Venky kudumula
-
‘రాబిన్‌హుడ్’ మూవీ రివ్యూ
నితిన్ ఖాతాలో హిట్ పడి చాలా కాలమైంది. భీష్మ(2020) తర్వాత ఆయనకు ఆ స్థాయి విజయం లభించలేదు.దీంతో మళ్లీ భీష్మ దర్శకుడు వెంకీ కుడుములనే నమ్ముకున్నాడు. ఆయన దర్శకత్వంలో ‘రాబిన్‌హుడ్’(Robinhood Review) అనే సినిమాతో నితిన్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి చిత్రంతో నితిన్ హిట్ ట్రాక్ ఎక్కడా? లేదా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. రామ్ (నితిన్) అనాథ. చిన్నప్పుడు అతన్ని ఓ పెద్దాయన హైదరాబాద్‌లోని ఓ అనాథ ఆశ్రమంలో చేర్పిస్తాడు. అక్కడ తినడానికి తిండిలేక ఇబ్బందిపడుతున్న తోటి పిల్లల కోసం దొంగగా మారతాడు. పెద్దయ్యాక ‘రాబిన్‌హుడ్’ పేరుతో ధనవంతుల ఇళ్లలో చోరీలు చేస్తుంటాడు. అతన్ని పట్టుకోవడం కోసం రంగంలోకి దిగిన పోలీసు అధికారి విక్టర్(షైన్ చాం టాకో) ఈగోని దెబ్బతీస్తూ ప్రతిసారి దొరికినట్లే దొరికి తప్పించుకుంటాడు. దీంతో విక్టర్ రాబిన్‌ని పట్టుకోవడమే టార్గెట్‌గా పెట్టుకుంటాడు. రాబిన్‌కి ఈ విషయం తెలిసి..దొంగతనం మానేసి జనార్ధన్ సున్నిపెంట అలియాస్ జాన్ స్నో(రాజేంద్రప్రసాద్) నడిపే ఒక సెక్యూరిటీ ఏజెన్సీలో జాయిన్ అవుతాడు.(Robinhood Review). అదే సమయంలో ఆస్ట్రేలియాలో సెటిల్ అయిన ఇండియన్ ఫార్మా కంపెనీ అధినేత కుమార్తె నీరా వాసుదేవ్ (శ్రీలీల) ఇండియాకు వస్తుంది. ఆమెకు సెక్యూరిటీగా రాబిన్ వెళ్తాడు. ఇండియాకు వచ్చిన నీరాను గంజాయి దందా చేసే రౌడీ సామి(దేవదత్తా నాగే) మనుషులు బంధించి రుద్రకొండ అనే ప్రాంతానికి తీసుకెళ్తారు? సామి వలలో చిక్కుకున్న నీరాను రాబిన్‌హుడ్ ఎలా రక్షించాడు? నిరాను రుద్రకొండకు ఎందుకు రప్పించారు? రాబిన్‌హుడ్ సడెన్‌గా సెక్యూరిటీ ఏజెన్సీలో ఎందుకు చేరాల్సివచ్చింది? ఈ కథలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..రాబిన్‌హుడ్ కథ అంటే ధనవంతుల నుంచి దొంగిలించి పేదవాళ్లకు పంచే ఒక నీతిగల దొంగ స్టోరీ అందరికి తెలిసిందే. తెలుగు సినిమాల్లో ఈ తరహా కథలు చాలానే వచ్చాయి. కానీ ప్రతి సినిమా దానికి తగ్గట్టుగా కొత్త రంగు, రుచి జోడించి ప్రేక్షకులను అలరించింది. రాబిన్‌హుడ్ కూడా టైటిల్‌కి తగ్గట్టే రాబిన్‌హుడ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రం. కథ పరంగా చూస్తే ఇందులో కొత్తదనం ఏది కనిపించదు. శారీరక బలం కంటే, మానసిక బలాన్ని ఎక్కువగా నమ్ముకునే హీరో.. దొంగతనం చేసి అవసరం ఉన్నవాళ్లకు పంచడం..కథ ఇదే లైన్లో సాగుతుంది. ఇక్కడ హీరో అనాథ పిల్లల కోసం దొంగతనం చేస్తుంటాడు. ఆ పాయింట్ వినగానే అందరికి రవితేజ ‘కిక్’ గుర్తొస్తుంది. కానీ పూర్తిగా ‘కిక్’ థీమ్‌ని అనుసరించలేదు. ( ఇదీ చదవండి: Mad Square Movie Review: 'మ్యాడ్ స్క్వేర్' మూవీ రివ్యూ)కథలో డిఫరెంట్ డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. చివరకు వాటి మధ్య ఉన్న సంబంధం రివీల్ అవుతుంది. ఈ ట్విస్టులు సాధారణ ప్రేక్షకులకు కిక్ ఇస్తాయి. ఫస్టాప్ మొత్తం ఫన్‌జోన్‌లో సాగుతుంది. హీరో చిన్నప్పుడే ఎందుకు దొంగగా మారాల్సి వచ్చిందో తెలియజేస్తూ కథను ప్రారంభించాడు దర్శకుడు. హీరోను పట్టుకోవడానికి వచ్చిన పోలీసులను బురిడి కొట్టించే సీన్లన్ని పాత సినిమాను గుర్తు చేస్తాయి. హీరోయిన్ ఎంట్రీ తర్వాత కథనం కామెడీతో పరుగులు పెడుతుంది. వెన్నెల కిశోర్, రాజేంద్రప్రసాద్ మధ్య వచ్చే సన్నివేశాలల్లో కామెడీ బాగా పండింది(Robinhood Review)ముఖ్యంగా నీరా దగ్గర మంచి మార్కులు కొట్టేసేందుకు జాన్ స్నో చేసే ప్రయత్నాలు నవ్వులు పూయిస్తాయి. కామెడీ సీన్లతో ఫస్టాఫ్ ఎంటర్టైనింగ్గా సాగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంటుంది. ఇక సెకండాఫ్‌లో కథనం కాస్త సాగదీసినట్లుగా అనిపిస్తుంది. విలన్ చుట్టూ సాగే సన్నివేశాలు అంతగా ఆకట్టుకోలేవు. కథనం కూడా కొంతవరకు ఊహకందేలా సాగుతుంది. కొన్ని ట్విస్టులు ఆకట్టుకున్నప్పటికీ.. రాబిన్ అసలు రుద్రకోండకు ఎందుకు వచ్చాడనేది తెలిసిన తర్వాత మళ్లీ రొటీన్ మూడ్‌లోకి వెళ్లిపోతాం. అదే సమయంలో వచ్చిన అదిదా సర్ప్రైజ్ సాంగ్ కాస్త ఉపశమనం కలిగిస్తుంది. ‘ట్రూత్ ఆర్ డేర్’ సీన్ ఒకటి నవ్వులు పంచుతుంది. డేవిడ్ వార్నర్ పాత్ర మినహా క్లైమాక్స్ రొటీన్‌గానే ఉంటుంది. అయితే వార్నర్ పాత్రను సరైన ముగింపు ఇవ్వకుండా.. పార్ట్ 2 కూడా ఉంటుందని హింట్ ఇచ్చేశారు. ఎవరెలా చేశారంటే..రాబిన్‌హుడ్ పాత్రలో నితిన్ చక్కగా నటించాడు. అతని కామెడీ టైమింగ్ సినిమాకు ప్లస్ అయింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో పలు సన్నివేశాల్లో అతని నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. శ్రీలీల పాత్ర పరిమితంగా ఉన్నప్పటికీ, తెరపై చాలా అందంగా కనిపించింది. నటనపరంగా ఆమెకు పెద్దగా స్కోప్ ఉన్న పాత్రమేది కాదు. దేవదత్త పాత్ర మొదట్లో భయపెట్టేలా అనిపించినా, చివర్లో కాస్త నీరసంగా మారి ప్రేక్షకులను నిరాశపరిచింది.రాజేంద్రప్రసాద్, వెన్నెల కిశోర్‌ల కామెడీ బాగా వర్కౌట్ అయింది. ఇద్దరు తమదైనశైలీలో నటించి నవ్వులు పూయించారు.డేవిడ్ వార్నర్ స్క్రీన్‌పై చాలా తక్కువ సమయం కనిపించినప్పటికీ, అతని ఎంట్రీతో థియేటర్లలో విజిల్స్ మారుమోగేలా అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ చూపించాడు. శుభలేక సుధాకర్, షైన్ చాం టాకోతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.సాంకేతికంగా సినిమా పర్వాలేదు. జీవి ప్రకాశ్ నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్లస్ పాయింట్. పాటలు వినడానికి బాగున్నా..తెరపై చూస్తే అంతగా ఆకట్టుకోలేవు. కథలో వాటిని ఇరికించినట్లుగా అనిపిస్తాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాకు భారీగానే ఖర్చు చేసినట్లు సినిమా చూస్తే అర్థమవుతుంది. సినిమాను చాలా రిచ్‌గా తీర్చిదిద్దారు. -
Robinhood: ‘రాబిన్‌హుడ్’ మూవీ ట్విటర్ రివ్యూ
హీరో నితిన్ గత కొంత కాలంగా వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్నాడు. ఆయన ఖాతాలో ఇటీవలి కాలంలో ఒక్క హిట్ సినిమా కూడా లేదు. ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’, ‘మాచర్ల నియోజకవర్గం’, ‘మాస్ట్రో’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమవడంతో నితిన్ మార్కెట్ బాగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో ఆయన తాజా చిత్రం ‘రాబిన్‌హుడ్’తో గట్టి కమ్‌బ్యాక్ ఇవ్వాలని భావిస్తున్నాడు. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హీస్ట్ కామెడీ చిత్రంలో నితిన్‌కి జోడీగా శ్రీలీల నటించింది. ఆస్ట్రేలియా క్రికెటర్ డెవిడ్ వార్నర్ ఓ కీలక పాత్ర పోషించాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ప్రచారచిత్రాలకు మంచి స్పందన లభించింది. దానికి తోడు సినిమా ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో సినిమాపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(మార్చి 28) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘రాబిన్‌హుడ్’కథేంటి? ఎలా ఉంది? తదితర విషయాలను ఎక్స్(ట్విటర్) వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చదివేయండి. ఇది కేవలం నెటిజన్ల అభిప్రాయం మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు.రాబిన్‌హుడ్ చిత్రానికి ఎక్స్‌లో మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమా బాగుందని కొందరు అంటుంటే...యావరేజ్ అని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. Done with my show,good 2nd half, where each & every episode worked out except cringe Leela portions. David Bhai cameo at the end is hilarious!!adidha suprisu song is good..!! Overall a decent commercial entertainer 2.5/5 #Robinhood— Peter Reviews (@urstrulyPeter) March 27, 2025 ఇప్పుడే సినిమా చూశాను. సెకండాఫ్ బాగుంది. శ్రీలీల పోర్షన్ మినహా ప్రతి ఎపిసోడ్ బాగా వర్కౌట్ అయింది. డేవిడ్ వార్నర్ క్యామియో రోల్ చివరిలో వచ్చి నవ్వులు పూయిస్తోంది. అదిదా సర్ప్రైజ్ సాంగ్ బాగుంది. ఓవరాల్‌గా ఇది డీసెంట్ కమర్షియల్ ఎంటర్టైనర్ అని ఓ నెటిజన్ 2.5 రేటింగ్ ఇచ్చాడు.#RobinhoodGood 1st half and a bad second half.Not better than bheeshma(as compared by hero). @actor_nithiin @sreeleela14 @VenkyKudumula pic.twitter.com/hZHFLIoHA5— Nenu (@nenuneneh) March 28, 2025 ‘ఫస్టాఫ్ బాగుంది. సెకండాఫ్ బాగోలేదు. భీష్మతో పోలిస్తే మాత్రం ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి’ అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.#Robinhood Review : SUMMER FULL FAMILY ENTERTAINER - 3.5/5 🔥🔥🔥ACTOR @actor_nithiin and #RajendraPrasad GAARU DUO WAS THE BIGGEST ASSET TO THE FILM 🎥 DIRECTOR @VenkyKudumula DEALED THE SIMPLE STORY WITH HIS TRADEMARK COMEDY AND SCREENPLAY 💥💥🔥🔥👍👍NEW STAR ⭐️… pic.twitter.com/b8EFYU2PD4— Telugu Cult 𝐘𝐓 (@Telugu_Cult) March 28, 2025‘సమ్మర్ ఫుల్‌ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. రాజేంద్రప్రసాద్, నితిన్ పాత్రలు పండించిన కామెడీ సినిమాకు ప్రధాన బలం. ఓ సింపుల్‌స్టోరీని వెంకీ కుడుముల తనదైన కామెడీ సీన్లతో, స్క్రీన్ ప్లేతో చక్కగా తీర్చిదిద్దాడు’ అంటూ ఓ నెటిజన్ 3.5 రేటింగ్‌చ్చాడు.#Robinhood Bagundhi 2nd half >>>> 1st half David Bhai entry ki theaters resound aeeeComedy bagundhi Songs placement worst except adhi dha suprise song.Overall ga good film😂— NAvANeETh (@Navaneethkittu) March 28, 2025రాబిన్‌హుడ్ బాగుంది. ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ బెటర్. డేవిడ్ భాయ్ ఎంట్రీకి థియేటర్స్‌లో రీసౌండే. కామెడీ బాగుంది. అదిదా సర్ప్రైజ్ మినహా మిగతా పాటల ప్లేస్‌మెంట్స్ బాగోలేవు. ఓవరాల్‌గా గుడ్ మూవీ అని ఓ వ్యక్తి ట్విటర్లో రాసుకొచ్చాడు. Done with 1st Half of #Robinhood !Here is the #Review so far:Strictly Average!! As a commercial cinema, plot and treatment is quite routine, but the comedy by #VennelaKishore & #RajendraPrasad garu worked out to an extent! Generated good laughs in the theatre! Needs a very… https://t.co/3yhnScEFtP— FILMOVIEW (@FILMOVIEW_) March 27, 2025POSITIVE REPORTS 💥 from the Premiere Shows #Robinhood. Congratulations💐 #teamRobinhood @actor_nithiin @VenkyKudumula @sreeleela14 @gvprakash @MythriOfficial pic.twitter.com/Du6ClOcmao— Mallesh Chetpally (@Mallesh_Nithiin) March 28, 2025#Robinhood Review : SUMMER FULL FAMILY ENTERTAINER - 3.5/5 🔥🔥🔥ACTOR @actor_nithiin and #RajendraPrasad GAARU DUO WAS THE BIGGEST ASSET TO THE FILM 🎥 DIRECTOR @VenkyKudumula DEALED THE SIMPLE STORY WITH HIS TRADEMARK COMEDY AND SCREENPLAY 💥💥🔥🔥👍👍NEW STAR ⭐️… pic.twitter.com/b8EFYU2PD4— Telugu Cult 𝐘𝐓 (@Telugu_Cult) March 28, 2025Show completed:- #Robinhood Fun entertainer 👍Above average movie 2.75/5 First half is good Okayish Second half Not a story based film ... go with the flow Go with your family , have fun#Robinhood series will continue... 2nd part villain @davidwarner31 pic.twitter.com/yrd3PGpsl6— venkatesh kilaru (@kilaru_venki) March 27, 2025#Robinhood2.75/5A good entertainer with loads of fun😀Nithiin & Venky Kudumula's combo generates a laugh riot in 1st half and the second half is a mix of emotion & entertainment.Vennela Kishore and RP comedy worked well. The pre-climax and climax are the heart of the film.— BioScope Telugu (@BioScope_Telugu) March 28, 2025 -
పోటీ తప్పదనే మైండ్‌సెట్‌తో ఉండాలి: ‘మైత్రీ’ నిర్మాత
‘‘రాబిన్ హుడ్’లో మంచి వినోదం ఉంది. ఓ హార్ట్ టచింగ్ పాయింట్‌ను ఈ సినిమాలో టచ్ చేశాం. ఆడియన్స్ కొత్త అనుభూతి పొందుతారు’’ అని నితిన్ అన్నారు. నితిన్, శ్రీలీల జంటగా నటించిన తాజా చిత్రం ‘రాబిన్ హుడ్’. ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ అతిథి పాత్రలో నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం రేపు (శుక్రవారం) విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం విలేకరుల సమావేశంలో హీరో నితిన్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో నాది చాలా ఇంటలెక్చువల్ రోల్. క్లైమాక్స్‌లో నా క్యారెక్టర్ రౌండప్, వచ్చే ట్విస్ట్‌లు, షాక్‌లు ఆడియన్స్‌కు ఫ్రెష్‌గా అనిపిస్తాయి’’ అని అన్నారు. ‘‘ఈ సినిమాలో ఫన్ ఉన్నప్పటికీ కథలో ఆత్మ మాత్రం ఎమోషనే. ఆ ఎమోషన్ సీక్వెన్స్ బాగా వర్కౌట్ అయింది’’ అని తెలిపారు వెంకీ కుడుముల. ‘‘ఈ రోజుల్లో ఉన్న పోటీ ప్రపంచంలో సోలో రిలీజ్ డేట్ ఆశించకూడదు. మేం వస్తున్నామన్నప్పుడు మా ఒక్క సినిమానే ఉంది. కానీ ఇప్పుడు రెండు డబ్బింగ్ సినిమాలు వచ్చాయి. మనం మూవీ చేస్తున్నప్పుడే పోటీ తప్పదనే మైండ్ సెట్‌తో దిగాలని భావిస్తా. ఇక వచ్చే ఏడాది మా బ్యానర్‌కు చాలా ముఖ్యం. ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్, రామ్‌చరణ్– బుచ్చిబాబు, ప్రభాస్–హను రాఘవపూడి, రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’, రాహుల్ సంకృత్యాన్–విజయ్ దేవరకొండ మూవీ, పవన్ కల్యాణ్ సినిమా... ఈ అరడజను సినిమాలపై మా ప్రస్తుత ఫోకస్ ఉంది. ఇక తమిళ హీరో అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ మూవీకి మంచి ఓపెనింగ్స్ వస్తాయని ఆశిస్తున్నాం. మా బేనర్లో ఇంకొన్ని సినిమాలు కూడా ఉన్నాయి’’ అని నిర్మాత రవిశంకర్ అన్నారు. -
రాజేంద్రప్రసాద్ బూతు మాటలపై డేవిడ్ వార్నర్ రియాక్షన్ ఇదీ..
ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఎంట్రీతో రాబిన్‌హుడ్ సినిమా (Robinhood Movie)కు కొత్త జోష్ వచ్చినట్లయింది. అతడి స్పెషల్ ఎంట్రీ సినిమాలోనే కాకుండా ప్రీరిలీజ్ ఈవెంట్లోనూ ఉండటంతో అభిమానులు సంతోషపడ్డారు. కానీ ఇదే ఈవెంట్లో ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ వార్నర్‌పై నోరు జారాడు. రేయ్ వార్నరూ.. క్రికెట్ ఆడమంటే కుప్పిగంతులు వేస్తున్నావ్.. అంటూ అతడిని వెక్కిరిస్తూ ఓ బూతు మాట కూడా అన్నాడు.క్షమాపణలు చెప్పిన రాజేంద్రప్రసాద్అంత పెద్ద క్రికెటర్‌ను పట్టుకుని ఇలాంటి చవకబారు వ్యాఖ్యలేంటని జనం మండిపడ్డారు. దీంతో రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) క్షమాపణలు తెలిపాడు. వార్నర్ అంటే తనకిష్టమని, ఉద్దేశపూర్వకంగా అలాంటి మాట అనలేదన్నాడు. పొరపాటున నోరు జారానని, మరోసారి అలా జరగకుండా చూసుకుంటానని హామీ ఇచ్చాడు. తన మాట తీరు వల్ల ఎవరైనా బాధపడుంటే క్షమించండి అని కోరాడు.వార్నర్ రియాక్షన్ ఇదీ!ఈ విషయంలో వార్నర్ (David Warner) రియాక్షన్ ఎలా ఉందో బయటపెట్టాడు దర్శకుడు వెంకీ కుడుముల (Venky Kudumula). వెంకీ మాట్లాడుతూ.. ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు మేమందరం కలిశాం. అప్పుడు రాజేంద్రప్రసాద్‌గారు, వార్నర్ బాగా క్లోజ్ అయ్యారు. రాజేంద్రప్రసాద్‌గారు చాలా పెద్దాయన, కానీ చిన్నపిల్లాడి మనస్తత్వం. ఏదనిపిస్తే అది మాట్లాడతారు. నువ్వు యాక్టింగ్‌కు వచ్చావ్ కదా.. చూసుకుందాం అని రాజేంద్రప్రసాద్.. నువ్వు క్రికెట్‌కు రా.. చూసుకుందాం అని వార్నర్ ఒకరినొకరు టీజ్ చేసుకున్నారు.నోరు జారాడుదాన్ని స్టేజీపై ఫన్ చేసే క్రమంలో రాజేంద్రప్రసాద్ అనుకోకుండా ఓ మాట తూలారు. అందుకు ఆయన కూడా బాధపడ్డారు. ఈ విషయం గురించి వార్నర్‌తో మాట్లాడా.. కాస్త నోరు జారాడు, ఏమీ అనుకోకు అని చెప్పాను. అందుకు వార్నర్.. క్రికెట్లో పెద్ద పెద్ద స్లెడ్జింగ్‌లు (కావాలని తిట్టుకోవడం) చూశాను. మా స్లెడ్జింగ్‌లు చూస్తే మీరు చెవులు మూసుకుంటారు. ఇది యాక్టర్స్ మధ్య స్లెడ్జింగ్.. ఇట్స్ ఓకే.. అని పాజిటివ్‌గా మాట్లాడారు. ఆయన చాలా మంచి మనిషి అని వెంకీ చెప్పుకొచ్చాడు. నితిన్ హీరోగా శ్రీలీల కథానాయికగా నటించిన రాబిన్‌హుడ్ మార్చి 28న విడుదల కానుంది. ఇందులో వార్నర్ ముఖ్య పాత్ర పోషించాడు.చదవండి: 15 ఏళ్ల క్రితం పిల్లల్ని దత్తత తీసుకోవాలనుకున్నా.. కానీ అదంతా టైం వేస్ట్ -
నితిన్ ‘రాబిన్ హుడ్’ HD మూవీ స్టిల్స్
-
మా కెరీర్లో రాబిన్ హుడ్ బెస్ట్: వెంకీ కుడుముల
‘‘అవసరం ఉన్న వారి కోసం నిలబడే హీరో ‘రాబిన్‌హుడ్’. మా చిత్ర కథకి ఈ టైటిల్ యాప్ట్. ఈ మూవీ చాలా వైవిధ్యంగా ఉంటుంది. మంచి సందేశం కూడా ఉంటుంది. నితిన్, నా కెరీర్లో ‘రాబిన్ హుడ్’ బెస్ట్ మూవీ అవుతుందనే నమ్మకం ఉంది. కుటుంబమంతా కలిసి చూడదగ్గ వినోదాత్మక చిత్రం ఇది’’ అని డైరెక్టర్ వెంకీ కుడుముల చెప్పారు. నితిన్, శ్రీలీల జంటగా నటించిన చిత్రం ‘రాబిన్‌హుడ్’. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదలవుతోంది.ఈ సందర్భంగా వెంకీ కుడుముల మాట్లాడుతూ– ‘‘భీష్మ’ సినిమా తర్వాత చిరంజీవిగారి కోసం ఒక కథ అనుకున్నాను. ఆయనకి ఫస్ట్ ఐడియా చెప్తే చాలా ఎగై్జట్ అయ్యారు. అయితే ఎక్కడో ఓ దగ్గర చిరంజీవిగారిని సంతృప్తి పరచలేకపోయాను. దీంతో మరో కథతో వస్తానని ఆయనకి చెప్పాను. కచ్చితంగా చిరంజీవిగారితో సినిమా చేస్తాను. నేను చెప్పిన ‘రాబిన్ హుడ్’ ఐడియా నితిన్‌కి నచ్చింది. ‘భీష్మ’ సినిమాతో నాకు, నితిన్‌కి మధ్య మంచి బంధం ఏర్పడింది. మైత్రీ మూవీ మేకర్స్ రాజీ పడకుండా సినిమాని నిర్మించారు’’ అని తెలిపారు.వార్నర్ సరదాగా తీసుకున్నారుఇదిలా ఉంటే... ఆదివారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో డేవిడ్ వార్నర్ గురించి రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై మీ అబీప్రాయం ఏంటి? అని వెంకీని అడిగితే... ‘‘ఫంక్షన్ అయిపోయిన తర్వాత రాజేంద్ర ప్రసాద్‌గారి మాటలకు అర్థం ఏమిటనేది నేను వార్నర్గారికి చెప్పాను. ఆయన నవ్వి.. క్రికెట్లో కూడా ఇలాంటివి సహజమే అన్నారు. సీనియర్ ఆర్టిస్టుగా రాజేంద్ర ప్రసాద్‌గారు తన కోస్టార్స్ని చిన్న పిల్లల్లా అనుకుని, అలా సరదాగా అంటుంటారు. వార్నర్గారిని కూడా అలా సరదాగా అన్నారు’’ అని పేర్కొన్నారు. -
‘రాబిన్ హుడ్’ ట్రైలర్ రిలీజ్..డేవిడ్ వార్నర్ ఎంట్రీ అదుర్స్ (ఫొటోలు)
-
రాబిన్‌హుడ్ వచ్చేశాడు.. ట్రైలర్ రిలీజ్ చేసిన డేవిడ్ వార్నర్
నితిన్, శ్రీలీల జంటగా నటించిన తాజా యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ రాబిన్‌హుడ్.'భీష్మ' వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో నితిన్- దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్లో వస్తోన్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదల తేదీని ప్రకటించిన మేకర్స్ ప్రమోషన్స్‌తో దూసుకెళ్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా రాబిన్‌హుడ్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో డేవిడ్ వార్నర్ చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు.ట్రైలర్ చూస్తే నితిన్ పంచ్ డైలాగ్స్, యాక్షన్ సీన్స్ ఈ మూవీపై మరిన్ని అంచనాలు పెంచేస్తున్నాయి. వెన్నెల కిశోర్, నితిన్ మధ్య వచ్చే సన్నివేశాలతో థియేటర్లలో నవ్వులు పూయించడం ఖాయంగా కనిపిస్తోంది. ట్రైలర్ చివర్లో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఎంట్రీ ఓ రేంజ్లో అదిరిపోయింది. కాగా.. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించారు. ఈ సినిమాను మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం జీవీ ప్రకాశ్‌కుమార్ అందించారు. -
నీ గూబ పగిలిపోతుందంటూ నితిన్‌కు వార్నింగ్
'ఛాట్ జీపీటీ'కి పోటీగా టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ ప్రవేశపెట్టిన ‘గ్రోక్’ సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే. సినిమా ఇండస్ట్రీ కూడా తమ మూవీ ప్రమోషన్ల కోసం గ్రోక్‌ను ఉపయోగిస్తున్నారు. ప్రశ్న ఏదైనా సరే దానిని అడిగిన వెంటనే అదే స్టైల్ల్లో సమాధానం వచ్చేస్తుంది. ఒకవేళ వాళ్లు వాడిన బూతు మాటల్ని తిరిగి వాళ్ల మీదే ప్రయోగిస్తూ బోలెడంత వినోదాన్ని పంచుతోంది. అందుకే ఇప్పుడు నెట్టింట గ్రోక్ వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే నితిన్ 'రాబిన్‌హుడ్' సినిమా ట్రైలర్ తేదీని ప్రకటించేందుకు గ్రోక్‌ను సంప్రదించారు. దాని నుంచి వచ్చిన సమాధానాలు విన్న అందరిలోనూ నవ్వులు తెప్పిస్తున్నాయి.దర్శకుడు వెంకీ కుడుముల, నితిన్ ఇద్దరూ కలిసి రాబిన్‌హుడ్ ట్రైలర్ లాంచ్ ముహూర్తం కోసం ఒక సిద్ధాంతిని కలవాలని అనుకుంటారు. ఈరోజుల్లో సిద్ధాంతి ఏంటి బ్రో అంటూ.. గ్రోక్‌ను సంప్రదించాలని నితిన్ సలహా ఇస్తాడు.. అక్కడి నుంచి మొదలౌతుంది అసలు కథ. ట్రైలర్ లాంచ్ కోసం ఒక సరైన ముహూర్తం చెప్పాలని వెంకీ కుడుముల ఇంగ్లీష్‌లో టైప్ చేస్తాడు. అప్పుడు పంచ్ డైలాగ్‌తో గ్రోక్ సమాధానం ఇస్తుంది. దీంతో షాక్ అయిన దర్శకుడు వెంటనే నితిన్‌ను డీల్ చేయమంటాడు. ఆ సమయంలో దానిని నువ్వే డీల్ చేయ్ అని నితిన్ అనడంతో.. గ్రోక్ నుంచి అదే రేంజ్లో సమాధానం వస్తుంది. నువ్వు దాన్ని, దీన్నీ అంటే నీ గూబ పగిలిపోతుందని సమాధానం ఇస్తుంది. ఇలా సుమారు రెండు నిమిషాల పాటు సరదాగా గ్రోక్తో రాబిన్‌హుడ్ టీమ్ ముచ్చట్లు కొనసాగుతాయి.‘రాబిన్‌హుడ్’ సినిమా ట్రైలర్ మార్చి 21న సాయింత్రం 4గంటల 5నిమిషాలకు విడుదలౌతుందని మేకర్స్ ప్రకటంచారు.వెంకీ కుడుముల డైరెక్షన్లో నితిన్, శ్రీలీల జోడీగా నటించిన చిత్రం ‘రాబిన్‌హుడ్’. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 28న విడుదలవుతోంది. ఈ సినిమాలో అతిథిగా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కనిపించనున్నడం విశేషం. -
ఐటం సాంగ్‌లో మల్లెపూలతో హీరోయిన్.. సీక్రెట్ బయటపెట్టిన డైరెక్టర్
దొంగలందరూ చెడ్డవారే కాదు.. దొంగల్లోనూ మంచివాళ్లుంటారు. అలాంటి ఓ వ్యక్తి కథే రాబిన్‌హుడ్ (Robinhood Movie). నితిన్ హీరోగా, శ్రీలీల హీరోయిన్గా నటించారు. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషించారు. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ అతిథి పాత్రలో నటించారు. నితిన్- దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్లో వస్తున్న రెండో చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం మార్చి 28న విడుదలవుతోంది.విషయం బయటపెట్టిన డైరెక్టర్శనివారం ఈ సినిమా మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకీ కుడుముల (Venky Kudumula) ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. రాబిన్‌హుడ్‌లో అదిదా సర్ప్రైజ్ అని ఓ ఐటం సాంగ్ ఉంది. కేతిక శర్మ (Ketika Sharma) ఈ స్పెషల్ సాంగ్‌లో ఆడిపాడింది. అయితే అందర్నీ సర్ప్రైజ్ చేసిన మరో విషయం ఈ పాటలో కేతిక మల్లెపూల డ్రెస్‌తో కనిపించింది. అసలీ ఐడియా ఎవరిది? అని చాలామంది మదిలో మెదిలిన ప్రశ్న.మల్లెపూల వెనక ఇదా మ్యాటర్ఇదే ప్రశ్న దర్శకుడు వెంకీకి ఎదురైంది. దీనికి ఆయన సమాధానమిస్తూ.. అమ్మాయి ఇంట్రో స్పెషల్‌గా ఉండాలి. తన కాస్ట్యూమ్ కూడా అంతే ప్రత్యేకంగా ఉండాలని అని బాల్కనీలో ఆలోచిస్తున్నాను. ఇంతలో ఎవరో వీధిలో మల్లెపూలు.. అని అమ్ముకుంటూ వెళ్లాడు. అది కాస్ట్యూమ్ చేస్తే ఎలా ఉంటుందా? అనుకున్నాను. అదే ఆచరణలో పెట్టాం అని చెప్పుకొచ్చాడు. అదిదా సర్ప్రైజు పాట విషయానికి వస్తే.. జీవీ ప్రకాశ్ సంగీతం అందించిన ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ రాశాడు. నీతి మోహన్, అనురాగ్ కులకర్ణి ఆలపించారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు. చదవండి: ఛాతి నొప్పి.. ఆస్పత్రిలో చేరిన ఏఆర్ రెహమాన్ -
నితిన్ ‘రాబిన్‌హుడ్’ మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
నితిన్ రాబిన్‌హుడ్.. అది దా సర్ప్రైజ్ అంటోన్న కేతిక శర్మ
నితిన్, శ్రీలీల జంటగా నటించిన తాజా యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ రాబిన్‌హుడ్.'భీష్మ' వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో నితిన్- దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్లో వస్తోన్న ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదల తేదీని ప్రకటించిన మేకర్స్ ప్రమోషన్స్‌తో దూసుకెళ్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన మంచి రెస్పాన్స్ వస్తోంది.తాజాగా ఈ మూవీ నుంచి మూడో లిరికల్ పాటను మేకర్స్ విడుదల చేశారు. 'అది దా సర్ప్రైజ్' అంటూ సాగే ఐటమ్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ స్పెషల్ సాంగ్‌లో హీరోయిన్ కేతిక శర్మ తన డ్యాన్స్‌తో అలరించింది. ముఖ్యంగా కేతిక శర్మ అందాలతో అభిమానులను తెగ ఆకట్టుకుంది. ఈ పాట రాబిన్ హుడ్‌లో మూవీలో ప్రత్యేకమైన క్రేజ్ సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా.. అంతుకుముందే కేతిక శర్మ తెలుగులో రంగరంగ వైభవంగా, లక్ష్య లాంటి చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. కాగా.. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి సంగీతం జీవీ ప్రకాశ్‌కుమార్ అందించారు. This summer heat is here with the sizzling moves and the blazing beats 🔥🔥#Robinhood third single #AdhiDhaSurprisu ft. @TheKetikaSharma out now ❤️🔥▶️ https://t.co/GvczL8HezzA @gvprakash musical.Lyrics by Academy Award Winner @boselyricistSung by @neetimohan18 &… pic.twitter.com/fRkw35ndnO— Mythri Movie Makers (@MythriOfficial) March 10, 2025 -
పండుగ రేసు నుంచి తప్పకున్న నితిన్ 'రాబిన్‌హుడ్'
క్రిస్టమస్ రేసు నుంచి 'రాబిన్ హుడ్' సినిమా తప్పుకుంది. ఈమేరకు చిత్ర యూనిట్ నుంచి అధికారికంగా ప్రకటన కూడా వెలువడింది. 'భీష్మ' వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘రాబిన్ హుడ్’. టైటిల్ ప్రకటించిన సమయం నుంచి ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.‘రాబిన్‌హుడ్’ సినిమాను డిసెంబర్ 25న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించారు. అయితే, తాజాగా ఆ సంస్థ మరో ప్రకటన చేసింది. రాబిన్ హుడ్ చిత్రాన్ని అనుకున్న తేదీలో విడుదల చేయడం లేదంటూ తెలిపింది. కానీ, కొత్త రిలీజ్ డేట్‌ను త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది. మైత్రీ మూవీస్ నుంచి తెరకెక్కిన పుష్ప2 ఇంకా థియేటర్లో రన్ అవుతూనే ఉంది. మరోవైపు మోహన్‌లాల్ బరోజ్ తెలుగు వర్షన్‌ను ఇదే సంస్థ డిసెంబర్ 25న విడుదల చేస్తుంది. ఆపై ఈ క్రిస్టమస్ రేసులో సుమారు 10కి పైగా చిత్రాలు రేసులో ఉన్నాయి. దీంతో థియేటర్స్ కొరత ఏర్పడే ఛాన్స్ ఉందని రాబిన్ హుడ్ను వాయిదా వేసినట్లు తెలుస్తోంది.రాబిన్ హుడ్‌లో నితిన్ సరసన శ్రీలీల హీరోయిన్గా నటిస్తుంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. సంగీతం జీవీ ప్రకాశ్‌కుమార్ అందిస్తున్నారు. యునిక్ యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రానుంది. -
నితిన్ 'రాబిన్‌హుడ్' మూవీ ప్రెస్ మీట్ (ఫొటోలు)
-
వన్ మోర్ టైమ్ అంటోన్న నితిన్.. రొమాంటిక్ సాంగ్ వచ్చేసింది!
భీష్మ హిట్ తర్వాత నితిన్- వెంకీ కుడుముల కాంబోలో వస్తోన్న చిత్రం రాబిన్‌హుడ్. ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.తాజాగా రాబిన్‌హుడ్ మూవీ నుంచి వన్ మోర్ టైమ్ అనే రొమాంటిక్ లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటకు కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా.. జీవి ప్రకాశ్, విద్య ఆలపించారు. యూనిక్ యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 25న థియేటర్లలో సందడి చేయనుంది. కాగా.. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతమందిస్తున్నారు. The LOVE FUSION SONG OF THE YEAR is here!#Robinhood First Single #OneMoreTime out now!▶️ https://t.co/QR2AWYjcFlSung by @gvprakash & @VidyaVox 🎙️GRAND RELEASE WORLDWIDE ON DECEMBER 25th 💥@sreeleela14 @VenkyKudumula @kk_lyricist @OfficialSekhar @MythriOfficial pic.twitter.com/0MiffNi3x6— nithiin (@actor_nithiin) November 26, 2024 -
'జమాన' టైటిల్ ప్రోమోను రిలీజ్ చేసిన దర్శకుడు వెంకీ కుడుముల
-
'జమాన' టైటిల్ ప్రోమోను రిలీజ్ చేసిన దర్శకుడు వెంకీ కుడుముల
ఇటీవల కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో కంటెంట్ ఉన్న సినిమాకు దక్కుతున్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కథా బలం ఉంటే చిన్న సినిమాలకు కూడా ప్రేక్షకులు పెద్ద విజయాలు కట్టబెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ కోవలోనే ఈ తరం యువత ఆలోచనలకు అద్దం పట్టే ఒక ఆసక్తికరమైన కథ, కథనాలతో తెరకెక్కుతోన్న యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ `జమాన`. పవన్‌కల్యాణ్`బ్రో` సినిమాతో సుపరిచితుడైన సూర్య శ్రీనివాస్, సంజీవ్ కుమార్ ప్రధాన పాత్రలలో నటిస్తుండగా శ్రీ లక్ష్మీ వల్లభ క్రియేషన్స్, విఎస్ అసోసియేట్స్ పతాకాలపై తేజస్వి అడప, బొద్దుల లక్ష్మణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భాస్కర్ జక్కుల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్ ప్రోమోను దర్శకుడు వెంకీ కుడుముల విడుదల చేశారు. ఈ సందర్భంగా వెంకీ కుడుముల మాట్లాడుతూ - 'జమాన టైటిల్ ప్రోమో చూశాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ సినిమాలో నటించిన సూర్య శ్రీనివాస్, సంజయ్‌కి ఆల్ ది బెస్ట్. డైరెక్టర్ భాస్కర్ జక్కుల విజన్ బాగా నచ్చింది. టైటిల్ ప్రోమోలో చార్మినార్ దగ్గరి షాట్ చాలా బాగుంది. డిఓపి చక్కగా తీశారు. ఈ సినిమాకు సంబందించి ఎలాంటి సహాయం కావాలన్నా మా టీమ్ ఎప్పుడు అందుబాటులోనే ఉంటుంది. ఈ సినిమా నిర్మాతలకు, చిత్ర యనిట్ కు ఆల్ ది వెరీ బెస్ట్' అన్నారు. హీరో సూర్య శ్రీనివాస్ మాట్లాడుతూ.. 'మేం అడగగానే వెంటనే మా 'జమాన' టైటిల్ ప్రోమోను విడుదల చేసిన వెంకీ కుడుముల గారికి థ్యాంక్స్...ఆయనది లక్కీ హ్యాండ్. ఆయన చేతుల మీదుగా విడుదలైన మా 'జమాన' సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందని నమ్మకం ఉంది.. మా డైరెక్టర్ భాస్కర్ గారికి మంచి విజన్ ఉంది. నేటి యువతకు సంబందించి ఒక అద్భుతమైన కథతో ఈ చిత్రానికి తెరకెక్కించారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకి థ్యాంక్స్.' అన్నారు. దర్శకుడు భాస్కర్ జక్కుల మాట్లాడుతూ.. 'జమాన టైటిల్ ప్రోమో రిలీజ్ చేసిన దర్శకులు వెంకీ కుడుముల గారికి థ్యాంక్స్. చార్మినార్, ఓల్డ్ సిటీ బ్యాక్‌డ్రాప్ లో యూత్ కి నచ్చే విధంగా 'జమాన' చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. ఫస్ట్ మూవీ అయినా యాక్టర్స్, టెక్నీషియన్స్ మంచి సపోర్ట్ ఇచ్చారు. అలాగే ఈ కథని నమ్మి ప్రొడ్యూస్ చేసిన మా నిర్మాతలకి థ్యాంక్స్..త్వరలోనే మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మీ ముందుకు వస్తాం.' అన్నారు. -
నిర్లక్ష్యం.. నిండు ప్రాణం ఖరీదు.. టాలీవుడ్ డైరెక్టర్ ట్వీట్ వైరల్!
టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ కుడుముల టాలీవుడ్ అభిమానులకు వార్నింగ్ ఇచ్చారు. జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయవద్దని ప్రజలతో పాటు ఫ్యాన్స్‌కు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి చిన్న తప్పుతో ప్రాణాలు పోగొట్టుకోవద్దని ఆయన సూచించారు. ప్రస్తుతం వెంకీ కుడుముల చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలుసుకుందాం. (ఇది చదవండి: రష్మిక వీడియోలానే మరో స్టార్ హీరోయిన్.. సోషల్ మీడియాలో వైరల్!) ట్వీట్లో వెంకీ రాస్తూ..' కొన్ని వారాలుగా మా కజిన్ జ్వరంతో బాధపడుతున్నారు. అది సాధారణ జ్వరమేనని అనుకున్నారు. దీంతో టైముకి వైద్యుని వద్దకు వెళ్లలేదు. అది కాస్తా అరుదైన జీబీ సిండ్రోమ్‌కు (మనిషిలోని రోగనిరోధకశక్తి అదుపు తప్పి నరాలపై దాడి చేయటం) దారి తీసింది. సరైన సమయంలో చికిత్స తీసుకుని ఉంటే ఇలా జరిగేది కాదు. ఆలస్యం చేయడం వల్లే జీవితాన్ని కోల్పోవాల్సి వచ్చింది. నిర్లక్ష్యం మా కుటుంబానికి తీరని దుఃఖం మిగిల్చింది. కొవిడ్ తర్వాత జ్వరాన్ని కూడా తేలికగా తీసుకుంటున్నారు. దయచేసి అలా చేయొద్దు. జ్వరం వస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఇలాంటి చిన్న జాగ్రత్తలే మన ప్రాణాలు కాపాడతాయి.'అని రాసుకొచ్చారు. కాగా.. వెంకీ ప్రస్తుతం నితిన్‌తో ఇటీవల సినిమాను ప్రకటించారు. భీష్మ’ తర్వాత నితిన్ - రష్మిక కాంబోలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: అశ్వినిని ఏడిపించేసిన బిగ్ బాస్.. హౌస్‌లో ఏం జరిగిందంటే?) #NotJustAFever 💔🙏🏻 pic.twitter.com/kuxuXr4V5L — Venky Kudumula (@VenkyKudumula) November 7, 2023 -
హీరోయిన్ రష్మికపై కుట్ర జరుగుతోందా?
హీరోయిన్ రష్మిక ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్గా ఫుల్ బిజీగా ఉంది. 'పుష్ప 2'తోపాటు పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అయితే ఈమె.. నితిన్ సినిమా నుంచి తప్పుకుందనే వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇందులో నిజానిజాల సంగతి పక్కనబెడితే మరో కొత్త విషయం ఒకటి బయటకొచ్చింది. ఈమెపై ఓ వ్యక్తి కుట్ర చేస్తున్నాడని అంటున్నారు. కిరాక్ హిట్‌తో కన్నడ బ్యూటీ రష్మిక.. డిగ్రీ చదువుతున్న టైంలో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. 'కిరిక్ పార్టీ' అనే చిత్రంతో వచ్చీరావడంతో బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకుంది. అలా 'ఛలో' మూవీతో తెలుగులోకి వచ్చేసింది. ఆ మూవీ సూపర్ హిట్ కావడంతో రష్మిక దశ తిరిగిపోయింది. యంగ్ హీరోలతో వరసపెట్టి నటించింది. అల్లు అర్జున్‌తో చేసిన 'పుష్ప' అయితే ఈమెని పాన్ ఇండియా స్టార్‌ని చేసేసింది. (ఇదీ చదవండి: పెళ్లి జీవితంపై సంగీత కామెంట్స్.. అప్పట్లో చాలా దారుణంగా!) నితిన్ ప్రాజెక్ట్ నుంచి ఔట్ ప్రస్తుతం 'పుష్ప 2'తో రష్మిక బిజీగా ఉంది. దీనితోపాటు హిందీలో 'యనిమల్', ద్విభాషా చిత్రం 'రెయిన్ బో' లోనూ నటిస్తూ బిజీగా ఉంది. నితిన్-వెంకీ కుడుముల మూవీలో ఈమెనే హీరోయిన్ గా చేస్తోంది. కానీ డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్ల ఈమె తప్పుకొందనే న్యూస్ ఒకటి బయటకొచ్చింది. ఈమె బదులు శ్రీలీలని హీరోయిన్గా తీసుకున్నారని అన్నారు. ఇందులో క్లారిటీ రావాల్సి ఉంది. అతడు వల్ల అయితే కొన్నిరోజుల ముందు రష్మికని మేనేజర్ మోసం చేశాడని న్యూస్ వచ్చింది. ఇది జరిగిన కొన్నాళ్లకు ఫ్రొఫెషనల్‌గా వీళ్లిద్దరూ విడిపోయారు. అప్పుడు ఏం జరిగిందనేది పక్కనబెడితే.. ఇప్పుడు అతడే రష్మిక కెరీర్ ని దెబ్బ కొడుతున్నాడని అంటున్నారు. రష్మికకు తెలుగుపై పెద్దగా ఆసక్తి లేదని అందరీ దగ్గర చెబుతున్నాడట. ఈ కారణంగానే నితిన్ ప్రాజెక్ట్ నుంచి ఈమె తప్పుకొందని అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై స్వయానా రష్మిక స్పందిస్తే గానీ అసలు విషయం బయటపడదు. (ఇదీ చదవండి: 'ఆదిపురుష్' దెబ్బకు ఇరకాటంలో ఆ సినిమా!) -
క్రేజీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న రష్మిక.. ఛాన్స్ కొట్టేసిన యంగ్ హీరోయిన్!
ప్రస్తుతం టాలీవుడ్లో ఓ రేంజ్లో దూసుకెళ్లున్న హీరోయిన్లు వారిద్దరే. ఆ ఇద్దరు స్టార్ హీరోలతో ఛాన్స్‌లు కొట్టేస్తూ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారు. అంతే కాకుండా వారిద్దరి మధ్యనే విపరీతమైన పోటీ నెలకొంది. డైరెక్టర్స్ కూడా హీరోయిన్ల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కొన్ని సినిమాలు ఎంపిక చేశాక హీరోయిన్స్ ఏదో ఒక కారణంతో తప్పుకోవడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అయితే తాజాగా ఓ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి స్టార్ హీరోయిన్ తప్పుకున్నట్లు వార్తలొస్తున్నాయి. అంతే కాకుండా మరో హీరోయిన్ను సెలెక్ట్ చేయడం కూడా జరిగిపోయిందట. ఇంతకీ టాలీవుడ్‌ను ఊపేస్తున్న ఆ ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసుకుందాం. (ఇది చదవండి: శ్రీలీల బదులు రష్మిక.. సూపర్ ఛాన్స్ కొట్టేసింది!) ఒకరు నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కాగా.. మరొకరు పెళ్లసందడి ఫేమ్ శ్రీలీల. పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు తెచ్చుకున్న రష్మిక ప్రస్తుతం బాలీవుడ్లో యానిమల్, పుష్ప-2, రెయిన్ బో సినిమాలతో బిజీగా ఉంది. అయితే ఈ ఏడాది భీష్మ కాంబినేషన్ నితిన్‌కు జోడీగా మరో చిత్రంలో నటిస్తోంది. ఇప్పటికే అఫీషియల్ కూడా ప్రకటించేశారు. కానీ ఈ చిత్రం నుంచి రష్మిక తప్పుకుందని వార్తొలొస్తున్నాయి. ఆమె స్థానంలో పెళ్లి సందడి ఫేమ్ శ్రీలీల ఛాన్స్ కొట్టేసిందని టాలీవుట్‌లో టాక్ వినిపిస్తోంది. భీష్మ డైరెక్టర్ వెంకీ కుడుముల తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం నుంచి రష్మిక వైదొలిగినట్లు తెలుస్తోంది. అయితే ఆమె చేతిలో వరుసగా భారీ సినిమాలు చేతిలో ఉండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా.. ఇప్పటికే మహేష్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రంలో పూజా హెగ్డే స్థానంలోనూ శ్రీలీల ఛాన్స్ కొట్టేసింది. రష్మిక తర్వాత శ్రీలీలనే టాప్ హీరోయిన్గా కనిపిస్తోంది. ఈ ఏడాదిలోనే ఆదికేశవ, స్కంద, భగవంత్ కేసరి, గుంటూరు కారం, వీడీ12, ఉస్తాద్ భగత్ సింగ్‌తో సహా దాదాపు ఏడు చిత్రాలలో నటిస్తోంది. కాగా.. గతంలో.. హీరో నితిన్, హీరోయిన్ రష్మికా మందన్నా భీష్మ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. మరోసారి క్రేజీ కాంబో రిపీట్ కాబోతోందని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. (ఇది చదవండి: నయన్ భర్తకు వార్నింగ్ ఇచ్చిన షారుక్ ఖాన్!) -
ముగ్గురు డైరెక్టర్లు, ముగ్గురి హీరోయిన్ల కాంబో రిపీట్
కాంబినేషన్ రిపీట్ కావడం కామన్. అయితే హిట్ కాంబినేషన్‌రిపీట్ అయినప్పుడు ‘హిట్ రిపీట్’ కావడం ఖాయం అనే అంచనాలు ఉంటాయి. తాజాగా మూడు కాంబినేషన్ల మీద అలాంటి అంచనాలు ఉన్నాయి. త్రివిక్రమ్–పూజా హెగ్డే, వెంకీ కుడుముల–రష్మికా మందన్నా, అట్లీ–నయనతార... ఈ ముగ్గురు డైరెక్టర్లు, ముగ్గురి హీరోయిన్ల కాంబో రిపీట్ అవుతోంది. ఆ విశేషాల్లోకి వెళదాం. త్రివిక్రమ్ – పూజా హెగ్డే తొలిసారి త్రివిక్రమ్ దర్శకత్వంలో పూజా హెగ్డే కథానాయికగా నటించిన చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’ (2018). ఈ సినిమాలో అందం, ఆత్మవిశ్వాసం, ప్రతిభ ఉన్న అరవిందపా త్ర చేశారు పూజా హెగ్డే. నటిగా తన టాలెంట్ నిరూపించుకోవడానికి ఈ క్యారెక్టర్ హెల్ప్ అయింది. దాంతోపా టు సినిమా కూడా ఘనవిజయం సాధించడంతో పూజా కెరీర్‌కి ప్లస్ అయింది. ఆ తర్వాత రెండేళ్లకు ‘అల.. వైకుంఠపురములో’ సినిమా ప్లాన్ చేసి, అందులోనూ పూజా హెగ్డేని తీసుకున్నారు త్రివిక్రమ్. ఈ సినిమాలో పూజా హెగ్డే చేసిన అమూల్య క్యారెక్టర్ ఆమెకు ప్లస్ అయింది. ‘అల..’తో మరో హిట్ సినిమా ఆమె ఖాతాలో పడింది. ఇప్పుడు మహేశ్‌బాబు హీరోగా త్రివిక్రమ్ ఓ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇందులోనూ పూజానే హీరోయిన్. ఈ సినిమాలో పూజా హెగ్డేపా త్ర ఎలా ఉంటుంది? అనేది తెలియాల్సి ఉంది. వెంకీ కుడుముల – రష్మికా మందన్నా ఒక మీడియమ్ బడ్జెట్ సినిమాలో చేసిన సింపుల్, హోమ్లీ క్యారెక్టర్ ఆ తర్వాత పెద్ద బడ్జెట్ సినిమాలు, గ్లామరస్ రోల్స్ చేసే రేంజ్‌కి తీసుకెళుతుందని ‘ఛలో’ (2018) సినిమా ఒప్పుకున్నప్పుడు రష్మికా మందన్నా ఊహించి ఉండరు. కానీ ఆ మేజిక్ జరిగింది. వెంకీ కుడుముల దర్శకత్వంలో చేసిన ‘ఛలో’ చిత్రం ద్వారా కన్నడ బ్యూటీ రష్మికా మందన్నా తెలుగుకి పరిచయం అయ్యారు. తొలి సినిమానే హిట్. ఆ తర్వాత పెద్ద సినిమాలు చేస్తూ వచ్చిన రష్మిక మళ్లీ రెండేళ్లకు వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘భీష్మ’ (2020) సినిమాలో మంచిపా త్ర చేశారు. ఈ సినిమా కూడా సూపర్ హిట్. ఇప్పుడు మళ్లీ వెంకీ కుడుముల దర్శకత్వంలో రష్మిక ఓ సినిమా చేస్తున్నారు. విశేషం ఏంటంటే.. ‘భీష్మ’లో నటించిన నితిన్ ఇందులో హీరో. ఆ విధంగా వెంకీ–నితిన్–రష్మికలకు ఇది రెండో సినిమా. ఈ హిట్ కాంబినేషన్ చేస్తున్న ఈ సినిమా ఇటీవలే ఆరంభమైంది. అట్లీ – నయనతార దర్శకుడిగా అట్లీ తొలి సినిమా ‘రాజా రాణి’ (2013) చేస్తున్నప్పటికి నయనతార స్టార్ హీరోయిన్. ఒక కొత్త దర్శకుడు చెప్పిన కథని నమ్మి ఆమె ‘రాజా రాణి’ చేశారు. ఆ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తొలి చిత్రం తర్వాత అట్లీ స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ స్టార్ డైరెక్టర్ల జాబితాలో చేరిపోయారు. ఇక మళ్లీ నయనతారను ఆయన కథానాయికగా తీసుకున్న చిత్రం ‘బిగిల్’ (2019). ఈ సినిమా కూడా సూపర్ హిట్. ఇప్పుడు అట్లీ దర్శకత్వంలో నయనతార ఓ సినిమా చేస్తున్నారు. అయితే ఈసారి ఈ డైరెక్టర్–హీరోయిన్ కాంబినేషన్లో రానున్నది హిందీ చిత్రం ‘జవాన్’. షారుక్ ఖాన్ హీరోగా అట్లీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ద్వారా నయనతార బాలీవుడ్‌కి కథానాయికగా పరిచయం అవుతున్నారు. సౌత్‌లో హిట్స్ ఇచ్చిన ఈ కాంబో నార్త్‌లోనూ ఆ ఫీట్‌ని రిపీట్ చేస్తుందని ఊహించవచ్చు. -
గ్రాండ్‌గా ప్రారంభమైన నితిన్-రష్మిక సినిమా
హీరో నితిన్, రష్మికా మందన్నాలు మరోసారి జంటగా నటించనున్నారు. వెంకీ కుడుమల డైరెక్షన్లో తెరకెక్కనున్న ఈ సినిమా గ్రాండ్‌గా ప్రారంభమైంది. దీనికి చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసి ముహూర్తం షాట్‌ను క్లాప్ కొట్టి ఆరంభించారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. నేడు పూజా కార్యక్రమాలతో ఈ సినిమా లాంచ్ అయ్యింది. దీనికి సంబంధించిన ఫోటోలు #VNRTrio అనే హ్యష్ ట్యాగ్‌తో ట్రెండ్ అవుతున్నాయి. గతంలో నితిన్-రష్మికలు జోడీగా భీష్మలో నటించి సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఈ హిట్ కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మరోసారి నితిన్‌కి జోడీగా రష్మిక మందన్నా.. క్రేజీ అనౌన్స్మెంట్
హీరో నితిన్, హీరోయిన్ రష్మికా మందన్నా మరోసారి జోడీగా నటించనున్నారు. గతంలో భీష్మ చిత్రంలో వీరు తొలిసారిగా స్క్రీన్ షేర్ చేసుకున్నారు. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఈ కాంబో రిపీట్ కానుంది. దీనికి సంబంధించి మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా చేసేశారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇంట్రడక్షన్ వీడియోతోనే సినిమాపై బజ్‌ను క్రియేట్ చేశారు. త్వరలోనే ఈ చిత్రం టైటిల్‌ను అనౌన్స్ చేయనున్నారు. కొంతకాలంగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న నితిన్‌కు ఈ సినిమా అయినా సక్సెస్ ఇస్తుందా అన్నది చూడాల్సి ఉంది. The trio so rare even we are aware!#VNRTrio is back with something more entertaining and more adventurous 💥💥 Watch now! - https://t.co/UxHVoTh7KZ More details soon!@actor_nithiin @iamRashmika @VenkyKudumula @gvprakash pic.twitter.com/IPZWsdJwct — Mythri Movie Makers (@MythriOfficial) March 22, 2023 -
మరోసారి జంటగా నటించనున్న నితిన్-రష్మిక?
హీరో నితిన్, హీరోయిన్ రష్మికా మందన్నా మరోసారి జోడీగా నటించనున్నారా? అంటే అవునను అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్, రష్మిక జంటగా నటించిన భీష్మ చిత్రం 2020 ఫిబ్రవరి 21 విడుదలై మంచి హిట్‌ను అందుకుంది. కాగా మరోసారి భీష్మ కాంబినేషన్ రిపీట్ కానుందని టాక్. ఛలో, భీష్మ చిత్రాలతో వరుస హిట్లు అందుకున్న వెంకీ కుడుముల మూడో చిత్రాన్ని చిరంజీవితో తీయనున్నారనే వార్తలొచ్చాయి. అయితే ఆ ప్రాజెక్టుపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాగా తన తర్వాతి చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌లో చేయనున్నారు వెంకీ కుడుముల. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు జరగుతున్నాయి. ఇందులో హీరో, హీరోయిన్లుగా నితిన్, రష్మిక నటిస్తున్నారని భోగట్టా. భీష్మలో వీరి జోడీకి మంచి మార్కేలే పడటంతో మరోసారి రిపీట్ చేసేందుకు వెంకీ ఆసక్తి చూపుతున్నారు.ఈ ఏడాది చివరల్లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళుతుందని టాక్. -
మరోసారి రిపీట్ కానున్న 'భీష్మ' కాంబినేషన్
నితిన్- వెంకీ కుడుముల కాంబినేషన్లో వచ్చిన చిత్రం భీష్మ. ఈ సినిమా నితిన్ కెరీర్‌కు మంచి బ్రేక్ ఇచ్చింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగానూ దుమ్మురేపిందీ చిత్రం. ఈ సినిమా తర్వాత నితిన్‌కు మళ్లీ ఆ స్థాయిలో హిట్ పడలేదు. ఇదిలా ఉండగా వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పుడు మరో సినిమా రానున్నట్లు టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రీసెంట్గా వెంకీ కుడుముల ఓ కథను చెప్పడం, నితిన్ వెంటనే గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నారట. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందట. -
లక్ అంటే ఈ డైరెక్టర్లదే.. అప్పుడే స్టార్ హీరోలతో సినిమాలు!
స్టార్ హీరోలతో సినిమాలు చేయాలని ఏ దర్శకుడు అయినా అనుకుంటారు. ఈ సువర్ణావకాశం కోసం కొందరు దర్శకులు చాలాకాలం ఎదురుచూస్తుంటారు. కానీ కొందరు డైరెక్టర్లకు మాత్రం తక్కువ సమయంలోనే స్టార్ హీరోకి ‘స్టార్ట్ యాక్షన్’ చెప్పే చాన్స్ వస్తుంది. ఇప్పుడలాంటి కాంబినేషన్లు కొన్ని ఉన్నాయి. ‘స్టార్ హీరో’లు ‘యంగ్ కెప్టెన్’ (డైరెక్టర్లను కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు)ల కాంబినేషన్లో సెట్ అయిన చిత్రాలపై ఓ లుక్కేద్దాం. సిల్వర్ స్క్రీన్‌పై రజనీకాంత్ క్రేజ్ ఏంటో ప్రేక్షకులకు తెలుసు. ఇంతటి స్టార్డమ్ ఉన్న హీరోతో సినిమా చేయాలని ఏ దర్శకుడు అయినా ఆశపడుతుంటారు. ఈ చాన్స్ కనీసం మూడు సినిమాలను కూడా తెరకెక్కించని ఓ దర్శకుడికి లభిస్తే అది కాస్త ఆశ్చర్యమే. తమిళ చిత్రం ‘డాన్’తో దర్శకుడిగా పరిచయమైన సిబీ చక్రవర్తికి చాన్స్ ఇవ్వనున్నారు రజనీకాంత్. ఆల్రెడీ ఈ సూపర్ స్టార్‌ను కలిసి సీబీ చక్రవర్తి ఓ లైన్ వినిపించారు. పూర్తి కథను రెడీ చేసి, నరేషన్ ఇస్తే సినిమా చేస్తానని సీబీ చక్రవర్తికి మాట ఇచ్చారట రజనీ. ప్రస్తుతం రజనీకాంత్ ‘జైలర్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రదర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కూడా యువదర్శకుడే కావడం విశేషం. నెల్సన్ కెరీర్లో ‘జైలర్’ చిత్రం నాలుగోది. చిరంజీవి స్టార్డమ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ మెగాస్టార్ రీసెంట్గా యువదర్శకుడు వెంకీ కుడుములకు అవకాశం ఇచ్చారు. ఆల్రెడీ అధికారిక ప్రకటన వచ్చింది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఇప్పటికే ‘ఛలో’, ‘భీష్మ’ వంటి చిత్రాలతో మంచి హిట్స్ సాధించిన జోష్‌లో వెంకీ కుడుముల ఉన్నా రన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, ‘బోళా శంకర్’ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాల షూటింగ్స్ ఓ కొలిక్కి వచ్చాక వెంకీ కుడుములతో చేసే సినిమా ఆరంభమయ్యే అవకాశం ఉంది. ∙‘బాహుబలి’ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు హీరో ప్రభాస్. ఈ స్టార్ హీరో 25వ సినిమాకి దర్శకత్వం వహించే చాన్స్‌ను దక్కించుకున్నారు సందీప్‌రెడ్డి వంగా. ‘స్పిరిట్’ టైటిల్‌తో ఈ చిత్రం తెరకెక్కనుంది. తొలి చిత్రం ‘అర్జున్ రెడ్డి’తో దర్శకుడిగా హిట్ సాధించిన సందీప్ రెడ్డి వంగా ఇదే సినిమాను హిందీలో షాహిద్ కపూర్‌తో ‘కబీర్ సింగ్’గా తీసి, అక్కడా హిట్ సాధించారు. ఆ తర్వాత ప్రభాస్‌తో ‘స్పిరిట్’ చాన్స్‌ను దక్కించుకున్నారు. ప్రస్తుతం రణ్‌బీర్ కపూర్‌తో ‘యానిమల్’ అనే సినిమా చేస్తున్నారు సందీప్. కెరీర్లో పాతిక సినిమాలు చేసి, అగ్రహీరోల జాబితాలో కొనసాగుతున్నారు హీరో ఎన్టీఆర్. అయితే జస్ట్ ఒకే ఒక సినిమా ‘ఉప్పెన’తో ఇండస్ట్రీ తనవైపు చూసేలా చేసుకున్న బుచ్చిబాబు సనకి అవకాశం ఇచ్చారు. రెండో సినిమానే యంగ్ టైగర్‌తో చేసే అవకాశం బుచ్చిబాబుకి లభించడం విశేషం. ప్రస్తుతం కొరటాల శివతో ఎన్టీఆర్ ఓ సినిమా కమిట్ అయ్యారు. ఈ సినిమా షూటింగ్ నవంబరులో ప్రారంభం అవుతుంది. ఆ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్‌తో ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఎనీ్టఆర్. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక ఎన్టీఆర్–బుచ్చిబాబు సినిమా సెట్స్‌కి పైకి వెళుతుందట. ∙ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ఖాతాలో ఓ భారీ సినిమానే ఉంది. ఈ సినిమాకి శంకర్ దర్శకుడు. ఈ చిత్రం తర్వాత చరణ్ నెక్ట్స్ మూవీ తెలుగులో ‘మళ్ళీ రావా’, ‘జెర్సీ’ వంటి హిట్ సినిమాలను తీసిన యువ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో తెరకెక్కాల్సి ఉంది. అయితే ఈ సినిమా కంటే ముందు రామ్‌చరణ్ మరో యువ దర్శకుడితో సినిమా చేయనున్నారనే టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. కన్నడంలో ‘మఫ్తీ’ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమై సూపర్ హిట్ సాధించిన నార్తన్యే ఈ దర్శకుడు. రామ్‌చరణ్ కోసం నార్తన్ ఓ కథను రెడీ చేశారట. ఇది చరణ్‌కు కూడా నచ్చిందట. దీంతో శంకర్ ప్రాజెక్ట్ తర్వాత రామ్‌చరణ్ హీరోగా చేయబోయేది నార్తన్ దర్శకత్వంలోనే అనే టాక్ వినిపిస్తోంది. అంతే కాదు.. కోలీవుడ్ యువ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కూడా రామ్‌చరణ్‌కు ఓ కథ వినిపించారు. అయితే ఈ సినిమాలకు సంబంధించిన అధికారిక ప్రకటనలు రావాల్సి ఉంది. దర్శకుడిగా రెండు సినిమాలే (తెలుగులో ‘తొలిప్రేమ’, ‘రంగ్ దే’) చేసిన వెంకీ అట్లూరి ప్రస్తుతం ధనుష్‌తో ‘సార్’ (తమిళంలో ‘వాత్తి’) అనే సినిమా చేస్తున్నారు. అలాగే తమిళంలో 2021లో వచి్చన ‘రాకీ’ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు అరుణ్ మాథేశ్వరన్. ఆ తర్వాత ‘సాని కాయిదమ్’ (తెలుగులో ‘చిన్ని’) అనే సినిమా చేశారు. ప్రస్తుతం మూడో సినిమానే ధనుష్‌తో చేసే అవకాశాన్ని దక్కించుకున్నారు అరుణ్. వీరిద్దరి కాంబినేషన్లో ‘కెప్టెన్ మిల్లర్’ అనే సినిమా తెరకెక్కుతోంది. వీరే కాదు.. తొలి చిత్రం ‘జాతిరత్నాలు’తో దర్శకుడిగా బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన కేవీ అనుదీప్ ఇటీవల విక్టరీ వెంకటేశ్‌కు, ‘రన్ రాజా రన్’, ‘సాహో’ చిత్రాల ఫేమ్ సుజిత్‌కి పవన్ కల్యాణ్‌తో సినిమా చేసే అవకాశం దక్కిందని టాక్. ఇంకా యువ దర్శకులతో సినిమాలు చేసే టాప్ హీరోల జాబితా పెరిగే అవకాశం ఉంది. -
జోడెద్దులు, నాలుగెకరాల పొలం ఉన్న భాగ్యవంతుడి కథే ‘జైత్ర’
‘‘ఇంజనీరో, డాక్టరో అవుతామని పిల్లలు చెప్పిన మాటలను వారి తల్లిదండ్రులు నమ్ముతారు. అలాగే యాక్టరో, ఫిల్మ్ మేకరో అవుతామని చెప్పినా కూడా తల్లిదండ్రులు నమ్మాలని కోరుకుంటున్నాను. ఫిల్మ్ మేకింగ్ కూడా బాధ్యతతో, గౌరవంతో కూడిన ఉద్యోగం’’ అన్నారు దర్శకుడు వెంకీ కుడుముల. సన్నీ నవీన్, రోహిణీ రేచల్ జంటగా నటించిన చిత్రం ‘జైత్ర’. అల్లం సుభాష్, సురేశ్ కొండేటి నిర్మించిన ఈ సినిమా టైటిల్ లోగో, ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్ కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా హాజరైన వెంకీ కుడుముల మాట్లాడుతూ – ‘‘నా ‘ఛలో’ సినిమాకు అసిస్టెంట్ దర్శకుడిగా చేసిన మల్లి సినిమాకు నేను అతిథిగా రావడం హ్యాపీగా ఉంది. మల్లి చాలా నిజాయితీగా ఈ సినిమా తీసి ఉంటాడని ఆశిస్తున్నాను’’ అన్నారు. ‘‘రాయలసీమలో జోడెద్దులు, నాలుగెకరాల పొలం ఉన్న భాగ్యవంతుడి కథే ‘జైత్ర’’ అన్నారు మల్లికార్జున్. ‘‘ప్రేమిస్తే, జర్నీ, పిజ్జా... ఇలా 15 సినిమాలను రిలీజ్ చేశాను. నిర్మాతగా నాకు మంచి పేరు తీసుకువచ్చే మరో సినిమా ‘జైత్ర’ సుభాష్ గారి ద్వారా వస్తున్నందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు సురేష్ కొండేటి. ‘‘రాయలసీమ యాసతో కూడిన మట్టిమనుషుల కథే ఈ చిత్రం’’ అన్నారు సుభాష్. -
కొత్త సినిమా ప్రకటించిన చిరు, డైరెక్టర్ ఎవరంటే..
Chiranjeevi And Venky Kudumula New Movie: సెకండ్ ఇన్నింగ్‌లో మెగాస్టార్ చిరంజీవి సినిమాల పరంగా దూసుకుపోతున్నాడు. ఖైదీ నెం150తో రీఎంట్రీ ఇచ్చిన చిరు వరసగా ప్రాజెక్ట్స్‌ను ప్రకటిస్తూ యువ హీరోలకు పోటీ ఇస్తున్నాడు. ఇప్పటికే ఆయన ఆచార్య, గాడ్ ఫాదర్, భోళా శంకర్ వంటి చిత్రాలతో బిజీగా ఉండగా తాజాగా మరో కొత్త సినిమాను ప్రకటించాడు. చదవండి: కాజల్‌పై బిగ్‌బాస్ నిర్వాహకులు సీరియస్! ఆ రూల్ బ్రేక్ చేసిందా? చిరంజీవి 156వ చిత్రంగా ఈ మూవీ తెరకెక్కనుంది. ఛలో, భీష్మ వంటి హిట్ చిత్రాలతో గుర్తింపు పొందిన డైరెక్టర్ వెంకీ కుడుముల డైరెక్షన్ ఈ మూవీ రూపొందనుంది. డీవీవీ దానయ్య ఈ మూవీని నిర్మించనున్నట్లు సమాచారం. ఇక త్వరలోనే ఈ మూవీ హీరోయిన్, మిగతా తారగాణంపై ప్రకటన ఇవ్వనున్నారు. Extremely delighted to announce a film with Megastar @KChiruTweets garu under the direction of Successful Director @VenkyKudumula. It's a dream come true for us. Co Produced by Dr. Madhavi Raju. Rolling soon… #MegaStarWithMegaFan pic.twitter.com/QyvWAzotss — DVV Entertainment (@DVVMovies) December 14, 2021 -
జోరు పెంచిన మెగాస్టార్..మరో యంగ్ డైరెక్టర్‌కి గ్రీన్ సిగ్నల్
మంచి దూకుడు మీద ఉన్నారు చిరంజీవి. వరుసగా సినిమాలు కమిట్ అవుతున్నారు. ఇప్పటికే ‘గాడ్‌ఫాదర్’, ‘బోళాశంకర్’, దర్శకుడు బాబీతో సినిమాలు కమిట్ అయిన చిరంజీవి తాజాగా మరో కొత్త సినిమా అంగీకరించారని తెలిసింది. ‘ఛలో’, ‘భీష్మ’ చిత్రాలను తెరకెక్కించిన వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మిస్తారని భోగట్టా. ఆల్రెడీ చిరంజీవికి వెంకీ స్టోరీలైన్ వినిపించారట. ఈ సినిమా గురించి త్వరలో అధికారక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. -
దూకుడు పెంచిన నాగ చైతన్య.. ఆ హిట్ డైరెక్టర్‌తో నెక్స్ట్ సినిమా
అక్కినేని హీరో నాగచైతన్య కెరీర్లో చాలా సెలక్టివ్ కథలతో ముందుకు వెళ్తున్నారు. తాజాగా ఆయన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్‌స్టోరీ మూవీలో నటించారు. సాయిపల్లవి తొలిసారిగా నాగచైనత్యతో జోడీ కట్టిన ఈ సినిమా ఏప్రిల్16న విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. ఇప్పటికే ఈ మూవీలోని టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక లవ్‌స్టోరీ మూవీలోని పాటలు యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఇక విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో థ్యాంక్యూ సినిమాలో నటిస్తున్న చైతూ మరో సినిమాను లైన్లో పెట్టేశాడు. 'చలో, భీష్మ' వంటి విజయవంతమైన చిత్రాలతో హిట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నవెంకీ కుడుములతో ఓ సినిమా ఓకే చేసినట్లు సమాచారం. కామెడీ ఎంటర్టైనర్గా ఈ మూవీ తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఇక బాలీవుడ్‌లోను ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాతో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చైతూ గెస్ట్ రోల్ పోషించనున్నాడు. తెలుగు కుర్రాడి పాత్రలో చైతు కనిపించనున్నట్లు సమాచారం. అయితే చైతూ పాత్ర దాదాపు 18 నిమిషాల నిడివితో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని టాక్ వినిపిస్తోంది. చదవండి : 'డాడీ' మూవీలో చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? శేఖర్ కమ్ములకు కోపం వస్తే... సీక్రెట్ చెప్పిన చై.. నవ్వులే నవ్వులు -
మరోసారి జంటగా నటించనున్న వరుణ్‌తేజ్, సాయిపల్లవి ?
వరుణ్‌తేజ్, వెంకీ కుడుముల కాంబినేషన్లో ఓ మూవీ వస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ‘గని’ అనే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో సాగే చిత్రంతో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్‌తో కలసి ‘ఎఫ్ 3’ చిత్రంలోనూ వరుణ్ నటిస్తున్నారు. అయితే కరోనా కారణంగా ఈ రెండు సినిమాలు ఆగిపోయాయి. అయితే ‘ఛలో, భీష్మ’ సినిమాలతో హిట్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న వెంకీ కుడుముల తన నెక్స్ట్ మూవీని వరుణ్‌తో చేస్తున్నట్లు ఫిల్మ్‌నగర్ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఇటీవల ఆయన వరుణ్ తేజ్ కి ఒక కథ వినిపించడం .. ఆయన ఓకే చెప్పేయడం అంతా చకచకా జరిగిపోయినట్లు సమాచారం. అయితే ఈ సినిమాకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు వైరలవుతోంది. అదేంటంటే ఈ మూవీలో వరుణ్‌తేజ్ సరసన సాయి పల్లవి నటించనుందట. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఆమెతో చర్చలు జరుపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. వరుణ్‌తేజ్, సాయి పల్లవి ఇప్పటికే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఫిదా మూవీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో మరోసారి ఈ జంట తెరపై సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. అన్నీ కుదిరితే దసరాకి చిత్రీకరణ మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మించనున్నట్లు సమాచారం. చదవండి : మూడేళ్లలో రూ.5 కోట్లు పోగొట్టుకున్న సాయి పల్లవి! -
వెంకీ కుడుములతో వరుణ్ మూవీ: దసరాకు ప్రారంభం!
హీరో –డైరెక్టర్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనుందా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ‘గని’ అనే స్పోర్ట్స్ డ్రామా చేస్తున్నారు వరుణ్ తేజ్. అలాగే అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్‌తో కలసి ‘ఎఫ్ 3’ చిత్రంలోనూ నటిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ రెండు సినిమాల చిత్రీకరణకు బ్రేక్ పడింది. ఈ గ్యాప్‌లోనే ‘ఛలో, భీష్మ’ చిత్రాల ఫేమ్ వెంకీ కుడుముల చెప్పిన స్టోరీ లైన్ విన్నారట వరుణ్. వెంకీ చెప్పిన స్టోరీ లైన్ నచ్చడంతో నటించేందుకు పచ్చజెండా ఊపారట వరుణ్ తేజ్. ప్రస్తుతం నటిస్తున్న ‘గని, ఎఫ్ 3’ చిత్రాల షూటింగ్ పూర్తయిన వెంటనే వెంకీ కుడుముల ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నారని సమాచారం. అన్నీ కుదిరితే దసరాకి చిత్రీకరణ మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మించనుందని తెలిసింది. -
త్రివిక్రమ్‌కు అసిస్టెంట్‌గా మారనున్న హిట్ డైరెక్టర్!
ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసి, ‘ఛలో’తో దర్శకుడిగా మారారు వెంకీ కుడుముల. ఆ తర్వాత ‘భీష్మ’ వంటి హిట్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పుడు మళ్లీ గురువు దగ్గర ఓ సినిమాకి దర్శకత్వ శాఖలో చేయనున్నారట వెంకీ. మహేశ్‌బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమాకే వెంకీ పని చేయనున్నారట. రెండు హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన ఓ దర్శకుడు... మళ్లీ దర్శకత్వ శాఖలో సహాయకుడిగా పని చేయడం ఏంటీ అనుకోవచ్చు. త్రివిక్రమ్ దగ్గర సీనియర్ కో–డైరెక్టర్‌గా చేస్తూ వచ్చిన సత్యం ఇటీవల కరోనాతో కన్నుమూశారు. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రానికి దర్శకత్వ శాఖలో చేయమని వెంకీని చిత్రనిర్మాత రాధాకృష్ణ కోరారట. వెంకీ ‘భీష్మ’కు నిర్మాత ఆయనే. పైగా తన దర్శకత్వంలో తెరకెక్కాల్సిన చిత్రానికి ఇంకా టైమ్ ఉండటం, కరోనా పరిస్థితుల్లో చిత్రీకరణ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారడంతో వెంకీ కూడా ఈ సినిమాకి ప్రస్తుతం స్క్రిప్ట్‌పరమైన చర్చల్లో పాల్గొంటున్నారని సమాచారం. చదవండి: కొరటాల ప్రాజెక్ట్‌కు నో చెప్పిన విజయ్.. కారణం ఇదేనట -
ఆ హిట్ డైరెక్టర్‌తోనే వైష్ణవ్ తేజ్ నెక్స్ట్ మూవీ
తొలి సినిమా ఉప్పెన తోనే బాక్సాఫీస్ బద్దలు కొట్టిన మెగా హీరో వైష్ణవ్ తేజ్. తొలి చిత్రంతోనే తనదైన నటనతో సముద్రమంత క్రేజ్ సంపాదించుకొని ఓవర్‌నైట్ స్టార్ అయ్యాడు. దీంతో వైష్ణవ్ తేజ్‌కి ఆఫర్స్ వెల్లువెత్తుతున్నాయి. ఉప్పెన రిలీజ్ కాకముందే క్రిష్ డైరెక్షన్లో ఓ సినిమాను పూర్తి చేశాడు. అయితే అది ఇంకా రిలీజ్ కాలేదు. తొలి సినిమాతోనే బంపర్ సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ కుర్ర హీరో కోసం దర్శకనిర్మాతలు క్యూ కట్టేస్తున్నారు. ఇప్పటికే తమిళ 'అర్జున్ రెడ్డి' దర్శకుడు గిరీశయ్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలె దీనికి సంబంధించిన పూజా కార్యక్రమం పూర్తయ్యింది. ఇది కాకుండా మైత్రీ మూవీస్ బ్యానర్ లో రెండు సినిమాల డీల్ కి కూడా ఓకె చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం వైష్ణవ్..తన నాలుగో సినిమాను భీష్మ డైరెక్టర్ వెంకీ కుడుములతో చేయనున్నాడు. వైష్ణవ్ కోసం వెంకీ కుడుముల మంచి కథను రెడీ చేశాడని, దీనికి వైష్ణవ్ కూడా ఓకే చేసినట్లు సమాచారం. నితిన్ కెరియర్లోనే భీష్మ మంచి కంబ్యాక్ చిత్రంగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ మెగా హీరోకు కూడా మరో బంపర్ హిట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడట. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుంది. మరి ఈ సినిమాలో వైష్ణవ్‌కు జోడీగా ఎవరు ఉంటారన్నది ఇంకా ఫైనల్ కాలేదు. చదవండి : పెళ్లికి రెడీ అవుతున్న అరియానా! వరుడు ఎవరంటే.. యాంకర్ అనసూయ భర్త జాబ్ ఏంటో తెలుసా? -
కొరటాల ప్రాజెక్ట్‌కు నో చెప్పిన విజయ్.. కారణం ఇదేనట
కమర్షియల్ ఎలిమెంట్స్‌ని జోడించి మంచి సందేశాత్మక చిత్రాలను ప్రేక్షకులు అందిచండంతో సిద్ధహస్తుడు దర్శకుడు కొరటాల శివ. ప్రభాస్ ‘మిర్చి’ మొదలు మహేశ్‌బాబు ‘భరత్ అనే నేను’వరకు ఆయన తీసిన ప్రతి సినిమాలో ఓ స్ట్రాంగ్ సోషల్ మెసేజ్ ఉంటుంది. ప్రస్తుతం ఆయన మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్‌తో మరో సినిమా చేయనున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా కొరటాల శివ ఆఫర్‌ని రౌడీ హీరో విజయ్ దేవరకొండ తిరస్కరించాడనే వార్తలు టాలీవుడ్లో చక్కర్లు కొడుతున్నాయి. తన స్నేహితుని కోసం ఓ సినిమా చేయమని అడిగితే విజయ్ దేవరకొండ నో చెప్పారట. వివరాల్లోకి వెళితే.. యువ సుధా ఆర్ట్స్ అధినేత మిక్కిలినేని సుధాకర్, కొరటాల శివ మధ్య మంచి అనుబంధం ఉంది. కొరటాల శివ సక్సెస్ బాటలో దూసుకెళ్లడంతో ఆయన అండతో సుధాకర్ నిర్మాతగా నిలదొక్కుకుంటున్నాడు. ప్రస్తుతానికి ఆయన టాలీవుడ్లో చాలా సినిమాలు నిర్మిస్తున్నాడు. భవిష్యత్తులో కొరటాల తీయబోయే సినిమాలను యువ సుధా ఆర్ట్స్ నిర్మిస్తుంది. ఇక దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నట్లుగా.. కొరటాల శివ టాప్ డైరెక్టర్‌గా కొనసాతున్నప్పుడే తన నిర్మాణ సంస్థను మరింత బలంగా తీర్చిదిద్దుకోవాలని భావిస్తున్నాడట సుధాకర్. కొరటాల కూడా తన స్నేహితుడి బ్యానర్ కోసం కొత్త ప్రాజెక్టులను సెట్ చేయాలని చూస్తున్నాడట. అందులో భాగంగా యువసుధ ఆర్ట్స్, యువ దర్శకుడు వెంకి కుడుముల కాంబినేషన్లో ఓ ప్రాజెక్ట్ ను సెట్ చేశాడట. దీని కోసం రౌడీ హీరోని సంప్రదించారట. అయితే విజయ్ మాత్రం కొరటాల ఆఫర్‌ని సున్నితంగా తిరస్కరించిన్నట్లు తెలుస్తోంది. డేట్స్ ఖాళీగా లేకపోవడం వల్లే కొరటాల ఆఫర్‌ని విజయ్ రిజెక్ట్ చేశాడట. ప్రస్తుతం విజయ్.. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ అనే సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత శివ నిర్వాణ, సుకుమార్ దర్శకత్వంలో సినిమాలు చేయాల్సి ఉంది. ఇలా రాబోయే రెండేళ్ల వరకు విజయ్ డేట్స్ ఖాళీగా లేవట. అందుకే కొరటాల ప్రాజెక్ట్‌కి నో చెప్పాడట. ఇక విజయ్ నో చెప్పడంతో ఈ ప్రాజెక్టు కోసం మరో హీరోని వెతికే పనిలో ఉన్నాడట కొరటాల శివ. చదవండి: సోహైల్‌కు ఖరీదైన బైక్ బహుమతిగా ఇచ్చిన ఫ్యాన్ ఆ కారణంతో క్రేజీ ఆఫర్లు వదులుకున్న ‘చిట్టి’ -
మహేశ్ బాబు నిర్మాతగా మరో క్రేజీ ప్రాజెక్ట్
సూపర్ స్టార్ మహేశ్ బాబు నిర్మాత మరో క్రేజ్ ప్రాజెక్ట్ రానుంది. ఇప్పటికే ఆయన అడవి శేషు హీరోగా ‘మేజర్’ మూవీని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన యువ హీరో నవిన్ పోలిశెట్టి హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ మూవీని నిర్మించనున్నట్లు తాజా సమాచారం. పూర్తి ఎంటర్టైన్మెంట్తో ప్లాన్ చేస్తున్న ఈ మూవీపై ఇప్పటికే ప్రాథమిక చర్చలు జరుగినట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఇక పూర్తి తారాగాణాన్ని నిర్ణయించాకే దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సినీ వర్గాల సమాచారం. కాగా ఆయన నటించిన శ్రీమంతుడుతోనే మహేశ్ నిర్మాతగా మారారు. అయితే ఇందులో స్టీపింగ్ పార్టనర్‌గా ఉన్న ఆయన ‘మేజర్’తో నిర్మాతగా పూర్తి ఫోకస్ పెట్టాడు. ఈ మూవీని సోనీ సంస్థతో కలిసి నిర్మిస్తున్నాడు. ఆయన స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ మూవీని జూలై 2వ తేదీన విడుదల చేసేందుకు ప్లాన్ చేసినట్లు ఇటీవల చిత్రం బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. చదవండి: ‘ఆదిపురుష్’ డైరెక్టర్ కండీషన్ పూజను మిస్సయ్యా.. బాధగా ఉంది :పూజా హెగ్డే ప్రభాస్‌కు పోటీగా మహేశ్ ‘రామాయణం’.. సీతగా స్టార్ హీరోయిన్! -
డైరెక్టర్‌కే సినిమా చూపించారు
-
‘భీష్మ’ డైరెక్టర్ వెంకీ కుడుములకు టోకరా..
సాక్షి, హైదరాబాద్: నితిన్ కథానాయకుడిగా నటించిన ‘భీష్మ’ చిత్రం పేరు చెప్పి, ఆ సినిమా దర్శకుడు వెంకీ కుడుములకు సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. త్వరలో జరుగనున్న అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఆ చిత్రాన్ని నామినేట్ చేస్తామంటూ నమ్మబలికారు. ఆయన నుంచి రూ. 66 వేలు డిపాజిట్ చేయించుకుని మోసం చేశారు. వెంకీ సోమవారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. డైరెక్టర్ వెంకీ కుడుములకు ఇటీవల ఓ గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. మీ దర్శకత్వంలో వచ్చిన ‘భీష్మ’ చిత్రం అద్భుతంగా ఉందని చెప్పారు. దీన్ని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఆరు కేటగిరీల్లో నామినేట్ చేయాలని నిర్ణయించామని పేర్కొన్నాడు. తాను ఆ ప్యానల్లో కీలక సభ్యుడిని అని, గోప్యత వహించాల్సిన అంశం కావడంతో రహస్యంగా ఇలా ఫోన్ చేశానని నమ్మబలికాడు. ఆ ఫెస్టివల్లో నామినేట్ చేయడానికి ఒకో కేటగిరికి రూ.11 వేలు చొప్పున ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని అన్నాడు. దీనికి వెంకీ అంగీకరించడంతో ఓ బ్యాంకు ఖాతా వివరాలు పంపిన నేరగాడు అందులో డబ్బు డిపాజిట్ చేయమన్నాడు. సైబర్ నేరగాడు చెప్పింది నిజమేనని నమ్మిన వెంకీ మొత్తం రూ.66 వేలు ఆ బ్యాంకు ఖాతాలోకి పంపాడు. మరుసటి రోజు మళ్లీ డైరెక్టర్ వెంకీకి ఫోన్ చేసిన సైబర్ నేరగాడు కొత్త కథ చెప్పాడు. ఆరింటిలోనూ మూడు కేటగిరిలకు సంబంధించి నామినేట్ చేసే విషయంలో చిన్న పొరపాటు జరిగిందంటూ క్షమాపణలు చెప్పాడు. వాటిని సరిచెయ్యడానికి మరికొంత మొత్తం చెల్లించాల్సి వస్తుందంటూ చెప్పాడు. దీంతో అనుమానం వచ్చిన వెంకీ సదరు చిత్ర నిర్మాత నామినేషన్ పర్వం వద్దన్నారంటూ చెప్పి తాత్కాలికంగా దాట వేశారు. ఆపై పూర్వాపరాలు పరిశీలించిన ఆయన జరిగిన మోసం తెలుసుకున్నారు. దీనిపై సోమవారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. నేరగాడు వినియోగించిన ఫోన్ నెంబర్లు, వెంకీ డబ్బు పంపిన ఖాతాల వివరాల ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: చరణ్‌ను మెప్పించిన ‘భీష్మ’ డైరెక్టర్ 'భీష్మ' డైరెక్టర్‌కు లగ్జరీ కారు గిఫ్ట్ ఇచ్చిన నితిన్ నో చెప్పిన చెర్రీ.. మహేష్ గ్రీన్ సిగ్నల్! -
నో చెప్పిన చెర్రీ.. మహేష్ గ్రీన్ సిగ్నల్!
సూపర్ స్టార్ మహేష్ బాబు తన తదుపరి చిత్రం ‘సర్కారు వారి పాట’ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచానాలే నెలకొన్నాయి. మహానటి ఫేం కీర్తి సురేష్ ఈ సినిమాతో తొలిసారి మహేష్‌తో జోడీ కట్టనున్నారు. గీతా గోవిందం దర్శకుడు పరుశురామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీలో మహేష్‌కు సంబంధించిన ఓ వార్త వినిపిస్తోంది. సర్కారు వారి పాట సినిమా అనంతరం మహేష్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. నితిన్, రష్మిక మందన కాంబినేషన్లో వచ్చిన భీష్మ సూపర్ హిట్ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా దర్శకుడు వెంకీ కుడుముల ఇటీవల ఓ సరికొత్త కథతో రామ్ చరణ్‌ను కలిసినట్లు తెలుస్తోంది. అయితే అందులో తన పాత్ర నచ్చకపోవడంతో చరణ్ ఈ సినిమాకు నో చెప్పాడట. చదవండి: మహేష్‌కు బ్యాంక్ రెడీ అవుతోంది! దీంతో వెంటనే వెంకీ సూపర్ స్టార్ మహేష్ వద్దకు వెళ్లి కథ వినిపించినట్లు వినికిడి. తరువాత కథ విన్న మహేష్ ఈ సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అన్ని కుదిరితే త్వరలోనే వీరిద్దరి కలయికలో త్వరలోనే ఓ సినిమా వచ్చే అవకాశం ఉంది. కాగా ఈ విషయాలపై ఇంకా అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్(రౌద్రం,రణం, రుధిరం) చేస్తున్నాడు. ఈ సినిమా అనంతరం వంశీ పైడిపల్లి దర్వకత్వంలో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. చదవండి: ఆచార్య: భారీ సెట్.. అన్ని కోట్ల ఖర్చా! -
డైరెక్టర్‌కు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన నితిన్
హీరో నితిన్‌కు నాలుగేళ్ల తర్వాత మంచి బ్రేక్ ఇచ్చిన భీష్మ సినిమా డైరెక్టర్ వెంకీ కుడుములకు నితిన్ మంచి గిఫ్ట్ ఇచ్చాడు. బుధవారం దర్శకుడు వెంకీ పుట్టినరోజు సందర్భంగా ఖరీదైన రేంజ్ రోవర్ కారును ఇచ్చి సర్ప్రైజ్ చేశాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వెంకీ కుడుముల దర్శకత్వంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో వచ్చిన భీష్మ చిత్రం మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. నితిన్, రష్మికా మందన్నా జంటగా నటించిన ఈ సినిమా మంచి వసూళ్లనే రాబట్టింది. నాలుగేళ్ల తర్వాత నాకు హిచ్ వచ్చిందంటూ హీరో నితిన్ స్వయంగా చెప్పాడు. ఖరీదైన కారును గిఫ్ట్‌గా ఇవ్వడం పట్ల డైరెక్టర్ వెంకీ ఆనందం వ్యక్తం చేశాడు. (జిమ్ ట్రైనర్‌కు ప్రభాస్ గిఫ్ట్) ‘ఉత్తమ వ్యక్తులతో మంచి సినిమాలు చేస్తే ఇలాంటివే జరుగుతాయి. ఇంత మంచి బహుమతి ఇచ్చినందుకు థ్యాంక్యూ’ అంటూ తన సంతోషాన్ని ట్విటర్ ద్వారా తెలియజేశాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ వెంకి కుడుములతో కలిసి తన తర్వాతి సినిమాను పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నాడట. ఇప్పటికే చరణ్‌కు వెంకీ స్క్రిప్ట్ కూడా వినిపించాడట. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్నారని సమాచారం. ఇప్పటికే ‘ఛలో’, ‘భీష్మ’ లాంటి సినిమాలతో కామెడీ, యాక్షన్, లవ్ ట్రాక్ లను బాగా ప్రొజెక్ట్ చేయగల వెంకీ కుడుముల స్టార్ డైరెక్టర్‌గా పేరు సంపాదించుకున్నారు. (తెలుగు సీరియల్ నటి ఆత్మహత్య) When u make a best film with the best person, best things happen ! Thank you so much for this best birthday gift @actor_nithiin anna.. Love u loads.. 😍😘🤗🤩 pic.twitter.com/JX5cw38e6f — Venky Kudumula (@VenkyKudumula) September 8, 2020 -
చరణ్‌ను మెప్పించిన ‘భీష్మ’ డైరెక్టర్
సాక్షి, హైదరాబాద్: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా మేజర్ షెడ్యూల్ పూర్తయినప్పటికీ కరోనా ఎఫెక్ట్ తో మిగతా షూటింగ్ ఆగిపోయింది. అయితే ఇప్పటి వరకూ రామ్ చరణ్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను మాత్రం ప్రకటించలేదు. జెర్సీ మూవీ డైరెక్టర్ గౌతమ్ తిన్నూరితో రామ్ చరణ్ సినిమా ఉంటుందని వార్తలు వినిపించినా ఇప్పటి వరకూ దానిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే ఇప్పుడు చరణ్ మరో దర్శకుడికి ఛాన్స్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. (చదవండి: పవన్ చిత్రంలో మెగాపవర్ స్టార్?) ఇటీవల హీరో నితిన్‌తో ‘భీష్మ’ సినిమా తీసి సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ వెంకీ కుడుములకు చరణ్ చాన్స్ ఇవ్వనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలవడంతో పాటు హీరో నితిన్‌కు కూడా మంచి కమర్షియల్ హిట్ అందించింది. దీంతో ఈ డైరెక్టర్‌కు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ వచ్చింది. అయితే ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ వెంకి కుడుములతో కలిసి తన తర్వాతి సినిమాను పట్టాలెక్కించే ఆలోచనలో ఉన్నాడట. ఇప్పటికే చరణ్‌కు వెంకీ స్క్రిప్ట్ కూడా వినిపించాడట. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్నారు. ఇప్పటికే ‘ఛలో’, ‘భీష్మ’ లాంటి సినిమాలతో కామెడీ, యాక్షన్, లవ్ ట్రాక్ లను బాగా ప్రొజెక్ట్ చేయగల వెంకీ కుడుములకు స్టార్ డైరెక్టర్‌గా ఎదగడానికి ఇదొక మంచి అవకాశమని చెప్పుకోవచ్చు. (చదవండి: ‘ఆర్ఆర్ఆర్’ ట్రయిల్ షూట్ రద్దు.. అందుకేనా!) -
నాలుగేళ్ల తర్వాత హిట్ వచ్చింది
‘‘భీష్మ’ సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మా టీమ్ ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న హిట్ ఇది. నేను బాగా నటించాను.. నవ్వించానని అంటుంటే సంతోషంగా ఉంది. డైరెక్టర్ వెంకీని కాపీ కొట్టానంతే. అతను ఎలా చెయ్యమంటే అలా చేశాను కాబట్టే నా నటన బాగుందంటున్నారు’’ అని నితిన్ అన్నారు. వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్, రష్మికా మందన్నా జంటగా నటించిన చిత్రం ‘భీష్మ’. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన విజయోత్సవంలో నితిన్ మాట్లాడుతూ –‘‘భీష్మ’ హిట్‌తో చాలామందికి వెంకీ జవాబు చెప్పాడు. నాలుగేళ్ల తర్వాత నాకు హిట్ వచ్చింది.. అందుకే ఎమోషన్ అవుతున్నా. ఈ సినిమాలో రష్మికతో కంటే సంపత్ రాజ్‌తో నా కెమిస్ట్రీ ఇంకా బాగా కుదిరిందని అంటున్నారు. ‘ఛలో’తో వెంకీకి, ‘భీష్మ’తో నాకు రష్మిక బ్రేక్ ఇచ్చింది. ‘అ ఆ’తో నా కెరీర్లో బిగ్గెస్ట్ హిట్టిచ్చిన బ్యానర్లోనే నాకు మళ్లీ హిట్ వచ్చింది.. ఈ సంస్థలో మరెన్నో సినిమాలు చెయ్యాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘భీష్మ’ చిత్రం పంపిణీదారుడు, నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ –‘‘ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో నేను చెప్పినట్లే ప్రేక్షకులు సూపర్ హిట్ చేశారు. ‘ఛలో’తో హిట్ కొట్టిన వెంకీ ‘భీష్మ’తో సూపర్ హిట్ కొట్టాడు.. ఇక హ్యాట్రిక్‌కు రెడీ అవుతున్నాడు. నితిన్‌తో ‘శ్రీనివాస కల్యాణం’ చిత్రంతో హిట్ కొట్టాలనుకున్నాం. కానీ, కుదరలేదు. హీరోలతో పోటీ పడుతూ రష్మిక డ్యాన్స్ చేస్తోంది. సినిమాలో మంచి కామెడీ, కంటెంట్ బలంగా ఉంటే ప్రేక్షకులు హిట్ చేస్తారని ‘ప్రతిరోజూ పండగే’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘అల వైకుంఠపురములో’, ‘భీష్మ’ సినిమాలు నిరూపించాయి’’ అన్నారు. వెంకీ కుడుముల మాట్లాడుతూ –‘‘నా కథని నమ్మి అవకాశం ఇచ్చిన చినబాబు, వంశీ, నితిన్‌గార్లకు థ్యాంక్స్. నా సాంకేతిక నిపుణులంతా బాగా సహకారం అందించడం వల్లే నేను అనుకున్న విధంగా సినిమా తీశాను. ‘దిల్’ సినిమా నుంచి నితిన్‌ను అభిమానిస్తూ వస్తున్నా. కలిసి పని చేసేటప్పుడు ఆయన ప్రవర్తనకూ నేను అభిమానినైపోయా’’ అన్నారు. ‘‘భీష్మ’లో నాకు మంచి పాత్ర ఇచ్చినందుకు వెంకీకి రుణపడి ఉంటాను. భీష్మ పాత్రలో నితిన్‌ను చూసి అభిమానిని అయిపోయాను’’ అన్నారు రష్మికా మందన్నా. ఈ విజయోత్సవంలో సూర్యదేవర నాగవంశీ, కెమెరామేన్ సాయి శ్రీరామ్, సంగీత దర్శకుడు మహతి స్వరసాగర్, నటులు ‘శుభలేఖ’ సుధాకర్, సంపత్ రాజ్, పాటల రచయితలు కాసర్ల శ్యామ్, శ్రీమణి, ఆర్ట్ డైరెక్టర్ సాహి సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
నాలుగేళ్ల తర్వాత హిట్: నితిన్ భావోద్వేగం
యంగ్ హీరో నితిన్ తాజా చిత్రం 'భీష్మ' బాక్సాఫీస్‌లో దూసుకుపోతోంది. ఫిబ్రవరి 21న విడుదలైన ఈ చిత్రం అసలు సిసలైన కామెడీతో థియేటర్లో ప్రేక్షకుడికి గిలిగింతలు పెడుతోంది. సితార ఎంటర్టైర్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రంలో రష్మికా మందన్న నాయిక. 'ఛలో' ఫేమ్ వెంకీ కుడుముల దర్శకుడు. ఈ సినిమా విజయాన్ని పురస్కరించుకుని చిత్రబృందం మంగళవారం హైదరాబాద్‌లోని దసపల్లా హోటల్లో విజయోత్సవ వేడుక నిర్వహించింది. వివరాల్లోకి వెళితే.... నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ‘ప్రీ రిలీజ్ ఈవెంట్లో నేను చెప్పినట్లే ప్రేక్షకులు ఈ సినిమాను సూపర్ హిట్ చేశారు. తొలి సినిమా 'ఛలో'తో హిట్ కొట్టిన వెంకీ, ఇప్పుడు రెండో సినిమా 'భీష్మ'తో సూపర్ హిట్ కొట్టాడు. ఇక హ్యాట్రిక్‌కు రెడీ అవుతున్నాడు. డైరెక్టర్ విజన్ పర్ఫెక్టుగా ఉంటే 'భీష్మ'కు వచ్చిన ఫలితమే వస్తుంది. రష్మికలో అసాధారణ ఎనర్జీ ఉంది. హీరోలతో పోటీపడుతూ డ్యాన్స్ చేస్తుంది, చక్కగా నటిస్తుంది. నితిన్‌తో మేం 'శ్రీనివాస కల్యాణం'తో హిట్ కొట్టాలనుకున్నాం కానీ, కుదరలేదు. సినిమాలో మంచి కామెడీ, కంటెంట్ బలంగా ఉంటే హిట్ చేస్తారని ప్రతిరోజూ పండగే, సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో, ఇప్పుడు భీష్మ నిరూపించాయి. ఈ సినిమాను యూత్ బాగా ఆదరిస్తున్నారు" అని చెప్పారు. హీరో నితిన్ మాట్లాడుతూ ‘సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు బిగ్ థాంక్స్. మా టీం ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న హిట్ ఇది. నితిన్ బాగా నవ్వించాడు, బాగా చేశాడంటుంటే హ్యాపీగా ఉంది. నేను చేసిందల్లా డైరెక్టర్ వెంకీని కాపీ కొట్టడమే. అతను ఎలా చెయ్యమంటే అలా చేశాను కాబట్టే నా నటన బాగుందంటున్నారు. ఈ సినిమా కోసం వెంకీ చాలా కష్టపడ్డాడు. ఈ హిట్‌తో చాలామందికి అతను జవాబు చెప్పాడు. నాలుగేళ్ల తర్వాత నాకు హిట్ వచ్చింది. అందుకే ఎమోషనల్ అవుతున్నా. కన్నీళ్లు కనబడకూడదనే అద్దాలు పెట్టుకున్నా. ఇక రష్మికతో కంటే సంపత్ రాజ్‌తో నా కెమిస్ట్రీ ఇంకా బాగా వర్కవుట్ అయ్యిందని అంటున్నారు. 'ఛలో'తో వెంకీకి, 'భీష్మ'తో నాకు రష్మిక బ్రేక్ ఇచ్చింది. తను ఇంకా ఎన్నో హిట్లు కొట్టి ఇంకా ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నా’నని పేర్కొన్నారు. (భీష్మ మూవీ రివ్యూ) దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ 'దిల్' సినిమా నుంచి నేను నితిన్‌ను అభిమానిస్తూ వస్తున్నా. ఆయనను అభిమానించేవాడిగానే ఈ సినిమా తీశాను. కలిసి పనిచేసేటప్పుడు ఆయన ప్రవర్తనకూ నేను అభిమానినైపోయా. నా ఊహకు భిన్నంగా కథ చెప్పగానే వెంటనే ఒప్పుకొని రష్మిక ఈ సినిమా చేసింది. తను స్నేహానికి విలువ ఇచ్చిందన్నారు. హీరోయిన్ రష్మికా మందన్న మాట్లాడుతూ ‘ఇందులో నాకొక మంచి పాత్ర ఇచ్చినందుకు దర్శకుడు వెంకీకి రుణపడి ఉంటాను. 'భీష్మ' పాత్రలో నితిన్‌ను చూసినప్పుడు అతని అభిమానిని అయిపోయాను. సినిమాలో అతను కనిపించిన తీరునూ, అతని నటననూ నిజంగా ఇష్టపడ్డానని పేర్కొన్నారు. గేయరచయిత కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ ‘నేను రాసిన వాటే బ్యూటీ పాటకు వచ్చిన రెస్పాన్స్ చూసి చాలా ఆనందం వేసిందన్నారు. ఇది 'హాసమ్' సక్సెస్ అని మరో గేయ రచయిత శ్రీమణి అన్నారు. ఈ బ్యానర్ తో 'జులాయి' సినిమా నుంచి అనుబంధం ఉందన్నారు. సంగీత దర్శకుడు మహతి స్వరసాగర్ మాట్లాడుతూ ‘మా తండ్రులు గర్వపడేలా 'భీష్మ'ను వెంకీ రూపొందించారు. ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ కావడం చాలా ఆనందాన్నిస్తోందని పేర్కొన్నారు. నటుడు సంపత్ రాజ్ మాట్లాడుతూ, "నాకు 'తియ్యరా బండి' అనే డైలాగ్ చెప్పీ చెప్పీ విసుగొచ్చేసింది. ఈ సినిమాలో దానికి భిన్నమైన క్యారెక్టర్ ఇవ్వగా దానికి ప్రశంసలు రావడం సంతోషకరమన్నారు. ఈ వేడుకలో సినిమాటోగ్రాఫర్ సాయి శ్రీరామ్, ఆర్ట్ డైరెక్టర్ సాహి సురేష్ తదితరులు పాల్గొన్నారు.(హైదరాబాద్‌లో ఇల్లు కొనుక్కుంటా: రష్మిక) -
పవన్‌తో 'భీష్మ' యూనిట్
సాక్షి, హైదరాబాద్: నితిన్ నటించిన తాజా చిత్రం 'భీష్మ' విజయం సాధించడంతో నితిన్‌తో పాటు చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల పవన్ కల్యాణ్‌ని కలిసారు. ఈ సందర్భంగా పవన్ చిత్ర బృందాన్ని, నితిన్‌ను అభినందించారు. ‘భీష్మ సినిమా ఘన విజయం సాధించినందుకు గాను చిత్ర యూనిట్‌ను పవర్ స్టార్ ప్రశంసించారు. ఈ విషయంపై నితిన్ తన ట్విటర్ అకౌంట్లో ఫోటోలు షేర్ చేస్తూ.. 'వెలకట్టలేని క్షణం.. మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను సర్’ అంటూ ట్వీట్ చేశారు. చదవండి: ‘డబుల్ కంగ్రాట్యూలేషన్స్ నితిన్’ ఇక దర్శకుడు వెంకీ కుడుముల కూడా తన ట్విటర్ ఖాతాలో.. ‘భీష్మ సినిమా తీసినందుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నన్ను అభినందించారు. ఈ క్షణం నాకైతే జీవితాంతం గుర్తిండిపోతుంది’ అంటూ ట్వీట్లో పేర్కొన్నారు. కాగా.. భీష్మ చిత్రం ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్ళని రాబడుతూ.. నితిన్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా దూసుకుపోతోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ చిత్రంతో పాటు క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చారిత్రాత్మక చిత్రంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. చదవండి: ‘భీష్మ’ మూవీ రివ్యూ POWERSTAR congratulating BHEESHMA team for its success!! Priceless moment..love you forever sirr 😍😍😍🤗🤗🤗@VenkyKudumula @vamsi84 @SitharaEnts pic.twitter.com/y38ZKF66zr — nithiin (@actor_nithiin) February 24, 2020 -
‘భీష్మ’ మూవీ రివ్యూ
-
‘భీష్మ’ మూవీ రివ్యూ
టైటిల్: భీష్మ టైటిల్: రొమాంటిక్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ నటీనటులు: నితిన్, రష్మిక మందన, అనంత్ నాగ్, జిష్‌సేన్ గుప్త, వెన్నెల కిశోర్, రఘుబాబు తదితరులు దర్శకత్వం: వెంకీ కుడుముల సంగీతం: మహతి స్వర సాగర్ నిర్మాత: సూర్యదేవర నాగవంశీ బ్యానర్: సితార ఎంటర్టైన్మెంట్ నిడివి: 150.45 నిమిషాలు ‘అఆ’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత యంగ్ హీరో నితిన్ హీరోగా వచ్చిన లై, చల్‌మోహన్‌రంగ, శ్రీనివాస కళ్యాణం చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి. దీంతో గ్యాప్ తీసుకున్న నితిన్ తన తరువాత సినిమా కోసం ఆచితూచి అడుగేశాడు. ‘ఛలో’తో మంచి క్రేజ్ సంపాదించిన వెంకీ కుడుముల చెప్పిన ‘భీష్మ’ స్క్రిప్ట్‌కు నితిన్ లాక్ అయ్యాడు. రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేశాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా నితిన్‌ను మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కించిందా? రష్మిక గ్లామర్ ఈ చిత్రానికి ఎంతవరకు పనిచేసింది? టీజర్, ట్రైలర్ రేంజ్లో సినిమా ఉందా? అనేది మన సినిమా రివ్యూలో తెలుసుకుందాం. కథ: తాను ఐఏఎస్ అని భీష్మ (నితిన్) చెప్పుకుంటూ అమ్మాయిల వెంట పడతాడు. పరిచయం అయిన కొద్ది నిమిషాల్లోనే భీష్మకు బైబై చెప్పి వెళ్లి పోతారు. ఎందుకంటే అతడు చెప్పిన ఐఏఎస్‌కు అర్థం కలెక్టర్ అని కాదు.. ఐయామ్ సింగిల్ అని. డిగ్రీ డ్రాపౌట్ అయిన భీష్మ సోషల్ మీడియాలో మీమ్స్ క్రియేట్ చేసి పోస్ట్ చేస్తూ కాలం వెళ్లదీస్తుంటాడు. అయితే అనుకోకుండా చైత్ర(రష్మిక)ను తొలి చూపులోనే ఇష్టపడి, వెంటపడతాడు. తొలుత భీష్మను అసహ్యించుకునే చైత్ర తర్వాత జరిగిన కొన్ని సంఘటనల తర్వాత అతడి ప్రేమలో పడుతుంది. అంత సవ్యంగా సాగుతున్న తరుణంలో ఏసీపీ దేవా(సంపత్) తన కూతురు చైత్రను భీష్మ ప్రేమిస్తున్నాడని తెలుసుకొని అతడి తలపై గన్ ఎక్కుపెడతాడు. ఈ సమయంలో భీష్మ తండ్రి ఆనంద్ (నరేశ్) ఓ సంచలన విషయాన్ని చెబుతాడు. ఎనిమిది వేల కోట్ల రూపాయలకు పైగా టర్నోవర్ కలిగిన భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీకి భీష్మ సీఈఓ అని, పెద్దాయన భీష్మ (అనంత్ నాగ్) మనవడు అని చెబుతాడు. దీని తర్వాత చైత్ర భీష్మను దూరంగా పెడుతుంది. మరోవైపు భీష్మ ఆర్గానిక్ కంపెనీని నేల మట్టం చేయడానికి ఫీల్డ్ సైన్స్ కంపెనీ విశ్వపయత్నాలు చేస్తుంటుంది. చివరికి ఫీల్డ్ సైన్స్ ప్రయత్నాలు సఫలమయ్యాయా? లేక హీరో అడ్డుకున్నాడా? అసలు ఇంతకీ ఆనంద్ చెప్పింది నిజమేనా? లేక కొడుకును కాపాడుకోవాడానికి చెప్పిన అబద్దమా? చైత్ర భీష్మను ఎందుకు దూరం పెట్టింది? భీష్మ ఆర్గానిక్ ఫుడ్ కంపెనీకి హీరోకు ఉన్న సంబంధం ఏమిటి? ఈ కథలోకి రాఘవన్ (జిషుసేన్ గుప్తా), పరిమళ్ (వెన్నెల కిశోర్), జేపీ (బ్రహ్మాజీ)లు ఎందుకు ఎంటర్ అవుతారు? అనేదే భీష్మ సినిమా అసలు కథ. నటీనటులు: ఈ సినిమాలో భీష్మగా కనిపించిన నితిన్ తనదైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఫస్టాఫ్‌లో అల్లరిచిల్లరగా తిరిగే బ్యాచ్‌లర్‌గా కనిపించిన నితిన్, సెకండాఫ్‌లో కంపెనీ సీఈఓగా హుందాగా కనిపించాడు. అమ్మాయిల వెంట పడే రోమియోగా, అప్పుడప్పుడు మంచి వాక్యాలు చెప్పి ఇతరులను ఇంప్రెస్ చేసే తనలోని మరో కోణాన్ని బయటపెడుతుంటాడు. తన నటనలో డిఫరెంట్ షేడ్స్‌ను చూపించి నటుడిగా మరో మెట్టు ఎక్కాడు. చైత్రగా కనిపించిన రష్మిక నితిన్‌తో పోటీ పడి మరీ నటించిందనే చెప్పాలి. తన అందం, అభినయంతో మెస్మరైజ్ చేసింది. క్యూట్ ఎక్స్ప్రెషన్స్, చెప్పే చిన్నిచిన్ని డైలాగ్‌లు చాలా ముద్దుగా ఉంటాయి.అంతేకాకుండా నితిన్‌తో కలిసి రష్మిక డ్యాన్స్‌లతో అదరగొట్టింది. అనంత్ నాగ్ తన అనుభవాన్ని రంగరించి పెద్దాయన భీష్మ పాత్రను అవలీలగా చేశాడు. వెన్నెల కిశోర్, రఘుబాబు, జేపీల కామెడీ టైమింగ్ సూపర్బ్‌గా ఉంటుంది. విలన్‌గా కనిపించిన జిషుసేన్ గుప్త క్లాస్ విలన్‌గా కనిపించాడు. అయితే అశ్వథ్థామ చిత్రంలో చూసినట్టు ఈ చిత్రంలో కనిపిస్తాడు. హెబ్బా పటేల్ కనిపించేది రెండు మూడు సీన్లలో అయినా ఆకట్టుకుంటుంది. విశ్లేషణ: ఈ సినిమా కథ మొత్తం భీష్మ (నితిన్, అనంత్ నాగ్, ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ) చుట్టే తిరుగుతుంది. అనుకున్న కథ ఎక్కడా డీవియేట్ కాకుండా, అనవసర హంగుల విషయాలకు వెళ్లకుండా దర్శకుడు వెంకీ కుడుముల చాలా జాగ్రత్తగా, పద్దతిగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అతడు చెప్పాలనుకున్న పాయింట్‌ను పక్కాగా తెరపై ప్రజెంట్ చేశాడు. ఈ విషయంలో అతడికి నూటికి నూరు మార్కులు పడతాయి. అనంత్ నాగ్ ఆర్గానిక్ వ్యవసాయం గొప్పతనం గురించి చెప్పే స్పీచ్‌తో సినిమా ఆరంభం అవుతుంది. వెంటనే హీరో సాదాసీదా ఎంట్రీ ఇస్తాడు. ఆ తర్వాత ఎంటర్టైన్మెంట్ ఎక్కడ తగ్గకుండా, కథ పక్కదారి పట్టకుండా సినిమా సాగుతుంది. హీరోయిన్ ఎంట్రీ, వెన్నెల కిశోర్, సంపత్, నరేశ్, నితిన్, బ్రహ్మాజీల కామెడీ, నితిన్, రష్మికల మధ్య వచ్చే సీన్లతో ఫస్టాఫ్ సాఫీగా సాగుతుంది. ఇంటర్వెల్‌కు ముందు వచ్చే ట్విస్ట్ అదిరిపోతుంది. ఇక సెకండాఫ్ కామెడీతోనే మొదలవుతుంది. ఆ తర్వాత అనూహ్య మలుపులు తిరుగుతుంది. ట్విస్టుల మీద ట్విస్టులు రివీల్ అవుతాయి. ముఖ్యంగా రెండో అర్థభాగం ఆర్గానికి వ్యవసాయం చుట్టూ తిరుగుతున్నా ఎక్కడా బోర్ కొట్టదు. వ్యవసాయానికి శృతి మించని ఎంటర్టైన్మెంట్ జోడించడం బాగుంటుంది. ఇక కొన్ని పంచ్ డైలాగ్‌లు వావ్ అనిపించేలా ఉంటాయి. ఇక ఈ సినిమాలో హీరో అంతగా చదువుకోలేదు.. డబ్బులు ఉన్నవాడు కాదు.. కానీ అనుకున్నది సాధిస్తాడు. ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తాడు. ఆశయం గొప్పదయితే ప్రకృతే మనకు అదృష్టంగా మారి మన విజయానికి సహకరిస్తుందని ‘భీష్మ’ సినిమాతో మరోసారి రుజువైంది. ఇక సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. మ్యూజిక్ డైరెక్టర్ మహతి స్వర సాగర్ అందించిన పాటలు ఎంతటి హిట్ సాధించాయే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. సింగర్స్, లిరక్ రైటర్స్ తమ వంతు న్యాయం చేశారు. స్క్రీన్‌ప్లే గజిబిజీగా కాకుండా క్లీన్‌గా సాగుతుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సాయి శ్రీరామ్ తన కెమెరా పనితనంతో సినిమాను చాలా రిచ్‌గా చూపించారు. ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టు ఉన్నాయి. ఎక్కడా కూడా వెనక్కితగ్గకుండా ఖర్చు నిర్మాత నాగవంశీ ఖర్చు చేసినట్టు సినిమా చూస్తే అర్థమవుతుంది. ఫైనల్‌గా చెప్పాలంటే.. దర్శకుడి ప్రతిభ, ఆకట్టుకునే నటీనటులు నటన, అలరించే సంగీతం ఇలా అన్నీ కలబోసి వచ్చిన చిత్రం ‘భీష్మ’ . పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్.. పైసా వసూల్ చిత్రం. ప్లస్ పాయింట్స్: నితిన్ నటన రష్మిక గ్లామర్ అండ్ క్యూట్‌నెస్ కామెడీ మైనస్ పాయింట్స్: విలనిజం ఆకట్టుకోకపోవడం రెగ్యులర్ కమర్షియల్ ఫార్మట్ కావడం - సంతోష్ యాంసాని, సాక్షి వెబ్‌డెస్క్ -
ప్రతి సినిమా పరీక్షే
‘‘నా మొదటి సినిమా ‘ఛలో’ విడుదలయ్యాక, నేను రాసింది నాకే కాదు ఆడియన్స్‌ని కూడా నవ్విస్తుందనే నమ్మకం వచ్చింది. మొదటి సినిమాలానే రెండో సినిమాకి కూడా అదే భయం, నిజాయతీతో పని చేశాను. ప్రతి సినిమా పరీక్షలానే భావించి పని చేస్తాను’’ అన్నారు దర్శకుడు వెంకీ కుడుముల. ఆయన దర్శకత్వంలో నితిన్, రష్మికా మందన్నా జంటగా నటించిన చిత్రం ‘భీష్మ’. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఇవాళ విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ – ‘‘ఛలో’ సినిమా పూర్తయిన తర్వాత నితిన్‌గారితో సినిమా చేయాలనే కమిట్మెంట్ ఉంది. పూర్తి స్క్రిప్ట్ రెడీ అయ్యాకే షూటింగ్ చేద్దాం అని నితిన్‌గారు చెప్పారు. కొంచెం లేట్ అయినా అలానే చేశాం. బౌండ్ స్క్రిప్ట్ వల్ల చిత్రీకరణ సులువుగా జరిగిపోయింది. ఈ సినిమాలో ఇద్దరు భీష్మలు ఉంటారు. ఒకరేమో అనంత్ నాగ్‌గారు. ఆయన ఒక లక్ష్యం కోసం పెళ్లి చేసుకోకుండా ఉంటారు. మరోవైపు నితిన్ పేమించాలనుకున్నా ఎవ్వరూ పడరు. ఆయన పేరు (భీష్మ) వల్లే ఇలా జరుగుతుందని బాధపడుతుంటారు. ఈ ఇద్దరి భీష్మల మధ్య సంబంధం ఏంటి? అనేది సినిమాలో చూడాలి. తదుపరి సినిమా ఇంకా నిర్ణయించుకోలేదు. మైత్రీ మూవీ మేకర్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లకు కమిట్మెంట్స్ ఉన్నాయి’’ అన్నారు. -
‘భీష్మ’ సినిమాలో ట్విస్ట్ అదే : వెంకీ
నితిన్, రష్మిక మందన్నా జంటగా వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన చిత్రం ‘భీష్మ’. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల గురువారం మీడియాతో సంభాషించారు. ఆ విశేషాలివి... ► ‘ఛలో’ విడుదలయ్యాక నితిన్‌కి ఈ కథ చెప్పా. ఆయన కోసమే రాసిన కథ ఇది. స్ర్కిప్ట్ వర్క్ పూర్తవడానికి కాస్త సమయం పట్టడంతో టెన్షన్ పడ్డా. కానీ నితిన్ ‘బౌండెడ్ స్ర్కిప్ట్‌తోనే సెట్‌కి వెళదాం. కంగారు ఏమీ లేదు. నేను వెయిట్ చేస్తా’ అని ఏడాది మరో సినిమా చేయకుండా ఉన్నారు. స్ర్కిప్ట్ లాక్ అయ్యాక షూటింగ్‌కి వెళ్లాం. మధ్యలో మార్పులు, చేర్పుల గొడవే లేదు. షూటింగ్ కూడా చాలా ఈజీగా అయిపోయింది. ►ప్రతి కథలోనూ ప్రేమ మిళితమై ఉంటుంది. ఇందులోనూ కామన్‌గా లవ్‌స్టోరీ ఉంది. కాకపోతే అది వినోదాత్మకంగా సాగుతుంది. కథలో భాగంగానే ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి చెప్పాను. మీమ్స్ చేస్తూ సరదాగా తిరిగే కుర్రాడికి, సేంద్రీయ వ్యవసాయానికి మధ్య సంబంధం ఏంటన్నది ఇందులో ఆసక్తికరమైన పాయింట్. (చదవండి : నవ్వులు పూయిస్తున్న ‘భీష్మ’ మేకింగ్ వీడియో) ►భీష్మ అంటే బ్రహ్మచారి. ఇందులో అనంత్ నాగ్ బ్రహ్మచారిగా కనిపిస్తారు. నితిన్ పాత్రని కూడా భీష్మకి సంబంధించిన కొన్ని అంశాలు జోడించి తీర్చిదిద్దాను. అనంత్ నాగ్‌కి, నితిన్ సంబంధం ఏంటనేది సినిమా చూస్తేనే తెలుస్తుంది. సేంద్రీయ వ్యవసాయం మంచిదనే సందేశాన్ని ఈ సినిమా ద్వారా చెబుతున్నాం. ►రష్మిక తొలి సినిమాకే తెలుగు బాగా నేర్చుకుంది. డెడికేషన్‌తో పని చేసే నటి ఆమె. తన ఎక్స్ప్రెషన్స్ నాకు ఇష్టం. అందుకే మరోసారి ఆమెను కథానాయికగా ఎంపిక చేశా. అయితే రెండో సినిమాతోనే రష్మిక పెద్ద స్టార్ అయిపోయింది. అసలు నా సినిమా చేస్తుందో లేదో అనుకున్నా. అడగ్గానే అంగీకరించింది. నితిన్‌తో ఆమె చేసే సందడి అలరిస్తుంది. హుందాగా ఉండే ఓ పాత్ర కోసం అనంత నాగ్ని సంప్రదించా. మొదట చేయనన్నారు. కథ పూర్తిగా విన్నాక అంగీకరించారు. సినిమాకు ఆయన పాత్ర చాలా కీలకం. ►మన దగ్గ ఉన్న అత్యుత్తమ రైటర్స్‌లో త్రివిక్రమ్ గారు ముందుంటారు. నేను ఆయనకు అభిమానిని. ఆయన దగ్గర పని చేయడం వల్ల ఆ ప్రభావం నాపై చాలా ఉంది. నా డైలాగులు కూడా ఆయన డైలాగుల్లా అనిపించడానికి అదో కారణం. త్రివిక్రమ్‌గారు సినిమా చూసి నచ్చిందన్నారు. ట్రైలర్లోనే కథ చెప్పేయాలని, అప్పుడే ఆడియన్స్ ప్రిపేర్ అయ్యి వస్తారని, ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదని సలహా ఇచ్చారు. అందుకే ట్రైలర్లో కథ చెప్పే ప్రయత్నం చేశా. ►చిన్నప్పటి నుంచి సినిమాల్లోకి రావాలని ఉండేది. పేరెంట్స్ కోసం చదువుకున్నా. కొన్ని రోజులు వ్యవసాయం చేశా. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చా. తొలి విజయం సాధించాక అనేకమంది హీరోలు, నిర్మాతలు ఫోన్ చేయడం కామన్. నాకది ఓ గుర్తింపులా అనిపిస్తుంది. తర్వాత ఎలాంటి అవకాశాలు వస్తాయనే దాని కంటే నా వర్క్‌ని గుర్తించారనే విషయం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ‘భీష్మ’ తర్వాత ఏ సినిమా చేయాలనేది ఇంకా ఆలోచించలేదు. మైత్రీ, యువీ సంస్థలకు సినిమాలు చేయాల్సి ఉంది. ప్రతి సినిమా నాకు ఓ పరీక్షలాగే ఫీలవుతా. సినిమా చేసే ప్రాసెస్ మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. -
‘భీష్మ’ మేకింగ్ : రష్మీక అల్లరే అల్లరి
నితిన్ హీరోగా రిలీజ్‌కు రెడీ అయిన సినిమా భీష్మ. ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు ప్రేక్షకులను విశేషంగా అలరించడమే కాకుండా సినిమాపై అంచనాలు ఓ రేంజ్లో పెంచాయి. మంచి హైప్‌తో, భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమాపై హీరో నితిన్ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. (చదవండి : అదిరిపోయిన ‘భీష్మ’ ట్రైలర్) శుక్రవారం (ఫిబ్రవరి 21న) ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రం బృందం గురువారం మేకింగ్ వీడియోని విడుదల చేసింది. సెట్స్‌లో రష్మిక చేసే అల్లరి, నితిన్ కామెడీ పంచ్‌లతో మేకింగ్ వీడియో అదిరిపోయింది. సినిమాలో సెట్లో జరిగిన సందడి అంతా ఇందులో చూపించారు. (చదవండి : భీష్మ సినిమా పేరు మార్చాలి) ‘హై క్లాసు నుంచి లోక్లాసు దాకా నా క్రష్‌లులే.. వందల్లో ఉన్నారులే... ఒకళ్లూ సెట్టవ్వలే..’ అనే పాటను బ్యాగ్రౌండ్ ప్లే చేస్తూ మేకింగ్ వీడియోను క్రియేట్ చేశారు. షూటింగ్ టైంలో రష్మీక, డైరెక్టర్ వెంకీల మధ్య జరిగిన సరదా సన్నివేశాలను మేకింగ్ వీడియోలో చూపించారు. దర్శకుడి షర్ట్‌పై ‘హీ ఇజ్ ఏ వెరీ రోమాంటిక్ ఫెల్లో’ అని రష్మీక రాయడం బట్టి చూస్తే తెలుస్తుంది ఆమె భీష్మ సెట్లో ఎంత అల్లరి చేసిందో. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకి మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ చిత్రం నితిన్‌కి బ్రేక్ ఇస్తుందో లేదో తెలియాలంటే మరి కొద్ది గంటలు ఆగాల్సిందే. -
ఇక ఒకేసారి మూడు సినిమాలు చేయను
‘‘ఇష్క్’ (2012)కి ముందు నావి 12 సినిమాలు ఆడలేదు. ఇంటికెళ్లిపోతామా? అనే ఆలోచన రాబోతున్నప్పుడు ‘ఇష్క్’ సూపర్‌హిట్‌గా నిలిచింది. ఆడియన్స్ మళ్లీ చాన్స్ ఇచ్చారనిపించింది. ఈ మధ్య నావి మూడు సినిమాలు (లై, ఛల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం) ఆడలేదు. జాగ్రత్తలు తీసుకుని ‘భీష్మ’ చిత్రం చేశాను. ఈ సినిమా హిట్ సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నితిన్. వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘భీష్మ’. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా నితిన్ చెప్పిన విశేషాలు. ► ఈ సినిమాలో ‘మీమ్స్’ క్రియేటర్‌గా నటించాను. నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. సినిమాలో ఒక లేయర్‌గా మాత్రమే సేంద్రియ వ్యవసాయం గురించిన ప్రస్తావన ఉంటుంది. సినిమాలో వచ్చే ఓ పొలం ఫైట్‌ను ‘అతడు’ సినిమాలోని ఫైట్‌ను ఇన్స్పిరేషన్గా తీసుకుని చేశాం. ‘గుండెజారి గల్లంతయ్యిందే’ తర్వాత బాగా డ్యాన్స్‌లు చేసే అవకాశం ఈ చిత్రంలో లభించింది. త్రివిక్రమ్‌గారు సినిమా చూసి హిట్ అవుతుందని చెప్పారు. ► నేను ‘శ్రీనివాసకల్యాణం’ సినిమా చేస్తున్నప్పుడు వెంకీ కుడుముల ‘భీష్మ’ కథ చెప్పారు. నా గత మూడు సినిమాలు అంతగా ఆడలేదు కాబట్టి ‘భీష్మ’ స్క్రిప్ట్ పూర్తిగా లాక్ అయిన తర్వాతే సెట్స్‌కు వెళ్దాం అని చెప్పాను. ఇందుకు కొంత సమయం పట్టింది. అలాగే ‘రంగ్ దే’ (వెంకీ అట్లూరి దర్శకత్వంలో...), ‘చెక్’ (చంద్రశేఖర్ ఏలేటీ దర్శకత్వంలో...) సినిమాల స్క్రిప్ట్స్‌ని కూడా విని ఓకే చేశాను. షూట్ కూడా స్టార్ట్ చేశాం. ఆ తర్వాత హిందీ హిట్ ‘అంధాధూన్’ తెలుగు రీమేక్ (మేర్లపాకగాంధీ దర్శకత్వంలో..), ‘పవర్‌పేట’ (కృష్ణచైతన్య దర్శకత్వంలో) కథలను కూడా ఓకే చేశాను. గత ఏడాది నా సినిమా ఒక్కటి కూడా రాలేదు. కానీ ఈ ఏడాది నావి కనీసం నాలుగు సినిమాలు విడుదలవుతాయి. అయితే జీవితంలో ఇకపై మూడు సినిమాలను ఒకేసారి చేయను. సరిగ్గా నిద్ర లేదు. విశ్రాంతి లేదు. నాకు ఒక్క రోజు గ్యాప్ వస్తే చాలు.. నా కాల్షీట్ కోసం ముగ్గురు డైరెక్టర్స్ కొట్టుకుంటారు (నవ్వుతూ). ఇప్పుడు ‘భీష్మ’ అయిపోయింది కాబట్టి రిలాక్స్‌గా అనిపిస్తోంది. ► జాతీయ అవార్డు సాధించిన హిందీ హిట్ ‘అంధాధూన్’ తెలుగు రీమేక్‌లో నటించడం రిస్క్‌తో కూడుకున్న పని. కానీ చాలెంజింగ్‌గా తీసుకుని చేస్తున్నాను. నా కెరీర్ గ్రాఫ్ సరిగ్గా లేదని నాకూ అనిపిస్తోంది. అందుకే ఇప్పుడు జాగ్రత్తగా సినిమాలు చేస్తున్నాను. ► ఓ సినిమా బాగున్నప్పుడు అభినందనలు తీసుకున్న నేను, మరో సినిమా బాగోలేదన్నప్పుడు విమర్శలను కూడా తీసుకుంటాను. విమర్శలను విశ్లేషించుకుని తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్త పడుతుంటాను. కమర్షియల్, డిఫరెంట్ సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్దాం అనుకుంటున్నా. ► ఇండస్ట్రీకి ఎప్పుడో వచ్చాను. అప్పట్లో బుట్టో.... ఇప్పుడు ముషారఫ్ (‘దిల్’ సినిమాలోని డైలాగ్) అన్నట్లు నన్ను యంగ్ హీరో అంటుంటే హ్యాపీగానే ఉంది కానీ నేను ఇంకా యంగ్ ఏంటీ? జట్టు కూడా నెరిసింది. గెడ్డం కూడా తెల్లబడింది అని నా ఇన్నర్ఫీలింగ్ (నవ్వుతూ). పెళ్లి ముచ్చట్లు ► పెళ్లనేది జీవితంలో ఓ బిగ్ స్టెప్. మెంటల్‌గా రెడీ అవ్వాలి. అందుకే కాస్త సమయం పట్టినట్లుంది. ఈ ఏడాది ఏప్రిల్ 15న నిశ్చితార్థం జరుగుతుంది. దుబాయ్‌లో ఏప్రిల్ 16న వివాహం జరుగుతుంది. వచ్చిన తర్వాత ఏప్రిల్ 21న ఇండస్ట్రీ ప్రముఖులకు రిసెప్షన్ ఏర్పాటు చేస్తాం. షాలినీ (నితిన్ కాబోయే భార్య)కి నేను నటించిన ‘ఇష్క్, సై’ చిత్రాలంటే ఇష్టం ► నా పెళ్లి గురించి కొందరు హీరోలు సంతోషపడుతుంటే మరికొందరు బాధపడుతున్నారు. నాని ఏమో.. మా పెళ్లి బ్యాచ్‌లోకి రా అని పిలుస్తున్నాడు. రానా ఏమో ‘ఏంటీ బ్రో’ అంటున్నాడు. వరుణ్‌తేజ్.. ‘ఏంటీ నితిన్ ఇలా చేశావ్. నీ వల్ల ఇప్పుడు మా ఇంట్లో నన్ను పెళ్లి చేసుకోమని అంటున్నారు’ అన్నాడు (నవ్వుతూ). -
మా బుట్టబొమ్మ..లా వాటే బ్యూటీ ఉంది
‘‘భీష్మ’ సినిమాని చూశాను.. చాలా చాలా బాగుంది. 21న అందరూ బాగా ఎంజాయ్ చేస్తారని నమ్మకంగా చెబుతున్నా’’ అన్నారు దర్శకుడు త్రివిక్రమ్. నితిన్, రష్మికా మందన్నా జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భీష్మ’. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథి త్రివిక్రమ్ మాట్లాడుతూ– ‘‘భీష్మ’లో నాకు బాగా నచ్చిన అంశాలు సెకండాఫ్‌లో రెండున్నాయి. ఒకటి వెంకట్ మాస్టర్ చేసిన ఫైట్. రెండు.. జానీ మాస్టర్ చేసిన లాస్ట్ సాంగ్ ‘వాటే బ్యూటీ’. ఈ పాటను మా ‘బుట్టబొమ్మ’ పాటలా బాగా చేశాడు. ‘జెర్సీ’ తర్వాత నిర్మాత వంశీ మరో మంచి సినిమాని తీసుకువస్తున్నారు’’ అన్నారు. నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘భీష్మ’ చూసి చాలా సంతోషపడ్డా. ఎంత నవ్వించాలో అంత నవ్వించారు. ప్రేక్షకులు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. నితిన్ డ్యాన్సులు ఇరగదీశాడు. ‘అల.. వైకుంఠపురములో’ ఎంత పెద్ద హిట్టయ్యిందో తెలుసు. ఆ సినిమాతో పోటీపడేలా ‘భీష్మ’ విజువల్స్ ఉన్నాయి’’ అన్నారు. ‘‘వెంకీ కుడుముల లేకపోతే నేనిక్కడ ఉండేవాణ్ణి కాదు’’ అన్నారు సంగీత దర్శకుడు మహతి స్వరసాగర్. వెంకీ కుడుముల మాట్లాడుతూ – ‘‘భీష్మ’ కథకు సమయం పట్టింది. అయితే సినిమా చాలా బాగా వచ్చింది. ప్రేక్షకుల్ని నిరుత్సాహపరచం’’ అన్నారు. ‘‘ఈరోజు టాలీవుడ్లో నేను ఉన్నానంటే ప్రధాన కారణం వెంకీ కుడుముల. ఆయనకు జీవితాంతం మంచి ఫ్రెండ్‌గా ఉంటాను. నితిన్ నా బెస్ట్ కో–స్టార్ కాదు.. బెస్ట్ ఫ్రెండ్’’ అన్నారు రష్మికా మందన్నా. నితిన్ మాట్లాడుతూ– ‘‘వెంకీ కుడుముల నాకు, ‘దిల్’ సినిమాకు పెద్ద అభిమాని. ఒక అభిమాని సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా అలా ఉంటుంది. ‘దిల్’, ‘సై’ తర్వాత మళ్లీ అలాంటి యాంగిల్లో నన్ను చూపించాడు. నా అభిమానులందరూ ఎప్పుడూ ‘డ్యాన్స్.. డ్యాన్స్’ అని అడుగుతున్నారు.. ఈ సినిమాలో నా డ్యాన్స్ చూసి వారి ఆకలి తీరుతుందనుకుంటున్నా. ఈ సినిమాలో ‘వాటే బ్యూటీ’ సాంగ్‌లో రష్మిక డ్యాన్స్ చూసి షాకయ్యా.. చాలా బాగా చేసింది. మా నిర్మాతలు చినబాబు, వంశీ గార్లతో మొదట ‘అఆ’ చేశా.. ఇప్పుడు ‘భీష్మ’ చేశాను.. మూడో సినిమా ‘రంగ్ దే’ ఇప్పటికే చేస్తున్నా. నాలుగో సినిమా కోసం నాగవంశీ స్కెచ్ గీస్తున్నారు. నా జీవితంలో మా అమ్మానాన్నలు, మా అక్క, పవన్ కల్యాణ్‌గారు, త్రివిక్రమ్‌గారు పంచప్రాణాలు.. ఇప్పుడు పెళ్లవబోతోంది కాబట్టి నా భార్య ఆరో ప్రాణం కాబోతోంది’’ అన్నారు. ఈ వేడుకలో నిర్మాత ఎన్.సుధాకర్ రెడ్డి, డైరెక్టర్ వెంకీ అట్లూరి, నటుడు బ్రహ్మాజీ, పాటల రచయితలు శ్రీమణి, కాసర్ల శ్యామ్, నృత్య దర్శకుడు జానీ మాస్టర్, ఫైట్ మాస్టర్ వెంకట్, సుచిర్ ఇండియా కిరణ్, గ్రీన్ మెట్రో ప్రతినిధులు అశోక్, ఆదిత్య తదితరులు పాల్గొన్నారు. -
‘భీష్మ’ ప్రీ రిలీజ్ ఈవెంట్
-
‘దానివల్లేనేమో ఒక్కరు కూడా పడట్లేదు’
‘దుర్యోధనుడు, దుశ్శాసన, ధర్మరాజ్, యమధర్మ రాజ్, శని, శకుని పురాణాల్లో ఇన్ని పేర్లు ఉండగా పోయి పోయి ఆ జన్మ బ్రహ్మచారి భీష్మ పేరు ఎందుకు పెట్టారు నాకు’ అని తెగ ఫీలైపోతున్నాడు హీరో నితిన్. ఆయన హీరోగా ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘భీష్మ’. ఇందులో రష్మికా మండన్నా కథానాయికగా నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా సోమవారం ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ఇప్పటికే విడుదలైన సినిమా ఫస్ట్ గ్లింప్స్, టీజర్, పాటలు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. తాజాగా విడుదలయిన ట్రైలర్ మరింత ఆకట్టుకునేలా ఉంది. (చదవండి : ఘనంగా హీరో నితిన్ ఎంగేజ్మెంట్) ట్రైలర్ చూస్తుంటే సినిమాలో ప్రేక్షకులకు కావాల్సిన అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నట్టు అర్థమైపోతోంది.‘దుర్యోధన్, దుశ్శాసన, ధర్మరాజ్, యమధర్మరాజ్, శని, శకుని ఇలా పురాణాల్లో ఇన్ని పేర్లు ఉండగా పోయి పోయి ఆజన్మ బ్రహ్మచారి భీష్మ పేరు పెట్టారు నాకు. దానివల్లేనేమో ఒక్కరు కూడా పడట్లేదు’ అనే నితిన్ డైలాగుతో ట్రైలర్ మొదలైంది. వెన్నెల కిషోర్ కామెడీ పంచ్‌లు, రష్మీకతో నితిల్ రోమాన్స్ తరవాత అసలు కథ ఏ అంశం చుట్టూ తిరుగుతుందో చూపించారు. (చదవండి : ‘సరాసరి గుండెల్లో దించావె..’) ఈ సినిమా కథ సేంద్రీయ వ్యవసాయం చుట్టూ తిరుగుతుందని అని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమాలో విలన్‌గా బెంగాల్ నటుడు జిషు సేన్‌గుప్తా నటించారు. ఈయన ఎరువుల తయారీ కంపెనీకి యజమాని. జిషు, నితిన్ మధ్య వచ్చే సీన్లు అదిరిపోతాయని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ‘నువ్వు ఎన్ని నెలల్లో పుట్టావ్? ఆరు నెలల్లో పుడితే నిన్ను ఏమంటారో తెలుసా? నెల తక్కువ వెధవ అంటారు’ అంటూ జిషుతో నితిన్ చెప్పే డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది. ‘బలవంతుడితో పోరాడి గెలవచ్చు.. అదృష్టవంతుడితో గెలవలేం’ అని విలన్ చెప్పే డైలాగ్ బాగుంది. చివరిగా ‘యు టచ్ మి ఐ పోక్ యు.. యు పోక్ మి ఐ స్క్రాచ్ యు’అని నితిన్ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్‌ను ముగించారు. -
నితిన్ లవ్‌స్టోరీ తెలిసింది అప్పుడే: రష్మిక
యంగ్ హీరో నితిన్, క్రేజీ బ్యూటీ రష్మిక మందన జంటగా తెరకెక్కిన చిత్రం ‘భీష్మ’. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఫిబ్రవరి 21న విడుదల కాబోతున్న ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్, సాంగ్‌కు ఆడియన్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఇక చిత్ర ప్రమోషన్లో భాగంగా హీరోయిన్ రష్మిక మీడియాతో సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘డబ్బింగ్ చెప్పేటప్పుడు సినిమా కనిపించిన విధానం కానీ, నితిన్ కూ, నాకూ మధ్య కెమిస్ట్రీ కానీ చాలా బాగున్నాయనిపించింది. వెరీ క్యూట్ ఫిల్మ్ అనిపించింది. ప్రేక్షకులు కూడా కచ్చితంగా అదే ఫీలవుతారు. సాంగ్స్ కూడా బాగా నచ్చాయ్. సినిమా మొత్తం ఒక విజువల్ ట్రీట్ లా ఉంటుంది" అని రష్మిక అన్నారు. 'సింగిల్ ఫరెవర్' అనే ట్యాగ్ లైన్ మీకు యాప్ట్ ఏమో ఇప్పుడు? అవును కదూ.. నితిన్ ఎంగేజ్ అయిపోయారు.. డైరెక్టర్ వెంకీ, నేను కూర్చొని ఈ సినిమాని మన కోసం చేసుకున్నాం అని సరదాగా అనుకున్నాం. సినిమా చూశారా? లేదు. డబ్బింగ్ చెప్పేటప్పుడు నా పోర్షన్ మాత్రం చూశాను. సినిమా కోసం ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నా. ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్స్ ని ఎంజాయ్ చేస్తున్నా. 'భీష్మ'లో ఎలాంటి రష్మికను ఆశించవచ్చు? మంచి వినోదాన్ని మీరు ఆశించవచ్చు. అయితే నా సినిమాని నేను జడ్జ్ చెయ్యలేను. ఇందులో నేను చైత్ర అనే క్యారెక్టర్ చేశాను. నైస్ క్యారెక్టర్. భీష్మ ఆర్గానిక్స్ కంపెనీలో పని చేస్తుంటా. నా పాత్ర నుంచి మీకు అది లభిస్తుంది, ఇది లభిస్తుంది.. అని చెప్పలేను. జనరల్ గా చెప్పాలంటే సినిమా మాత్రం సూపర్ గా నవ్విస్తుంది. ఒక్కటి మాత్రం చెప్పగలను. ఈ సినిమాతో రష్మిక బాగా నటిస్తుందనీ, బాగా డాన్సులు చేస్తుందనీ, బాగా పాడుతుందని కూడా అందరూ అనుకుంటారు. అనంత్ నాగ్ గారితో కలిసి పనిచెయ్యడం ఎలా ఉంది? ఆయన ఫాదర్ ఫిగర్ లాంటివారు. ఆయన కాంబినేషన్ లో నాలుగైదు రోజులు పనిచేశాను. ఆయన కూడా కర్ణాటక నుంచి వచ్చినవాళ్లు కాబట్టి ఇద్దరం ఎప్పుడూ కన్నడలో మాట్లాడుకొనేవాళ్లం. నా సినిమాల గురించి అడిగేవారు. ఆయన నటన అంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో కలిసి పనిచెయ్యడాన్ని బాగా ఆస్వాదించాను. ఈ సినిమాలో ఆర్గానిక్ వ్యవసాయం గురించి చెప్పడం ఎలా అనిపించింది? మా ఫ్రెండ్స్ తో ఈ కథ చెప్పినప్పుడు, ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి ఏం చెప్తారే?.. అని అన్నారు. కానీ 'భీష్మ'లో తన స్క్రీన్ ప్లేతో ఆ టాపిక్ గురించి వెంకీ చాలా బాగా చెప్పాడు. ఇందులో ఎక్కడా దాని గురించి లెక్చర్స్ ఉండవు. 'భీష్మ' అనేది ఆర్గానిక్ వ్యవసాయం గురించిన కథ కాదు. ఇది ఒక వ్యక్తి ప్రయాణం. ఆర్గానిక్ వ్యవసాయం అనేది అతని జర్నీలో ఒక భాగం. ఒక్క మాటలో చెప్పాలంటే 'భీష్మ' చాలా మంచి ఫిల్మ్. వ్యవసాయం గురించిన యథార్థ ఘటనలను కూడా ఈ సబ్జెక్టులో జోడించారా? రైతులు ఇవాళ ఎన్ని కష్టాలు పడుతున్నారో మనకు తెలుసు. అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నవాళ్లనూ, పిల్లల స్కూళ్లు ఫీజు చెల్లించడానికి కూడా నానా కష్టాలు పడుతున్నవాళ్లనూ మనం చూస్తున్నాం. వాటిని సూచనప్రాయంగా ఈ కథలో డైరెక్టర్ చెప్పాడు. నాకు కథ చెప్పినప్పుడు ఆర్గానిక్ వ్యవసాయం అనేది ఒక అంతర్లీన సందేశంగానే ఉంటుందనీ, ప్రధానంగా ఇది ఫన్ ఫిల్మ్ అనీ చెప్పాడు. నేను డబ్బింగ్ చెప్పేప్పుడు అదే ఫీలయ్యాను. వ్యవసాయం అనేది చాలా సున్నిత అంశం. దాన్ని ప్రేక్షకులు ఆమోదించేలాగా వెంకీ తీశాడు. నితిన్.. పవన్ కల్యాణ్ అభిమాని అని మీకు తెలుసా? మాటల మధ్యలో ఒకసారి తాను పవన్ కల్యాణ్ గారికి వీరాభిమానినని నితిన్ చెప్పారు. చిన్నప్పట్నుంచీ ఆయన పవన్ కల్యాణ్ గారికి ఫ్యాన్. ఇప్పుడు తను యాక్టర్ అయినా కూడా ఇంకా ఆయన ఫ్యాన్ గానే ఉండటం ముచ్చటగా అనిపించింది. 'పవన్ గారిని ఎప్పుడైనా కలిశారా?' అనడిగాను. రెండు మూడుసార్లు పవన్ కల్యాణ్ గారిని కలిశానని చెప్పారు. మొత్తానికి నితిన్ ఒక ఫ్యాన్ బాయ్. నితిన్ తో పనిచెయ్యడం ఎలా అనిపించింది? నేను సరదాగా చెప్పడం లేదు. 'అ ఆ'లో నితిన్, సమంతను చూసినప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వెళ్తే, ఇలాంటి సినిమా చెయ్యాలి అనుకొన్నాను. వాళ్లిద్దరూ అంత చక్కగా అనిపించారు ఆ సినిమాలో. ఇప్పుడు నితిన్ తోటే ఈ సినిమా చేశా. మొదటిరోజు సెట్స్ మీదకు వెళ్లినప్పుడు.. తను చాలా సినిమాలు చేశారు కదా, తనతో చెయ్యడం సౌకర్యంగా ఉంటుందా, లేదా అనుకున్నా. కానీ తను ఒక కాలేజ్ బాయ్ లా కనిపించారు. కూర్చొని ఫోన్ చూసుకుంటూ, వెంకీతో మాట్లాడుతూ నవ్వుతూ ఉంటారు. దాంతో నేను సౌకర్యంగా ఫీలయ్యా. కాలేజ్ ఫ్రెండ్స్ ఎలా ఉంటారో అలా అయిపోయాం. మీకు నితిన్ లవ్ స్టోరీ గురించి ఎప్పుడు తెలిసింది? నిశ్చితార్థానికి రెండు రోజుల ముందే తెలిసింది. అప్పటిదాకా తను నాకూ ఈ విషయం చెప్పలేదు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ గురించి ఏం చెబుతారు? ఈ సినిమా చేసేటప్పుడు నాలుగైదు సార్లు నిర్మాత నాగవంశీ గారిని కలిశాను. చాలా ప్రశాంతంగా ఉంటారు. ఈ సినిమా చూసినవాళ్లు ప్రొడక్షన్ విలువల గురించి కూడా మాట్లాడుకుంటారు. అంత క్వాలిటీతో నాగవంశీ గారు 'భీష్మ'ను నిర్మించారు. 'ఛలో' నుంచి చూసుకుంటే మూడేళ్లలోనే మీకు స్టార్ డం రావడాన్ని ఎలా ఫీలవుతున్నారు? నాకు వచ్చిన స్క్రిప్ట్స్ లో నాకు నచ్చినవి చేసుకుంటూ పోతున్నానంతే. ఇందులో లక్ ఫ్యాక్టర్ ఎంత ఉందో నాకు తెలీదు. వాలంటైన్స్ డేని ఎలా గడిపారు? వాలంటైన్స్ డేకి ఫుల్ వర్క్ ఉంటుందని మార్నింగ్ జిమ్ కు వెళ్లొచ్చా. కానీ అన్ని వర్క్స్ కేన్సిల్ అయ్యాయి. అలా నా వాలంటైన్స్ డే ఎప్పుడూ లేనంత బోరింగ్‌గా గడిచింది. ఎవరూ ఎప్పుడూ అలాంటి బోరింగ్ వాలంటైన్స్ డేని గడిపి ఉండరు. పాత్రల ఎంపికలో ఇప్పుడు వేటికి ప్రాధాన్యమిస్తున్నారు? కథకు ప్రాధాన్యమున్న పాత్రల్ని, మనసుకు నచ్చిన పాత్రల్ని ఎంచుకుంటున్నా. ఇది చేస్తే కొత్తగా ఉంటుంది అనిపించినా చేస్తున్నా. ఇప్పుడు పాత్రల విషయంలో మరింత కొత్తదనం కోసం చూస్తున్నా. ఇది ప్రయోగాలు చెయ్యడమే. తర్వాత ఏమవుతుందనే ఉత్కంఠ కలిగించే సబ్జెక్టులు ఎంచుకుంటున్నా. రెండు విషయాలు నేను నమ్ముతాను. థియేటర్ కు వచ్చిన ప్రేక్షకులు మంచి సినిమా చూశామనే అనుభూతిని పొందాలి.. అది ఎమోషనల్ కావచ్చు, మరొకటి కావచ్చు. లేదంటే వాళ్లు సరదాగా ఎంజాయ్ చేసేటట్లయినా ఉండాలి. కడుపు నొప్పి పుట్టేంతగా వాళ్లు నవ్వాలి. 'భీష్మ' ఈ రెండో రకానికి చెందిన సినిమా. డబ్బింగ్ చెప్పేప్పుడు నేనే నవ్వలేక పొట్టచేత్తో పట్టుకున్నా. అల్లు అర్జున్ తో చేస్తున్న సినిమాలో ఎప్పుడు జాయిన్ అవుతున్నారు? మార్చి మధ్యలో జాయినవుతాను. అందులో పూర్తిగా మరో రష్మికను మీరు చూస్తారు. చదవండి: చిన్నప్పటి నుంచి విజయ్ అంటే క్రష్ ‘లవ్యూ వెంకీ.. రష్మిక నువ్వు నా’ -
‘సరాసరి గుండెల్లో దించావె..’
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ లేటెస్ట్ మూవీ ‘భీష్మ’. రష్మిక మందన హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి ట్యాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వం వహించాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రతీ అంశం హైలైట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఫస్ట్ గ్లింప్స్, టీజర్, సాంగ్స్‌తో ఈ సినిమాపై అందరిలోనూ క్యూరియాసిటీ పెరిగింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన లిరికల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ కాసేపటి క్రితం విడుదల చేసింది. ఇప్పటివరకు విడుదలైన సింగిలే అన్న సాంగ్, వాటే బ్యూటీ సాంగ్స్ బాగానే రీచ్ కాగా తాజాగా విడుదలైన సరాసరి సాంగ్ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది. మహతి స్వరసాగర్ కంపోజ్ చేసిన ఈ పాటకు శ్రీమణి సాహిత్యం అందించాడు. ‘రాములో రాములో’ తో ఫుల్ ఫామ్‌లో ఉన్న అనురాగ్ కులకర్ణి ఈ పాటను ఆలపించాడు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 21న విడుదల కానుంది. చదవండి: ‘లవ్యూ వెంకీ.. రష్మిక నువ్వు నా’ హీరో నితిన్ పెళ్లి వాయిదా..! ‘నా వైఫ్ దిశ.. తను కనిపించట్లేదు సర్’ -
‘భీష్మ’ సినిమా స్టిల్స్
-
వందల్లో ఉన్నారులే.. ఒకళ్లూ సెట్టవ్వలే!
ప్రేయసి కోసం తెగ ఆరాటపడిపోతున్నారు హీరో నితిన్ . మాటల్లో లాభం లేదని పాటలో తన భావాన్ని బయటపెట్టారు. నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘భీష్మ’. ‘సింగిల్ ఫరెవర్’ అనేది ఉప శీర్షిక. ఈ చిత్రంలో రష్మికా మందన్నా కథానాయికగా నటిస్తున్నారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయింది.. నిర్మాణ కార్యక్రమాలు కూడా ముగింపు దశకు చేరుకున్నాయి. తాజాగా ఈ సినిమాలోని ‘హై క్లాసు నుంచి లోక్లాసు దాకా నా క్రష్‌లులే.. వందల్లో ఉన్నారులే... ఒకళ్లూ సెట్టవ్వలే..’ అనే పాటను ‘సింగిల్ యాంథమ్’గా ‘భీష్మ’ చిత్రబృందం శుక్రవారం విడుదల చేసింది. శ్రీమణి సాహిత్యం అందించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించారు. ఈ సినిమాకు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. ‘భీష్మ’ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల కానుంది. -
కనిపిస్తుంటుంది.. కానీ క్యాచ్ చేయలేం
కనుల ముందు కనిపిస్తున్న ప్రేమ చెంతకు చేరడం లేదని తెగ ఫీలైపోతున్నారు నితిన్. ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్, రష్మికా మందన్నా జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘భీష్మ’. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ రాజమండ్రిలో జరుగుతోంది. ఇప్పటికే ఓ పాటను అక్కడ చిత్రీకరించారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ఓ చిన్న వీడియోను విడుదల చేశారు. ఈ టీజర్లో ‘నా లవ్ కూడా విజయ్ మాల్యాలాంటిది రా... కనిపిస్తుంటుంది కానీ క్యాచ్ చేయలేం’ అని నితిన్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది. టీజర్‌కు మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం చెబుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ– ‘‘భీష్మ’ ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్. కథనం వినోదాత్మకంగా సాగుతుంది. యువతీ, యువకులకు రష్మిక, నితిన్ క్యారెక్టర్లు కనెక్ట్ అవుతాయి’’ అన్నారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 21న విడుదల కానుంది. -
లేడీ విలన్?
ఇప్పటివరకూ గ్లామర్ రోల్స్‌తో అలరించిన హెబ్బా పటేల్ తనలోని నెగటివ్ షేడ్ చూపించబోతున్నారని సమాచారం. వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘భీష్మ’. నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మికా మందన్నా కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమాలో హెబ్బా పటేల్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆమె పాత్రలో నెగటివ్ షేడ్స్ ఉంటాయని, తనే ఈ సినిమాలో లేడీ విలన్ అని టాక్. క్రిస్మస్ సందర్భంగా ఈ ఏడాది డిసెంబర్ చివరి వారంలో ఈ సినిమా విడుదల కానుంది. -
ఎక్కడుందో నా లవర్?
భీష్మ.. ఓ బ్యాచిలర్. గాళ్‌ఫ్రెండ్ కోసం తెగ వెతుకుతున్నాడు. ఇంతకీ తనకు గాళ్‌ఫ్రెండ్ దొరికిందా? ఆ విషయం క్రిస్మస్కు తెలుస్తుంది. నితిన్ హీరోగా ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన చిత్రం ‘భీష్మ’. రష్మికా మందన్నా కథానాయిక. పీడీవీ ప్రసాద్ సమర్పణలో నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను క్రిస్మస్ సీజన్లో రిలీజ్ చేయనున్నట్టు చిత్రబృందం తెలిపింది. ‘‘చేతిలో ఫ్లవర్.. ఎవరవుతారో నా లవర్. క్రిస్మస్ తాత సాంటా క్లాజే నాకు గాళ్ ఫ్రెండ్‌ని గిఫ్ట్ ఇస్తాడనుకుంటున్నాను. ‘భీష్మ’ మీ అందర్నీ క్రిస్మస్కు ఎంటర్టైన్ చేస్తాడు’’ అని నితిన్ ట్వీట్ చేశారు. -
న్యూ లుక్.. న్యూ క్యారెక్టర్
‘భీష్మ’ చిత్రంతో కొత్త ప్రయాణాన్ని సంతోషంగా ఆరంభించానంటున్నారు హీరో నితిన్. ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా ‘భీష్మ’ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రష్మికా మండన్నా కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ గురువారం మొదలైంది. ‘‘దాదాపు ఏడాది తర్వాత కెమెరా ముందుకు వచ్చాను. ‘న్యూ డే.. న్యూ లుక్.. న్యూ క్యారెక్టర్’. ‘భీష్మ’ ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తున్నందుకు ఎగై్జటింగ్‌గా ఉంది’’ అని నితిన్ పేర్కొన్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పీడీవీ ప్రసాద్, సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా కాకుండా చంద్రశేఖర్ ఏలేటి, కృష్ణచైతన్య దర్శకత్వాల్లో సినిమాలు కమిట్ అయ్యారు నితిన్. -
‘భీష్మ’ జోడిపై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్
వరుస ఫ్లాప్‌లతో మరోసారి కష్టాల్లో పడ్డ యంగ్ హీరో నితిన్, లాంగ్ గ్యాప్ తరువాత ఓ సినిమా చేస్తున్నాడు. ఛలో ఫేం వెంకీ కుడుముల దర్శకత్వంలో సితార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఓ సినిమా చేయనున్నాడు నితిన్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ సినిమాలో నితిన్‌కు జోడిగా రష్మిక మందన్న నటిస్తుందన్న విషయాన్ని కూడా ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉంటుందన్న టాక్ చాలా రోజులుగా వినిపిస్తోంది. ఈ వార్తలపై దర్శకుడు వెంకీ క్లారిటీ ఇచ్చారు. భీష్మలో ఒకే హీరోయిన్‌ఉంటుందని ఆ పాత్ర రష్మికను ఇప్పటికే ఫైనల్ చేసినట్టుగా వెల్లడించారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. Rashmika Mandanna is the only female lead in Nithin starrer #Bheeshma produced under Sithara entertainments ! Cast and crew details vl announce soon 😊🙏🏻@actor_nithiin @iamRashmika @vamsi84 @SitharaEnts — Venky Kudumula (@VenkyKudumula) 16 April 2019 -
నితిన్ కొత్త సినిమాకు ఇంట్రస్టింగ్ టైటిల్
శ్రీనివాస కల్యాణం సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న నితిన్.. శనివారం తన పుట్టిన రోజు సందర్భంగా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌ను ప్రకటించాడు. ఇప్పటికే వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మాతో పాటు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఓ సినిమాను ప్రకటించిన నితిన్.. తాజాగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో మరో సినిమాను ఎనౌన్స్ చేశాడు. నితిన్ సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు పవర్ పేట అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. అంతేకాదు నితిన్ కెరీర్లో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా 2020 సమ్మర్లో ప్రారంభం కానుంది. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించానున్నారు. -
ఎప్పటికీ ఒంటరిగానే!
మూడుపదుల వయసు దాటిన హీరో నితిన్ ఇంకా వివాహం చేసుకోలేదు. శుక్రవారం ‘సింగిల్ ఫర్ ఎవర్’ (ఎప్పటికీ ఒంటరిగా) అంటూ ఓ ప్రకటన ఇప్పించారు. ఇది చదివి ఇక నితిన్ ఎప్పటికీ బ్యాచిలర్‌గా మిగిలిపోతాడేమో అని ఊహించుకోకండి. ఒంటరిగా ఉంటానని నితిన్ చెప్పింది ‘భీష్మ’ చిత్రం గురించి. ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందనున్న సినిమా ‘భీష్మ’. ఇందులో రష్మికా మండన్నా కథానాయికగా నటిస్తారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు. ఈ రోజు నితిన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘భీష్మ’ అనౌన్స్మెంట్ వచ్చింది. ‘‘తొమ్మిది గ్రహాలు.. ఏడుసముద్రాలు.. 204 దేశాలు... మూడు బిలియన్స్ పైగా అమ్మాయిలు ఉన్నారు. కానీ అతను స్టిల్ సింగిల్ గానే ఉన్నాడు’’ అన్నారు దర్శకుడు వెంకీ కుడుముల. మరి.. సినిమాలో భీష్మ బ్యాచిలర్ ౖలñఃఫ్కి ఫుల్స్టాప్ పెట్టించడానికి హీరోయిన్ ఏం చేసింది? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. -
బిజీ బ్యాచిలర్
భుజం గాయం కారణంగా కొన్ని నెలలుగా కెమెరా ముందుకు వెళ్లని నితిన్ మళ్లీ షూటింగ్స్‌తో బిజీ అవ్వడానికి రెడీ అయ్యారు. ‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా ‘భీష్మా’ ది బ్యాచిలర్ అనే సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా రెగ్యులర్ షుటింగ్‌ను ఈ నెల 25న స్టార్ట్ చేయనున్నారట. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రష్మికా మండన్నా హీరోయిన్. ‘ఛలో’ తరహాలోనే ఈ ‘భీష్మా’ కూడా పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రంగా ప్లాన్ చేశారట. ఈ సినిమానే కాకుండా ‘కుమారి 21ఎఫ్’ ఫేమ్ సూర్య ప్రతాప్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించనున్న ఓ సినిమాను అంగీకరించారు నితిన్. ఈ రెండు సినిమాలతో నితిన్ ఈ ఏడాది బిజీ బిజీగా ఉండబోతున్నారు. ‘భీష్మ’ సినిమాకు సాగర్ మహతి సంగీత దర్శకుడు. -
నితిన్.. మీరు ఇప్పుడు బాగానే ఉన్నారా?
నితిన్, రష్మిక మందన్న జంటగా తెరకెక్కనున్న భీష్మా చిత్రానికి వెంకీ కుడుముల దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం గురించి సామాజిక మాధ్యమాల్లో ఎదురవుతున్న ప్రశ్నలపై వెంకీ ట్విటర్లో స్పందించారు. తన భుజానికి అయిన గాయం నుంచి నితిన్ ప్రస్తుతం కోలుకుంటున్నారని తెలిపారు. భీష్మాలో తన బెస్ట్ లుక్ ఇవ్వడాని నితిన్ ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించారు. భీష్మా చిత్రం స్ర్కిప్ట్ తుది దశలో ఉందని తెలిపారు. రష్మిక తన షూటింగ్‌లతో బీజిగా ఉందని పేర్కొన్నారు. ఓ మంచి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని అన్నారు. కాగా, రష్మికను తెలుగు తెరకు పరిచయం చేసిన వెంకీ ఈ చిత్రంలో కూడా ఆమెనే హీరోయిన్గా తీసుకున్నారు. ‘నితిన్ సార్‌కు గాయమైనట్టు తెలియదు’ వెంకీ ట్వీట్‌పై రష్మిక స్పందించారు. ‘మూవీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను. నితిన్ సార్‌కు గాయమైనట్టు నాకు తెలియదు. నితిన్ మీరు ఇప్పుడు బాగానే ఉన్నారా?. మీరు బాగుండాలని కోరుకుంటున్నా’ అని అమె ట్వీట్లో పేర్కొన్నారు. త్వరలో కలుద్దాం.. రష్మిక, వెంకీ ట్వీట్లపై నితిన్ స్పందించారు. నేను ప్రస్తుతం బాగానే ఉన్నాను. భీష్మా షూట్ కోసం ఎదురుచూస్తున్నానని తెలిపారు. త్వరలోనే సెట్లో కలుద్దామని రష్మికకు తెలిపారు. షూటింగ్ ఎప్పుడూ ప్రారంభమవుతుందని వెంకీని సరదాగా అడిగారు. -
‘భీష్మా’ జోడిగా రష్మిక
ఛలో సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన టాలెంటెడ్ బ్యూటీ రష్మిక మందన్న. తొలి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ భామ ఇప్పుడు టాలీవుడ్లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు. గీత గోవిందం సినిమాకు ఏకంగా వంద కోట్ల వసూళ్లు రావటంతో రష్మిక కూడా లక్కీ గర్ల్ అన్న ముద్ర పడిపోయింది. అయితే యంగ్ హీరోలు, దర్శకులు రష్మిక కోసం క్యూ కడుతున్నారు. తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు రష్మికను ఓకె చేసినట్టుగా తెలుస్తోంది. రష్మికను తెలుగు తెరకు పరిచయం చేసిన దర్శకుడు వెంకీ కుడుముల మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. నితిన్ హీరోగా భీష్మా పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాకు కూడా రష్మికనే హీరోయిన్గా కన్ఫమ్ చేశాడు వెంకీ. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందించనున్నాడు. -
రష్మిక ఖాతాలో మరో క్రేజీ ప్రాజెక్ట్
ఛలో సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన టాలెంటెడ్ బ్యూటీ రష్మిక మందన్న. తొలి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ భామ ఇప్పుడు టాలీవుడ్లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు. గీత గోవిందం సినిమాకు ఏకంగా వంద కోట్ల వసూళ్లు రావటంతో రష్మిక కూడా లక్కీ గర్ల్ అన్న ముద్ర పడిపోయింది. అయితే యంగ్ హీరోలు, దర్శకులు రష్మిక కోసం క్యూ కడుతున్నారు. తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు రష్మికను ఓకె చేసినట్టుగా తెలుస్తోంది. రష్మికను తెలుగు తెరకు పరిచయం చేసిన దర్శకుడు వెంకీ కుడుముల మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. నితిన్ హీరోగా భీష్మా పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాకు కూడా రష్మికనే హీరోయిన్గా తీసుకునే ఆలోచనలో ఉన్నాడట వెంకీ. ప్రస్తుతం ఈ భామ మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న దేవదాస్‌తో పాటు విజయ్ దేవరకొండకు మరోసారి జోడిగా డియర్ కామ్రేడ్ సినిమాల్లో నటిస్తున్నారు. -
భీష్మతో ఛలో
ప్రేమకు సరిహద్దులు లేవన్న నిజాన్ని వెండితెరపై ఎంటరై్టనింగ్గా చూపించి తొలి సినిమా ‘ఛలో’తోనే బంపర్ హిట్ సాధించారు వెంకీ కుడుముల. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో నితిన్ హీరోగా ఓ సినిమా రూపొందనుంది. ప్రస్తుతం స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దుతున్నారు వెంకీ కుడుముల. ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ చివర్లో లేదా అక్టోబర్ ఫస్ట్ వీక్‌లో ఆరంభం అవుతుందని సమాచారం. ఇంకా హీరోయిన్ను ఫైనలైజ్ చేయలేదు. ఈ సినిమాకు ‘భీష్మ’ అనే టైటిల్ అనుకుంటున్నారని ఇండస్ట్రీలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. -
త్వరలో సెట్స్ మీదకు ‘భీష్మ’
ఛలో సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా ఓ సినిమా ప్రారంభం కానుందన్న టాక్ చాలా రోజులుగా వినిపిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు భీష్మ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ప్రస్తుతం శ్రీనివాస కళ్యాణం పనుల్లో బిజీగా ఉన్న నితిన్ ఈ సినిమాతో త్వరలో ప్రారంభించనున్నాడట. ఇప్పటికే వెంకీ ఫుల్ స్క్రిప్ట్ తో రెడీగా ఉండటంతో ఆగస్టు మొదటి వారంలోనే షూటింగ్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. డిఫరెంట్ లవ్ స్టోరితో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సింగిల్ ఫర్ ఎవర్ అనేది ట్యాగ్ లైన్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న శ్రీనివాస కళ్యాణంలో నితిన్ రాశీఖన్నా హీరోయిన్గా నటిస్తుండగా శతమానంభవతి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సతీష్ వేగేశ్న ఈ చిత్రానికి దర్శకుడు. -
ఆజన్మ బ్రహ్మచారిగా నితిన్
టాలీవుడ్ లో పెళ్లికాని ప్రసాదులు చాలా మందే ఉన్నారు. ప్రభాస్, రానా దగ్గుబాటి లతో నితిన్ కూడా వయసు పెరుగుతున్న సినిమాలతోనే కాలం గడిపేస్తున్నారు. తాజాగా నితిన్ సింగిల్ ఫర్ఎవర్ అనే స్టేట్మెంట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడట. అయితే ఇది రియల్ లైఫ్‌లో మాత్రం కాదు. రీల్ లైఫ్‌లోనే. ప్రస్తుతం సతీష్ వేగేశ్న దర్శకత్వంలో శ్రీనివాస కళ్యాణం సినిమాలో నటిస్తున్న నితిన్ తరువాత మరో క్రేజీ ప్రాజెక్ట్ కు ఓకె చెప్పాడు. ఛలో సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ ఓ సినిమా చేసేందుకు అంగీకరించాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు భీష్మా అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. అంతేకాదు సింగిల్ ఫర్ఎవర్ అనేది ట్యాగ్ లైన్. ఆజన్మ బ్రహ్మచారి అయిన భీష్మా పేరుతో లవ్ స్టోరి తెరకెక్కిస్తుండటంతో భీష్మాపై ఆసక్తి నెలకొంది. -
మెగా బ్యానర్లో యువ దర్శకుడు
ఇటీవల టాలీవుడ్లో ఒక్క సినిమాతో సెన్సేషన్‌గా మారిన దర్శకులు చాలా మందే ఉన్నారు. ఛలో సినిమాతో ఈ జాబితాలో చేరిన దర్శకుడు వెంకీ కుడుముల. నాగశౌర్య హీరోగా తెరకెక్కిన ఛలో సినిమాతో దర్శకుడిగా పరిచయమయిన వెంకీ తొలి సినిమాతోనే ఘనవిజయాన్ని అందుకున్నాడు. దీంతో పెద్ద బ్యానర్ల నుంచి కూడా వెంకీకి ఆఫర్స్ వస్తున్నాయి. ఇప్పటికే నితిన్, సాయి ధరమ్ తేజ్ లాంటి యంగ్ హీరోలతో వెంకీ సినిమా చేయబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా వెంకీ కుడుముల ఓ బడా బ్యానర్లో సినిమా అంగీకరించినట్టుగా తెలుస్తోంది. స్టార్ హీరోలతో బిగ్ బడ్జెట్ సినిమాలతో పాటు యంగ్ హీరోలతో మీడియం రేంజ్ సినిమాలను రూపొందిస్తున్న గీతా ఆర్ట్స్ బ్యానర్లో వెంకీ కుడుముల ఓ సినిమా చేయనున్నాడు. సాయి ధరమ్ తేజ్ తో రూపొందించబోయే సినిమా ఇది అన్న టాక్ వినిపిస్తోంది. ఛలో తరువాత వెంకీ తన తదుపరి ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన ఇంతవరకు చేయలేదు. -
మెగా హీరోతో ఛలో డైరెక్టర్
నాగశౌర్య హీరోగా తెరకెక్కిన సక్సెస్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ ఛలో. నాగశౌర్య స్వయంగా నిర్మించిన ఈ సినిమాతో వెంకీ కుడుముల దర్శకుడిగా పరిచయమయ్యాడు. తొలి ప్రయత్నంలోనే ఘనవిజయం సాధించటంతో బడా నిర్మాణ సంస్థల దృష్టిలో పడ్డాడు వెంకీ. తాజాగా ఈ యువ దర్శకుడి తదుపరి ప్రాజెక్ట్‌కు సంబంధించి ఓ అప్డేట్ టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. మెగా అల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుందట. ప్రస్తుతం కరుణాకరన్ దర్శకత్వంలో తేజ్ ఐ లవ్ యు సినిమా చేస్తున్న సాయి ధరమ్ తదుపరి ప్రాజెక్ట్‌ను ఇంతవరకు ప్రకటించలేదు. కిశోర్ తిరుమల, చంద్రశేఖర్ ఏలేటి, గోపిచంద్ మలినేని లాంటి దర్శకులతో చర్చలు జరగుతున్నట్టుగా తెలుస్తోంది. తాజాగా ఈ లిస్ట్‌లో వెంకీ కుడుమల కూడా చేరాడు. వీరి కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమాను గీతా ఆర్ట్స్‌లో తెరకెక్కించనున్నారు. -
‘ఛలో’ దర్శకుడి కొత్త సినిమా అప్డేట్
నాగశౌర్య హీరోగా తెరకెక్కిన సక్సెస్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ ఛలో. నాగశౌర్య స్వయంగా నిర్మించిన ఈ సినిమాతో వెంకీ కుడుముల దర్శకుడిగా పరిచయమయ్యాడు. తొలి ప్రయత్నంలోనే ఘనవిజయం సాధించటంతో బడా నిర్మాణ సంస్థల దృష్టిలో పడ్డాడు వెంకీ. తాజాగా ఈ యువ దర్శకుడి తదుపరి ప్రాజెక్ట్‌కు సంబంధించి ఓ అప్డేట్ టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ప్రేమమ్, బాబు బంగారం లాంటి సినిమానలు తెరకెక్కించిన సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ప్రస్తుతం నాగచైతన్య హీరోగా మారుతి దర్శకత్వంలో శైలజా రెడ్డి అల్లుడు సినిమాను నిర్మిస్తోంది. త్వరలో ఇదే బ్యానర్లో సుదీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా మరో సినిమా ప్రారంభం కానుంది. ఈ రెండు సినిమాలతో పాటు మరో ప్రాజెక్ట్‌ను సిద్ధం చేస్తోంది సితార ఎంటర్టైన్మెంట్స్. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో నితిన్ హీరోగా నటించే అవకాశం ఉంది. -
విశాఖలో ఛలో సినిమా సక్సెస్ మీట్
-
నాకు స్ఫూర్తి ఆ ఇద్దరే – వెంకీ కుడుముల
‘‘నాది ఖమ్మం జిల్లా అశ్వరావుపేట. సినిమాలపై ఆసక్తితో రచయిత బలభద్రపాత్రుని రమణి ద్వారా తేజ గారి వద్ద ‘నీకు నాకు డాష్ డాష్’ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరా. ఆ తర్వాత ‘అ ఆ’ సినిమాకు త్రివిక్రమ్‌గారి వద్ద దర్శకత్వ శాఖలో పనిచేశా. దర్శకులు త్రివిక్రమ్, పూరి జగన్నాథ్ నాకు స్ఫూర్తి’’ అన్నారు దర్శకుడు వెంకీ కుడుముల. నాగశౌర్య, రష్మిక మండన్న జంటగా శంకర్ ప్రసాద్ మూల్పూరి సమర్పణలో ఉషా మూల్పూరి నిర్మించిన ‘ఛలో’ ఫిబ్రవరి 2న విడుదలవుతోంది. ఈ సందర ్భంగా దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ –‘‘నాగశౌర్య ‘జాదూగాడు’ సినిమాకు నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసా. నా వర్క్ నచ్చడంతో కథ రెడీ చేసుకురమ్మన్నారు శౌర్య. నేను వినిపించిన ‘ఛలో’ స్టోరీ ఆయనకు నచ్చడంతో సినిమా ప్రారంభమయ్యింది. నన్ను, నా కథను నమ్మి నాగశౌర్య పేరెంట్స్ ఈ సినిమా నిర్మించినందుకు వారికి నా కృతజ్ఞతలు. కన్నడ ‘కిరిక్ పార్టీ’ సినిమా చూశాక రష్మిక హీరోయిన్గా కరెక్ట్ అనిపించింది. నాగశౌర్యతో పాటు ఆయన పేరెంట్స్ కూడా ఓకే అనడంతో తనని తీసుకున్నాం. సంగీత దర్శకుడు సాగర్ మణిశర్మగారి అబ్బాయి అని అందరికీ తెలుసు. ‘జాదూగాడు’ టైమ్‌లో నాకు పరిచయమయ్యారు. ‘ఛలో’ సినిమాకు మంచి పాటలిచ్చారు. ఇప్పటి యువ దర్శకులపై త్రివిక్రమ్‌గారి ప్రభావం ఉంటుంది. అయితే ఆయన్ని అనుకరించకూడదు. సినిమా అవుట్‌పుట్ చూశాక టెన్షన్ లేదు. ‘ఛలో’ రిలీజ్ తర్వాత కొత్త సినిమా స్క్రిప్ట్ పనులు ప్రారంభిస్తా’’ అన్నారు. -
నాగశౌర్య ’ఛలో’ ట్రైలర్ విడుదల
-
లవ్ ఎంటర్టైనర్లో నాగశౌర్య
త్రివిక్రమ్ శిష్యుడు వెంకి కుడుములను దర్శకునిగా పరిచయం చేస్తూ నాగశౌర్య హీరోగా ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా మూల్పూరి, శంకర ప్రసాద్ మూల్పూరి నిర్మించనున్న చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. కన్నడ హిట్ ‘కిరాక్ పార్టీ‘ ఫేం రష్మిక మండన ఇందులో కథానాయిక. ముహూర్తపు సన్నివేశానికి పారిశ్రామికవేత్త రాజేశ్ కిలారు కెమెరా స్విచ్చాన్ చేయగా, హీరో నారా రోహిత్ క్లాప్ ఇచ్చారు. శంకర ప్రసాద్ మూల్పూరి మాట్లాడుతూ– ‘‘మా అబ్బాయి నాగశౌర్యతో ఓ చిత్రం నిర్మించాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాం. వెంకి కుడుముల చెప్పిన కథ నచ్చడంతో మా బ్యానర్లోనే చేస్తున్నాం’’ అన్నారు. ‘‘మా ఐరా క్రియేషన్స్ మొదటి సినిమా నాది కావడం సంతోషంగా ఉంది.’’ అన్నారు నాగశౌర్య. ‘‘నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన నాగశౌర్య, ఉషా, శంకరప్రసాద్ గార్లకు ధన్యవాదాలు. ఇది మంచి లవ్ ఎంటర్టైనర్’’ అని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: సాగర్ మహతి, కెమెరా: సాయి శ్రీరామ్, లైన్ ప్రొడ్యూసర్: ఎస్. నాగేశ్వరరావు (బుజ్జి).