ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం తీవ్ర నిర్ణయం | Telangana Government Warns RTC Employees To Withdraw Strike | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం తీవ్ర నిర్ణయం

Published Sat, Oct 5 2019 7:59 AM | Last Updated on Thu, Mar 21 2024 11:35 AM

ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. సమ్మెను వీడి విధుల్లో చేరాలని, లేదంటే వారిపై వేటు తప్పదని హెచ్చరించింది. శనివారం సాయంత్రం 6 గంటల లోపు ఆర్టీసీ డిపోల్లో రిపోర్టు చేయాలని, అలా చేయని వారిని ఆర్టీసీ ఉద్యోగులుగా పరిగణించబోమని స్పష్టం చేసింది. తమంతట తాముగా ఉద్యోగాలు వదిలిపెట్టిన వారిగా గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విధుల్లో చేరి, బాధ్యతలు నిర్వర్తిస్తున్న కారి్మకులకు పూర్తి స్థాయిలో రక్షణ, ఉద్యోగ భద్రత కలి్పస్తామని పేర్కొంది. విధుల్లో చేరని వారిని తిరిగి ఉద్యోగంలో చేర్చుకోవద్దని నిర్ణయం తీసుకుంది. ఇకపై కారి్మక సంఘాల నేతలతో ఎలాంటి చర్చలు జరపొద్దని ప్రభుత్వం నిర్ణయించింది. చర్చల కోసం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ రద్దయిపోయింది. ఆగమేఘాల మీద రవాణా శాఖ కమిషనర్‌గా సందీప్‌ సుల్తానియాను నియమించింది.  

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement