసీ బస్సులపై వాణిజ్య ప్రకటనలకు అవకాశం కల్పించారు. ఆ ప్రకటనలు వినాయిల్ షీట్లతో రూపొందించిన పోస్టర్లను బస్సులపై అతికించేవారు. దీంతో బస్సుల అసలు రంగులు ఏమిటో తెలుసుకోవడం గగనమయ్యేది. ప్రకటన గడువు తీరగానే ఆ పోస్టర్లను పీకేస్తుండటంతో దానికుండే జిగురు కొంత అలాగే ఉండిపోయి, దానికి దుమ్ము, ధూళి అంటుకుని బస్సులు అందవిహీనంగా కనిపిస్తూ వచ్చాయి. మరోవైపు ప్రకటనల కారణంగా, ఆ బస్సు ఎక్స్‌ప్రెస్సా, ఆర్డినరీనా అనేది తెలియకుండా పోయింది. దీన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తీవ్రంగా పరిగణించారు. బస్సులపై ప్రకటనల విధానానికి చెక్ పెట్టారు. ఆ బస్సులన్నింటికీ కొత్త రంగులు వేసి కొత్తవాటిల్లా మెరిసేలా చేయాలని ఆదేశించారు. దినేశ్‌రెడ్డి ఆర్టీసీ ఎండీ ఉండగా బస్సులకు రంగులు మార్పించారు. ఇంకా అవే కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుత రంగుల డిజైన్ బాగానే ఉందని ఎక్కువమంది అధికారులు అభిప్రాయపడటంతో వాటినే కొనసాగించాలని నిర్ణయించి, ఆ మేరకు రంగులేస్తున్నారు. సొంత డిపోల్లోనే.. ఆర్టీసీకి ప్రతి డిపోలో సొంత గ్యారేజీలున్నాయి. నిపుణులైన సిబ్బంది ఉన్నారు. ఎండీ ఆదేశాల మేరకు ఏ డిపో బస్సులకు ఆ డిపోలోనే సొంత సిబ్బందితో రంగులద్దిస్తున్నారు. ట్రిప్పులకు ఇబ్బంది లేకుండా రోజుకు ఒకటి, రెండు చొప్పున బస్సులను మాత్రమే డిపోలో ఉంచి రంగులేస్తున్నారు. దీంతో అన్ని బస్సులకు రంగుల ప్రక్రియ పూర్తి చేయటానికి డిసెంబర్ చివరి వరకు సమయం పట్టే అవకాశం ఉంది. అప్పట్లో రూ.4 కోట్ల దుబారా.. మహిళాప్రయాణికులకు వేధింపులు ఎక్కువయ్యాయనే ఫిర్యాదులు రావడంతో అధికారులు కొంతకాలం క్రితం సిటీ బస్సుల్లో ప్రత్యేక పార్టిషన్ తెరలు ఏర్పాటు చేశారు. అల్యూమినియం ఫ్రేములు అమర్చి దానికి డోర్ బిగించారు. మహిళలు ముందు వైపు పరిమితం కాగా, పురుషులు అటుగా వెళ్లేందుకు వీలులేకుండా చేయటం దీని ఉద్దేశం. ఈ ఫ్రేములు బిగించే పనిని డిపోల్లో గ్యారేజే సిబ్బందికి కాకుండా ఓ ఉన్నతాధికారి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారు. ఇందుకు రూ.4 కోట్లకుపైగా అప్పట్లో ఖర్చయినట్టు సమాచారం. ఈ విషయంలో అవినీతి జరిగిందని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తినా నాటి ఎండీ పట్టించుకోలేదు. ఇప్పుడు చాలా ఫ్రేములు వినియోగంలో లేవు. దీంతో రూ.4 కోట్ల వ్యయం వృథాగా మారినట్టయింది. -
తెలంగాణలో మరోసారి ఆర్టీసీ చార్జీల పెంపు.. కిలోమీటర్‌కు ఎంతంటే!
సాక్షి, హైదరాబాద్:తెలంగాణలో మారోసారి ఆర్టీసీ ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమైంది. ఎప్పటి నుంచో టీఎస్ఆర్టీసీ ఛార్జీల పెంపుపై సాగుతున్న చర్చ తాజాగా ఇది కొలక్కి వచ్చింది. ఓ వైపు కరోనా.. మరోమైపు డీజిల్ ధరలు పెరగడంతో బస్సు చార్జీలు పెంచక తప్పదనే నిర్ణయానికి టీఎస్ఆర్టీసీ వచ్చింది. ఇప్పటికే ఆర్టీసీ చార్జీల పెంపునకు సంబంధించిన ఫైల్ సీఎం కేసీఆర్ ముందుకు చేరింది. చార్జీల పెంపును ఆమోదించాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీంతో ఆర్టీసీ చార్జీల పెంపుపై సీఎం కేసీఆర్ అతి త్వరలోనే అధికారిక నిర్ణయం తీసుకోనున్నారు. కాగా ఆర్డినరీ బస్సులో కిలోమీటర్‌కు 20 పైసల పెంపు, పల్లె వెలుగు బస్సుల్లో 25 పైసల పెంపు, అన్నీ ఇతర బస్సుల్లో 30 పైసల చొప్పున చార్జీలు పెంచాలని సజ్జనార్ ప్రతిపాదించారు. ఆ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ.. అప్పుల్లో కూరుకుపోయిన ప్రజారవాణా సంస్థ టీఎస్ఆర్టీసీపై డీజిల్ రూపంలో మరో పెనుభారం పడిందన్నారు. రోజురోజుకీ పెరిగిపోతున్న డీజిల్ ధరలతో ఆర్టీసీ రోజూ కోట్లలో నష్టం చవిచూస్తోందని తెలిపారు. దీంతో చార్జీలు పెంచక తప్పని అనివార్య పరిస్థితులు నెలకొన్నాయని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వ్యాఖ్యానించారు. చదవండి: ఆర్టీసీ బస్సులో సజ్జనార్ కుటుంబం.. వీడియో వైరల్ 9750 ఆర్టీసీ బస్సులను 3080 రూట్లలో నడిపిస్తున్నట్లు వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. రోజూ 33 లక్షల కిలోమీటర్లు బస్సులు తిరుగుతూ 32 లక్షల మంది ప్రయాణికులను ప్రతి రోజు తరలిస్తున్నామని తెలిపారు. గతంలో అన్ని బస్సులకు 20 పైసలు పెంచడం జరిగిందని, ఆ డబ్బులు ఆర్టీసీకి చేరలేదన్నారు. కరోనా వచ్చినప్పటి నుంచి ఆర్టీసీ తీవ్ర నష్టాలు ఎదుర్కొంటుందన్నారు.కరోనా సమయంలో బస్సులు నడపడం వల్ల 251 మంది మరణించారన్నారు. రెండు సంవత్సరాలుగా డీజిల్ ధరలు భారీగా పెరిగుతున్నాయని, రూ. 63.8 డీజిల్ ఇప్పుడు 87.రూపాయలు ఉందన్నారు. స్పెర్ పార్ట్స్ కూడా భారీగా పెరిగాయని తెలిపారు. ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు 1440 కోట్ల నష్టం వచ్చిందని, అందుకే చార్జీలు పెంచాలని ప్రభుత్వానికి గతంలో విజ్ఞప్తి చేశామని సజ్జనార్ గుర్తు చేశారు. ఇప్పుడు కూడా మంత్రి పువ్వాడ ద్వారా కోరుతున్నామన్నారు. ఛార్జీలు పెరగం వల్ల ఆర్టీసీ మళ్లీ సాధారణ స్థితికి వస్తుందన్నారు. అన్ని ధరలు పెరిగాయని, ఆర్టీసీ ఛార్జీలు కూడా పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఛార్జీల పెంపుతో సుమారు రూ. 800 కోట్ల నుంచి రూ.850 కోట్ల వరకు అదనపు ఆదాయం లభించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అదే విధంగా ఆర్టీసీ నష్టాల్లో ఉందని, చార్జీలు పెంచక తప్పడం లేదని రవాణాశాఖ మంత్రి పువ్వాడ పేర్కొన్నారు. -
కండక్టర్లు, డ్రైవర్ల ఆకస్మిక సెలవులు.. బస్సుకు బ్రేక్!
సాక్షి, హైదరాబాద్: చాంద్రాయణగుట్ట, ఆరాంఘర్, అత్తాపూర్ తదితర ప్రాంతాల మీదుగా ఉప్పల్ నుంచి మెహిదీపట్నంకు రాకపోకలు సాగించే బస్సు (రూట్ నంబర్ 300)కు భారీ డిమాండ్ ఉంటుంది. ప్రతి అరగంటకు ఒక బస్సు నడిచినా మరో బస్సు కోసం ప్రయాణికులు పడిగాపులు కాస్తూనే ఉంటారు. అలాంటి రద్దీ రూట్లో ఆకస్మికంగా బస్సులు రద్దయితే ప్రయాణికులు ఎదుర్కొనే ఇబ్బందుల గురించి ప్రత్యేకంగా చెపాల్సిన పని లేదు. రూట్లో బస్సులు నడిపే బండ్లగూడ డిపోలో కొద్ది రోజులుగా సిబ్బంది కొరత అధికారులను వేధిస్తోంది. కండక్టర్లు, డ్రైవర్ల ఆకస్మిక గైర్హాజరుతో బస్సులు నిలిచిపోతున్నాయి. చదవండి: ఆర్టీసీపై పాట.. కిన్నెర మొగులయ్యకు సజ్జనార్ బంపర్ ఆఫర్ రోజుకు 15 నుంచి 20 మంది ఏదో ఒకకారణంతో ఉన్నపళంగా సెలవు పెట్టేస్తున్నారు. దీంతో ఒక్క ఉప్పల్–మెహదీపట్నం రూట్లోనే కాదు, డిపో నుంచి శివారు ప్రాంతాలకు రాకపోకలు సాగించే పలు రూట్లలో పెద్ద సంఖ్యలో ట్రిప్పులు రద్దవుతున్నాయి. వందలాది మంది ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. ‘70 సొంత బస్సులు, మరో 25 అద్దె బస్సులున్న బండ్లగూడ డిపోలో రోజుకు కనీసం 10 బస్సులు ఆగిపోయినా కష్టమే’ అని ఆర్టీసీ అధికారి ఒకరు విస్మయం వ్యక్తం చేశారు. ఈ ఒక్క డిపోలోనే కాదు. గ్రేటర్‌లోని చాలా డిపోల్లో ఇదే పరిస్థితి నెలకొంది. చదవండి: హైదరాబాద్‌లో కిలో టమాట రూ. 50.. ఎగబడ్డ జనం డ్రైవర్ ఉంటే కండక్టర్ ఉండరు.. గ్రేటర్లో మొత్తం 29 డిపోలు ఉన్నాయి. ఒక్కో డిపోలో 100 నుంచి 130 బస్సులు ఉన్నాయి. కొన్ని డిపోల్లో వంద లోపు ఉంటే మరికొన్ని చోట్ల ఎక్కువే ఉన్నాయి. అన్ని డిపోల్లో 10 శాతం స్పేర్ బస్సులను మినహాయించి సుమారు 2,750 బస్సులను నడుపుతున్నారు. ప్రతి డిపోలో 15 శాతం సిబ్బంది సాధారణ సెలవుపై ఉంటారు. వీక్లీ ఆఫ్‌లు, ముందస్తు సమాచారంతో పొందిన సెలవులు, అనారోగ్యం కారణంగా సెలవులో ఉన్నవాళ్లు ఉంటారు. ఈ సిబ్బందిని మినహాయించి మిగతా కండక్టర్లు, డ్రైవర్ల సంఖ్యకు అనుగుణంగా అధికారులు ఆ రోజుకు ప్రణాళికను రూపొందించుకుంటారు. ఆ రోజు విధులు నిర్వహించాల్సిన కండక్టర్లు, డ్రైవర్లలో ఏ ఒక్కరు ఆకస్మిక సెలవు పెట్టినా ఒక బస్సు ఆగిపోవాల్సిందే. చదవండి: చలాన్ల వేధింపులు తట్టుకోలేక బైక్‌కు నిప్పంటించాడు రకరకాల కారణాలతో ప్రతి డిపోలో 10 నుంచి 15 మంది ఇలా ఆకస్మిక సెలవులు పెట్టేస్తున్నారు. ‘ఒక బస్సుకు డ్రైవర్ ఉంటే కండక్టర్ ఉండరు. కండక్టర్ ఉన్న బస్సుకు డ్రైవర్ గైర్హాజరవుతాడు, దీంతో మరో గత్యంతరం లేక బస్సులను ఆపేయాల్సి వస్తుంది’. అని ఒక డిపోమేనేజర్ తెలిపారు. మరోవైపు సాధారణంగానే ఆర్టీసీని సిబ్బంది కొరత వెంటాడుతుంది. దీర్ఘకాలిక సమ్మె అనంతరం నగరంలో కొన్ని బస్సులను కార్గోలుగా మార్చారు. మరి కొన్నింటిని తుక్కు కిందకు మార్చారు. కండక్టర్లు, డ్రైవర్లను పెట్రోల్ బంకుల్లో డెలివరీబాయ్‌లుగా, ఆఫీసుల్లో క్లర్కులుగా, ఇతరత్రా విధుల్లో చేర్చారు. కార్గో బస్సుల కోసం ప్రతి డిపో నుంచి 30 మందికి పైగా సిబ్బందిని బదిలీ చేశారు. ఈ బస్సుల్లో కండక్టర్లు హమాలీలుగా పని చేస్తున్నారు. ఇలా వివిధ రకాల కారణాలతో తగ్గిన సిబ్బందితో బస్సుల నిర్వహణ కష్టంగా మారింది. ఇక ఆకస్మికంగా సెలవులు పెట్టే సిబ్బంది గైర్హాజరు దీనికి మరింత ఆజ్యం పోస్తోంది. శివార్లు విలవిల బస్సుల రద్దుతో శివారు ప్రాంతాల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు నడిచే ట్రిప్పుల్లో రద్దయ్యేవి ఎక్కువగా ఉంటున్నాయి. ఘట్కేసర్, కీసర, హయత్‌నగర్, చేవెళ్ల, శంకరపల్లి, ఇబ్రహీంపట్నం, తదితర ప్రాంతాల్లోని శివారు గ్రామాలు, కాలనీలకు బస్సులు రద్దు కావడంతో ఇటీవల విద్యార్థులు పలు చోట్ల ధర్నాలకు దిగారు. ఉదయం పూట రద్దీకి అనుగుణంగా బస్సులు నడుస్తున్నాయి. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వేళల్లో డిపోల్లో గైర్హాజరీలు పెరగడంతో బస్సులు రద్దవుతున్నాయి. -
శభాష్ ఆర్టీసీ.. శభాష్ సజ్జనార్.. తెలంగాణ ఆర్టీసీపై కిన్నెర మొగులయ్య పాట, వైరల్
Folk Singer Kinnera Mogulaiah TSRTC Song Video: టీఎస్ఆర్టీసీ బలోపేతానికి నడుం బిగించిన ఎండీ వీసి సజ్జనార్ అటు కార్మికుల సంక్షేమంతో పాటు ఇటు ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. సాధ్యమైనంత వరకూ ట్విట్టర్లో ప్రయాణికులు చేస్తున్న విజ్ఞప్తులకు సజ్జనార్ స్పందిస్తూ తనదైన స్టైల్లో సమస్యకు పరిష్కారం చూపిస్తున్నారు. తాజాగా కిన్నెర వాయిద్యకారుడు మొగులయ్య ఆర్టీసిని ప్రశంసలతో ముంచెత్తాడు. కూతురు వివాహానికి టీఎస్ఆర్టీసీ బస్ బుక్ చేసుకున్న మొగులయ్య తన అనుభవాన్ని పాట రూపంలో పంచుకున్నాడు. చదవండి: సినిమా కథను తలపించే లవ్‌స్టోరీ.. ప్రియుడి కోసం భారత్‌కు.. అతడి మరణంతో... ఆర్టీసీ బస్సులో ప్రయాణం మంచిదంటూ కిన్నెర మొగులయ్యగానం చేస్తున్న వీడియోను ఆర్టీసీ అధికారులు ట్విట్టర్లో షేర్ చేశారు. ఆర్టీసీ అందించిన సేవలకు సంతోషం వ్యక్తంచేస్తూ అద్దెకు తీసుకున్న బస్సు ముందు తనదైన శైలిలో కిన్నెరతో పాటను ఆలపించారు. ఆర్టీసీ బస్సు తల్లిలాంటిదని కొనియాడాడు ‘గంటలోనా బస్సు వస్తది.. ఆగవయ్య మొగులయ్యా.. డీఎం సార్‌కు చెప్తనేను.. ఆర్టీసీ బస్సు పంపుతా.. ఒక్క గంటలో బస్సు వచ్చే.. సుట్టాల్ పిల్లలు బస్సు ఎక్కిరి.. ఆర్టీసీ బస్సులోనా చెప్పలేని ఆనందం.. ఆర్టీసీ బస్సు ఎక్కి మంచిగ నేను పోయి వచ్చిన.. బస్సు అంటే బస్సు కాదు తల్లిలాంటి ఆర్టీసీ.. శభాష్ ఆర్టీసీ.. శభాస్ సజ్జనార్’ అంటూ సాగే పాటను ఆయన ఆలపించారు. కూతురు వివాహానికి TSRTC బస్ బుక్ చేసుకున్న కిన్నెర వాయిద్యకారుడు మొగులయ్య గారి స్వీయ అనుభవం.@tsrtcmdoffice #Hyderabad #TeluguFilmNagar #Tollywood pic.twitter.com/BqvkpwRRxa — Abhinay Deshpande (@iAbhinayD) November 21, 2021 -
బస్సు చక్రాల కింద నలిగిన బాలుడు
గుడిహత్నూర్: అప్పటివరకు కుటుంబ సభ్యులతో గడిపిన బాలుడు ఇంటి ముందు ఉన్న షాప్‌కు వెళ్లొస్తానని బయటకు వెళ్లాడు. అదే సమయంలో వేగంగా వచ్చిన ఓ ఆర్టీసీ బస్సు ఆ చిన్నారిని చిదిమేసింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండ లం హనుమాన్‌నగర్‌లో మంగళవారం జరిగింది. హనుమాన్‌నగర్‌లో నివాసం ఉండే అజీజ్ –సుల్తానాలకు నలుగురు సంతానం. చిన్నవాడైన అర్మాన్ (6) సాయంత్రం సమయంలో ఇంటి ఎదురుగా ఉండే కిరాణా దుకాణం వైపు పరిగెత్తాడు. రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన (ఉట్నూర్– ఆదిలాబాద్ వన్‌స్టాప్) ఆర్టీసీ బస్సు చిన్నారి మీదుగా దూసుకెళ్లింది. బస్సు వేగంగా ఉండటంతో ముందు చక్రాలతోపాటు వెనుక చక్రాలు కూడా బాలుడిపైనుంచి వెళ్లాయి. తీవ్రంగా గాయపడిన చిన్నారిని స్థానికులు ప్రైవేటు వాహనంలో ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా, బస్సును నిర్లక్ష్యంగా నడిపి బాలుడి మృతికి కారణమైన డ్రైవర్‌ను స్థానికులు చితకబాదారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. -
Hyderabad RTC: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. సిటీ బస్సు ఇక చిటికలో
సాక్షి, హైదరాబాద్: సిటీ బస్సులను పూర్తిస్థాయిలో రోడ్డెక్కించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కోవిడ్ దృష్ట్యా నిలిచిపోయిన శివారు రూట్లలో బస్సులను పునరుద్ధరించారు. ముఖ్యంగా ఇంజినీరింగ్, వృత్తివిద్యా కళాశాలలు తిరిగి తెరుచుకోవడంతో విద్యార్థుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పలు మార్గాల్లో అదనపు ట్రిప్పులను పెంచినట్లు హైదరాబాద్ రీజినల్ మేనేజర్ వెంకన్న తెలిపారు. ఇబ్రహీంపట్నం, ఘట్కేసర్, కీసర, చేవెళ్ల, మొయినాబాద్, గండిమైసమ్మ తదితర రూట్లలో విద్యార్థుల రద్దీకనుగుణంగా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం 2 వేల ట్రిప్పులకుపైగా బస్సులు నడుస్తాయి. కోవిడ్ దృష్ట్యా విద్యాసంస్థలు మూసివేయడంతో బస్సుల రాకపోకలు కూడా తగ్గాయి. కోవిడ్ రెండో ఉద్ధృతి తగ్గుముఖం పట్టిన అనంతరం అన్ని స్కూళ్లు, కాలేజీలు తదితర విద్యా సంస్థలను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చినప్పటికీ కొన్ని విద్యాసంస్థలు ఇటీవల వరకు ఆన్లైన్ క్లాసులను నిర్వహించాయి. చదవండి:టీఎస్ఆర్టీసీ మరో ముందడుగు.. ప్రయాణికులకు సజ్జనార్ గుడ్‌న్యూస్ సెమిస్టర్ పరీక్షలను మాత్రమే ప్రత్యక్షంగా ఏర్పాటు చేశారు. కానీ.. దసరా అనంతరం అన్ని కాలేజీలు ప్రత్యక్ష బోధనకు చర్యలు చేపట్టాయి. దీంతో విద్యార్థుల రద్దీకనుగుణంగా బస్సులను పునరుద్ధరించేందుకు ఏర్పాట్లు చేశారు. అన్ని వైపులా.. ► సికింద్రాబాద్ రీజియన్ పరిధిలో ప్రతి రోజు సుమారు 1200 బస్సులు 3.5 లక్షల కిలోమీటర్లు రాకపోకలు సాగిస్తాయి. కీసర, గండిమైసమ్మ, బాచుపల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్ తదితర ప్రాంతాల్లోని విద్యాసంస్థలకు రాకపోకలు సాగించేందుకు సాధారణ రోజుల్లో ఉదయం, సాయంత్రం సుమారు 1000 ట్రిప్పుల వరకు నడుపుతారు. కోవిడ్ నేపథ్యంలో ఈ ట్రిప్పుల సంఖ్య భారీగా తగ్గింది. తిరిగి ఈ రూట్లలో ట్రిప్పులను పెంచేందుకు అధికారులు కసరత్తు చేపట్టారు. ► హైదరాబాద్ రీజియన్ పరిధిలో నిత్యం 1,551 బస్సులు సుమారు 4.15 లక్షల కిలోమీటర్లు తిరుగుతాయి. ఇబ్రహీంపట్నం, ఘట్కేసర్, చుట్టుపక్కల ప్రాంతాల్లోని కళాశాలలకు రాకపోకలు సాగించే విద్యార్థుల కోసం ఉప్పల్, నాగోల్, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల నుంచి అదనపు బస్సులను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు ఆర్ఎం వెంకన్న చెప్పారు. ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు.. మరోవైపు బస్సుల రాకపోకలు, ఇతరత్రా సమాచారంకోసం హైదరాబాద్ రీజియన్‌లో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రయాణికులు 99592 26160ను సంప్రదించి బస్సుల వివరాలు తెలుసుకోవచ్చు. సమస్యలపై ఫిర్యాదు చేయొచ్చు. -
హైదరాబాద్: ఆకస్మికంగా ఆర్టీసీ బస్సులు రద్దు!
సాక్షి, హైదరాబాద్: అమీర్‌పేట్‌కు చెందిన నగేష్ ఈ నెల 12వ తేదీన విజయవాడకు వెళ్లేందుకు ఆర్టీసీ గరుడప్లస్ బస్సు (1402) కోసం అడ్వాన్స్‌గా రిజర్వేషన్ బుక్ చేసుకున్నాడు. ఉదయం 5.50 గంటలకు ఎస్సార్‌నగర్ నుంచి బస్సు బయలుదేరవలసిన సమయాని కంటే అరగంట ముందే చేరుకున్నాడు. కానీ ఉదయం 8.15 గంటల వరకు కూడా బస్సు రాలేదు. పైగా బస్సు రద్దయినట్లు ఎలాంటి సమాచారం లేదు. అసలు వస్తుందో, రాదో కూడా తెలియలేదు. టీఎస్ఆర్టీసా కాల్‌సెంటర్‌ను సంప్రదించాడు. ఎలాంటి స్పందన లేదు. చివరకు రెండు గంటల తరవాత ఆర్టీసీ బీహెచ్ఈఎల్ డిపోకు చెందిన అధికారులు సదరు బస్సు రద్దయినట్లు తాపీగా సెలవిచ్చారు. కానీ ఆ బస్సు కోసం ఉదయం నాలుగున్నరకే పాయింట్‌కు చేరుకున్ననగేష్ మాత్రం 8 గంటల వరకు అంటే మూడున్నర గంటల పాటు ఆందోళనగా ఎదురు చూడవలసి వచ్చింది. ఇది ఒక్క నగేశ్‌కు ఎదురైన సమస్య మాత్రమే కాదు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఆకస్మికంగా రద్దవుతున్న దూరప్రాంత బస్సుల వల్ల అప్పటికప్పుడు మరో బస్సులో వెళ్లేందుకు అవకాశం లేక ప్రయాణికులు తరచుగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు తప్పనిసరిగా వెళ్లవలసిన వాళ్లు మాత్రం ప్రైవేట్ వాహనాల్లో పెద్ద మొత్తం చెల్లించవలసి వస్తోంది. నిర్వహణలో సమన్వయ లోపం... బస్సుల నిర్వహణలో సమన్వయ లోపం కారణంగా ప్రయాణికులు పడిగాపులు కాయాల్సి వస్తోంది. సాంకేతిక కారణాల వల్ల బస్సులు రద్దయితే ఆ సమాచారాన్ని ప్రయాణికులకు ముందే చేరవేయాలి. మరో బస్సు అందుబాటులో ఉంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. కానీ అధికారుల మధ్య సమన్వయ లోపం కారణంగా ప్రయాణికులు ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది. బీహెచ్ఈఎల్ డిపో నుంచి ఉదయం నాలుగున్నర గంటలకు బయలేదేరవలసిన గరుడ ప్లస్ బస్సు ఇంజన్లో సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్ల బస్సు రద్దయినట్లు అధికారులు తెలిపారు. కానీ ప్రయాణికులకు ఆ సమాచారం అందజేయడంలో తమ సిబ్బంది విఫలమైనట్లు డివిజనల్ మేనేజర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. దీంతో ఒక్క ఎస్సార్ నగర్ నుంచి బయలుదేరే ప్రయాణికులే కాకుండా కేపీహెచ్‌బీ, అమీర్‌పేట్, లకిడికాపుల్, ఎల్బీనగర్, తదితర ప్రాంతాల్లో అదే బస్సు కోసం ఎదురు చూస్తున్న వాళ్లంతా ఆందోళనకు గురయ్యారు. ‘ఆర్టీసీ అధికారుల నిర్వాకం వల్ల ముఖ్యమైన కార్యక్రమానికి హాజరుకాలేకపోయాను. ఇది చాలా దారుణం’. అని నగేశ్ విస్మయం వ్యక్తం చేశారు. ఆదరణ లేకపోవడమే కారణమా... ► సాంకేతిక కారణాల వల్ల బస్సులు రద్దవుతున్నట్లు అధికారులు పైకి చెబుతున్నప్పటికీ ఏసీ బస్సులకు ఆదరణ లేకపోవడం వల్లనే అప్పటికప్పుడు రద్దు చేస్తున్నట్లు తెలిసింది. ► ఏసీ బస్సుల్లో హైదరాబాద్ నుంచి దూరప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయాణికులు వెనుకంజ వేస్తున్నారు. ఏసీ వల్ల కోవిడ్ వ్యాపిస్తుందేమోననే ఆందోళన ఇందుకు కారణం. ►దీంతో కనీసం 50 శాతం ఆక్యుపెన్సీ కూడా లేకపోవడంతో బస్సులను రద్దు చేసుకోవలసి వస్తున్నట్లు ఆర్టీసీ అధికారి ఒకరు తెలిపారు. కానీ అదే సమాచారాన్ని ముందస్తుగానే ప్రయాణికులకు తెలియజేసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లను సూచించకపోవడం ఆర్టీసీ అధికారులు బాధ్యతారాహిత్యాన్ని ప్రతిబింబిస్తోంది. పనిచేయని కాల్ సెంటర్ ► ఆన్లైన్లో టిక్కెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు ఎప్పటికప్పుడు బస్సు సమాచారం తెలుసుకొనేందుకు ఆర్టీసీ కాల్సెంటర్లను ఏర్పాటు చేసింది. ► ఆర్టీసీ కాల్‌సెంటర్ నెంబర్లు : 040–30102829, 040–68153333 ► ఈ కాల్‌సెంటర్లు ఇరువైనాలుగు గంటలు ప్రయాణికులకు అందుబాటులో ఉండాలి. ఫిర్యాదులను స్వీకరించాలి. ఎప్పటికప్పుడు తగిన సమాచారం ఇవ్వాలి. ► కానీ అందుకు విరుద్ధంగా ఫోన్ చేసినా ఎలాంటి సమాచారం లభించడం లేదని, స్పందన కరువవుతుందని ప్రయాణికులలు పేర్కొంటున్నారు. -
‘వజ్ర’ తుక్కవుతోంది
సాక్షి, హైదరాబాద్: వజ్ర .. ప్రజలకు చేరువగా కాలనీల్లోకే వచ్చి ఎక్కించుకుని వెళ్లేందుకు వీలుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రారంభించిన ఆర్టీసీ మినీ ఏసీ బస్సు. ఇలాంటివి సంస్థ వద్ద 100 ఉన్నాయి. కానీ ఇప్పటికే కన్పించకుండా డిపోలకు పరిమితమైన ఈ బస్సులు ఇకపై ప్రయాణి కులకు దూరం కానున్నాయి. ఉన్నవి ఉన్నట్టుగా అమ్మేయాలని ఆర్టీసీ నిర్ణయించడమే ఇందుకు కారణం. అమ్మకానికి వీలుగా కొన్నిటిని తుక్కుగా నిర్ధారిస్తూ ఆదేశాలు కూడా జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలోని పలు డిపోల అధీనంలో ఉన్న బస్సులను హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో ఉన్న తుక్కు యార్డుకు తరలించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. తొలిదశలో 65 బస్సుల్ని తుక్కు కింద ప్రైవేటు వ్యక్తులకు అమ్మేయనున్నారు. ఆ తర్వాత మిగతా 35 బస్సుల్ని కూడా విక్రయించనున్నారు. ఐదేళ్ల క్రితం ప్రారంభమై ఇంకా కాలం తీరని బస్సుల్ని సరిగా నిర్వహించలేక.. టోకున అమ్మేసేందుకు ఆర్టీసీ నిర్ణయించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలా మొదలై.. సిటీ బస్సు కాకుండా దూర ప్రాంతానికి వెళ్లే ఆర్టీసీ బస్సెక్కాలంటే బస్టాండుకో లేదా ఎక్కడో ఉండే ఆర్టీసీ పాయింట్ వద్దకో వెళ్లాలి. అంతేకానీ క్యాబ్ లాగా అది మన ఇంటి సమీపంలోకి రాదు. కానీ బస్సు కూడా కాలనీలకు చేరువగా వెళ్లేలా ఆర్టీసీలో ఓ ఏర్పాటు ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ‘వజ్ర’ పేరుతో 2016–17లో ఆర్టీసీ ఓ మినీ బస్సు కేటగిరీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు వంద ఏసీ బస్సులను రెండు దశల్లో కొనుగోలు చేసింది. హైదరాబాద్ నుంచి నిజామాబాద్, వరంగల్‌కు నడిచేలా రూట్లు సిద్ధం చేసింది. ప్రయాణికులు ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుని.. ఆ బస్సు రూట్లో వారుండే కాలనీకి దగ్గరగా ఉండే పాయింట్‌కు వెళ్లి ఎక్కేలా ఏర్పాటు చేశారు. నగదు లావాదేవీ లేకుండా ఆన్లైన్లోనే డబ్బు చెల్లించాలి. బస్సు ఏ పాయింట్‌కు, ఎన్ని గంటలకు వస్తుందో ముందుగానే ప్రయాణికుడి మొబైల్‌కు సమాచారం వెళ్లేలా ఏర్పాటు చేశారు. కానీ అంతా ఆన్‌లైన్‌తో కూడిన ఈ విధానానికి ప్రయాణికులు చేరువ కాకపోవటంతో అది కాస్తా ఫెయిల్ అయ్యింది. ప్రయాణికులకు ఎందుకు చేరువ కాలేదో, ఏ విధమైన మార్పులు చేయాలో గుర్తించని ఆర్టీసీ, కొంతకాలం అదే పద్ధతిలో బస్సులు నడిపి చివరకు ఆ పద్ధతి విరమించుకుంది. మిగతా బస్సుల మాదిరి బస్టాండ్లకే పంపేలా ఏర్పాటు చేసింది. కానీ గరుడ ప్లస్ టికెట్ ధరలను వీటికి అన్వయించటం, చిన్న బస్సు ఎక్కువ వేగంగా వెళితే వైబ్రేషన్‌కు గురవటం, ఏసీ సరిగా పనిచేయకపోవటం వంటి కారణాలతో ఇక్కడా ఆదరణ అంతంత మాత్రంగానే ఉంటూ వచ్చింది. ఈసారైనా లోపాలను సరిదిద్దడంపై సంస్థ దృష్టి పెడితే బాగుండేది. కానీ సర్వే కూడా సరిగా చేయకుండా వాటిని కొంతకాలం అలాగే తిప్పటం, జనం ఎక్కకుంటే డిపోలకే పరిమితం చేయటం ద్వారా ప్రయాణికులకు వాటిపై నమ్మకం లేకుండా చేసింది. గతేడాది ఆర్టీసీలో సమ్మె తర్వాత అధికారులు వాటిని పూర్తిగా డిపోలకే పరిమితం చేశారు. ఆ తర్వాత కోవిడ్ లాక్‌డౌన్‌తో పూర్తిగా మూలన పడేశారు. కాలం తీరకున్నా.. సాధారణంగా ఆర్టీసీ తన బస్సుల కాలం తీరిన తర్వాత కూడా వాడుతుంటుంది. చాలినన్ని బస్సుల్లేక చాలాకాలంగా డొక్కు బస్సులను వినియోగిస్తూనే ఉంది. కానీ ఇప్పుడు తుక్కుగా మారుస్తున్న వజ్ర బస్సుల కాలం తీరలేదు. తాజాగా జారీ చేసిన ఆదేశాల్లో అధికారులు ఈ విషయం కూడా పేర్కొన్నారు. తక్కు కింద అమ్మకానికి సిద్ధమైన 65 బస్సులకు ఇంకా రూ.7,27,27,592 విలువైన ‘జీవితకాలం’ ఉందని పేర్కొన్నారు. అంటే.. తరుగు, ఇతర ఖర్చులు తీసేసినా అంత విలువ మేరకు ఇంకా వినియోగించాలన్న మాట. ఇప్పుడు వాటిని పక్కన పెడితే అంత నష్టం వాటిల్లినట్టే. ఆర్టీసీ కొత్తగా ప్రారంభించిన సరుకు రవాణా విభాగానికి వీటిని బదిలీ చేసి ఏసీ అవసరం ఉన్న సరుకులను వీటిల్లో తరలించేలా ప్రయత్నాలు చేసినా డిమాండ్ లేక పోవడంతో డిపోలకే పరిమితం అయ్యాయి. వినియోగం లేక క్రమంగా పాడవుతున్నాయన్న ఉద్దేశంతో చివరకు అమ్మేయాలని నిర్ణయించారు. తొలుత తుక్కు యార్డుకు తరలించాలని నిర్ణయించిన 65 బస్సులు 4 లక్షల కి.మీ వరకు తిరగ్గా.. మిగతా 35 బస్సులు అంత కూడా ప్రయాణించలేదు. ఇలా వాడేందుకు అవకాశం ఉన్నా.. ప్రస్తుతం ఆర్టీసీలో బస్సుల కొరత తీవ్రంగా ఉంది. కొత్త బస్సులు కొనకపోవడమే దీనికి కారణం. ఇక ఏసీ బస్సులకు మరింత కొరత ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వజ్ర బస్సుల్ని ఎలా వినియోగిస్తే బాగుంటుందో అనే విషయంలో సరైన కసరత్తు జరగలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.రాష్ట్రంలో కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ లాంటి అతికొద్ది జిల్లా కేంద్రాలకే ఏసీ బస్సులున్నాయి. మిగతా జిల్లా కేంద్రాలకు ఏసీ బస్సులకు డిమాండ్ ఉన్నా కొనే ఆర్థిక స్తోమత ఆర్టీసీకి లేదు. ఈ నేపథ్యంలో నగరానికి చేరువగా ఉన్న పట్టణాలకు మినీ బస్సుల్ని రెగ్యులర్ సర్వీసులుగా తిప్పితే ఆదరణ ఉంటుందన్న అభిప్రాయాన్ని ఆర్టీసీ సిబ్బందే వ్యక్తం చేస్తున్నారు. అలాగే నిరంతరం రద్దీగా ఉండే శ్రీశైలం లాంటి పుణ్య క్షేత్రాలకు వీటిని వాడాలన్న సూచన కూడా పెండింగులో ఉంది. యాదాద్రి కొత్త దేవాలయంలో దర్శనాలు మొదలయ్యాక నగరం నుంచి రద్దీ బాగా ఉంటుంది. అప్పుడు వీటిని షటిల్ సర్వీసులుగా వాడాలన్న సూచన ఉంది. దీన్ని ఆర్టీసీ పట్టించుకోవటం లేదు. కేరళ ప్రభుత్వం కొన్ని మినీ ఏసీ బస్సులను మొబైల్ దుకాణాలుగా మార్చి అద్దెకు ఇచ్చింది. అక్కడి నగరాల్లో వీటికి డిమాండ్ బాగా ఉంది. అలా ప్రైవేటు వ్యక్తులకు అద్దెకిస్తే ఆర్టీసీకి ఆదాయం వస్తుందన్న సూచనను కూడా అధికారులు బుట్టదాఖలు చేశారు. టికెట్ బుక్ చేసుకుని.. ఆ బస్సు రూట్లో వారుండే కాలనీకి దగ్గరగా ఉండే పాయింట్‌కు వెళ్లి ఎక్కేలా ఏర్పాటు చేశారు. నగదు లావాదేవీ లేకుండా ఆన్లైన్లోనే డబ్బు చెల్లించాలి. బస్సు ఏ పాయింట్‌కు, ఎన్ని గంటలకు వస్తుందో ముందుగానే ప్రయాణికుడి మొబైల్‌కు సమాచారం వెళ్లేలా ఏర్పాటు చేశారు. కానీ అంతా ఆన్‌లైన్‌తో కూడిన ఈ విధానానికి ప్రయాణికులు చేరువ కాకపోవటంతో అది కాస్తా ఫెయిల్ అయ్యింది. ప్రయాణికులకు ఎందుకు చేరువ కాలేదో, ఏ విధమైన మార్పులు చేయాలో గుర్తించని ఆర్టీసీ, కొంతకాలం అదే పద్ధతిలో బస్సులు నడిపి చివరకు ఆ పద్ధతి విరమించుకుంది. మిగతా బస్సుల మాదిరి బస్టాండ్లకే పంపేలా ఏర్పాటు చేసింది. కానీ గరుడ ప్లస్ టికెట్ ధరలను వీటికి అన్వయించటం, చిన్న బస్సు ఎక్కువ వేగంగా వెళితే వైబ్రేషన్‌కు గురవటం, ఏసీ సరిగా పనిచేయకపోవటం వంటి కారణాలతో ఇక్కడా ఆదరణ అంతంత మాత్రంగానే ఉంటూ వచ్చింది. ఈసారైనా లోపాలను సరిదిద్దడంపై సంస్థ దృష్టి పెడితే బాగుండేది. కానీ సర్వే కూడా సరిగా చేయకుండా వాటిని కొంతకాలం అలాగే తిప్పటం, జనం ఎక్కకుంటే డిపోలకే పరిమితం చేయటం ద్వారా ప్రయాణికులకు వాటిపై నమ్మకం లేకుండా చేసింది. గతేడాది ఆర్టీసీలో సమ్మె తర్వాత అధికారులు వాటిని పూర్తిగా డిపోలకే పరిమితం చేశారు. ఆ తర్వాత కోవిడ్ లాక్‌డౌన్‌తో పూర్తిగా మూలన పడేశారు. కాలం తీరకున్నా.. సాధారణంగా ఆర్టీసీ తన బస్సుల కాలం తీరిన తర్వాత కూడా వాడుతుంటుంది. చాలినన్ని బస్సుల్లేక డొక్కు బస్సులను వినియోగిస్తూనే ఉంది. కానీ ఇప్పుడు తుక్కుగా మారుస్తున్న వజ్ర బస్సుల కాలం తీరలేదు. తాజాగా జారీ చేసిన ఆదేశాల్లో అధికారులు ఈ విషయం కూడా పేర్కొన్నారు. తక్కు కింద అమ్మకానికి సిద్ధమైన 65 బస్సులకు ఇంకా రూ.7,27,27,592 విలువైన ‘జీవితకాలం’ ఉందని పేర్కొన్నారు. అంటే.. తరుగు, ఇతర ఖర్చులు తీసేసినా అంత విలువ మేరకు ఇంకా వినియోగించాలన్న మాట. ఇప్పుడు వాటిని పక్కన పెడితే అంత నష్టం వాటిల్లినట్టే. ఆర్టీసీ కొత్తగా ప్రారంభించిన సరుకు రవాణా విభాగానికి వీటిని బదిలీ చేసి ఏసీ అవసరం ఉన్న సరుకులను తరలించేలా ప్రయత్నాలు చేసినా డిమాండ్ లేక పోవడంతో డిపోలకే పరిమితం అయ్యాయి. వినియోగం లేక క్రమంగా పాడవుతున్నాయన్న ఉద్దేశంతో చివరకు అమ్మేయాలని నిర్ణయించారు. తొలుత తుక్కు యార్డుకు తరలించాలని నిర్ణయించిన 65 బస్సులు 4 లక్షల కి.మీ వరకు తిరగ్గా.. మిగతా 35 బస్సులు అంత కూడా ప్రయాణించలేదు. ఇలా వాడేందుకు అవకాశం ఉన్నా ♦ప్రస్తుతం ఆర్టీసీలో బస్సుల కొరత తీవ్రంగా ఉంది. కొత్త బస్సులు కొనకపోవడమే దీనికి కారణం. ఇక ఏసీ బస్సులకు మరింత కొరత ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వజ్ర బస్సుల్ని ఎలా వినియోగిస్తే బాగుంటుందో అనే విషయంలో సరైన కసరత్తు జరగలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ♦రాష్ట్రంలో కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ లాంటి అతికొద్ది జిల్లా కేంద్రాలకే ఏసీ బస్సులున్నాయి. మిగతా జిల్లా కేంద్రాలకు ఏసీ బస్సులకు డిమాండ్ ఉన్నా కొనే ఆర్థిక స్తోమత ఆర్టీసీకి లేదు. ఈ నేపథ్యంలో నగరానికి చేరువగా ఉన్న పట్టణాలకు మినీ బస్సుల్ని రెగ్యులర్ సర్వీసులుగా తిప్పితే ఆదరణ ఉంటుందన్న అభిప్రాయాన్ని ఆర్టీసీ సిబ్బందే వ్యక్తం చేస్తున్నారు. ♦శ్రీశైలం లాంటి పుణ్య క్షేత్రాలకు, యాదాద్రి కొత్త దేవాలయంలో దర్శనాలు మొదలయ్యాక నగరం నుంచి రద్దీ బాగా ఉంటుంది. వీటిని షటిల్ సర్వీసులుగా వాడాలన్న సూచన ఉంది. దీన్ని ఆర్టీసీ పట్టించుకోవటం లేదు. ♦కేరళ ప్రభుత్వం కొన్ని మినీ ఏసీ బస్సులను మొబైల్ దుకాణాలుగా మార్చి అద్దెకు ఇచ్చింది. అక్కడి నగరాల్లో వీటికి డిమాండ్ బాగా ఉంది. అలా ప్రైవేటు వ్యక్తులకు అద్దెకిస్తే ఆర్టీసీకి ఆదాయం వస్తుందన్న సూచనను కూడా అధికారులు బుట్టదాఖలు చేశారు. -
ఒక బస్సు..రెండింతలజనం, కొండగట్టును మరిచారా?
సాక్షి, హైదరాబాద్: సోమవారం.. రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో 75 శాతం ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) నమోదైంది. మంగళవారం 68 శాతంగా రికార్డయింది. లాక్డౌన్ ముగిసిన తర్వాత బస్సులు మళ్లీ కళకళలాడుతున్నాయి. కరోనా కేసులు తగ్గడంతో జనం ప్రయాణాలకు ముందుకొస్తున్నారు. బస్టాండ్లు, బస్సులు కిటకిటలాడుతున్నాయి. ఉదయం, సాయం త్రం వేళల్లో రద్దీ ఎక్కువగా ఉంటోంది. అందుబాటు లో ఉన్న బస్సులన్నీ రోడ్డుపైకి తెచ్చినా చాలటం లేదు. గత్యంతరం లేక డిపోల్లో మూలకు చేరిన డొక్కు బస్సులను అప్పటికప్పుడు మరమ్మతులు చేయించి వాడుకోవాల్సి వస్తోంది. వీటిల్లో కొన్ని మధ్యలోనే మొరాయిస్తుండటంతో సిబ్బంది, ప్రయాణికులు నెట్టాల్సి వస్తోంది. కొన్నిచోట్ల అవి కూడా సరిపోక, ఒక్కో బస్సులో రెండు బస్సులకు సరిపడా ప్రయాణికులను కుక్కి పంపుతున్నారు. అధికారులు డిపోల్లో నిలబడి మరీ బస్సుల్లోకి జనాన్ని ఎక్కిస్తున్నారు. ఎందుకీ పరిస్థితి....? ఆర్టీసీకి సొంతంగా 6,370 బస్సులున్నాయి. నిధులు లేక చాలాకాలంగా కొత్త బస్సులు కొనటం లేదు. ఏటా 400 బస్సులు తుక్కుగా మారుతుంటాయి. వాటి స్థానంలో కొత్త బస్సులు కొనాలి. కానీ కొన్నేళ్లుగా కొత్త బస్సుల్లేక ఆర్టీసీ సొంత బస్సులు తగ్గిపోయాయి. దీంతో నిబంధనలను సడలించి మరీ అద్దె బస్సులు తీసుకుంది. ప్రస్తుతం ఆర్టీసీలో 3,170 బస్సులు అద్దె ప్రాతిపదికనే నడుస్తున్నాయి. అయితే అసలే నష్టాలు, ఆపై కోవిడ్ కష్టాలతో అద్దె బస్సు నిర్వాహకులకు రూ.100 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. లాక్డౌన్ తర్వాత అద్దె బస్సుల వాడకాన్ని ఆర్టీసీ నిలిపేయడంతో.. 3,170 బస్సులు అందుబాటులో లేక ఇప్పుడీ కష్టాలు చుట్టుముట్టాయి. చేతిలో సొంత నిధులు లేకపోవటం, ప్రభుత్వం పూచీకత్తు ఇచ్చినా బ్యాంకు రుణాలు చేతికందకపోవటం, ప్రభుత్వం ఇచ్చే మొత్తం జీతాలకే వాడేస్తుండటం వల్ల అద్దె బస్సుల వినియోగానికి వీల్లేకుండా పోయింది. ఫలితంగా ప్రయాణికులకు ఇబ్బంది తప్పడం లేదు. కొండగట్టును మరిచారా? 2018లో 102 మందితో కిక్కిరిసి ప్రయాణిస్తున్న బస్సు కొండగట్టు వద్ద బ్రేకులు ఫెయిలై దొర్లిపడిపోయి 50 మందికిపైగా దుర్మరణం చెందారు. అది ఎన్నో కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపటంతో.. ఇక సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని ఆర్టీసీ సిబ్బందిని ఆదేశించింది. ఇప్పుడు స్వయంగా ఆర్టీసీ అధికారులే దాన్ని ఉల్లంఘించి దగ్గరుండి మరీ ఎక్కువ మందిని బస్సుల్లోకి ఎక్కిస్తున్నారు. ‘ప్రస్తుతం మాకు బస్సుల కొరత తీవ్రంగా ఉంది. అద్దె యజమానులతో ఉన్న సమస్యలను పరిష్కరించుకొని వీలైనంత త్వరగా ప్రయాణికులకు ఇబ్బందులు రాకుండా చూస్తాం’ అని ఓ ఉన్నతాధికారి చెప్పారు. -
ఆర్టీసీ వింత నిర్ణయం.. ‘కరోనా’ముప్పున్నా రాకపోకలు షురు..
సాక్షి, బోధన్: మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోన్న తరుణంలో.. ఆర్టీసీ తీసుకున్న నిర్ణయం విమర్శలకు తావిస్తోంది. పొరుగు రాష్ట్రంలో నిత్యంవేలాది కేసులు నమోదవుతుండగా, ఆ రాష్ట్రానికి బస్సు సర్వీసులను పునరుద్ధరించింది. సోమవారంనుంచి మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు బస్సులునడుపుతోంది. అయితే, వైరస్ వ్యాప్తి ఎక్కువగాఉన్న ఆయా ప్రాంతాలకు సర్వీసులను పునరుద్ధరించడం ఆందోళన కలిగిస్తోంది. ‘మహా’ ప్రభావంకారణంగా ఇప్పటికే సరిహద్దుల్లోని మన పల్లెల్లోపాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఆ రాష్ట్రానికి సర్వీసులను పునరుద్ధరించడం విమర్శలకు తావిస్తోంది. ఏడాదికి పైగా నిలిపివేత.. కరోనా నేపథ్యంలో గతేడాది మార్చి 24 నుంచి ఆర్టీసీ పొరుగు రాష్ట్రానికి బస్సు సర్వీసులను నిలిపి వేసింది. మహారాష్ట్రలో మొదటి నుంచి వైరస్ ఉద్ధృతి ఎక్కువగానే ఉంది. ఇటీవల అది మరింత ఎక్కువైంది. నిత్యం వేల సంఖ్యలో అక్కడ కేసులు నమోదవుతున్నాయి. దీంతో పొరుగు రాష్ట్రంలో కర్ఫ్యూతో పాటు కొన్ని నగరాల్లో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో మరింత అప్రమత్తంగా మన ఆర్టీసీ అధికారులు వింతనిర్ణయం తీసుకున్నారు. కాగా,గత సోమవారం నుంచి బస్సుసర్వీసులను పునరుద్ధరించారు. పొంచి ఉన్న ‘మహా’ ముప్పు.. తెలంగాణ–మహారాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర సర్వీసులను పునరుద్ధరించడం ఆందోళన కలిగిస్తోంది.జిల్లాలోని బోధన్ రెవెన్యూ డివిజన్ మండలం పరిధిలోని కోటగిరి, బోధన్ రెవెన్యూ, రెంజెల్ మండలంలోని అనేక గ్రామాలు మహారాష్ట్ర ప్రాంత సరిహద్దులకు ఆనుకుని ఉన్నాయి. బోధన్ మండలంలోని సాలూర గ్రామం నుంచి 80 కిలో మీటర్ల దూరంలోగల మహారాష్ట్ర ప్రాంతంలోని నాందేడ్ జిల్లా కేంద్రం ఉండగా, ఇదే జిల్లా పరిధిలోని బిలోలి,దెగ్లూర్, కొండల్‌వాడీ, ధర్మాబాద్ పట్టణ కేంద్రాలు,అనేక పల్లెలు తెలంగాణ ప్రాంత సరిహద్దు పల్లెలకు ఆనుకుని ఉన్నాయి. రెండు రాష్ట్రాల సరిహద్దుపట్టణ కేంద్రాలు, పల్లెల నుంచి రాకపోకాలు సాగుతున్నాయి. గతంలో నిత్యం 10–12 బస్సు సర్వీసులలు నడిపే వారు. కరోనా కారణంగా వాటిని నిలిపి వేయగా, తాజాగా సోమవారం నుంచి ఐదు సర్వీసులను నడుపుతున్నారు. ప్రస్తుతానికి నాందెడ్, దెగ్లూర్ పట్టణాలకు బస్సులు నడుస్తున్నాయి.కార్లు, ప్యాసింజర్ ఆటోలు ఎప్పడి నుంచో తిరుగుతున్నాయి. నిత్యం పదుల సంఖ్యలో కేసులు.. మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న సాలూర వద్ద చెక్‌పాయింట్‌ను ఏర్పాటు చేసి పొరుగు రాష్ట్రం నుంచివస్తున్న ప్రయాణికులకు టెస్టులు చేస్తున్నారు. ఇక్కడ నిత్యం పదుల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న కరోనాకేసులు సరిహద్దు ప్రాంత ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. మహారాష్ట్ర ప్రాంతానికి సరిహద్దులోగల సాలూర క్యాంప్ గ్రామంలోపాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఆ గ్రామస్తులు స్వచ్ఛందంగా లాక్డౌన్ ప్రకటించారు. ఐదు సర్వీసుల పునరుద్ధరణ.. కరోనా నేపథ్యంలో మార్చి 24 నుంచి మహారాష్ట్ర ప్రాంతానికి బస్సు సర్వీసులను నిలిపివేశాం. అయితే, సోమవారం నుంచి నాందేడ్, దెగ్లూర్‌లకు ఐదుబస్సు సర్వీసులు పునరుద్ధరించాం. కరోనా నిబంధనలు పాటిస్తూ బస్సులునడుపుతున్నాం. సిట్టింగ్‌సీట్ల మేరకే ప్రయాణికులకు అనుమతి ఇస్తున్నాం. రమణ, బోధన్ డిపో మేనేజర్ -
ఆర్టీసీ వింత నిర్ణయం.. ఇక కష్టమే!
సాక్షి, బోధన్: మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోన్న తరుణంలో.. ఆర్టీసీ తీసుకున్న నిర్ణయం విమర్శలకు తావిస్తోంది. పొరుగు రాష్ట్రంలో నిత్యం వేలాది కేసులు నమోదవుతుండగా, ఆ రాష్ట్రానికి బస్సు సర్వీసులను పునరుద్ధరించింది. సోమవారం నుంచి మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు బస్సులు నడుపుతోంది. అయితే, వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ఆయా ప్రాంతాలకు సర్వీసులు పునరుద్ధరించడం ఆందోళన కలిగిస్తోంది. ‘మహా’ ప్రభావం కారణంగా ఇప్పటికే సరిహద్దుల్లోని మన పల్లెల్లో పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఆ రాష్ట్రానికి సర్వీసులను పునరుద్ధరించడం విమర్శలకు తావిస్తోంది. ఏడాదికి పైగా నిలిపివేత.. కరోనా నేపథ్యంలో గతేడాది మార్చి 24 నుంచి ఆర్టీసీ పొరుగు రాష్ట్రానికి బస్సు సర్వీసులను నిలిపి వేసింది. మహారాష్ట్రలో మొదటి నుంచి వైరస్ ఉద్ధృతి ఎక్కువగానే ఉంది. ఇటీవల అది మరింత ఎక్కువైంది. నిత్యం వేల సంఖ్యలో అక్కడ కేసులు నమోదవుతున్నాయి. దీంతో పొరుగు రాష్ట్రంలో కర్ఫ్యూతో పాటు కొన్ని నగరాల్లో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో మరింత అప్రమత్తంగా మన ఆర్టీసీ అధికారులు వింత నిర్ణయం తీసుకున్నారు. సోమవారం నుంచి బస్సు సర్వీసులను పునరుద్ధరించారు. చదవండి: మమ్మల్ని ఏపీకి బదిలీ చేయండి పొంచి ఉన్న ‘మహా’ ముప్పు.. తెలంగాణ–మహారాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర సర్వీసులను పునరుద్ధరించడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలోని బోధన్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని కోటగిరి, బోధన్, రెంజల్ మండలంలోని అనేక గ్రామాలు మహారాష్ట్ర ప్రాంత సరిహద్దులకు ఆనుకుని ఉన్నాయి. బోధన్ మండలంలోని సాలూర గ్రామం నుంచి 80 కిలో మీటర్ల దూరంలో గల మహారాష్ట్ర ప్రాంతంలోని నాందేడ్ జిల్లా కేంద్రం ఉండగా, ఇదే జిల్లా పరిధిలోని బిలోలి, దెగ్లూర్, కొండల్‌వాడీ, ధర్మాబాద్ పట్టణ కేంద్రాలు, అనేక పల్లెలు తెలంగాణ ప్రాంత సరిహద్దు పల్లెలకు ఆనుకుని ఉన్నాయి. రెండు రాష్ట్రాల సరిహద్దు పట్టణ కేంద్రాలు, పల్లెల నుంచి రాకపోకాలు సాగుతున్నాయి. గతంలో నిత్యం 10–12 బస్సు సర్వీసులు నడిపే వారు. కరోనా కారణంగా వాటిని నిలిపి వేయగా, తాజాగా సోమవారం నుంచి ఐదు సర్వీసులను నడుపుతున్నారు. ప్రస్తుతానికి నాందేడ్, దెగ్లూర్ పట్టణాలకు బస్సులు నడుస్తున్నాయి. కార్లు, ప్యాసింజర్ ఆటోలు ఎప్పటి నుంచో తిరుగుతున్నాయి. నిత్యం పదుల సంఖ్యలో కేసులు.. మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న సాలూర వద్ద చెక్ పాయింట్ ఏర్పాటు చేసి పొరుగు రాష్ట్రం నుంచి వస్తున్న ప్రయాణికులకు టెస్టులు చేస్తున్నారు. ఇక్క డ నిత్యం పదుల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులు సరిహద్దు ప్రాంత ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. మహారాష్ట్ర ప్రాంతానికి సరిహద్దులో గల సాలూర క్యాంప్ గ్రామంలో పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఆ గ్రామస్తులు స్వచ్ఛందంగా లాక్డౌన్ ప్రకటించారు. ఐదు సర్వీసుల పునరుద్ధరణ.. కరోనా నేపథ్యంలో మార్చి 24 నుంచి మహారాష్ట్ర ప్రాంతానికి బస్సు సర్వీసులు నిలిపివేశాం. అయి తే, సోమవారం నుంచి నాందేడ్, దెగ్లూర్‌లకు ఐదు బస్సు సర్వీసులు పునరుద్ధరించాం. కరోనా నిబంధనలు పాటిస్తూ బస్సులు నడుపుతున్నాం. సిట్టింగ్ సీట్ల మేరకే ప్రయాణికులకు అనుమతి ఇస్తున్నాం. – రమణ, బోధన్ డిపో మేనేజర్ -
ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేయబోయి..
సాక్షి, కరీంనగర్ : కరీంనగర్ రూరల్ మండలం నగునూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ బాలుడు మృతిచెందగా మరో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన వెల్గటూరు మండలంలోని చెగ్యాంలో విషాదం నింపింది. కరీంనగర్ రూరల్ పోలీసుల కథనం ప్రకారం.. చెగ్యాంకు చెందిన పన్నాల చిలుకయ్య–సునీత దంపతుల కుమారుడు మణిదీప్(17), పన్నాల పోషయ్య–సత్తవ్వ దంపతుల కుమారుడు విష్ణు వరసకు అన్నదమ్ములు. మణిదీప్ గతేడాది పదో తరగతి పూర్తి చేయగా విష్ణు పదో తరగతి చదువుతున్నాడు. ఎటువెళ్లినా ఇద్దరూ కలిసే వెళ్తారు. ఇటీవల తల్లిదండ్రులను బెదిరించి మరీ బైక్‌లు కొనుక్కున్నారు. ఈ క్రమంలో మణిదీప్ తన బైక్ సర్వీసింగ్ కోసం కరీంనగర్ వెళ్దామని విష్ణుని అడిగాడు. ఇద్దరూ కలిసి సోమవారం ఉదయం బైక్‌పై కరీంనగర్ వెళ్లారు. సర్వీసింగ్ పూర్తయ్యాక మధ్యాహ్నం స్వగ్రామం బయలుదేరారు. నగునూర్ రైతు వేదిక వద్ద ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేస్తూ ఎదురుగా వస్తున్న కారును అతివేగంగా ఢీకొట్టారు. ప్రమాదంలో ఇద్దరూ దూరంగా ఎగిరిపడటంతో తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మణిదీప్ మృతిచెందాడు. విష్ణును ఓ ప్రయివేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతున్నాడు. పోషయ్య–సత్తవ్వ దంపతులకు విష్ణు ఒక్కడే సంతానం. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఇరు కుటుంబాలకు వ్యవసాయమే ఆధారమని గ్రామస్తులు తెలిపారు. మణిదీప్, విష్ణులకు బైక్ రేస్‌లంటే ఇష్టమని, ఎటు వెళ్లినా కలిసే వెళ్లేవారని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదంలో మణిదీప్ చనిపోగా విష్ణు పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో బాధిత కుటుంబీకులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. మృతుడి తండ్రి చిలుకయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అతివేగమే ప్రమాదానికి కారణమని, హెల్మెట్ ఉంటే ఇంత నష్టం జరిగి ఉండకపోయేదని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. చదవండి: చదువులో వెనకబడ్డానని.. బీటెక్ విద్యార్థి.. -
ఆర్టీసీలో మరో సరికొత్త వ్యవస్థ..!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో క్యాష్‌లెస్ టికెట్ జారీ వ్యవస్థ ఏర్పాటు కానుంది. దీనికోసం ప్రత్యేకంగా రీచార్జి చేసుకునే కార్డులను జారీ చేయనుంది. డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఈ కార్డు ద్వారానే టికెట్ కొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రయోగం కోసం తొలుత హైదరాబాద్ సిటీలోని 16వ నంబర్ బస్ రూట్‌ను కేటాయించారు. ఈ రూట్లో తిరిగే బస్సుల్లో దీన్ని అమలు చేసి.. లోటుపాట్లు, లాభనష్టాలు గుర్తించి దాని ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా అమలుపై నిర్ణయం తీసుకోనున్నారు. భవిష్యత్తులో ఈ కార్డులను ఇతర అవసరాలకు కూడా వినియోగించేలా మార్పు చేయనున్నారు. టికెట్ జారీ ఇలా... ఈ ప్రత్యేక కార్డులు ప్రతిపాదిత మొత్తం (రూ.30గా ప్రస్తుతానికి అంచనా) చెల్లించి కొనాలి. అందులో నిర్ధారిత మొత్తాన్ని టాప్అప్ చేయించుకోవాలి. ఆ కార్డుకు ఓ క్యూఆర్ కోడ్ ఉంటుంది. కండక్టర్ వద్ద ప్రత్యేక టికెట్ జారీ యంత్రం ఉంటుంది. ప్రయాణికుడు ఏ స్టేజీలో దిగాలో నమోదు చేసి ప్రయాణికుడి వద్ద ఉన్న కార్డులో ఉండే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయగానే నిర్ధారిత టికెట్ మొత్తం కార్డు నుంచి డిడక్ట్ అవుతుంది. ఆ యంత్రం నుంచి టికెట్ జారీ అవుతుంది. కార్డులో బ్యాలెన్స్ అయిపోగానే మళ్లీ రీచార్జి చేసుకోవాలి. దీంతో చిల్లర సమస్యలుండవు, టికెట్ జారీలో అవకతవకలకు ఆస్కారం ఉండదు. ప్రయాణికుడు కచ్చితంగా వెంట టికెట్ డబ్బు ఉంచుకోవాల్సిన అవసరం లేదు. ఓ కంపెనీకి ప్రయోగం బాధ్యత.. ఇటీవల వన్ మనీ అనే ప్రైవేటు కంపెనీ ఈ కార్డు విషయంలో ఆర్టీసీని సంప్రదించింది. ఇప్పటికే క్యాష్‌లెస్ లావాదేవీల విషయంలో యాప్స్ రూపొందించి అమలు చేయడంలో తనకున్న అనుభవాన్ని పేర్కొంటూ ఆర్టీసీలో దాన్ని అమలు చేయాలని కోరింది. ఈ మేరకు ప్రయోగాత్మక పరిశీలన రూట్‌ను దానికి అప్పగించారు. సిటీలో సికింద్రాబాద్–కుషాయిగూడ మధ్య ఉండే 16వ నంబర్ బస్ రూట్లో దీన్ని అమలు చేయనున్నారు. డిజిటల్ ఇండియా కింద కేంద్ర ప్రభుత్వం సంస్థలకు భారీగా సాయం చేస్తోంది. ఇప్పుడు ఆర్టీసీలో నగదు రహిత లావాదేవీలకు సంబంధించి కూడా సంబంధిత సంస్థకు కేంద్రం నుంచి భారీగా నగదు ప్రోత్సాహకాలు, గ్రాంట్లు అందే అవకాశం ఉంటుందని సమాచారం. ఆర్టీసీలో ఈ విధానాన్ని నిర్వహించే ప్రైవేటు సంస్థలకు ఈ లబ్ధి ఉండనున్నందున అవకాశం కోసం పలువురు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. అధికారుల సమీక్ష.. రవాణా, రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి విజేంద్ర బోయీ ఆధ్వర్యంలో అధికారులు ఇటీవల దీనిపై సమీక్ష జరిపారు. ఆ కార్డును ఆధార్‌తో అనుసంధానించాలన్న సదరు కంపెనీ సూచనను అధికారులు వ్యతిరేకించారు. అలా చేయలేమని చెప్పడంతో ప్రస్తుతానికి ఆధార్‌తో అనుసంధానం లేకుండానే ప్రయోగం నిర్వహించనున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే టెండర్ ప్రక్రియ ద్వారా రాష్ట్రం మొత్తం నిర్వహించే బాధ్యతను నిర్ధారిత కంపెనీకి అప్పగించనున్నట్లు అధికారులు చెప్పారు. 5 శాతం రాయితీ.. కార్డును వినియోగించి టికెట్ కొంటే నిర్ధారిత బస్సు చార్జీపై 5 శాతం రాయితీ ఇచ్చేలా యోచిస్తున్నారు. దీంతో ప్రయాణికుడికి కొంత వెసులుబాటు కలుగుతుంది. డబ్బు చెల్లించడం కంటే నగదు రహిత లావాదేవీకే మొగ్గు చూపుతారని అధికారులు భావిస్తున్నారు. -
బస్సుల సంఖ్య మళ్లీ పెంచుకుందాం..!
సాక్షి హైదరాబాద్: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా లక్ష కిలోమీటర్ల మేర తిరిగే సర్వీసులను ఏపీ తగ్గించుకుంది.. దీనివల్ల ఆర్టీసీకి వచ్చేనష్టం ఏటా దాదాపు రూ.270 కోట్లు. తెలంగాణ ఆర్టీసీ.. ఆ మొత్తాన్నితన సర్వీసులు నడపడం ద్వారా ఆదా చేసుకోగలుగుతుందా? లేదా ప్రైవేటు బస్సులు తన్నుకుపోతాయా? కొత్తగా అదనపు బస్సులునడపడంపై తెలంగాణ ఆర్టీసీ యోచన ఏమిటి?.. ప్రస్తుతానికి ఇలా.. అంతర్రాష్ట్ర సర్వీసులకు సంబంధించి టీఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ మధ్య సోమవారం ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. తగ్గించుకున్న బస్సుల వల్ల ఏపీ పెద్దగా కోల్పోయేది ఏం లేదని, దుబారా తగ్గి ఖర్చు ఆదా అవుతుందన్న భావన తెలంగాణ ఆర్టీసీలో వ్యక్తమవుతోంది. అయితే, దీన్ని మరింత నిశితంగా పరిశీలించాలని రెండు సంస్థలు నిర్ణయించాయి. ప్రస్తుత ఒప్పందం ప్రకారం నడుస్తున్న సర్వీసులకుసంబంధించి మరో మూడు నెలల తర్వాత సమీక్షించుకోవాలని ఏపీ అధికారులు చేసిన ప్రతిపాదనకు తెలంగాణ అధికారులు సూత్రప్రాయంగాఅంగీకరించారు. ప్రస్తుతం భారీగా బస్సులు, అవి తిరిగే నిడివిని ఏపీఎస్ఆర్టీసీ తగ్గించుకున్న నేపథ్యంలో, వీలైనంత తొందరలో డిమాండ్ పెరుగుతుందన్న అభిప్రాయాన్ని ఏపీ అధికారులు వ్యక్తం చేశారు. ఒకవేళ బస్సులకు ప్రయాణికుల నుంచి డిమాండ్ పెరిగి, అందుకు అనుగుణంగా నడపలేకపోతున్నామనే భావన వ్యక్తమైతే, వెంటనే సమీక్షించాలని పేర్కొన్నారు. డిమాండ్‌కు తగ్గట్టు బస్సులు నడపకుంటే ప్రయాణికులు ప్రైవేటు బస్సులవైపు చూస్తారని, అప్పుడా ఆదాయాన్ని రెండు ఆర్టీసీలు కోల్పోయినట్లేనన్న అభిప్రాయం వ్యక్తమైంది. పర్యవసానం ఏమిటి..? ప్రస్తుతం కోవిడ్‌తో పెద్దగా ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) లేనందున ఇబ్బంది ఏముండదు. కోవిడ్ ప్రభావం తగ్గగానే ప్రయాణికులు మునుపటిలా బస్సులెక్కు తారు. అప్పుడు ఓఆర్ పెరిగి బస్సులపై ఒత్తిడి పెరుగుతుంది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు ప్రైవేటు ట్రావెల్స్ ముందుకొచ్చే ప్రమాదం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆర్టీసీలు నష్ట పోకుండా ఉండాలంటే మళ్లీ బస్సుల సంఖ్య పెంచుకోవాలని ఏపీ అధికారులు ప్రతిపాదించగా.. తెలంగాణ అధికారులు సమ్మతించారు. దీని ప్రకారం కనీసం ఆరు నెలల తర్వాత మళ్లీ బస్సుల సంఖ్య పెంచుకునే పరిస్థితి రావచ్చు. అప్పుడు రెండు ఆర్టీసీలు కొత్త ఒప్పందం దామాషా మేరకు బస్సుల సంఖ్యను పెంచుకోవాల్సి ఉంటుంది. టీఎస్ఆర్టీసీ కర్తవ్యం..? ప్రస్తుతం ఏపీకి తిప్పే సర్వీసుల సంఖ్య పెరిగినందున తెలంగాణ ఆర్టీసీ కొత్త బస్సులను నడపాల్సి వస్తుంది. ప్రస్తుతం బస్సుల కొరత ఉన్నందున డిపోల్లో స్పేర్‌గా ఉండే బస్సులను వాడనున్నారు. ఆరు నెలల తర్వాత బస్సుల సంఖ్య పెంచాల్సి వస్తే కచ్చితంగా కొత్తవి కొనాల్సి వస్తుంది. ప్రస్తుతం అంత ఆర్థిక స్థోమత తెలంగాణ ఆర్టీసీకి లేనందున ప్రభుత్వం వైపు చూడాల్సిందే. కోవిడ్ తదనంతర పరిస్థితిలో ప్రత్యేకంగా నిధులివ్వడం ప్రభుత్వానికీ సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో అంతర్రాష్ట్ర సర్వీసులను కూడా అద్దె ప్రాతిపదికన తీసుకునే యోచనలో టీఎస్ఆర్టీసీ ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో తిరిగే జిల్లా, సిటీ సర్వీసులుగా దాదాపు 3,300 అద్దె బస్సులను వాడుతున్నారు. తొలిసారి ఏపీ–తెలంగాణ మధ్య అంతర్రాష్ట్ర సర్వీసుల కోసం కూడా అద్దె బస్సులనే తీసుకుంటే ఎలా ఉంటుందని యోచిస్తున్నారు. అద్దె బస్సుకు డ్రైవర్ ఎవరు..?? ఇప్పటికే పెద్దసంఖ్యలో బస్సు సర్వీసులను కుదించటంతో వేలసంఖ్యలో డ్రైవర్లు, కండక్టర్లు అదనంగా మారారు. వారికి ఇతరత్రా పనులు అప్పగిస్తున్నా.. కొందరు ఖాళీగా ఉంటున్నారు. అంతర్రాష్ట్ర సర్వీసులుగా అద్దె బస్సులు తీసుకుంటే అందులో ఎలాగూ సిబ్బంది ఉంటారు కాబట్టి ఆర్టీసీ సిబ్బందిని వాడుకునే అవకాశం ఉండదు. కూర్చోబెట్టి జీతాలివ్వాల్సిందే. వచ్చే ఏడాది పెద్దసంఖ్యలో పదవీ విరమణలున్నందున సమస్య కొంతమేర తగ్గినా ఇంకా కొందరు మిగులుతారు. ఇందుకోసం అద్దె బస్సుల్లోనూ ఆర్టీసీ డ్రైవర్లనే వాడాలని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం అద్దె బస్సుల యజమానులే ప్రైవేటు డ్రైవర్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. వారికి బదులు ఆర్టీసీ డ్రైవర్లనే వాటిల్లో వాడే అవకాశం ఉంది. -
సిటీ బస్సు ప్రయాణికులకు గుడ్ న్యూస్
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ ఆర్టీసీ ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ శుక్రవారం శుభవార్త చెప్పింది. కోవిడ్ కారణంగా విధించిన లాక్డౌన్ కాలంలో బస్ పాస్ ఉపయోగించుకోని వారికి మళ్ళీ సదుపాయం కల్పించనుంది. కోవిడ్ లాక్డౌన్లో తీసుకున్న బస్ పాస్‌లో(ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్, ఎయిర్పోర్ట్ పుష్పక్ ఎసీ బస్) ఎన్ని రోజులు ఉపయోగించుకోలేదో అన్ని రోజులు మళ్లీ ఉపయోగించుకునే అవకాశాన్ని గ్రేటర్ హైదరాబాద్ జోన్ టీఎస్ఆర్టీసీ కల్పించనుంది. దీంతో వినియోగదారులు అప్పటి బస్ పాస్‌ను కౌంటర్లో తిరిగి ఇచ్చేసి కొత్త కార్డు తీసుకోవాలని ఆర్టీసీ సూచించింది. కొత్త పాస్‌లో కోల్పోయిన రోజులను కలిపి పాసులు జారీ చేయనుంది. ఈ సదుపాయాన్ని నవంబర్ 30 వరకు వినియోగించుకోవచ్చు. చదవండి: ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త -
టీఎస్ఆర్టీసీకి కొత్త బస్సుల కొరత!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో కొత్త బస్సుల కొరత నెలకొంది. నాలుగేళ్ల కిందట తొలిసారి వెయ్యి, ఆ తర్వాత మరో 300 వరకూ కొత్తవి కొన్నా.. ప్రస్తుతం వాటిలోనూ చాలా వరకు పాతబడిపోయాయి. దూర ప్రాంతాలకూ డొక్కు బస్సులే తిప్పాల్సిన దుస్థితి ఉంది. కొత్తవాటి కొనుగోళ్లపై ఆర్టీసీ దృష్టి సారించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతర్రాష్ట్ర సర్వీసుల్లో ఇప్పుడు ఇది కూడా కీలకంగా మారనుంది. ఇటీవల ఏపీఎస్ ఆర్టీసీ కొత్త బస్సులు కొనుగోలు చేసి దూరప్రాంతాలకు నడుపుతోంది. తెలంగాణ ఆర్టీసీలో మాత్రం కొత్తవి సరిపోవట్లేదు. ఏపీఎస్ ఆర్టీసీ కొత్తవి తిప్పుతుంటే, ఆ ప్రాంతానికి తెలంగాణ ఆర్టీసీ పాతవి తిప్పాల్సి వస్తోంది. ఇటీవల రెండు ఆర్టీసీలూ సమ సంఖ్యలో అంతర్రాష్ట్ర బస్సులు నడపాలనే చర్చ వచ్చినప్పుడు, ఈ అంశం కూడా తెరపైకి వచ్చింది. దీంతో దూర ప్రాంతాలకు తెలంగాణ ఆర్టీసీ కూడా కొత్తవి నడపాల్సిన అవసరం ఏర్పడింది. ఉన్న బస్సుల్లోనూ చాలా వరకు పాతపడి, సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. 2016–17లో కొన్న గరుడ, గరుడ ప్లస్ బస్సులు చాలా వరకు పాతబడ్డాయి. ప్రస్తుతం ఆర్టీసీ వద్ద ఉన్న హైఎండ్ మోడల్ మల్టీ యాక్సిల్ బస్సు ల్లో స్కానియా కంపెనీవి కొత్తవి. గరిష్టంగా ఏడున్నర లక్షల కి.మీ.తిరగాల్సిన ఈ బస్సు లు ఇప్పటికే 5 లక్షల కి.మీ. పూర్తి చేసుకున్నా యి. వీటిల్లోనూ కొన్ని వెంటనే అవసరం. 1,100 బస్సులు కావాలి.. ఆర్టీసీకి 6,850 సొంత, మరో 3,500 అద్దె బస్సులు ఉన్నాయి. సొంత వాటికి సంబంధించి దాదాపు 1,500 వరకు బాగా పాతబడిపోయాయి. వాటిల్లో కొన్నింటిని తొలగించాల్సిన అవసరం ఉంది. దీంతో ఇప్పటికిప్పుడు 1,100 వరకు కొత్త బస్సులు అవసరమవుతున్నాయి. వీటిల్లో 60 వరకు మల్టీయాక్సిల్వి కావాలి. మరో 150 వరకు రాజధాని ఏసీ, మిగతావి సూపర్ లగ్జరీ అవసరమవుతాయి. వీటిల్లో మల్టీయాక్సిల్ బస్సు దాదాపు రూ.కోటిన్నర ధర పలుకుతోంది. రాజధాని–రూ.55 లక్షలు, సూపర్ లగ్జరీ రూ.36 లక్షల వరకు ధర ఉంటుంది. ఇక సాధారణ ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు బస్సు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు పలుకుతోంది. ఈ లెక్కన 1,100 బస్సులకు దాదాపు రూ.450 కోట్లు అవసరమవుతోంది. ప్రస్తుతం ఆర్టీసీ వద్ద ఇన్ని నిధులు లేనందున, ప్రభుత్వమే రుణంగానో, గ్రాంటుగానో సమకూర్చాల్సి ఉంటుంది. అద్దె ప్రాతిపదికన తీసుకుంటే.. ఆర్టీసీలో కొంతకాలంగా అద్దె బస్సుల సంఖ్య పెరుగుతోంది. కొత్తవి సమకూర్చుకోవటం ఇబ్బందిగా మారడంతో అద్దె ప్రాతిపదికన ప్రైవేటు వ్యక్తుల నుంచి తీసుకుంటోంది. ఇప్పటి వరకు హైఎండ్ మోడల్ బస్సులను మాత్రం ఆర్టీసీ సొంతంగానే సమకూర్చుకుంది. ప్రస్తుతం నిధులకు ఇబ్బందిగా ఉండడంతో ఆ కేటగిరీ బస్సులనూ అద్దె ప్రాతిపదికన తీసుకోవడంపై యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 3,500 వరకు అద్దె బస్సులుండగా, అంతమేర ఆర్టీసీ డ్రైవర్లకు పని లేకుం డా పోయింది. ఈ క్రమంలో ఇప్పటికే దాదా పు ఐదారు వేల మంది ఎక్సెస్‌గా మారారు. కొత్తగా అద్దె బస్సులు తీసుకుంటే వారి సంఖ్య మరింత పెరిగి, ఆర్టీసీలో వేల మంది డ్రైవర్లకు పని లేకుండా పోతుంది. ఇప్పటికే దాదాపు 2 వేల మంది డ్రైవర్లకు ఇతర చిన్నా చితక పనులు అప్పగిస్తున్నారు. అవీ సరిపోక కొందరు ఊరకే ఉండాల్సి వస్తోంది. ఇలాంటి తరుణంలో డ్రైవర్ల సంఖ్య పెరిగితే వాలంటరీ రిటైర్మెంట్ పథకం వర్తింపచేయడం మినహా మరో మార్గం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాధారణంగా ఇలాంటి పరిస్థితి, ప్రైవేటీకరించే సమయం లోనే వస్తుందని, ఇప్పుడు ఆ దిశగా యోచిస్తే సంస్థ మనుగడే ప్రశ్నార్థకంగా మారినట్లు అర్థం చేసుకోవాలని నిపుణులు అంటున్నారు. రూ.700 కోట్లు ఇవ్వాలి ప్రస్తుతం ఆర్టీసీలో 1,500 బస్సులు తుక్కుగా మార్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. వాటి స్థానంలో కొత్తవి కొనాలి. ఏపీఎస్ ఆర్టీసీతో ఒప్పందంలో భాగంగా లక్ష కి.మీ. పెంచుకోవద్దన్న నిర్ణయం వెనుక బస్సుల కొరతే కారణం. దీంతో కొత్త బస్సులు కొని లక్ష కి.మీ. ప్రయాణ నిడివిని ఏపీలో టీఎస్ ఆర్టీసీ పెంచుకోవాలి. కొత్తవి కొంటేనే మన ఆర్టీసీ ప్రతిష్ట ఉంటుంది. ఇందుకు ప్రభుత్వం రూ.700 కోట్ల మొత్తం గ్రాంటుగా ఇవ్వాలి. – రాజిరెడ్డి, ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి -
‘తెలంగాణ నుంచి స్పందన లేదు..’
సాక్షి, హైదరాబాద్ : అంతరాష్ట్ర సర్వీసులపై ఇప్పటి వరకు 3సార్లు చర్చలు, సమావేశాలు జరిగాయని తెలంగాణ మజ్ధూర్ యూనియన్ (టీజేఎమ్‌యూ) ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ తెలిపారు. అయినా టీఎస్ఆర్టీసీ వైపు నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. ఏపీఎస్ఆర్టీసీ బస్సులు నడుపుకోమన్నప్పటికీ కూడా తెలంగాణ నుంచి స్పందన లేదన్నారు. బస్సులు లేకపోతే కొనేందుకు ప్రభుత్వం నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తీరు చూస్తుంటే టీఎస్ఆర్టీసీని నిర్వీర్యం చేసి, ప్రైవేట్ బస్సులను ప్రొత్సహించే విధంగా ఉందని అర్ధమవుతోందన్నారు. (తెలంగాణకు బస్సులపై నేడు మరోసారి భేటీ) ‘ఆర్టీసిని రక్షించుకుంటాం అని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ప్రభుత్వం అనుకుంటే బస్సులు కొనడం ఇబ్బంది ఏం కాదు. కావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్యం చేయడం సరైన పద్ధతి కాదు. ఓ వైపు ఇరు రాష్ట్రాల మధ్య ప్రైవేట్ బస్సులు నడుస్తూ లాభాలు గడిస్తుంటే ఆర్టీసీ బస్సులు మాత్రం డిపోలకే పరిమితం అయ్యాయి. ఆర్టీసీకి రోజు రోజుకు నష్టాలు పెరుగుతున్నాయి. ఇకనైనా ప్రభుత్వం జోక్యం చేసుకొని వెంటనే ఇరు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు ప్రారంభించాలని’ హనుమంతు డిమాండ్ చేశారు. -
తెలంగాణలో రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు
-
బ్రేక్‌డౌన్ కాదు.. లాక్డౌన్ !
జనతా కర్ఫ్యూ.. ఆ వెంటనే అమలులోకి వచ్చిన లాక్‌డౌన్‌తో ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. అందులో భాగంగా రైళ్లను కూడా ఎక్కడికక్కడ ఆపివేశారు. ఈ క్రమంలో కాజీపేట రైల్వే జంక్షన్ నుంచి జయలుదేరే రైళ్ల ఇంజన్లు, గూడ్స్ బోగీలను స్టేషన్ పక్కనే ఉన్న యార్డులో నిలిపారు. వీటికి తోడు సికింద్రాబాద్ యార్డు కూడా నిండిపోగా అక్కడి నుంచి కొన్ని ఇంజన్లను ఇక్కడికి పంపించారు. దీంతో యార్డులోని అన్ని లైన్లు గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంజన్లు, బోగీలతో ఇలా నిండిపోయాయి. – కాజీపేట రూరల్ సాక్షి, హన్మకొండ: ప్రతికూల పరిస్థితులతో టీఎస్ ఆర్టీసీ ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. మొన్నటి వరకు ఉద్యోగుల సమ్మె.. ఆ తర్వాత కొద్దిగా కోలుకునే స్థితికి రాగానే కరోనా వైరస్‌తో లాక్డౌన్ విధించడంతో ప్రజారవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించి పోయింది. దీంతో ఆర్టీసీ పరిస్థితి ఆగమాగంగా మారింది. ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా గ్రీన్, ఆరెంజ్ జోన్లలో పరిమితంగా బస్సులు నడపడానికి అనుమతించనున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం ఆర్టీసీ వర్గాల్లో కొంత సంతోషాన్ని కలిగిస్తున్నా... మరో వైపు కరోనా వైరస్ వ్యాప్తిపై ఆందోళన నెలకొంది. ఇక ఆర్టీసీ బస్సులు నడిపేందుకు రాష్ట్రప్రభుత్వం అనుమతిస్తుందా లేదా అనేది తేలాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే మాత్రం బస్సులు నడపడానికి సిద్ధంగా ఉన్నామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఆదాయంలో ముందంజ టీఎస్ ఆర్టీసీలో 11 రీజియన్లు ఉన్నాయి. ఇందులో ఒక్క వరంగల్ రీజియన్ మాత్రమే ఆదాయ సముపార్జనలో ముందుంది. వరంగల్ రీజియన్ లాక్డౌన్ నాటికి రూ.3 కోట్ల లాభాల్లో ఉన్నట్లు అధికారులు చెబుతుండగా.. మిగతా రీజియన్లు అన్నీ నష్టాల్లో ఉన్నాయి. ఆర్టీసీలో ఉద్యోగుల సమ్మె ముగిశాక వరంగల్ రీజియన్ ఆదాయపరంగా పుంజుకుంటున్న క్రమంలోనే కరోనా వైరస్ ప్రతిబంధకంగా మారింది. బస్సుల రాకపోకలు లేకపోవడంతో నిర్మానుష్యంగా ఉన్న హన్మకొండలోని జిల్లా బస్టాండ్ డిపోల్లోనే బస్సులు లాక్‌డౌన్‌తో బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. వరంగల్ రీజియన్‌లోని 9 డిపోల్లో 962 బస్సులు నిలిచిపోయాయి. దీంతో వరంగల్ రీజియన్‌లో ఆర్టీసీకి సగటున రోజుకు వచ్చే ఆదాయం రూ.137.77 లక్షల చొప్పున 43 రోజులకు రూ.57.09 కోట్ల ఆదాయాన్ని కోల్పోయినట్లయింది. వరంగల్ రీజియన్‌లో 962 షెడ్యూళ్ల ద్వారా రోజుకు 3.95 లక్షల కిలోమీటర్లు తిరిగి 3 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్నాయి. లాక్‌డౌన్‌తో సంస్థలోని 1,734 మంది కండక్టర్లు, 1,564 మంది డ్రైవర్లు ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రధాని మోదీ గ్రీన్ జోన్లలో బస్సులు తిప్పడానికి అవకాశవిుస్తామని చెప్పడం ఆర్టీసీ వర్గాలకు కొంత ఊరట కలిగించింది. అయితే రాష్ట్రంలో ఇంకా కొన్ని జిల్లాల్లో కరోనా వైరస్ కేసులు బయట పడుతున్న క్రమంలో ప్రజారవాణాకు అనుమతిస్తారా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిర్వహణ లేక సమస్యలు లాక్‌డౌన్‌తో 43 రోజులుగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కావడం వాటి పనితీరుపై ప్రభావం చూపే అవకాశముంది. బస్సుల బ్యాటరీలు, ఇతర భాగాలు దెబ్బ తినే అవకాశముందని చెబుతున్నారు. అయితే అధికారులు మాత్రం ప్రతిరోజు బస్సులను కొద్ది సేపు ఆన్‌లో ఉంచి బ్యాటరీలు దెబ్బతినకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికిప్పుడు బస్సులు నడిపేందుకు అనుమతించినా తాము సిద్ధంగా ఉన్నామని... బస్సులు కూడా కండీషన్లో ఉన్నాయని చెబుతున్నారు. గతంలో ఉద్యోగులు 53 రోజుల పాటు సమ్మె చేసినప్పుడు రాజధాని, గరుడ ఏసీ బస్సులు నడపలేదు. అయినా ఉద్యోగులు విధుల్లో చేరిన వెంటనే ఏసీ బస్సులను ఎలాంటి ఇబ్బందులు లేకుండా నడిపామని గుర్తు చేస్తున్నారు. భౌతిక దూరం పాటించాలంటే కష్టమే... వరంగల్ రీజియన్ పరిధిలోని ఆరు జిల్లాల్లో వరంగల్ అర్బన్ జిల్లా రెడ్ జోన్లో ఉండగా.. మిగతా జిల్లాలు గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ఉన్నాయి. వరంగల్ అర్బన్ జిల్లాలో వరంగల్–1, 2, హన్మకొండ డిపోలు ఉన్నాయి. వరంగల్ రూరల్ జిల్లాలో నర్సంపేట, పరకాల డిపోలు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలో మహబూబాబాద్, తొర్రూరు, జనగామ జిల్లాలో జనగామ డిపో ఉండగా.. ములుగు జిల్లాలో ఆర్టీసీ డిపో లేదు. తాజాగా ప్రజారవాణాను పునరుద్ధరించి బస్సులు నడిపినా 50 శాతం సీట్లలోనే ప్రయాణికులను తీసుకెళ్లాలని ప్రధాని వెల్లడించారు. ఈ నిర్ణయం ప్రకారం ఆర్టీసీ బస్సులు నడిపినా నష్టాలు వస్తాయని.. నిర్వహణ ఖర్చులు కూడా రావడం కష్టమేనని చెబుతున్నారు. వరంగల్ రీజియన్‌లో 73 శాతం అక్యుపెన్సీ రేషియో(ఓఆర్)తో బస్సులు నడుస్తుండగా.. 50 శాతం ఆక్యుపెన్సీ రేషియోతో నడిపిస్తే నష్టాలు కొని తెచ్చుకోవాలి్సందే. కానీ అత్యవసర పనుల నిమిత్తం వెళ్లాలనుకునే వారికి మాత్రం బస్సులు నడపడం ద్వారా ఇబ్బందులు తీరతాయి. అయితే, బస్సు విశాలంగా ఉండడంతో ప్రయాణికుల మధ్య భౌతిక దూరం పాటించే అవకాశంతో పాటు కరోనా వైరస్ సోకే అవకాశం తక్కువగా ఉంటుందని ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి. ప్రతిరోజు శానిటేషన్ చేసే అవకాశమున్నందున కరోనా వైరస్ ప్రభావం అంతగా ఉండకపోవచ్చని పేర్కొంటున్నారు. -
ఆర్టీసీ బస్సు ఢీ.. ఏడుగురు దుర్మరణం
సాక్షి, మెదక్: జిల్లాలోని కొల్చారం మండలం సంగాయిపేట వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, డీసీఎం వ్యాన్ ఢీకొన్న ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డవారిలో ఆర్టీసీ బస్ డ్రైవర్ కూడా ఉన్నాడు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతులంతా సంగారెడ్డి జిల్లా ఫసల్వాడి గ్రామానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. మెదక్‌లోని ఏడుపాయల జాతరకు వీరంతా డీసీఎం వ్యాన్‌లో వెళ్లి వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కాగా, ఘటనాస్థలాన్ని జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి, ఎస్పీ చందన దీప్తి సందర్శించారు. ప్రమాద ఘటనపై రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ దిగ్భాంతి వ్యక్త చేశారు. మృతుల కుటుంబాలను, క్షతాగాత్రులను ఆదుకుంటామని హామినిచ్చారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను, ఆర్టీసీ అదికారులను ఆదేశించారు. మృతుల వివరాలు.. గూడల మనెమ్మ, గూడల దుర్గమ్మ, మధురిమ, రజిత, మరో ముగ్గురి పేర్లు తెలియాల్సి ఉంది. మృతులంతా మహిళలే కావడంతో వారి పిల్లలు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
తప్పిన పెను ప్రమాదం.. 60 మంది సేఫ్!
సాక్షి, రాయపర్తి : 60 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. బస్సు 11 కేవీ విద్యుత్ తీగలను తాకడంతో టైర్లు ఒక్కసారిగా పేలిపోయాయి. అదే సమయంలో విద్యుత్ తీగలు కూడా తెగిపడడంతో.. ట్రాన్స్ఫార్మర్ ఫీజు కొట్టేసి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈఘటన వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తిలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలు.. రాయపర్తి మండలం తిరుమలయ్య పల్లి శివారులో పాలకుర్తి సీఐ వాహనం ఢీకొని దంపతులు బొమ్మకంటి రాజు (40), బొమ్మకంటి రాణి (33) మంగళవారం మృతి చెందిన విషయం తెలిసిందే. వారితో పాటు బైక్‌పై వెళ్తున్న రాణి సోదరి కవిత తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈనేపథ్యంలో.. తమకు న్యాయం చేయాలంటూ మృతుల కుటుంబ సభ్యులు వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై మృతదేహాలతో ధర్నాకు దిగారు. దీంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. రహదారికి రెండు వైపులా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్‌తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో వరంగల్ నుంచి తొర్రూర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును.. డ్రైవర్ ఇరుకైన మార్గం గుండా పోనిచ్చేందుకు యత్నించాడు. ఆ పక్కనే ఉన్న విద్యుత్ వైర్లను డ్రైవర్ గమనించకపోవడంతో.. బస్సు 11 కేవీ విద్యుత్ తీగలకు తాకింది. విద్యుత్ ప్రసరించడంతో బస్సు టైర్లు ఒక్కసారిగా పేలిపోయాయి. విద్యుత్ తీగలు కూడా తెగిపోవడంతో.. ట్రాన్స్ఫార్మర్ ఫీజు కొట్టేసింది. దాంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం తెలుసుకున్న విద్యుత్ సిబ్బంది వెంటనే ఆ రూట్లో విద్యుత్ నిలిపివేయడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ అజాగ్రత్తపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
టోల్‌ప్లాజా వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం
సాక్షి, యాదాద్రి: ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా అదుపు కోల్పోయిన బస్సు టోల్‌ప్లాజా వద్ద ఆగిన వరుస వెంబడి కార్లను ఢీకొట్టింది. ఈ ఘటనలో మూడు కార్లు ధ్వంసమయ్యాయి. అయితే, అదృష్టవశాత్తు ఎవరూ ఈ ఘటనలో గాయపడలేదు. యాదాద్రి జిల్లాలోని పతంగి టోల్‌ప్లాజా వద్ద ఈ ఘటన జరిగింది. మణుగూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా అదుపు కోల్పోయి.. ముందువరుసలో ఉన్న మూడు కార్లను ధ్వంసం చేసింది. ఈ ఘటనలో ప్రయాణికులెవరికీ గాయాలు కాలేదు. ఒక్కసారిగా బస్సు బ్రేక్ ఫెయిలవ్వడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని ఆర్టీసీ బస్సు డ్రైవర్ చెప్తున్నారు. -
ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మందకృష్ణ
సాక్షి, సూర్యాపేట: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తాజాగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఆర్టీసీ పరిరక్షణ యాత్రను చేపట్టిన ఆయన హైదరాబాద్ నుంచి భద్రాచలం వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నష్టాల్లో ఉన్న ఆర్టీసీ బతకాలంటే ప్రతి ఒక్కరు సొంత వాహనాలను వదిలి ఆర్టీసీలో ప్రయాణించాలి. ఆర్టీసీ సమ్మె కాలంలో కార్మికులకు మద్దతు ఇచ్చినట్లుగానే ఆర్టీసీని బతికించేందుకు ఇప్పుడు బస్సులో ప్రయాణం చేస్తున్నా. లోటు బడ్జెట్ ఉన్న ఆంధ్రాలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినప్పుడు.. ఇక్కడ ఎందుకు సాధ్యంకాదు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి’ అని కోరారు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేయడంలో భాగంగానే సీఎం కేసీఆర్ ఉద్యోగ సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారని, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు మంత్రులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయాలన్న కేసీఆర్ మాటలు ఎక్కడా కార్యరూపం దాల్చలేదని తప్పుబట్టారు. -
విలీనం లేదు
-
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్
-
రెండోరోజుకు చేరిన తెలంగాణ ఆర్టీసీ సమ్మె
-
పోరాటాన్ని ఉధృతం చేస్తాం
-
బైక్ పై వచ్చి..బస్సుపై రాళ్ల దాడి
-
ఆర్టీసీ సమ్మె.. 3 నిమిషాలకో మెట్రో రైలు
-
ఆర్టీసీ సమ్మె.. ప్రజల ఇబ్బందులు
-
కనిపించని ఆర్టీసీ బస్సులు
-
ఎక్కడికక్కడ నిలిచిపోయిన బస్సులు
-
ప్రయాణీకులకు తప్పని తిప్పలు
-
ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం తీవ్ర నిర్ణయం
-
బస్సుకు బ్రేకులు..
-
ఆర్టీసీ సమ్మె ప్రయాణికుల ఇక్కట్లు
-
సబ్సిడీలా!
సాక్షి, మెదక్: కప్పుడు ఆర్టీసీ సంస్థ మనుగడకే ముప్పు వాటిళ్లే విధంగా ప్రైవేట్ వాహనాలు ఉనికి చాటుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికులను అధిక సంఖ్యలో ఆకర్షించేందుకు, ఆర్టీసీ వైపు మళ్లించేందుకు సబ్సిడీ పథకాలను ప్రవేశపెట్టి కొన్ని సంవత్సరాలుగా కొనసాగిస్తోంది. ప్రయాణికులు కోరిన చోట ఆపడం, ఎక్స్‌ప్రెస్, లగ్జరీ, డీలక్స్ బస్సుల్లో కాలక్షేపం కోసం టీవీలను ఏర్పాటు చేయటంతో పాటు పలురకాల వసతులు పెంచింది. డ్రైవర్లు, కండక్టర్లు ప్రయాణికులతో మర్యాదగా నడుచుకోవడం ప్రారంభమైంది. వీటికి తోడు సబ్సిడీతో కూడిన నవ్య, వనిత, విహారి కార్డులను ప్రయాణికులకు అందించింది. మొదటిసారి నవ్య కార్డు ధర రూ.280 కాగా ఆ మరుసటి ఏడాది రూ.180కి ఇచ్చింది. పల్లెవెలుగు మొదలుకుని సూపర్ లగ్జరీవరకు అన్ని బస్సుల్లో పదిశాతం సబ్సిడీ పొందే వెసులుబాటు కల్పించింది. తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ.100కే వనిత కార్డును అందించింది. కుటుంబంలోని ఐదుగురు సభ్యులు పదిశాతం రాయితీపై ప్రయాణం చేసే అవకాశం కల్పించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రయణించే వారికోసం విహారి కార్డులను సైతం ప్రవేశపెట్టింది. రూ.610 చెల్లిస్తే వారం రోజుల పాటు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా సూపర్ లగ్జరీ బస్సులతో పాటు అన్ని బస్సుల్లో సగం చార్జీలకే ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. ఈ పథకాలతో సంస్థకు ఎలాంటి లాభం లేదని, పదిశాతం నష్టమేనని తేల్చుకున్న ఆర్టీసీ మే 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా వాటిని ఎత్తివేసేందుకు సిద్ధమవుతోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో.. ఉమ్మడి మెదక్ జిల్లాలో 1,260 సబ్సిడీ కార్డులు ఉన్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. మెదక్ డిపోలో మొత్తం 103 బస్సులు ఉండగా 7 ఎక్స్‌ప్రెస్, 6 లగ్జరీ, 13 డీలక్స్‌తో పాటు 77 పల్లెవెలుగు బస్సులు ఉన్నాయి. ఇవి నిత్యం 39,000 కిలోమీటర్ల మేర ప్రయాణం సాగిస్తుంటాయి. వీటి ద్వారా నిత్యం రూ.11 లక్షలు రావాల్సి ఉండగా రూ.10 లక్షలు మాత్రమే వస్తోంది. ఈలెక్కన నెలకు రూ.30 లక్షల ఆదాయం తగ్గినట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం మెదక్ డిపో రూ.7కోట్ల నష్టాల్లో ఉందని పేర్కొంటున్నారు. సబ్సిడీ కార్డులను ఎత్తివేçయాలని రాష్ట్ర వ్యాప్తంగా సంస్థ తీసుకున్న నిర్ణయంతో నష్టాల నుంచి కొంత బయట పడే వీలుంటుందని అధికారులు చెబుతున్నారు. రూ.7 కోట్ల నష్టాల్లో ఉంది ప్రస్తుతం మెదక్ డిపో రూ.7కోట్ల నష్టాల్లో ఉంది. డిపోలను నష్టాల ఊబి నుంచి బయట పడేయాలనే ఆలోచనతో సబ్సిడీ కార్డులను ఎత్తివేస్తున్నారు. ఇక నుంచి సంస్థ నష్టాలను అధిగమించి లాభాల బాటలో నడుస్తుందని ఆశిస్తున్నాం.– జాకీర్‌హుస్సేన్, మెదక్ డిపో మేనేజర్ -
జగిత్యాల ఆర్టీసీ బస్సులో మంటలు
జగిత్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్‌లో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లేందుకు ప్లాట్‌ఫాంపై సిద్ధంగా ఉన్న సూపర్ లక్సరీ బస్సులో శనివారం రాత్రి ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. వెంటనే ఆర్టీసీ అధికారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సకాలంలో స్పందించిన ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పివేశారు. ఈ ఘటనలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఆ తర్వాత మరో బస్సు ఏర్పాటు చేసి ప్రయాణికులను శంషాబాద్‌కు పంపించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే బస్సులో మంటలు చెలరేగినట్టు అధికారులు ప్రాథమిక నిర్దారణకు వచ్చారు. -
చోరీ అయిన ఆర్టీసీ బస్సును తుక్కు తుక్కుగా మార్చేశారు..
సాక్షి, హైదరాబాద్: సీబీఎస్‌లో చోరీకి గురైన తెలంగాణ ఆర్టీసీ బస్సు ఆచూకీ లభించింది. మంగళవారం రాత్రి చోరీకి గురయిన బస్సును నాందేడ్‌లోని ఓ షెడ్లో పోలీసులు గుర్తించారు. కానీ బస్సును ముక్కలు ముక్కలు చేసిన దుండగులు.. దాని గుర్తుపట్టలేని విధంగా మార్చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కుషాయిగూడ డిపో ఏపీ 11 జెడ్ 6254 నెంబర్ గల ఆర్టీసీ బస్సు అంబేడ్కర్ నగర్, అఫ్జల్‌గంజ్‌ల మధ్య రాకపోకలు సాగిస్తుంది. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో నైట్‌హాల్ట్ కోసం డ్రైవర్ ఆ బస్సును సీబీఎస్‌లో నిలిపాడు. అయితే ఆ బస్సు కనిపించకుండా పోయింది. దీంతో పోలీసులు, ఆర్టీసీ అధికారులు బస్సు కోసం గాలింపు చేపట్టారు. పలుచోట్ల సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించిన పోలీసులు.. మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో తూప్రాన్ ప్రాంతంలో తిరిగినట్టు ఆధారాలు సేకరించారు. ఆ దిశగా విచారణ చేపట్టిన పోలీసులు గురువారం నాందేడ్‌లో బస్సును గుర్తించారు. బస్సును అపహరించిన వ్యక్తులు దాని రూపురేఖలు మార్చేందుకు ఆ బస్సును క్రాష్ చేస్తున్న సమయంలో అఫ్జల్ గంజ్ పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు రావడం గమనించిన నిందితులు అక్కడి నుంచి పరారు అయ్యారు. దీంతో బస్సు క్రాష్ చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. -
కృష్ణా జిల్లాలో తెలంగాణ ఆర్టీసీ బస్సు బోల్తా
-
ఎయిర్‌పోర్ట్‌లో ఆర్టీసీ నిర్లక్ష్యం.. మంత్రి ఆగ్రహం!
సాక్షి, హైదరాబాద్: నగరానికి విమానంలో వచ్చిన ఓ ప్రయాణికుడు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తెలంగాణ ఆర్టీసీ నిర్లక్ష్యం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కరీంనగర్ వెళ్లేందుకు తాను ముందుగానే టికెట్ బుక్ చేసుకున్నప్పటికీ.. అక్కడ బస్సు అందుబాటులో లేకపోవడం.. వాకబు చేసేందుకు కనీసం సిబ్బంది కూడా లేకపోవడంతో షాక్ తిన్నారు. దీంతో వెంటనే ఆయన రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి ఎస్సెమ్మెస్స్ ద్వారా ఫిర్యాదు చేయగా.. ఆయన వెంటనే స్పందించి.. సదరు ప్రయాణికుడికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించడమే కాకుండా.. ఆర్టీసీ సిబ్బంది నిర్లక్ష్యంపై విచారణకు ఆదేశించారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. కరీంనగర్‌కు చెందిన శంకరయ్య, ఆయన కుమారుడు అరవింద్ ఆదివారం ఉదయం అహ్మదాబాద్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆర్టీసీ బస్సులో కరీంనగర్ వెళ్లేందుకు ముందుగానే వారు ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్నారు. బస్సు ఉదయం 10.30 గంటలకు రావాల్సి ఉండగా.. ఎంత వేచి చూసినా అది రాలేదు. దీంతో వాకబు చేసేందుకు ఆర్టీసీ కౌంటర్ వద్దకు వెళ్లగా.. అక్కడ సిబ్బంది ఎవరూ లేకపోవడం వారికి విస్మయం కలిగించింది. దీంతో వెంటనే ఆర్టీసీ సిబ్బంది నిర్లక్ష్యంపై మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి ఎస్సెమ్మెస్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై వెంటనే స్పందించిన మంత్రి సంబంధిత అధికారులను ఆరాతీసి.. బస్సును ఏర్పాటుచేశారు. అంతేకాకుండా ఆర్టీసీ సిబ్బంది అలసత్వంపై విచారణకు ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిని సస్పెండ్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. -
రోడ్డెక్కిన ఎలక్ట్రిక్ బస్సులు
-
తండ్రి, కూతురిని చిదిమేసిన ఆర్టీసీ బస్సు
పుల్కల్(అందోల్): ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో బైక్‌పై వెళ్తున్న తండ్రి, కూతురు మృతి చెందిన విషాదకరమైన సంఘటన మండల పరిధిలోని శివంపేట బ్రిడ్జిపై జరిగింది. ప్రమాదంలో చిన్నారి తల్లితోపాటు వారి బంధువైన మరో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. పుల్కల్ ఎస్ఐ ప్రసాదరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. టేక్మాల్ మండలం కాదులూర్ గ్రామానికి చెందిన రమేశ్(28), అతడి భార్య లక్ష్మి, మూడేళ్ల కూతురు మీనాక్షి, అక్క కొడుకు శ్రీహరిని తీసుకొని బైక్‌పై కూకట్పల్లి వెళ్లేందుకు బుధవారం ఉదయం 7.30 గంటలకు బయలుదేరాడు. వారు శివంపేట బ్రిడ్జి వద్దకు రాగానే సంగారెడ్డి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వచ్చి వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రమేష్, అతడి కూతురు మీనాక్షి బస్సు కింద పడ్డారు. తనతో పాటు మేన అల్లుడు శ్రీహరి బస్ తగిలిన వెంటనే కింద పడిపోయామని ఆసుపత్రికి వచ్చే వరకు ఏం జరిగిందో తెలియదని లక్ష్మి తెలిపారు. ఇదిలా ఉండగా ఈ ప్రమాదంలో గాయపడిన శ్రీహరి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించినట్లుగా పోలీసులు తెలిపారు. లక్ష్మి ప్రస్తుతం సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రిలో చికిత్సపొందుతోంది. రమేశ్, మీనాక్షి మృతదేహాలకు పోస్టుమార్టం చేసి కుటుంబ సభ్యులకు అప్పగించామని పోలీసులు తెలిపారు.ఇదిలా ఉండగా బ్రిడ్జిపై ప్రమాదం చోటుచేసుకోవడంతో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో సంగారెడ్డి రూరల్ పోలీసులతోపాటు ట్రాఫిక్ సీఐ, పుల్కల్ ఎస్ఐలు ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు తీవ్రంగా శ్రమించారు -
కన్నీటిపేట
-
కొండగట్టు ప్రమాదం: 60కి చేరిన మృతుల సంఖ్య
సాక్షి, జగిత్యాల : అంజన్న భక్తులకు కొండంత విషాదాన్ని మిగిల్చిన బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. కరీంనగర్ ప్రైవేట్ ఆస్పత్రిలో ఒకరు, హైదరాబాద్‌లో మరొకరు మృతి చెందడంతో మరణించిన వారి సంఖ్య 60కి చేరింది. తీవ్ర గాయాలపాలైన మరో 41మంది కరీంనగర్, హైదరాబాద్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయ ఘాట్ రోడ్డు వద్ద మంగళవారం ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 101 మంది ప్రయాణిస్తున్నట్లు తెలిసింది. సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడంతో అదుపు తప్పి బస్సు లోయలో పడింది. ఈ విషాదకర ఘటనలో 60 మంది మృతి చెందగా, క్షతగాత్రులను కరీంనగర్, హైదరాబాద్ ఆస్పత్రులకు తరలించారు. కాగా బాధిత కుటుంబాలకు తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు 5 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన విషయం తెలిసిందే. సంబంధిత కథనాలు... దేశ చరిత్రలోనే అతిపెద్ద బస్సు ప్రమాదం కొండగట్టు బస్సు ప్రమాదం; మృతుల వివరాలు నిర్లక్యం ఖరీదు! -
నిర్లక్ష్యమే మృత్యుకుహరానికి కారణం
-
‘ఆర్టీసీ తప్పిదం వల్లే ప్రమాదం జరిగింది’
సాక్షి, కొండగట్టు: జగిత్యాల జిల్లా కొండగట్టులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదానికి ఆర్టీసీ, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమే కారణమని వారు మండిపడుతున్నారు. ఈ ఘటనపై స్థానికులు సాక్షితో మాట్లాడుతూ.. ‘ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. శనివారంపేట నుంచి జగిత్యాల వెళ్లే ఆర్టీసీ బస్సులు మాములుగా దొంగలమర్రి, నాచుపల్లి మీదుగా వెళ్లాలి. కానీ గత పది రోజులుగా బస్సులు కొండగట్టు ఘాట్ రోడ్డు మీదుగా వెళ్తున్నాయి. ప్రమాదం జరిగిన బస్సులో పరిమితికి మించి ప్రయాణికులు ఉండటం, బస్సు కండీషన్లో లేకపోవడం ప్రమాదానికి ఒక కారణం అయి ఉండొచ్చు. మూల మలుపు వద్ద బస్సు అదుపు తప్పడంతోనే ప్రమాదం జరిగింది. మేము ఇక్కడికి చేరుకున్నప్పుడు ఇరవై మంది మృతి చెందారు. ఇది పూర్తిగా అధికారుల నిర్లక్ష్యం, ఆర్టీసీ తప్పిదం వల్లే జరిగింద’ ని తెలిపారు. ‘ఈ రూట్లో అసలు బస్సును నడపాల్సింది కాదు. దీనికి కారణమైన జగిత్యాల డిపో మేనేజర్, ఆర్టీసీ డీఎంపై చర్యలు తీసుకోవాలి. ఈ రోడ్డుపై గతంలో లారీ ప్రమాదం జరిగిందని.. అయినా ఘాట్ రోడ్డు భద్రతపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి, గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాల’ని స్థానికులు కోరుతున్నారు. కాగా ఈ ప్రమాదంలో 55మంది మృతి చెందారు. గాయపడిన వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. -
బస్సు ప్రమాదం: జగిత్యాల ఆస్పత్రి వద్ద తీవ్ర విషాదఛాయలు!
-
కొండగట్టు బస్సు ప్రమాదం; మృతుల వివరాలు
సాక్షి, కొండగట్టు: జగిత్యాల జిల్లా కొండగట్టులో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో 57 మంది మృతిచెందారు. ఆర్టీసీ, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 88 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. ప్రమాదంలో గాయపడ్డ వారికి జగిత్యాల, కరీంనగర్‌లలో చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో మహిళలు అధికంగా ఉన్నారు. మృతుల వివరాలు: 1. నామాల మౌనిక (23), శనివారంపేట 2. బైరి రిత్విక్(3), రామసాగర్ 3. పోలు లక్ష్మి(50), హిమ్మత్ రావుపేట 4. చెర్ల లక్ష్మి (45), హిమ్మత్ రావుపేట 5. గండి లక్ష్మీ (60), శనివారంపేట 6. డబ్బు అమ్మయి(50) D/o తిమ్మయ్య, డబ్బు తిమ్మయ్యపల్లి 7. బండపల్లి చిలుకవ్వ(76) 8. గోలి అమ్మాయి(44), శనివారంపేట 9. తిప్పర్తి వెంకటరత్నం(56), తిరుమలాపూర్ 10. కంకణాల ఎల్లవ్వ(70), సండ్రలపల్లి 11. లాంబ కిష్టయ్య(65), హిమ్మత్ రావుపేట 12. బందం లస్మవ్వ (65) ముత్యంపేట 13. బొల్లారం బాబు (54), శనివారంపేట 14. లైసెట్టి చంద్రకళ (45), శనివారంపేట 15. ఎండ్రికాల ఎంకవ్వ, శనివారంపేట 16.ఎండ్రికాల సుమ(30), శనివారంపేట 17. ర్యాగాల రాజవ్వ (56), డబ్బు తిమ్మయ్యపల్లి 18. ఉత్తమ్ నందిని , కోనాపూర్ 19. మల్యాల అనిల్(19), హిమ్మత్ రావుపేట 20. గాజుల చిన్నయ్య (60), s/o హన్మంతు, డబ్బు తిమ్మయ్యపల్లి 21. శామకూరా మల్లవ్వ (38), తిర్మలాపూర్ 22. సలేంద్ర వరలక్ష్మి (28), శనివారంపేట 23. కుంబాల సునంద (45), శనివారంపేట 24. గుడిసె రాజవ్వ (50), శనివారంపేట 25. పందిరి సత్తెవ్వ (75), హిమ్మత్ రావుపేట 26. దాసరి సుశీల (55), తిరుమలపూర్ 27. డ్యాగల ఆనందం(55), రామసాగర్ 28. నేదునూరి మదనవ్వ(75), హిమ్మత్ రావుపేట 29. చెర్ల హేమా(30), హిమ్మత్ రావుపేట 30. పిడుగు రాజిరెడ్డి(55), డబ్బు తిమ్మయ్యపల్లి 31. చెర్ల గంగయ్య(75), శనివారం పేట 32. ఒడ్నాల లస్మవ్వా (48), తిమ్మయ్యపల్లి 33. ఒడ్నాల కాశిరం(55), తిమ్మయ్యపల్లి 34. గోల్కొండ లచవ్వ(51), డబ్బు తిమ్మయ్యపల్లి 35. గోల్కొండ దేవయ్య (63), డబ్బు తిమ్మయ్యపల్లి 36.కొండ అరుణ్ సాయి(5), కోరెం 37. బొంగని మదునయ్య(55), రాంపెల్లి 38. ఓత్యం భూలక్మి(40), కొనపూర్ 39. సోమిడి పుష్ప(45), తిర్మల్పూర్ 40. బొంగోని భూమక్క(55), పెద్దపల్లి 41. వేముల భాగ్యవ్వ(50), హిమ్మత్ రావుపేట 42. బాలసాని రాజేశ్వరి(40), రేకుర్తి 43. తిరుమాని ముత్తయ్య(40), రామసాగర్ 44. బొంగోని రాంచరణ్ (09), రాంపెల్లి 45. చిర్రం పూజిత (15, జగిత్యాల 46. ఆరె మల్లయ్య, హిమ్మత్ రావుపేట 47. మేడి చెలిమల రాజేషం (70), రాంసాగర్ 48. చెర్ల మౌనిక (24), రాంసాగర్ 49. డ్రైవర్ శ్రీనివాస్ (ఆర్టీసీ డ్రైవర్) 50. మేడి చెలిమల గౌరీ (48), రాంసాగర్ 51.పడిగెల స్నేహలత (22), హిమ్మత్‌రావుపేట 52. డ్యాగల స్వామి (32), రాంసాగర్ 53. గాజుల శ్రీహర్ష (02), శనివారంపేట 54. తైదల పుష్ప (40), తిర్మలాపూర్ 55. పుండ్రా లలిత (36), డబ్బు తిమ్మాయిపల్లి 56. పోతుగంటి జ్యోత్స్నా (27), మల్యాల 57. గోలి రాజమల్లు (60), శనివారంపేట -
అప్డేట్స్: బస్సులో మొత్తం 101 మంది.. 60 మంది దుర్మరణం..!
సాక్షి, కొండగట్టు : జగిత్యాల జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయ ఘాట్ రోడ్డులో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. సామర్థ్యానికి మించి ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఘోర రోడ్డు ప్రమాదంలో 60 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో 30పైగా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 101 మంది ప్రయాణిస్తున్నట్లు అధికారుల సమాచారం. సంఘటనా స్థలానికి బస్సు చేరుకునే సమయానికి కండక్టర్ 82 మందికి టికెట్ ఇచ్చారు. మిగతావారికి టికెట్ ఇవ్వాల్సి ఉంది. అంతలోపే ఈ ఘోరం జరిగిపోయింది. జగిత్యాల జిల్లా శనివారంపేట నుంచి బయలుదేరిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి.. కొండగట్టు ఘాట్ రోడ్డులోయలో పడిపోవడంతో ఈ ప్రదేశంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన అప్డేట్స్... సాయంత్రం 5. 30 గంటలు: కొండగట్టు ఘాట్‌రోడ్డులో చోటుచేసుకున్న ఘోర బస్సుప్రమాదం కేసులో విచారణ ప్రారంభమైంది. ఈ ఘటన నేపథ్యంలో జగిత్యాల ఆర్టీసీ డిపో మేనేజర్ హనుమంతరావుపై సస్పెన్షన్ వేటు వేశారు. ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. సాయంత్రం 5. 30 గంటలు: కొండగట్టు ఘాట్‌రోడ్డులో ఘోర బస్సు ప్రమాదం జరిగిన సంఘటనాస్థలాన్ని ఆపద్ధర్మ మంత్రులు కేటీఆర్, మహేందర్‌రెడ్డి, ఎంపీ కవిత పరిశీలించారు. ప్రమాదం ఎలా జరిగిందనే వివరాలను అధికారులు వారికి వివరించారు. మృతుల కుటంబాలను ఆదుకుంటామని, గాయపడిన వారికి పూర్తి చికిత్స అందించడంతోపాటు అండగా ఉంటామని కేటీఆర్, మహేందర్‌రెడ్డి భరోసా ఇచ్చారు. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. సాయంత్రం 5.30 గంటలు: కొండగట్టు బస్సుప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు, గాయపడిన వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. The bus accident in Telangana’s Jagtial district is shocking beyond words. Anguished by the loss of lives. My thoughts and solidarity with the bereaved families. I pray that the injured recover quickly. — Narendra Modi (@narendramodi) 11 September 2018 సాయంత్రం 4.30 గంటలు: కొండగట్టు అంజన్న దర్శనానికి వెళ్లిన తమవారు.. రోడ్డుప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. మృతదేహాలను తరలించిన జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణ బంధువుల రోదనలతో ఉద్విగ్నంగా మారిపోయింది. ఆస్పత్రి వద్ద తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. తమవారిని మృత్యువు కబళించడంతో.. అయినవారు, ఆత్మీయులు బంధువులు గుండెలు అవిసేలా విలపిస్తున్నారు. ఆస్పత్రి వద్ద మహిళలు గుండెలు బాదుకొని రోదిస్తున్న దృశ్యాలు చూపరులను సైతం కంటతడి పెట్టిస్తున్నాయి. కొండంత విషాదం.. ఎవరిది నిర్లక్ష్యం.. ఎన్నెన్నో ప్రశ్నలు.. చదవండి కొండగట్టు బస్సుప్రమాదంపై పూర్తి కథనాలు అంజన్న భక్తులకు విషాదం ఊపిరాడకపోవడం వల్లే ఎక్కువ మంది మృతి దేశంలో అతి పెద్ద బస్సు ప్రమాదాలు కొండగట్టు బస్సు ప్రమాదం; మృతుల వివరాలు బస్సు ప్రమాదం: అడ్డదారే కొంప ముంచింది! కొండగట్టు ప్రమాదం: డ్రైవర్ తప్పిదం వల్లే? సాయంత్రం 4 గంటలు: కొండగట్టు ఘాట్‌రోడ్డులో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘తెలంగాణలో జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు, గాయపడిన వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం క్షతగాత్రులను ఆదుకుంటోందని ఆశిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు. ఈ ఘటనపై తెలుగులో, ఆంగ్లంలో ఆయన ట్వీట్ చేశారసు. తెలంగాణలో జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు మరియు గాయపడిన వారికి నా ప్రఘాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం క్షతగాత్రులను ఆదుకుంటోందని ఆశిస్తున్నాను. — President of India (@rashtrapatibhvn) 11 September 2018 Shocked to learn about the bus accident in Jagtial, Telangana. Thoughts with the bereaved families and those injured. I understand local authorities are making efforts to rescue and help passengers who have suffered #PresidentKovind — President of India (@rashtrapatibhvn) 11 September 2018 మధ్యాహ్నం 3.30 గంటలు: కొండగట్టు బస్సు ప్రమాదం పట్ల నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆమె కోరారు. మధ్యాహం 3 గంటలు: కొండగట్టు వద్ద బస్సు ప్రమాదంలో ప్రమాదవశాత్తు మరణించిన వారి కుటుంబాలకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధర్మపురి అరవింద్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని, మరణించిన వారి కుటుంబాలకు ప్రకటించిన రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియాను వెంటనే అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రమాదంలో పసిపిల్లలు కూడా ఉన్నారని, గాయపడిన పిల్లలు అత్యవసరస్థితిలో ఉంటే ఆసుపత్రులు వారిని వెంటనే చేర్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. క్షతగాత్రులు పేదవారైతే వారికి అరవింద్ ధర్మపురి ఫౌండేషన్ తరఫున సహాయం అందిస్తామని తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలు: జగిత్యాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించనున్న మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత, మంత్రి మహేందర్‌రెడ్డి.. మరికాసేపట్లో హెలికాప్టర్లో వెళ్లనున్న నేతలు -
బస్సు ప్రమాదం: అడ్డదారే కొంప ముంచింది!
సాక్షి, కొండగట్టు : జగిత్యాల జిల్లా కొండగట్టులో చోటుచేసుకున్న ఘోర ప్రమాదానికి ఆర్టీసీ, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. గతంలో ఇదే చోట ఓ లారీ ప్రమాదంలో సుమారు 20 మంది మృతి చెందారు. ఆ తర్వాత ఇంతటి పెద్ద ప్రమాదం చోటుచేసుకోవడం ఇదే తొలిసారి. లారీ ప్రమాదమప్పుడే అధికారులు ఈ ఘాట్ రోడ్డుపైకి భారీ వాహనాలను నిషేదించారు. కేవలం బైక్స్‌ను మాత్రమే అనుమతించేవారు. దీనికి సంబంధించి హెచ్చరిక బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. ఈ రోడ్డుకు ప్రత్యామ్నయంగా బైపాస్ రోడ్డు కూడా ఉంది. కానీ గత మూడు నెలల నుంచి ఆర్టీసీ బస్సులు, ప్రయివేట్ వాహనాలను మళ్లీ అనుమతిస్తున్నారు. ఘాట్ రోడ్డు నుంచి హైవేపైకి కిలోమీటర్ దూరం ఉంటుంది. ప్రత్యమ్నాయ రోడ్డు ఉపయోగిస్తే మరో ఐదు కిలోమీటర్లు ఎక్కువగా ప్రయాణించాల్సి వస్తుంది. దీంతోనే ఆర్టీసీ అధికారులు డిజీల్‌కు కక్కుర్తిపడి బస్సులను షార్ట్‌కట్‌గా భావించిన ఘాట్‌రోడ్డు రూట్లో నడిపిస్తున్నారు. ఘాట్ రోడ్డు నిర్మాణం కూడా ఆర్అండ్బీ నిబంధనలకు విరుద్దంగా ఉందని గతంలోనే అధికారులు గుర్తించారు. ప్రభుత్వానికి కూడా నివేదిక పంపించారు. ఘాట్ రోడ్డుకు ఇరువైపుల గోడను నిర్మించాలని కూడా నిర్ణయించారు. ఆ గోడ నిర్మాణం చేబడితే ఈ ఘోర ప్రమాధం సంభవించేది కాదని, వారి నిర్లక్ష్యంతో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారని స్థానికులు అధికారుల తీరుపట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 57మంది ప్రాణాలు కోల్పోయారు. -
అంజన్న భక్తులకు విషాదం
సాక్షి, కొండగట్టు : జగిత్యాల జిల్లాలో పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఘాట్ రోడ్డులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 57 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. జగిత్యాల జిల్లా శనివారంపేట నుంచి బయలు దేరిన ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తు కొండగట్టు ఘాట్ రోడ్డు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో కొండగట్టుకు వచ్చిన హనుమాన్ భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం కావడంతో కొండగట్టుకు హనుమాన్ భక్తుల తాకిడి ఎక్కుగా ఉంది. దర్శనం చేసుకున్న భక్తులు తిరుగు ప్రయాణంలో అధిక సంఖ్యలో బస్సెక్కారు. దీంతో ఓవర్లోడైన బస్సు అదుపు తప్పి లోయలో పడ్డట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కొండగట్టులో బస్సెక్కిన భక్తులకు కొద్ది క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోయారు. మరో మూడు కిలోమీటర్లు దూరం వెళ్తే బస్సు జగిత్యాల హైవే ఎక్కేది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 88 మంది ప్రయాణీకులున్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. తమ ఇష్టదైవం దగ్గరకు వచ్చిన భక్తులు ఊహించని ప్రమాదంలో మరణించారు. నిమిష నిమిషానికి మృతుల సంఖ్య పెరుగుతోంది. మృతుల్లో అధిక సంఖ్యలో చిన్నారులు, మహిళలు, వృద్ధులు ఉన్నారు. ఊపిరాడకనే ఎక్కువ మంది చనిపోయినట్లు తెలుస్తోంది. అప్పటివరకు తమతో కలిసి ప్రయాణం చేసిన వారిలో చాలా మంది నిర్జీవులుగా మారడంతో బాధితుల దుఃఖానికి అంతేలేకుండా పోయింది. జగిత్యాల ఆసుపత్రి ప్రాంగణం బాధితుల ఆర్తనాదాలతో దద్దరిల్లుతోంది. -
ఊపిరాడకపోవడం వల్లే ఎక్కువ మంది మృతి
సాక్షి, కొండగట్టు: అంజన్న దర్శనం పూర్తి చేసుకొని మరికొద్ది నిమిషాల్లో ఇంటికి చేరుతామనుకున్న భక్తుల ప్రాణాలు అనంత వాయువులో కలిసిపోయాయి. ఈ ఘోరప్రమాదంలో 57 మందికిపైగా మృత్యువాత పడ్డారు. మరికొంత మందికి తీవ్ర గాయలపాలయ్యారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పుత్రులకు తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 88 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ఘాట్ రోడ్ వద్ద బస్సు మలుపు తిప్పుతున్నప్పుడు ప్రయాణికులు ఒక వైపే ఒరగడంతో బస్సు అదుపు తప్పి లోయలో పడి వుంటుందని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. నిమిష నిమిషానికి మృతుల సంఖ్య పెరుగుతోంది. మృతుల్లో అధిక సంఖ్యలో చిన్నారులు, మహిళలు, వృద్ధులు ఉన్నారు. ఊపిరాడకనే ఎక్కువ మంది చనిపోయినట్లు తెలుస్తోంది. బస్సులో ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని భావిస్తున్నారు. మంగళవారం కూడా కావడంతో కొండగట్టుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తుల రద్దీకి తగ్గట్టుగా ఆర్టీసీ.. బస్సులు ఏర్పాటు చేయలేకపోయింది. దీంతో ఏపీ 28 జెడ్ 2319 నంబర్ ఆర్టీసీ బస్సు 88మందితో శనివారంపేట నుంచి జగిత్యాలకు బయలుదేరింది. రెగ్యులర్ డ్రైవర్ కాకుండా కొత్త డ్రైవర్ బస్సును నడిపిస్తున్నారు. డ్రైవర్ మలుపులను అంచనా వేయలేకపోయాడని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ శ్రీనివాస్ రెండు కాళ్లు విరిగిపోయాయి. అదే విధంగా ఘాట్ రోడ్డు వెడల్పు లేకపోవడం కూడా ప్రమాదానికి కారణమని స్థానికలు పేర్కొన్నారు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఈ రహదారులను పట్టించుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదం స్థలం వద్ద మృతిచెందిన వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. -
కొండగట్టలో ఘోర రోడ్డు ప్రమాదం ఫోటోలు
-
కొండగట్టు ప్రమాదం: డ్రైవర్ తప్పిదం వల్లే?
సాక్షి, కొండగట్టు: ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురి కావడంతో 57 మందికిపైగా మృతి చెందగా, మరి కొంత మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కొండగట్టులో చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి గల కారణాలను వేములవాడ డిపో మేనేజర్ వెల్లడించారు. ఈ ఘోర ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తామని తెలిపారు. అయితే బస్సు కండీషన్లోనే ఉందని.. డ్రైవర్ తప్పిదం వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఘాట్ రోడ్డుపై సైన్ బోర్డులు ఉన్నప్పటికి ఈ ప్రమాదం జరగడం బాధకరం అని పేర్కొన్నారు. బస్సు శనివారంపేట నుంచి కొండగట్టుకు బయలుదేరిందని తెలిపారు. బస్సులో ఎక్కువ శాతం మంది స్థానికులు ఉన్నట్లు చెప్పారు. సహాయక చర్యల కోసం స్థానికుల సహాయం తీసుకుంటున్నామని పేర్కొన్నారు. (ఈ విషాద ఘటనకు సంబంధించిన మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
దేశ చరిత్రలోనే అతిపెద్ద బస్సు ప్రమాదం!
కొండగట్టు: జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్ రోడ్డు వద్ద ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 60 మంది దుర్మరణం పాలయ్యారు. గాయపడిన వారిలో 15 మందికి జగిత్యాల ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. 25 మంది ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. బస్సు కొండగట్టు నుంచి జగిత్యాల వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 101 మంది వరకు ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి కారణమైన బస్సు జగిత్యాల డిపోకు చెందినదిగా గుర్తించారు. 44 మృతదేహాలను జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరో ఐదు మృతదేహాలు కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బస్సులో ప్రయాణిస్తున్న వారందరూ కొండగట్టు అంజన్న స్వామి భక్తులు. దేశ ఆర్టీసీ చరిత్రలోనే ఇది అతిపెద్ద ప్రమాదంగా భావిస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని, మృతుల్లో డ్రైవర్ కూడా ఉన్నాడని తెలుస్తోంది. కొండగట్టు ఘాట్ రోడ్డులో బస్సు కిందకు దిగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సు మరో నిమిషంలో ప్రధాన రహదారికి చేరుకుంటుందనగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఘటనా స్థలంలో బాధితుల ఆర్తనాదాలు, బంధువుల రోదనలతో విషాద వాతావరణం నెలకొంది. ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. మృతుల్లో ఎక్కువగా 25 మంది మహిళలు, ఏడుగురు చిన్నారులు ఉన్నారు. సహాయక చర్యల్లో స్థానికులు నిమగ్నమయ్యారు. బస్సులో చిక్కుకున్న క్షతగాత్రులను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. బస్సులో పరిమితికి మంచి ప్రయాణికులు ఉండటంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగినట్టు అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రమాద సమయంలో బస్సు ఒక పక్కకు ఒరిగిపోవడంతో అందరూ ఒకరిపై ఒకరు పడి ఊపిరి ఆడక పిల్లలు, మహిళలు ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి ఈ దుర్ఘటనపై తెలంగాణా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సహాయక చర్యలను పర్యవేక్షించాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అటు ఆపద్ధర్మ ఆర్థిక శాఖమంత్రి ఈటల రాజేందర్ స్పందిస్తూ సంఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జగిత్యాల కలెక్టర్, ఎస్పీ సహాయక చర్యల్లో నిమగ్నమైనట్టు చెప్పారు. ప్రభుత్వం తరపున క్షతగాత్రులకు వైద్య సహాయం అందిస్తున్నట్టు తెలిపారు. ప్రమాదం చాలా బాధాకరం: రవాణ మంత్రి కొండగట్టు రోడ్డు ప్రమాదం చాలా బాధాకరమని ఆపద్ధర్మ రవాణ మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. ఈ కొండపై తొలిసారి ఇంత పెద్ద ప్రమాదం జరిగిందన్నారు. తను ఘటనాస్థలికి బయలు దేరుతున్నానని, ఇప్పటికే జిల్లా అధికారులు, మంత్రి ఈటల రాజేందర్ అక్కడికి చేరుకున్నారని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించినట్లు స్పష్టం చేశారు. ప్రమాద వివరాలను ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి బాధితులను ఆదుకుంటామన్నారు. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి కొండగట్టు ఆర్టీసీ ప్రమాదం పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. చంద్రబాబు దిగ్భ్రాంతి అమరావతి : కొండగట్టు రోడ్డుప్రమాదంపై ఏపీ శాసనమండలిలో సీఎం చంద్రబాబునాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని ఆయన కోరారు. (ఈ విషాదానికి సంబంధించిన మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఆర్టీసీ బస్సులో పైరసీ సినిమా.. కేటీఆర్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో పైరసీ సినిమాలు ప్రదర్శించడంపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ సిబ్బంది వ్యవహరించిన తీరుపై ఆయన మండిపడ్డారు. న్యాచురల్ స్టార్ నాని తాజా చిత్రం ‘కృష్ణార్జున యుద్ధం’ విడుదలైన మరుసటి రోజే టీఎస్ఆర్టీసీ గరుడ బస్సులో ప్రదర్శించారు. ఈ విషయాన్ని సునీల్ కొప్పరపు అనే యువకుడు కేటీఆర్‌కు ట్వీట్ చేశాడు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వస్తున్న గరుడ బస్సులో కృష్ణార్జున యుద్దం పైరసీని వేశారని స్క్రీన్ షాట్‌తో సహా కేటీఆర్‌కు ట్వీట్లో తెలిపాడు. ప్రభుత్వ సంస్థల్లోనే పైరసీ జరుగుతుంటే, ఫైరసీనీ నియంత్రించాలని సామాన్యుడిని ఎలా అడుగుతారని సునీల్ ప్రశ్నించాడు. దీంతో యువకుడి ట్వీట్‌కు కేటీఆర్ వెంటనే స్పందించారు. ఆర్టీసీ సిబ్బంది తీరుపై మండిపడిన ఆయన.. ఇలాంటివి మళ్లీ జరగకుండా చూడాలని సంస్ధ ఎండీని కోరారు. కాగా, కేటీఆర్ వెంటనే స్పందించడంతో సునీల్ ఆయనకు ధన్యవాదాలు తెలిపాడు. ఏదైనా ఘటనలు జరిగినప్పుడు కేటీఆర్ స్పందించే తీరుపై అతడు హర్షం వ్యక్తం చేశాడు. @NameisNani @tsrtc @KTRTRS privacy failure on bus travel. Garuda Volvo bus trip to Bengaluru from hyd. How can you ask a common man avoid privacy when an institute fails. Movie released yesterday. #krishnarjunayudham #avoidprivacy details of bus can be given on DM pic.twitter.com/VLPP0ks6xU — Sunil Kopparapu (@Sunil_santiago) April 15, 2018 That’s extremely irresponsible on the part of the @TSRTCHQ staff of this bus. Request JMD of @TSRTCHQ to make sure to act and prevent recurrence https://t.co/lR2Ga8Wy70 — KTR (@KTRTRS) April 15, 2018 Typo Piracy. @KTRTRS thanks for quick response. Happy to see your quick actions everytime you see something wrong happens. https://t.co/bJuiNokFWQ — Sunil Kopparapu (@Sunil_santiago) April 15, 2018 -
ఆర్టీసీ బస్సులో అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే
-
బస్సులను తగలబెట్టిన మావోయిస్టులు
-
ఎదురుదాడికి దిగిన మావోయిస్టులు
చర్ల: ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌కు మావోయిస్టులు ప్రతికార చర్యలకు దిగారు. తెలంగాణ హైదరాబాద్ డిపోకు చెందిన ఎక్స్‌ప్రెస్ బస్సు, మరో ప్రైవేట్ సర్వీసును మావోయిస్టులు దగ్ధం చేశారు. హైదరాబాద్ నుంచి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని జగ్దల్పూర్కు ఆర్టీసీ బస్సు వెళుతుండగా.. సుకుమా జిల్లా దోర్నపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుర్తి గ్రామ సమీపంలో మావోయిస్టులు నిలిపివేసి, ప్రయాణికులను కిందకు దించేశారు. ఆ తరువాత బస్సు డీజిల్ ట్యాంక్‌ను పగులగొట్టి, ఆయిల్‌ను బస్సులో చల్లి నిప్పంటించారు. ఇదే మార్గం గుండా వెళ్తున్న మరో ప్రైవేటు బస్సు, టిప్పరు, ఒక ట్రాక్టర్‌ను సైతం దగ్ధం చేశారు. ప్రయాణికులు చూస్తుండగానే ఒకరిని కాల్చి చంపారు. మృతుడు కానిస్టేబుల్‌గా భావిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో ఈ నెల 1న జరిగిన ఎన్‌కౌంటర్‌ను నిరసిస్తూ, ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. బస్సులోని ప్రయాణికులు, డ్రైవర్లు సమీపంలోని సీఆర్పీఎఫ్ క్యాంపునకు చేరుకున్నట్లు సమాచారం. మరోవైపు మావోయిస్టులు ఎదురుదాడి నేపథ్యంలో ఇంటలిజెన్స్ వర్గాల హెచ్చరికల నేపధ్యంలో తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు హైదరాబాద్‌కు బయల్దేరారు. అలాగే ఖమ్మం, భూపాల్పల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ముందస్తు సమాచారం ఇచ్చి పర్యటించాలని పోలీసు శాఖ సూచించింది. -
డ్రైవర్‌కి ఫిట్స్... ప్రయాణీకులకు తప్పిన ప్రమాదం
నిజామాబాద్ : విధుల్లో ఉన్న ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు ఫిట్స్ వచ్చాయి. అయితే వెంటనే అప్రమత్తమైన అతడె బస్సును నిలిపివేశాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి ఆదివారం చోటు చేసుకుది. జిల్లాలోని కామారెడ్డి డిపోకు చెందిన టీఎస్ఆర్టీసీ బస్సు నిజామాబాద్ వెళుతుండగా డిచ్పల్లి బస్టాండ్ వద్ద డ్రైవర్ అంజన్గౌడ్కు ఆకస్మాత్తుగా ఫిట్స్ వచ్చాయి. దాంతో డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన ఆపివేశాడు. దీంతో బస్సులోని ప్రయాణీకులకు ప్రాణాపాయం తప్పింది. -
కాల్వలోకి దూసుకెళ్లిన బస్సు
విజయవాడ : విజయవాడ సమీపంలోని గొల్లపూడి శ్రీచైతన్య కాలేజీ సమీపంలో నల్గొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సోమవారం కాల్వలోకి దూసుకు వెళ్లింది. అయితే ఈ ఘటనలో బస్సులోని ప్రయాణీకులు ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. బస్సు నల్గొండ నుంచి విజయవాడ వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించే క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. క్రేన్ల సాయంతో బస్సును కాల్వ నుంచి బయటకు తీశారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో డ్రైవర్, కండక్టర్‌తోపాటు ఐదుగురు ప్రయాణికులు మాత్రమే ఉన్నారు. -
టీఎస్ ఆర్టీసీ బస్సు, ట్రాక్టర్ ఢీ
హైదరాబాద్: మహారాష్ట్రలో టీఎస్ ఆర్టీసీ బస్సు, ట్రాక్టర్ ఢీకొనడంతో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. బస్సు షిర్డీ నుంచి హైదరాబాద్ వస్తుండగా షోలాపూర్ వద్ద ఈ ఘటన జరిగింది. బస్సులో 43 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో కొందరికి గాయలయ్యాయి.