బాధితుల శరీరాల్లో తూటాల తొలగింపు | Bullets Removed From Adilabad Firing Victims | Sakshi
Sakshi News home page

బాధితుల శరీరాల్లో తూటాల తొలగింపు

Published Sun, Dec 20 2020 1:57 AM | Last Updated on Sun, Dec 20 2020 8:02 AM

Bullets Removed From Adilabad Firing Victims - Sakshi

పంజగుట్ట (హైదరాబాద్‌): ఆదిలాబాద్‌లో శుక్రవారం చిన్నపిల్లల ఆట కాస్తా మాటా మాట పెరిగి కాల్పుల వరకు దారితీసిన ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. మొతేషీన్‌ నడుము భాగంలో ఉన్న ఒక తూటా, సయ్యద్‌ జమీర్‌ శరీరంలో రెండు తూటాలను శనివారం నిమ్స్‌ వైద్యులు శస్త్ర చికిత్స చేసి తొలగించారు. ప్రస్తుతం న్యూరోసర్జన్‌ విభాగం, గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగాల నుంచి వారు వైద్య సేవలను పొందుతున్నారు. ప్రస్తుతం ఇరువురి ఆరోగ్యం నిలకడగా ఉందని నిమ్స్‌ వైద్యవర్గాలు పేర్కొన్నాయి.

ఆదిలాబాద్‌ ఏఐఎంఐఎం శాఖ రద్దు 
ఏఐఏంఐఎం ఆదిలాబాద్‌ శాఖను రద్దు చేస్తున్నట్లు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి అహ్మద్‌ పాషా ఖాద్రీ ప్రకటించారు. శనివారం హైదరాబాద్‌ దారుస్సలాంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ..ఆదిలాబాద్‌ ఘటన దురదృష్టకరమని, త్వరలోనే నూతన కమిటీతో శాఖను ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement