ఢిల్లీలో ఎంఐఎం ఇద్దరు అభ్యర్థులు జైల్లోనే
వారి తరఫున విస్తృత ప్రచారం చేస్తున్న
అధినేత అసదుద్దీన్ ఒవైసీ
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోనూ తన అస్థిత్వాన్ని బలంగా చాటుకోవాలని కృతనిశ్చయంతో ఉన్న ఎంఐఎం పార్టీ ముస్లిం ఓటు బ్యాంకు బలంగా ఉన్న రెండు స్థానాల్లో తన పార్టీ చిహ్నమైన పతంగిని ఎగురవేసేందుకు తీవ్ర కసరత్తులే చేస్తోంది. ఆ పార్టీ పోటీ చేస్తున్న ఓఖ్లా, ముస్తఫాబాద్ నియోజకవర్గాల్లో పార్టీ తరఫున పోటీ చేస్తున్న ఇద్దరు అభ్యర్థులూ ఢిల్లీ అల్లర్ల కేసులో జైలు నుంచే తమమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా, వారి తరఫున అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నీతానే ప్రచార బాధ్యతలు మోస్తున్నారు. జైలు నుంచే పార్టీ అభ్యర్థులు తమ వ్యూహాలను అమలు చేస్తుంటే, ప్రచార క్షేత్రంలో ఒవైసీ తన పదునైన మాటలతో ప్రచారం చేస్తున్నారు.
గెలుస్తారా..చీలుస్తారా?
ఓఖ్లా అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తంగా 3.35 లక్షల మంది ఓటర్లుండగా, ఇందులో 1.78 లక్షలు (52.5)శాతం మంది ముస్లింలే ఉన్నారు. ఇక ముస్తఫాబాద్ నియోజకవర్గంలోనూ 2.63 లక్షల ఓటర్లలో 1.03 లక్షలు (40శాతం) ముస్లిం ఓటర్లు. ఈ గణాంకాలను దృష్టిలో పెట్టుకునే ఎంఐఎం ఈ రెండు స్థానాల్లో పోటీకి దిగింది. రెండు నియోజకవర్గాలోనూ 2020 ఢిల్లీ అల్లర్ల కేసులో ముద్దాయిలుగా ఉన్న అభ్యర్థులను రంగంలోకి దించింది. ఓఖ్లా నుంచి ఆప్ మాజీ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్‌ను పోటీలో పెట్టగా, ముస్తఫాబాద్ నుంచి షిఫా ఉర్ రెహా్మన్ పోటీలో ఉన్నారు. వీరిద్దరు పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కి వ్యతిరేకంగా జరిగిన నిరసనల ద్వారా హింసను ప్రేరేపించిన ఆరోపణలతో జైళ్లో ఉన్నారు. కోర్టు నుంచి పెరోల్‌లో బయటకు వచ్చిన ఇద్దరు, నామినేషన్ల అనంతరం తిరిగి జైలుకు వెళ్లారు.
అక్కడి నుంచే తమ అనుచరల ద్వారా ప్రచార వ్యూహాలను రూపొందిస్తున్నారు. ఓఖ్లాలో 2015, 2020 ఎన్నికల్లో ఆప్‌కు చెందిన అమానతుల్లా ఖాన్ 50 వేలకు పైగా భారీ ఆధిక్యంతో గెలుపొందుతూ వస్తున్నారు. అయితే ఇటీవల మనీలాండరింగ్ ఆరోపణలతో ఈడీ అరెస్ట్‌ను ఎదుర్కొని బయటకు వచ్చి తిరిగి పోటీలో ఉన్నారు. ఆయన్ను తట్టుకోవడం ఎంఐఎంకు అంత సులువు కాకున్నా, ఆప్ ఓట్లను చీల్చడంలో ఎంఐఎం కీలకపాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. గడిచిన రెండ్రోజులుగా పార్టీ అధినేత ఒవైసీ ఇక్కడ పర్యటిస్తూ విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఇక ముస్తఫాబాద్‌లో సైతం 2015లో బీజేపీ, 2020లో ఆప్ విజయపతాకం ఎగురవేసింది. గత ఎన్నికల్లో ఆప్ తరఫున హాజీ హుస్సేన్ 53 శాతం ఓట్లతో విజయం సాధించారు. ఇక్కడ ఎంఐఎం తరఫున పోటీ చేస్తున్న షిఫా ఉర్ రెహా్మన్‌కు స్థానికంగా గట్టి పట్టుంది.
ఒకవేళ ఆయన 5–8 శాతం ఓట్లను ప్రభావితం చేసినా బీజేపీ గెలుపు అవకాశాలు మెరుగుపడే అవకాశముంది. ఈ స్థానంలో ఓట్ల చీలిక జరిగితే బీజేపీ తిరిగి గెలిచే అవకాశాలున్నాయి. ఇక రెండు స్థానాల్లో ప్రచారం చేస్తున్న ఓవైసీ సైతం ప్రధానంగా ఆప్ అధినేత కేజ్రీవాల్ లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ‘గత ఐదేళ్లుగా తాహిర్ హుస్సేన్, షిఫా ఉర్ రెహా్మన్ జైలు లోపలే ఉండగా, లిక్కర్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కి ఎలా బెయిల్ వచి్చంది?, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్‌తో సహా ఆప్ నాయకులందరూ బెయిల్ పొందారు, ఈ ఇద్దరు ఇంకా లోపలే ఎందుకు ఉన్నారు’అని ఓవైసీ ప్రశి్నస్తున్నారు. లిక్కర్ పాలసీలో అరెస్టయి బెయిల్‌పై బయటికొచి్చన కేజ్రీవాల్ గెలువగలిగితే, తమ ఇద్దరు అభ్యర్థులు ఎందుకు గెలవరని అడుగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment