Opposition status
-
హోదా ఇవ్వాల్సిందే
సాక్షి, అమరావతి: వైఎస్సార్ సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా.. చట్టసభలో ప్రజల గళాన్ని వినిపించనివ్వకుండా చేయాలనే కుట్రతో కూటమి సర్కారు వ్యవహరిస్తోందని విపక్ష పార్టీ నేతలు మండిపడ్డారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించి సభ నుంచి వాకౌట్ చేసిన అనంతరం వైఎస్సార్సీపీ నేతలు బొత్స, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టి.చంద్రశేఖర్, వరుదు కళ్యాణి బయట మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష హోదా ఇస్తే తమ పాలనా వైఫల్యాలను చట్టసభ సాక్షిగా నిలదీస్తారనే భయంతోనే కూటమి సర్కారు ఇలాంటి దుర్మార్గ పోకడలను అనుసరిస్తోందని ధ్వజమెత్తారు.ప్రజా గొంతుక వినిపించడానికి వీల్లేకుండా టీడీపీ కూటమి ప్రభుత్వం కుట్ర పన్నిందని అంతకుముందు వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు శాసనసభలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో ఉన్న ఏౖకైక విపక్షం వైఎస్సార్సీపీకి ప్రతిపక్ష హోదా కల్పించకపోవడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి పాతరేసిన చంద్రబాబు ప్రభుత్వ వైఖరికి నిరసనగా అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం కొనసాగుతున్న సమయంలో సభ నుంచి వైఎస్సార్సీపీ వాకౌట్ చేసింది. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సోమవారం ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jaganmohan Reddy) నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉభయ సభల సంయుక్త సమావేశానికి హాజరయ్యారు. ఆయన వెంట శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు.సభలో ఉన్నవి రెండే పక్షాలు: బొత్స సత్యనారాయణ, శాసన మండలిలో ప్రతిపక్షనేతరాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. ప్రజల వాణిని వినిపించేది, వారి కష్టాలపై ఎలుగెత్తేది ప్రతిపక్షమే. అలాంటి ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన హోదా, గౌరవం ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. సభలో ఉన్నవి రెండే పక్షాలు. ఒకటి అధికారంలో ఉన్న కూటమి పార్టీలు... మరొకటి ప్రతిపక్షంగా నిలిచిన వైఎస్సార్సీపీ. సభలో మేం ఒక్కరమే విపక్షంలో ఉన్నాం కాబట్టే మమ్మల్ని ప్రతిపక్షంగా గుర్తించాలని కోరాం.మిర్చి రైతులు పడుతున్న ఇబ్బందులు, వారి కష్టాల గురించి సభలో ప్రస్తావించాం. వైఎస్ జగన్ గుంటూరు మిర్చియార్డు వద్దకు వెళ్లిన తరువాతే ఈ ప్రభుత్వం మేలుకుని రైతుల గురించి ఆలోచించడం మొదలు పెట్టింది. అయినా నేటికీ మిర్చి కొనుగోళ్లు చేయడం లేదు. కేంద్రం స్పందించాలని, కేంద్రమే కొనుగోలు చేయాలని అంటున్నారు. మార్క్‌ఫెడ్ ద్వారా మిర్చి ఎందుకు కొనుగోలు చేయడం లేదు? ఇటువంటి అంశాలపై మాట్లాడాలంటే మాకు ప్రతిపక్ష హోదా కావాలి. అప్పుడే మాకు తగినంత సమయం లభిస్తుంది. మిర్చి రైతులను కలిసిన మా నాయకుడిపై కేసులు పెట్టారు.మ్యూజికల్ నైట్ కోసం హంగూ ఆర్భాటంగా వెళ్లిన వారిపై మాత్రం ఎటువంటి కేసులు లేవు. ఇటువంటి నిరంకుశ విధానాలను ప్రశ్నించాలంటే ప్రతిపక్షంగా మాకు సరైన సమయం ఇవ్వాలి. ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ అంటూ హామీలు ఇచ్చారు. నేటికీ వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారు. కొత్తగా ప్రవేశపెట్టే బడ్జెట్లోనూ కేటాయింపులు లేకుండా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం. సర్కారు వైఖరిని ఎండగడుతూ ప్రజల సమస్యలను మీడియా ముఖంగా ప్రశ్నిస్తాం. క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లి పోరాటం చేస్తాం.ప్రభుత్వ వైఫల్యాలను చొక్కా పట్టుకుని నిలదీస్తాం. రాష్ట్రంలో అన్ని వర్గాల వారు ఇబ్బందుల్లో ఉన్నారు. మిర్చి రైతులకు మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. మార్కెట్ జోక్యంతో ఆదుకోకుండా కేంద్రం ఎప్పుడో కొనుగోలు చేస్తుందని మిర్చి రైతులను గాలికి వదిలేయడం సరికాదు. అప్పటి వరకు రైతులు తట్టుకునే పరిస్థితిలో లేరు. రైతులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితిని కల్పించవద్దు. ప్రభుత్వం వెంటనే దీనిపై ఆలోచన చేయాలనేది మా డిమాండ్. అసెంబ్లీకి వెళ్లాలా వద్దా అనే దానిపై ప్రభుత్వ ప్రతిస్పందన చూసి నిర్ణయం తీసుకుంటాం.సభలో నిలదీస్తామనే భయంతోనే: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రిటీడీపీ కూటమి ప్రభుత్వం ప్రతి సందర్భంలోనూ వైఎస్సార్ సీపీని లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున విష ప్రచారం చేస్తోంది. గత ప్రభుత్వంలో విధ్వంసం జరిగిందంటూ బురద చల్లటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఎనిమిది నెలలు గడుస్తున్నా ప్రజలకు ఏం చేస్తారో మాత్రం చెప్పడం లేదు. ప్రజల గళాన్ని వినిపిస్తుందనే భయంతోనే వైఎస్సార్సీపీని ప్రతిపక్షంగా గుర్తించడం లేదు. మా నాయకుడు వైఎస్ జగన్ సభలో మాట్లాడేందుకు ప్రతిపక్ష నేతగా అవకాశం కల్పించాలి. ఇప్పటికే దీనిపై న్యాయ పోరాటం కూడా చేస్తున్నాం.వైఎస్సార్సీపీని ప్రతిపక్షంగా గుర్తించాలని గవర్నర్‌ని కోరాం. ప్రభుత్వం దీనిపై స్పందించకపోవడంతో నిరసన వ్యక్తం చేసి సభ నుంచి వాకౌట్ చేశాం. దేశంలో ఎక్కడైనా సరే ప్రతిపక్షానికే పీఏసీ చైర్మన్ పదవి ఇస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనూ ఆ పదవిని ప్రతిపక్షానికే ఇచ్చాం. గతంలో ఒకే ఒక్క శాసనసభ్యుడు ఉన్న కాంగ్రెస్ పార్టీకి పీఏసీ చైర్మన్ పదవి ఇచ్చారు. ప్రపంచంలో ఒక్క ఆఫ్ఘనిస్తాన్‌లో మాత్రమే తాలిబన్ల పాలనలో కేవలం అధికార పక్షం మాత్రమే పని చేస్తుంది. ప్రతిపక్షం లేకుండా టీడీపీ మన రాష్ట్రంలో తాలిబన్ పాలన సాగిస్తోంది. దేశంలో మరెక్కడా లేదు: వరుదు కళ్యాణి ఎమ్మెల్సీరాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోంది. సభలో మూడు పార్టీలు అధికార పక్షంగానే ఉన్నాయి. వైఎస్సార్సీపీ ఒక్కటే ప్రతిపక్షం. కాబట్టి ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వరు? ఒక్క ఏపీ మినహా దేశంలో ఎక్కడా ఇలా లేదు. గతంలో ఢిల్లీలో బీజేపీ తరఫున కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలు ఎన్నిక కాగా, ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కల్పించారు. కూటమి పాలనలో జరుగుతున్న అక్రమాలను ఎక్కడ సభలో నిలదీస్తారోననే భయంతోనే వైఎస్సార్ సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు.కూటమి పాలన చూశాక ఇటువంటి పార్టీలకు ఎందుకు ఓటు వేశామని ప్రజలు బాధపడుతున్నారు. ప్రతిపక్ష హోదాపై కోర్టులో పిటిషన్ వేస్తే స్పీకర్ కనీసం కౌంటర్ కూడా దాఖలు చేయకపోవడం దారుణం. కేంద్రంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ ఏపీకి ప్రత్యేక హోదాపై ఎందుకు ప్రశ్నించడం లేదు? పోలవరం ఎత్తు తగ్గిస్తున్నా ఎందుకు నిలదీయలేకపోతున్నారు? వైఎస్సార్ సీపీకి అప్పు రత్న అవార్డు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు తొమ్మిది నెలల్లోనే ఏకంగా రూ.1.19 లక్షల కోట్లు అప్పులు తెచ్చిన సీఎం చంద్రబాబుకు అంతకంటే గొప్ప బిరుదు ఏం ఇవ్వాలో పవన్ కళ్యాణ్ చెప్పాలి.11 మందిని ఎదుర్కొనే సత్తా లేదా?పదకొండు మందిని ప్రతిపక్షంగా ఎదుర్కొనే సత్తా కూటమి ప్రభుత్వానికి లేదా? ప్రజలు వైఎస్సార్ సీపీకి 41 శాతం ఓట్ షేర్ ఇచ్చారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభలో మా గళం వినిపించేందుకు తగిన సమయం లభిస్తుంది. కూటమి ప్రభుత్వం పాలనను గాలికి వదిలేసింది. తమ వైఫల్యాలను సభలో ఎండగడతారనే భయంతో ప్రతిపక్షంగా వైఎస్సార్సీపీని గుర్తించేందుకు నిరాకరిస్తోంది. రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యం, రైతుల పక్షాన మాట్లాడాల్సిన అవసరం లేదా? అధికార మదంతో ప్రతిపక్షం గొంతును నొక్కేస్తున్నారు. రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా? ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత గవర్నర్‌కు లేదా? ప్రజాస్వామిక విలువలను కాపాడి ప్రజల పక్షాల పాలన సాగేలా ఆయన చొరవ తీసుకోవాలి. కూటమి సర్కారు నిరంకుశ పాలనకు పరాకాష్ట నాలుగు మీడియా సంస్థలను నిషేధించడం. దేశ చరిత్రలో నోటీస్ ఇవ్వకుండా నాలుగు చానెళ్లను బహిష్కరించిన ఘటనలు ఎప్పుడూ లేవు. – ఎమ్మెల్యే టి.చంద్రశేఖర్విపక్షం వాకౌట్చట్ట సభలో ప్రజల గొంతుక వినిపించాలంటే వైఎస్సార్సీపీకి ప్రతిపక్ష హోదా కల్పించాల్సిందేనని పార్టీ ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో పట్టుబట్టారు. శాసనసభ సభలోకి గవర్నర్ ప్రవేశించి ప్రసంగిస్తుండగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ స్థానాల్లో నిలబడి ఆందోళన చేశారు. వారి ఆందోళనను పట్టించుకోకుండా గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ క్రమంలో సేవ్ డెమోక్రసీ.. ఉయ్ వాంట్ జస్టిస్.. అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్పీకర్ పోడియం వద్దకు చేరుకున్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి.. వైఎస్సార్సీపీకి ప్రతిపక్ష హోదా కల్పించండి... అంటూ నినాదాలు చేశారు. బాబు ష్యూరిటీ.. మోసం, బాదుడు గ్యారంటీ!మద్దతు ధర లభించక తీవ్రంగా నష్టపోయిన మిర్చి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు సభలో ప్లకార్డులు ప్రదర్శించారు. బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ.. బాబు ష్యూరిటీ.. ధరల బాదుడు గ్యారంటీ.. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన చేపట్టారు. నిరసనలను పట్టించుకోకుండా గవర్నర్ ప్రసంగాన్ని కొనసాగిస్తుండటంతో సభ నుంచి వైఎస్సార్ సీపీ వాకౌట్ చేసింది. వైఎస్ జగన్ వెంట నినాదాలు చేస్తూ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభ నుంచి నిష్క్రమించారు. -
‘కూటమి ప్రభుత్వానికి దమ్ముంటే వైఎస్సార్సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలి’
సాక్షి,వైఎస్సార్‌జిల్లా: వైఎస్సార్సీసీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే తమ బాగోతం బయటపడుతుందనే భయం అధికార పక్షానికి పట్టుకుంది. అందుకే తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు విముఖత వ్యక్తం చేస్తుందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. దమ్ముంటే వైఎస్సార్సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం (ఫిబ్రవరి24) ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కూటమి ప్రభుత్వం తర్వాత సభలో ఉంది తామేనని, కాబట్టి ప్రజాగళం వినిపించేందుకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే అంశంపై ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘ప్రతిపక్షం ఉండేది కేవలం వైఎస్సార్సీపీనే. 11 సీట్లంటున్నారు. కానీ.. 40 శాతం ఓట్లు వచ్చాయనేది మర్చిపోతున్నారా?. నలుగురు ఎంపీలున్నారు..11 మంది ఎమ్మెల్యేలున్నారు. నిజంగా ఈ ప్రభుత్వానికి దమ్ముంటే ప్రజల గొంతు వినే ఉద్దేశం ఉంటే వైఎస్సార్సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. ఇతర ఎమ్మెల్యేలకు ఇచ్చినట్లు వైఎస్సార్సీపీ అధినేత, వైఎస్ జగన్మోహన్రెడ్డికి రెండు నిమిషాలు మాత్రమే మైక్ ఇస్తామంటే ఎలా? అదే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే ముఖ్యమంత్రి గంట మాట్లాడితే 40 నిమిషాలు ప్రధాన ప్రతిపక్షనేత మాట్లాడే అవకాశం ఉంటుంది. ప్రజల గొంతుక అసెంబ్లీలో వినిపించే అవకాశం ఉంటుంది. ప్రధాన ప్రతిపక్షహోదా ఇవ్వకపోతే ప్రజల సమస్యలను వినిపించే అవకాశమే ఉండదు. వైఎస్ జగన్‌ను అవమానిస్తున్నామని స్పీకర్, చంద్రబాబు అనుకుంటున్నారు కానీ..ప్రజలను అవమానిస్తున్నారనేది మర్చిపోతున్నారు.ప్రధాన ప్రతిపక్షాన్ని గుర్తించండి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అనే నినాదంతోనే మేం అసెంబ్లీకి వెళ్లాం. ప్రధాన ప్రతిపక్షనేతగా జగన్ వెళ్తే వీళ్లకి ఏ రకమైన సినిమా కనిపిస్తుందో వాళ్లకు తెలుసు. వాళ్లిచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేదు.ఇదే అంశంపై వైఎస్ జగన్ మాట్లాడటం మొదలు పెడితే వాళ్లు సమాధానం చెప్పలేరు. దాని నుంచి తప్పించుకోవడం కోసమే ప్రధాన ప్రతిపక్షహోదా ఇవ్వకుండా ఇలా వ్యవహరిస్తున్నారు.నిజంగా పులివెందులకు ఉప ఎన్నిక వస్తుందనే ముచ్చట పడితే కూటమి గాలిలో 65 వేల ఓట్లతో బీటెక్ రవి ఓడిపోయాడు.వాళ్లకు అంత ముచ్చటగా ఉంటే..పులివెందుల, కుప్పం, మంగళగిరి, పిఠాపురం నాలుగు చోట్లా రాజీనామాలు చేయండి. ఎన్నికలకు వెళ్దాం.ఈ తొమ్మిది నెలల పాలనకు రిఫరెండంగా, సూపర్ సిక్స్ పాలనకు రిఫరెండంగా ఎన్నికలకు వెళ్లి చూసుకుందాం. ప్రజలేం తీర్పు ఇస్తారో చూద్దాం..కాకమ్మ కబుర్లు, దద్దమ్మ మాటలు మాట్లాడొద్దు’ అని కూటమి ప్రభుత్వంపై ఘాటు విమర్శలతో విరుచుకు పడ్డారు. -
జగన్ పిటిషన్.. స్పీకర్ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు
సాక్షి, విజయవాడ: ప్రతిపక్ష హోదా కల్పించాలని వైఎస్సార్సీపీ అధినేత, ఆ పార్టీ శాసన సభాపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పిటిషన్‌పై ఏపీ హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. కక్షపూరితంగా ప్రతిపక్ష నేత హోదా ఇవ్వటం లేదని వైఎస్ జగన్ తరఫున న్యాయవాది తన వాదనను వినిపించారు.ప్రతిపక్ష నేతగా గుర్తించాలని స్పీకర్‌కు వైఎస్ జగన్ రిప్రజెంటేషన్ ఇచ్చారా అని న్యాయమూర్తి ప్రశ్నించగా, గత నెల 24న ఇచ్చారని కోర్టుకు వైఎస్ జగన్ తరఫున న్యాయవాది తెలిపారు. అసెంబ్లీ సెక్రటరీ, స్పీకర్ కార్యదర్శికి కోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ మూడు వారాలకు విచారణను కోర్టు వాయిదా వేసింది.కాగా, శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీకి 11 సీట్లు వచ్చాయన్న కారణంతో తమ పార్టీకి ప్రతిపక్ష హోదా, తనకు ప్రతిపక్ష పార్టీ నేత హోదా ఇచ్చే విషయంలో స్పీకర్ నాన్చుడు ధోరణి ప్రదర్శిస్తున్నారని, ప్రతిపక్ష హోదా ఇచ్చే ఉద్దేశం లేనందునే ఇలా చేస్తున్నారంటూ వైఎస్ జగన్ ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
వైఎస్ జగన్ పిటిషన్‌పై విచారణ 30కి వాయిదా
సాక్షి, అమరావతి: శాసన సభలో వైఎస్సార్సీపీకి ప్రతిపక్ష హోదా, తనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేలా స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ ఆ అధినేత, పార్టీ శాసన సభాపక్ష నేత వైఎస్ జగన్ దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణను హైకోర్టు 30కి వాయిదా వేసింది. జగన్ దాఖలు చేసిన వ్యాజ్యానికి విచారణార్హత లేదని, ఈ అంశంపై స్వయంగా వాదనలు వినిపిస్తానని, విచారణ వాయిదా వేయాలని ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ చేసిన అభ్యర్థన మేరకు హైకోర్టు విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీకి 11 సీట్లు వచ్చాయన్న కారణంతో తమ పార్టీకి ప్రతిపక్ష హోదా, తనకు ప్రతిపక్ష పార్టీ నేత హోదా ఇచ్చే విషయంలో స్పీకర్ నాన్చుడు ధోరణి ప్రదర్శిస్తున్నారని, ప్రతిపక్ష హోదా ఇచ్చే ఉద్దేశం లేనందునే ఇలా చేస్తున్నారంటూ వైఎస్ జగన్ ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యం శుక్రవారం జస్టిస్ రవి ముందుకు విచారణకు వచ్చింది. ఆ వెంటనే ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. తాను శాసన వ్యవహారాలు, న్యాయ శాఖ కార్యదర్శి తరఫున హాజరవుతున్నానని తెలిపారు. ప్రస్తుతం తాను అందుబాటులో లేనని, విచారణ రెండు రోజులు వాయిదా వేయాలని కోరారు. ఈ సమయంలో జగన్ తరఫున సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్య శ్రీరామ్ స్పందిస్తూ.. ఈ వ్యాజ్యంలో ఇతర ప్రతివాదులు కూడా ఉన్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వారి వైఖరి ఏమిటో తెలుసుకోవాలన్నారు. సింగిల్ జడ్జి ముందుకు నేహా రెడ్డి వ్యాజ్యంవిశాఖపట్నం భీమిలి సముద్ర తీరం సమీపంలో ఉన్న తమ ప్రహరీని కూల్చివేసేందుకు గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు జారీ చేసిన తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి కుమార్తె పెనకా నేహా రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంపై సింగిల్ జడ్జి విచారణ జరపడం సబబని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. నేహారెడ్డి వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి ముందుంచాలని, సోమవారం విచారణకు వచ్చేలా చూడాలని రిజిస్ట్రీని ఆదేశించింది. అధికారుల ఉత్తర్వులు చట్ట విరుద్ధంగా ఉంటే వాటిని సవాలు చేసే హక్కు నేహా రెడ్డికి ఉందని ధర్మాసనం తెలిపింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
పయ్యావుల వ్యాఖ్యలతో కుట్ర బట్టబయలు
అమరావతి, సాక్షి: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అనుమానించిందే జరుగుతోంది. అసెంబ్లీలో వైఎస్సార్సీపీ అణగదొక్కాలని, రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా చేయాలన్న ప్రభుత్వ కుట్ర.. సాక్షాత్తూ మంత్రి పయ్యావుల వ్యాఖ్యలతో బయటపడింది. వైఎస్సార్సీపీ ప్రతిపక్ష హోదా అంశంపై స్పీకర్ అయ్యన్నపాత్రుడికి మంగళవారం వైఎస్ జగన్ సుదీర్ఘమైన లేఖ రాశారు. అందులో ఎన్నో కీలకాంశాలను ప్రస్తావించారాయన. అంతేకాదు.. ప్రతిపక్ష హోదా ఉంటేనే ప్రజా గళం వినిపించేందుకు అవకాశం ఉంటుందని, గతంలో ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు పలు పార్టీలకు ప్రతిపక్ష హోదా ఇచ్చిన సందర్భాల్ని సైతం ఆయన ఉటంకించారు. అయినప్పటికీ.. ప్రతిపక్ష హోదాను వైఎస్సార్సీపీకి దక్కనివ్వకుండా ప్రభుత్వం బలంగా నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది.ఈ లేఖపై శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ను మీడియా స్పందించాలని కోరింది. దానికి పయ్యావుల వివరణ ఇస్తూ.. "అసెంబ్లీలో జగన్‌కు ప్రతిపక్ష నాయకుడి హోదా దక్కే అవకాశమే లేదని" అన్నారు. అంతేకాదు ఆయన ఫ్లోర్ లీడర్‌గా మాత్రమే ఉంటారని చెబుతున్నారు. పైగా "స్పీకర్ కి లేఖ రాసినంత మాత్రాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం సాధ్యం కాదని, కేంద్రంలో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా దక్కేందుకు పదేళ్లు పట్టిందంటూ" వెటకారంగా మాట్లాడారు.దేశ రాజకీయాల్లో ఇలాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ అంశాన్ని గనుక పరిశీలిస్తే.. ఏదైనా చట్ట సభలో అధికార పార్టీ/ అధికారంలో ఉండే పార్టీల తర్వాత పెద్ద పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కాలి. కానీ, ఏపీ అసెంబ్లీలో ఆ సంప్రదాయాన్ని తుంగలో తొక్కే ప్రయత్నం జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. శాసనసభలో మేం గొంతు విప్పే అవకాశాలు కనిపించడం లేదని, ప్రతిపక్ష హోదా ఉంటేనే అది సాధ్యమవుతుందని స్పీకర్‌కు రాసిన లేఖలో జగన్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ శాలరీస్ అండ్ పెన్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ 1953 చట్టం 12-బీ ప్రకారం ప్రధాన ప్రతిపక్ష పార్టీ అంటే ఎవరనే విషయాన్ని స్పష్టంగా నిర్వచించిందని లేఖలోనే స్పష్టం చేశారు.ఇక.. ప్రతిపక్ష హోదా ఇవ్వడం స్పీకర్ పరిధిలోని అంశం. జగన్ రాసిన లేఖపై ఇంకా స్పీకర్ నుంచి బదులు రాలేదు. ఈలోపే పయ్యావుల, వైఎస్సార్సీపీకి ప్రతిపక్ష హోదా రాదని చెప్పడం దేనికి సంకేతం? అనే చర్చ మొదలైంది. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వీలు లేకుండా.. అసలు వైఎస్సార్సీపీకి ప్రతిపక్ష హోదానే లేకుండా చేయాలన్నది కూటమి ప్రభుత్వ కుట్రగా ఇప్పుడు తేటతెల్లమయ్యింది. -
ప్రజల గొంతును గుర్తించండి.. స్పీకర్ అయ్యన్నపాత్రుడికి వైఎస్ జగన్ లేఖ
అంతరంగం అప్పుడే అర్థమైంది..ఈ నెల 21న అసెంబ్లీలో జరిగిన ఎమ్మెల్యేల ప్రమాణం కార్యక్రమాన్ని పరిశీలిస్తే నాకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వరనే అభిప్రాయం కలిగింది. అసెంబ్లీ సంప్రదాయాల ప్రకారం ముందుగా సభా నాయకుడు, తర్వాత ప్రతిపక్ష నాయకుడు, అనంతరం మంత్రులు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా అలా జరగలేదు. సంప్రదాయాలకు విరుద్ధంగా మంత్రుల తర్వాతే నాతో ప్రమాణం చేయించారు. నాకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకూడదనే నిర్ణయాన్ని మీరు ముందుగానే తీసుకున్నట్లు కనిపిస్తోంది.సాక్షి, అమరావతి: ప్రజా సమస్యలను చట్టసభల్లో బలంగా వినిపించేందుకు ప్రతిపక్ష హోదా ఉండాల్సిందేనని, ఈ విషయంలో పరిశీలన చేయాలని కోరుతూ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం లేఖ రాశారు. ప్రతిపక్ష పార్టీగా గుర్తింపుతో సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చట్టబద్ధమైన భాగస్వామ్యం లభిస్తుందన్నారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10 శాతం సీట్లు సాధించాలని చట్టంలో ఎక్కడా లేదన్నారు. విపక్ష పార్టీల్లో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో నిర్వచించారని పేర్కొన్నారు. శాసనసభలో కూటమి పార్టీల ఉద్దేశపూర్వక చర్యలను సైతం లేఖలో ప్రస్తావించారు. వైఎస్ జగన్ లేఖలో ముఖ్యాంశాలు ఇవీ..శతృత్వాన్ని ప్రదర్శిస్తున్నారు..మంత్రుల తర్వాత నాతో ప్రమాణం చేయించడం సంప్రదాయాలకు పూర్తి విరుద్ధం. ప్రధాన ప్రతిపక్ష నాయకుడి గుర్తింపు ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించినట్లు దీనిద్వారా కనిపిస్తోంది. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో నిర్వచించారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే పది శాతం సీట్లు సాధించి ఉండాలని చట్టంలో ఎక్కడా లేదు. పార్లమెంట్లోగానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోగానీ ఈ నిబంధన పాటించలేదు. అధికార కూటమి, స్పీకర్ ఇప్పటికే నాపట్ల శతృత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. చచ్చేదాకా కొట్టాలంటూ స్పీకర్ చేసిన వ్యాఖ్యలు వీడియోల ద్వారా బయటపడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో అసెంబ్లీలో గొంతు విప్పే అవకాశాలు కనిపించడం లేదు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా గుర్తింపుతోనే ప్రజా సమస్యలను బలంగా వినిపించే ఆస్కారం ఉంటుంది. ప్రతిపక్ష పార్టీగా గుర్తింపుతో సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చట్టబద్ధమైన భాగస్వామ్యం లభిస్తుంది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని నా లేఖను పరిశీలించాలని కోరుతున్నా.చట్టంలో స్పష్టంగా ఉంది.. ప్రధాన ప్రతిపక్ష పార్టీ, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అంటే ఎవరనే విషయాన్ని చట్టంలో స్పష్టంగా పొందుపరిచారు. ‘ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ శాలరీస్ అండ్ పెన్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ 1953 చట్టం 12 ఆ’ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అంటే ఎవరనే విషయాన్ని స్పష్టంగా నిర్వచించింది. విపక్షంలో ఉన్న పార్టీల్లో ఎవరికి ఎక్కువ సంఖ్యా బలం ఉంటే వారికే ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టం చెబుతుంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకుని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినందున విపక్షంలో ఉన్న ఏకైక పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కానీ జూన్ 21న జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని చూస్తే వైఎస్సార్సీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడం, పార్టీ శాసనసభా పక్ష నాయకుడిగా నన్ను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించడంలో మీ ఉద్దేశాలేమిటో బయటపడ్డాయి. కానీ చట్టాన్ని పరిశీలిస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడంలోగానీ, పార్టీ శానసభా పక్షనేత అయిన నన్ను ప్రధాన ప్రతిపక్ష నేతగా స్పీకర్ గుర్తించేందుకుగానీ ఎలాంటి సందిగ్ధతకు తావులేదు. ఇటీవల స్పీకర్ చేసిన వ్యాఖ్యలు యూట్యూబ్ ఛానళ్లలో ఉన్నాయి. ఓడిపోయాడుగానీ చావలేదు.. చచ్చేవరకూ కొట్టాలి..! అంటూ నన్ను ఉద్దేశించి గౌరవ స్పీకర్ అన్న మాటలు ఆ వీడియోల్లో ఉన్నాయి. తద్వారా నాపై ఉన్న శత్రుత్వాన్ని స్పీకర్ రూపంలో అధికార కూటమి వ్యక్తం చేసింది.వైఎస్సార్ సీపీ 40 శాతం ఓట్లను సాధించింది..ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ 40 శాతం ఓట్లను సాధించింది. ప్రజా సంబంధిత అంశాలపై అసెంబ్లీలో ప్రజల తరఫున ప్రాతినిథ్యం వహించాల్సిన బాధ్యత మాపై ఉంది. అయితే ప్రభుత్వం, స్పీకర్ శత్రుత్వ వైఖరిని ప్రదర్శిస్తున్న నేపథ్యంలో మా పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకుంటే అసెంబ్లీ కార్యకలాపాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని కట్టడి చేస్తున్నట్లే అవుతుంది. వైఎస్సార్ సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం వల్ల అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడికి తగిన సమయం లభిస్తుంది. దీనివల్ల ప్రజా సంబంధిత అంశాలను సభ దృష్టికి బలంగా తేగలుగుతారు. సభా కార్యక్రమాల్లో ముమ్మరంగా పాల్గొనేలా, ప్రభుత్వ విధానాలపై ప్రతిపక్ష పార్టీగా అభిప్రాయాలను చెప్పేలా చట్టబద్ధమైన భాగస్వామ్యం ప్రధాన ప్రతిపక్ష పార్టీకి లభిస్తుంది. ఇలాంటి పరిస్థితి లేకపోతే అసెంబ్లీలో అధికార కూటమి గొంతు మాత్రమే వినిపిస్తుంది. వివిధ అంశాల్లో బలమైన చర్చలు జరిగే అవకాశం కనిపించదు.ఉపేంద్ర, పీజేఆర్‌ను ప్రధాన ప్రతిపక్ష నేతలుగా గుర్తించారు.. అసెంబ్లీలో 10 శాతం సీట్లు రానందున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్షానికి ప్రధాన ప్రతిపక్ష హోదా లభించదనే చర్చ జరుగుతోంది. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 208 కింద ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నోటిఫై చేసిన సభా ప్రవర్తనా నియమావళిలో నిర్దిష్ట సీట్లు వస్తేనే ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలనే విషయాన్ని ఎక్కడా చెప్పలేదనే విషయాన్ని మీ ముందుకు తెస్తున్నా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎక్కడా ఈ నిబంధన పాటించలేదనే అంశాన్ని గుర్తు చేస్తున్నా. లోక్‌సభకు 1984లో 543 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ 30 ఎంపీ సీట్లను గెలుచుకుంది. సభలో 10 శాతం సీట్లు సాధించనప్పటికీ నాడు టీడీపీకి చెందిన పర్వతనేని ఉపేంద్రను ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించారు. 1994 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 294 సీట్లకుగానూ కాంగ్రెస్ 26 సీట్లు మాత్రమే సాధించింది. 10 శాతం సీట్లు కాంగ్రెస్‌కు దక్కనప్పటికీ పి.జనార్థనరెడ్డిని నాడు ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించారు.3 సీట్లు వచ్చిన బీజేపీకి సైతం..2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకుగానూ బీజేపీ కేవలం 3 సీట్లు సాధించినప్పటికీ ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఈ అంశాలన్నీ కూడా కేవలం ప్రజా ప్రయోజనాల రీత్యా మీ దృష్టికి తెస్తున్నా. ప్రజల తరఫున అసెంబ్లీలో గొంతు విప్పడానికి తగిన సమయం లభించాలనే ఉద్దేశంతో మీకు ఈ లేఖ రాస్తున్నా. అయితే ఇలాంటి పరిస్థితికి ఆస్కారం లేకుండా అధికార కూటమి ఇప్పటికే శతృత్వాన్ని ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో నేను సభలో మాట్లాడాలనుకుంటే అది భారీ మెజార్టీ సాధించిన అధికార కూటమి దయమీద, నన్ను చచ్చేవరకూ కొట్టాలన్న స్పీకర్ గారి విచక్షణ మీదే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం సభలో ఉన్న పార్టీల సంఖ్యా బలాలను దృష్టిలో ఉంచుకుని ఈ లేఖను పరిశీలించాలని కోరుతున్నా. -
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్‌కు వైఎస్ జగన్ లేఖ
అమరావతి, సాక్షి: ప్రజా సమస్యలను చట్టసభల్లో బలంగా వినిపించేందుకు ప్రతిపక్ష హోదా ఉండాల్సిందేనని, ఈ విషయంలో పరిశీలన చేయాలని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడికి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ రాశారు. ఈ క్రమంలో సభలో కూటమి ఉద్దేశపూర్వక చర్యలను సైతం ఆయన ప్రస్తావించారు.‘‘ఈ నెల 21న అసెంబ్లీలో జరిగిన ఎమ్మెల్యేల ప్రమాణం కార్యక్రమాన్ని చూస్తే ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదా నాకు ఇవ్వరనే అభిప్రాయం కలిగింది.అసెంబ్లీ విధానం ప్రకారం ముందుగా సభా నాయకుడు, తర్వాత ప్రతిపక్ష నాయకుడు, ఆ తర్వాత మంత్రులు ప్రమాణ స్వీకారం చేయాలి, కానీ అలా జరగలేదు. సంప్రదాయాలకు విరుద్ధంగా మంత్రుల తర్వాతే నాతో ప్రమాణం చేయించారు. నాకు ప్రధాన ప్రతిపక్షనాయకుడి హోదా ఇవ్వకూడదనే నిర్ణయాన్ని మీరు ముందుగానే తీసుకున్నట్టు కనిపిస్తోంది.👉 ప్రధాన ప్రతిపక్ష పార్టీ, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అంటే ఎవరనే విషయాన్ని చట్టంలో స్పష్టంగా పొందుపరిచారు. ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ శాలరీస్ అండ్ పెన్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ -1953 చట్టంలోని 12-Bలో ప్రధాన ప్రతిపక్షం అంటే ఎవరనే విషయాన్ని నిర్వచించారు. విపక్షంలో ఉన్నపార్టీల్లో ఎవరికి ఎక్కువ సంఖ్యాబలం ఉంటే వారికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టం చెబుతోంది. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకుని, సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వల్ల విపక్షంలో ఉన్న ఏకైక పార్టీ వైఎస్సార్సీపీ మాత్రమే. 👉 కానీ.. జూన్ 21న జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని చూస్తే YSRCPని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించడంలో కాని, ఆ పార్టీ శాసనసభా పక్ష నాయకుడిగా నన్ను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించడంలోకాని, మీ ఉద్దేశాలేంటో బయటపడ్డాయి. చట్టాన్ని చూస్తే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడంలో కానీ, ఆ పార్టీ శాసనసభా పక్షనేత అయిన నన్ను ప్రధాన ప్రతిపక్షనేతగా స్పీకర్ గుర్తించడంలో ఎలాంటి సందిగ్ధతకు తావు లేదు.👉 గౌరవ స్పీకర్ ఇటీవల నన్ను ఉద్దేశించి అన్న మాటలు యూట్యూబ్ ఛానళ్లలో పబ్లిష్ అయ్యాయి. "ఓడిపోయాడు కాని చావలేదు, చచ్చేవరకూ కొట్టాలి" అంటూ నన్ను ఉద్దేశించి గౌరవ స్పీకర్ అన్న మాటలు ఆ వీడియోల్లో ఉన్నాయి. తద్వారా నాపై ఉన్న శత్రుత్వాన్ని స్పీకర్ రూపంలో అధికార కూటమి వ్యక్తం చేసింది.👉 ఇటీవల జరిగిన ఎన్నికల్లో YSRCP 40శాతం ఓట్లను సాధించింది. ప్రజా సంబంధిత అంశాలపై అసెంబ్లీలో ప్రజల తరఫున ప్రాతినిథ్యం వహించాల్సిన బాధ్యత మాపై ఉంది. ప్రభుత్వం, స్పీకర్ శత్రుత్వ వైఖరిని ప్రదర్శిస్తున్న నేపథ్యలో మా పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఒకవేళ ఇవ్వకుంటే అసెంబ్లీ కార్యకలాపాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని కట్టడి చేస్తున్నట్టవుతుంది. YSRCPకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం వల్ల అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడికి తగిన సమయం లభిస్తుంది. దీనివల్ల ప్రజా సంబంధిత అంశాలను సభ దృష్టికి బలంగా తీసుకురాగలుగుతారు.👉 సభాకార్యక్రమాల్లో ముమ్మరంగా పాల్గొనేలా, ప్రభుత్వ విధానాలపై ప్రతిపక్ష పార్టీగా అభిప్రాయాలను చెప్పేలా చట్టబద్ధమైన భాగస్వామ్యం ప్రధాన ప్రతిపక్షానికి లభిస్తుంది. ఇలాంటి పరిస్థితి లేకపోతే అసెంబ్లీలో గణనీయమైన సీట్లు సాధించిన అధికార కూటమి గొంతు మాత్రమే వినిపిస్తుంది కాని, వివిధ అంశాల్లో సరైన చర్చలు జరిగే అవకాశం ఉండదు.👉అసెంబ్లీ సీట్లలో 10శాతం సీట్లు రానందున వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శానసభాపక్షానికి ప్రధాన ప్రతిపక్ష హోదా రాదనే చర్చ జరుగుతోంది. భారత రాజ్యంగం ప్రకారం ఆర్టికల్-208 కింద ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నోటిఫై చేసిన సభా ప్రవర్తనా నియమావళిలో ఇన్ని సీట్లు వస్తేనే ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలనే విషయాన్ని ఎక్కడా చెప్పలేదన్న విషయాన్ని మీ ముందుకు తెస్తున్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఎక్కడా ఈ నిబంధన పాటించలేదనే అంశాన్ని గుర్తుచేస్తున్నాను. 1984లో లోక్‌సభలో 543 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ 30 ఎంపీ సీట్లను గెలుచుకుంది. సభలో 10శాతం సీట్లు లేకపోయినప్పటికీ అప్పుడు టీడీపీకి చెందిన పర్వతనేని ఉపేంద్రను ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించారు. 1994 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 294 సీట్లకు గాను కాంగ్రెస్ 26 సీట్లు మాత్రమే సాధించింది. 10 శాతం సీట్లు కాంగ్రెస్‌కు లేకపోయినప్పటికీ పి.జనార్దన్‌రెడ్డిని ప్రధాన ప్రతిపక్ష నేతగా గుర్తించారు.2015లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను బీజేపీ కేవలం 3సీట్లు సాధించినప్పటికీ ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చారు.ఈ అంశాలన్నీకూడా కేవలం ప్రజా ప్రయోజనాల రీత్యా మీ దృష్టికి తీసుకు వస్తున్నాను.ప్రజల తరఫున అసెంబ్లీలో గొంతు విప్పడానికి తగిన సమయం లభించాలనే ఉద్దేశంతో ఈ లేఖ మీకు రాస్తున్నాను. అయితే ఇలాంటి పరిస్థితికి ఆస్కారం లేకుండా ఇప్పటికే అధికార కూటమి శతృత్వాన్ని ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో నేను సభలో మాట్లాడాలనుకుంటే అది భారీ మెజార్టీ సాధించిన అధికార కూటమి దయమీద, "నన్ను చచ్చేవరకూ కొట్టాలన్న" స్పీకర్ విచక్షణ మీదే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం సభలో ఉన్న పార్టీల సంఖ్యాబలాలను దృష్టిలో ఉంచుకుని ఈ లేఖను పరిశీలించాలని కోరుతున్నానని వైఎస్ జగన్ లేఖలో పేర్కొన్నారు. -
మాకు ప్రతిపక్ష హోదా కల్పించండి
సాక్షి, హైదరాబాద్ : అసెంబ్లీలో తమ పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించి విపక్ష హోదాను కల్పించాలని శాసనసభాపతికి మజ్లీస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) విజ్ఞప్తి చేసింది. ఈ అంశంపై స్పీకర్‌కు ఎంఐఎం శాసనసభాపక్షం ఒక లేఖను ఇటీవల అందజేసింది. కాంగ్రెస్ శాసనసభాపక్షానికి చెందిన 12 మం ది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో విలీనమైన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.సభలోని మొత్తం సభ్యుల్లో కనీసం పదిశాతం బలం లేకపోతే నిబంధనల మేరకు ఆ పా ర్టీకి ప్రతిపక్షంగా గుర్తింపు, అలాగే దాని నేతకు విపక్షనేత హోదాను ఇవ్వడం సాధ్యం కాదని శాసనసభా వర్గాలు స్పష్టంచేశాయి. 1994లో కాంగ్రెస్‌పార్టీ నుంచి 26 మంది ఎమ్మెల్యేలు గెలవడంతో అప్పుడు కూడా పి.జనార్ధనరెడ్డికి ప్రతిపక్షనేత హోదా ఇవ్వలేదని, సీఎల్‌పీనేతగానే ఆయన వ్యవహరించారని ఉటంకిస్తున్నాయి. శాసనసభలో వివిధ అం శాలపై చర్చ, ప్రసంగాలకు అవకాశమిచ్చే సందర్భంలో మాత్రం సం ఖ్యాబలం దృష్ట్యా ఎంఐఎంకే తొలి అవకాశం లభిస్తుందని తెలిపాయి. అందుకు తగ్గట్టుగానే గురువారం అసెంబ్లీలో పలు బిల్లులపై చర్చ సందర్భంగా ఎంఐఎంకే అవకాశం దక్కిన విషయం తెలిసిందే. -
తెలంగాణ పాలిటిక్స్‌లో కొత్త కలర్స్!!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మారబోతోందా? ప్రతిపక్ష స్థానం కోసం కాంగ్రెస్‌కు బీజేపీ గట్టిపోటీ ఇచ్చే స్థాయికి చేరుకోబోతోందా? వరుస ఓటములు, భారీ వలసలతో డీలాపడిన కాంగ్రెస్‌కు దీటుగా బీజేపీ దూసుకెళ్తోందనే చర్చ ఊపందుకుంది. లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా ఆరుచోట్ల రెండోస్థానంలో బీజేపీ ఉండ నుందనే అంచనాలే ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి. క్షేత్రస్థాయిలో జరుగుతున్న మార్పుల ప్రకారం.. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అనుకున్న స్థాయిలో ప్రభావం చూపిస్తేమాత్రం.. రాష్ట్రంలో కాంగ్రెస్ రాజకీయ భవిష్యత్తు సంకటస్థితిలో పడిపోవడం ఖాయమని రాజకీయ వర్గాలంటున్నాయి. అదే జరిగి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష స్థానం కోసం బీజేపీతో తలపడాల్సిన పరిస్థితే వస్తే.. బీజేపీ నాయకత్వం రాష్ట్ర రాజ కీయాలపై దృష్టి సారిస్తుందని విశ్లేషకులంటున్నారు. చిత్రం మార్చిన ఎన్నికలు ఈనెల 11న జరిగిన పార్లమెంటు ఎన్నికల పోలింగ్ సరళి, స్థానిక రాజకీయ వర్గాల సమాచారం పై చర్చకు ఊతమిచ్చే విధంగా ఉన్నాయి. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు గానూ.. హైదరాబాద్ స్థానంలో వన్‌మ్యాన్‌షోగా మజ్లిస్ హవా నడుస్తుందని, మిగిలిన 16 స్థానాల్లో ఆరింట బీజేపీ టీఆర్ఎస్కు గట్టిపోటీ ఇచ్చి కాంగ్రెస్ కన్నా ఎక్కువ ఓట్లు దక్కించుకుం టుందని పరిశీలకులంటు న్నారు. ఇందులో సికింద్రాబాద్, మహబూబ్‌నగర్, జహీరా బాద్, నిజా మాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ స్థానాలున్నాయని తెలు స్తోంది. గెలుపోటములను పక్కన పెడితే 6 చోట్ల బీజేపీ గట్టి పోటీ ఇచ్చిందని, కేవలం 60% స్థానాల్లోనే టీఆర్ఎస్తో కాంగ్రెస్ తలపడిందనే సమాచారం గాంధీభవన్ వర్గాలను కలవరపరుస్తోంది. మళ్లీ అధికారంలోకి వస్తే! ప్రస్తుత సమాచారం ప్రకారం కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే మాత్రం కమలనాథులు వ్యూహాన్ని మార్చే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాలంటున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి చెప్పుకోదగిన స్థాయిలో వలసలను తీసుకోగలిగిన బీజేపీ లోక్‌సభ ఫలితాల తర్వాత రాష్ట్ర రాజకీయాలపై తీవ్రంగా దృష్టి కేంద్రీకరిస్తుందని అంటున్నాయి. పశ్చిమబెంగాల్, ఒడిశా, త్రిపుర, అస్సాంల్లో అనుసరించిన వ్యూహాలను తెలంగాణలోనూ అమలు చేయాలనే యోచనలో బీజేపీ ఢిల్లీ పెద్దలు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్‌కు ఇన్నాళ్లు అండగా ఉండి చేయూతనిచ్చిన ఓ ప్రధాన వర్గాన్ని ఆకర్షించే వ్యూహానికి బీజేపీ పదును పెడుతుందని, తద్వారా రాష్ట్రంలో ప్రతిపక్ష స్థానం కోసం బరిలో నిలిచే అవకాశాలను బలోపేతం చేసుకుంటుందని విశ్లేషకులంటున్నారు. ఇప్పటికే ఆ దిశలో ఒకరిద్దరు నేతలను తమ బుట్టలో వేసుకున్న కమలనాథులు ఈసారి బిగ్‌షాట్స్‌పై దృష్టి పెట్టి కాంగ్రెస్‌ను కోలుకోకుండా చేసి ఆ స్థానాన్ని ఆక్రమించే కసరత్తు చేయడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ కోలుకుంటుందా? వాస్తవానికి, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న పరిస్థితిని బట్టి లోక్‌సభ ఫలితాలు తారుమారైతే మాత్రం కోలుకునే పరిస్థితులు ఇప్పట్లో లేవనేది బహిరంగ రహస్యమే. వందల సంఖ్యలో కేడర్‌ను, పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను కోల్పోయిన ఆ పార్టీ లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొనేందుకే ఆపసోపాలు పడాల్సి వచ్చింది. ముఖ్యంగా పార్టీ ఇంటి మనుషుల్లాంటి పొంగులేటి సుధాకర్‌రెడ్డి, రాపోలు ఆనందభాస్కర్ లాంటి నాయకులు కూడా పార్టీని వీడివెళ్లిపోవడం, పార్టీ నాయకత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేయడం మొదట్నుంచీ పార్టీ జెండా మోసిన కేడర్‌ను నైరాశ్యంలోకి నెట్టింది. దీనికితోడు గాంధీ కుటుంబానికి వీరవిధేయుడైన వీహెచ్ లాంటి నేతలు కాంగ్రెస్‌లో సామాజిక న్యాయం అమలు కావడం లేదని, రాహుల్‌గాంధీకి జ్ఞానోదయం కావాలని తాజాగా వ్యాఖ్యలు చేసిన తీరు ఆ పార్టీ పరిస్థితికి అద్దం పడుతోంది. ఓ వైపు వలసల జోరు, మరోవైపు ఓటముల హోరు నడుమ రాష్ట్రంలో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ ప్రభ మసకబారిపోతుందనే చర్చ జోరందుకుంది. అయితే, ఈ పరిస్థితులను అంచనా వేస్తున్న గులాబీ శిబిరంలో మరికొంత ఉత్సాహం కనిపిస్తోంది. కాంగ్రెస్, బీజేపీలు ప్రతిపక్ష స్థానం కోసం పోరాడాల్సిన పరిస్థితే వస్తే తమకు చాలా వెసులుబాటు కలుగుతుందని, ఆ రెండు పార్టీల పోరాటం ఓ కొలిక్కి వచ్చేసరికి 2023 అసెంబ్లీ ఎన్నికలు పూర్తవుతాయనే అంచనాలో ఆ పార్టీ నేతలున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కమలనాథులు రాష్ట్రంలో పుంజుకుని ప్రతిపక్ష పార్టీగా ఎదుగుతారా? కాంగ్రెస్ కోలుకుని కష్టంగానయినా బరిలో నిలుస్తుందా? ఈ రెండు జాతీయ పార్టీల్లో ఎవరు టీఆర్ఎస్కు రాజకీయ ప్రత్యర్థిగా మిగులుతారన్నది లోక్‌సభ ఎన్నికల ఫలితాలు తేల్చనున్నాయి. జెండాలు మారాయిలా! 1950 నుంచి 80వ దశకం వరకు తెలంగాణ రాజకీయాలను పరిశీలిస్తే మొదటి మూడు సాధారణ ఎన్నికల్లోనూ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల మధ్య పోటీ ఉండేది. కాంగ్రెస్ గెలిచేది.. కమ్యూనిస్టులు పోటీ ఇచ్చి ఓడిపోయేవాళ్లు. అప్పుడు రాజకీయ రణక్షేత్రంలో పోటీ అంతా కాంగ్రెస్ జెండా – ఎర్రజెండాల మధ్యే ఉండేది. ఆ తర్వాత కొన్నాళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఎదురే లేకుండా పోయింది. 1980వ దశకంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత మూడు దశాబ్దాల పాటు కాంగ్రెస్–తెలుగుదేశం పార్టీల మధ్య అధికారం దోబూచులాడింది. క్రమంగా ఎర్రజెండా కనుమరుగై మూడురంగుల జెండా – పచ్చ జెండాల మధ్య పోటీ పెరిగింది. ఇక, 2014లో తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాజకీయ క్షేత్రం ఉన్నట్టుండి మారిపోయింది. అధికారం కోసం పోరు కాంగ్రెస్, టీఆర్ఎస్ల మధ్య నడిచింది. ఈ పోరాటంలో రెండుసార్లూ గులాబీ జెండాదే పైచేయి అయింది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కూడా కాంగ్రెస్ జెండా వెలవెలబోయింది. ఈ జెండాకు మరో 10 రకాల రంగులను కలుపుకుని 2018 అసెంబ్లీ రణక్షేత్రంలో పోరాడినా ఓటమి తప్పలేదు. 2019 పార్లమెంటు ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌కు ధీటుగా మరో పార్టీ పుంజుకునే పరిస్థితి వస్తే రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం రంగులు మారనున్నాయి. తొలిసారి కాంగ్రెస్ పోటీలో కనుమరుగయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. -
కాంగ్రెస్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది
వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కదు: బూర నర్సయ్య సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి కౌంట్‌డౌన్ మొదలైందని.. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా దక్కదని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ విమర్శించారు. సీల్డు కవర్లతో ముఖ్యమంత్రులను ఎంపిక చేసే సంస్కృతి కాంగ్రెస్ పార్టీదని దుయ్యబట్టారు. తమ ఎంపీలకు పార్లమెంటులో మంచి గుర్తింపు ఉందని, చవకబారు రాజకీయాలు చేయరని చెప్పారు. టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రెండున్నరేళ్ల పాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో విజయాలు సాధించిందని, గవర్నర్ కూడా తమ పాలనకు కితాబిస్తున్నారని చెప్పారు. అవినీతి–కాంగ్రెస్ అవిభక్త కవలలని.. తమ ఆవేదనను ప్రజల ఆవేదనగా కాంగ్రెస్ చెప్పుకుంటోందని ఎద్దేవా చేశారు. ప్రజల భిక్షతోనే కేసీఆర్ సీఎం అయ్యారు కానీ సోనియా భిక్షతో కాదన్నారు. కేసీఆర్ ది రావుల పాలన అనడం సరికాదని, ఆయన తెలంగాణ ఉద్యమాన్ని నడిపినపుడు రావు పదం గుర్తుకు రాలేదా అని నిలదీశారు. కులం పేరిట విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. ఏ దళిత ,బీసీ ముఖ్యమంత్రి చేయని అభివృద్ధి పనులను ఆ వర్గాల కోసం చేస్తున్న ఘనత కేసీఆర్‌దేనని, 2019లో జాతీయ రాజకీయాల్లో ఆయన కీలక పాత్ర పోషిస్తారని చెప్పారు. -
‘ప్రతిపక్షం’పై సిగపట్లు!
హోదా కోసం కాంగ్రెస్, ఎన్సీపీ హోరాహోరీ సాక్షి, ముంబై: ప్రతిపక్ష హోదా దక్కించుకునే విషయపై కాంగ్రెస్, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) మధ్య రాజుకున్న వివాదం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెందిన 42 మంది ఎమ్మెల్యేలు, ఎన్సీపీకి చెందిన 41 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. బలాబలాలను బట్టి చూస్తే కాంగ్రెస్ ప్రతిపక్షంలో కొనసాగాలి. కాని ఇరు కాంగ్రెస్ పార్టీల మధ్య కేవలం ఒకే సభ్యుడి తేడా ఉంది. దీంతో తమకు ఇతర పార్టీల ఎమ్మెల్యేల మద్దతు ఉండడంతో ప్రతిపక్షంలో తామే కొనసాగుతామని ఎన్సీపీ కూడా పట్టుబడుతోంది. శీతాకాల సమావేశాలకు ముందు ప్రతిపక్షంలో ఉన్న శివసేన సమావేశాలకు రెండు రోజుల ముందు బీజేపీతో చేతులు కలిపి అధికారపక్షంలోకి మారడంతో ప్రతిపక్ష హోదా కోసం కాంగ్రెస్,ఎన్సీపీలు పోటీపడసాగాయి. 15 యేళ్లుగా (మూడు పర్యాయాలు) కూటమిగా కొనసాగుతూ రాష్ట్రాన్ని ఏలిన ఇరు కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ప్రతిపక్షం పదవి కోసం బద్ధ శత్రువులుగా మారారు. ఎడముఖం, పెడముఖం కారణంగా నాగపూర్‌లో జరుగుతున్న శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో ఇరు పార్టీల నాయకుల మధ్య సమన్వయం కోసం చేస్తున్న ప్రయత్నాలు బెడసికొడుతున్నాయి. దీంతో అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కాకుండా ప్రశాంతంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. విధాన్ పరిషత్ సభాపతి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు శివాజీరావ్ దేశ్‌ముఖ్‌కు వ్యతిరేకంగా ఎన్సీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. దీంతో ఎన్సీపీ వైఖరిపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. పరిస్ధితులు ఇలాగే కొనసాగితే ఇరు కాంగ్రెస్ పార్టీల మధ్య వివాదం మరింత ముదిరే ప్రమాదం ఉంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ (122) మొదటి స్థానంలో ఉండగా శివసేన(3) రెండో స్థానంలో నిలిచింది. కాని బీజేపీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ఇతర పార్టీల సాయం తీసుకోవాల్సిన దుస్థితి వచ్చింది. ఎన్సీపీ బయటనుంచి బేషరతుగా మద్దతు ఇచ్చేందుకు సిద్ధమైంది. మొదట కాంగ్రెస్ మినహా ఎవరి మద్దతునైనా స్వీకరిస్తామని ప్రకటించిన బీజేపీ, తర్వాత ఎన్సీపీ మద్దతు తీసుకునేందుకు తటపటాయించింది. ఎన్నికల ప్రచార సమయంలో ప్రధాని మోదీపై పలు విమర్శలు చేసిన ఎన్సీపీ మద్దతు ఎలా తీసుకుంటారని బహిరంగంగానే బీజేపీపై పలువురు ఆరోపణలు గుప్పించారు. దాంతో ఆ పార్టీ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అనంతరం శివసేనతో మంతనాలు జరిపినప్పటికీ పదవులపై రెండు పార్టీల మధ్య రాజీ కుదరకపోవడంతో చివరకు శివసేన ప్రతిపక్షంలో కూర్చుంది. అయితే భావసారూప్యంగల బీజేపీ, శివసేన జతకడితేనే ప్రభుత్వం సుదీర్ఘకాలం నిలబడే అవకాశం ఉంటుందని ఆర్ఎస్ఎస్ సహా పలు హిందూత్వ వర్గాలు సూచించడంతో ఆ రెండు పార్టీలు శీతాకాల సమావేశాలకు ముందు కూటమిగా ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఖాళీ అయిన ప్రతిపక్ష హోదా కోసం కాంగ్రెస్, ఎన్సీపీ నుంచి స్పీకర్‌కు ప్రతిపాదనలు వెళ్లాయి. ప్రస్తుతం శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రతిపక్ష పార్టీ లేకుండానే కొనసాగుతుండటం గమనార్హం. -
విపక్షం... వలపక్షం!
నియమ నిబంధనలు పెట్టుకునేది ఏ పనైనా సజావుగా పూర్తికావడానికే. అంతేతప్ప అందుకు ఆటంకాలు ఏర్పడేందుకు కాదు. నిబంధనలను రూపొందించేటపుడు ఊహకు రానివి అనంతరకాలంలో సంభవిస్తే అం దుకు తగినట్టుగా మార్పులు చేసుకోవడానికి వెనకాడవలసిన పనిలేదు. అయితే, అలాంటి మార్పులు చేయడానికి అధికారమున్నవారు కాస్త విశాల దృక్పథంతో వ్యవహరిస్తే తప్ప ఇది సాధ్యంకాదు. ఆ విశాల దృక్పథం కొరవడబట్టే లోక్‌సభలో కాంగ్రెస్‌కు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వొచ్చునా, లేదా అనే అంశం చివరకు న్యాయస్థానం ముంగిటకు చేరింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎన్నడూ లేనంత స్థాయిలో కేవలం 44 స్థానాలు మాత్రమే లభించాయి. ఆ షాక్‌నుంచి ఇంతవరకూ ఆ పార్టీ కోలుకోలేదు. ఇప్పుడు గోరుచుట్టు మీద రోకటి పోటులా ఆ పార్టీకి లోక్‌సభలో ప్రతిపక్ష నాయకత్వ హోదా ఇచ్చేది లేదని, అందుకు నిబంధనలు అంగీకరించడంలేదని స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. నిబంధనల ప్రకారం సభలోని మొత్తం సభ్యుల సంఖ్య(545)లో పదోవంతు(55)లభిస్తేనే అది సాధ్యమవుతుంది. నిబంధనలంటూ ఏర్పర్చినప్పుడు దానికి మినహాయింపులు కూడా ఉంటాయి. కానీ, ఎందుకనో ఈ నిబంధనకు అలాంటివేమీ లేవు. ఆ పరిస్థితిని అవకాశంగా తీసుకుని గతంలో రెండు సందర్భాల్లో-1980, 1984 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం ఉనికిని గుర్తించనిరాకరిం చింది. ఇప్పుడు తన వంతు వచ్చింది గనుక కాంగ్రెస్‌కు ‘అలాంటి మర్యాద’ చేయడానికి బీజేపీ వెనకాడలేదు. నిజానికి ఈ హోదా దక్కనంత మాత్రాన సభలో కాంగ్రెస్‌కొచ్చే నష్టం పెద్దగా ఏమీ ఉండదు. సభలో ఉన్న పార్టీల్లో అత్యధిక స్థానాలు న్నది కాంగ్రెస్‌కే గనుక ఆ నిష్పత్తికి అనుగుణంగా వివిధ సభా సంఘాల్లో ఆ పార్టీకి ఎటూ చోటు దక్కుతుంది. అయితే, ప్రతిపక్ష నాయకత్వ హోదా వల్ల దక్కేవి ఇతరత్రా చాలా ఉన్నాయి. ప్రపంచ దేశాల అధినే తలు వచ్చినప్పుడు వారితో ప్రతిపక్ష నేత సమావేశం కావడమనే సంప్ర దాయం రెండు దశాబ్దాలుగా ఏర్పడివుంది. జాతీయ, అంతర్జాతీయ అంశాల్లో పరస్ప రం ఆలోచనలను పంచుకోవడం, వైఖరు లను తెలుపుకోవడం ఈ సమావేశాల ఉద్దేశం. దీంతోపాటు ప్రతిపక్ష నాయకత్వ స్థానంలో ఉన్న పార్టీయే అధికార పక్షానికి ప్రత్యామ్నా యమనే అభిప్రాయం సహజంగానే ఆ వచ్చిన విదేశీ అతిథులకు కలుగుతుంది. మన దేశ రాజకీయ వ్యవస్థపై ఆసక్తి గల విదేశీయులకు కూడా ఆ ప్రతిపక్షం వేసే అడుగులపై, దాని రాజకీయ వ్యూహాలపై దృష్టి పడుతుంది. వీటన్నిటికీ మించి మన దేశంలో ఆరోగ్యకరమైన రాజకీయ వ్యవస్థ అమలులో ఉన్నదన్న అభిప్రాయం సర్వత్రా ఏర్పడుతుంది. ప్రతిపక్షాన్ని గుర్తించి గౌరవించడమంటే అసమ్మతిని గుర్తించడం... ఏ విషయంలోనైనా భిన్నాభిప్రాయాన్ని ఆహ్వానించడం. అంతేకాదు... ఆ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని అవసరమైతే తమ పథకాలు, కార్యక్రమాల తీరుతెన్నులను మార్చడానికి సిద్ధపడటం. ఎన్నో దశాబ్దాల తర్వాత సంకీర్ణ కూటమి కూడా అవసరం లేని స్థితిలో సంపూర్ణ మెజా రిటీని తెచ్చుకున్న బీజేపీ ఇవన్నీ ఆలోచించి కాంగ్రెస్‌కు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు సిద్ధపడి ఉంటే హుందాగా ఉండేది. తాను అధికా రంలో ఉండగా విపక్షాలకు తగిన సంఖ్యా బలం లేదన్న కారణంతో కాంగ్రెస్ సంకుచితంగా వ్యవహరించడమూ, వాటి మనోభావాలను పరిగణనలోకి తీసుకోకపోవడమూ నిజమే. అయితే, తాము కూడా అచ్చం అలాగే వ్యవహరించాలని అనుకోవడం ఎంత వరకూ సబబో ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి. పైగా ప్రతిపక్ష హోదా అనేది గతంతో పోలిస్తే ఇప్పుడు ముఖ్య భూమికను పోషించాల్సిన స్థితిలో ఉన్నది. లోక్‌పాల్ మొదలుకొని వివిధ రాజ్యాంగ పదవులకు వ్యక్తులను ఎంపిక చేయడంలో ప్రతిపక్ష నేత ప్రమేయం ఉండితీరాలి. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సభ్యులు, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్, సీబీఐ డెరైక్టర్, లోక్‌సభ సెక్రటరీ జనరల్, జాతీయ మానవహక్కుల సంఘం సభ్యుల ఎంపికలో ప్రధాన ప్రతిపక్షాన్ని ప్రభుత్వం సంప్రదించడం తప్పనిసరి. ఇక ఈమధ్యే పార్లమెంటు ఆమోదం పొందిన జాతీయ న్యాయ నియామకాల కమిషన్ బిల్లు కూడా న్యాయమూర్తుల ఎంపిక కోసం ఏర్పడే ఆరుగురు సభ్యుల కమిటీలో విపక్ష నేతకు చోటుకల్పించింది. ఇప్పుడు కాంగ్రెస్‌కు ప్రధాన ప్రతిపక్ష హోదా నిరాకరించడమంటే ఈ నియామకాల విషయంలో విపక్షం స్వరాన్ని వినబోమని చెప్పడమే అవుతుంది. ప్రధాన ప్రతిపక్ష హోదా కాంగ్రెస్‌కు లేకపోయినా...అత్యధిక స్థానాలున్న పార్టీగా ఈ పదవుల ఎంపికలో దానికి స్థానం కల్పిస్తామని ప్రభుత్వం పేర్కొనివుంటే వేరేవిధంగా ఉండేది. అలా చేయని కారణంగా సర్కారు ఏకపక్షంగా వ్యవహరించదల్చుకున్నదన్న సంకేతాలు వెళ్తున్నాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్నది కూడా ఈ కోణంలోనే. లోక్‌పాల్ ఎంపిక కోసం ఏర్పడే అయిదుగురు సభ్యుల ప్యానెల్లో ప్రతిపక్ష నాయకుడికి స్థానం కల్పించాలన్న నిబంధన చట్టంలో ఉన్నప్పుడు దాన్ని వమ్ముచేసే పరిస్థితులు ఏర్పడితే ఎలాగని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. విపక్ష నేత ఉండరు గనుక లోక్పాల్వంటి పదవులకు ఎంపికను నిరవధికంగా వాయిదా వేస్తారా అని కూడా అడిగింది. సాంకేతిక అంశాలను ఆధారం చేసుకుని లేదా కక్ష తీర్చుకోవడానికి అవకాశం వచ్చింది కదా అని ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు నిరాకరించడం సరికాదని ఇప్పటికైనా ఎన్డీయే సర్కారు గుర్తించాలి. అసమ్మతికి, భిన్నాభిప్రాయానికి తావీయని ప్రజాస్వామ్యం అర్ధంలేనిదవుతుందని తెలుసుకోవాలి. తన వైఖరిని పునరాలోచించుకోవాలి. -
కాంగ్రెస్‌కు ఆ అర్హత లేదు!
అటార్నీ జనరల్ స్పష్టీకరణ న్యూఢిల్లీ: లోక్‌సభలో ప్రతిపక్ష హోదా(ఎల్ఓపీ) సాధించేం దుకు కాంగ్రెస్‌కు అర్హత లేదని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ స్పష్టం చేశారు. ఎల్ఓపీ ఇచ్చేందుకు అవసరమైన 10% సీట్ల(మొత్తం 543 స్థానాల్లో 55 సీట్లు)ను కాంగ్రెస్ సాధించలేదని, 10% సీట్లు సాధించకుండా ఏ పార్టీకి కూడా ఎల్ఓపీ ఇచ్చిన దృష్టాంతం గతంలో ఎన్నడూ లేదని లోక్‌సభ స్పీకర్‌కు ఆయన వివరించారని శుక్రవారం లోక్‌సభ వర్గాలు తెలిపాయి. 1984లో కాంగ్రెస్ 400 పైగా స్థానాలు సాధించిన సమయంలో విపక్ష పార్టీల్లో టీడీపీ అత్యధిక స్థానాలు సాధించినప్పటికీ ఇదే కారణంతో ప్రతిపక్ష హోదా ఆ పార్టీకి ఇవ్వలేదని రోహత్గీ స్పీకర్‌కు గుర్తు చేశారని చెప్పాయి. లోక్‌సభ ఎన్నికల్లో 44 స్థానాలు సాధించిన కాంగ్రెస్ ఎల్ఓపీ పదవి కోసం పట్టుబడుతుండటంతో స్పీకర్ ఏజీ అభిప్రాయం కోరడంతో ఆయన స్పందించారు. యూపీఏ కూటమిని పరిగణనలోకి తీసుకుని ఆ కూటమికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్‌కు ఎల్ఓపీ హోదా ఇవ్వవచ్చన్న వాదననూ ఏజీ తోసిపుచ్చినట్లు సమాచారం. స్పష్టమైన చట్టం ఉంది: దీనిపై కాంగ్రెస్ స్పందిస్తూ..‘ప్రభుత్వ అభిప్రాయాలను ఏజీ ప్రతిబింబిస్తారు. స్పీకర్ నిర్ణయం తరువాతే ఈ విషయంపై స్పందిస్తాం’ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి షకీల్ అహ్మద్ స్పష్టం చేశారు. ఎల్‌ఓపీకి సంబంధించి 1977లో స్పష్టమైన చట్టం రూపొందిందని, 2003లో సవరణ కూడా జరిగిందన్నారు. సీపీపీ భేటీపై సోనియాకు సమాచార లోపం: కాంగ్రెస్ పార్టీలో సమాచార లోపం ఏ స్థాయిలో ఉందో తెలిపే సంఘటన చోటుచేసుకుంది. శుక్రవారం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) సమావేశం ఉందన్న సమాచారంతో పార్లమెంటుకు చేరుకున్న అధ్యక్షురాలు సోనియా, తీరా అక్కడ పార్టీ ఎంపీలెవరూ కనిపించకపోవడంతో అవాక్కయ్యారు. వాస్తవానికి ఏం జరిగిందంటే...సీపీపీ భేటీని శుక్రవారం జరపాలని తొలుత భావించినా పలు కారణాలరీత్యా దాన్ని వాయిదా వేశారు. -
ప్రతిపక్ష హోదా అప్పుడుందా: వెంకయ్య
-
ప్రతిపక్ష హోదా అప్పుడుందా: వెంకయ్య
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభలో కాంగ్రెస్‌కు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చే వరకు సోమవారం నుంచి ప్రారంభం కానున్న సభను సాగనీయబోమన్న ఆ పార్టీ నేతల హెచ్చరికలపై కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు తీవ్రంగా మండిపడ్డారు. సభను ఎలా జరపాలో తమకు తెలుసన్నారు. జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలను ఆదివారం హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి.. ఆ తరువాత జాతీయ మీడియా ప్రతినిధులతో వెంకయ్య మాట్లాడారు. సంఖ్యా బలం లేనప్పుడు ప్రతిపక్ష హోదాకోసం స్పీకర్‌పై ఒత్తిడి పెంచాలి తప్పితే మొత్తం సభను అడ్డుకుంటామన్న మాటలు సరికాదని హితవు పలికారు. ప్రతిపక్ష పార్టీల్లో ఎవరికీ తగిన సంఖ్యా బలం లేనందున నెహ్రూ, ఇందిరా, రాజీవ్‌ల హయాంలో ప్రతిపక్ష హోదా ఇవ్వని సందర్భాలున్నాయని గుర్తు చేశారు. అప్పటి నిర్ణయాలకు జవాబు చెప్పి కాంగ్రెస్ ఈ చర్చను ముందుకు తీసుకెళితే మంచిదని సలహా ఇచ్చారు. మత రిజర్వేషన్లకు బీజేపీ పూర్తి వ్యతిరేకం మతపరంగా రిజర్వేషన్లు ఏర్పాటు చేయడానికి బీజేపీ పూర్తిగా వ్యతిరేకమని వెంకయ్యనాయుడు చెప్పారు. అలాంటివి తెలంగాణలో ప్రభుత్వం ఇచ్చినా.. యూపీలో ప్రభుత్వం ఇచ్చినా మంచివి కాదన్నారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్ ఇస్తే దేశంలో మతమార్పిడి ఎక్కువయ్యే ప్రమాదముందని హెచ్చరించారు.