AIMIM
-
Delhi poll: జైలు నుంచే ‘పతంగి’ ఆట!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోనూ తన అస్థిత్వాన్ని బలంగా చాటుకోవాలని కృతనిశ్చయంతో ఉన్న ఎంఐఎం పార్టీ ముస్లిం ఓటు బ్యాంకు బలంగా ఉన్న రెండు స్థానాల్లో తన పార్టీ చిహ్నమైన పతంగిని ఎగురవేసేందుకు తీవ్ర కసరత్తులే చేస్తోంది. ఆ పార్టీ పోటీ చేస్తున్న ఓఖ్లా, ముస్తఫాబాద్ నియోజకవర్గాల్లో పార్టీ తరఫున పోటీ చేస్తున్న ఇద్దరు అభ్యర్థులూ ఢిల్లీ అల్లర్ల కేసులో జైలు నుంచే తమమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా, వారి తరఫున అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నీతానే ప్రచార బాధ్యతలు మోస్తున్నారు. జైలు నుంచే పార్టీ అభ్యర్థులు తమ వ్యూహాలను అమలు చేస్తుంటే, ప్రచార క్షేత్రంలో ఒవైసీ తన పదునైన మాటలతో ప్రచారం చేస్తున్నారు. గెలుస్తారా..చీలుస్తారా? ఓఖ్లా అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తంగా 3.35 లక్షల మంది ఓటర్లుండగా, ఇందులో 1.78 లక్షలు (52.5)శాతం మంది ముస్లింలే ఉన్నారు. ఇక ముస్తఫాబాద్ నియోజకవర్గంలోనూ 2.63 లక్షల ఓటర్లలో 1.03 లక్షలు (40శాతం) ముస్లిం ఓటర్లు. ఈ గణాంకాలను దృష్టిలో పెట్టుకునే ఎంఐఎం ఈ రెండు స్థానాల్లో పోటీకి దిగింది. రెండు నియోజకవర్గాలోనూ 2020 ఢిల్లీ అల్లర్ల కేసులో ముద్దాయిలుగా ఉన్న అభ్యర్థులను రంగంలోకి దించింది. ఓఖ్లా నుంచి ఆప్ మాజీ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్‌ను పోటీలో పెట్టగా, ముస్తఫాబాద్ నుంచి షిఫా ఉర్ రెహా్మన్ పోటీలో ఉన్నారు. వీరిద్దరు పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కి వ్యతిరేకంగా జరిగిన నిరసనల ద్వారా హింసను ప్రేరేపించిన ఆరోపణలతో జైళ్లో ఉన్నారు. కోర్టు నుంచి పెరోల్లో బయటకు వచ్చిన ఇద్దరు, నామినేషన్ల అనంతరం తిరిగి జైలుకు వెళ్లారు.అక్కడి నుంచే తమ అనుచరల ద్వారా ప్రచార వ్యూహాలను రూపొందిస్తున్నారు. ఓఖ్లాలో 2015, 2020 ఎన్నికల్లో ఆప్‌కు చెందిన అమానతుల్లా ఖాన్ 50 వేలకు పైగా భారీ ఆధిక్యంతో గెలుపొందుతూ వస్తున్నారు. అయితే ఇటీవల మనీలాండరింగ్ ఆరోపణలతో ఈడీ అరెస్ట్‌ను ఎదుర్కొని బయటకు వచ్చి తిరిగి పోటీలో ఉన్నారు. ఆయన్ను తట్టుకోవడం ఎంఐఎంకు అంత సులువు కాకున్నా, ఆప్ ఓట్లను చీల్చడంలో ఎంఐఎం కీలకపాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. గడిచిన రెండ్రోజులుగా పార్టీ అధినేత ఒవైసీ ఇక్కడ పర్యటిస్తూ విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఇక ముస్తఫాబాద్‌లో సైతం 2015లో బీజేపీ, 2020లో ఆప్ విజయపతాకం ఎగురవేసింది. గత ఎన్నికల్లో ఆప్ తరఫున హాజీ హుస్సేన్ 53 శాతం ఓట్లతో విజయం సాధించారు. ఇక్కడ ఎంఐఎం తరఫున పోటీ చేస్తున్న షిఫా ఉర్ రెహా్మన్కు స్థానికంగా గట్టి పట్టుంది. ఒకవేళ ఆయన 5–8 శాతం ఓట్లను ప్రభావితం చేసినా బీజేపీ గెలుపు అవకాశాలు మెరుగుపడే అవకాశముంది. ఈ స్థానంలో ఓట్ల చీలిక జరిగితే బీజేపీ తిరిగి గెలిచే అవకాశాలున్నాయి. ఇక రెండు స్థానాల్లో ప్రచారం చేస్తున్న ఓవైసీ సైతం ప్రధానంగా ఆప్ అధినేత కేజ్రీవాల్ లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ‘గత ఐదేళ్లుగా తాహిర్ హుస్సేన్, షిఫా ఉర్ రెహా్మన్ జైలు లోపలే ఉండగా, లిక్కర్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కి ఎలా బెయిల్ వచి్చంది?, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్‌తో సహా ఆప్ నాయకులందరూ బెయిల్ పొందారు, ఈ ఇద్దరు ఇంకా లోపలే ఎందుకు ఉన్నారు’అని ఓవైసీ ప్రశి్నస్తున్నారు. లిక్కర్ పాలసీలో అరెస్టయి బెయిల్‌పై బయటికొచి్చన కేజ్రీవాల్ గెలువగలిగితే, తమ ఇద్దరు అభ్యర్థులు ఎందుకు గెలవరని అడుగుతున్నారు. -
అసదుద్దీన్ ప్రమాణస్వీకారం పై లోక్ సభ లో దుమారం
-
మహారాష్ట్ర ఎంఐఎం నేతపై కాల్పులు
ముంబై: మహారాష్ట్రలోని ఏఐఎంఐఎం నేతపై కాల్పులు జరిగాయి. సోమవారం ఉదయం గుర్తు తెలియని దుండగులు మాజీ మాలెగావ్ మేయర్ అబ్దుల్ మాలిక్ మహమ్మద్ యూనస్ ఇసాపై మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. మూడు సార్లు కాల్చడంతో మాలిక్ శరీరంపై మూడు చోట్ల బుల్లెట్ గాయాలు అయ్యాయి. వెంటనే ఆయన్ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మాలిక్ శరీరంపై ఎడమవైపు ఛాతి, ఎడమ తొడ, కుడి చెతిపై బెల్లెట్ గాయాలు అయ్యాయి. మహారాష్ట్ర ఎంఐఎం పార్టీలో మాలిక్ చాలా కీలకమైన నేత వ్యవహరిస్తున్నారు. మాలెగాల్ పోలీసుల ప్రకారం..సోమవారం తెల్లవారుజన 1.20 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ కేసులో ఇంకా ఎవరినీ అరెస్ట్ చేయలేదు. -
ఓటు హక్కు వినియోగించుకున్న అసదుద్దీన్ ఒవైసీ
-
పల్లవి పటేల్‌తో ఒవైసీ కూటమి.. తొలి జాబితా విడుదల
లక్నో: దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో 2024 లోక్‌సభ ఎన్నికల కోసం మూడు ప్రధాన కూటములు ఏర్పడ్డాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ, కాంగ్రెస్-సమాజ్‌వాదీ పార్టీల ఇండియా కూటమితోపాటు ఇప్పుడు పీడీఎం (పిచ్చా, దళిత, ముసల్మాన్) కూటమి కూడా బరిలో నిలిచింది. అప్నా దళ్ కమరావాడి (ADK) నాయకురాలు పల్లవి పటేల్, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కలిసి పీడీఎం (PDM) కూటమిని ఏర్పాటు చేశారు. ఈ కూటమి ఉత్తరప్రదేశ్‌లో తొలి జాబితా విడుదల చేసింది. ఈ రెండు పార్టీలు కలిసి ఏడు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి. పీడీఎం తొలి జాబితాలో బరేలీ నుంచి సుభాష్ పటేల్, హత్రాస్ నుంచి జైవీర్ సింగ్ ధంగర్, ఫిరోజాబాద్ నుంచి న్యాయవాది ప్రేమ్ దత్ బఘేల్, రాయ్ బరేలీ నుంచి హఫీజ్ మహ్మద్ మొబీన్, ఫతేపూర్ నుంచి రామకృష్ణ పాల్, భదోహి నుంచి ప్రేమ్ చంద్ బింద్, చందౌలీ నుంచి జవహర్ బింద్ ప్రకటించారు. ఈ సమాచారాన్ని పీడీఎం కార్యాలయ కార్యదర్శి మహ్మద్ ఆషిక్ తెలిపారు. ప్రియాంక గాంధీ రాయ్‌బరేలీ నుంచి ఇండియా కూటమి తరపున పోటీ చేస్తారనే ఊహాగానాల మధ్య పీడీఎం ఇక్కడ ముస్లిం అభ్యర్థిని నిలబెట్టాలని నిర్ణయించుకుంది. ఇది కాంగ్రెస్ అభ్యర్థికి సమస్యగా మారుతుందని భావిస్తున్నారు. అభ్యర్థుల ప్రకటనకు ఒక రోజు ముందుగా శుక్రవారం నాడు లక్నోలో పీడీఎం మొదటి సమావేశం జరిగింది. ఇందులో పీడీఎంకు నేతృత్వం వహిస్తున్న పల్లవి పటేల్‌తో పాటు ఏఐఎంఐఎం నేతలు కూడా పాల్గొన్నారు. నాలుగైదు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఉత్తరప్రదేశ్‌లోని 80 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల పేర్లను చర్చించారు. ఎన్నికల్లో సీరియస్‌గా పోటీ చేస్తామని, మిగతా స్థానాలకు అభ్యర్థులను త్వరలో ప్రకటిస్తామని పీడీఎం జాతీయ కార్యవర్గ సభ్యుడు అజయ్ పటేల్ తెలిపారు. -
దేశానికి బాబా మోదీ అవసరం లేదు: ఒవైసీ
న్యూఢిల్లీ: కేంద్రం వైఖరిపై మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ నిప్పులు చెరిగారు. మోదీ ప్రభుత్వం ఒక వర్గానికో, మతానికో చెందిన ప్రభుత్వమా లేక యావద్దేశానికి ప్రభుత్వమా అని నిలదీశారు. దేశానికి బాబా మోదీ ప్రభుత్వం అవసరం లేదన్నారు. రామమందిర నిర్మాణంపై శనివారం సభలో చర్చ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘రామ మందిర ప్రారంభం ద్వారా ఒక మతంపై మరో మతం విజయం సాధించినట్లు సందేశం ఇవ్వదలిచారా? దేశంలోని 17 కోట్ల ముస్లింలకు ఏం సందేశమిస్తున్నారు? నేను బాబర్, జిన్నా, ఔరంగజేబ్ తరఫున మాట్లాడటం లేదు. రాముడిని గౌరవిస్తా. కానీ గాడ్సేను ద్వేషిస్తా. ‘బాబ్రీ మసీదు జిందాబాద్, బాబ్రీ మసీదు ఎప్పటికీ ఉంటుంది’ అంటూ ముగించారు. -
‘బీజేపీకి ఆప్‌కు మధ్య తేడా ఎంటీ?’
అమ్ ఆద్మీ పార్టీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ చేసిన వ్యాఖ్యలపై ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ చీఫ్,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవిండ్ కేజ్రీవాల్, రాష్ట్రం ప్రభుత్వం ప్రతి నెల మొదటి మంగళవారం సుందరకాండ, హనుమాన్ చాలీసా పఠించాలని నిర్ణయం తీసుకుంటే.. బీజేపీకి ఆప్ మధ్య తేడా ఏంటని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఈ రెండు పార్టీల మధ్య ఏమాత్రం తేడా ఉండదని అన్నారు. ఢిల్లీలోని ప్రతి నియోజకవర్గంలో ప్రతి నెల మొదటి మంగళవారం సుందరకాండ, హనుమాన్ చాలీసా పఠించాలని ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. సుందరకాండ, హనుమాన్ చాలీసా పఠించడానికి రానున్న రోజుల్లో సుమారు 2,600 ప్రాంతాలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యపై స్పందించిన మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సదరు మంత్రి తీవ్ర విమర్శలు చేశారు. ఆప్ తమను తాము గొప్పగా ఊహించుకుంటోందని అన్నారు. ప్రధాన మంత్రి మోదీ అనుసరిస్తున్న హిందుత్వ రాగాన్ని ఆప్ అమలు చేస్తోందని మండిడ్డారు. ఆప్‌లో కొంత మంది నేతలు తాము సరయు నదికి వెళ్లుతామని అంటారు. మరికొందరు సుందరకాండ పఠనం పాఠశాలల్లో, ఆస్పత్రిలో అమలు చేయాలని వ్యాఖ్యాస్తారు. ఇలా చేస్తూ ఆప్ పార్టీ నరేంద్రమోదీ అడుగుజాడల్లో నడుస్తోందని విమర్శించారు. నరేంద్ర మోదీ ఏదైతే చేయాలనుకుంటారో మీరు (ఆప్) అదే చేస్తారని అన్నారు. ఇలా చేస్తూ వెళ్లితే.. మీకు(ఆప్), బీజేపీకి తేడా ఏం ఉందని ఓవైసీ సూటిగా నిలదీశారు. చదవండి: ‘ఇండియా కూటమి చరిత్రక గెలుపు నమోదు చేస్తుంది’ -
హంగ్ కోసం బీజేపీ యత్నం
‘రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ కోసం బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈసారి ఇక్కడ పప్పులు ఉడకడం లేదని పసిగట్టింది. దీంతో రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడాలని చూస్తోంది. దాని ఫలితంతో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందాలని భావిస్తోంది. వచ్చే ఐదేళ్లలో సంకీర్ణంతో బలోపేతం కావాలనుకుంటోంది. ప్రజలు మజ్లిస్‌కు 9, బీఆర్ఎస్కు 110 సీట్లలో సంపూర్ణ మద్దతు ఇచ్చి.. కేసీఆర్ మామకు అధికారం కట్టబెట్టాలి’ అని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు. బధవారం టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే... – సాక్షి, హైదరాబాద్ కాంగ్రెస్‌తోనే బీజేపీ గ్రాఫ్ పెరుగుతోంది కాంగ్రెస్ అసమర్థత వల్లే బీజేపీ గ్రాఫ్ పెరుగుతోంది. కేంద్రంలో వరుసగా గెలుస్తోంది. రాహుల్ గాంధీ నాయకత్వంలోనే ఎంపీల బలం 50కి పడిపోయింది. మోదీ ప్రధాని కావడానికి ఆయనే కారణం. తమ అసమర్థత కప్పిపుచ్చుకోవడానికి కోపమంతా మజ్లిస్‌పై ప్రదర్శిస్తున్నారు. ఓట్లు చీల్చుతున్నామని అపవాదు అంటకడుతున్నారు. అమేథీలో మజ్లిస్ పోటీ చేయకపోయినా స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ ఓడిపోయారు. తాత ముత్తాత, నానమ్మ సీట్లను కూడా కాపాడుకోలేకపోయారు. కేరళలోని వయనాడ్‌లో ముస్లిం లీగ్ సహకారంతో 30 శాతం ముస్లిం ఓట్లతో రాహుల్ గెలిచారు. శివసేనతో అధికారం పంచుకున్నప్పుడు కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ ఎలా అవుతుంది. ఎంఐఎం, బీఆర్ఎస్ కోసం తలుపులు మూసేశామని రాహుల్ చెబుతున్నారు. ఇండియా కూటమిలో మేము ఎలా భాగస్వాములం అవుతాం. అజహరుద్దీన్.. అసమర్థ రాజకీయవాది అజహరుద్దీన్ మంచి క్రికెటరే.. కానీ, రాజకీయాల్లో అసమర్థుడు. యూపీలోని మొరాదాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ప్రజలు గెలిపిస్తే అక్కడ ఎలాంటి అభివృద్ధి చేయలేదు. ఆ తర్వాత రాజస్తాన్‌కు పంపిస్తే అక్కడ ఓడిపోయారు. ఆ తర్వాత తిరిగి ముఖం చూపించలేదు. సొంతగడ్డపై కేటీఆర్ ఆయనకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బాధ్యతలు అప్పగిస్తే దాని స్థాయి దిగజార్చారు. ఆయన అవినీతిపై నాలుగు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఎన్నికల్లో ప్రత్యర్థులు ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారైతే తప్పేంటి? అసమర్థ నేత కాబట్టి ఆయనపై బలమైన మజ్లిస్ అభ్యర్థిని రంగంలోకి దింపాం. కాంగ్రెస్ చీఫ్ పక్కా ఆర్ఎస్ఎస్వాది టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి గతంలో ఏబీవీపీలో పనిచేశారు. కార్వాన్లో కిషన్ రెడ్డి పోటీ చేసినప్పుడు ఆయనకు మద్దతుగా గుడిమల్కాపూర్‌లో ప్రచారం నిర్వహించారు. ఆర్ఎస్ఎస్ ఆయనను టీడీపీకి పంపిస్తే ఆ పార్టీ అడ్రస్ తెలంగాణలో గల్లంతైంది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సూచనతో కాంగ్రెస్‌లో చేరారు. మోహ¯న్ భగవత్ రిమోట్ కంట్రోల్‌తోనే గాంధీభవన్ పనిచేస్తోంది. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే. హైదరాబాద్‌లో మజ్లిస్ బలంగా ఉంది కాబట్టి తెలంగాణలో మైనార్టీ డిక్లరేషన్ ప్రకటించారు. కానీ కర్ణాటక, రాజస్తాన్, మధ్యప్రదేశ్, మిజోరం, ఛత్తీస్‌గడ్‌లలో ఎందుకు ప్రకటించలేదో సమాధానం చెప్పాలి? అక్కడ ముస్లింలు లేరా..? లేక వారి అభివృద్ధిపై చిత్తశుద్ది లేదా? బీఆర్ఎస్తో ఎలాంటి పొత్తులేదు బీఆర్ఎస్తో మజ్లిస్‌కు ఎలాంటి పొత్తు లేదు. ఫ్రెండ్లీ పార్టీ మాత్రమే. బీజేపీతో కలిసే ప్రసక్తే లేదు. కాంగ్రెస్, బీజేపీ మధ్య సంబంధం ఉంది. మేము ఎవరికీ బీ–టీమ్ కాదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తోంది కాబట్టి సమర్థిస్తున్నాం. బీజేపీతో కేసీఆర్‌కు సంబంధం ఉంటే.. తొమ్మిదిన్నరేళ్లలో మైనారిటీల కోసం పెద్దఎత్తున బడ్జెట్ కేటాయింపు జరిగేదా? 201 మైనార్టీ గురుకులాల ఏర్పాటు చేసేవారా? ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌తోపాటు ఏటా రూ.650 కోట్లు ముస్లింల విద్య కోసం ఖర్చు పెట్టేవారా? కేసీఆర్ మూడోసారి సీఎం అవుతారు. తొమ్మిదేళ్లలో రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొంది. భైంసా ప్రశాంతంగా ఉంది. కాంగ్రెస్ అధికారంలో ఉంటే మతఘర్షణలు జరుగుతాయి. మత సామరస్యం దెబ్బతీంటుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం కల్ల. మతప్రాతిపదిక రిజర్వేషన్ కాదు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అమలవుతున్న 4 శాతం రిజర్వేషన్లు మత ప్రాతిపదికన చేసినవి కావు. ముస్లిం సామాజిక వర్గంలో ఆర్థికంగా, విద్యాపరంగా వెనకబడిన వారికి మాత్రమే అమలు చేస్తున్నారు. అదీ పీఎస్ కృష్ణన్, మండల్ కమిషన్ రిపోర్టు ప్రకారం సుప్రీంకోర్టు ఆదేశాలతో రిజర్వేషన్ అమలవుతోంటే బీజేపీకి వచ్చిన ఇబ్బందేంటి? తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి మోదీ ప్రభుత్వానికి పంపితే మంజూరు చేయలేదు. బీజేపీ ఇప్పుడు దీన్ని రద్దు చేస్తామని చెబుతోంది. పాఠ్యపుస్తకాల్లో గాం«దీని అవమానపర్చి.. గాంధీని చంపిన గాడ్సే గురించి చదివిస్తున్నారు. -
మైనారిటీల కోసం కాంగ్రెస్ ప్రత్యేక డిక్లరేషన్
-
రేవంత్ రెడ్డి RSS నుంచి వచ్చిన వ్యక్తి : ఒవైసీ
-
మౌనంగా ఉండటమా.. లేక బరిలో దిగడమా.. ముంతాజ్ ఖాన్ దారెటు?
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో తొమ్మిది నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నట్లు మజ్లిస్ (ఎంఐఎం) పార్టీ ప్రకటించింది. నగరంలోని పాత బస్తీలోని ఏడు సిట్టింగ్ స్థానాలతో పాటు జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్ స్థానాల్లో సైతం బరిలో దిగనున్నట్లు వెల్లడించింది. శుక్రవారం దారుస్సలాంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తొలి జాబితాలో ఆరు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. చాంద్రాయణగుట్ట స్థానానికి అక్బరుద్దీన్ ఒవైసీ, మలక్‌పేట స్థానానికి అహ్మద్ బలాల, కార్వాన్కు కౌసర్ మోహియుద్దీన్, నాంపల్లికి మాజీద్ హుస్సేన్, చార్మినార్‌కు జుల్ఫీకర్, యాకుత్‌పురాకు జాఫర్ హుస్సేన్ మేరాజ్ అభ్యర్థిత్వాలను ఖరారు చేశారు. త్వరలో బహదూర్‌పురా, జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్ అభ్యర్థులను ప్రకటిస్తామని అసదుద్దీన్ ఒవైసీ వెల్లడించారు. మజ్లిస్ పోటీ చేయని స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు ఇస్తామన్నారు. ఉద్దండులకు మొండిచేయి.. రాజకీయ ఉద్దండులు, ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేలకు మజ్లిస్ పార్టీ మొండిచేయి చూపించింది. చార్మినార్ సిట్టింగ్ ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్, యాకుత్‌పురా సిట్టింగ్ ఎమ్మెల్యే అహ్మద్ పాషా ఖాద్రీలకు సీటు కేటాయించ లేదు. నాంపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మేరాజ్ అభ్యర్థిత్వం యాకుత్‌పురా స్థానానికి మారింది. ఈసారి కొత్తగా ఇద్దరు మాజీ మేయర్లకు అవకాశశం లభించింది. నాంపల్లి సిట్టింగ్ స్థానానికి మాజీ మేయర్ మాజీద్ హుస్సేన్‌కు, చార్మినార్ సిట్టింగ్ స్థానాన్ని జుల్ఫీకర్లకు కేటాయించారు. 2018 ఎన్నికల తర్వాత తీసుకున్న నిర్ణయం ప్రకారమే ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేలకు ఎన్నికల బరి నుంచి తప్పించి పార్టీలో వారి సేవలు తీసుకోవాలని నిర్ణయించినట్లు పార్టీ అధినేత అసదుద్దీన్ ప్రకటించారు. కొత్తగా జూబ్లీహిల్‌లో.. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పక్షాన భారత క్రికెట్ మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ బరిలో దిగుతుండగా.. ఏఐఎంఐఎం కూడా పోటీ చేస్తామని ప్రకటించటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండి.. ఈసారి పోటీ నిర్ణయం వెనుక మతలబు అర్థం కాని పరిస్థితి నెలకొంది. అత్యంత సంపన్నలున్న ప్రాంతంగా పేరొందిన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మజ్లిస్ గతంలో పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైంది. 2014 ఎన్నికల్లో మజ్లిస్ తరఫున రంగంలో దిగిన నవీన్ యాదవ్ టీడీపీ అభ్యర్థి మాగంటికి ఢీ అంటే ఢీ అనేంతలా పోటీ ఇచ్చారు. గత ఎన్నికల్లో మజ్లిస్ పోటీకి దూరం పాటించి అప్పటి టీఆర్ఎస్ అభ్యర్థి మాగంటికి మద్దతు ఇచ్చింది. అయినప్పటికీ నవీన్ యాదవ్ ఇండిపెండెంట్‌గా బరిలో దిగి గట్టి పోటీ ఇచ్చి మూడో స్థానంలో నిలిచారు. ఈసారి తిరిగి మిత్ర పక్షమైన బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానంలో పోటీకి దిగడం ఆసక్తి రేపుతోంది. డబుల్ హ్యాట్రిక్.. 'ఓటమి ఎరగని నేతగా యాకుత్‌పురా నుంచి ఐదుసార్లు, చార్మినార్ నుంచి ఒకసారి వరుసగా విజయంసాధించి డబుల్ హ్యాట్రిక్ కొట్టిన అనంతరం ముంతాజ్ ఖాన్‌కు టికెట్ దక్కకపోవడంతో ఆయన రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థంగా మారింది. పార్టీ అధిష్టానం ప్రతిపాదన మేరకు రిటైర్మెంట్కు సిద్ధమంటూనే తన కొడుకుకు టికెట్ ఇవ్వాలని మెలికపెట్టినా ఫలితం లేకుండా పోయింది. ఏకంగా టికెట్ ఇవ్వకున్నా బరిలో దిగుతానని అల్టిమేటం ఇవ్వడంతో పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ రంగంలో దిగినట్లు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్, ఎంబీటీలు సంప్రదింపులు చేస్తూ పార్టీ పక్షాన రెండు సీట్ల బంపర్ ఆఫర్ హామీ ఇచ్చినట్లు సమాచారం. తాజాగా చార్మినార్ అసెంబ్లీ స్థానానికి మాజీ మేయర్ జుల్ఫీకర్ అభ్యర్థిత్వం ఖరారు కావడంతో పార్టీ నిర్ణయం మేరకు మౌనంగా ఉండటమా? లేక బరిలో దిగడమా? ముంతాజ్ ఖాన్ ఎటూ తేల్చుకోలేక మౌనంగా ఉండిపోయినట్లు తెలుస్తోంది. ఒకవేళ తిరుగుబాటు బావుటా ఎగరవేస్తే మాత్రం పాతబస్తీ రాజకీయాల్లో సంచలన మార్పులు సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చార్మినార్ అసెంబ్లీ స్థానంపై దృష్టి సారించింది. ఇంకా అభ్యర్థి ప్రకటించలేదు. ఇవి చదవండి: అందోల్ కోటలో గెలుపెవరిది..? తీవ్రంగా శ్రమిస్తున్న ప్రధాన పార్టీలు! -
TS: అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించిన ఎంఐఎం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఎంఐఎం పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. హైదరాబాద్‌లోని 9 స్థానాల్లో ఎంఐఎం అభ్యర్థులు పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ శుక్రవారం వెల్లడించారు. ఏడుగురు సిట్టింగ్‌లతోపాటు మరో రెండు స్థానాల్లో ఎంఐఎం పోటీ చేయనున్నట్లు తెలిపారు. చాంద్రాయణగుట్ట, చార్మినార్, యాకుత్ పురా, బహుదూర్‌పురా, నాంపల్లి, కార్వాన్, మలక్ పేట, జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్‌లో పోటీ చేయనున్నట్టుగా ఓవైసీ పేర్కొన్నారు. కాగా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికను పూర్తిచేసేపనిలో పడ్డాయి. ఇప్పటికే ప్రకటించిన స్థానాల్లో అభ్యర్థులు ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. బీఆర్ఎస్ దాదాపు అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతుంది. బీజేపీ ఇప్పటి వరకు 88 స్థానాల్లో అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. కాంగ్రెస్ సైతం రెండు విడదతల్లోనూ 100 స్థానాల్లో అభ్యర్థులను వెల్లడించింది. రెండు పార్టీలో మరికొన్ని సీట్లకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇక మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకొని హ్యాట్రిక్ సాధించాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తుండగా.. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ, కాంగ్రెస్ గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. చదవండి: తెలంగాణ బీజేపీ మేనిఫెస్టో రాసేదెవరు? -
మేనిఫెస్టో లేని మజ్లిస్
ప్రతి రాజకీయ పార్టీకి ఎన్నికల మేనిఫెస్టో కీలకమైనది. తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తామో చెబుతూ.. ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించడం ఆనవాయితీ. దాన్ని బట్టే ఆ పార్టీ గెలుపుపోటములు కూడా ఆధారపడి ఉంటాయి. స్వతంత్రులు సైతం తమను గెలిస్తే చేసే పనులను ప్రకటించి ఓట్లను అభ్యర్థిస్తారు. కానీ, అసలు మేనిఫెస్టో లేకుండా ఎన్నికల బరిలో దిగే ఏకైక రాజకీయ పార్టీ ఆల్ ఇండియా మజ్లిస్– ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం). సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్నా, వరసగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఏఐఎంఐఎం మాత్రం ఎన్నడూ మేనిఫెస్టో విడుదల చేయలేదు. ఎన్నికల మేనిఫెస్టోతో సంబంధం లేకుండా.. ఓటర్లకు జవాబుదారీగా ఉండేందుకు ఏం చేశారో, ఏం చేస్తారో చెప్పకుండానే ఓటర్లను ఆకర్షిస్తోంది. ఆరున్నర దశాబ్ధాలుగా ఎన్నికల్లో పోటీ చేస్తూ వస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఏ ఎన్నికల్లోనూ మేనిఫెస్టో పత్రాన్ని విడుదల చేయలేదు. తాజాగా కూడా తెలంగాణ, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో సైతం మేనిఫెస్టో లేకుండానే బరిలో దిగుతోంది. ప్రాంతీయ పార్టీగా ఎన్నికల సంఘం గుర్తింపు ఉన్న ఏఐఎంఐఎం మిగతా రాజకీయ పక్షాలకు భిన్నంగా మేనిఫెస్టో విడుదల చేయని పార్టీగా రికార్డుకెక్కింది. పాతబస్తీ నుంచి దేశస్థాయికి ‘‘మా పనితీరు.. మా గుర్తింపు’’ అనే నినాదంతో ఎన్నికల క్షేత్రంలో దిగే ఎంఐఎం హైదరాబాద్ పాతబస్తీ నుంచి జాతీయ స్థాయికి పార్టీని విస్తరించింది. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, బిహార్ శాసనసభల్లో సైతం పార్టీ ప్రాతినిధ్యం కలిగి ఉంది. అదేవిధంగా కర్ణాటక, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాలో స్థానిక స్థంస్థల్లో ప్రాతినిధ్యం వహిస్తోంది. పార్లమెంటులోనూ హైదరాబాద్ నుంచి అసదుద్దీన్ ఒవైసీ, ఔరంగాబాద్ నుంచి ఇంతీయాజ్ జలీల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారంలో ఆరు రోజులు... ఏఐఎంఐఎం పార్టీ ప్రధాన కార్యాలయమైన దారుస్సలాంలో వారంలో ఆరు రోజుల పాటు ప్రతి రోజూ ప్రజా గ్రీవెన్స్ కొనసాగుతుంది. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు కార్పొరేటర్ నుంచి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీల వరకు అందుబాటులో ఉంటారు. వివిధ పనులపై వచ్చే ప్రజలు నేరుగా కార్పొరేటర్నో, ఎమ్మెల్యేనో, ఎంపీనో కలిసి తమ సమస్యలు చెప్పుకొనే అవకాశం ఇక్కడ ఉంటుంది. ముస్లిం సామాజిక వర్గం కంటే హిందుసామాజిక వర్గం తాకిడి దారుస్సలాంకు అధికంగా ఉండటం విశేషం. అయితే ఇక్కడ అంతా క్యూ పాటించాల్సిందే. పాతబస్తీలో కింగ్ మేకర్ హైదరాబాద్ రాజకీయాలలో మజ్లిస్ కింగ్ మేకర్ పాత్రను పోషిస్తోంది. హైదరాబాద్ పాతనగరం రాజకీయ పరిస్థితికి కొత్త నగరం భిన్నంగా ఉంటుంది. హిందూ, ముస్లిం ఎజెండాలతో ఇక్కడ మజ్లిస్, బీజేపీ రాజకీయంగా తలపడుతున్నా.. ఫలితం మాత్రం వన్‌సైడ్‌గా ఉంటోంది. ఇదీ చరిత్ర 96 ఏళ్ల కిందట నిజాం పాలనలోని హైదరాబాద్ స్టేట్‌లో 1927లో ‘మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్’గా ఆవిర్భవించిన ధార్మిక సంస్ధ క్రమంగా ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్’ రాజకీయ పార్టీగా రూపాంతరం చెందింది. 1948లో హైదరాబాద్ స్టేట్ ఇండియన్ యూనియన్‌లో చేరిన తర్వాత ఈ సంస్థ నిషేధానికి గురైంది. అసదుద్దీన్ ఒవైసీ తాత అప్పటి ప్రసిద్ధ న్యాయవాది మౌలానా అబ్దుల్ వాహిద్ ఒవైసీ 1958లో రాజ్యాంగంలో పొందుపరిచిన మైనారిటీల హక్కుల కోసం పోరాడేందుకు ఆ సంస్థనే రాజకీయ పార్టీగా మార్చారు. 1959లోనే హైదరాబాద్‌లో జరిగిన రెండు మున్సిపల్ ఉప ఎన్నికల్లో పార్టీ విజయం సాధించింది. 1960లో హైదరాబాద్ బల్డియాలో ప్రధాన ప్రతిపక్షంగా ఆవిర్భవించింది. వరసగా అబ్దుల్ వాహెద్ ఒవైసీ కుమారుడు సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ, ఆ తర్వాత ఆయన కుమారుడు అసదుద్దీన్ ఒవైసీ పార్టీ పగ్గాలు చేపట్టి ముస్లిం మైనారిటీ గొంతుకగా బలమైన రాజకీయ శక్తిగా మార్చుతూ వచ్చారు. మభ్యపెట్టడానికే మేనిఫెస్టో ఎన్నికల్లో ప్రజలను మభ్య పెట్టడానికి మేనిఫెస్టో ఒక ప్రచారసాధనం. ఓట్లు రాబట్టుకునేందుకు ఒక ఆయుధం. అందుకే మేం ఎన్నడూ ఆ ఊసెత్తం. హామీలు ఇవ్వం. పని చేసి గుర్తింపు తెచ్చుకుంటాం. ప్రజల మధ్యనే ఉంటాం. ఎప్పుడూ అందుబాటులో ఉంటాం. ఇలాంటప్పుడు ఇక మేనిఫెస్టో అవసరం ఏముంది. అమలు కాని హామీలిచ్చి ప్రజలకు అందుబాటులో లేకుండా తిరగడం మజ్లిస్ పార్టీ పద్ధతి కాదు. – అసదుద్దీన్ ఒవైసీ ,అధినేత, ఏఐఎంఐఎం - మహమ్మద్ హమీద్ ఖాన్ -
కేసీఆర్‌కు మా సంపూర్ణ మద్దతు: ఒవైసీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎన్నికలపై ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్‌కు తమ పార్టీ తరపున సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారాయన. ‘‘పేదల కోసం కేసీఆర్ చాలా పథకాలు తీసుకొచ్చారు.కేసీఆర్ విడుదల చేసిన మేనిఫెస్టో అద్భుతంగా ఉంది. కేసీఆర్ తెలంగాణకు హ్యాట్రిక్ సీఎం అవుతారు’’ అని ఒవైసీ అన్నారు. మజ్లిస్ పార్టీ అధినేత ఇంతకు ముందు కూడా కేసీఆర్‌కు మద్దతుగా వ్యాఖ్యలు చేశారు. వారం కిందట హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి, సుఖశాంతుల కోసం మూడోసారి కేసీఆర్‌ను గెలిపించాలని తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బీజేపీ, కాంగ్రెస్ దొందూ దొందేనని విమర్శించారు. అయితే తెలంగాణతో పాటు రాజస్థాన్ ఎన్నికల్లోనూ పోటీ చేస్తామని ఆ సందర్భంలో ఆయన ప్రకటించారు. -
మజ్లిస్... పాతబస్తీ దాటేనా?
హైదరాబాద్: పదేళ్లుగా దేశ వ్యాప్తంగా ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు తీవ్ర స్థాయిలో ప్రయతి్నస్తున్న ఆల్ ఇండియా మజ్లిస్–ఎ–ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) సొంత గడ్డపై మాత్రం ఆచితూచి అడుగులేస్తోంది. హైదరాబాద్ పాత బస్తీ సిట్టింగ్ స్థానాలు మినహా మిగతా స్థానాలపై పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ దోస్తీ కోసం కేవలం పాతబస్తీకే పరిమితమైంది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో సైతం పాత పరిస్థితి పునరావృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్తవంగా నగరంలో 10 నుంచి 12 అసెంబ్లీ స్థానాల్లోపార్టీకి గట్టి పట్టుంది. సిట్టింగ్ స్థానాలైన చార్మినార్, యాకుత్‌పురా, చాంద్రాయణగుట్ట, నాంపల్లి, బహద్దూర్‌పురా, కార్వాన్, మలక్‌పేట అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్, అంబర్‌పేట, ముషీరాబాద్, ఖైరతాబాద్, సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానాలో ముస్లింల ప్రాబల్యం అధికంగానే ఉంది. గతంలో జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్‌లో పోటీ చేసి ఓటమి చవిచూసినా గణనీయమైన ఓట్లను దక్కించుకోగలిగింది. నిజామాబాద్ అర్బన్‌లో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. అయితే.. ఈసారి పార్టీ శ్రేణుల నుంచి ఒత్తిడి అధికమైంది. ఏకంగా స్థానిక శాఖలు తీర్మానాలు చేస్తున్న అధినేత నుంచి మాత్రం గ్రీన్ సిగ్నల్ లభించడం లేదు. ఇతర రాష్ట్రాలకు ఓకే.. ఇతర రాష్ట్రాల్లో మాత్రం పదుల సంఖ్యలో అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు మజ్లిస్ పార్టీ వెనుకాడటం లేదు. ఇప్పటికే మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, బిహార్, ఉత్తరప్రదేశ్. మధ్యప్రదేశ్‌లలో పోటీ చేసిన మజ్లిస్.. తాజాగా రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధమైంది. అక్కడ మూడు స్థానాలకు అభ్యర్థులను సైతం ప్రకటించింది. ప్రస్తుతం తెలంగాణలో ఏడుగురు, మహారాష్ట్రలో ఇద్దరు, బిహార్‌లో ఒకరు. (మజ్లిస్ నుంచి ఎన్నికైన నలుగురు ఎమ్మెల్యేలు ఆర్జేడీలో చేరారు) ఉన్నారు. వివిధ రాష్ట్రాలకు విస్తరించే ప్రయత్నాలను కొనసాగిస్తూనే, తెలంగాణలో బీజేపీ జోరుకు చెక్ పెట్టేందుకు బీఆర్ఎస్తో కలిసి వెళ్తున్నామని ఆ పారీ వర్గాలు పేర్కొంటున్నాయి. -
కేసీఆర్‌ను గెలిపించడానికే మోదీ పర్యటనలు.. బాంబు పేల్చిన రేవంత్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు పార్టీల ఫెలికాల్ బంధాన్ని గురించి నిజామాబాద్ సాక్షిగా ప్రధాని మోదీ బయటపెట్టారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చడమే బీఆర్ఎస్, బీజేపీ లక్ష్యమని రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా, రేవంత్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అంటే బీజేపీ రిస్తేదార్ సమితి అని మా నాయకుడు రాహుల్ గాంధీ ముందే చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని సర్వేలు చెబుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి కేసీఆర్‌ను గెలిపించేందుకే మోదీ తెలంగాణలో పర్యటనలు చేస్తున్నారు. పదేళ్లలో విభజన హామీల్లో ఏ ఒక్క హామీ నెరవేర్చే ప్రయత్నం చేయలేదు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను మోదీ అపహాస్యం చేశారు. మోదీనే ఒప్పుకున్నారు.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితను అరెస్టు చేయొద్దని కేసీఆర్ అడిగిన విషయాన్ని కూడా మోదీ చెప్పాల్సింది. బీఆర్ఎస్ అదేశాలతోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చారు. కేసీఆర్ అవినీతిపై ఎందుకు ఈడీ, సీబీఐ, ఐటీ విచారణ చేయడం లేదు. సీఎం కేసీఆర్ అవినీతి చేశారని ఆరోపణలు చేసినప్పుడు మోదీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ దోపిడీలో బీజేపీకి వాటాలు వెళుతున్నాయి. అందుకే కేసీఆర్‌పై మోదీ చర్యలు తీసుకోవడం లేదు. ఈ నిజాన్ని నిన్న నిజామాబాద్ సాక్షిగా మోదీ ఒప్పుకున్నారు. బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వడంపై ఎంఐఎం పునరాలోచించుకోవాలి. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే.. అవిభక్త కవలలు. మోదీ, కేసీఆర్‌ది ఫెవికాల్ బంధం. వారిది గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ. అలాంటి వారికి అసదుద్దీన్ ఎలా మద్దతు ఇస్తారు. ఎంఐఎం ఎవరివైపు నిలబడుతుంది?. బీజేపీతో దోస్తీ కడుతున్న బీఆర్ఎస్తోనా?. బీజేపీ, బీఆర్ఎస్ను ఓడించాలంటున్న కాంగ్రెస్ తోనా?. ఇదంతా నాణేనికి ఒకవైపే.. కేసీఆర్‌కు నీళ్లు అంటే.. కవిత కన్నీళ్లు గుర్తొస్తాయి. నిధులు అంటే దోపిడీ సొమ్ము.. నియామకాలు అంటే కొడుకును సీఎం చేయడం గుర్తొస్తాయి. కేసీఆర్ కొల్లగొట్టిన సొమ్ములతోనే మోదీని ఆయన దర్బారులో సన్మానం చేశారు. ఇదంతా కనిపించే ఒకవైపు మాత్రమే. మరి ఎన్నికల కోసం పంపిన కనిపించని వేల కోట్ల సంగతి ఏంటి?. బీఆర్ఎస్ దోపిడీపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. కేసీఆర్ అధిష్టానం నరేంద్ర మోదీ అని స్పష్టత వచ్చింది. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు ఉంటుందని ఆ పార్టీ ఎంపీలే నాకు చెప్పారు. 9 బీఆర్ఎస్, 7 బీజేపీకి, 1 ఎంఐఎంకు అని పంపకాలు చేసుకున్నారు. బండారం బయటపడిందనే కాంగ్రెస్‌పై బీజేపీ, బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తున్నాయి. వాళ్లిద్దరూ కాంగ్రెస్‌ను ఉమ్మడి శత్రువుగా భావిస్తున్నారు. మోదీ చెప్పింది నిజమో కాదో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను. ఇది కూడా చదవండి: ‘బీఆర్ఎస్ మేనిఫెస్టో.. శుభవార్తకు రెడీగా ఉండండి’ -
ఒవైసీకి దమ్ముంటే నాపై పోటీ చేయాలి: రాజాసింగ్
సాక్షి, అబిడ్స్ (హైదరాబాద్): మజ్లిస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ దమ్ముంటే గో షామహల్ నియోజకవర్గంలో తనపై పోటీ చేయాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సవాలు విసిరారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ.. మజ్లిస్ పార్టీని పాముకు పాలుపోసి పెంచినట్లు పోషించిందని ఆరోపించారు. కాంగ్రెస్ బంధుత్వాన్ని ఒవైసీ అప్పుడే మరిచిపోయారని ఎద్దేవాచేశారు. కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీకి ఒవైసీ సవాల్ విసరడం విడ్డూరంగా ఉందన్నారు. అసదుద్దీన్ కానీ ఆయన సోదరుడు అక్బరుద్దీన్ కానీ తనపై పోటీచేస్తే ప్రజలు వారిని చిత్తుగా ఓడిస్తారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో గోషామహల్లో మరోసారి విజయం సాధించి హ్యాట్రిక్ సాధిస్తానని రాజాసింగ్ ధీమా వ్యక్తంచేశారు. తాంత్రిక పూజల్లో కేసీఆర్ సిద్ధహస్తుడు కరీంనగర్ టౌన్: ముఖ్యమంత్రి కేసీఆర్ తాంత్రిక పూజల్లో సిద్ధహస్తుడని బీజేపీ జాతీ య ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. ఇతర పార్టీల నేతలనే కా కుండా తన మాట వినని సొంత పార్టీ నాయకులు కూడా నాశనం కావాలని కోరుకుంటూ ఇతర రాష్ట్రాలకు వెళ్లి క్షుద్ర పూజలు చేస్తున్నా రని మండిపడ్డారు. పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకుని సోమ వారం కరీంనగర్‌లోని మహాశక్తి ఆలయం వద్ద సంజయ్ మొక్క నాటారు. అనంతరం బీజేపీ ప్రచార రథాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ఎన్ని వేషాలేసినా, ఎన్ని కుట్రలు చేసినా మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నేతలు కులాల మధ్య కుమ్ములాటలు పెట్టి గెలవాలని చూస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ నుంచి గెలిచే వాళ్లంతా కేసీఆర్‌కు ఏటీఎం మిషన్ లాంటివాళ్లేనని, ఎప్పుడంటే అప్పుడు వాళ్లను బీఆర్ఎస్లోకి తీసుకోవడం ఖాయమన్నారు. -
ఇది యాంటీ బీసీ, యాంటీ ముస్లిం బిల్లు: ఎంపీ అసుదుద్దీన్
న్యూఢిల్లీ: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ పార్లమెంటులో కేంద్రం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లును తమ పార్టీ వ్యతిరేకిస్తున్నట్లు ఎంఐఎం నేత, ఎంపీ అసుదుద్దీన్ పేర్కొన్నారు. ఆ బిల్లులో కొన్ని ప్రధాన లోపాలున్నాయని అన్నారు. ‘నారీ శక్తి వందన్ అధినియం’ పేరుతో ప్రవేశపెట్టిన బిల్లులో ముస్లిం, ఓబీసీ వర్గాల మహిళల కోటాను చేర్చలేదని విమర్శించారు. కాగా లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలలో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్ కల్పించే బిల్లును మంగళవారం కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ లోక్‌సభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీనిపై దిగువసభలో బుధవారం చర్చ సాగింది.ఈ సందర్భంగా ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ లోక్‌సభలో మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ బిల్లు యాంటీ బీసీ, యాంటీ ముస్లిం బిల్లు అని విమర్శించారు. బీసీలకు న్యాయమైన వాటాను ఈ బిల్లు నిరాకరించిందన్నారు. కేవలం ధనవంతులే చట్టసభల్లో ఉండేలా ఈ బిల్లు పెట్టారని దుయ్యబట్టారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ, ముస్లిం మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని కోరారు. అప్పట్లో జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభభాయి పటేల్ రాజ్యాంగ సభలో ముస్లింలపై వివక్ష చూపించారని, వారు నిజాయితీగా ఉంటే ముస్లింలకు మరింత ప్రాతినిధ్యం ఉండేదని ఆరోపించారు. చదవండి: మహిళా రిజర్వేషన్ బిల్లును 15 ఏళ్లకే పరిమితం చేయొద్దు: ఎంపీ సత్యవతి -
TS Election 2023: బోధన్ నియోజక వర్గం.. ఆసక్తికర అంశాలు!
సాక్షి, నిజామాబాద్: బోధన్ నియోజక వర్గంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల సమస్య ప్రభావితం చేస్తోంది. నవీపేట మండలంలోని మాటు కాలువ 12 కిలో మీటర్ల పొడవున ఐదు గ్రామాల శివారులో జన్నెపల్లి, సిరన్‌పల్లి, లింగాపూర్, నిజాంపూర్, తుంగిని ఆయకట్టు 2 వేల ఎకరాల వరకు ఉంది. ఈ కాలువ గండిపడి రైతులు ఏళ్లకాలంగా నష్టపోతున్నారు. ఈ సమస్య ఎన్నికలపై ప్రభావితం చూపే అవకాశాలుంటాయి. బోధన్‌లో మూతపడి ఉన్న నిజాం షుగర్స్ ప్రతిపక్ష పార్టీలకు అస్త్రంగా మారబోతుంది. అధికారంలోకి వస్తే 100 రోజుల్లోగా నిజాం షుగర్ ఫ్యాక్టరీ ని తెరిపిస్తామని బీఆర్ఎస్ పార్టీ 2014 ఎన్నికల ముందు ప్రకటించింది.. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తాజా హామీల్లో 2లక్షల పంట రుణమాఫీ, రూ. 500 లకే సిలిండర్ హామీలు గ్రామాల్లో చర్చనీయాంశంగా ఉన్నాయి. రాజకీయపరంగా.. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ లో నాయకుల మధ్య అంతర్గత విబేధాలు ఎన్నికల ఫలితాల పై ప్రభావం చూపేందుకు అవకాశాలున్నాయి. అతి పెద్ద మండలం, ప్రభావితం చూపే పంచాయతీ.. అతి పెద్ద మండలం: నవీపేట ప్రభావితం చేసే పంచాయతీలు: నవీపేట, ఎడపల్లి, సాలూర నియోజక వర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య.. మొత్తం ఓటర్ల సంఖ్య: 2,04218 మహిళలు: 1,06226 పురుషులు: 97,989 ఇతరులు: 03 కొత్త ఓటర్లు: 12,300 వృత్తిపరంగా ఓటర్లు.. ఈ నియోజక వర్గంలో రైతులు ఎక్కువ మతం/కులం పరంగా ఓటర్లు? బీసీ ఓటర్లు: 1 లక్ష వరకు ఎస్సీ,ఎస్టీలు: 30 వేలు క్రిస్టియన్లు: 8500 ముస్లీం మైనార్టీలు: 50 వేలు ఇతరులు, రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణులు: 18500 (మున్నూర్‌కాపు, పద్మశాలి, లింగాయత్‌లు, గూండ్ల, గొల్లకుర్మలు, ముదిరాజ్ సంఖ్య అధికంగా ఉంటుంది.) నియోజక వర్గంలో భౌగోళిక పరిస్థితులు.. నియోజక వర్గం అంచున మంజీర, గోదావరినదులు ఉంటాయి. మహారాష్ట్ర ప్రాంతం నుంచి వచ్చే గోదావరి నది రెంజల్ మండలంలోని కందకుర్తి త్రివేణి సంగమ క్షేత్రం వద్ద తెలుగు నేలపై అడుగు పెడుతోంది. త్రివేణి సంగమ క్షేత్రం వద్ద గోదావరి పుష్కరాలు నిర్వహిస్తారు. ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు కేశవరావు బలిరాం హెగ్డెవార్ పూర్వీకుల గ్రామం కందకుర్తి (రెంజల్ మండలం) నవీపేట మండలానికి నిర్మల్ జిల్లాలోని బాసర పుణ్యక్షేత్రం సమీపంలో ఉంటుంది. బోధన్‌లో ఆసియా ఖండంలోనే ఖ్యాతి గడించిన నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఉంది. మూతపడింది. ఎడపల్లి మండలంలోని జాన్కంపే – ఠానాకలాన్ గ్రామాల మధ్య అలీసాగర్ రిజర్వాయర్, ఉద్యావనం పర్యాటక కేంద్రంగా ఉంది. నవీపేట మండలంలోని కోస్లీవద్ద గోదావరి నదిపై అలీసాగర్ ఎత్తిపోతల పథకం నిర్మించారు. 51 వేల ఎకరాలకు సాగు నీరందిస్తోంది.. కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు బోధన్, ఎడపల్లి, రెంజల్, నవీపేట మండలాల్లో ఉంటుంది. బోధన్‌లో ప్రముఖ ఏకచక్రేశ్వరాలయం ఉంది. నియోజక వర్గానికి మహారాష్ట్ర సరిహద్దు ఉంటుంది. ఆసక్తికర అంశాలు.. బోధన్ ఎమ్మెల్యే షకీల్ తెలంగాణలోనే ఏకైక ముస్లిం ఎమ్మెల్యే.. వరుసగా రెండుసార్లు గెలిచారు.. హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తున్నారు. అయితే ఇక్కడ మిమ్ పార్టీ సహకారం ముస్లింల సహకారం ఎన్నికల్లో ప్రభావితం చూపిస్తుంది.. కానీ మిమ్ నేతలకు ఎమ్మెల్యే షకీల్‌కు మధ్య సంబంధాలు చెడి పోయాయి.. ఆ పార్టీ నేతలు ఎనిమిది మందిపై ఎమ్మెల్యే హత్యాయత్నం కేసు పెట్టారు.. దాంతో నేతలు అరెస్టు అయ్యి జైలుకు వెళ్లారు.. వారిని మిమ్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ జైలుకు వెళ్లి పరామర్శించి బోధన్ లో యుద్ధం ప్రకటించారు.. ఇటీవల జరిగిన ఈ పరిణామంతో మిమ్ బోధన్ లో బీఆర్ఎస్కు సహకరించే పరిస్తితి లేదు. షకీల్‌ను మారిస్తే మనసు మారొచ్చు. ఇతర రాజకీయ అంశాలు.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి పోటీలో ఉంటారనే ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్కు చెందిన మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మ భర్త శరత్‌రెడ్డి, ఎమ్మెల్యే షకీల్ మధ్య అంతర్గత విబేదాలు రచ్చకెక్కాయి. శరత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ , ఎంఐఎం పార్టీ ముఖ్య నాయకులతో టచ్‌లో ఉన్నారు. బీజేపీ నాయకులతో టచ్‌లో ఉన్నారు. ఎమ్మెల్సీకవిత, జిల్లా మంత్రి ప్రశాంత్ రెడ్డిని కలిసి ఎమ్మెల్యే షకీల్‌కు మళ్లీ టిక్కెట్ ఇస్తే సహకరించేది లేదని ,ఓడిస్తామని తూము శరత్‌రెడ్డి తేల్చి చెప్పారు. మిత్ర పక్షంగా ఉన్న ఎంఐఎం నాయకులు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పని చేస్తున్నారు. ఎమ్మెల్యేను అడ్డగించిన ఎంఐఎం ఇద్దరు నాయకులను హత్యాయత్నం కేసు పెట్టి జైలుకు పంపారు. -
కేసీఆర్ నాయకత్వానికి మేం మద్దతిస్తాం: ఓవైసీ
-
ఎంఐఎంలో వారసులకు చాన్స్?.. రేసులో అక్బరుద్దీన్ కుమారుడు!
హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీనియర్ ఎమ్మెల్యేల వారసులతో పాటు యువతరానికి పెద్దపీట వేయాలని మజ్లిస్ పార్టీ యోచిస్తోంది. సిట్టింగ్ స్థానాలతో అదనపు స్థానాలను సైతం తమ ఖాతాల్లో పడే విధంగా వ్యూహ రచన చేస్తోంది. నగరంలో పార్టీకి కంచుకోట లాంటి ఏడు సిట్టింగ్ స్థానాలుండగా కొత్తగా మరికొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలపై కూడా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అయితే సిట్టింగ్ స్థానాల్లోని ముగ్గురు ఎమ్మెల్యేలు వయోభారం దృష్ట్యా అభ్యర్థిత్వాలు మార్పు అనివార్యం కాగా, మరో స్థానంలో సైతం రాజకీయ పరిస్థితులను బట్టి అభ్యర్థి మార్పు జరిగే అవకాశాలు లేకపోలేదని పార్టీలో జోరుగా ప్రచారం సాగుతోంది. మొత్తం మీద ఖాళీ అయ్యే స్థానాల్లో సిట్టింగ్‌ల వారసులతో పాటు కొత్త వారికి కూడా అవకాశం దక్కవచ్చని చర్చ జరుగుతుంది. గత పర్యాయం జరిగిన ఎన్నికల్లో ఏడుగురు సిట్టింగ్‌లకు అవకాశం లభించగా, అందులో అప్పటి యాకుత్‌పురా ఎమ్మెల్యే అభ్యర్థిత్వం చార్మినార్ స్థానానికి, చార్మినార్ ఎమ్మెల్యే అభ్యర్థిత్వం యాకుత్‌పురా స్థానాలకు మార్చి అవకాశం కల్పించారు. కానీ ఈసారి ఎన్నికల్లో మాత్రం ముగ్గురు నుంచి నలుగురు సిట్టింగుల అభ్యర్థిత్వాలే మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారసుల అరంగేట్రం? కొత్తగా పార్టీ సీనియర్ నేతల వారసుల పేర్లు తెరపైకి వచ్చాయి. పార్టీ ద్వితీయ అగ్రనేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్‌ఖాన్‌ల కుమారులు కూడా ఈసారి పోటీలో ఉంటారని ప్రచారం సాగుతోంది. ఇప్పటికే చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్‌ఖాన్, యాకుత్‌పురా ఎమ్మెల్యే అహ్మద్ పాషాఖాద్రిలు వయోభారం దృష్ట్యా పోటీపై పెద్దగా అసక్తి కనబర్చడం లేదు. అధిష్టానం మాత్రం మరో పర్యాయం వారి సేవలు వినియోగించుకోవాలని యోచిస్తోంది. ముంతాజ్‌ఖాన్ మాత్రం తన కుమారుడికి అవకాశం కల్పించాలని అదిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. నాలుగు స్థానాల్లో.. మజ్లిస్ పార్టీ సిట్టింగ్ స్థానాలైన ఏడింటిలో నాలుగింటిలో మార్పులు చేయాలని భావిస్తోంది. చాంద్రాయణగుట్ట నుంచి ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఈసారి కూడా పోటీ చేస్తారనడంలో ఎలాంటి అనుమానం లేదు. సిట్టింగ్‌లున్న మలక్‌పేట నుంచి అహ్మద్ బలాల, కార్వాన్ నుంచి కౌసర్ మోయినుద్దీన్‌లు పోటీలో ఉండటం ఖాయమే. ఇక మిగిలిన నాలుగు స్థానాల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయ పరిస్థితులను బట్టి నాంపల్లి నియోజకవర్గం నుంచి జాఫర్‌హుస్సేన్ మేరాజ్ అభ్యర్థిత్వం మార్పు జరిగితే ఆ స్థానంలో మాజీ మేయర్ మాజిద్ హుస్సేన్ అభ్యర్థిత్వం ఖరారయ్యే అవకాశం కూడా లేకపోలేదని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇక బహదూర్‌పురా ఎమ్మెల్యే మోజంఖాన్ వయోభారం దృష్ట్యా ఆయనను తప్పిస్తే ఆ స్థానం నుంచి అక్బరుద్దీన్ కుమారుడు నూరుద్దీన్ ఒవైసీ పేరు పరిశీలించే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మోజంఖాన్ బరిలో ఉంటే నూరుద్దీన్ ఒవైసీని చార్మినార్ లేదా యాకుత్‌పురా నుంచి పోటీలోకి దింపే అవకాశాలు లేకపోలేదన్న చర్చ సాగుతోంది. ఆ రెండింటిపై కూడా పాత నగరంలో చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా, బహదూర్‌పురాతోపాటు కార్వాన్, నాంపల్లి, మలక్‌పేట నియోజకవర్గాల్లో వరుస విజయాలతో కై వసం చేసుకుంటూ వస్తున్న మజ్లిస్ ఈసారి రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్‌పై కన్నేసినట్లు తెలుస్తోంది. రాజేంద్రనగర్ అసెంబ్లీ పరిధిలో పార్టీ అధినేత అసదుద్దీన్ నివాసం ఉండటంతో ఆ స్థానం కూడా పార్టీ ఖాతాలో వేసుకునేందుకు వ్యూహ రచన సాగుతున్నట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్‌లో గట్టి పట్టు ఉండటంతో బలమైన అభ్యర్థిని బరిలో దింపాలని యోచిస్తోంది. -
చైనా ముందు మోకరిల్లిన మోదీ సర్కారు: అసదుద్దీన్
సాక్షి, హైదరాబాద్: చైనా ముందు మోదీ సర్కార్ మోకరిల్లుతోందని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. లద్దాఖ్ సరిహద్దులో ఏం జరుగుతుందో దేశప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఒవైసీ మాట్లాడుతూ భారత వీర సైనికులు 40 నెలలుగా సరిహద్దులో చైనీయులకు భయపడకుండా నిలబడ్డారన్నారు. మరి మోదీ ఎందుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ఎదురొడ్డి నిలబడలేకపోతున్నారని ప్రశ్నించారు. ది కశ్మీర్ ఫైల్స్ చిత్రం అవార్డుకు ఎంపిక చేయడం పట్ల అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర అభ్యంతరం తెలిపారు. -
బీఆర్ఎస్ ప్రభుత్వంపై అక్బరుద్దీన్ ప్రశంసలు.. కేసీఆర్ మళ్లీ సీఎం!
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ పాలనపై అసెంబ్లీలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ప్రశంసలు కురిపించారు. తమ ప్రయాణం బీఆర్‌ఎస్‌తోనేనని స్పష్టం చేశారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని పేర్కొన్నారు. తమ్మిదేళ్ల కాలంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని చెప్పారు. శాసనసభలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు-స్వరాష్ట్రంలో సాధించిన ప్రగతిపై అక్బరుద్దీన్ ఒవైసీ లఘుచర్చను ప్రారంభించారు. జైపూర్ రైలు ఘటనలో చనిపోయిన హైదరాబాద్ యువకుడికి ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. ఇందుకు రాష్ట్ర సర్కారుకు, కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారని అక్బరుద్దీన్ చెప్పారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని అన్ని రాష్ట్రాలు చూసి నేర్చుకోవాలన్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండటం గర్వంగా భావిస్తున్నానని చెప్పారు. రాష్ట్రంలో 50 లక్షల మంది ముస్లీం మైనార్టీలు ఉన్నారని వారి ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.2200 కోట్లు కేటాయించిందన్నారు. మైనార్టీలకు షాదీముబారక్, ఓవర్సీస్ స్కాలర్షిప్ వంటి పథకాలు చేపట్టారని వెల్లడించారు. రెండో హజ్ హౌస్‌కు ప్రభుత్వం రూ.23 కోట్లు కేటాయించిందని చెప్పారు. 58, 59 జీవో కింద పట్టాలు ఇచ్చి ప్రభుత్వం పేదలను ఆదుకుంటుంన్నదని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల సక్షేమాభివృద్ధికి కృషిచేస్తుందన్నారు. -
మేం వాళ్లకు అంటరానివాళ్లమేమో!: ఎంఐఎం
ఢిల్లీ: బీజేపీని ఓడించే ఏకైక లక్ష్యంతో ఏకమైన 26 పార్టీల విపక్ష కూటమి.. ఇండియా(I.N.D.I.A) పేరుతో 2024 సార్వత్రిక ఎన్నికలకు సంఘటితంగా వెళ్లాలని నిర్ణయించుకుంది. అయితే రెండు రోజల బెంగళూరు విపక్ష భేటీకి తమను ఆహ్వానించకపోవడాన్ని ఎంఐఎం తీవ్రంగా పరిగణించింది. రాజకీయంగా మేం అంటరానివాళ్లమని భావించారు గనుకే మమ్మల్ని విపక్ష భేటీకి పిలవలేదేమో అని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన మజ్లిస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి వారిస్ పథాన్. ‘‘లౌకిక పార్టీలని చెప్పుకునే వాళ్లు.. ఎందుకనో మమ్మల్ని ఆహ్వానించలేదు. బహుశా రాజకీయ అంటరానితనమే అందుకు కారణం కాబోలు. ఒకప్పుడు బీజేపీతో ఉన్న నితీశ్ కుమార్, ఉద్దవ్ థాక్రే, మెహబూబా ముఫ్తీలను సైతం వాళ్లు పిలిచారు. అంతెందుకు.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తిట్టిపోసిన అరవింద్ కేజ్రీవాల్ సైతం వాళ్లతో బెంగళూరులో కూర్చున్నారు. 2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా మేం కృష్టి చేస్తున్నాం. కానీ, మా పార్టీని, పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీని వాళ్లు పట్టించుకోలేదు అని వారిస్ వ్యాఖ్యానించారు. ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూసివ్ అలయన్స్ పేరుతో విపక్ష కూటమి.. వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఢీ కొట్టేందుకు సిద్ధం కావాలని నిర్ణయించుకున్నాయి. ఇదీ చదవండి: ఇండియాపై యుద్ధానికి దిగితే గెలుపెవరిదంటే.. -
విపక్షాల కూటమికి ఒవైసీ పంచ్.. ‘చౌదరీ’ల క్లబ్‌లా తయారైందంటూ..
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతిపై తీవ్ర చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇక, యూసీసీ బిల్లును పార్లమెంట్ సమావేశాల్లో పెట్టేందుకు అటు బీజేపీ రెడీ అవుతోంది. ఈ క్రమంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. యూసీసీని తమ పార్టీ వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఇక, తాజాగా ఒవైసీ మీడియాతో మాట్లాడుతూ.. హిందూ వివాహ చట్టాన్ని పూర్తిగా మార్చలేని వారు, యూసీసీని ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. బీజేపీని ఓడించాలనుకుంటున్న విపక్ష పార్టీలు.. భిన్నమైన ఎజెండాతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఇదే క్రమంలో విపక్ష పార్టీల కూటమికి సెటైరికల్ పంచ్ ఇచ్చారు. విపక్ష పార్టీల కూటమి చౌదరీల క్లబ్‌లా తయారైందన్నారు. విపక్ష పార్టీల భేటీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ మామూలు వ్యక్తి కాదు అని, దేశ రాజకీయాల్లో ఆయన ముఖ్య పాత్ర పోషిస్తున్నారని ఒవైసీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. #WATCH | Our party will oppose UCC...If you (opposition parties) want to defeat BJP then you have to show the difference that you will not follow the agenda set by BJP. They (opposition parties) are a club of big 'Chaudharis'. You have not invited our Telangana CM to the meeting.… pic.twitter.com/ABGOvfPbVV — ANI (@ANI) July 15, 2023 ఇదిలా ఉండగా, అంతకుముందకు అసోం సీఎం హిమంత బిశ్వ శర్మకు ఒవైసీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ముస్లిం వ్యాపారుల వల్లనే కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని శర్మ చేసిన వ్యాఖ్యలకు ఒవైసీ కౌంటర్ ఇచ్చారు. అసోంలో ఒక విచిత్రమైన గుంపు తయారైంది. వారింట్లో గేదె పాలు ఇవ్వకపోయినా, కోడి గుడ్డు పెట్టక పోయినా దానికి ముస్లింలు(అసోంలో మియాలు) కారణమంటారు. బహుశా వారి వ్యక్తిగత వైఫల్యాలకు కూడా మియా భాయ్ మీద నిందలు వేస్తారేమోనని చురకలంటించారు. ఇదే క్రమంలో మన ప్రధాని విదేశీ ముస్లింలతో చాలా చనువుగా ఉంటారు కదా.. మరి అక్కడికి వెళ్ళినప్పుడు టమాటాలు, పాలకూరను, బంగాళాదుంపలను ఎగుమతి చేయమని ఆయా దేశాలను కోరితే బాగుంటుందని ఎద్దేవా చేశారు. क्या Assam के CM Himanta Sarma UCC Bill को अदिवासियों पर लागू करेंगे, वह सिर्फ एक आंख से देख रहे हैं बस और उस आंख में मुसलमानों को लेकर Hatred (नफ़रत) भरी हुई है : Barrister Asaduddin Owaisi#ucc #ManipurBurning #UCCDividesIndia #IndiaAgainstUCC #aimim #owaisi pic.twitter.com/3OJHPYO2Sg — Mohammad shahnshah (@shahnshah_aimim) July 15, 2023 ఇది కూడా చదవండి: తెలంగాణ కాంగ్రెస్‌లో మరో ట్విస్ట్? -
మీ ఇంట్లో గేదె పాలు ఇవ్వకపోయినా మేమే కారణమా?
న్యూఢిల్లీ: ముస్లిం వ్యాపారుల వల్లనే కాయగూరల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. ఈ వ్యాఖ్యలకు ప్రతి స్పందిస్తూ ఎఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఘాటుగా స్పందించారు. మీ ఇళ్లలో గేదెలు పాలు ఇవ్వకపోయినా దానికి ముస్లింలే కారణం అనేలా ఉన్నారే.. అంటూ ట్విట్టర్లో ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అస్సామీయులు ఎప్పుడు వ్యాపారం చేసినా కాయగూరల ధరలు ఇంతగా పెరగలేదని ముస్లిం వ్యాపారులే ధరలను పెంచుకుంటూ పోతున్నారని అన్నారు. మీరే చెప్పండి కాయగూరల ధరలను పెంచింది ఎవరు మియాలు(అసోంలో ఉంటూ బెంగాలీ మాట్లాడే స్థానిక ముస్లింలు) కాదా? అని ఎదురు ప్రశ్నించారు. ఈ సందర్బంగా మియా సంఘం వారిని బయటవారిగా చెబుతూ వారు అస్సామీ సంస్కృతిని, భాషని కించపరుస్తూ చాలా జాత్యహంకారంతో వ్యవహరిస్తూ ఉంటారని ఘాటు విమర్శలు చేశారు. అసోం సీఎం చేసిన ఈ వ్యాఖ్యలకు ఎఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ.. అసోంలో ఒక విచిత్రమైన గుంపు తయారయ్యింది. వారింట్లో గేదె పాలు ఇవ్వకపోయినా, కోడి గుడ్డు పెట్టక పోయినా దానికి మియాలే కారణమంటారు. బహుశా వారి వ్యక్తిగత వైఫల్యాలకు కూడా మియా భాయ్ మీద నిందలు వేస్తారేమోనని చురకలంటించారు. మన ప్రధాని విదేశీ ముస్లింలతో చాలా చనువుగా ఉంటారు కదా మరి అక్కడికి వెళ్ళినప్పుడు టమాటాలు, పాలకూరను, బంగాళాదుంపలను ఎగుమతి చేయమని ఆయా దేశాలను కోరితే బాగుంటుందని ఎద్దేవా చేశారు. देश में एक ऐसी मंडिली है जिसके घर अगर भैंस दूध ना दे या मुर्ग़ी अण्डा ना दे तो उसका इल्ज़ाम भी मियाँ जी पर ही लगा देंगे। शायद अपने “निजी” नाकामियों का ठीकरा भी मियाँ भाई के सर ही फोड़ते होंगे।आज कल मोदी जी की विदेशी मुसलमानों से गहरी यारी चल रही है, उन्हीं से कुछ टमाटर, पालक, आलू… https://t.co/1MtjCnrmDT — Asaduddin Owaisi (@asadowaisi) July 14, 2023 ఇది కూడా చదవండి: రాంగ్ రూటులో వచ్చి అంబులెన్సును ఢీకొట్టిన మంత్రి కాన్వాయ్ -
భయపడే వాళ్లు ఎవరూ లేరు.. ఒవైసీకి ఎమ్మెల్యే షకీల్ స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, నిజామాబాద్: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల్లో చూసుకుందామని బెదిరిస్తే భయపడే వారు ఇక్కడ ఎవరూ లేరు అంటూ స్ట్రాంగ్ కామెంట్స్ చేశారు. దీంతో, ఎమ్మెల్యే వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కాగా, బీఆర్ఎస్ బోధన్ ఎమ్మెల్యే షకీల్ శుక్రవారం ఓ వీడియోలో మాట్లాడుతూ.. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేస్తున్నారు. ఎన్నికలు రాగానే ఆయన నైజం బయటపెడుతున్నారు. ఎన్నికల్లో చూసుకుంటామని బెదిరిస్తే భయపడే వారు ఎవరూ లేరు. దమ్ముంటే ముందు నుండి కొట్లాడండి.. వెనుక నుండి కాదు. నేనెవరి మీదా తప్పుడు కేసులు పెట్టలేదు. ఎంఐఎం కౌనిల్సర్లు నామీద ముమ్మాటికీ హత్యాయత్నం చేశారు. ప్లాన్ ప్రకారమే ఆరోజు నామీద దాడి చేసి చంపాలనుకున్నారు. ప్రస్తుతం జైలులో ఉన్న నిందితులపై సంఘ విద్రోహా కేసులు ఉన్నాయి. దొంగతనం, రౌడీయిజం, మర్డర్ ఇలా చాలా కేసులు వారిపై ఉన్నాయి. బోధన్ బీఆర్ఎస్ రాజకీయ నేత శరత్ రెడ్డి, ఎంఐఎం నేతలు కలిసి నాపై కుట్రలు చేస్తున్నారు. ఈ హత్యాయత్నం కేసులో పోలీసులే నిజానిజాలు తేలుస్తారు. ఈసారి ఎన్నికల్లో తేల్చుకుందాం. బోధన్ ప్రజలు నాతోనే ఉన్నారు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: అరెస్ట్ అయిన వారంతా కవిత గెలుపు కోసం పనిచేశారు: ఎంఐఎం ఒవైసీ -
తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త టెన్షన్.. రేవంత్ ప్లాన్?
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. ఈ క్రమంలో తెలంగాణలో బలంగా ఉన్న అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని మజ్లిస్ (ఎంఐఎం) పార్టీ చేసిన ప్రకటనపై ఇప్పుడు కాంగ్రెస్ దృష్టిపెట్టింది. కాంగ్రెస్‌కు సంప్రదాయకంగా ఉన్న ముస్లిం ఓట్లను చీల్చే కుట్రలో భాగంగానే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఈ నిర్ణయం తీసుకున్నారని.. దీనివల్ల కాంగ్రెస్‌పై పడే ప్రభావం ఎలా ఉంటుంది, దీనిని ఎలా ఎదుర్కోవాలన్న విషయాలపై ఆలోచన చేస్తోంది. ఈ మేరకు వ్యూహాలను సిద్ధం చేయాలని రాష్ట్ర నేతలకు రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గే సూచించినట్టు సమాచారం. ముస్లిం ఓటర్లు 15% నుంచి 40% వరకున్న 49 నియోజకవర్గాల పరిధిలో కార్యాచరణ తీసుకోవాలని ఆదేశించినట్టు తెలిసింది. ఎంఐఎంను అడ్డుకోవాల్సిందే.. రాష్ట్రంలో సుమారు 44 లక్షల ముస్లిం జనాభా ఉంది. ఇందులో 20 వేలకన్నా ఎక్కువ ముస్లిం ఓటర్లున్న నియోజకవర్గాలు 49 ఉన్నాయి. ఇందులో ప్రస్తుతం ఎంఐఎం ఎమ్మెల్యేలున్న స్థానాలతోపాటు కొత్తగా జహీరాబాద్, సంగారెడ్డి, బోధన్, నిజామాబాద్ అర్బన్, నిర్మల్, ముధోల్, ఆదిలాబాద్, కరీంనగర్, జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్, ఖైరతాబాద్, గోషామహల్, కుత్బుల్లాపూర్, ముషీరాబాద్, వరంగల్ ఈస్ట్, మహబూబ్‌నగర్, బాన్సువాడ, ఎల్లారెడ్డిలలో మజ్లిస్ పోటీచేసే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ నేతలు అంచనా వేసినట్టు తెలిసింది. ఇందులో మెజార్టీ స్థానాలు ప్రస్తుత సర్వేల్లో కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నవేనని.. కేవలం ముస్లిం ఓటు బ్యాంకును చీల్చేందుకే ఎంఐఎం ఆ స్థానాల్లో పోటీచేసే అవకాశం ఉందని భావిస్తున్నట్టు సమాచారం. ఆయా స్థానాల్లో ఎంఐఎం ప్రాబల్యాన్ని అడ్డుకోకుంటే.. కాంగ్రెస్ గెలుపు అవకాశాలపై ప్రభావం పడుతుందని అభిప్రాయపడినట్టు తెలిసింది. కర్ణాటకలో కలసిరావడంతోనే.. కర్ణాటక ఎన్నికల్లో ముస్లిం ఓట్లన్నీ కాంగ్రెస్ వైపు మళ్లడం విజయానికి బాటలు వేసిందని.. బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిన 4% రిజర్వేషన్ కోటాను పునరుద్ధరిస్తామన్న ప్రకటన కాంగ్రెస్‌కు కలసి వచి్చందని నేతలు చెప్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో బీఆర్ఎస్ హామీఇచ్చి అమలు చేయలేకపోయిన ముస్లింలకు 12% రిజర్వేషన్ల అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించినట్లు తెలిసింది. ముస్లింలలో ప్రభావం చూపే వ్యక్తులతో సమావేశాలు నిర్వహించి కాంగ్రెస్ వైపు తిప్పుకోవాలని అధిష్టానం సూచించినట్టు సమాచారం. ఇది కూడా చదవండి: ఆ మార్పుల ప్రచారం కేసీఆర్ కుట్ర -
తెలంగాణ పాలిటిక్స్‌లో ట్విస్ట్.. బిగ్ బాంబ్ పేల్చిన ఒవైసీ!
సాక్షి, నిజామాబాద్: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ నిజామాబాద్ జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్బంగా నిజామాబాద్ జిల్లా జైలులో ఉన్న బోధన్ ఎంఐఎం నేతలతో ములాఖత్ అయ్యారు. అయితే, ఇటీవలే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే షకీల్ ఫిర్యాదుతో మజ్లిస్ నేతలు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. జైలు ములాఖత్ అనంతరం ఒవైసీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ సందర్బంగా ఒవైసీ మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో మెజార్టీ స్థానాల్లో పోటీ చేస్తాం. ఎక్కడెక్కడ పోటీ చేస్తామనేది ఎన్నికల ముందు జాబితాను ప్రకటిస్తాం. బోధన్‌లో ఎంఐఎం పోటీ చేస్తుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్‌కు ఎన్నికల ద్వారా తగిన బుద్ధి చెబుతాం. ఎంఐఎం కౌన్సిలర్స్, నేతలపై అక్రమ కేసులు పెట్టారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్, డీజీపీ దృష్టికి తీసుకువెళ్తాం. అరెస్ట్ అయిన ఎంఐఎం నేతలు.. ఎమ్మెల్సీ కవిత, షకీల్ గెలుపు కోసం పనిచేశారు. తెలంగాణలో ముస్లింలకు కూడా ముస్లిం బంధు ఇవ్వాలి. ముస్లింలలో పేద ప్రజలు ఎక్కవగానే ఉన్నారు. గతంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లాము. కానీ, ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మసీదులు తొలగించి సచివాలయం నిర్మించారు. ఆ మసీదులు వెంటనే కట్టాలి అని డిమాండ్ చేశారు. ఇదే క్రమంలో ఎంఐఎం బలపడటం కోసం ముందుగా పనిచేస్తాం. ఏ పార్టీతో మద్దతు.. ఏ పార్టీతో ముందుకెళ్లాలనేది ఆలోచిస్తాం. పాట్నా మీటింగ్‌కు ప్రతిపక్ష పార్టీలు నన్ను పిలవలేదు. తెలంగాణలో మేం కూడా ప్రత్యామ్నాయమే. తెలంగాణలో గెలుపోటములను ప్రజలు నిర్ణయిస్తారు. మణిపూర్‌లో మైనార్టీలకు అన్యాయం చేస్తున్నారు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: బీజేపీలో కోల్డ్‌వార్ పాలిటిక్స్.. జేపీ నడ్డాకు వారు ముగ్గురు ఏం చెప్పారు? -
ఎస్పీకి ఎసరుపెడుతూ.. మజ్లిస్ పార్టీ హవా!
తెలంగాణలో, అదీ హైదరాబాద్‌లో అధిక ప్రభావం చూపే ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్(AIMIM).. వడివడిగా మిగతా రాష్ట్రాల్లోనూ అడుగులు వేస్తోంది. ఆయా రాష్ట్రాల ఎన్నికల్లో బొటాబొటీ ప్రదర్శన కనబరుస్తూ వస్తున్న పార్టీ.. తాజాగా యూపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో చూపిన హవాపై ఇప్పుడు జోరుగా చర్చ నడుస్తోంది. ఏకంగా పదవులను చేపట్టే స్థాయికి చేరుకోగా.. మరోవైపు ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీలో టెన్షన్ మొదలైంది. ఒకే ఒక్క సీటు.. 0.49 శాతం ఓట్లు.. కిందటి ఏడాది జరిగిన ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో ఎంఐఎం రాబట్టిన ఫలితం ఇది. థర్డ్ ఫ్రంట్ ‘భగీదారి పరివర్తన్ మోర్చా’ పేరుతో ఎన్నికల్లో దిగినప్పటికీ.. పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది మజ్లిస్ పార్టీ. అయితే.. యూపీ నగర పాలికా పరిషత్‌లో ఐదుగురు మజ్లిస్ అభ్యర్థులు చైర్మన్లుగా, మరో 75 మంది కౌన్సిలర్లుగా ఎన్నికైనట్టు ఒవైసీ తెలిపారు. మీరట్‌లో 11 మంది కౌన్సిలర్ స్థానాలను దక్కిం చుకొని మజ్లిస్ డిప్యూటీ చైర్మన్ పదవిని చేపట్టబోతున్నారు. మీరట్‌లో అయితే ఏకంగా మేయర్ అభ్యర్థిత్వానికి జరిగిన పోటీలో బీజేపీ నామిని తర్వాత రెండో స్థానంలో నిలిచారు ఎంఐఎం అభ్యర్థి. అయితే.. ఈ మొత్తంలో నష్టపోయింది ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీనే!. ముస్లిం ఓటు బ్యాంకును ఇంతకాలం మెయింటెన్ చేస్తూ వస్తున్న ఎస్పీకి ఇది ఊహించిన షాక్ అనే చెప్పాలి. అదీగాక.. ఇంతకాలం బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీలకే పరిమితమైన స్థానిక సంస్థల్లో మజ్లిస్ పాగా వేయడం ఓ మైలురాయిగా చెప్పొచ్చు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో యూపీ ముస్లిం ఓట్ బ్యాంకు అంతా దాదాపుగా సమాజ్‌వాదీ పార్టీ వైపే వెళ్లింది. మిత్రపక్షాలతో కలిసి 34 మంది ముస్లిం అభ్యర్థులను బరిలోకి దింపి.. విజయం సాధించింది ఎస్పీ. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. ఎంఐఏం చేజిక్కించున్న నగర పాలిక పరిషత్‌లలో ఎస్పీ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. రెండు చోట్ల చివరాఖరి స్థానంతో సరిపెట్టుకోవడం గమనార్హం. అన్నింటికి మించి.. మీరట్ ఫలితం మజ్లిస్ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. 2.35 లక్షల ఓట్లతో(41 శాతం) బీజేపీ అభ్యర్థి హిరాకాంత్ అహ్లువాలియా మేయర్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఆ తర్వాతి ప్లేస్‌లో 1.28 లక్షల ఓట్లతో(22.37 శాతం) ఎంఐఎం అభ్యర్థి అనస్ రెండో స్థానంలో నిలిచారు. ఇక.. మూడో స్థానంలో ఎస్పీ ఎమ్మెల్యే అతుల్ ప్రధాన్ భార్య సీమా ప్రధాన్ నిలిచారు. 17 మేయర్ సీట్లకుగానూ 10 చోట్ల, అలాగే.. 52 నగర పాలిక పరిషత్ చైర్పరిషత్ అభ్యర్థులను, 63 మంది నగర పంచాయితీ చైర్పర్సన్ అభ్యర్థులను, 653 వార్డ్ మెంబర్.. పరిషత్ మెంబర్లను స్థానిక సంస్థల ఎన్నికల్లో దింపింది ఎంఐఎం. మొత్తంగా అర్బన్ లోకల్ బాడీ ఎన్నికల్లో 83 వార్డులు గెల్చుకున్నట్లు ప్రకటించుకుంది ఆ పార్టీ. మజ్లిస్ పార్టీ సాధించిన ఈ ఫలితం కంటే సమాజ్‌వాదీ పార్టీకి గట్టి పోటీ ఇవ్వడం అనే కోణంలోనే చర్చ నడుస్తోంది అక్కడ. ఇప్పటికిప్పుడు అది జరగకపోయినా.. ఎస్పీ ఓటు బ్యాంకుకు ఎంఐఎం దెబ్బ తీసే అవకాశాలను కొట్టిపారేయలేమని అక్కడి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే యూపీ, బీహార్, మహారాష్ట్రలలో ఇప్పటికే ఎస్టాబ్లిష్ మెంట్ అయ్యింది మజ్లిస్ పార్టీ. ఇప్పుడు మరిన్ని రాష్ట్రాల వైపు చూస్తోంది. ఈ క్రమంలో ముస్లిం ఓట్లతో పాటు దళిత ఓట్లను సైతం ఆకర్షించే ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం యూపీ థర్డ్‌ఫ్రంట్‌లోకి మాయావతి బీఎస్పీకి సైతం ఆహ్వానం పంపింది. అటు నుంచి సానుకూల స్పందన వస్తుందనే ఎంఐఎం భావిస్తోంది కూడా. మరోవైపు 2024 సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా బీజేపీ పసమందా ముస్లిం(వెనుకబడిన ముస్లింలు)లను ఆకర్షించేలా స్వయంగా ప్రధాని మోదీ వరాలు ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికల్లో పది నుంచి పదిహేను స్థానాల్లో పోటీ చేయాలని ఎంఐఎం భావిస్తోందట. ఈ విషయాన్ని ఎంఐఎం జనరల్ సెక్రటరీ పవన్ రావ్ అంబేద్కర్ ప్రకటించారు. -
అమిత్ షా విమర్శలకు అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్
-
శాంతిభద్రతల కోసం బీజేపీని తిరస్కరించాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మతవిద్వేషాల వ్యాప్తికి బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోందని, శాంతిభద్రతలు వెల్లివిరియాలంటే కమలనాథులను తిరస్కరించాలని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రజలకు పిలుపునిచ్చారు. కేవలం మతోన్మాదాన్ని రెచ్చగొట్టి అధికారంలో రావాలని పగటికలలు కంటోందని దుయ్యబట్టారు. గురువారం హైదరాబాద్ దారుస్సలాం మైదానంలో జరిగిన ఏఐఎంఐఎం ఆవిర్భావ దినోత్సవాల్లో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి, అనంతరం బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని, బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే ఇక్కడే జీడీపీ ఎక్కువని పేర్కొన్నారు. రాష్ట్రంలో మతకల్లోలాలు లేవని, శాంతి, అభివృద్ధి రెండూ ఉన్నాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతి, రాజ్యాంగం కావాలో లేక బుల్డోజర్ కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలన్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు గంట మోగినట్లేనని, పార్టీ బాధ్యులు ఎన్నికలకు సంసిద్ధం కావాలని అసదుద్దీన్ పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో రాజస్తాన్, కర్ణాటకలో ఏఐఎంఐఎం పోటీ చేస్తుందని ప్రకటించారు. గ్యాస్ సిలిండర్‌కు నమస్కారం పెట్టండి వచ్చే ఎన్నికల్లో ఓటు వేసే ముందు మహిళలు తమ ఇళ్లలోని గ్యాస్ సిలిండర్లకు నమస్కారం పెట్టి వెళ్లాలని ఒవైసీ విజ్ఞప్తి చేశారు. వంటగ్యాస్ సిలిండర్ల ధరలను మరోసారి పెంచిన మోదీ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. ఖదీర్‌ఖాన్ కుటుంబాన్ని తమ పార్టీ అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఒవైసీ ప్రకటించారు. భారతదేశానికి చాయ్‌వాలా, చౌకీదార్ అవసరం లేదని, దేశ సరిహద్దులను రక్షించగల బలమైన ప్రధాని అవసరమని ఏఐఎంఐఎం శాసన పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అహ్మద్ పాషా ఖాద్రీ, అహ్మద్ పాషా ఖాద్రీ, జాఫర్ హుస్సేన్ మేరాజ్, కౌసర్ మోహియుద్దీన్, అహ్మద్ బలాలా, మోజంఖాన్, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్ మద్దతు ప్రకటన.. పోటీకి బీజేపీ సై?
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోటీపై బీజేపీ పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. తొలుత ఎన్నికకు దూరంగా ఉండాలని భావించింది కమలం పార్టీ. అయితే.. తాజాగా ఎంఐఎంకు మద్దతు ఇస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది బీఆర్ఎస్. దీంతో బీజేపీ పునరాలోచనలో పడింది. ఇదిలా ఉంటే.. హైదరాబాద్ స్థానిక సంస్థ ఎమ్మెల్సీ కోటా ఓట్లు 127 కాగా ఇందులో 9 ఖాళీగా ఉన్నాయి. ఎల్లుండితో నామినేషన్ల ఘట్టం ముగియనుంది. ఓటు హక్కు వినియోగించుకునే వారి సంఖ్య 118 కాగా, ఎంఐఎం 52, బీఆర్ఎస్ 41, బిజెపికి 25 ఓట్ల చొప్పున ఉన్నాయి. మొత్తం ఓట్లలో 60 ఓట్లు వస్తే గెలిచినట్లు లెక్క. అంటే.. ఏ పార్టీ కూడా సొంతంగా గెలవలేని పరిస్థితి ఉందన్నమాట. ఇక బీఆర్ఎస్-ఎంఐఎంల మద్దతు నేపథ్యంలో.. బీజేపీ గనుక బరిలోకి దిగితే ఓటింగ్ తప్పనిసరి కానుంది. ఇప్పటికే స్థానిక సంస్థ ఎమ్మెల్సీ ఎన్నిక పోటీపై బీజేపీ నేతలు విస్తృతంగా చర్చిస్తున్నారు. ఇదిలా ఉండగా.. మరోవైపు హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్ నగర్ టీచర్స్ ఎమ్మెల్సీ బరిలో బీజేపీ అభ్యర్థిగా ఏవీఎన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. -
MLC Elections: ఎంఐఎం ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీర్జా రహమత్ బేగ్
సాక్షి,హైదరాబాద్: నగర స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థిగా మీర్జా రహమత్ బేగ్‌ను ఎంపిక చేసింది ఎంఐఎం పార్టీ. ఈ మేరకు మంగళవారం ఆ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బేగ్ పేరును ఖరారు చేశారు పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ. ప్రస్తుత ఎమ్మెల్సీ అమీన్ ఉల్ హసన్ జాఫ్రీకి.. ఎంఐఎం మరో అవకాశం ఇవ్వలేదు. అయితే జాఫ్రీ ఇంతకాలం అందించిన సేవలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ.. భవిష్యత్తులోనూ ఆయన అనుభవాన్ని ఉపయోగించుకుంటామని ఓ ట్వీట్ చేశారు ఒవైసీ. ఇదిలా ఉంటే.. 2018లో రాజేంద్రనగర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు రహమత్ బేగ్. Happy to announce that Mirza Rahmath Baig @_MirzaRahmath will be @aimim_national’s MLC candidate. I’d also like to thank outgoing MLC Syed Amin Ul Hasan Jafri sb for his valuable services to AIMIM. Inshallah, we’ll continue to benefit from his experience & wisdom in future too — Asaduddin Owaisi (@asadowaisi) February 21, 2023 -
హైదరాబాద్ ‘స్థానిక’ ఎమ్మెల్సీ అభ్యర్థిగా జాఫ్రీ
హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ సీటుకు జరుగుతున్న ఎన్నికలో బీఆర్ఎస్ మద్దతుతో బరిలోకి దిగేందుకు ఎంఐఎం సన్నాహాలు చేసుకుంటోంది. ఆ పార్టీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్సీ సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ మరోమారు పోటీ చేస్తున్నారు. ఈ నెల 23న జాఫ్రీ నామినేషన్ పత్రాలు సమర్పించనున్నారు. వచ్చే నెల 13న పోలింగ్ జరగనుంది. బీఆర్ఎస్ మద్దతుతో ఎంఐఎం తరఫున బరిలోకి దిగుతున్నారు. పాత్రికేయుడిగా పనిచేసిన జాఫ్రీ తొలిసారిగా 2010లో స్థానిక సంస్థల కోటాలో హైదరాబాద్ నుంచి ఎంఐఎం తరఫున శాసనమండలిలో అడుగు పెట్టారు. ఆ తర్వాత రెండుసార్లు..2011, 2017లో మండలికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఏడాది మే 1న ఎమ్మెల్సీగా ఆరేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకుంటున్న ఆయన వరుసగా నాలుగోసారి ఇదే కోటాలో పోటీ చేసేందుకు ఎంఐఎం అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైదరాబాద్ స్థానిక ఓటర్లు 117 హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల కోటాలో మొత్తం 127 మంది ఓటర్లు (పాత ఎంసీహెచ్ పరిధి) ఉండగా, ఇందులో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో 8 మంది సభ్యుల స్థానాలు ఖాళీగా ఉన్నాయి. గుడిమల్కాపూర్ బీజేపీ కార్పొరేటర్ దేవర కరుణాకర్ ఈ ఏడాది జనవరిలో మరణించడంతో ఓటర్ల సంఖ్య 118గా ఎన్నికల సంఘం నిర్ధారించింది. అయితే ఎక్స్అఫీషియో సభ్యుడిగా ఉన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న రెండురోజుల క్రితం అనారోగ్యంతో మరణించడంతో ఓటర్ల సంఖ్య 117కు చేరింది. ఇందులో 83 మంది జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు కాగా దివంగత ఎమ్మెల్యే సాయన్నను మినహాయిస్తే మరో 34 మంది ఎక్స్అఫీషియో సభ్యులు ఉన్నారు. వీరిలో లోక్‌సభ సభ్యులు అసదుద్దీన్ ఒవైసీ (హైదరాబాద్), జి.కిషన్‌రెడ్డి (సికింద్రాబాద్)తో పాటు ఐదుగురు రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, దామోదర్‌రావు, సురేశ్ రెడ్డి, సంతోష్‌కుమార్, బండి పార్థసారధి రెడ్డి, మరో 12 మంది ఎమ్మెల్సీలు, 15 మంది ఎమ్మెల్యేలు (నామినేటెడ్ ఎమ్మెల్యేను కూడా కలుపుకొని) శాసనమండలి హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎన్నికలో ఓటు హక్కును కలిగి ఉన్నారు. 117 మంది ఓటర్లలో బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలకు 94 మంది ఓటర్ల బలం ఉంది. బీజేపీ సంఖ్యా బలం 23 బీజేపీకి ఎక్స్ అఫీషియో సభ్యులు కిషన్‌రెడ్డి (ఎంపీ), రాజాసింగ్ (ఎమ్మెల్యే) ఓట్లు కలుపుకుని హైదరాబాద్ స్థానిక సంస్థల కోటాలో 23 మంది సభ్యుల బలాన్ని కలిగి ఉంది. అయితే ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరడం, జూబ్లీహిల్స్ కార్పొరేటర్ డి.వెంకటేశ్, అడిక్‌మెట్ కార్పొరేటర్ సునీత ప్రకాశ్‌గౌడ్ బీజేపీ నుంచి బీఆర్ఎస్లో చేరడంతో ఆయా పార్టీల వాస్తవ బలాబలాల్లో కొంత మార్పు ఉండే అవకాశముంది. ఇదిలా ఉంటే బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలకు భారీగా ఓటర్లు ఉండటంతో హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తుందా లేదా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. బీజేపీ దూరంగా ఉంటే జాఫ్రీ వరుసగా మూడోసారి ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యే అవకాశముంది. -
అక్బర్ పోటీ చేస్తామన్న 50 స్థానాల్లో కరీంనగర్.. అసెంబ్లీ జంగ్లో పతంగ్!
సాక్షి, కరీంనగర్: ‘షహర్ హమారా.. మేయర్ హమారా’ అంటూ హైదరాబాద్ పాతబస్తీలో మొదలైన ముస్లిం ఇత్తేహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) ప్రస్థానం క్రమంగా జాతీయ పార్టీగా రూపాంతరం చెందుతోంది. గతవారం అసెంబ్లీలో మజ్లిస్ శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ వచ్చే ఎన్నికల్లో తాము రాష్ట్రవ్యాప్తంగా 50 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించి సంచలనానికి తెరతీశారు. పార్టీ ఆవిర్భావం నుంచి మజ్లిస్ పాతబస్తీ పార్టీగానే అందరికీ తెలుసు. పాత హైదరాబాద్‌లోని గుల్బర్గా (కర్ణాటక), మరాఠ్వాడా (మహారాష్ట్ర) తెలంగాణ లోకల్ బాడీస్కే పరిమితమైంది. 2014లో మహారాష్ట్ర అసెంబ్లీలో అడుగుపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ తరువాత ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, పశ్చిమబెంగాల్, గుజరాత్ రాష్ట్రాల్లో పోటీ చేసింది. అయితే, సొంతరాష్ట్రంలో మాత్రం పార్టీని విస్తరించలేకపోతున్నారు అన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో రానున్న 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పాతబస్తీ దాటికి బయటికి రావాలని మజ్లిస్ సంచలన ప్రకటన చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కరీంనగర్లో 60 వేల ఓట్లు..! ప్రస్తుతం కరీంనగర్ ఓటర్ల సంఖ్య 3.30 లక్షల పైమాటే. అందులో 59,270 వరకు ముస్లిం ఓట్లు ఉన్నాయి. మజ్లిస్ ప్రకటన ఆకస్మికంగా చేసింది కాదు. దీని వెనక పెద్ద కసరత్తే జరిగినట్లు సమాచారం. ఉమ్మడి జిల్లా కేంద్రాలతోపాటు తమకు బ లం ఉన్న 50 స్థానాల్లో పోటీ చేయాలన్న ప్రతిపాదనను తెరపైకి తీసుకొచి్చంది. అందులో భాగంగానే ఎంపిక చేసిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉన్నాయని సమాచారం. ఇందుకోసం కరీంనగరంలోని ఓటర్ల సమాచారం మొత్తం సేకరించారు. దారుస్సలాం ఆదేశాల మేరకు.. ప్రత్యేక యాప్‌లో మొత్తం ఓటర్ల సమాచారం నిక్షిప్తం చేశారు. మొత్తం దాదాపు 390 పోలింగ్ బూత్‌ల వారీగా.. హిందూ, ముస్లింలు.. బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మహిళలు, పురుషులుగా విభజించారు. కరీంనగర్లో 30 వేలకుపైగా ఉన్న ఎస్సీలు తమతో కలిసి వస్తారన్న ధీమాతో మజ్లిస్ ఉంది. కొత్త ఓట్ల నమోదుకే డివిజన్ల పర్యటన.. కరీంనగర్లో 60 వేలకుపైగా ఓటర్ల బలం ఉన్న నేపథ్యంలో పోటీ చేసే పరిస్థితి వచ్చినా.. మద్దతిచ్చే నిర్ణయం తీసుకున్నా.. దేనికైనా సిద్ధంగా ఉండాలని దారుస్సలాం నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎంఐఎం నగర అధ్యక్షుడు గులాం అహ్మద్ హుస్సేన్ సిద్ధంగా ఉన్నారని సమాచారం. అందుకే.. ఇప్పటి నుంచే పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు వారం రోజులుగా డివిజన్ల పర్యటనకు ఎంఐఎం శ్రీకారం చుట్టింది. తమ ఓటర్లు ఉన్న 35 డివిజన్లలో కొత్త ఓటర్లను నమోదు చేయించాలన్నది దీని వెనక అసలు ఉద్దేశం. ఇప్పుడున్న ఓటర్లకు కనీసం నాలుగైదు వేలు యువ ఓటర్లు ఉంటారని స్థానిక నాయకులు అంచనా వేస్తున్నారు. ఎంఐఎం వెంట ఎస్సీలు నడుస్తారా? మొత్తం కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్‌ను మజ్లిస్ కులం, మతం అనే అంశాల ఆధారంగా డేటా వర్గీకరించింది. 81.5% హిందూ జనాభా, 18.5% ముస్లిం జనాభా అని రెండు రకాలుగా విభజించింది. అందులో హిందువుల్లో 81.5% మందిలో మరో 14.5% వరకు అంటే దాదాపు 30 వేల నుంచి 40 వేల వరకు ఎస్సీలు కూడా ఉన్నారని.. మొత్తం తమకు 80 వేలమంది మద్దతు దొరుకుతుందని ఎంఐఎం ధీమాగా ఉంది. అదే సమయంలో నగరంలో ఉన్న ముస్లింలలో ఎందరు ఎంఐఎం వెంట నిలుస్తారు? రూ.10 లక్షల ఆర్థిక సాయంతో దళితబంధులాంటి భారీ సంక్షేమ పథకాలు అమలువుతున్న నేపథ్యంలో ఎస్సీలు మజ్లిస్‌కు మద్దతిస్తారా? అన్న సవాళ్లు మజ్లిస్‌ను వేధిసూ్తనే ఉన్నాయి. అందుకే.. అసలు మజ్లిస్ కరీంనగర్లో పోటీ చేస్తుందా? లేక మిత్రపక్షం బీఆర్ఎస్తోనే కలిసి నడుస్తుందా? అన్న ప్రశ్నకు మరికొన్ని రోజుల్లోనే సమాధానం దొరకనుంది. -
అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన ప్రకటన
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 50 స్థానాల్లో పోటీ చేసి కనీసం 15 మంది ఎమ్మెల్యేలతో సభకు వస్తామని ఎంఐఎంపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. శనివారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా అక్బరుద్దీన్ మాట్లాడుతూ ప్రస్తుతం శాసనసభలో తాము ఏడుగురు ఎమ్మెల్యేలే ఉన్నామనే ప్రస్తావన, ఇతరులు ఎత్తిచూపడం కొంత బాధ కలిగిస్తోందన్నారు. ఏడుగురు సభ్యులున్న పార్టీకి సభలో గంట సమయం ఎందుకు కేటాయించాలంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. అందువల్ల ఈ విషయమై ఎంఐఎం అధ్యక్షుడితో చర్చిస్తామని, కనీసం 50 సీట్లలో పోటీచేసి 15 స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు గెలుపొందే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. అయితే తాము రాజకీయంగా బీఆర్ఎస్తోనే ముందుకు సాగుతామని ప్రకటించారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రసంగంలో తనను ఉద్దేశించి ప్రతిపక్ష నేత అని సంబోధించడంపై సభాపతి స్పష్టత ఇవ్వాలని ఆయన కోరారు. ప్రతిపక్ష నేత అనేది లేదని ఆ తర్వాత స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి వివరణ ఇచ్చారు. 12% రిజర్వేషన్ల హామీ అమలు చేయాలి.. గతంలో హామీ ఇచ్చిన విధంగా ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పన దిశగా చర్యలు చేపట్టాలని అక్బరుద్దీన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న కొత్త రిక్రూట్మెంట్లో 4 శాతం రిజర్వేషన్లు పాటించడం లేదని, రోస్టర్ ప్రకారం 3 శాతమే వర్తింపజేస్తున్నట్లు వస్తున్న వార్తలపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాతబస్తీలో రోడ్ల విస్తరణ, మెట్రో రైలు, ఫ్లైఓవర్ల నిర్మాణం వంటి అంశాలపై మంత్రులతో చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. ఉద్యోగులకు డీఏ 6.8 శాతం చెల్లింపుతోపాటు కొత్త పీఆర్సీని ఏర్పాటు చేసి 3 నెలల్లో నివేదిక ఇచ్చేలా చూడాలన్నారు. రాష్ట్రంలో ద్రవ్యోల్బణం నియంత్రణకు వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. అక్బరుద్దీన్ సూచనలపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ ప్రతిపక్ష నేత అని ప్రస్తావించానే తప్ప తనకు అంత కచ్చితంగా తెలియదన్నారు. పాతబస్తీలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చకు సోమవారం (6న) అసెంబ్లీ ఆవరణలోనే సమావేశం ఏర్పాటుచేస్తామన్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఉద్యోగులకు ఒక డీఏను ఇటీవల ప్రకటించిందని, పీఆర్సీ ఏర్పాటు విషయం ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళతామన్నారు. ద్రవ్యోల్బణం కట్టడికి దిద్దుబాటు చర్యలు చేపడతామని కేటీఆర్ హామీ ఇచ్చారు. చదవండి: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు: అసెంబ్లీలో కేటీఆర్ ఫైర్ -
పాతబస్తీలో దారుణం.. లలిత్ బాగ్ కార్పొరేటర్ అల్లుడి హత్య
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. లలిత్‌బాగ్ జీహెచ్ఎంసీ కార్పొరేటర్ కార్యాలయంలో హత్య జరిగింది. లలిత్‌బాగ్ ఎంఐఎం కార్పొరేటర్ ఆజం షరీఫ్ అల్లుడు ముర్తుజా అనస్‌పై గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన అనస్‌ను ఉస్మానియా అసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాధితుడు మరణించాడు. కాగా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిని సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. ఆరుగురు కలిసి అనస్‌పై దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. కార్పొరేటర్ కార్యాలయంలో ఉండగానే ఏకకాలంలో దుండగులు దాడికి పాల్పడినట్లు తెలిపారు. ఆరుగురు కలిసి కత్తులతో దాడి చేసినట్లు పేర్కొన్నారు. బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో అనస్ ఇంటర్ చదువుతున్నాడు. స్నేహితుల మధ్య గొడవే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. చదవండి: కరీంనగర్లో వింతవ్యాధి కలకలం..! ఇప్పటికే కొడుకు, కూతురు, భార్య మృతి -
Gujarat: కాంగ్రెస్‌కు కోలుకోలేని దెబ్బ
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం దిశగా బీజేపీ దూసుకుపోతోంది. బీజేపీ ప్రభంజనం ధాటికి.. ప్రభావం చూపెడుతుందనుకున్న ఆప్.. సింగిల్ డిజిట్ స్థానాలకే పరిమితమయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక ఈ ఎన్నికల్లో భారీ దెబ్బ పడింది కాంగ్రెస్ పార్టీకే. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో.. గుజరాత్లో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఏకంగా 60 దాకా సిట్టింగ్ స్థానాలకు కోల్పోయింది ఆ పార్టీ. కాంగ్రెస్ ఓట్లను ఆప్, ఎంఐఎం పార్టీలు భారీగా చీల్చాయి. మరోవైపు ఆదివాసి ఓట్లు కూడా కోల్పోవడం కాంగ్రెస్‌కు మరో మైనస్‌గా మారాయి. 2017 ఎన్నికల్లో యూపీఏ కూటమికి 80 సీట్లు దక్కాయి. ఇందులో కాంగ్రెస్ 77 సీట్లు సాధించింది. అంతకు ముందు ఎన్నికలతో పోలిస్తే 2017 ఎన్నికల్లో కాంగ్రెస్ ఏకంగా పదహారు సీట్లు అధికంగా గెల్చుకోవడం గమనార్హం. తాజా ట్రెండ్స్ చూస్తుంటే పాతిక సీట్లు లోపే కాంగ్రెస్ పరిమితం అయ్యేలా కనిపిస్తోంది. -
గుజరాత్ అల్లర్లపై అమిత్ షా కామెంట్స్.. ఒవైసీ షాకింగ్ కౌంటర్
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల వేళ పొలిటికల్ వాతావరణం వేడెక్కింది. నేతల మధ్య మాటల వార్ నడుస్తోంది. ఈ క్రమంలో ప్రచారంలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా.. 2002 గుజరాత్లో అల్లర్లు సృష్టించిన వారికి తగిన బుద్ధి చెప్పామంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విధ్వంసం సృష్టించిన వారికి తగిన బుద్ధి చెప్పి 22 ఏళ్లుగా రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉంచామని అన్నారు. కాగా, అమిత్ షా వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఈ క్రమంలో బీజేపీపై కౌంటర్ అటాక్ చేశారు. కాగా, ఒవైసీ మాట్లాడుతూ.. అమిత్ షా మీరు చెప్పిన ఎన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. గుజరాత్ అల్లర్లు సృష్టించిన వారికి బుద్ధి చెప్పాం అని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులోకి తెచ్చామనీ చెప్పుకుంటున్నారు. కానీ, బిల్కిస్‌ను దారుణంగా అత్యాచారం చేసిన దోషులను విడుదల చేయాలన్న పాఠం నేర్పారు. ఆ బాధితురాలి మూడేళ్ల కూతురుని హత్య చేసిన నేరస్థులను బయట స్వేచ్ఛగా తిరిగేలా చేయాలనీ మాకు నేర్పించారు. నేరస్థులకు శిక్ష పడినప్పుడే సమాజంలో అసలైన శాంతి నెలకొంటుంది అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో అధికార బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారం ఎప్పుడూ ఒక్కరి చేతిలోనే ఉండదు. ఏదో ఒకరోజు అధికారం మారుతుంది. అధికారంలో ఉన్నారనే భావనతోనే అమిత్ షా ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు అని తీవ్ర విమర్శలు చేశారు. ఇదిలా ఉండగా.. తొలిసారిగా గుజరాత్ ఎన్నికల బరిలోకి ఎంఐఎం పార్టీ దిగుతోంది. తమ పార్టీ 14 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని గుజరాత్ రాష్ట్ర అధ్యక్షుడు సబీర్ కబ్లీవాలా స్పష్టం చేశారు. .@AmitShah aapne kaunsa sabaq sikhaya? - Barrister @asadowaisi pic.twitter.com/aAuEIhukTm — AIMIM (@aimim_national) November 26, 2022 -
Gujarat Assembly Election 2022: కాంగ్రెస్‌కు ‘మైనారిటీ’ బెంగ!
అహ్మదాబాద్: గుజరాత్లో కీలకమైన మైనారిటీల ఓట్లను ఒడిసిపట్టేందుకు బీజేపీ మినహా పార్టీలన్నీ ఈసారి సర్వ శక్తియుక్తులూ కేంద్రీకరిస్తున్నాయి. ముఖ్యంగా ఏళ్ల తరబడి వాళ్ల ఓట్లను గంపగుత్తగా పొందుతూ వచ్చిన కాంగ్రెస్‌కు ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ, మజ్లిస్ రూపంలో సెగ తగులుతోంది. కొత్తగా రాష్ట్ర బరిలో దిగిన ఆ రెండు పార్టీల నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటోంది. మరోవైపు ఈ రెండు పార్టీల రాకతో ఓటర్లకు కూడా చాయిస్ పెరిగిపోయడం ఆసక్తికరంగా మారింది...! 6.5 కోట్ల గుజరాత్ జనాభాలో ముస్లింలు దాదాపు 11 శాతం దాకా ఉంటారు. కనీసం 25 అసెంబ్లీ స్థానాల్లో వీరి ప్రాబల్యముంది. జమ్లాపూర్–ఖడియా అసెంబ్లీ స్థానంలో ముస్లిం ఓటర్లు ఏకంగా 65 శాతమున్నారు. మిగతా చోట్ల అంతగా కాకున్నా వీరి ఓట్లు పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి! రాష్ట్ర ముస్లింలు పాలక బీజేపీకి ఎప్పుడూ పెద్దగా ఓటేసింది లేదు. అందుకు తగ్గట్టే గత రెండు దశాబ్దాల పై చిలుకు కాలంలో ముస్లింలకు బీజేపీ ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదు! 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆరుగురు ముస్లింలకు టికెట్లివ్వగా కేవలం ముగ్గురే నెగ్గారు. 2012లో ఏడుగురికి టికెట్లిస్తే ఇద్దరే గెలిచారు! ఈసారి తన ముస్లిం ఓటు బ్యాంకుకు ఆప్, మజ్లిస్ గండి కొట్టేలా కన్పిస్తుండటంతో దీన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ పలు చర్యలు చేపట్టింది. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎమ్మెల్యే మొహమ్మద్ పిర్జాదాను నియమించింది. దేశ వనరులపై ముస్లింలకే మొదటి హక్కుండాలంటూ అప్పట్లో మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర మైనారిటీల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లేందుకు పీసీసీ చీఫ్ జగదీశ్ ఠాకూర్ కొంతకాలంగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇది కేవలం మైనారిటీ ఓట్లను కొల్లగొట్టే ఎత్తుగడేనంటూ ఇతర పార్టీలు ఎంతగా విమర్శించినా లెక్క చేయడం లేదు. కేజ్రీవాల్, అసద్ పర్యటనలు మరోవైపు ముస్లిం ఓటర్లను ఆకట్టుకునేందుకు మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తరచూ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈసారి 30 స్థానాల్లో పోటీ చేస్తామని పార్టీ ఇప్పటికే పేర్కొంది. ఆరు చోట్ల అభ్యర్థులను కూడా ప్రకటించింది. కాంగ్రెస్, మజ్లిస్‌లకు భిన్నంగా ఆప్ మాత్రం మైనారిటీల్లోకి చొచ్చుకుపోయేందుకు నిశ్శబ్దంగా ప్రయత్నాలు సాగిస్తోంది. ఇప్పటికే ముగ్గురు ముస్లింలకు టికెట్లిచ్చింది. ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో కేజ్రీవాల్‌తో పాటు ఆప్ పాలనలోని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తరచూ పర్యటిస్తూ వారి నమ్మకాన్ని చూరగొనేందుకు శ్రమిస్తున్నారు. ఇవన్నీ రాష్ట్ర మైనారిటీలకు మంచి శకునాలేనంటున్నారు మైనారిటీ కో ఆర్డినేషన్ కమిటీ అనే ముస్లిం స్వచ్చంద సంస్థ కన్వీనర్ ముజాహిద్ నఫీస్. ‘‘గత ఎన్నికల దాకా గుజరాత్ ముస్లింలకు కాంగ్రెస్ మినహా పెద్దగా చాయిస్ ఉండేది కాదు. కానీ ఇప్పుడలా లేదు’’ అని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే మజ్లిస్, ఆప్‌లను ముస్లిం ఓటర్లు పెద్దగా పట్టించుకోరని, ఎప్పట్లాగే కాంగ్రెస్‌కే దన్నుగా నిలుస్తారని ఆ పార్టీకి చెందిన దరియాపూర్ ఎమ్మెల్యే గయాజుద్దీన్ షేక్ ధీమా వెలిబుచ్చారు. ‘‘ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ బీజేపీని మించిన హిందూత్వవాదినని పదేపదే రుజువు చేసుకుంటున్నారు. కనుక ముస్లింలు ఆయన్ను నమ్మే పరిస్థితి లేదు. మజ్లిస్‌కు రాష్ట్రంలో పెద్దగా ఆదరణే లేదు’’ అని చెప్పుకొచ్చారు. ఆప్ నేతలు మాత్రం ఢిల్లీ, పంజాబ్ ప్రదర్శనను గుజరాత్లో పునరావృతం చేస్తామని, మైనారిటీలు కూడా తమనే నమ్ముతున్నారని చెబుతున్నారు. -
అసదుద్దీన్ ఓవైసీ ప్రయాణిస్తున్న రైలుపై రాళ్ల దాడి?
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. ఈ క్రమంలో ఆయన ప్రయాణిస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌పై రాళ్ల దాడి జరిగినట్లు ఆల్ ఇండియా మజ్లిజ్ ఈ ఇత్తెహదుల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) పార్టీ అధికార ప్రతినిధి ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలను ఖండించారు పోలీసులు. సోమవారం జరిగిన ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. సోమవారం సాయంత్రం ట్రైను సూరత్‌కు చేరుకునే క్రమంలో రాళ్ల దాడి జరిగినట్లు ఏఐఎంఐఎం జాతీయ ప్రతినిధి వారిస్ పఠాన్ ఆరోపించారు. గుజరాత్‌లోని సూరత్‌లో ప్రచార ర్యాలీ నిర్వహించేందుకు ఆయన వెళ్తున్నారని చెప్పారు. రైలుపై రాళ్లు విసిరినట్లు తన వద్ద కొన్ని ఫోటో ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ‘అసదుద్దీన్ ఓవైసీ సాబ్, సబిర్ కబ్లివాలా సర్, నేను, ఏఐఎంఐఎం టీం అహ్మదాబాద్ నుంచి సూరత్‌కు వందేభారత్ రైలులో ప్రయాణిస్తున్నాం. ఈ క్రమంలో కొందరు దుండగులు రాళ్లు విసిరి అద్దాలు పగలగొట్టారు.’ అని పేర్కొన్నారు వారిస్ పఠాన్. ఏఐఎంఐఎం ఆరోపణలను ఖండించారు పశ్చిమ రైల్వే పోలీసు ఎస్పీ రాజేశ్ పర్మార్. భరుచి జిల్లాలోని అంక్లేశ్వర్ సమీపంలో ట్రాక్ పనులు నడుస్తున్నందున కొన్ని రాళ్లు ట్రైన్‌పై పడ్డాయని తెలిపారు. ఇది రాళ్ల దాడి కాదని స్పష్టం చేశారు. ఆయన కిటికీకి దూరంగానే కూర్చుని ఉన్నారని తెలిపారు. దెబ్బతిన్న విండోను మార్చామని, దర్యాప్తు చేపట్టాని తెలిపారు. అసదుద్దీన్ ఓవైసీ కూర్చున్న సీటు పక్క కిటికి అద్దం ఇదీ చదవండి: సౌత్‌లో తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. ట్రయల్ రన్ సక్సెస్ -
మోదీకి ఎందుకంత భయం.. ఒవైసీ సెటైర్లు
సాక్షి,న్యూఢిల్లీ: చైనా జిన్జియాంగ్ రాష్ట్రంలో ఉయ్ఘర్లపై జరుగుతున్న మనవహక్కుల ఉల్లంఘనలపై చర్చించేందుకు ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కమిషన్ ముందుకు ముసాయిదా తీర్మానం వచ్చింది. అయితే దీనిపై చర్చకు జరిగిన ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంది. పలు ఇతర దేశాలు కూడా ఓటింగ్‌లో పాల్గొనకపోవడంతో ఇది చైనాకు అనుకూలంగా మారింది. తీర్మానం వీగిపోయింది. ఫలితంగా చైనాకు మరోసారి తిరుగులేకుండా పోయింది. ఈ విషయంపై స్పందిస్తూ ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అంటే ఎందుకంత భయం? అని ప్రశ్నించారు. ఆయనతో 18 సార్లు భేటీ అయినా.. ఏది కరెక్ట్, ఏది తప్పో చెప్పే ధైర్యం లేదా అని నిలదీశారు. ఐరాస ఓటింగ్‌లో భారత్ దూరంగా ఉండి చైనాకు ఎందుకు అనుకూలంగా వ్యవహరించిందో ప్రధాని చెప్పాలని ఒవైసీ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. Will the PM Modi saheb explain the reason for India’s decision to help China out in the UNHRC on the Uighur issue by choosing to abstain from an important vote? Is he so scared of offending Xi Jingping, whom he met 18 times, that India can’t speak for what is right? https://t.co/TJNy3Ffn2w — Asaduddin Owaisi (@asadowaisi) October 7, 2022 కాంగ్రెస్ అధికార ప్రతినిధి షామ మహమద్ కూడా ఈ విషయంపై విమర్శలు గుప్పించారు. మన భూమిని చైనా ఆక్రమించిందని చెప్పడానికి గానీ, చైనాలో మానవహక్కుల ఉల్లంఘనలకు ఖండించడానికి గానీ మోదీ సిద్ధంగా లేరు, చైనా అంటే ఆయనకు ఎందుకంత భయం అని ప్రశ్నించారు. ఈమేరకు ఆమె ట్వీట్ చేశారు. India abstains on draft resolution at UNHRC for a debate on human rights violations of Uyghurs in China Far from holding China accountable for stealing our land, PM Modi can't even bring himself to condemn China on human right violations. Why is @narendramodi so scared of China! — Dr. Shama Mohamed (@drshamamohd) October 6, 2022 ఐరాస మానవహక్కుల కమిషన్ తీర్మానంపై జరిగిన ఓటింగ్ ఫలితం చైనాకు అనుకూలంగా వచ్చింది. 19 దేశాలు తీర్మానాన్ని వ్యతిరేకించాయి. భారత్, మలేసియా, ఉక్రెయిన్ సహా 11 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. దీంతో తీర్మానం వీగిపోయింది. చదవండి: వందే భారత్ రైలు ప్రమాదం.. గేదెల యజమానులపై కేసు -
17 జాతీయ సమైక్యతా దినం
-
సెప్టెంబర్ 17.. మూడు పార్టీల మధ్య ట్రయాంగిల్ గేమ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాలను సెప్టెంబర్ 17.. ఒక్క సారిగా మార్చేసింది. వాడీవేడిని రగిల్చింది. ఎత్తుకు పైఎత్తులు వేసేలా శనివారం రాజకీయాలు కొనసాగాయి. మూడు పార్టీల మధ్య గేమ్‌గా మారింది. తెలంగాణ విలీన దినాన్ని ఎనిమిదేళ్లుగా పట్టించుకోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ ఉత్సవాల నిర్వహణకు పోటాపోటీగా రంగంలోకి దిగాయి. పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభు త్వం నిర్వహిస్తుందని, అందులో పాల్గొనాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మై, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేలకు లేఖలు రాశారు. హైదరాబాద్ సంస్థానం నుంచి విముక్తి పొందిన మూడు రాష్ట్రాలను కలిపి విమోచన దినోత్సవం హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్లో నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్‌షా హాజరై కేంద్రబలగాల గౌరవ వందనం స్వీకరిస్తారని అందులో వెల్లడించారు. గౌరవ అతిథులుగా హాజరుకావాలని ముగ్గురు ముఖ్యమంత్రులను కోరారు. మరోౖ వెపు, సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ‘తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం’గా సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని తీర్మానించారు. ప్రారంభ, ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. తెలంగాణ ప్రాశస్త్యాన్ని చాటిచెప్పేలా కార్యక్రమాలను నిర్వహించాలని కేబినెట్ అధికారులను ఆదేశించింది. ఇదిలాఉండగా, మజ్లిస్ పార్టీ సైతం ఉత్సవాలను ఆహ్వానిస్తూనే.. జాతీయ సమైక్యతా దినోత్సవంగా నిర్వహించాలంటూ కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు, సీఎం కేసీఆర్‌కు ఆ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ లేఖ రాశారు. పాతబస్తీలో తిరంగా యాత్రతోపాటు బహిరంగ సభ నిర్వహిస్తామని, కేసీఆర్‌ను కూడా ఆహ్వానిస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించిన అసదుద్దీన్.. తమ సూచనను పరిగణనలోకి తీసుకుని జాతీయ సమైక్యతా దినోత్సవం నిర్వహణకు ముందుకొచ్చినందుకు కేసీఆర్‌కు, తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేయడం కొసమెరుపు. కాగా ఈ ఉత్సవాల గురించి ఎనిమిదేళ్లుగా ఏ మాత్రం పట్టించుకోని బీజేపీ, టీఆర్ఎస్ ఇప్పుడు నిర్వహిస్తామని చెప్పడం అవకాశవాద రాజకీయమంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించడం గమనార్హం. -
మజ్లీస్కోటలో పాగా వేసేది ఎవరు? అక్బరుద్దీన్‌తో పోటీ అంత కఠినమా?
హైదరాబాద్ పాతబస్తీ రాజకీయాలు మారుతాయా? మజ్లీస్కోటను ఎవరైనా ఢీకొట్టగలరా? మజ్లీస్‌కు దూరమైన కాంగ్రెస్ వ్యూహమేంటి? మిత్రపక్షానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్అభ్యర్థులు బరిలో దిగుతారా? కమలదళం చార్మినార్ పై జెండా ఎగురవేస్తుందా? వచ్చే ఎన్నికల నాటికి పాతబస్తీ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి? నాలుగు శతాబ్దాలకు పైగా చరిత్ర ఉన్న ఒరిజినల్ హైదరాబాద్ నగరాన్ని ఇప్పుడు పాతబస్తీ అని పిలుస్తున్నారు. నలు దిక్కులా విస్తరించిన మహా నగరానికి గుండెకాయలాంటి పాతబస్తీలో దశాబ్దాలుగా మజ్లీస్‌పార్టీ పాగా వేసింది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఏడు లేదా 8 స్థానాలు మజ్లిస్ పార్టీ గెలుస్తోంది. వచ్చే ఎన్నికలకు కూడా అసదుద్దీన్ నాయకత్వంలోని ఎంఐఎం రెడీగా ఉంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఇప్పుడు తమ ఎమ్మెల్యేలున్న ఏడు స్థానాలు మావే అంటున్నారు ఎంఐఎం నేతలు. చార్మినార్, యాకుత్‌పుర , చంద్రాయణ గుట్ట, నాంపల్లి, కార్వాన్, బహదూర్ పుర, మలక్ పేట్ నియోజకవర్గాలు ఎంఐఎం పార్టీకి కంచుకోటలు. ఈ సెగ్మెంట్లలో మరో పార్టీ గెలవాలంటే బాగా శ్రమించాల్సిందే. ఈ సారి ఎలాగైనా తమ బలాన్ని చూపాలని బీజేపి, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి . నాంపల్లిలో టీఆర్ఎస్ నుంచి ఎవరంటే! నాంపల్లి నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో కాంగ్రెస్అభ్యర్ది ఫిరోజ్ ఖాన్ మీద ఎంఐఎం అభ్యర్ది జాఫర్ హుస్సేన్ 9 వేల ఓట్ల మెజారిటితో గెలిచారు. ఈ సారి నాంపల్లి నుంచి ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది. వచ్చే ఎన్నికల్లో కూడా ఫిరోజ్ ఖాన్ కాంగ్రెస్ తరపున పోటీ చేసే అవకాశం ఉంది. బీజేపి నుంచి దేవర కరుణాకర్ మళ్ళీ పోటీ చేస్తారని తెలుస్తుంది. టిఆర్ఎస్ నుంచి ఆనంద్ కుమార్ పోటీలో ఉండొచ్చని సమాచారం. చార్మినార్‌లో టీఆర్ఎస్ నుంచి లోధి చార్మినార్నియోజకవర్గంలో గత ఎన్నికల్లో బీజేపి అభ్యర్ది ఉమా మహేంద్రపై ఎంఐఎం అభ్యర్ధి ముంతాజ్ అహ్మద్ ఖాన్ 32 వేల మెజారిటితో గెలుపోందారు. ఎంఐఎం నుంచి ముంతాజ్ అహ్మద్ ఖాన్, టిఆర్ఎస్నుంచి మహ్మద్ సలాహుద్దీన్ లోధి, కాంగ్రేస్ నుంచి టీ పిసీసీ సెక్రటరి షేక్ ముజబ్, బీజేపి నుంచి ఉమా మహేంద్రలు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. చాంద్రాయణ గుట్టలో అది అసాధ్యమా? చాంద్రాయణ గుట్ట సెగ్మెంట్ లో గత ఎన్నికల్లో బీజేపి అభ్యర్ది సయ్యద్ షాహెజాదిపై ఎంఐఎం అభ్యర్ది అక్బరుద్దిన్ ఓవైసీ 80 వేల ఓట్ల మెజారిటితో విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఎంఐఎం నుంచి అక్బరుద్దిన్ ఓవైసీ, బీజేపి నుంచి షాహెజాది, టిఆర్ఏస్ నుంచి సీతారామ్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి బినోబైద్ మిస్త్రీ పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఒకప్పుడు ఎంబీటీకి పట్టున్న చాంద్రాయణగుట్టలో కూడా ఎంఐఎం పాతుకుపోయింది. ఇక్కడ అక్బరుద్దీన్‌ను ఓడించడం అసాధ్యమనే వాదన కూడా ఉంది. హజరి, యూసఫ్లలో ఒకరు పోటీలో పక్కా! కార్వాన్ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో బీజేపి అభ్యర్ది అమర్ సింగ్ పై ఎంఐఎం అభ్యర్ది కౌసర్ 50 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. వచ్చే ఎన్నికల్లో ఎంఐఎం నుంచి కౌసర్, బీజేపి నుంచి అమర్ సింగ్, టీఆర్ఎస్ నుంచి మహ్మద్ అల్ హజరి, అప్సర్ యూసఫ్ జాహిలలో ఓకరు పోటీ చేసే అవకాశం ఉది. (చదవండి: సీమాపాత్ర చేతిలో చిత్రహింసలకు గురైన సునీత.. చదువుకు సాయం అందిస్తానన్న కేటీఆర్) సంతోష్ కుమార్‌కు మరో అవకాశం? మలక్ పేట నియోజకవర్గంలో గత ఎన్నికల్లో బీజేపి అభ్యర్ది ఆలె జితేంద్రపై ఎంఐఎం అభ్యర్ది బలాల 30 వేల మెజారిటితో గెలిచారు. వచ్చే ఎన్నికల్లో ఎంఐఎం నుంచి బలాల, బీజేపి నుంచి ఆలె జితేంద్ర మరోసారి పోటీ పడనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ నుంచి సంగిరెడ్డి , చెక్కిలోకర్ శ్రీనివాస్ టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. టిఆర్ఏస్ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన చావా సంతోష్ కుమార్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంది. యాకుత్ పురలో ఖాద్రితో పోటీకి దిగేది ఎవరో? యాకుత్ పుర నియోజకవర్గంలో గత ఎన్నికల్లో టిఆర్ఎస్అభ్యర్ది సామ సుందర్ రావు పై 47 వేల ఓట్ల మెజారిటితో ఎంఐఎం అభ్యర్ది పాషా ఖాద్రి గెలిచారు. వచ్చే ఎన్నికల్లో ఎంఐఎం నుంచి పాషా ఖాద్రీ, టిఆర్ఎస్ నుంచి సుందర్ రావు , బీజేపి నుంచి రూప్ రాజ్, కాంగ్రెస్ నుంచి రాజేందర్ రాజు, కోట్ల శ్రీనివాస్ టిక్కెట్ కోసం ట్రై చేస్తున్నారు . బహదూర్ పుర భారీ మెజారిటీతో ఎంఐఎం బహదూర్ పుర నియోజకవర్గంలో గత ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్ది అలీ బక్రీ పై ఎంఐఎం అభ్యర్ది మోజం ఖాన్ 80 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లో ఎంఐఎం నుంచి మోజం ఖాన్, టిఆర్ఏస్ నుంచి అలీ బక్రీ , కాంగ్రెస్‌నుంచి కలీం బాబ, బీజేపి నుంచి అనీఫ్ అలీ టిక్కెట్ కోసం ట్రై చేస్తున్నారు. పాతబస్తీలోని 7 అసెంబ్లీ సీట్లపై బీజేపి, కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలకు పెద్దగా ఆశలు లేనప్పటికి అక్కడ గట్టి పోటీ ఇవ్వటం ద్వారా... ఇతర సీట్లపై దృష్టి పెట్టకుండా మజ్లిస్‌ను పాతబస్తికే పరిమితం చేయొచ్చని పార్టీలు భావిస్తున్నాయి. ఇదే సమయంలో పాత బస్తిలో బోణీ కోట్టాలనే పట్టుదలనుకూడా ప్రదర్శిస్తున్నాయి. మజ్లిస్ మాత్రం ఈ 7 సీట్లతో పాటు రాజేంద్రనగర్ , జూబ్లిహిల్స్ సీట్లలో కూడా గెలిచేందుకు స్కెచ్ వేస్తోంది. దీంతో పాతబస్తీ రాజకీయం రసకందాయంలో పడింది. (చదవండి: మునుగోడులో బీజేపీకి బూస్ట్.. ‘ప్రజల తీర్పు చరిత్ర సృష్టిస్తుంది’) -
హైదరాబాద్‌పై బీజేపీ సర్జికల్ స్ట్రైక్.. అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, హైదరాబాద్‌పై బీజేపీ కుట్ర చేసిందని ఎఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ధ్వజమెత్తారు. మత కల్లోలాలు సృష్టించేందుకు హైదరాబాద్‌పై బీజేపీ సర్జికల్ స్ట్రైక్ చేపట్టిందని మండిపడ్డారు. బీజేపీ సర్జికల్ స్ట్రైక్‌ను హైదరాబాదీలు భగ్నం చేశారని అన్నారు. పాతబస్తీలో కొంతమంది ఆందోళన చేశారని, అందులో ఏం తప్పు ఉందని ప్రశ్నించారు. పోలీసులపై ఎవరూ రాళ్లు విసరలేదని స్పష్టం చేశారు. కొందరిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, వాళ్లను విడిపిస్తే తప్పేముందని నిలదీశారు. రాజాసింగ్‌కు ఇప్పటికీ బీజేపీ పెద్దల మద్దతు ఉందన్నారు. కాగా గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పీడీయాక్ట్పై పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మసీదుల్లో ప్రార్థనల అనంతరం ఎలాంటి నిరసన కార్యక్రమాలు నిర్వహించరాదని ముస్లింలకు శుక్రవారం ఎంఐఎం అధినేత అసదుద్దిన్ ఒవైసీ సూచించారు. ప్రశాంతంగా ప్రార్ధనలు చేసుకోవాలని సూచించారు. ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా ఉండాలంటే ప్రార్థనల అనంతరం అందరూ ప్రశాంతంగా తమ ఇళ్లలోకి వెళ్లాలని తెలిపారు. ఓవైసీ, మత పెద్దల పిలుపుతో ప్రశాంతంగా ప్రార్ధనలు ముగిశాయి. చదవండి: తెలంగాణలో నయా నిజాం వచ్చారు.. కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన జేపీ నడ్డా -
రాజాసింగ్ సస్పెన్షన్ కేవలం కంటితుడుపు చర్యే: అసదుద్దీన్ ఒవైసీ
-
బీజేపీ అధిష్టానం ఆదేశాలతోనే హైదరాబాద్‌లో అలజడి: ఎంపీ అసదుద్దీన్
-
ఎంఐఎం తరపున గెలిచిన అరుణ
భోపాల్: ఎంఐఎం పార్టీ తరపున ఓ హిందూ అభ్యర్థి మధ్యప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందడం అక్కడి రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఊహించని రీతిలో ఓ మహిళా అభ్యర్థిని బరిలోకి దింపి గెలుపు అందుకుంది ఆ పార్టీ. స్వయానా మంత్రే దగ్గరుండి అక్కడి ప్రచార బాధ్యతలను చూసుకున్నా.. ఆమె గెలుపును ఆపలేకపోయారు. తన విజయానికి గానూ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీకి కృతజ్ఞతలు తెలియజేస్తూ.. హామీలను నెరవేరుస్తానంటోంది అరుణ ఉపాధ్యాయ. మొట్టమొదటిసారి మధ్యప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది ఎంఐఎం. మొదటి ఫేజ్‌లో నాలుగు చోట్ల సంచలన విజయం సాధించింది. ఆయా చోట్ల బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించారు ఎంఐఎం అభ్యర్థులు. ఇప్పుడు రెండో ఫేజ్లోనూ ఏడు స్థానాల్లో పోటీ చేస్తే.. మూడు స్థానాలు కైవసం చేసుకుంది. అందులో ఖార్గావ్ మున్సిపల్ స్థానం విజయం ప్రత్యేకంగా నిలిచింది. ఈ మున్సిపాలిటీలో వార్డు నెంబర్ 2లో పోటీకి దిగింది గృహిణి అయిన అరుణ శ్యామ్ ఉపాధ్యాయ. ఆమె భర్త శ్యామ్ ఉపాధ్యాయ స్థానికంగా ఉద్యమవేత్త. రాజ్యాంగం, దళిత-వెనుకబడిన వర్గాల వాదనకు ఆకర్షితుడై ఎంఐఎంలో చేరాడు. తొలుత పార్టీ సీటును శ్యామ్‌కే కేటాయించాలనుకుంది. కానీ, అనూహ్యంగా స్థానికంగా మహిళలతో కలివిడిగా ఉండే అరుణకు బరిలోకి దించింది. కీలకమైన మున్సిపాలిటీ కావడంతో మధ్యప్రదేశ్ మంత్రి విశ్వాస్ సారంగ్ తన అనుచరులతో ప్రచారం చేయించినప్పటికీ.. అరుణనే గెలుపు అందుకుంది. #ArunaUpadhyaya Thanked #AIMIM President Barrister @asadowaisi after Winning Corporator Election on AIMIM Ticket from City of #Khargone for the First Time in #MadhyaPradesh, #AIMIM has Registered a Big Victory in Corporator Elections. pic.twitter.com/hRIjsP8eqk — Syed Mubeen (Tez Dhar) (@SyedZiya_Mubeen) July 21, 2022 -
‘తాజ్‌మహల్ కట్టకపోతే లీటర్ పెట్రోల్ రూ.40 కే వచ్చేది’.. మోదీపై ఒవైసీ సెటైర్లు
భోపాల్: ఒకవేళ షాజహాన్ తాజ్‌మహల్‌ను కట్టి ఉండకపోతే ఈ రోజు లీటర్ పెట్రోల్ ధర రూ.40 మాత్రమే ఉండేదని అన్నారు ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. బీజేపీ, ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ ఈ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అధికార కమలం పార్టీ దేశంలోని అన్ని సమస్యలకు మొగలులు, ముస్లింలనే నిందిస్తోందని ఆరోపించారు. 'దేశంలోని యువతకు ఉద్యోగాలు లేవు. ద్రవ్యోల్బణం అంతకంతకూ పెరుగుతోంది. డీజిల్ లీటరు రూ.102కి చేరింది. వీటన్నింటికీ కారణం ఔరంగజేబు. ప్రధాని మోదీ కాదు. దేశంలోని నిరుద్యోగానికి అక్బర్ చక్రవర్తి బాధ్యత వహిస్తాడు. పెట్రోల్ ధర లీటర్ రూ.104-115కి చేరడానికి తాజ్‌మహల్ కట్టిన వ్యక్తే కారణం. ఒకవేళ షాజహాన్ తాజ్‌మహల్ కట్టి ఉండకపోతే లీటర్ పెట్రోల్‌ను ఇవాళ రూ.40కే అమ్మేవారు. ప్రధాని మోదీ. తాజ్‌మహల్, ఎర్రకోట కట్టి షాజహాన్ తప్పిదం చేశారని నేను అంగీకరిస్తాను. దానికి బదులు షాజహాన్ ఆ డబ్బునంతా ఆదా చేసి 2014 ఎన్నికల్లో మీకు ఇవ్వాల్సింది. దేశంలోని ప్రతి సమస్యకు ముస్లింలు, మొగలులే కారణమని ప్రచారం చేస్తున్నారు' అని ఒవైసీ బీజేపీపై విమర్శల దాడికి దిగారు. ఈమేరకు మధ్యప్రదేశ్‌లో ఓ బహిరంగ సభలో మాట్లాడిన వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు. చదవండి👉🏻శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు.. మహారాష్ట్రలో మధ్యంతర ఎన్నికలు? देश में महंगाई, बेरोज़गारी, और बढ़ती पेट्रोल-डीज़ल की कीमतों का ज़िम्मेदार @narendramodi नहीं, मुग़ल हैं😜 - Barrister @asadowaisi https://t.co/KLDrUaOwMz — AIMIM (@aimim_national) July 4, 2022 భారత్‌ను కేవలం మొగలులే పాలించారా? అని ఒవైసీ.. మోదీని సూటిగా ప్రశ్నించారు? అశోకుడు, చంద్రగుప్త మౌర్యుడు పాలించలేదా? అని అడిగారు. బీజేపీకి మొగలులు మాత్రమే కన్పిస్తారని విమర్శించారు. ఆ పార్టీ ఒక కన్నుతో మొగలులను, మరో కన్నుతో పాకిస్థాన్‌ను చూస్తుందని ధ్వజమెత్తారు. మొగలులు, పాకిస్థాన్‌తో భారతీయ ముస్లింలకు ఎలాంటి సంబంధం లేదని ఒవైసీ అన్నారు. మహమ్మద్ అలీ జిన్నా ప్రతిపాదనను తిరస్కరించామని పేర్కొన్నారు. భారత్ తమ మాతృభూమి అని, చనిపోయే వరకు ఇక్కడే జీవిస్తామన్నారు. తమను వెళ్లగొట్టాలని ఎవరెన్ని నినాదాలు చేసినా పట్టించుకోమన్నారు. చదవండి👉🏻వ్యాక్సినేషన్ సక్సెస్‌ను వదిలేసి.. నా ఫొటోపై పడ్డారు -
ఔరంగాబాద్ పేరు మార్పు తప్పుడు నిర్ణయం: ఏఐఎంఐఎం
సాక్షి, ముంబై: ఔరంగాబాద్ పేరు మారుస్తూ మహా రాష్ట ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఏఐఎంఐఎం ఎంపీ ఇంతియాజ్ జలీల్ తప్పుబట్టారు. అందుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామన్నారు. ఔరంగాబాద్కో చరిత్ర ఉందని, దాన్నెవరూ చెరపలేరని అన్నారు. ఎంవీఏ నేతలు... ఛత్రపతి శంభాజీ మహరాజ్ పేరును తమ రాజకీయా ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు. ఇప్పుడు బాల్ కేంద్ర ప్రభుత్వ కోర్టులో ఉందన్న ఇంతియాజ్, నిర్ణయానికి వ్యతిరేకంగా అవసరమైతే తాము వీధుల్లోకొస్తామని స్పష్టం చేశారు. పేరు మార్చడానికి ముందు ఔరంగాబాద్‌ను అభివృద్ధి చేస్తామని ఉద్ధవ్ ఠాక్రే చెప్పారని, కానీ అభివృద్ధి జరిగిందా అని ప్రశ్నించారు. కాగా ప్రభుత్వ నిర్ణయాన్ని ఔరంగాబాద్ శివసేన, మహానవనిర్మాణ్ సేన, బీజే పీ నేతలు స్వాగతించారు. ఎలాంటి జాప్యం చేయకుండా కేంద్రం ఈ ప్రతిపాదనను ఆమో దించాలని ఎమ్మెల్సీ అంబదాస్ అన్నారు. ఔరంగాబాద్ పేరు మార్చడంలో బీజేపీ విఫలమైందని విమర్శించారు. తన తండ్రి బాల్ ఠాక్రే హామీ ఉద్ధవ్ నెరవేర్చారని, ఇక ఆమో దం విషయంలో బీజేపీ ఎంత చిత్తశుద్ధి చూపుతుందో తెలుస్తుందని అన్నారు. సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఈ నిర్ణయాన్ని ఇంకాస్త ముందు తీసుకు ని ఉంటే బాగుండేదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అతుల్ అభిప్రాయపడ్డారు. చదవండి: ఎమ్మెల్యేలను వదులుకున్నారు.. ఎన్సీపీని వదలలేరా? -
Bihar-RJD: బిహార్ రాజకీయాల్లో కీలక పరిణామం! అసదుద్దీన్‌కు షాక్!
పట్నా: మహారాష్ట్ర పరిణామాలతో ఆసక్తికరంగా మారిన దేశ రాజకీయాల్లో మరింత వేడి పెంచే సంఘటన చోటుచేసుకుంది. బిహార్‌లో ఇప్పటివరకు అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీని రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) వెనక్కినెట్టింది. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి షాకిస్తూ ఆ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఆర్జేడీలో చేరారు. ఈమేరకు జాతీయ వార్తా సంస్థ ఏఎన్ఐ పేర్కొంది. ఏఐఎంఐఎం పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు మొహమ్మద్ అంజార్ నైమీ, ముహమ్మద్ ఐజర్ అస్ఫీ, సయ్యద్ రుక్నూద్దీన్, షానవాజ్ తమ పార్టీలో చేరినట్టు ఆర్జేడీ కీలక నేత తేజస్వీ యాదవ్ బుధవారం ప్రకటించారు. కాగా, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఎంఐఎం బిహార్‌లో 5 స్థానాల్లో గెలుపొందిన సంగతి తెలిసిందే. చదవండి👉🏻ఉత్కంఠ రేపుతోన్న మహారాష్ట్ర రాజకీయాలు.. ఏం జరగవచ్చు? అతిపెద్ద పార్టీగా ఆర్జేడీ తాజా చేరికలతో ఆర్జేడీ మరింత బలం పుంజుకుంది. 79 మంది ఎమ్మెల్యేలతో రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. తర్వాతి స్థానంలో 77 మంది ఎమ్మెల్యేలతో బీజేపీ ఉంది. 243 సీట్లున్న బిహార్‌లో జేడీ (యూ), బీజేపీ ప్రభుత్వం కొనసాగుతోంది. గత ఎన్నికల్లో జేడీయూ 45 సీట్లు సాధించగా.. బీజేపీ 74 సాధించింది. వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీకి చెందిన ముగ్గురు కాషాయ పార్టీలో చేరడంతో వారి బలం 77కు పెరిగింది. ఇక కాంగ్రెస్‌కు 19 మంది ఎమ్మెల్యేలు, వామపక్ష పార్టీకి 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 90 చోట్ల పోటీ చేస్తే ఫలితాలు శూన్యం! 2020 బిహార్ ఎన్నికల్లో 5 స్థానాల్లో గెలుపొంది దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారిన ఏఐఎంఐఎం పార్టీ... 2021 ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తేలిపోయింది. 90 చోట్ల పోటీ చేసి ఒక్కచోట కూడా విజయం సాధించలేకపోయింది. ఈనేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు తమ భవిష్యత్ అయోమయంలో పడుతుందనే పార్టీ మారినట్టు ఎమ్మెల్యేలు తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లిం ఓట్లను చీల్చడం ద్వారా దాదాపు 20 చోట్ల ఆర్జేడీ విజయావకాశాలను అసదుద్దీన్ పార్టీ దెబ్బకొట్టడం గమనార్హం!| చదవండి👉🏻మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష.. ఏక్నాథ్ షిండే ప్లాన్ ఇదే! -
అగ్నిపథ్ స్కీమ్‌పై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: అగ్నిపథ్ స్కీమ్‌ను కేంద్ర వెనక్కి తీసుకోవాలని ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. అగ్నిపథ్ వల్ల భారత ఆర్మీ బలహీనపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో తమ పార్టీ తలదూర్చదని ఆయన అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల విషయంపై జరిగిన సమావేశానికి శరద్‌పవార్ తనకు ఫోన్ చేసి ఆహ్వానించారు. అయితే పవార్ ఆహ్వానంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ పాత్ర తక్కువ అంచనా వేయొద్దు అని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. చదవండి: (ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిపై ఉత్కంఠ.. రేసులో బలంగా ఆ ఇద్దరు..?) -
రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌పై కేసు నమోదు
న్యూఢిల్లీ: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని ఢిల్లీ స్పెషల్ సెల్‌లోని ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్ విభాగం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అలాగే ఆలయ పూజారి యతి నర్సింగానంద్‌పేరును కూడా ఎఫ్ఐఆర్లో చేర్చారు. కాగా ఇప్పటికే మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నూపుర్ శర్మపై కూడా ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆమెతోపాటు నవీన్ జిందాల్ జర్నలిస్ట్ సబా నఖ్వీ, షాదాబ్ చౌహాన్, మౌలానా ముఫ్తీ నదీమ్, అబ్దుర్ రెహ్మాన్, గుల్జార్ అన్సారీ, అనిల్ కుమార్‌పై కూడా ఎఫ్ఐఆర్ దాఖలైంది. మొత్తం ఢిల్లీ పోలీసులు రెండు ఎఫ్ఐఆర్లను నమోదు చేశారు. సోషల్ మీడియాలో మత విద్వేశాలను వ్యాప్తి చేసి ప్రజల ప్రశాంత వాతావరణానికి విఘాతం కలిగించారని పోలీసులు ఈ కేసులు నమోదు చేశారు. దేశంలో అశాంతిని సృష్టించే ఉద్ధేశంతో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసిన వారిపై కూడా దర్యాప్తు చేస్తామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. సంబంధిత వార్త: వివాదాస్పద వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత: మరిన్ని చిక్కుల్లో నూపుర్ శర్మ AIMIM chief Asaduddin Owaisi named in FIR registered by the IFSO unit of Delhi Police over alleged inflammatory remarks yesterday. Swami Yati Narasimhananda's name also mentioned in the FIR. pic.twitter.com/8NpEKdQvI8 — ANI (@ANI) June 9, 2022 -
ఎంఐఎంతో జట్టు కట్టం: శివ సేన ఎంపీ సంచలన వ్యాఖ్యలు
ముంబై: మహారాష్ట్రలో అధికార కూటమి ఎంవీఏ(మహా వికాస్ అగాధి)లోకి ఏఐఎంఐఎంకు ప్రవేశం ఉంటుందా? అనే ప్రశ్నకు శివసేన స్పందించింది. ఎట్టిపరిస్థితుల్లో ఎంఐఎంను ఎంవీఏ కూటమిలోకి రానివ్వమని, అలాంటి అవకాశాలు ఇంచు కూడా లేవని స్పష్టత ఇచ్చారు శివ సేన ఎంపీ(రాజ్యసభ) సంజయ్ రౌత్. ఎంఐఎం పొత్తు అంశంపై స్పందించే క్రమంలో రౌత్.. కాస్త కటువుగానే స్పందించారు. ఎంఐఎం పొత్తు పెట్టుకోవడం అంటే.. ఓ రోగాన్ని అంటగట్టుకోవడమే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘ఔరంగజేబు సమాధి ముందు మోకరిల్లి నమస్కరించే పార్టీతో మేం(శివ సేన) ఎలా పొత్తు పెట్టుకోగలం. దాని గురించి ఆలోచనే వద్దు. దాని గురించి ఆలోచించడం కూడా ఒక రోగమంతో సమానమే. శివ సేన.. ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆదర్శాలను అనుసరిస్తుంది’’ అంటూ వ్యాఖ్యలు చేశారు సంజయ్ రౌత్. ఇక ఎంఐఎం పార్టీకి బీజేపీతో రహస్య ఒప్పందం ఉందని, యూపీ ఎన్నికల్లో అది మరోసారి బయటపడిందని అన్నారాయన. అలాంటి పార్టీకి దూరంగా ఉండడమే మంచిదని భావిస్తున్నట్లు చెప్పారు సంజయ్ రౌత్. ఇక ఎంఐఎం నేత ఇంతియాజ్ జలీల్ ప్రతిపాదనపై ప్రశ్నించగా.. సంజయ్ రౌత్ స్పందించారు. మహారాష్ట్రలో మూడు పార్టీల ప్రభుత్వం(సేన, కాంగ్రెస్, ఎన్సీపీ) ఉంది. నాలుగో పార్టీకి అవకాశమే లేదు. ఆయన(ఇంతియాజ్ జలీల్‌ను ఉద్దేశిస్తూ) ఒక ఎంపీ. అందుకే ఢిల్లీలో కలుసుకున్నాం. అంతేతప్ప.. దానర్థం కూటమిలోకి ఆహ్వానిస్తామని కాదు అని తెలిపారు రౌత్. అంతకు ముందు ఎంఐఎం నేత ఇంతియాజ్ జలీల్ పొత్తుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్సీపీ నేతను కలిసినప్పుడు మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీల్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పాను. అయితే ఇది శివసేనకు ఆమోదయోగ్యం కాదని మాకు తెలుసు. మేము ప్రతిపాదన ఇచ్చాము కాబట్టి ఏమి జరుగుతుందో చూద్దాం అని ఇంతియాజ్ జలీల్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా.. పొత్తుల వ్యవహారంపై ప్రతిపక్ష నేత, మాజీ సీఎం దేవెంద్ర ఫడ్నవీస్ స్పందించారు. పార్టీలన్నీ బీజేపీకి వ్యతిరేకంగా చేతులు కలుపుతున్నాయని.. కానీ, దేశ ప్రజలు ప్రధాని మోదీ వెంటనే ఉన్నారని, రాబోయే రోజుల్లో గెలుపు బీజేపీదే అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. కూటమిపై స్పందిస్తూ.. ఎంత మంది వచ్చినా ఒక్కటేనని, ఎన్నికల్లో ఓడినప్పుడల్లా ఈవీఎం ఆరోపణలు చేసేవాళ్లు.. ఇప్పుడు ఎంఐఎంను ‘బీజేపీ బీ టీం’ అంటున్నారని, అలాంటి ఆరోపణలపై స్పందించాల్సిన అవసరమే లేదని ఫడ్నవీస్ పేర్కొన్నారు. -
వచ్చే ఎన్నికల్లో ఎక్కువచోట్ల పోటీ
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుతం తమకున్న స్థానాల కంటే ఎక్కువ చోట్ల పోటీచేసే అవకాశముందని మజ్లిస్ (ఏఐఎంఐఎం) పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికల వస్తాయా అన్నదానిపై తనకు సమాచారం లేదని చెప్పారు. శనివారం అసెంబ్లీ వద్దకు వచ్చిన అసదుద్దీన్ అక్కడ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో పోటీకి ఎంఐఎం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. యూపీ, ఇతర రాష్ట్రాల్లో విజయాల నేపథ్యంలో తెలంగాణలో బీజేపీ దూకుడు పెంచే ఆలోచనలో ఉందని మీడియా ప్రస్తావించగా.. ఇక్కడ చురుకైన ముఖ్యమంత్రి ఉన్నారని అసద్ పేర్కొన్నారు. జాతీయ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ ఎలాంటి పాత్ర పోషిస్తారో తమకు తెలియదని, ఫ్రంట్‌లో తాము ఎలాంటి పాత్ర పోషిస్తామో ఇప్పుడే చెప్పలేమని అన్నారు. ఒంటరిగా తెలంగాణ సాధించిన కేసీఆర్‌ను తక్కువగా అంచనా వేయలేమని, ఆయన మొండి మనిషి అని ప్రశంసించారు. కాంగ్రెస్ ప్రత్యామ్నాయం కాలేదు ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఏడాది మొత్తం కష్టపడిన వారికే ఫలితం ఉంటుందని నిరూపణ అయిందని అసదుద్దీన్ పేర్కొన్నారు. తాము ఇప్పుడు ఓడించడమే దశలో ఉన్నామని, వచ్చే ఎన్నికల్లో గెలుపు తీరానికి చేరుకుంటామని చెప్పారు. గుజరాత్, రాజస్థాన్ ఎన్నికల్లోనూ పోటీ చేస్తామని చెప్పారు. జాతీయస్థాయిలో బీజేపీకి కాంగ్రెస్ ప్రత్యామ్నాయం కాలేకపోతోందని.. కాంగ్రెస్ వైఫల్యంతో ఏర్పడిన రాజకీయ శూన్యతను ప్రాంతీయ పార్టీలు అనుకూలంగా మార్చుకుంటున్నాయని తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్ఎస్, వైఎస్సార్సీపీ, బీజేడీ పార్టీలు కీలకమన్నారు. బీజేపీ గులాం నబీ ఆజాద్‌ను రాష్ట్రపతి అభ్యర్థిగా నిలిపినా.. ఆ పార్టీని శత్రువుగానే చూస్తామన్నారు. -
‘జెడ్’ భద్రత వద్దన్న ఒవైసీ
సాక్షి, న్యూఢిల్లీ: యూపీ కాల్పుల నేపథ్యంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కి జెడ్ కేటగిరీ భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయించగా ఆయన దాన్ని తిరస్కరించారు. తనపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని శుక్రవారం లోక్‌సభలో కేంద్రాన్ని డిమాండ్ చేశారు. దేశంలో పెరిగిపోతున్న రాడికలిజానికి ముగింపు పలకాలన్నారు. తనపై జరిగిన బుల్లెట్ దాడికి యూపీ ఓట్లరు బ్యాలెట్‌తో బదులిస్తారన్న నమ్మకం తనకుందన్నారు. ‘‘నాకు జెడ్ కేటగిరీ రక్షణ వద్దు. మీ అందరితో సమానంగా ఎ కేటగిరీ పౌరునిగా బతికే అవకాశం కల్పిస్తే చాలు. రెండుసార్లు ఎమ్మెల్యే, నాలుగుసార్లు ఎంపీ అయిన నాపై కేవలం ఆరడుగుల దూరం నుంచి నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. నేను పుట్టింది ఈ భూమ్మీదే. చచ్చినా ఔరంగాబాద్ గడ్డ మీదే పూడుస్తారు. కాల్పులకు భయపడను. బుల్లెట్ తాకినా ఇబ్బంది లేదు గానీ ఆంక్షలతో కూడిన జీవితం గడపడం నాకు నచ్చదు. స్వతంత్రుడిగా బతకాలనుకుంటున్నా. నేను బతకాలంటే నా మాట బయటకు రావాల్సిందే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాల్సిందే. దేశంలోని మైనార్టీలు, పేదలు, బలహీన వర్గాలకు భద్రత లభిస్తే నాకు లభించినట్లే’’ అన్నారు. దేశ ప్రధాని భద్రతలో వైఫల్యం తలెత్తినప్పుడు ఇతర విపక్షాల కంటే ముందు తానే దాన్ని తప్పుపట్టానని గుర్తు చేశారు.‘‘నాపై దాడి చేసిన వారికి బుల్లెట్‌పైనే తప్ప ప్రజాస్వామ్యంపై, రాజ్యాంగంపై నమ్మకం లేదు. ఫేస్బుక్లో ఎవరైనా ఒక క్రికెట్ జట్టును అభినందిస్తే చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టాన్ని (యూఏపీఏ) ప్రయోగిస్తున్నారు. నాపై దాడి చేసిన వారిపై ఎందుకు ప్రయోగించరు? తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వారిపై ఎందుకు ప్రయోగించరు’’ అని కేంద్రాన్ని ప్రశ్నించారు. కాల్పులపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని ఈసీని ఇప్పటికే అసద్ కోరారు. గురువారం ఉత్తర యూపీలో ఎన్నికల కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్తుండగా ఒవైసీ కారుపై కాల్పులు జరగడం తెలిసిందే. ‘‘ఈ నేపథ్యంలోనే ఒవైసీకి ఉన్న ముప్పు స్థాయిని పునఃసమీక్షించి, జెడ్ కేటగిరీ భద్రత ఇవ్వాలని నిర్ణయించాం. సీఆర్పీఎఫ్ అధికారులు ఒవైసీ నివాసానికి వెళ్లి ఈ నిర్ణయాన్ని ఆయనకు తెలియజేస్తారు’’ అని కేంద్ర హోం శాఖ వర్గాలు శుక్రవారం తెలిపాయి. ఇద్దరి అరెస్టు ఒవైసీపై కాల్పులకు సంబంధించి ఇద్దరిని యూపీ పోలీసులు అరెస్టు చేశారు. ఒకరిని గౌతంబుద్ధ నగర్‌కు చెందిన సచిన్‌గా, మరొకరిని సహరన్‌పూర్‌కు చెందిన శుభంగా గుర్తించినట్టు ఒక ప్రకటనలో తెలిపారు. ఒవైసీ, ఆయన పార్టీ నేతల రెచ్చగొట్టే వ్యాఖ్యలపై కోపంతోనే దాడికి పాల్పడ్డట్టు విచారణలో వారు చెప్పారన్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా వీరిని పట్టుకున్నాం. ఒక మారుతి ఆల్టో కారు, రెండు పిస్టళ్లు స్వాధీనం చేసుకున్నాం. పలు పోలీసు బృందాలు కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి’’ అని వివరించారు. కాల్పులపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోమవారం లోక్‌సభలో ప్రకటన చేస్తారని మరో మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. అసద్‌పై కాల్పులను తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ‘‘ఇది పిరికిపందల మతిలేని చర్య. అసద్ భాయ్! మీరు క్షేమంగా ఉన్నందుకు సంతోషం’’ అని ట్వీట్ చేశారు. జెడ్ కేటగిరీ అంటే... ► ప్రధానికి రక్షణ కల్పించే ఎస్పీజీని పక్కన పెడితే జెడ్ ప్లస్ తర్వాత మన దేశంలో రెండో అత్యున్నత స్థాయి భద్రత జెడ్ కేటగిరీ ► అధిక ముప్పున్న నాయకులు, ప్రముఖులకు కేంద్రం ఈ భద్రత కల్పిస్తుంది ► సీఆర్పీఎఫ్ కమాండోలు 24 గంటల పాటూ రక్షణగా ఉంటారు ► 16 నుంచి 22 మంది షిఫ్టుల్లో పని చేస్తారు ► రోడ్డు ప్రయాణాల్లో ఒక ఎస్కార్ట్, మరో పైలట్ వాహనం సమకూరుస్తారు ► ఈ భద్రతకు నెలకు రూ.16 లక్షలకు పైగా ఖర్చవుతుంది చదవండి: ఒవైసీపై దాడి.. కేంద్రం కీలక నిర్ణయం చదవండి: (అసదుద్దీన్ ఒవైసీ కాన్వాయ్‌పై కాల్పులు) -
యూపీలో అధికారంలోకి వస్తే.. ఇద్దరు సీఎంలు!
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ పొత్తులు, సీట్ల కేటాయింపులపై అన్ని పార్టీలు కసరత్తులు చేస్తున్నాయి. తాజాగా ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బాబూ సింగ్ కుష్వాహా, భారత్ ముక్తి మోర్చా పార్టీలతో పొత్తు పెట్టుకుంటున్నామని శనివారం ప్రకటించారు. తమ భాగస్వామ్య కూటమి అధికారంలోకి వస్తే.. ఇద్దరిని ముఖ్యమంత్రులుగా ఎంపిక చేస్తామని తెలిపారు. ఒకరు ఓబీసీ సామాజికవర్గం నుంచి మరోకరిని దళిత సామాజికవర్గం నుంచి ఎంపిక చేస్తామని వెల్లడించారు. ముస్లిం కమ్యూనిటీతో పాటు ముగ్గురిని డిప్యూటీ సీఎంలను ఎంపిక చేస్తామని అసదుద్దీన్ పేర్కొన్నారు. గతంలో ఓం ప్రకాష్ రాజ్‌భర్‌కు చెందిన సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీతో పొత్తు పెట్టుకున్నట్లు ఒవైసీ ప్రకటించారు. రాజ్‌భర్ ఆ కూటమిని విడిచిపెట్టి.. సమాజ్‌వాదీ పార్టీలో కలిశారు. రాజ్‌భర్ పార్టీ తమ కూటమి నుంచి విడిపోయిందని, అయినప్పటికీ 100 సీట్లలో తమ కొత్త కూటమి పోటీ చేస్తుందని వెల్లడించారు. అన్ని స్థానాల్లో గట్టిపోటీ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అసదుద్దీన్ ఒవైసీ ఇటీవల మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్‌లో ఏ రాజకీయపార్టీ ముస్లింల అభివృద్ధికి కృషి చేయలేదని విమర్శించారు. ముస్లింకు ఉత్తరప్రదేశ్‌లో అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రభుత్వం ముస్లింల అభ్యున్నతికి పాటుపడటంలేదని తెలిపారు. రాజకీయ పార్టీలు చేస్తున్న మోసాన్ని ప్రజలకు వివరిస్తామని, మార్పు తప్పకుండా వస్తుందని పేర్కొన్నారు. అన్ని విషయాలు ప్రజలకు వివరిస్తామని, తమకు ఎవరు మంచి చేస్తారో వారినే ఎన్నుకుంటారని ఎంపీ అసదుద్దీన్ అన్నారు. -
ఎంఐఎం ఎమ్మెల్యే జులుం.. సలాం చేయలేదని చెంపదెబ్బకొట్టాడు
సాక్షి, దూద్‌బౌలి(హైదరాబాద్): తనకు సలాం చేయలేదంటూ చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ తన చెంపపై కొట్టారని ఓ వ్యక్తి హుస్సేనీఆలం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వివరాల ప్రకారం...పంచ్ మొహల్లా ప్రాంతానికి చెందిన గులాం గౌస్ జిలానీ (45) శనివారం రాత్రి తన ఇంటి వద్ద ఉండగా... తన ఇంట్లోకి వెళుతున్న ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ తనను చూసి సలాం చేయలేదంటూ తన చెంపపై కొట్టాడని హుస్సేనీఆలం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు అతన్ని శనివారం రాత్రి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం ఆదివారం సోషల్ మీడియాలో వైరల్ అయింది.బాధితుడి ఫిర్యాదు మేరకు హుస్సేనీఆలం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: నన్ను అడ్డుకుంటే పొడుచుకుంటా.. -
ఆ రెండు పార్టీలు ఒకే నాణేనికి రెండు దిక్కులు
సాక్షి, ముంబై(మహరాష్ట్ర): బీజేపీ, ఏఐఎంఐఎం పార్టీలు ఒకే నాణేనికి ఉన్న రెండు దిక్కుల వంటివని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆరోపించింది. శనివారం తిరంగా యాత్ర బహిరంగ సభ సందర్భంగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేత నసీమ్ ఖాన్ ఆదివారం ఘాటుగా సమాధానమిచ్చారు. రాష్ట్రంలో 2014 నుంచి 2019 వరకు బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ముస్లిం కోటా గురించి ఎంఐఎం ఎందుకు నోరు విప్పలేదని ఆయన ప్రశ్నించారు. విద్య, ఉద్యోగాల్లో ముస్లింలకు రిజర్వేషన్ కోటా గురించి బాంబే హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ అప్పటి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం వాటిని అమలు చేయలేదన్నారు. అప్పుడు తాము కోటా గురించి పోరాడుతుంటే ఎంఐఎం చడీ చప్పుడు లేకుండా ఉందన్నారు. తమ పార్టీ నాయకులు శాసన సభలో తమ గళాన్ని వినిపించినప్పుడు ఎంఐఎంకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఎందుకు కలిసి రాలేదని ప్రశ్నించారు. అప్పుడు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఫడ్నవీస్ ప్రభుత్వానికి సహకరించారని మండిపడ్డారు. ఎంఐఎం పార్టీ ఎప్పుడు బీజేపీకి మద్దతుగా ఉండేందుకే పనిచేస్తుందని ఆరోపించిన నసీమ్ ఖాన్.. అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం నేతలకు ఎన్నికల సమయంలో మాత్రమే ముస్లిం రిజర్వేషన్ల అంశం గుర్తుకు వస్తుందని ధ్వజమెత్తారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరికి వచ్చినందునే వారికి ఈ అంశం గుర్తుకు వచ్చిందన్నారు. ముస్లింలకు కోటా కల్పించేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఎంఐఎం నిజ స్వరూపమేంటో ముస్లింలు అందరికీ తెలుసని పేర్కొన్న నసీమ్ ఖాన్.. ముస్లింల కోసం ఒవైసీ, ఎంఐఎం పార్టీ ఏం చేశాయో చెప్పాలని డిమాండ్ చేశారు. చదవండి: మిస్ యూనివర్స్‌గా భారత యువతి -
యూపీ బరిలో ఒవైసీ అలజడి
లక్నో: వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల అసెంబ్లీ కదనరంగంలోకి తొలిసారిగా దిగుతున్న అసదుద్దీన్ ఒవైసీకి చెందిన ఏఐఎంఐఎం పలు పారీ్టలకు సవాల్ విసురుతోంది. రాష్ట్రంలో ముస్లిం నాయకత్వం లేదని, దాని ఏర్పాటు చేయడమే తన లక్ష్యమంటూ ఎన్నికల బరిలో దిగిన హైదరాబాద్ ఎంపీ ఒవైసీ ఎంత మేరకు ప్రభావం చూపిస్తారన్న చర్చ మొదలైంది. మజ్లిస్ పోటీ ఇన్నాళ్లూ మైనార్టీ ఓటు బ్యాంకుని నమ్ముకున్న పార్టీల్లో ఆందోళన రేపుతోంది. రాష్ట్ర జనాభాలో 19 శాతం మంది ముస్లింలు ఉన్నప్పటికీ సరైన నాయకులు లేని కొరత వారిని వెంటాడుతూనే ఉంది. యాదవులు, రాజ్బహర్లు, నిషాద్‌లు, జాటవులు వంటి తక్కువ జనాభా ఉన్న కులాలకు కూడా ఎంతో కొంత పేరు పొందిన నేతలు ఉన్నారు. ముస్లింలో ఆ నాయకత్వ లేమి సమస్యనే ఒవైసీ ఎన్నికల అస్త్రంగా చేసుకున్నారు. సమాజ్‌వాది (ఎస్పీ), బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ), కాంగ్రెస్ పార్టీల ఓటు బ్యాంకు రాజకీయాల్లో నలిగిపోతున్న ముస్లింలను సంఘటితం చేసి నాయకుల్ని తయారు చేస్తానన్న ఒవైసీ మాటలు ఆ పారీ్టల గుండెల్లో తూటాలై పేలుతున్నాయి. 403 లోక్‌సభ స్థానాలున్న యూపీలో 82 స్థానాల్లో ముస్లింలు గెలుపోటముల్ని నిర్దేశించే స్థాయిలో ఉన్నారు. గత ఏడాది జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికలో ముస్లింల ప్రాబల్యం అధికంగా ఉన్న సీమాంచల్ ప్రాంతంలో అయిదు సీట్లు దక్కించుకొని ఆర్జేడీ, కాంగ్రెస్ ఓట్లను ఎంఐఎం భారీగా చీలి్చంది. ఆ విజయం ఇచి్చన ధీమాతో యూపీలో 100 సీట్లలో భాగదారి మోర్చా కూటమితో చేతులు కలిపి ఎన్నికల బరిలో దిగుతున్నారు. ముస్లింల అభ్యున్నతి కోసం సమర్థులైన నాయకుల్ని ఎదగనివ్వడమే తమ లక్ష్యమని ఎంఐఎం జాతీయ అధికార ప్రతినిధి సయ్యద్ అసిమ్ వకార్ వెల్లడించారు. ఇన్నాళ్లూ ముస్లిం ఓట్లతో అధికారంలోకి వచి్చన పారీ్టలేవీ ఆ వర్గానికి చెందిన నాయకుల్ని ఎదగనివ్వలేదని, సచార్ కమిటీ నివేదిక కూడా అదే చెబుతోందని ఆయన విమర్శించారు. మరోవైపు ఎస్పీ, బీఎస్పీలు ఒవైసీ అధికార బీజేపీ చెప్పినట్టుగా ఆడుతున్నారని, ఓట్లు చీల్చడానికి యూపీలో పోటీకి వచ్చారని ఆరోపిస్తున్నాయి. ఎస్పీ విజయావకాశాలను గండి కొట్టడానికే బీజేపీ అడుగులకి మడుగులొత్తుతూ ఒవైసీ నడుచుకుంటున్నారని సీనియర్ ఎస్పీ నేత అబూ అజ్మీ ఆరోపించారు. సత్తా చాటగలరా? అయోధ్యలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ఒవైసీ ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎన్నికల సభలు నిర్వహిస్తున్నారు. ఒవైసీ తాను అనుకున్నది సాధిస్తారా లేదా అన్నదానిపై రాజకీయ పరిశీలకుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బిహార్‌లో గెలిచినంత సులభంగా యూపీ రాజకీయాల్లో ఒవైసీ నెగ్గలేరని, కానీ ఓట్లు భారీగా చీల్చి విజయావకాశాలను తారుమారు చేసే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఎస్పీ, బీఎస్పీ వంటి పారీ్టలు ముస్లిం ఓట్లతో నెగ్గినా వారి సమస్యలపై ఎప్పుడూ మౌనం వహిస్తున్నాయని, అందుకే ఒవైసీ ప్రభావం ఉంటుందని మరికొందరు అంటున్నారు. ‘‘ముస్లింలకు నాయకత్వం లేకపోతే వారిపై అరాచకాలు కొనసాగుతాయన్న భావన వారిలో మొదలైంది. ఎన్నికల నాటికి ఇది బలోపేతమై ఒవైసీకి కలిసొస్తుంది’’ అని రాజకీయ విశ్లేషకుడు పర్వేజ్ అహ్మద్ అన్నారు. యూపీలో ప్రతీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ముస్లింలలో నాయకత్వం అంశంపై చర్చ జరుగుతూనే ఉంటుందని... అయినప్పటికీ వారు దానిని పెద్దగా పట్టించుకోకుండా ఎస్పీ, బీఎస్పీకి ఓటు వేస్తూ వచ్చారని ఎన్నికల విశ్లేషకుడు రషీద్ కిద్వాయ్ అన్నారు. ► జనాభాలో ముస్లింల శాతం: 19.26% ► నిర్ణయాత్మక పాత్ర పోషించే స్థానాలు: 82 ► రామ్‌పూర్‌లో ముస్లిం జనాభా: 50.57% ► మొరాదాబాద్: 47.12% n బిజ్నార్: 43.04% n ► n ముజఫర్‌నగర్: 41.3% n అమ్రోహ్: 40.78% ► బలరామ్‌పూర్, అజమ్గఢ్, బరేలి, మీరట్, బహ్రెయిచ్, గోండా, శ్రావస్తిలలో: 30%పైగా -
Usman Sagar: విస్తీర్ణానికి ‘గండి’!
సాక్షి, హైదరాబాద్: శతాబ్ద కాలంగా మహానగర దాహార్తిని తీరుస్తున్న గండిపేట (ఉస్మాన్‌సాగర్) విస్తీర్ణం తగ్గిందా? అంటే.. అవుననే అంటున్నారు పర్యావరణవేత్తలు. ఈ జలాశయ విస్తీర్ణంపై హెచ్ఎండీఏ జారీ చేసిన ప్రాథమిక నోటిఫికేషన్ మ్యాప్, జలమండలి నుంచి గతంలో సేకరించిన మ్యాప్‌లను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుందని చెబుతున్నారు. వీటి ప్రకారం చూస్తే జలాశయ విస్తీర్ణం (ఎఫ్టీఎల్ పరిధి) సుమారు 300 ఎకరాల మేర తగ్గిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యత్యాసంపై వ్యాజ్యం ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జంట జలాశయాల ఎఫ్టీఎల్ పరిధిపై 2019లో హెచ్ఎండీఏ, ఇరిగేషన్, రెవెన్యూ విభాగాలు సర్వే నిర్వహించి ప్రాథమిక నోటిఫికేషన్ మ్యాప్ విడుదల చేశాయి. గండిపేట జలాశయం విస్తీర్ణం 6,039 ఎకరాలని పేర్కొన్నాయి. అయితే పలువురు పర్యావరణవేత్తలు 2014లో సమాచార హక్కు చట్టం కింద జలమండలి నుంచి గండిపేట ఎఫ్టీఎల్కు సంబంధించిన మ్యాపులను సేకరించారు. ఇందులో జలాశయం విస్తీర్ణం 6,335.35 ఎకరాలుగా ఉంది. ఈ నేపథ్యంలోనే పలువురు పర్యావరణవేత్తలు రెండు మ్యాప్‌ల మధ్య తేడాకు కారణాలు ఏమిటన్న అంశంపై ఉన్నత స్థాయి విచారణ చేపట్టాలని కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. జలాశయం విస్తీర్ణం తగ్గితే నీటినిల్వ సామర్థ్యం తగ్గే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కమిటీ తీరుపై హైకోర్టు ఆగ్రహం గండిపేట, హిమాయత్‌సాగర్ జలాశయాల చుట్టూ 10 కి.మీ పరిధిలో ఉన్న 84 గ్రామాల పరిధిలో బహుళ అంతస్తుల నిర్మాణాలు, చెక్‌డ్యామ్‌లు, లిఫ్ట్ ఇరిగేషన్ పనులు, లేఅవుట్లు చేపట్టకూడదని 1996 మార్చి 8న జారీచేసిన జీవో నంబర్ 111 స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే 111 నంబర్ జీవోకు సంబంధించి 2016లో ఏర్పాటు చేసిన కమిటీ పనితీరుపై హైకోర్టు తాజాగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐదేళ్లుగా నివేదిక సమర్పించక పోవడాన్ని తప్పుబట్టింది. జాతీయ హరిత ట్రిబ్యునల్ సూచనల నేపథ్యంలో.. జంట జలాశయాల పరిరక్షణ చర్యలు, 111 జీవోలో మార్పులు చేర్పులను సూచించాలని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2016లో ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఐఏఎస్ అధికారులు ఎస్పీ సింగ్, దానకిశోర్, ఎస్కే జోషీ ఈ కమిటీలో ఉన్నారు. ఆక్రమణలే శాపం ఆరేళ్ల కిందట పంచాయతీరాజ్ శాఖ చేపట్టిన సర్వేలో జీవో 111లో పేర్కొన్న 84 గ్రామాలకు సంబంధిచిన వేలాది ఎకరాల్లో 418 అక్రమ లే అవుట్లు, 6,682 అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు తేలింది. మరో 5,202 వ్యక్తిగత గృహాలు కూడా కలిపి మొత్తం 11,887 అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు సర్వే తేల్చింది. జంట జలాశయాలకు ఇన్‌ఫ్లో రాకుండా పలు లే అవుట్లు, ఇతర నిర్మాణాల చుట్టూ భారీ గోడలు నిర్మించారు. జలాశయాల ఎఫ్టీఎల్ పరిధిలో పలువురు ప్రముఖులు ఏర్పాటు చేసిన ఫామ్‌హౌస్‌లు కూడా శాపంగా పరిణమించాయి. సమగ్ర విచారణ చేపట్టాలి గతంలో జలమండలి నుంచి మేము సేకరించిన మ్యాపులు.. హెచ్ఎండీఏ జారీచేసిన ప్రాథమిక నోటిఫికేషన్‌ను పరిశీలిస్తే గండిపేట విస్తీర్ణం 300 ఎకరాలు తగ్గినట్లు కనిపిస్తుంది. దీనిపై హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు మూడుసార్లు లేఖ రాశాం. ఈ అంశంపై సమగ్ర విచారణ చేపట్టి గండిపేటతో పాటు హిమాయత్‌సాగర్ జలాశయాన్నిక కూడా పరిరక్షించాలి. – లుబ్నా సర్వత్, పర్యావరణవేత్త -
తల్లిదండ్రుల్ని చంపి అనాథ అన్నట్లుగా ఉంది: సీజేఐ
సాక్షి, న్యూఢిల్లీ: గతేడాది డిసెంబర్లో ఆదిలాబాద్‌లో తుపాకీ కాల్పులు జరిపి ఒకరు మృతి, మరో ఇద్దరు గాయపడటానికి కారణమైన ఎంఐఎం నేత ఫరూఖ్ అహ్మద్ బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాలు సవాల్‌చేస్తూ ఫరూఖ్ దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్ , జస్టిస్ వినీత్ శరణ్‌తో కూడిన ధర్మాసనం విచారించింది. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది వీకే శుక్లా వాదనలు వినిపిస్తూ అనారోగ్యం దృష్ట్యా ఫరూఖ్‌కు బెయిలివ్వాలని అభ్యర్థించారు. ‘‘పిటిషనర్‌పై 302, 307, 324, ఆయుధాల చట్టానికి సంబంధించిన అన్ని సెక్షన్లు ఉన్నాయి. భయభ్రాంతులకు గురిచేస్తూ క్రూరంగా కాల్పులు జరిపారు. బెయిలు కోరడమంటే తల్లిదండ్రులను చంపి అనాథను అన్నట్లుగా ఉంది’’ అని జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. పిటిషనర్ ఆరోగ్యం సరిగాలేదని జైలులో ఆత్మహత్యకు యత్నించారని వీకే శుక్లా తెలిపారు. ‘ఓ వ్యక్తిని చంపారు. మరొకరు అదృష్టవశాత్తూ తప్పించుకున్నారు. అరెస్టు తర్వాత ఆత్మహత్యాయత్నం చేశారు. ఇన్ని ఆధారాలున్నా బెయిలు కోరుతున్నారా’ అని వీకే శుక్లాను జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు. అనంతరం బెయిల్ పిటిషన్ కొట్టివేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. చదవండి: అందుకు భార్య సమ్మతి అవసరం లేదు: హైకోర్టు -
మోహన్ భగవత్ వ్యాఖ్యలపై ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) అధినేత మోహన్ భగవత్ ముస్లింలకు సంబంధించి చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ముస్లిం సమాజంపై ద్వేషం హిందుత్వ నుంచి వచ్చిందని, తీవ్రమైన భావాజాలం ఉన్న కొంతమంది వల్ల వ్యాపిస్తోందని ఒవైసీ తీవ్రంగా ఆరోపించారు. ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా ద్వేషాన్ని ప్రచారం చేస్తున్న కొంతమంది నేరస్తులకు హిందుత్వ ప్రభుత్వం మద్ధతు పలుకుతోందని ట్విటర్లో విమర్శలు గుప్పించారు. ఆదివారం యూపీలోని ఘజియాబాద్‌లో ముస్లిం రాష్ట్రీయ మంచ్(ఆర్ఎస్ఎస్ ముస్లిం విభాగం) ఏర్పాటు చేసిన ‘హిందుస్తానీ ఫస్ట్.. హిందుస్తాన్ ఫస్ట్’ అనే కార్యక్రమంలో మోహన్ భగవత్ మాట్లాడుతూ.. ముస్లింలపై మూకదాడులకు పాల్పడుతున్న వారు హిందుత్వ వ్యతిరేకులని వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన ఒవైసీ.. ముస్లింలపై మూకదాడులకు పాల్పడుతున్న నేరస్తులకు అధికారపార్టీ అండగా ఉంటోందని తీవ్రంగా ఆరోపించారు. భారత గడ్డపై హిందూ-ముస్లిం తేడాలేవీ లేవని, భారతీయులందరి డీఎన్ఏ ఒక్కటేనని ఆర్ఎస్ఎస్ ముస్లిం విభాగం కార్యక్రమంలో మోహన్ భాగవత్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. -
యూపీలో 100 స్థానాల్లో పోటీ చేస్తాం: అసదుద్దీన్
లక్నో: వచ్చే ఏడాది జరగనున్న ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో ఏఐఎంఐఎం కూడా యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతోంది. యూపీ ఎన్నికల్లో దాదాపు 100 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉందని వెల్లడించింది. 2022లో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో వంద స్థానాల్లో పోటీ చేస్తామని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. ఇందుకోసం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పార్టీ ప్రారంభించిందన్నారు. ఓంప్రకాశ్ రాజ్‌భర్ సారథ్యంలోని సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్బీఎస్పీ)తో కలిసి ఎంఐఎం యూపీ ఎన్నికల్లో పోటీ చేయనుందని తెలిపారు. భగీదరి సంకల్ప్ మోర్చా పేరుతో ఇతర పార్టీలని ఏకం చేస్తున్న ఓం ప్రకాశ్ నేతృత్వంలో ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేస్తామన్నారు. అంతేకాక, ఎన్నికలు, పొత్తులపై ఇతర రాజకీయ పార్టీలతో ఇప్పటివరకు చర్చించలేదని అసదుద్దీన్ తెలిపారు. ఈ మేరకు అసదుద్దీన్ ట్వీట్ చేశారు. उ.प्र. चुनाव को लेकर मैं कुछ बातें आपके सामने रख देना चाहता हूँ:- 1) हमने फैसला लिया है कि हम 100 सीटों पर अपना उम्मीदवार खड़ा करेंगे, पार्टी ने उम्मीदवारों को चुनने का प्रक्रिया शुरू कर दी है और हमने उम्मीदवार आवेदन पत्र भी जारी कर दिया है।1/2 — Asaduddin Owaisi (@asadowaisi) June 27, 2021 గతేడాది జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 20స్థానాల్లో పోటీ చేసిన ఎంఐఎం, ఐదు స్థానాల్లో గెలుపొందింది. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న సీమాంచల్ ప్రాంతంలో పట్టు సాధించేందుకు ప్రయత్నించి విజయం సాధించింది. అంతకుముందు 2019లో మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లోనూ రెండు స్థానాల్లో గెలుపొందింది. ఇలా వివిధ రాష్ట్రాల్లో పాగా వేయాలని ప్రయత్నిస్తోన్న ఎంఐఎం.. వచ్చే ఏడాది జరిగే ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికలపైనా కన్నేసింది. అయితే, ఈ మధ్యే జరిగిన పశ్చిమబెంగాల్, తమిళనాడులో మాత్రం ఎంఐఎం ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. చదవండి: ఎంఐఎంతో పొత్తు.. అస్సలు ఉండదు -
గాలిపటం ఆశలు ఆవిరి: అసదుద్దీన్‌కు నిరాశ
సాక్షి, హైదరాబాద్: తపరమైన పార్టీగా ముద్ర పడిన ఆల్ ఇండియా మజ్లిస్-ఈ-ఇతెహదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ తాజా ఎన్నికల్లో ఘోర ఫలితాల పొందింది. 30 శాతం ముస్లిం ఓటర్లు ఉండే పశ్చిమ బెంగాల్లో ఎంఐఎం పార్టీ ప్రధాన దృష్టి సారించింది. అయితే ఎంఐఎం పోటీపై పశ్చిమ బెంగాల్లో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎంఐఎం తీరుపై విరుచుకుపడింది. బీజేపీ ఇచ్చే మూటల కోసం ఎంఐఎం పార్టీ పోటీ చేస్తోందని.. హైదరాబాద్ పార్టీకి బెంగాల్లో ఏం పని పశ్నిస్తూ ఇరుకున పెట్టింది. మత రాజకీయాలకు బెంగాల్లో చోటు లేదని మమతా స్పష్టం చేసింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినా ఎన్నార్సీ, సీఏఏ వంటి వాటిపై మమతా బెనర్జీ మొదటి నుంచి పోరాటం చేస్తోంది. ఈ సందర్భంగా ఆ ఓట్లన్నింటిని మమతా సొంతం చేసుకుంది. దీంతో ఎంఐఎం పార్టీకి ఘోర ఫలితాలు వచ్చాయి. దాదాపు పది లోపు స్థానాలు సొంతం చేసుకుంటామని ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆశలు అడియాశలయ్యాయి. గాలిపటం ఎక్కడా ఎగరలేదు. బీజేపీతో ఎంఐఎం లోపాయికారి ఒప్పందం చేసుకుందనే ప్రచారం బలంగా వీచింది. ఆ వాదన బెంగాల్లో బలపడడంతో ముస్లింలంతా ఎంఐఎం పార్టీకి ఓట్లు వేయలేదు. తమ ఓట్లన్నీ మమతా పార్టీకి వేసినట్లు తెలుస్తోంది. ఈ విధంగా ఎన్నో ఆశలు పెట్టి బెంగాల్లో పోటీ చేసిన ఎంఐఎం పార్టీని బెంగాల్ ప్రజలు తిరస్కరించారు. హైదరాబాద్ పార్టీగా ముద్రపడిన ఎంఐఎంను ఆదరించలేదు. కేవలం 0.02 శాతం ఓట్లు మాత్రమే ఆ పార్టీకి పడ్డాయి. అయితే ఎంఐఎం ఒక్క బెంగాల్ మినహా కేరళ, అసోం, తమిళనాడులో పోటీపై అంతగా ఆసక్తి కనబర్చలేదు. ఆ రాష్ట్రాల్లో పోటీ కూడా చేయలేదు. చదవండి: కాంగ్రెస్‌కు చావుదెబ్బ: హస్త'గతమేనా..?' చదవండి: 3 రాష్ట్రాల్లో బీజేపీకి ఘోర పరాభవం -
గుజరాత్లో బీజేపీ ఘన విజయం
అహ్మదాబాద్: గుజరాత్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఎన్నికలు జరిగిన ఆరు మున్సిపల్ కార్పొరేషన్లలోనూ అధికారం నిలుపుకుంది. అహ్మదాబాద్, రాజ్‌కోట్, సూరత్, జామ్‌నగర్, వడోదర, భావ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్లకు ఆదివారం ఎన్నికలు జరిగాయి.ఆరు కార్పొరేషన్లలో మొత్తం 576 డివిజన్లలో ఎన్నికలు జరిగాయి. వాటిలో 483 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. కాంగ్రెస్ 55 సీట్లు మాత్రమే గెలుపొందింది. తొలి సారి ఈ ఎన్నికల్లో పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రశంసనీయ స్థాయిలో ఫలితాలు సాధించింది. సూరత్‌లో ఆ పార్టీ 27 స్థానాలు గెలుచుకుని, ఆ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. మొత్తం ఆరు కార్పొరేషన్లలో 470 స్థానాల్లో ఆప్ అభ్యర్థులను నిలిపింది. జామ్‌నగర్‌లో బహుజన్ సమాజ్ పార్టీ మూడు సీట్లలో విజయం సాధించింది. అహ్మదాబాద్‌లో 192, రాజ్‌కోట్‌లో 72, జామ్‌నగర్‌లో 64, భావ్‌నగర్‌లో 52, వదోదరలో 76, సూరత్‌లో 120 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. అహ్మదాబాద్‌లో 159, రాజ్‌కోట్‌లో 68, జామ్‌నగర్‌లో 50, భావ్ నగర్లో 44, వడోదరలో 69, సూరత్‌లో 93 సీట్లను బీజేపీ గెలుచుకుంది. అహ్మదాబాద్‌లో 25, రాజ్‌కోట్‌లో 4, జామ్‌నగర్‌లో 11, భావ్‌నగర్‌లో 8, వడోదరలో 7 సీట్లలో కాంగ్రెస్ గెలుపొందింది. ఈ విజయం ప్రత్యేకం ఈ విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇది చాలా ప్రత్యేక విజయమని ట్వీట్ చేశారు. రాష్ట్రంలో రెండు దశాబ్దాలకు పైగా అధికారంలో ఉన్న పార్టీ ఈ స్థాయిలో విజయం సాధించడం గొప్ప విషయమన్నారు. బీజేపీని విశ్వసించినందుకు రాష్ట్రప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. ఇది ప్రజా విజయమని రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ పేర్కొన్నారు. ప్రధాని మోదీ అభివృద్ధి పథకాల ఫలితం ఇదని ట్వీట్ చేశారు. గుజరాత్లో ప్రభుత్వ వ్యతిరేకత ఎందుకు లేదన్న విషయంపై ఇక రాజకీయ విశ్లేషకులు అధ్యయనం ప్రారంభించవచ్చని వ్యాఖ్యానించారు. ఎంఐఎం విజయం: అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఏఐఎంఐఎం బోణీ కొట్టింది. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న జమల్పూర్, మక్తమ్పురా ప్రాంతాల్లోని 7 స్థానాల్లో గెలిచింది. -
అసెంబ్లీ ఎన్నికలు.. రంగంలోకి ఒవైసీ
సాక్షి, న్యూఢిల్లీ : బెంగాల్ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించు కొనేందుకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తన వ్యూహా లకు పదును పెడుతు న్నారు. ఈ నేపథ్యంలో ఒవైసీ మరోసారి బెంగాల్ పర్యటనకు వెళుతున్నారు. ఈ నెల 25 తేదీన కోల్‌కతాకు చేరుకున్న తర్వాత ముస్లింల ప్రాధాన్యత ఎక్కువగా ఉన్న మాటియాబుర్జ్ ప్రాంతంలో ఎన్నికల సమావేశాన్ని నిర్వహించడమే కాకుండా, పాదయాత్ర చేయాలనే యోచనలోనూ ఉన్నారు. అనంతరం అసెంబ్లీ ఎన్నికల్లో ఇతర పార్టీలతో కలిసి పోటీ చేసే అంశంపై ఒవైసీ చర్చలు జరిపే అవకాశాలున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వామపక్ష పార్టీలతో కలిసి పోటీ చేస్తున్నట్లు ప్రకటించాయి. ఒవైసీ బెంగాల్ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమిలో ఎంఐఎం చేరికపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ ఏడాది జనవరి మొదటివారంలో బెంగాల్లో పర్యటించిన ఒవైసీ, హుగ్లీ జిల్లాలోని ఫుర్ఫురా షరీఫ్ దర్గాలో పిర్జాదా అబ్బాస్ సిద్దిఖీతో భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం పిర్జాదా అబ్బాస్ నాయకత్వంలో ఎంఐఎం బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని ఒవైసీ ప్రకటించారు. అయితే అబ్బాస్ సిద్ధిఖీ కొద్దిరోజుల క్రితం సొంతంగా పార్టీని ఏర్పాటుచేసి, ప్రస్తుతం కాంగ్రెస్ కూటమితో కలిసి ఎన్నికల బరిలో దిగేందుకు చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో లెఫ్ట్ ఫ్రంట్ చైర్మన్ బిమాన్ బసు, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరి ఇటీవల జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో అబ్బాస్ సిద్దిఖీ తమ కూటమిలో చేరబోతున్నారని ప్రకటించారు. ముర్షిదాబాద్, మాల్డా, ఉత్తర– దక్షిణ దినజ్‌పూర్, దక్షిణ–ఉత్తర 24 పరగణాలు, హూగ్లీ, కోల్‌కతాలో ముస్లింల ఆధిపత్య స్థానాలపై ఒవైసీ, అబ్బాస్ సిద్ధిఖీ దృష్టి సారించారు. -
గ్రేటర్ మేయర్: వాకౌటా.. గైర్హాజరా?
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి మజ్లిస్ పార్టీ పాత్ర కీలకంగా మారింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏ పార్టీ సంపూర్ణ మెజారిటీ సాధించకపోవడంతో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక సమస్యగా పరిణమించింది. మజ్లిస్‌కు మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలపై పెద్దగా ఆశలు లేకపోవడంతో పాటు అందుకు తగినంత సంఖ్యా బలం లేకుండాపోయింది. అధికార టీఆర్ఎస్తో దోస్తీ ఉన్నప్పటికీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలో దిగింది. ఇరు పక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. ఈ ప్రభావంతో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలో మద్దతు ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు బీజేపీకి మజ్లిస్ మద్దతు ఇచ్చే ప్రసక్తి ఉండదు. అలాగే టీఆర్ఎస్కు ప్రత్యక్షంగా మద్దతు ఇచ్చేందుకూ ఆ పార్టీ సిద్ధంగా లేదు. ఇందుకు వ్యతిరేకంగానూ ఓటు వేసే అవకాశాలు కనిపించడం లేదు. ఈ క్రమంలో మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికల్లో పాల్గొనే అంశంపై మజ్లిస్ తర్జనభర్జన పడుతోంది. సమావేశం నుంచి వాకౌట్ చేయడమా? మొత్తానికే గైర్హాజర్ కావడమా అనే అంశాలపై చర్చించనుంది. మజ్లిస్ సంఖ్యాబలం 54.. బల్దియాలో మజ్లిస్ సంఖ్యా బలం 54. ఇందులో 44 మంది కార్పొరేట్లరతో పాటు 10 మంది ఎక్స్అఫీషియో సభ్యులు ఉన్నారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలకు ఓటు హక్కు ఉన్న మొత్తం సభ్యుల సంఖ్య 193 కాగా.. కోరం సంఖ్య 97. ఎక్స్అఫీషియో సభ్యులతో కలుపుకొంటే టీఆర్ఎస్ సంఖ్యాబలం 88కు మించదు. దీంతో మజ్లిస్ పాత్ర కీలకంగా మారింది. దూరం పాటించడమే.. జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల ప్రక్రియకు దూరం పాటించాలని మజ్లిస్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కార్పొరేటర్ల ప్రమాణ స్వీకరణ అనంతరం మేయర్ ఎన్నికల కోసం జరిగే ప్రత్యేక సమావేశం నుంచి నేరుగా వైదొలగడమా? ప్రత్యేక సమావేశానికి గైర్హాజరు కావడమా? అనే అంశాలపై ఆ పార్టీ తర్జనభర్జన పడుతోంది. పార్టీ కేంద్ర కార్యాలయమైన దారుస్సలాంలో ఈ నెల 11న ఉదయం జరిగే కార్పొరేటర్ల ప్రత్యేక సమావేశంలోనే అధినేత అసదుద్దీన్ ఒవైసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో అవలంబించే వ్యూహంపై స్పష్టతనిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ఫిబ్రవరి 11న జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మేయర్ ఎన్నిక ఫిబ్రవరి 11న జరగనుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం నోటిఫికేషన్‌ను జారీచేసింది. వచ్చేనెల 11వ తేదీన ఉదయం 11 గంటలకు కొత్తగా ఎన్నికైన జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో ప్రిసైడింగ్ అధికారి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అదే రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు నిర్వహించే ప్రత్యేక సమావేశంలో ముందుగా మేయర్ ఎన్నిక జరుగుతుంది. ఆ తర్వాత డిప్యూటీ మేయర్‌ను ఎన్నుకుంటారు. ఏవైనా అనివార్య కారణాల వల్ల 11న ఈ ఎన్నిక నిర్వహించలేని పక్షంలో మరుసటి రోజు 12న (ఒకవేళ సెలవు రోజు అయినప్పటికీ) ఈ ఎన్నిక నిర్వహిస్తారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ పరోక్ష ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌తో పాటు దీనికి సంబంధించిన విధానపరమైన సూచనలను విడుదల చేసినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొత్తగా ఎన్నికైన 150 మంది కార్పొరేటర్లతో పాటు గ్రేటర్లో ఎక్స్అఫీషియో సభ్యులుగా నమోదైన లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా సమావేశానికి సంబంధించిన సమాచారాన్ని 6వ తేదీకల్లా తెలియజేస్తారు. గత ఏడాది డిసెంబరు ఒకటో తేదీన జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 56, బీజేపీ 48, ఎంఐఎం 44, కాంగ్రెస్ 2 స్థానాలు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈసారి మేయర్ స్థానం జనరల్ మహిళకు రిజర్వు అయింది. -
మాజీ సీఎంపై ఒవైసీ ఘాటు విమర్శలు
లక్నో: రానున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ(ఎస్బీఎస్పీ)తో కలిసి పోటీ చేస్తామని ఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. ఎస్బీఎస్పీ అధ్యక్షుడు ఓం ప్రకాశ్ రాజ్భర్తో కలిసి భాగీధరి సంకల్‌్ప మోర్చా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గెలుపే లక్ష్యంగా ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నామని, ప్రతి జిల్లాను సందర్శించి క్షేత్రస్థాయి కార్యకర్తల అభిప్రాయాలు సేకరిస్తామని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ ప్రజలు రాజకీయ ప్రత్యామ్నాయాల కోసం వేచి చూస్తున్నారన్న ఒవైసీ... సమాజ్‌వాదీ వంటి పార్టీలు సోషల్ మీడియా, టీవీకే పరిమితమవుతాయంటూ ఎద్దేవా చేశారు. ఇక బీజేపీ ఏజెంట్‌గా తనపై చౌకబారు ఆరోపణలు చేసే వారికి బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే సమాధానం చెప్పాయన్నారు. అక్కడ తాము సెక్యులర్ డెమొక్రటిక్ ఫ్రంట్‌లో భాగంగా బరిలోకి దిగిన విషయాన్ని గుర్తు చేశారు. ఆజంఘర్, జాన్పూర్ నియోజకవర్గాల్లో ఒవైసీ మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘బీఎస్ఎమ్ అధినేత రాజ్‌భర్‌ను కలిసేందుకు ఇక్కడికి వచ్చాను. ఎంఐఎం, బీఎస్‌ఎంలో అంతర్భాగమే. శాసన సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాం. కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ పూర్తైన తర్వాత సమావేశాలు ఏర్పాటు చేస్తాం. నాకు ఇంతటి సాదర స్వాగతం లభించడం ఆనందంగా ఉంది’’ అంటూ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.(చదవండి: ఒవైసీ కీలక నిర్ణయం.. ఆ పార్టీతో జట్టు!) 12 సార్లు అడ్డుకున్నారు: ఒవైసీ ఎస్పీ అధినేత, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్‌పై విమర్శలు ఎక్కుపెట్టిన ఒవైసీ.. ‘‘అఖిలేశ్ ప్రభుత్వ హయాంలో నన్ను రాష్ట్రానికి రానివ్వకుండా 12 సార్లు అడ్డుకున్నారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనకుండా చేశారు. 28 సార్లు అనుమతి నిరాకరించారు. ఆయన పార్టీకి క్షేత్రస్థాయిలో అసలు కార్యకర్తలే లేరు. కేవలం సామాజిక మాధ్యమాలు, టెలివిజన్లలో మాత్రమే ఆ పార్టీ నేతలు కనిపిస్తారు. మేమెవరికీ ఏజెంట్లం కాదు’’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. కాగా దేశ వ్యాప్తంగా తన ప్రాబల్యాన్ని మరింత పెంచుకొనేందుకు ఎంఐఎం ప్రయత్నాలు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. కేవలం హైదరాబాద్‌లోని పాతబస్తీకే పరిమితం కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ సత్తా చాటేందుకు పతంగి పార్టీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా.. వచ్చే ఏడాది జరుగనున్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు శాసన సభ ఎన్నికలు, 2022లో జరుగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఒవైసీ ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తూ ముఖ్యనేతలతో మంతనాలు జరుపుతున్నారు.(చదవండి: మజ్లిస్ విస్తరణ వ్యూహం) -
జమీర్ ఇంటి వద్ద ఉద్రిక్తత
సాక్షి, ఆదిలాబాద్: కాల్పుల ఘటనలో ప్రాణాలు కోల్పోయిన సయ్యద్ జమీర్ ఇంటివద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిందితుడు ఫారూఖ్ అహ్మద్, అతనికి సహాయపడినవారిని కఠినంగా శిక్షించాలని మృతుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఘటన జరిగి వారం గుడుస్తున్నా నిందితులను పట్టుకోవడంలో పోలీసుల వైఫల్యం కనిపిస్తోందని జమీర్ బామ్మర్ధి సయ్యద్ మీర్జా ఆరోపించారు. కాల్పులకు సంబంధించిన వీడియో ఆధారాలు ఉన్నా కూడా పోలీసులు నిందితులను అరెస్టు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక సమీర్ మృతదేహానికి అంత్యక్రియల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఇదిలాఉండగా.. పోస్టుమార్టం నిమిత్తం జమీర్ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాగా, ఎంఐఎం ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఫారూఖ్ అహ్మద్ ఈ నెల 18న సయ్యద్ జమీర్‌పై కాల్పులు జరపడంతో.. నిమ్స్‌లో చికిత్స పొందుతూ అతను శనివారం తెల్లవారుజామున మృతి చెందారు. కాల్పుల్లో గాయపడిన మోతేషాన్, ఫారుఖ్ కత్తిగాటుకు గురైన సయ్యద్ మన్నన్ ప్రాణాలతో బయటపడ్డారు. పాత కక్షల నేపథ్యంలోనే కాల్పుల ఘటన జరిగినట్టుగా ప్రాథమిక సమాచారం. ఇక ఈ ఘటన అనంతరం ఫారుఖ్‌ను ఎంఐఎం పార్టీ బహిష్కరించిన సంగతి తెలిసిందే. దాంతోపాటు ఆదిలాబాద్ జిల్లా శాఖను కూడా ఆ పార్టీ రద్దు చేసింది. (చదవండి: అయ్యో జమీర్!) -
అయ్యో జమీర్!
సాక్షి, ఆదిలాబాద్: ఎంఐఎం నేత, మున్సిపల్ మాజీ చైర్మన్ ఫారుఖ్ అహ్మద్ ఫారూఖ్ అహ్మద్ జరిపిన కాల్పుల్లో గాయపడ్డ జమీర్ శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు. వారంక్రితం ఆదిలాబాద్ తాటిగూడలో పిల్లల క్రికెట్ విషయమై గొడవ చెలరేగగా.. ఫారుఖ్ తుపాకీ, తల్వార్‌తో వీరంగం సృష్టించాడు. పాత కక్షలతో ప్రత్యర్థి వర్గానికి చెందిన సయ్యద్ మన్నన్‌పై తల్వార్‌తో దాడిచేశాడు. మోతేషాన్‌పై కాల్పులు జరిపాడు. అంతటితో ఆగకుండా అడ్డుగా వచ్చిన సయ్యద్ జమీర్పైనా కాల్పులకు దిగడంతో అతని శరీరంలోకి రెండు బుల్లెట్లు దూసుకెళ్లాయి. దీంతో తీవ్రంగా గాయపడిన వారిని రిమ్స్ దవాఖానకు తరలించారు. అయితే సయ్యద్ జమీర్ పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో అక్కడ నుంచి హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో జమీర్ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఇక కాల్పుల ఘటన అనంతరం ఫారుఖ్‌ను ఎంఐఎం పార్టీ బహిష్కరించిన సంగతి తెలిసిందే. దాంతోపాటు ఆదిలాబాద్ జిల్లా శాఖను కూడా ఆ పార్టీ రద్దు చేసింది. (చదవండి: ఆదిలాబాద్ ఎంఐఎం శాఖ రద్దు) క్రికెట్ పంచాయితీ ప్రాణం తీసింది జిల్లా కేంద్రంలోని తాటిగూడ కాలనీలో నివసించే ఫారూఖ్ అహ్మద్ కుమారుడు, అదే కాలనీలో నివసించే సయ్యద్ మన్నన్ కుమారుడు మోతిషీమ్ శుక్రవారం సాయంత్రం క్రికెట్ ఆడే క్రమంలో గొడవపడ్డారు. ఇటీవలి మున్సిపల్ ఎన్నికల్లో తాటిగూడ వార్డు మహిళకు రిజర్వ్‌కాగా ఫారూఖ్ అహ్మద్ భార్య ఎంఐఎం నుంచి, సయ్యద్ మన్నన్ బంధువు టీఆర్ఎస్ నుంచి బరిలో నిలిచారు. అప్పటి నుంచి వారి మధ్య రాజకీయ విభేదాలు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తమ పిల్లలు క్రికెట్ ఆడుతూ గొడవ పడటంతో ఇరు కుటుంబాల వారు పరస్పరం ఘర్షణకు దిగారు. ఈ సమయంలో ఫారూఖ్ అహ్మద్ రివాల్వర్, తల్వార్‌తో దాడికి దిగాడు. సయ్యద్ మన్నన్‌పై తల్వార్‌తో దాడి చేయడంతో ఆయన తలకు గాయాలయ్యాయి. ఆ తర్వాత చేతిలో ఉన్న రివాల్వర్‌తో కాల్పులు జరపగా సయ్యద్ మన్నన్‌కు మద్దతుగా వచ్చిన ఆయన సోదరుడు సయ్యద్ జమీర్, మోతిషీమ్‌లకు బుల్లెట్ గాయాలయ్యాయి. (చదవండి: చిచ్చురేపిన క్రికెట్.. కాల్పుల కలకలం) -
బాధితుల శరీరాల్లో తూటాల తొలగింపు
పంజగుట్ట (హైదరాబాద్): ఆదిలాబాద్‌లో శుక్రవారం చిన్నపిల్లల ఆట కాస్తా మాటా మాట పెరిగి కాల్పుల వరకు దారితీసిన ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మొతేషీన్ నడుము భాగంలో ఉన్న ఒక తూటా, సయ్యద్ జమీర్ శరీరంలో రెండు తూటాలను శనివారం నిమ్స్ వైద్యులు శస్త్ర చికిత్స చేసి తొలగించారు. ప్రస్తుతం న్యూరోసర్జన్ విభాగం, గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగాల నుంచి వారు వైద్య సేవలను పొందుతున్నారు. ప్రస్తుతం ఇరువురి ఆరోగ్యం నిలకడగా ఉందని నిమ్స్ వైద్యవర్గాలు పేర్కొన్నాయి. ఆదిలాబాద్ ఏఐఎంఐఎం శాఖ రద్దు ఏఐఏంఐఎం ఆదిలాబాద్ శాఖను రద్దు చేస్తున్నట్లు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి అహ్మద్ పాషా ఖాద్రీ ప్రకటించారు. శనివారం హైదరాబాద్ దారుస్సలాంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ..ఆదిలాబాద్ ఘటన దురదృష్టకరమని, త్వరలోనే నూతన కమిటీతో శాఖను ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు. -
ఆదిలాబాద్ ఎంఐఎం శాఖ రద్దు
సాక్షి, హైదరాబాద్ : కాల్పుల ఘటన కలకలం రేపిన నేపథ్యంలో ఎంఐఎం ఆదిలాబాద్ శాఖ రద్దు అయింది. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి అహ్మద్ పాషా ఖాద్రీ ప్రకటించారు. శనివారం హైదరాబాద్ దారుస్సలాంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆదిలాబాద్‌లో జరిగిన సంఘటన దురదృష్టకరమన్నారు. త్వరలో నూతన కమిటీతో శాఖను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. కాగా కాల్పుల ఘటనలో గాయపడినవారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. (చదవండి : తుపాకీతో రెచ్చిపోయిన ఎంఐఎం నేత) -
మజ్లిస్ విస్తరణ వ్యూహం
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ప్రాబల్యాన్ని మరింత పెంచుకొనే దిశగా ఆలిండియా మజ్లిస్ ఇత్తేహదుల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) పావులు కదుపుతోంది. హైదరాబాద్‌లోని పాతబస్తీకే పరిమితం అనుకున్న ఆ పార్టీ క్రమంగా ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తోంది. వచ్చే ఏడాది జరుగనున్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉన్నామని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. 2022లో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ తమ అభ్యర్థులను బరిలోకి దింపేందుకు సన్నద్ధమవుతున్నారు. తమిళనాడులో కమల్ పార్టీతో పొత్తు! పశ్చిమ బెంగాల్లో 294 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. జనాభాలో 30 శాతం మంది ముస్లింలున్నారు. 110 శాసనసభ స్థానాల్లో మైనార్టీలే నిర్ణయాత్మక శక్తి. ఈ నేపథ్యంలో అసదుద్దీన్ ఒవైసీ బెంగాల్ ఎంఐఎం నాయకులతో భేటీ అయ్యారు. బెంగాల్లో ఇప్పటిదాకా 22 జిల్లాల్లో పార్టీ యూనిట్లు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. బిహార్‌లో బీజేపీ బి–టీం ఎంఐఎం అనే విమర్శలు వెల్లువెత్తాయి. తమ రాష్ట్రంలో ముస్లింలను విభజించడానికి రూ.కోట్లు ఖర్చుపెట్టి హైదరాబాద్ నుంచి ఒక పార్టీని తీసుకువచ్చింది అంటూ బీజేపీపై మమతా బెనర్జీ మండిపడ్డారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం సినీ నటుడు కమల్ హాసన్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యం పార్టీతో ఎంఐఎం పొత్తు పెట్టుకోనుందనే వార్తలు కూడా వెలువడుతున్నాయి. దళిత–ముస్లిం ఫార్ములా 2017లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 34 స్థానాల్లో ఎంఐఎం అభ్యర్థులు పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఒక్కరు కూడా నెగ్గలేదు. ఇటీవల బిహార్ ఎన్నికల్లో 5 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకోవడం పార్టీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. సుహల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అధ్యక్షుడు ఓం ప్రకాష్ రాజ్‌భర్ నేతృత్వంలోని కూటమిలో తాము చేరుతున్నట్లు ప్రకటించారు. ప్రగతిశీల సమాజ్‌వాదీ పార్టీ(లోహియా) అధ్యక్షుడు శివపాల్ సైతం ఎంఐఎంతో పొత్తు దిశగా సంకేతాలిస్తున్నారు. బిహార్‌లో 5 సీట్లు గెలిచేందుకు సహకరించిన బీఎస్పీ నేత మాయావతితో యూపీ లోనూ ఒవైసీ జట్టుకట్టే అవకాశాలున్నాయని చర్చ జరుగుతోంది. బిహార్‌లో కలిసొచ్చిన దళిత–ముస్లిం ఫార్ములాను యూపీలోనూ వాడుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. -
తమిళనాట సరికొత్త రాజకీయ శక్తి
సాక్షి హైదరాబాద్ : తమిళనాట పతంగి ఎగిరేనా? కమల్‌తో కలిసి కమాల్ చేయగలదా? మజ్లిస్ పార్టీ అక్కడ కూడా అడుగు పెట్టగలదా? ఈ ప్రశ్నలంటికీ వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలే సమాధానమిస్తాయి. అప్పటిదాకా వేచి చూడాల్సిందే. బిహార్ అసెంబ్లీ, గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటిన ఎంఐఎం పార్టీ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ పోటీ చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. 2021లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ పోటీ చేసే అవకాశాలున్నట్లు సమాచారం. మక్క ల్ నీది మయ్యం అధ్యక్షుడు, సినీనటుడు కమల్ హాసన్, మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ మధ్య ‘పొత్తు’పొడిచే అవకాశమున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ జట్టుగా, కలిసికట్టుగా వచ్చే ఎన్నికల్లో పో టీ చేయనున్నారని, ప్రాథమికంగా ఓ అంచనాకు కూడా వచ్చారని సమాచారం. ఈ నేపథ్యంలో తమిళనాడుకు చెందిన ఎంఐఎం నేతలతో అసద్ సోమవారం భేటీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పోటీ చేయాల్సిన నియోజకవర్గాలు, ఎన్నికల్లో గెలుపునకు అనుసరించాల్సిన వ్యూహాల గురించి వారితో చర్చించినట్లు తెలుస్తోంది. కాగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తామని కమల్ సోమవారం ప్రకటించారు. అయితేతా ము పోటీ చేసే నియోజకవర్గాలపై త్వరలోనే స్పష్టతనిస్తావన్నారు. జనవరి మా సాంతంలో ఒవైసీ చెన్నైకి వెళ్లి, పొత్తుకు తుది రూపం ఇవ్వనున్నారని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. తమిళనాట 25 సీట్లలో పోటీ చేయాలని, ఈ స్థానాల్లో కమల్‌తో పొత్తు పెట్టుకోవాలని అసద్ నిర్ణయించుకున్నారని సమాచారం. అక్కడ మజ్లిస్ పాగా వేసేనా? ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో పోటీ చేస్తామని అసద్ ప్రకటించిన విషయం తెలిసిందే. బెంగాల్‌కు చెంది న నేతలతో హైదరాబాద్‌లో శనివారం భేటీ అయిన ఒవైసీ ఫలవంతమైన చ ర్చలు జరిగాయంటూ ట్వీట్ చేశారు. ఇక తమిళనాట మైనార్టీ జనాభా ఎక్కువగా ఉన్న జిల్లాల్లోని కనీసం 25 నియోజకవర్గాల్లో బరిలో దిగేందుకు సమాయత్తమవుతున్నట్లు సమాచారం. ముస్లిం పార్టీలను ఏకతాటిపైకి బిహార్ ఎన్నికల్లో గెలిచినట్లుగానే తమిళనాట కూడా విజయం సాధించాలని ఒవైసీ భావిస్తున్నారు. అయితే తమిళనాట ఇప్పటికే అనేక ముస్లిం పార్టీలున్నాయి. వాటన్నింటినీ ఏకతాటిపైకి తేవాలని ఒవైసీ భావిస్తున్నట్లు తెలు స్తోంది. ‘అన్ని ముస్లిం పార్టీలను ఏకతాటిపైకి తెచ్చి ఎన్నికల్లో నిలబడాలని ఒవైసీ భావిస్తున్నారు. కమల్ పార్టీ, ఇతర చిన్న పార్టీలతో ఒవైసీ పొత్తు పెట్టుకుంటారు’ అని మజ్లిస్ వర్గాలు పేర్కొన్నాయి. -
ఒవైసీ కీలక నిర్ణయం.. ఆ పార్టీతో జట్టు!
చెన్నై: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన ఆలిండియా మజ్లిస్-ఎ-ఇత్తేహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ పోటీ చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పశ్చిమ బెంగాల్లో పోటీ చేస్తామని ఎంఐఎం ప్రకటించిన విషయం తెలిసిందే. బెంగాల్ నేతలతో హైదరాబాద్‌లో శనివారం భేటీ అయిన ఆ పార్టీ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఫలవంతమైన చర్చలు జరిగాయంటూ ట్వీట్ చేశారు. ఇక తాజా సమాచారం ప్రకారం.. తమిళనాడులో కూడా పాగా వేసేందుకు ఎంఎంఐం కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక ముస్లిం పార్టీలతో పాటు సినీ నటుడు కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యం పార్టీతో జతకట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం. మైనార్టీ జనాభా ఎక్కువగా ఉన్న వెల్లూర్, రాణీపేట్, తిరపత్తూర్, క్రిష్టగిరి, రామనాథపురం, పుదుకొట్టై, ట్రిచి, ముధురై, తిరునల్వేలి జిల్లాల్లోని కనీసం 25 నియోజకవర్గాల్లో బరిలో దిగేందుకు సమాయత్తమవుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒవైసీ, తమిళనాడు ఆఫీస్ బేరర్లతో సోమవారం భేటీ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పోటీ చేయాల్సిన నియోజకవర్గాలు, ఎన్నికల్లో గెలుపునకై అనుసరించాల్సిన వ్యూహాల గురించి వారితో చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ సమావేశం అనంతరం తిరుచిరాపల్లి, చైన్నైలో జనవరిలో మరోసారి భేటీ అయి భవిష్యత్ ప్రణాళికపై నిర్ణయం తీసుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తామని కమల్ హాసన్ సోమవారం ప్రకటించారు. అయితే తాము ఏయే నియోజకర్గాల్లో పోటీ చేసే అంశంపై త్వరలోనే స్పష్టతనిస్తామని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఒవైసీ, కమల్‌తో చేతులు కలిపేందుకు ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వెలువడటం గమనార్హం.(చదవండి: బెంగాల్లో ఎగరనున్న గాలిపటం!) కాగా 2011 గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని మొత్తం జనాభాలో ముస్లిం జనాభా సుమారు 5. 86 ఉంటుంది. ఇక ఇప్పటికే అక్కడ యూనియన్ ముస్లింలీగ్, ఇండియన్ నేషనల్ లీగ్, మనితనేయ మక్కల్ కట్చి, మనితనేయ జననయాగ కట్చి, ఆల్ ఇండియా ముస్లిం లీగ్, తమిళనాడు తోహీద్ జమాత్ సహా ఇతర రాజకీయ పార్టీలు మైనార్టీల తరఫున గళం వినిపిస్తున్నాయి. వీటిని కలుపుకోవడంతో పాటు మక్కల్ నీది మయ్యంతో కూడా పొత్తు పెట్టుకున్నట్లయితే విజయావకాశాలు ఎలా ఉంటాయన్న అంశంపై ఒవైసీ సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఇక ఎంఐఎం తమిళనాడు అధ్యక్షుడు వకీల్ అహ్మద్ గత నెలలో ఓ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ.. డీఎంకే(ద్రవిడ మున్నేట్ర కళగం) జనరల్ సెక్రటరీ దురైమురుగన్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొన్న విషయం తెలిసిందే. (చదవండి: మోదీపై ప్రశ్నల వర్షం కురిపించిన కమల్) రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీతో జట్టుకట్టే అంశం గురించి ప్రస్తావించామని, అయితే ఆయన నుంచి ఎటువంటి స్పందన రాలేదని చెప్పుకొచ్చారు. అదే విధంగా ఏఐడీఎంకే పొత్తు ఉంటుందా అన్న ప్రశ్నకు బదులుగా బీజేపీకి మద్దతు పలికే పార్టీతో తాము కలిసి నడిచే అవకాశమే లేదని స్పష్టం చేశారు. ఇలాంటి తరుణంలో ఎన్డీయే ప్రభుత్వం, బీజేపీ విధానాలను తీవ్రంగా విమర్శించే కమల్‌హాసన్‌తో ఒవైసీ జట్టుకట్టనున్నారనే వార్తలు ఆసక్తి రేపుతున్నాయి. ఇక సూపర్‌స్టార్ రజనీకాంత్ సైతం జనవరిలో రాజకీయ పార్టీ స్థాపించి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలు ఆసక్తికర మలుపులు తీసుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. -
అసదుద్దీన్ ఒవైసీ కీలక నిర్ణయం!
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా మజ్లిస్-ఎ-ఇత్తేహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తామని ప్రకటించింది. ఈమేరకు ఏఐఎంఐఎం చీఫ్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ బెంగాల్ నేతలతో శనివారం హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. పార్టీ విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలను వారితో చర్చించారు. బెంగాల్ ప్రతినిధులతో ఈరోజు ఫలవంతమైన చర్చలు జరిగాయని అసదుద్దీన్ ట్విటర్లో పేర్కొన్నారు. బెంగాల్లో రాజకీయ పరిస్థితులు, పార్టీ ఉన్నతికి చేపట్టాల్సిన భవిష్యత్ కార్యాచరణపై చర్చించామని తెలిపారు. సమావేశానికి హాజరైన నేతలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇక వచ్చే ఏడు జరగునున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీచేస్తామని ఏఐఎంఐఎం ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎంఐఎం పోటీకి దిగుతుండటంతో ఆయా పార్టీల్లో కలవరం మొదలైంది. తమ ఓటు బ్యాంకులో చీలిక తెచ్చి ఎంఐఎం ఏ విధంగా చేటు చేస్తుందోనని బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఎంఐఎం దెబ్బతో బిహార్‌లో మహాఘట్ బంధన్‌ను అధికారానికి దూరం చేసింది. ఆర్జేడీకి సంప్రదాయ ఓటు బ్యాంకులో యాదవులతో పాటు ముస్లింలు కూడా ఉన్నారు. ఐదు స్థానాల్లో గెలుపొందడమే కాకుండా.. చాలా స్థానాల్లో ఆర్జేడీ ఓట్లను చీల్చింది. ఇదిలాఉండగా.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై బెంగాల్లో రాళ్ల దాడి జరిగిన సంగతి తెలిసిందే. టీఎంసీ వర్గాలే ఈ దాడికి పాల్పాడ్డాయని బీజేపీ తీవ్ర ఆగ్రహంతో ఉంది. దీంతో బెంగాల్ రాజకీయాలు వేడెక్కాయి. తాజాగా ఎంఐఎం కూడా రంగంలోకి దిగడంతో పోరు మరింత రసవత్తరంగా మారింది. జాతీయ స్థాయిలో విస్తరణ ఒకప్పుడు హైదరాబాద్ నగరానికే పరిమితమైన ఎంఐఎం.. జాతీయ స్థాయిలో విస్తరించాలన్న సంకల్పంతో ఒక్కో రాష్ట్రంలో అడుగు మోపుతుతోంది. ఇప్పటికే మహారాష్ట్రలో వేళ్లూనుకుంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మంచి ప్రదర్శన కనబర్చి అదే ఉత్సాహంతో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీకి సై అంది. బెంగాల్ అసెంబ్లీలో కనీసం 20 మంది ఎంఐఎం సభ్యులుండేలా ఓవైసీ కార్యాచరణ సిద్దం చేస్తున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సీమాంచల్ ప్రాంతంతోపాటు.. 24 పరగణాలు, అసన్సోల్ వంటి ప్రాంతాల్లో ఎంఐఎం పార్టీకి బలమైన కేడర్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ముస్లింల జనాభా అధికంగా ఉన్న నియోజకవర్గాలను ఎంఐఎం టార్గెట్ చేస్తోంది. -
జీహెచ్ఎంసీ: గెలుపోటములకు కారణాలెన్నో..
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో ముషీరాబాద్ నియోజవకర్గంలో కారు స్పీడుకు బ్రేక్ పడింది. అడిక్‌మెట్ డివిజన్లో సిట్టింగ్ కార్పొరేటర్ అభ్యర్థిని మార్చకపోవడం, ఇన్చార్జిగా వ్యవహరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇక్కడే తిష్టవేసి అహర్నిషలూ శ్రమించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ముషీరాబాద్ డివిజన్లో సిట్టింగ్ కార్పొరేటర్ అభ్యర్థి ఎడ్ల భాగ్యలక్ష్మిని మార్చకపోవడం, రూ.10వేల వదర సాయం, కార్పొరేటర్ పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకత అధికార పార్టీ ఓటమికి దారి తీసింది. రాంనగర్ డివిజన్లో టీఆర్ఎస్ అధిష్టానం సిట్టింగ్ కార్పొరేటర్ వి.శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన 5వేల ఓటు బ్యాంకున్న పలు బస్తీలు ముషీరాబాద్ డివిజన్లో కలవడం, అసమ్మతి నేతలను బుజ్జగించడంలో ఆలస్యం చేయడంతో బీజేపీ అభ్యర్థి వి.రవిచారికి విజయానికి దోహదం చేశాయి. భోలక్‌పూర్ డివిజన్లో ఎంఐఎం నాయకత్వం కొత్త అభ్యర్థికి టికెట్ ఇవ్వడంతో మరోసారి ఎంఐఎం తన పట్టును నిలుపుకొంది. గాంధీనగర్ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే ముఠా గోపాల్ మరదలు ముఠా పద్మ హ్యాట్రిక్ సాధిస్తారనుకున్నా.. టీఆర్ఎస్పై వ్యతిరేకత, బీజేపీ పాజిటివ్ ఓట్లు కొంపముంచాయి. కవాడిగూడ డివిజన్ టికెట్‌ను టీఆర్ఎస్ సిట్టింగ్ అభ్యర్థి లాస్యనందితకే మళ్లీ ఇచ్చారు. ఆమె తండ్రి ఎమ్మెల్యేగా ఉండటం, డివిజన్లో ఆమె పట్ల ఉన్న వ్యతిరేకత, బీజేపీ గాలి తోడవడం, బీజేపీ అభ్యర్థి ఒక టెంట్ హౌస్ నడుపుకునే సామాన్య నాయకుడి కుమార్తె కావడంతో టీఆర్ఎస్ ఓటమికి కారణంగా కనిపిస్తోంది. చీలిన ఓట్లు.. సంక్షేమ పథకాలు జూబ్లీహిల్స్: ఆరు సిట్టింగ్ స్థానాలకుగాను టీఆర్ఎస్ నాలుగు డివిజన్లను నిలబెట్టుకుంది. బోరబండ, యూసుఫ్‌గూడ, వెంగళరావునగర్, రహమత్‌నగర్‌లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. చీలిన ఓట్లు, ప్రభుత్వ పథకాలు, అధికార పార్టీకి కలిసొచ్చాయని చెబుతున్నారు. షేక్‌పేట, ఎర్రగడ్డ డివిజన్లలో మైనార్టీలు పెద్దసంఖ్యలో ఉండడంతో ఎంఐఎం సులభంగా విజయం సాధించింది. ఎల్బీనగర్లో వరద సాయం, ఎల్ఆర్ఎస్ ప్రభావం ఎల్బీనగర్: ఎల్బీనగర్లో ఇటీవల కురిసిన భారీ వర్షానికి వరదలు ముంచెత్తడంతో చాలా కాలనీలు నీట మునిగి కోలుకోలేని నష్టం వాటిల్లింది. ప్రభుత్వం అందించిన వరద సాయం అసలైన బాధితులకు అందలేదనే కారణంతో టీఆర్ఎస్ అభ్యర్థులకు ఓట్లు వేయలేదు. దీంతో ఆ పార్టీ పోటీ చేసిన స్థానాల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. నీట మునిగిన కాలనీలకు చెందిన వరద బాధితులకు సహాయ అందిచండంలో అధికార పార్టీ కార్పొరేటర్లు తమ బంధువర్గాలకు, సన్నిహితులకు, కార్యకర్తలకు ఇచ్చారని కారణంగా ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. అలాగే నగర శివారు ప్రాంతాల్లో ఖాళీ ప్లాట్లు ఉన్నవారు ఎల్ఆర్ఎస్ను వ్యతిరేకించారు. పట్టు నిలుపుకొన్న ఎంఐఎం నాంపల్లి: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం విజయ ఢంకా మోగించింది. నియోజకవర్గంలోని మొత్తం ఏడు స్థానాల్లో ఆరు స్థానాలను ఆ పార్టీ కైవసం చేసుకుంది. టీఆర్ఎస్కు ఉన్న ఒక్క స్థానాన్ని చేజార్చుకుంది. గుడిమల్కాపూర్ నుంచి బీజేపీ ఖాతా తెరుచుకుంది. బీజేపీ అగ్రనేతల ప్రచారం‘కమల’ వికాసం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్లు చేసిన ప్రచారం బీజేపీ అభ్యర్థుల ‘స్టార్’ మార్చేసింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు ఇతర అగ్రనేతలు చేసిన ప్రచారం గ్రేటర్లో ఆ పార్టీ పుంజుకునేందుకు దోహదపడింది. 150 డివిజన్లలో పోటీ చేసిన ఆ పార్టీ ఎవరి ఊహలకు అందని విధంగా ఏకంగా 48 సీట్లు సొంతం చేసుకొని గ్రేటర్లో అత్యధిక సీట్లు సాధించిన రెండో పెద్ద పార్టీగా అవతరించింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి అభ్యర్థుల ఎంపిక, అనంతరం ప్రచార తీరుతెన్నులు, బావోద్వేగ ప్రసంగాలతో ప్రజల దృష్టిని తమ వైపునకు తిప్పుకొనేలా బీజేపీ నేతల వ్యవహరించిన తీరు కమలం వికాసానికి తోడ్పడింది. గ్రేటర్ ఎన్నికలతో అధికార పార్టీ టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయమని బీజేపీ బలంగా చెప్పగలిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్నికల నోటిఫికేషన్ నుంచి పోలింగ్ వరకు ఉన్న అతి తక్కువ సమయంలో బీజేపీ అభ్యర్థులు పెద్దగా ప్రజలకు పరిచయం లేకున్నా అగ్రనేతల ప్రచారశైలి వారికి ఓట్లు తెచ్చిపెట్టింది. ఎక్కడెక్కడ ఫలితాలు ఎలా.. కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వారాసిగూడ నుంచి సీతాఫల్మండి వరకు చేసిన రోడ్డు షో ఆ ప్రాంతానికి ఆనుకొని ఉన్న మిగతా డివిజన్లలో గెలుపుపై ప్రభావాన్ని చూపింది. అడిక్మేట్, కవాడిగూడ, రాంనగర్ ప్రాంతాల్లో కాషాయ జెండా రెపరెపలాడింది. బీజేపీ కేంద్ర అధ్యక్షుడు జేపీ నడ్డా నాగోల్ నుంచి చైతన్యపురి వరకు రోడ్డు షో మాత్రం అనూహ్య ఫలితాన్ని రాబట్టింది. ఆయా ప్రాంతాల్లో వరదలు వచ్చిన సమయంలో టీఆర్ఎస్ పార్టీ నేతలు వ్యవహరించిన తీరును కూడా ప్రసంగాల్లో ఎండగడుతూ చేసిన ప్రచారం కమలం పార్టీకి ఓట్లు కురిపించింది. ఏకంగా ఎల్బీ నియోజకవర్గంలోని 13 సీట్లను క్లీన్‌స్వీప్ చేసింది. ఆర్కేపురం, సరూర్‌నగర్, బీఎన్ రెడ్డి, హస్తినాపురం, చంపాపేట, మన్సూరాబాద్, నాగోల్, వనస్థలిపురం, హయత్‌నగర్, లింగోజిగూడ, కొత్తపేట, చైతన్యపురిలలో కాషాయ జెండా రెపరెపలాడింది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రచారం నిర్వహించిన జీడిమెట్ల ప్రాంతంలో బీజేపీ అభ్యర్థి చెరకుపల్లి తారాచంద్రరెడ్డి భారీ మెజారిటీతో గెలిచారు. యువ మోర్చా జాతీయ అధ్యక్షుడు తేజస్వినిసూర్య కూడా అన్ని ప్రాంతాల్లో పర్యటించి ప్రచారం చేశారు. ఎన్నికల పరిశీలకుడు బీజేపీ జాతీయ నేత భూపేందర్ యాదవ్ వ్యూహాలను రాష్ట్ర పార్టీ నేతలు బండి సంజయ్, కిషన్ రెడ్డిలు అమలు చేసి ప్రచారంలో ఓటర్లను ఆకర్షించి విజయం వైపు తీసుకెళ్లారు. మోండాలో విలక్షణ తీర్పు కంటోన్మెంట్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు ప్రాంతాలతో కూడుకున్న మోండా మార్కెట్ డివిజన్ పరిధిలో వ్యాపార, వాణిజ్య వర్గాలకు చెందిన ప్రజలకు అధిక సంఖ్యలో ఉన్నారు. డివిజన్ పరిధిలోనే ఉండే మారేడుపల్లిలో అధిక ఆదాయ వర్గాలు, ఉన్నత విద్యావంతుల శాతం ఎక్కువగా ఉంది. బస్తీలు పరిమిత సంఖ్యలోనే ఉండే ఈ ఓటర్లలో రాజకీయ చైతన్యం ఎక్కువగానే ఉండటంతో ప్రతీ ఎన్నికల్లోనూ అప్పటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా విలక్షణ తీర్పునిస్తూ ఉంటారు. ఈ నేపపథ్యంలోనే తాజా ఎన్నికల్లో టీఆర్ఎస్పై వ్యతిరేకతతో బీజేపీకి మద్దతుగా నిలిచారు. కంటోన్మెంట్‌కు చెందిన కీలక నేతలు రామకృష్ణ, మల్లికార్జున్‌లు ఇటీవలే బీజేపీలో చేరడంతో మోండా పరిధిలోని వారి అనుచరగణం పెద్ద సంఖ్యలో బీజేపీ గెలుపు కోసం పనిచేశారు. సిట్టింగ్ కార్పొరేటర్‌గా బరిలోని నిలిచిన టీఆర్ఎస్ అభ్యర్థి గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీల్లో చాలా వరకు నెరవేర్చకపోవడంతో కొంత వ్యతిరేకత నెలకొంది.అంబేడ్కర్‌నగర్, లోహియా నగర్ వంటి బస్తీల్లోనూ ఆంధ్రా సెటిలర్లు బీజేపీకి అనుకూలంగా వేసినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ సిట్టింగ్‌లపై వ్యతిరేకత.. టీఆర్ఎస్ను సిట్టింగ్ అభ్యర్థులే కొంపముంచారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కార్పొరేటర్లపై జనంలో వ్యతిరేకత ఉందనేందుకు ఎన్నికల ఫలితాలే స్పష్టం చేస్తున్నాయి. ఈసారి 72 మంది సిట్టింగ్‌లకు టీఆర్ఎస్ సీట్లు ఇవ్వగా.. ఇందులో 28 మంది మాత్రమే గెలుపొందారు. అంటే దాదాపు 44 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులకు చుక్కెదురైంది. స్వయంకృతాపరాధంతో.. ఉప్పల్: ఉప్పల్ సర్కిల్ పరిధిలో ఉన్న నాలుగు టీఆర్ఎస్ సీట్లలో ఒకదాన్ని మాత్రమే దక్కించుకోగలిగింది. ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డి భార్య భేతి స్వప్న హబ్సిగూడ డివిజన్ నుంచి బరిలో దిగారు. దీంతో ఆయన ఇతర డివిజన్లలో ప్రచారం చేయకపోవడం, వరదతో హబ్సిగూడ, రామంతాపూర్, ఉప్పల్‌లోని కాలనీలు ముంపునకు గురికావడంతో అధికార పార్టీపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. వెరసి ఉప్పల్ సర్కిల్లో టీఆర్ఎస్ కేవలం ఒక్క సీటుకే పరిమితం కావాల్సి వచ్చింది. కాప్రా సర్కిల్లో ఏఎస్‌రావునగర్ స్థానం మినహా అన్ని సీట్లు టీఆర్ఎస్ దక్కించుకుంది. కార్పొరేటర్లు చేసిన అభివృద్ధి, కేసీఆర్ పథకాలు శ్రీరామరక్షగా నిలిచాయి. కొంపముంచిన అతివిశ్వాసం.. ఆరోపణలు మల్కాజిగిరి: సర్కిల్ పరిధిలోని మూడు డివిజన్లలో సిట్టింగ్ కార్పొరేటర్లు బీజేపీ అభ్యర్థుల చేతిలో ఓడిపోయారు. అతివిశ్వాసం, వరద సహాయం అందని బాధితుల అసంతృప్తితో పాటు కార్పొరేటర్లపై ఆరోపణలు, ఉద్యమకారులు, కార్యకర్తలను పట్టించుకోకపోవడంతో ఓటమికి కారణాలుగా భావిస్తున్నారు. ఓల్డ్‌సిటీలో బీజేపీ పాగా ఎంఐఎంకు కంచుకోటగా ఉన్న ఓల్డ్‌సిటీలో బీజేపీ పాగా వేసింది. మూడు డివిజన్లకే పరిమితమైన ఆ పార్టీ 10 డివిజన్లకు విస్తరించింది. ఓల్డ్ సిటీపై సర్జికల్ స్ట్రైక్, రోహింగ్యాల ఏరివేత ప్రధాన అస్త్రాలుగా బీజేపీ ప్రచారం చేసి పాగా వేసింది. 7 టీఆర్ఎస్, ఒక ఎంఐఎం సిట్టింగ్ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. సికింద్రాబాద్‌లో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ సికింద్రాబాద్: సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలోని అయిదు డివిజన్లనూ టీఆర్ఎస్ క్లీన్‌స్వీప్ చేసింది. నగరం అంతా బీజేపీ పవనాలు వీచినా ఇక్కడ మాత్రం అధికార పార్టీ తన స్థానాలను పదిలపర్చుకుంది. సీఎం సహాయనిధి, పెన్షన్లు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు వంటి కార్యక్రమాలు నియోజకవర్గంలో విస్తృతంగా అమలు చేశారు. డిప్యూటీ స్పీకర్‌గా కొనసాగుతున్న ఇక్కడి ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండడం ఒక కారణంగా చెప్పుకోవచ్చు. నియోజకవర్గంలో మైనారిటీ ఓట్లు అధికంగా ఉన్నాయి. వీరందరు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి టీఆర్ఎస్కు బాసటగా నిలుస్తున్నారు. నియోజకవర్గంలోని అయిదు డివిజన్లలో తెలంగాణ జిల్లాలకు చెందినవారు పెద్దసంఖ్యలో ఓటర్లు ఉన్నారు. వీరంతా తెలంగాణ ఉద్యమకాలం నుంచి టీఆర్ఎస్కు అండగా ఉంటున్నారు. ఫలించని మంత్రుల వ్యూహం... దిల్సుఖ్నగర్: మలక్‌పేట్ నియోజకవర్గంలోని 6 డివిజన్లలో నాలుగు స్థానాలను ఎంఐఎం తిరిగి గెలుచుకోగా టీఆర్ఎస్ రెండు స్థానాలను కోల్పోయింది. అజంపుర, ఓల్డ్‌మలక్‌పేట్, చావుణి, అక్బర్‌బాగ్ డివిజన్లలో కొంత వ్యతిరేకత ఉన్నా ఎంఐఎంకు గట్టి ప్రత్యర్థులు లేకపోవడంతో వారి విజయం నల్లేరు మీద నడకలా సాగింది.వరదల సమయంలో సరైన సహాయం అందకపోవడంతో మూసారంబాగ్, సైదాబాద్ డివిజన్లలో టీఆర్ఎస్ ఓడిపోయింది. దానికితో వరదసాయం అందకపోవడంతో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. దీంతో ప్రజలు బీజేపీ అభ్యర్థులకు పట్టం కట్టారు. మహేశ్వరం నియోజకవర్గంలోని సరూర్‌నగర్‌లో ప్రభుత్వ వ్యతిరేకత, వరదసాయం అందరికీ అందకపోవడంతో టీఆర్ఎస్ను ఓడించారు. ఇద్దరు మంత్రుల వ్యూహం ఫలించలేదు. అనూహ్యంగా బీజేపీ 5 డివిజన్లలో గెలిచి సత్తా చాటింది. టీఆర్ఎస్కు ఒక్కసీటూ దక్కలేదు. లోకల్ కేడర్ పట్టించుకోకవడం వల్లే.. హుడా కాంప్లెక్స్: లోకల్ కేడర్‌తో కాకుండా డివిజన్లతో సంబంధం లేని నేతల జోక్యమే అధికార పార్టీ పుట్టి ముంచిదా? అంటే అవుననే అంటున్నారు టీఆర్ఎస్ నాయకులు. ఓటర్లతో ముఖాముఖి పరిచయాలు, క్షేత్రస్థాయి సమస్యలపై అవగాహన, బంధుగణం అధికంగా ఉన్న స్థానిక నేతలను పక్కన పెట్టి.. ఓటర్లతో ఏ మాత్రం పరిచయం లేని ఇతర ప్రాంత నేతలకు ప్రచార బాధ్యతలను అప్పగించింది. ఒక్కో డివిజన్‌కు మంత్రి సహా ఎమ్మెల్యేలను ఇన్‌చార్జీలగా నియమించింది. వీరు క్షేత్రస్థాయిలో పని చేస్తున్న లోకల్ కేడర్‌ను కాకుండా తమ నియోజకవర్గాల పరిధిలోని లీడర్లను రంగంలోకి దింపారు. ప్రచార సరళి, ఓటర్లకు మద్యం, నగదు పంపిణీలో వీరే కీలకంగా వ్యవహరించారు. దీంతో లోకల్ కేడర్ మనస్తాపంతో పోల్ మేనేజ్మెంట్కు దూరంగా ఉంది. సరూర్‌నగర్ సిట్టింగ్ అభ్యర్థిపై ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత లేకపోయినçప్పటికీ ఇతర నేతల ఆధిపత్యాన్ని జీర్ణించుకోలేక వారంతా దూరంగా ఉండిపోయారు. ఇది బీజేపీకి బాగా కలిసి వచ్చింది. వరద సహాయం పంíపిణీలో చోటు చేసుకున్న అవకతవకలు కూడా బీజేపీ బలం పెంచుకునేందుకు పరోక్షంగా కారణమైంది. బీజేపీ సిట్టింగ్ స్థానం ఆర్కేపురంపై ఎలాగైనా పట్టు సాధించాలని అధికార పార్టీ భావించింది. ఆ మేరకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రచారంలో కీలకపాత్ర పోషించారు. అయినా ఇక్కడి ఓటర్లు మాత్రం సిట్టింగ్ అభ్యర్థి రాధాధీరజ్రెడ్డికే మళ్లీ పట్టం కటారు. ‘కార్వాన్’లో సత్తా చాటిన మజ్లిస్.. గోల్కొండ: కార్వాన్ నియోజకవర్గంలో మజ్లిస్ మరోసారి సత్తాను చాటింది. గత ఎన్నికల్లో గెలిచిన అయిదు స్థానాల్లో ఆ పార్టీ మళ్లీ విజయం సాధించింది. ముగ్గురు సిట్టింగ్, ఇద్దరు కొత్తవారిని బరిలో దింపి టోలిచౌకి, నానల్‌నగర్, గోల్కొండ డివిజన్లలో మెజార్టీ మరింత పెంచుకుంది. నియోజకవర్గంలోని ఆరు స్థానాలలో అయిదు మజ్లిస్ గెలుపొందగా, జియాగూడ స్థానంలో కమలం వికసించింది. జియాగూడలో సిట్టింగ్ టీఆర్ఎస్ అభ్యర్థి మిత్ర కృష్ణ బీజేపీ అభ్యర్థి చేతిలో ఓటమిపాలయ్యారు. గట్టి పోటీ అనుకున్న లంగర్‌హౌస్‌లో మజ్లిస్ సిట్టింగ్ అభ్యర్థి మరోసారి గెలుపొందారు. కార్వాన్ నియోజకవర్గం మజ్లిస్‌కు కంచుకోటగా మరోసారి రుజువైంది. కార్వాన్, లంగర్‌హౌస్, నానల్‌నగర్, గోల్కొండ, టోలిచౌకి డివిజన్లలో మజ్లిస్ అభ్యర్థులు గెలుపొందారు. జియాగూడలో కమలం పదేళ్ల తర్వాత మళ్లీ వికసించింది. ఆరు డివిజన్లలో టీడీపీ, కాంగ్రెస్ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. అటు అసమ్మతి.. ఇటు మార్పు అంబర్‌పేట: కాచిగూడ డివిజన్లో గతంలో ఓడిన బీజేపీ అభ్యర్థి ప్రజల మధ్యలో ఉండటం, దీనికి తోటు సిట్టింగ్ కార్పొరేటర్ రెబల్‌గా ఉండటంతో టీఆర్ఎస్ ఓటమి పాలైంది. ఈ డివిజన్ బీజేపీ అభ్యర్థి కన్నె ఉమా రమేష్‌యాదవ్ గెలుపొందారు. నల్లకుంట డివిజన్లో సిట్టింగ్ కార్పొరేటర్ గరిగంటి శ్రీదేవి పదేళ్లు కార్పొరేటర్‌గా వ్యవహరించడంతో ఈ దఫా ప్రజలు మార్పు కోరుకొని బీజేపీ అభ్యర్థి అమృతను గెలిపించారు. రెబల్‌గా నామినేషన్ వేసిన ఉద్యమకారుడు కట్ట సుధాకర్‌ను ఉపసంహరించడంలో.. సీనియర్ నాయకులను సైతం ఎన్నికల ప్రచారంలో భాగస్వామ్యం చేయలేకపోవడం ఓటమికి మరో కారణం. దీనికి తోటు ఈ డివిజన్లో ముంపు సాయం కూడా ప్రభావం చూపింది. గోల్నాక డివిజన్లో టీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ అభ్యర్థిని కాకుండా కొత్తవారైన దూసరి లావణ్యకు అవకాశం ఇచ్చింది. ఇక్కడ మైనార్టీలతో పాటు ఎమ్మెల్యే సొంత డివిజన్ కావడంతో గులాబీ అభ్యర్థి విజయం సాధించగలిగారు. అంబర్‌పేట డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ కార్పొరేటర్ పులి జగన్‌కు కాకుండా కొత్త అభ్యర్థి విజయ్కుమార్గౌడ్కు అధిష్టానం అవకాశం కల్పించింది. ఇన్చార్జిగా వ్యవహరించిన మంత్రి నిరంజన్‌రెడ్డి అసమ్మతి నేతలను అతి కష్టంమీద బుజ్జగించడం, మైనార్టీ ఓటు బ్యాంకింగ్‌తో టీఆర్ఎస్ గెలిచింది. బాగ్ అంబర్‌పేట డివిజన్లో టీఆర్ఎస్ సిట్టింగ్ కార్పొరేటర్ కె.పద్మావతిరెడ్డిపై అసమ్మతి సెగతో పాటు కాలనీల్లో బీజేపీకి ఓటు బ్యాంకు అధికంగా ఉంది. వరద సాయంలో అవకతవకలూ బీజేపీ అభ్యర్థి పద్మావెంకట్రెడ్డికి కలిసివచ్చాయి. టీఆర్ఎస్ ఓటమి పాలైంది. మూడు సిట్టింగ్ స్థానాలు స్వాహా.. అబిడ్స్: గోషామహల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ గత ఎన్నికల్లో సాధించిన మూడు డివిజన్లను బీజేపీ దక్కించుకుంది. జాంబాగ్, గన్‌ఫౌండ్రీ, బేగంబజార్, గోషామహల్, మంగళ్‌హాట్ డివిజన్లలో బీజేపీ విజయం సాధించగా దత్తాత్రేయనగర్ డివిజన్లో మాత్రం మజ్లిస్ విజయం సాధించింది. గత మూడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో దత్తాత్రేయనగర్, జాంబాగ్‌లో మజ్లిస్ గెలుస్తూ వచ్చింది. ఈ ఎన్నికల్లో జాంబాగ్‌ను బీజేపీ గెలుచుకుంది. దీంతో టీఆర్ఎస్ మూడు సీట్లతో పాటు మజ్లిస్ ఒక్క సీటును బీజేపీ కైవసం చేసుకుంది. అలా కలిసొచ్చి.. ఇలా వెనకబడి.. సనత్‌నగర్: సనత్‌నగర్ డివిజన్లో టీఆర్ఎస్ సిట్టింగ్ కార్పొరేటర్ కొలను లక్ష్మీ మరోసారి విజయదుందుభి మోగించడానికి మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ చొరవతో పాటు ఇక్కడ మంచినీటి రిజర్వాయర్, ఇండోర్ స్టేడియం, వైకుంఠధామం వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు పూర్తికావడంతో పాటు అభివృద్ధే కారణంగా చెప్పాలి. అమీర్‌పేటలో ఇక్కడ టీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ కార్పొరేటర్ శేషుకుమారి ఓటమి చవిచూశారు. ఈ డివిజన్ నుంచి కార్పొరేటర్ టికెట్ ఆశించడంతో పాటు శేషుకుమారి అభ్యర్ధిత్వంపై బాహాటంగానే వ్యతిరేకించారు. దీంతో అసంతృప్తిగా ఉన్న పలువురు నేతలు ఆమెకు పనిచేయకుండా ఓటమికి కారణమయ్యారనే వార్తలు వస్తున్నాయి. బీజేపీ నుంచి తొలిసారి పోటీ చేసిన కేతినేని సరళకు ఉత్తర భారతీయుల ఓటింగ్ కలిసొచ్చింది. బన్సీలాల్‌పేటలో టీఆర్ఎస్ సిట్టింగ్ కార్పొరేటర్ హేమలత విజయానికి ఇక్కడ నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్ల కారణంగా చెప్పవచ్చు. బీజేపీ అభ్యర్థి స్పందన గట్టి పోటీ ఇచ్చినా ఆర్థిక, అంగబలం అంతగా లేకపోవడంతో ఓటమి పాలైనట్లు తెలుస్తోంది. రాంగోపాల్‌పేట డివిజన్ టీఆర్ఎస్ సిట్టింగ్ కార్పొరేటర్ అరుణగౌడ్ ఓటమికి స్థానికంగా కొంత బయటపడని వ్యతిరేకత. బీజేపీ అభ్యర్ధి సుచిత్ర గెలుపు వెనుక ఆ పార్టీ వేవ్‌తో పాటు స్థానికంగా సత్సంబంధాలు మెరుగ్గా ఉండడం, నార్త్ ఇండియన్ ఓట్లు శాతం ఎక్కువగా ఉండడం. బేగంపేట డివిజన్ నుంచి గెలుపొందిన టీఆర్ఎస్ అభ్యర్థి టి.మహేశ్వరికి గతంలో కార్పొరేటర్‌గా చేసిన అనుభవం, ప్రభుత్వ సంక్షేమ పథకాలూ కలిసొచ్చాయి. -
కీలకంగా మారిన మజ్లీస్.. మద్దతు ఎవరికి?
జీహెచ్ఎంసీ మేయర్ ఎంపికలో ‘మజ్లిస్’ పాత్ర కీలకంగా మారింది. దాదాపు 30 శాతం సీట్లు దక్కించుకున్నఎంఐఎం మద్దతుపైనే మేయర్ ఎన్నిక ఆధారపడి ఉంది. అందుకే ఆ పార్టీ నేతలు గుంభనంగా వ్యవహరిస్తున్నారు.‘మేం ఎవ్వరి దగ్గరకు వెళ్లం.. మా దగ్గరికే వాళ్లు రావాలి’ అన్న రీతిలో ఆ పార్టీ అధినేత వ్యాఖ్యానించడం గమనార్హం. తాజా పరిణామాల దృష్ట్యా ‘తాము కారెక్కడం కంటే తమ బండి ఎక్కితే హైదరాబాద్ మొత్తం తిప్పి చూపిస్తాం’ అని మీడియా సమావేశంలో ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఒక ప్రశ్నకు సమాధానం ఇవ్వడం ఇందుకు బలం చేకూరుస్తోంది. మరో వైపు లోపాయికారీ ఒప్పందంతో టీఆర్ఎస్తో కలిసి పోయే అవకాశాలు కూడా లేకపోలేదు. సాక్షి, సిటీబ్యూరో : మేయర్ ఎన్నికలో కీలకంగా మారిన ఎంఐఎంలో ముఖ్య నిర్ణయాలు తీసుకునేది అసదుద్దీన్ ఓవైసీ మాత్రమే. కానీ, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపధ్యంలో ‘పార్టీలో చర్చించి మేయర్ పీఠంపై నిర్ణయం తీసుకుంటాం’ అని సాక్ష్యాత్తు ఆయనే పేర్కొనడం కాస్త విస్మయం గొలుపుతోంది. చివరి వరకు విషయాన్ని సాగదీయాలనే ఉద్దేశంతోనే ఆయన పార్టీలో చర్చిస్తామని చెప్పుకొచ్చారని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. (కాంగ్రెస్‌కు భారీ షాక్.. బీజేపీలోకి జానారెడ్డి!) ఆరేళ్ల బంధం.. గత ఆరేళ్లుగా అధికార టీఆర్ఎస్–మజ్లిస్ మధ్య దోస్తీ కొనసాగుతున్నప్పటికి ప్రతి ఎన్నికల్లో స్నేహ పూర్వక పోటీ పేరుతో ఎవరికి వారు ఒంటరిగా బరిలో దిగుతూ వచ్చారు. ఈసారి కూడా ఎవరికి వారే పోటీకి దిగగా.. టీఆర్ఎస్ ఒక అడుగు ముందుకు వేసి మజ్లిస్‌తో దోస్తీ గీస్తీ లేదని, గత పర్యాయం ఐదు సీట్లలో ఓడగొట్టాం.. ఈ సారి పది డివిజన్లలో ఓడిస్తామని చెప్పింది. దానికి మజ్లిస్ ఘాటుగానే స్పందించింది. పరస్పర విమర్శలు కూడా తీవ్రస్థాయికి చేరడంతో ఆరేళ్ల బంధం కాస్త బెడిసినట్టయింది. ఈ నేపథ్యంలో తిరిగి దోస్తీ కోసం ఒకరికి ఒకరు సంప్రదించుకునేందుకు సంశయిస్తున్నట్లు తెలుస్తోంది. (కాంగ్రెస్ ఓటమి.. రేవంత్ వర్గంలో ఆశలు) సంఖ్యా బలంపై ధీమా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ పక్షాన 44 మంది అభ్యర్థులు విజయం సాధించగా, మరో పది మంది ఎక్స్ అఫీషియో సభ్యులున్నారు. దీంతో బల్దియాలో మజ్లిస్ సంఖ్యా బలం 54కి చేరింది. అయితే మేయర్ పీఠం సాధించేందుకు ఈ బలం సరిపోదు. అందువల్ల టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వడమా..? లేక టీఆర్ఎస్ సహకారం తీసుకోవడమా? అనే రెండు మార్గాలు మాత్రమే మజ్లిస్ ముందు ఉన్నాయి. గతంలో కాంగ్రెస్ హయాంలో మాదిరిగా పాలనలో భాగస్వాములై రెండున్నరేళ్లు మేయర్ పదవి చేపట్టడమా... లేక బేషరతుగా మద్దతిచ్చి డివిజన్లలో అభివృద్ధి పనులు చేపట్టడమా అన్న దానిపై తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై వెంటనే నిర్ణయం వెలువరించకుండా... వేచి చూసే ధోరణి అవలంబించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. (వాళ్లడిగితే.. ఆలోచిస్తాం) దారుస్సలాంలో సందడి మజ్లిస్ పార్టీ కేంద్ర కార్యాలయమైన హైదరాబాద్ దారుస్సలాం సందడిగా మారింది. శనివారం పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు, కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతో వేర్వేరుగా ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ సమావేశమయ్యారు. మేయర్ పీఠం అంశం పెద్దగా చర్చించనప్పటికీ ‘అధికారం ముఖ్యం కాదు.. ఓట్లు వేసిన ప్రజలకు న్యాయం చేయాలి. సమస్యలు పరిష్కరించి వారిని సంతృప్తిపర్చాలి’ అని ఆయన ఉద్బోధించారు. 51 స్థానాలకు గాను 44 డివిజన్లలో విజయం సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. -
వాళ్లడిగితే.. ఆలోచిస్తాం
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మేయర్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వైఖరిపై హడావుడిగా నిర్ణయం తీసుకోవాల్సిన అవస రంలేదని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. టీఆర్ఎస్ తమ మద్దతు కోరితే అప్పుడు ఆలోచిస్తామని, ప్రస్తుతానికైతే ఈ పార్టీ నుంచి తమనెవరూ సంప్రదించలేదన్నా రు. ‘బీజేపీది బలం అని నేను అనుకోవటం లేదు. బండి సంజయ్ ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్న కరీంనగర్లో మేయర్, డిప్యూటీ మేయర్లుగా బీజేపీ వారిని గెలిపించుకోలేకపోయారు. మరో ఎంపీ అరవింద్ నిజామాబాద్‌లో ఇలాగే విఫలమయ్యారు. కొన్ని తాత్కాలిక పరి స్థితుల ప్రభావంతో ఇక్కడ బీజేపీ ఎక్కువ సీట్లు గెలిచింది. దక్షిణ భారత్‌లో సత్తా ఉన్న నేతల్లో కేసీఆర్ ఒకరు. భవిష్యత్తులోనూ తెలంగాణ జనం ఆయనకు అనుకూలంగా ఉంటారనే విశ్వ సిస్తున్నా’ అని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. శనివా రం సాయం త్రం ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. తాజా పరిస్థితులపై తన అభిప్రాయాలను వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. మిగిలిన ఏడు కూడా నెగ్గుతామనుకున్నాం మేం ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 51 డివిజన్లలో పోటీచేసి 44 గెలిచాం. అన్ని చోట్లా నెగ్గుతామని ఆశించాం. కానీ మా అభ్యర్థులు కొందరు సరిగా పనిచేయలేకపోవటం వల్ల మిగతా వాటిని సాధించలేకపోయాం. దీనిపై కూడా అంతర్గతంగా విశ్లేషించుకుని పొరపాట్లు సరిదిద్దుకుంటాం. బీజేపీకి భయపడం... ఎప్పుడూ ప్రజల్లో ఉండి, వారి సమస్యలు పరిష్కరిస్తూ.. వారికి దగ్గరవుతుండటమే మా విజ యరహస్యం. ఇక ముందూ అలాగే ఉంటాం. బీజేపీ ఇప్పుడు ఎక్కువ సీట్లు గెలిచినంత మాత్రాన ఆ పార్టీతో మాకు పోటీ ఏం లేదు. మాకు పట్టున్న చోట పనిచేసుకుంటూ పోతాం. ఎన్నికల్లో ఎవరిని ఆదరించాలో ప్రజలే నిర్ణయించుకుంటారు. బీజేపీని చూసి మేం భయపడం. టీఆర్ఎస్ కూడా భయపడొద్దనే సూచిస్తున్నా. ఎవరికీ అనుకూల తీర్చు ఇవ్వలేదు తాజా ఎన్నికల్లో హైదరాబాద్ నగర ఓటరు మూడు పార్టీలకు సమ ప్రాధాన్యం ఇచ్చినట్టుగానే అనిపిస్తోంది. టీఆర్ఎస్, బీజేపీ, మా పార్టీ... దేనికీ పూర్తి అనుకూల తీర్పు చెప్పలేదు. ఇది కొంత ఇబ్బందికర విషయమే. అలా ఎందుకు జరిగిందో విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీలో అంతర్గతంగా చర్చిస్తాం జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు వెల్లడై 2 రోజులు కూడా గడవలేదు. అప్పుడే మేయర్ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సినంత హడావుడి లేదు. నేరేడ్మెట్ ఫలితం పెండింగ్‌లో ఉంది. అది వచ్చాక మేయర్ ఎన్నికపై అంతర్గతంగా పార్టీలో చర్చించి ఓ అభిప్రాయానికి వస్తాం. టీఆర్ఎస్ సంప్రదించలేదు మా ఫలితాలను విశ్లేషించుకునే పనిలో ఉన్నాం. మేయర్ విషయంలో టీఆర్ఎస్ మా మద్దతు కోరితే అప్పుడు ఆలోచిస్తాం. ఇప్పటి వరకు ఆ పార్టీ నుంచి మమ్మల్ని ఎవరూ సంప్రదించలేదు. మా అవసరం ఏర్పడి సహకారం కోరితే .. మా పార్టీ నేతల అభిప్రాయానికనుగుణంగా నిర్ణయం తీసుకుంటాం. దుబ్బాకతో గ్రేటర్‌కు పోలిక లేదు ఇటీవల జరిగిన దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీ గెలవటానికి, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ పార్టీ ఎక్కువ సీట్లు సాధించటానికి పోలిక లేదు. టీఆర్ఎస్ చేసిన కొన్ని తప్పిదాల వల్ల దుబ్బాక ఫలితం అలా వచ్చింది. దివంగత ఎమ్మెల్యేపై ప్రజల్లో వ్యతిరేకత ఉండటం, ప్రచార సమయంలో బీజేపీ అభ్యర్థి ఇంటిలో సోదాల పేరుతో హడావుడి చేయటం, పోలింగ్‌కు మూడు నెలల సమయం దొరికినా టీఆర్ఎస్ దాన్ని సరిగా వినియోగించుకోలేకపోవటం... ఇలాంటి కారణాలతో టీఆర్ఎస్ ఓడిందని నేను అనుకుంటున్నా. -
బీజేపీ గెలుపు తాత్కాలికమే : ఒవైసీ
-
ఒవైసీ, కేసీఆర్ కలిసి బిర్యానీ తింటారు
సాక్షి, న్యూఢిల్లీ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో టీఆర్ఎస్, ఎంఐఎం రహస్య పొత్తు పెట్టుకున్నాయమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మరోసారి ఆరోపించారు. మేయర్ ఎన్నికతో వారి బండారం బయటపడుతుందని చెప్పారు. గ్రేటర్ ఎన్నికల్లో నగర ఓటరు ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇవ్వలేదు. టీఆర్ఎస్-55, బీజేపీ-48, ఎంఐఎం-44, కాంగ్రెస్-2 స్థానాల్లో విజయం సాధించింది. మేయర్ పీఠం కోసం ఎంఐఎంతో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో శనివారం ఈ అంశంపై కిషన్ రెడ్డి వ్యగ్యంగా స్పందించారు. ‘కేసీఆర్, అసదుద్దీన్ ఒవైసీ కలిసి బిర్యానీ తింటారు’ అని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. (చదవండి : బీజేపీ గెలుపు తాత్కాలికమే : ఒవైసీ) ‘హైదరాబాద్ ఒక మిని తెలంగాణ. అక్కడ ప్రజలు బీజేపీకి 48 సీట్లు ఇచ్చి ఆశీర్వదించారు. ఈ ఫలితాలు అధికార టీఆర్ఎస్కు చెంపపెట్టు. తెలంగాణలో బీజేపీ క్రమంగా బలపడుతోందని తెలిపారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపును ఒవైసీ కానీ, కేసీఆర్ ఆపలేరు’ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. -
బీజేపీ గెలుపు తాత్కాలికమే : ఒవైసీ
సాక్షి, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నగర ప్రజలు ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఇవ్వలేదని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఆయన ఎన్నికల ఫలితాలపై శనివారం ‘సాక్షి’తో మాట్లాడుతూ పాతబస్తీలో బీజేపీ ప్రభావం లేదని అన్నారు. ముస్లింలు, హిందువులు అందరూ ఎంఐఎంకు ఓటు వేశారని తెలిపారు. అయితే తమ పార్టీకి వచ్చిన ఫలితాలపై సమీక్ష జరుపుతున్నామన్నారు. గ్రేటర్లో బీజేపీ గెలుపు తాత్కాలికమేనని, దాని ప్రభావం రాష్ట్రంలో ఉండదని పేర్కొన్నారు. ఇక మేయర్ అభ్యర్థిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఒవైసీ అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రభావం రాష్ట్రంలో ఉండదని, తెలంగాణ ప్రజలకు కేసీఆర్‌పై ఎనలేని గౌరవం ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్, టీడీపీ బలహీనపడటం వల్లే బీజేపీ ఓట్ల శాతం పెరిగిందన్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన తెలిపారు. కాగా ఎంఐఎం పాతబస్తీపై తమ పట్టును మరోసారి నిరూపించుకుంది. 44 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. 2016లోనూ ఎంఐఎంకు సరిగ్గా ఇన్ని సీట్లే రావడం గమనార్హం. 2023లో బీజేపీదే గెలుపు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి ఆశించిన స్థానాలు వచ్చాయని కేంద్రమంత్రి కిషన్ అన్నారు. ఈ ఫలితాలు అధికార టీఆర్ఎస్కు చెంపపెట్టు అన్నారు. తెలంగాణలో బీజేపీ క్రమంగా బలపడుతోందని తెలిపారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపును ఒవైసీ కానీ, కేసీఆర్ ఆపలేదన్నారు. -
ఎంఐఎంని వెనక్కి నెట్టిన కమలం..!
సాక్షి, హైదరాబాద్: బల్దియా ఎన్నికల ఫలితాలు ముగింపుకు చేరుకున్నాయి. మరొక డివిజన్లో ఫలితం వెల్లడి కావాల్సి ఉంది. ఇప్పటివరకు టీఆర్ఎస్-56, బీజేపీ-48, ఎంఐఎం-44, కాంగ్రెస్-2 స్థానాల్లో విజయం సాధించింది. ఇక గత ఎన్నికల్లో పోలీస్తే.. ఈ ఫలితాలు అధికార టీఆర్ఎస్ పార్టీకి, పతంగి పార్టీకి షాక్ ఇచ్చాయి. గతంలో టీఆర్ఎస్ మేజిక్ ఫిగర్‌ని సాధించగా.. ఎంఐఎం 44 స్థానాల్లో విజయం సాధించి అతి పెద్ద రెండో పార్టీగా నిలిచింది. ఇక ఈ సారి బల్డియా పోరులో ఫలితాలు తారుమారయ్యాయి. గ్రేటర్ ఓటర్ ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇవ్వలేదు. ఇక గత ఎన్నికల్లో 44 స్థానాలు సాధించిన ఎంఐంఎ ఈ సారి 43 మాత్రమే సాధించింది. ఇక గతంలో 4స్థానాలకే పరిమితమైన బీజేపీ ఈ సారి ఏకంగా 48 స్థానాల్లో విజయం సాధించి.. రెండో అతి పెద్ద పార్టీగా నిలిచి.. ఎంఐఎంని వెనక్కి నెట్టింది. కానీ పాత బస్తీలో మాత్రం పాగా వేయలేకపోయింది. అమిత్ షా భాగ్యలక్ష్మీ ఆలయం సందర్శించినప్పటికి పెద్దగా ఫలితం లేకపోయింది. ఇక ఇప్పటికి పాతబస్తీలో తమకు తిరుగు లేదని పతంగి పార్టీ మరోసారి రుజువు చేసుకుంది. ఈ సారి ఎంఐఎం మూడో స్థానానికి పరిమితమయ్యింది. అయినప్పటికి మేయర్ ఎన్నికల్లో ఎంఐంఎ కీలక పాత్ర పోషించనుంది. (చదవండి: హంగ్ దిశగా.. గ్రేటర్ జడ్జిమెంట్) -
మేయర్ పీఠంపై ఉత్కంఠ..!
సాక్షి, హైదరాబాద్: బల్దియా పోరులో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ దక్కలేదు. టీఆర్ఎస్-56, బీజేపీ-47, ఎంఐఎం-43, కాంగ్రెస్-2 స్థానాల్లో విజయం సాధించాయి. ఏ పార్టీ మేజిక్ ఫిగర్ సాధించకపోవడంతో హంగ్ పరిస్థితులు ఏర్పడ్డాయి. 56 స్థానాల్లో విజయం సాధించిన టీఆర్ఎస్ అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఇక 47 స్థానాల్లో విజయం సాధించి బీజేపీ రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఈ తరుణంలో ఏవైనా రెండు పార్టీలు కలిస్తేనే బల్దియా పాలక వర్గం కొలువుదీరుతుంది. టీఆర్ఎస్-బీజేపీ, ఎంఐంఐ-బీజేపీ పొత్తు అసాధ్యం. ఈ పరిస్థితుల్లో టీఆర్ఎస్ మేయర్ పీఠాన్ని అధిరోహించాలంటే ఎంఐంఎం మద్దతు తప్పని సరి. అయితే నిన్నటి వరకు తమకు ఎంఐఎంతో ఎలాంటి పొత్తు లేదంటూ ప్రచారం చేసుకున్న టీఆర్ఎస్.. ఇప్పుడు ఖచ్చితంగా పతంగి పార్టీ మద్దతు తీసుకోవాల్సిందే. ఇలాంటి తరుణంలో ఎంఐఎం, టీఆర్ఎస్కు మద్దతిస్తుందా.. లేదా.. ఒకవేళ ఇచ్చినా.. ఎలాంటి షరతులు పెడుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఏకంగా మేయర్ కుర్చీ తమకు ఇవ్వాలని అడిగే ఛాన్స్ ఉందని ప్రచారం. డిప్యూటీ మేయర్‌తో సరిపెట్టుకోవాలని టీఆర్ఎస్ బేరసారాలు సాగించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. రెండు పార్టీల అధినేతల మధ్య అంగీకారం కుదిరితేనే హంగ్‌తో బల్దియా పాలక వర్గం కొలువుదీరుతుంది. (చదవండి: టీఆర్ఎస్ కొంపముంచిన డమ్మీ అభ్యర్థి..! ) గతంలో 2009లో ఉమ్మడి రాష్ట్రంలో గ్రేటర్లో ఇదే పరిస్థితి తలెత్తింది. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ, ఎంఐంఎంతో కలిసి అధికారంలోకి వచ్చింది. ఈ రెండు పార్టీలు చెరో రెండున్నరేళ్లు మేయర్ పదవిని పంచుకున్నాయి. ప్రస్తుతం టీఆర్ఎస్, ఎంఐఎం కూడా ఇలాంటి అవగాహనకు వస్తాయా.. టీఆర్ఎస్, ఎంఐఎం కలిసి అధికారం పంచుకుంటాయా.. లేక ఒకరు మేయర్, మరొకరు డిప్యూటీ మేయర్ తీసుకుంటారా అనే అంశాలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. -
హంగ్ దిశగా.. గ్రేటర్ జడ్జిమెంట్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది. టీఆర్ఎస్-56, బీజేపీ-48,ఎంఐఎం-44, కాంగ్రెస్-2 చోట్ల విజయం సాధించింది. ఇక గ్రేటర్ ఎన్నికల్లో నగర ఓటరు ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇవ్వలేదు. మేయర్ పీఠం దక్కించుకోవాలంటే 76 స్థానాల్లో విజయం సాధించాలి. కానీ ఒక్క పార్టీ కూడా 60 దాటలేదు. దాంతో హంగ్ తప్పదంటున్నారు విశ్లేషకులు. ఇక ఎగ్జిట్ పోల్స్‌లో టీఆర్ఎస్ సొంతంగా మెజారిటీ సాధిస్తుందని ప్రకటించినప్పటికి తాజా ఫలితాల్లో మాత్రం 56 స్థానాలకే పరిమితమయ్యింది. ఎలాగు ఎంఐఎం మద్దతుతో మేయర్ పీఠం దక్కించుకోనున్నప్పటికి.. గ్రేటర్ ఫలితల్లో టీఆర్ఎస్కు భారీ పరాజయమనే చెప్పవచ్చు. జీహెచ్ఎంసీ పోరులో బీజేపీ, కారుకు బాగానే బ్రేక్ లేసిందనే చెప్పవచ్చు. 2016 ఎన్నికల్లో కేవలం నాలుగు స్థానాలకే పరిమితైన బీజేపీ తాజాగా 48 స్థానాల్లో విజయం సాధించి రెండవ స్థానంలో నిలిచింది. శివారు కాలనీల్లో దూసుకుపోయిన కారు జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో 100కు పైగా స్థానాల్లో విజయం సాధిస్తామని టీఆర్ఎస్ ప్రకటించింది. కానీ చివరకు మేజిక్ ఫిగర్ కూడా చేరలేదు. తాజా ఫలితాల్లో టీఆర్ఎస్ నగర శివార్లలో మెరుగైన ఫలితాలు సాధించినప్పటికి సిటీలో మాత్రం దారుణంగా విఫలమయ్యింది. ఎన్ని ఉచిత హామిలిచ్చినా ఓటరు పెద్దగా పట్టించుకోలేదు. ఆరేళ్లలో టీఆర్ఎస్ సిటీలో పెద్దగా అభివృద్ధి చేసింది ఏం లేకపోగా.. తాజాగా వరదల సమయంలో.. ముఖ్యమంత్రి, మంత్రులు, కార్పొరేటర్లు స్పందించిన తీరు నగరవాసికి నచ్చలేదు. దాంతో కేవలం 56 స్థానాలతో సరిపెట్టాడు. కేసీఆర్ ప్రకటించిన 10 వేల రూపాయల వరద సాయం పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. గ్రేటర్ ఫలితం టీఆర్ఎస్పై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను స్పష్టం చేసింది. టీఆర్ఎస్ మీద వ్యతిరేకత వల్లే ఓటింగ్ తగ్గిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇలానే కొనసాగితే.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కారుకు కష్టాలు తప్పవంటున్నారు విశ్లేషకులు. 4 నుంచి 48కు ఎదిగిన బీజేపీ దుబ్బాక ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ బల్దియాలో కూడా బలంగా తన ప్రభావం చూపించింది. 2016 ఎన్నికల్లో కేవలం నాలుగు స్థానాలకే పరిమితైమన బీజేపీ ఈ ఎన్నికల్లో ఏకంగా 48 స్థానాల్లో విజయం సాధించి రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక గ్రేటర్లో బీజేపీ పుంజుకోవడంలో బండి సంజయ్ కీలక పాత్ర పోషించారనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎంఐఎం, అధికార పార్టీ నాయకుల విమర్శలకు కౌంటర్లు ఇస్తూ.. కేంద్రం నుంచి రాష్ట్రం పొందిన ప్రయోజనాల గురించి ప్రజలకు తెలుపుతూ.. ప్రచారంలో దూసుకుపోయింది బీజేపీ. ఈ ఎన్నికల్లో మేజిక్ ఫిగర్ సాధించనప్పటికి రెండో స్థానంలో కొనసాగడం అంటే కమలానికి గెలుపుతో సమానం. ఇక గ్రేటర్ ఫలితాలతో తెలంగాణలో టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నయం అని బీజేపీ మరో సారి రుజువు చేసింది. ఇక గ్రేటర్ జోష్‌నే కొనసాగిస్తే.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కారును కట్టడి చేయగల్గుతుందనడంలో సందేహం లేదు. (చదవండి: షాడో టీమ్స్.. ఎత్తుకు.. పై ఎత్తులు!) పాతబస్తీలో పట్టు నిలుపుకున్న మజ్లీస్ ఇక మజ్లీస్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోన్నక్కర్లేదు. పాతబస్తీలో పతంగి పార్టీకి మంచి పట్టుంది. 40కిపైగా స్థానాల్లో మజ్లీస్ విజయం సాధిస్తుందని ముందు నుంచి అంచనా వేసిందే. గత ఎన్నికల్లో ఎంఐఎం 44 స్థానాల్లో విజయం సాధించగా.. ఈసారి కూడా ఆ స్థానాలను నిలుపుకుంది. సింగిల్ డిజిట్‌కే పరిమితమైన హస్తం వరుస ఓటములతో సతమవుతున్న కాంగ్రెస్ పార్టీకి.. గ్రేటర్లో కూడా అదే పరిస్థితి ఎదురయ్యింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం రెండు స్థానాలకే పరిమితం అయ్యింది. అధికార పార్టీకి పోటిగా తాము గెలిస్తే ఏకంగా వరద సాయం 50 వేల రూపాయలు ఇస్తామన్నప్పటికి ఓటరు కాంగ్రెస్‌ను లైట్ తీస్కున్నాడు. ఇప్పటికి కాంగ్రెస్‌కు కార్యకర్తల బలం ఉన్నప్పటికి పార్టీ నేతల మధ్య విభేదాలు, సమన్వయం లోపం.. ప్రచారానికి అగ్ర నాయకత్వం దూరంగా ఉండటం వంటి అంశాలు కాంగ్రెస్‌కు ప్రతికూలంగా మారాయి. (చదవండి: జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలపై కంగనా ట్వీట్) బోణీ కూడా కొట్టని తెలుగుదేశం పార్టీ గెలవమని తెలిసి కూడా 106 స్థానాల్లో పోటీ చేసిన టీడీపీ.. కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. ఒక్క చోట కూడా విజయం సాధించలేదు. ఇక తెలంగాణలో టీడీపీ తన ఉనికిని పూర్తిగా మర్చిపోతే బెటర్ అంటున్నారు విశ్లేషకులు. -
మావైపే గ్రేటర్ ఓటర్.. కాదు మా వైపు!
బల్దియా పోలింగ్ ముగియడంతో రాజకీయ పార్టీలు గెలుపు లెక్కలు వేసుకుంటున్నాయి. పోలింగ్ సరళిని బట్టి విజయం మాదంటే.. మాదే అనే ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మళ్లీ మేయర్ కుర్చీ తమదేనని, ఈసారి కచ్చితంగా 100 స్థానాల్లో గెలుస్తామని, పోలింగ్ జరిగిన తీరు, ప్రజాభిప్రాయం కూడా ఇదే చెబుతోందని టీఆర్ఎస్ నేతలు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా పోలింగ్ సరళిపై ఆ పార్టీ గంపెడాశలు పెట్టుకుంది. ఇక, గ్రేటర్ ఎన్నికల్లో దుబ్బాక ఫలితాన్ని పునరావృతం చేస్తామనే ధీమాతో ఉన్న బీజేపీ కూడా మెజార్టీ స్థానాలు తమవేనన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత తమకు లాభిస్తుందని, 50కి పైగా స్థానాల్లో విజయం సాధించి తీరుతామని కమలనాథులు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతల్లోనూ గెలుపు ధీమా గట్టిగానే కనిపిస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల సరళిలో తాము వెనుకబడినట్టు కనిపించినా కనీసం 20 స్థానాల్లో గెలుస్తామని, మల్కాజ్గిరి పార్లమెంటు పరిధి నుంచి మంచి ఫలితాలు వస్తాయని గాంధీభవన్ వర్గాలంటున్నాయి. ఎంఐఎం ఎప్పటిలాగే పాతబస్తీలో పాగా వేస్తామనే విశ్వాసంతో ఉండగా, వామపక్షాలు, ఇతర పార్టీలు, స్వతంత్రులు కూడా గెలుపు తీరం చేరుతామని లెక్కలు వేసుకుంటున్నాయి. – సాక్షి, హైదరాబాద్ సెంచరీ కొట్టేనా..? జీహెచ్ఎంసీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్ మళ్లీ మేయర్ పీఠం తమదేనన్న ధీమాతో ఉంది. పోలింగ్ శాతం తగ్గినా, గతంలో మాదిరి 100కు డివిజన్లలో పాగా వేయడం ఖాయమనే అంచనాలో ఉంది. మంగళవారం ఉదయమే ఓటు వేసిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. తన నివాసంలోని వార్‌రూం నుంచి పార్టీ అభ్యర్థులు, డివిజన్ ఇన్‌చార్జ్‌లతో పోలింగ్ తీరుతెన్నులపై సమీక్షించారు. ఏ డివిజన్లో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకున్న ఆయన బీజేపీతో గట్టిపోటీ ఉన్న డివిజన్లలో పోలింగ్ గురించి ప్రత్యేకంగా ఆరా తీశారు. అయితే, నగర వ్యాప్తంగా పోలింగ్ శాతం భారీగా తగ్గుతోందనే సమాచారం మేరకు అభ్యర్థులు, డివిజన్ ఇన్‌చార్జ్‌లను అప్రమత్తం చేశారు. పార్టీకి పట్టున్న కాలనీలు, బస్తీల నుంచి ఓటర్లను పోలింగ్ బూత్‌లకు తరలించేలా చొరవ తీసుకోవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో పోల్ అయిన ఓట్లలో మెజార్టీ ఓట్లు తమ ఖాతాలోనే పడ్డాయనే లెక్కల్లో గులాబీ నేతలున్నారు.(చదవండి: గ్రేటర్ వార్: స్పందించని నగర వాసులు) జనం మావైపే... ఈ ఎన్నికల్లో గ్రేటర్ ప్రజలు తమ వైపే నిలిచారని కమలనాథులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ శాతం తగ్గినా... పోలైన ఓట్లు తమకే పడ్డాయని, టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఓటర్లు బ్యాలెట్ బాక్సులు నింపారని అంటున్నారు. ఈ ఎన్నికల్లో తాము సెంచరీ కొడతా మని పైకి చెబుతున్నా.. కనీసం 50 కన్నా ఎక్కువ డివిజన్లలో గెలిచి తీరుతామని రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలు భరోసాగా ఉన్నారు. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు ముఖ్య నాయకులు కిషన్‌రెడ్డి, లక్ష్మణ్, డి.కె.అరుణ, ధర్మపురి అరవింద్ తదితరులు పోలింగ్ సరళిపై ఎప్పటికప్పుడు డివిజన్ల వారీగా ఆరా తీస్తూ అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. గెలిచే స్థానాల్లో పోలింగ్ ముగిసేంత వరకు పట్టువీడొద్దని సూచించారు. అయితే, తగ్గిన పోలింగ్ శాతం ఏం చేస్తుందన్న టెన్షన్ కూడా బీజేపీ నేతల్లో కనిపిస్తోంది. యువత, విద్యాధికుల ఓట్లు పెద్దగా పోల్ కాకపోవడం నష్టం చేస్తుందేమోనన్న ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. కాంగి‘రేసు’ఎంత వరకు? రాష్ట్రంలో ఆటుపోట్లు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ విషయం లో జీహెచ్ఎంసీ ఓటర్లు ఏం చేశారన్నది ఆసక్తికరంగా మారింది. పోలింగ్ సరళిని పరిశీలించిన నాయకులు తాము 15–20 స్థానాల్లో గెలుస్తామని లెక్కలు వేసుకుంటున్నారు. రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజ్గిరి పరిధిలోని 47, చేవెళ్ల పరిధిలోని 18 డివిజన్లలో గట్టిపోటీ ఇచ్చామని చెబుతున్నారు. కోర్‌సిటీలో కొన్ని డివిజన్లలో తమకు అనుకూల పోలింగ్ జరిగిందని అంటున్నారు. పాతబస్తీ పతంగిదేనా..? పాతబస్తీలో మంచి పట్టు ఉన్న ఎంఐఎం మళ్లీ తన స్థానం అక్కడ పదిలమేనని అంటోంది. గతంలో గెలిచిన 44 స్థానాలకు ఒకట్రెండు ఎక్కువే కానీ తగ్గేది లేదని ధీమా వ్యక్తం చేస్తోంది. పోలింగ్ సరళిని పార్టీ ముఖ్య నేతలు అసద్, అక్బర్లు సమీక్షించి కేడర్‌ను అప్రమత్తం చేశారు. పాతబస్తీపై పట్టు అలాగే కొనసాగుతుందన్న ధీమా దారుస్సలాం వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఇక, 29 స్థానాల్లో పోటీ చేసిన సీపీఐ, సీపీఎం లతో పాటు 26 చోట్ల బరిలోకి దిగిన టీజేఎస్ కూడా తాము గట్టిపోటీ ఇవ్వగలిగామనే అభిప్రాయంతో ఉన్నాయి. స్వతంత్ర అభ్యర్థులు కూడా బరిలో సత్తా చాటుతామనే ధీమాలో ఉన్నారు. ఎవరికి వారే తమ డివిజన్లలో పోలైన ఓట్లలో ఎన్ని తమకు సానుకూలమనే లెక్కలు కట్టుకుంటున్నారు. ఏం జరుగుతుంది... రాజకీయ పార్టీల భవితవ్యం ఎలా ఉండబోతుందన్నది ఈనెల 4న తేలనుంది. -
గ్రేటర్ పోరు: కౌన్ బనేగా?
గ్రేటర్ ఎన్నికల్లో కీలక ఘట్టమైన ప్రచార పర్వం ముగిసింది. గెలుపు కోసం అన్ని పార్టీల అభ్యర్థులు ఆదివారం వరకు పోటాపోటీ ప్రచారం నిర్వహించారు. తామే గెలుస్తామంటూ లెక్కలు వేసుకుంటున్నారు. చాలా ప్రాంతాల్లో టీఆర్ఎస్, బీజేపీ మధ్యే నువ్వా నేనా..? అనేలా పోటీ ఉండగా.. అక్కడక్కడా కాంగ్రెస్ పోటీ ఇస్తోంది. కొన్ని ప్రాంతాల్లో త్రిముఖ పోటీ నెలకొంది. అభివృద్ధి పథకాలు, సిట్టింగ్‌లు, క్యాడర్ టీఆర్ఎస్కు అనుకూలంగా ఉండగా.. వరదలు, రూ.10 వేల ఆరి్థక సాయం, దుబ్బాక ఓటమి బీజేపీకి కలిసొచ్చే అంశాలు. పాతబస్తీలో అత్యధిక స్థానాలు మజ్లిస్ పార్టీలకే అనుకూలంగా ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో సెటిలర్లు, ఉత్తర భారతీయులు, ముస్లిం మైనార్టీ ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గుచూపినా అంచనాలు తారుమారయ్యే అవకాశం ఉంది. కూకట్పల్లి నియోజకవర్గంలో.. కూకట్పల్లి: కూకట్పల్లి నియోజకవర్గంలో 8 డివిజన్లు ఉన్నాయి. గతంలో కేపీహెచ్‌బీ డివిజన్ మినహా మిగిలిన అన్ని డివిజన్లను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. కేపీహెచ్బీలో టీడీపీ నుంచి గెలుపొందిన కార్పొరేటర్ కూడా టీఆర్ఎస్లో చేరిపోయారు. మూసాపేటలో త్రిముఖ పోటీ నెలకొంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ ఉంది. టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు మూసాపేట ప్రాంతానికి చెందిన వారే కావడంతో ఓట్లు చీలే అవకాశం ఉంది. మోతీనగర్ ప్రాంతంలో కొంత భాగంలో ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. పోటీ టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే కనిపిస్తోంది. అభివృద్ధి టీఆర్ఎస్కు కలిసివచ్చే అవకాశం ఉంది. కేపీహెచ్‌బీ కాలనీలో అధికార టీఆర్ఎస్, బీజేపీకి హోరాహోరీ పోరు నడుస్తోంది. వలస ప్రాంతీయులు ఎక్కువగా ఉన్న ఈ డివిజన్లో పోటీ నువ్వా నేనా..? అన్న విధంగా ఉంది. సెటిలర్స్ బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. బాలాజీనగర్ డివిజన్లో టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ ఉంది. టీఆర్ఎస్ అభ్యర్థి రాజకీయ అనుభవజ్ఞుడు కావటం బీజేపీ అభ్యర్థి రాజకీయాలకు కొత్త కావడంతో కొంత తేడా కనిపిస్తోంది. అయినప్పటికీ ప్రజల్లో బీజేపీకి మంచి ఆదరణ లభిస్తోంది. అల్లాపూర్‌లో అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ నెలకొంది. ఇక్కడ మైనార్టీ ఓట్లు కీలకంగా ఉండటంతో టీఆర్ఎస్కు అనుకూలమైన వాతావరణం కనిపిస్తోంది.ఫతేనగర్ డివిజన్లో టీఆర్ఎస్, బీజేపీకి హోరాహోరిగా ఉన్నప్పటికీ బీజేపీకి రెబల్ అభ్యర్థి, టీఆర్ఎస్కు ముస్లింఅభ్యర్థితో కొంత ఇబ్బంది నెలకొంది. దీంతో ఇరుపార్టీల అభ్యర్థులకు కూడా తలనొప్పిగా మారింది. బోయిన్‌పల్లిలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే పోటీ ఉంది. బాలానగర్‌లో కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ముఖ్యంగా ఇక్కడ పోటీ చేసే ముగ్గురు అభ్యర్థులు కొత్త వారు కావడంతో ఓటర్లు ఎవరికి తీర్పు ఇచ్చేదో ఉత్కంఠగా ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి గతంలో పోటీ చేయడంతో ఆయనకు కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది.కూకట్పల్లి డివిజన్లో త్రిముఖ పోటీ ఉంది. అధికార పార్టీ తాను చేసిన అభివృద్ధి పనులతో ముందుకు పోతుండగా బీజేపీ అభ్యర్థి ప్రచారంలో ఉత్సాహంగా దూసుకెళ్తున్నారు. ఇక్కడ ముగ్గురు ఒకే సామాజికవర్గం కావటంతో ఓటర్లు ఎవరికి తీర్పు ఇవ్వనున్నారో వేచి చూడాల్సిందే. శేరిలింగంపల్లి జంట సర్కిళ్ల పరిధిలో.. గచ్చిబౌలి: శేరిలింగంపల్లి జంట సర్కిళ్ల పరిధిలో ఏడు డివిజన్లు ఉన్నాయి. ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల మధ్యనే పోటీ నెలకొంది. ఓవరాల్‌గా ఎక్కువ స్థానాలు టీఆర్ఎస్ కైవసం చేసుకునే అవకాశం ఉంది. నార్త్ ఇండియన్స్ పోలింగ్‌లో పాల్గొంటేనే బీజేపీ పోటీ ఇవ్వగలుగుతుంది. కొండాపూర్ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి షేక్ హమీద్ పటేల్, బీజేపీ అభ్యర్థి రఘునాథ్ యాదవ్ మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ఇక్కడ మైనార్టీ ఓట్లు కీలకంగా మారనున్నాయి. నార్త్ ఇండియన్ ఓట్లు ఎక్కువగా పోలైతే టీఆర్ఎస్కు మెజార్టీ తగ్గే అవకాశం ఉంది. గచ్చిబౌలి డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి కొమిరిశెట్టి సాయిబాబ, బీజేపీ అభ్యర్థి గంగాధర్‌రెడ్డి మధ్య పోటీ ఉంది. మైనార్టీ ఓట్లతో పాటు నార్త్ ఇండియన్ ఓట్లు కీలకంగా మారనున్నాయి. ఇప్పటికీ టీఆర్ఎస్కే ఎడ్జ్ ఉంది. శేరిలింగంపల్లి డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి రాగం నాగేందర్ యాదవ్, బీజేపీ అభ్యర్థి ఎల్లేష్ మధ్య పోటీ ఉంది. మాదాపూర్ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి జగదీశ్వర్‌గౌడ్, బీజేపీ అభ్యర్థి గంగల రాధాకృష్ణ యాదవ్ మధ్య పోటీ ఉంది. మైనార్టీ ఓట్లు కీలకం కానున్నాయి. మియాపూర్ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఉప్పలపాటి శ్రీకాంత్, బీజేపీ అభ్యర్థి రాఘవేందర్రావు మధ్య పోటీ ఉంది. మైనార్టీ ఓట్లు కీలకం. హఫీజ్‌పేట్ డివిజన్లో పూజితా జగదీశ్వర్‌గౌడ్, అనూష మహేష్ యాదవ్‌ల మధ్య పోటీ ఉంది. చందానగర్ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి మంజుల, బీజేపీ అభ్యర్థి సింధూ మధ్య పోటీ ఉంది. ఖైరతాబాద్ నియోజకవర్గంలో.. బంజారాహిల్స్: ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఆరు డివిజన్లు బంజారాహిల్స్‌లో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. టీఆర్ఎస్ తరఫున మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తొలిరోజు నుంచే ప్రచారంలో ఉన్నారు. మంత్రులు ఈటెల రాజేందర్, మహమూద్ అలీలు ఇక్కడ ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ తరఫున ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు సీతక్క ప్రచారం నిర్వహించారు. బీజేపీ తరఫున ధర్మపురి అరవింద్ ప్రచారం నిర్వహించారు. వెంకటేశ్వరకాలనీలో టీఆర్ఎస్, బీజేపీ జోరుగా ప్రచారం చేసుకుంటున్నాయి. ఇక్కడ వార్ వన్‌సైడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జూబ్లీహిల్స్ డివిజన్లో టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ నెలకొంది. ఇక్కడ కాంగెస్ అభ్యర్థి యువకుడు కావడంతో కొంత వరకు ఓట్లు చీలే అవకాశం ఉంది. బస్తీల్లో టీఆర్ఎస్కు ధీటుగా బీజేపీ బలంగానే ఉంది. ఇక్కడ ప్రధానంగా బీజేపీ, టీఆర్ఎస్ల మధ్య పోటీ నెలకొనే అవకాశం ఉంది. ఖైరతాబాద్ డివిజన్లో టీఆర్ఎస్ బలంగా ఉన్నప్పటికీ బీజేపీ చాపకింద నీరులా కొంత విస్తరిస్తోంది. ముఖ్యంగా యువత బీజేపీ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఇక్కడ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ నడుస్తోంది. సోమాజిగూడ డివిజన్ ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ రెండు నియోజకవర్గాల మధ్యలో ఉంది. దీంతో ఇక్కడ ఒక వైపు ముస్లింలు, మరో వైపు హిందువులు ఉన్నారు. ఇక్కడ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా టఫ్ ఫైట్ నడుస్తోంది. కాంగ్రెస్ ముస్లింల ఓట్లను చీల్చే అవకాశం ఉంది. హిమాయత్‌నగర్ డివిజన్లో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్లుగా పోరు సాగుతోంది. అత్యధికంగా వ్యాపారులు, కాలనీలు, ఉన్నత విద్యావంతులు ఉండటంతో వారు ఎక్కువగా బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. మోండాలో పోటీ ఆ ఇద్దరి మధ్యే.. కంటోన్మెంట్: మోండా (డివిజన్ 150)లో ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్(ఆకుల రూప), బీజేపీ(కొంతం దీపిక), కాంగ్రెస్(బాల ప్రశాంతి) బరిలో ఉన్నారు. ప్రధాన పోటీ టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల మధ్యే ఉంది. టీఆర్ఎస్ సిట్టింగ్ కార్పొరేటర్‌పై స్థానికంగా కొంత వ్యతిరేకత ఉంది. ప్రచారంలోనూ నిరసనలు వ్యక్తమయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే సాయన్న తన కూతురు లాస్యనందిత పోటీ చేస్తున్న ముషీరాబాద్ నియోజకవర్గంలోని కవాడిగూడ డివిజన్లో ప్రచారానికే పరిమతం అయ్యారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ తరఫున ఇన్చార్జి ముధోల్ ఎమ్మెల్యే, కొందరు స్థానిక నేతలు మినహా పార్టీ పెద్దలు ఎవరూ ఇక్కడ ప్రచారం చేయలేదు. బీజేపీ అభ్యర్థి రాజకీయాలకు కొత్త అయినా కొందరు స్వచ్ఛందంగా ఆమెకు ప్రచారం చేసేందుకు ముందుకు వచ్చారు. మలక్‌పేట నియోజకవర్గం మలక్‌పేట: నియోజకవర్గ పరిధిలో 6 డివిజన్లు ఉన్నాయి. మూసారంబాగ్లో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ ఉంది. సైదాబాద్ డివిజన్లో టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ ఉండగా మైనార్టీ ఓట్లు ఎక్కువగా పోలైతే టీఆర్ఎస్ అనుకూలం. మిగిలిన నాలుగు డివిజన్లు ఓల్డ్‌మలక్‌పేట, చవుని, ఆజంపుర, అక్బర్బాగ్లో ఎంఐఎం పార్టీ గెలుపు సునాయసమే. సైదాబాద్, మూసారంబాగ్లలో టీఆర్ఎస్కు ఎమ్మెల్యే బలాల ప్రచారం చేశారు. యాకత్‌పుర నియోజకవర్గం ఐఎస్‌సదన్‌లో టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ ఉంది. కుర్మగూడ డివిజన్లో ఎంఐఎం, టీఆర్ఎస్, బీజేపీల మధ్య పోటీ ఉంది. మహేశ్వరం నియోజకవర్గం.. ఆర్కేపురం, సరూర్‌నగర్ డివిజన్లలో టీఆర్ఎస్ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. సనత్‌నగర్ నియోజకవర్గం సనత్‌నగర్: నియోజకవర్గం పరిధిలో ఆరు డివిజన్లు ఉన్నాయి. సనత్‌నగర్, అమీర్‌పేట, బేగంపేట, రాంగోపాల్‌పేట, బన్సీలాల్‌పేటలతో పాటు మోండా(పార్ట్) డివిజన్లు విస్తరించి ఉన్నాయి. సనత్‌నగర్ డివిజన్లో టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ నెలకొంది. ఈ డివిజన్లో సెటిలర్స్ ఓటు బ్యాంక్ కీలకం. అమీర్‌పేట డివిజన్‌కు వచ్చేసరికి టీఆర్ఎస్–బీజేపీ నువ్వా నేనా అన్నట్లుగా ఉన్నాయి. ఇక్కడి నుంచి పోటీలో ఉన్న టీఆర్ఎస్ అభ్యర్థికి రాజకీయ అనుభవంతో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అండదండలు పుష్కలంగా ఉన్నాయి. నార్త్ ఇండియన్స్ ఓటు బ్యాంకుపై తమకే అన్న ధీమాతో బీజేపీ నేతలు ఉన్నారు. బేగంపేట డివిజన్లో అధికార టీఆర్ఎస్ అభ్యరి్థకి మద్దతుగా ప్రచారం కొనసాగించారు. మంత్రులు ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, ఇన్‌ఛార్జి రేఖానాయక్ ఇక్కడ ప్రచారంలో పాల్గొన్నారు. రాంగోపాల్‌పేట డివిజన్ నుంచి కూడా టీఆర్ఎస్, బీజేపీలు నువ్వా–నేనా అన్నట్లుగా తలపడుతున్నాయి. ఇక్కడ బీజేపీ ఉత్తర భారతీయుల మద్దతు లభిస్తుండటంతో ఆ పార్టీ జోష్‌లో ఉంది. బన్సీలాల్‌పేట డివిజన్లో బస్తీలు ఎక్కువగా ఉండటంతో కొన్ని హామీలు నెరవేర్చడంతో టీఆర్ఎస్ అభ్యరి్థని గట్టెక్కిస్తాయనే ధీమాతో ఆ పార్టీ నేతలు ఉన్నారు. గోషామహల్ నియోజకవర్గంలో.. అబిడ్స్: గోషామహల్ నియోజకవర్గంలోని ఆరు డివిజన్లు ఉన్నాయి. బేగంబజార్ డివిజన్లో టీఆర్ఎస్, బీజేపీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థి విజి.పురుషోత్తమ్ టీఆర్ఎస్ అభ్యర్థి పూజ వ్యాస్ బిలాల్‌కు మద్దతు ప్రకటించడంతో పోటీ పెరిగింది. గోషామహాల్ డివిజన్లో టీఆర్ఎస్, బీజేపీల మధ్య బిగ్ ఫైట్ నెలకొంది. టీఆర్ఎస్ అభ్యర్థి ముఖేష్ సింగ్, బీజేపీ నుంచి సీనియర్ బీజేపీ నేత లాల్‌సింగ్ పోటీలో ఉన్నారు. జాంబాగ్ డివిజన్లో టీఆర్ఎస్, మజ్లిస్, బీజేపీల మధ్యే ప్రధాన పోటీ. టీఆర్ఎస్ గత ఎన్నికల్లో కేవలం 5 ఓట్లతో ఓడిపోయింది. ఆ సింపతి కలిసొచ్చే అవకాశం ఉంది. గన్‌ఫౌండ్రీ డివిజన్లో టీఆర్ఎస్, బీజేపీల మధ్య పోటీ ఉంది. ఎల్బీస్టేడియంలోని కేసీఆర్ బహిరంగ సభ గన్‌ఫౌడ్రీ డివిజన్‌లోనే ఉండటం టీఆర్ఎస్లో ఉత్సాహం పెరిగింది. మంగళ్‌హాట్ డివిజన్లో టీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ. దత్తాత్రేయనగర్ డివిజన్లో మజ్లిస్ అభ్యర్థి జకీర్ బాక్రే, బీజేపీ అభ్యర్థి ధర్మేందర్ సింగ్‌లు బలంగా ఉన్నారు. ఇక్కడ 70 శాతం మైనార్టీ ఓట్లు ఉన్నాయి. సికింద్రాబాద్ నియోజకవర్గంలో.. సికింద్రాబాద్: నియోజకవర్గంలో ఐదు డివిజన్లు ఉన్నాయి. తార్నాకలో టీఆర్ఎస్ అభ్యర్థి మోతె శ్రీలతారెడ్డి, బీజేపీ అభ్యర్థి బండ జయసుధరెడ్డి మధ్యే పోటీ.. బౌద్ధనగర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి కంది శైలజ, బీజేపీ అభ్యర్థి మేకల కీర్తి మధ్య పోటీ ఉంది. ఐదు డివిజన్లలో బస్తీలు ఎక్కువగా ఉన్నాయి. బస్తీల ఓట్లు కీలకంగా మారనున్నాయి. సీతాఫల్మండి, తార్నాక, మెట్టుగూడ డివిజన్లలో రైల్వే కాలనీల్లో రైల్వే కుటుంబాలకు చెందిన వేలాది ఓట్లు ఉన్నాయి. రైల్వే కుటుంబాలు పోలింగ్‌కు దూరంగా ఉండటంతో వీరి ప్రభావం లేకుండాపోయింది. కేటీఆర్ రోడ్ షోతో ఐదు డివిజన్లు తమవేనని టీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తుండగా, అమిత్ షా రోడ్‌షో ద్వారా తమకు 3 డివిజన్లు దక్కడం ఖాయమన్న ధీమాను బీజేపీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నారు. బౌద్ధనగర్, మెట్టుగూడ, తార్నాక, అడ్డగుట్ట డివిజన్ల నుంచి టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు అందరూ కొత్తవారిని రంగంలోకి దింపాయి. కుత్బుల్లాపూర్, గాజులరామారం జంట సర్కిళ్ల పరిధిలో.. కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్, గాజులరామారం జంట సర్కిళ్ల పరిధిలో మొత్తం ఎనిమిది డివిజన్లు ఉండగా ప్రధాన పారీ్టల మధ్య పోటీ తీవ్రతరంగా ఉంది. కొన్నిచోట్ల ద్విముఖ పోటీ నెలకొనగా, మరికొన్ని డివిజన్లలో త్రిముఖ పోటీ నెలకొంది. ఒకటి, రెండు డివిజన్లలో ఏకపక్షంగా అభ్యర్థులు గెలిచే అవకాశముంది. గాజులరామారం డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి కూన శ్రీనివాస్‌గౌడ్, టీఆర్ఎస్ అభ్యర్థి రావుల శేషగిరి మధ్య గట్టి పోటీ ఉంది. జగద్గిరిగుట్ట డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి జగన్, బీజేపీ అభ్యర్థి మహేశ్ యాదవ్ మధ్య నువ్వా.. నేనా అన్నట్లుగా పోటీ నెలకొంది. చింతల్ డివిజన్లో బీజేపీ అభ్యర్థి కొట్టె రాధిక, టీఆర్ఎస్ అభ్యర్థి రషీదాబేగం మధ్య పోటీ నెలకొంది. సూరారం డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి సత్యనారాయణకు కాంగ్రెస్ అభ్యర్థి బట్ట పాలవెంకటేశ్ పోటీ ఇస్తున్నారు. సుభాష్‌నగర్ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి హేమలతకు అనుకూలంగా ఉంది. ఇక్కడ ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీల అభ్యర్థులు పోటీ ఇవ్వలేకపోతున్నారు. జీడిమెట్ల డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి పద్మాప్రతాప్, బీజేపీ అభ్యర్థి తారా చంద్రారెడ్డి మధ్య పోటీ ఉంది. కుత్బుల్లాపూర్ డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా గౌరీష్ పారిజాత, బీజేపీ అభ్యర్థి గడ్డం సాత్విక్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. రంగారెడ్డినగర్ డివిజన్లో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. అంబర్‌పేట నియోజకవర్గంలో అంబర్‌పేట: అంబర్‌పేట నియోజకవర్గంలో ఐదు డివిజన్లలో టీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ నెలకొంది. కాంగ్రెస్ మూడు డివిజన్లలో ఫలితాలను తారుమారు చేసే స్థాయిలో ప్రచారం చేస్తోంది. కాచిగూడ డివిజన్లో టీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ ఉంది. టీఆర్ఎస్ సిటింగ్ కార్పొరేటర్ రెబల్ అభ్యర్థిగా బరిలో ఉండటంతో బీజేపీ కాస్త అనుకూలంగా మారినా పోటీ తీవ్రంగానే ఉంది.నల్లకుంట డివిజన్లో టీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ ఉంది. కాంగ్రెస్ బలమైన పోటీ ఇవ్వనుంది. గోల్నాక డివిజన్లో టీఆర్ఎస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ. గెలుపు అవకాశం టీఆర్ఎస్కే ఉన్నా సైలెంట్ ఓటింగ్ జరిగితే బీజేపీకి అవకాశం ఉంది. అంబర్‌పేట డివిజన్లో త్రిముఖ పోటీ ఉంది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా పోరాడుతున్నాయి. బాగ్‌అంబర్‌పేట డివిజన్లో టీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ ఉంది. అభ్యర్థులు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. బీజేపీ అభ్యరి్థకి రెబల్ బెడద ఉంది. మెహిదీపట్నంలో.. గోల్కొండ: మెహిదీపట్నంలో కార్వాన్ నియోజకవర్గానికి చెందిన ఆరు డివిజన్లు ఉన్నాయి. గతంలో జియాగూడ డివిజన్ టీఆర్ఎస్ గెలవగా.. కార్వాన్, లంగర్‌హౌస్, టోలిచౌకి, గోల్కొండ, నానల్‌నగర్ డివిజన్లలో మజ్లిస్ అభ్యర్థులు గెలిచారు. ప్రస్తుతం లంగర్‌హౌస్‌లో బీజేపీ, మజ్లిస్మధ్య పోటీ ఉంది. టోలిచౌకి, గోల్కొండ, నానల్నగర్లలో మజ్లిస్ పార్టీ అభ్యర్థులు ముందున్నారు. ఉప్పల్ నియోజకవర్గంలో.. ఉప్పల్: ఉప్పల్ నియోజకవర్గంలో పది డివిజన్లు ఉన్నాయి. కాప్రా డివిజన్లో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లు విజయం కోసం కష్టపడుతున్నా.. అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ అధికంగా ఉంది. ఎవరికి రెండో స్థానమో సందిగ్ధం నెలకొంది. ఏఎస్‌రావునగర్ డివిజన్లో టీఆర్ఎస్కు కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఉంది. చర్లపల్లి డివిజన్లో గతంలో గెలిచి మేయర్ అయిన బొంతు రామ్మోహన్ భార్య ప్రస్తుతం టీఆర్ఎస్ నుంచి పోటీలో ఉన్నారు. రూ.200 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేశారు. మీర్‌పేట–హెచ్‌బీకాలనీ డివిజన్లో టీఆర్ఎస్, బీజేపీల మధ్యే పోటీ ఉంది. మల్లాపూర్ డివిజన్లోటీఆర్ఎస్ అభ్యర్థి దేవేందర్‌రెడ్డికి వ్యతిరేకత ఉన్నప్పటికీ టీఆర్ఎస్కు అనుకూలం. నాచారం డివిజన్లో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. చిలుకానగర్ డివిజన్లో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నువ్వా.. నేనా? అనే అన్నట్లుగా పోటీ ఉంది. హబ్సిగూడ డివిజన్లో టీఆర్ఎస్, బీజేపీ మధ్య బిగ్ ఫైట్ నడుస్తోంది. రామంతాపూర్ డివిజన్లో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఉప్పల్ డివిజన్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ ఉంది. ముషీరాబాద్ నియోజకవర్గంలో.. ముషీరాబాద్: ముషీరాబాద్ నియోజకవర్గంలో ఆరు డివిజన్లు ఉన్నాయి. ఐదు డివిజన్లలో టీఆర్ఎస్, బీజేపీల మధ్య తీవ్ర పోటీ నెలకొనగా.. భోలక్‌పూర్ డివిజన్లో మాత్రం ఎంఐఎం, టీఆర్ఎస్, బీజేపీల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. నియోజకవర్గంలో ముస్లిం, క్రిస్టియన్ మైనారీ్టలు అధికంగా ఉన్నారు. వీరు టీఆర్ఎస్ వైపు మొగ్గుచూపే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. బీజేపీ అభ్యర్థులు కూడా సరైనవారికి ఇవ్వకపోవడంతో బీజేపీకి చెందిన పలువురు సీనియర్ నేతలు టీఆర్ఎస్లో చేరడం ఆ పారీ్టకి మరింత బలాన్ని చేకూర్చింది. నియోజకవర్గంలోని ఐదు డివిజన్లలో సిట్టింగులకే మళ్లీ టికెట్ కేటాయించడంతో వారిమీద ప్రజల్లో ఉన్న వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది. కొంతమంది టికెట్ ఆశించిన నేతలు అభ్యర్థుల విజయం కోసం పనిచేయడంలేదు. కాంగ్రెస్ నామమాత్రపు అభ్యర్థులకు టికెట్లను కేటాయించి ప్రచారంలో వెనుకపడటంతో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ టీఆర్ఎస్కా.. బీజేపీకా..? వేచి చూడాల్సిందే.. రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో రాజేంద్రనగర్: రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో ఐదు డివిజన్లు ఉన్నాయి. శాస్త్రీపురం, సులేమాన్‌నగర్ డివిజన్లలో మజ్లిస్ ప్రాతినిధ్యం వహిస్తోంది. సులేమాన్‌నగర్, శాస్త్రీపురంలో మజ్లిస్‌కు అనుకూలంగా ఉంది. అత్తాపూర్, రాజేంద్రనగర్, మైలార్‌దేవ్‌పల్లి మూడు డివిజన్లలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య నువ్వా నేనా అనేలా పోటీ ఉంది. మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ సిట్టింగ్ కార్పొరేటర్ బీజేపీలో చేరి పోటీ చేస్తున్నాడు. టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యే ప్రకా‹Ùగౌడ్ సోదరుడు ప్రేమ్‌దాస్‌గౌడ్ పోటీలో నిలిచారు. రాజేంద్రనగర్‌లో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ ఉంది. అత్తాపూర్ డివిజన్లో టీఆర్ఎస్, బీజేపీతో గట్టిపోటీ ఉంది. ఎల్బీనగర్ నియోజకవర్గంలో.. ఎల్బీనగర్: ఎల్బీనగర్ నియోజకవర్గంలో 11 డివిజన్లలో పోటీ తీవ్రంగా ఉంది. అన్ని డివిజన్లలో టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు నువ్వా నేనా..? అనే రీతిలో ప్రచారంతో పాటు ఓటర్లను ఆకట్టుకునే పనిలో ఉన్నారు. చైతన్యపురి, నాగోల్,మన్సూరాబాద్, వనస్థలిపురం, హయత్‌నగర్, బీఎన్‌రెడ్డి, చంపాపేట్, కొత్తపేట డివిజన్లలో టీఆర్ఎస్, బీజేపీల మధ్య పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. హస్తినాపురంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ ఉంది. లింగోజిగూడలో మూడు పారీ్టల మధ్య పోటీ ఉంది. గడ్డిఅన్నారంలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య పోటీ ఉంది. హస్తినాపురం, చంపాపేట, కొత్తపేట, నాగోల్, హయత్‌నగర్, మన్సూరాబాద్ డివిజన్లలో బస్తీలకు చెందిన ఓటర్లు కీలకం కాగా, వనస్థలిపురం, బీఎన్‌రెడ్డి, గడ్డిఅన్నారం, చైతన్యపురి డివిజన్లలో ఉద్యోగులు, ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఓటర్లు కీలకం కానున్నారు. 11 డివిజన్లలో టీఆర్ఎస్ సిట్టింగ్కార్పొరేటర్లే అభ్యర్థులుగా ఉన్నారు. గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో సఫలం కాకపోవడంతో ప్రత్యర్థులకు కలిసి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జూబ్లీహిల్స్: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 6 డివిజన్లు ఉన్నాయి. యూసుఫ్‌గూడ టీఆర్ఎస్, బీజేపీల మధ్య పోటీ నెలకొంది. సిట్టింగ్ సంజయ్గౌడ్కు టికెట్ ఇవ్వకుండా రాజ్కుమార్పటేల్కు టికెట్ ఇవ్వడంతో సంజయ్‌గౌడ్ వర్గం చాపకిందనీరులా వ్యతిరేకంగా పనిచేస్తోంది. బీజేపీ అభ్యర్థి కుంభాల గంగరాజు పుంజుకున్నాడు. అవకాశాలు చెరి సగం ఉన్నాయి. వెంగళరావునగర్ సిట్టింగ్ కిలారి మనోహర్‌కు టికెట్ నిరాకరించడంతో బీజేపీ నుంచి బరిలో దిగారు. కమ్మ కులం మద్దతు ఉంది. టీఆర్ఎస్ అభ్యర్థి దేదిప్య రాజకీయాలకు కొత్త కావడం కొంత ఇబ్బందికరంగా మారింది. ఎర్రగడ్డలో ఎంఐఎం సిట్టింగ్ షాహిన్‌బేగం ఉన్నారు. ముస్లింల మెజార్టీ ఉండటంతో ఎంఐఎంకు అనుకూలంగా ఉండే అవకాశం. రహమత్‌నగర్‌లో టీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్యే ప్రధాన పోటీ ఉంది. ఇద్దరికీ సమాన అవకాశాలు ఉన్నాయి. బోరబండ టీఆర్ఎస్ సిట్టింగ్ బాబా ఫసియుద్దీన్ పట్ల వ్యతిరేకత ఇబ్బందిగా ఉంది. సైట్ 3లో పట్టుకోల్పోతున్నట్లు కనిపిస్తోంది. బీజేపీ నుంచి తీవ్ర పోటీ ఉంది. పాతబస్తీలో మజ్లిస్ హవా చార్మినార్: మజ్లిస్ పార్టీకి కంచుకోటగా నిలిచిన పాతబస్తీలోని నాలుగు నియోజకవర్గాల్లో మజ్లిస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటనున్నారు. చారి్మనార్, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా, బహదూర్‌పురా తదితర నాలుగు నియోజకవర్గాల పరిధిలోని 24 డివిజన్లలో మజ్లిస్ పార్టీ అభ్యర్థులు మొదటి స్థానంలో ఉండగా.. పోటీనిచ్చే స్థానంలో బీజేపీ, టీఆర్ఎస్ అభ్యర్థులున్నారు. మల్కాజిగిరిలో.. మల్కాజిగిరి డివిజన్లో టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ ఉంది. టీఆర్ఎస్ నుంచి అభ్యర్థి జగదీష్‌గౌడ్ రెండవసారి పోటీ చేస్తుండగా.. బీజేపీ అభ్యర్థి వూరపల్లి శ్రవణ్ మొదటిసారి పోటీలో ఉన్నారు. బ్రాహ్మణ సామాజికవర్గం ఓట్లు అధికంగా ఉన్నాయి. ఈస్ట్ ఆనంద్‌బాగ్ డివిజన్లో త్రిముఖ పోటీ ఉండే అవకాశముంది. మాజీ కార్పొరేటర్ ప్రేమ్‌కుమార్ మరోమారు పోటీ చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థి బక్కా నాగరాజు డివిజన్ పరిధిలోని నాయకుడు కానప్పటికీ స్వచ్ఛ భారత్ కనీ్వనర్‌గా గుర్తింపు ఉంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉమేష్‌సింగ్ సీనియర్ లీడర్, స్థానికంగా గుర్తింపు ఉండటం ఆయనకు కలిసివచ్చింది. ఇక్కడ పోటీ నువ్వా.. నేనా? అన్నట్లు ఉంది. -
సారు, కారు.. పదహారు అన్నది ఎవరు?
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో కూర్చొని పాతబస్తీ మిత్రునికి సలాం కొడుతున్నారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా ధ్వజమెత్తారు. ‘మీకు బీజేపీ మేయర్ కావాలా..? ఎంఐఎం మేయర్ కావాలా..?. కాంగ్రెస్‌కు ఓటువేస్తే టీఆర్ఎస్కి వేసినట్లే.. టీఆర్ఎస్కి వేస్తే ఎంఐఎంకు పోతాది’ అంటూ జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సంబిత్ పాత్ర శనివారం నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. (బండి సంజయ్, అక్బరుద్దీన్‌పై కేసు నమోదు) కుటుంబ పాలన సాగుతోంది.. 'భాగ్యనగరానికి రావడం నా అదృష్టం. భాగ్యనగరం ఒక కుటుంబానికే పరిమితమయ్యింది. ఇది నిజంగా దౌర్భాగ్యం. భాగ్యనగర్ అన్నందుకు రెండు రోజుల క్రితం యువరాజు కేటీఆర్ చాలా బాధపడ్డాడు. బాధ దేనికి హైదరాబాద్ పేరును భాగ్యనగర్‌గా మార్చొద్దా..?. ఇక్కడ కుటుంబ పాలన సాగుతోంది. ఫ్యామిలీ ఫ్రెండ్ పాలన ఇది. దుబ్బాకలో కేసీఆర్ నివాసం ఉంది. అక్కడ బీజేపీ గెలిచింది. సర్కార్ కాదు. కార్కి పంక్చర్.. సర్ ఫామ్ హౌస్‌కి పరిమితం. ఏనాడు భారత్ అనని ఒవైసీని గెలిపిస్తే హిందూస్తాన్‌ను మార్చేస్తారు. సెప్టెంబర్ 17ను అధికారికంగా ఎందుకు నిర్వహించరు..?. భాగ్యలక్ష్మి గుడికి తాళాలు వేశారు. అంటే పాతబస్తీ వేరే దేశంలో ఉందా.. వీసా తీసుకొని రావాలా..?. పాతబస్తీలోకి రావాలంటే ఎంఐఎం అనుమతి కావాలా..?. అలాంటి వాళ్లకు బుద్ది చెప్పాలి. అందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లన్నారు. పట్టుమని ఇప్పటిదాకా 1,500 మందికి రాలేదు. ఇలా అయితే 50 ఏళ్లకు అయినా ఇళ్లు రావు. ప్రగతి భవన్లో అపరిమితంగా బెడ్రూమ్లు. సాధారణ జనాలకు మాత్రం ఇళ్లు లేవు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దేశవ్యాప్తంగా ఇళ్లు నిర్మించి ఇస్తున్నాం. ఇక్కడ మాత్రం కేసీఆర్ ఇవ్వడం లేదు. కనీసం ఇటుక ఇవ్వలేదు. ఫొటోల కోసమే కేటీఆర్ వరదల్లో ఫోజులిచ్చారు. గ్లోబల్ హైదరాబాద్‌ను వరదల్లో ముంచారు. మీ కబ్జాల వల్ల 80 మంది మరణించారు. వరద సాయం పెద్ద స్కామ్. అందరూ ఎన్నికల్లో ఓటువేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించండి' అని జీహెచ్ఎంసీ ఓటర్లను సంబిత్ పాత్రా కోరారు. (బీజేపీలో చేరిన విక్రం గౌడ్) -
హోరెత్తుతున్న హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంతో నగరం హోరెత్తిపోతోంది. రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో బల్దియా ఎన్నికల వేడి పతాకస్థాయికి చేరింది. ప్రధాన పార్టీలు సర్వశక్తులూ కేంద్రీకరించి గ్రేటర్ బరిలో శ్రమిస్తున్నాయి. గతానికి భిన్నంగా గ్రేటర్ ఫైట్ సాగుతోంది. గత ఎన్నికల్లో ప్రధాన పోటీ టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం మధ్యే ఉండగా ఈసారి ఆ పరిస్థితి మారిపోయింది. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ప్రధాన ప్రత్యర్థి బీజేపీ నిలిచింది. పరస్పర విమర్శలు, మాటల తూటాలతో ప్రధాన రాజకీయ పార్టీలు సై అంటే సై అంటున్నాయి. ప్రజాకర్షక హామీలతో ఓట్లను పొందేందుకు, గ్రేటర్ పీఠాన్ని దక్కించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ మళ్లీ గ్రేటర్ పీఠాన్ని తామే దక్కించుకునేలా పావులు కదుపుతుంటే, దుబ్బాక ఇచ్చిన తీర్పుతో గ్రేటర్‌లోనూ తమ సత్తా చాటాలని బీజేపీ ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ కొన్ని స్థానాల్లో గట్టిపోటీ ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఎంఐఎం పాతబస్తీ వరకు పదిలంగానే ఉందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. 3, 4 డివిజన్లలో స్వతంత్రులు, ఇతర పార్టీల అభ్యర్థులు పోటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా అన్ని పార్టీల ప్రచార కార్యక్రమాలతో జీహెచ్ఎంసీ ప్రాంతాలు హోరెత్తిపోతున్నాయి. అన్నీ తానై... కేటీఆర్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.తారకరామారావు అన్నీ తానై గ్రేటర్లో టీఆర్ఎస్ను మళ్లీ గెలిపించేందుకు విస్తృత ప్రచారం చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఒంటిచేత్తో గ్రేటర్లో టీఆర్ఎస్ను గెలిపించిన కేటీఆర్ ఈసారి కూడా తానే బాధ్యతను చేపట్టారు. గత ఎన్నికల్లో కేటీఆర్ నేతృత్వంలో 150 స్థానాల్లో పోటీచేసిన టీఆర్ఎస్ 99 స్థానాలను గెలుచుకుంది. ఇక ఈసారి 100 స్థానాల్లో గెలుస్తామని టీఆర్ఎస్ చెబుతోంది. 20కి పైగా డివిజన్లు మినహా మిగతా చోట్ల పాతవారినే పోటీలో నిలిపింది. కొందరు సిట్టింగ్ కార్పొరేటర్లపై స్థాని కంగా వ్యతిరేకత ఉన్నా, వారిని గెలిపించుకునే బాధ్యతను మంత్రులకు అప్పగించింది. బీఫారాలు పొందిన కొంతమందిపై కూడా వ్యతిరేకత కనిపిస్తోందన్న చర్చ జరుగుతోంది. అయితే గ్రేటర్లో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, చేపట్టిన సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని గులాబీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కేటీఆర్ రోడ్‌షోలకు అనూహ్య స్పందన లభిస్తోంది. బీజేపీ కాంగ్రెస్ పార్టీ నేతల విమర్శలకు కేటీఆర్ ధీటుగా సమాధానం ఇస్తున్నారు. దుబ్బాక విజయంతో నయాజోష్ దుబ్బాకలో తాము గెలిచిన వెంటనే గ్రేటర్ ఎన్నికలు రావడం తమకు మంచి అవకాశమని బీజేపీ భావిస్తోంది. దుబ్బాకలో ప్రదర్శించిన దూకుడును జీహెచ్ఎంసీలోనూ కొనసాగిస్తోంది. గత ఎన్నికల్లో 55 స్థానాల్లో పోటీ చేసినా 4 స్థానాలకే పరిమితమైన బీజేపీ ఈసారి అధికారం లోకి వస్తామని చెబుతోంది. అయితే, 30కి పైచిలుకు స్థానాలను గెలుచుకుంటామని ఆ పార్టీలో అంతర్గత చర్చ లో ప్రస్తావన వచ్చినట్లు తెలిసింది. నాలుగు స్థానాలే ఉన్న తాము ఇపుడు 30 గెలిచినా, 40 గెలిచినా.. అది టీఆర్ఎస్ను దెబ్బకొట్టినట్లే అవుతుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. పైగా 2023లో రాష్ట్రంలో అధికారంలోకి రావాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్న బీజేపీ అందుకు ఈ ఎన్నికలే పునాదిగా పరిగణిస్తోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్‌లోని అసంతృప్తులను అక్కున చేర్చుకుంటూ బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. అమిత్‌షా, జేపీ నడ్డా, యోగి ఆదిత్యనాథ్, ప్రకాష్ జవదేకర్, స్మృతి ఇరానీ వంటి బిగ్ షాట్స్‌ను ప్రచారం లో ఉపయోగిస్తోంది. మరోవైపు బండి సంజయ్, అరవింద్ వంటి నేతల వ్యాఖ్యలు హిందూ ఓటర్లను ఆకర్షిస్తు న్నాయన్న అంచనాలో పార్టీ ఉంది. ఎంఐఎం స్థానాలు పదిలమే! గత ఎన్నికల్లో 60 స్థానాల్లో పోటీచేసి 44 స్థానాలను గెలుచుకున్న ఎంఐఎంకు ఈ ఎన్నికల్లో తమ సిట్టింగ్ స్థానాలను నిలబెట్టుకుంటామనే ధీమాతో ఉంది. ఓల్డ్‌సిటీపై తమకున్న పట్టును సడలనివ్వకూడదని శ్రమిస్తోంది. బీజేపీకి కొంత అనుకూలత ఏర్పడినా అది ఎంఐఎం గెలుపోటములపై ప్రభావం చూపబోదని ఆ పార్టీ వర్గాల అంచనా. అయితే పాతబస్తీలో ఏం జరుగుతుందన్నది మాత్రం రాజకీయవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. గ్రేటర్లో వామపక్షాలు 20 –25 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ప్రధాన పార్టీల నుంచి సీట్లు ఆశించిన భంగపడిన వారు, స్వతంత్రులు బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో 95 డివిజన్లలో పోటీ చేసిన టీడీపీ ఒక్క స్థానమే గెలిచింది. ఈసారి ఎన్ని గెలుస్తుందో చూడాలి. సగం స్థానాల్లో గట్టిపోటీ కాంగ్రెస్ పార్టీ గతంలోలాగే 150 డివిజన్లలో పోటీ చేస్తోంది. 2016లో రెండే డివిజన్లలో గెలిచిన కాంగ్రెస్ ఇపుడు సగానికి పైగా స్థానాల్లో గట్టిపోటీ ఇస్తామని చెబుతోంది. అయితే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంపీ రేవంత్‌రెడ్డి ప్రచారం చేస్తున్నా ఓటర్లను ఆకట్టుకునే స్టార్ క్యాంపెయినర్ల కొరత కనిపిస్తోంది. ఓటర్లను ఆకట్టుకునేలా మేనిఫెస్టోను ప్రకటించారు. ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ కూడా మేనిఫెస్టో బాగుందని, అదే తమ హీరో అని చెప్పారు. రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజిగిరి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పోటీ చేసిన చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గాలపై కాంగ్రెస్ గంపెడాశలు పెట్టుకుంది. మల్కాజిగిరిలో 47, చేవెళ్లలో 18 డివిజన్లు ఉన్నాయి. రెండు చోట్ల కలిపి 10 నుంచి 15 స్థానాలు గెలుస్తామన్న ధీమాతో కాంగ్రెస్ ఉంది. ఉన్నత చదువులు, ఉద్యోగాలు ఈ ఎన్నికల్లో అగ్రతాంబూలం మహిళలకే దక్కింది. గ్రేటర్ మేయర్ పీఠం మహిళకు రిజర్వు చేయడం, సగం డివిజన్లు మహిళలకే కేటాయించడంతో ఈ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఉన్నత చదువులు, ఉద్యోగాలు వదిలి పోటీలో నిలిచారు. ముఖ్యంగా 25 ఏళ్లలోపు మíహిళలు 20కి పైగా డివిజన్లలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పోటీలో నిలిచారు. వారిని ఓటర్లు ఎంతమేరకు ఆదరిస్తారు..ఆయా పార్టీలు వారిని గెలుపు తీరాలకు ఎలా చేర్చుతాయన్నది ఆసక్తిగా మారింది. -
'సీఎం భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు'
సాక్షి, హైదరాబాద్: హిందు ధర్మం కోసం మాట్లాడితే బీజేపీని మతతత్వ పార్టీ అంటున్నారు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. సీఎం కేసీఆర్ స్వార్ధం కోసం యాగాలు చేస్తున్నారు. గోమాతను వధించే పార్టీ ఎంఐఎం. తెలంగాణను వ్యతిరేకంచిన పార్టీ ఎంఐఎం. అలాంటి పార్టీతో కేసీఆర్ చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారు. హిందువులు వారానికి ఒక్క పండుగ చేసుకుంటే ఎంఐఎం నేతలకు ఇబ్బంది ఎందుకు అంటూ ప్రశ్నించారు. ఈ మేరకు బండి సంజయ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ ఎన్నికలు దేశద్రోహులకు, దేశ భక్తులకు జరిగేవి. ఎంఐఎంను, టీఆర్ఎస్ను ప్రజలు ఓడించాలి. హైదరాబాద్‌లో కేసీఆర్ ఎలాంటి అభివృద్ధి చేయలేదు. కేంద్ర నిధులు లేనిది ఏ అభివృద్ధి లేదు. కేంద్రం 2 లక్షల ఇళ్లు కేటాయిస్తే ఒక్క ఇల్లు కూడా కేసీఆర్ కట్టించలేదు. వరదలతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే కేసీఆర్ కనీసం బయటకు రాలేదు. కోవిడ్‌కు ఉచిత వైద్యం అందిస్తాం. ఉచితంగా కోవిడ్ టెస్టులు చేస్తాం. చదవండి: (మజ్లిస్ రూటే సపరేటు..!) లక్ష ఉద్యోగాలు ఇస్తానని కేసీఆర్ కుటుంబానికి ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. ఓటును ఆయుధంగా ఉపయోగించుకొని టీఆర్ఎస్, ఎంఐఎంకు బుద్ది చెప్పాలి. సీఎం రాసిన స్క్రిప్ట్‌ను డీజీపీ చదువుతున్నారు. విధ్వంసాలు జరుగుతాయి అనే సమాచారం ఉందని చెప్పిన సీఎం, డీజీపీ వారిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు. సీఎం భయానక వాతావరణాన్ని సృష్టించాలని చూస్తున్నారు. ఓటర్లను బయటకు రాకుండా చూడాలని అనుకుంటున్నారు. సీఎం విద్వేషాలను రెచ్చగొట్టాలనే కుట్ర చేస్తున్నారు అంటూ బండి సంజయ్ సీఎం కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మజ్లిస్ రూటే సపరేటు..!
సాక్షి, సిటీబ్యూరో : హైదరాబాద్ పాతబస్తీ రాజకీయలను శాసిస్తున్న మజ్లిస్ పార్టీ తీరే వేరు. జాతీయ స్థాయిలో విస్తరిస్తున్నప్పటికీ ఎన్నికల మేనిఫెస్టో మాత్రం ప్రకటించని ఏకైక రాజకీయ పార్టీ మజ్లిస్. ఆ పార్టీ వ్యూహాలు.. ప్రతి వ్యూహాలు రాజకీయ ఉద్దండులకే అంతుచిక్కదు. అధినేతదే కీలక నిర్ణయం. బుజ్జగింపులు, సర్దుబాట్లు ఉండవు. ఎన్నికల మేనిఫెస్టో ఒక మోసం... ప్రజల్ని మోసం చేసే డాక్యుమెంట్ అని పార్టీ అభివర్ణిస్తోంది. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు కూడా ఎప్పటి మాదిరిగా ఈ సారి కూడా మజ్లిస్‌పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయలేదు. వాస్తవంగా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వదు. నిరంతర పనితీరునే గుర్తింపుగా భావిస్తూ అదే అనే నినాదంలో ముందుకు సాగుతోంది. అభ్యర్థుల ఎంపిక విషయంలో సైతం ఆచితూచి వ్యవహరిస్తోంది. పాదయాత్రో ఇంటింటి ప్రచారానికి పెద్ద పీట వెస్తోంది. ఉదయం, సాయంత్రంం పాదయాత్రలు రాత్రిళ్లు బహిరంగ సభలతో హోరెత్తిస్తోంది. సాక్షాత్తు పార్టీ అధినేత అసదద్దీన్ , మరో నేత అక్బరుద్దీన్ ప్రసంగాలు పార్టీ శ్రేణులో ఉత్తే్తజాన్నినింపుతోంది. (చదవండి: ఎన్నికలు: అంతా ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ) పని తీరుపై ధీమా పార్టీ నిరంతర పనితీరుపైనే ధీమా వ్యక్తమవుతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎలాంటి హామీలు, వాగ్దానాలు లేకుండా పార్టీ పనితీరు అభ్యర్ధులకు విజయం చేకూర్చుతాయని భావిస్తోంది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో షహెర్ హమారా.. మేయర్ హమారా అనే నినాదంతో ఎన్నికల బరిలో దిగిన మజ్లిస్ అంతకు ముందు 2009లోఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ యాక్షన్ ప్లాన్ పేరిట డాక్యుమెంట్‌ను విడుదల చేసింది. 2002 లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో దివంగత నేత సలావుద్దీన్ హైదరాబాద్ యాక్షన్ ప్లాన్ పేరిటడాక్యుమెంట్‌ను విడుదల చేశారు. కొన్ని స్థానాలకే పరిమితం ఈ ఎన్నికల్లో మజ్లిస్ పరిమితమైన స్ధానాలకు మాత్రమే పోటీ చేస్తోంది. ఈ సారి 51 డివిజన్లకు మాత్రమే అభ్యర్థులను బరిలో దింపింది. గత ఎన్నికలోల 60 డివిజన్లకు పోటీ చేసి 44 స్థానాలను దక్కించుకుంది. అందులో సమారు 16 మంది సిట్టింగ్‌లకు పోటీకి ఛాన్స్ ఇవ్వలేదు. అయినప్పటికి ఎలాంటి అసంతృప్తి, అలకలు లేకుండా జాగ్రత్త పడింది 2016లో సైతం సిట్టింగ్‌లకు పోటీ చేసే చాన్స్ అంతంత మాత్రమే లభించింది. అంతకు మందు కాంగ్రెస్ దోస్తీలో మేజార్టీ లేకున్నా మూడేళ్ల పాటు పరిపాలన సాగించింది. 2002లో పాలక పగ్గాలు చేపట్టకున్నా.. స్టాండింగ్ కమిటీ ద్వారా పాలనను కంట్రోల్ చేసింది. 1986లో 38 స్థానాల్లో విజయం సాధించి.. మెజార్టీ లేకున్నా ఐదేళ్లపాటు అధికార పగ్గాలు చేపట్టింది. -
‘గస్తీ కాసేవాళ్లకు ఓటు వేయండి’
సాక్షి, హైదరాబాద్: దుబ్బాకలో విఫలమైన కాంగ్రెస్ పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో దూకుడుగా వ్యవహరిస్తోంది. అగ్ర నాయకులందరూ ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి అల్వాల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన.. వెంకటాపురం డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి సంజీవ్ కుమార్‌ను గెలిపించాల్సిందిగా జనాలను అభ్యర్థించారు. బస్తీలకు గస్తీ కాసే వాళ్ళకి ఓటు వేయండని కోరారు. టీఆర్ఎస్ నాయకులు వ్యక్తిగత వ్యవహారాలు తప్ప ప్రజలకు చేసిందేమీ లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మతతత్వ రాజకీయాలు చేస్తూ బీజేపీ, ఎంఐఎం పార్టీలు ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. కరోనా, వరదల సమయంలో పేదలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం అయ్యిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌లో ఓటు అడిగే హక్కు కేవలం కాంగ్రెస్‌కు మాత్రమే ఉందని స్పష్టం చేశారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాల్సిన సమయం ఇది అన్నారు. మల్కాజిగిరి పార్లమెంట్ ప్రజల కోసం పోరాడుతున్నా.. చదువుకున్న వ్యక్తులకు ఓటువేయలని రేవంత్ రెడ్డి ప్రజలను కోరారు. -
అక్బరుద్దీన్‌ని పిచ్చోడితో పోల్చిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో నాయకులు దూసుకుపోతున్నారు. ఢీ అంటే ఢీ అంటూ పరస్పరం సవాళ్లు విసురుకుంటున్నారు. కేటీఆర్ తనదైన శైలీలో ప్రతిపక్షాలకు కౌంటర్లు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ మాట్లాడుతూ.. మోదీ ఇచ్చిన హామీ ప్రకారం 15 లక్షల రూపాయలు వచ్చిన వారు బీజేపీకి ఓటు వేయండి.. రాని వారు మాకు ఓటు వేయండి అన్నారు. మార్కెట్లో కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి ఉందా అని ప్రశ్నించారు. అర్హులందరికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇచ్చే బాధ్యత తమదే అన్నారు. ఢిల్లీ నుంచి వచ్చే టూరిస్ట్‌లు ఏమి ఇవ్వరని తెలిపారు. ఒక పిచ్చోడు ఎన్టీఆర్, పీవీ సమాధులు కులగొట్టాలని అంటాడు.. ఇంకో పిచ్చోడు చాలన్లు కడుతా అంటాడు అంటూ పరోక్షంగా ఎంఐఎం, బీజేపీ నేతలకు చురకలంటించారు కేటీఆర్. (చదవండి: టీఆర్ఎస్కు షాక్.. కమలం గూటికి స్వామిగౌడ్) వరద లాగా ఢిల్లీ నుంచి దిగుతున్న కేంద్ర మంత్రులందరికీ హైదరాబాదుకు స్వాగతం అంటూ ఎద్దేవా చేశారు కేటీఆర్. ఈ రాక ఏదో, నగరం అకాల వర్షాలు, వరదలతో తల్లడిల్లుతున్నప్పుడు సాంత్వన చేకూర్చడానికి వస్తే బాగుండేది అన్నారు. ఢిల్లీ నుంచి వచ్చే వారు ఉత్త చేతులతో రాకుండా, సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేసిన విధంగా నగర ప్రజలకు వరద సాయంగా 1350 కోట్ల రూపాయలు తీసుకువస్తున్నారని ఆశిస్తున్నాను అన్నారు కేటీఆర్. -
టీఆర్ఎస్కు ప్రజా మద్దతు లేదు: స్మృతి ఇరానీ
సాక్షి, హైదరాబాద్: 'సబ్కా సాథ్.. సబ్ కా వికాస్' భారతీయ జనతా పార్టీ విధానమని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె బుధవారం హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా స్మృతి ఇరానీ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో టీఆర్ఎస్, ఎంఐఎంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 'తెలంగాణ కోసం చాలా మంది ప్రాణాలర్పించారు. వాళ్ల కుటుంబాల గుండెలు పగిలాయి. అవినీతి, అవకాశవాద పొత్తు వల్ల హైదరాబాద్ వరదలతో మునిగింది. వరదల్లో 80 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు ఫైనల్ మెమోరాండం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇవ్వలేదు. దుబ్బాక ఉపఎన్నికతో తెలంగాణ ప్రజల సపోర్ట్ అధికార పార్టీకి లేదని తెలిసిపోయింది. (సర్జికల్ స్ట్రైక్ అంటే కంగారెందుకు: విజయశాంతి) రాజకీయ లబ్ధికోసమే వారికి ఓటు అక్రమ చొరబాటుదారలుకు, రోహింగ్యాలకు హైదరాబాద్‌లో ఓటు హక్కు ఎలా కల్పించారు. రాజకీయ లబ్ధికోసమే రోహింగ్యాలకు ఓటు హక్కు కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విచారణ చేపట్టాలి. అక్రమ చొరబాటు దారుల విషయంలో పార్టీ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దేశ సంపద దేశ ప్రజలే అనుభవించాలి. ఎంఐఎం-టీఆర్ఎస్ కలిసి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాయి. పారదర్శక పాలన కోసం బీజేపీకి పట్టాం కట్టాలని కోరుతున్నాం. 920 కోట్ల రూపాయలు ప్రాజెక్టును తెలంగాణకు కేటాయించాం. టెక్నికల్ టెక్స్ టైల్స్ కోసం కేంద్రం 1,000 కోట్లు కేటాయించింది. చిల్డ్రన్ వాక్సినేషన్, ఉపాధి ఆవకాశాలు అందకుండా చేస్తోంది. హైదరాబాద్ మహానగరంలో 75 వేల అక్రమ నిర్మాణాలు ఎలా జరిగాయి..?. (షాడో టీమ్స్.. ఎత్తుకు.. పై ఎత్తులు!) టీఆర్ఎస్- ఎంఐఎం డ్రామాలాడుతున్నాయి.. తెలంగాణలో టీఆర్ఎస్, ఎంఐఎంలు కలిసి సాగుతున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజల మద్దతు లేదు. తెలంగాణలో కుటుంబ పాలనపై బీజేపీ చార్జిషీట్ విడుదల చేస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించలేదు. ఎంఐఎం నేతలపై ఆరోపణలు వచ్చినప్పుడు టీఆర్ఎస్ ఎందుకు విచారణకు అదేశించదు. పాతబస్తీ ఎందుకు అభివృద్ధి కావడం లేదు.. ప్రభుత్వ పథకాలు అన్ని ఎందుకు పాతబస్తీకి చేరడం లేదు. లా అండ్ ఆర్డర్ అనేది రాష్ట్ర పరిధిలో ఉంటది. ఎంఐఎం ఎమ్మెల్యే లేఖలు ఉన్నా ప్రభుత్వం విచారణ చేయడం లేదు. టీఆర్ఎస్- ఎంఐఎం తెలంగాణ రాష్ట్రంలో మిత్ర పార్టీలు. రెండు పార్టీలు కలిసి రాజకీయ డ్రామా అడుతున్నాయి' అంటూ స్మతి ఇరానీ వ్యాఖ్యానించారు. -
కోట్లాది రూపాయల అవినీతి జరిగింది: స్మృతి ఇరానీ
-
సర్జికల్ స్ట్రైక్ అంటే కంగారెందుకు: విజయశాంతి
సాక్షి, హైదరాబాద్: సర్జికల్ స్ట్రైక్ అంటే టీఆర్ఎస్, ఎంఐఎంకు కంగారెందుకని మాజీ ఎంపీ విజయశాంతి మండిపడ్డారు. గ్రెటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కుమర్ మంగళవారం మాట్లాడుతూ.. తాము గెలిస్తే పాతబస్తీలోని పాకిస్తానీలు, బంగ్లాదేశీయులు, రోహింగ్యాలపై సర్జికల్ స్ట్రైక్ చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా సంజయ్ వ్యాఖ్యలపై విజయశాంతి ట్విటర్ వేదికగా స్పందించారు. చదవండి: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. రాములమ్మ గుడ్ బై సర్జికల్ స్ట్రైక్ అంటే టీఆర్ఎస్, ఎంఐఎంకు కంగారెందుకని, రోహింగ్యాలు, పాకిస్తానీల గురించి టీఆర్ఎస్, ఎంఐఎంకు భయమెందుకని సూటిగా ప్రశ్నించారు. దానికి బదులు టీఆర్ఎస్ ప్రభుత్వం బ్రహ్మాండంగా హైదరాబాద్‌లో ఇంటింటి సర్వే చేసిందని చెప్పొచ్చు కదా అని ఎద్దేవా చేశారు. పాతబస్తీలో అలాంటి వారు లేరని కేంద్రానికి నివేదిక ఇవ్వొచ్చు కదా అని ఆమె ట్విటర్ వేదికగా మండిపడ్డారు. ఇక సంజయ్ వ్యాఖ్యలను ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఖండించారు. బీజేపీకి దమ్ముంటే భారత్ సరిహద్దుల్లో తిష్టవేసిన చైనా సైన్యంపై సర్జికల్ స్ట్రైక్ చేయాలన్నారు. అదే విధంగా ఎంపీ సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. పచ్చని హైదరాబద్‌ను పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలతో పోలుస్తారా? ఓట్ల, సీట్ల కోసం బీజేపీ ఎంపీ పూర్తిగా మతితప్పి మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. -
‘అసదుద్దీన్‌కి ఆ బిర్యానీ తినిపించాలి’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికల వార్ జోరుగా నడుస్తోంది. పార్టీలన్ని ఒకదానిపై మరొకటి తీవ్ర ఆరోపణలు చేసుకుంటూ దూసుకెళ్తున్నాయి. దుబ్బాక విజయంతో మంచి ఊపు మీద ఉన్న బీజేపీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మరింత ఉత్సాహంగా దూసుకెళ్తుంది. అధికార టీఆర్ఎస్ పార్టీకి, ప్రతిపక్ష ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలకి స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా, బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర విమర్శలు చేశారు. ‘బీజేపీ వాళ్లు ఫ్రస్టేషన్లో ఉన్నారు.. వాళ్ళకు బిర్యానీ తినిపించాలి అని అసుదుద్దీన్ అంటున్నారు. ఎన్నికల సమయంలో హిందూ ముస్లిం సింపతి తీసుకుని రావాలని అసద్ చూస్తున్నారు. కానీ బీజేపీ ఎప్పుడూ ఆయనలాగ తప్పుడు ప్రచారం.. కామెంట్స్ చేయదు. వాల్మీకి కులాల వారు ‘పిగ్ బిర్యానీ’ బాగా చేస్తారు... అసదుద్దీన్.. నీకే మంచి బిర్యానీ తినిపిస్తా రా’ అంటూ రాజా సింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ( గ్రేటర్ వార్: సందిగ్ధతకు తెర దించిన ఒవైసీ..) అందుకే ప్రచారానికి దూరం: రాజాసింగ్ రాజా సింగ్ మాట్లాడుతూ.. ‘వరదల తరువాత ఒక్క ముస్లిం కూడా అసదుద్దీన్ ఓవైసీకి ఓటెయ్యరు. ఓల్డ్ సిటీలో అనేక బస్తిలు మునిగిపోయాయి.. ఇల్లుమునిగాయి.. పడిపోయాయి.. బైక్‌లు కొట్టుకు పోయాయి. నీవు కానీ నీ పార్టీ కాని వారికి సాయం చేయలేదు. ఓల్డ్ సిటీ ఓటర్లు నీ పార్టీని బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు. ముస్లిం ఏరియలో డెవలప్మెంట్.. న్యాయం కావాలంటే ఒకే ఒక్క ఆప్షన్.. బీజేపీ అధికారంలోకి రావడం మాత్రమే. వరదసాయం పూర్తిగా బాదితులకు చేరలేదు. అవి టీఆర్ఎస్.. ఎంఐఎం కార్యకర్తల జేబుల్లోకి వెళ్ళాయి. నా అల్లుడు చనిపోయినందుకు నేను ప్రచారంలో పాల్గొనడం లేదు’ అని తెలిపారు రాజా సింగ్. -
హిందుస్తాన్ అనను: ఎంఐఎం ఎమ్మెల్యే
పట్నా: ప్రమాణ స్వీకారం సందర్భంగా ఎంఐఎం ఎమ్మెల్యే ఒకరు ‘హిందుస్తాన్’ అననంటూ సంచలన వ్యాఖ్యలు చేసి వివాదాన్ని రేపారు. వివరాలు.. బిహార్ అసెంబ్లీకి కొత్తగా ఎన్నికైన ఎంఐఎం ఎమ్మెల్యే అక్తారుల్ ఇమాన్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన రాజ్యాంగాన్ని ఉటంకిస్తూ.. ‘దానిలో భారత్ అనే ఉంది కదా.. హిందుస్తాన్ అని ప్రమాణం చేయడం సరైందేనా అని తెలుసుకోవాలనుకుంటున్నాను’ అన్నారు. ‘రాజ్యంగా ప్రకారం ప్రమాణ స్వీకారం చేసే ప్రతిసారి భారత్ అనే ఉపయోగిస్తాం. ఈ క్రమంలో నేను హిందుస్తాన్ అని ఉపయోగించడం సరైందేనా.. లేక భారత్ అనే ఉపయోగించాలా. ఎందుకంటే మేం ప్రజాప్రతినిధులం. రాజ్యాంగం మాకు అన్నింటి కంటే ఎక్కువ’ అన్నారు. రిపోర్టర్ల ప్రశ్నలకు సమాధానమిస్తూ.. ‘హిందుస్తాన్ అనే పదం పట్ల నేను ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. చేయను కూడా. రాజ్యాంగ ప్రవేశికను ఏ భాషలో చదివినా అందులో ఉండేది భారత్ అనే. దీని ప్రకారం రాజ్యాంగం పేరిట మన ప్రమాణం చేస్తున్నందున దానిలో ఉన్న దాన్ని ఉపయోగించడమే సరైన పని’ అన్నారు ఇమాన్. (మమతతో దోస్తీకి ఒవైసీ రెడీ) హిందుస్తాన్ అనడం ఇష్టం లేకపోతే పాక్ వెళ్లండి: బీజేపీ ఇక ఇమాన్ వ్యాఖ్యల పట్ల బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ నాయకుడు ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ.. ‘హిందుస్తాన్ అని పలకాలంటే ఇబ్బంది పడేవారు పాకిస్తాన్ వెళ్లవచ్చు’ అన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇమాన్‌తో సహా మరో నలుగురు ఎంఐఎం నాయకులు విజయం సాధించారు. -
టీఆర్ఎస్పై ఎంఐఎం ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్ : ‘మేం తలుచుకుంటే గ్రేటర్ ఎన్నికల్లోనే కాదు.. రాబోయే రెండు నెలల్లో మొత్తమే గెంటేస్తాం.. మజ్లిస్ పార్టీ నిన్న కళ్లు తెరవలేదు.. మంత్రి కేటీఆర్ ఒక చిలుక.. నిన్న కళ్లు తెరిచాడేమో ఎక్కువ మాట్లాడుతున్నారు. రాజకీయాలు మాకు కొత్త కాదు. మాతో పెట్టుకుంటే కనుమరుగవుతారు. గతంలో ఎంతో మంది సమాధి అయ్యారు’ అంటూ చార్మినార్ ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై, కేటీఆర్‌పై విరుచుకుపడ్డారు. ఆదివారం చార్మినార్‌లో మాజీ కార్పొరేటర్ మహ్మద్ గౌస్‌తో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. తమకు సీట్లో కూర్చో బెట్టడం తెలుసు.. కింద పడేయడం తెలుసునని సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ ఎప్పుడూ చెబుతుండేవారన్నారు. తమతో కలిసి ఉంటే బావుంటుందని.. గతంలో తమతో ఇష్టమొచ్చినట్లు మాట్లాడిన వారి పరిస్థితి ఏమైందో అందరికి తెలుసన్నారు. ఏది పడితే అది అంటుంటే ఊరుకోబోమని హెచ్చరించారు. -
‘టీఆర్ఎస్, ఎంఐఎం మ్యాచ్ ఫిక్సింగ్’
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని ఎంఐఎం ఎమ్మెల్యే వ్యాఖ్యానించడం మ్యాచ్ ఫిక్సింగ్‌లో భాగమేనని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్పర్సన్, మాజీ ఎంపీ విజయశాంతి ఆరోపించారు. ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్న ఎంఐఎం పార్టీ ప్రభుత్వాన్ని ఎలా కూలదోస్తారని, మత కలహాలు సృష్టించి కూలదోస్తామని చెబుతున్నట్టా అని ఆదివారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. టీఆర్ఎస్, ఎంఐఎంలు ఎప్పటికీ కలిసే ఉంటాయని, జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత అవసరమైతే పొత్తు పెట్టుకుంటాయని ఆమె అభిప్రాయపడ్డారు. ఇక, బిహార్‌లో కాంగ్రెస్–ఆర్జేడీలాంటి బలమైన కూటమిని ఓడగొడితే దేశంలో కాంగ్రెస్ పార్టీ గెలవదనే అభిప్రాయం మైనార్టీల్లో కలిగించాలనే వ్యూహంతోనే టీఆర్ఎస్, ఎంఐఎంలు కలిసి పనిచేశాయని ఆరోపించారు. తద్వారా అనేక రాష్ట్రాల్లో పట్టు సాధించి పొత్తుల ద్వారా విస్తరించేందుకు అవసరమైన నిధులను కూడా ఎంఐఎంకు టీఆర్ఎస్ అందించిందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోందని వెల్లడించారు. -
‘రెండు నెలల్లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేయగలం’
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీపై చార్మినార్ ఎమ్మెల్యే, మజ్లీస్ పార్టీ సీనియర్ నేత ముంతాజ్ అహ్మద్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము తలుచుకుంటే రెండు నెలల్లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేయగలమని హెచ్చరించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మజ్లీస్ పార్టీ చాలా మందిని చూసిందని, తమ అధినేత చెప్పినట్టు రాజకీయం తమ ఇంటి గుమస్తాతో సమానం అన్నారు. కేటీఆర్ నిన్న మొన్న రాజకీయాల్లోకి వచ్చిన చిలుక అని ఎద్దేవా చేశారు. తమకు రాజకీయాల్లో ఒకరిని గద్దే మీద కూరోచబెట్టడం తెలుసు.. గద్దె దించడం తెలుసు అని పరోక్షంగా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. -
ఒంటరి పోరుకు సిద్ధమైన మజ్లిస్..
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమైంది. అధికార టీఆర్ఎస్ పార్టీతో దోస్తీ ఉన్నా బల్దియా ఎన్నికల్లో మాత్రం గతంలోలానే బరిలో దిగేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ప్రాతినిధ్యం కల్గిన డివిజన్లతోపాటు బలమైన స్థానాల్లో సైతం బరిలో దిగేందుకు అభ్యర్థులను ఖరారు చేసింది. – సాక్షి, సిటీబ్యూరో సాక్షి, హైదరాబాద్ : వాస్తవంగా గత ఎన్నికల్లో 60 స్థానాలకు పోటీ చేసి 44 డివిజన్లు దక్కించుకుంది. ఈ సారి అదనంగా మరో ఆరు స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తోంది. ఇప్పటికే మెజార్టీ సిట్టింగ్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా... కొన్ని సిట్టింగ్ స్థానాల్లో కొత్త వారికి మౌఖిక అదేశాలు జారి చేసింది. జై మీమ్–జై భీమ్ నినాదంతో కొత్త నగరంతో పాటు శివారు డివిజన్లలో సైతం పాగా వేసేందుకు అభ్యర్థుల ఖరారులో ఆచితూచి వ్యవహరిస్తోంది. చదవండి: ఈ ఎన్నికల్లో వారికే ఓటు వేద్దాం.. ఘర్‌వాపిసీ... ఎంఐఎం వీడిన పాత కాపులను తిరిగి పార్టీలో చేర్చుకునేందుకు అధిష్టానం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం నగరంలో బీజేపీ పాగా వేసేందుకు ప్రయత్నిస్తుండటంతో గట్టిగా ఎదుర్కొని ఆదిలోనే అడ్డుకునే ప్రయత్నాలకు సిద్ధమైంది. గతంలో పార్టీ వీడిన ముఖ్య నేతలతో సంప్రదింపులకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో గురువారం శాలిబండ మాజీ కార్పొరేటర్ మహ్మద్ గౌస్ తిరిగి మజ్లిస్ పార్టీలో చేరారు. ఏకంగా ఆయన పార్టీ అగ్రనేత అక్బరుద్దీన్ వాహనాంలో దారుస్సలాంకు వచ్చి పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఇదే విధంగా పలు డివిజన్లలో సైతం పార్టీ వీడిన వారిని తిరిగి రప్పించే విధంగా చర్యలకు ఉపక్రమించింది. చదవండి: గ్రేటర్ ఎన్నికలు: నేను.. నా నేర చరిత! సందడే.. సందడి మజ్లిస్ పార్టీ కేంద్ర కార్యాలయం దారుస్సలాం పార్టీ శ్రేణులతో సందడిగా మారింది ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి ఆశావహుల తాకిడి పెరిగింది. ఒక వైపు కొత్తవారు.. మరోవైపు గ్రీన్ సిగ్నల్ లభించిన వారితో కిటకిట లాడుతోంది. పార్టీ శ్రేణులు గ్రీన్ సిగ్నిల్ లభించిన అభ్యర్థులతో పాటు పార్టీ అధినేతలకు పూలమాలలతో ముంచెత్తుతున్నాయి. సొంతగూటికి మహ్మద్ గౌస్ చార్మినార్: జీహెచ్ఎంసీ మజ్లిస్ పార్టీ మాజీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, శాలిబండ మాజీ కార్పొరేటర్ మహ్మద్ గౌస్ సొంత గూటికి చేరారు. 2016లో మజ్లిస్‌కి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌లో చేరిన ఆయన గురువారం తిరిగి మజ్లిస్ పార్టీలో చేరారు. గురువారం దారుస్సలాంలో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ సమక్షంలో మహ్మద్ గౌస్ మజ్లిస్ పార్టీలో చేరారు. -
మమతతో దోస్తీకి ఒవైసీ రెడీ
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీతో కలిసి పోటీ చేయడానికి ఏఐఎంఐఎం ముందుకొచ్చింది. ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు రాష్ట్ర సీఎం మమతా బెనర్జీతో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నామని అసదుద్దీన్ ఒవైసీ ప్రతిపాదించారు. బిహార్‌లో తన పార్టీ ప్రదర్శనపై సంతృప్తిగా ఉన్న అసదుద్దీన్ ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో పావులు కదుపుతున్నారు. బిహార్‌లోని సీమాంచల్ ప్రాంతంలో 5 సీట్ల గెలుపుతో ఎంఐఎం ఉత్సాహంగా ఉంది. అందుకే పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లోనూ తన అభ్యర్థులను రంగంలోకి దింపుతున్నట్లు ఒవైసీ ప్రకటించారు. మైనార్టీ జనాభా ఎక్కువగా ఉన్న మాల్దా, ముర్షిదాబాద్, ఉత్తర దినాజ్‌పూర్, దక్షిణ దినాజ్‌పూర్, దక్షిణ 24 పరగణా జిల్లాలపై ఒవైసీ దృష్టిసారించారు. ఈ ఐదు జిల్లాల్లో సుమారు 60కి పైగా అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మమతాకు ఎంత నష్టం? బెంగాల్ ఎన్నికల్లో ఎంఐఎం ఎంట్రీని తృణమూల్ కాంగ్రెస్ తమ ఓటు బ్యాంకుకు ముప్పుగానే భావిస్తోంది. బిహార్ ఎన్నికల్లో సంచలనంగా మారిన మైనార్టీ ఓటు బ్యాంకు రాజకీయాల నేపథ్యంలో, బెంగాల్లో తమకు బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న మైనార్టీలను ఒవైసీ తన వైపు తిప్పుకుంటారని టీఎంసీ, కాంగ్రెస్‌లకు ఆందోళన మొదలైంది. పశ్చిమ బెంగాల్లో 24 శాతం బెంగాలీ మాట్లాడే ముస్లింలు ఉండగా, 6 శాతం హిందీ మాట్లాడే ముస్లింలు ఉన్నారు. వాస్తవానికి, ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ టీఎంసీ, బీజేపీల మ«ధ్యే జరగనుంది. అదే సమయంలో కాంగ్రెస్, వామపక్షాలు సైతం మమతాతో పోరాడుతున్నాయి. ఇలాంటి త్రికోణ పోటీ మధ్యలో, ఎంఐఎం దీటైన అభ్యర్థులతో బెంగాల్ ఎన్నికల బరిలో దిగితే, బిహార్‌లో మహాకూటమి మాదిరిగా మమతా బెనర్జీ ప్రత్యక్ష నష్టాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ ఓటుబ్యాంకును దెబ్బతీసేందుకు ఎంఐఎంను కమలదళం రంగంలోకి దింపిందని టీఎంసీ నేతల వాదన. బీజీపీ బీ–టీంగా పనిచేస్తూ, లౌకిక పార్టీల ఓటుబ్యాంకుకు నష్టం చేకూర్చటమే ఎంఐఎం లక్ష్యమని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి విమర్శించారు. -
మా లక్ష్యం బావ, బావమరిది కాదు: రఘునందన్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ నాయకత్వం గ్రేటర్ ఎన్నికలను సీరియస్‌గా తీసుకుందని, జీహెచ్ఎంసీ ఎలక్షన్‌ని ఎదుర్కొవడానికి బీజేపీ దగ్గర ప్రత్యేక ప్రణాళికలున్నాయన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు. ఎంఐఎంను మేయర్ పీఠంపై కూర్చోబెట్టడానికి కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ జర్నలిస్టు యూనియన్ సోమవారం నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘టీఆర్ఎస్కు ఓటు వేస్తే.. ఎంఐఎంకు ఓటు వేసినట్లే. హైదరాబాద్‌ను బెంగాల్, కోల్‌కతాగా మార్చవద్దని గ్రేటర్ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నాను. పాతబస్తీలో జరుగుతోన్న అసాంఘిక కార్యక్రమాలను బయటకు తీస్తాం. గ్రేటర్ ఎన్నికల తర్వాత కేటీఆర్ కళ్ళు కిందకు దిగుతాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సమాచారాన్ని సేకరించే పనిలో ఉన్నాను. బావ, బావమరిది కాదు.. మా లక్ష్యాన్ని చేరుకోవటమే బీజేపీకి ముఖ్యం’ అన్నారు రఘునందన్ రావు. (చదవండి: సంక్రాంతికి ‘జీహెచ్ఎంసీ’ గిఫ్ట్ ఇస్తారు..) ఆయన మాట్లాడుతూ.. ‘వరద సాయాన్ని టీఆర్ఎస్ ఓట్లు కొనుగోలుగా మార్చింది. జోనల్ కమిషనర్‌కు 2 లక్షల రూపాయల కంటే ఎక్కువ డబ్బులు డ్రా చేసే అధికారం లేదు. గ్రేటర్ ఎన్నికల తర్వాత 2 లక్షల కంటే ఎక్కువ డ్రా చేసిన జోనల్ కమిషనర్లను కోర్టుకు ఈడ్చుతాం. టీఆర్ఎస్లో అవమానాలు ఎదుర్కొంటోన్నఅసలసిసలైన ఉద్యమకారులను బీజేపీ గౌరవిస్తోంది. టీఆర్ఎస్ పార్టీని ఓడింవచ్చన్న స్పూర్తిని దుబ్బాక ఇచ్చింది. బీజేపీని.. రఘునందనరావును వేరుచేసి చూడవద్దని మనవి చేస్తున్నాను. గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లకు మాత్రమే కేసీఆర్ ముఖమంత్రి కాదు. సిద్ధిపేటతో సమానంగా కోట్లాడి దుబ్బాకకు నిధులు తీసుకెళ్తాను. గ్రామీణ ప్రాంతం కాబట్టే కేంద్ర నిధులతో దుబ్బాకను అభివృద్ధి చేస్తాను. ఇకపై ప్రతి ఎన్నికలోనూ బీజేపీనే గెలిచేలా దుబ్బాకను అభివృద్ధి చేస్తాను. మల్లన్న సాగర్ నిర్వాసితుల కోసం కోర్టులో స్వయంగా పోరాటం చేస్తాను. దుబ్బాక బస్టాండ్ నిధులను గోల్ మాల్ వ్యవహారం త్వరలో బయటకు వస్తుంది అన్నారు రఘునందన్ రావు. -
హైదరాబాద్‌కు బిహార్ ఎమ్మెల్యేలు
సాక్షి, హైదరాబాద్ : బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఐదుగురు ఏఐఎంఐఎం ఎమ్మెల్యేలు పార్టీ కేంద్ర కార్యాలయమైన హైదరాబాద్ దారుస్సలాం చేరుకున్నారు. బుధవారం సాయంత్రం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ ఎయిర్ పోర్టు వద్ద బిహార్ ఎమ్మెల్యేలు అఖ్తరుల్ ఇమాన్, మహ్మద్ ఇజాహర్ ఆసీఫ్, షాహనవాజ్ ఆలం, సయ్యద్ రుకునుద్దీన్, అజహర్ నయీమీలకు హైదరాబాద్‌కు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా దారుస్సలాం చేరుకొని పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీని కలుసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. కాగా మంగళవారం విడుదలైన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించిన విషయం తెలిసిందే. బీజేపీ 74, జేడీయూ 44 స్థానాల్లో గెలుపొందాయి. ఇక తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ అత్యధికంగా 76 స్థానాల్లో విజయం సాధించింది. -
వారి స్వరం వినిపిస్తా: ఓవైసీ
సాక్షి, హైదరాబాద్ : బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు స్ధానాలు గెలుపొంది సత్తా చాటిన ఏఐఎంఐఎం బలహీనుల గొంతుకగా మారుతుందని ఆ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. రాబోయే ఎన్నికల్లో తాము బెంగాల్, యూపీ సహా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పోటీ చేసి పార్టీని విస్తరిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. ప్రతి రాష్ట్రంలోనూ పోటీచేసి ఎంఐఎంను జాతీయ పార్టీగా మలిచే ప్రణాళికలు తమ ముందున్నాయనే సంకేతాలు పంపారు. బెంగాల్లోనూ విజయాలను నమోదు చేస్తామని 2021లో ఆ రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో దిగుతామని పేర్కొన్నారు. బీజేపీ వ్యతిరేక ఓటును చీల్చిందని తమను కాంగ్రెస్ పార్టీ విమర్శించడాన్ని ఆయన తప్పుబట్టారు. మహారాష్ట్రలో శివసేనతో చేతులు కలిపిన కాంగ్రెస్‌తో తాము ఎలా జతకడతామని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడినుంచైనా పోటీ చేసే హక్కు తమకు ఉందని, దీనికి ఎవరి అనుమతి అవసరం లేదన్నారు. బిహార్‌లో దీటైన రాజకీయ శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఆర్జేడీకి మద్దతుపై పూర్తి ఫలితాలు వెల్లడయ్యాక ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. బిహార్‌లో తమ పార్టీ విజయంలో మహిళలు కీలక పాత్ర పోషించారని, తాను హాజరైన పలు సభలకు మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారని అన్నారు. దుబ్బాకలో టీఆర్ఎస్ ఓటమికి ఎంఐఎంను నిందిచడం తగదని అన్నారు. చదవండి : ‘ఆ వివాదం మళ్లీ తెరపైకి తెచ్చారు’ -
న్యాయ చరిత్రలో బ్లాక్ డే: ఒవైసీ
సాక్షి, హైదరాబాద్: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో కోర్టు ఇచ్చిన తీర్పు భారతీయ న్యాయ చరిత్రలో బ్లాక్ డే అని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. బుధవారం హైదరాబాద్ దారుస్సలాంలో ఒవైసీ విలేకరులతో మాట్లాడారు. అందరూ నిర్దోషులైతే మరి మసీదును ఎవరు కూల్చేశారు? దానంతట అదే కూలిపోయిందా? అని ప్రశ్నించారు. భారతీయ న్యాయ చరిత్రలో ఈ రోజు విషాద దినంగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. ‘కోర్టు తీర్పు తనకెంతో బాధ కలిగించింది. మసీదును ధ్వంసం చేశారనేందుకు ఆధారాలు లేవంటున్నారు. కానీ దాన్ని ఎవరు కూల్చారో ప్రపంచమంతా చూసింది. మసీదును కూల్చండి అని ఉమాభారతి రెచ్చగొట్టడం నిజం కాదా..? బాబ్రీ కూల్చివేతలో కుట్ర లేదని కోర్టు చెబుతోంది.. ఈ ఘటన అప్పటికప్పుడు జరిగిందని తేల్చేందుకు ఎన్ని నెలల సమయం పడుతుంది’అని ఆయన ప్రశ్నించారు. సరైన ఆధారాలు లేవని అందరిపై అభియోగాలు కొట్టివేయడం సరైంది కాదని ఆయన పేర్కొన్నారు. చట్టాలను అతిక్రమించారని, ప్రణాళిక ప్రకారమే ప్రార్థనా మందిరాన్ని ధ్వంసం చేశారని ఇప్పటి ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినట్లు ఆయన గుర్తుచేశారు. బాబ్రీ మసీదు కూల్చివేత అంశం న్యాయానికి సంబంధించినదని, మసీదు కూల్చివేతకు కారణమైన వాళ్లను దోషులుగా తేల్చాల్సి ఉందని, కానీ వారికి రాజకీయంగా లబ్ధి జరిగినట్లు ఒవైసీ ఆరోపించారు. -
ఓల్డ్ సిటీ సంగతేంటి?: అక్బరుద్దీన్ ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతూ అద్భుతంగా పురోగమిస్తోందని, హైటెక్ సిటీ ప్రాంతం గత 20 ఏళ్లలో ఎంతో పురోగమించి ఇప్పుడు భారతదేశ న్యూయార్క్‌గా గుర్తింపు పొందిందని మజ్లిస్ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ పేర్కొన్నారు. కానీ 400 ఏళ్ల చరిత్ర ఉన్న పాతనగరం అదే దుస్థితిలో ఉండటం బాధ కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పాతబస్తీపై కూడా ప్రభుత్వం దృష్టి సారిం చాల్సి ఉందని, పాత నగరానికి ఐటీ సెంటర్ రావాలని డిమాండ్ చేశారు. పలు దఫాలుగా చెప్పినట్టుగా సీఎం హామీల అమలు కోసం తామంతా ఎదురు చూస్తున్నట్టు పేర్కొన్నారు. హైదరాబాద్, ఇతర మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పనపై బుధవారం సభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన మాట్లాడారు. పాతబస్తీ అభివృద్ధికి రూ.10 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించాలని కోరారు. ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సురేశ్‌రెడ్డి ఉమ్మడి రాష్ట్రం స్పీకర్‌గా ఉండగా, చార్మినార్ పాదచారుల ప్రాజెక్టు ప్రారంభమైందని, కానీ ఇప్పటికీ పూర్తి కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాతనగరంలోని అద్భుత నిర్మాణా లు దెబ్బతింటున్నాయని, వాటిని పరిరక్షించే చర్యలు మాత్రం లేవన్నారు. ముర్గీ చౌక్ సమీపంలో అతిపురాతన భవనం కూలేందుకు సిద్ధంగా ఉన్నా హెరిటేజ్ పేరుతో దాన్ని తొలగించటం లేదని, దాన్ని కూల్చి అక్కడ మార్కెట్ భవనం నిర్మించాలని డిమాండ్ చేశారు. పాతనగరంలో పార్కింగ్ టవర్లను పూర్తి చేయాలని కోరారు. నవ యవ్వనంలో అసెంబ్లీలో అడుగుపెట్టిన నువ్వు జుట్టు నెరిసి వృద్ధుడివి అవుతున్నావు తప్ప పాతబస్తీ అభివృద్ధి చెందటం లేదని ప్రజలు తనను నిలదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌కు మెట్రో వచ్చిందంటే అది తన వల్లేనని, దీన్ని చాలెంజ్ చేసి చెప్తానని పేర్కొన్నారు. నా మాటల్లో తప్పుందని తేలితే రాజీనామాకు కూడా సిద్ధమన్నారు. పీజేఆర్ మోనో రైల్ కోసం, తాను మెట్రో కోసం పోటీ పడగా నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనను ఢిల్లీకి పంపి మెట్రో రైలు ప్రాజెక్టు పరిశీలించి రమ్మన్నారని, ఆ తర్వాతనే నగరానికి మెట్రో వచ్చిందని, కానీ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాతబస్తీకి మాత్రం మెట్రో యోగం లేదా అని ప్రశ్నించారు. కృష్ణా ఫేజ్–2 పాతనగరం కోసం ఏర్పాటైందని, కానీ కొత్త నగరంలో అమలవుతున్నట్టు పాతనగరానికి రోజువిడిచి రోజు నీళ్లు రావటం లేదన్నారు. నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగినట్టుగానే, నీటి విషయంలో పాతబస్తీకి అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. నాలుగు వేల ఎకరాల వైశాల్యంలో ఉన్న హుస్సేన్‌సాగర్‌ను ఇప్పుడు వేయి ఎకరాలకే పరిమితం చేశారని, లుంబినీపార్కు, నెక్లెస్‌రోడ్డు, ఫుడ్‌కోర్టులకు ఎవరు అనుమతిచ్చారని అక్బరుద్దీన్ ప్రశ్నించారు. -
‘నోటరీ ఆస్తులపై నిర్ణయం తీసుకోవాలి ’
సాక్షి, హైదరాబాద్: లేఅవుట్, భవనాల క్రమబద్ధీకరణ పథకాల్లో ప్రభు త్వం మరికొన్ని మార్పులు చేయాలని ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల ఇళ్లు, ప్లాట్లు నోటరీల ద్వా రా క్రయవిక్రయాలు జరిగాయని, ఇది వరకు ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్కు అవకాశం ఇచ్చినప్పటికీ చాలామంది దర ఖాస్తు చేసుకోలేకపోయారని అన్నా రు. కొందరికి తరతరాలుగా వస్తున్న ఆస్తులు ఇదే పద్ధతిలో ఉన్నాయని, ప్రస్తుతం క్రమబద్ధీకరణ విషయంలో నోటరీ ఆస్తులపై విధానపరమైన నిర్ణయం తీసుకొని చివరి అవకాశం ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. రెవెన్యూ బిల్లుపై శుక్రవారం శాసనసభలో జరిగిన చర్చ లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం రూపొందించిన రెవెన్యూ బిల్లుకు ఎంఐఎం పూర్తి మద్ద తు ఇస్తుందని, కానీ కొన్ని రకాల మా ర్పులు చేయాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. వక్ఫ్‌బోర్డు భూములు అన్యాక్రాంతమవుతున్నాయని, వీటిపై ప్రభు త్వం మరింత పక్కాగా నిఘా ఏర్పాటు చేయాలని కోరారు. ఇకపై వక్ఫ్ బోర్డు, దేవాదాయ భూములు ఆక్రమణకు గురైతే సంబంధిత అధికారులను బా ధ్యులుగా చేయాలన్నారు. హైదరాబా ద్ అభివృద్ధి కోసం టీఆర్ఎస్ ప్రభు త్వం కృత నిశ్చయంతో పని చేస్తోందని అక్బరుద్దీన్ అన్నారు. రాష్ట్ర ఐటీ, పట్టణాభివృద్ధి, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ నగర అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారని ప్రశంసించారు. గచ్చిబౌలి, హైటెక్‌సిటీ ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధిలో కేటీఆర్ కీలక పా త్ర పోషించారన్నారు. ఇటీవల తాను ఆ ప్రాంతాల్లో పర్యటించినప్పుడు అభివృద్ధిని చూసి షాక్ అయ్యానన్నారు. -
‘జాతీయ జంతువుగా గోవు’
గువహటి : గోవధ నియంత్రణపై యూపీ ప్రభుత్వం ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపిన క్రమంలో గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని ఏఐఎంఐఎం నేత సయ్యద్ అసీం వకార్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గోమాతను కాపాడేలా బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు ఓ ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని కోరారు. పాలివ్వని ఆవులను అమ్మేవారిని కూడా కఠినంగా శిక్షించి రూ 20 లక్షల జరిమానా విధించాలని అన్నారు. ఆవులపై సరైన వ్యూహం అమలుచేయడంలో కేంద్ర ప్రభుత్వం, యూపీ ప్రభుత్వం విఫలమయ్యాయని విమర్శించారు. విక్రేతల నుంచి మంచి ధరలకు గోవులను కొనుగోలు చేసి వాటిని షెల్టర్ హోంలలో ఉంచేలా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు చొరవ చూపాలని వకార్ సూచించారు. ఆవులు వీధుల వెంట తిరుగుతూ ప్లాస్టిక్ పదార్ధాలను తింటూ, డ్రైన్ల నుంచి నీటిని తాగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాగా గో రక్షణ, గోవధ నియంత్రణ కోసం యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వం మంగళవారం ఆర్డినెన్స్‌ను ఆమోదించింది. ఈ ఆర్డినెన్స్ ప్రకారం గోవథకు పాల్పడితే పదేళ్ల జైలు శిక్ష, రూ 5 లక్షల వరకూ జరిమానా విధిస్తారు. చదవండి : గాడ్సే వారసులు నన్ను హతమారుస్తారేమో? -
ఢిల్లీ హింసపై నోరు మెదపరేం?
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ ‘మారణహోమం’పై ప్రధాని మోదీతోపాటు ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు ఎందుకు నోరు మెదపడం లేదని ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నించారు. హింసాకాండలో ప్రాణాలు కోల్పోయిన, గాయపడిన వారంతా భారతీయులేనని, ఇప్పటికైనా బాధిత కుటుంబాలను పరామర్శించాలని డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులు చేసిన ప్రకటన వల్లే ఇదంతా జరిగిందని ఆరోపించారు. ఆదివారం దారుస్సలాంలో జరిగిన పార్టీ 62వ ఆవిర్భావ దినోత్సవ సభలో ఆయన మాట్లాడారు. ఢిల్లీ హింసాకాండపై ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు మౌనం వహిస్తున్నాయని.. నితీశ్‌కుమార్, రామ్‌విలాస్ పాశ్వాన్, అకాలీదళ్ హింసపై ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారని ప్రశ్నించారు. ఢిల్లీ అల్లర్ల బాధితులకు మజ్లిస్ పార్టీకి చెందిన పార్లమెంట్, అసెంబ్లీ, మున్సిపల్ ప్రజాప్రతినిధుల ఒక నెల జీతం విరాళంగా ఇస్తున్నట్లు అసదుద్దీన్ ప్రకటించారు. ఢిల్లీలో శాంతిభద్రతల పరిస్థితికి కేంద్రమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఎన్పీఆర్పై స్టే విధించాలి.. అసెంబ్లీ సమావేశాల్లో ఎన్పీఆర్పై స్టే విధించేలా ఒత్తిడి తెస్తామని అసదుద్దీన్ వెల్లడించారు. సీఏఏకు వ్యతిరేక తీర్మానం మాదిరిగా ఎన్పీఆర్పై స్టే విధించాలని ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విజ్ఞప్తి చేశారు. కేరళ మాదిరిగా ఎన్పీఆర్పై నిర్ణయం తీసుకుంటేనే భవిష్యత్‌లో దాని ప్రక్రియ ఆగుతుందని తేల్చిచెప్పారు. ఈ బహిరంగ సభలో పార్టీ శాసన సభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ, పార్టీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
ఢిల్లీ అల్లర్లు: అసదుద్దీన్ ఒవైసీ సభ వాయిదా
ముంబై: దేశ రాజధానిలో ఢిల్లీ చోటు చేసుకుంటున్న పౌరసత్వం సవరణ చట్టం( సీఏఏ) వ్యతిరేక, అనుకూల అల్లర్ల సెగ ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సభకు తగిలింది. మహారాష్ట్ర థానే జిల్లాలోని భీవండిలో స్థానిక ఎంఐఎం నేతలు గురువారం నిర్వహించే సీఏఏ, ఎన్ఆర్సీ వ్యతిరేక బహిరంగ సభను పోలీసులు రద్దు చేశారు. ఈ సభకు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించాల్సింది. అయితే.. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఎంఐఎం నేతలు నిర్వహించే ఈ సభను వాయిదా వేయాలని బుధవారం పోలీసులు కోరారు. ఢిల్లీ ఘర్షణలపై స్పందించిన ఆరెస్సెస్ ఇక ఎంఐఎం నేతలు పోలీసుల అభ్యర్థనకు సానుకూలంగా స్పందించి తమ సభను వాయిదా వేస్తున్నట్లు తెలిపారని డీసీపీ రాజ్‌కుమార్ షిండే పేర్కొన్నారు. అదే విధంగా గురువారం సాయంత్రం ముంబైలోని భీవండిలో జరగబోయే ఎంఐఎం బహిరంగ సభ వాయిదా పడిందని ఔరంగాబాద్ ఎంపీ ఇంతియాజ్ జలీల్ తన ట్విటర్ ఖాతాలో తెలిపారు. ఈ సభను మార్చి నెల రెండో వారంలొ నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. (ఢిల్లీ అల్లర్లు : ఏప్రిల్ 13కు విచారణ వాయిదా) -
అసలు వారి ఎజెండా పాకిస్థాన్ జెండా: బీజేపీ
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్లో లౌకికవాదం అనే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ బయట మాత్రం మతం పేరిట దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కె. కృష్ణసాగర్ రావు మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎంఐఎం మత విద్యేషాలు రెచ్చగొట్టే పార్టీ అని మరోసారి రుజువైందన్నారు. ఎన్ఆర్సీ, సీఏఏ, ఎన్‌ఆర్‌పీలను ఆధారం చేసుకుని ఎంఐఎం దేశంలో విద్వేషాలు రెచ్చగొడుతుందని విమర్శించారు. అదే విధంగా ఎంఐఎంకు తోడు పార్టీలుగా టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మారాయన్నారు. భారతదేశం నడి బొడ్డున ఎంఐఎం మీటింగ్‌లో ఒక అమ్మాయి పాకిస్థాన్ జిందాబాద్ అని నినాదాలు చేసిందని, గతంలో ఎంఐఎం సీనియర్ నేత వారీస్ పఠాన్ హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందని, సెక్యులర్ అని చెప్పుకునే కాంగ్రెస్, వామపక్షాలు ఇతర పార్టీలు దీనిపై ఎందుకు మాట్లాడటం లేదన్నారు. ఎంఐఎం హిందువులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుంటే ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. హిందువులను ఇన్ని మాటలు అంటుంటే రేవంత్‌రెడ్డి, షబ్బీర్ అలీ, ఉత్తమ్ కుమార్‌రెడ్డిలు ఎక్కడకు వెళ్లారని ధ్వజమెత్తారు. భారతదేశ ముస్లీంలు ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలను.. ఎంఐఎం పార్టీ వ్యాఖ్యాలను ఖండించాలని పిలుపునిచ్చారు. సీఏఏ వ్యతిరేక ఊరేగింపులకు భారదేశ జెండా పట్టుకుని తిరగడం ఒక డ్రామా వాళ్ల అసలు ఎజెండా పాకిస్థాన్ జెండా అంటూ కృష్ణ సాగర్ విమర్శించారు. సీఏఏకు వ్యతిరేక నిర్ణయం చరిత్రాత్మకం -
సీఏఏకు వ్యతిరేక నిర్ణయం చరిత్రాత్మకం
సాక్షి, హైదరాబాద్: పౌరసత్వ సవరణ చట్టం (సీఏ ఏ)కు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ అభివర్ణించారు. తెలంగాణ మంత్రివర్గ తీర్మానాన్ని ఆయన స్వాగతించారు. కేరళ మాదిరిగా జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్పీఆర్)పై స్టే విధించాలని ఆయన సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తిచేశారు. సోమవారం హైదరాబాద్ దారుస్సలాంలో మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ఎన్పీఆర్పై కూడా నిర్ణయం తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఎన్పీఆర్కు జనాభా గణన, సాంఘిక సంక్షేమ పథ కాలతో ఎలాంటి సంబంధం లేదని, ఇది భవిష్యత్తులో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సీ) చేపట్టడానికి చేసే ప్రక్రియ అని తెలిపారు. ఢిల్లీ పోలీసులు జామియా మిలియా ఆవరణలోనే కాకుండా రీడింగ్ గదుల్లో సైతం చొరబడి విద్యార్థులను కొట్టారని, బయటకి వెళ్లకుండా అరాచకం సృష్టించినట్లు వీడియో దృశ్యాలు స్పష్టం చేస్తున్నాయన్నారు. -
దేశద్రోహులకు మద్దతిస్తారా?: పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: పాకిస్తాన్ నుంచి వచ్చిన వారి కి, ఉగ్రవాదులతో సంబంధమున్న వారికి దేశ పౌరసత్వం ఇవ్వాలా? దేశ ద్రోహులకు విపక్షాలు మద్దతునిస్తాయా అని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి ప్రశ్నించారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని శరణార్థుల కోసం తీసుకొస్తే విపక్షాలు వివాదాస్పదం చేస్తున్నాయన్నారు. పార్టీ నేతలు పద్మ, సుధాకరశర్మలతో కలసి ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్, ఎంఐఎం మోకాలికి, బోడి గుండుకు లంకె పెట్టేలా వ్యవహరిస్తున్నా యని ధ్వజమెత్తారు. దేశంపై తమ గుత్తాధిపత్యం కొనసాగాలనే అక్కసుతో సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చి, అవకాశవాద పొత్తులతో కాంగ్రెస్ పార్టీ కాస్తా కమర్షియల్ పార్టీగా మారిందన్నారు. -
ఎంఐఎం నేతలకు భట్టి సవాల్
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలోని దారుస్సలాంలో తలుపులేసుకుని మీటింగ్‌లు పెట్టుకోవడం కాదని, బయటికొచ్చి బీజేపీ విధానాలను వ్యతిరేకించాలని కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) నేత మల్లు భట్టి విక్రమార్క ఎంఐఎం నేతలకు సవాల్ చేశారు. పౌరసత్వ చట్ట సవరణ బిల్లు, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ఈ నెల 28న తాము నిర్వహించబోయే నిరసన ర్యాలీకి మద్దతిచ్చి.. ర్యాలీలో పాల్గొంటారా? అని ఎంఐఎం నేతలను ప్రశ్నించారు. సోమవారం అసెంబ్లీ లోని మీడియా హాల్లో మాజీ ఎమ్మెల్యే కిచ్చన్న గారి లక్ష్మారెడ్డితో కలిసి ఆయన మాట్లాడుతూ.. ఎంఐఎం లాంటి పార్టీల కారణంగానే బీజేపీ విభజన, మతతత్వ విధానాలను అవలంబిస్తోందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా మైనార్టీల ఆందోళనకు ఆ పార్టీ వ్యవహారశైలే కారణమని విమర్శించారు. పౌరసత్వ చట్ట సవరణను దేశం లోని అన్ని రాష్ట్రాల బీజేపీయేతర ముఖ్యమంత్రులు వ్యతిరేకిస్తుంటే తెలంగాణ సీఎం కేసీఆర్ మౌనంగా ఎందుకుంటున్నారని భట్టి ప్రశ్నించా రు. ఈ నెల 28న కాంగ్రెస్ ఆధ్వర్యంలో గాంధీభవన్ నుంచి ట్యాంక్‌బండ్ అంబేడ్కర్ విగ్రహం వరకు నిర్వహించే ర్యాలీలో పెద్ద ఎత్తున హాజరు కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. -
నిర్మల్ కోర్టుకు హాజరైన అక్బరుద్దీన్ ఒవైసీ
-
నిర్మల్ కోర్టుకు హాజరైన అక్బరుద్దీన్ ఒవైసీ
సాక్షి, నిర్మల్: గతంలో హిందూ దేవతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మంగళవారం నిర్మల్ కోర్టుకు హాజరయ్యారు. నిర్మల్‌లోని ఓ సభలో మాట్లాడుతూ హిందూ దేవతలపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని నిర్మల్‌లో కేసు దాఖలైంది. ఈ కేసు విచారణ నిమిత్తం కోర్టుకు హాజరైన అక్బర్.. కేసును హైదరాబాద్ కోర్టుకు బదిలీ చేయాలని న్యాయమూర్తిని కోరారు. నిర్మల్ కోర్టుకు అక్బర్ రావడంతో ఎంఐఎం కార్యకర్తలు, మైనారిటీలు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలివచ్చారు. దీంతో నిర్మల్ కోర్టు పరిసరాల్లో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. -
కొండను తవ్వి ఎలుకను పట్టి, ఇప్పుడు మళ్లీ..
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా జాతీయ పౌర రిజిస్టర్(ఎన్ఆర్సీ) తయారు చేస్తామన్న కేంద్రం ప్రకటనపై ఏఐఎంఐఎం చీఫ్, ఎపీ అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. ఎన్ఆర్సీ పేరుతో అస్సాంలో హడావుడి చేసిన మోదీ ప్రభుత్వం... చివరకు కొండను తవ్వి ఎలుకను పట్టారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు అదే పనిని దేశవాప్తంగా చేసేందుకు సిద్దమయ్యారని విమర్శించారు. ‘ఎన్ఆర్సీ కారణంగా అస్సాం ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. అయినప్పటీకి కేంద్రం సాధించిందేమి లేదు. 40లక్షల మంది అక్రమంగా చొరబడ్డారని చెప్పిన అమిత్ షా.. చివరకు 19లక్షల మందిని మాత్రమే ఎన్ఆర్సీ జాబితా నుంచి తొలగించారు. అదీ కూడా అక్రమంగా తొలగించారు. ఎన్ఆర్సీలో నమోదు కానీ భారతీయులను అదుపులోకి తీసుకొవాలని కేంద్రం యోచిస్తుంది. మైనార్టీలను దయతో వదివలేయాలని భావిస్తోంది. ప్రపంచంలోని ఏ దేశ ప్రజలు ఇలాంటి కష్టాలను ఎదుర్కొనలేదు’ అని ఓవైసీ పేర్కొన్నారు. (చదవండి : ఇక దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ) ఇక అస్సాం ఆర్థిక మంత్రి హిమంత బిశ్వాశర్మ కూడా ఎన్ఆర్సీని వ్యతిరేకించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్ఆర్సీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అమిత్‌షాను కోరుతున్నానని తెలిపారు. ‘ అస్సాం ప్రభుత్వం ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తోంది. ఎన్ఆర్సీని తొలగించాల్సింది కేంద్ర హోం మంత్రి అమిత్ షాను రాష్ట్ర ప్రభుతం, బీజేపీ కోరుతోందని తెలిపారు. కాగా, దేశవ్యాప్తంగా జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్ఆర్సీ) ప్రక్రియను ప్రారంభిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా బుధవారం రాజ్యసభలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ జాబితా రూపకల్పనలో మతపరమైన వివక్షలు ఉండవని ఆయన పేర్కొన్నారు. -
ఆ పార్టీ విభేదాలు సృష్టిస్తోంది
కోల్‌కతా : హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఏఐఎంఐఎం పార్టీ సామాజిక వర్గాల మధ్య విభేదాలు సృష్టిస్తోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. పశ్చిమ బెంగాల్ లోని కూచ్ బిహార్ లో నిర్వహించిన ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఏఐఎంఐఎంను అతివాద పార్టీగా ఆమె అభివర్ణించారు. ఇటువంటి శక్తులను నమ్మకూడదని మైనార్టీలను కోరారు.అలాగే హిందూ అతివాద శక్తుల పట్ల ఓటర్లు జాగ్రత్తగా ఉండాలని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. 2011 నుంచి పశ్చిమ బెంగాల్ సీఎంగా మమతా బెనర్జీ కొనసాగుతున్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్లో ఎలాగైనా గెలవాలని బీజేపీ ప్రయత్నాలు జరుపుతుండడంతో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే తమ బలాన్ని మరింత పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది. కొన్ని నెలల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో బీజేపీ మెరుగైన ఫలితాలు సాధించడం గమనార్హం. మమతా బెనర్జీ వ్యాఖ్యలపై ఒవైసీ స్పందిస్తూ.. మమత ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి. బెంగాల్లో ముస్లింల పరిస్ధితి అత్యంత దారుణంగా ఉంది. బెంగాల్లో మేం బీజేపీకి 'బీ టీం' అనడం పూర్తిగా అర్థరహితమన్నారు. మమతా బెనర్జీ భయంతోనే అలా మాట్లాడుతున్నారు. బెంగాల్లో ప్రజలు మార్పు కోరుకుంటున్నట్లు ఒవైసీ తెలిపారు. -
‘ఆయన రెండో జకీర్ నాయక్’
సాక్షి, న్యూఢిల్లీ : ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ రెండో జకీర్ నాయక్ (ఇస్లాం బోధకుడు)లా తయారవుతున్నారని కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో ఆరోపించారు. జకీర్ నాయక్‌పై రెచ్చగొట్టే వ్యాఖ్యలతో విద్వేషాన్ని వ్యాపింపచేయడం, ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూర్చడం వంటి పలు ఆరోపణలున్న విషయం తెలిసిందే. అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో తనకు తమ మసీదును తిరిగి ఇవ్వాలని ఓవైసీ పేర్కొన్న నేపథ్యంలో కేంద్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన అతిగా మాట్లాడితే చట్టం తన పని తాను చేసుకువెళుతుందని అన్నారు. కాగా, తమ పోరాటం భూమి కోసం కాదని, తమ న్యాయపరమైన హక్కులు దక్కడం కోసమేనని ఓవైసీ వ్యాఖ్యానించారు. మసీదును నిర్మించేందుకు ఏ ఆలయాన్ని కూల్చలేదని సుప్రీం కోర్టు స్పష్టంగా చెప్పిందని..మసీదును మాకు తిరిగివ్వాలని తాము కోరుకుంటున్నామని ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అసదుద్దీన్ పేర్కొన్నారు. -
'కేసులు పెడితే భయపడేవారు లేరిక్కడ'
సాక్షి, హైదరాబాద్ : బాబ్రీ మసీదు–అయోధ్య వివాదంలో సుప్రీంకోర్టు తీర్పు పై రాజ్యాంగం పరిధిలోనే మాట్లాడానని, కేసులకు భయపడేది లేదని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని దారుస్సలాంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజ్యాంగ బద్ధంగా అభిప్రాయం వ్యక్తం చేసే హక్కు తనకు ఉందని, బీజేపీ, ఆర్ఎస్ఎస్లను సంతోష పెట్టేలా మాట్లాడలేనని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ మాట్లాడే హక్కు ఉందని తేల్చి చెప్పారు. ‘నాపై ఎంత మాట్లాడుతారో మాట్లాడండి. అది మీ హక్కు. ఎంత అసహనం వెల్లగక్కుతారో వెల్లగక్కండి. బీజేపీ, ఆర్ఎస్ఎస్లకు భయపడేది లేదు’అని అన్నారు. -
బలపడుతున్న బీజేపీ : అసదుద్దీన్ ఒవైసీ
సాక్షి,సిటీబ్యూరో: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీతోనే మజ్లిస్‌కు ప్రధాన పోటీ అని ఆ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. ఆదివారం మజ్లిస్ పార్టీ కేంద్ర కార్యాలయమైన హైదరాబాద్ దారుస్సలాంలో జరిగిన జిల్లా, పట్టణ స్థాయి పార్టీ ముఖ్య బాధ్యుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. దేశ నలుమూలలు మజ్లిస్‌కు మంచి ఆదరణ ఉందని, రాష్ట్రంలోని మున్సిపల్ ఎన్నికల్లో సైతం సత్తా చాటాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలహీన పడుతోందని, అదే సమయంలో బీజేపీ బలం పుంజుకొంటోదన్నారు. బీజేపీని అడ్టుకోవల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని అడ్డుకునేందుకు గెలుపు గుర్రాలను బరిలోకి దింపాలని సూచించారు. మున్సిపల్ సిట్టింగ్ స్థానాలతో పాటు గతంలో ప్రాతినిధ్యం వహించిన స్థానాలు, కొత్త స్థానాల్లో సైతం అభ్యర్థులను పోటీకి దింపాలన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో కనీసం 15 నుంచి 20 స్థానాల్లో అభ్యర్థులను గెలిపించుకుని కనీసం వైస్ చైర్మన్, డిప్యూటీ మేయర్ పదవులను దక్కించుకునే విధంగా కృషి చేయాలని సూచించారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను ఎంపిక చేయాల్సిన బాధ్యత పార్టీ జిల్లా, పట్టణ బాధ్యులదేన్నారు. స్థానికంగా సమన్వయంతో సమర్థులను ఎంపిక చేయాలని ఆయన సూచించారు. ఒక వేళ స్థానికంగా పార్టీ అభ్యర్థుల ఎంపిక జరగని పక్షంలో పార్టీ అధిష్టానం రంగంలో దిగి అభ్యర్థులను ప్రకటిస్తుందన్నారు. రిజర్వేషన్ స్థానాల్లో దళితులకు అవకాశం ఇవ్వాలని, వారితో సంప్రదింపులు చేయాలని సూచించారు. అభ్యర్థుల ఎంపికలో మహిళలకు సముచిత స్థానం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీని అడ్డుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నించాలని కోరారు. -
తీర్పుపై సంతృప్తి లేదు!
సాక్షి, హైదరాబాద్: అయోధ్య–బాబ్రీ మసీదు వివాదంలో సుప్రీంకోర్టు తీర్పు అసంతృప్తి కలిగించిందని ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమిన్ (ఏఐఎంఐఎం) అధినేత, హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. శనివారం హైదరాబాద్ శాస్త్రీపురంలోని తన నివాసంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. బాబ్రీ మసీదుపై సున్నీ వక్ఫ్ బోర్డు న్యాయవాదులు తమ వాదనలు బలంగా వినిపించారన్నారు. తమ పోరాటం న్యాయమైన, చట్టపరమైన హక్కుల కోసమేనని, ఐదెకరాల భూమి కేటాయింపు అక్కర్లేదని, మసీదుపై రాజీపడే సమస్యే లేదని స్పష్టంచేశారు. ‘‘బాబ్రీ మసీదుకు ఐదువందల సంవత్సరాల చరిత్ర ఉంది. భవిష్యత్తు తరాలకు సైతం బాబ్రీ మసీదు అక్కడ ఉండేదని మేం చెబుతాం. 1992 డిసెంబర్లో బాబ్రీ మసీదును కూల్చివేసిన వారినే... ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించమని సుప్రీంకోర్టు చెబుతోంది. ఒకవేళ బాబ్రీ మసీదు కూల్చివేతకు గురి కాకుంటే తీర్పు ఏం వచ్చేది?. దేశంలో అనేక ఇతర మసీదులు ఉన్నాయని, వీటిపై కూడా సంఘ్ పరివార్ దావా వేసింది. ఆ సందర్భాల్లో కూడా ఈ తీర్పును ఉదహరిస్తారా?’’ అని ఆయన ప్రశ్నించారు. ప్రధాని మోదీ భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చడం అయోధ్య నుంచి ప్రారంభమవుతోందని దుయ్య బట్టారు. రాజ్యాంగంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, హక్కుల కోసం చివరిదాకా పోరాడతామని పేర్కొన్నారు. తీర్పుపై ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లాబోర్డ్ వైఖరి ప్రకారం నడుచుకుంటామన్నారు. ‘సుప్రీంకోర్టు సుప్రీం. దాని తీర్పు ఫైనల్. కాకపోతే అన్నివేళలా అది కరెక్టేనని అనుకోలేం’ అన్నారాయన. అయోధ్య వివాదంలో కాంగ్రెస్ తీరును కూడా అసద్ తప్పుబట్టారు. ఆ పార్టీ వల్లే బాబ్రీ మసీదు చేజారిందని, ఆ పార్టీ నిజమైన రంగును బహిర్గతం చేసిందని విమర్శించారు. -
ఫిఫ్టీ-ఫిఫ్టీ ఫార్ములాపై అసదుద్దీన్ వ్యాఖ్యలు..
హైదరాబాద్ : మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ, శివసేనల మధ్య సాగుతున్న సంవాదంపై ఇరు పార్టీల తీరును ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ తప్పుపట్టారు. ఫిప్టీ ఫిఫ్టీ ఫార్ములాపై ఇరు పార్టీల మధ్య నెలకొన్న వివాదాన్ని ఎద్దేవా చేస్తూ మార్కెట్లో ఫిఫ్టీ-ఫిఫ్టీ పేరుతో కొత్త బిస్కట్ వచ్చిందా అని ప్రశ్నించారు. మహారాష్ట్రలో చెరి రెండున్నరేళ్లు సీఎం పదవిని పంచుకోవాలన్న శివసేన డిమాండ్‌ను బీజేపీ తోసిపుచ్చడంతో నూతన ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన నెలకొన్న సంగతి తెలిసిందే. మహారాష్ట్ర ప్రజలకు ఏదైనా చేయాలనే తపన బీజేపీ, శివసేనలకు లేదని, సతారాలో భారీ వర్షాలతో రైతాంగం దెబ్బతిన్నదని, అయినా ఇరు పార్టీలు ఫిఫ్టీ-ఫిఫ్టీ గురించి మాట్లాడుతున్నాయని హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఎద్దేవా చేశారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ లేదా శివసేనలకు తమ పార్టీ మద్దతు ఇవ్వబోదని ఆయన స్పష్టం చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఎంఐఎం రెండు స్ధానాల్లో గెలుపొందిన సంగతి తెలిసిందే. దేవేంద్ర ఫడ్నవీస్ లేదా మరొకరు సీఎం అవుతారో తనకు తెలియదని, మ్యూజికల్ ఛైర్ కొనసాగుతోందని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. శివసేనకు ఏం చేయాలో పాలుపోవడం లేదని, ఉద్ధవ్ ఠాక్రేకు ప్రధాని నరేంద్ర మోదీ భయం పట్టుకున్నట్టు కనిపిస్తోందని దుయ్యబట్టారు. -
తొలి విజయం; అది అతి ప్రమాదకరం!
న్యూఢిల్లీ : బిహార్ ఉప ఎన్నికల్లో ఓటర్లు అతి ప్రమాదకరమైన తీర్పు వెలువరించారని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కిషన్‌గంజ్‌లో ఎంఐఎం గెలవడం వల్ల జిన్నా భావజాలం వ్యాప్తి చెందుతుందని పేర్కొన్నారు. వందేమాతరాన్ని ద్వేషించే ఎంఐఎం పార్టీతో బిహార్‌లో సామాజిక సమగ్రతకు భంగం వాటిల్లే అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. బిహార్ ప్రజలు ఇక తమ భవిష్యత్ ఎలా ఉండబోతుందో ఆలోచించుకోవాలని సూచించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. కాగా గిరిరాజ్ సింగ్ ట్వీట్‌పై స్పందించిన జేడీయూ సీనియర్ నేత, బిహార్ మంత్రి శ్యామ్ రజాక్ ఆయనకు కౌంటర్ ఇచ్చారు. ‘ ఒకవేళ గిరిరాజ్ సింగ్‌కు నిజంగా బిహార్ ప్రజలపై అంత ప్రేమే ఉంటే తక్షణమే తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలి. కేంద్ర కేబినెట్ నుంచి వైదొలిగి రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలి’అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక అసదుద్దీన్ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ తాజా ఎన్నికల్లో సత్తా చాటిన సంగతి తెలిసిందే. బిహార్‌లో బోణీ కొట్టి... కిషన్‌గంజ్(ఉప ఎన్నిక) అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకుని బీజేపీకి గట్టి షాకిచ్చింది. ఈ సందర్భంగా అసదుద్దీన్ మాట్లాడుతూ... ‘బిహార్‌లో మాకు దక్కిన తొలి విజయం ఎంతో కీలకమైంది. బీజేపీని ఓడించడమే కాదు.. కాంగ్రెస్‌ను కూడా మూడోస్థానానికే పరిమితం చేశాం. బిహార్ ఎంఐఎం అధ్యక్షుడు ఇమాన్ నాయకత్వం ఇలాగే కొనసాగాలి. ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. కాగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఎంఐఎం కాంగ్రెస్‌కు గట్టి పోటీనిచ్చి.. ఔరంగాబాద్‌లో సంచలన విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. बिहार के उपचुनाव में सबसे ख़तरनाक परिणाम किशनगंज से उभर के आया है ..ओवैसी की पार्टी AIMIM जिन्ना की सोच वाले है ,यें वंदे मातरम से नफरत करते है ,इनसे बिहार की सामाजिक समरसता को खतरा हैं। बिहार वासियों को अपने भविष्य के बारे में सोचना चाहिए। — Shandilya Giriraj Singh (@girirajsinghbjp) October 25, 2019 -
మహారాష్ట్రలో ఎంఐఎం సంచలనం
-
మహారాష్ట్రలో ఎంఐఎం సంచలనం
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల్లో అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం పార్టీ సత్తా చాటింది. గణనీయమైన స్థానాలు గెలుపొందనప్పటికీ.. మైనారిటీ ఓట్లను చీల్చడం ద్వారా పలు పార్టీల గెలుపోటములు శాసించగలిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి మజ్లిస్ పార్టీ గట్టి షాక్ ఇచ్చింది. దాదాపు 44 స్థానాల్లో మజ్లిస్ పార్టీ అభ్యర్థులకు గణనీయమైన సంఖ్యలో ఓట్లు వచ్చాయి. ఒకప్పుడు మైనారిటీ ఓట్లు గంపగుత్తగా కాంగ్రెస్ పార్టీకే పడేవి. అటు హిందుత్వ కూటమిగా బీజేపీ-శివసేన కలిసి పోటీచేస్తున్న నేపథ్యంలో మైనారిటీలు సహజంగానే కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గుచూపేవారు. అయితే, ఈసారి మస్లిజ్ పార్టీ పెద్ద ఎత్తున స్థానాల్లో పోటీచేసి.. గట్టిగా ప్రచారం చేయడంతో కాంగ్రెస్‌కు మైనస్‌గా మారింది. కాంగ్రెస్‌కు ఓటుబ్యాంకుగా ఉన్న మైనారిటీ ఓట్లు చీలడం.. బీజేపీ-శివసేన కూటమికి వరంగా మారింది. దీంతో కాంగ్రెస్‌కు పట్టున్న కొన్ని స్థానాల్లోనూ బీజేపీ కూటమి సునాయసంగా గెలువగలిగింది. మహారాష్ట్రలోని మైనారిటీ ఓట్లను ఏకతాటిపైకి తేవడంలో ఆ పార్టీ విఫలమైన పరిస్థితి కనిపిస్తోంది. మైనారిటీ పార్టీగా పేరొందిన ఎంఐఎం పోటీ.. చాలాస్థానాల్లో కాంగ్రెస్ విజయ అవకాశాలకు గండికొట్టింది. మైనారిటీ ఓటర్లు మజ్లిస్ వైపు మొగ్గడం కాంగ్రెస్‌ను దెబ్బతీసింది. దీంతో ఆ పార్టీ ప్రతిపక్ష కాంగ్రెస్-ఎన్సీపీ కూటమిలో రెండోస్థానానికి పడిపోయింది. గతంలో గెలుచుకున్న స్థానాలను కూడా నిలబెట్టుకోలేకపోయింది. ఒకవైపు బీజేపీ-శివసేన కూటమి మరోసారి కంఫర్టబుట్ మెజారిటీతో అధికారాన్ని నిలబెట్టుకోగా.. మరోవైపు మరాఠా కురువృద్ధుడు శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 50కిపైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ.. పర్వాలేదనిపించగా.. కాంగ్రెస్ మాత్రం 37 స్థానాలకే పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఔరంగాబాద్‌లో సంచలనం ఔరంగాబాద్ నియోజకవర్గంలో సంచలన విజయం దిశగా ఎంఐఎం సాగుతోంది. ఈ నియోజకవర్గంలో పోలైన ఓట్లలో 80శాతానికిపైగా ఓట్లు ఎంఐఎం అభ్యర్థికి దక్కడం గమనార్హం. ఎన్నికల చరిత్రలోనే ఒక అభ్యర్థికి ఈస్థాయి ఓట్లు రావడం అనేది ఇదే తొలిసారి అంటున్నారు. ఈ నేపథ్యంలో ఔరంగాబాద్ నియోజకవర్గంలో రికార్డుస్థాయి మెజారిటీతో సంచలన విజయం దిశగా ఎంఐఎం సాగుతోంది. మరో నియోజకవర్గంలోనూ ఎంఐఎం బొటాబొటి మెజారిటీతో ఆధిక్యంలో కొనసాగుతోంది. -
‘త్వరలో మమత ఇంటికే... ఆ తర్వాత కేసీఆరే’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కారులో మజ్లిస్ పార్టీ సవారీ చేస్తోందని.. కేసీఆర్ ఇంటి నుంచి బయటకు కూడా రావడం లేదని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మండిపడ్డారు. మంగళవారం పటాన్‌చెరులోని ఎస్వీఆర్ గార్డెన్లో తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఆధ్వర్యంలో ‘తెలంగాణ విమోచన దినోత్సవ సభ’ బహిరంగ సభ జరిగింది. ఈ సభలో కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1947 ఆగస్టు15 అనంతరం 13మాసాల తర్వాత హైదరాబాద్ సంస్థానానికి స్వాతంత్రం వచ్చిందన్నారు. తెలంగాణలో మంత్రులకు కూడా ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వని దుస్థితి ఉందని మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్లో మమత బెనర్జీ కూడా ఇదే విధంగా వ్యవహరిస్తోందన్నారు. త్వరలో మమత ఇంటికి వెళ్ళిపోతుంది. కేసీఆర్ కూడా ఇంటికి వెళతారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ పాలనలో కుక్కలకు మర్యాద ఉంది. కానీ ఆత్మ బలిదానాలు చేసుకున్న అమరవీరులకు విలువ లేదని దుయ్యబట్టారు. తెలంగాణలో ఏం పాలన నడుస్తుందో తెలియడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్, ఆవాస్ యోజన వంటి పథకాలను కేసీఆర్ తెలంగాణలో అమలు చేయడం లేదని మండిపడ్డారు. ఇక కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేదని.. ఆ పార్టీకి కనీసం అధ్యక్షుడు లేకపోవడం హాస్యస్పదం అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ నిధులు విడుదల చేసిందన్నారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టులో అడుగడుగునా అవినీతి జరిగిందని విమర్శించారు. హర్యానా, బిహార్ రాష్ట్రాలకు ఉన్న పూర్వ ముఖ్యమంత్రులకు పట్టిన గతి తెలంగాణ సీఎంకి కూడా పడుతుందన్నారు. ఈ క్రమంలో తెలంగాణకు ఎయిమ్స్ మంజూరు చేశామని మంత్రి ప్రహ్లాద్ జోషి గుర్తు చేశారు. ఈ సభలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె. లక్ష్మణ్, కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి, మురళీధర్ రావు ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ బహిరంగ సభకు భారీగా బీజేపీ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు తరలివచ్చారు. -
అక్బర్ ప్రసంగంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు లేవు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ కరీంనగర్లో ప్రసంగంలో ఎలాంటి విద్వేషపూరిత, రెచ్చ గొట్టే వ్యాఖ్యలు లేవని న్యాయ నిపుణులు తేల్చి నట్టు నగర పోలీసు కమిషనర్ వీబీ కమలాసన్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ నెల 23న కరీంనగర్లో జరిగిన సభలో అక్బర్ పాల్గొన్నారు. ఈ సభలో ఒక వర్గం మనోభావాలను కించపరిచే విధంగా, విద్వేషాలను రెచ్చగొట్టేలా అక్బరుద్దీన్ ప్రసంగించారని మూడు రోజులుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో వైరల్ అయింది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయణ అక్బరుద్దీన్‌పై కేసు నమోదు చేయాలని కమిషనర్‌ను కలసి ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కూడా తానెలాంటి విద్వేషపూరిత ప్రసంగం చేయలేదని వివరణ ఇచ్చారు. ‘ముందు జాగ్రత్త చర్యగా అక్బరుద్దీన్ ప్రసంగాన్ని రికార్డు చేయించాం. ఆ వీడియోను అనువాద నిపుణుల సహాయంతో ట్రాన్స్‌లేట్ చేయించి, వీడియో రికార్డింగును, అనువాద ప్రతిని న్యాయ నిపుణుల సలహా కోసం పంపించాం. అయితే.. ఆ వీడియో ప్రసంగంలో ఎటువంటి విద్వేషపూరిత వ్యాఖ్యలు గానీ, రెచ్చగొట్టే పదాలు గానీ లేవని , ఎలాంటి కేసులు నమోదు చేసే అవకాశం లేదని న్యాయ నిపుణులు చెప్పారు’’అని సీపీ తెలిపారు. ఈ మేరకు ఎలాంటి కేసు నమోదు చేయడం లేదని స్పష్టం చేశారు. -
స్వలింగ సంపర్కం నేరం కాదు; మరి ట్రిపుల్ తలాక్?!
న్యూఢిల్లీ : ట్రిపుల్ తలాక్ బిల్లుపై లోక్‌సభలో చర్చ సందర్భంగా ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వలింగ సంపర్కాన్ని సుప్రీంకోర్టు చట్టబద్ధం చేస్తే.. ట్రిపుల్ తలాక్‌ను నేరంగా పరగణించాలంటూ కేంద్రం బిల్లు తీసుకురావడమేమిటని ప్రశ్నించారు. గురువారం సభలో ఆయన మాట్లాడుతూ...‘ మీరు తెచ్చిన బిల్లు ప్రకారం.. ఓ ముస్లిం వ్యక్తి తన భార్యకు మూడుసార్లు తలాక్ చెప్పినా వారి వివాహం చట్టబద్ధమే. అదే విధంగా ట్రిపుల్ తలాక్ ద్వారా భార్యకు విడాకులు ఇచ్చిన పురుషుడికి మూడేళ్లు జైలు శిక్ష విధిస్తారు. అదే జరిగితే భర్త జైలులో ఉన్నపుడు భార్యకు భరణం ఎలా లభిస్తుంది. విడాకులిచ్చిన భర్త జైలు నుంచి విడుదలయ్యే దాకా సదరు మహిళ ఎదురుచూస్తూ ఉండాలా?’ అని ప్రశ్నించారు. మహిళలను మీరు శిక్షిస్తున్నారు.. ‘స్వలింగ సంపర్కం, వివాహేతర సంబంధాలు నేరం కాదంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. కానీ మీరు మాత్రం ట్రిపుల్ తలాక్‌ను నేరంగా పరిగణించాలని అనుకుంటున్నారు. ఇదెక్కడి న్యాయం. మీరు సరికొత్త భారతాన్ని నిర్మించాలనే మాటకు కట్టుబడి ఉన్నారా! ట్రిపుల్ తలాక్ సరైంది కాదని సుప్రీంకోర్టు చెప్పింది. జైలులో ఉన్న భర్త బయటికి వచ్చేదాకా విడాకులు పొందిన ఓ భార్యకు ఎవరు ఆర్థిక సహాయం చేస్తారు. భర్తకు మూడేళ్లు జైలు శిక్ష విధించి భార్యలను మీరు శిక్షిస్తున్నారు’ అని అసదుద్దీన్ ఒవైసీ కేంద్రం తీరుపై మండిపడ్డారు. ట్రిపుల్ తలాక్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని మరోసారి స్పష్టం చేశారు. వాళ్ల కోసమే ఈ బిల్లు.. లోక్‌సభలో చర్చ సందర్భంగా అసదుద్దీన్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ పూనమ్ మహాజన్ స్పందించారు. ఎవరైనా ఒక వ్యక్తి తన భార్య లేదా కూతురు ఒక్క ఫోన్ కాల్ ద్వారా విడాకులు పొందటాన్ని ఒవైసీ సమర్థిస్తారా అని ప్రశ్నించారు. ‘ వాట్సాప్ మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ ద్వారా విడాకులు ఇచ్చే వాళ్ల కోసమే ఈ బిల్లు. పళ్లు సరిగా లేవని, కూరలో తగినంత ఉప్పు వేయలేదని విడాకులు ఇస్తున్న మహానుభావులను చూస్తూనే ఉన్నాం కదా’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
‘అధికారంలో లేనప్పుడు కాంగ్రెస్ అంతే’
సాక్షి, న్యూఢిల్లీ : చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం తీసుకువచ్చిన కాంగ్రెస్ పార్టీ తీరును ఏఐఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ బుధవారం లోక్‌సభలో ఎండగట్టారు. సవరణ బిల్లుపై సభలో జరిగిన చర్చ సందర్భంగా ఓవైసీ కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. అధికారంలో లేనప్పుడు కాంగ్రెస్ ముస్లింలకు పెద్దన్నయ్యలా వ్యవహరిస్తూ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ కన్నా దారుణంగా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. ఈ చట్టానికి తానూ బాధితుడినని చెప్పిన ఓవైసీ కాంగ్రెస్ పార్టీకి తాను ఏం చేసిందీ తమ నేత నెలలకొద్దీ జైలులో గడిపితేనే తెలుస్తుందని విమర్శించారు. ఈ చట్టంతో బాధితులుగా మారిన వారికి తన ప్రసంగాన్ని అంకితం చేస్తున్నానని ఈ సందర్భంగా ఓవైసీ పేర్కొన్నారు. ఈ చట్టాన్ని తీసుకువచ్చిన కాంగ్రెస్ నేతలు ద్రోహులని మండిపడ్డారు. ఈ బిల్లు చట్ట నిబంధనలకు విరుద్ధమని అన్నారు. కేవలం అనుమానితులను కూడా ఆరు నెలల పాటు పోలీస్ కస్టడీలో ఉంచేలా ఈ బిల్లు వెసులుబాటు కల్పిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చట్టం కింద బ్రిటన్‌లో 28 రోజలు, అమెరికాలో కేవలం రెండు రోజులే పోలీస్ కస్టడీకి అనుమతిస్తున్నారని చెప్పారు. -
మాకు ప్రతిపక్ష హోదా కల్పించండి
సాక్షి, హైదరాబాద్ : అసెంబ్లీలో తమ పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించి విపక్ష హోదాను కల్పించాలని శాసనసభాపతికి మజ్లీస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) విజ్ఞప్తి చేసింది. ఈ అంశంపై స్పీకర్‌కు ఎంఐఎం శాసనసభాపక్షం ఒక లేఖను ఇటీవల అందజేసింది. కాంగ్రెస్ శాసనసభాపక్షానికి చెందిన 12 మం ది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో విలీనమైన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.సభలోని మొత్తం సభ్యుల్లో కనీసం పదిశాతం బలం లేకపోతే నిబంధనల మేరకు ఆ పా ర్టీకి ప్రతిపక్షంగా గుర్తింపు, అలాగే దాని నేతకు విపక్షనేత హోదాను ఇవ్వడం సాధ్యం కాదని శాసనసభా వర్గాలు స్పష్టంచేశాయి. 1994లో కాంగ్రెస్‌పార్టీ నుంచి 26 మంది ఎమ్మెల్యేలు గెలవడంతో అప్పుడు కూడా పి.జనార్ధనరెడ్డికి ప్రతిపక్షనేత హోదా ఇవ్వలేదని, సీఎల్‌పీనేతగానే ఆయన వ్యవహరించారని ఉటంకిస్తున్నాయి. శాసనసభలో వివిధ అం శాలపై చర్చ, ప్రసంగాలకు అవకాశమిచ్చే సందర్భంలో మాత్రం సం ఖ్యాబలం దృష్ట్యా ఎంఐఎంకే తొలి అవకాశం లభిస్తుందని తెలిపాయి. అందుకు తగ్గట్టుగానే గురువారం అసెంబ్లీలో పలు బిల్లులపై చర్చ సందర్భంగా ఎంఐఎంకే అవకాశం దక్కిన విషయం తెలిసిందే. -
మారిన రాజకీయం
సాక్షి, ఆదిలాబాద్: బల్దియా పోరు ఆసక్తికరంగా మారుతోంది. త్వరలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనుండగా ప్రధానంగా జిల్లాలోని ఏకైక ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ప్రధాన పార్టీల మధ్య పోటీ నెలకొనే పరిస్థితి కనిపిస్తోంది. రిజర్వేషన్లపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. 2014లో జరిగిన మున్సిపల్ ఎన్నికలకు రాబోయే ఈ ఎన్నికలకు రాజకీయం మారింది. ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు, స్వంతంత్ర కౌన్సిలర్లుగా గెలిచిన వారు అప్పట్లో అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు. దీంతో ప్రతిపక్షాల బలం నీరుగారిపోయింది. ఈ ఎన్నికల్లో మళ్లీ అధికార పార్టీతోపాటు ప్రతిపక్ష పార్టీ లు ఏమేర సత్తా చూపుతాయానేది ఆసక్తికరం. ఉమ్మడి రాష్ట్రంలో 2014లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేసింది. అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలకవర్గాలు కొలువుదీరాయి. ఈ జూలై 2తో పాలకవర్గం పదవీకాలం పూర్తయింది. కాగా అప్పట్లో 36 వార్డులున్న ఆదిలాబాద్ మున్సిపాలిటీలో టీఆర్ఎస్ 14, ఎంఐఎం 4, స్వతంత్రులు 4, కాంగ్రెస్, బీజేపీ చెరో ఏడు స్థానాలు దక్కించుకున్నాయి. టీఆర్ఎస్ ఎంఐఎం మద్దతుతో స్వతంత్ర అభ్యర్థులను కలుపుకుని అప్పట్లో కొలువుదీరింది. 21వ వార్డు కౌన్సిలర్ రంగినేనీ మనీశ చైర్‌పర్సన్‌గా, ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు, 29వ వార్డు కౌన్సిలర్ ఫారూఖ్ అహ్మద్ వైస్‌చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఐదేళ్లపాటు పదవుల్లో కొనసాగారు. కాగా కాంగ్రెస్ నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ముగ్గురు, స్వతంత్ర కౌన్సిలర్లు నలుగురు అధికార పార్టీలో చేరడంతో మున్సిపాలిటీలో టీఆర్ఎస్ బలం పెరిగిపోయింది. అదే సమయంలో కాంగ్రెస్, బీజేపీల సంఖ్య పలచబడిపోయింది. ఈ నేపథ్యంలో జరగనున్న ఎన్నికల్లో ఆయా పార్టీలు ఏ మేరకు ప్రభావం చూపుతాయన్నది పట్టణ ప్రజల్లో ఆసక్తి కలిగిస్తోంది. రిజర్వేషన్లపై కొనసాగుతున్న ఉత్కంఠ ఆదిలాబాద్ మున్సిపాలిటీ 36 వార్డుల నుంచి ప్రస్తుతం 49 వార్డులకు పెరిగింది. మావల గ్రామం వదిలి దాని పరిధిలోని మిగిలిన కాలనీలు, అనుకుంట, బంగారుగూడ, రాంపూర్, బట్టి సావర్గాం గ్రామాన్ని వదిలి దాని పరిధిలోని కాలనీలు పట్టణంలో విలీనం అయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభంజనం చూపించగా, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. కొత్త వార్డుల్లో గతంలో జెడ్పీటీసీ, ఎంపీపీలు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లుగా పని చేసిన వారు ఈ పురపాలిక ఎన్నికల్లో నిలబడేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రధాన పార్టీలు టీఆర్ఎస్, బీజేపీ నుంచి అధికంగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతుండగా, కాంగ్రెస్ కొంత లేకపోలేదు. ఇక కొన్ని వార్డుల్లో ఎంఐఎం పార్టీ ప్రభావం ఉంది. ఈ నేపథ్యంలో జరగబోయే ఎన్నికల్లో ఒక పార్టీ మెజార్టీ సాధించేందుకు శాయశక్తులగా కృషి చేయాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. 25 వార్డుల్లో విజయకేతనం ఎగురవేస్తేనే పాలకవర్గం దక్కుతుంది. లేని పక్షంలో మిత్ర పక్షాల సహకారంతోనైనా పార్టీలు కొలువుదీరే పరిస్థితి ఉంది. ఇదిలా ఉంటే టీఆర్ఎస్లో ఎమ్మెల్యే జోగు రామన్న తనయుడు జోగు ప్రేమేందర్ ఈ ఎన్నికల ద్వారా పుర రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నాడు. తద్వారా టీఆర్ఎస్ గెలుపుపై వారు ఆశలు పెట్టుకున్నారు. కాగా ఆయా పార్టీలు ఇప్పటికే వార్డులలో ఒక అంచనాతో ముందుకు కదులుతున్నాయి. దాని ప్రకారం రిజర్వేషన్లు అనుకూలంగా వస్తే వారే అభ్యర్థులుగా ఉంటారు. లేనిపక్షంలో పార్టీలకు అభ్యర్థులను వడపోసి ఎంపిక చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ నుంచి రిజర్వేషన్లకు అనుగుణంగా అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. పార్టీలు కసరత్తు మొదలు పెట్టినా పలు వార్డులలో కొన్ని పార్టీలకు సరైన అభ్యర్థులకు కూడా కరువయ్యే పరిస్థితి లేకపోలేదు. గత ఎన్నికల్లో 34న వార్డు నుంచి మెస్రం కృష్ణ ఏకగ్రీవంగా కౌన్సిలర్‌గా ఎన్నిక కావడం ఈ పరిస్థితిని తేటతెల్లం చేస్తుంది. -
‘మజ్లీస్‌కు ప్రతిపక్ష హోదా ఇస్తే పోరాటం తప్పదు’
సాక్షి, హైదరాబాద్ : మజ్లీస్‌కు ప్రతిపక్ష హోదా ఇస్తే పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్ హెచ్చరించారు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పలు అంశాల గురించి మాట్లాడారు. ‘చదువుకుందాం’ నినాదాన్ని కాస్తా ‘చదువుకొందాం’గా మార్చిన ఘనత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. తెలంగాణ వస్తే కామన్ స్కూల్ విధానం తీసుకోస్తానని కేసీఆర్ ప్రగల్భాలు పలికాడన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక అక్షరాస్యత ఒక్క శాతం కూడా పెరగలేదని తెలిపారు. ఫీజుల నియంత్రణ లేదు.. కార్పొరేట్ విద్యావిధానానికి పెద్ద పీట వేశారని ఆరోపించారు. ఫీజుల కలెక్షన్ విషయంలో దేశంలో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉందన్నారు. 2007 నుంచి ఇప్పటి వరకూ దాదాపు 400 శాతం ఫీజు పెంపు జరిగిందని పేర్కొన్నారు. విద్యాసంస్థలు 5 శాతం కన్నా ఎక్కువ లాభాల్లో ఉండకూడదన్న రూల్‌ని అతిక్రమించి దాదాపు 70 శాతం లాభాలతో నడుస్తున్న పాఠశాలలున్నాయని తెలిపారు. ఫీజుల కోసం విద్యార్థులను డిటెన్షన్ చేస్తున్నారని ఆరోపించారు. విద్యార్థుల బరువు కంటే వారి బ్యాగే ఎక్కువ బరువుండటం ఆందోళనకరం అన్నారు. రాష్ట్రంలో నిబంధనలకు మించి ఫీజులు వసూలు చేస్తోన్న పాఠశాలల వివరాలలు తమ దగ్గర ఉన్నాయని.. వారంలోగా వారు సర్దుకోకపోతే.. వాళ్ల పని పడతామని లక్ష్మణ్ హెచ్చరించారు. అలయన్స్ పార్టీలకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలనుకోవడం సిగ్గు చేటన్నారు. -
అక్బరుద్దీన్ త్వరగా కోలుకోవాలి : వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్: మజ్లిస్ పార్టీ శాసనసభాపక్ష నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అనారోగ్యం నుంచి త్వరగా కోలుకుని ఆయురారోగ్యాలతో ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్షించారు. ఈమేరకు తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. కాగా తీవ్ర అనారోగ్యానికి గురైన ఒవైసీ రెగ్యులర్ వైద్య సేవల కోసం లండన్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. గత మూడు రోజుల క్రితం అక్బరుద్దీన్ తిరిగి ఆకస్మికంగా వాంతులు, తీవ్రమైన కడుపు నొప్పికి గురికావడంతో కుటుంబ సభ్యులు అక్కడి ఆసుపత్రిలో చేర్పించారు. Praying for the speedy recovery and good health of Akbaruddin Owaisiji. — YS Jagan Mohan Reddy (@ysjagan) June 11, 2019 -
క్షీణించిన అక్బరుద్దీన్ ఆరోగ్యం.. లండన్‌కు తరలింపు
సాక్షి, హైదరాబాద్: ఎంఐఎం సీనియర్ నాయకుడు, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఆరోగ్యం క్షీణించింది. గతంలో చందాయణగుట్ట సమీపంలో అక్బరుద్దీన్‌పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడి నుంచి తృటిలో ప్రాణాలతో అక్బరుద్దీన్ బయటపడినా.. అప్పట్లో తీవ్ర గాయాలు కావడంతో ఆయన ఇప్పటికీ చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆకస్మికంగా అక్బరుద్దీన్ ఆరోగ్యం క్షీణించినట్టు తెలుస్తోంది. దీంతో మెరుగైన వైద్యం కోసం ఆయనను లండన్ ఆస్పత్రికి తరలించినట్టు తెలుస్తోంది. సోదరుడు అక్బర్ త్వరగా కోలుకోవాలంటూ దేవుడిని ప్రార్థించాలని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పార్టీ శ్రేణులు, అభిమానులను కోరారు. -
పదోసారి హైదరాబాద్ మజ్లిస్ వశం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ లోక్‌సభ స్థానంలో మజ్లిస్ పార్టీ వరసగా పదో విజయాన్ని నమోదు చేసుకుంది. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తాజా ఎన్నికల్లో ఈ స్థానంలో ఘన విజయం సాధించారు. పోటీ చేసిన ప్రతిసారీ మెజారిటీని పెంచుకుంటూ వస్తున్న అసదుద్దీన్ ఈసారి భారీ మెజారిటీని సొంతం చేసుకున్నారు. ఆయన దాదాపు 2.82 లక్షల ఓట్ల మెజారిటీని సొంతం చేసుకున్నారు. హైదరాబాద్ పార్లమెంటు స్థానం నుంచి ఆయనకు ఇది వరసగా నాలుగో విజయం. గత ఎన్నికల్లో 2.02 లక్షల ఓట్ల మెజారిటీ సంపాదించారు. ఇప్పటికి వరుసగా పదిసార్లు ఈ స్థానాన్ని కైవసం చేసుకున్న మజ్లిస్‌పార్టీకి ఇదే అతిపెద్ద మెజారిటీ కావటం విశేషం. పాతనగరంలో తనకు తిరుగులేదని మజ్లిస్ పార్టీ మరోసారి నిరూపించుకుంది. ఈ పార్లమెంటు స్థానం పరిధిలో ఒక్క గోషామహల్ అసెంబ్లీ స్థానం తప్ప మిగతా ఏడు స్థానాలూ మజ్లిస్ చేతిలోనే ఉన్నాయి. ఎన్నికలకు ముందే ‘గెలుపు’.. కారు.. సారు... పదహారు.. నినాదంతో ఎన్నికల్లో ప్రచారం చేసిన టీఆర్ఎస్ తాను 16 స్థానాలు గెలుస్తున్నట్టు పేర్కొంది. ఆ పార్టీ అభ్యర్థి బరిలో ఉన్నప్పటికీ, హైదరాబాద్‌లో గెలుపు మాత్రం మజ్లిస్‌దేనని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికలకు ముందే ప్రకటించటం విశేషం. గత పార్లమెంటు ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసిన భగవంతరావునే బీజేపీ ఈసారి కూడా బరిలో నిలిపింది. తమ పార్టీ విజయం సాధిస్తుందని పేర్కొంటూ చివరి వరకు పోటీ ఇచ్చింది. కానీ అధికార పక్షం మజ్లిస్ విజయాన్ని పోలింగ్‌కు ముందే చెప్పేయటంతో అక్కడ పోటీ అంత రసవత్తరం కాదని తేలిపోయింది. మజ్లిస్ కేడర్‌లో కొంత నిరుత్సాహం అసెంబ్లీ ఎన్నికల్లో ఏడుకు ఏడు సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానాలను, పార్లమెంటు ఎన్నికల్లో హైదరాబాద్ సిట్టింగ్ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకుని మజ్లిస్ పార్టీ జోష్‌లోనే ఉంది. కానీ, లోలోన మాత్రం ఆ పార్టీ నేతల్లో ఈసారి కొంత నిరుత్సాహం ఆవరించింది. నగరంలోని ఒక్క రాజేంద్రనగర్ అసెంబ్లీ స్థానం మినహా కొత్త చోట్ల పోటీ చేయలేదు. రాజేంద్రనగర్‌లో టీఆర్ఎస్ గెలవడంతో మజ్లిస్ శ్రేణులు డీలా పడ్డాయి. గతంలో సికింద్రాబాద్ పార్లమెంటు స్థానంలో గట్టి పోటీ ఇచ్చినా, ఈసారి టీఆర్ఎస్కు మేలు చేసే క్రమంలో సికింద్రాబాద్‌లో పోటీ చేయలేదు. అటు అసెంబ్లీ స్థానాలు, ఇటు పార్లమెంటు స్థానాలకు సంబంధించి కొత్త స్థానాల్లో పోటీ చేయకపోవటం ఆ పార్టీ శ్రేణుల్లో నిర్లిప్తతకు కారణమైంది. ఔరంగాబాద్‌లో మజ్లిస్ విజయం... మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో మజ్లిస్ పార్టీ విజయం సాధించింది. ఇది ఆ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇప్పటి వరకు మహారాష్ట్ర నుంచి ఎమ్మెల్యేలను గెలిపించుకున్న మజ్లిస్ పార్టీ తొలిసారి ఒక ఎంపీ స్థానాన్ని సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి ఇంతియాజ్ జలీల్ దాదాపు 5 వేల ఓట్ల మెజారిటీతో ఎంపీగా గెలిచారు. అసదుద్దీన్ ఒవైసీతోపాటు ఆయన సోదరుడు, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, పార్టీలోని మిగతా ఎమ్మెల్యేలు విడతలవారీగా అక్కడ ప్రణాళికాబద్ధంగా ప్రచారం నిర్వహించారు. ఇంతకాలం పార్లమెంటులో ఒక్క సీటుకే పరిమితమైన మజ్లిస్ తరఫున ఈసారి దర్జాగా ఇద్దరు ప్రవేశించనున్నారు. -
సర్వం మోదీ మయం: ఒవైసీ
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ కేంద్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్నారా లేక పబ్జి ఆన్లైన్ గేమ్ ఆడుతున్నారా అని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. బీజేపీ పాలనలో దేశం మొత్తం మోదీ మయం అయిపోయిందని వ్యాఖ్యానించారు. జమ్ముకశ్మీర్‌లో పుల్వామా ఉగ్రదాడి జరిగిన తర్వాత మోదీ తన ఎయిర్‌ఫోర్స్‌ను పంపి పాకిస్తాన్‌లోని ఉగ్రవాదులను మట్టుబెట్టించారని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై అసదుద్దీన్ ట్విటర్లో స్పందించారు. మోదీ సేన, మోదీ వాయుసేన, మోదీ అణుబాంబు.. ఇలా దేశానికి చెందినవన్నీ ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీవి అయిపోయాయని ఎద్దేవా చేశారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ర్యాలీలో అమిత్ షా మాట్లాడుతూ... ‘పుల్వామా ఉగ్రదాడిలో 44 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి దారుణ ఘటనలు జరిగినప్పుడు గత ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. కానీ మేము అలా కాదు. పుల్వామా ఘటన జరిగిన తర్వాత 13వ రోజునే నరేంద్ర మోదీ తన ఎయిర్‌ఫోర్స్‌ను ఆదేశించి మన ఎయిర్‌క్రాఫ్ట్‌తో పాకిస్తాన్ ఉగ్రవాదులను ముక్కలు ముక్కలుగా పేల్చేయించార’ని అన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అంతకుముందు వాయుసేనను ‘మోదీ సేన’గా వర్ణించి విమర్శల పాలయ్యారు. Modi ki Sena, Modi ki Air Force, Modi ka nuclear ‘pataka’. 5 saal mein jo sab desh ka tha, wo Modi ka ho gaya Desh chala rahe the ya PUBG khel rahe the? @PMOIndia https://t.co/1fvTzAZ39h — Asaduddin Owaisi (@asadowaisi) 22 April 2019 -
అధికారంలోకి వస్తే ఈసీకి జైలు శిక్ష
సాక్షి, ముంబై: తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నికల సంఘంపై చర్యలు తీసుకుంటామని భరిప బహుజన్ మహాసంఘ్(బీబీఎమ్) చైర్మన్, బీఆర్ అంబేద్కర్ మనువడు ప్రకాశ్ అంబేద్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర యవత్మాల్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని, పుల్వామా దాడి గురించి మాట్లాడకుండా ఆంక్షలు విధించడం దారుణమని విమర్శించారు. ‘రాజ్యాంగ పరిధిలో అంశమే అయినప్పటికీ పుల్వామా దాడి గురించి ప్రస్తావించకూడదని ఎన్నికల సంఘం ఎందుకు అడ్డుకుంటుందో అర్థం కావడం లేదు. మన ప్రభుత్వం వచ్చాక ఎలక్షన్ కమిషన్‌పై చర్యలు తీసుకుంటుంది. రెండు రోజులు ఎన్నికల సిబ్బందిని జైల్లో పెడుతుంది. తటస్థంగా ఉండాల్సిన ఈసీ బీజేపీ తొత్తుగా వ్యవహరిస్తుంది’ అని అన్నారు. ప్రకాశ్ అంబేద్కర్ సోలాపూర్, అకోలా లోక్‌సభ నియోజకవర్గాల నుంచి వంచిత్ బహుజన్ అగాదీ (వీబీఏ) అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మహారాష్ట్రలో బరిప్ బహుజన్ మహాసంఘ్, ఏఐఎమ్ఐఎమ్, జనతా దళ్(ఎస్) లు కలిసి వీబీఏ కూటమి గా ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ కూటమి ఏ పార్టీ ఓట్లు చీల్చుతుందోనని అధికార బీజేపీ, విపక్షాల్లో కలవరం మొదలైంది. కాగా సోలాపూర్ పార్లమెంట్ స్థానంలో పోటీ చేస్తున్న ప్రకాశ్ అంబేద్కర్‌కు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నట్లు సీపీఐ(ఎం) ప్రకటించింది. -
ఆయన గళం గమనం ఒకటే...!
సాక్షి వెబ్ ప్రత్యేకం : హైదరా 'బాద్షా'. ఓల్డ్‌సిటీకా షేర్. అప్పుడప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్. ఉర్దూ ఇంగ్లీష్ బాషలో అనర్గళంగా మాట్లాడే వక్త. భారత ముస్లింలకు ఆయనే గళం. హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ. ప్రతి సందర్భంలోనూ ముస్లింల పక్షానే పోరాడుతూ.. వారి సమస్యలపై తన గళాన్ని వినిపిస్తూ ముందుకుసాగుతున్నారు. ఎప్పుడూ షేర్వాణీ, టోపీ ధరించి విలక్షణమైన ఆహార్యంతో ఆరడుగులకుపైగా ఆజానుబాహుడు. ఆయన ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడగలిగిన ఉర్దూలో ప్రసంగించడానికే ఇష్టపడుతారు. ముస్లిం ధార్మిక సంస్థగా పురుడు పోసుకున్న మజ్లిస్ –ఏ–ఇత్తేహదుల్–ముస్లిమీన్ (ఎంఐఎం)ను సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ రాజకీయపార్టీగా మారిస్తే.. తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకున్న అసదుద్దీన్ పార్టీని జాతీయ స్థాయి వినిపించడంలో విజయం సాధించారు. ఎమ్మెల్యేగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించి ఒటమెరుగని నేతగా కొనసాగుతున్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా, తమ డిమాండ్లను సాధించుకోవడం ఒవైసీ ప్రత్యేకత. రాజకీయ ప్రస్థానం సుల్తాన్ సలావుద్దీన్ వారుసుడిగా రాజకీయాల్లోకి అరంగేట్రం చేసిన అసదుద్దీన్.. పాతబస్తీలోని చార్మినార్ అసెంబ్లీ నుంచి 1994,1999 రెండు పర్యాయాలు ఎంపికయ్యారు. అనంతరం 2004లో హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి బరిలో దిగి ఘన విజయం సాధించారు. వరసగా మూడు పర్యాయాలు(2004, 2009, 2014) గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. ఇప్పుడు నాలుగోసారి బరిలో దిగేందుకు నామినేషన్ దాఖలు చేశారు. ఒవైసీ పోటీ చేసిన అన్ని ఎన్నికల్లోనే భారీ మెజార్టీతో ప్రత్యర్థులను మట్టికరిపించారు. 2009లో ఎంఐఎం పార్టీ అధ్యక్షత బాధ్యతలను చేపట్టిన అసదుద్దీన్.. పార్టీని ఇతర రాష్ట్రాలకు విస్తరించడంలో కీలక పాత్ర పోషించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం ఒక స్థానం గెలుచుకోవడంలో అసద్ కీలక పాత్ర పోషించారు. వివాదాలు.. వివాదాస్పద వ్యాఖ్యలు ముస్లింల పక్షాన తన గళాన్ని వినిపించే ఒవైసీ ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా 2016లో మహారాష్ట్రలో జరిగిన ఓ ప్రచార ర్యాలీలో భారత్‌మతాకీ జై అననని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఆర్ఎస్సెస్ భావాజాలాన్ని ఇతరులకు బలవంతంగా రుద్దుతుందని, అందుకే తాను భారత్ మతాకీ జై అనని వివరణ ఇచ్చారు. ఇక దూకుడుగా వ్యవహరించే సోదరుడు అక్బరుద్దీన్ ఒవైసీ ముస్లింలు తలచుకుంటే.. ముస్లింలు ఆలోచించుకోవాలి.. అంటూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో కూడా ఒవైసీ ఇరకాటంలో పడ్డారు. 2005లో ఓ వ్యక్తిని కొట్టారనే ఆరోపణలతో ఒవైసీ సోదరులపై కేసు నమోదైంది. 2009లో అసద్.. టీడీపీ పోలింగ్ ఏజెంట్‌పై దాడి చేశారనే ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేశారు. 2013లో కర్ణాటక, బీదర్‌లో జరిగిన ఓ ర్యాలీలో అనుమతి లేకుండా గన్ పట్టుకొచ్చారని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేశారు. కుటుంబ నేపథ్యం ఎంఐఎం వ్యవస్థాపక అధినేత సుల్తాన్ సలావుద్దిన్ ఒవైసీ-నజమున్నీసాల తనయుడైన అసుదుద్దీన్ ఒవైసీ... 1969 మే 13న హైదరాబాద్‌లో జన్మించారు. ఇక్కడే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో బీఏ పూర్తి చేశారు. అనంతరం లండన్‌లో న్యాయవాద విద్యను అభ్యసించారు. అనంతరం న్యాయవాదిగా వృత్తిని కొనసాగిస్తూ తండ్రిప్రోద్బలంతో రాజకీయాల్లోకి వచ్చారు. 1996లో ఫర్హీన్‌ను వివాహం చేసుకున్న ఒవైసీకి ఆరుగురు సంతానం. ఒక కుమారుడు, ఐదుగురు కూతుర్లు. రాజకీయ నాయకుడుగానే కాకుండా ఒవైసీ ఆసుపత్రి, వైద్య కళాశాల అధిపతిగా కొనసాగుతున్నారు. ముస్లింలు, దళితుల రిజర్వేషన్ల కోసం పోరాడే ఒవైసీ.. తాను హిందుత్వానికి వ్యతిరేకమని కానీ హిందువులకు కాదని చెబుతుంటారు. ఒవైసీని అందరూ అసద్ భాయ్ అని పిలుస్తుంటారు. సోదరుడు సగం బలం.. దూకుడు స్వభావంతో సోదరుడు అక్భరుద్దీన్.. ఇరకాటంలో పడేసినా.. అసద్ బలం మాత్రం ఆయనే. ఎంఐఎంలో నెంబర్ టూ పొజిషన్గా కొనసాగుతున్న అక్బర్.. అవసరానికి అనుగుణంగా రాజకీయాలు...చేయడంలో దిట్ట. ఎన్నికలు వచ్చాయంటే చాలు పార్టీకి ఆయనే స్టార్ క్యాంపెయినర్. ఇటు పార్టీ క్యాడర్లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నాయకుడు. అందుకే అక్బర్ మాటంటే పార్టీ నాయకులకు, కార్యకర్తలకు వేదవాక్కు. 1999, 2004, 2009, 2014 .. ఇలా వరుసగా... చాంద్రాయణ గుట్ట నుంచి పోటీ చేసి నాలుగు సార్లు అక్భర్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. - శివ ఉప్పల -
వైరల్ : ఒవైసీ పుల్-అప్స్ ప్రచారం
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునే క్రమంలో వినూత్న కార్యాక్రమాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ‘జిమ్ బాయ్’ అవతారమెత్తారు. ఇప్పటికే హైదరాబాద్ ఎంపీగా హ్యాట్రిక్ విజయం సాధించిన ఒవైసీ.. నాలుగోసారి గెలుపు కోసం ప్రచారంలో దూసుకెళ్తున్నారు. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోని చాంద్రాయణగుట్ట అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా అసదుద్దీన్ ఓ జిమ్‌లోకి వెళ్లి సరదాగా కసరత్తులు చేశారు. వయసును ఏమాత్రం లెక్క చేయని ఒవైసీ.. పుల్అప్స్ చేస్తూ ఫిట్‌నెస్‌పై యువకులకు సవాల్ విసిరారు. బాడీ బిల్డప్ చేయడానికి తీవ్ర కసరత్తులు చేయాలని, అలాగే కొత్త హైదరాబాద్ నిర్మాణం కోసం భాగస్వాములు కావాలని సూచించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. -
హైదరాబాద్ @ మజ్లిస్ అడ్డా
సాక్షి, హైదరాబాద్ : దాదాపు 400 సంవత్సరాల ప్రాచీన నగరం హైదరాబాద్ పాతబస్తీ. ఇదే హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం. హిందూ, ముస్లింలు సోదర భావంతో భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా కనిపిస్తుంటారు. ఇక్కడ ప్రధాన రాజకీయ పక్షాల మేనిఫెస్టోలు, ఇతరత్రా ప్రచార అంశాలేవీ ప్రభావం చూపవు. బలమైన ముస్లిం, హిందుత్వ ఎజెండాలే జెండా ఎగురవేస్తాయి. దీంతో ఇక్కడ పార్టీల కంటే మత రాజకీయాలే ఎన్నికల ఫలితాలను నిర్దేశిస్తాయి. ఇక్కడ ముస్లిం సామాజికవర్గం ఓట్లు అధికం. ముస్లిం పక్షాన గళం విప్పే మజ్లిస్ పార్టీకి గట్టి పట్టుంది. ఇక్కడి ప్రజానీకంపై ఆ పార్టీ తనదంటూ చెరగని ముద్ర వేసుకుంది. గత మూడున్నర దశాబ్దాలుగా ప్రాతినిధ్యం వహిస్తూ వస్తోంది. ఆదిలో కాంగ్రెస్ శకం సాగినప్పటికీ.. ఆ తర్వాత మజ్లిస్ పార్టీ పాగా వేసి తిరుగులేని శక్తిగా ఎదిగింది. దశాబ్దాలుగా బీజేపీ హిందుత్వ ఎజెండాతో హేమాహేమీలను రంగంలోకి దింపి మజ్లిస్ కంచుకోటను బద్దలు కొట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తూనే ఉంది. తొలిదశలో కాంగ్రెస్‌దే హవా.. హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో మొదట్లో కాంగ్రెస్ హవా కొనసాగింది. నిజాం పాలన విముక్తి కోసం తెలంగాణ సాయిధ పోరాటానికి సారధ్యం వహించిన ‘కమ్యూనిస్టు పార్టీ పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్’ (పీడీఎఫ్) ఎన్నికల బరిలో దిగినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ముందు నిలవలేక పోయింది. హైదరాబాద్ స్టేట్‌లో లోక్‌సభకు తొలిసారిగా 1952లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. నిజాం పాలనలో మంత్రిగా పనిచేసిన అహ్మద్ మోహియిద్దీన్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగి ప్రముఖ కమ్యూనిస్టు నేత మగ్దూం మోహియుద్దీన్పై విజయం సాధించారు. తర్వాత 1957లో లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజతో అహ్మద్ మొహియుద్దీన్ కొత్తగా ఏర్పడ్డ సికింద్రాబాద్ లోక్‌సభ స్థానానికి మారిపోయారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థిగా వినాయక్‌రావు రంగంలోకి దిగి ఇండిపెండెంట్ అభ్యర్థిపై భారీ మెజార్టీతో విజయం సాధించారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ పక్షాన గోపాల్ ఎస్ మెల్కొటే వరుసగా 1962, 1967లో విజయ ఢంకా మోగించారు. 1971లో తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ మెల్కొటే తెలంగాణ ప్రజా సమితి పక్షాన బరిలోకి దిగి విజయం సాధించారు. అనంతరం కాంగ్రెస్ నుంచి కేఎస్ నారాయణ వరుసగా రెండుసార్లు గెలిచారు. 1984 ఎన్నికల నుంచి కాంగ్రెస్ పార్టీ మూడో స్థానంలో పడిపోయి.. క్రమంగా పూర్తిగా ‘హైదరాబాద్’లో వెనుకబడిపోయింది. హైదరా‘బాద్’షా మజ్లిస్ మజ్లిస్ పార్టీకి కంచుకోట హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం. ఇక్కడి నుంచి మూడున్నర దశాబ్దాలుగా వరుసగా ప్రాతినిథ్యం వహిస్తోంది. మజ్లిస్‌కు ఆదిలో వరుస పరాజయాలు ఎదురైనప్పటికీ పట్టు వీడకుండా ఎన్నికల బరిలో దిగి పట్టు బిగించి వరస విజయాలు తన ఖాతాలో వేసుకుంటోంది. మొదట్లో మజ్లిస్ పార్టీ ‘స్వతంత్రుల’ పేరుతో ఎన్నికల బరిలో దిగి గట్టిపోటీ ఇచ్చింది. ‘మజ్లిస్ ఇతేహదుల్ ముస్లిమీన్’ (ఎంఐఎం) పార్టీ పునర్నిర్మాణం తర్వాత తొలిసారిగా ఇండిపెండెంట్‌గా బరిలో దిగి పరాజయం పాలైంది. 1962లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అప్పటి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు వాహెద్ ఒవైసీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగి గట్టి పోటీనిచ్చినా రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వాహెద్ అనంతరం ఆయన కుమారుడు సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ 1977లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీచేసి కాంగ్రెస్ చేతిలో ఓటమి పాలయ్యారు. తర్వాత పార్టీ పక్షాన మహ్మద్ అమానుల్లా ఖాన్‌ను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీకి దింపగా.. ఆయన మూడోస్థానానికే పరిమితమయ్యారు. 80వ దశకంలో టీడీపీ ఆవిర్భావం మజ్లిస్ పార్టీకి కలిసొచ్చింది. 1984లో మజ్లిస్ బోణీ లోక్‌సభకు 1984లో జరిగిన ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ నుంచి ఇండిపెండెంట్‌గా సుల్తాన్ సలావుద్దీన్ బరిలోకి దిగి తొలిసారి గెలుపు ఖాతా తెరిచారు. అప్పట్లో కొత్తగా ఆవిర్భ వించిన టీడీపీ నుంచి పోటీ చేసిన కె.ప్రభాకర్‌రెడ్డి రెండో స్థానంలోను, కాంగ్రెస్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నాయి. తిరిగి 1989లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నేరుగా ‘మజ్లిస్ పార్టీ’ పేరుతో ఎన్నికల బరిలో దిగి విజయం సాధించింది. తర్వాత మజ్లిస్ పార్టీ వెనక్కి తిరిగి చూడలేదు. ప్రతిసారి ఎన్నికల్లో అధికార పక్షాలతో చేసుకున్న ఒప్పందాలు కూడా ఆ పార్టీకి కలిసొచ్చాయి. సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ వరుసగా ఆరు సార్లు ఎంపీగా ఎన్నికవగా.. తద నంతరం ఆయన వారసుడిగా అసదుద్దీన్ ఓవైసీ ఎన్నికల బరిలోకి దిగి వరుసగా విజయాలు సాధించి హ్యాట్రిక్ కొట్టారు. తాజాగా ఈ ఎన్నికల్లో ఆయనే బరిలోకి దిగుతున్నారు. వికసించని ‘కమలం’ హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో కమలం హిందుత్వ ఎజెండాతో గట్టిపోటీ ఇస్తున్నా విజయాన్ని మాత్రం చేరుకోలేకపోతోంది. ప్రతిసారి ఎన్నికల్లో హేమా హేమీలను రంగంలోకి దింపి విజయం కోసం శత విధాలా ప్రయత్నిస్తూనే ఉంది. తొలిసారి 1980లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసంఘ్ అభ్యర్థిగా ఆలెæ నరేంద్ర బరిలోకి దిగి కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇచ్చినా విజయాన్ని దక్కించుకోలేకపోయారు. టీడీపీ ఆవిర్భావం అనంతరం మిత్రపక్షం కారణంగా బీజేపీకి పోటీ చేసే అవకాశం దక్కలేదు. తర్వాత 1991లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన బద్దం బాల్‌రెడ్డి కూడా పోటీ ఇచ్చినప్పటికీ విజయాన్ని అందుకోలేకపోయారు. 1996లో పార్టీ అగ్రనేత ఎం. వెంకయ్యనాయుడు ఎన్నికల బరిలో దిగినా పరాభవమే ఎదురైంది. తర్వాత వరుసగా రెండుసార్లు తిరిగి బద్దం బాల్‌రెడ్డి పోటీ చేసినా ఓటమే పునరావృతమైంది. బాల్‌రెడ్డి తర్వాత సుభాష్ చంద్రాజీ, భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి కార్యదర్శి డాక్టర్ భగవంతరావులను ఎన్నికల బరిలోకి దింపినా ఆశించిన విజయం మాత్రం దక్కలేదు. తాజాగా ప్రస్తుత (2019) లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా భగవంతరావు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. టీడీపీకి సైతం పరాభవమే.. తెలుగుదేశం పార్టీకి ఆదిలోనే పరాభవం ఎదురైంది. పార్టీ ఆవిర్భావం నుంచి వరసగా రెండు పర్యాయాలు బీజేపీ మద్దతుతో లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగినప్పటికీ ‘సైకిల్’కు పరాజయం తప్పలేదు. 1984లో కె. ప్రభాకర్‌రెడ్డి, 1989లో తీగల కృష్ణారెడ్డి గట్టి పోటీ ఇచ్చి రెండో స్థానానంతో సరిపెట్టుకున్నారు. తర్వాత పటోళ్ల ఇంద్రారెడ్డి బరిలోకి దిగి మూడో స్థానంలోకి పడిపోయారు.1996లో తిరిగి తీగల కృష్ణారెడ్డి పోటీ చేయగా.. ఆరోస్థానానికి పరిమితమయ్యారు. తర్వాత 2009 ఎన్నికల్లో టీడీపీ పక్షాన ‘సియాసత్’ ఉర్దూ పత్రిక ఎడిటర్ జహీద్ అలీఖాన్ గట్టి పోటీ ఇచ్చిన్పపటికీ రెండో స్థానంలోనే ఉండిపోయారు. ఆ తర్వాత టీడీపీ పోటీ ఉనికికే పరిమితమైంది. టీఆర్ఎస్ పార్టీ కూడా ఇక్కడి నుంచి నామమాత్రపు పోటీతోనే సరిపెట్టుకుంటోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో ‘గులాబీ’ అభ్యర్థి పోటీ చేసినా డిపాజిట్ కోల్పోయాడు. గెలుపు ఓటములు తొలిసారి జరిగిన ఎన్నికల్లో ప్రముఖ కమ్యూనిస్టు నేత మగ్దూం మొహియుద్దీన్ ‘పీడీఎఫ్’ పక్షాన పోటీచేసి ఓటమి పాలయ్యారు. స్వాతంత్య్రం అనంతరం మజ్లిస్ పార్టీ పగ్గాలు చేపట్టిన అబ్దుల్ వాహేద్ ఓవైసీ ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగి గట్టి పోటీ ఇచ్చినా విజయం కాంగ్రెస్‌నే వరించింది. జీఎస్ మెల్కోటే హ్యాట్రిక్ సాధించారు. రెండుసార్లు కాంగ్రెస్ పక్షాన, ఒకసారి తెలంగాణ ప్రజా సమితి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పక్షాన కేఎస్ నారాయణ రెండుసార్లు విజయం సాధించారు. మజ్లిస్ పార్టీకి చెందిన సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ ఒకసారి ఓటమి పాలైనా తర్వాత వరుసగా ఆరుసార్లు విజయం సాధించారు. ఒకసారి ఇండిపెండెంట్‌గా, ఐదుసార్లు మజ్లిస్ పక్షాన ఎన్నికయ్యారు. ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ వరసగా మూడు సార్లు ఎన్నికై హ్యాట్రిక్ కొట్టారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ బరిలోకి దిగారు. బీజేపీ పక్షాన బద్దం బాల్‌రెడ్డి మూడు పర్యా యాలు, ఆలె నరేంద్ర, ఎం.వెంకయ్య నాయుడు ఒక్కోసారి పోటీచేసి పరాజయం పాలయ్యారు. కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు కూడా ఒకసారి ఇక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. విజయం.. ఏ పార్టీ ఎన్నిసార్లు.. కాంగ్రెస్ : 06 టీపీఎస్ : 01 మజ్లిస్ : 09 తొలి ఎంపీ : అహ్మద్ మొహియుద్దీన్ ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ : అసదుద్దీన్ ఓవైసీ ప్రస్తుత రిజర్వేషన్ : జనరల్ హైదరాబాద్ లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు.. చార్మినార్ చాంద్రాయణగుట్ట యాకుత్‌పురా బహదూర్‌పురా కార్వాన్ మలక్‌పేట గోషామహల్ -
12 రోజుల ముందే సర్జికల్ దాడులు జరిగి ఉంటే..
సాక్షి, హైదరాబాద్ : పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారకంగా పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళాలు చేసిన మెరుపు దాడి పట్ల యావత్ భారత్ హర్షం వ్యక్తం చేస్తోంది. సర్జికల్ స్ట్రైక్-2తో భారత వాయుసేన.. పుల్వామా ఉగ్రదాడిలో వీరమరణం పొందిన జవాన్లకు ఘన నివాళులర్పించిందని భారత ప్రజలు అభిప్రాయపడుతున్నారు. రాజకీయ నాయకులు, సీనీ ప్రముఖులు, క్రీడాకారులు.. ప్రతి ఒక్కరు ఈ దాడి పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారత వైమానిక దళం జరిపిన ఈ ప్రతీకారక దాడుల్లో సుమారు 200 నుంచి 300 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. ఈ దాడిపై ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఈ సర్జికల్ దాడులు 12 రోజుల ముందే జరిగుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఆలస్యమైనా ఈ సర్జికల్ దాడిని స్వాగతిస్తున్నామని చెప్పారు. ఉగ్రవాదులకు భారత్ గట్టి జవాబు ఇచ్చిందన్నారు. ఈ విషయంలో భారత ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఉంటుందన్నారు. (ఇమ్రాన్.. అమాయకత్వపు ముసుగు తీసేయ్: ఒవైసీ) ఇవి కూడా చదవండి సర్జికల్ స్ట్రైక్ 2 : 300 మంది ఉగ్రవాదులు హతం! ఇప్పుడు నా భర్త ఆత్మకు శాంతి దొరికింది బాంబుల వర్షం కురిసేటప్పుడు మోదీ అక్కడే ఉన్నారా..! పాక్‌ను తగలబెట్టాలి: రాజా సింగ్ -
ఉగ్రవాదులకు భారత్ గట్టి జవాబు ఇచ్చింది
-
ప్రొటెం స్పీకర్‌గా ముంతాజ్ అహ్మద్ ప్రమాణ స్వీకారం
సాక్షి, హైదరాబాద్: ఎంఐఎం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్‌ఖాన్ తెలంగాణ అసెంబ్లీకి ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అహ్మద్ ఖాన్‌తో బుధవారం సాయంత్రం 5 గంటలకు రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు. అసెంబ్లీలో సీనియర్ ఎమ్మెల్యేను ప్రొటెం స్పీకర్‌గా నియమించడం ఆనవాయితీగా వస్తోంది. ఆ సంప్రదాయాన్ని పాటిస్తూ.. చార్మినార్ నియోజకవర్గం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ముంతాజ్ అహ్మద్ ఖాన్‌ను సీఎం కేసీఆర్ ప్రొటెం స్పీకర్‌గా ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. జనవరి 17 నుంచి నాలుగు రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ స్పీకర్ మధుసూధనాచారి, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తదితరులు పాల్గొన్నారు. (ఎంఐఎం ఎమ్మెల్యేకు అరుదైన చాన్స్.. కేసీఆర్‌కు ఒవైసీ థాంక్స్) కాగా, నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ రేపు (గురువారం) ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికి ముందు ఉదయం 11 గంటలకు గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్ద కేసీఆర్ నివాళులు అర్పిస్తారు. కేసీఆర్‌తో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం అసెంబ్లీలో జరిగే కార్యక్రమాల్లో కేసీఆర్ పాల్గొంటారు. రేపు స్పీకర్ ఎన్నికల షెడ్యుల్ ప్రకటన విడుదల చేస్తారు. ఎల్లుండి స్పీకర్‌ను ఎన్నుకుంటారు. 19వ తేదీన తెలంగాణ అసెంబ్లీని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. గవర్నర్ ప్రసంగంపై 20 తేదీన అసెంబ్లీలో ధన్యవాద తీర్మానం ప్రవేశపెడతారు.