
సాక్షి, హైదరాబాద్ : అసెంబ్లీలో తమ పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించి విపక్ష హోదాను కల్పించాలని శాసనసభాపతికి మజ్లీస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) విజ్ఞప్తి చేసింది. ఈ అంశంపై స్పీకర్‌కు ఎంఐఎం శాసనసభాపక్షం ఒక లేఖను ఇటీవల అందజేసింది. కాంగ్రెస్ శాసనసభాపక్షానికి చెందిన 12 మం ది ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో విలీనమైన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.సభలోని మొత్తం సభ్యుల్లో కనీసం పదిశాతం బలం లేకపోతే నిబంధనల మేరకు ఆ పా ర్టీకి ప్రతిపక్షంగా గుర్తింపు, అలాగే దాని నేతకు విపక్షనేత హోదాను ఇవ్వడం సాధ్యం కాదని శాసనసభా వర్గాలు స్పష్టంచేశాయి. 1994లో కాంగ్రెస్‌పార్టీ నుంచి 26 మంది ఎమ్మెల్యేలు గెలవడంతో అప్పుడు కూడా పి.జనార్ధనరెడ్డికి ప్రతిపక్షనేత హోదా ఇవ్వలేదని, సీఎల్‌పీనేతగానే ఆయన వ్యవహరించారని ఉటంకిస్తున్నాయి. శాసనసభలో వివిధ అం శాలపై చర్చ, ప్రసంగాలకు అవకాశమిచ్చే సందర్భంలో మాత్రం సం ఖ్యాబలం దృష్ట్యా ఎంఐఎంకే తొలి అవకాశం లభిస్తుందని తెలిపాయి. అందుకు తగ్గట్టుగానే గురువారం అసెంబ్లీలో పలు బిల్లులపై చర్చ సందర్భంగా ఎంఐఎంకే అవకాశం దక్కిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment