
నితిన్
ప్రేయసి కోసం తెగ ఆరాటపడిపోతున్నారు హీరో నితిన్ . మాటల్లో లాభం లేదని పాటలో తన భావాన్ని బయటపెట్టారు. నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘భీష్మ’. ‘సింగిల్ ఫరెవర్’ అనేది ఉప శీర్షిక. ఈ చిత్రంలో రష్మికా మందన్నా కథానాయికగా నటిస్తున్నారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయింది.. నిర్మాణ కార్యక్రమాలు కూడా ముగింపు దశకు చేరుకున్నాయి. తాజాగా ఈ సినిమాలోని ‘హై క్లాసు నుంచి లోక్లాసు దాకా నా క్రష్‌లులే.. వందల్లో ఉన్నారులే... ఒకళ్లూ సెట్టవ్వలే..’ అనే పాటను ‘సింగిల్ యాంథమ్’గా ‘భీష్మ’ చిత్రబృందం శుక్రవారం విడుదల చేసింది. శ్రీమణి సాహిత్యం అందించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించారు. ఈ సినిమాకు మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. ‘భీష్మ’ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment