చరణ్‌ను మెప్పించిన ‘భీష్మ’ డైరెక్టర్‌ | Ram Charan Next Movie In Venky Kudumula Direction | Sakshi
Sakshi News home page

చరణ్‌ను మెప్పించిన ‘భీష్మ’ డైరెక్టర్‌

Published Wed, Jul 22 2020 3:41 PM | Last Updated on Wed, Jul 22 2020 4:07 PM

Ram Charan Next Movie In Venky Kudumula Direction - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా మేజ‌ర్ షెడ్యూల్ పూర్త‌యిన‌ప్ప‌టికీ క‌రోనా ఎఫెక్ట్ తో మిగతా షూటింగ్ ఆగిపోయింది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ రామ్ చ‌ర‌ణ్ త‌న నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను మాత్రం ప్రకటించలేదు. జెర్సీ మూవీ డైరెక్ట‌ర్ గౌత‌మ్ తిన్నూరితో రామ్ చ‌ర‌ణ్ సినిమా ఉంటుంద‌ని వార్త‌లు వినిపించినా ఇప్ప‌టి వ‌ర‌కూ దానిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే ఇప్పుడు చ‌ర‌ణ్ మ‌రో ద‌ర్శ‌కుడికి ఛాన్స్ ఇచ్చే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. (చదవండి: పవన్‌ చిత్రంలో మెగాపవర్‌ స్టార్‌?)

ఇటీవల హీరో నితిన్‌తో ‘భీష్మ’ సినిమా తీసి సూప‌ర్ హిట్ అందుకున్న డైరెక్ట‌ర్ వెంకీ కుడుముల‌కు చ‌ర‌ణ్‌ చాన్స్‌ ఇవ్వనున్నారనే టాక్‌ వినిపిస్తోంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద సూప‌ర్ హిట్‌గా నిల‌వ‌డంతో పాటు హీరో నితిన్‌కు కూడా మంచి క‌మ‌ర్షియ‌ల్ హిట్ అందించింది. దీంతో ఈ డైరెక్ట‌ర్‌కు ఇండ‌స్ట్రీలో మంచి క్రేజ్ వ‌చ్చింది. అయితే ఆర్ఆర్ఆర్ త‌ర్వాత చ‌ర‌ణ్ వెంకి కుడుములతో కలిసి తన తర్వాతి సినిమాను ప‌ట్టాలెక్కించే ఆలోచ‌న‌లో ఉన్నాడ‌ట‌. ఇప్ప‌టికే చ‌రణ్‌కు వెంకీ స్క్రిప్ట్ కూడా వినిపించాడ‌ట‌. రొమాంటిక్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైనర్‌గా తెర‌కెక్క‌నున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మించ‌నున్నారు. ఇప్ప‌టికే ‘ఛ‌లో’, ‘భీష్మ’ లాంటి సినిమాల‌తో కామెడీ, యాక్ష‌న్, ల‌వ్ ట్రాక్ ల‌ను బాగా ప్రొజెక్ట్ చేయ‌గ‌ల వెంకీ కుడుముల‌కు స్టార్ డైరెక్ట‌ర్గా ఎద‌గ‌డానికి ఇదొక మంచి అవ‌కాశమని చెప్పుకోవచ్చు. (చదవండి: ‘ఆర్‌ఆర్‌ఆర్’‌ ట్రయిల్‌ షూట్‌ రద్దు.. అందుకేనా!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement