సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఎంఐఎం పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. హైదరాబాద్‌లోని 9 స్థానాల్లో ఎంఐఎం అభ్యర్థులు పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ శుక్రవారం వెల్లడించారు. ఏడుగురు సిట్టింగ్‌లతోపాటు మరో రెండు స్థానాల్లో ఎంఐఎం పోటీ చేయనున్నట్లు తెలిపారు. చాంద్రాయణగుట్ట, చార్మినార్, యాకుత్ పురా, బహుదూర్‌పురా, నాంపల్లి, కార్వాన్, మలక్ పేట, జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్‌లో పోటీ చేయనున్నట్టుగా ఓవైసీ పేర్కొన్నారు.
కాగా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికను పూర్తిచేసేపనిలో పడ్డాయి. ఇప్పటికే ప్రకటించిన స్థానాల్లో అభ్యర్థులు ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. బీఆర్‌ఎస్ దాదాపు అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతుంది. బీజేపీ ఇప్పటి వరకు 88 స్థానాల్లో అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. కాంగ్రెస్ సైతం రెండు విడదతల్లోనూ 100 స్థానాల్లో అభ్యర్థులను వెల్లడించింది. రెండు పార్టీలో మరికొన్ని సీట్లకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇక మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకొని హ్యాట్రిక్ సాధించాలని బీఆర్‌ఎస్ ప్రయత్నిస్తుండగా.. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ, కాంగ్రెస్ గట్టిగా ప్రయత్నిస్తున్నాయి.
చదవండి: తెలంగాణ బీజేపీ మేనిఫెస్టో రాసేదెవరు?
Comments
Please login to add a commentAdd a comment