
నితిన్
ప్రేమకు సరిహద్దులు లేవన్న నిజాన్ని వెండితెరపై ఎంటరై్టనింగ్‌గా చూపించి తొలి సినిమా ‘ఛలో’తోనే బంపర్ హిట్ సాధించారు వెంకీ కుడుముల. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో నితిన్ హీరోగా ఓ సినిమా రూపొందనుంది. ప్రస్తుతం స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దుతున్నారు వెంకీ కుడుముల. ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ చివర్లో లేదా అక్టోబర్ ఫస్ట్ వీక్‌లో ఆరంభం అవుతుందని సమాచారం. ఇంకా హీరోయిన్‌ను ఫైనలైజ్ చేయలేదు. ఈ సినిమాకు ‘భీష్మ’ అనే టైటిల్ అనుకుంటున్నారని ఇండస్ట్రీలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.