టోల్‌ప్లాజా వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం | RTC Bus Creates Ruckus At Toll plaza | Sakshi
Sakshi News home page

టోల్‌ప్లాజా వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం

Published Fri, Jan 17 2020 2:16 PM | Last Updated on Fri, Jan 17 2020 5:17 PM

RTC Bus Creates Ruckus At Toll plaza - Sakshi

సాక్షి, యాదాద్రి: ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా అదుపు కోల్పోయిన బస్సు టోల్‌ప్లాజా వద్ద ఆగిన వరుస వెంబడి కార్లను ఢీకొట్టింది. ఈ ఘటనలో మూడు కార్లు ధ్వంసమయ్యాయి. అయితే, అదృష్టవశాత్తు ఎవరూ ఈ ఘటనలో గాయపడలేదు. యాదాద్రి జిల్లాలోని పతంగి టోల్‌ప్లాజా వద్ద ఈ ఘటన జరిగింది. మణుగూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా అదుపు కోల్పోయి.. ముందువరుసలో ఉన్న మూడు కార్లను ధ్వంసం చేసింది. ఈ ఘటనలో ప్రయాణికులెవరికీ గాయాలు కాలేదు. ఒక్కసారిగా బస్సు బ్రేక్ ఫెయిలవ్వడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని ఆర్టీసీ బస్సు డ్రైవర్ చెప్తున్నారు.




No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement