support
-
కార్యకర్త కుటుంబానికి వైఎస్ జగన్ అండ
-
ఢిల్లీ ఎన్నికల్లో ఆప్‌కు ‘దీదీ’ మద్దతు
న్యూఢిల్లీ:ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) మద్దతు ప్రకటించింది. తమకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మద్దతు ప్రకటించినందుకు ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన ‘థాంక్యూ దీదీ’ అంటూ బుధవారం(జనవరి 8) ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు.‘ఢిల్లీ ఎన్నికల్లో ఆప్‌నకు టీఎంసీ మద్దతు ప్రకటించింది. ఇందుకు మమతా దీదీకి వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా. థాంక్యూ దీదీ. మీరు మాకు ఎల్లప్పుడూ అండగా నిలిచారు’అని కేజ్రీవాల్ ట్వీట్లో పేర్కొన్నారు. తృణమూల్ ప్రకటనతో ఢిల్లీ ఎన్నికల్లో ఆప్‌నకు మద్దతుగా నిలిచిన ‘ఇండియా’ కూటమి పార్టీలో జాబితాలో తాజాగా ఆప్ చేరడం గమనార్హం. ఇప్పటికే సమాజ్‌వాదీ పార్టీ, శివసేన (యూబీటీ) కేజ్రీవాల్‌కు మద్దతు ప్రకటించాయి.గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న ఆప్ ఆ తర్వాత జరిగిన హర్యానా ఎన్నికల్లో ఒంటరి పోరాటం చేసింది. ఢిల్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌తో పొత్తు లేదని ప్రకటించింది. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది. 8న ఫలితాలు వెల్లడించనున్నారు. ఇదీ చదవండి: రమేష్ బిదూరిపై బీజేపీ చర్యలు -
Happy New Year 2025: ఎందుకు? ఏమిటి? ఎలా?..
ఇవాళ్టి నుంచి.. ఎలాగైనా ఉదయమే లేచి చదువుకోవాలి. .. జిమ్‌కు వెళ్లి బాడీని పెంచాలి.. సరైన డైట్‌ను మెయింటెన్ చేస్తూ ఆరోగ్యంగా ఉండాలి. .. ఎలాగైనా డబ్బులను పొదుపు చేసి ఫలానాది కొనాలి. .. ఆఫీస్‌కు టైంకు వెళ్లాలి. ఇలా అన్నీ కూడా ఏడాదిలో తొలిరోజు నుంచే చేస్తూ ఫ్రెష్ జీవితం ప్రారంభించాలి. చేస్తారో.. చేయరో.. తెలియదు!. కానీ, కొత్త ఏడాది వచ్చిందంటే.. రెజల్యూషన్స్ పేరుతో ఇలాంటి వాటిని తెరపైకి తెచ్చి హడావిడి చేసేవాళ్లు ఎందరో ఉంటారు. ఇందులోనూ హాస్యకోణం వెతుకుతూ.. ఇంటర్నెట్లో మీమ్స్(Resolutions Memes) వైరల్ అవుతున్న పరిస్థితుల్ని ఇప్పుడు చూస్తున్నాం. ఆ లక్ష్యాలను అందుకోవడం మన వల్ల కాదా?..కొత్త ఏడాది కొత్త తీర్మానాలు మనకు కొత్తేం కాదు. ‘‘జీవితంలో ఓ ఏడాది దొర్లిపోయింది. ఇన్ని రోజులు ఏలాగోలా గడిచాయి.కనీసం ఈ కొత్త ఏడాదిలోనైనా మార్పుతో పని చేద్దాం!’.. అని పదిలో తొమ్మిది మంది అనుకుంటారని పలు అధ్యయనాలు తేల్చాయి. ఇది ఏ విద్యార్థులకో, యువతకో మాత్రమే కాదు.. రెజల్యూషన్స్ తీసుకోవడానికి వయసుతో సంబంధం లేదు. దీర్ఘకాలికంగా ప్రయత్నిస్తున్నవాళ్లు లేకపోలేదు. అంటే.. ప్రతీ ఒక్కరికీ ఇది వర్తిస్తుందన్నమాట. అయితే..ప్రతి కొత్త ప్రారంభం ఎంతో గొప్ప శక్తి, సానుకూల భావనలతో వస్తుందని అందరి నమ్మకం. మన భాషలో మంచి పాజిటివ్ వైబ్ అన్నమాట. చాలా మంది చాలా రకాల లక్ష్యాలను ఈ కొత్త ఏడాదిలో నిర్దేశించుకుంటారు. వాటిలో కొన్నింటిని ఎలాగైనా చేయాలని ప్రయత్నిస్తుంటారు. అవి మాములువి కాదు.. పెద్ద పెద్ద టార్గెట్లే ఉండొచ్చు!. అలాంటి వాటిని ఒంటరిగా నెరవేర్చుకోవడం కొంచెం కష్టమే!. అందుకోసమైనా సరే ఈ లక్ష్యాలను నలుగురితో పంచుకుని సాధించుకునే ప్రయత్నం చేయాలి.కొత్త ఏడాది రెజల్యూషన్స్ చేసుకోవడంలో.. విద్యార్థులు, యువత ముందుంటారు. ఇక్కడ విద్యార్థులతో పాటు వారు తల్లిదండ్రులు/సంరక్షకులు కూడా ఈ లక్ష్యాల కోసం వారితో కలిసి పనిచేస్తేనే ఫలితం ఉండేది. ఉదయాన్నే లేచి చదువుకోవాలనో, లేదంటే టైంకు హోంవర్క్ పూర్తి చేయాలనో, అదికాకుంటే మార్కులు బాగా తెచ్చుకోవాలనో, యూనివర్సిటీలో ర్యాంకు రావాలనో.. ఇలా తల్లిదండ్రులు, పిల్లలతో కలిసి మాట్లాడుకోవాలి. భవిష్యత్‌లో పిల్లలు మంచి స్థాయిలో స్థిరపడాలంటే చదువు తప్పనిసరని చెబుతూనే వారికి కొన్ని లక్ష్యాలను నిర్దేశించాలి. అయితే ఇది వాళ్లను ఒత్తిడి, ఆందోళనలకు గురి చేసేదిలా మాత్రం అస్సలు ఉండకూడదు. అలాగే ప్రొగ్రెస్‌ను రివ్యూ చేస్తూ.. వాళ్లకు అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వాలే తప్ప!.. ఇతరులతో పోల్చి నిందించడం.. ఆశించిన ఫలితం రాలేదని కోప్పడడం, కొట్టడం లాంటివి అస్సలు చేయకూడదు. మానసిక ఆరోగ్యమే వాళ్ల విజయానికి తొలి మెట్టు అనేది గుర్తించి ముందుకు వెళ్లాలి.లక్ష్యాలను ఎక్కువగా నిర్దేశించుకునే వర్గం యువతే. అలాగే.. రెజల్యూషన్స్‌ను బ్రేక్ చేసేది కూడా ఈ వర్గమే. కెరీర్‌పరంగా స్థిరపడే క్రమంలో.. వీళ్లకు కుటుంబ సభ్యులు, స్నేహితుల తోడ్పాడు కచ్చితంగా అవసరం ఉంటుంది. ఉన్నత చదువులు, ఉద్యోగాల అన్వేషణ.. ఇలా లక్ష్యాలను నిర్దేశించుకునేలా వాళ్లను సమాయత్తం చేయాలి. అందుకు అవసరమైన సాధన, నైపుణ్యాలు, సామర్థ్యాలను పెంచుకునేలా వాళ్లను ప్రొత్సహించాలి. ఆ దశలో అన్ని రకాలుగా విశ్లేషణ అనేది అవసరం. అందుకు అవసరమైన సాయమూ అందించినప్పుడే వాళ్లు తమ లక్ష్యాలను చేరుకోగలరని గుర్తించాలి.జీవితంలో ఎదుగుదల పొదుపు(Savings)తోనే ప్రారంభమవుతుంది. అందుకే కొత్త ఏడాదిలో అడుగుపెట్టే ముందైనా.. ఆర్థికంగా పరిపుష్టి సాధించాలకుని ఎన్నో ప్రణాళికలు వేసుకుంటారు. కొత్తగా ఉద్యోగం సాధించిన వారైతేనేమి, కొత్తగా ఆర్థికంగా నిలదొక్కుకోవాలని అనుకునేవారైతేనేమి.. దీన్నొక భవిష్యత్ ఆశాకిరణంగా భావిస్తారు కూడా. అలాగే తూచా తప్పకుండా పాటించాల్సిన నియమాలు కూడా ఎక్కువ అవసరం పడేది ఈ లక్ష్య సాధనలోనే!. కాబట్టి.. స్వీయ నియంత్రణతో పాటు కుటుంబ సభ్యుల సహకారం అవసరం. మరీ ముఖ్యంగా భాగస్వామి పాత్ర ఇంకాస్త ఎక్కువే!. నెలావారీ ఖర్చులతో పాటు ఏ నెలలో ఎంత మొత్తం అవసరం అవుతుందనే ప్రణాళిక ముందుగానే వేసుకోవడం, ఎమర్జెన్సీ కోసం కొంత డబ్బును పక్కన పెట్టుకోవడం లాంటివి చేయాలి.కొత్త సంవత్సరం తొలిరోజు మాత్రమే కాదు.. వచ్చే ఏడాదిలో ప్రతీ పండుగను సంతోషంగా జరుపుకోవాలని అనుకుంటున్నారా?.. అయితే ఆరోగ్యంగా ఉండడం అవసరం. న్యూఇయర్ రెజల్యూషన్స్(NewYear's Resolutions)లో.. వయసుతో సంబంధం లేకుండా మంచి ఆరోగ్య ప్రణాళికను చాలామంది నిర్దేశించుకుంటారు. అయితే ఇంత ముఖ్యమైన తీర్మానాన్ని.. ఉల్లంఘించేవాళ్లు కూడా ఎక్కువ స్థాయిలోనే ఉంటారు. ఇందుకు బద్ధకం సహా రకరకరాల కారణాలు ఉండొచ్చు. కానీ, ఈ తీర్మానాన్ని సమిష్టిదిగా ఆ కుటుంబం భావించాలి. తద్వారా మానసిక, శారీరక సమస్యలనూ దూరంగా ఉంచుకోవాలి. అప్పుడే కదా మనం అనుకున్న లక్ష్యాలు కానీ బాధ్యతలు కానీ నేరవేర్చడానికి వీలవుతుంది.న్యూ ఇయర్ రిజల్యూషన్లు ఎవరైనా తీసుకోవచ్చు. కానీ, పక్కాగా అమలు కావాలంటే మాత్రం మనకు గట్టి సపోర్ట్ అవసరం అంటారు నిపుణులు. ఇది ఒంటరి ప్రయాణం ఎంతమాత్రం కాదు. ఒకరకంగా ఇది ఆఫీసుల్లో టీం వర్క్ లాంటిదన్నమాట. అందుకే తీసుకునే నిర్ణయాన్ని నలుగురికి చెప్పాలి.. వాళ్ల సపోర్ట్ తీసుకోవాలి. ఎందుకు? ఏమిటి? ఎలా? అనే చర్చ జరగాలి. ఆ ప్రభావం చాలా మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది. అప్పుడే ఏడాది పొడవునా.. అనుకున్న మేర ఫలితాలు అందుకోగలరు. -
దివ్యాంగులకు హోఫ్4 స్పందన చేయూత
దివ్యాంగులకు అండగా నిలవాలనే సంకల్పంతో కృషి చేస్తున్న అమెరికాలోని హోఫ్4స్పందన సేవా సంస్థ తెలుగునాట వేల మంది వికలాంగులకు సాయం అందిస్తుంది. ఈ క్రమంలోనే అనంతపురంలోని కాటగానికాలువ గ్రామంలో ఆశ్రయ అనాధశ్రమానికి హోఫ్4 స్పందన అండగా నిలిచింది. ఈ ఆశ్రమంలో అనాధ మానసిక వికలాంగులకు శాశ్వత నివాసం కల్పించేందుకు కావాల్సిన ఆర్ధిక సహకారాన్ని అందించింది. అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలిచే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్, ఏకాంశ సంస్థలు ఈ సత్కార్యానికి సాయం చేశాయి. హోఫ్4 స్పందన నిర్వాహకులు లక్ష్మీ నరసింహం కోట తాజాగా అనంతపురంలోని ఆశ్రయ అనాధశ్రమం కోసం నిర్మిస్తున్న శాశ్వత షెల్టర్‌ను పరిశీలించారు. దాదాపు 70 శాతం పూర్తయిన ఈ షెల్టర్ అనాధ మానసిక వికలాంగులకు ఆవాసంగా మారనుంది. సమాజ సేవ కోసం హోఫ్4 స్పందన పిలుపుతో స్పందించి సాయం చేసిన నాట్స్, ఏకాంశ సంస్థలకు లక్ష్మీ నరసింహ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటితో పాటు హోఫ్4 స్పందన ఆశయ సిద్ధికి అండగా నిలిచిన నాట్స్ నాయకులు శ్రీధర్ అప్పసాని, మురళీకృష్ణ మేడిచెర్ల లకు ధన్యవాదాలు తెలిపారు. 25 ఏళ్లుగా అనాధ మానసిక వికలాంగుల కోసం ఆశ్రయ అనాధశ్రమం ద్వారా కృషి చేస్తున్న కృష్ణారెడ్డి సేవలు అభినందనీయమని లక్ష్మీ నరసింహ అన్నారు. వందమందికిపైగా మానసిక వికలాంగులకు ఈ కొత్త షెల్టర్ ఉపయోగపడనుంది.(చదవండి: ఫ్రాంచైజ్ బిజినెస్‌పై నాట్స్ వెబినార్ ఔత్సాహికులకు దిశా నిర్దేశం) -
అట్టుడుకుతున్న మణిపూర్.. సంగ్మా కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: బీజేపీ ఆధ్వర్యంలోని మణిపుర్ ప్రభుత్వానికి తమ మద్దతును ఉపసంహరించుకున్నట్లు నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) అధ్యక్షుడు, మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా ఆదివారం(నవంబర్ 17) ప్రకటించారు.‘మణిపూర్‌లో సంక్షోభాన్ని పరిష్కరించడంలో సీఎం బీరేన్ సింగ్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. తాజా హింసాత్మక ఘటనల్లో అనేకమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి మా మద్దతును తక్షణమే ఉపసంహరించుకుంటున్నాం’ అని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు రాసిన లేఖలో ఎన్పీపీ తెలిపింది. మణిపుర్ అసెంబ్లీలో మొత్తం 60 సీట్లున్నాయి. వీటిలో 53స్థానాలతో ఎన్డీయే అధికారంలో ఉంది. ఈ 53 సీట్లలో ఎన్పీపీకి ఏడు సీట్లున్నాయి.హింసాత్మక ఘటనల నేపథ్యంలో మణిపుర్ పరిస్థితులపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించారు. ఆదివారం(నవంబర్ 17)ఉన్నతాధికారులతో సమావేశమైన ఆయన రాష్ట్రంలో శాంతిస్థాపనకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహారాష్ట్రలో తన ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకుని ఢిల్లీకి తిరిగి వచ్చిన వెంటనే అమిత్ షా ఈ సమావేశాన్ని నిర్వహించారు. కాగా, మణిపుర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్‌తోపాటు ముగ్గురు మంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేల నివాసాలపై నిరసనకారులు దాడులు చేసిన విషయం తెలిసిందే. -
భారతీయ అమెరికన్లలో హారిస్‌కు తగ్గిన ఆదరణ!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ డెమొక్రాట్లకు చేదు కబురు. ఆ పార్టీకి మద్దతిస్తున్న ఇండియన్ అమెరికన్ ఓటర్ల సంఖ్యలో గత ఎన్నికలతో పోలిస్తే ఏకంగా ఏడు శాతం తగ్గుదల నమోదైంది! భారత మూలాలున్న కమలా హారిస్‌కు మద్దతిస్తున్న వారి సంఖ్య 61 శాతానికి తగ్గింది. అంతేగాక తాము డెమొక్రాట్లమని చెప్పుకున్న ఇండియన్ అమెరికన్ల సంఖ్య కూడా 56 నుంచి 47 శాతానికి తగ్గింది. సోమవారం వెలువడ్డ ‘ఇండియన్ అమెరికన్ ఆటిట్యూడ్స్’ సర్వేలో ఈ మేరకు తేలింది. ట్రంప్‌కు ఓటేస్తామని వారిలో 32 శాతం మంది పేర్కొన్నారు. 2020లో డెమొక్రాట్ల అభ్యర్థి జో బైడెన్‌కు 68 శాతం మద్దతు దక్కగా ట్రంప్‌కు 22 శాతం మాత్రమే జైకొట్టారు!→ ఇండియన్ అమెరికన్ మహిళా ఓటర్లలో 67 శాతం మంది హారిస్‌కు జైకొట్టారు. ట్రంప్‌కు మద్దతిచ్చిన వారు కేవలం 22 శాతమే.→ 40 ఏళ్ల పైచిలుకు వయసు వారిలో ఏకంగా 70 శాతం మహిళలు, 60 శాతం పురుషులు హారిస్‌కు జైకొట్టారు.→ 40 ఏళ్ల లోపువారిలో మాత్రం 60 శాతం మహిళలే హారిస్‌కు మద్దతిచ్చారు.→ ఇండియన్ అమెరికన్ పురుషుల్లో 53 శాతం హారిస్‌కు, 39 శాతం మంది ట్రంప్‌కు ఓటేస్తామని చెప్పారు.→ 40 ఏళ్లలోపు పురుషుల్లో మాత్రం ట్రంప్‌దే పైచేయి కావడం విశేషం. ఆయనకు 48 శాతం, హారిస్‌కు 44 శాతం జైకొట్టారు.→ యువ ఇండియన్ అమెరికన్లలో మాత్రం ట్రంప్‌కు మద్దతిస్తున్న వారి సంఖ్య భారీగా పెరిగినట్టు సర్వే తేల్చింది.→ అమెరికాలో 52 లక్షలకు పైగా భారత సంతతి వారున్నారు. వారిలో ఓటర్ల సంఖ్య 26 లక్షల పై చిలుకు.→ హిందూయేతరులతో పోలిస్తే హిందువుల్లో ట్రంప్ మద్దతుదారులు అధికంగా ఉండటం విశేషం. ఆయనకు ఓటేస్తామని 58 శాతం మంది హిందువులు తెలిపారు. 35 శాతం హిందువులు హారిస్‌కు మద్దతిస్తామన్నారు.→ హిందూయేతర భారతీయ అమెరికన్లలో 62 శాతం హారిస్‌కు, 27 శాతం ట్రంప్‌కు మద్దతిచ్చారు.→ 17 శాతం మంది ద్రవ్యోల్బణాన్ని ప్రధాన సమస్యగా పేర్కొన్నారు.→ ఉపాధి, ఆర్థిక అవ్యస్థ, అబార్షన్ ప్రధానాంశాలని 13 శాతం చెప్పారు.→ భారత్–అమెరికా సంబంధాలకు ప్రాధాన్యమిస్తున్నట్టు చెప్పిన వారు కేవలం 4 శాతమే. -
USA Presidential Elections 2024: కమలా హారిస్‌కు గాయని బియాన్స్ మద్దతు
హూస్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యరి్థగా పోటీకి దిగుతున్న కమలా హారిస్‌కు ప్రఖ్యాత గాయని బియాన్స్ మద్దతు ప్రకటించారు. శుక్రవారం రాత్రి హూస్టన్‌లో జరిగిన డెమొక్రటిక్ ప్రచార సభలో ఆమె ప్రసంగించారు. ‘‘ఒక సెలబ్రిటీకి ఇక్కడికి రాలేదు. ఒక రాజకీయ నాయకురాలిగా రాలేదు. ఒక తల్లిగా వచ్చాను. మన బిడ్డలు ప్రతిబంధకాలు, పరిమితులు లేకుండా పెరగాలంటే కమలా హారిస్‌కు ఓటు వేయాలి’’అని పిలుపునిచ్చారు. హూస్టన్ బియాన్స్ సొంత నగరం కావడం విశేషం. 2016లోనూ ఆమె అప్పటి డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు మద్దతు పలికారు. క్లీవ్‌లాండ్‌లో ప్రచార సభలో హిల్లరీకి మద్దుతుగా ఒక పాట కూడా పాడారు. ఈసారి మాత్రం పాడలేదు. కమలా హారిస్‌ను గెలిపించాలని ప్రజలను కోరారు. హూస్టన్ సభలో కమలా హారిస్ మాట్లాడుతూ.. తన ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై విరుచుకుపడ్డారు. మహిళల పునరుత్పత్తి హక్కుల విషయంలో గత 50 ఏళ్లలో సాధించిన ప్రగతిని ట్రంప్ నాశనం చేశారని మండిపడ్డారు. మహిళలకు హక్కులు నిరాకరించారని ధ్వజమెత్తారు. ఈ ఎన్నికల్లో ట్రంప్‌ను చిత్తుగా ఓడించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
కమలా హారిస్‌కు మద్దతుగా ఏఆర్ రెహమాన్
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌లు తమ ప్రచార కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తున్నారు. ఇద్దరు అభ్యర్థులూ ప్రచార సభల్లో పాల్గొంటూ, అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపధ్యంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌కు మద్దతుగా ఓ సంగీత కార్యక్రమం నిర్వహించనున్నారు.డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌కు మద్దతుగా జరగబోయే ఒక ప్రచార సభలో ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కాన్సర్ట్ ఇవ్వనున్నారని ఏషియన్ అమెరికన్ పసిఫిక్ ఐలాండర్స్ (ఏఏపీఐ) అనే నిధుల సేకరణ బృందం ప్రకటించింది. కాగా ఈ కార్యక్రమ తేదీ, ఇతర వివరాలు త్వరలోనే వెల్లడించనున్నట్లు ఏఏపీఐ తెలిపింది. ఈ విషయమై ఏఆర్ రెహమాన్ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఈ కార్యక్రమం నిర్వహించే తేదీ నిర్ణయించిన తరువాత రెహమాన్ నుండి ప్రకటన రావచ్చని అంటున్నారు. కమలా హారిస్‌కు మద్దతుగా రెహమాన్ సంగీత కార్యక్రమం జరగబోతున్నదనే వార్త వెలువడగానే ఇది చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమంతో కమలా హారిస్ ఓటర్ల నుంచి మరింత ఆదరణ పొందగలరని పలువురు భావిస్తున్నారు.ఇది కూడా చదవండి: బంగ్లాదేశ్: దుర్గాపూజలో చెలరేగిన హింస -
జమ్ముకశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్‌కు ఆప్ మద్దతు
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ తాజాగా.. నేషనల్ కాన్ఫరెన్స్‌కు మద్దతు ప్రకటిస్తున్నట్లు ప్రకటించింది. నేషనల్ కాన్ఫరెన్స్‌కు మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొంటూ ఒక లేఖను లెఫ్టినెంట్ గవర్నర్‌కు సమర్పించింది. కాగా మ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ తొలిసారిగా గెలుపొందింది. దోడా నియోజకవర్గం నుంచి ఆప్ తరుపున పోటీ చేసిన మెహ్రాజ్ మాలిక్- బీజేపీ అభ్యర్థిపై గజయ్ సింగ్ రాణాపై 4,538 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్‌లో తొలిసారి జరిగిన ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్- కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది. మ్యాజిక్ ఫిగర్ కన్నా రెండు సీట్లు ఎక్కువగా గెలుచుకుంది. ఎన్సీ 42 చోట్ల, కాంగ్రెస్ 6 స్థానాల్లో విజయ దుందుభి మోగించాయి. బీజేపీ 29 సీట్లను సొంతం చేసుకుంది. పీడీపీ మూడు స్థానాలకు పరిమితమైంది. 10 స్థానాల్లో ఇతరులు గెలుపొందారు. -
బంగ్లాలో హిందువులపై హింస.. మహారాష్ట్రలో నిరసన ర్యాలీ
గోండియా: బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న అకృత్యాలను నిరసిస్తూ మహారాష్ట్రలోని గోండియా జిల్లాలో మెగా ర్యాలీ నిర్వహించారు. దాదాపు 20 వేల మంది ఈ ర్యాలీలో పాల్గొని, హిందువులకు మద్దతుగా పలు నినాదాలు చేశారు.బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులకు సంబంధించిన ఫొటోలు, వార్తలు వెలువడుతున్న దరిమిలా ప్రపంచవ్యాప్తంగా హిందువుల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. ఈ నేపధ్యంలో గోండియాలో 70కి పైగా హిందూ గ్రూపులకు చెందిన 20 వేల మంది బంగ్లాదేశ్‌లోని హిందువులకు మద్దతుగా ర్యాలీని చేపట్టారు. జైస్తంభ్ చౌక్ నుండి కిలోమీటరు మేర పాదయాత్ర చేపట్టారు. బంగ్లాదేశ్‌లో హిందువులకు భద్రత కల్పించాలంటూ వారు ర్యాలీలో నినదించారు.ర్యాలీలో పాల్గొన్న కొందరు మాట్లాడుతూ బంగ్లాదేశ్‌లో హిందూ, బౌద్ధ, క్రైస్తవ మైనారిటీలు ప్రమాదంలో ఉన్నారని అన్నారు. మత ఛాందసవాదులు మైనారిటీ హిందువుల దేవాలయాలపై దాడులు చేస్తున్నారని, హిందువుల ఇళ్లను ద్వంసం చేసి, వారిని నిరాశ్రయులుగా మారుస్తున్నారని పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌లో అస్థిరత ఏర్పడినప్పుడల్లా మైనారిటీలు, ముఖ్యంగా హిందువులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది భారతదేశాన్ని కూడా ప్రభావితం చేస్తున్నదని అన్నారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై కొనసాగుతున్న హింస, అరాచకాలు, అశాంతి అంతం కావాలని ర్యాలీలో పాల్గొన్నవారు నినదించారు. చివరిగా భారతదేశ జాతీయ గీతాలాపనతో ఈ కార్యక్రమాన్ని ముగించారు. ఇది కూడా చదవండి: ప్రధాని మోదీతో నేపాల్ ప్రధాని ద్వైపాక్షిక చర్చలు -
‘నేతలు గోల్గప్పాలు అమ్ముకోవాలా?’: కంగనా
బాలీవుడ్ నటి కంగన రాజకీయాల్లోకి ప్రవేశించాక తనదైన ముద్ర వేస్తున్నారు. తాజాగా ఆమె జ్యోతిర్మఠం(ఉత్తరాఖండ్)నకు చెందిన శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.వివరాల్లోకి వెళితే అవిముక్తేశ్వరానంద సరస్వతి ఇటీవల ముంబైలో శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్ధవ్ ఠాక్రేకు ద్రోహం జరిగిందని ఆరోపించారు. సనాతన ధర్మంలో ద్రోహం పెద్ద పాపమని పేర్కొన్నారు. అవిముక్తేశ్వరానంద వ్యాఖ్యల నేపధ్యంలో కొందరు ఆయనను విమర్శిస్తుండగా, మరికొందరు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు.ఈ ఉదంతంపై బాలీవుడ్ క్వీన్, బీజేపీ నాయకురాలు కంగనా రనౌత్ కూడా స్పందించారు. ఎంపీ కంగనా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకు మద్దతు పలుకుతూ, అవిముక్తేశ్వరానందపై విమర్శలు చేశారు. శంకరాచార్య తన పదజాలంతో మతపరమైన విద్యను దుర్వినియోగం చేశారని కంగనా ఆరోపించారు.కంగనా తన సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో..‘ రాజకీయాల్లో పొత్తు, పార్టీ విభజన అనేవి చాలా సాధారణమైన, రాజ్యాంగబద్ధమైన విషయాలని, 1907లో కాంగ్రెస్ పార్టీ చీలిపోయిందని, 1971లోనూ ఇలానే జరిగిందని, నేతలు రాజకీయాలు చేయకపోతే గోల్గప్పాలు (పానీపూరీలు) అమ్ముకోవాలా? అని ప్రశ్నించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేను దేశద్రోహి అని వ్యాఖ్యానించిన శంకరాచార్య హిందూ ధర్మం గౌరవాన్ని దెబ్బతీస్తున్నారని ఆమె ఆరోపించారు. राजनीति में गठबंधन , संधि और एक पार्टी का विभाजन होना बहुत सामान्य और संवैधानिक बात है, कांग्रेस पार्टी का विभाजन 1907 में और फिर 1971 में हुआ, अगर राजनीति में राजनीतज्ञ राजनीति नहीं करेगा तो क्या गोलगप्पे बेचेगा? शंकराचार्य जी ने उनकी शब्दावली और अपने प्रभाव और धार्मिक शिक्षा… https://t.co/UV2KuLwVUz— Kangana Ranaut (@KanganaTeam) July 17, 2024 -
స్మృతి ఇరానీకి మద్దతుగా రాహుల్ గాంధీ ట్వీట్!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. కేంద్రమాజీ మంత్రి, బీజేపీ నేత స్మృతి ఇరానీకి మద్దతుగా ఎక్స్ ఖాతాలో ఓ సందేశం ఉంచడం చర్చనీయాంశంగా మారింది.2019 సార్వత్రిక ఎన్నికల్లో అమేథీలో స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ గాంధీ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లోనూ వీళ్ల మధ్య పోటీ ఉండొచ్చని భావించినప్పటికీ.. అనూహ్యంగా రాయ్‌బరేలీ నుంచి రాహుల్ పోటీ చేశారు. ఈ క్రమంలో స్మృతి ఇరానీ, రాహుల్‌ను ఎద్దేవా చేస్తూ కాంగ్రెస్‌పై కామెంట్లు చేశారు. అయితే కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన కిషోరీ లాల్ శర్మ, స్మృతి ఇరానీని ఓడించారు.ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక.. తాజాగా స్మృతి ఇరానీని దూషిస్తూ సోషల్ మీడియాలో కొందరు పోస్టులు చేస్తున్న సంగతి రాహుల్ గాంధీ దృష్టికి వచ్చింది. దీంతో ఆమెకు మద్దతుగా ఆయన తన ఎక్స్ ఖాతాలో ఓ సందేశం ఉంచారు.జీవితంలో గెలుపోటములు వస్తుంటాయి. అలాగని ఒకరిని కించపర్చడం, అవమానించడం సరికాదు. పైగా అది బలహీనత అవుతుందే తప్ప.. బలం అనిపించుకోదు. స్మృతి ఇరానీనో లేదంటే ఇతర నాయకుల్ని అవమానించడం, దుర్భాషలాడడంలాంటివి చేయొద్దని కోరుతున్నా అని రాహుల్ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. Winning and losing happen in life. I urge everyone to refrain from using derogatory language and being nasty towards Smt. Smriti Irani or any other leader for that matter. Humiliating and insulting people is a sign of weakness, not strength.— Rahul Gandhi (@RahulGandhi) July 12, 2024 -
బైడెన్‌కు తగ్గిన భారతీయ- అమెరికన్ల మద్దతు
ఈ ఏడాది నవంబర్‌లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఇంతలో బైడెన్‌కు మద్దతునిచ్చే విషయంలో భారతీయ-అమెరికన్లు కాస్త వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది. ప్రతి రెండేళ్లకోసారి నిర్వహించే ఆసియన్-అమెరికన్ ఓటర్ సర్వే (ఏఏవీఎస్) తెలిపిన వివరాల ప్రకారం 2020 ఎన్నికలు- 2024 ఎన్నికల మధ్యకాలంలో జో బైడెన్‌కు మద్దతునిచ్చే భారతీయ-అమెరికన్ మద్దతుదారులలో 19 శాతం క్షీణత కనిపించింది.ఆసియా అండ్ పసిఫిక్ ఐలాండర్ అమెరికన్ వోట్ ఆసియన్ అమెరికన్స్ అడ్వాన్సింగ్ జస్టిస్‌ల సర్వే ప్రకారం 49 శాతం మంది భారతీయ-అమెరికన్ పౌరులు ఈ ఏడాది జో బైడెన్‌కు ఓటు వేసే అవకాశం ఉంది. 2020లో ఇది 65 శాతంగా ఉంది. 30 శాతం మంది భారతీయ-అమెరికన్ పౌరులు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఓటు వేసే అవకాశాలున్నాయని సర్వే వెల్లడించింది.డొనాల్డ్ ట్రంప్‌కు రెండు పాయింట్ల మేరకు ప్రయోజనం ఉండబోతోందని ఈ సర్వే తెలిపింది. గత రెండు దశాబ్దాలుగా అమెరికాలో ఆసియా అమెరికన్ ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత నాలుగేళ్లలో 15 శాతం వృద్ధి నమోదైంది. భారతీయ-అమెరికన్ ఓటర్ల సంఖ్య తగ్గడం బైడెన్‌కు ఆందోళన కలిగించే అంశంగా మారింది.ఈ సర్వే ప్రకారం 55 శాతం భారతీయ-అమెరికన్ ఓటర్లు బైడెన్‌కు మద్దతు నివ్వగా, 38 శాతం మంది మాత్రమే ట్రంప్‌కు మద్దతు పలికారు. కాగా దక్షిణ కాలిఫోర్నియా గవర్నర్, అమెరికా రాయబారి నిక్కీ హేలీని 33 శాతం మంది భారతీయ-అమెరికన్లు ఇష్టపడుతున్నారు. అయితే హేలీ పేరు వినని వారు 11 శాతం మంది ఉండటం విశేషం. -
ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు పూర్తి మద్ధతు: ఉత్తర కొరియా
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బుధవారం ఉత్తర కొరియాలో పర్యటిస్తున్నారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆహ్వానం మేరకు రెండు రోజులు (ఈనెల18,19) అక్కడ పుతిన్ పర్యటిస్తున్నారు. ప్యోంగ్యాంగ్ విమానాశ్రయానికి స్వయంగా వెళ్లిన కిమ్, పుతిన్‌కు ఆహ్వానం పలికారు. అనంతరం ప్యోంగ్యాంగ్లో నిర్వహించిన కార్యక్రమంలో ఇరువురు పాల్గొన్నారు. ఇరు దేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు ద్వైపాక్షిక చర్చలు జరిపారు.ఉక్రెయిన్‌తో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో రష్యాకు తమ పూర్తి మద్ధతు ఉంటుందని కిమ్ హామీ ఇచ్చారు. ఇరుదేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేయడానికి, అమెరికా ఆధిప్యత విధానాలకు వ్యతిరేకంగా పోరేండేందుకు ఓ ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్లు పుతిన్ పేర్కొన్నారు. ఇరు దేశాల మద్య ఆర్థిక, సైనిక సహకారాన్ని విస్తరించేందుకు అంగీకరించినట్లు తెలిపారు.యుద్ధంలో తమ పాలసీలకు మద్ధతు ప్రకటించడంపై కిమ్‌కు పుతిన్ ధన్యవాదాలు తెలిపారు. అయితే యుద్ధంలో తమకు ఆయుధాలను పంపాలని కిమ్‌ను కోరినట్టు తెలుస్తోంది. దీనికి బదులుగా ఉత్తర కొరియాకు ఆర్థికంగా, సాంకేతికంగా రష్యా సాయం చేయనున్నట్టు సమాచారం.ఇక ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర సమయంలో పుతిన్ పర్యటనకు రావడం.. అమెరికా సహా దాని మిత్రదేశాలను ఆందోళనకు గురిచేసింది. అణ్వాయుధాలు, క్షిపణి పరీక్షలతో నిత్యం శత్రు దేశాలను కవ్వించే ఉత్తర కొరియా చేతికి రష్యా అత్యాధునిక సాంకేతికత అందితే మరింత ప్రమాదమని పశ్చిమ దేశాల్లో ఆందోళన నెలకొంది.ఇదిల ఉండగా అంతర్జాతీయంగా ఇరుదేశాలపై కఠిన ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఒకవైపు.. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగిస్తోంది. మరోవైపు.. ఉత్తర కొరియా ఆయుధ పరీక్షలు, ఇతర దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది. ఈ పరిణామాల నడుమ.. వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఉత్తర కొరియాలో పుతిన్ పర్యటించడం 24 ఏళ్లలో ఇదే తొలిసారి. కాగా గత ఏడాది సెప్టెంబరులో కిమ్ జోంగ్ ఉన్ రష్యాలో పర్యటించిన సంగతి తెలిసిందే. -
రేవ్ పార్టీ కేసులో సినీ నటి హేమకు మంచు విష్ణు సపోర్ట్
-
వైఎస్ఆర్ సీపీనే మళ్ళీ గలిపిస్తాం
-
వైయస్సార్సీపీ సిద్ధం సభలకు అమెరికా NRI ల సంఘీభావం !
ఎన్నికలకు సమయం సమీపిస్తున్న తరుణంలో లాస్ ఏంజెల్స్, ఇర్విన్ పట్టణంలోని వైయస్సార్సీపీ అభిమానులు సమావేశమైనారు.,ఈ వారం రోజుల్లో చేయాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. ముఖ్యంగా వైయస్సార్సీపీ ప్రభుత్వం గత ఐదేళ్లుగా చేసిన అభివృద్ధి పనులపై సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా ప్రచారం కల్పించాలని తీర్మానించారు .వాస్తవానికి గత అన్ని ప్రభుత్వాలకంటే ఎక్కువగా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వర్తించినప్పటికీ , ఆదాయ వనరులతో భావితరాల అభివృద్ధికి బాటలు పరిచినప్పటికీ, కేవలం సంక్షేమానికి సంబందించిన విషయాలు మాత్రమే ఎక్కువ ప్రాచుర్యం పొందినందున, అభివృద్ధికి సంబంధించి మరింత అవగాహన కల్పించాలని తీర్మానించారు .ఈ సందర్భంగా పలువురు ఎన్ఆర్ఐలు మాట్లాడుతూ, వైయస్సార్సీపీ తాను చేసిన పనులను చెప్పుకుంటూ, ఓట్లను అభ్యర్థిస్తుండగా , ప్రతిపక్షాలు మాత్రం వారు గతంలో చేసిందేమీ లేక కేవలం తిట్లు , పరుషవాక్యాలతో ప్రచారం చేస్తున్నారని, ప్రజలు ఈ వ్యత్యాసం గ్రహించలేని అజ్ఞానులు ఏమాత్రం కాదని , అది ఎన్నికల ఫలితాలలో నిరూపించబడుతుంది అన్నారు . -
ఏపీలో వైఎస్ఆర్ సీపీకి మద్దతు ప్రకటించిన ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్
-
మా మద్దతు సీఎం జగన్ కే
-
వైఎస్సార్సీపీకి మద్దతు ప్రకటించిన ఆర్య వైశ్య సంఘం
-
జగన్ అన్న కోసం యూకే సైన్యం సిద్ధం (ఫొటోలు)
-
ప్రభుత్వంలో చేరబోం
ఇస్లామాబాద్: మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్–నవాజ్(పీఎంఎల్–ఎన్), బిలావల్ భుట్టో నేతృత్వంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ)ల సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుఖాయమైన వేళ బిలావల్ భిన్నమైన ప్రకటన చేశారు. తాము ప్రభుత్వంలో చేరట్లేదని, బయటి నుంచి మద్దతు ఇస్తామని ఆయన స్పష్టంచేశారు. ‘‘ ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులు పొందటంలో మేం విఫలమయ్యాం. గెలిచిన సీట్ల సంఖ్యలో మేం మూడోస్థానానికే పరిమితమయ్యాం. అందుకే ప్రభుత్వంలో చేరొద్దని, ఏ మంత్రి పదవులూ స్వీకరించవద్దని మా పార్టీ నిర్ణయించింది. దేశంలో రాజకీయ సంక్షోభాన్ని మేం కోరుకోవట్లేదు. దేశంలో రాజకీయ సుస్థిరతే మాకు ముఖ్యం’’ అని పార్టీ అత్యున్నత కేంద్ర కార్యనిర్వాహక కమిటీ సమావేశం తర్వాత బిలోవల్ మీడియాతో చెప్పారు. దీంతో నవాజ్ షరీఫ్ రికార్డుస్థాయిలో నాలుగోసారి ప్రధా ట కావడం ఖాయమైంది. మరోవైపు కేంద్రంలో, రెండు ప్రావిన్సుల్లో ప్రభుత్వాల ఏర్పాటుకు ఇమ్రాన్ నేతృత్వంపీటీఐ ప్రయత్నిస్తోంది. ఎండబ్ల్యూఎం పార్టీతో కలసి కేంద్రంలో, పంజాబ్ ప్రావిన్స్‌లో.. జమాతే ఇస్లామీ పార్టీతో కలిసి ఖైబర్–పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయతి్నస్తామని పీటీఐ పేర్కొంది. -
సీఎం వైఎస్ జగన్ పాలనలో మహిళలకు పెద్దపీట
-
పబ్లిక్ పరీక్షల బిల్లుకు వైఎస్సార్సీపీ మద్దతు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే పబ్లిక్ పరీక్షల్లో అవతకవకలకు పాల్పడే వారిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్లు–2024కు వైఎస్సార్సీపీ మద్దతు తెలిపింది. బిల్లుపై లోక్‌సభలో మంగళవారం జరిగిన చర్చలో వైఎస్సార్సీపీ ఎంపీ చింతా అనూరాధ మాట్లాడుతూ.. పబ్లిక్ పరీక్షలు, ఉద్యోగ నియామకాల పరీక్ష పత్రాల లీక్ కారణంగా నష్టపోయిన కోట్లాది మంది యువత ఈ తరహా బిల్లు కోసమే ఎదురు చూస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పరీక్ష పత్రాలు లీక్‌చేసే వారిపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందన్నారు. స్థానిక సంస్థల రిజర్వేషన్లలో ఓబీసీల చేర్పు అభినందనీయమని ఎంపీ చింతా అనూరాధ పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్ స్థానిక సంస్థల చట్టాల బిల్లుకు వైఎస్సార్సీపీ తరఫున మద్దతు ప్రకటించారు. ఏకలవ్య పాఠశాలలు అత్యవసరం గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటు అత్యవసరమని వైఎస్సార్సీపీ ఎంపీ గొడ్డేటి మాధవి అన్నారు. జమ్మూ కశ్మీర్ షెడ్యూల్డ్ కులాల, తెగల ఆర్డర్ సవరణ బిల్లులు–2024కు వైఎస్సార్సీపీ తరఫున మద్దతు ప్రకటించారు. వేగివాడలో డీఎస్పీ పశ్చిమ గోదావరి జిల్లా వేగివాడలో ‘డిమాన్స్ట్రేషన్ కం సీడ్ ప్రొడక్షన్ ఫారం’ (డీఎస్పీ) ఏర్పాటు చేసినట్టు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా తెలిపారు. లోక్‌సభ ప్రశ్నోత్తరాల్లో భాగంగా ఎంపీ బీశెట్టి వెంకట సత్యవతి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి జవాబిచ్చారు. విశ్వవిద్యాలయాల్లో ఫ్రీ కోచింగ్ అంబేడ్కర్ ఫౌండేషన్ (డీఏఎఫ్)’, అంబేడ్కర్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (డీఏసీఈ) ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం ఉచిత కోచింగ్ స్కీమ్ నిర్వహిస్తున్నట్టు కేంద్ర సహాయ మంత్రి ఎ.నారాయణస్వామి తెలిపారు. లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఎంపీ మార్గాని భరత్ అడిగిన ప్రశ్నకు జవాబిచ్చారు. ఏపీలో 24 కృషి విజ్ఞాన కేంద్రాలు రైతులు వ్యవసాయ రంగంలో నూతన సాంకేతికతలను అవలంభించేందుకు ఏపీలో 24 కృషి విజ్ఞాన కేంద్రాల(కేవీకేల)ను ఏర్పాటు చేసినట్టు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా తెలిపారు. ఎంపీలు పీవీ మిథున్‌రెడ్డి, గోరంట్ల మాధవ్, కోటగిరి శ్రీధర్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి జవాబిస్తూ.. అనంతపురం, చిత్తూరు, తూర్పు గోదావరి, గుంటూరు, కృష్ణా, కర్నూలు, ప్రకాశం, నెల్లూరు, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, వైఎస్సార్ జిల్లాల్లో రెండేసి చొప్పున, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒకటి చొప్పున కేవీకేలు ఉన్నట్టు వివరించారు. మిల్లెట్, ఎర్రపప్పు, బెంగాల్ చిట్రా, కదిరి, వేరుశనగ వంటి పంటల ఉత్పత్తి కోసం కరువు ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు మొబైల్ సందేశాలతో రైతులకు అవగాహన కల్పిస్తున్నట్టు వివరించారు. -
రైతులకు మరింత ఆర్థిక చేయూత ఇవ్వండి
సాక్షి, అమరావతి: రైతులకు మరింత ఆర్థిక చేయూతనిచ్చేందుకు బ్యాంకర్లు ఉదారంగా ముందుకు రావాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థనరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం సచివాలయంలో నాబార్డ్ క్రెడిట్ సెమినార్ జరిగింది. ఇందులో 2024–25కు నాబార్డ్ రూ.3.55 లక్షల కోట్ల అంచనాతో రూపొందించిన స్టేట్ ఫోకస్ పేపర్‌ను కాకాణి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేళ్లలో ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. గ్రామీణాభివృద్ధి రంగం బలోపేతం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు అన్ని విధాలుగా చేయూతనిచ్చిన నాబార్డ్‌ను అభినందిస్తున్నానన్నారు. వ్యవసాయం, నీటిపారుదల, సామాజిక, గ్రామీణ రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వానికి నాబార్డ్ మద్దతునివ్వడం అభినందనీయమని తెలిపారు. వ్యవసాయ రంగంలో సవాళ్ల పరిష్కారం, స్థిరమైన వృద్ధి సాధన కోసం ప్రభుత్వం, కార్పొరేట్ రంగం, ఆర్థిక సంస్థలతో కలిసి నాబార్డ్ రోడ్‌మ్యాప్ తయారుచేయాలని సూచించారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, వ్యవసాయ ఉత్పత్తుల వ్యాల్యూ చైన్, విలువ జోడింపు, కౌలు రైతులకు విరివిగా రుణ సదుపాయం కల్పించాలన్నారు. నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎంఆర్ గోపాల్ మాట్లాడుతూ 2024–25కి రాష్ట్ర రుణ ప్రణాళికను రూ.3.55 లక్షల కోట్లుగా అంచనా వేశామన్నారు. ఇది 2023–24తో పోలిస్తే 24 శాతం అధికమన్నారు. ఈసారి 38 శాతం పంట రుణాలు, 25 శాతం ఎంఎస్ఎంఈ, 13 శాతం వ్యవసాయ టర్మ్, 4 శాతం వ్యవసాయ అనుబంధ అవసరాలకు, 2 శాతం వ్యవసాయ మౌలిక వసతుల కల్పనకు, 18 శాతం ఇతర రంగాలకు రుణాలు ఇచ్చేలా æప్రణాళిక తయారు చేశామన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.2.04 లక్షల కోట్లు, పంట రుణాలకు రూ.1.36 లక్షల కోట్లుగా అంచనా వేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సహకార, మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, కమిషనర్ ఆఫ్ కోఆపరేటివ్స్ అహ్మద్ బాబు, వ్యవసాయ, ఉద్యాన శాఖల కమిషనర్లు శేఖర్‌బాబు, శ్రీధర్, పౌరసరఫరాల సంస్థ ఎండీ వీరపాండ్యన్, ఆర్బీఐ జీఎం ఆర్కే మహానా, ఎస్ఎల్బీసీ కన్వ్నిర్ ఎం.రవీంద్రబాబు, నాబార్డ్ జీఎం డాక్టర్ కేవీఎస్ ప్రసాద్, ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ శారదా జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
AP: లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి బీసీ సంఘం మద్దతు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏపీ బీసీ సంఘం మద్దతు తెలిపింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి మద్దతు తెలపాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం ప్రకటించింది. వైఎస్సార్సీపీకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయ నాయకుడు మాత్రమే కాదని.. సంఘ సంస్కర్త అని పేర్కొన్నారు. సీఎం జగన్ ప్రజల జీవితాలను బాగుచేస్తున్నారన్నారు. ఆయన పాలనలో బీసీల పిల్లలు అమెరికాలో చదువుకుంటున్నారని తెలిపారు. గత పాలకులు ఓట్ల సమయంలో డబ్బులు, మద్యం, తినడానికి రేషన్ ఇచ్చి చేతులు దులుపుకునే వారని విమర్శించారు. చంద్రబాబు 14 ఏళ్లు పాలించి బీసీలకు చేసిందేం లేదని మండిపడ్డారు. ‘బీసీల పిల్లలు ఫీజులు కట్టడానికి రక్తం అమ్ముకున్నారు. సీఎం జగన్ అమ్మ ఒడి, విద్యాదీవెన వంటి అనేక పధకాలు పెట్టి బీసీల బిడ్డలను చదివిస్తున్నారు. జగన్ పాలనలో మా బతుకులు మారాయి. ఖబడ్డార్ ప్రతిపక్ష పార్టీలు. మీ మోసాలు మాకు తెలిశాయి. ఇన్నేళ్లు మమ్మల్ని మోసం చేశారు. డబ్బు, నోరు, శక్తి, పేరు లేనినవాళ్ళకి పదవులు ఇచ్చిన ఏకైక వ్యక్తి సీఎం జగన్ వైఎస్సార్సీపీ హయాంలో బీసీలకు జరిగిన మంచి గురించి 175 నియోజకవర్గాల్లో ప్రచారం చేయండి. ఇతర రాష్ట్రాల్లో బీసీల పరిస్థితి బాలేదు. ఇంకా అక్కడ హాస్టళ్లు, గురుకులాలు, తిండి కోసం కొట్లాడుతున్నారు. ఇక్కడి బీసీలు విమానాలు ఎక్కుతున్నారు.. కార్లలో తిరుగుతున్నారు. బీసీలకు అధికారం, సంపద, విద్య, హోదా ఇస్తున్నారు. ప్రతిపక్షాల మోసపు మాటలు నమ్మవద్దు. వైఎస్ జగన్మోహన్రెడ్డి గెలుపు.. బీసీల గెలుపు’ అని ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బడుగు, బలహీన వర్గాల బలమైన గొంతుక అని ఏపీ బీసీ సంఘం అధ్యక్షుడు మారేష్ తెలిపారు. నవరత్నాల ద్వారా బీసీలకు జరిగిన మేలును 175 నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తామని చెప్పారు. 139 బీసీ కులాలు సీఎం జగన్ వెంట నడుస్తాయని అన్నారు. చంద్రబాబు బీసీ నేత అచ్చెన్నాయుడిని పక్కకుపెట్టి పవన్ కల్యాణ్‌ను అక్కున చేర్చుకున్నారని విమర్శించారు. ఇన్నేళ్లు చంద్రబాబు బీసీలకు చేసింది శూన్యమని మండిపడ్డారు. 6 కి.మీ లు వెళ్లి పెన్షన్ తెచ్చుకునే పరిస్థితి కావాలా? ఉదయం 6 గంటలకు పెన్షన్ ఇంటి వద్దకే తెచ్చి ఇచ్చే పరిస్థితి కావాలో ప్రజలు ఆలోచించాలని సూచించారు. చదవండి: కాంగ్రెస్‌లో ఎవరున్నా మాకు ప్రత్యర్థులే: మంత్రి పెద్దిరెడ్డి -
రైతులకు కొండంత అండగా రైతు భరోసా కేంద్రాలు
-
తెలంగాణ స్పీకర్ పదవికి గడ్డం ప్రసాద్ నామినేషన్
-
తెలంగాణలో మేం గెలిచాం..ఇంద్రబాబు డాన్స్ లు
-
కుటుంబం మద్దతుతోనే ఉద్యోగంలో రాణింపు
ముంబై: ఇంట్లో వాతావరణం సరిగ్గా లేకపోతే ఆ ప్రభావం ఉద్యోగంపైనా పడుతుందని మెజారిటీ ఉద్యోగులు అంటున్నారు. ఇంట్లో సరిగ్గా లేని రోజు ఉద్యోగంలోనూ అదే మాదిరిగా ఉంటుందని జీనియస్ కన్సల్టెంట్స్ అనే మానవ వనరుల సేవల సంస్థ నిర్వహించిన సర్వేలో మూడింట రెండొంతుల మంది చెప్పారు. చక్కని ఉద్యోగ/వృత్తి జీవితానికి, పనిలో ఉత్పాదకతకు కుటుంబం మద్దతు ఎంత ముఖ్యమో ఈ సర్వే గుర్తు చేసింది. వ్యక్తిగత జీవితంలో కష్టాలు/అశాంతి అనేవి కార్యాలయంలో ఒత్తిడితో కూడిన వాతావరణానికి దారితీస్తాయని, ఫలితంగా సామర్థ్యం తగ్గిపోతుందని సర్వేలో 69 శాతం మంది చెప్పారు. ఉద్యోగ–వ్యక్తిగత జీవితం మధ్య అంతర్గత అనుసంధానత ఉంటుందని, ఒక దాని ప్రభావం మరోదానిపై పడుతుందన్న అభిప్రాయం వినిపించింది. ఆగస్ట్ 20 నుంచి సెపె్టంబర్ 26 మధ్య 1,088 మంది వృత్తి నిపుణులను ప్రశ్నించి, జీనియస్ కన్సల్టెంట్స్ ఈ వివరాలు విడుదల చేసింది. బీఎఫ్ఎస్ఐ, నిర్మాణం, ఇంజనీరింగ్, విద్య, ఎఫ్ఎంసీజీ, ఆతిథ్యం, హెచ్ఆర్ సేవలు, ఐటీ, ఐటీఈఎస్, బీపీవో, లాజిస్టిక్స్, తయారీ, మీడియా, ఆయిల్ అండ్ గ్యాస్, ఫార్మా తదితర రంగాల్లో పనిచేసే వారు ఇందులో ఉన్నారు. నియమ రహితంగా, అస్తవ్యస్థంగా ఉండే వ్యక్తిగత జీవితం, పనిలోనూ అదే ధోరణికి దారితీస్తుందని ఈ సర్వే తేల్చి చెప్పింది. పనిలో వృత్తి నైపుణ్యాలు చూపించి, రాణించాలంటే.. వ్యక్తిగత జీవితం క్రమశిక్షణగా, నియమబద్ధంగా ఉండాల్సిన అవసరాన్ని ప్రస్తావించింది. ► కుటుంబం మద్దతు ఉంటే ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుందని 70 శాతం మంది చెప్పారు. ► కుటుంబం మద్దతు ఉంటే పనిలో సామర్థ్యాల పెరుగుదలకు సాయపడుతుందని 15 శాతం మంది చెప్పారు. ఉద్యోగంలో ఎదుగుదలకు అనుకూలిస్తుందని 6 శాతం మంది తెలిపారు. ► పని ప్రదేశంలో ప్రశాంత వాతావరణం ఉండాలని 15 శాతం మంది చెప్పగా, పని ప్రాంతంలో గోప్యత అవసరమని 2 శాతం మంది పేర్కొన్నారు. ► మొత్తం మీద కుటుంబం మద్దతు ఉంటే ఉద్యోగంలో మెరుగ్గా రాణిస్తామని 71 శాతం మంది చెప్పారు. -
అందుబాటులో ఉచిత న్యాయ సేవలు.. సద్వినియోగ పరుచుకోండి
గద్వాల క్రైం: ప్రతి పౌరుడికి ఉచిత న్యాయ సేవలను అందించాలనే లక్ష్యంతో లీగల్ సర్వీస్ అథారిటీస్ యాక్ట్ అమల్లోకి వచ్చిందని జిల్లా జడ్జి కుషా అన్నారు. గురువారం లీగల్ సర్వీస్ డే సందర్భంగా కోర్టు ఆవరణలో జాతీయ లీగల్ సర్వీస్ డే కార్యక్రమాన్ని నిర్వహించగా ఆయన హాజరై మాట్లాడారు. సమస్యలు వచ్చినప్పుడు కోర్టు ద్వారా పరిష్కారం చేసుకునే క్రమంలో లాయర్లకు ఫీజులు చెల్లించలేని వారికి లీగల్ సర్వీస్ చేయూత అందిస్తుందన్నారు. ఉచితంగా న్యాయం పొందగలిగే విధానాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని, మహిళలు, పిల్లలు, లైంగిక దాడులు, కిడ్నాప్, వరకట్న వేధింపులు, మానసిక – శారీరక హింస మొదలైన వాటి నుంచి న్యాయం పొందడానికి లీగల్ సర్వీస్ సెల్‌ను ఆశ్రయించవచన్నారు. ప్రస్తుతం యువత చెడు వ్యసనాలకు ఆకర్షితులవుతున్నారని, ఈ క్రమంలో పాఠశాల, కళాశాల యాజమాన్యులతో లీగల్ అవేర్నెస్ కార్యక్రమాలు సైతం చేపట్టామన్నారు. చట్ట పరిధిలోని ప్రతి సమస్యలకు ఉచితంగా న్యాయం అందించడమే లీగల్ సర్వీస్ డే ఉద్దేశ్యమన్నారు. కార్యక్రమంలో జడ్జిలు కవిత, ఉదయ్‌నాయక్ కోర్టు సిబ్బంది, బార్ అసోసియేషన్ సభ్యులు ఉన్నారు. చట్టాలపై అవగాహన అవసరం అలంపూర్: అట్టడుగు, వెనకబడిన పేదలకు ఉచిత న్యాయ సహాయం అందించడమే నేష్నల్ లీగల్ సర్వీస్ అధారిటీ లక్ష్యమని, ప్రతిఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జూనియర్ సివిల్ కోర్టు జడ్జీ కమలాపురం కవిత అన్నారు. అలంపూర్‌లో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ డే గురువారం నిర్వహించారు.ఈ సమావేశానికి జడ్జీ కమలాపురం కవిత ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. ప్రతి ఏడాది నవంబర్ 9వ తేదిన నేషనల్ లీగల్ సర్వీసెస్ డేను నిర్వహించడం జరుగుతుందన్నారు. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీతో వెనకబడిన పేద, అట్టడుగు వర్గాలకు ఉచిత న్యాయం, న్యాయ సేవలను అందించడం ముఖ్య ఉద్దేశమన్నారు. రాజ్యాంగంలో పొందుపర్చిన సమానత్వం, సామాజిక న్యాయం ప్రాథమిక సూత్రాలను సమర్థిస్తుందన్నారు. కొందరికి న్యాయం ప్రత్యేక హక్కుగా కాకుండా అందరికి సమానమైన హక్కుగా వర్తిస్తోందన్నారు. కార్యక్రమంలో ఏజీపీ నరసింహులు, న్యాయవాదులు రాజేశ్వరి, సురేష్ కుమార్, తిమ్మారెడ్డి, శ్రీనివాసులు, ఆంజనేయులు, కిషన్ రావు, సాయితేజ ఉన్నారు. -
ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతును నిరసిస్తూ ఆందోళనలు
హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం ఇంకా కొనసాగుతోంది. ఇజ్రాయెల్ సైన్యం హమాస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటోంది. ఇదిలావుండగా పాలస్తీనియన్ మద్దతుదారులు అమెరికాలోని వైట్ హౌస్ గేట్ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. తక్షణమే గాజాలో కాల్పుల విరమణ పాటించాలని వారు డిమాండ్ చేశారు. ఇజ్రాయెల్‌కు అమెరికా చేస్తున్న సహాయాన్ని నిలిపివేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. పాలస్తీనియన్ అనుకూలవాదుల నిరసనలతో వాషింగ్టన్ డీసీ నగరంలోని వీధుల్లో రద్దీ నెలకొంది. పాలస్తీనాకు విముక్తి కల్పించాలంటూ నిరసనకారులు నినాదాలు చేశారు. పాలస్తీనా జెండాలు చేతబట్టిన నిరసనకారులలో ఎక్కువగా యువకులు ఉన్నారు. గాజాలో రక్తపాతానికి సూచికగా నిరసనకారులు వైట్ హౌస్ గేట్‌పై ఎరుపు రంగును చల్లారు. పాలస్తీనా అనుకూల నిరసనకారులు మీడియాతో మాట్లాడుతూ గాజాలో కాల్పుల విరమణ ప్రకటించాలని, ఇజ్రాయెల్‌కు అమెరికా సహాయాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. నిరసనకారులు లాఫాయెట్ పార్క్‌లోని జనరల్ మార్క్విస్ డి లఫాయెట్ విగ్రహాన్ని పాలస్తీనా జెండాలతో కప్పారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ జాతి నిర్మూలనకు మద్దతు ఇస్తున్నారని నిరసనకారులు ఆరోపించారు. అక్టోబరు 7న గాజాకు చెందిన ఉగ్రవాద సంస్థ హమాస్.. ఇజ్రాయెల్‌పై ఐదు వేల రాకెట్లను ప్రయోగించింది. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య మధ్య భీకర యుద్ధం మొదలైంది. గాజాలోని హమాస్ స్థావరాలపై ఇజ్రాయెల్ నిరంతరం దాడులు చేస్తోంది. అక్టోబరు 7 నుండి జరుగుతున్న యుద్ధంలో 9,400 మంది పాలస్తీనియన్లు మృతి చెందారని హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది కూడా చదవండి: హాంబర్గ్ విమానాశ్రయంలో కాల్పుల కలకలం.. -
మానసిక అనారోగ్యమే అని లైట్ తీసుకోవద్దు! బీ కేర్ ఫుల్!
మానసికంగా బాగుంటేనే మనం పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు లెక్క. మెంటల్‌గా బాగుంటేనే మన రోజూవారీ లైఫ్‌కి ఎలాంటి ఢోకా ఉండదు. అలాంటి మనసే స్ట్రగులైతే సమస్యలన్నీ చుట్టుముట్టేస్తాయి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా నిన్ను నిలువునా పతనం దిశగా తీసుకువెళ్లి మట్టుబెట్టేంత వరకు వదలదు ఆ మానసిక వ్యాధి. దీన్ని జోక్‌గా తీసుకోవద్దు. ప్రతిమనిషి మానసికంగా బలంగా ఉంటే దేన్నేనా అవలీలగా జయించగలడు అన్నది సత్యం. అక్టోబర్ 10 ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మానసిక అనారోగ్యం ఎందుకొస్తుంది? ఎలా బయటపడాలి? తదితరాల గురించే ఈ కథనం.! మానసిక అనారోగ్యామే అని కొట్టి పారేయొద్దు. అది ఓ భయానకమైన వ్యాధి మనిషిని నిలువునా కుంగదీసి చనిపోయేలా ప్రేరేపిస్తుంది. ముందుగానే మేల్కొని బయటపడేందుకు ప్రయత్నించకపోతే పరిస్థితి మరింత అధ్వాన్నంగా ఉంటుంది. ఇటీవల కాలంలో ఈ మానసికంగా బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజూకి అనూహ్యంగా పెరుగుతుంది. అరచేతిలో ప్రపంచాన్ని చూపించేంత టెక్నాలజీ మన వద్ద ఉంది. టెక్నాలజీ పరంగా ఆర్థిక పరంగా మనిషి అభివృద్ధి శరవేగంగా దూసుకు వెళ్తోంది. అయినా మానసిక రుగ్మత బారిన పడి మనిషి ఎందుకు విలవిల్లాడుతున్నాడు. ఒక్కసారిగా పాతాళానికి పడిపోయి ఏం చేయలేను అనేంత స్థాయికి దిగజారి నిరాశ నిస్ప్రుహలోకి వెళ్లిపోతున్నాడు. ఎక్కడ ఉంది ఈ లోపం. వ్యవస్థలోనా? మనిషిలోనా ?అంటే.. మనిషి టెక్నాలజీ, అభివృద్ధి పేరుతో పెడుతున్న పరుగులు తనకు తెలియకుండానే మనసుపై ఒత్తిడిని పెంచేస్తున్నాయి. ఎదుటి వాడు తనకన్న బెటర్‌గా ఉన్నాడనే అక్కసు, తాను ఎక్కువ సంపాదించలేకపోతున్నాను అన్న నిరాశ, తాను అనుకున్నవి సాధించలేకపోయాను అన్న నిట్టూర్పుతో.. ఢీలా పడి ఈ మానసిక రుగ్మత బారిన ఈజీగా పడి పోతున్నాడు. ఆ తర్వాత దీన్నుంచి బయటపడలేక గుంజుకుపోతున్నాడు. చివరికి తనను తాను అంతం చేసుకునేంత స్థితికి దిగజారిపోతున్నాడు. ఎలా బయటపడాలి..? ముందుకు కెరీర్ పరంగా లేదా ఆర్థిక పరంగానో,కుటుంబ పరంగానో మీరు ఉన్నతంగా లేదా మంచి స్థాయిలో లేకపోయామనే నిరాశ ఉంటే..దాన్ని వెంటనే మనసులోంచి తీసేయండి. అందరూ అన్ని సాధించలేకపోవచ్చు. కానీ ఎవరి ప్రత్యేకత వారిదే అది గుర్తించుకోండి. మొక్కలన్నింటి పువ్వులు ఉండవు. పుష్పించిన పూలన్నీ సుగంధాలు వెదజల్లవు. కానీ వాటికి ఉండే ప్రత్యేకత విభిన్నం, పోల్చదగినది కాదు. ఔనా!. సుగంధ భరితం కానీ పువ్వు ఔషధం అవుతుంది. సుగంధం వెద్దజల్లే పువ్వు అత్తరుగా మారతుంది. అలాగే మనుషులు కూడా అంతే. ఒక్కొక్కరిది ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ముఖ్యంగా మనం కోల్పోయినవి, సాధించలేనివి తలుచుకుని.. వాటితో నిన్ను నువ్వు తక్కువ చేసుకుని ఆత్యనూన్యతకు గురై బాధపడటం మానేయండి. మొదట మీరు సాధించిన చిన్న చిన్న విజయాలు గుర్తు తెచ్చుకోండి. రికార్డు స్థాయి విజయాలు కాకపోయినా పర్వాలేదు. మీదైనా చిన్ని ప్రపంచంలో మీరు సాధించింది ఎంత చిన్నవైనా అవి గొప్పవే. మీలా మీ స్థాయిలో ఉన్నవాళ్లు ఎవ్వరూ సాధించలేకపోయారు లేదా చేరుకోలేకపోయారు. కనీసం మీరు ప్రయత్నించారు, కొంత అయినా సాధించారు అని మనస్సు పూర్తిగా ఫీలవ్వండి, సంతోషపడండి. పరాజయం పెద్దదైన చిన్నదైనా ఐ డోంటే కేర్ అనే పదం స్మరించండి. అది అన్నింటికీ అసలైన మందు. ఏ రోజుకైన ఎప్పటికైనా మీకంటూ ఓ రోజు వస్తుంది. మీరు సాధించగలుగుతారు అనేది సత్యం అని చాలా బలంగా మిమ్మల్ని మీరు విశ్వసించండి. ఇలా అనుకుంటే ఎలాంటి మానసిక వ్యాధైనా పరారే. వియోగం వల్ల వచ్చే మానసిక బాధ.. మనకు నచ్చిన వ్యక్తి లేదా ఆత్మీయుడు మన సొంతం అనే వ్యక్తి కాలవశాత్తు లేదా ప్రమాదవశాత్తు దూరం అయినా మానసికంగ కుంగిపోవద్దు. ఇది సర్వసాధారణం. అందరి జీవితాల్లో జరిగేదే. కొందరికి చిన్నతనంలోనే నా అనేవాళ్లు దూరం అయితే మరికొందరికీ ఓ స్టేజ్‌లో దూరం అవ్వచ్చు దీన్ని మనస్ఫూర్తిగా అంగీకరించి ముందుకు సాగిపోండి. అదే ప్రేమికులు/భార్యభర్తలు విడిపోయినా లేదా చనిపోయినా మీ బాధ వర్ణనాతీతం. ఎవ్వరూ తీర్చలేనిది తట్టుకోలేనిది ఒప్పుకుంటాం. కొందరూ మన జీవిత ప్రయాణంలో కొంత వరకే. వారి జ్ఞాపకాలు మన వెంట పదిలంగా ఉంటాయి. గుండె నిండా శ్వాస పీల్చుకుని వారిని గుర్తు చేసుకోండి అలానే ఎందుకు దూరం అయ్యారని బాధపడొద్దు. మీకు తీరని ద్రోహం చేసి నిలువునా మోసం చేసి వెళ్లిపోయారని అస్సలు చింతించొద్దు. నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోవద్దు. ఇదొక గుణపాఠంగా తీసుకో. నీ స్థాయికి సరిపోని వాడు అని గడ్డిపరకను తీసిపడేసినట్టు పడేయి. నీ మనసు పట్టి పీడుస్తున్న వేదన దూదిపింజలా తేలిక అయిపోతుంది. మనిషి ఎంతో తెలివైన వాడు. అసాధ్యలన్నింటిని సాధించగలుగుతాడు. తనలాంటి సాటి మనుషుల చేతిలో మోసపోయిన, ధగ పడితే మాత్రం తిరిగి లేచి నిలబడలేక విలవిలలాడతాడు. ఎందుకిలా? 'ఓ మనిషి' నీకు మహాశక్తి ఉంది. మెలి పెడుతున్న మనుసును మధించి సరైన మార్గంలో పెట్టి దూసుకుపోవాలి. గమ్మతైన మనసు కథ.. మనల్ని ఎంతో ప్రేమించి మనమే సర్వస్వం అనుకునే వాళ్లని ప్రతి క్షణం స్మరించం. కానీ మనల్ని బాధపెట్టిన వాడిన మన మనసు పదే పదే గుర్తు తెచ్చుకుని ఏడుస్తుంది. నీలో నీవే తిట్టుకుంటూ, భోంచేసినా, కూర్చొన్నా, అతడినే గుర్తు తెచ్చుకుంటావు. మనకు ఇష్టం లేకపోతే మనకు నచ్చిన స్వీట్ అయినా పక్కన పెడతాం. అలాంటిది మనకు నచ్చని వ్యక్తి, వేదన పాలు చేసిన వాళ్లను, వాళ్ల తాలుకా గాయాలను ఎందుకు తలుచుకుంటున్నాను అని ఎప్పుడైనా ఆలోచించారా?. కనీసం ఛీ! వీడు నన్ను ఇంతలా బాధపెట్టాడు గుర్తు తెచ్చుకోవడమే పాపం అని గట్టిగా మీరు అనుకున్నట్లయితే. ఏ మానసిక సమస్య మీ దరిదాపుల్లోకి రాగలదు. జీవితం సాఫీగా సాగితే నీ గొప్పదనం ఉండదు. ఆటుపోట్లు ఉంటేనా మంచి కిక్కు ఉంటుంది. అదే నీ గొప్పతనన్ని బయటపెట్టుకునే ఓ గొప్ప అవకాశం. దురదృష్టవంతుడివి కాబట్టి కష్టాలు రాలేదు. నువ్వు తట్టుకోగల సమర్థుడువి కాబట్టే నీకు వచ్చాయి. అవే రాకపోతే నీ సామర్థ్యం ఏంటో నీకు తెలియదు. పైగా నువ్వు గొప్పోడివి అని చూపించుకునే అవకాశం ఉండదు. మిత్రమా! సాధించలేకపోవడంలోనే సాధన ఉంది. కోల్పోవడంలోనే పొందడం ఉంది. ఇదే నిజం! కూల్‌గా ఆలోచించి.. మనో చిత్తాన్ని పట్టిపీడించే చింతను చిత్తుచేసి మానసికంగా ధృఢం ఉండేలా మనసుకి శిక్షణ ఇవ్వండి. సులభంగా మానసిక అనారోగ్యం నుంచి బయటపడగలుగుతారు. (చదవండి: స్టెరాయిడ్స్ ఇంత ప్రమాదమా? ఇమ్రాన్ ఖాన్ సైతం..) -
వీధి కుక్కలను చంపడం తప్పుకాదని గాంధీ ఎందుకన్నారు? మహాత్ముని అంతరంగ రహస్యం ఏమిటి?
ఇటీవలి కాలంలో వీధి కుక్కల ఆగడాలకు సంబంధించి తరచూ వార్తలు వస్తున్నాయి. వీధి కుక్కల విషయంలో సుప్రీంకోర్టు నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయి. వీధికుక్కలకు సంబంధించి నాటి రోజుల్లో మహాత్మాగాంధీ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేకెత్తించాయి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అది 1942వ సంవత్సరం. ప్రతి సోమవారం మౌనవ్రతం పాటించాలని గాంధీజీ నిర్ణయించుకున్నారు. గాంధీ మౌన దీక్ష చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఆ రోజు కూడా గాంధీ సందర్శకులను కలుసుకునేవారు. ఎదుటివారి మాటలు విని, రాతపూర్వకంగా సమాధానం ఇచ్చేవారు. ఇదే సమయంలో గాంధీ ఒక అనూహ్యమైన వివాదంలో చిక్కుకున్నారు. సుప్రసిద్ధ అమెరికన్ జర్నలిస్ట్ లూయిస్ ఫిషర్ రాసిన ‘ది లైఫ్ ఆఫ్ మహాత్మా గాంధీ’ పుస్తకం గాంధీజీ జీవితానికి సంబంధించిన అత్యంత విశ్వసనీయ పుస్తకంగా పరిగణిస్తుంటారు. ఈ పుస్తకంలోని 10వ అధ్యాయంలో ఒక ఉదంతం ఎంతో ఆసక్తిని కలిగిస్తుంది. అహ్మదాబాద్ టెక్స్టైల్ మిల్లు యజమాని అంబాలాల్ సారాభాయ్ తన మిల్లు ఆవరణలో తిరుగుతున్న 60 వీధికుక్కలను పట్టుకుని చంపాడు. అనంతరం గాంధీజీ దగ్గరకు పరుగున వచ్చి, తన భయాన్ని, బాధను వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా వారి మధ్య జరిగిన సంభాషణ అహ్మదాబాద్‌లోని జీవ్ దయా సమితికి ఆగ్రహం తెప్పించింది. ఈ సందర్భంగా వారు గాంధీజీకి రాసిన లేఖలో ‘హిందూ మతంలో ఏదైనా ప్రాణిని చంపడాన్ని పాపంగా భావించినప్పుడు, పిచ్చి కుక్కలను చంపడం సరైనదని మీరు ఎలా అనుకుంటున్నారు?’ అని ప్రశ్నించారు. దీనికి గాంధీ ఇచ్చిన సమాధానాన్ని ‘యంగ్ ఇండియా’లో ప్రచురించారు. ‘మనలాంటి అసంపూర్ణులు, మందబుద్ధిగలవారికి కుక్కలను చంపడం తప్ప మరో మార్గం లేదు. కొన్నిసార్లు మనని హత్య చేసేందుకు ప్రయత్నించే వ్యక్తిని చంపడమనే అనివార్యమైన విధిని మనం ఎదుర్కొంటాం’ అని గాంధీ పేర్కొన్నారు. ఈ కథనంపై ఆగ్రహంతో పలువురి నుంచి గాంధీకి లేఖలు వెల్లువెత్తాయి. చాలామంది గాంధీని తిట్టడం మొదలుపెట్టారు. అయితే గాంధీ తన అభిప్రాయానికి కట్టుబడి ఉన్నారు. ‘యంగ్ ఇండియా’ రెండవ, మూడవ సంచికల్లోనూ గాంధీ తన అభిప్రాయాన్ని ఇదే రీతిలో తెలిపారు. కొందరు విమర్శకులు గాంధీ హద్దులు దాటిపోయారని ఆరోపించారు. ‘ఒకరి ప్రాణం తీయడం కూడా ఒక్కోసారి మన విధిగా మారుతుందని’ గాంధీ ‘యంగ్ ఇండియా’లో రాశారు. ఒక వ్యక్తి చేతిలో కత్తి పట్టుకుని పరుగెడుతూ, ఎదురుగా వచ్చిన వారిని చంపుతున్నాడనుకోండి. అప్పుడు అతన్ని సజీవంగా పట్టుకునే ధైర్యం ఎవరికీ లేనప్పుడు, ఆ పిచ్చివాడిని యమపురికి పంపించిన వ్యక్తి.. సమాజం అందించే కృతజ్ఞతకు పాత్రుడని గాంధీ పేర్కొన్నారు. కాగా ఈ కుక్కల వివాదం గాంధీని ఏడాదిపాటు చుట్టుముట్టింది. ఇది కూడా చదవండి: ఏ జంతువులు అంతరిక్షాన్ని చూశాయి? తాబేళ్లు, ఈగలు ఏం చేశాయి? -
డబ్బులు తీసుకుని ఓట్లు వేసే జనమే అవినీతి పరులట
-
‘ఇండియా’కు మద్దతు
న్యూఢిల్లీ: విపక్ష ఇండియా కూటమికి 18 చిన్న పార్టీలు, 50కి పైగా పౌర సంఘాలు మద్దతు ప్రకటించాయి. త్వరలో జరగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఆ కూటమిలోని పారీ్టల తరఫున పోటీ చేసే అభ్యర్థులకు మద్దతివ్వాలని నిర్ణయించాయి. ‘ఇండియా గెలుస్తుంది: ప్రజాస్వామ్యం, సామ్యవాదం, సామాజిక న్యాయం కోసం జాతీయ సదస్సు‘ పేరుతో వాటి నేతలు శుక్రవారం ఇక్కడ భేటీ అయ్యారు. ముఖ్యంగా విపక్ష అభ్యర్థులు స్వల్ప తేడాతో ఓడిపోతున్న 100 నుంచి 150 లోక్‌సభ స్థానాల్లో ఈసారి వారికి దన్నుగా నిలుస్తామని స్వరాజ్ ఇండియా నేత యోగేంద్ర యాదవ్ పేర్కొన్నారు. 20కి పైగా రాష్ట్రాల నుంచి ప్రతినిధులు సదస్సుకు హాజరైనట్టు చెప్పారు. -
పవన్‌కు షాకిచ్చిన ఏపీ కాపు నేతలు
సాక్షి, కాకినాడ: వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసే పోటీ చేస్తాయని పవన్ కల్యాణ్ ప్రకటించడంపై ఏపీ కాపు నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జనసేన ఒంటరిగానే పోటీ చేయాలని, లేదంటే పవన్ కల్యాణ్‌కు తమ మద్దతు ఉండబోదని తేల్చి చెప్పారు. ఈ మేరకు కాకినాడలో జరిగిన కాపుల చర్చా గోష్టిలో నిర్ణయం తీసుకున్నారు. జనసేన ఒంటరిగా పోటీ చేస్తే పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడనుకున్నామని కాపు నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ టీడీపీ పొత్తుతో మళ్ళీ చంద్రబాబే సీఎం అవుతాడని అన్నారు. చంద్రబాబు ఒక దొంగ.. ఆయన మాటల్ని తాము నమ్మలేమని చెప్పారు. టీడీపీతో పొత్తు లేకుండా జనసేన ఒంటరిగా పోటీ చేయాలని కోరుతున్నట్లు కాపు నేతలు చెప్పారు. అలా పోటీ చేస్తేనే కాపుల మద్దత్తు పవన్ కు ఉంటుందని ఏకాభిప్రాయానికి వచ్చారు. చర్చా గోష్టిలో కాపు నేతలు, న్యాయవాదులు,చిరంజీవి.. పవన్ అభిమానులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: చంద్రబాబు కేసులో అడుగడుగునా కేంద్ర దర్యాప్తు సంస్థలే -
'బాబుతో నేను' కార్యక్రమానికి స్పందన కరువు
అమరావతి: 'బాబుతో నేను' కార్యక్రమానికి టిడిపి నేతలు నుండి స్పందన కరువవుతోంది. కార్యక్రమానికి మద్దతు కోసం నేతలు పడరాని పాట్లు పడతున్నారు. 'బాబుతో నేను' కార్యక్రమంలో అనుబంధ విభాగాల నేతలు పాల్గొనాలని అచ్చెం నాయుడు బహిరంగ లేఖ రాశారు. పాల్గొనని నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. కాగా, చంద్రబాబు అరెస్ట్ తర్వాత కార్యకర్తలు రోడ్ల మీదకు రావడం లేదంటూ అచ్చెన్నాయుడు ఆక్రోశం వెళ్లగక్కిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కొన్ని రోజుల క్రితం అచ్చెన్నాయుడు నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ ఆడియో లీకైంది. ప్రజలు రోడ్ల మీదకు రావడం లేదంటూ అచ్చెన్నాయుడు అసంతృప్తి వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున కార్యకర్తలను రోడ్డు మీదకు తీసుకురావాలంటూ ఆదేశాలిచ్చారు. మహిళలను తీసుకొస్తే పోలీసులు అడ్డుకోరంటూ నాయకులకు సలహాలు ఇస్తున్నారు. బాబు అరెస్ట్‌ను ప్రజలు పట్టించుకోకపోవడం బాధ కలిగిస్తోందని అచ్చెన్నాయుడు నిట్టూర్పులు విడుస్తున్నారు. ఇదీ చదవండి: అమావాస్యనాడు పవన్ తొందరపాటు! ఫలితం.. ఢిల్లీకి ఉరుకులు -
యాపిల్ సంచలన నిర్ణయం: యూజర్లకు షాక్?
టెక్ దిగ్గజం యాపిల్ సరికొత్త నిర్ణయంతో తన యూజర్లకు షాక్ ఇవ్వనుంది. సోషల్ మీడియాలో కస్టమర్ సహాయాన్ని నిలిపివేయనుంది. ఎక్స్ (ట్విటర్), యూట్యూబ్, సపోర్ట్ కమ్యూనిటీ ఆన్లైన్ ఫోరమ్‌లకు చెక్ పెట్టనుంది. అంతేకాదు సోషల్ మీడియా సపోర్ట్ అడ్వైజర్లను తొలగించాలని యోచిస్తోంది, అంటే కస్టమర్లు ఇకపై ట్విట్టర్, యూట్యూబ్‌లో ప్రత్యక్ష మద్దతు పొందలేరు. అక్టోబర్ నుండి కస్టమర్ల డైరెక్ట్ మెసేజ్‌లకు వ్యక్తిగతంగా సమాధానాలివ్వడం ఆపివేస్తుంది. మ్యాక్ రూమర్స్ అందించిన సమాచారం ప్రకారం సోషల్ మీడియా సపోర్ట్స్ అడ్వైజర్ ఉద్యోగుల్ని కూడా తొలగించనుంది. వచ్చే ఏడాది ఆరంభంనుంచి ఈ చర్యకు దిగనుంది. అంటే ఈ నిర్ణయం అమల్లోకి వస్తే కస్టమర్లు ఇకపై ఈ ప్లాట్‌ఫారమ్‌లలో యాపిల్ ఉద్యోగి సపోర్ట్‌ను పొందలేరు. అలాగే అక్టోబర్ నుండి, ట్విటర్లోని యాపిల్ సపోర్ట్ అనే అకౌంట్ ఇక పని చేయదు. యూజర్ల మెసేజ్‌లకు స్పందించదు. దీనికి బదులుగా కస్టమర్లు సహాయం కోసం ఆటోమేటెడ్ సమాధానాలపై దృష్టి పెడుతోందని ఈ నివేదిక తెలిపింది. దీనికి ఫోన్ సపోర్ట్ అందించడానికి ఉద్యోగులకు శిక్షణ ఇవ్వ నుందని, నవంబర్ నాటికి పరివర్తన పూర్తవుతుందని నివేదిక పేర్కొంది. దీనిపై పని చేయ కూడదనుకునే వారు యాపిల్ వెలుపల ఉద్యోగం చూసుకోవాలని కూడా సూచించినట్టు తెలుస్తోంది. మరోవైపు సెప్టెబంరు 12న ఈ ఏడాది మెగా ఈవెంట్‌ను నిర్వహించనుంది యాపిల్.ఇందులో ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లను లాంచ్ చేయనుంది. ఇదే ఈవెంట్లో కొత్త యాపిల్ వాచ్‌లను కూడా ప్రకటించే అవకాశం ఉంది. కాగా 2016నుంచి ట్విటర్ ద్వారా కస్టమర్ మద్దతును అందిస్తోంది. కానీ గత ఏడాది ట్విటర్ ఎలాన్ మస్క్ చేతిలోకి వెళ్లిన తరువాత ఉద్యోగులతో ఇటీవల జరిగిన సమావేశంలో, ఫోన్ బేస్డ్ సపోర్ట్ నిర్ణయాన్ని సమర్ధించుకున్నట్టుతెలుస్తోంది. అయితే ఈ మార్పులపై యాపిల్ అధికారిక ప్రకటన ఏదీ ఇంత వరకు విడుదల చేయలేదు. -
మొదటి ప్రయాణం మరచిపోకూడదు: త్రినాథరావు నక్కిన
‘‘నాది, బెక్కెం వేణుగోపాల్‌గారి ప్రయాణం చిన్న సినిమా నుంచే ప్రారంభమైంది. అప్పట్లో మా సినిమా పొస్టర్, టీజర్, ట్రైలర్లను ఎవరు రిలీజ్ చేస్తారా? అని ఎదురు చూసే వాళ్లం. ఇప్పుడు పెద్ద సినిమాలు చేస్తున్నామని మా మొదటి ప్రయాణం మరచిపొకూడదు కదా?. అందుకే ఎవరైనా సపొర్ట్ కావాలని అడిగితే మా వంతు సపొర్ట్ చేయటానికి,ప్రొత్సహించటానికి వెనుకాడం’’ అని డైరెక్టర్ త్రినాథరావు నక్కిన అన్నారు. చంటి, లహరి జంటగా కేవీఆర్ దర్శకత్వంవహిస్తున్న చిత్రం ‘ఏపీ 31’. ‘నెంబర్ మిస్సింగ్’ అన్నది ట్యాగ్ లైన్. అన్నపూర్ణేశ్వరి సినీ క్రియేషక్స్ పై నారాయణ స్వామి.ఎం నిర్మిస్తున్నారు. ఈ సినిమా మోషన్ పొస్టర్‌ను త్రినాథరావు నక్కిన, ఫస్ట్ లుక్‌ని నిర్మాత బెక్కెం వేణుగోపాల్ రిలీజ్ చేసి, ‘ఏపీ 31’ హిట్ కావాలన్నారు. ‘‘అందరి సపొర్ట్‌తో సినిమాను పూర్తి చేస్తున్నాం’’ అన్నారు కేవీఆర్. -
సచిన్ పైలెట్‌పై బీజేపీ ఆరోపణలు.. మద్దతు నిలిచిన గహ్లోత్..
జైపూర్: రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్, ఉపముఖ్యమంత్రి సచిన్ పైలెట్ మధ్య పార్టీలో అంతర్గతంగా విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. సీఎం కుర్చీ నాదంటే.. నాదంటూ పోట్లాడుకున్నా.. ఇంటి గొడవ గడప దాటేవరకేనని రుజువు చేశారు. సచిన్ పైలెట్ కుటుంబంపై బీజేపీ తీవ్ర ఆరోపణలు చేయగా.. పైలెట్‌కు మద్దతుగా సీఎం గహ్లోత్ నిలిచారు. సచిన్ పైలెట్ తండ్రి సొంత ప్రజలపైనే బాంబులు వేశారని బీజేపీ నేత అమిత్ మాలవ్య ఆరోపించారు. సచిన్ పైలట్ తండ్రి రాజేష్ పైలట్, సురేష్ కల్మాడీలపై ట్విట్టర్ వేదికగా సంచలన ఆరోపణలు చేశారు. ఏయిర్ ఫోర్స్‌లో పనిచేసే క్రమంలో వారిద్దరూ కలిసి 1966, మార్చి 5న మిజోరాం ఐజ్వాల్‌లో బాంబు దాడి జరిపారని అన్నారు. ప్రతిఫలంగా వారికి ఇందిరా గాంధీ మంత్రి పదవులు ఇచ్చారని ఆరోపణలు చేశారు. దీనిపై పైలెట్ కూడా బీజేపీపై మండిపడ్డారు. తప్పుడు సమాచారం ఇవ్వొద్దని దుయ్యబట్టారు. ఈ పరిణామాల అనంతరం సచిన్ పైలెట్‌కు మద్దతుగా నిలిచారు సీఎం గహ్లోత్. భారత వైమానిక దళానికి సేవలు చేసినవారిపై బీజేపీ ఆరోపణలు చేస్తోందని అన్నారు. ఇది ఏయిర్ ఫోర్స్ సేవలను అవమానించడమేనని చెప్పారు. కాంగ్రెస్ నాయకుడు రాజేష్ పైలెట్ ధైర్యవంతుడైన పైలెట్ అని అన్నారు. దేశం మొత్తం ఖండించాల్సిన అంశమని చెప్పారు. कांग्रेस नेता श्री राजेश पायलट भारतीय वायुसेना के वीर पायलट थे। उनका अपमान करके भाजपा भारतीय वायुसेना के बलिदान का अपमान कर रही है। इसकी पूरे देश को निंदा करनी चाहिए। — Ashok Gehlot (@ashokgehlot51) August 16, 2023 రాజస్థాన్‌లో ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు ఐక్యమత్యాన్ని తాజా ఘటన సూచిస్తోంది. పార్టీలో అంతర్గతంగా గొడవలు ఉన్న ఇతర పార్టీలు విమర్శలు చేస్తే ఐక్యంగా పోరాడుతున్నారు. ఇదీ చదవండి: బాంబులు వేసింది భారత్-పాక్ యుద్ధంలో.. బీజేపీ నేతకు సచిన్ పైలట్ చురకలు -
కష్టాలకు లొంగని మహిళా ట్యాక్సీ డ్రైవర్.. విదేశాల్లో చదువుకునే స్థాయికి..
ముంబయి: కష్టాలకు లొంగని తత్వం తనది. ఎక్కడో మారుమూల గిరిజన గూడెంలో ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తోంది. పరిస్థితులు పరీక్షించినా.. కుటుంబ భారం మీద పడినా.. అమ్మాయి డ్రైవారా..! అంటూ సమాజం చిన్నచూపు చూసినా బెరుకులేని జీవిత ప్రయాణం సాగించింది. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే సహాయంతో చివరికి విదేశాల్లో చదువుకోవాలనే తన కలను సాకారం చేసుకుంది. ఆ యువతి పేరు కిరణ్ కుర్మా. నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన గడ్చిరోలి జిల్లాలోని రేగుంత గ్రామానికి చెందినది. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసింది. తండ్రి ఆరోగ్యం దెబ్బతినడంతో కుటుంబ పోషణకు ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేయాల్సి వచ్చింది. రేగుంత నుంచి సిరోంచ వరకు 140 కిలోమీటర్ల దూరం ట్యాక్సీ నడిపింది. ప్రస్తుతం ఆమెకు మూడు ట్యాక్సీ లు ఉన్నాయి. మావోయిస్టు ప్రాంతంలో సాహసంతో ట్యాక్సీ సేవలు అందించినందుకు వరల్డ్ క్రాస్ అనే సంస్థ ఆమెను గుర్తించింది. ఇప్పటికీ ఆమెకు 18 అవార్డులు కూడా వచ్చాయి. అయితే.. తన ఉన్నత చదువుల కోసం మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేను సంప్రదించింది. దీంతో ఆయన రూ.40 లక్షల స్కాలర్షిప్ను మంజూరు చేశారు. యూకేలో ఏడాది పాటు ఇంటర్నేషనల్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ కోర్సును యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్ లో ఆమె చదవనున్నారు. మరో రెండేళ్ల పాటు అక్కడే ఓ సంస్థలో పనిచేయనున్నారు. ఇదీ చదవండి: IIT Bombay: ఐఐటీ బాంబేలో కొత్త వివాదం.. నాన్ వెజిటేరియన్లు వేరే చోట కూర్చోవాలంటూ.. -
అదే నా ఆస్తి – బ్రహ్మాజీ
‘‘మా అబ్బాయి సంజయ్ నటించిన ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ ప్రమోషన్‌కి నాగార్జున, అలీ, అనిల్ రావిపూడి.. ఇలా అందరూ సపోర్ట్ చేశారు. ఇలా అందరి ప్రేమను సంపాదించడమే నా ఆస్తిగా భావిస్తున్నా’’ అని నటుడు బ్రహ్మాజీ అన్నారు. సంజయ్ రావు, ప్రణవి మానుకొండ జంటగా ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’. అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ రేపు రిలీజ్ చేస్తోంది. ‘‘ఈ చిత్రంలో విడాకుల స్పెషలిస్ట్ లాయర్‌గా కనిపిస్తాను’’ అన్నారు బ్రహ్మాజీ. -
అవిశ్వాస తీర్మానానికి బీఆర్ఎస్ మద్దతు...
-
నేనున్నానంటూ సీఎం జగన్ భరోసా
సాక్షి ప్రతినిధి, విజయవాడ/, గుంటూరు, నరసరావుపేట : అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న వారికి నేనున్నానంటూ సీఎం జగన్ అండగా నిలిచారు. తలసేమియాతో బాధపడుతున్న విజయవాడకు చెందిన దుర్గాభవానీ, సీతారామ్ దంపతులు కుమారుడు గౌతమ్వెంకట్, బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న పల్నాడు జిల్లా రొంపిచర్లకు చెందిన సూర్యఆదిత్యరెడ్డి, ప్రమాదంలో కళ్లు కోల్పోయి, మానసిక స్థితి సరిగా లేని దుగ్గిరాలకు చెందిన నాగూర్‌తో పాటు కుమార్తె త్రివేణిలు వెంకటపాలెం వద్ద సీఎం జగన్‌కు గోడు వెళ్లబోసుకున్నారు. వారి కష్టాలు ఓపికగా విన్న సీఎం.. తక్షణ ఆర్థిక సాయంతో పాటు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఈ మేరకు గంటల వ్యవధిలోని ఆయా జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు బాధితులకు ఆర్థిక సాయం అందజేశారు. వైద్యం అందిస్తామన్నారు. చదవండి: CM Jagan VenkatapalemTour: అమరావతి అందరిదీ -
రేవంత్ జోలికొస్తే ఊరుకోను
-
గతంలో పీస్ వర్క్ చేసేదాన్ని ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో నలుగురికి ఉపాధి కల్పిస్తున్నా.
-
Bihar: నితీష్ కుమార్ సర్కార్‌కు ఎదురుదెబ్బ ..
బిహార్: బిహార్ సీఎం నితీష్ కుమార్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. జితన్ రామ్ మాంఝీకి చెందిన హిందుస్థాన్ ఆవాం మోర్చా(హెచ్ఏఎమ్) ప్రభుత్వానికి తన మద్దుతును ఉపసంహరించుకుంది. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు సంతోష్ సుమన్ వెల్లడించారు. దీనికి సంబంధించిన ఉపసంహరణ పత్రాన్ని రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌కు సమర్పించనున్నట్లు స్పష్టం చేశారు. కేబినెట్‌కు గత వారమే రాజీనామా చేసిన మాంఝీ తనయుడు సంతోష్ సుమన్.. నితీష్ నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. తన పార్టీని విలీనం చేయాలని సీఎం బలవంతం చేస్తున్నట్లు ఆరోపించారు. పార్టీ భవిష్యత్తును ఢిల్లీకి వెళ్లి చర్చించనున్నట్లు చెప్పారు. మూడో కూటమిని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. కాగా నితీష్ కుమార్ సర్కార్‌కు మద్దతు ఉపసంహరించిన జితన్ రాం మాంఝీ పార్టీ ఎన్డీయేకు చేరువయ్యేందుకు సంకేతాలు పంపింది. తాను మంగళవారం ఢిల్లీ వెళుతున్నానని, ఎన్డీయే నుంచి ఆహ్వానం అందితే కాషాయ కూటమిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. థర్డ్ ఫ్రంట్ ప్రతిపాదననూ కూడా పరిశీలిస్తున్నామని సుమన్ తెలిపారు. అయితే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశానికి సంబంధించిన వార్తలపై స్పందించేందుకు నిరాకరించారు. నలుగురు ఎమ్మెల్యేలు ఉన్న హిందుస్థాన్ స్వామ్ మోర్చా పార్టీ.. గతేడాది బీజేపీని వీడిన నితీష్ కుమార్‌కు మద్దతుగా మహాకూటమిలో చేరింది. ప్రస్తుతం బిహార్‌లో 243 సీట్లకు గాను ప్రభుత్వానికి చెందిన కూటమికి 160 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో పాటు మరో మూడు చిన్న పార్టీలు ఇందులో భాగస్వామ్యులుగా ఉన్నాయి. ఇదీ చదవండి:గీతా ప్రెస్‌కు గాంధీ శాంతి బహుమతి.. కాంగ్రెస్ ఫైర్.. రూ కోటి నిరాకరణ -
స్వశక్తితో ఎదిగేందుకు జగనన్న భరోసా ఇచ్చారు
-
లేస్ పరిశ్రమకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తూ మహిళలకు జీవనోపాధి కల్పిస్తోంది
-
ఏపీ నుంచి ఒడిశాకు 50 అంబులెన్స్ లు, మెడికల్ టీమ్స్
-
కీళ్లు, మోకాళ్ల నొప్పులకు ఉపశమనం కావాలంటే, Nveda Joint Support తెలుసుకోండి!
హైడ్రోలైజ్డ్ కొలాజెన్ టైప్-2తో సహజసిద్ద పద్దతిలోనే కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందాలనుకుంటున్నారా? అయితే మీరు “Nveda Joint Support” గురించి తప్పకుండా తెలుసుకుని విముక్తి పొందండి! హైడ్రోలైజ్డ్ కొలాజెన్ టైప్-2 అనేది ఒక రకమైన కొలాజెన్, ఇది కీళ్లు మరియు మోకాళ్ల ఆరోగ్యం కోసమే ప్రత్యేకంగా రూపొందించబడింది, ఎందుకంటే ఇది కీళ్ల మృదులాస్థి యొక్క ప్రధాన నిర్మాణ భాగం కాబట్టి. ఇది కోడి మృదులాస్థి నుండి తీసుకోబడింది. కీళ్లు మరియు మోకాళ్ల ఆరోగ్యానికి హైడ్రోలైజ్డ్ కొలాజెన్ టైప్-2 ద్వారా పొందే కొన్ని ప్రయోజనాలను ఇక్కడ చూద్దాము : కీళ్ల చలనాన్ని మెరుగుపరుస్తుంది: హైడ్రోలైజ్డ్ కొలాజెన్ టైప్-2 అనేది కీళ్ల చలనాన్ని మరియు వంగే గుణాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది, కీళ్ల నొప్పులు మరియు అన్ని రకాల కీళ్ళవాపు వ్యాధులు(ఆర్థరైటిస్), కీళ్ల కదలికలో కష్టం (రుమాటిక్ ) మరియు ముసలితనపు కీళ్ళ వ్యాధి (ఆస్టియో ఆర్థరైటిస్)తో బాధపడుతున్న వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కీళ్లు & మోకాళ్ల నొప్పులను తగ్గిస్తుంది : హైడ్రోలైజ్డ్ కొలాజెన్ టైప్-2 అనేది మంటను తగ్గించే లక్షణాలను కలిగి ఉన్నట్లు గుర్తించబడింది, దీని వలన ముసలితనపు కీళ్ళ వ్యాధి (ఆస్టియో ఆర్థరైటిస్) మరియు కీళ్ల కదలికలో కష్టంగా (రుమటాయిడ్ ఆర్థరైటిస్) ఉన్నటువంటి వారిలో కీళ్ల నొప్పులు మరియు వాపులను తగ్గించడంలో సహాయపడుతుంది. మృదులాస్థి ఆరోగ్యానికి దోహదపడుతుంది: కొలాజెన్ టైప్-2 అనేది మృదులాస్థిలో ప్రధాన భాగం, అది కీళ్లలో ఉన్న ఎముకల మధ్య ఒక మెత్తని పదార్థంలాగా పనిచేస్తుంది. హైడ్రోలైజ్డ్ కొలాజెన్ టైప్-2 అనేది మృదులాస్థి ఆరోగ్యానికి సహాయపడుతుంది ఇంకా దాని అరుగుదలను నెమ్మదిపరుస్తుంది. క్రీడల్లో గాయపడిన వారికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. కీళ్లు & మోకాళ్ల కణజాలను బాగుచేయడంలో దోహదపడుతుంది : కొలాజెన్ టైప్-2 అనేది కీళ్లు & మోకాళ్ల కణజాలను బాగుపరచడంలో ఎంతో ముఖ్యమైనది. హైడ్రోలైజ్డ్ కొలాజెన్ టైప్-2 కలిగిన పదార్థాలను తీసుకోవడం వల్ల కొత్తగా కీళ్ల కణజాల పెరుగుదలకు దోహదపడుతుంది మరియు కీళ్ల & మోకాళ్ల పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. సురక్షితమైనది మరియు సహజసిద్ధమైనది : హైడ్రోలైజ్డ్ కొలాజెన్ టైప్-2 అనేది చాలా మంది ఒంటికి తగినటువంటి సురక్షితమైన, సహజసిద్ధమైన పదార్థం. ఇది చాలా తేలికగా జీర్ణమవుతుంది ఇంకా దీనిని శరీరం బాగా గ్రహించుకుంటుంది, అందువలన కీళ్ల నొప్పులు మరియు బిగుసుకుపోయిన కీళ్లు ఉన్న వారికి ఇదొక ప్రభావవంతమైన ఎంపిక అని చెప్పవచ్చు. Nveda (https://nveda.in/ ) అనేది బాగా పరిశోధించబడిన పదార్థాలతో కూడిన Nveda Joint Support అనే ఒక ఉత్పత్తిని తయారు చేసింది, ఇవన్నీ కూడా మోకాళ్లు, కీళ్లను బలపరచడంలో సహాయపడతాయి. Nveda Joint Support లో హైడ్రోలైజ్డ్ కొలాజెన్ టైప్-2తో పాటు గ్లూకోసమైన్, ఎంఎస్ఎం, కాల్షియం సిట్రేట్ & కాల్షియం ఆస్కార్బేట్ లు కూడా ఉన్నాయి. ఈ సహజసిద్ద పదార్ధాలన్నీ మంటను తగ్గించడానికి, కీళ్ల రాపిడిని తగ్గించడానికి మరియు కీళ్లు & మృదులాస్థిని బలపరచడంలో సహాయపడతాయి. ఈ ఉత్పత్తి గురించి మరిన్ని వివరాల కోసం, మీరు ఈ వెబ్సైట్ లోకి వెళ్లి తెలుసుకోవచ్చు (https://nveda.in/products/joint-support-60) గ్లూకోసమైన్ అనేది సహజసిద్దంగా మన శరీరంలో ఉండే పదార్థం, ఇది మృదులాస్థి తయారీలో ఇంకా దానిని బాగుచేయడంలో దోహదపడుతుంది. ఇది సాధారణంగా మోకాళ్లు & కీళ్ల ఆరోగ్యానికి ఉపయోగించబడుతుంది. కీళ్ల ఆరోగ్యానికి గ్లూకోసమైన్ కొన్ని ముఖ్యమైన ప్రయోజనాలు ఇక్కడ చూడండి: 👉కీళ్లు & మోకాళ్ల నొప్పులు తగ్గించి అవి బిగుసుకుపోవడాన్ని కూడా తగ్గిస్తుంది: గ్లూకోసమైన్ అనేది ముసలితనపు కీళ్ళ వ్యాధి(ఆస్టియో ఆర్థరైటిస్), కీళ్ళ కదలికలో కష్టము (రుమాటిక్ ఆర్థరైటిస్), ఇతర రకాల కీళ్లు & మోకాళ్ల నొప్పి ఉన్నవారిలో కీళ్లు&మోకాళ్ల నొప్పిని తగ్గించి, అవి బిగుసుకుపోవడాన్ని కూడా తగ్గించడంలో సహాయ పడుతుంది. 👉కీళ్ల పనితీరునుమెరుగుపరుస్తుంది: గ్లూకోసమైన్ అనేది కీళ్ల & మోకాళ్ల నొప్పి ఉన్నవారు సులభంగా కదలడానికి ఇంకా తక్కువ కష్టంతో రోజువారీ పనులను చేసుకోవడానికి కీళ్ల పనితీరును, వాటి చలనాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. 👉మృదులాస్థి ఆరోగ్యానికి దోహదపడుతుంది: గ్లూకోసమైన్ అనేది కీళ్లలో ఎముకల మధ్య మెత్తని పదార్థంలాగా పనిచేస్తుంది, ఇది మృదులాస్థి యొక్క కీలక భాగం. గ్లూకోసమైన్ కలిగిన పదార్థాలను తీసుకోవడం వల్ల మృదులాస్థి ఆరోగ్యానికి మేలు చేస్తుంది ఇంకా దాని అరుగుదలను నెమ్మదిపరుస్తుంది. 👉కణజాలాన్ని బాగుచేయడంలో తోడ్పడుతుంది: గ్లూకోసమైన్ అనేది కొత్త కీళ్ల కణజాల పెరుగుదలకు తోడ్పడడంలో సహాయపడుతుంది ఇంకా కీళ్లు & మోకాళ్ల యొక్క పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులో మంటను తగ్గించే (యాంటీ ఇన్ఫ్లమేటరీ) లక్షణాలు ఉన్నాయి: గ్లూకోసమైన్ అనేది మంటను తగ్గించే లక్షణాలున్నాయి, కాబట్టి ఇది ముసలితనపు కీళ్ల వ్యాధికి, కీళ్ల కదలికలో కష్టంగా ఉన్నవారిలో కీళ్లలో మంటను తగ్గిస్తుంది. అదే విధంగా మిథైల్ సల్ఫోనిల్ మీథేన్ (ఎంఎస్ఎం) అనేది కొన్ని ఆహారాలలో ఉండే సహజసిద్దమైన పదార్థం, ఇది అన్ని రకాల కీళ్ల, మోకాళ్ల నొప్పులనుంచి ఉపశమనం కలిగేలా మంచి ప్రయోజనాల్ని కలిగి ఉన్నట్లు గుర్తించబడింది. ఎంఎస్ఎం అనేది కీళ్ల వాపును తగ్గించడంలో సహాయపడే మంటను తగ్గించగలిగే లక్షణాలను కలిగివుంది, ఇది ముసలితనపు కీళ్ళ వ్యాధి (ఆస్టియో ఆర్థరైటిస్) మరియు కీళ్ల కదలికలో కష్టంగా (రుమటాయిడ్ ఆర్థరైటిస్) ఉన్నవారిలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కంపెనీ డాక్టర్ ప్రకారం, చాలా మంది వ్యక్తులు దీనిని తీసుకోవడం (కోర్సు) ప్రారంభించిన 3-4 వారాలలోనే ఉపశమనం పొందారంట. దీని వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు, కానీ కోడిమాంసం, చేపలంటే పడనివారు దీనిని తినకూడదని సూచించారు, ఎందుకంటే ఈ ఉత్పత్తిలో వాటి నుండి సేకరించిన కొన్ని పదార్థాలు ఉన్నాయి కాబట్టి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో ఈ ఉత్పత్తికి 3,000 కంటే ఎక్కువ పాసిటివ్ రేటింగులున్నాయి, అంతేకాకుండా ఇది ఆరోగ్యం కోసం వాడే పదార్థాల విభాగంలో ఎక్కువగా అమ్ముడుపోయే ఉత్పత్తుల్లో ఒకటిగా ఉంది. ఈ ఉత్పత్తి గురించి మరిన్ని వివరాల కోసం దయచేసి లింక్‌ని క్లిక్ చేసి తెలుసుకోండి. -అడ్వర్టోరియల్ -
రెజ్లర్లకు మద్దతుగా రైతుసంఘాల మహాపంచాయత్
-
సూక్ష్మ రుణ సంస్థలకు ప్రభుత్వ మద్దతు కావాలి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బడుగు వర్గాల రుణ అవసరాలు తీర్చడంలో కీలకపాత్ర పోషిస్తున్న మైక్రోఫైనాన్స్ రంగానికి ప్రభుత్వం తగు తోడ్పాటు అందించాలని సూక్ష్మ రుణ సంస్థల (ఎంఎఫ్ఐ) సమాఖ్య ఎంఫిన్ సీఈవో అలోక్ మిశ్రా తెలిపారు. ఎంఎఫ్ఐలకు రుణ హామీ పథకాన్ని తిరిగి ప్రారంభించడం, ఎన్బీఎఫ్సీ-ఎంఎఫ్‌ఐల కోసం ప్రత్యేకంగా రీఫైనాన్స్ సదుపాయం కల్పించడం, ఇండియా మైక్రోఫైనాన్స్ ఈక్విటీ ఫండ్ (ఐఎంఈఎఫ్) ద్వారా ఈక్విటీపరమైన సహాయం పెంచడం తదితర రూపాల్లో మద్దతు కల్పించాలని కోరుతున్నట్లు ఆయన వివరించారు. (ఇదీ చదవండి: అమ్మకాల్లో అదరగొట్టిన రెనో.. ఏకంగా 9 లక్షల యూనిట్లు) తద్వారా సమ్మిళిత వృద్ధి సాధించాలన్న ప్రభుత్వ లక్ష్య సాధనలో మైక్రోఫైనాన్స్ రంగం కూడా తన వంతు పాత్ర పోషించగలదని పేర్కొన్నారు. 2021-22 ఇండియా మైక్రోఫైనాన్స్ రివ్యూ ప్రకారం 2025-26 నాటికి సూక్ష్మ రుణాల మార్కెట్ రూ. 25 లక్షల కోట్లకు చేరవచ్చనే అంచనాలు నెలకొన్నట్లు మిశ్రా చెప్పారు. ప్రస్తుతం 32 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 633 జిల్లాల్లో ఎంఎఫ్ఐలు కార్యకలాపాలు సాగిస్తున్నట్లు ఆయన వివరించారు. -
అతన్ని అరెస్టు చేయకపోతే నిరసన జంతర్‌మంతర్‌ని దాటి వెళ్తుంది!
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక ఆరోపణల నేపథ్యంలో భారత రెజ్లర్లు జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. వారి నిరసనకు రైతు సంఘాలు కూడా మద్దతు తెలపాయి. ఈ తరుణంలో ప్రభుత్వం నుంచి సరైన విధంగా స్పందన రాకపోవడంతో.. రెజ్లర్లు తమ నిరసనను జంతర్ మంతర్ని దాటి మరింత ముందుకు తీసుకువెళ్లే యోచనలో ఉన్నట్లు సోమవారం ప్రకటించారు. ఇతర దేశాల ఒలింపిక్ పతక విజేతలు, అథ్లెట్లను సంప్రదించి వారి మద్దతును కూడా తీసుకుని తమ ఆందోళన మరింతగా ఉద్ధృతం చేస్తామని చెప్పారు. బ్రిజ్ భూషణ్ శరణ్‌సింగ్‌ని అరెస్టు చేయాలనే డిమాండ్‌ను ప్రభుత్వం పట్టించుకోకుంటే ఇలానే చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు భారత స్టార్ రెజ్లర్లు ఒలింపిక్ పతక విజేతలు బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్ తదితరులు మే 21న పెద్ద ఎత్తున నిరసనకు పిలుపునిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద గత 23 రోజులుగా భారత రెజ్లర్లు నిరసన చేస్తున్నారు. సుప్రీం కోర్టు జోక్యంతో ఢిల్లీ పోలీసులు బ్రిజ్ భూషణ్‌పై రెండు కేసులు నమోదు చేశారు. (చదవండి: అమితాబ్ బచ్చన్ పోస్ట్ వివాదం..రంగంలోకి దిగిన ముంబై పోలీసులు) -
కాంగ్రెస్‌కు మద్దతిస్తాం! కానీ..: మమతా బెనర్జీ
ఎన్నికల పోరులో ప్రతిపక్షాల ఐక్యత విషయమై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ నేత మమతా బెనర్జీ తొలిసారిగా తన వైఖరి ఏంటో ముందుగానే స్పష్టం చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బలంగా ఉన్న చోట తమ పార్టీ మద్దతు ఇస్తుందని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ బలంగా ఉన్న చోట పోరాడనివ్వండి అని అన్నారు. అందుకు తమ మద్దతు ఇక్కడ ఇస్తామని చెప్పారు. కానీ అదేసమయంలో వారు కూడా ఇతర పార్టీలకు కూడా మద్దతు ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ మద్దతు పొందాలంటే మొదటగా అది కూడా ఇతర పార్టీలకు మద్దతివ్వాల్సి ఉంటుందని నొక్కి చెప్పారు. ఈ సందర్భంగా ఆమె బలమైన ప్రాంతీయ పార్టీలకు తప్పక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. ఈమేరకు ఆమె బీజేపీని ఓడించేలా కొత్త వ్యూహ రచనను కూడా తెరపైకి తీసుకొచ్చారు. ప్రాంతీయ పార్టీలు అన్ని తమ కంచుకోటలో బీజేపీని ఎదుర్కోవాలి, కాంగ్రెస్ మాత్రం తన సొంత సీట్లను గెలవడంపై దృష్టి సారించాలన్నారు. ఆ తర్వాత విపక్షాలన్ని కలసి బలమైన పార్టీకే ప్రాధాన్యత(ఏ పార్టీ ఎక్కువ సీట్లు దక్కించుకుందో) ఇవ్వాలని అన్నారు. అలాగే ప్రాంతీయ పార్టీలకు కూడా కాంగ్రెస్ మద్దతివ్వాలని చెప్పారు. కేవలం తనకు కావల్సిన మద్దుతు తీసుకుని రోజు మాపైనే పోరాడుతూ ఉండటం అనేది సరైన పాలసీ కాదని చెప్పారు. కాగా, సీటు షేరింగ్ ఫార్ములా బలంగా ఉన్న ప్రాంతాల్లోని ఆటగాళ్లకే ప్రాధాన్యత ఇస్తామని తృణమూల్ నాయకురాలు మమతా కూడా చెప్పకనే చెప్పారు. అంతేగాదు ఆమె కర్ణాటకలో కాంగ్రెస్‌కి పట్టం కట్టిన ప్రజలకు సెల్యూట్ చేశారు కూడా. (చదవండి: ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉత్తర్వును ఉల్లంఘించడంతో..ఐఏఎస్ అధికారికి నోటీసులు) -
ఆర్ బీకేలతో ఏపీలో వ్యవసాయరంగం కొత్త పుంతలు
-
మహిళా స్టార్టప్‌లకు నిధుల సాయం, ఎవరు? ఎలా?
హైదరాబాద్: మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఎలైట్ ఫుడ్స్ అండ్ ఇన్నోవేషన్స్ గ్రూప్ ‘స్కేల్ యువర్ స్టార్టప్’ పేరుతో క్తొత కార్యక్రమాన్ని ప్రారంభించింది. రూ.10 లక్షలకు మించిన ఆదాయం గడించే మహిళల ఆధ్వర్యంలోని స్టార్టప్‌లకు మద్దతు ఇవ్వనుంది. స్టార్టప్‌లకు ఆర్థిక సాయం, మార్గదర్శకం అందించాలన్నది ఎలైట్ గ్రూప్ చైర్మన్, ఎండీ టీఆర్ రఘులాల్ కలల ప్రాజెక్టు అని తెలిపింది. మహిళల ఆధ్వ ర్యంలో నడుస్తూ, వారి వాటా కనీసం 51 శాతం ఉంటే, ఏప్రిల్ 10 వరకు ఎలైట్కనెక్ట్ డాట్ ఇన్ఫో వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. (చదవండి: ట్విటర్ మాజీ సీఈవోపై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంచలన రిపోర్టు) స్టార్టప్‌ల ఎంపిక ప్రమాణాలు టీం, మార్కెట్, వ్యాపార నమూనా ,సామాజిక ప్రభావం వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది.. వివిధ పరిశ్రమల రంగాలకు చెందిన నిపుణుల బృందం ఎంపిక ప్రక్రియను చేపట్టనుంది. "మహిళా పారిశ్రామికవేత్తలు వారి కలలను సాధించడానికి , వారి పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడానికి తోడ్పాటు అందించడం ద్వారా వారికి సాధికారత కల్పించడమే తమ లక్ష్యమన్నారు ఎలైట్ ఫుడ్స్ అండ్ ఇన్నోవేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దానేసా రఘులాల్ . (యాక్సెంచర్ సంచలనం: ఏకంగా 19వేల మందికి ఉద్వాసన) ఇదీ చదవండి: ‘నాటు నాటు’ ఫీవర్: నా వల్ల కావడం లేదు..ఇదే లాస్ట్! ఆనంద్ మహీంద్ర -
‘ఇన్సాఫ్ కె సిపాహి’కి కేజ్రీవాల్ మద్దతు
న్యూఢిల్లీ: రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ దేశంలో జరిగే అన్యాయాలపై పోరాటానికి ఏర్పాటు చేసిన ‘ఇన్సాఫ్ కె సిపాహి’వేదికకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మద్దతు ప్రకటించారు. ‘సిబల్ ప్రకటించిన ఇన్సాఫ్ సిపాహి చాలా ముఖ్యమైంది. అన్యాయంపై కలిసికట్టుగా పోరాడేందుకు ప్రతి ఒక్కరూ ఇందులో చేరాలి’అని ఆదివారం కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ‘ఇన్సాఫ్’కు శివసేన ఉద్ధవ్ వర్గం, ఆర్జేడీ చీఫ్, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ మద్దతు దక్కింది. -
దొంగకు ఖాకీ మద్దతు.. తొమ్మిది నెలలుగా కేసు చేధించకుండా..
సాక్షి, పుట్టపర్తి: ‘నా ఇంట్లో చోరీ జరిగి 9 నెలల వుతోంది. 20 తులాల బంగారాన్ని అపహరించుకెళ్లారు. ఈ సొత్తు రికవరీలో ఇప్పటికీ ఎలాంటి పురోగతి లేదు. ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న హోంగార్డు నాగరాజు నాయక్.. పుట్టపర్తి సీఐ బాలసుబ్రహ్మణ్యం రెడ్డి వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. నేను ఎన్నిసార్లు స్టేషన్‌కెళ్లి సీఐను కలిసినా ఫలితం లేకుండా పోతోంది. పైగా నన్నే దుర్భాషలాడుతూ కేసును పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలి. నాకు న్యాయం చేయాలి’ అంటూ ఏఎస్పీ రామకృష్ణ ప్రసాద్ ఎదుట హోంగార్డు లక్ష్మణ నాయక్ వాపోయాడు. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఏఎస్పీని కలసి అర్జీ అందజేసి, మాట్లాడారు. పుట్టపర్తిలోని శిల్పారామం సమీపంలో నివాసముంటున్న లక్ష్మణ నాయక్ ఇంట్లో 2022, జూన్ 14న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల్లోపు చోరీ జరిగింది. 20 తులాల బంగారం, రూ.11 వేలను అపహరించుకెళ్లారు. గోకులం ప్రాంతానికి చెందిన కాటమయ్య, హోంగార్డు నాగరాజు నాయక్‌ను అనుమానితులగా పేర్కొంటూ అప్పట్లో పుట్టపర్తి అర్బన్ పోలీసులకు లక్ష్మణ నాయక్ ఫిర్యాదు చేశాడు. నాగరాజు నాయక్‌పై గతంలోనూ చోరీ కేసులున్నాయని అందులో గుర్తు చేశాడు. బైక్ చోరీ కేసులో పట్టుబడి జైలు జీవితం అనుభవించి వచ్చిన నాగరాజు నాయక్‌ను పుట్టపర్తి సీఐ బాలసుబ్రహ్మణ్యంరెడ్డి చేరదీసి డ్రైవర్‌గా పెట్టుకున్నారని వివరించాడు. ఈ క్రమంలో కేసు దర్యాప్తులో అంతులేని నిరక్ష్యం కనబరుస్తున్నారని బాధితుడు వాపోయాడు. చోరీ సొత్తు రికవరీ చేసివ్వాలంటూ స్టేషన్‌కెళ్లి అడిగితే దుర్భాషలాడుతున్నారని వాపోయాడు. పైగా ‘ఎమ్మెల్యేతో ఫోన్‌చేయిస్తే బంగారాన్ని రికవరీ చేయాలా? నా దగ్గర పనిచేసే డ్రైవర్ దొంగతనం ఎందుకు చేస్తాడు? ఇంకోసారి స్టేషన్‌కు వస్తే బాగుండదు. నీ ఉద్యోగం ఊడగొట్టిస్తా’ అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోయాడు. ఉన్నతాధికారులైనా న్యాయం చేయాలని కోరాడు. 63 వినతులు.. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి వివిధ సమస్యలపై 63 వినతులు అందాయి. తొలుత ఏఎస్పీ రామకృష్ణ ప్రసాద్ అర్జీలు స్వీకరించి, పరిశీలించారు. అనంతరం ఎస్పీ రాహుల్‌దేవ్ సింగ్ చేరుకుని అర్జీదారులతో మాట్లాడి సమస్య తీవ్రతపై ఆరా తీశారు. చట్ట పరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లను ఆదేశించారు. (చదవండి: కనుమరుగవుతున్న కష్టజీవి..) -
చైనాకు చేయి అందించి సాయం చేస్తానన్న తైవాన్! విస్తుపోయిన బీజింగ్
చైనాలో ఇబ్బడి ముబ్బడిగా కేసులు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఆంక్షలు సడలించాకే కనీవినీ ఎరుగని స్థాయిలో కేసులు పెరిగిపోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఐతే ఇలాంటి మహమ్మారి పరిస్థితుల్లో చైనాకు ఆపన్నహస్తం అందించి సాయం చేస్తానంటూ ముందుకు వచ్చింది తైవాన్. ఈ మేరకు తైవాన్ అధ్యక్షుడు సాయ్ ఇంగ్ వెన్ ఆదివారం భారీగా పెరుతున్న కరోనా కేసులను కట్టడి చేయడంలో చైనాకు అవసరమైన సాయాన్ని అందిస్తానని ప్రకటించారు. ఈ కొత్త ఏడాదిలో మావనతా దృక్పథంతో మహమ్మారీ నుంచి ఎక్కువ మంది చైనా ప్రజలు బయటపడి ఆరోగ్యకరమైన జీవనం సాగించేలా అవసరమైన సాయం అందించేందుకు తాము సదా సిద్ధంగా ఉన్నామని ఇంగ్ వెన్ చెప్పారు. అలాగే సమస్యలను పరిష్కరించడానికి యుద్ధం ఒక ఎంపిక కాదంటూ చైనాతో చర్చలకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం ద్వీప సమీపంలో చైనా సైనిక కార్యకలాపాలు చాలా ఉద్రిక్తంగా ఉన్నయని, శాంతి స్థిరత్వానికి భంగం వాటిల్లేలా ఉన్నాయంటూ.. ఆవేదన చెందారు. ఇదిలా ఉండగా, చైనా అద్యక్షుడు జిన్‌పింగ్ నూతన సంవత్సరం ప్రసంగంలో తైవాన్ జలసంధికి ఇరువైపులా ఉన్న ప్రజలు ఒకే కుటుంబానికి చెందినవారు అంటూ ప్రసంగించారు. ఐతే కోవిడ్ వ్యాప్తిని నియంత్రించడంలో గతంలో తైవాన్, చైనా దేశాలు తమ చర్యలపై ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న సంగతి తెలిసిందే. గతేడాది మహమ్మారి విషయంలో తైవాన్ సమర్థవంతంగా పనిచేయలేదంటూ చైనా విమర్శించగా,.. మరోవైపు తైవాన్ చైనాలో పారదర్శకత లోపించిందని, తమ దేశానికి సరఫరా చేసే వ్యాక్సిన్లలో జోక్యం చేసుకుందంటూ మండిపడింది. ఐతే బీజింగ్ తైవాన్ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. (చదవండి: చైనాలో తమిళనాడు యువకుడు మృతి.. సాయం కోసం కుటుంబం వేడుకోలు) -
కూతురు కోసం ఆ తల్లి చేసిన పని చూసి.. ఫిదా అవ్వాల్సిందే
కొంతమంది డిప్రెషన్‌కి గురై బాధపడుతుంటారు. పైగా అంత సులభంగా వారు దాని నుంచి బయటడ లేరు కూడా. అలాంటి సమయంలో వారికి అండగా నిలిచి మేము ఉన్నాం అనే భరోసా ఇచ్చి.. తొందరగా బయటపడేలా చేయాలి. ఏ మాత్రం అయినవాళ్లే నుంచే అవమానం ఎదురైతే... వాళ్లు మరింత కుంగిపోయి చనిపోయే ప్రమాదం ఉంది. ఐతే ఇక్కడోక అమ్మాయి కూడా అచ్చం అలానే ఆందోళనతో బాధపడుతోంది. దీంతో ఆమె తన ఇంటి వాకిలి ముందే వర్షంలో తడుస్తూ పడుకుని ఉంది. ఇంతలో సడెన్‌గా వాళ్ల అమ్మ అక్కడికి కారులో వచ్చింది. అక్కడ అలా వర్షంలో తడుస్తూ ..నేలపై పడుకొని బాధపడుతున్న తన కూతుర్ని చూసి ఆమె కారు నుంచి దిగి నేరుగా కూతురు పక్కన కూర్చొంటుంది. ఆ తర్వాత కూతురు ఎలా పడుకుని ఉందో అలా ఆమె కూడా సాయంగా పడుకుని ఉంటుంది. అంతేగాదు ఆమె ఆందోళన శాంతించేవరకు అలానే ఆమె తోపాటు వర్షంలో పడుకుని అండగా ఉంటుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు కష్టకాలంలో కూతురికి అండగా నిలిచిన ఆ తల్లిపై ప్రశంసల జల్లు కురిపిస్తూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: కోచింగ్ ఫీజు కోసం.. రాత్రిపూట టీ అమ్ముతూ...) -
అన్నదాతలకు అన్ని విధాలా అండగా జగన్ సర్కార్
-
ఉక్రెయిన్‌కి సాయం అందిస్తాం: రిషి సునాక్
కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా రిషి సునాక్ బ్రిటన్ పగ్గాలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఉక్రెయిన్‌లో పర్యటించారు. ఈ మేరకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో రష్యా చేస్తున్న దురాక్రమణ యుద్ధంలో ఉక్రెయిన్‌కి బ్రిటన్ అన్ని విధాలుగా మద్ధతు ఇస్తుందని సునాక్ హామీ ఇచ్చారు. జెలెన్ స్కీ కీవ్‌ని సందర్శించినందుకు సునాక్‌కి ధన్యావాదాలు తెలిపారు. అంతేగాదు బ్రిటన్‌కి స్వాతంత్య్రం కోసం పోరాడటం అంటే ఏమిటో తెలుసునని సునాక్ అన్నారు. అలాగే ఉక్రెయిన్ కోసం పోరాడుతున్న పరాక్రమ యోధులకు సాయం అందిస్తామని వాగ్ధానం చేశారు. పైగా ఉక్రెయిన్ ప్రజలకు కావాల్సిన ఆహారం, ఔషధాలు, అందుబాటులో ఉండేలా బ్రిటన్ మానవతా సహాయాన్ని అందిచడం కొనసాగిస్తుందని తెలిపారు. ఈ మేరకు జెలెన్స్కీ ట్విట్టర్లో..."ఇరు దేశాలకు స్వాతంత్యం కోసం నిలబడటం తెలుసు. బ్రిటన్ లాంటి స్నేహితులు పక్కన ఉంటే విజయం సాధించడం తధ్యం" అని ధీమగా చెప్పారు. ఇదిలా ఉండగా..సునాక్ ఆగస్టులో ఉక్రెయిన్‌కి స్వాతంత్రదినోత్సవం సందర్భంగా ఒక లేఖ కూడా రాశారు. ఆ లేఖలో రష్యా దూకుడుకి ఎదురు నిలబడి అజేయమైన ధైర్యసాహాసాలో పోరాడుతున్నందుకు ఉక్రెయిన్‌ని ప్రశంసలతో ముంచెత్తారు సునాక్. నిరంకుశత్వానికి పరాకాష్టగా పోరాటం సాగిస్తున్న వారెవ్వరూ విజయం సాధించలేరంటూ ఒక చక్కటి సందేశాన్ని పంపారు సునాక్. Britain knows what it means to fight for freedom. We are with you all the way @ZelenskyyUa 🇺🇦🇬🇧 Британія знає, що означає боротися за свободу. Ми з вами до кінця @ZelenskyyUa 🇺🇦🇬🇧 pic.twitter.com/HsL8s4Ibqa — Rishi Sunak (@RishiSunak) November 19, 2022 (చదవండి: వందేళ్ల వయసులోనూ విరామమెరుగని వృద్ధ డాక్టర్) -
వికేంద్రీకరణకు మద్దతుగా అనంతపురంలో సత్యాగ్రహ దీక్ష
-
మూడు రాజధానులకు మద్దతుగా నెల్లూరులో విద్యార్థుల భారీ ర్యాలీ
-
అనంతపురంలో వికేంద్రీకరణకు మద్దతుగా రౌండ్ టేబుల్ సమావేశం
-
మెటాలో వేల మందికి ఉద్వాసన: హెచ్1బీ వీసా హోల్డర్లలో కలవరం
న్యూఢిల్లీ: టెక్నాలజీ కంపెనీల్లో ఉద్యోగాల కోతలు కొనసాగుతున్నాయి. టెక్ పరిశ్రమకు సవాళ్లు పెరుగుతుండటం, ఆదాయాలు పడిపోతుండటం వంటి పరిణామాల నేపథ్యంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఫేస్బుక్ మాతృసంస్థ మెటా 11,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. మెటా మొత్తం సిబ్బంది సంఖ్యలో ఇది 13 శాతం. ఉద్యోగులకు రాసిన లేఖలో సంస్థ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఈ విషయాలు వెల్లడించారు. ‘కోవిడ్ మహమ్మారి తర్వాత కూడా భారీ వృద్ధి ఉంటుందనే అంచనాతో పెద్ద యెత్తున ఉద్యోగులను తీసుకున్నాం. దురదృష్టవశాత్తు నేను ఊహించిన విధంగా జరగలేదు. (రూ.2 వేల నోట్లు: షాకింగ్ ఆర్టీఐ రిప్లై) ఆన్లైన్ కామర్స్ మళ్లీ పాత స్థాయికి వచ్చేసింది. స్థూల ఆర్థిక మందగమనం, పెరిగిన పోటీ, ప్రకటనలు తగ్గడం వంటి కారణాలతో ఆదాయాలు నేను ఊహించిన దానికన్నా తగ్గాయి. నేను పరిస్థితిని తప్పుగా అంచనా వేశాను. దీనికి బాధ్యుణ్ని నేనే‘ అని ఆయన పేర్కొన్నారు. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్లో కూడా కోతల పర్వం నడుస్తున్న నేపథ్యంలో మెటాలోనూ ఉద్వాసనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ మొదలైనవి మెటాలో భాగంగా ఉన్నాయి. తీసివేస్తున్న ఉద్యోగులకు ఈమెయిల్స్ వస్తాయని, వారికి కంపెనీ సిస్టమ్స్ ఇక అందుబాటులో ఉండవని జుకర్‌బర్గ్ తెలిపారు. మాజీ ఉద్యోగులకు 16 వారాల బేసిక్ పేతో పాటు కంపెనీలో పని చేసిన ప్రతి ఏడాదికిగాను 2 వారాల జీతం లభిస్తుంది. 6 నెలల పాటు వారితో పాటు వారి కుటుంబ సభ్యులకూ హెల్త్ ఇన్సూరెన్స్ పని చేస్తుంది. ఇదీ చదవండి: క్యూ కడుతున్న టాప్ కంపెనీలు: అయ్యయ్యో ఎలాన్ మస్క్! టెక్ సంస్థలకు సవాళ్లు.. కోవిడ్ సమయంలో లాక్డౌన్ల వల్ల ఇళ్లకే పరిమితం కావడంతో ప్రజలు సోషల్ మీడియాను గణనీయంగా ఉపయోగించారు. దీంతో ఆయా కంపెనీలకూ భారీగా ఆదాయాలు వచ్చాయి. అయితే, లాక్డౌన్లు ముగిసి, ప్రజలు తిరిగి దైనందిన జీవితాల్లో పడిపోయిన తర్వాత వాటి ఆదాయాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ప్రత్యేకంగా మెటా విషయానికొస్తే.. డిజిటల్ యూనివర్స్ ’మెటావర్స్’ పై భారీగా పెట్టుబడులు పెడుతుండటం ఇన్వెస్టర్లను కలవరపరుస్తోంది. అటు టెక్ దిగ్గజం యాపిల్ ప్రైవసీ టూల్స్ సైతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు సమస్యగా మారుతున్నాయి. వీటి వల్ల యూజర్ల అనుమతి లేకుండా వారిని ట్రాక్ చేయడం, ప్రత్యేకంగా టార్గెట్ చేసే ప్రకటనలు చూపడం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్ లాంటి సంస్థలకు కష్టతరమవుతోంది. అలాగే యువత ఎక్కువగా టిక్‌టాక్ వైపు మళ్లుతుండటం ఇన్‌స్టాగ్రామ్‌పై ప్రతికూల ప్రభావం చూపుతోంది. భారత్‌లోని ఉద్యోగుల్లో కలవరం.. ఏయే దేశాల్లో ఏ మేరకు కోతలు ఉంటాయనేది తెలియకపోవడంతో భారత్‌లోని మెటా ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, వాట్సాప్‌లకు సంబంధించి మెటాకు భారత్‌లో 300–400 మంది ఉద్యోగులు ఉన్నారు. వీటిలో 60 మంది సిబ్బంది గల వాట్సాప్ బృందమే చిన్నది. మెటా ఇండియా హెడ్ అజిత్ మోహన్ ఇటీవలే రాజీనామా చేసి పోటీ సంస్థ స్నాప్‌లో చేరారు. హెచ్1బీ వీసా హోల్డర్లకు సహకారం ఉద్వాసనకు గురైన వారిలో హెచ్1బీ వీసాహోల్డర్లు ఉంటే ఇమ్మిగ్రేషన్ పరంగా వారికి అవసరమైన పూర్తి సహాయ, సహకారాలను కంపెనీ అందిస్తుందని జుకర్‌బర్గ్ తెలిపారు. తమ దేశంలో పని చేసేందుకు విదేశీయులకు అమెరికా ఈ వీసాలు జారీ చేస్తుంది. అకస్మాత్తుగా ఉద్యోగం పోతే, తమ వీసాను స్పాన్సర్ చేసే మరో కంపెనీలో ఉద్యోగాన్ని 60 రోజుల్లోగా చూసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే వీసా గడువు ముగిసిపోతుంది. పలు అమెరికన్ కంపెనీల్లో భారత్, చైనా నుంచి చాలా మటుకు ఉద్యోగులు ఉన్నారు. ప్రధానంగా ఫేస్బుక్లో వీరి సంఖ్య 15శాతం పైనే. ఉద్యోగాల్లో కోతల వల్ల ఇలాంటి హెచ్1బీ వీసాహోల్డర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారనుంది. -
పరిశ్రమలకు పెద్దపీట..
-
మూన్‌లైటింగ్‌పై టెక్ఎం సీఎండీ కీలక వ్యాఖ్యలు, ఒక్క మాటతో..!
సాక్షి, ముంబై: ఐటీ కంపెనీల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన మూన్‌లైటింగ్‌పై దేశీయ 5వ అతిపెద్ద టెక్ దిగ్గజం టెక్ మహీంద్ర కీలక వ్యాఖ్యలు చేసింది. మూన్‌లైటింగ్‌కు ఆదిగా మద్దతిచ్చిన కంపెనీల్లో ఒకటైన టెక్ మహీంద్రా సీఎండీ సీపీ గుర్నానీ స్పందిస్తూ తమది డిజిటల్ కంపెనీ తప్ప, వారసత్వ సంస్థ కాదని వ్యాఖ్యానించారు. తమ కంపెనీ సైడ్ గిగ్లకు మద్దతునిస్తుందని, అసలు అదే ఫ్యూచర్ అంటూ మంగళవారం కంపెనీ ఫలితాల సందర్భంగా ప్రకటించడం విశేషం. అయితే మహీంద్రా గ్రూప్ కంపెనీ ఈ అంశంపై ఇంకా ఒక విధానాన్ని తీసుకురాలేదన్నారు. ఎందుకంటే 90కి పైగా దేశాల్లో స్థానిక చట్టాలకు అనుగుణంగా ఉండాలని గుర్నాని మీడియాతో అన్నారు. తన ఉద్యోగులకు మూన్లైట్ను అనుమతించే విధానంపై పనిచేస్తున్నామన్నారు. లెగసీ, డిజిటల్ కంపెనీల మధ్య చాలా వ్యత్యాసం ఉందని, తమది లెగసీ సంస్థ కాదు కాబట్టి మూన్‌లైటింగ్‌కు మద్దతు ఇవ్వడంలో విశ్వాసం వస్తుందన్నారు. అయితే సిబ్బంది ముందుకు వచ్చి వేరే కంపెనీలో ఉద్యోగం చేస్తున్న విషయాన్ని వెల్లడించాలని కంపెనీ భావిస్తోందని, విలువలు, నైతికత, పారదర్శకత వంటి కీలక అంశాల్లో రాజీ పడకూడదని పేర్కొన్నారు. ఎవరైనా మంచి పనితనం కలిగి ఉంటే సీఈవోగా చాలా సంతోషిస్తాను.. కానీ ఉద్యోగులు అనుమతి తీసుకుని, ఏ పని చేస్తున్నారో తమకు క్లియర్‌గా చెబితే బావుంటుందనే మాట మాత్రం కచ్చితంగా చెబుతానన్నారు. ఇది కంపెనీతోపాటు, ఆ ఉద్యోగికి కూడా శ్రేయస్కరమన్నారు. అయితే ప్రస్తుతం తమ వద్ద ఉన్న 1.63 లక్షల ఉద్యోగుల్లో ఎవరికైనా అనుమతి లేకుండా రెండు ఉద్యోగాలు చేసుకునేందుకు అనుమతించే విధానం ఏదీ లేదని స్పష్టం చేసిన ఆయన, ఏదైనా ఉల్లంఘన జరిగితే మాత్రం చర్యలు తీసుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు. మరోవైపు సెప్టెంబరు 2021తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ లాభాలు శాతం క్షీణించాయి.సెప్టెంబర్‌తో ముగిసిన రెండవ త్రైమాసికంలో పన్ను తర్వాత కన్సాలిడేటెడ్ లాభం (గత ఏడాది నాటి 1,338.7 కోట్లతో పోలిస్తే) 1,285.4 కోట్లకు పడిపోయింది. (Elon Musk క్లారిటీ: బ్లూటిక్ వెరిఫికేషన్ ఫీజు ఎంతో తెలుసా?) కాగా కోవిడ్ పరిస్థితులు, ఆంక్షలు, వర్క్ ఫ్రంహోం సమయంలో ఐటీ సంస్థల్లో మూన్‌లైటింగ్ అంశం వివాదాన్ని రేపింది. విప్రో, టీసీఎస్, ఐబీఎం లాంటి దిగ్గజ సంస్థల్లో చర్చకు దారి తీసింది. మూన్ లైటింగ్‌ను ఇన్ఫోసిస్ కూడా వ్యతిరేకించింది. మూన్‌లైటింగ్‌కు పాల్పడితే చర్యలు తప్పవంటూ ఈమెయిల్ ద్వారా హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా విప్రో ఇదే ఆరోపణలతో 300మంది ఉద్యోగులను తొలగించడంతో ఇది మరింత ముదిరింది. ఫలితంగా 220 బిలియన్ డాలర్ల భారతీయ ఐటీ పరిశ్రమలో మూన్‌లైటింగ్ నైతికత, చట్టబద్ధతపై భిన్నాభిప్రాయాలు నెలకొన్న సంగతి తెలిసిందే. -
వికేంద్రీకరణకు మద్దతుగా చోడవరంలో ‘విద్యార్థి గర్జన’
చోడవరం(అనకాపల్లి జిల్లా): మూడు రాజధానులు కావాలంటూ విద్యార్థులు గర్జించారు. వికేంద్రీకరణకు మద్దతుగా భేరి మోగించారు. తమ బంగారు భవిష్యత్ కోసం విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటు చేయాలని విద్యార్థులంతా చోడవరం వేదికగా గళమెత్తారు. మూడు రాజధానుల సాధన పోరాట సమితి (జేఏసీ) ఆధ్వర్యంలో చోడవరంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జేఏసీ నేతలుత లజపతిరాయ్, దేవుడు, వేలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. చదవండి: సీఎం జగన్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్.. ఆ నిర్మాణంలో ప్రత్యేకతలెన్నో.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ, మూడు రాజధానులతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. టీడీపీ, తోక పార్టీలు పరిపాలన రాజధానిని అడ్డుకుంటున్నాయన్నారు. విశాఖ పరిపాలన రాజధాని అయితే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు. -
మూడు రాజధానులకు మద్దతు ప్రకటించిన మాల మహానాడు
సాక్షి, విశాఖపట్నం: మూడు రాజధానులకు మాల మహానాడు మద్దతు ప్రకటించింది. విశాఖను పరిపాలన రాజధానిగా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు మంగరాజు తెలిపారు. ‘‘దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర ప్రాంతం వెనుకబడి ఉంది. విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తేనే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుంది. అమరావతి రైతులు ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారులు పాదయాత్ర చేస్తున్నారు. చంద్రబాబు ఒక సామాజిక వర్గం కోసమే అమరావతి రాజధాని కావాలంటున్నారు. మూడు రాజధానులను అడ్డుకుంటే రాబోయే ఎన్నికల్లో టీడీపీకి తగిన గుణపాఠం చెబుతామని’’ మంగరాజు హెచ్చరించారు. చదవండి: AP: ఒకే అంశంపై రెండు పిటిషన్లు.. హైకోర్టు ఆగ్రహం -
ఉత్తరాంధ్రను చంద్రబాబు, పవన్ అవహేళన చేస్తున్నారు : మంత్రి ధర్మాన
-
గెహ్లాట్‌పై చర్యలకు శశిథరూర్ డిమాండ్
భోపాల్: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌పై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల అభ్యర్థి, సీనియర్ నేత మల్లికార్జున ఖర్గేకు మద్దతుగా గెహ్లాట్ తన ట్విటర్లో ఈమధ్య ఓ వీడియో సందేశం ఉంచారు. ఈ క్రమంలో ఖర్గేకు బహిరంగ మద్దతు ప్రకటించడంపై థరూర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అభ్యర్థులు ఎవరైనా సరే..అంటూ మొదలుపెట్టి గెహ్లాట్ ప్రసంగం కొనసాగింది. ‘‘ఖర్గే పార్టీ నేతలతో, కార్యకర్తలతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. ప్రతిపక్ష నేతలతోనూ చర్చించగల సామర్థ్యం ఉంది. కాబట్టి, పార్టీ ప్రతినిధులంతా ఆయన్ని ఘనమైన మెజార్జీతో గెలిపించాలి’’ అని గెహ్లాట్ సదరు వీడియో సందేశంలో కోరారు. ఈ పరిణామంపై గురువారం భోపాల్(మధ్యప్రదేశ్) పార్టీ కార్యాలయంలో శశిథరూర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. పార్టీ ఆఫీస్ బేరర్గానీ, ముఖ్యమంత్రిగానీ, పీసీసీ చీఫ్‌లు గానీ ఏ అభ్యర్థి తరపున ప్రచారంలో పాల్గొనడంగానీ, మద్దతు తెలపడం లాంటి పనులు గానీ చేయకూడదు. मैं उम्मीद करता हूं जो भी डेलीगेट हैं वो भारी बहुमत से श्री मल्लिकार्जुन खड़गे को कामयाब करेंगे।कामयाब होने के बाद में वो हम सबका मार्गदर्शन करेंगे व कांग्रेस मजबूत होकर प्रतिपक्ष के रूप में उभर कर सामने आएगी।यह मेरी सोच है, मेरी शुभकामनाएं है खड़गे साहब भारी मतों से कामयाब हों। pic.twitter.com/OQ4Nk8zFKa — Ashok Gehlot (@ashokgehlot51) October 13, 2022 అలాంటిది గెహ్లాట్ బహిరంగంగా ఖర్గేకు మద్దతు తెలిపారు. ఎన్నికలను సజావుగా నిర్వహించాల్సిన కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల అధికార యంత్రాంగం ఈ వ్యవహారంపై పక్షపాతం ప్రదర్శించకుండా దర్యాప్తు చేయాలి. అలాగే గెహ్లాట్ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలి’’ అని థరూర్ పేర్కొన్నారు. చాలా చోట్లా పీసీసీ చీఫ్‌లు, సీఎల్పీ నేతలు, బడా నేతలు మల్లికార్జున ఖర్గేకు ఘనస్వాగతం పలుకుతున్నారు. ఆ కార్యక్రమాలకు కార్యకర్తలను రమ్మంటూ పిలుస్తున్నారు. ఆయనతో కూర్చుని.. చాలాసేపు చర్చిస్తున్నారు. నా విషయంలో మాత్రం ఇది ఎందుకనో జరగడం లేదు అంటూ థరూర్ ఇంతకు ముందు అసంతృప్తి వ్యక్తం చేశారు కూడా. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు ఎల్లుండి.. అంటే అక్టోబర్ 17 సోమవారం జరగనున్నాయి. మరోవైపు పార్టీ హైకమాండ్ మీద ధిక్కార స్వరం వినిపించి పార్టీని ప్రక్షాళన చేయాలని గత కొంత కాలంగా డిమాండ్ చేస్తున్న జీ23 నేతలు.. ఖర్గేకే తమ మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ సుస్థిరంగా మనుగడ సాగించాలంటే ఖర్గే పగ్గాలు అందుకోవాలని సీనియర్ నేత మనీశ్ తివారీ సైతం స్పష్టం చేశారు. జీ–23 కూటమిలో శశిథరూర్ ఉన్నప్పటికీ.. ఖర్గేకే వాళ్లంతా జై కొట్టడం విశేషం. ఇదీ చదవండి: చచ్చేదాకా బీజేపీతో కలిసే ప్రసక్తే లేదు! -
అన్నీ రూమర్లే..సోనియా నుంచి ఎలాంటి సపోర్ట్ లేదు: ఖర్గే
లఖ్‌నవూ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో సీనియర్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, శశిథరూర్‌లు పోటీ పడుతున్నారు. అయితే, అధిష్ఠానం తరపు అభ్యర్థి, అంతర్గతంగా సోనియా గాంధీ సపోర్టు మల్లికార్జున్ ఖర్గేకు ఉందంటూ కొంత కాలంగా జోరుగా ప్రచారం సాగుతోంది. తాజాగా అధ్యక్ష పదవికి ఖర్గే పేరును స్వయంగా సోనియా గాంధీనే సూచించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, అవి అన్నీ వదంతులేనని తీవ్రంగా ఖండించారు మల్లికార్జున్ ఖర్గే. సోనియాజీ తన పేరును సూచించలేదని, అంతర్గతంగా తనకు సోనియా నుంచి ఎలాంటి మద్దతు లేదని పేర్కొన్నారు. ‘అధ్యక్ష పదవికి నా పేరును సోనియా గాంధీ సూచించినట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం. నేను ఎప్పుడూ ఆ విషయాన్ని చెప్పలేదు. గాంధీ కుటుంబ నుంచి ఎవరూ ఎన్నికల్లో పాల్గొనటం, అభ్యర్థులకు మద్దతు తెలపటం వంటివి చేయరని ఆమె స్పష్టంగా చెప్పారు. కొందరు కాంగ్రెస్ పార్టీ, సోనియా, నన్ను అప్రతిష్ఠపాలు చేసేందుకు రూమర్స్ వ్యాప్తి చేస్తున్నారు. ఎన్నికల్లో పాల్గొనబోనని, ఎవరికీ మద్దతు తెలపనని స్పష్టంగా చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 9300 మంది సభ్యులు అభ్యర్థులకు ఓటు వేసి ఎన్నుకుంటారు. మెజారిటీ వచ్చిన వారు అధ్యక్ష పదవి చేపడతారు.’ అని తెలిపారు ఖర్గే. ప్రస్తుతం దేశంలో పరిస్థితులు సరిగా లేవని, మోదీ, అమిత్ షా రాజకీయాల వల్ల ప్రజాస్వామ్యం కుంటుపడుతోందని విమర్శించారు ఖర్గే. సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను బలహీనపరుస్తున్నారని ఆరోపించారు. అలాంటి వారిపై పోరాడేందుకు తగిన శక్తి కావాలని, కాంగ్రెస్ ప్రతినిధుల సిఫారసు మేరకు ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇదీ చదవండి: పోటీ చేయాలని ఒక్కరోజు ముందు చెప్పారు: ఖర్గే -
టీడీపీ బినామీలు గోబ్యాక్
-
వికేంద్రీకరణకు మద్దతుగా గిరిజనుల ఉద్యమాలు
-
వికేంద్రీకరణకు మద్దతుగా గిరిజనుల ఉద్యమాలు...
-
వికేంద్రీకరణకు మద్దతుగా జేఏసీ ఏర్పాటు
-
వికేంద్రీకరణకు మద్దతుగా మైనార్టీ నేతల ప్రార్థనలు
-
రెండు చేతులు లేవు.. కుంగిపోలేదు.. ఆత్మవిశ్వాసంతో..
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే సాధించలేనిదంటూ ఏదీ ఉండదు. శరీరంలోని అన్ని అవయవాలు బాగున్నా కొందరు నిర్లక్ష్యంగా, బాధ్యత లేకుండా ఉంటారు. నగరానికి చెందిన ఓ వ్యక్తికి రెండు చేతుల్లేవు. అయినా ఏ మాత్రం కుంగిపోలేదు. తనకు జీవితం లేదని భావించలేదు. కష్టపడి పనిచేస్తూ తల్లిని పోషిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. చదవండి: టీడీపీ నేత లైంగిక వేధింపులు: బాలిక సెల్ఫీ వీడియో.. బయటపడ్డ షాకింగ్ నిజాలు నెల్లూరు నగరంలోని 54వ డివిజన్ జనార్దనరెడ్డి కాలనీకి చెందిన పందిళ్లపల్లి శేషయ్య, రమణమ్మ దంపతులకు ఒక కుమార్తె, ఒక కుమారుడు పిల్లలు. రెండో సంతానమైన మల్లికార్జున రెండు చేతులు లేకుండా జన్మించాడు. దీంతో తల్లిదండ్రులు కుంగిపోయారు. ఎలా బతుకుతాడో?, ఎలాంటి అవమానాలను భరించాల్సి వస్తుందోనని ఆందోళన చెందారు. మల్లికార్జున చిన్నతనంలో ఉండగా తండ్రి అనారోగ్యంతో మరణించాడు. దీంతో అతను ఎవరికీ భారం కాకుండా కుటుంబానికి అండగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. చదువుకు స్వస్తి పలికి పనులు చేయడం ప్రారంభించాడు. సెకండ్ హ్యాండ్ వస్తువులను కొనుగోలు చేసి విక్రయిస్తున్నాడు. అలాగే ప్రభుత్వం దివ్యాంగుల పింఛన్ అందజేస్తోంది. వీటితో తల్లి రమణమ్మను పోషిస్తున్నాడు. మల్లికార్జున తన పనులు తానే చేసుకుంటాడు. కష్టమైన పనులకు మాత్రం తల్లి సాయం తీసుకుంటాడు. తల్లి రమణమ్మతో మల్లికార్జున.. సాయం చేస్తే అంగడి పెట్టుకుంటా సెకండ్ హ్యాండ్ వస్తువులు కొనుగోలు చేసి విక్రయిస్తుంటా. అలాగే నాకు, మా అమ్మకు వచ్చే పింఛన్‌తో జీవిస్తున్నాం. జీవనభృతి కోసం శాశ్వతంగా ఏదో ఒకటి ఏర్పాటు చేసుకోవాలి భావిస్తున్నా. ప్రభుత్వం లేదా దాతలు ఆర్థిక సాయం చేస్తే చిల్లర దుకాణాన్ని ప్రారంభించి జీవితాన్ని మరింత మెరుగుపరుచుకుంటా. – పందిళ్లపల్లి మల్లికార్జున, దివ్యాంగుడు -
మూడు రాజధానులకు మద్దతుగా ప్రత్యేకపూజలు
-
స్టార్టప్‌లకు ఏఐఎఫ్‌ల దన్ను
న్యూఢిల్లీ: ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (ఏఐఎఫ్) స్టార్టప్‌లకు మద్దతుగా నిలుస్తున్నాయి. ఇప్పటికే 720 స్టార్టప్‌లలో రూ.11,206 కోట్ల పెట్టుబడులు పెట్టినట్టు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ప్రకటించింది. స్టార్టప్‌ల కోసం ఉద్దేశించిన ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్‌వోఎఫ్).. స్టార్టప్లలలోనే పెట్టుబడులు పెట్టే 88 ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (ఏఐఎఫ్)కు రూ.7,385 కోట్లు సమకూర్చనున్నట్టు తెలిపింది. స్టార్టప్ ఎకోసిస్టమ్ బలోపేతానికి కావాల్సిన నిధులను సమీకరించడంలో ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ కీలక పాత్ర పోషిస్తున్నట్టు పేర్కొంది. ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ మద్దతుతో ఏఐఎఫ్‌లు రూ.48,000 కోట్ల పెట్టుబడులను స్టార్టప్‌లకు అందించే లక్ష్యంతో ఉన్నట్టు తెలిపింది. వీటిల్లో చిరేట్ వెంచర్స్, ఇండియా క్వొటెంట్, బ్లూమ్ వెంచర్స్, ఇవీ క్యాప్, వాటర్‌బ్రిడ్జ్, ఓమ్నివేర్, ఆవిష్కార్, జేఎం ఫైనాన్షియల్, ఫైర్‌సైడ్ వెంచర్స్ కీలకంగా పనిచేస్తున్నట్టు పేర్కొంది. -
రియల్టీ స్టార్టప్స్‌కు మంచిరోజులు: రూ.800 కోట్ల ఫండ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రియల్టీ రంగంలో మరో మైలురాయి.ఈ పరిశ్రమలో వినూత్న పరిష్కారాలు,సేవలను పరిచయం చేసేందుకు సిద్ధమైన స్టార్టప్స్‌లో పెట్టుబడులు చేసేందుకు కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్), ఇంక్యుబేటర్, స్టార్టప్స్ యాక్సిలరేటర్ అయిన వెంచర్ క్యాటలిస్ట్స్ ముందుకు వచ్చాయి. ఇరు సంస్థలు రూ.800 కోట్ల ప్రాపర్టీ టెక్నాలజీ ఫండ్‌ను ఏర్పాటు చేశాయి. సాంకేతికత, డేటా అనలిటిక్స్, బ్లాక్‌చైన్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఆగ్మెంటెడ్ రియాలిటీ ఆధారంగా పరిశ్రమను మార్చగల సామర్థ్యం ఉన్న ప్రారంభ, వృద్ధి దశలో ఉన్న స్టార్టప్స్‌కు ఈ ఫండ్ ద్వారా నిధులను సమకూరుస్తాయి. గృహ, వాణిజ్య, సంస్థాగత, పారిశ్రామిక విభాగాలకు సేవలు అందించే స్టార్టప్స్‌లో పెట్టుబడి చేస్తాయి. ప్రస్తుతం భారత రియల్టీ రంగం 300 బిలియన్ డాలర్లుగా ఉంది. పరిశ్రమ 2030 నాటికి 1 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవడానికి ఆవిష్కరణలు, సాంకేతిక పురోగతి దోహదం చేస్తుందని క్రెడాయ్ తెలిపింది. క్రెడాయ్‌లో డెవలపర్స్, వెండార్స్, చానెల్ పార్ట్నర్స్, ప్రమోటర్స్ వంటి 256 విభాగాల నుంచి 13,000 పైచిలుకు సభ్యులు ఉన్నారు. ఓయో, బేసిక్, షేర్నెస్ట్, హోమ్ క్యాపిటల్ వంటి రియల్టీ రంగ స్టార్టప్స్‌లో వెంచర్ క్యాటలిస్ట్ పెట్టుబడి చేసింది. -
..మనకు ఎవరైనా అవకాశం ఇస్తేగా మాట్లాడటానికి!
..మనకు ఎవరైనా అవకాశం ఇస్తేగా మాట్లాడటానికి! -
బీ అలర్ట్: ఈ ఫోన్లలో వాట్సాప్ అక్టోబరు నుంచి పనిచేయదు
న్యూఢిల్లీ: ఫేస్బుక్ సొంతమైన ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొన్ని పాత ఐఫోన్లకు సపోర్ట్ చేయడం ఆపివేయనుంది. రానున్న అక్టోబరు నుంచి ఎంపిక చేసిన ఐఫోన్ మోడల్‌ల కోసం వాట్సాప్ పనిచేయదని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. ఆపిల్ ఇటీవల ఇచ్చిన సపోర్ట్ అప్డేట్ ప్రకారం కొన్ని పాత iPhoneలలో ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ పని చేయదు. WABetaInfo ప్రకారం, మెసేజింగ్ యాప్ అక్టోబరు 24 నాటికి iOS 10, iOS 11 పరికరాల్లో పనిచేయదు. ఈ మేరకు ఈ ఐవోఎస్‌లను వాడుతున్న వినియోగదారులకు హెచ్చరికలు కూడా జారీ చేస్తోందట. అప్డేట్ చేసుకోవాలనేసమాచారాన్ని అందిస్తోంది. యూజర్లు తమ స్మార్ట్ఫోన్లలో ఈ యాప్ ఉపయోగించడం కొనసాగించాలంటే, వారి iPhoneలు తప్పనిసరిగా అప్డేట్ చేసుకొమ్మని సూచిస్తోంది. ఐఫోన్ వినియోగదారులు iOS 12 లేదా తదుపరిది కలిగి ఉండాలని WhatsApp గతంలో దాని హెల్ప్ సెంటర్ పేజీలో కూడా స్పష్టం చేసింది. అయితే ఈ సవరణ iPhone 5 , iPhone 5c అనే రెండు iPhone వెర్షన్లను మాత్రమే ప్రభావితం చేస్తుందట. iPhoneని ఎలా అప్‌గ్రేడ్ చేయాలి iOS 10, iOS 11 అనేవి ఐఫోన్ల పాత ఆపరేటింగ్ సిస్టమ్‌లు. ఐఫోన్ ఇంకా అప్డేట్ కాకపోతే వెంటనే అప్డేట్ చేయడం మంచిది. సెట్టింగ్‌లు > జనరల్‌కి నావిగేట్ చేయండి. ఇక్కడ సాఫ్ట్వేర్ అప్‌గ్రేడ్‌ని ఎంచుకుని, ఆపై సాఫ్ట్‌వేర్‌ను అప్డేట్ చేయడానికి లేటెస్ట్ iOS వెర్షన్‌ను ఎంచుకుంటే సరిపోతుంది. -
Nupur Sharma: బజరంగ్ దళ్ కార్యకర్తపై దాడి
భోపాల్: బీజేపీ బహిష్కృత నేత నూపుర్ శర్మకు మద్దతు చెప్తున్న వాళ్లపై దాడులు కూడా పెరిగిపోతున్నాయి. ఉదయ్‌పూర్, అమరావతి దారుణ హత్యోదంతాల తర్వాత.. బీహార్‌లో ఓ యువకుడు వాట్సాప్ స్టేటస్‌గా నూపుర్ శర్మ వ్యాఖ్యల వీడియోను పెట్టుకున్నాడని దుండుగులు కత్తులతో గాయపరిచారు. తాజాగా మధ్యప్రదేశ్‌లోనూ ఓ బజరంగ్ దళ్ కార్యకర్తపై కత్తులతో దాడి చేసింది ఓ మూక. బుధవారం అగర్-మాల్వాలో ఈ ఘటన చోటు చేసుకుంది. నూపుర్ శర్మ కామెంట్లకు మద్దతు ప్రకటించిన ఓ వ్యక్తిని కత్తులతో పొడిచారు పదమూడు మంది. బాధితుడి ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసు నమోదు చేసుకుని.. ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఈ దాడితో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బజరంగ్ దళ్ స్థానిక కన్వీనర్ అయిన ఆయూష్ జడమ్(25).. స్థానిక మీడియాలో బహిరంగంగా నూపుర్ శర్మకు మద్దతు ఇస్తూ వ్యాఖ్యలు చేశాడు. బుధవారం ఉదయం స్థానిక టోల్ బూత్ నుంచి బైక్‌పై వెళ్తున్న సమయంలో అతనిపై దాడి చేసింది ఓ గ్రూప్. దీంతో బాధితుడిని చికిత్స కోసం ఉజ్జయిని ఆస్పత్రిని తరలించారు. దాడికి పాల్పడిందంతా స్థానికులేనని పోలీసులు నిర్ధారించారు. కాగా, ఈ ఘటనను నిరసిస్తూ నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలంటూ ఎస్పీ కార్యాలయం ఎదుట హిందూ సంఘాలు బైఠాయించి ఆందోళన చేపట్టాయి. मप्र के आगर मालवा में एक बजरंग दल कार्यकर्ता पर हमला हो गया,आरोप है कि #नुपुर_शर्मा का समर्थन करने की वजह से ये हमला हुआ है,मामले में 13 लोगों के खिलाफ मामला दर्ज किया गया है जिनमें से दो को गिरफ्तार कर लिया गया है, घटना के बाद शहर में तनाव की स्थिति बन गई है @ndtv @ndtvindia pic.twitter.com/wRD1vT39PH — Anurag Dwary (@Anurag_Dwary) July 20, 2022 ఇదీ చదవండి: నూపుర్ శర్మకు ప్రాణహాని ఉంది నిజమే- సుప్రీంకోర్టు -
ఆంధ్రప్రదేశ్ కు ఘనమైన చరిత్ర ఉంది: ద్రౌపది ముర్ము
-
సాయి పల్లవి వివరణపై ప్రకాశ్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Prakash Raj Support Sai Pallavi About Controversial Comments: రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం 'విరాట పర్వం'. ఈ మూవీ విడుదలకు ముందు నుంచి సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో 'కశ్మీర్ ఫైల్స్ మూవీలోని హింస, గోరక్షక దళాలు, మానవత్వం' గురించి మాట్లాడింది. ఈ వ్యాఖ్యలపై ఓ వర్గం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తన వ్యాఖ్యలపై శనివారం (జూన్ 18) స్పష్టతనిస్తూ ఓ వీడియో విడుదల చేసింది. ఈ వీడియోలో తన దృష్టిలో హింస అనేది ముమ్మాటికి తప్పేనని, తన మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని, ఒకరి ప్రాణం తీసే హక్కు మరొకరికి లేదని సాయి పల్లవి చెప్పుకొచ్చింది. సాయి పల్లవి ఇచ్చిన వివరణపై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. ఆమెకు మద్దతుగా నిలుస్తూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్లో 'మానవత్వమే అన్నింటికంటే ముందు. కాబట్టి సాయి పల్లవి.. మేము నీతోనే ఉన్నాం.' అని రాసుకొచ్చారు ప్రకాశ్ రాజ్. కాగా నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన 'విరాట పర్వం' చిత్రానికి వేణు ఊడుగుల దర్శకత్వం వహించారు. చదవండి: 'విరాట పర్వం'పై సరళ అన్నయ్య ఆసక్తికర వ్యాఖ్యలు.. థియేటర్లో అందరిముందే ఏడ్చేసిన సదా.. వీడియో వైరల్ Humanity first … we are with you @Sai_Pallavi92 https://t.co/6Zip4FJPv3 — Prakash Raj (@prakashraaj) June 19, 2022 -
భారత్‌కు మద్దతుగా నిలిచిన చైనా.. షాక్‌లో ప్రపంచ దేశాలు!
డ్రాగన్ కంట్రీ చైనా అనూహ్యంగా భారత్‌కు మద్దతుగా నిలిచింది. ఈ క్రమంలో ప్రపంచ దేశాలు ఒక్కసారిగా ఖంగుతిన్నాయి. గోధుమల ఎగుమతిపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో నిత్యవసర ధరల పెరుగుదలతో వ్యవసాయ ఉత్పత్తులపై ఎండల ప్రభావం, ఆహార భద్రత వంటి కారణాలతో గోధుమల ఎగుమతిని నిషేధించింది. ఈ సందర్భంగా ముందస్తు ఒప్పందాల వరకు మాత్రమే ఎగుమతి చేసుకోవచ్చని తెలిపింది. భవిష్యత్తు ఎగుమతులపై నిషేధం విధిస్తున్నట్టు పేర్కొంది. కాగా, భారత్ నిర్ణయంపై జీ 7 దేశాలు తప్పుబట్టాయి. దీంతో అనూహ్యంగా భారత్‌కు డ్రాగన్ కంట్రీ చైనా మద్దతు తెలిపింది. గోధుమ ఎగుమతి నిలిపివేతపై జీ 7 దేశాలు భారత్‌ను విమర్శించడం సరికాదని వ్యాఖ్యానిస్తూ చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ కథనంలో గోధుమ ఎగుమతుల నిషేధంపై భారత్‌ను విమర్శిస్తున్నారు కరెక్టే.. అయితే జీ 7 దేశాలు తమ ఎగుమతులను పెంచడం ద్వారా ఆహార మార్కెట్ సరఫరాను స్థిరీకరించడానికి ఎందుకు ముందుకు రావడం లేదంటూ ప్రశ్నించింది. ప్రపంచ గోధుమ ఎగుమతుల్లో భారత్‌ది చిన్న వాటానే అంటూ కామెంట్స్ చేసింది. ఈ క్రమంలోనే ఈయూ, అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలు గోధుమ ప్రధాన ఎగుమతిదారులంటూ కౌంటర్ ఇచ్చింది. అనంతరం గోధుమ ఎగుమతులపై భారత్‌ను విమర్శించడం మానేసి ఆహార సంక్షోభాన్ని పరిష్కరించే ప్రయత్నాలను జీ-7 దేశాలు చేపట్టాలని సూచించింది. ఇది కూడా చదవండి: రష్యాకు మరో షాక్! నాటోలో చేరనున్న మరోదేశం -
విశ్వక్సేన్కు సపోర్ట్.. టీవీ ఛానెల్‌పై కమెడియన్ సంచలన వ్యాఖ్యలు
హీరో విశ్వక్ సేన్- ఓ టీవీ యాంకర్ మధ్య జరిగిన వివాదం చర్చనీయాంశమైంది. ఈ వివాదంలో కొందరు ఆ యాంకర్‌కు సపోర్ట్ చేస్తుండగా, మరికొందరు విశ్వక్సేన్కు మద్దతుగా నిలుస్తున్నారు. తాజాగా ప్రముఖ కమెడియన్ రాహుల్ రామకృష్ణ సైతం విశ్వక్సేన్కు సపోర్ట్‌గా నిలుస్తూ సదరు టీవీ ఛానెల్‌ను వరుస ట్వీట్స్‌తో ఏకిపారేశాడు. ఆయన ఏం అన్నారంటే.. 'ఇప్పుడు జరుగుతున్న ఈ సర్కస్ ఫీట్లో నేను కూడా భాగమవుదామనుకుంటున్నా.విశ్వక్సేన్ను అవమానించిన విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. జర్నలిస్టుల ముసుగులో వీళ్లు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఆ ఛానెల్ కేవలం డబ్బుల కోసమే న్యూస్ కవర్ చేస్తుంది. నీచమైన రూపంలో ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది.. ప్రజలను ఆకట్టుకునేందుకు ఏమైనా చేస్తుంది. సదరు ఛానెల్ న్యూస్ తప్పా మిగతావన్నీ కవర్ చేస్తారని, వాళ్లకి పెద్ద ఎత్తున ఫండ్స్ వస్తాయంటూ సంచలన కామెంట్స్ చేశాడు. అంతేకాకుండా ఈ మొత్తం ఇష్యూపై సదరు ఛానెల్ వాళ్లు పిలిస్తే లైవ్ డిబెట్లో పాల్గొంటా' అంటూ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం రాహుల్ రామకృష్ణ చేసిన ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. I’d like to be a part of the circus that is surrounding and humiliating a grounded, humble person as #VishwakSen He has my total support especially in light of how @TV9Telugu treated him. I don’t know what they do to journalists these days..jeez.. — Rahul Ramakrishna (@eyrahul) May 3, 2022 Their news is about monetary benefits. It is just shameful that people salivate for the kind of nonsense that they mostly* perpetuate. — Rahul Ramakrishna (@eyrahul) May 3, 2022 I really want @TV9Telugu to call me over for a live television debate. — Rahul Ramakrishna (@eyrahul) May 4, 2022 -
వారి జీవితాల్లో వెలుగు రేఖలు.. బతుకు చూపిన ‘భారతి’
కడప సెవెన్‌రోడ్స్(వైఎస్సార్ జిల్లా:) కోవిడ్–19 ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపింది. భవిష్యత్తును అంధకారంలోకి నెట్టింది. తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయి అనాథలుగా వీధిన పడిన పిల్లలు ఎందరో. కుటుంబ పెద్ద దిక్కయిన భర్తను కోల్పోయి ఆ భారాన్ని మోస్తున్న మహిళలు మరెందరో. ఒక్కొక్కరిది ఒక్కో విషాదగాథ. చీకట్లు అలుముకున్న జీవితాల్లో వెలుగు రేఖలు పూయించడం తమ సామాజిక బాధ్యతగా స్వీకరించింది భారతి సిమెంట్ యాజమాన్యం. క్షేత్ర స్థాయిలో ఈ ప్రణాళిక అమలును భుజానికెత్తుకుంది అవేర్ సంస్థ. జిల్లాలో 100 కోవిడ్ బాధిత కుటుంబాల పునరావాసానికి భారతి సిమెంట్ తన కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ (సీఎస్ఆర్) కింద నిధులు అందించింది. దీంతో కడప నగరంలోని పలువురు మహిళలకు బతుకుపై భరోసా ఏర్పడింది. చదవండి👉: మనం ప్రజా సేవకులం జీవనోపాధి ఏర్పాటు చేసుకుని స్వతంత్రంగా, ఆత్మగౌరవంతో జీవిస్తున్నారు. కలెక్టర్ చొరవ తీసుకుని తమ పిల్లలకు కార్పొరేట్ స్కూళ్లలో ఉచిత విద్య అందించగలిగితే తాము నిశ్చింతగా ఉండగలమంటున్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వెలువరించిన వివరాల మేరకు జిల్లాలో 1,35,061 కోవిడ్ కేసులు నమోదు కాగా, 729 మంది మృతి చెందారు. జిల్లాలో 404 మంది పిల్లలు అనాథలుగా మారినట్లు ఐసీడీఎస్ సర్వే ద్వారా వెల్లడైంది. అనాథ పిల్లలను ఆదుకోవాలంటూ కలెక్టర్ విజయరామరాజు కార్పొరేట్ కంపెనీలకు విజ్ఞప్తి చేశారు. ఇందుకు భారతి సిమెంటు ముందుకొచ్చింది. సామాజిక సేవలో అపార అనుభవం ఉన్న అవేర్ స్వచ్ఛంద సంస్థను ఆహ్వానించి వారి ద్వారా బాధిత కుటుంబాలను ఆదుకోవాలని నిర్ణయించింది. ఆర్థికాభివృద్ధి యూనిట్ల పంపిణీ నగదు పంపిణీ చేయడం వంటి చర్యలు ఫలితం ఇవ్వబోవని, ఆర్థికాభివృద్ధి యూనిట్లు పంపిణీ చేస్తే బాధిత కుటుంబాలకు ఉపాధి లభిస్తుందని అవేర్ సంస్థ సూచించింది. ఈ కొత్త ప్రయోగానికి భారతి సిమెంటు యాజమాన్యం అంగీకరించింది. పాడి ఎనుములు, కిరాణాస్టోర్లు, చిన్నపాటి వస్త్ర దుకాణాలు, కూరగాయల దుకాణాలు, టిఫెన్ సెంటర్లు, కంప్యూటర్ సెంటర్లు, సోఫా తయారీ వంటి స్వయం ఉపాధి కల్పించారు. భారతి సిమెంట్ ప్రధాన అధికారి సాయి రమేష్, పీఆర్ఓ మేనేజర్ భార్గవరెడ్డి కలెక్టర్ విజయరామరాజు ద్వారా యూనిట్లను బాధిత కుటుంబాలకు అందించారు. ఇలా వంద కుటుంబాల్లోని 212 మంది పిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పించారు. తమకు ఒక దారి చూపి ఆదుకున్న భారతి సిమెంట్, అవేర్ సంస్థలకు రుణపడి ఉంటామని బాధితులు తెలిపారు. అవేర్ వ్యవస్థాపకులు మాధవన్ ఆదేశాలతో తాము జిల్లాలోని 11 మండలాలకు చెందిన వంద కుటుంబాలకు ఉపాధి యూనిట్లు అందజేశామని అవేర్ సంస్థ జిల్లా ప్రాజెక్టు అధికారి రవీంద్రారెడ్డి తెలిపారు. ఇందులో బేకరీ, జిరాక్స్, ఆటో, గొర్రెల పెంపకం తదితర యూనిట్లు ఉన్నాయని వివరించారు. యూనిట్లను బాధిత కుటుంబాలు సద్వినియోగం చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. కుటుంబానికి ఆసరా దొరికింది నా భర్త అమానుల్లాబాషా, బావ అమీర్‌బాషా, అత్త షేక్ మురాద్‌బీ గత సంవత్సరం రంజాన్ నెలలో కోవిడ్‌తో మృతి చెందారు. సొంత ఇల్లు లేదు. చెర్లోపల్లెలో ప్రభుత్వం స్థలం ఇచ్చినా ఇల్లు నిర్మించుకోలేని పరిస్థితి. భారతి సిమెంట్స్, అవేర్ సంస్థ నాకు కిరాణా షాపు ఏర్పాటు చేయించడంతో కుటుంబం గడుస్తోంది. ఒక్కగానొక్క కొడుకు ప్రైవేటు స్కూలులో చదువుతున్నాడు. ఫీజులు చెల్లించలేక పోతున్నాను. దాతలు ఆదుకుని చదువుకు సాయం చేయాలి. – పర్వీన్‌బాను, రాజారెడ్డివీధి, కడప ఆపదలో ఆదుకున్నారు లాడ్జిలో గుమాస్తాగా పనిచేసే నా భర్త ఎం.చంద్రశేఖర్ గత ఏడాది జూన్ 19వ తేదీ బ్లాక్ ఫంగస్‌తో మృతి చెందాడు. సొంత ఇల్లు తప్ప మాకు ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. కోవిడ్ సోకడంతో వలంటీర్ నా భర్త వేలిముద్రను తీసుకోవడానికి నిరాకరించింది. దీంతో వైఎస్సార్ బీమా రాలేదు. అప్పుల వారు వేధిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో భారతి సిమెంట్, అవేర్ సంస్థలు చీరల వ్యాపారం యూనిట్ మంజూరు చేసి ఆదుకున్నాయి. దీంతో ఇల్లు గడుస్తోంది. పిల్లలకు మంచి కార్పొరేట్ విద్య అందించగలిగితే రుణపడి ఉంటాము. – ఎం.వెంకట సుజిత, పెద్దబెస్తవీధి, కడప -
మాక్రాన్ గెలుపుతో ఉక్రెయిన్‌కు ఊరట
పారిస్: ఫ్రాన్స్ అధ్యక్షుడిగా రెండోమారు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ విజయం సాధించడంతో ఉక్రెయిన్ ఊపిరి పీల్చుకుంది. అయితే గతంతో పోలిస్తే లీపెన్‌కు మద్దతు బాగా పెరిగినట్లు కనిపించింది. అతివాద నాయకురాలు లీపెన్ నెగ్గొచ్చన్న ఊహాగానాలు తొలుత యూరప్ హక్కుల సంఘాలకు, ఉక్రెయిన్ నాయకత్వానికి ఆందోళన కలిగించాయి. ఆమె బహిరంగంగా పుతిన్‌కు అనుకూలంగా మాట్లాడటం, ఈయూకు, నాటోకు వ్యతిరేకంగా గళమెత్తడంతో ఆమె అధ్యక్షురాలైతే తమకు ఒక పెద్ద అండ లోపిస్తుందని జెలెన్‌స్కీసహా ఉక్రెయిన్ నాయకత్వం భయపడింది. లీపెన్ పదవిలోకి వస్తే జీ7లాంటి కూటములు కూడా ప్రశ్నార్థకమయ్యేవని జపాన్ ఆందోళన చెందింది. లీపెన్‌పై మాక్రాన్ విజయం సాధించినప్పటికీ ఆయన్ను వ్యతిరేకిస్తున్నవారి సంఖ్య స్వదేశంలో పెరిగిపోతోంది. ఈ అంశాన్ని గుర్తించిన మాక్రాన్ స్వదేశంలో తనను వ్యతిరేకిస్తున్నవారి ధోరణికి కారణాలు కనుగొంటానని, వారిని సంతృప్తి పరిచే చర్యలు తీసుకుంటానని ప్రకటించారు. తాను దేశీయులందరికీ అధ్యక్షుడినన్నారు. అయితే స్వదేశం ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించుకోకుండా విదేశీ వ్యవహారాల్లో పెద్దమనిషి పాత్ర పోషిస్తున్న మాక్రాన్‌పై స్వదేశంలో చాలామంది గుర్రుగా ఉన్నారు. తొలి నుంచి మద్దతు ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా దాడి ఆరంభం కావడానికి ముందే యుద్ధ నివారణకు మాక్రాన్ చాలా యత్నాలు చేశారు. వ్యక్తిగతంగా పుతిన్‌తో చర్చలు జరిపారు. యుద్ధం ఆరంభమైన తర్వాత రష్యా చర్యను ఖండించడంలో ఉక్రెయిన్‌కు సాయం అందించడంలో ముందున్నారు. అందుకే మాక్రాన్‌ను నిజమైన స్నేహితుడు, నమ్మదగిన భాగస్వామిగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కొనియాడారు. పుతిన్ చర్యకు వ్యతిరేకంగా రష్యాపై మాక్రాన్ ఆంక్షలను కూడా విధించారు. అలాగే రష్యా సహజవాయువు అవసరం ఫ్రాన్స్‌కు లేదని, తాము గ్యాస్ కోసం ఇతర దేశాలపై ఆధారపడతామని మాక్రాన్ బహిరంగంగానే ప్రకటించారు. దీంతో ఇకపై పుతిన్‌కు వ్యతిరేకంగా ఫ్రాన్స్ మరింత చురుగ్గా వ్యవహరిస్తుందని భావిస్తున్నారు. ఉక్రెయిన్‌కు మద్దతు కొనసాగిస్తామని మాక్రాన్ చెప్పారు. ఒకపక్క రష్యా చర్యను వ్యతిరేకిస్తూనే పుతిన్‌తో చర్చలకు తయారుగా ఉన్నానని ప్రకటించడం ద్వారా మాక్రాన్ హుందాగా వ్యవహరించారని నిపుణులు అంచనా వేస్తున్నారు. యుద్ధం ముదురుతున్న ఈ తరుణంలో ఫ్రాన్స్ ఈ సమతుల్యతను కొనసాగిస్తుందని భావిస్తున్నారు. అయితే అస్తవ్యస్తంగా మారిన ఫ్రాన్స్ ఆర్థికవ్యవస్థను గాడిన పెట్టడమనే పెద్ద సవాలు ప్రస్తుతం మాక్రాన్ ముందున్నదని నిపుణులు అంటున్నారు. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అదంత సులభం కాబోదంటున్నారు. ఫ్రాన్స్ పీఠం మాక్రాన్దే ఫ్రాన్స్ అధ్యక్షునిగా ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ (44) వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. దేశ చరిత్రలో ఈ ఫీట్ సాధించిన మూడో నాయకునిగా నిలిచారు. ఆదివారం జరిగిన ఎన్నికల్లో జాతీయవాదిగా పేరున్న ఫైర్ బ్రాండ్ నాయకురాలు మరీన్ లీ పెన్ (53)పై మాక్రాన్ విజయం సాధించారు. ఇప్పటిదాకా ఐదింట నాలుగొంతుల ఓట్ల లెక్కింపు పూర్తయింది. మాక్రాన్‌కు 56 శాతానికి పైగా ఓట్లు రాగా పెన్ 44 శాతంతో సరిపెట్టుకున్నారు. 2017లో ఆయన 66 శాతం ఓట్లు సాధించారు. గెలుపు అనంతరం ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ‘‘ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం తదితరాల నేపథ్యంలో మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. నానా అనుమానాలతో, పలు రకాల విభజనలతో అతలాకుతలంగా ఉన్న దేశాన్ని మళ్లీ ఒక్కతాటిపైకి తెస్తా’’ అని ప్రకటించారు. యూరప్ దేశాధినేతలంతా ఆయనకు అభినందనలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా మాక్రాన్‌ను అభినందిస్తూ ట్వీట్ చేశారు. ఇండో–ఫ్రాన్స్ బంధాన్ని బలోపేతం చేసే దిశగా ఆయనతో మరింతగా కలిసి పని చేసేందుకు ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. -
చిన్న పరిశ్రమల కోసం కొత్త క్లస్టర్లు
సాక్షి, హైదరాబాద్: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను (ఎంఎస్ఎంఈ) ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పారిశ్రామిక క్లస్టర్లు ఏర్పాటు చేయనుంది. దీంతో పాటు వ్యవస్థాపకులు తమ యూనిట్లను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేసేందుకు వీలుగా ప్రధాన పారిశ్రామికవాడల్లో మౌలిక వసతుల కల్పనను వేగవంతం చేయనుంది. మరోవైపు రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఎంఎస్ఎంఈల నడుమ పోటీ తత్వాన్ని పెంచేందుకు ప్రోత్సాహకాలతో పాటు అవార్డులు కూడా ఇవ్వాలని నిర్ణయించింది. ఎంఎస్ఎంఈలో ఉత్పాదకత, సృజనాత్మకత, భద్రతకు సంబంధించిన కృషిని గుర్తిస్తూ రాష్ట్ర స్థాయితో పాటు 33 జిల్లాల్లో అవార్డులు ఇవ్వాలని పరిశ్రమల శాఖ నిర్ణయించింది. ‘తెలంగాణ ముత్యాలు’పేరిట ఇచ్చే ఈ అవార్డు కోసం 2022–23 బడ్జెట్లో రూ.50 లక్షలు కేటాయించింది. ఉత్పాదకత, నాణ్యత మెరుగు పరిచేలా.. ఎంఎస్ఎంఈ రంగాన్ని బలోపేతం చేసేందుకు ఏర్పాటు చేస్తున్న క్లస్టర్లలో ఉమ్మడి సదుపాయాల కేంద్రాలను పరిశ్రమల శాఖ నెలకొల్పుతుంది. తద్వారా ఉత్పాదకత, నాణ్యతను మెరుగు పరుచుకోవంతో పాటు ముడిసరుకు కొనుగోలు, మార్కెటింగ్‌లో సంప్రదింపులు బలోపేతం చేసుకునే వెసులుబాటు ఆయా పరిశ్రమల యాజమాన్యాలకు లభిస్తుంది. కేంద్ర సర్కారు భాగస్వామ్యం క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌లో భాగంగా రాష్ట్రాల్లో ఏర్పాటయ్యే పారిశ్రామిక క్లస్టర్లకు కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ సాయం అందిస్తోంది. రాష్ట్రాలు కూడా తమ వంతు వాటాగా క్లస్టర్ల అభివృద్ధికి నిధులు కేటాయించాల్సి ఉంటుంది. ఇప్పటికే రాష్ట్రంలో 12 క్లస్టర్లు ఈ పథకంలో భాగంగా పురోగతిలో ఉండగా, వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో 19 జిల్లాల్లో పారిశ్రామిక క్లస్టర్లను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఒక్కో క్లస్టర్ ఏర్పాటుకు రూ.10 కోట్లు చొప్పున అవసరమవుతాయని అంచనా వేయగా, ఇందులో కేంద్రం వాటాగా రూ.8 కోట్లు, రాష్ట్రం వాటాగా రూ.2 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తన వంతు వాటాగా రూ.38 కోట్లు ఇచ్చేందుకు సన్నద్ధమవుతోంది. పరిశ్రమల ఏర్పాటుకు పెట్టుబడిదారులు ముందుకు వస్తున్నా కొన్ని సందర్భాల్లో పారిశ్రామిక వాడల్లో మౌలిక వసతులు లేక యూనిట్ల స్థాపన ఆలస్యమవుతోంది. దీంతో పెట్టుబడిదారులపై అదనపు భారం పడటంతో పాటు అనుమతులు ఉన్నా ఉత్పత్తి దశకు చేరేందుకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ప్రధాన పారిశ్రామిక వాడల్లో ప్లగ్ అండ్ ప్లే (వాడుకోవడానికి సిద్ధంగా ఉండేలా) సౌకర్యాలను అభివృద్ధి చేయడం ద్వారా పెట్టుబడిదారులు తమ యూనిట్లను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమమవుతుంది. ఈ నేపథ్యంలో పారిశ్రామిక వాడల్లో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ఓ ప్రత్యేక పథకాన్ని (ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంపెŠల్క్స్) ప్రకటించింది. ఈ పథకం నిబంధనల మేరకు ఒక్కో పారిశ్రామికవాడకు తన వంతు వాటాగా కేంద్రం రూ.12 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.3 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో 27 పారిశ్రామికవాడల్లో మౌలిక వసతులు మెరుగు పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం తన వంతు వాటాగా రూ.81 చెల్లించేందుకు సుముఖత చూపుతోంది. -
ప్రధానికి పుల్ సపోర్ట్ ఇస్తానంటున్న మమతా బెనర్జీ.. అందరం ఒక్కటై..
కోల్‌కతా: రాజకీయంగా ఎప్పుడూ నువ్వా-నేనా అంటూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ప్రధాని నరేంద్రమోదీ తలపడతారనేది అందరికీ తెలిసిన విషయమే. తాజగా ఫైర్ బ్రాండ్ దీదీ ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో ప్రధాని మోదీకి పూర్తి మద్దతు తెలిపారు. ఉక్రెయిన్ అంశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు సంపూర్ణ మద్దతు తెలుపుతూ మమతా ఓ లేఖను ప్రధానికి పంపారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా తీవ్రమైన సంక్షోభం ఏర్పడిందని, వాటి నుంచి బయటపడటం ఎంతైనా అవసరం ఉందన్న మమతా.. అందుకోసం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడాన్ని పరిశీలించాలని ఆమె కోరారు. ఉక్రెయిన్‌లో ఉన్న విద్యార్థులను త్వరితగతిన దేశానికి రప్పించాలిని కోరారు. సహకార సమాఖ్య వ్యవస్థలో ఉన్న ఓ సీనియర్ ముఖ్యమంత్రిగా ఉక్రెయిన్ సంక్షోభం విషయంలో మన దేశ నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు మమత ఆ లేఖలో తెలిపారు. సంక్షోభ సమయంలో దౌత్య వ్యవహారాలను సరైన రీతిలో అమలు చేస్తారని ఆశిస్తున్నట్లు దీదీ తన లేఖలో తెలిపారు. తీవ్రమైన అంతర్జాతీయ సంక్షోభ సమయాల్లో ఒక దేశంగా ఐక్యంగా నిలబడాల్సి అవసరం ఎంతైనా ఉందని అందుకు మన దేశీయ విబేధాలను పక్కనపెట్టి ఉండాలని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్ ఉన్నందున, ప్రపంచానికి శాంతియుత పరిష్కారాన్ని అందించడానికి భారత్ నాయకత్వం వహించాలని ప్రధానికి సూచించారు. -
పనికొద్దు.. ఆ డబ్బులు నేనే ఇస్తా..
తగరపువలస (భీమిలి)/విశాఖపట్నం: ఇంటిలో ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో స్కూల్‌కు వెళ్లకుండా వెల్డింగ్ పనికి వెళ్లిన ఓ విద్యార్థికి డీఈవో చంద్రకళ అండగా నిలిచారు. పనికెళ్తే వచ్చే డబ్బులు తానే ఇస్తానని, చక్కగా చదువుకోవాలని హితవు పలికారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆనందపురం జెడ్పీ హైస్కూల్‌ను డీఈవో చంద్రకళ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడుతూ పాఠశాలలో వసతులు, సిలబస్ బోధనపై అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజనం, నాణ్యత, రుచిపై ఆరా తీశారు. చదవండి: కిరాతక దుశ్చర్య.. కూరతో భోజనం పెట్టలేదని.. అనంతరం పదో తరగతి విద్యార్థుల అటెండెన్స్ రిజిస్టర్ తనిఖీ చేశారు. హాజరుకాని వారి తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా గొంప లోకేశ్వరరావు అనే విద్యార్థి ఆర్థిక ఇబ్బందులతో వెల్డింగ్ షాపులో పనికి వెళ్తున్నట్టు తెలుసుకున్నారు. వెంటనే ఆనందపురం కూడలిలో లోకేశ్వరరావు పనిచేస్తున్న వెల్డింగ్‌షాపు వద్దకు ఉపాధ్యాయులు సాయంతో వెళ్లి మాట్లాడారు. చదువు కోసం ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను వివరించారు. మధ్యలో చదువు ఆపేయవద్దని కోరారు. పదో తరగతి పరీక్షలు పూర్తయ్యే వరకు వెల్డింగ్ పనులకు వెళ్తే ఎంత వేతనం వస్తుందో ఆ మొత్తం తాను సమకూరుస్తానని ఆమె భరోసా కల్పించారు. అలాగే హాస్టల్లో ఉండి చదువుకునేలా చర్యలు తీసుకుంటానని లోకేశ్వరరావుకు హామీ ఇచ్చారు. ఆమె వెంట ప్రధానోపాధ్యాయుడు బి.శ్రీనివాసరావు ఉన్నారు. -
వికేంద్రీకరణకు మద్దతుగా ‘చైతన్యయాత్ర’
సాక్షి, తిరుపతి: అధికార వికేంద్రీకరణ కోసం ఏపీ వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని రాయలసీమ హక్కుల నేతలు వెల్లడించారు. జనవరిలో శ్రీశైలం నుంచి అమరావతి వరకు చైతన్య యాత్ర చేస్తామన్నారు. ప్రతి ప్రాంతంలోని విశ్వ విద్యాలయాల్లో సదస్సులు నిర్వహిస్తామని రాయలసీమ హక్కుల నేతలు భూమన్, చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. చదవండి: అభివృద్ధి వికేంద్రీకరణపై తిరుపతిలో భారీ బహిరంగ సభ అమరావతిలోనే రాజధాని ఉండాలనుకోవడం దుర్మార్గమన.. దీనివల్ల మిగతా ప్రాంతాలు తీవ్రంగా నష్టపోతాయన్నారు. వికేంద్రీకరణకు మద్దతుగా ప్రతి ఒక్కరినీ కలుపుకునిపోతామన్నారు. చంద్రబాబు, నారాయణ, రామకృష్ణ రాయలసీమ ద్రోహులని మండిపడ్డారు. త్వరలో వీళ్ల బండారం ప్రజల వద్ద బట్టబయలు చేస్తామని భూమన్, చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. చదవండి: Christmas-Sankranti Holidays: క్రిస్మస్, సంక్రాంతి సెలవులివే.. -
బిగ్‌బాస్ చూసి షణ్నూ క్యారెక్టర్ డిసైడ్ చేయకండి: దీప్తి సునయన
Deepthi Sunaina Support To Shanmukh Jaswanth In Bigg Boss 5 Telugu Last Week: బిగ్‌బాస్ హౌస్‌లో ఏమైనా జరగొచ్చు. అప్పటివరకు హీరోలుగా ఉన్నా హౌస్‌లోకి వచ్చాక నెగిటివిటి పెరగొచ్చు. ఈ సీజన్లో యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ పరిస్థితి ప్రస్తుతం ఇలాగే ఉందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎన్నో అంచనాల మధ్య బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన షణ్నూపై ఈ మధ్యకాలంలో నెగిటివిటి పెరిగింది. పైకి ఫ్రెండ్ అని చెప్పినా సిరితో హగ్గులు ఆడియెన్స్‌కు ఏమాత్రం రుచించడం లేదు. ఇప్పటికే సిరికి ఎంగేజ్మెంట్ కావడం, షణ్నూ..దీప్తి సునయనతో లవ్‌లో ఉండటంతో వీరి రిలేషన్‌పై సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమవుతుంది. హగ్గులు తగ్గించుకోమని స్వయంగా సిరి తల్లి సూచించినా వీళ్లు మాత్రం తగ్గేదేలే అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. వీరిద్దరి ప్రవర్తనపై వస్తున్న నెగిటివిటి బట్టి షణ్నూ టైటిల్ రేసు నుంచి ఒక అడుగు దూరంలో ఉన్నట్లు నెట్టింట టాక్ వినిపిస్తుంది. వచ్చే వారం బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే జరగనున్న నేపథ్యంలో షణ్నూకి సపోర్ట్ చేసేందుకు దీప్తి సునయన రంగంలోకి దిగింది. 'బిగ్‌బాస్ షోను చూసి షణ్ముఖ్ క్యారెక్టర్ని అంచనా వేయకుండి. అది కేవలం ఒక గేమ్ షో అని గుర్తుపెట్టుకోండి. షణ్నూ ఎంతో మంచివాడు. అతను ఏం చేయాలనుకుంటున్నాడో అది చేయనివ్వండి. మీ అంచనాలకు తగ్గట్లు రీచ్ అవ్వాలని అనుకోకండి. మీకు నచ్చినట్టు కాకుండా వాడికి నచ్చినట్టు ఉండనివ్వండి.. అతనేంటో అతనిలా ఉన్నాడు. ఎవరిమీదా ద్వేషం వద్దు. మీకు నచ్చిన కంటెస్టెంట్‌కి మీరు సపోర్ట్ చేయండి. నా మద్దతు ఇప్పటికీ, ఎప్పటికీ షణ్నూకే ఉంటుంది. అతను సంతోషంగా ఉండడమే నాకు కావాలి' అంటూ దీప్తి సునయన తన ఇన్‌స్టాలో పోస్టు షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) -
చిన్మయికి ఆ ఇద్దరి మద్దతు.. స్క్రీన్ షాట్స్ వైరల్
Singer Chinmayi Shares Nri Messages Of Who Supporting Her: ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద ఎప్పుడూ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటారు. ప్రస్తుత పరిస్థితులు, జరుగుతున్న విషయాలు, అమ్మాయిలు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందిస్తుంటారని తెలిసిన విషయమే. అలాగే ఎంతోమంది అమ్మాయిలు కూడా తమ బాధలను సోషల్ మీడియా ద్వారా చిన్మయికి చెప్తూ, సలహాలు తీసుకుంటారు. ఇటీవల చిన్మయి అమ్మాయిల వివాహం, కట్నం ఇవ్వడం, ఎన్ఆర్ఐ సంబంధాల గురించి తన ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ పోస్ట్‌పై ఎంతోమంది నెటిజన్స్ ట్రోల్ చేశారు. కామెంట్ చేశారు. వారికి కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది చిన్మయి. అయితే తాజాగా ఈ విషయంపై ఇద్దరు ఎన్ఆర్ఐలు చిన్మయికి మద్దతుగా నిలిచారు. ఈ విషయాన్ని స్వయంగా చిన్మయి బయటపెట్టింది. వారు చేసిన మెసేజ్‌లను స్క్రీన్‌షాట్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. 'మీరు చెప్పినట్టుగానే చాలా మంది ఎన్ఆర్ఐలు ప్రవర్తిస్తున్నారు. మీ మీద నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. కానీ వాటిని మీరు పట్టించుకోకండి. మీరు సరైనా దారిలో వెళ్తున్నారు. అమ్మాయిలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇది చాలా మంచి పని. మీ మాట విని ఒక్కరు మారిన చాలు. అమ్మాయిలు తమ కాళ్ల మీద తాము నిలబడినా చాలు.' అంటూ చిన్మయికి మద్దతుగా నిలిచారు. 'నిజమైన మనుషులు, మగవారికి నా పోస్టులతో ఎలాంటి బాధ ఉండదు. వారికి ఎలాంటి సమస్యలు లేవు. కానీ ఒక అమ్మాయి నో చెబితే తట్టుకోలేని వాళ్లు, వారి ఆధిపత్యం ఎక్కడ పోతుందో అని భయపడేవాళ్లు ఇలా చేస్తారు. ఇలా నాకు మద్దతుగా నిలిచిన వారు జెంటిల్మెన్స్. మీరు గోల్డ్.' అంటూ చిన్మయి షేర్ చేసింది. View this post on Instagram A post shared by Chinmayi Sripada (@chinmayisripaada) ఇదీ చదవండి: అమ్మాయిలను ఆర్థికంగా, స్వేచ్ఛగా బతకనివ్వరు.. సింగర్ ఘాటు వ్యాఖ్యలు -
షణ్నూకి జలక్ ఇచ్చిన దీప్తి సునయన.. వేరే కంటెస్టెంట్‌కి సపోర్ట్
Not Shannu Deepthi Sunanina Asks Fans To Vote Bigg Boss 5 Contestant: యూట్యూబర్స్ షణ్ముఖ్ జస్వంత్, దీప్తి సునైనాల ప్రేమ గురించి అందరికి తెలిసిందే. వీరిద్దరూ తమ ప్రేమ విషయాన్ని బహిరంగానే ప్రకటించారు. ఒకరిపేరు ఒకరు టాటూగా కూడా వేయించుకున్నారు. ప్రస్తుతం షణ్ముఖ్ బిగ్‌బాస్ -5 హౌస్‌లో ఉండగా, దీప్తి సునయన బయట ఫుల్ ప్రమోషన్స్ చేస్తూ అతడ్ని గెలిపించేందుకు తెగ కష్టపడుతుంది. లాస్ట్ వీకెండ్ ఎపిసోడ్‌లోనూ షణ్నూకి సపోర్ట్ చేయడానికి దీప్తి బిగ్‌బాస్‌కి వచ్చిన సంగతి తెలిసిందే. షణ్నూకి ఓట్లు వేసి గెలిపించాలంటూ సోషల్ మీడియాలో తన ఫాలోవర్లను రిక్వెస్ట్ చేస్తుంది. అయితే తాజాగా షణ్నూకి కాకుండా మరో బిగ్‌బాస్ కంటెస్టెంట్‌కి దీప్తి తన మద్దతు ప్రకటించింది. అంతేకాకుండా అతడకి తాను వేసిన ఓట్స్‌కి సంబంధించిన స్క్రీన్‌షాట్స్‌ని సైతం సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం దీప్తి షేర్చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఎవరా అనే కదా మీ డౌటు. దీప్తి సపోర్ట్ చేస్తున్న కంటెస్టెంట్ తమిళ బిగ్‌బాస్‌కి చెందిన వ్యక్తి. ప్రస్తుతం తమిళంలో కూడా బిగ్‌బాస్ సీజన్-5 ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వరుణ్ అనే కంటెస్టెంట్‌కి దీప్తి తన మద్ధతు ప్రకటించింది. అతడికి ఓట్లు వేయాలంటూ తన ఫాలోవర్లను సైతం కోరింది. -
నెలల వయసున్న చిన్నారికి.. ఇంత పెద్ద ఐడియా ఎలా వచ్చింది?
సాధారణంగా ఏదైనా.. నేర్చుకోవాలనే తపన.. సాధించాలనే ఆశయం ఉన్నవారు చుట్టు జరుగుతున్న ప్రతి సంఘటన నుంచి ప్రేరణ పొందుతుంటారు. చాలా మంది తమ జీవితంలో గొప్ప గొప్ప కలలు, ఆశయాలను పెట్టుకుంటారు. దాన్ని సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. ఈ క్రమంలో కొందరు.. కొన్ని ఆటంకాలు ఎదురుకాగానే ఆ పనిని మధ్యలోనే వదిలేస్తారు. మరికొందరు మాత్రం.. తమ పట్టును వదలకుండా చివరి వరకు ఉండి తమకు కావాల్సిన దాన్ని సాధించుకుంటారు. వారికి మాత్రమే గొప్ప పేరు ప్రఖ్యాతులు వస్తాయి. తాజాగా, ఇలాంటి స్ఫూర్తివంతమైన వీడియోను ఐపీఎస్ అధికారి రూపిన్ శర్మ తన ట్వీటర్ ఖాతాలో పోస్టు చేశారు. దానికి ‘ కోశిశ్ కర్నేవాలోకీ హార్ నహీ హోతి హై..’ అంటే ‘నిరంతరం ప్రయత్నం చేసేవారు.. ఎప్పటికీ ఓటమి బారినపడరంటూ’ ట్యాగ్ చేశారు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో వివరాలు లేవు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో నెలల వయసున్న అందమైన బుజ్జాయి మంచంపై కూర్చోని ఉంది. ఆ పసిపాప దగ్గరలో ఆమె తల్లిదండ్రులు లేరు. అయితే.. ఆ పాప.. తన తల్లికోసం అటూ ఇటూ చూసింది. మంచంపై నుంచి దిగాలనుకుంది. మంచం ఎత్తుగా ఉండటంతో ఆ బాలిక కిందపడిపోతానేమోనని భయపడింది. మంచంపైన కొన్ని దిండులు, బెడ్షీట్లు ఉన్నాయి. ఆ బాలిక నెమ్మదిగా పాకుతూ.. ఒక బెడ్షిట్ను మెల్లగా మంచం కింద పడేసింది. దాన్ని ఆధారంగా చేసుకుని దిగాలనుకుంది. నెమ్మదిగా చూసింది. పాపం.. చిన్నారికి కాళ్లు అందలేవు. ఆ తర్వాత.. మరో బెడ్షిట్ను కిందపడేసి చూసింది. అప్పుడు కూడా ఆధారందొరకలేదు. ఇప్పుడు అలాకాదని.. ఒక దిండుని లాగి కిందపడేసింది. ఇప్పుడు.. కొద్దిగా అందినట్లే ఉన్నా.. పూర్తి స్థాయిలో ఆధారం దొరకలేదు. చివరకు ఇలాకాదని .. ఆ బాలిక మరో ట్రిక్ వేసింది. మంచంపై ఉన్న మరో దిండును లాగి కింద పడేసింది. ఆ తర్వాత.. నెమ్మదిగా ఆ దిండును ఆధారం చేసుకుని నవ్వుతూ.. ఆనందంగా కిందకు దిగేసింది. చివరకు తన ప్రయత్నం ఫలించినందుకు చిన్నారి ఆనందంతో ముసిముసినవ్వులు నవ్వింది. కాగా, ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. ‘వావ్.. చిన్నారి ఎంత ముద్దుగా ఉందో..’, అంత చిన్న వయసులో ఐడియా ఎలా తట్టింబ్బా..’,‘ కష్టపడేవారికి ఎప్పటికైన విజయం లభిస్తోందంటూ..’ కామెంట్లు చేస్తున్నారు. -
పాపం ద్రాక్షాయణి.. కుటుంబీకులు దూరమై.. ఏకాకిగా మిగిలి..!
పీలేరు రూరల్: విధి వైపరీత్యమంటే ఇదేనేమో..బ్లాక్ ఫంగస్ బారిన పడి తల్లి మృతి చెందగా, అంతకుముందు రెండేళ్ల కిందటే అనారోగ్యంతో ఆమె సో దరుడు, ఏడాది క్రితం తండ్రి మృతి చెందారు. దీంతో ఆమె ఏకాకిగా మిగిలి కన్నీరుమున్నీరవుతోంది. వైఎస్సార్ జిల్లా మైదకూరు మండలం సుంకలగారిపల్లెకు చెందిన డి.లక్ష్మీదేవి 2005లో ఏపీఎస్ ఆర్టీసీ కండక్టర్‌గా ఉద్యోగంలో చేరింది. అప్పటి నుంచి ఆర్టీసీ నల్లగుట్టలో నివాసముంటూ పీలేరు ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. లక్ష్మీదేవి కుమారుడు చక్రధారి 2019 లో అనారోగ్యంతో మృతి చెందాడు. చదవండి: పంథా మార్చి.. పట్టుబడిన కిలేడీలు ఏడాది క్రితం లక్ష్మీదేవి భర్త రమణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కుమారుడు, భర్తను కోల్పోయిన లక్ష్మీదేవి బాధను దిగమింగుకుంటూ కుమార్తె ద్రాక్షాయణితో కలిసి జీవనం సాగిస్తూ వచ్చింది. 20 రోజుల క్రితం లక్ష్మీదేవి కరోనా బారినపడి బ్లాక్ ఫంగస్‌కు గురై వే లూరు సీఎంసీలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. కుటుంబ సభ్యుల్లో ముగ్గురూ తన నుంచి దూరం కావడంతో ఏకాకిగా మిగిలిన ద్రాక్షాయణి కన్నీమున్నీరుగా విలపిస్తోంది. లక్ష్మీదేవి మృతదేహాన్ని వారి స్వగ్రామం సుంకలగారిపల్లెకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. ఆర్టీసీ సీఐ ధనుంజయలు దహనక్రియలకుగానూ రూ.15 వేలు అందజేశారు. ద్రాక్షాయణి ఇంటర్ పూర్తిచేసి ఎంసెట్‌లో 52 వేలు ర్యాంక్ సాధించింది. అనాథగా మిగిలిన ద్రాక్షాయణిని ఆదుకోవాలని ఆమె బంధువులు విజ్ఞప్తి చేస్తున్నారు. చదవండి: అత్యాచార వీడియో ఒకరి నుంచి ఒకరికి.. ఐదుగురికి యావజ్జీవం -
అయ్యో జ్యోతి.. నీకు ఎంత కష్టమొచ్చింది!
కన్నబిడ్డను అమ్మ కాదనుకుంది. నాన్న లోకంలోనే లేకుండా పోయాడు. చివరకు వృద్ధాప్యంలో ఉన్న తాతే ఆ ఆడబిడ్డకు ఆధారంగా ఉన్నాడు. అష్టకష్టాలు పడుతూ పోషిస్తున్నాడు. అయినా మన అధికారుల కళ్లకు ఆ బిడ్డ కష్టాలు కనిపించడం లేదు. ప్రభుత్వం ద్వారా అందించాల్సిన ఏ ఒక్కటీ అందించడం లేదు. వివరాల్లోకి వెళ్తే... శృంగవరపుకోట: పట్టణంలోని బర్మా కాలనీకి చెందిన గొర్లె సత్యవతికి కొత్తవలసకు చెందిన గురయ్యతో పుష్కర కాలం కిందట వివాహమైంది. వీరికి పదేళ్ల కుమార్తె జ్యోతి ఉంది. గురయ్య ఎనిమిదేళ్ల కిందట చనిపోవడంతో సత్యవతి తన బిడ్డ జ్యోతితో ఎస్.కోటలోని తండ్రి అంకులు వద్దకు వచ్చేసింది. రెండేళ్ల కిందట సత్యవతి కూడా జ్యోతిని కాదనుకుంది. కన్నబిడ్డను కాదనుకొని వేరొకరిని వివాహమాడి జ్యోతిని వదిలేసి వెళ్లిపోయింది. తండ్రి లేక తల్లి వదిలేయడంతో తాత వద్దే జ్యోతి ఉంటుంది. తాత తట్టా, బుట్ట అల్లి విక్రయించగా వచ్చే కాసింత డబ్బుతో పేదరికం మధ్య మనమరాలు జ్యోతితో అష్టకష్టాల నడుమ జీవనం కొనసాగిస్తున్నాడు. వీరి కి ఇల్లంటూ లేకపోవడంతో పుణ్యగిరిలోని ప్రభుత్వ సామాజిక భవనంలోనే తలదాచుకుంటున్నారు. దయ చూపని అధికారులు ఇన్ని అవస్థల నడుమ కూడా జ్యోతి ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతుంది. అయితే ప్రభుత్వం ఇచ్చే అమ్మ ఒడి, జగనన్న విద్యా కానుకలేవీ అందడం లేదు. దీనికి కారణం ఆధార్ లేకపోవడమే. ఆధార్ లేకపోవడంతో పాఠశాలలోని ఛైల్డ్ ఇన్ఫో యాప్‌లో జ్యోతి వివరాలు నమోదు కావడం లేదని హెచ్ఎం ఎం.పార్వతి చెప్పారు. తనకు చదువుకోవాలని ఉందని, వసతిగృహంలో వేస్తే చదువుకుంటానని జ్యోతి చెబుతోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ చిన్నారి జ్యోతికి ప్రభుత్వ పథకాలు అందేలా, చదివేలా చూడాలని పలువురు కోరుతున్నారు. ఆ చిన్నారి ఆశను బతికించాలని ఆశిద్దాం. చదవండి: పెళ్లి ముచ్చట తీరనేలేదు.. తోరణాలు తొలగనేలేదు.. అంతలోనే.. -
అన్నాడీఎంకే కైవసమే లక్ష్యంగా చిన్నమ్మ పయనం.. దినకరన్ మద్దతు
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే కైవసమే లక్ష్యంగా చిన్నమ్మ శశికళ సాగిస్తున్న పయనానికి తమ మద్దతును అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్ ప్రకటించారు. ఆమె పర్యటనలకు తమ కార్యకర్తలు బ్రహ్మరథం పడుతారని తెలిపారు. దివంగత సీఎం జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ అక్క వనితామణి కుమారుడు దినకరన్ అన్న విషయం అందరికీ తెలిసిందే. చిన్నమ్మ ప్రతినిధిగానే ఆయన రాజకీయ పయనంలో ఉన్నారు. అన్నాడీఎంకేలో చీలికతో ఆయన అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంను ఏర్పాటు చేశారు. తొలుత చిన్నమ్మ ఈ కళగంకు ప్రతినిధిగా పేర్కొన్నా, చివరకు తానే ప్రధాన కార్యదర్శి ఆయన చాటుకున్నారు. అన్నాడీఎంకే కైవసంలో చిన్నమ్మకు కోర్టుల్లో చట్టపరంగా కొత్త చిక్కులు ఎదురు కాకూడదనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారనేది జగమెరిగిన సత్యం. ఈ పరిస్థితుల్లో తాజాగా చిన్నమ్మ దూకుడు పెంచారు. అన్నాడీఎంకే కేడర్‌ను తన వైపుకు తిప్పుకుని పార్టీ కైవశంకు తగ్గ వ్యూహాలకు పదును పెట్టారు. చదవండి: (స్వగ్రామానికి రాజ్ కిరణ్ మృతదేహం.. సీఎం స్టాలిన్ రూ. పది లక్షల సాయం) శశికళ పర్యటన ఇలా.. రాజకీయ వ్యూహాలకు పదును పెట్టిన్న చిన్నమ్మ శశికళ ఈనెల 27న తంజావూరులో , 28న మదురైలో, 29న రామనాథపురంలో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. పలు కార్యక్రమాలు, కేడర్‌తో పలకరింపుల దిశగా ఆమె పయనం సాగనుంది. ఈ పర్యటనల విజయవంతంతో పాటుగా ఆమెకు బ్రహ్మరథం పట్టేందుకు అమ్మమక్కల్ మున్నేట్ర కళగం సేనల్ని రంగంలోకి దించేందుకు దినకరన్ నిర్ణయించారు. ఇందులో భాగంగా, చిన్నమ్మకు తన మద్దతు అని శనివారం ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ప్రకటించారు. -
సమంత..జీవితం చాలా విలువైంది: వనితా విజయ్‌కుమార్
Vanitha Vijaykumar Supports Samantha: సమంత-నాగ చైతన్య విడిపోయినప్పటి నుంచి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. విడాకులకు సమంతనే కారణం అంటూ ఆమెను టార్గెట్ చేస్తున్నారు. సమంత పిల్లలు వద్దనుకుందని, ఇప్పటికే రెండుసార్లు అబార్షన్ కూడా చేయించుకుంది అంటూ చాలా దారుణంగా సామ్‌ను ట్రోల్ చేస్తున్నారు. ఇక డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో అయితే ఆమెపై అసత్య ప్రచారాలకు అడ్డూ, అదుపు లేకుండా పోయింది. చదవండి: జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది..ఇక బయటపెడుతున్నా: సుమ సామ్-చై విడిపోతున్నట్లు ప్రకటించినప్పటి నుంచి సోషల్ మీడియాలో సమంతదే తప్పు అన్నట్లు చిత్రీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రకుల్ ప్రీత్ సహా పలువురు సెలబ్రిటీలు సమంతకు మద్దతుగా నిలిచారు. తాజాగా వివాదాస్పద నటి వనితా విజయ్‌కుమార్ సైతం సామ్‌కు సపోర్ట్‌గా నిలుస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్టును షేర్ చేసుకుంది. 'సమాజం అన్నది అవాస్తవం సామ్. దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జీవితం చాలా విలువైంది. ఏం జరిగినా దాని వెనుక ఓ కారణం ఉండే ఉంటుంది. ధైర్యంగా ముందుకు వెళ్లు' అంటూ వనితా విజయ్‌కుమార్ పేర్కొంది. చదవండి: సమంత..జీవితం చాలా విలువైంది: వనితా విజయ్‌కుమార్ -
అలా చేస్తే ఈ సమాజం నన్ను యాక్సెప్ట్ చేస్తుందా : నాగబాబు
మెగాబ్రాదర్ నాగబాబు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు తనదైన స్టైల్లో సమాధానమిచ్చారు. సాయి ధరమ్ తేజ్ ఎలా ఉన్నారంటూ పలువురు ప్రశ్నించగా..తేజ్ కోలుకుంటున్నాడని, త్వరలోనే మీ ముందుకు వస్తాడంటూ పేర్కొన్నారు. చదవండి : డ్రగ్స్ అమ్ముతూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ నటుడు ఇక మరో యూజర్.. బిగ్‌బాస్ లేదా ఐపీఎల్...ఈ రెండింట్లో ఏది ఫాలో అవుతారంటూ ఓ నెటిజన్ ప్రశ్నించగా..'బిగ్‌బాస్ చూడకుండా ఐపీఎల్ చూస్తూ నా బిడ్డ లాంటి ప్రియాంక సింగ్‌కి సపోర్ట్ చేస్తే ఈ సమాజం నన్ను యాక్సెప్ట్ చేస్తుందా మావా' అంటూ క్రేజీగా బదులిచ్చారు నాగబాబు. దీనికి స్పందించిన ప్రియాంక సింగ్ టీం నాగబాబుకు ధన్యవాదాలు తెలిపారు. 'మీరు ఎప్పుడు ఎవరిని ఊరికే సపోర్ట్ చేయరు ... జెన్యూన్ పర్సన్స్ ని తప్ప, ఆ జెన్యూన్ నేచర్ మన పింకీని ఇంత వరకూ తీస్కోచ్చింది ...మీకు లాగే అందరూ సపోర్ట్ చేసేలా చేస్తోంది' అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఇప్పటికే నాగబాబు బిగ్‌బాస్-5లో తనకు తెలిసిన వాళ్లు చాలా మంది ఉన్నారని, అయినప్పటికీ ప్రియాంక సింగ్‌కే తన మద్దతు అని ప్రకటించిన సంగతి తెలిసిందే. కన్నడ నటి సంజన గల్రానీ సైతం ప్రియాంక సింగ్‌ను విన్నర్‌గా చూడాలనుందని పేర్కొంది. చదవండి : అరెరె.. కత్రినా కైఫ్‌కు జిరాక్స్ కాపీలా ఉందే.. -
మంచు విష్ణుకు నరేష్ మద్దతు
-
MAA Elections 2021: మంచు విష్ణుకు నరేష్ మద్దతు
Naresh Extends Support to Manchu Vishnu Pannel: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో అధ్యక్ష బరిలో ఉన్న మంచు విష్ణు ప్యానల్‌కు మా మాజీ అధ్యక్షుడు నరేష్ మద్దతు ప్రకటించారు. విష్ణు ప్యానల్లో వివాదాస్పద వ్యక్తులెవరూ లేరని, ఆయన ప్యానెల్ కొత్తగా ఉందని అభిప్రాయపడ్డారు. విష్ణు ప్యానల్లో ఉన్నవాళ్లు చాలా చదువుకున్నవాళ్లు, మంచివాళ్లు, అనుభవజ్ఞులున్నారని, ప్యానల్లో 10 మంది మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. విష్ణు తన ప్యానల్లో స్థానికులకు పెద్దపీట వేశాడని కొనియాడారు. కాగా ‘మా కోసం మనమందరం’ పేరుతో మంచు విష్ణు తన ప్యానల్ సభ్యులను వెల్లడించిన సంగతి తెలిసిందే. ఉపాధ్యక్షులుగా మాదల రవి, పృథ్వీరాజ్, జనరల్ సెక్రటరీగా రఘుబాబు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా బాబుమోహన్, ట్రెజరర్‌గా శివబాలాజీ, జాయింట్ సెక్రటరీలుగా కరాటే కల్యాణి, గౌతమ్ రాజు సహా మొత్తం ప్యానల్ సభ్యులను విష్ణు ప్రకటించాడు. చదవండి : MAA Elections 2021: మంచు విష్ణు ప్యానల్ ఇదే -
బిగ్‌బాస్ : ప్రియాంక సింగ్‌కు కన్నడ నటి మద్దతు
Sanjana Galrani Support To Bigg Boss 5 Contestant Priyanka Singh: బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్‌బాస్ సీజన్-5 అదరగొడుతుంది. అప్పుడే హౌస్‌లో అలకలు, గ్రూపు రాజకీయాలు, లవ్ యాంగిల్స్ మొదలైన సంగతి తెలిసిందే. అప్పటివరకు ఎంతో ఫ్రెండ్లీగా ఉంటున్న కంటెస్టెంట్లు టాస్కుల విషయానికి వచ్చే సరికి ఉగ్రరూపం చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఒకరిపై మరొకరు తిట్టుకుంటూ హౌస్‌ను హీటెక్కిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే సోషల్‌మీడియాలో మీమ్స్, ట్రోల్స్ ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ట్రాన్స్ జెండర్‌గా బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక సింగ్ అందరితో ఫ్రెండ్లీగా ఉంటూ ఇంటా, బయటా మంచి మార్కులే కొట్టేస్తుంది. ఇప్పటికే ఆమెకు ప్రేక్షకుల నుంచి భారీగానే మద్దతు లభిస్తోంది. ఇటీవలె నటుడు నాగబాబు సైతం ప్రియాంకకు మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. హౌస్‌లో తనకు తెలిసిన వాళ్లు చాలామంది ఉన్నా, తన పూర్తి సపోర్ట్ మాత్రం ప్రియాంకకే అని ఇదివరకే ఆయన ప్రకటించాడు. ఈ నేపథ్యంలో కన్నడ నటి, బుజ్జిగాడు ఫేం సంజన గల్రానీ సైతం ప్రియాంకకు తన పూర్తి మద్దతును ప్రకటించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'ఎప్పుడూ అబ్బాయిలు లేదా అమ్మాయిలే షోలో గెలుస్తారు. కానీ ఈసారి ఒక మార్పు తీసుకొద్దాం. ట్రాన్స్‌జెండర్స్ ఎప్పుడూ వాళ్ల జీవితం కోసం ప్రతిరోజు పోరాడుతూనే ఉంటారు. వాళ్ల మీద ఎప్పుడూ నాకు చాలా సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. అందుకే ప్రియాంక సింగ్ కోసం ప్రేమగా ఈ వీడియో చేస్తున్నాను. ఆమెకు ఎక్కువ ఓట్లు వేసి గెలిపించండి' అంటూ సంజన ఇన్స్టాగ్రామ్ వేదికగా పిలుపునిచ్చింది. కన్నడ నటి అయినప్పటికీ ఒక తెలుగు షో గురించి మాట్లాడటమే కాకుండా, ఓ కంటెస్టెంట్‌కు సపోర్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తుండటంపై పింకీ(ప్రియాంక సింగ్)ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా తొలి వారం సరయూ ఎలిమినేట్ కాగా ఈవారం ఉమాదేవి, కాజల్, ప్రియ,నటరాజ్ మాస్టర్, యానీ మాస్టర్, లోబోలతో పాటు ప్రియాంక సింగ్‌లు నామినేషన్లో ఉన్నారు. వీరిలో ఇప్పటికే లోబో, ప్రియాంక సింగ్, ప్రియలు సేఫ్ జోన్లో ఉన్నట్లు అన్ అఫీషియల్ పోల్స్ ద్వారా తెలుస్తుంది. మరి వీరిలో ఈవారం హౌస్ నుంచి బయటకు ఎవరు వెళ్తారన్నది తెలియాలంటే ఆదివారం నాటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే. చదవండి : ఉమాపై గెలుపు, ఏడుస్తూనే ట్విస్ట్ ఇచ్చిన లోబో! టీఆర్పీ రేటింగ్‌లో సత్తా చూపిన బిగ్‌బాస్ 5, కానీ.. View this post on Instagram A post shared by Priyanka Singh (@priyankasingh.official_) -
వయసు చిన్నది.. బాధ్యత పెద్దది: ఎనిమిదేళ్లకే ఆటో నడుపుతూ..
ఆడుతూ పాడుతూ హాయిగా జీవించాల్సిన వయస్సులో ఆ బాలుడి భుజాలపై పెద్ద బాధ్యత.. అంధులైన తల్లిదండ్రులు, ఇద్దరు తమ్ముళ్ల మంచిచెడ్డలు చూసుకోవాల్సిన పరిస్థితి.. ప్రభుత్వం ఇచ్చే పింఛన్‌తో కుటుంబాన్ని పోషించాల్సిన దీనస్థితి.. ఎనిమిదేళ్లకే ప్రాణాలకు తెగించి ఆటో నడుపుతూ.. మరోవైపు చదువుకుంటూ.. అమ్మనాన్నలతో పాటు ఇద్దరు తమ్ముళ్ల పోషణకు తన రెక్కలు ముక్కలు చేసుకుంటున్న తీరు స్థానికులను కదిలిస్తోంది. చంద్రగిరి (చిత్తూరు జిల్లా): మండల పరిధిలోని గంగుడుపల్లి గ్రామానికి చెందిన బండి పాపిరెడ్డికి వెదురుకుప్పం మండలం మాంబేడు గ్రామానికి చెందిన రేవతితో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి గోపాలకృష్ణారెడ్డి, హిమవంతురెడ్డి, గణపతిరెడ్డి ముగ్గురు సంతానం. పాపిరెడ్డి చిన్నతనంలోనే కంటిచూపు కోల్పోయాడు. రేవతి పుట్టుకతోనే అంధురాలు. ప్రభుత్వం మంజూరు చేసిన పింఛన్‌పై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వీరి పెద్ద కొడుకు గోపాలకృష్ణారెడ్డి స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. కుటుంబ పోషణ కోసం.. తల్లిదండ్రులిద్దరికీ చూపులేకపోవడంతో కుటుంబ పోషణ భారమైంది. ఎనిమిదేళ్లకే గోపాలకృష్ణారెడ్డి కుటుంబ భారాన్ని మోయాల్సి వచ్చింది. తల్లిదండ్రులతో పాటు తమ్ముళ్లకు పట్టెడన్నం పెట్టేందుకు ఆటో నడపడం నేర్చుకున్నాడు. గ్రామాల్లో తిరుగుతూ ఉప్పు, పప్పు దినుసులు, ఇతర నిత్యావసరాలు విక్రయిస్తున్నాడు. స్కూల్ ముగిసిన తర్వాత ఇంటికొచ్చి తన తండ్రి పాపిరెడ్డిని ఆటోలో ఎక్కించుకుని గ్రామాల్లో తిరుగుతూ వంట సామగ్రి విక్రయిస్తున్నాడు. తల్లిదండ్రులు, తమ్ముళ్లతో కలసి గోపాలకృష్ణారెడ్డి మమ్మల్ని పోషించేది మా బిడ్డే మేమిద్దరం అంధులమే. మా పెద్ద కొడుకు గోపాలకృష్ణారెడ్డి మొదట సైకిల్ తొక్కడం నేర్చుకున్నాడు. అప్పులు చేసి బ్యాటరీ ఆటో తీసుకున్నాం. ఇంటి వద్దే వాడికి ఆటో ఎలా నడపాలో చెప్పేవాడిని. నిదానంగా ఆటో నడపడం వాడే నేర్చుకున్నాడు. ఇప్పుడు స్కూల్ అయిపోగానే ఉప్పు, బియ్యం, పప్పు దినుసులు వగైరా ఆటోలో తీసుకెళ్లి విక్రయిస్తుంటాడు. ఇంటి వద్ద పండించిన కూరగాయలు, ఆకుకూరలు సైతం తిరుపతికి తీసుకెళ్లి విక్రయించి, ఇంటికి వస్తుంటాడు. ఆడుకోవాల్సిన పసి వయస్సులో మమ్మల్ని పోషిస్తున్నాడు. – రేవతి, పాపిరెడ్డి, గోపాలకృష్ణారెడ్డి తల్లిదండ్రులు అన్ని విధాల ఆదుకుంటాం పాపిరెడ్డి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటాం. ముగ్గురు పిల్లలకు మంచి చదువు చెప్పించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ మేరకు కుటుంబ సభ్యులతో మాట్లాడాను. పిల్లల చదువుతో పాటు తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యత చూసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే అంధ దంపతులకు పింఛను, అమ్మఒడి, రేషన్ సరుకులు, జగనన్న కాలనీలో ఇల్లును మంజూరు చేశారు. – నాగశైలజ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ పీడీ ఇవీ చదవండి: Andhra Pradesh : 27 నెలల్లో 68 మెగా పరిశ్రమలు మాయ‘లేడి’: చాటింగ్‌తో మొదలై.. నగ్నంగా వీడియో కాల్ -
Maa Elections 2021: ప్రకాశ్‌రాజ్‌కు ఆ స్టార్ డైరెక్టర్ సపోర్ట్
హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. ఈ ఎన్నికలకు సమయం ఇంకా ఉన్నప్పటికీ అప్పుడే అభ్యర్థులు ప్రత్యర్థులపై ఆరోపణలు చేసుకోవడం, విమర్శనాస్త్రాలు సంధించుకోవడం మొదలెట్టేశారు. ఈ పరిణామాలు చూస్తుంటే ఇవి రాజకీయ ఎన్నికలలానే కనిపిస్తున్నాయి. కాగా ఈ ఎన్నికలకు సంబంధించి ఎక్కువగా వార్తల్లో విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్ పేరే వినపడుతోంది. అభ్యర్థిగా పేరు ప్రకటించిన రోజు నుంచి ఏదో ఓ రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. తాజా సమాచారం ప్రకారం మన మోనార్క్‌కు స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సపోర్ట్ ఉందని టాలీవుడ్లో టాక్. ప్రకాశ్ రాజ్ పోటీ చేస్తుండగా....ఇదివరకే ఆయనకు సంబంధించి లోకల్ నాన్ లోకల్ అంశం తెరపైకి రావడం ఈ ఎన్నికల వేడిని కాస్త పెంచిదనే చెప్పాలి. ఈ విషయంలో కొందరు సినీ ప్రముఖులు ప్రకాశ్ రాజ్‌కు మద్దతుగా నిలవగా, మరికొందరు దీనిని సమర్థిస్తున్నారు. ఇదే అంశంపై వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ తనదైన శైలిలో కామెంట్లు చేయడం కూడా తెలిసిందే. ఇంత హంగామా ప్రకాశ్ రాజ్ చూట్టు జరుగుతుండగా ఈ తరుణంలో తాజాగా పూరి జగన్నాథ్ సహకారం కూడా ఉందనే వార్త బయటకు రావడం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే ప్రకాష్ రాజ్‌కి మెగా ఫ్యామిలీ మద్దతు ఉందని సంగతి తెలిసిందే. పూరి జగన్నాథ్, ప్రకాష్ రాజ్ మధ్య మంచి స్నేహబంధం కొనసాగుతోంది. 'బద్రి' సినిమా టైమ్ నుంచే వీళ్ళ మధ్య మంచి బాండింగ్ కొనసాగుతోంది. ఈ బాండింగ్ కారణంగానే పూరి సహాయం కోరారట ప్రకాష్ రాజ్. దీంతో ఆయన రిక్వెస్ట్ అగ్రీ చేసిన పూరి.. బ్యాక్ గ్రౌండ్లో కొన్ని కీలకమైన సలహాలు, సూచనలు ఇస్తున్నట్లు సమాచారం. -
నోరు జారిన ఇమ్రాన్ ఖాన్, వెనకేసుకొచ్చిన..
ఈమధ్య వివాదాస్పద వ్యాఖ్యలతో పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. ప్రతీ అంశానికి భారత్‌ను ముడిపెట్టి సోషల్ మీడియాలో ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నాడు. అయితే కిందటి ఏడాది పార్లమెంట్(జాతీయ అసెంబ్లీ) సాక్షిగా ఇమ్రాన్ చేసిన సీరియస్ కామెంట్లు.. ఇప్పుడు తెరపైకి వచ్చి దుమారం రేపుతున్నాయి. ఉగ్రసంస్థ అల్ ఖైదా వ్యవస్థాపకుడు, అంతర్జాతీయ సమాజం దృష్టిలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్‌గా పేరున్న ఒసామా బిన్ లాడెన్‌ను ‘అమరవీరుడి’గా ఇమ్రాన్ ఖాన్ పేర్కొనడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఇమ్రాన్‌ను వెనకేసుకొస్తున్నారు అక్కడి మంత్రులు. ఇస్లామాబాద్: ‘‘పాకిస్థాన్‌కు సమాచారం ఇవ్వకుండానే అమెరికా దళాలు ఇక్కడి గగనతలంలో అడుగుపెట్టాయి. అబ్బొట్టాబాద్ లో అక్రమంగా ఆపరేషన్ నిర్వహించి ఒసామా బిన్ లాడెన్‌ను మట్టుపెట్టాయి. దీంతో లాడెన్ అమరుడయ్యాడు. ఆ సందర్భంలో మన దేశం చాలా ఇబ్బంది పడింద’’ని ఇమ్రాన్ ఖాన్ జాతీయ అసెంబ్లీలో ప్రసగించాడు. అయితే, ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో ఇమ్రాన్‌ఖాన్‌పై అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో ఇమ్రాన్ కామెంట్లపై పాక్ సమాచార శాఖ మంత్రి ఫవాద్ చౌదరి వివరణిచ్చాడు. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పొరబాటున నోరుజారి ఆ వ్యాఖ్యలు చేశారని చెప్పుకొచ్చాడు. ఒసామా బిన్ లాడెన్ ను పాకిస్థాన్ ప్రభుత్వం ఎప్పటికీ ఓ ఉగ్రవాదిగానే భావిస్తుందని, అల్ ఖైదాను ఓ ఉగ్రవాద సంస్థగానే పరిగణిస్తామని ఫవాద్ స్పష్టం చేశాడు. అయినా, ఇమ్రాన్ వ్యాఖ్యలను వంకర కోణంలో చూస్తున్నారని పేర్కొన్నారు. పాక్ మీడియాలోని ఓ వర్గం దీన్ని భూతద్దంలో చూపిస్తోందని మండిపడ్డాడు. ఇంతకుముందు పాక్ విదేశాంగ మంత్రి ముహమ్మద్ ఖురేషీ కూడా.. ఇమ్రాన్ వ్యాఖ్యలు అసందర్భోచితమైనవని చెప్పాడు. అమెరికా భద్రతా దళాలకు భయపడి బిన్ లాడెన్ పాకిస్థాన్ లోని అబ్బొట్టాబాద్ లో తలదాచుకోగా, అమెరికా నేవీ సీల్స్ కమాండోలు 2011లో సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించి లాడెన్‌ను మట్టుపెట్టాయి. బాలీవుడ్‌ను కాపీ కొట్టకండి ఇదిలా ఉంటే బాలీవుడ్‌ను కాపీ కొట్టొద్దంటూ పాక్ ఫిల్మ్మేకర్లను ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కోరాడు. ఇస్లామాబాద్‌లో జరిగిన షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరైన ఇమ్రాన్ ఖాన్.. పాకిస్థాన్ సినిమా.. బాలీవుడ్ వల్ల బాగా ప్రభావితం అయ్యిందని వ్యాఖ్యానించాడు. పాక్ సినిమా అక్కడి(భారత్) కల్చర్‌ను చూపిస్తోంది. ఇది పరోక్షంగా మరో దేశపు కల్చర్‌ను ప్రోత్సహించడమే అవుతుంది. ఇక్కడి నేటివిటీని చూపించే ప్రయత్నం చేయండి. సినిమాలు పోతాయని భయపడకండి. ఓటమికి భయపడితే గెలవలేం. నా స్వానుభవంతో చెప్తున్నా’ ఫిల్మ్ మేకర్లలో ధైర్యం నింపే ప్రయత్నం చేశాడు ప్రధాని ఇమ్రాన్ ఖాన్. చదవండి: హిందీ హీరోయిన్‌తో ఇమ్రాన్ ఖాన్ చెట్టాపట్టాల్ -
తెలుగు జర్నలిస్టులకు ఎంపీ విజయసాయిరెడ్డి సాయం
న్యూఢిల్లీ: తెలుగు జర్నలిస్టులకు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సాయం చేశారు. గురువారం ఆయన తెలుగు జర్నలిస్ట్ అసోసియేషన్‌కు రూ.10 లక్షల విరాళంగా ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో జర్నలిస్టుల పాత్ర ఎనలేనిదని కొనియాడారు. విపత్కర పరిస్థితుల్లోనూ జర్నలిస్టులు తమ విధులు నిర్వహిస్తున్నారని, జర్నలిస్టులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. చదవండి: కేంద్ర ఆర్థిక మంత్రితో ఎంపీ విజయసాయిరెడ్డి భేటీ -
‘మా సీఎం మారడు.. 65 మంది మద్దతు ఉంది’
బెంగళూరు: కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు అంశానికి సంబంధించి రోజుకో పరిణామం చోటుచేసుకుంటోంది. అయితే ముఖ్యమంత్రి యడియూరప్ప మాత్రం మారడని ఆయన రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్యే రేణుకాచార్య కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. యడియూరప్ప సీఎం పదవికి రాజీనామా చేయాల్సిన అవసరమే లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రికి 65 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ప్రకటించారు. ఈ మేరకు సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా యడియూరప్పకు వ్యతిరేకంగా పని చేస్తున్న వారిపై రేణుకాచార్య విరుచుకుపడ్డారు. వారి పక్క నియోజకవర్గాన్ని గెలిపించుకునే సత్తాలేనివారు యడియూరప్ప గురించి మాట్లాడుతుండడం వింతగా ఉందని పేర్కొన్నారు. యత్నాళ్ పిచ్చోడి తరహాలో మాట్లాడారని తెలిపారు. ఆయనకు వ్యతిరేకంగా ఏమి జరగదని చెప్పారు. వారం కిందట 18 మంది ఎమ్మెల్యేలు యడియూరప్పకు మద్దతుగా తాము ఢిల్లీకి వెళ్లి వస్తామని చెప్పారని.. అయితే ఏ సమస్య లేదని యడియూరప్ప చెప్పినట్లు’ రేణుకాచార్య వివరించారు. ఈ సమయంలో యడియూరప్ప రాజీనామా చేయాల్సిన అవసరమే లేదు అని స్పష్టం చేశారు. ప్రస్తుతం కరోనా తీవ్రంగా విజృంభిస్తున్న సమయంలోనూ యడియూరప్ప వృద్ధాప్యంలో చురుగ్గా పని చేస్తున్నారని రేణుకాచార్య తెలిపారు. కోవిడ్ సందర్భంలో కొందరు ఢిల్లీకి వెళ్లి ఏవేవో ప్రయత్నాలు చేయడం సరికాదని ప్రత్యర్థి గ్రూపులకు హితవు పలికారు. నాయకత్వ మార్పు వివాదం రేగిన నేపథ్యంలో యడియూరప్పకు మద్దతుగా 65 మందికి పైగా ఎమ్మెల్యేలు సంతకాలు చేశారని, దానికి సంబంధించిన లేఖ తన వద్ద ఉందని రేణుకాచార్య తెలిపారు. చదవండి: కలకలం..ముఖ్యమంత్రిని పంపేందుకు ముహూర్తం పెట్టాం చదవండి: ‘సీఎంను మార్చే ప్రసక్తే లేదు.. అవి కేవలం పుకార్లే’ -
‘భారత్ సహాయాన్ని ఎప్పటికీ మరిచిపోలేం’
వాషింగ్టన్: కోవిడ్ వ్యాప్తి చెందుతున్న తొలి రోజుల్లో అమెరికాకు భారత్ బాసటగా నిలిచిందని, ఈ సహాయాన్ని ఎప్పటికీ మరిచిపోలేమని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకన్ తెలిపారు. భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ అమెరికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. పర్యటనలో భాగంగా ఎస్ జైశంకర్ ఆ దేశ విదేశాంగ మంత్రిని కలిశారు. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ దేశాన్ని పర్యటించిన తొలి భారతీయ విదేశాంగా మంత్రి ఎస్ జైశంకర్. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో మేము ఐక్యంగా ఉన్నామని బ్లింకన్ అన్నారు. యుఎస్, భారతదేశం మధ్య భాగస్వామ్యం చాలా ముఖ్యమైనది, ప్రస్తుతం అది మరింత ముందుకు వెళ్తుందన్నారు. అంతకుముందు, జైశంకర్ యుఎస్ రక్షణ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు రెండు దేశాల మధ్య వ్యూహాత్మక, రక్షణ భాగస్వామ్యాన్ని మరింతగా అభివృద్ధి చేయడం గురించి చర్చించారు. మా వ్యూహాత్మక ,రక్షణ భాగస్వామ్యాన్ని మరింత అభివృద్ధి చేయడం గురించి సమగ్ర సంభాషణ జరిగిందని సమావేశం తరువాత ట్వీట్ చేస్తూ, వారితో కలిసి ఉన్న ఫోటోను జైశంకర్ పంచుకున్నారు. A warm meeting with US @SecDef Lloyd Austin. A comprehensive conversation about further developing our strategic and defence partnership. Exchanged views on contemporary security challenges. Expressed appreciation of the US military role in responding to the Covid situation. pic.twitter.com/ea0iBezGQZ — Dr. S. Jaishankar (@DrSJaishankar) May 28, 2021 చదవండి: రండి.. వ్యాక్సిన్ వేసుకోండి.. 840 కోట్ల ప్రైజ్‌మనీ గెలుచుకోండి -
భారీ మద్దతు: మేమంతా ‘ఈటల’ వెంటే..
హుజూరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఈటల రాజేందర్‌ను సీఎం కేసిఆర్ మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయడం సరికాదని, నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు ఈటల వెంటే ఉన్నారని, తాము కూడా ఈటల రాజేందర్ వెంటనే ఉంటామని హనుమాన్ దేవస్థాన కమిటీ చైర్మన్ ఆకుల సదానందం, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు రమేష్‌గౌడ్, ఎంపటి సుధీర్ అన్నారు. మంగళవారం సాయిరూప కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హుజూరాబాద్ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ది చేసిన ఘనత ఈటలకే దక్కుతుందన్నారు. సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు పోతుల సంజీవ్, రాపర్తి శివ, బీఆర్‌గౌడ్, గోసు్కల చందు, కొలుగూరి దేవయ్య, గూడూరి మహేందర్‌రెడ్డి, మురాద్‌హుస్సేన్, రాజ్‌కుమార్, సందీప్ పాల్గొన్నారు. ఈటల వర్గీయుల సంబరాలు వీణవంక: మండలంలోని ఎల్భాకలో ఈటల రాజేందర్ వర్గీయులు సోమవారం రాత్రి టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. సర్పంచ్ కొత్తిరెడ్డి కాంతారెడ్డి, జెడ్పీటీసీ మాడ వనమాల మంత్రి గంగుల కమలాకర్ సమక్షంలో టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించడంపై మండిపడ్డారు. నిన్నటి వరకు ఈటలకు మద్దతు పలికి తెల్లవారేసరికి టీఆర్ఎస్కు జై కొట్టారని పేర్కొన్నారు. గ్రామస్తులంతా ఈటలకే మద్దతు తెలుపుతున్నారని, ఇక గ్రామానికి పట్టిన పీడ పోయిందని టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఈటల వర్గీయులు రాజారాం, మాడ గౌతమ్‌రెడ్డి, రాజ్‌కుమార్ యాదవ్, రాజు, పొన్నాల అనిల్, సంపత్ తదితరులు పాల్గొన్నారు. -
కరీంనగర్లో నైట్ కర్ఫ్యూ.. సహకరిస్తున్న ప్రజలు
-
ఉక్కు సంకల్పంతో విశాఖ ఉక్కును కాపాడుకుందాం: చిరంజీవి
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకుందామని తెలిపారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకణకు వ్యతిరేకంగా పరీరక్షణ కమీటి చేస్తున్న పోరాటనికి తన మద్దతు ప్రకటిస్తునట్లు పేర్కొన్నారు. ‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ అంటూ మోగిన ఆనాటి నినాదాలు ఇంకా తన చెవుల్లో మారుమోగుతనే ఉన్నాయని పేర్కొన్నారు. ‘విశాఖ ఉక్కు’కు దేశంలోనే ఓ ప్రత్యేకత ఉందని తెలిసి గర్వించామని చిరంజీవి గుర్తుచేశారు. లక్షలాది మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిని విశాఖ ఉక్కును ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేసే ప్రయత్నాలకు కేంద్రం విరమించుకోవాలని కోరుతున్నాని తెలిపారు. కేంద్రం ఈ నిర్ణయాన్ని పున:సమీక్షించుకోవాలని సూచించారు. ఇది ప్రాంతాలకు, పార్టీలకు, రాజకీయాలకు అతీతమైన, న్యాయమైన హక్కు అని.. ఆ హక్కును ఉక్కు సంకల్పంతో కాపాడుకుందామని ఆయన ట్వీటర్లో పేర్కొన్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ఆచార్య మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయిక. నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఆచార్య సినిమా చిత్రీకరణ కొనసాగుతోంది. Visakha Steel Plant is a symbol of numerous sacrifices.Let's raise above parties and regions. With a Steely resolve, Let's save Visakha Steel plant! pic.twitter.com/jfY7UXYvim — Chiranjeevi Konidela (@KChiruTweets) March 10, 2021 చదవండి: ఖమ్మం, రాజమండ్రి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఆచార్య -
ఆర్థిక వృద్ధికి చర్యలు కొనసాగుతాయి
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ విషయంలో జాగ్రత్తతో కూడిన ఆశావాదంతోనే ప్రభుత్వం ఉందని, ఆర్థిక వృద్ధిని ముందుకు తీసుకెళ్లేందుకు మద్దతు చర్యలు కొనసాగుతాయని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి తరుణ్‌బజాజ్ తెలిపారు. ఫిక్కీ వార్షిక సమావేశాన్ని ఉద్దేశించిన ఆయన మాట్లాడారు. రెండో త్రైమాసికం జీడీపీ గణాంకాలు (జూలై–సెప్టెంబర్) మార్కెట్ అంచనాల కంటే మెరుగ్గా ఉన్నాయని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వీతీయ భాగంలో (2020 అక్టోబర్ నుంచి 2021 మార్చి వరకు) మరింత పురోగతి ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి కారణంగా.. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో జీడీపీ మైనస్ 23.9 శాతం స్థాయిలో ఉంటుందని మార్కెట్లు అంచనా వేయగా.. కేవలం మైనస్ 7.5 శాతంగానే నమోదు కావడం గమనార్హం. ‘‘మేము సానుకూల ధోరణితో ఉన్నాము. అదే సమయంలో ఆర్థిక ప్రగతి విషయంలో అప్రమత్తతతో కూడినా ఆశావాదంతోనే ఉన్నాము. మూడు, నాలుగో త్రైమాసికాల్లో మరింత మెరుగుదల ఉంటుందని అంచనా వేస్తున్నాము. మేమే కాదు అంతర్జాతీయ సంస్థలు, రేటింగ్ ఏజెన్సీలు సైతం దేశ ఆర్థిక వృద్ధి విషయంలో వాటి అంచనాలను మెరుగుపరిచాయి’’ అని తరుణ్ బజాజ్ వివరించారు. పండుగలు ముగిసిన తర్వాత కూడా డిమాండ్ కొనసాగుతుండడం రెండు, మూడో త్రైమాసికాల్లో వృద్ధికి మద్దతునిస్తుందన్నారు. ఇక్కడి నుంచి ఆర్థిక వ్యవస్థ ప్రగతి కోసం అవసరమైన అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వరంగ సంస్థల నూతన విధానం త్వరలోనే నూతన ప్రభుత్వరంగ సంస్థల విధానంతో ప్రభుత్వం ముందుకు వస్తుందని తరుణ్ బజాజ్ తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజీ కింద వ్యూహాత్మక రంగాల్లో గరిష్టంగా నాలుగు ప్రభుత్వరంగ సంస్థలే ఉంటాయని ప్రకటించిన విషయం తెలిసిందే. అంతకుమించి ఉంటే వాటిని ప్రైవేటీకరించాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం. ఈ విధానం ఎంతో ప్రతిష్టాత్మకమైనదన్న తరుణ్ బజాజ్.. త్వరలోనే అమల్లోకి రానుందన్నారు. ప్రభుత్వం పట్ల ఆలోచనలో ఇది ఎంతో మార్పును తెస్తుందన్నారు. -
బాబాకా ధాబాకు క్యూ కట్టిన కస్టమర్లు
-
సోషల్ మీడియానా మజాకా: వైరల్ వీడియో
సాక్షి, న్యూఢిల్లీ: చిన్నపిల్లలనుంచి వృద్ధుల దాకా సోషల్ మీడియా విపరీతమైన ప్రభావాన్ని పడవేస్తోంది. ఆధునిక టెక్నాలజీ యుగంలో సోషల్ మీడియా ప్రపంచ దిశ దశను మారుస్తోంది. రాజకీయాలు నుంచి వంటింటి దాకా సోషల్ మీడియానా మజాకా అనిపిస్తోంది. ఢిల్లీలో చోటు చేసుకున్న ఒక సంఘటన గురించి తెలుసుకుంటే.. సోషల్ మీడియా మీద ఒకింత కోపంగా ఉన్న వారు కూడా ఔరా అనక మానరు. ఢిల్లీలోని మాలవీయనగర్‌లో ఉన్న బాబాకా ధాబా గురించి ట్విటర్లో ఒక వీడియో పోస్ట్ అయింది. కరోనా, లాక్డౌన్ కారణంగా డిమాండ్ లేక షాపు యజమాని కన్నీళ్లు పెట్టుకున్న వీడియోలో షేర్ చేశారు. దాదాపు 80 ఏళ్ళ వృద్ధాప్యంలో జీవనం కోసం ఆ జంట పడుతున్న ఆరాటాన్ని చూపించారు. అంతేకాదు వీరిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. అంతే క్షణాల్లో ఈ వీడియో వైరల్ గా మారింది. పిల్లల అనాదరణకు గురైన ఈ వృద్ధ దంపతుల పోరాట కథ పలువురి హృదయాలను కదిలించింది. బాలీవుడ్ నటులు సునీల్ శెట్టి, రవీన్ టాండన్, సోనమ్ కపూర్, రవీనా టాండన్, జర్నలిస్టు, నటి స్వర భాస్కర్, క్రికెటర్ ఆర్ అశ్విన్ లాంటి సెలబ్రిటీలతో పలువురు దీన్ని లైక్ చేసి, షేర్ చేశారు. దీంతో నెటిజనుల నుంచి స్పందన భారీగా వచ్చింది. సపోర్ట్ లోకల్ అంటూ స్థానికులు బాబా కా ధాబాకు క్యూ కట్టారు. ఫుడ్ స్టాల్ లో లభ్యమయ్యే భోజనం, చపాతీలకు ఇబ్బడి ముబ్బడిగా ఆర్డర్లు ఇవ్వడం మొదలు పెట్టారు. బాబా చేతి వంట మటర్ పనీర్ ఆసాంతం లొట్టలేసుకుంటూ ఆరగించేశారు. సెల్ఫీలతో సందడి చేశారు. దీంతో సంతోషంతో ఉక్కిరి అయిపోవడం యజమాని వంతైంది. అంతేకాదు మాలవీయ నగర్ బాబాకా ధాబా ఒక ల్యాండ్ మార్క్ గా నిలిచింది. ఈ వీడియో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సోమనాథ్ భారతిని కూడా కదిలించింది. బాబా కా ధాబాను తాను సందర్శించానని, వారి జీవితాల్లో సంతోషం కోసం తాను చేయగలిగింది తాను చేస్తానంటూ ట్వీట్ చేశారు. కాగా ఈ వీడియోను బ్లాగర్ గౌరవ్ వాసన్ చిత్రీకరించారు. బాబా కా దాబా ఓనరు పేరు కాంత ప్రసాద్. భార్య పేరు బాదామి దేవి. .@RICHA_LAKHERA .@VasundharaTankh .@sohitmishra99 .@sakshijoshii .@RifatJawaid .@ShonakshiC .@TheDeshBhakt Visited "Baba Ka Dhaba" n hv done d needful to bring SMILE on their faces as promised. Will take care of them n I am starting a drive 2 take care of similarly placed people. pic.twitter.com/S9A94AmJxK — Adv. Somnath Bharti (@attorneybharti) October 8, 2020 -
వారికి సింగపూర్ బంపర్ ఆఫర్
సింగపూర్ : కరోనా మహమ్మారి సమయంలో సింగపూర్ ప్రభుత్వం కీలక నిర్ణయ తీసుకుంది. ఈ సంక్షోభ సమయంలో బిడ్డను కనబోతున్న తల్లిదండ్రులకు సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. వారికి అదనపు సహాయాన్ని అందజేయనున్నామని ఆ దేశ ఉప ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి హెంగ్ స్వీ కీట్ సోమవారం (అక్టోబర్ 5) వెల్లడించారు. ప్రజల ఆదాయ క్షీణత సంతానోత్పత్తి రేటును మరింత దెబ్బతీసే అవకాశం ఉందనే అంచనాలతో ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే కరోనా వ్యతిరేక పోరాటంలో తాము స్థిరంగా ఉన్నామని ప్రకటించారు. ఈ మేరకు పార్లమెంటులో ఆర్థిక మంత్రి ప్రకటన విడుదల చేశారు. కరోనా వైరస్ మహమ్మారి సమయంలో ఉద్యోగ తొలగింపులు, వేతన కోతల మధ్య ప్రజల ఆర్థిక భారాన్ని తగ్గించే ప్రయత్నం, బిడ్డ కోసం చూస్తున్న తల్లిదండ్రులకు మద్దతు ఇవ్వడానికి సింగపూర్ ఒక్కసారి చెల్లింపును అందించనుంది. ఇది ప్రస్తుతం అమలు చేస్తున్న బేబీ బోనస్‌లకు అదనమని మంత్రి స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన వివరాలను పూర్తిగా వెల్లడించలేదు. అయితే బేబీ బోనస్ కింద ఇప్పటికే అర్హతగల తల్లిదండ్రులకు 10వేల డాలర్ల వరకు ప్రయోజనాలను అందిస్తున్నసంగతి తెలిసిందే. కోవిడ్-19 సమయంలో ఉపాధి లేక, ఆదాయాలు క్షీణించడంతో భార్యభర్తలు, పిల్లల్ని కనే ప్రణాళికలను వాయిదా వేసుకుంటున్నారనే నివేదికల మధ్య సింగపూర్ సత్వర చర్యలకు దిగింది. సింగపూర్ సంతానోత్పత్తి రేటు 2018లో ఎనిమిదేళ్ల కనిష్టాన్ని తాకింది. కాగా దేశంలో ఇప్పటివరకు 57 వేలకు పైగా కరోనా కేసులు నమోదు కాగా మరణించిన వారి సంఖ్య 27. -
యాపిల్ ఆన్లైన్ స్టోర్ వచ్చేసింది : విశేషాలు
సాక్షి,న్యూఢిల్లీ: ఎంతో ఆసక్తిగా యాపిల్ లవర్స్ ఎదురు చూస్తున్న దేశంలో యాపిల్ తొలి ఆన్లైన్ స్టోర్ ను అమెరికా టెక్ దిగ్గజం యాపిల్ ప్రారంభించింది. రానున్నపండుగ సీజన్ డిమాండ్‌ను క్యాష్ చేసుకునే వ్యూహంలో భాగంగా దేశీయ వినియోగదారుల నెట్టింట వాలిపోయింది. యాపిల్ ఇండియా అధికారిక వెబ్సైట్ (www.apple.com/in)ను సందర్శించి, థర్డ్ పార్టీ సేవలపై ఆధారపడకుండా నేరుగా కొనుగోళ్లు చేయవచ్చు. అంతేకాదు డైరెక్ట్ కస్టమర్ సపోర్టు కూడా యూజర్లకు భిస్తుంది. కస్టమర్లకు అత్యుత్తమ సేవలను అందించేందుకు నైపుణ్యం కలిగిన తమ ఆన్లైన్ టీం సిద్ధంగా ఉన్నారని యాపిల్ ప్రకటించింది. ఆన్లైన్ స్టోర్ ద్వారా యాపిల్ మొదటిసారిగా దేశవ్యాప్తంగా వినియోగదారులకు పూర్తి స్థాయి ఉత్పత్తులు, ప్రీమియం అనుభవాన్ని అందిస్తుంది. రవాణా కోసం యాపిల్ బ్లూడార్ట్ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. (గుడ్ న్యూస్ చెప్పిన టిమ్ కుక్) యాపిల్ ఆన్లైన్ స్టోర్ అందించే సేవలు అన్ని ఆర్డర్లు కాంటాక్ట్‌లెస్ డెలివరీ ట్రేడ్-ఇన్ ప్రోగ్రామ్ ద్వారా ఫైనాన్సింగ్ సదుపాయం విద్యార్థులు ప్రత్యేక ధరల వద్ద మాక్ లేదా ఐప్యాడ్ లు. ఆపిల్ కేర్ ఉత్పత్తులపై స్పెషల్ డిస్కౌంట్లు. యాక్సిడెంట్ కవరేజి వారంటీ ఎయిర్‌పాడ్స్‌లో ఇంగ్లీష్, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, మరాఠీ, తమిళం తెలుగు భాషలలో స్పెషల్ ఎమోజీలు , టెక్ట్స్, ప్రపంచవ్యాప్తంగా 38 వ ఆన్లైన్ స్టోర్ ఆపిల్ ఇండియా స్టోర్ ద్వారా భారతీయ వినియోగదారులకు యాపిల్ నిపుణుల సలహాలు, సూచనలు అందుబాటులో ఉంటాయి. ప్రొడక్ట్ ఫీచర్ల గురించి మరింత తెలుసుకోవడం, సెటప్ చేయడం వరకు వినియోగదారులు ఇంగ్లీష్‌లో ఆన్లైన్ లో సాయం అందిస్తుంది. అలాగే ఫోన్ ద్వారా హిందీ ఇంగ్లీషులో నేరుగా సలహాలు యాపిల్ ఉత్పత్తులను కొనుగోలు చేసిన వారు, తమ డివైస్ గురించి మరింత తెలుసుకునేందుకు , ఇతర సలహాలు, సందేహాల నివృత్తి కోసం ఎగ్జిక్యూటివ్‌తో 30 నిమిషాల పాటు మాట్లాడవచ్చు. ఫోటోగ్రఫీ, సంగీతాభిమానులకు 'టుడే ఎట్ ఆపిల్' ద్వారా స్థానిక నిపుణుల నేతృత్వంలో ఆన్లైన్ సెషన్లు అక్టోబర్‌లో ప్రారంభించనుంది. కాగా ఇటీవల యాపిల్ లాంచ్ చేసిన యాపిల్ వాచ్ సిరీస్ 6, కొత్త ఐప్యాడ్ ఎయిర్ తోపాటు, ఐఫోన్, ఐప్యాడ్, మాక్ లాంటి ఉత్పత్తులు ఆన్లైన్ స్టోర్లలో అందుబాటులో ఉంటాయి. యాపిల్ ప్రస్తుతం భారత్‌లో ఉత్పత్తులను థర్డ్ పార్టీ విక్రేతలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈకామర్స్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. (ఆపిల్ ఈవెంట్ 2020 : ప్రధాన ఆవిష్కరణలు) -
ఇండియన్ అమెరికన్ల ఓట్లన్నీ నాకే
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియన్ అమెరికన్ ఓటర్లపై గాలం వేశారు. వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో భారత్ ప్రధాని నరేంద్ర మోదీ మద్దతు తనకే ఉంటుందని ప్రకటించారు. అమెరికాలో భారతీయుల ఓట్లన్నీ తనకే వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన ఇండియన్ అమెరికన్ ఓట్ల గురించి అడిగిన ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ ‘‘భారత్ మాకు ఎంతగానో సహకరిస్తోంది. ప్రధాని మోదీ మాకు గట్టి మద్దతుదారు. ప్రవాస భారతీయుల ఓట్లన్నీ మాకే వస్తాయన్న విశ్వాసం ఉంది’అని పేర్కొన్నారు. భారత్ అంటే అందరికీ అభిమానం తమ కుటుంబంలో అందరికీ భారతదేశం పట్ల ప్రేమాభిమానాలు ఉన్నాయని ట్రంప్ చెప్పారు. తన కుమార్తె ఇవాంకా ట్రంప్, కుమారుడు జూనియర్ డొనాల్డ్ ట్రంప్, అతని స్నేహితురాలు కింబర్లీలకు భారతీయుల్లో మంచి పేరు ఉందని ఉన్నారు. వారంతా భారత్ గురించి ఎక్కువగా ఆలోచిస్తారని, అందుకే తనకి కూడా ఆ దేశం అంటే ఎంతో అభిమానమని వెల్లడించారు. భారతీయుల సెంటిమెంట్లు తనకెంతో నచ్చుతాయన్న ట్రంప్ ఇండియన్ అమెరికన్ల ఓట్ల కోసం వారు ముగ్గురూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని చెప్పారు. -
శిరోముండనం బాధితుడికి మంత్రి ముత్తంశెట్టి భరోసా
-
శ్రీకాంత్‌కు ప్రభుత్వం అండగా ఉంటుంది
సాక్షి, విశాఖపట్నం/పెందుర్తి: విశాఖపట్నంలో శిరోముండనం బాధితుడు పర్రి శ్రీకాంత్‌కు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. జనసేన సానుభూతిపరుడు, టీడీపీ నేతలతో వ్యాపార భాగస్వామి, సినీ దర్శక, నిర్మాత నూతన్‌నాయుడు ఇంట్లో దాష్టీకానికి గురైన దళిత యువకుడు శ్రీకాంత్ ఫిర్యాదు చేసిన 24 గంటల్లోనే ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. బాధితుడు శ్రీకాంత్‌ను మంత్రి ముత్తంశెట్టి, ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్ ఆదివారం పరామర్శించారు. ► శ్రీకాంత్‌కు ప్రభుత్వం తరఫున రూ.లక్ష సాయం అందజేయటంతో పాటు ఔట్సోర్సింగ్ ద్వారా ఉపాధి కల్పిస్తామని మంత్రి ప్రకటించారు. ► కేసు విషయంలో పోలీసులు, అధికారులు వ్యవహరించిన తీరు ప్రశంసనీయమన్నారు. భవిష్యత్‌లో మరెవరూ ఇలాంటి ఘటనలకు పాల్పడకుండా నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూడాలని కోరారు. ► బాధితులకు అండగా ఉండాల్సిన ప్రతిపక్షాలు నిస్సిగ్గుగా రాజకీయాలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. ► బాధితుడు శ్రీకాంత్‌కు ఎమ్మెల్యే అదీప్‌రాజ్ తన సొంత నిధులు రూ.50 వేలు మంత్రి చేతుల మీదుగా అందజేశారు. ► ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్, ఆర్డీవో పెంచల కిశోర్ తదితరులు పాల్గొన్నారు. జ్యుడీషియల్ రిమాండ్‌కు ఏడుగురు నిందితులు శ్రీకాంత్‌ను హింసించిన ఘటనలో అరెస్ట్ చేసిన ఏడుగురు నిందితులను జ్యుడీషియల్ రిమాండ్‌కి పంపించారు. నిందితులను ఎస్సీ, ఎస్టీ స్పెషల్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా.. వారికి సెప్టెంబర్ 11 వరకు రిమాండ్ విధించారు. ఆరిలోవలో ఉ¯న్న విశాఖ జిల్లా సెంట్రల్ జైలుకు నూతన్‌నాయుడి భార్య ప్రియామాధురితో సహా బ్యూటీషియన్ ఇందిరారాణి, వరహాలు, ఝాన్సీ, సౌజన్యలను తరలించగా బార్బర్ రవికుమార్, బాల గంగాధర్‌ను అనకాపల్లి సబ్ జైలుకు పంపించినట్లు డీసీపీ (క్రైం) సురేష్‌బాబు తెలిపారు. -
చంద్రబాబు తీరు సిగ్గుచేటు
కర్నూలు(సెంట్రల్): చంద్రబాబు అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నారని, ఆయన తీరు సిగ్గుచేటని వైఎస్ఆర్సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య విమర్శించారు. ఆయన స్వలాభం కోసం దేన్నైనా నాశనం చేస్తారని దుయ్యబట్టారు. మూడు రాజధానులను అడ్డుకుంటే పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. బుధవారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పాలనా వికేంద్రీకరణకు మద్దతుగా కర్నూలు కలెక్టరేట్ వద్దనున్న గాంధీజీ విగ్రహం ఎదుట కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీవై రామయ్యతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, హఫీజ్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీవై రామయ్య మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలోని మూడు ప్రాంతాలనూ సమానంగా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో మూడు రాజధానులను ప్రకటించారన్నారు. భవిష్యత్‌లో ప్రాంతీయ అసమానతలు తలెత్తకుండా ఉండాలంటే మూడు రాజధానులే పరిష్కారమన్నారు. శ్రీబాగ్ ఒప్పందాన్ని గౌరవించి కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేసిన సీఎంకు జిల్లా ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ మూడు రాజధానులను అడ్డుకోవడానికి చంద్రబాబు కుట్రలు పన్నడం శోచనీయమన్నారు. స్వలాభం కోసం అమరావతి రాజధానిగా ఉండాలని పట్టుబట్టడం దారుణమన్నారు. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ మాట్లాడుతూ పాలనా వికేంద్రీకరణను అడ్డుకోవడానికి చంద్రబాబు హైదరాబాద్‌లో ఉండి కుట్రలు పన్నుతున్నారని దుయ్యబట్టారు. ఆయన ఎన్ని కుట్రలు పన్నినా త్వరలోనే మూడు రాజధానుల ప్రక్రియ ముందుకు సాగుతుందన్నారు. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటయితే ఇక్కడి ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు రాజా విష్ణువర్ధన్‌రెడ్డి, రాష్ట్ర అదనపు కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, నాయకులు సీహెచ్ మద్దయ్య, రైల్వే ప్రసాద్, ఆదిమోహన్‌రెడ్డి, జమీల, రియల్ టైం నాగరాజు యాదవ్, సాంబశివారెడ్డి,దేవపూజ ధనుంజయాచారి, డీకే రాజశేఖర్, మంగమ్మ, రాజు,కృష్ణకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణలోనే అత్యున్నత పోలీసింగ్
సాక్షి, హైదరాబాద్: సమాజంలో శాంతి భద్రతల పరిస్థితి పటిష్టంగా ఉంటేనే సమగ్రాభివృద్ధి సాధ్యమని, దీనికి నిదర్శనం తెలంగాణ రాష్ట్రమని డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం తెలంగాణ పోలీస్ మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో నెలరోజుల పాటు రాష్ట్రంలోని మహిళలు, యువతకు నిర్వహించిన వెబ్ ఆధారిత చైతన్య సదస్సు ముగింపు కార్యక్రమం జరిగింది. దీనికి డీజీపీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పోలీస్ శాఖ ఆధునీకరణకు అందిస్తున్న ప్రోత్సాహంతోనే రాష్ట్రంలో శాంతి, భద్రతల పరిస్థితి పటిష్టంగా ఉందన్నారు. మహిళలు, పిల్లలు సైబర్ నేరాల బారిన పడకుండా నెలరోజులపాటు సైబ్–హర్ పేరిట నిర్వహించిన అవగాహన కార్యక్రమం దేశంలోనే మొదటిదన్నారు. కార్యక్రమంలో రాష్ట్రంతోపాటు దేశ, విదేశాలకు చెందిన 50 లక్షల మంది పాల్గొనడం విశేషమని కొనియాడారు. డీఐజీ సుమతి మాట్లాడుతూ.. సైబ్–హర్ కార్యక్రమం స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల్లో ఇలాంటి కార్యక్రమాన్ని ప్రారంభించారని వెల్లడించారు. కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరైన మై విలేజ్ షో గంగవ్వ మాట్లాడుతూ.. తనను కూడా పైసల్ గీకే కార్డు (ఏటీఎం) నంబర్ చెప్పాలని ఫోన్లో ఎవడో అడిగాడని, అయినా చెప్పలేదన్నారు. ఈ సందర్భంగా సైబర్ నేరాలపై చైతన్యం కలిగించే పలు ప్రచార కిట్లను మహేందర్‌రెడ్డి విడుదల చేశారు. కార్యక్రమంలో ఏడీజీ జితేందర్ కూడా పాల్గొన్నారు. 15 లక్షల మందికి అవగాహన..: జూలై 15న మొదలైన ఈ కార్యక్రమం ద్వారా నెలరోజులపాటు రాష్ట్రంలోని దాదాపు 15 లక్షలకుపైగా యువత, మహిళలకు ఆన్లైన్ నేరాలు, అప్రమత్తత, రక్షణ పొందే విధానం, ఎవరికి ఫిర్యాదు చేయాలి? వంటి విషయాలపై అవగాహన కల్పించడం విశేషం. కాగా, ఈ కార్యక్రమం సైబర్ నేరాలపై ప్రత్యేక పుస్తకాలు వెలువరించింది. యువతలో ఆసక్తిని పెంచేలా పలు క్విజ్లు, వ్యాసరచన, పోస్టర్ ప్రజెంటేషన్, కవితలు తదితర పోటీలు కూడా నిర్వహించింది. పోస్టర్ ప్రజెంటేషన్ కోసం అత్యధికంగా 367 మంది చిత్రాలను పంపారు. వారిలో రితిక్, నమ్రతలు విజేతలుగా నిలిచారు. ఇక కవితల పోటీల విభాగంలో దాదాపు 100కు పైగా రాగా.. వాటిలో హైమా, అన్షు, సాయి నిక్షేప్, హరికాంత్, రమాదేవిల కవితలను ఉత్తమమైనవిగా ఎంపిక చేశారు -
సెనెటర్ శారమ్మ
ఇంకా సెనెటర్ కాలేదు. కానీ అయ్యేలా ఉన్నారు. అవుతారు కూడా. మంచికోసం పోరాడాలి. మంచి దారిలో పెట్టాలి. మంచికి తోడు అవ్వాలి. ఇన్ని హోప్స్ ఉన్నాయి... ఒబామాకు శారా మీద. ఆ ఆశలే ఆమె గెలుపు. గొప్పగా అనిపిస్తుంది.. ఇక్కడి వాళ్లు ఎక్కడికో వెళ్లి అక్కడి రాజకీయాల్లో ప్రముఖులు అయిపోవడం. పారిశ్రామికవేత్తలైతే ‘తెలివుంది కనుక’ అనుకోవచ్చు. నటీనటులైతే ‘టాలెంట్ ఉంది కనుక’ అనుకోవచ్చు. ఇంకా ఏ రంగానికి ఆ రంగంలో ఎవరికి వారు కష్టపడితే సుప్రసిద్ధ ఎన్నారైలు అయిపోవచ్చు. కానీ మనవాళ్లు పాలకులుగా కూడా ఎదుగుతున్నారే! అదీ అమెరికా వంటి అగ్రరాజ్యాలలో!! ప్రజలు ఎన్నుకుంటేనే ఎక్కడైనా సభల్లోకి ప్రవేశం. మరి భారతీయులు.. దేశంకాని దేశంలో.. ఎలా చట్టసభల ప్రతినిధులు అవుతున్నారు? ఎలా అంటే.. అక్కడి ప్రజల్లో కలిసిపోయి. అక్కడి ప్రజలకు సేవలు అందించి, సదుపాయాలను కల్పించి! వ్యాపారికి తెలివి, నటులకు టాలెంట్.. ఉన్నట్లే.. రాజకీయంగా ‘నాయకత్వ సమర్థత’ మనవాళ్లను నిలబెడుతోంది. యు.ఎస్.లోని మైన్ రాష్ట అసెంబ్లీకి ప్రస్తుతం స్పీకర్‌గా ఉన్న 48 ఏళ్ల శారా గిడియన్.. మన భారతీయ సంతతి మహిళే. ఇప్పుడామె ఆ పై స్థానానికి పోటీ చేయబోతున్నారు. అమెరికన్ ‘సెనెటర్’గా! సెనెటర్‌గా శారా అభ్యర్థిత్వానికి అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా శుక్రవారం మద్దతు ఇవ్వగానే (‘ఎండార్స్’ అంటారు ఇలా మద్దతు ఇవ్వడాన్ని) వెనువెంటనే ఆమె తరఫున పార్టీ ఎన్నికల ప్రచారం మొదలైంది. వాస్తవానికి ఆమె కొత్తగా ప్రచారం గానీ, పరిచయం కానీ చేసుకోవలసిందేమీ లేదు. డెమొక్రాట్ పార్టీ అభ్యర్థిగా అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న జో బైడన్ కూడా శారాకు మద్దతు పలికారు. ఇద్దరు దిగ్గజాలు ఇటొకరు, అటొకరు ఉండి (ఒబామా, బైడన్) శారాను సెనెట్‌కు పంపేందుకు కృతనిశ్చయంతో ఉన్నారు. ఆమె పని తీరు మీద వారికున్న నమ్మకం, విశ్వాసం అది. 2012 లో మైన్ అసెంబ్లీలో దిగువ సభకు ఎన్నికయ్యారు శారా. అది ఆమె ప్రత్యక్ష రాజకీయ రంగ ప్రవేశం. తర్వాత 2016లో అదే సభకు స్పీకర్ అయ్యారు. ఇప్పుడు మైన్ రాష్ట్రం నుంచి వాషింగ్టన్ వెళ్లేందుకు.. ప్రస్తుతం ఇదే రాష్ట్రం నుంచి రిపబ్లికన్ అభ్యర్థిగా సెనెట్‌లో ఉండి, మళ్లీ పోటీ పడుతున్న సీనియర్ సెనెటర్ 67 ఏళ్ల సుజేన్ కాలిన్స్‌ను డీకొనబోతున్నారు! ఆమెపై గెలిస్తే అమెరికన్ సెనెట్‌లో శారా రెండో భారతీయ సంతతి సభ్యురాలు అవడం అటుంచి, సుజేన్పై గెలవడం పెద్ద విషయం అవుతుంది. ఈ ఏడాది నవంబర్ 3న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న రోజే అమెరికన్ సెనెట్‌లోని మూడింట ఒక వంతు స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. సభ్యులకు ఆరేళ్ల పదవీ కాలం ఉండే సెనెట్.. ప్రతి ‘సరి’ సంవత్సరంలో ఎన్నికలకు వెళుతుంది. శారా తండ్రి ఇండియా నుంచి వెళ్లి యు.ఎస్.లోని రోడ్ ఐలాండ్ రాష్ట్రంలో స్థిరపడిన పిల్లల వైద్యుడు. నలుగురు పిల్లల్లో శారా ఆఖరి సంతానం. రోడ్ ఐలాండ్‌లోనే పెరిగింది. శారా తల్లి రెండో తరం ఆర్మేనియన్ సంతతి మహిళ. శారా అంతర్జాతీయ వ్యవహారాలలో డిగ్రీ చేశారు. చదువు అయ్యాక ఓ సెనెటర్ దగ్గర ఇంటెర్న్‌గా ఉన్నారు. తర్వాత మైన్స్టేట్లోని ఫ్రీపోర్ట్ టౌన్ కౌన్సిల్‌కు ఎన్నికయ్యారు. అక్కడి నుంచి అసెంబ్లీ వరకు! అరోగ్య సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, పోలిస్ సంస్కరణలు, తుపాకీ సంస్కృతి నియంత్రణ.. వీటికోసం శారా చాలా కృషి చేశారు. ఇలాంటి వారు సెనెట్‌లో ఉంటే అమెరికాకు మంచి జరుగుతుందని ఒబామా తన ఎండార్స్మెంట్లో రాశారు. శారా సెనెటర్‌గా ఎన్నికైతే కమలా హ్యారిస్ తర్వాత సెనెటర్ అయిన రెండో భారత సంతతి మహిళ అవుతారు. శారా భర్త, ఆమె ముగ్గురు పిల్లలు ఫ్రీపోర్ట్లో నివాసం ఉంటారు. భర్త బెంజమిన్ లాయర్. భర్త, పిల్లలతో శారా -
దళితులకు అండగా ఉంటాం: భట్టి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రోజురోజుకూ దళిత, గిరిజన బడుగు, బలహీన వర్గాలకు చెందిన ప్రజలపై దాడులు పెరుగుతున్నాయని, హత్యలు నిత్యకృత్యం అయ్యాయని కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) నేత మల్లు భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే రోజు తెలంగాణలో ఇద్దరు దళితులు ప్రభుత్వ పాశవిక విధానాలకు బలయ్యారని, ఇంత ఘోరాలు జరుగుతున్నా.. ముఖ్యమంత్రి స్పందించకపోవడం దారుణమని శుక్రవారం ఒక ప్రకటనలో ఆయన అభిప్రాయపడ్డారు. సీఎం కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్‌లోని వర్గల్ మండలం వేలూరులో తన భూమి ప్రభుత్వం గుంజుకుందన్న ఆవేదనతో ఓ దళిత యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడని, ఇది ప్రభుత్వం చేసిన హత్యనేనని ఆరోపించారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం రాజపూర్ మండలం తిరుమలపూర్ గ్రామంలో ఓ దళిత యువ రైతును ఇసుక మాఫియా లారీతో తొక్కి హత్య చేసిందని, ఈ విషయంలో దోషులపై హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాల వారికి న్యాయం జరిగే వరకు ఈ ఉద్యమాన్ని ఇలాగే కొనసాగిస్తామని, ఒకట్రెండు రోజుల్లో గవర్నర్ ను కలసి వినతిపత్రం ఇస్తామని, తర్వాత జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను కలసి ఫిర్యాదులు చేస్తామని తెలిపారు. దళితులకు న్యాయం జరిగే వరకు రాష్ట్రంలో అందరినీ కలుపుకుని కాంగ్రెస్ పోరాటం చేస్తుందని ఆ ప్రకటనలో భట్టి స్పష్టం చేశారు. -
‘ట్రంప్ భారత్‌కు మద్దతిస్తాడని గ్యారెంటీ లేదు’
వాషింగ్టన్: భారత్-చైనా ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా జాతీయ భద్రతా మాజీ సలహాదారు జాన్ బోల్టన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు పెరిగితే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌కు మద్దతు ఇస్తారనే గ్యారెంటీ లేదని అన్నారు. ఒక టెలివిజన్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బోల్టన్ ఈ విషయం చెప్పారు.(గల్వాన్ దాడి; విస్తుగొలిపే నిజాలు!) చైనా తన అన్ని సరిహద్దుల్లో దూకుడుగా ప్రవర్తిస్తున్నదని ఈ కారణంగా.. జపాన్, ఇండియా, ఇతర దేశాలతో దాని సంబంధాలు క్షీణించాయని అన్నారు బోల్టన్. చైనా-భారత్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ట్రంప్, భారత్ వైపు నిలుస్తాడనేది అనుమానమే అని తెలిపారు. నవంబర్ ఎన్నికల తరువాత ట్రంప్ ఇంకా ఏం చేస్తారో చెప్పలేమన్నారు. చైనాతో వాణిజ్య ఒప్పందాన్ని తిరిగి కొనసాగించినా ఆశ్చర్యపోవద్దని సూచించారు. రాబోయే కొద్ది నెలల్లో ట్రంప్ ఇలాంటి అన్ని విషయాల నుంచి పక్కకు తప్పింకుంటారన్నారు. ఈ సారి తనను ఎన్నుకోవడం కష్టమని తెలిసినందున ట్రంప్ సరిహద్దులో శాంతినే కోరుకుంటారని బోల్టన్ పేర్కొన్నారు. ట్రంప్ పరిపాలనలో 2018 ఏప్రిల్ నుంచి 2019 సెప్టెంబర్ వరకు అమెరికా జాతీయ భద్రతా సలహాదారుగా బోల్టన్ సేవలందించారు. -
పంటల బీమా.. రైతుకు ధీమా
గత ప్రభుత్వాల నిర్వాకం వల్ల బక్కచిక్కిన రైతును ఆర్థికంగా బలోపేతం చేసేందుకు, వ్యవసాయాన్ని పండగలా మార్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పటిష్ట చర్యలు చేపడుతున్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల కర్షకులు నష్టపోకూడదని.. గత ఏడాది రూపాయి ప్రీమియానికే బీమా వర్తింపజేసిన ఆయన ఈ ఏడాదీ అదీ కట్టనవసరం లేదని, ప్రభుత్వమే పూర్తిమొత్తం చెల్లిస్తుందని అభయం ఇచ్చారు. ఫలితంగా హలధారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్‌కు జేజేలు పలుకుతున్నారు. ఆకివీడు: గత ఏడాది వైఎస్సార్ పంటల బీమా పథకంలో భాగంగా రూపాయి బీమా ప్రీమియంతో రైతులకు ఆసరాగా నిలిచిన ప్రభుత్వం ఈ ఏడాది మరో అడుగు ముందుకు వేసింది. ఈ ఏడాది రైతులు రూపాయి కూడా కట్టనవసరం లేదని స్పష్టం చేసింది. వైఎస్సార్ పంటల ఉచిత బీమా సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. గత ఏడాది రూపాయి ప్రీమియంతో బీమా సౌకర్యాన్ని జిల్లాలో 2,36,912 మంది వినియోగించుకున్నారు. వీరిలో వరి, చెరుకు రైతులు ఉన్నారు. వీరు 1,19,717.5 హెక్టార్లలో సేద్యం చేశారు. అయితే ఈ ఏడాది ప్రీమియం సొమ్ము మొత్తం ప్రభుత్వమే చెల్లించే విధంగా చర్యలు తీసుకుంది. ఈ–క్రాప్‌లో నమోదైన ప్రతి రైతుకూ బీమా సదుపాయం వర్తింపజేసింది. అంతేకాదు. వరి, చెరుకుతోపాటు ఉద్యానాల సాగు, మత్స్య పెంపకం రైతులకూ బీమా సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఈ ఖరీఫ్ సీజన్లో ఈ–క్రాప్ ఆధారంగా జిల్లాలోసాగు చేపట్టిన వరి, చెరకు, ఉద్యాన పంటలు, మత్స్యపెంపకానికి ఉచిత బీమా సౌకర్యం కల్పించింది. ఫలితంగా జిల్లాలో సుమారు 2.25 లక్షల హెక్టార్లలో వరి సాగుతోపాటు మరో 2 లక్షల హెక్టార్లలో ఇతర పంటలు సాగు చేస్తున్న సుమారు 6.11 లక్షల మందికి ఉచిత బీమా వర్తిస్తోంది. గతంలో బీమా ప్రీమియం అధికం గత ప్రభుత్వాల హయాంలో పంటల బీమా సౌకర్యం కోసం రైతుల వద్ద నుంచి అత్యధిక ప్రీమియం వసూలు చేసేవారు. 2017–18లో ఎకరాకు రూ.560, 2018–19లో ఎకరాకు రూ.480 చొప్పున ప్రీమియం వసూలు చేశారు. ముఖ్యమంత్రిగా వైఎస్.జగన్మోహన్రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత గత ఏడాది ఖరీఫ్ సాగులో పంటల బీమాకు ఎకరాకు రూపాయి మాత్రమే ప్రీమియం వసూలు చేశారు. చాలామంది రైతులు అదీ కట్టకపోవడంతో ఈ ఏడాది ఉచిత ప్రీమియం అమలు చేసి రైతును బలోపేతం చేసేందుకు వైఎస్ జగన్ చర్యలు చేపట్టారు. గతంలో క్లెయిమ్‌ల సొమ్ము ఇవ్వలేదు : గత ప్రభుత్వ హయాంలో రైతులు ప్రకృతి వైపరీత్యాలకు గురైతే పంటల బీమా అమలులో ఉన్నా.. రైతులకు క్లెయిమ్ సొమ్మును అందించలేదు. ప్రభుత్వం పట్టించుకోలేదు. సీఎం జగన్ ఇటీవల గత ప్రభుత్వంలో రావాల్సిన క్లెయిమ్ సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేసేలా చర్యలు తీసుకోవడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు తుపాన్లు, అధిక వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీని మంజూరు చేయలేదు. అభినందనీయం గత ప్రభుత్వాల హయాంలో ప్రకృతి వైపరీత్యాలు వస్తే రైతులకు చెల్లించాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కూడా తుపా న్లు, భారీ వర్షాలకు పంటలు తీవ్రంగా నష్టపోయాయి. ప్రస్తుత ప్రభుత్వం ఉచిత బీమా ప్రక టించడం అభినందనీయం. గత ప్రభుత్వాలు బకాయి పెట్టిన ఇన్పుట్ సబ్సిడీని ఇస్తే రైతులకు మేలు జరుగుతుంది. – మల్లారెడ్డి శేషమోహనరంగారావు, కిసాన్ సంఘ్ రాష్ట్ర ప్రతినిధి, అప్పారావుపేట ఇక ధీమాగా.. ఉచిత బీమా ఇవ్వడం రైతులకు నిజంగా ధీమా కలి్పంచినట్లే. వరి రైతులతోపాటు చేపల పెంపకందారులకు, ఇతర పంటలకు ఉచిత బీమా కలి్పంచడం నిజంగా అభినందనీయం. రైతులందరికీ ఇది శుభవార్త. సీఎం జగన్‌కు ధన్యవాదాలు. – కట్రెడ్డి కుసుమేశ్వరరావు, చేపల రైతు, పెదకాపవరం, ఆకివీడు మండలం ఈ–క్రాప్ విధానంతో ఉచిత బీమా ఈ–క్రాప్ విధానం ద్వారా ఉచిత బీమా సౌకర్యం కలి్పంచేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. నిబంధనలు, ఇతర వివరాలు అందాల్సి ఉంది. గత ఏడాది ఖరీఫ్‌లో రూపాయి ప్రీమియంతో రూ.51.97 కోట్లను 2,36,912 మంది రైతులు చెల్లించారు. – ఎం.డీ.గౌసియా బేగం, వ్యవసాయ సంచాలకులు, ఏలూరు -
10వేల స్థాయి వద్ద నిఫ్టీకి గట్టిమద్దతు
ప్రధాన బెంచ్‌మార్క్ ఇండెక్స్ నిఫ్టీకి 10000స్థాయి వద్ద కీలక మద్దతు స్థాయి నెలకొని ఉందని భారత ఈక్విటీ ఆప్షన్ ట్రేడర్లు విశ్వసిస్తున్నారు. ఎన్ఎస్ఈ గణాంకాల పరిశీలిస్తే.., నిఫ్టీ ఇండెక్స్ ఆప్షన్ కాంట్రాక్ట్‌ల్లో కెల్లా అత్యధిక ఓపెన్ ఇంటెస్ట్ర్ 10వేల స్ట్రైక్ ప్రైస్ పుట్ కాంట్రాక్టుల వద్ద ఉంది. దీని ప్రకారం గురువారం వరకు నిఫ్టీ 10వేల స్థాయిని పరిరక్షించుకోగలదని వారు అంచనా వేస్తున్నారు. నిఫ్టీ ఇండెక్స్ మార్చి నెల తరువాత తొలిసారి ఈ జూన్ 10000 స్థాయిని అధిగమించింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలను అందుపుచ్చుకున్న దేశీయ ఈక్విటీ సూచీలు... ఈ మార్చి కనిష్ట స్థాయిల నుంచి 35శాతానికి మించి రికవరీ అయ్యాయి. మరోవైపు ఇదే సమయంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ తొలిసారి 40ఏళ్ల కనిష్టాలను చవిచూసింది. నిఫ్టీ ఇండెక్స్ బేస్ 9,700 నుండి 10,000 కు పెరిగింది. సాంకేతికంగానూ బలంగా ఉంది. రాబోయే వారంలో 10,600-10,800 శ్రేణిని పరీక్షించడానికి ఇటీవలి గరిష్ట స్థాయి 10,350-10,400 పరిధిని అధిగమించాల్సి ఉంటుంది.’’ అని ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్ విశ్లేషకుడు సమీత్ చవాన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వారంలో గురువారం డెరివేటివ్ కాంట్రాక్టు ఎక్స్పైరీ తేది ఉండటం, కొన్ని దేశాల్లో కరోనా వైరస్ రెండో దశ వ్యాధి వ్యాప్తి మొదలు కావడం, అమెరికా-చైనాల మధ్య మరోసారి వాణిజ్య ఉద్రిక్తతలు తెరపైకి రావడం తదితర ప్రతికూల అంశాల దృష్టా్య ఈ వారం మార్కెట్ ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని మరికొందరు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. -
బంగ్లా ప్రేక్షకులు మద్దతివ్వరు
న్యూఢిల్లీ: కేవలం బంగ్లాదేశ్‌లో మాత్రమే టీమిండియాకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి ప్రోత్సాహం లభించదని భారత స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ అన్నాడు. శనివారం బంగ్లాదేశ్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్‌తో ఫేస్బుక్ లైవ్ చాట్‌లో సరదాగా ముచ్చటించిన రోహిత్ శర్మ... సంధి దశను అధిగమించి బంగ్లాదేశ్ ఎదిగిన తీరును అభినందించాడు. ‘భారత్, బంగ్లాదేశ్‌లలో క్రికెట్ వీరాభిమానులు ఉంటారు. వారు ఎంతగా ఆరాధిస్తారో ఆటలో మనవల్ల ఏదైనా తప్పు జరిగితే అంతే తీవ్రంగా విమర్శిస్తారు. బంగ్లాదేశ్‌లో మరీ ఎక్కువగా క్రికెట్‌ను ఆరాధిస్తారు. భారత్ అక్కడ మ్యాచ్ ఆడితే మాకు ప్రేక్షకుల నుంచి కనీస మద్దతు లభించదు. ఇదే నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మాకు మద్దతు దొరకని ప్రదేశం ఏదైనా ఉందంటే అది బంగ్లాదేశ్ మాత్రమే’ అని రోహిత్ సరదాగా వ్యాఖ్యానించాడు. ఐసీసీ టోర్నీల్లో బంగ్లాపై చెలరేగే రోహిత్ కారణంగా తమ అభిమానుల నుంచి తాను తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నానని తమీమ్ గుర్తు చేసుకున్నాడు. గతేడాది వన్డే ప్రపంచకప్ రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్‌లో 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రోహిత్ ఇచ్చిన క్యాచ్‌ను తమీమ్ వదిలేయడంతో సెంచరీతో చెలరేగిన ‘హిట్‌మ్యాన్’ భారత్‌ను గెలిపించాడు. ‘రోహిత్ భాయ్ మాపైనే నీ ప్రతాపం చూపిస్తావెందుకు? 2015 ప్రపంచకప్ క్వార్టర్స్‌లో ఓ సెంచరీ, 2017 చాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌లో మరో సెంచరీ, మొన్నటి ప్రపంచకప్‌లో నా పొరపాటు కారణంగా మరో సెంచరీ చేశావు. అప్పుడు ప్రేక్షకులు స్పందించిన తీరు నాకింకా గుర్తుంది. ఇక చేసేదేం లేక ఎలాగైనా నువ్వు ఔటవ్వాలని నేను కోరుకున్నా. కానీ నువ్వు 40 పరుగులకు చేరుకోగానే ఏం జరుగబోతుందో నాకు అర్థమైంది’ అంటూ తమీమ్ నాటి సంగతుల్ని గుర్తు చేసుకున్నాడు. -
వైద్యులకు అండగా ఉంటాం: సీఎస్ సోమేశ్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ సోకిన రోగులకు చికి త్స అందిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని రాష్ట్ర ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ పేర్కొన్నారు. కరోనా పాజిటివ్ రోగులకు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్న వైద్యులు, సిబ్బందితో శనివారం ఆయ న టెలి కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. రక్షణ పరికరాలు, పీపీఈలు, మాస్కుల లభ్యతతోపాటు వైద్యులు, సిబ్బంది.. నివాసం, రవాణా పరంగా ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గాంధీ, కింగ్ కోఠి, సరోజినీదేవి కంటి ఆస్పత్రి, ఛాతీ, నేచర్ క్యూర్, నిజామాబాద్, వరంగల్ ఎంజీఎం ఆస్పత్రుల వద్ద రక్షణ ఏర్పాట్లను డీజీపీ మహేందర్‌రెడ్డి ఈ సమావేశంలో వైద్యులకు వివరించారు. -
హెచ్డీఎఫ్సీ గ్రూప్ : రూ.150 కోట్ల సాయం
సాక్షి, ముంబై: ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ హెచ్‌డిఎఫ్‌సి గ్రూప్ కరోనాపై పోరుకు సాయం చేసేందుకు నిర్ణయించింది. కోవిడ్ -19 మహమ్మారిని అరికట్టేందుకు పాటుపడుతున్న కేంద్ర ప్రభుత్వానికి రూ .150 కోట్ల సహాయాన్ని ప్రకటించింది. ప్రధానమంత్రి సిటిజెన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిట్యువేషన్స్ ఫండ్ (పీఎం-కేర్స్ ఫండ్)కి ఈ సాయాన్ని అందించనునున్నామని హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్ చైర్మన్ దీపక్ పరేక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తమ వంతు సాయంగా బాధితుల ఉపశమన, పునరావాస చర్యలకు మద్దతుగా నిలవాలని భావిస్తున్నట్టు చెప్పారు. ఇది మనందరికీ అనిశ్చితమైన, కష్టమైన సమయం. కరోనాని అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు దేశవ్యాప్తంగా సాయుధ పారామిలిటరీ దళాలు, స్థానిక పోలీసులు, ఆరోగ్య నిపుణులు, పారిశుద్ధ్య కార్మికులు నిరంతరాయంగా శ్రమిస్తూ ఎనలేని సేవలందిస్తున్నారు. వారికి మద్దతుగా నిలవాలన్నారు. చదవండి : కరోనాపై పోరు : గూగుల్ భారీ సాయం చైనా నగరంలో కుక్క మాంసంపై శాశ్వత నిషేధం -
గుండుతో వార్నర్....
మెల్బోర్న్: ప్రపంచవ్యాప్తంగా కరోనా సృష్టిస్తోన్న అలజడి ఎంత తీవ్రంగా ఉందో అందరికీ తెలిసిందే. ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు పోలీస్, వైద్య సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి నిరంతరం ప్రజల్ని కాపాడుతున్నారు. ఈ నేపథ్యంలో వీరి సేవకు ఆస్ట్రేలియా డాషింగ్ బ్యాట్స్‌మన్, ఓపెనర్ డేవిడ్ వార్నర్ వినూత్నంగా మద్దతు తెలిపాడు. అత్యంత కఠిన పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తోన్న వారికి సంఘీభావంగా వార్నర్ ట్రిమ్మర్ సహాయంతో స్వయంగా గుండు గీసుకున్నాడు. జుట్టును షేవ్ చేసుకుంటున్న వీడియోను మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న వార్నర్... మరో ఎనిమిది మందికి ఈ చాలెంజ్‌ను విసిరాడు. ఇందులో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ కోహ్లి, స్టీవ్ స్మిత్, కమిన్స్, జో బర్న్స్, స్టొయినిస్, జంపా కూడా ఉన్నారు. -
అండగా ఉంటాం
గజ్వేల్/జోగిపేట/సిద్దిపేటజోన్: రాష్ట్రంలో 4 లక్షల మంది వలస కార్మికులు ఉన్నారని, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు భరోసా ఇచ్చారు. మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ముట్రాజ్‌పల్లిలో వలస కార్మిక కుటుంబాలకు బియ్యం, రూ. 500 నగదు అందజేశారు. అలాగే జోగిపేటలో అధికారులతో సమీక్షించారు. సిద్దిపేటలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ.. కార్మికులు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా 100 నంబరుకు డయల్ చేస్తే అధికారులు సాయం చేస్తారని చెప్పారు. కరోనా వ్యాప్తి చెందుతున్న తరుణంలో ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడి ప్రాజెక్టుల్లో పని చేస్తున్న వలస కార్మికులంతా తమ ఆత్మీయులేనని, వారిని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని మంత్రి చెప్పారు. ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. సరుకుల పంపిణీ సందర్భంగా ‘భౌతిక దూరం’ పాటించిన వలస కార్మికులు -
వికేంద్రీకరణకే మద్దతు..
సాక్షి, గుంటూరు: అభివృద్ధి వికేంద్రీకరణను కాంక్షిస్తూ ఆంధ్రప్రదేశ్ బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏపీ రాజధాని మందడంలో చేపట్టిన రిలే దీక్షలు 6వ రోజు కొనసాగుతున్నాయి. దీక్షలకు బీసీ ఐక్యవేదిక, ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్, నేషన్ దళిత సంఘం, మాదిగ ఐక్య వేదికలు మద్దతు తెలిపాయి. వికేంద్రీకరణ దీక్షకు రోజురోజుకు మద్దతు పెరుగుతుంది. మండుటెండలను సైతం లెక్క చేయకుండా భారీసంఖ్యలో మహిళలు తరలివస్తున్నారు. వికేంద్రీకరణను అడ్డుకునేందుకు టీడీపీ నాయకులు అనేక కుట్రలు చేస్తున్నారని దళిత సంఘాల నేతలు మండిపడ్డారు. మూడు రాజధానులకే తమ మద్దతంటూ అమరావతిలో దళిత, బీసీ, మహిళా, ప్రజా సంఘాల నేతలు గళమెత్తున్నారు. (వికేంద్రీకరణతోనే ప్రగతి) -
ఇది ఫెవికాల్ బంధం
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మధ్య అనుబంధం ఫెవికాల్ కన్నా దృఢమైనదని మరోసారి నిరూపితమైంది. స్థానిక సంస్థల్లో మిత్రపక్షం బీజేపీతో కలిసి పోటీ చేస్తున్నట్లు కనపడుతున్నా, చాలా స్థానాల్లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ గెలుపు కోసమే జనసేన సహకారం అందిస్తోంది. మొన్నటి అసెంబ్లీ – లోకసభ ఎన్నికల సమయంలో లోపాయికారీగా జనసేన పార్టీ కొన్ని చోట్ల తన సొంత గెలుపును పక్కనపెట్టి టీడీపీ గెలుపునకు సహకరించిన విషయం తెలిసిందే. ఇప్పుడూ అదే రీతిలో ‘స్థానిక’ ఎన్నికల్లో టీడీపీకి కనీస గౌరవం దక్కించడానికి వీలుగా జనసేన అధినేత పావులు కదుపుతున్నారు. ఇదీ అంతర్గత ఒప్పందం ►కొన్ని మండలాల్లో జెడ్పీటీసీ స్థానంలో జనసేన, ఎంపీపీ పదవిని టీడీపీ పంచుకొని పోటీ చేస్తున్నాయి. ►మరికొన్ని మండలాల్లో కొన్ని ఎంపీటీసీ పదవులకు మాత్రమే పోటీ చేసిన జనసేన.. ఎంపీపీ, జెడ్పీటీసీ పదవులు రెండింటిలోనూ తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం పని చేస్తోంది. ►తెలుగుదేశం పార్టీ గెలుపునకు కొద్దో గొప్పో అవకాశాలున్న చోట జనసేన అభ్యర్థి పోటీకి సిద్ధమైతే.. వారు నామినేషన్లు ఉపసంహరించుకోవాలని పవన్ కల్యాణ్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే వారు సూచిస్తున్నారు. ►టీడీపీకి వ్యతిరేకంగా పని చేయకుండా ఆయా జిల్లాల నాయకులకు సూచనలు చేసినట్లు సమాచారం. ►టీడీపీ ప్రయోజనాల కోసం బీజేపీని జనసేన వాడుకుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. భీమవరంలోనే పదవుల పంపకం ►పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అసెంబ్లీ నియోజకవర్గంలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ స్వయంగా పోటీ చేసి ఓడిపోయిన విషయం విదితమే. ఆ నియోజకవర్గంలో భీమవరం రూరల్, వీరవాసరం మండలాల్లో ఎంపీపీ, జెడ్పీటీసీ పదవులను టీడీపీ, జనసేన నేతలు పంచేసుకుంటూ లోపాయికారీ ఒప్పందంతో పోటీకి దిగారు. ►భీమవరం జెడ్పీటీసీ బరిలో జనసేన పోటీలో లేదు. ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థి బరిలోకి దిగారు. ►ఈ మండలంలో కాపు సామాజిక వర్గంతోపాటు మత్స్యకారులు జనసేనకు అండగా ఉంటున్నారు. దీంతో అధికంగా ఓట్లు ఉన్న మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని తెలుగుదేశం పార్టీ తరఫున నిలబెట్టారు. ఇక్కడి ఎంపీపీ పదవిని జనసేన పార్టీకి కేటాయించే విధంగా ఒప్పందం చేసుకున్నారు. ►వీరవాసరం మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉండడంతో జెడ్పీటీసీ స్థానంలో జనసేన, ఎంపీపీ పదవికి టీడీపీ పోటీ చేసే విధంగా ఒప్పందం చేసుకున్నారు. ►భీమవరం రూరల్ మండలంలో జనసేన పార్టీ పోటీ చేస్తున్న వెంప, శ్రీరామపురం, పెదగరవు ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ కనీసం నామినేషన్లు కూడా దాఖలు చేయలేదు. కొన్ని చోట్ల జనసేన నామినేషన్లు దాఖలు చేసినప్పటికీ, వారి నామినేషన్ల ఉపసంహరణకు ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయి. ►నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలంలో జెడ్పీటీసీ అభ్యర్థిగా తెలుగుదేశం నుంచి అభిశెట్టి పద్మకుమారి నామినేషన్ వేశారు. గతంలో పెరవలి జెడ్పీటీసీగా ఉన్న అరిటికాయల రమ్యశ్రీ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి 24 వేల ఓట్లు సాధించింది. ఇప్పుడు తాజాగా తమకు బలం ఉన్న పెరవలి మండలంలో జనసేన జెడ్పీటీసీ రేసు నుంచి తప్పుకుని తెలుగుదేశం పార్టీకి లోపాయికారీగా మద్దతు ప్రకటించింది. దీనికి ప్రతిఫలంగా ఎంపీపీ పదవి లక్ష్యంగా రమ్యశ్రీ భర్త మురళీకృష్ణ బరిలోకి దిగనున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలోనూ అదే వైఖరి ►జనసేన పార్టీలో పవన్ కల్యాణ్ తర్వాత నాదెండ్ల మనోహర్ నిర్ణయాలే కీలకం. మనోహర్ సొంత నియోజకవర్గం గుంటూరు జిల్లా తెనాలి రూరల్ మండలంలో 21 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. టీడీపీకి మేలు జరిగేలా జనసేన నుంచి కేవలం 12 స్థానాలకు మాత్రమే నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ స్థానాల్లో జనసేన మిత్రపక్షంగా ఉన్న బీజేపీ సైతం పోటీలో లేదు. ►ఇదే నియోజకవర్గంలోని కొల్లిపర మండలంలో 16 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా, 5 స్థానాల్లోనే జనసేన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ►జనసేన పోటీ చేయని 11 స్థానాలకు గాను 3 గ్రామాల్లో మాత్రమే బీజేపీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. ‘తూర్పు’న లోపాయికారీ ఒప్పందం ►తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి–1 ఎంపీటీసీ స్థానంలో టీడీపీ తరఫున పోటీ చేస్తున్న మాజీ జెడ్పీటీసీ సభ్యుడు దేశంశెట్టి లక్ష్మీనారాయణ సతీమణి దేశంశెట్టి రత్నకుమారికి మేలు జరిగేలా జనసేన వదులుకుంది. ►ఈ ఎంపీటీసీ స్థానం పరిధిలో గత సాధారణ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి మెజార్టీ వచ్చింది. రెండో స్థానంలో జనసేన నిలిచింది. అతి తక్కువ ఓట్లు వచ్చి మూడో స్థానంలో నిలిచిన టీడీపీకి ఇక్కడ జనసేన మద్దతు ఇవ్వడం గమనార్హం. ఇందుకు బదులుగా భీమనపల్లి–2 ఎంపీటీసీ స్థానాన్ని జనసేన కోసం టీడీపీ వదులుకుంది. ►అమలాపురం మండలంలో గత సాధారణ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తొలి స్థానంలో నిలబడగా జనసేన రెండో స్థానంలో నిలిచింది. ఇప్పుడు ఈ జెడ్పీటీసీ స్థానానికి పెద్దగా పేరు లేని చీకురమిల్లి కిరణ్‌కుమార్‌ను జనసేన ఎంపిక చేసింది. ఇక్కడ టీడీపీ నుంచి పోటీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు కోసమే జనసేన బలహీన అభ్యర్థిని బరిలోకి దించింది. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం గడియారం స్తంభం సెంటర్లో జనసేన, టీడీపీ జెండాలతో ర్యాలీ పావుగా మారిన బీజేపీ జెడ్పీటీసీ స్థానాల్లో జనసేన కాకుండా బీజేపీ పోటీలో ఉంటేనే టీడీపీకి గౌరవప్రదమైన సంఖ్యలో ఓట్లు వస్తాయని జనసేన పెద్దలు వ్యూహం పన్నారు. ఇందులో భాగంగానే జెడ్పీటీసీ స్థానాల్లో అత్యధికం బీజేపీ.. ఎంపీటీసీ స్థానాల్లో అత్యధికం జనసేన పార్టీలు పోటీ చేయాలని ఒప్పందం చేసుకున్నారు. ఈ ప్రకారం మొత్తం 652 జెడ్పీటీసీ స్థానాల్లో అత్యధికంగా 433 మంది బీజేపీ అభ్యర్థులు, 270 మంది జనసేన అభ్యర్థులు (కొన్ని చోట్ల ఇద్దరు అభ్యర్థులు) నామినేషన్లు దాఖలు చేశారు. ►ఒప్పందం మేరకు ఎంపీటీసీ స్థానాల విషయంలో జనసేన పార్టీ దాదాపు మూడింట రెండు వంతుల ఎంపీటీసీ స్థానాల్లో పోటీ చేయాల్సి ఉంది. ►కానీ 9,696 ఎంపీటీసీ స్థానాలకు గాను జనసేన అభ్యర్థులను బరిలోకి దించింది కేవలం 2,027 స్థానాల్లో మాత్రమే. బీజేపీ తరఫున కేవలం 1,816 మంది అభ్యర్థులు ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేశారు. అంటే ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నది 3,843 చోట్ల మాత్రమే. ►మిగిలిన చోట్ల లోపాయికారీ ఒప్పందం ప్రకారం జనసేన టీడీపీ అభ్యర్ధులకే మద్దతు ఇవ్వనుంది. ►అనంతపురం జిల్లాలో 13 జెడ్పీటీసీ స్థానాల్లో బీజేపీ–జనసేన అభ్యర్థులను బరిలో నిలుపలేదు. ►841 ఎంపీటీసీ స్థానాలకు గాను బీజేపీ 200, జనసేన 83 స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశాయి. టీడీపీకి మేలు జరిగేలా మిగిలిన స్థానాలకు నామినేషన్లు వేయలేదు. -
రాజమండ్రిలో వికేంద్రీకరణకు మద్దతుగా రిలే నిరాహార దీక్ష
-
రజనీకాంత్ అసలు రాజకీయం ఇదీ!
సాక్షి, చెన్నై: పౌరసత్వం (సవరణ) చట్టానికి మద్దతుగా నటుడు రజనీకాంత్ చేసిన ప్రకటనకు వరుస కౌంటర్లు పేలుతున్నాయి. సీఏఏ, ఎన్పీఆర్ గురించి ప్రతిపక్ష పార్టీలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయన్న రజనీకాంత్ వ్యాఖ్యలను తమిళనాడు ప్రతిపక్ష నాయకులు తీవ్రంగా ఖండించారు. అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థికమంత్రి చిదంబరం రజనీకాంత్‌పై విమర్శలు గుప్పించారు. అధికార బీజేపీ చేతిలో ఆయన కీలు బొమ్మగా మారిపోయాడని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అళగిరి మండిపడ్డారు. సీఏఏ అమల్లోకి వస్తే 17 కోట్ల మంది ముస్లింలు, మూడు కోట్ల మంది క్రైస్తవులతోపాటు 83 కోట్ల మంది హిందువులు కూడా ప్రభావితమవుతారు. అస్సాంలో 19 లక్షల మంది పౌరులను విదేశీయులుగా ప్రకటించారు. ఈ జాబితాలో ముస్లింలు, హిందువులు ఉన్నారనే సంగతి రజనీకాంత్‌కు తెలుసా అని అళగిరి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసోంలో మాదిరిగా దేశవ్యాప్తంగా నిర్బంధ కేంద్రాలు ఏర్పాటు చేయాలను కుంటున్నారా? అని ప్రశ్నించారు. రజనీకాంత్ తమిళనాడులో మతపరమైన ఎజెండాను భుజానకెత్తుకున్నారని స్పష్టమైందనీ, రజనీ అసలు రాజకీయాలు ఇప్పుడు బహిర్గతమ య్యాయని విమర్శించారు. మతం ప్రాతిపదికన పౌరులపై వివక్ష చూపలేమని రాజ్యాంగం చాలా స్పష్టంగా పేర్కొందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కె బాలకృష్ణన్ వ్యాఖ్యానించారు. బీజేపీకి రజనీకాంత్ మద్దతు ఇవ్వాలనుకుంటే ఇచ్చుకోవచ్చు.. కానీ వాస్తవాలను మరుగుపరచకూడదన్నారు. జనాభా గణన, ఎన్పీఆర్ వేర్వేరు అనే విషయాన్ని ఆయన మొదట అర్థం చేసుకోవాలని హితవు పలికారు. అలాగే కాంగ్రెస్ సీనియర్‌నేత, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పీ చిదంబరం రజనీకాంత్ వ్యాఖ్యలపై నిరాశ వ్యక్తం చేశారు. సీఏఏ ఎందుకు వివక్షాపూరితమైందో, రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ఉల్లంఘన ఎలా అవుతుందో రజనీకాంత్ వివరించేవాడినని ఆయన ట్వీట్ చేశారు. అటు కాంగ్రెస్ నేత, ఎంపీ కార్తీచిదంబరం కూడా రజనీకాంత్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నట్లు రజనీ నటించాల్సిన అవసరం లేదని కార్తీ ఎద్దేవా చేశారు. ఆయన బీజేపీలో చేరవచ్చని పేర్కొన్నారు. కాగా పౌరసత్వ సవరణ చట్టానికి సూపర్‌స్టార్ రజనీకాంత్ మద్దతును ప్రకటించిన విషయం తెలిసిందే. సీఏఏపై బుధవారం స్పందించిన రజనీ సీఏఏ వలన ముస్లింలకు ఎలాంటి ముప్పు లేదని, ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగితే వారి తరపున పోరాడే మొదటి వ్యక్తిని తానే అవుతానని రజనీ ప్రకటించారు. చదవండి :సీఏఏ, ఎన్పీఆర్పై రజనీకాంత్ కీలక వ్యాఖ్యలు Disappointed with Mr.Rajnikanth’s statement on CAA. If he had asked me, I would’ve explained to him why the CAA is discriminatory and violates Art 14 of the Constitution. — P. Chidambaram (@PChidambaram_IN) February 5, 2020 -
సీఏఏ, ఎన్పీఆర్పై రజనీ కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ పౌరసత్వ సవరణ చట్టంపై కీలక వ్యాఖ్యలు చేశారు. సీఏఏ వ్యతిరేక ఆందోళనలు, అనుకూల గళాలు ముమ్మరంగా వినిపిస్తున్న నేపథ్యంలో బుధవారం వివాదాస్పద చట్టానికి మద్దతుగా నిలిచారు. సీఏఏ చట్టం ఏ భారతీయ పౌరుడిని ప్రభావితం చేయదని పేర్కొన్నారు. ముఖ్యంగా దేశంలోని ముస్లింలకు సీఏఏ వల్ల ఎలాంటి ముప్పు ఉండదనీ, ఒకవేళ వారు ఇబ్బందులను ఎదుర్కొంటే, వారికి అండగా నిలబడే మొదటి వ్యక్తి తానే అవుతానని రజనీకాంత్ వెల్లడించారు. అలాగే జాతీయ పౌర పట్టిక (ఎన్పీఆర్) చాలా అవసరమని కూడా వ్యాఖ్యానించారు. బయటివారు ఎవరో తెలుసుకోవడం అవసరమని ఆయన పేర్కొన్నారు. భారత, పాకిస్తాన్ విభజన సందర్భంగా భారతదేశంలో ఉండటానికే నిర్ణయించుకున్న ముస్లింలను దేశం నుండి ఎలా పంపిస్తారు?" అని రజనీకాంత్ ప్రశ్నించారు. సీఏఏకి వ్యతిరేకంగా కొనసాగుతున్న హింసాత్మక నిరసనలపై ఆందోళన వ్యక్తం చేయడంతోపాటు, దేశ భద్రత, సంక్షేమం కోసం ప్రజలు ఐక్యంగా, అప్రమత్తంగా ఉండాలంటూ గతంలో రజనీకాంత్ విజ్ఞప్తి చేయడం గమనార్హం. మోదీ సర్కార్ తీసుకొచ్చిన సీఏఏపై ఇప్పటివరకూ మౌనాన్ని ఆశ్రయించిన రజనీకాంత్ చివరకు మద్దతు పలకడం విశేషం. (ఎన్పీఆర్ అంటే ఏంటి.. ఆ రాష్ట్రానికి ఎందుకు మినహాయింపు?) కాగా దేశీయంగా, ప్రపంచవ్యాప్తంగా నిరసనల మధ్య గత డిసెంబర్లో భారతదేశంలో కొత్త పౌరసత్వ చట్టం అమల్లోకి వచ్చింది. దీంతో సీఏఏ అమలును వ్యతిరేకిస్తూ తీవ్ర ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఢిల్లీలోని షాహీన్ బాగ్ వద్ద 50 రోజులుగా ఆందోళన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. చదవండి : వరుస కాల్పులు, సీనియర్ అధికారిపై వేటు ఆజాదీ కావాలా అంటూ తెగబడిన ఉన్మాది Rajinikanth: Citizenship Amendment Act will not affect any citizen of our country, if it affects Muslims then I will be the first person to stand up for them. NPR is a necessity to find out about the outsiders. It has been clarified that NRC has not been formulated yet. pic.twitter.com/wyXMCY8pH9 — ANI (@ANI) February 5, 2020 -
వికేంద్రీకరణ మద్దతుగా కడపలో రీలే నిరాహార దీక్షలు
-
ఇష్టమున్నా.. లేకున్నా.. సీఏఏ అమలు
చార్మినార్/దూద్‌బౌలి: ఎవరికి ఇష్టమున్నా.. లేకున్నా.. దేశంలో సీఏఏ అమలు తప్పకుండా జరుగుతుందని పలువురు వక్తలు స్పష్టం చేశా రు. ఆర్టికల్ 11 ప్రకారం కేంద్రం చేసిన చట్టాన్ని దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తప్పకుండా పాటించాల్సిన అవసరముందన్నారు. సీఏఏ చట్టాన్ని అమలు చేయని రాష్ట్రాలపై కేంద్రం తగిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించా రు. కొన్ని రాజకీయ పార్టీల నాయకులు కావాల ని స్వార్థ రాజకీయ లబ్ధి కోసం ముస్లింలను తప్పుదారి పట్టిస్తున్నారని వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. అఖండ భారత్ సంఘర్ష్ సమితి భాగ్యనగర్ కన్వీనర్ ఆలే భాస్కర్ రాజ్ ఆధ్వర్యంలో ఆదివారం కుడా స్టేడియంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఎమ్మెల్సీ, నగర బీజేపీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు, రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్‌రావు, సుప్రీంకోర్టు న్యాయవాది సుభూహీ ఖాన్ తదితరులు పాల్గొని సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్లపై ప్రజలకు అవగాహన కల్పించారు. భారత్ మాతాకీ జై.. మోదీ, అమిత్‌షా జిందాబాద్ అంటూ.. తిరంగా జెండాలు పట్టుకొని పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్వార్థ రాజకీయ లబ్ధి కోసం ముస్లింలను తప్పుదోవ పట్టిస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్ రావు అన్నారు. ఆయనకు దమ్ము, ధైర్యం ఉంటే కుడాలో నిర్వహిస్తున్న ఈ సభకు రావాలని.. తామే దారుస్సలాంకు వచ్చి డిబేట్ నిర్వహిస్తామని సవాలు విసిరారు. గతంలో బంగ్లాదేశ్‌కు చెందిన తస్లీమా నస్రీన్ నగరానికి వచ్చి ప్రెస్‌క్లబ్‌లో సమావేశాన్ని నిర్వహిస్తే మజ్లీస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆమెపై విచక్షణారహితంగా దాడులు నిర్వహించారన్నారు. దాడులు చేసిన మజ్లీస్ పార్టీ నాయకులపై ఇప్పటికైనా నగర పోలీసులు కేసులు నమోదు చేసి చార్జ్‌షీట్ వేయాల్సిన అవసరముందన్నారు. అసదుద్దీన్‌తో చేతులు కలిపిన సీఎం కేసీఆర్.. సీఏఏను తెలంగాణలో అమలు చేయబోమంటూ ప్రకటిస్తున్నారని, అవసరమైతే అసెంబ్లీలో ప్రకటన చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని వ్యతిరేకించడం సరైంది కాదని పేర్కొన్నారు. ఎన్నార్సీ, ఎన్పీఆర్ల సందర్భంగా ఇంటికి వచ్చే అధికారులు ఎలాంటి పత్రాలు అడగబోరని.. కేవలం 14 ప్రశ్నలకు జవాబులను మాత్రమే సేకరిస్తారన్నారు. కార్యక్రమంలో హిందూ సంఘటన్ అధ్యక్షుడు కరుణసాగర్, కార్పొరేటర్లు ఆలే లలిత నరేంద్ర, రేణు సోనీల, బీజేపీ నేతలు పాల్గొన్నారు. సభకు హాజరైన ప్రజలు -
కార్మికుల హక్కులను కేంద్రం హరిస్తోంది..
సాక్షి, విజయవాడ: ఈ నెల 8న దేశవ్యాప్తంగా జరగనున్న సార్వత్రిక సమ్మె, రాష్ట్ర బంద్‌కు వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ మద్దతు ప్రకటించింది. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పూనూరు గౌతమ్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కనీస వేతనాలపై కార్మికుల హక్కులను కేంద్ర ప్రభుత్వం హరిస్తోందని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరవాలన్నారు. 8న విజయవాడ రథం సెంటర్ నుంచి లెనిన్ సెంటర్ వరుకు వేలాది మందితో భారీ ప్రదర్శన నిర్వహిస్తామని తెలిపారు. అన్ని జిల్లాల నుండి కార్మికులు సమ్మెకు సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు. సమ్మెలో వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ సభ్యులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. సీపీఎం నేత ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. కార్మికుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించకపోతే..ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ సమ్మెకు వామపక్షాలు మద్దతునిస్తున్నాయని పేర్కొన్నారు. -
సీఏఏపై బీజేపీ ప్రచారం
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టాని(సీఏఏ)కి మద్దతు కూడగట్టేందుకు బీజేపీ సోమవారం సోషల్ మీడియా వేదికగా ‘ఇండియా సపోర్ట్ సీఏఏ’పేరుతో సరికొత్త ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఆ«ధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ సీఏఏకు అనుకూలంగా మాట్లాడిన వీడియో క్లిప్పింగ్‌ను ప్రధాని మోదీ పోస్ట్ చేశారు. శరణార్థులకు పౌరసత్వం ఇవ్వడం కోసమే సీఏఏ తప్ప ఎవరి పౌరసత్వాన్నీ తొలగించేది కాదంటూ మోదీ వ్యక్తిగత ట్విట్టర్ ఖాతాలో ట్వీట్‌చేశారు. ‘ఇండియా సపోర్ట్ సీఏఏ’హ్యాష్‌ట్యాగ్ తో ఈ మెసేజ్‌ను పోస్ట్ చేశారు. అలాగే, సీఏఏ అనుకూల ప్రజాస్పందనను ప్రతిబింబించే వివిధ అంశాలనూ, వీడియోలనూ, గ్రాఫిక్స్‌నూ ప్రధానమంత్రి నమో యాప్‌లో పెట్టాలని ప్రజలను కోరారు. సీఏఏ భారత పౌరులకు ఎలాంటి నష్టం చేకూర్చదని, మతపర వివక్ష ఈ చట్టంలో లేదని, అందుకే సమర్థిస్తున్నామంటూ బీజేపీ ఉపాధ్యక్షుడు వై జయంత్ జే పాండా ట్వీట్ చేశారు. -
సీఏఏ : మరో కీలక పరిణామం
సాక్షి, న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్ట వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఒకవైపు దేశవ్యాప్తంగా సీఏఏకి వ్యతిరేక ఆందోళనలు మిన్నంటాయి. విద్యార్థిలోకం సాహిత్య కారులు, పలువురు మేధావులు ఈ చట్టం ఆటవిక చట్టమని విమర్శిస్తుండగా, మద్దతుగా మరికొంతమంది మేధావులు ముందుకు రావడం విశేషం. దాదాపు 1100 మంది ప్రముఖులు, మేధావులు బహిరంగ లేఖ రాశారు. ప్రముఖ విద్యావేత్తలు, సాహిత్య కారులు సహా, దేశంలోని వివిధ యూనివర్శిటీలకు చెందిన ఉన్నతాధికారులు, పలువురు సీనియర్లు దీనిపై సంతకాలు చేశారు. ఈ విషయంలో ప్రజలు తప్పుడు ప్రచారానికి పూనుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా పౌరసత్వ చట్టాన్ని తీసుకొచ్చిన పార్లమెంటును అభినందించారు. మరోవైపు వివాదాస్పద పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా చెలరేగిన నిరసనలు, హింసాత్మక ఘటనల నేపథ్యంలో పరిస్థితిని అంచనావేసేందుకు, భద్రతపై చర్చించడానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ శనివారం మంత్రులతో సమావేశమయ్యారని పేరు చెప్పడానికి ఇష్టపడని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. కాగా సీఏబీ ప్రతిపాదన మొదలు ఈశాన్య రాష్ట్రమైన అసోం సహా దేశంలోని పలు ప్రాంతాల్లో అందోళనలు మిన్నంటాయి. పౌరసత్వ సవరణ చట్టం అమానవీయమైందనీ, ముస్లింలపై వివక్ష చూపుతుందని, దేశ లౌకిక రాజ్యాంగాన్ని బలహీనపరుస్తుందని విమర్శకులు భావిస్తున్నారు. ఈ చట్టాన్ని కేంద్రం తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. గత వారం పార్లమెంటు చట్టాన్ని ఆమోదించినప్పటి నుండి పోలీసులు, నిరసనకారుల మధ్య హింసాత్మక ఘర్షణల్లో కనీసం 14 మంది మరణించారు. More than 1,000 academicians from universities across the country release statement in support of Citizenship Amendment Act — Press Trust of India (@PTI_News) December 21, 2019 -
కార్మిక సంఘాల ఏర్పాటు ప్రజాస్వామిక హక్కు: అశ్వత్థామరెడ్డి
చంపాపేట: కార్మికుల సంక్షేమం కోసం సంఘాలు, యూనియన్ల ఏర్పాటు ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగం కల్పించిన హక్కని, వాటిని కాలరాయాలని చూస్తే సహించేది లేదని తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామరెడ్డి హెచ్చరించారు. చంపాపేట డివిజన్ పరిధిలోని చంద్రాగార్డెన్‌లో మంగళవారం ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు తిరుపతి ఏర్పాటు చేసిన కేంద్రకమిటీ సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ..సమ్మెకాలంలో మరణించిన ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు యూనియన్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఆర్టీసీ యాజమాన్యం కార్మికులపై కక్ష సాధింపులకు దిగుతున్నారని ఆవిధానం మానుకోక పోతే మళ్ళీ ఆందోళన బాట పట్టక తప్పదన్నారు. బస్సుల సంఖ్యను కుదించటం వల్ల కార్మికులు డ్యూటీల కోసం బస్‌డిపోల ముందు పడిగాపులు కాయటమే కాకుండా ఓవర్‌లోడ్ ప్యాసింజర్‌తో కార్మికులు పని ఒత్తిడికి గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి బస్ డిపోలో విధినిర్వహణలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్మికుల సమస్యలపై అవగాహన లేని వ్యక్తులను కార్మిక సంక్షేమ సభ్యులుగా నియమించటం వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. -
మహా ప్రాణదీపం
కోరకుండానే దేవుడు వరమిచ్చినంత ఆనందంగా ఉంది ఆ కుటుంబం.. అనారోగ్యవంతుల పాలిట ఆపద్బాంధవిగా ఉన్న ఆరోగ్యశ్రీ పథకం తమ కుమార్తెకు వర్తించదని తెలుసుకున్న తల్లిదండ్రులు ఎంతో కుమిలిపోయారు. తమను ఆదుకునే దిక్కెవ్వరని కన్నీళ్లు పెట్టుకున్నారు. బాలిక సహ విద్యార్థులు, కళాశాల యాజమాన్యం చందాలు వేసుకొని కొంత సాయం చేశా రు. చికిత్సకు లక్షల్లో అవసరం కావడంతో.. చేయూతనందించే ఆదరవు కోసం ఎదురుచూస్తున్న దశలో ఓ సంతోషకర వార్త.. బాలిక అనారోగ్యం గురించి ‘సాక్షి’ పత్రిక ద్వారా తెలుసుకున్న ఆరోగ్యశ్రీ అధికారులు ప్రత్యేక కేసుగా పరిగణించి అవసరమైనంత సాయం చేస్తామని ముందుకు వచ్చారు. శ్రీకాకుళం: మెదడుకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న డిగ్రీ విద్యార్థిని జస్మితను ఆరోగ్యశ్రీ పథకం ఆదుకుంటోంది. నగరంలోని ఆ నిరుపేద కుటుంబానికి చెందిన ఈ బాలిక కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతోంది. చికిత్స పొందుతున్నా ఎప్పటికీ వ్యాధి నయం కాకపోవడంతో స్థానిక వైద్యులు విశాఖపట్నం కేజీహెచ్‌కు రిఫర్ చేశారు. అక్కడ పరీక్షలు చేసిన వైద్యులు జస్మితకు శస్త్ర చికిత్స అవసరమని తేల్చారు. నిరుపేద కుటుంబమైన వీరికి శస్త్ర చికిత్స జరిపించేందుకు అవసరమైన రూ.6 లక్షలు భరించలేమని మానసికంగా కుంగిపోయారు. జస్మిత చదువుతున్న కళాశాల విద్యార్థులు, యాజమాన్యం రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ విషయం సాక్షిలో ప్రచురితం కావడంతో స్థానిక ఆరోగ్యశ్రీ అధికారులు స్పందించారు. పేదలు ఎటువంటి వ్యాధి తో బాధపడుతున్నా స్పందించి రాష్ట్రస్థాయి అధికారుల దృష్టికి తీసుకురావాలని అప్పటికే ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్‌లో ఆదేశించడంతో దీనిని అధికారులు ఆచరణలో పెట్టారు. జస్మితకు ఉన్న వ్యాధి ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాదని, నిరుపేద కుటుంబమని చెప్పడంతో రాష్ట్ర అధికారులు తక్షణం స్పందించి ప్రత్యేక కేసుగా పరిగణించి చికిత్సలు చేయించాలని జిల్లా ఆరోగ్యశ్రీ అధికారులను ఆదేశించారు. ఈ విషయం సోమవారం జస్మిత కుటుంబ సభ్యులకు తెలియడంతో వారంతా ఆనందపడుతూ విశాఖపట్నం వెళ్లారు. అయితే అక్కడ బుధవారం రావాలని చెప్పడంతో తిరిగి నగరానికి చేరుకున్నారు. రానున్న శుక్ర, శని వారాల్లో గాని, సోమవారం గాని జస్మితకు శస్త్ర చికిత్స జరిగే అవకాశాలున్నాయి. వైఎస్సార్ కుటుంబానికి రుణపడి ఉంటాం.. బిడ్డను ఆరోగ్యశ్రీ పథకం ఆదుకుందని జస్మిత తండ్రి రాము ‘సాక్షి’తో ఆనందం వ్యక్తం చేశారు. తాపీమేస్త్రి గా పనిచేస్తున్న తనకు అంత పెద్ద మొత్తం వెచ్చించే స్థోమత లేదని, తమ కూతురు పడుతున్న బాధ చూడలేక రోజూ తన భా ర్య, తాను కుంగిపోయేవారమన్నారు. బాగా చదివే జస్మిత తమను ఆదుకుంటుందని భావించి ఎన్ని కష్టాలు ఎదురైనా చదివించామన్నారు. ఆరోగ్యశ్రీ పరిధిలో జస్మితకు ఉన్న వ్యాధి రాదని తొలుత వైద్యులు చెప్పడంతో ఆశలు వదులుకున్నామని, ప్రత్యేక కేసుగా పరిగణించి చికిత్స చేయిస్తామని ఆ రోగ్యశ్రీ అధికారులు చెప్పగానే ఆనందం ప ట్టలేకపోయామన్నారు. వైఎస్ జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటామన్నారు.