
నితిన్, రష్మిక మందన్న జంటగా తెరకెక్కనున్న భీష్మా చిత్రానికి వెంకీ కుడుముల దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం గురించి సామాజిక మాధ్యమాల్లో ఎదురవుతున్న ప్రశ్నలపై వెంకీ ట్విటర్‌లో స్పందించారు. తన భుజానికి అయిన గాయం నుంచి నితిన్ ప్రస్తుతం కోలుకుంటున్నారని తెలిపారు. భీష్మాలో తన బెస్ట్ లుక్ ఇవ్వడాని నితిన్ ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించారు. భీష్మా చిత్రం స్ర్కిప్ట్ తుది దశలో ఉందని తెలిపారు. రష్మిక తన షూటింగ్‌లతో బీజిగా ఉందని పేర్కొన్నారు. ఓ మంచి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని అన్నారు. కాగా, రష్మికను తెలుగు తెరకు పరిచయం చేసిన వెంకీ ఈ చిత్రంలో కూడా ఆమెనే హీరోయిన్‌గా తీసుకున్నారు.
‘నితిన్ సార్‌కు గాయమైనట్టు తెలియదు’
వెంకీ ట్వీట్‌పై రష్మిక స్పందించారు. ‘మూవీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను. నితిన్ సార్‌కు గాయమైనట్టు నాకు తెలియదు. నితిన్ మీరు ఇప్పుడు బాగానే ఉన్నారా?. మీరు బాగుండాలని కోరుకుంటున్నా’ అని అమె ట్వీట్‌లో పేర్కొన్నారు.
త్వరలో కలుద్దాం..
రష్మిక, వెంకీ ట్వీట్‌లపై నితిన్ స్పందించారు. నేను ప్రస్తుతం బాగానే ఉన్నాను. భీష్మా షూట్ కోసం ఎదురుచూస్తున్నానని తెలిపారు. త్వరలోనే సెట్లో కలుద్దామని రష్మికకు తెలిపారు. షూటింగ్ ఎప్పుడూ ప్రారంభమవుతుందని వెంకీని సరదాగా అడిగారు.