![Asaduddin Owaisi Praises Indian Air Force Over Surgical Stricke 2 - Sakshi](/styles/webp/s3/article_images/2019/02/26/Asaduddin-Owaisi.jpg.webp?itok=BIdNhVSb)
సాక్షి, హైదరాబాద్ : పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారకంగా పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళాలు చేసిన మెరుపు దాడి పట్ల యావత్ భారత్ హర్షం వ్యక్తం చేస్తోంది. సర్జికల్ స్ట్రైక్-2తో భారత వాయుసేన.. పుల్వామా ఉగ్రదాడిలో వీరమరణం పొందిన జవాన్లకు ఘన నివాళులర్పించిందని భారత ప్రజలు అభిప్రాయపడుతున్నారు. రాజకీయ నాయకులు, సీనీ ప్రముఖులు, క్రీడాకారులు.. ప్రతి ఒక్కరు ఈ దాడి పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారత వైమానిక దళం జరిపిన ఈ ప్రతీకారక దాడుల్లో సుమారు 200 నుంచి 300 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. ఈ దాడిపై ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఈ సర్జికల్ దాడులు 12 రోజుల ముందే జరిగుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఆలస్యమైనా ఈ సర్జికల్ దాడిని స్వాగతిస్తున్నామని చెప్పారు. ఉగ్రవాదులకు భారత్ గట్టి జవాబు ఇచ్చిందన్నారు. ఈ విషయంలో భారత ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఉంటుందన్నారు. (ఇమ్రాన్.. అమాయకత్వపు ముసుగు తీసేయ్: ఒవైసీ)
ఇవి కూడా చదవండి
సర్జికల్ స్ట్రైక్ 2 : 300 మంది ఉగ్రవాదులు హతం!
ఇప్పుడు నా భర్త ఆత్మకు శాంతి దొరికింది
బాంబుల వర్షం కురిసేటప్పుడు మోదీ అక్కడే ఉన్నారా..!
పాక్‌ను తగలబెట్టాలి: రాజా సింగ్
Comments
Please login to add a commentAdd a comment