
Not Shannu Deepthi Sunanina Asks Fans To Vote Bigg Boss 5 Contestant: యూట్యూబర్స్ షణ్ముఖ్ జస్వంత్, దీప్తి సునైనాల ప్రేమ గురించి అందరికి తెలిసిందే. వీరిద్దరూ తమ ప్రేమ విషయాన్ని బహిరంగానే ప్రకటించారు. ఒకరిపేరు ఒకరు టాటూగా కూడా వేయించుకున్నారు. ప్రస్తుతం షణ్ముఖ్ బిగ్‌బాస్ -5 హౌస్‌లో ఉండగా, దీప్తి సునయన బయట ఫుల్ ప్రమోషన్స్ చేస్తూ అతడ్ని గెలిపించేందుకు తెగ కష్టపడుతుంది. లాస్ట్ వీకెండ్ ఎపిసోడ్‌లోనూ షణ్నూకి సపోర్ట్ చేయడానికి దీప్తి బిగ్‌బాస్‌కి వచ్చిన సంగతి తెలిసిందే.
షణ్నూకి ఓట్లు వేసి గెలిపించాలంటూ సోషల్ మీడియాలో తన ఫాలోవర్లను రిక్వెస్ట్ చేస్తుంది. అయితే తాజాగా షణ్నూకి కాకుండా మరో బిగ్‌బాస్ కంటెస్టెంట్‌కి దీప్తి తన మద్దతు ప్రకటించింది. అంతేకాకుండా అతడకి తాను వేసిన ఓట్స్‌కి సంబంధించిన స్క్రీన్‌షాట్స్‌ని సైతం సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం దీప్తి షేర్‌చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
ఇంతకీ ఆ బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఎవరా అనే కదా మీ డౌటు. దీప్తి సపోర్ట్ చేస్తున్న కంటెస్టెంట్ తమిళ బిగ్‌బాస్‌కి చెందిన వ్యక్తి. ప్రస్తుతం తమిళంలో కూడా బిగ్‌బాస్ సీజన్-5 ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వరుణ్ అనే కంటెస్టెంట్‌కి దీప్తి తన మద్ధతు ప్రకటించింది. అతడికి ఓట్లు వేయాలంటూ తన ఫాలోవర్లను సైతం కోరింది.