ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌కు మావోయిస్టులు ప్రతికార చర్యలకు దిగారు. తెలంగాణ హైదరాబాద్ డిపోకు చెందిన ఎక్స్‌ప్రెస్ బస్సు, మరో ప్రైవేట్ సర్వీసును మావోయిస్టులు దగ్ధం చేశారు. హైదరాబాద్ నుంచి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని జగ్దల్‌పూర్‌కు ఆర్టీసీ బస్సు వెళుతుండగా.. సుకుమా జిల్లా దోర్నపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుత్తి గ్రామ సమీపంలో మావోయిస్టులు నిలిపివేసి, ప్రయాణికులను కిందకు దించేశారు.