హీరో –డైరెక్టర్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనుందా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ‘గని’ అనే స్పోర్ట్స్ డ్రామా చేస్తున్నారు వరుణ్ తేజ్. అలాగే అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్‌తో కలసి ‘ఎఫ్ 3’ చిత్రంలోనూ నటిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ రెండు సినిమాల చిత్రీకరణకు బ్రేక్ పడింది.
ఈ గ్యాప్‌లోనే ‘ఛలో, భీష్మ’ చిత్రాల ఫేమ్ వెంకీ కుడుముల చెప్పిన స్టోరీ లైన్ విన్నారట వరుణ్. వెంకీ చెప్పిన స్టోరీ లైన్ నచ్చడంతో నటించేందుకు పచ్చజెండా ఊపారట వరుణ్ తేజ్. ప్రస్తుతం నటిస్తున్న ‘గని, ఎఫ్ 3’ చిత్రాల షూటింగ్ పూర్తయిన వెంటనే వెంకీ కుడుముల ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నారని సమాచారం. అన్నీ కుదిరితే దసరాకి చిత్రీకరణ మొదలుపెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మించనుందని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment