
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ సోకిన రోగులకు చికి త్స అందిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని రాష్ట్ర ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ పేర్కొన్నారు. కరోనా పాజిటివ్ రోగులకు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్న వైద్యులు, సిబ్బందితో శనివారం ఆయ న టెలి కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. రక్షణ పరికరాలు, పీపీఈలు, మాస్కుల లభ్యతతోపాటు వైద్యులు, సిబ్బంది.. నివాసం, రవాణా పరంగా ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గాంధీ, కింగ్ కోఠి, సరోజినీదేవి కంటి ఆస్పత్రి, ఛాతీ, నేచర్ క్యూర్, నిజామాబాద్, వరంగల్ ఎంజీఎం ఆస్పత్రుల వద్ద రక్షణ ఏర్పాట్లను డీజీపీ మహేందర్‌రెడ్డి ఈ సమావేశంలో వైద్యులకు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment