
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునే క్రమంలో వినూత్న కార్యాక్రమాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ‘జిమ్ బాయ్’ అవతారమెత్తారు. ఇప్పటికే హైదరాబాద్ ఎంపీగా హ్యాట్రిక్ విజయం సాధించిన ఒవైసీ.. నాలుగోసారి గెలుపు కోసం ప్రచారంలో దూసుకెళ్తున్నారు. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోని చాంద్రాయణగుట్ట అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా అసదుద్దీన్ ఓ జిమ్‌లోకి వెళ్లి సరదాగా కసరత్తులు చేశారు. వయసును ఏమాత్రం లెక్క చేయని ఒవైసీ.. పుల్‌అప్స్ చేస్తూ ఫిట్‌నెస్‌పై యువకులకు సవాల్ విసిరారు. బాడీ బిల్డప్ చేయడానికి తీవ్ర కసరత్తులు చేయాలని, అలాగే కొత్త హైదరాబాద్ నిర్మాణం కోసం భాగస్వాములు కావాలని సూచించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment