
లవ్ ఎంటర్‌టైనర్‌లో నాగశౌర్య
త్రివిక్రమ్ శిష్యుడు వెంకి కుడుములను దర్శకునిగా పరిచయం చేస్తూ నాగశౌర్య హీరోగా
త్రివిక్రమ్ శిష్యుడు వెంకి కుడుములను దర్శకునిగా పరిచయం చేస్తూ నాగశౌర్య హీరోగా ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా మూల్పూరి, శంకర ప్రసాద్ మూల్పూరి నిర్మించనున్న చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. కన్నడ హిట్ ‘కిరాక్ పార్టీ‘ ఫేం రష్మిక మండన ఇందులో కథానాయిక. ముహూర్తపు సన్నివేశానికి పారిశ్రామికవేత్త రాజేశ్ కిలారు కెమెరా స్విచ్చాన్ చేయగా, హీరో నారా రోహిత్ క్లాప్ ఇచ్చారు.
శంకర ప్రసాద్ మూల్పూరి మాట్లాడుతూ– ‘‘మా అబ్బాయి నాగశౌర్యతో ఓ చిత్రం నిర్మించాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాం. వెంకి కుడుముల చెప్పిన కథ నచ్చడంతో మా బ్యానర్‌లోనే చేస్తున్నాం’’ అన్నారు. ‘‘మా ఐరా క్రియేషన్స్ మొదటి సినిమా నాది కావడం సంతోషంగా ఉంది.’’ అన్నారు నాగశౌర్య. ‘‘నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన నాగశౌర్య, ఉషా, శంకరప్రసాద్ గార్లకు ధన్యవాదాలు. ఇది మంచి లవ్ ఎంటర్‌టైనర్’’ అని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: సాగర్ మహతి, కెమెరా: సాయి శ్రీరామ్, లైన్ ప్రొడ్యూసర్: ఎస్. నాగేశ్వరరావు (బుజ్జి).