సర్వం మోదీ మయం: ఒవైసీ | Asaduddin Owaisi Takes Jibe At Modi Ki Air Force Remark | Sakshi
Sakshi News home page

సర్వం మోదీ మయం: ఒవైసీ

Published Tue, Apr 23 2019 12:40 PM | Last Updated on Tue, Apr 23 2019 3:51 PM

Asaduddin Owaisi Takes Jibe At Modi Ki Air Force Remark - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రధాని నరేంద్ర మోదీ కేంద్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్నారా లేక పబ్జి ఆన్‌లైన్‌ గేమ్‌ ఆడుతున్నారా అని ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ప్రశ్నించారు. బీజేపీ పాలనలో దేశం మొత్తం మోదీ మయం అయిపోయిందని వ్యాఖ్యానించారు. జమ్ముకశ్మీర్‌లో పుల్వామా ఉగ్రదాడి జరిగిన తర్వాత మోదీ తన ఎయిర్‌ఫోర్స్‌ను పంపి పాకిస్తాన్‌లోని ఉగ్రవాదులను మట్టుబెట్టించారని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలపై అసదుద్దీన్‌ ట్విటర్‌లో స్పందించారు. మోదీ సేన, మోదీ వాయుసేన, మోదీ అణుబాంబు.. ఇలా దేశానికి చెందినవన్నీ ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీవి అయిపోయాయని ఎద్దేవా చేశారు.

పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల ర్యాలీలో అమిత్‌ షా మాట్లాడుతూ... ‘పుల్వామా ఉగ్రదాడిలో 44 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి దారుణ ఘటనలు జరిగిన​ప్పుడు గత ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. కానీ మేము అలా కాదు. పుల్వామా ఘటన జరిగిన తర్వాత 13వ రోజునే నరేంద్ర మోదీ తన ఎయిర్‌ఫోర్స్‌ను ఆదేశించి మన ఎయిర్‌క్రాఫ్ట్‌తో పాకిస్తాన్‌ ఉగ్రవాదులను ముక్కలు ముక్కలుగా పేల్చేయించార’ని అన్నారు. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అంతకుముందు వాయుసేనను ‘మోదీ సేన’గా వర్ణించి విమర్శల పాలయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement