
సాక్షి, హైదరాబాద్ : కాల్పుల ఘటన కలకలం రేపిన నేపథ్యంలో ఎంఐఎం ఆదిలాబాద్ శాఖ రద్దు అయింది. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి అహ్మద్ పాషా ఖాద్రీ ప్రకటించారు. శనివారం హైదరాబాద్ దారుస్సలాంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆదిలాబాద్‌లో జరిగిన సంఘటన దురదృష్టకరమన్నారు. త్వరలో నూతన కమిటీతో శాఖను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. కాగా కాల్పుల ఘటనలో గాయపడినవారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
(చదవండి : తుపాకీతో రెచ్చిపోయిన ఎంఐఎం నేత)
Comments
Please login to add a commentAdd a comment