సాక్షి, సిటీబ్యూరో : హైదరాబాద్ పాతబస్తీ రాజకీయలను శాసిస్తున్న మజ్లిస్ పార్టీ తీరే వేరు. జాతీయ స్థాయిలో విస్తరిస్తున్నప్పటికీ ఎన్నికల మేనిఫెస్టో మాత్రం ప్రకటించని ఏకైక రాజకీయ పార్టీ మజ్లిస్. ఆ పార్టీ వ్యూహాలు.. ప్రతి వ్యూహాలు రాజకీయ ఉద్దండులకే అంతుచిక్కదు. అధినేతదే కీలక నిర్ణయం. బుజ్జగింపులు, సర్దుబాట్లు ఉండవు. ఎన్నికల మేనిఫెస్టో ఒక మోసం... ప్రజల్ని మోసం చేసే డాక్యుమెంట్ అని పార్టీ అభివర్ణిస్తోంది.
ఇక జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు కూడా ఎప్పటి మాదిరిగా ఈ సారి కూడా మజ్లిస్‌పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయలేదు. వాస్తవంగా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వదు. నిరంతర పనితీరునే గుర్తింపుగా భావిస్తూ అదే అనే నినాదంలో ముందుకు సాగుతోంది. అభ్యర్థుల ఎంపిక విషయంలో సైతం ఆచితూచి వ్యవహరిస్తోంది. పాదయాత్రో ఇంటింటి ప్రచారానికి పెద్ద పీట వెస్తోంది. ఉదయం, సాయంత్రంం పాదయాత్రలు రాత్రిళ్లు బహిరంగ సభలతో హోరెత్తిస్తోంది. సాక్షాత్తు పార్టీ అధినేత అసదద్దీన్ , మరో నేత అక్బరుద్దీన్ ప్రసంగాలు పార్టీ శ్రేణులో ఉత్తే్తజాన్నినింపుతోంది. (చదవండి: ఎన్నికలు: అంతా ఫ్రీ.. ఫ్రీ.. ఫ్రీ)
పని తీరుపై ధీమా
పార్టీ నిరంతర పనితీరుపైనే ధీమా వ్యక్తమవుతోంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఎలాంటి హామీలు, వాగ్దానాలు లేకుండా పార్టీ పనితీరు అభ్యర్ధులకు విజయం చేకూర్చుతాయని భావిస్తోంది. గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో షహెర్ హమారా.. మేయర్ హమారా అనే నినాదంతో ఎన్నికల బరిలో దిగిన మజ్లిస్ అంతకు ముందు 2009లోఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ యాక్షన్ ప్లాన్ పేరిట డాక్యుమెంట్‌ను విడుదల చేసింది. 2002 లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో దివంగత నేత సలావుద్దీన్ హైదరాబాద్ యాక్షన్ ప్లాన్ పేరిటడాక్యుమెంట్‌ను విడుదల చేశారు.
కొన్ని స్థానాలకే పరిమితం
ఈ ఎన్నికల్లో మజ్లిస్ పరిమితమైన స్ధానాలకు మాత్రమే పోటీ చేస్తోంది. ఈ సారి 51 డివిజన్లకు మాత్రమే అభ్యర్థులను బరిలో దింపింది. గత ఎన్నికలోల 60 డివిజన్లకు పోటీ చేసి 44 స్థానాలను దక్కించుకుంది. అందులో సమారు 16 మంది సిట్టింగ్‌లకు పోటీకి ఛాన్స్ ఇవ్వలేదు. అయినప్పటికి ఎలాంటి అసంతృప్తి, అలకలు లేకుండా జాగ్రత్త పడింది 2016లో సైతం సిట్టింగ్‌లకు పోటీ చేసే చాన్స్ అంతంత మాత్రమే లభించింది. అంతకు మందు కాంగ్రెస్ దోస్తీలో మేజార్టీ లేకున్నా మూడేళ్ల పాటు పరిపాలన సాగించింది. 2002లో పాలక పగ్గాలు చేపట్టకున్నా.. స్టాండింగ్ కమిటీ ద్వారా పాలనను కంట్రోల్ చేసింది. 1986లో 38 స్థానాల్లో విజయం సాధించి.. మెజార్టీ లేకున్నా ఐదేళ్లపాటు అధికార పగ్గాలు చేపట్టింది.
Comments
Please login to add a commentAdd a comment